టీమిండియా మాజీ సారథి ఎంఎస్ ధోని సతీమణి సాక్షి ధోని సోషల్ మీడియాలో చాలా ఆక్టీవ్‌గా ఉంటారన్న విషయం తెలిసిందే. తాజాగా తన బర్త్ డే వేడుకలకు సంబంధించిన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ప్రతీ సారి తను షేర్ చేసే ఫోటోలో మిస్టర్ కూల్ ధోని లేక జీవా హైలెట్‌గా ఉండేవారు కానీ తాజాగా షేర్ చేసిన ఫోటోలు, వీడియోలో సాక్షి మాత్రమే హైలెట్‌గా నిలిచారు. ఆదివారం(నవంబర్ 18) ముంబైలో సాక్షి ధోని జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ వేడుకలో సాక్షి తన స్నేహితులతో కలిసి చిన్న పిల్లలా మారి ఆడుతూ, పాడుతూ తెగ అల్లరి చేశారు. ఈ కార్యక్రమానికి సాక్షి స్నేహితులతో పాటు పలువురు సినీ తారలు హాజరయ్యారు.