Sakshi Dhoni
-
‘నీకు క్రికెట్ రూల్స్ తెలియవు.. నేను చెప్పినట్టే జరుగుతుంది’
ప్రపంచంలోని అత్యుత్తమ వికెట్ కీపర్లలో టీమిండియా దిగ్గజ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోని ఒకడు. భారత్‌కు మూడుసార్లు ఐసీసీ ట్రోఫీలు అందించిన ఈ జార్ఖండ్ డైనమైట్ హయాంలోనే విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ వంటి స్టార్లు వెలుగులోకి వచ్చారు. ఇక ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లోనూ చెన్నై సూపర్ కింగ్స్‌ను ఐదుసార్లు చాంపియన్‌గా నిలిపిన ఘనత ధోని సొంతం.అలాంటి ఈ లెజెండరీ ఆటగాడికే క్రికెట్ రూల్స్ తెలియవట!.. ఈ మాట అన్నది మరెవరో కాదు.. ధోని సతీమణి సాక్షి. ‘నీకు రూల్స్ తెలియవు.. నేను చెప్పినట్లే జరుగుతుంది’ అని భర్తకే పాఠాలు చెప్పినంత పనిచేసిందట. ఈ విషయాన్ని స్వయంగా ధోనినే వెల్లడించాడు. ఇంతకీ విషయం ఏమిటంటే..?!బౌలర్ వైడ్ బాల్ వేశాడు‘‘ఓరోజు నేను, సాక్షి కలిసి ఇంట్లో వన్డే మ్యాచ్ చూస్తున్నాం. సాధారణంగా ఇద్దరం కలిసి టీవీ చూస్తున్నపుడు మేము క్రికెట్ గురించి మాట్లాడుకోము. అయితే, ఆరోజు మ్యాచ్‌లో.. బౌలర్ వైడ్ బాల్ వేశాడు. బ్యాటర్ మాత్రం షాట్ ఆడేందుకు ముందుకు రాగా.. వికెట్ కీపర్ బంతిని అందుకుని స్టంపౌట్ చేశాడు. అయితే, నా భార్య మాత్రం అతడు అవుట్కాలేదనే అంటోంది.అప్పటికు ఆ బ్యాటర్ పెవిలియన్ వైపు వెళ్లిపోతున్నాడు. అయినా సరే.. అంపైర్లు అతడిని వెనక్కి పిలిపిస్తారని.. వైడ్ బాల్లో స్టంపౌట్ పరిగణనలోకి తీసుకోరని వాదిస్తోంది. అప్పుడు నేను.. వైడ్‌బాల్‌కి స్టంపౌట్ అయినా అవుటైనట్లేనని.. కేవలం నో బాల్ వేసినపుడు మాత్రమే బ్యాటర్ స్టంపౌట్ కాడని చెప్పాను. అయినా సరే తను వినలేదు.నీకు క్రికెట్ గురించి తెలియదు.. ఊరుకో అంటూ నన్ను కసిరింది. థర్డ్ అంపైర్ నిర్ణయం తర్వాత సదరు బ్యాటర్ వెనక్కి వస్తాడు చూడంటూ చెబుతూనే ఉంది. అయితే, అప్పటికే ఆ బ్యాటర్ బౌండరీ లైన్ దాటి వెళ్లిపోవడం.. కొత్త బ్యాటర్ రావడం జరిగింది. ఏదో తప్పు జరిగిందిఅప్పుడు కూడా సాక్షి.. ‘ఏదో తప్పు జరిగింది’ అంటూ తన వాదనను సమర్థించుకునే ప్రయత్నం చేసింది’’ అంటూ ధోని ఓ ఈవెంట్లో చెప్పాడు. తన భార్యతో జరిగిన సరదా సంభాషణను ప్రేక్షకులతో పంచుకుని నవ్వులు పూయించాడు. అదీ సంగతి!! ఇదిలా ఉంటే.. ఐపీఎల్-2025లో ధోని ఆడే అవకాశాలు కనిపిస్తున్నాయి. తన ఒంట్లో శక్తి ఉన్నన్ని రోజు ఆడుతూనే ఉంటానని 43 ఏళ్ల తలా అభిమానులకు శుభవార్త అందించాడు.చదవండి: శతక్కొట్టిన కృనాల్ పాండ్యా.. ‘మా అన్న’ అంటూ హార్దిక్ పోస్ట్ వైరల్ -
ధోనిని ఆత్మీయంగా హత్తుకున్న రాధిక.. తలా ఎమోషనల్ నోట్
టీమిండియా దిగ్గజ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని సోషల్ మీడియాకు కాస్త దూరంగానే ఉంటాడు. ప్రత్యేక సందర్భాల్లో తప్ప మహీ ఫొటోలు పోస్ట్ చేయడు.ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ మిస్టర్ కూల్‌కు 49.3 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. కానీ, ఇప్పటి వరకు అతడు పెట్టిన పోస్టులు కేవలం 111. అయితే, తాజాగా ధోని ఓ అద్భుతమైన ఫొటోను షేర్ చేస్తూ అందమైన క్యాప్షన్ జతచేశాడు.గ్రాండ్ వెడ్డింగ్ప్రస్తుతం అతడి పోస్టు నెట్టింట వైరల్‌గా మారింది. ఇంతకీ అదేంటంటే.. భారత కుబేరుడు ముఖేశ్ అంబానీ- నీతా అంబానీ దంపతుల చిన్న కుమారుడు అనంత్ అంబానీ వివాహం అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెలిసిందే.వ్యాపారవేత్త వీరేన్ మర్చంట్- శైలా మర్చంట్ల కుమార్తె రాధికా మర్చంట్‌తో అనంత్ పెళ్లి జరిగింది. ముంబైలో జూలై 12న జరిగిన ఈ గ్రాండ్ వెడ్డింగ్‌కు ప్రపంచ నలుమూలల నుంచి క్రీడా, సినీ, వ్యాపార ప్రముఖులు హాజరయ్యారు.మహేంద్ర సింగ్ ధోని సైతం తన సతీమణి సాక్షి, కుమార్తె జివా ధోనితో కలిసి అనంత్- రాధికల పెళ్లికి వెళ్లాడు. బారాత్‌లో డాన్స్ చేస్తూ సందడి చేశాడు కూడా!ఇక వివాహ తంతు ముగిసిన అనంతరం ధోని దంపతులు ప్రత్యేకంగా కొత్త జంటను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా నవ వధువు రాధికా మర్చంట్ నవ్వులు చిందిస్తూ ధోనిని ఆత్మీయంగా ఆలింగనం చేసుకోగా.. అనంత్ చిరునవ్వుతో మహీ చేతిని పట్టుకున్నాడు.రాధికా.. అనంత్ అంటూ ధోని ఎమోషనల్ నోట్ఇందుకు సంబంధించిన ఫొటోను మహేంద్ర సింగ్ ధోని ఇన్‌స్టాలో షేర్ చేశాడు. అంబానీల నూతన జంటను ఉద్దేశించి.. ‘‘రాధికా.. నీ ప్రకాశవంతమైన చిరునవ్వు ఎప్పటికీ ఇలాగే వెలిగిపోతూ ఉండాలి.అనంత్.. మేమందరం చుట్టూ ఉన్నపుడు ఎలాగైతే నువ్వు రాధిక పట్ల ప్రేమను కురిపించావో.. ఎల్లప్పుడూ అలాగే ఉండు ప్లీజ్.మీ వైవాహిక జీవితం సంతోషాలతో నిండిపోవాలి. త్వరలోనే మిమ్మల్ని మళ్లీ కలుస్తాను. వీరేన్ అంకుల్ కోసం ఓ పాట’’ అంటూ ధోని ఉద్వేగపూరిత నోట్ పంచుకున్నాడు. ఈ ఫొటోకు ఇప్పటికే 8 మిలియన్లకు పైగా లైకులు రావడం విశేషం.కాగా భారత్‌కు టీ20 ప్రపంచకప్-2007, వన్డే వరల్డ్‌కప్-2011, చాంపియన్స్ ట్రోఫీ-2013 అందించిన జార్ఖండ్ ‘డైనమైట్’ ధోని.. ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్‌ను ఐదుసార్లు విజేతగా నిలిపాడు.ఇక ఈ ఏడాది చెన్నై కెప్టెన్సీ నుంచి తప్పుకొని రుతురాజ్ గైక్వాడ్‌కు సారథ్య బాధ్యతలు అప్పగించిన 43 ఏళ్ల ధోని.. ఆటగాడిగా కొనసాగుతున్నాడు.చదవండి: Copa America 2024: కోపా అమెరికా కప్ విజేతగా అర్జెంటీనా.. మెస్సీకి గిఫ్ట్ View this post on Instagram A post shared by M S Dhoni (@mahi7781) -
బేబీ రాబోతోంది.. నొప్పులు మొదలయ్యాయి: సాక్షి ధోని పోస్ట్ వైరల్
ఐపీఎల్-2024లో వరుసగా రెండు పరాజయాల తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ మళ్లీ గెలుపు బాట పట్టింది. చెపాక్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను చిత్తుగా ఓడించి సొంతగడ్డపై సత్తా చాటింది. ఈ విజయంతో పాయింట్ల పట్టికలో ఆరు నుంచి ఏకంగా మూడో స్థానానికి దూసుకువచ్చింది.హైదరాబాద్‌లో తమకు సన్‌రైజర్స్ చేతిలో ఎదురైన పరాభవానికి సీఎస్కే బదులు తీర్చుకోవడంతో జట్టు సంబరాల్లో మునిగిపోయింది. అభిమానుల ఆనందానికి కూడా హద్దుల్లేకుండా పోయాయి. ఈ నేపథ్యంలో... సీఎస్కే విజయానికి చేరవవుతున్న క్రమంలో చెన్నై స్టార్ మహేంద్ర సింగ్ ధోని భార్య సాక్షి షేర్ చేసిన ఇన్‌స్టా స్టోరీ నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది.రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్ ఇన్నింగ్స్కాగా ఆదివారం నాటి మ్యాచ్‌లో టాస్ గెలిచిన సన్‌రైజర్స్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన సీఎస్కే నిర్ణీత 20 ఓవర్లలో కేవలం మూడు వికెట్లు నష్టపోయి 212 పరుగుల భారీ స్కోరు సాధించింది.‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’, ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ (54 బంతుల్లో 98) కెప్టెన్ ఇన్నింగ్స్‌తో చెలరేగగా.. డారిల్ మిచెల్(32 బంతుల్లో 52) అర్ధ శతకంతో ఆకట్టుకున్నాడు. శివం దూబే మరోసారి ధనాధన్ ఇన్నింగ్స్(20 బంతుల్లో 39 నాటౌట్) దుమ్ములేపాడు.134 పరుగులకే ఇక లక్ష్య ఛేదనకు దిగిన సన్‌రైజర్స్.. సీఎస్కే బౌలర్ల దెబ్బకు 18.5 ఓవర్లలో 134 పరుగులకే కుప్పకూలింది. ఈ సీజన్లో విధ్వంసకర బ్యాటింగ్‌కు పెట్టింది పేరుగా ఉన్న రైజర్స్ ఇన్నింగ్స్‌లో 32 టాప్ స్కోరు(ఐడెన్ మార్క్రమ్)గా నమోదైంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.చెన్నై బౌలర్లలో తుషార్ దేశ్‌పాండే నాలుగు వికెట్లతో చెలరేగగా.. ముస్తాఫిజుర్ రహ్మాన్, మతీశ పతిరణ చెరో రెండు, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు. వీరి అద్భుత ప్రదర్శన కారణంగా హైదరాబాద్ జట్టు 78 పరుగుల తేడాతో ఓడిపోయింది.పురిటి నొప్పులు మొదలయ్యాయిఈ నేపథ్యంలో సాక్షి సింగ్ ధోని.. ‘‘ఈరోజు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా మ్యాచ్ పూర్తి చేయండి. చిన్నారి రాబోతోంది... పురిటి నొప్పులు మొదలయ్యాయి. కాబోయే మేనత్త నుంచి మీకిదే నా అభ్యర్థన’’ అంటూ సాక్షి సింగ్ ఇన్‌స్టా స్టోరీలో రాసుకొచ్చారు. సీఎస్కే విజయం తర్వాత ఆమె పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. చెన్నై గెలుపు నేపథ్యంలో.. ‘‘కాబోయే అత్తకు రెండు శుభవార్తలు.. కంగ్రాట్స్’’ అంటూ ఫ్యాన్స్ విష్ చేస్తున్నారు.Batting 🤝 Bowling 🤝 Fielding @ChennaiIPL put on a dominant all-round performance & continue their good show at home 🏠 Scorecard ▶️ https://t.co/uZNE6v8QzI#TATAIPL | #CSKvSRH pic.twitter.com/RcFIE9d46K— IndianPremierLeague (@IPL) April 28, 2024 -
ఉత్తరాఖండ్‌లోని స్వగ్రామానికి వెళ్లిన ధోని.. ఆమె పాదాలకు నమస్కరించి..
MS Dhoni- Sakshi Dhoni: ‘హోదా’ కాస్త పెరగగానే అందుకు అనుగుణంగా ఆహార్యంతో పాటు వ్యక్తిత్వాన్ని కూడా మార్చుకునే వారు ఎందరో ఉంటారు. కానీ ఎంత ఎదిగినా ఒదిగి ఉండే లక్షణం మాత్రం కొందరిలోనే ఉంటుంది. అలాంటి వారిలో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ముందు వరుసలో ఉంటాడు. భారత జట్టుకు ఏకంగా మూడు ఐసీసీ ట్రోఫీలు అందించిన దిగ్గజ సారథిగా జేజేలు అందుకున్న ధోని.. మైదానం వెలుపలా తన సింప్లిసిటీతో అభిమానుల మనసు గెలుచుకుంటూనే ఉన్నాడు. తాజాగా మరోసారి ఈ విషయాన్ని నిరూపించాడు. తన భార్యతో కలిసి ధోని బుధవారం ఉత్తరాఖండ్‌కు వెళ్లాడు. దాదాపు ఇరవై ఏళ్ల తర్వాత తమ పూర్వీకులు నివసించిన ఆల్మోరా గ్రామాన్ని సందర్శించాడు. ఈ సందర్భంగా అక్కడి ప్రజలతో మమేకమై వారిని ఆప్యాయంగా పలకరిస్తూ ముందుకు సాగాడు. వాళ్లతో ఫొటోలు దిగి సంతోషపరిచాడు. అంతేకాదు.. తనను ఆత్మీయంగా పలకరించిన మహిళ కాళ్లకు నమస్కరించి ఆశీర్వాదాలు తీసుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ నేపథ్యంలో.. ‘‘అందుకే కదా ధోనిని అందరూ ఇంతలా ఇష్టపడేది’’ అంటూ అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. కాగా దాదాపు రెండు దశాబ్దాల తర్వాత ధోని ఉత్తరాఖండ్‌కు వెళ్లడం విశేషం. సతీమణి సాక్షితో కలిసి తొలుత ఆల్మోరా వెళ్లిన తలా.. గురువారం నైనిటాల్ వెళ్లి.. అక్కడి నుంచి తమ స్వగ్రామమైన లవాలికి చేరుకున్నాడు. ధోని తండ్రి రాంచికి రాగా చాలా ఏళ్ల తర్వాత.. అది కూడా టీమిండియా దిగ్గజ క్రికెటర్‌గా ఎదిగిన తర్వాత ధోని వస్తుండటంతో అతడి సంప్రదాయ పద్ధతిలో ఘనంగా స్వాగతం పలికారు గ్రామస్తులు. ఆ తర్వాత పలు ఆలయాలు సందర్శించిన ధోని పూజలు చేశాడు. అనంతరం తమ కుటుంబ సభ్యులు, బంధువులను కలుసుకున్నాడు. కాగా 1970లలో ధోని తండ్రి పాన్ సింగ్ ఉద్యోగరీత్యా ఉత్తరాఖండ్ నుంచి రాంచికి వలస వచ్చాడు. అయితే, ధోని కుటుంబానికి చెందిన ఇతర సభ్యులు మాత్రం అక్కడే హల్ద్వానిలో నివసిస్తున్నారు. చదవండి: CWC 2023: వచ్చాడయ్యో ‘షమీ’.. వారసత్వాన్నే నిలబెట్టంగా.. జట్టును ఫైనల్‌కు చేర్చంగా! Show me a more Humble Person than MS Dhoni, I will wait.🥺❤️pic.twitter.com/Z9IgbLz15C — DIPTI MSDIAN (@Diptiranjan_7) November 15, 2023 -
MS Dhoni: ధోని గారాలపట్టి జివా స్కూల్ ఫీజు తెలిస్తే షాక్! ఆ మాత్రం ఉండదా?
MS Dhoni's Daughter Ziva: సెలబ్రిటీల వ్యక్తిగత జీవితం గురించి తెలుసుకోవాలని అభిమానుల్లో కుతూహలం ఉండటం సహజం. ఆయా రంగాల్లో వారు సాధించిన విజయాలతో పాటు.. పర్సనల్ లైఫ్ గురించి ఆరా తీయడం షరా మామూలే. ముఖ్యంగా సోషల్ మీడియా వినియోగం పెరిగిన తర్వాత ఫ్యాన్స్‌కు ఈ పని మరింత ఈజీ అయిపోయింది. సరిలేరు నీకెవ్వరు! టీమిండియా మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోని గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. భారత జట్టుకు మూడు ఐసీసీ టైటిళ్లు అందించిన ఎంఎస్ క్రీడా జీవితం తెరిచిన పుస్తకమే. అదే విధంగా.. ఈ చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ పర్సనల్ లైఫ్ గురించి కూడా కొత్తగా చెప్పాల్సింది ఏమీలేదు. సాధారణ మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన ధోని.. క్రికెటర్‌గా ఉన్నత శిఖరాలను అధిరోహించాడు. కీర్తి ప్రతిష్టలతో పాటు లెక్కకు మిక్కిలి డబ్బు కూడా సంపాదించాడు. కెరీర్లో అత్యుత్తమ స్థాయికి చేరుకున్న మహేంద్రుడు.. 2010, జూలై 4న సాక్షి సింగ్‌ను పెళ్లాడి వివాహ బంధంలో అడుగుపెట్టాడు. గారాలపట్టి జివా అన్యోన్య దంపతులుగా పేరున్న ఈ జంటకు 2015, ఫిబ్రవరి 6న కూతురు జివా జన్మించింది. పాప పుట్టే సమయానికి ధోని.. వన్డే వరల్డ్‌కప్ ఈవెంట్‌తో ఆస్ట్రేలియాలో బిజీగా ఉన్నాడు. భారత జట్టు కెప్టెన్‌గా తన బాధ్యతలు నెరవేర్చిన తర్వాతే బిడ్డను చూడటానికి దేశానికి తిరిగి వచ్చాడు. ఇక ఒక్కగానొక్క కూతురు జివా అంటే ధోనికి పంచప్రాణాలు. కాస్త విరామం దొరికినా తన గారాలపట్టి కోసమే సమయం కేటాయిస్తాడు తలా. కోటీశ్వరుడైన ధోని తలచుకుంటే తన కూతురిని విదేశాల్లో టాప్ మోస్ట్ స్కూల్స్‌లో చదివించగలడు. కానీ.. బిడ్డకు దూరంగా ఉండటం అతడికి ఇష్టం లేదు. రాంచిలోనే.. ఫీజు ఎన్ని లక్షలంటే! అందుకే స్వస్థలం రాంచిలోనే పేరెన్నికగన్న ప్రముఖ పాఠశాలలో జివాను చేర్పించారు ధోని దంపతులు. ఎనిమిదేళ్ల జివా ప్రస్తుతం మూడో తరగతి చదువుతున్నట్లు సమాచారం. మరి.. ఇంటర్నేషనల్ స్కూళ్లో డే స్కాలర్‌గా ఉన్న జివా కోసం ధోని ఏడాదికి చెల్లిస్తున్న ఫీజు ఎంతో తెలుసా? అక్షరాలా రెండు లక్షల డెబ్బై ఐదువేల రూపాయలు!! తామే స్వయంగా.. సదరు పాఠశాల వెబ్సైట్లో ఉన్న వివరాల ప్రకారం గ్రేడ్ 2-8 వరకు డే స్కాలర్స్‌కు రూ. 2,75,000, హాస్టల్లో ఉండే వాళ్లకు రూ. 4,40,000 చెల్లించాల్సి ఉంటుంది. మరి ఈ లెక్కన జివా నెల ఫీజు సుమారు 23 వేల రూపాయలు! దాదాపు వెయ్యి కోట్ల మేర ఆర్జించిన తలాకు ఈ మొత్తం లెక్కకాదు. అయితే, కూతుర్ని విదేశాల్లో చదివించడమో.. హాస్టల్లో వేయడమో కాకుండా తామే స్వయంగా బిడ్డ ఆలనాపాలనా దగ్గరుండి చూసుకోవడం విశేషమే!! విలాసవంతమైన ఫామ్‌హౌజ్‌లో.. కాగా ధోనికి రాంచిలో విలాసవంతమైన ఫామ్‌హౌజ్ ఉన్న సంగతి తెలిసిందే. ధోని తన కుటుంబంతో కలిసి ప్రస్తుతం అక్కడే నివసిస్తున్నట్లు సమాచారం. ఇక తలా కూతురిగా జివాకు ఉన్న అభిమానగణం కూడా ఎక్కువే! ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమెకు 2.3 మిలియన్ ఫాలోవర్లు ఉండటం ఇందుకు నిదర్శనం. ఇక తల్లి సాక్షితో పాటు మ్యాచ్‌లకు హాజరవుతూ తండ్రిని ఉత్సాహపరిచే ఈ చిన్నారి ‘చీర్ లీడర్’కు సంబంధించిన స్కూల్ ఫీజు అంశం ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. చదవండి: అరంగేట్రంలో 4 రన్స్! మూడో మ్యాచ్‌లో ఏకంగా ట్రిపుల్ సెంచరీ.. కానీ ఏడాదిలోనే ఖతం! -
ధోనీ తొలి సినిమా టాక్ ఏంటి? హిట్టా ఫట్టా?
టీమిండియా కెప్టెన్‌గా ఎన్నో అద్భుతాలు చేసిన మహేంద్ర సింగ్ ధోనీ.. ప్రపంచ క్రికెట్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాడు. అంతర్జాతీయంగా రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత ఐపీఎల్ మాత్రమే ఆడుతున్నాడు. మరోవైపు పలు వ్యాపారాల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. అలా సినిమాల్లోకి వచ్చాడు. నిర్మాతగా తమిళంలో ఫస్ట్ మూవీ తీశాడు. మరి దీని టాక్ ఏంటి? హిట్టా ఫట్టా? 'ఎల్‌జీఎమ్' కథేంటి? గౌతమ్(హరీశ్ కల్యాణ్), మీరా(ఇవానా) రెండేళ్లుగా లవ్‌లో ఉంటారు. పెద్దల అంగీకారంతో పెళ్లికి రెడీ అవుతారు. అయితే అత్తతో కలిసి ఉండటానికి మీరా నో చెబుతుంది. దీంతో గౌతమ్.. మన వివాహం కుదరదని అంటాడు. దీంతో రాజీకొచ్చిన మీరా.. అత్త(నదియా)ని అర్థం చేసుకోవడం కోసం తన పెళ్లికి ముందు ఆమెతో కలిసి వారం రోజుల ట్రిప్ ప్లాన్ చేస్తుంది. అనుకోని పరిస్థితుల్లో ట్రిప్‌కి వెళ్లిన మీరాతో పాటు ఆమెకు కాబోయే అత్తని కొందరు కిడ్నాప్ చేస్తారు. చివరకు ఏమైంది? అనేది స్టోరీ. (ఇదీ చదవండి: ప్రియుడి కోసం పేరు మార్చుకున్న నటి.. రెండో పెళ్లి చేసుకుందా?) టాక్ ఏంటి? తమిళ ఆడియెన్స్, నెటిజన్స్ చెబుతున్న దాని ప్రకారం 'ఎల్‌జీఎమ్' చాలా బోరింగ్‌గా ఉందని అంటున్నారు. రెండున్నర గంటలపాటు నిడివితో ఉన్న ఈ సినిమాలో చాలాసేపు ప్రేమకథనే చూపడం, కూర్చుని మాట్లాడుకోవడం లాంటి సీన్స్ వల్ల విసుగొచ్చిందని కామెంట్స్ చేస్తున్నారు. తమిళ బాక్సాఫీస్ దగ్గర వర్కౌట్ కాలేదని, కలెక్షన్స్ అంతంత మాత్రంగానే వచ్చినట్లు సమాచారం. తెలుగు సంగతేంటి? తమిళంతోపాటు తెలుగులోనూ జూలై 28నే రిలీజ్ చేయాలని అనుకున్నారు. కానీ 'బ్రో' వల్ల ప్లాన్ మార్చుకున్నారు. ఓ వారం ఆలస్యంగా అంటే ఆగస్టు 4న తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లలో 'ఎల్‌జీఎమ్' రిలీజ్ కాబోతుంది. ఈ మూవీలో హరీశ్ కల్యాణ్, ఇవానా, నదియా ప్రధాన పాత్రల్లో నటించారు. తమిళమణి దర్శకుడు. మరి తమిళంలో తేడా కొట్టేసిన ఈ సినిమా తెలుగులో ఏ మేరకు టాక్ తెచ్చుకుంటుందనేది చూడాలి. (ఇదీ చదవండి: ప్రముఖ యాంకర్‌తో హైపర్ ఆది పెళ్లి ఫిక్స్!) -
గుడ్‌న్యూస్ చెప్పిన ధోని భార్య సాక్షి! సంతోషంలో ఫ్యాన్స్.. ఇక..
MS Dhoni- IPL 2024: మోకాలి గాయం వేధిస్తున్నా ఐపీఎల్-2023 సీజన్ మొత్తం ఎలాగోలా నెట్టుకొచ్చాడు చెన్నై సూపర్‌కింగ్స్ సారథి మహేంద్ర సింగ్ ధోని. గతేడాది దారుణ ప్రదర్శనతో పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంలో నిలిచిన సీఎస్కేను ఈసారి ఏకంగా చాంపియన్‌గా నిలిపాడు. తన అద్భుత కెప్టెన్సీ నైపుణ్యాలతో జట్టుకు ఐదో ట్రోఫీ అందించాడు. మోకాలికి సర్జరీ ఇక క్యాష్ రిచ్ లీగ్ తాజా ఎడిషన్ ముగిసిన తర్వాత మిస్టర్ కూల్ మెకాలికి సర్జరీ చేయించుకున్న విషయం తెలిసిందే. నీరజ్ చోప్రా, రిషభ్ పంత్ వంటి యువ ఆటగాళ్లను ట్రీట్ చేసిన ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ దిన్షా పార్దీవాలా పర్యవేక్షణలో ధోనికి కీహోల్ సర్జరీ జరిగినట్లు సమాచారం. ఇదిలా ఉంటే.. ఐపీఎల్-2023 తనకు చివరి ఐపీఎల్ కాదంటూ ట్రోఫీ ముగిసిన తర్వాత ధోని స్పష్టం చేసిన సంగతి గుర్తుండే ఉంటుంది. ఈ నేపథ్యంలో 42 ఏళ్ల తలా మళ్లీ బ్యాట్ పట్టడం ఖాయమని అభిమానులు మురిసిపోతున్నారు. ఈ క్రమంలో ధోని సతీమణి సాక్షి సింగ్ ఇచ్చిన అప్డేట్ వారిని మరింత ఖుషీ చేసింది. ఆయన బాగున్నాడు కాగా ధోని ఎంటర్టైన్మెంట్ పేరిట ప్రొడక్షన్ హౌజ్ స్థాపించిన మిస్టర్ కూల్.. తన భార్య సాక్షి నిర్మాతగా కోలీవుడ్‌లో LGM అనే సినిమాను నిర్మించాడు. శుక్రవారం ఈ మూవీ విడుదల సందర్భంగా సాక్షి సందడి చేసింది. ఈ సందర్భంగా ధోని గురించి అభిమానులు ప్రశ్నించగా.. ‘‘ఆయన చాలా చాలా బాగున్నాడు.. కోలుకుంటున్నాడు.. రిహాబ్‌లో ఉన్నాడు’’ అని సమాధానమిచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియోను తలా ఫ్యాన్స్ నెట్టింట వైరల్ చేస్తున్నారు. ‘‘మహీ భాయ్.. ఐపీఎల్-2024లో ఆడటం ఖాయం’’ అంటూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. చదవండి: టీమిండియా క్రికెటర్లలో ప్రభుత్వ ఉద్యోగులు వీరే! లిస్టులో ఊహించని పేర్లు.. View this post on Instagram A post shared by MS DHONI FAN PAGE ™ (@msd7.imran) -
ప్రేమించేటపుడు వెంటపడతారు.. పెళ్లైన తర్వాత అంతే ఇక.. ఆ రొమాన్స్: సాక్షి ధోని
MS Dhoni- Sakshi Dhoni: ‘‘ఈ విషయంలో నేను నిజాయితీగా సమాధానం చెప్తాను. నిజానికి మగవాళ్లు తొలుత తాము ప్రేమించిన అమ్మాయిల వెంట పడతారు.. పెళ్లైన తర్వాత మాత్రం.. ‘ఓకే! ఇప్పుడు ఈమె నాదైపోయింది. ఇంకెక్కడికి పోతుందిలే! అన్న ధోరణిలో ఉంటారు. అలా కంఫర్ట్ జోన్లోకి వెళ్లిపోతారు. ఇక మా విషయానికొస్తే.. రోజంతా గొడవ పడుతూనే ఉంటాం(సరదాగా).. ఎప్పుడో ఓసారి మాత్రమే రొమాన్స్ ఉంటుంది. అయితే, రొమాన్స్ జరిగినంత మాత్రాన ఆ చిన్న చిన్న గొడవలు సమసిపోవు. మళ్లీ ఆటపట్టించుకోవడాలు.. స్నేహపూర్వక సంభాషణలు జరుగుతూనే ఉంటాయి. మా ఇద్దరి మధ్య కెమిస్ట్రీ ఇలాగే ఉంటుంది’’ అంటూ టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని సతీమణి సాక్షి ధోని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. సినీ నిర్మాతగా కొత్త ప్రయాణం తమ వైవాహిక బంధం గురించి ఎదురైన ప్రశ్నకు ఈ విధంగా బదులిచ్చింది. కాగా ధోని ఎంటర్టైన్మెంట్ పేరిట ఎంఎస్ సినీ నిర్మాణ రంగంలో అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తమ బ్యానర్‌పై సాక్షి నిర్మాతగా LGM(Lets Get Married) పేరిట తొలి సినిమాను తెరకెక్కించారు. వికాస్ హసిజా ఈ మూవీకి మరో నిర్మాత. ఈ నేపథ్యంలో LGM ప్రమోషన్లలో భాగంగా సాక్షి ధోని మీడియాతో ముచ్చటించింది. 13 ఏళ్ల వైవాహిక బంధం ఈ సందర్భంగా ధోనితో ఉన్న కెమిస్ట్రీ గురించి ప్రశ్న ఎదురుకాగా.. ఆమె ఏమాత్రం తొణక్కుండా మిస్టర్ కూల్‌తో తాను ఎలా ఉంటానన్న విషయాన్ని బయటపెట్టింది. కాగా 2010, జూలై 4న సాక్షి- ధోనిల వివాహం జరిగింది. ఇటీవలే 13వ పెళ్లిరోజు జరుపుకొన్న ఈ జంటకు కూతురు జీవా సంతానం. అన్యోన్యంగా ఉంటూ 2015లో జీవాకు జన్మనిచ్చిన ధోని దంపతులు.. ఎప్పటికప్పుడు కపుల్ గోల్స్ సెట్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. ధోనికి ఏమాత్రం విరామం దొరికినా రాంచిలోని తమ ఫామ్‌హౌజ్‌లో కుటుంబంతో గడుపుతాడు. అన్యోన్య దంపతులుగా ధోని- సాక్షిలకు పేరుంది. ఇక టీమిండియాకు మూడు ఐసీసీ టైటిళ్లు.. ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్‌కు ఏకంగా ఐదు ట్రోఫీలు అందించిన ఘనత ధోనిది. ఆటగాడిగా ఉన్నత శిఖరాలను అధిరోహించిన తలా.. కోలీవుడ్‌తో సినిమా రంగంలో ఎంట్రీ ఇచ్చాడు. చెన్నైతో తనకున్న అనుబంధాన్ని ఇలా మరోసారి చాటుకున్నాడు. చదవండి: కోహ్లి గురించి ప్రశ్న.. విసుగెత్తిపోయిన రోహిత్! ఘాటు రిప్లైతో నోరు మూయించి.. ఏడాదికి 50 కోట్ల సంపాదన! మరి.. ధోని సొంత అక్క పరిస్థితి ఎలా ఉందంటే! -
ధోనీ భార్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. తమిళ సినిమా అందుకేనని!
టీమిండియా మాజీ కెప్టెన్ ధోని నిర్మాతగా మారి తొలిసారిగా తమిళంలో తీసిన చిత్రం 'ఎల్జీఎం'. ధోనీ సతీమణి సాక్షి ధోని నిర్మాతగా వ్యవహరించిన ఈ మూవీతో రమేష్ తమిళమణి దర్శకుడు, సంగీత దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. హరీష్ కళ్యాణ్, ఇవనా జంటగా నటించిన ఇందులో నటి నదియా, యోగిబాబు, ఆర్జే. విజయ్ తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. విశ్వజిత్ ఛాయాగ్రహణం అందించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని శుక్రవారం వారం తెరపైకి రానుంది. (ఇదీ చదవండి: మరోసారి వివాదంలో 'బిగ్ బాస్'.. మొదలవడానికి ముందే!) ఈ సందర్భంగా చిత్ర యూనిట్ మంగళవారం సాయంత్రం చైన్నెలోని పలోజా థియేటర్లో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ వేదికపై దర్శకుడు మాట్లాడుతూ ఒక సాధారణ కథను బ్రహ్మాండంగా తెరకెక్కించే ప్రయత్నమే ఎల్జీఎం అని తెలిపారు. ధోనీ నిర్మించిన చిత్రంలో నటించడం అదృష్టం అని నటుడు హరీష్ కళ్యాణ్ పేర్కొన్నారు. తన వివాహానంతరం విడుదల అవుతున్న చిత్రం ఇదని,ఆ విధంగా తన భార్య లక్కీ ఛామ్ అని అన్నారు. నిర్మాత సాక్షి ధోని మాట్లాడుతూ... తమకు, తమిళ ప్రేక్షకులకు మధ్య భాష సమస్యే కాదన్నారు. ధోనీని తమిళ ప్రజలు ఎప్పుడో ఆదరించారని, తమిళ చిత్రం చేయడానికి అదీ ఒక కారణం అని అన్నారు. సహజత్వంతో కూడిన ఓ సినిమా చేయాలనుకున్నామని, అదే ఎల్జీఎం అని చెప్పుకొచ్చారు. మూవీ చూసిన ధోనీ చాలా బాగుందని మెచ్చుకున్నట్లు సాక్షి పేర్కొన్నారు. తమిళంలో ఈ వారం రిలీజ్ అవుతోంది కానీ తెలుగులో వచ్చే శుక్రవారం అంటే ఆగస్టు 4న రాబోతుంది. (ఇదీ చదవండి: 'బేబీ' డైరెక్టర్‌కి విశ్వక్సేన్ కౌంటర్స్.. కానీ!?) -
ఏడాదికి 50 కోట్ల సంపాదన! మరి.. ధోని సొంత అక్క పరిస్థితి ఎలా ఉందంటే!
Who Is Jayanti Gupta?: మహేంద్ర సింగ్ ధోని.. సాధారణ కుటుంబం నుంచి వచ్చి టీమిండియా స్టార్‌గా ఎదిగాడు. భారత్‌కు ఏకంగా మూడు ఐసీసీ ట్రోఫీలు అందించి లెజెండరీ కెప్టెన్‌గా నీరాజనాలు అందుకుంటున్నాడు. మరి క్రికెటర్‌గా ధోని ప్రయాణం మొదలుపెట్టిన సమయంలో అతడికి నైతికంగా, ఆర్థికంగా అండగా ఉన్నది ఎవరో తెలుసా?! మధ్యతరగతి కష్టాలు రాంచిలో 1981, జూలై 7 పాన్ సింగ్- దేవకీ దేవి దంపతులకు మహేంద్ర సింగ్ ధోని జన్మించాడు. అతడికి అక్క జయంతి గుప్తా, అన్న నరేంద్ర సింగ్ ధోని ఉన్నారు. ధోని తండ్రి చిన్నపాటి ప్రభుత్వోద్యోగి. మధ్యతరగతి కుటుంబానికి ఉండే కష్టాలన్నీ పడ్డారు. అయితే, టికెట్ కలెక్టర్‌గా ఉద్యోగం సంపాదించినప్పటికీ ధోనికి.. చిన్ననాటి నుంచే క్రికెటర్ కావాలని, దేశం కోసం ఆడాలనే కోరిక బలంగా ఉండేది. ఈ విషయం గురించి తండ్రికి చెప్తే.. ఇవన్నీ సాధ్యమయ్యే విషయాలు కావని ఆయన కాస్త వెనుకడుగు వేశారట. నాన్నకు నచ్చజెప్పి ఆ సమయంలో తమ్ముడికి అండగా నిలబడింది జయంతి గుప్తా. తల్లిదండ్రులకు నచ్చజెప్పి.. క్రికెటర్ కావాలనుకుంటున్న తమ్ముడి ఆశయం గురించి వాళ్లకు అర్ధమయ్యేలా చేసింది. ధోనికి ఎలాంటి సాయం కావాలన్న ముందే ఉండేది. అలా ఇంట్లో వాళ్లను ఒప్పించి తన ప్రయాణం మొదలుపెట్టిన ఎంఎస్ ఇప్పుడు కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నాడు. వెయ్యి కోట్లకు అధిపతి! మిస్టర్ కూల్ కెప్టెన్‌గా పేరొంది అభిమానులతో జేజేలు కొట్టించుకున్నాడు. ఆటగాడిగా ఉన్నత శిఖరాలు అధిరోహించి దాదాపు వెయ్యి కోట్ల(DNA నివేదిక ప్రకారం)కు అధిపతి అయ్యాడు. ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్‌కు మకుటం లేని మహారాజుగా కొనసాగుతూ ఏకంగా ఐదుసార్లు జట్టును విజేతగా నిలిపాడు. అత్యధిక బ్రాండ్ వాల్యూ కలిగిన క్రికెటర్లలో ఒకడిగా కొనసాగుతూ రెండు చేతులా సంపాదిస్తున్నాడు. ఏడాదికి దాదాపు 50 కోట్ల రూపాయలు(DNA రిపోర్టు ప్రకారం) వెనకేస్తున్నాడు. ఇటీవలే సినీ రంగంలోనూ ప్రవేశించాడు. ప్రొడక్షన్ హౌజ్ స్థాపించి సినిమాలు నిర్మించే పనిలో పడ్డాడు. అన్న, బావ, ధోని, అక్క మరి అక్క పరిస్థితి ఏంటి? మరి ఇలాంటి క్రికెట్ లెజెండ్‌ను తొలినాళ్ల నుంచే ప్రోత్సహించిన అక్క జయంతి గుప్తా.. లో ప్రొఫైల్ మెయింటెన్ చేస్తోంది. జాతీయ మీడియా కథనాల ప్రకారం.. ఆమె రాంచిలోని పబ్లిక్ స్కూళ్లో ఇంగ్లిష్ టీచర్‌గా పనిచేస్తున్నట్లు సమాచారం. బావ కూడా ధోని కోసం ఇక ధోనికి ప్రాణ స్నేహితుల్లో ఒకరైన గౌతం గుప్తా అనే వ్యక్తిని జయంతి పెళ్లి చేసుకుంది. ధోని దేశవాళీ క్రికెట్ ఆడే సమయంలో జయంతితో పాటు అతడు కూడా అండగా నిలబడినట్లు పలు వార్తా కథనాలు పేర్కొన్నాయి. కాగా ధోని బయోపిక్‌లో జయంతి గుప్తా పాత్ర ఉన్న సంగతి తెలిసిందే. అయితే, ఎంఎస్ అన్న గురించి మాత్రం ప్రస్తావన లేకపోవడం గమనార్హం. కాగా ధోని సాక్షిని వివాహమాడగా.. వీరికి కూతురు జివా జన్మించింది. చదవండి: దీనస్థితిలో ధోని సొంత అన్న? బయోపిక్‌లో ఎందుకు లేడు? అయినా అతడితో.. -
LGM Promotions Photos: ఎల్జీఎం ప్రమోషన్లో ధోని భార్య సాక్షి (ఫొటోలు)
-
టాలీవుడ్ హీరోకు పెద్ద ఫ్యాన్.. ధోని భార్య సాక్షి కామెంట్స్ వైరల్!
టీమిండియా లెజెండ్ క్రికెటర్ ఎంఎస్ ధోని ఎంటర్ టైన్మెంట్ పతాకంపై సాక్షి ధోని నిర్మాతగా తమిళంలో ఎల్జీఎం (లెట్స్ గెట్ మ్యారీ)అనే చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా రమేష్ తమిళమణి దర్శకుడిగా పరిచయమవుతున్నారు. హరీష్ కల్యాణ్, నటి ఇవాన జంటగా నటించిన ఈ చిత్రంలో నదియా, యోగిబాబు తదితరులు ముఖ్యపాత్రల్లో నటించారు. (ఇది చదవండి: సహ నటుడిని పెళ్లి చేసుకున్న యంగ్ హీరోయిన్!) ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రం త్వరలో విడుదలకు ముస్తాబవుతోంది. ఇటీవలే ఈ చిత్ర ట్రైలర్‌ను తెలుగులో రిలీజ్ చేశారు మేకర్స్. ప్రస్తుతం మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉంది చిత్రబృందం. తాజాగా హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌కు ధోని భార్య, చిత్ర నిర్మాత సాక్షి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె పలువురు మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు. మీరు తెలుగు హీరోల సినిమాలు చూస్తారా? అని ప్రశ్నించగా.. సాక్షి బదులిచ్చింది. తాను ఆర్ఆర్ఆర్, బాహుబలి సినిమాలు చూశానని.. కానీ అల్లు అర్జున్ సినిమాలైతే అన్ని చూస్తానని అన్నారు. నేను బన్నీకి పెద్ద ఫ్యాన్ అని సాక్షి తెలిపారు. ఈ సమాధానం చెప్పాగానే ఫ్యాన్స్ పెద్దఎత్తున సందడి చేశారు. ప్రస్తుతం సాక్షి మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఈ వీడియోను బన్నీ ఫ్యాన్స్ భారీ ఎత్తున వైరల్ చేస్తున్నారు. (ఇది చదవండి: ధోనీ నిర్మాతగా ఫస్ట్ సినిమా.. తెలుగు ట్రైలర్ రిలీజ్) While Growing up I have seen all #AlluArjun movies & I’m a huge fan of him - #MSDhoni ‘s wife #Sakshi at #LGM telugu press meet North Kaa Sher @alluarjun 🦁#Pushpa2TheRule pic.twitter.com/klOj2kYvUw — Allu Arjun Taruvate Evadina (@AATEofficial) July 24, 2023 -
'భయ్యా.. నొప్పి ఎలా ఉంది?'.. ధోని రియాక్షన్ వైరల్
టీమిండియా మాజీ క్రికెటర్ ఎంఎస్ ధోని క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇటీవలే ఐపీఎల్ 16వ సీజన్లో ధోని నేతృత్వంలోని సీఎస్కే ఐదోసారి టైటిల్ నెగ్గింది. అయితే ధోని ఐపీఎల్ 16వ సీజన్ సందర్భంగా మోకాలి గాయంతో బాధపడినట్లు వార్తలు వచ్చాయి. అందుకు తగ్గట్లుగానే తలా నీ-క్యాప్(Knee Cap)పెట్టుకొని ఆడాడు. నాకౌట్ దశకు చేరుకునే సరికి ధోని పరిగెత్తడానికి కూడా ఇబ్బంది పడ్డాడు. అందుకే బ్యాటింగ్ సమయంలో క్రీజులోకి వస్తే ఎక్కువగా బౌండరీలు, సిక్సర్ల మీదనే దృష్టి సారించేవాడు. ఇప్పటికైతే మోకాలి గాయం తగ్గినప్పటికి సర్జరీ చేయించుకునే అవకాశం ఉంది. ఈ విషయం పక్కనబెడితే ఇటీవలే చిత్ర నిర్మాణ రంగంలో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ధోని ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో ప్రొడక్షన్ కంపెనీ ప్రారంభించాడు. ప్రస్తుతం ధోని ప్రొడక్షన్ హౌస్ నుంచి LGM(ఎల్జీఎం) అనే తమిళ సినిమా తెరకెక్కుతుంది. కాగా ధోని సోమవారం తన భార్య సాక్షితో కలిసి సినిమా లాంచ్ కార్యక్రమంలో పాల్గొనేందుకు చెన్నై వచ్చాడు. విషయం తెలుసుకున్న అభిమానులు భారీగా ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నారు. అందులో ఒక అభిమాని.. మహీ భయ్యా నీ మోకాలి నొప్పి ఎలా ఉంది.. తర్వాతి ఐపీఎల్ ఆడతావా అంటూ ప్రశ్నించాడు. కానీ ధోనికి ప్రశ్న సరిగ్గా వినిపించలేదు. అభిమానులు ఏది అడిగినా అది మన మంచి కోసమే అయి ఉంటుందని ధోనికి తెలుసు.. అందుకే బాగానే ఉన్నా అన్నట్లు చేతులు ఊపుతూ నవ్వుకుంటూ వెళ్లిపోయాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక జూలై 7న ధోని 42వ పుట్టినరోజు జరుపుకున్నాడు. పుట్టినరోజు పురస్కరించుకొని ధోనికి అభిమానులు సహా వివిధ దేశాల క్రికెటర్లు శుభాకాంక్షలు తెలియజేశారు. ఇక వచ్చే ఐపీఎల్ సీజన్లో ధోని ఆడతాడా లేదా అనేది ఇప్పుడే చెప్పలేని స్థితి. తొమ్మిది నెలల తర్వాత తాను ఫిట్‌గా ఉంటే కచ్చితంగా ఐపీఎల్ 2024 ఆడుతానని ధోని ఇదివరకే తెలిపాడు. చదవండి: David Warner: హుందాగా తప్పుకుంటాడా లేక తప్పించే దాకా తెచ్చుకుంటాడా..? -
'నాకంటే వీడియో గేమ్స్ ఎక్కువయ్యాయా?'
టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనికి వీడియో గేమ్స్ అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అంతర్జాతీయ క్రికెట్ ఆడిన సమయంలోనూ ధోని విదేశీ టూర్లకు వెళ్లినప్పుడు హోటల్ రూమ్స్‌లో ఎక్కువగా వీడియో గేమ్స్‌తోనే కాలక్షేపం చేసేవాడు. ఇటీవలే ఐపీఎల్ సందర్భంగా ధోని ఫ్లైట్‌లో ప్రయాణిస్తూ క్యాండీ క్రష్ ఆడుతున్న వీడియోనూ షేర్ చేయగా అది కాస్త వైరల్‌గా మారింది. తాజాగా మంగళవారం(జూన్ 4న) ధోని, సాక్షిసింగ్ తమ 13వ వివాహా వార్షికోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ సందర్భంగా సాక్షి ధోని.. ''ధోని బెడ్‌రూంలోనూ ఏం చేస్తున్నాడో చూడండి'' అంటూ ఒక పాత ఫోటోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో రీషేర్ చేసింది. ఆ ఫోటోలో ధోని మంచంపై పడుకొని ట్యాబ్‌లో వీడియో గేమ్ ఆడుతూ చాలా బిజీగా కనిపించాడు. ఇది చూసిన సాక్షి.. ''బెడ్రూంలో కూడా వీడియో గేమ్స్ ఆడతావా.. నాకంటే నీకు వీడియో గేమ్ ఎక్కువయిందా'' అంటూ ధోని కాళ్లను కొరుకుతున్నట్లుగా ఉంది. ''మిస్టర్ స్వీటీ నుంచి అటెన్షన్ పక్కకు తప్పిన సమయంలో.. వీడియో గేమ్స్ వర్సెస్ వైఫ్(ముఖ్య గమనిక: ఈ ఫోటోకు అసలైన అర్థం కేవలం మా ఇద్దరి క్లోజ్ ఫ్రెండ్స్‌కు మాత్రమే అర్థమవుతుంది)'' అంటూ క్యాప్షన్ జత చేసింది. ఇక 2010లో డెహ్రాడూన్‌లో ధోని, సాక్షి సింగ్‌ల పెళ్లి జరిగింది. 2015లో ఈ జంటకు జీవా పుట్టింది. ఇక ధోని నాయకత్వంలోని సీఎస్కే ఐపీఎల్ 2023 సీజన్లో విజేతగా నిలిచింది. అయితే ధోనికి ఇదే లాస్ట్ ఐపీఎల్ సీజన్ అని ప్రచారం జరిగినా.. తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని మరో ఏడు, ఎనిమిది నెలల్లో ప్రకటిస్తానని ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ ముగిసిన అనంతరం పేర్కొన్నాడు. చదవండి: #Neymar: విలాసాల కోసం కృత్రిమ సరస్సు?.. రూ. 27 కోట్లు జరిమానా ICC Rankings: వరల్డ్ నెం1 టెస్టు బ్యాటర్‌గా విలియమ్సన్.. భారత్ నుంచి ఒకే ఒక్కడు -
ధోని జీవితంలో తీరని విషాదం..! మిస్టర్ కూల్ నాలో ఆ అమ్మాయిని చూస్తాడనుకున్నా..
టీమిండియా మాజీ కెప్టెన్, మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోని.. ఆటలో తనకు తానే సాటి. భారత్‌కు ఏకంగా మూడు ఐసీసీ టైటిళ్లు అందించిన సారథిగా రికార్డులకెక్కిన ఈ జార్ఖండ్ డైనమైట్.. ఐపీఎల్‌లోనూ హవా కొనసాగిస్తున్నాడు. 41 ఏళ్ల వయసులో చెన్నై సూపర్ కింగ్స్‌ను ఐదోసారి విజేతగా నిలిపి సరికొత్త చరిత్ర సృష్టించాడు. ధోని కెరీర్ గురించి కాసేపు పక్కన పెడితే.. అతడి వ్యక్తిగత జీవితంలో తీరని విషాదం ఉందన్న విషయం కొద్దిమందికి మాత్రమే తెలుసు. అవును.. ధోని తన ఫస్ట్‌లవ్‌ను కోల్పోయాడు. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి అకస్మాత్తుగా ఈ లోకాన్ని వీడటంతో అతడి కలల ప్రపంచం శూన్యమైంది. ఇంతకీ ధోని ప్రేమించిన ఆ అమ్మాయి ఎవరు? ఆమెతో జీవితం పంచుకోవాలనుకున్నాడు! 2002.. ధోని అప్పుడప్పుడే జాతీయ జట్టులోకి రావాలనే ప్రయత్నాలు ముమ్మరం చేశాడు. అదే సమయంలో ప్రియాంక ఝా అనే అమ్మాయితో ప్రేమలో పడ్డాడు. తనతోనే జీవితాన్ని పంచుకోవాలని కోరుకున్నాడు. కానీ విధిరాత మరోలా ఉంది. దురదృష్టవశాత్తూ జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ప్రియాంక ఝా కన్నుమూసింది. ఈ విషాదకర ఘటన నుంచి కోలుకునేందుకు ధోనికి చాలా సమయమే పట్టింది. ధోని అనుమతి తీసుకున్న తర్వాతే ఈ విషయాలను ఎంఎస్ ధోని: ది అన్‌టోల్డ్ స్టోరీ సినిమాలో చూపించారు. ధోనిగా దివంగత సుశాంత్ సింగ్ రాజ్‌పుత్, ప్రియాంక ఝా క్యారెక్టర్లో దిశా పటాని, ధోని సతీమణి సాక్షిగా కియారా అద్వానీ నటించారు. కాగా ధోని ఫస్ట్‌లవ్ గురించి సినిమాలో చూపించేందుకు దర్శకుడు నీరజ్ పాండే ముందుగానే అనుమతి తీసుకున్నాడు. తొలుత ఇందుకు ధోని నిరాకరించినా తన జీవితంలోని సంఘటనలు ప్రపంచానికి తెలియాలనే ఉద్దేశంతో ఉన్న డైరెక్టర్ ప్రతిపాదనకు అంగీకరించాడట. అయితే, కొంతమంది మాత్రం ప్రియాంక .. ధోని చిన్ననాటి స్నేహితులు మాత్రమే అని చెప్పడం గమనార్హం. అదే విధంగా.. సినిమాలో ఈ విషయాలు చూపించారే తప్ప ధోని కూడా ఎప్పుడూ దీని గురించి మాట్లాడింది లేదు. ధోని మూవీలో తన పాత్ర గురించి దిశా గతంలో మాట్లాడుతూ.. ‘‘నిజ జీవిత పాత్రలతో ఈ సినిమా రూపొందించారు. మీరంతా కియారాలో సాక్షిని, సుశాంత్‌లో ధోనిని చూస్తారు. అయితే, ధోని మాత్రం నాలో ప్రియాంక చూస్తాడని అనుకున్నా’’ అని పేర్కొంది. జింబాబ్వే, కెన్యా టూర్లో ఉన్న సమయంలో.. ఇక తన జీవితంలోని చేదు ఘటన సమయంలోనే ఈ వికెట్ కీపర్ బ్యాటర్ ఇండియా- ‘ఏ’ జట్టుకు ఎంపిక అయ్యాడు. కెరీర్ గాడిన పడుతుందనుకుంటున్న సమయంలో పిడుగులాంటి వార్త ధోని ప్రేమసౌధాన్ని కూల్చివేసింది. 2003-04 జింబాబ్వే- కెన్యా పర్యటనలో ధోని వరుస సెంచరీలతో అదరగొట్టాడు. కెన్యా, పాకిస్తాన్‌తో ట్రై సిరీస్‌లో ఆరు ఇన్నింగ్స్‌లో 362 పరుగులతో సత్తా చాటాడు. తద్వారా నాటి టీమిండియా కెప్టెన్ సౌరవ్ గంగూలీ, తాత్కాలిక కోచ్ రవిశాస్త్రి దృష్టిని ఆకర్షించాడు. అలా 2004లో బంగ్లాదేశ్ టూర్ సందర్భంగా టీమిండియా వన్డే జట్టుకు ఎంపికయ్యాడు. సాక్షితో వివాహం ఇక ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదుగుతూ సరికొత్త రికార్డులు సృష్టిస్తూ టీమిండియా మేటి కెప్టెన్‌గా ఎదిగాడన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇదిలా ఉంటే.. ప్రియాంక తర్వాత సాక్షి సింగ్ రావత్ ధోని జీవితంలోకి వచ్చింది. 2010లో వీరి వివాహం జరిగింది. ఈ జంటకు కూతురు జీవా సంతానం. కాగా వచ్చే నెల(జూలై) 7న ధోని పుట్టినరోజు సందర్భంగా ధోని సినిమాను రీరిలీజ్ చేయనున్నట్లు సమాచారం. చదవండి: జింబాబ్వే సంచలనం.. వన్డేల్లో అత్యధిక స్కోర్ నమోదు! ఇంతటి విషాదమా! పాపం.. పిల్లల ముద్దూముచ్చట్లు చూడకుండానే.. మళ్లీ.. -
సాక్షి ధోని నిర్మాతగా లెట్స్ గెట్ మ్యారీడ్.. పోస్టర్ చూశారా?
కుటుంబ నేపథ్యంలో రూపొందే ఫీల్ గుడ్ కథా చిత్రాలకు ప్రేక్షకుల మధ్య ఎప్పుడూ ఆదరణ ఉంటుంది. అలాంటి కథా చిత్రమే లెట్స్ గెట్ మ్యారీడ్. సినిమా పేరు కొత్తగా ఉందనుకుంటున్నారా? ఇప్పటి వరకు ఎల్జీఎం పేరుతో ప్రచారంలో ఉన్న చిత్రం పూర్తి పేరు లెట్స్ గెట్ మ్యారీడ్. ప్రముఖ భారతీయ క్రికెట్ క్రీడాకారుడు ఎంఎస్ ధోని సమర్పణలో ఆయన సతీమణి సాక్షి ధోని చిత్ర నిర్మాణం రంగంలోకి ప్రవేశించి నిర్మిస్తున్న తొలి చిత్రం ఇది. నటుడు హరీష్ కల్యాణ్, నటి నదియ, యువనా, యోగిబాబు తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రం ద్వారా రమేష్ తమిళమణి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. కాగా చిత్రం షూటింగ్‌ను శరవేగంగా పూర్తి చేసుకుంది. ప్రస్తుతం నిర్మాణ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను ఇటీవల విడుదల చేయగా మంచి స్పందన వచ్చింది. తాజాగా సెకండ్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. దీనికి మంచి స్పందన వస్తుందని చిత్ర వర్గాలు ఆశాభావం వ్యక్తం చేశాయి. చిత్ర షూటింగ్ ప్రణాళిక ప్రకారం పూర్తి చేసినట్లు నిర్మాత సాక్షి ధోని మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. ఇది మంచి ఫీల్‌గుడ్ మూవీగా ఉంటుందని చెప్పారు. చక్కని వినోదంతో అనుబంధాలను ఆవిష్కరించే మంచి కుటుంబ కథా చిత్రంగా ఎల్జీఎం చిత్రం ఉంటుందని తెలిపారు. ప్రేక్షకులకు మంచి అనుభూతిని కలిగిస్తుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. Presenting the second look poster of #LGM! Get ready to join us on this fun journey. #LGM படத்தின் செகண்ட் லுக் போஸ்டரை வழங்குகிறோம்! இந்த வேடிக்கையான பயணத்தில் எங்களுடன் சேர தயாராகுங்கள்! pic.twitter.com/nR2UydHcWp — Dhoni Entertainment Pvt Ltd (@DhoniLtd) May 27, 2023 -
ఐపీఎల్ 2023 విజేత, కెప్టెన్ ఎంఎస్ ధోని నెట్‌వర్త్ ఎంతో తెలుసా?
క్రికెట్ దిగ్గజం ధోని నేతృత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్ 2023 టైటిల్‌ను చేజిక్కించుకుంది. తీవ్ర ఉత్కంఠ మధ్య హోరాహోరీగా సాగిన పోరులో విజేతగా నిలిచి అభిమానులను ఉర్రూత లూగించింది టీం. దీంతో ప్రశంసల వెల్లువ కురుస్తోంది. The interaction you were waiting for 😉 MS Dhoni has got everyone delighted with his response 😃 #TATAIPL | #Final | #CSKvGT | @msdhoni pic.twitter.com/vEX5I88PGK — IndianPremierLeague (@IPL) May 29, 2023 భారత క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ ఆటగాళ్లలో, క్రికెట్ కరియర్లో అనేక రికార్డులను నమోదుచేసిన ధోని కేవలం గ్రౌండ్‌లోనే కాదు, వెలుపల కూడా తగ్గేదేలే అంటూ పెర్ఫెక్ట్ బిజినెస్‌మేన్‌లా సక్సెస్‌పుల్‌గా దూసుకుపోతున్నాడు మాజీ కెప్టెన్ పలు పెట్టుబడులు ప్రసిద్ధ బ్రాండ్ ఎండార్స్మెంట్లతో ఇండియాలో టాప్ రిచెస్ట్ ప్లేయర్‌గా ఉన్నాడు. ఎంఎస్ ధోని నికర విలువ ఎంత? అంచనాల ప్రకారం చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ నికర విలువ దాదాపు రూ. 1040 కోట్లు. వార్షిక వేతనం, 50 కోట్లకు పైగా ఉంటుందని అంచనా. అనేక రకాలు పెట్టుబడులు, బ్రాండ్ ఎండార్స్‌మెంట్స్‌తో పాటు, ఐపీఎల్ రెమ్యునరేషన్‌తో కలిపి మొత్తం ప్రపంచంలోని అత్యంత ధనిక క్రికెటర్లలో ఒకడు. ఐపీఎల్ టీం సీఎస్కే ద్వారా రూ. 12 కోట్ల ఆదాయం వస్తోంది. ఫైనాన్షియల్ ఎక్స్‌ప్రెస్ ప్రకారం గత పదహారు సీజన్లలో ఐపీఎల్ ద్వారా రూ. 178 కోట్లకు పైగా సంపాదించాడు. ఒక విధంగా చెప్పాలంటే అతని మొత్తం సంపాదనలో ఇది చిన్న మొత్తమే. ఖటాబుక్, కార్స్ 24, షాకా హ్యారీ, గరుడ ఏరోస్పేస్ వంటి అనేక వాటిలో ఇన్వెస్టర్‌గా ఉన్నాడు. ఇంకా ఫిట్నెస్, యాక్టివ్ లైఫ్‌స్టైల్ బ్రాండ్ సెవెన్లో మెజారిటీ వాటాదారు.సేంద్రీయ వ్యవసాయం, డ్రోన్లు, క్రీడా దుస్తులు, జిమ్ బిజినెస్.. ఇలా మొత్తం కలిపి ప్రతీ ఏడాది రూ. 4 కోట్లకు పైగా ఆదాయం వస్తుంది. కోకా కోలా, ఇండియా సిమెంట్స్, డ్రీమ్ 11, గోడాడీ , రీబాక్ వంటి బ్రాండ్లు ఎంఎస్ ఖాతాలో ఉన్నాయి. దీంతోపాటు ఫుట్‌బాల్ టీమ్ చెన్నైయిన్ ఎఫ్‌సి, హాకీ టీమ్ రాంచీ రేస్ , మహి రేసింగ్ టీమ్ ఇండియాలో వాటాలున్నాయి. (ఐపీఎల్ 2023: ముంబై ఇండియన్స్ ద్వారా అంబానీల సంపాదన ఎంతో తెలుసా?) ధోని సాక్షి ధోని లగ్జరీ లైఫ్ స్టైల్ ధోనీ, అతని భార్య సాక్షి ధోనీ ఇద్దరూ లగ్జరీ వస్తువులు, ఇళ్లతో విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు. జార్ఖండ్‌లోని రాంచీలో వీరికి ఒక భారీ ఫామ్‌హౌస్ ఉంది. ఇక్కడే ధోనీ సాక్షి, వారి కుమార్తె జీవాతో నివసిస్తున్నారు, దీని ధర రూ. 10 కోట్ల కంటే ఎక్కువ. దీంతోపాటు జంటకు డెహ్రాడూన్‌లో రూ. 17.8 కోట్ల ఇల్లు కూడా ఉంది. ఇక ధోనికి కార్లు, బైక్‌లపై ఉండే పప్రేమ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనేలేదు. కళ్లు చెదిరే కలెక్షన్ అతని సొంతం. హమ్మర్ హెచ్2, ఆడి క్యూ7, మిత్సుబిషి పజెరో ఎస్ఎఫ్ఎక్స్, ల్యాండ్ రోవర్ ఫ్రీలాండర్, మహీంద్రా స్కార్పియో, ఫెరారీ 599 జిటిఓ, జీప్ గ్రాండ్ చెరోకీ ట్రాక్‌హాక్, నిస్సాన్ జోంగా, పోంటియాక్ ఫైర్‌బర్డ్ ట్రాన్స్ ఆమ్, మెర్సిడెస్ బెంజ్ జిఎల్ఇ, హిందుస్తాన్ అంబాటోరోస్, రోల్స్ రాయ్టోర్ల లాంటి ఉన్నాయి. (ఐపీఎల్ 2023: గుజరాత్ టైటన్స్ ఓనర్ నెట్‌వర్త్ ఏకంగా రూ. 11 లక్షల కోట్లు) ఇది కాకుండా ధోని జీవితం ఆధారంగా తీసిన హిట్ మూవీ 'ఎంఎస్ ధోని: ది అన్‌టోల్డ్ స్టోరీ' ద్వారా దాదాపు రూ. 30 కోట్లు సంపాదించాడు. ఈ మూవీలో రీల్ ధోని పాత్రను దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ పోషించారు. కెప్టెన్ కూల్‌గా పాపులర్ అయిన ధోని, భారత క్రికెట్ చరిత్రలో అత్యంత విజయవంతమైన కెప్టెన్లలో ఒకడిగా తన ప్రతిభను చాటుకున్నాడు. అయితే అన్నిరకాల అంతర్జాతీయ క్రికెట్ నుండి రిటైర్మెంట్ తీసుకున్న ధోనీ ప్రస్తుతం ఐపీఎల్లో మాత్రమే ఆడుతున్న సంగతి తెలిసిందే -
MS Dhoni: అప్పుడే దుబాయ్ వెళ్లావా? ధోనితో ఫొటో వైరల్
MS Dhoni- Rishabh Pant: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని, యువ వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ హాలిడే ట్రిప్ ఎంజాయ్ చేస్తున్నారు. బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్ ముగిసిన అనంతరం పంత్.. ఐపీఎల్ 2023 మినీ వేలం ముగించుకున్న ధోని దుబాయ్ చేరుకున్నారు. అక్కడ ధోని కుటుంబాన్ని కలుసుకున్న పంత్.. వారితో కలిసి డిన్నర్‌కు వెళ్లాడు. ఇందుకు సంబంధించిన ఫొటోను ధోని భార్య సాక్షి సోషల్ మీడియాలో షేర్ చేయగా.. లక్షల్లో లైకులు వస్తున్నాయి. ఇక టీమిండియా ఫ్యాన్స్ ఈ ఫొటోపై తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. ‘‘హే పంత్.. అప్పుడే దుబాయ్‌కు వెళ్లిపోయావా? నీ గురువు ధోనితో కలిసి హాలీడే ట్రిప్ ఆస్వాదిస్తున్నావ్ కదా! చాలా రోజుల తర్వాత మిమ్మల్ని ఇలా చూస్తుంటే సంతోషంగా ఉంది’’ అంటూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా బంగ్లాదేశ్‌తో రెండో టెస్టులో రిషభ్ పంత్ అద్భుత ఇన్నింగ్స్ ఆడిన విషయం తెలిసిందే. జట్టు కష్టాల్లో కూరుకుపోయిన వేళ విలువైన 93 పరుగులు చేశాడు. మరోవైపు.. చెన్నై సూపర్ కింగ్స్ సారథి ధోని వేలంలో తన వ్యూహాలు అమలు చేశాడు. బెన్ స్టోక్స్ వంటి కీలక ఆటగాళ్లను కొనుగోలు చేయడంలో సఫలమై.. భవిష్యత్ కెప్టెన్‌ను తయారు చేసే దిశగా అడుగులు వేస్తున్నాడు. చదవండి: Babar Azam: పాంటింగ్ రికార్డు బద్దలు కొట్టిన బాబర్ ఆజం! సెహ్వాగ్‌లా అలా! 1089 రోజుల తర్వాత ఏకంగా డబుల్ సెంచరీ.. తొలి బ్యాటర్‌గా! కానీ అంతలోనే.. View this post on Instagram A post shared by Sakshi Singh (@sakshisingh_r) -
ప్రొడక్షన్ హౌస్ ప్రారంభించిన ధోని.. తొలి సినిమా ఏ భాషలో తెలుసా..?
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఎట్టకేలకు సినీ నిర్మాణ రంగంలోని అడుగుపెట్టాడు. దీపావళి పర్వదినాన భార్య సాక్షి సింగ్ ధోనితో కలిసి 'ధోని ఎంటర్టైన్మెంట్' పేరిట నిర్మాణ సంస్థను ప్రారంభించాడు. ఈ సంస్థకు సాక్షి సింగ్ ధోని మేనేజింగ్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. తమ నిర్మాణ సంస్థ నుంచి తొలుత తమిళ చిత్రాన్ని నిర్మించబోతున్నట్లు ధోని ఎంటర్టైన్మెంట్ ప్రతినిధులు తెలిపారు. తమ సంస్థ నిర్మించబోయే తొలి చిత్రానికి రమేశ్ తమిళ్ మణి దర్శకత్వం వహించనున్నట్లు వారు ప్రకటించారు. ఈ చిత్రానికి సంబంధించిన ఇతరత్ర వివరాలు త్వరలోనే ప్రకటిస్తామని వారు వెల్లడించారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కబోయే ఈ చిత్రానికి సాక్షి సింగ్ ధోనినే కథ సమకూర్చినట్లు తెలుస్తోంది. Legendary cricketer @msdhoni & his wife @SaakshiSRawat's production house @DhoniLtd will produce its 1st feature film in Tamil! Conceptualised by Sakshi herself, the Tamil film will be a family entertainer directed by @ramesharchi@HasijaVikas @PriyanshuChopra @proyuvraa pic.twitter.com/uOUwYvPG2w — Sreedhar Pillai (@sri50) October 24, 2022 కాగా. ధోని.. తమిళ సూపర్ స్టార్, ఇళయదళపతి విజయ్‌తో కలిసి త్వరలోనే సినిమా చేయబోతున్నాడని గత కొద్ది రోజులుగా కోలీవుడ్‌లో ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ విషయంపై కూడా ధోని ఎంటర్టైన్మెంట్ సంస్థ ప్రతినిధుల స్పందించారు. ధోనికి తమిళనాట విపరీతమైన క్రేజ్ ఉండటంతో ధోని ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై వరుస తమిళ సినిమాలు వచ్చే అవకాశాలు లేకపోలేదని పేర్కొన్నారు. ధోని ఎంటర్టైన్మెంట్ సంస్థ తమిళంతో పాటు తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో సినిమాలు నిర్మించే ఆలోచన ఉన్నట్లు పరోక్ష సంకేతాలు ఇచ్చారు. చదవండి: ధోని ప్రొడక్షన్లో హీరోగా విజయ్? స్టార్ హీరోలతో వరుస సినిమాలు -
MS Dhoni: ధోని బర్త్‌డే సెలబ్రేషన్స్.. హాజరైన పంత్.. వీడియో వైరల్
MS Dhoni 41st Birthday Celebrations Video: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని 41వ పుట్టిన రోజు నేడు(జూలై 7). ఈ సందర్భంగా భారత క్రికెట్ నియంత్రణ మండలి సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేసింది. అదే విధంగా అభిమానులు, సహచర ఆటగాళ్లు, రణ్వీర్ సింగ్ తదితర సినీ స్టార్లు కూడా మిస్టర్ కూల్‌కి విషెస్ తెలియజేస్తున్నారు. An idol & an inspiration 👏 👏 Here's wishing @msdhoni - former #TeamIndia Captain & one of the finest to have ever graced the game - a very happy birthday. 🎂 👍 pic.twitter.com/uxfEoPU4P9 — BCCI (@BCCI) July 7, 2022 ఇదిలా ఉంటే.. ధోని- సాక్షి దంపతుల వివాహ వార్షికోత్సవం జూలై 4న అన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సెలబ్రేషన్స్ కోసం ఈ జంట లండన్ వెళ్లింది. దీంతో ధోని పుట్టినరోజును కూడా అక్కడే సెలబ్రేట్ చేసింది ధోని సతీమణి సాక్షి. View this post on Instagram A post shared by Sakshi Singh (@sakshisingh_r) ఈ నేపథ్యంలో ధోని కేక్ కట్ చేస్తున్న వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసిన సాక్షి.. ‘‘పుట్టిన రోజు శుభాకాంక్షలు మై లవ్’’ అంటూ క్యాప్షన్ జత చేశారు. ఇక బర్త్‌డే వేడుకకు సంబంధించిన కొన్ని ఫొటోలు కూడా ఆమె సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఇందులో టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ కూడా ఉండటం విశేషం. కాగా టీమిండియా ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న నేపథ్యంలో పంత్.. మహీ భాయ్ బర్త్‌డే సెలబ్రేషన్స్‌లో పాల్గొన్నాడు. ఇక అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన ధోని ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. వచ్చే సీజన్లోనూ సీఎస్కే తరఫున బరిలోకి దిగుతానని తలైవా ఇప్పటికే స్పష్టం చేశాడు. చదవండి: Virat Kohli: ఆరేళ్లలో ఇదే తొలిసారి.. అయినా నీకే ఎందుకిలా? ఇప్పటికైనా కళ్లు తెరువు.. లేదంటే! MS Dhoni Knee Problem: మోకాలి నొప్పులతో బాధపడుతున్న ధోని.. ట్రీట్మెంట్ ఖర్చు 40 రూపాయలు! -
జార్ఖండ్ ప్రభుత్వాన్ని ఎండగట్టిన ధోని భార్య
టీమిండియా మాజీ క్రికెటర్ ఎంఎస్ ధోని భార్య సాక్షి ధోని జార్ఖండ్ ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సంధించింది. జార్ఖండ్‌లో విద్యుత్ సంక్షోభం ఇంతలా ఎందుకుందంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ట్విటర్ వేదికగా ఆమె ఈ వ్యాఖ్యలు చేసింది. ''ఒక టాక్స్ పేయర్‌గా జార్ఖండ్ ప్రభుత్వానికి ప్రశ్న వేస్తున్నా. కొన్నేళ్ల నుంచి రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభం ఇంతలా ఎందుకుందనేది తెలుసుకోవాలనుకుంటున్నా. ఒక బాధ్యత కలిగిన పౌరులుగా మా తరపు నుంచి విద్యుత్‌ను ఆదా చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయినా సమస్య ఒక కొలిక్కి రావడం లేదు'' అని పేర్కొంది. కాగా గత కొన్నిరోజులుగా జార్ఖండ్‌లో రోజువారి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు మించిపోతున్నాయి. కరెంట్ వినియోగం పెరిగిపోవడం వల్ల లోడ్ మార్పు పేరుతో విద్యుత్ సిబ్బంది గంటల తరబడి కోత విధిస్తున్నారు. దీంతో రాష్ట్ర ప్రజలు ఉక్కపోతతో అల్లాడుతున్నారు. చదవండి: Rishi Dhawan: ఫేస్‌గార్డ్‌తో పంజాబ్ కింగ్స్ ఆల్‌రౌండర్.. అసలు కథ ఇదే! As a tax payer of Jharkhand just want to know why is there a power crisis in Jharkhand since so many years ? We are doing our part by consciously making sure we save energy ! — Sakshi Singh 🇮🇳❤️ (@SaakshiSRawat) April 25, 2022 -
క్రికెటర్ల భార్యలైతే స్వేచ్ఛ ఉండకూడదా?
టీమిండియా మాజీ ఆటగాడు.. సీఎస్కే కెప్టెన్ ఎంఎస్ ధోని అర్థాంగి సాక్షి సింగ్ ధోని వ్యక్తిగత స్వేచ్ఛపై కీలక వ్యాఖ్యలు చేసింది. ఐపీఎల్ 2022 సీజన్ ఆడేందుకు ధోని జట్టుతో కలిసి సూరత్ క్యాంపెయిన్‌లో ఉన్న సంగతి తెలిసిందే. ధోనితో పాటే భార్య సాక్షి సింగ్ ధోని, కూతురు జీవా కుడా వచ్చారు. మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని సీఎస్కే యాజమాన్యం నిర్వహించిన ప్రత్యేక సెషన్లో సాక్షి పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ''వంద కోట్ల మందిలో 11 మంది మాత్రమే ఆడే జట్టులో ఉన్న క్రికెటర్‌ను పెళ్లి చేసుకోవడం మా అదృష్టం. ముఖ్యంగా క్రికెట్‌ని మతంగా భావించే దేశంలో అభిమానుల ప్రేమను తట్టుకోలేం. ఒక క్రికెటర్‌ను పెళ్లాడితే మా జీవితం పూర్తిగా మారిపోతుంది. ఉదయాన్నే ఆఫీసుకి వెళ్లి, సాయంత్రం ఇంటికి వచ్చే భర్తను పెళ్లాడితే జీవితంలో పెద్దగా మార్పు ఉండదు. అయితే ఒక ఆటగాడిని పెళ్లి చేసుకుంటే చాలా మార్పులు వస్తాయి. స్వేచ్ఛ ఉండదు. కెమెరాలు వెంటాడుతున్నప్పుడు వ్యక్తిగత స్వేచ్ఛ దొరకదు. కొందరికి కెమెరాలతో ఇబ్బంది ఉండదు. మరికొందరు చాలా ఇబ్బంది పడతారు. అదీకాకుండా జనాలు, మనం ఎలా ఉండాలో కూడా నిర్ణయించేస్తారు. ఎలాంటి బట్టలు వేసుకోవాలి, ఎలాంటి ఫోటోలు పోస్టు చేయాలనేది వాళ్లే నిర్ణయిస్తారు. ఎంత క్రికెటర్ల భార్యలమైనా మాకు వ్యక్తిగత స్వేచ్ఛ అనేది ఉంటుంది. బయట మాకు ఎలాగు అవకాశం లేదు.. కనీసం సోషల్ మీడియా వేదికగా అయినా మా స్వేచ్చను ఉపయోగించుకోవాలనుకుంటాం. కానీ కొందరు దీనిని కూడా దూరం చేస్తున్నారు. ఇలాంటివి పట్టించుకోవడం వల్ల ఒత్తిడి తప్ప ఇంకేమి ఉండదు'' అంటూ తెలిపింది. ఇక గతేడాది ఐపీఎల్లో విజేతగా నిలిచిన సీఎస్కే మరోసారి ఫెవరెట్‌గా బరిలోకి దిగుతుంది. అందరికంటే ముందే ప్రాక్టీస్‌ను ప్రారంభించిన ధోని సేన ఫుల్ జోష్‌లో కనిపిస్తుంది. ధోనికి ఇదే చివరి ఐపీఎల్ సీజన్ అని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. దీంతో ఎలాగైనా టైటిల్ గెలిచి ధోనికి కానుకగా ఇవ్వాలని సీఎస్కే భావిస్తోంది. మార్చి 26 నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్ 15వ సీజన్లో తొలి మ్యాచ్ కేకేఆర్, సీఎస్కే మధ్య జరగనుంది. చదవండి: WI vs ENG: పదేళ్ల క్రితమే ఎంట్రీ.. అరుదైన క్రికెటర్ల జాబితాలో చోటు IPL 2022: వార్న్ అంత్యక్రియలకు వార్నర్.. ఆందోళనలో ఢిల్లీ క్యాపిటల్స్ View this post on Instagram A post shared by Chennai Super Kings (@chennaiipl) -
సాక్షి ధోని బర్త్‌డే వేడుకలు.. అదరగొట్టిన ధోని
Sakshi Dhoni Birthday Celebrations.. టి20 ప్రపంచకప్ 2021లో టీమిండియా మెంటార్‌గా బిజీగా గడిపిన ఎంఎస్ ధోని తాజాగా బర్త్‌డే వేడుకల్లో తళుక్కుమన్నాడు. తన భార్య సాక్షి ధోని పుట్టినరోజు కావడంతో రాంచీలోని తన ఫామ్‌హౌస్‌లో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలకు సాక్షి ధోని చిరకాల స్నేహితురాలు ప్రియాన్షు చోప్రా సహా కొద్దిమంది సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బ్లాక్ టీషర్ట్‌లో రా లుక్‌తో ధోని అదరగొట్టాడు. చదవండి: AB De Villiers-Kohli: 'ఐ లవ్ యూ ఏబీ'.. నా గుండె ముక్కలయ్యింది ఇక టి20 ప్రపంచకప్‌లో టీమిండియా సూపర్-12 దశలో వెనుదిరిగిన సంగతి తెలిసిందే. పాకిస్తాన్, న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌ల్లో ఓటమిపాలైన టీమిండియా.. ఆ తర్వాత స్కాట్లాండ్, నమీబియా, అఫ్గానిస్తాన్ మ్యాచ్‌ల్లో విజయం సాధించినప్పటికి వెనుదిరిగింది. కాగా ఐపీఎల్ 2021లో సీఎస్కే విజయం సాధించిన సంగతి తెలిసిందే. ధోని నాయకత్వంలో సీఎస్కే ట్రోఫీ సాధించడం ఇది నాలుగోసారి కావడం విశేషం. ప్రస్తుతం సాక్షి సింగ్ ధోని ప్రెగ్నెంట్ కావడంతో త్వరలోనే మరో బిడ్డకు జన్మనివ్వనుంది. View this post on Instagram A post shared by Seemant Lohani (@seemantlohani) -
MS Dhoni: అప్పుడు కన్నీళ్లు పెట్టుకున్నాం.. ఇప్పుడు మాత్రం!
MS Dhoni Wife Sakshi Dhoni in Tears: గత సీజన్లో ప్లే ఆఫ్స్ నుంచి నిష్క్రమించిన చెన్నై సూపర్ కింగ్స్... ఈసారి మాత్రం అద్భుత ప్రదర్శనతో ఫైనల్ చేరిన తొలి టీమ్‌గా నిలిచింది. తొమ్మిదవసారి తుది పోరుకు అర్హత సాధించి సత్తా చాటింది. ముఖ్యంగా కెప్టెన్ ధోని.. చివరి ఓవర్లో వరుస బౌండరీలు బాది... తన స్టైల్లో ఫినిషింగ్ టచ్ ఇచ్చి జట్టును విజయతీరాలకు తీర్చడంతో సీఎస్కే ఫ్యాన్స్ ఆనందంతో మునిగితేలుతున్నారు. ‘‘తల... ఈ గెలుపు చిరనస్మరణీయం. గతేడాది బాధతో కన్నీళ్లు పెట్టుకున్నాం.. ఇప్పుడు నీ ఇన్నింగ్స్ చూసి ఆనందభాష్పాలు ఆగడం లేదు. నిన్ను ఎల్లప్పుడూ ప్రేమిస్తూనే ఉంటాం’’అంటూ సోషల్ మీడియా వేదికగా ఉద్వేగపూరిత కామెంట్లు చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన పోస్టులు వైరల్‌గా మారాయి. ఇక వీటన్నింటిలో ధోని భార్య సాక్షి ధోని ఫొటో హైలెట్‌గా నిలిచింది. ధోని.. బౌండరీ బాది చెన్నై గెలుపును ఖరారు చేయడంతో ఆమె ఒక్కసారిగా భావోద్వేగానికి గురయ్యారు. కన్నీళ్లు పెట్టుకుంటూనే... కరతాళ ధ్వనులతో భర్త విజయాన్ని హర్షించారు. ఈ ఫొటో సీఎస్కే అభిమానులను విపరీతంగా ఆకర్షిస్తోంది. ‘‘సాక్షి మేడమ్.. ఈ క్షణంలో మేము కూడా మీలాగే భావోద్వేగాలకు గురయ్యాం. మనందరికీ ఇది ఉద్వేగభరిత క్షణం. ధోనిని మనమంతా ప్రేమిస్తున్నామనడానికి నిదర్శనం’’ అంటూ రకరకాలుగా స్పందిస్తున్నారు. కాగా ఐపీఎల్-2020 సీజన్లో చెన్నై ప్లే ఆఫ్స్ నుంచి నిష్క్రమించగానే సాక్షి.. భావోద్వేగ పోస్టు షేర్ చేసిన సంగతి తెలిసిందే. ‘‘ఇది కేవలం ఆట మాత్రమే. అసలైన విజేతలు మీరే’’ అంటూ సూపర్‌కింగ్స్‌కు మద్దతుగా నిలిచారు. ఈ క్రమంలో ఈసారి ఫైనల్ చేరిన తొలి జట్టుగా నిలవడంతో ఇలా ఆనంద భాష్పాలు పెట్టుకున్నారు. ఇక ఆదివారం జరిగిన క్వాలిఫైయర్-1 మ్యాచ్‌లో సీఎస్కే 4 వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌పై గెలుపొందింది. రుతురాజ్ గైక్వాడ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. స్కోర్లు: ఢిల్లీ క్యాపిటల్స్: 172/5 (20) చెన్నై సూపర్‌కింగ్స్: 173/6 (19.4) What a game of cricket that was! #CSK, they are now in Friday's Final of #VIVOIPL pic.twitter.com/eiDV9Bwjm8 — IndianPremierLeague (@IPL) October 10, 2021 Sakshi mam... We too are crying on that moment.. It's a bit of little emotional moment for all of us. We all love #Dhoni #CSKvsDC #ipl #Yellove pic.twitter.com/nAiXN9smLT — Alok Sah (@ImAlokSah) October 10, 2021 MS #Dhoni Is Not Just A Name, It’s An Emotion. #WhistlePodu pic.twitter.com/CqoMM9r99B — Narendra Modi fan (@narendramodi177) October 10, 2021 I literary was in tears when he smashed that ball into the crowd ! We love you MsDhoni❤️ You were,are and will be the king👑💌🤴 #CSKvDC #Dhoni pic.twitter.com/bJjowFT4y6 — Ram / राम 🇮🇳 (@ramkumarjha) October 10, 2021 I literary was in tears when he smashed that ball into the crowd ! We love you MsDhoni❤️ You were,are and will be the king👑💌🤴 #CSKvDC #Dhoni pic.twitter.com/bJjowFT4y6 — Ram / राम 🇮🇳 (@ramkumarjha) October 10, 2021 -
వైరలవుతున్న టీమిండియా ప్రస్తుత, మాజీ కెప్టెన్ల భార్యల ఫోటోలు
న్యూఢిల్లీ: టీమిండియా ప్రస్తుత కెప్టెన్ విరాట్ కోహ్లి, మాజీ సారధి మహేంద్ర సింగ్ ధోనిల జీవిత భాగస్వాములు చిన్నతనంలో క్లాస్మేట్స్ అన్న విషయం ఇటీవలి కాలంలో అందరికి తెలిసిపోయింది. వీరిద్దరు చిన్నతనంలో అసోంలోని ఓ పాఠశాలలో చదువుకున్నట్లు 2012లో అనుష్క శర్మ వెల్లడించింది. ధోని భార్య సాక్షి, తను అసోంలోని ఓ చిన్న పట్టణంలో నివాసం ఉన్నట్లు, తామిద్దరం కలిసి ఒకే స్కూల్లో చదువుకున్నట్లు ఆమె ఓ ప్రైవేట్ కార్యక్రమంలో తెలిపింది. ఈ సందర్భంగా ఆమె, సాక్షి కలిసి స్కూల్లో తీయించుకున్న ఫోటోను ఆమె బహిర్గతం చేసింది. ఈ ఫోటోలో సాక్షి ఏంజెల్ వేషంలో ఉండగా, అనుష్క తన ఫేవరెట్ హీరోయిన్ మాధురి దీక్షిత్ తరహాలో గాగ్రా చోలీ ధరించి కనిపించింది. ఈ ఫోటోలు అప్పట్లో తెగ వైరలయ్యాయి. ఇదిలా ఉంటే, సాక్షి.. నాటి టీమిండియా టీ20 కెప్టెన్ ధోనిని 2010 జులై 4న వివాహం చేసుకోగా, కోహ్లి, అనుష్కల వివాహం 11 డిసెంబర్ 2017లో జరిగింది. అయితే వీరిద్దరి నిజ జీవితాల్లో చాలా కామన్ పాయింట్లు ఉన్నాయి. ఈ చిన్ననాటి స్నేహితురాళ్లు.. భారత్ క్రికెట్ జట్టు కెప్టెన్లను వివాహం చేసుకున్నారు. వీరిద్దరికి ఒక్కో కూతురు జన్మనిచ్చారు. ధోని దంపతులు తమ కుమార్తెకు జీవా అని నామకరణం చేయగా, విరుష్క జంట తమ గారాలపట్టికి వామిక అని పేరు పెట్టారు. ప్రస్తుతం ధోని, కోహ్లిలిద్దరూ ఐపీఎల్ 2021 సీజన్లో బిజీగా ఉండగా.. సాక్షి, అనుష్క శర్మలు ఎప్పటికప్పుడూ తమ అప్ డేట్స్ ను సోషల్ మీడియా ద్వారా పంచుకుంటున్నారు. అయితే ఈ త్రో బ్యాక్ ఫోటోలను అనుష్క శర్మ ఫ్యాన్స్ క్లబ్ ట్విట్టర్లో పోస్ట్ చేయడంతో ప్రస్తుతం వైరల్‌గా మారాయి. చదవండి: అందమైన రాజస్థానీ రాయల్‌కు జన్మదిన శుభాకాంక్షలు.. -
ధోని దంపతులతో చిల్ అయిన పంత్
రాంచీ: ఆసీస్ టూర్ తర్వాత టీమిండియా యువ వికెట్ కీపర్ రిషభ్ పంత్ ఉత్సాహంగా కనిపిస్తున్నాడు. బ్రిస్బేన్‌లో జరిగిన నాలుగో టెస్టులో 89*పరుగుల ఇన్నింగ్స్‌తో పంత్ ఒక్కసారిగా హీరో అయిపోయాడు. గబ్బా మైదానంలో 32 ఏళ్ల పాటు ఓటమిని ఎరుగని ఆసీస్ జైత్రయాత్రకు చెక్ పెట్టడంలో కీలకపాత్ర పోషించాడు. పంత్ భారత్‌కు తిరిగి రాగానే అభిమానుల నుంచి ఘనస్వాగతం కూడా లభించిన సంగతి తెలిసిందే. తాజాగా టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని దంపతులతో పంత్ చిల్ అవుతున్న ఫోటో ఒకటి వైరల్‌గా మారింది. ధోనికి వీరాభిమాని అయిన పంత్ అతనితో కలిసి ఎంజాయ్ చేసిన మూమెంట్స్‌ను తన కెమెరాలో బంధించాడు. ఈ సందర్భంగా ధోని భార్య సాక్షి ధోని తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంత్‌తో కలిసి దిగిన ఫోటోను షేర్ చేసింది. ఆ ఫోటోలో ధోని గ్రీన్ క్యాప్‌ను ధరించగా.. సాక్షి అతని పక్కనే నిల్చుని వీడియో కాల్‌తో బిజీ అయిపోయారు. వారిద్దరి వెనకాల నిల్చున్న పంత్ వీడియోకాల్‌ను ఎంజాయ్ చేస్తూ తన సంతోషాన్ని షేర్ చేసుకున్నాడు.చదవండి: బెయిర్ స్టో ప్రతీకారం.. కానీ ట్విస్ట్ ఏంటంటే కాగా ఆసీస్‌తో సిరీస్‌కు ముందు పంత్ ఫాంలో ఉన్నట్లుగా అనిపించలేదు. దానికి తగ్గట్టుగానే రెండో టెస్టులో సాహా స్థానంలో తుది జట్టులోకి వచ్చిన పంత్ బ్యాటింగ్, కీపింగ్ విభాగంలో దారుణంగా విఫలమయ్యాడు. అయితే మూడో టెస్టులో 97 పరుగుల కీలక ఇన్నింగ్స్‌తో మంచి ఫామ్ కనబర్చాడు. నాలుగో టెస్టులో పంత్ ఆట గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మ్యాచ్ డ్రా అవుతుందా అన్న దశలో పంత్ క్రీజులో చివరివరకు నిలబడి 89 పరుగుల నాకౌట్ ఇన్నింగ్స్ ఆడి మ్యాచ్‌ను గెలిపించాడు. ఆసీస్ 32 ఏళ్ల జైత్రయాత్రకు చెక్ పెడుతూ గబ్బా మైదానంలో మ్యాచ్‌ను గెలవడంతో పాటు వరుసగా రెండో ఏడాది 2-1 తేడాతో బోర్డర్ గవాస్కర్ ట్రోపీ గెలిపించడంలో కీలకపాత్ర పోషించాడు. ఇక టెస్టు సిరీస్ చివరికి చూసుకుంటే.. టీమిండియా తరపున అత్యధిక పరుగులు సాధించిన బ్యాట్స్‌మన్‌గా పంత్ అగ్రస్థానంలో నిలిచాడు. మొత్తం మూడు టెస్టు మ్యాచ్‌లాడిన పంత్ 68 సగటుతో 274 పరుగులు సాధించాడు. కాగా పంత్ టీమిండియా తరపున ఇప్పటివరకు 16 టెస్టుల్లో 1088, 16 వన్డేల్లో 374, 28 టీ20ల్లో 410 పరుగులు సాధించాడు.చదవండి:'గిల్ తల దించుకొని ఆడితే బాగుంటుంది' -
ధోనితో షోయబ్ మాలిక్
దుబాయ్: ఐపీఎల్‌తో తీరిక లేకుండా గడిపిన సీఎస్కే కెప్టెన్ ఎంఎస్ ధోని.. తన భార్య పుట్టిన రోజు సందర్భంగా దుబాయ్ వెళ్లిన సంగతి తెలిసిందే. అక్కడే కొందరు స్నేహితులతో కలిసి సాక్షి బర్త్ డేను సెలబ్రేట్ చేశారు. సాక్షి సింగ్ గురువారం తన 31వ పుట్టినరోజుని జరుపుకున్నారు. భర్త ధోనితో కలిసి బర్త్‌డే వేడుకలు జరుపుకున్న ఫోటోలను సాక్షి తన ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో పంచుకున్నారు. ఈ సందర్భంగా సాక్షి ధోనికి సోషల్ మీడియాలో పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. గొల్డెన్ డ్రెస్‌లో సాక్షి మెరిసిపోగా, ధోనీ బ్లాక్ కలర్ టీ షర్ట్‌ని ధరించాడు. సాక్షి బర్త్ డే సెలబ్రేషన్స్‌కు సంబంధించిన కొన్ని ఫొటోలు బయటకొచ్చాయి. కాగా సాక్షి బర్త్ డే పార్టీలో పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్-సానియా మీర్జా దంపతులు పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ఫోటోలను సానియా మీర్జా తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో పోస్ట్ చేశారు. ఈసారి సీఎస్కేకు ఘోర పరాభవం ఎదుర్కొంది. 2011లో తన స్కిల్స్‌తో టీమిండియాకు ప్రపంచ కప్ అందించిన ధోని గతేడాది వన్డేకు రిటైర్మెంట్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఐపీఎల్ 2020లో అతడు ఆడతాడో లేదోనని అనుమానాలు వ్యక్తం అవుతున్న తరుణంలో ధోని సీఎస్కే తరపున ఆడుతున్నట్లు ఆ జట్టు యాజమాన్యం స్పష్టం చేసింది. ఇక విరాట్‌కోహ్లికి బీసీసీఐ పితృత్వ సెలవును మంజూరు చేసింది. దీంతో ఆస్ట్రేలియాతో ద్వైపాక్షిక సిరీస్‌లో భాగంగా తొలి టెస్టు అనంతరం విరాట్ స్వదేశానికి తిరిగి రానున్నారు. (ధోనిని వదలకుంటే సీఎస్కేకు 15 కోట్ల నష్టం) View this post on Instagram A post shared by Sakshi Singh Dhoni (@sakshisingh_r) -
ఇది కేవలం ఆట మాత్రమే.. మీరే విజేతలు: సాక్షి
అబుదాబి: మూడుసార్లు ఐపీఎల్ ఛాంపియన్‌గా నిలిచిన చెన్నై సూపర్‌కింగ్స్ ఈసారి పేలవ ప్రదర్శనతో అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది. ఐపీఎల్- 2020 సీజన్లో పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచి, కనీసం ప్లే ఆఫ్స్‌కు కూడా చేరకుండా చతికిలపడింది. ఆదివారం నాటి మ్యాచ్‌లో ఆర్సీబీపై విజయం సాధించినప్పటికీ, ఆ గెలుపును అభిమానులు పూర్తిగా ఆస్వాదించలేకపోతున్నారు. ఈ సీజన్లో ప్లే ఆఫ్స్ నుంచి వైదొలిగిన తొలిజట్టుగా అపఖ్యాతి మూటగట్టుకున్న సీఎస్కే ఆట తీరుతో నైరాశ్యంలో మునిగిపోయారు. ఈ నేపథ్యంలో చెన్నై జట్టు కెప్టెన్ ధోని సతీమణి సాక్షి ధోని సోషల్ మీడియాలో భావోద్వేగ పోస్టు చేశారు. ఆటలో గెలుపోటములు సహజమని, తన దృష్టిలో సీఎస్కే ఎప్పుడూ విన్నరే అంటూ ఓ పద్యాన్ని షేర్ చేశారు.(చదవండి: రుతురాజ్ మెరిసె.. సీఎస్కే మురిసె) ఈ మేరకు.. ‘‘ఇది కేవలం ఆట మాత్రమే. కొన్నింటిలో గెలుస్తారు. మరికొన్నింటిలో ఓడిపోతారు!! అద్వితీయమైన విజయాలు, కొన్ని ఓటములు! వాటి వల్ల కొందరికి సంతోషాలు కలిగాయి.. మరికొందరికి గుండెపగిలే వేదన మిగిల్చాయి! కొన్నింటిలో గెలుస్తారు.. మరికొన్నింటిలో ఓడిపోతారు.. ఇంకొన్నింటిని చేజార్చుకుంటారు.. ఇది కేవలం ఆట మాత్రమే! ఇందుకు బదులుగా విభిన్న రకాల స్పందనలు! ఈ భావోద్వేగాలను, క్రీడాస్ఫూర్తిని దెబ్బతీసేందుకు అనుమతినివ్వకూడదు! ఎందుకంటే ఇది కేవలం ఆట మాత్రమే!! ఓడిపోవాలని ఎవరూ కోరుకోరు, అయితే అందరూ విజేతలు కాలేరు! మైదానాన్ని వీడే సమయంలో వినకూడని శబ్దాలు, చూడకూడని సైగలు.. మనోబలంతో వాటిపై పైచేయి సాధించాలి! ఇది కేవలం ఆట మాత్రమే!! మీరు అప్పుడు విజేతలే, ఇప్పుడు కూడా విజేతలే! నిజమైన యోధులు యుద్ధం చేయడం కోసమే పుడతారు.. వాళ్లు అభిమానుల గుండెల్లో ఎల్లప్పుడూ సూపర్ కింగ్స్ గానే ఉంటారు!!’’అని సాక్షి ధోని సీఎస్కే ఆటగాళ్లకు మద్దతుగా నిలిచారు. కాగా ఈ పోస్టు పట్ల నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందనలు వస్తున్నాయి. ఇక గతంలో కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ధోని, కేదార్ జాదవ్ పేలవ ప్రదర్శనపై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కొంతమంది ఆకతాయిలు ధోని కూతురు జీవాపై అత్యాచారానికి పాల్పడతామంటూ బెదిరింపులకు దిగగా, పోలిసులు వారిని అరెస్టు చేశారు. ఇక నిన్న, ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో సీఎస్కే 8 వికెట్ల తేడాతో జయకేతనం ఎగురవేసిన సంగతి తెలిసిందే. రుతురాజ్ గైక్వాడ్ 51 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో అజేయంగా 65 పరుగులు సాధించి సీఎస్కే విజయంలో కీలక పాత్ర పోషించాడు. View this post on Instagram 💛 A post shared by Sakshi Singh Dhoni (@sakshisingh_r) on Oct 25, 2020 at 10:12am PDT -
ఐపీఎల్ తర్వాత ధోని చేసేదేంటో తెలుసా?
ఆగస్టు 15, 2020.. ఎంఎస్ ధోని అభిమానులకు బ్యాడ్‌న్యూస్ అని చెప్పొచ్చు. ఎందుకంటే అదే రోజు సాయంత్రం 7.30 నిమిషాలకు అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించి అభిమానులకు బిగ్‌షాక్ ఇచ్చాడు. అయితే సెప్టెంబర్ 19నుంచి ఐపీఎల్ 13వ సీజన్ ప్రారంభం కావడంతో ధోని మళ్లీ బిజీ అయ్యాడు. సీఎస్కేకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న ధోని జట్టుకు మరోసారి టైటిల్ అందించేందుకు ప్రయత్నిస్తాడు. ఈ విషయం కాసేపు పక్కనపెడితే.. ఐపీఎల్ ముగిసిన తర్వాత ధోని ఏం చేస్తాడనేది అతని అభిమానుల్లో ప్రశ్న మెదులుతూ వస్తుంది. అయితే ఐపీఎల్ ముగిసిన తర్వాత ధోని ఎంటర్టైన్మెంట్ రంగంలో బిజీ కానున్నాడు. ఇప్పటికే దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లను ధోని భార్య సాక్షి ధోని పర్యవేక్షిస్తుంది. (చదవండి : ఆర్ఆర్ వర్సెస్ కేకేఆర్ : చెరో 10 విజయాలు) కాగా ధోనీ ఎంటర్టైన్మెంట్ పేరుతో 2019లోనే సొంత బ్యానర్‌ను స్థాపించిన జార్ఖండ్ డైనమేట్ రోర్ ఆఫ్ ది లయన్ అనే డాక్యుమెంటరీని రూపొందిస్తున్నాడు. దీనికి సంబంధించి న్యూ ప్రాజెక్ట్స్‌ను కూడా రూపొందించనున్నాడు. ఇదే విషయమై ధోని ఎంటర్టైన్మెంట్కు మేనేజింగ్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్న సాక్షి సింగ్ ధోని స్పందించారు. ఒక డెబ్యూ రచయిత రాసిన బుక్ పబ్లిషకాకపోవడంతో దాని హక్కలు తాము కొనుగోలు చేశామని.. దానిని ఒక వెబ్ సిరీస్‌గా మలవనున్నాం. ఇది ఒక పురాణ సైన్స్ ఫిక్షన్ కథ.. ఇది ఒక రహస్యమైన అగోరి ప్రయాణాన్ని అన్వేషించనుంది. కథకు సంబంధించి పాత్రలు, డైరెక్టర్‌ను త్వరలోనే ఫైనలైజ్ చేస్తాం. ఐపీఎల్ తర్వాత ధోని కూడా నాతో పాటు నిర్వహణ బాధ్యతలు పంచుకోనున్నాడు. ధోనికి క్రికెట్ తర్వాత ఎంటర్టైన్మెంట్ రంగాన్ని చాలా ఇష్టపడుతాడు. అందుకే రిటైర్మెంట్ తర్వాత ధోని ఏరికోరి ఈ రంగాన్ని ఏంచుకున్నాడు. ధోని ఎంటర్టైన్మెంట్ పేరు మీద మంచి కార్యక్రమాలను రూపొందించడమే లక్ష్యంగా పెట్టుకున్నాం. అంటూ చెప్పుకొచ్చారు. (చదవండి : ఐపీఎల్ 2020: అయ్యర్‌కు భారీ జరిమానా) కాగా ఐపీఎల్ 13వ సీజన్లో ధోని సారధ్యంలోని చెన్నై సూపర్‌కింగ్స్ తడబడుతూనే ఉంది. ఆడిన మూడు మ్యాచ్‌ల్లో ఒకటి మాత్రమే గెలిచి రెండు ఓడిపోయింది. రైనా, హర్బజన్ దూరమవడం.. రాయుడు గాయంతో ఆడకపోడం చెన్నై జట్టుకు శాపంగా మారింది. -
'రాంగ్' అంపైరింగ్‌పై సాక్షి ధోని ఫైర్
దుబాయ్ : చెన్నై సూపర్‌కింగ్స్ సారథి ధోని భార్య సాక్షి సింగ్ ఐపీఎల్లో అంపైరింగ్ తప్పిదాలపై విమర్శించింది. ఆ వెంటనే తన ట్వీట్‌ను, పోస్ట్‌ను తొలగించింది. రాజస్తాన్, చెన్నైల మధ్య మంగళవారం జరిగిన మ్యాచ్‌లో రాయల్స్ బ్యాట్స్‌మన్ టామ్ కరన్‌ను ఫీల్డ్ అంపైర్ ఔట్‌గా వేలెత్తాడు. తర్వాత ఇద్దరు అంపైర్లు సమీక్షించుకొని మూడో అంపైర్‌కు నివేదించగా... మూడో కన్ను నాటౌట్‌గా తేల్చింది. దీనిపై ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్లలో సాక్షి సింగ్ స్పందించింది. ‘సాంకేతికతనే వాడాలనుకుంటే సరిగ్గా వాడాలి. ఔట్ అంటే ఔటే. అది క్యాచ్ అయినా ఎల్బీడబ్ల్యూ అయినా? ఔటిచ్చాక తిరిగి మూడో అంపైర్‌కు నివేదించడాన్ని తొలిసారి చూస్తున్నా. కోట్ల మంది వీక్షించే ఐపీఎల్‌లాంటి ప్రతిష్టాత్మక టోర్నీల్లో అంపైరింగ్ మరింత నాణ్యంగా ఉండాలి’ అని పోస్ట్ చేసింది. కానీ వెంటనే ఈ పోస్ట్‌లను సాక్షి సింగ్ తొలగించింది. (చదవండి: ఆర్చర్ రెచ్చిపోతాడని అప్పుడు ఊహించలేదు) -
ధోని రిటైర్మెంట్పై భార్య సాక్షి భావోద్వేగ పోస్ట్
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయ్యారు. తన అభిమానుల కోసం పంచుకున్న సందేశంలో మీ నుంచి ఎల్లప్పుడూ లభించే ప్రేమ, మద్దతుకు ధన్యవాదాలు అని సోషల్ మీడియాలో ధోనీ రాశారు. శనివారం(15-08-2020) సాయంత్రం 07.29 తర్వాత తాను పదవీ విరమణ చేసినట్లు గుర్తించండి అని పేర్కొన్నాడు. ధోని రిటైర్మెంట్ తర్వాత పలువురు స్పందించారు. కొందరు ఆయనతో కలిసి నడిచిన కాలాన్ని గుర్తుచేసుకోగా... మరికొందరు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ క్రమంలోనే ధోనీ ఘనతల్ని గుర్తు చేసుకుంటూ ఫొటోలు, వీడియోల్ని ట్విటర్లో షేర్ చేస్తున్నారు. అభిమానులే కాదు.. ధోనీ సహచర క్రికెటర్లు కూడా అతనితో తమకి ఉన్న జ్ఞాపకాలను నెమరువేసుకుంటున్నారు. (చదవండి : రిటైర్మెంట్ ప్రకటించిన మిస్టర్ కూల్..) ఇక ధోని రిటైర్మెంట్పై ఆయన సతీమణి సాక్షిసింగ్ కూడా స్పందించారు. దేశం గర్వపడేలా ఎన్నో విజయాలను ధోని అందిచాడని, ప్రజలు వాటిని మర్చిపోతారు కాని ఆ క్షణంలో వారికి ఆయన అందించిన అనుభూతిని మర్చిపోలేనిదని ఇన్‌స్ట్రాగ్రామ్‌లో చెప్పుకొచ్చారు. ‘మీరు సాధించిన విజయాలను చూసి గర్వపడాలి. రిటైర్మెంట్ ప్రకటించినందుకు అభినందనలు. మీరు సాధించిన విజయాలను చూసి నేను గర్విస్తున్నాను. మీకిష్టమైన ఆటకు గుడ్‌బై చెప్పే క్రమంలో మీరు పడిన మనోవేదన నాకు తెలుసు. కన్నీళ్లను దిగమింగుకొని రిటైర్మెంట్ ప్రకటించారని అనుకుంటున్నాను. మీరు ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను. మీరు చెప్పిన మాటలు, చేసిన పనిని ప్రజలు మర్చిపోతారేమో కానీ, వాళ్లకు అందించిన అనుభూతిని ఎప్పుడూ మర్చిపోలేరు’అని సాక్షిసింగ్ ధోని పేర్కొన్నారు. (చదవండి : మహేంద్రుడి మాయాజాలం) దాదాపు 16 ఏళ్ళ పాటు టీం ఇండియాకు మహీ సేవలు అందించాడు. మూడు ఫార్మాట్లలో కూడా టీం ఇండియాకు ధోనీ అన్ని విధాలుగా తన బాధ్యతలు నిర్వహించి మంచి విజయాలు అందించాడు. 2007లో టి20 ప్రపంచ కప్, ఆ తర్వాత భారత అభిమానులంతా కలలు గన్న వన్డే వరల్డ్ కప్ (2011)తో పాటు 2013లో చాంపియన్ ట్రోఫీని కూడా సాధించి ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచాడు. మూడు ఐసీసీ టోర్నీలను గెలిచిన ఏకైక కెప్టెన్‌గా నిలిచిపోయాడు. ప్రస్తుతం ధోనీ ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. యూఏఈ వేదికగా సెప్టెంబర్ 19 నుంచి నవంబర్ 10వరకు ఐపీఎల్ 2020 జరుగనున్న సంగతి తెలిసిందే. View this post on Instagram You should be proud of what you have achieved. Congratulations on giving your best to the game. I am proud of your accomplishments and the person you are! I am sure you must have held those tears to say goodbye to your passion. Wishing you health, happiness and wonderful things ahead! #thankyoumsd #proud “People will forget what you said, people will forget what you did, but people will never forget how you made them feel.” — Maya Angelou A post shared by Sakshi Singh Dhoni (@sakshisingh_r) on Aug 15, 2020 at 10:51am PDT -
నువ్వు బహుమతులకు లొంగని వ్యక్తివి: సాక్షి ధోని
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని మంగళవారం(జూలై7) పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈరోజుతో ధోని 40వ వసంతంలోకి అడుగుపెడుతున్నాడు. ఈ సందర్భంగా క్రీడాకారులతోపాటు కోట్లాది మంది అభిమానులు ధోనికి బర్త్‌డే విషెస్ వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు చెన్నై సూపర్ కింగ్స్ ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రావో ధోని బర్త్‌డే సందర్భంగా స్పెషల్ వీడియోను రూపొందించాడు. ధోని ఘనతలు, గొప్పతనాన్ని కీర్తిస్తూ 'ఎంఎస్ ధోని నెంబర్ 7' పేరిట బ్రావో ఆ పాటను ఈ రోజు రిలీజ్ చేసాడు. దీంతో ధోనిపై ఉన్న తన ప్రేమని బ్రావో చాటుకున్నాడు. (ధోని ఆంతర్యం ఏమిటో ?) కాగా ఎంఎస్ ధోని భార్య సాక్షి ధోని తన భర్త కోసం ప్రత్యేకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు ట్విటర్లో పోస్టు పెట్టారు. ‘నీ పుట్టిన రోజును గుర్తుకుచేసుకుంటూ ఒక ఏడాది గడిచిపోయింది. కొంచెం వయసు పెరిగింది. ఇంకొంచెం తెలివిగా, మరింత తియ్యగా మారాల్సిన సమయం వచ్చింది. నువ్వు ఎలాంటి వ్యక్తివి అంటే బహుమతులకు లొంగని వ్యక్తివి. కేక్ కట్ చేసి, క్యాండిల్స్ వెలిగించి నీ జీవితంలోని మరో ఏడాదిని సెలబ్రేట్ చేసుకుందాం. హ్యపీ బర్త్‌డే హస్బెండ్’ అంటూ విష్ చేశారు. (టి20 ప్రపంచకప్ వాయిదా?) View this post on Instagram Marking the date you were born, another year older, greyed a bit more, become smarter and sweeter. (Literally 😂😂) You are a man who will not be moved by all the sweet wishes and gifts. Let’s celebrate another year of your life by cutting a cake and blowing the candles! Happy Birthday, Husband!! A post shared by Sakshi Singh Dhoni (@sakshisingh_r) on Jul 6, 2020 at 10:23pm PDT ధోని జార్ఖండ్‌లోని రాంచీలో 1981, జూలై7న జన్మించాడు. 2004లో బంగ్లాదేశ్‌తో జరిగిన వన్డే మ్యాచ్‌తో టీమిండియా జట్టులోకి ఎంట్రీ ఇచ్చాడు. మూడేళ్లకే 2007లో జరిగిన మొదటి టీ20 ప్రపంచకప్‌తో ధోని టీమిండియా కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించాడు. ఈ టోర్నీలో భారత్‌ను విజేతగా నిలిపాడు. అంతేగాక 2011లో వన్డే ప్రపంచకప్‌ను అందించాడు. ఐసీసీ నిర్వహించే వన్డే వరల్డ్‌కప్, చాంపియన్స్ ట్రోఫీ, టీ20 ప్రపంచకప్ గెలుచుకున్న మొదటి కెప్టెన్ గా ధోని రికార్డు సృష్టించాడు. ఇక 2014లో టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన ధోని, 2017లో టీ 20, వన్డే కెప్టెన్సీ బాధ్యతల నుంచి కూడా తప్పుకున్నాడు. గతేడాది వన్డే వరల్డ్‌కప్ జరిగిన తర్వాత నుంచి ధోని భారత జట్టు తరఫున ఆడలేదు. దాంతో అతని రిటైర్మెంట్పై రకరకాలు కథనాలు వస్తూనే ఉన్నాయి (ఐపీఎల్ ఆతిథ్యానికి మేము సిద్ధం: న్యూజిలాండ్) -
ధోని విరాళం రూ. లక్ష.. సిగ్గు పడండి!
ముంబై: మహమ్మారి కరోనా వైరస్(కోవిడ్-19) సంక్షోభంపై పోరులో ప్రభుత్వాలకు ఆర్థికంగా అండగా నిలబడేందుకు పలువురు వ్యాపార, సినీ, క్రీడా రంగాలకు చెందిన ప్రముఖులు ముందుకు వస్తున్నారు. ఈ క్రమంలో విపత్కర పరిస్థితిని ఎదుర్కొనేందుకు క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ రూ. 50 లక్షలు విరాళంగా ప్రకటించిన విషయం తెలిసిందే. స్టార్ స్ప్రింటర్ హిమదాస్ అసోం ప్రభుత్వానికి తన నెల జీతాన్ని విరాళంగా ఇచ్చారు. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ సారథి, మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోని తన వంతు సహాయంగా ఓ ఎన్జీవో ద్వారా లక్ష రూపాయలు సహాయ నిధికి అందించినట్లు వార్తలు వెలువడ్డాయి.(834కు చేరిన కేసులు.. 19 మంది మృతి) ఈ క్రమంలో ధోని తీరుపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. ఎంతో సంపన్నుడైన క్రికెటర్.. ఇంత పెద్ద మొత్తం దానం చేయడం గొప్ప విషయం అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. కరోనా సంక్షోభంలో డొనేషన్ జోక్‌గా మారిపోయిందంటూ ట్రోల్ చేస్తున్నారు. ఇక ఈ విషయంపై ధోని భార్య సాక్షి ధోని తీవ్రంగా స్పందించారు. ఈ వార్తను ప్రచురించిన మీడియా సంస్థలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు..‘‘సున్నితమైన సమయాల్లో ఇలాంటి నకిలీ వార్తలు ప్రచారం చేయవద్దని మీడియా సంస్థలను అభ్యర్థిస్తున్నా! సిగ్గు పడండి! జర్నలిజం విలువలు మాయమైపోయాయా అని నాకు ఆశ్చర్యం కలుగుతోంది’’అని సాక్షి ట్వీట్ చేశారు.(కరోనాపై పోరాటంలో గెలుస్తాం) I request all media houses to stop carrying out false news at sensitive times like these ! Shame on You ! I wonder where responsible journalism has disappeared ! — Sakshi Singh 🇮🇳❤️ (@SaakshiSRawat) March 27, 2020 -
'బేబీ! నేను ఎప్పటికి నీదాన్నే'
రాంచీ : టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని కొంతకాలంగా ఆటకు దూరంగా ఉంటున్నా సోషల్ మీడియా ద్వారా తన అభిమానులకు మాత్రం ఎప్పుడు టచ్‌లోనే ఉంటాడు. తను పెట్టే పోస్టులతో పాటు తన భార్య సాక్షి సింగ్ పెట్టే పోస్టుల్లోనూ తరచుగా కనిపిస్తుంటాడు. ఇంకా చెప్పాలంటే ధోని కంటే సాక్షినే సోషల్ మీడియాలో మరింత చురుకుగా ఉంటారన్న సంగతి చెప్పనవసరం లేదు. తన భర్తకు సంబంధించిన ప్రతి విషయాన్ని సాక్షి తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ తన అభిమానులతో పాటు ధోని అభిమానుల మనసును గెలుచుకుంటారు. తాజాగా ధోని అభిమానులు తమ ట్విటర్లో ఒక వీడియో షేర్ చేశారు. ఆ వీడియోలో ధోని తన భార్య సాక్షినుద్ధేశించి' నీ ఇన్స్టాగ్రామ్ స్టోరీలను అభిమానించే ఫాలోవర్స్ జాబితాలో నన్ను కూడా చేర్చావుగా' అంటూ ట్రోల్ చేశాడు. దీంతో రూంలో ఉన్న మిగతావారు గొల్లున నవ్వేసరికి సాక్షి ధోని దగ్గరకు వచ్చి ' బేబీ ! నాకు ఫాలోవర్స్ ఎంతమంది ఉన్నా.. నేను ఎప్పటికి నీ దాన్నే' అని పేర్కొన్నారు.(‘ధోని సీటును అలానే ఉంచాం’) కాగా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని గతేడాది జూన్‌లో జరిగిన ప్రపంచకప్‌లో ఇంగ్లాండ్‌పై చివరి మ్యాచ్ ఆడాడు. అప్పటి నుంచి ఒక్క మ్యాచ్ ఆడని ధోనికి బీసీసీఐ తమ వార్షిక కాంట్రాక్ట్‌లో చోటు లభించలేదు. దీంతో అతని కెరీర్‌పై అభిమానుల్లో సందిగ్థత నెలకొన్న ఇప్పటి వరకు ధోని తన రిటైర్మంట్‌పై ఎలాంటి ప్రకటన చేయలేదు. .@msdhoni : Dekho aapne Instagram ke followers badhne ke liye, ye sab kar rahe hai... @SaakshiSRawat : All your followers love me also no.. Check out the hilarious convo here!🤣#Dhoni #Sakshi #MahiWay ❤️😇 pic.twitter.com/B0VNZ4mUOH — MS Dhoni Fans Official (@msdfansofficial) January 30, 2020 -
సాక్షి తెగ ఇబ్బంది పడింది!!
టీమిండియా మాజీ సారథి ఎంఎస్ ధోని తన భార్య సాక్షిని ఆటపట్టిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఓ యాడ్ కోసం రూపొందించిన డైలాగ్‌ను సాక్షి ప్రాక్టీస్ చేస్తుంటే.. మిస్టర్ కూల్ తనను ఏడిపిస్తున్న వీడియోను ధోని తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. ‘ బ్లాస్ట్ ఫ్రమ్ ది పాస్ట్’ అనే క్యాప్షన్‌తో ధోని షేర్ చేసిన ఈ వీడియోకు.. ‘ఈ సంఘటన జరిగి ఏడాదిపైనే అవుతుంది. ఒక్క టేక్‌లో పూర్తి చేయాల్సిన డైలాగ్‌ను చదివేందుకు సాక్షి తెగ ఇబ్బందిపడుతుంది’ అనే ట్యాగ్‌లైన్‌ను జత చేశాడు. కాగా ఈ వీడియోలో.. నగదు చెల్లింపులకు సంబంధించిన ఓ ప్రకటన డైలాగ్ పేపర్లో రాసి ఉంది. దానిని చూసి కూడా సాక్షి సరిగా చదవలేకపోయారు. అది చూసి పక్కనే ఉన్న ధోని .. ‘ఇంతటి సులభమైన డైలాగ్‌ను చూసి కూడా చదవలేక పోతున్నావు.. ఇంకా ఎలా చెప్తావు’ అంటూ సాక్షిని ఆటపట్టించాడు. ధోని.. ముద్దుగా తన భార్యను మందలించిన ఈ వీడియో ప్రతిఒక్కరిని ఆకట్టుకుంటుంది. ఈ వీడియోకు ఫిదా అవుతూ నెటిజన్లంతా తమదైన శైలిలో కామెంట్లు పెడుతున్నారు. View this post on Instagram Blast from the past.when u turn the table and ask the director to deliver the dialogue specially when she keeps saying such an easy dialogue u shd do it in one take.time flies this was more than an Year back. A post shared by M S Dhoni (@mahi7781) on Dec 16, 2019 at 4:00am PST ఇక ధోనీ 2019 ప్రపంచ కప్ తర్వాత తిరిగి మైదానంలో కనిపించలేదు. దీనిపై టీమిండియా కోచ్ రవిశాస్త్రీ ఓ ఇంటర్యూలో మాట్లాడుతూ.. ధోనీ వచ్చే ఏడాది ‘ఇండియన్ ప్రీమియర్ లీగ్’ ఆడిన తర్వాత జట్టులో కొనసాగుతాడా లేదా అన్న విషయంపై స్పష్టతనిస్తాడని, అప్పుడు ధోని నిర్ణయాన్ని ప్రతి ఒక్కరు గౌరవించాలని పేర్కొన్నారు. -
సాక్షి ధోని బర్త్‌డే.. విష్ చేసిన హార్దిక్
టీమిండియా సీనియర్ క్రికెటర్ ఎంఎస్ ధోని సతీమణి సాక్షి ధోని మంగళవారం తన 31వ జన్మదిన వేడుకలను రాంచీలో ఘనంగా జరుపుకున్నారు. ఈ వేడుకుకు అతికొద్ది మందిని ఆహ్వానించినట్లు తెలుస్తోంది. ధోని ఇంట ఏ వేడుకైనా హాజరయ్యే టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాతో పాటు రాబిన్ ఊతప్ప ఆయన భార్య శీతల్ గౌతమ్ తదితరులు సాక్షి ధోని బర్త్‌డే వేడుకల్లో పాల్గొని ఆమెకు విషెస్ తెలిపినట్లు సమాచారం . ఇక సాక్షి ధోనికి హార్దిక్ పాండ్యా, శీతల్ గౌతమ్‌లు మంచి స్నేహితులనే విషయం తెలిసిందే. ఇక భర్త ధోని, కూతురు జీవాతో కలిసి బర్త్‌డే వేడుకలు జరుపుకున్న ఫోటోను సాక్షి తన ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటో వైరల్ అవుతోంది. అంతేకాకుండా సాక్షి ధోనికి నెటిజన్లు బర్త్‌డే విషెస్ తెలుపుతున్నారు. ఇక ధోని కుటుంబం టీమిండియా సభ్యులతో సరదాగా ఉంటుందన్న విషయం తెలిసిందే. సోషల్ మీడియాలో భారత క్రికెటర్లు చేసిన పోస్ట్‌లకు సాక్షి ఫన్నీ రిప్లై ఇస్తుంటుంది. గతంలో ధోనిని, జీవాను తెగ మిస్ అవుతున్నట్లు హార్దిక్ ట్వీట్ చేశాడు. దీనికి సమాధానంగా ‘హార్దిక్ నీకు తెలుసా..రాంచీలో నీకు ఇల్లు ఉంది’అంటూ సాక్షి ధోని రిట్వీట్ చేశారు. ఇక ప్రపంచకప్ ముగిసిన అనంతరం ధోని తాత్కాలిక విరామం ప్రకటించాడు. దీంతో వెస్టిండీస్, దక్షిణాఫ్రికా తాజాగా బంగ్లాదేశ్ సిరీస్‌కు ధోని దూరమయ్యాడు. మరోవైపు వెన్నులో గాయం కారణంగా లండన్‌లో శస్త్ర చికిత్స చేయించుకున్న హార్దిక్ పాండ్యా ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నాడు. View this post on Instagram A post shared by Sakshi Singh Dhoni (@sakshisingh_r) on Nov 19, 2019 at 7:01am PST -
‘పవర్ కట్’పై సాక్షి ధోని ఆగ్రహం
రాంచీ : వేళాపాళా లేని కరెంట్ కోతలు సాధారణ ప్రజలతో పాటు సెలబ్రిటీలను సైతం ఇబ్బందులకు గురి చేస్తోంది. తాజాగా ఇలాంటి అనుభవాన్నే టీమిండియా సీనియర్ క్రికెటర్ ఎంఎస్ ధోని సతీమణి సాక్షి సింగ్ ధోని ఎదుర్కొన్నారు. జార్ఖండ్ రాజధాని రాంఛీలో గత కొద్ది రోజులుగా కరెంట్ కోతలతో ప్రజలు నానా ఇబ్బందులకు గురవుతున్నారని సాక్షి మండిపడ్డారు. కరెంట్ కోతలపై ట్విట్టర్ వేదికగా సాక్షి తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. ‘ప్రతి రోజు కరెంట్ కోతలతో రాంచీ ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. దాదాపు రోజూ 4 నుంచి 7 గంటలు విద్యుత్ సరఫరాను నిలిపివేస్తున్నారు. ఈ రోజు కరెంట్ లేక ఐదు గంటలవుతుంది. ఈ రోజు విద్యుత్ సరఫరాను ఎందుకు నిలిపివేశారో అర్థం కావడం లేదు. ఈ రోజు పండగ కాదు.. వాతావరణం కూడా బాగానే ఉంది. సంబంధిత అధికారులు స్పందించి చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నా’అంటూ ట్వీట్ చేశారు. ఇక సాక్షి ట్వీట్‌పై నెటిజన్లు మిశ్రమంగా స్పందిస్తున్నారు. సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకొనిపోయే విధంగా సాక్షి ట్వీట్‌కు సీఎం, ఇతర ఉన్నతాధికారుల పేర్లను జతచేస్తూ పలువురు నెటిజన్లు రీట్వీట్ చేస్తున్నారు. మరోవైపు ధోని ప్రకటన ఇస్తున్న ఇన్వెర్టర్‌ను వాడాలని మరికొందరు సరదా సలహాలు ఇస్తున్నారు. #ranchi pic.twitter.com/OgzMHoU9OK — Sakshi Singh 🇮🇳❤️ (@SaakshiSRawat) September 19, 2019 -
రిటైర్మెంట్ వార్తలపై స్పందించిన ‘సాక్షి’
హైదరాబాద్: టీమిండియా సారథి విరాట్ కోహ్లి చేసిన ఓ ట్వీట్ ఎంఎస్ ధోని రిటైర్మెంట్ ఊహాగానాలకు తావిచ్చింది. రిటైర్మెంట్ నిర్ణయాన్ని ప్రకటించడానికి గురువారం సాయంత్రం మీడియా సమావేశం ఏర్పాటు చేశాడనే వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. దీంతో చాలాకాలం తర్వాత మరోసారి ఎంఎస్ ధోని రిటైర్మెంట్ హాట్‌టాపిక్‌గా మారింది. ఇప్పటికే బీసీసీఐతో చర్చించాడని గురువారం ప్రెస్ మీట్లో రిటైర్మెంట్ విషయాన్ని వెల్లడించనున్నాడని అనేక వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలపై ధోని సతీమణి సాక్షి ధోని స్పందించారు. ధోని రిటైర్మెంట్పై వస్తున్న వార్తలు అసత్యమని కొట్టిపారేశారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. ఇక చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ కూడా ధోని రిటైర్మెంట్ వార్తలను కొట్టిపారేశాడు. తనకు ఎలాంటి అధికారిక సమాచారం లేదని, ధోని ఈ విషయంపై బీసీసీఐతో గాని నాతో గాని చర్చించలేదని స్పష్టం చేశాడు. ఇక ధోని రిటైర్మెంట్, ప్రెస్ మీట్‌పై తమకు అధికారిక సమాచారం లేదని బీసీసీఐ పేర్కొంది. ప్రపంచకప్ అనంతరం ధోని విశ్రాంతి తీసుకుంటున్న విషయం తెలిసిందే. భారత్ ఆర్మీకి సేవలందించాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఇక తాజాగా ఆర్మీ శిక్షణ పూర్తి చేసుకున్న ధోని కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతున్నాడు. విశ్రాంతి నేపథ్యంలో దక్షిణాఫ్రికా సిరీస్‌కు కూడా ధోని అందుబాటులో ఉండటం లేదు. అయితే ధోనిని విశ్రాంతి పేరుతో కావాలనే పక్కకు పెడుతున్నారని క్రికెట్ అభిమానులు విమర్శిస్తున్నారు. -
ధోనికి సర్ప్రైజ్ గిఫ్ట్
రాంచీ: భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని ప్రస్తుతం కశ్మీర్లో భారత ఆర్మీతో పనిచేస్తున్నాడు. గౌరవ లెఫ్టినెంట్ కల్నల్ హోదాలో ఉన్న ధోని.. ఆర్మీతో కలిసి విధుల్లో పాల్గొంటున్నాడు. కాగా, ఆగస్టు 15వ తేదీ దాటిన తర్వాత ధోని ఇంటికి చేరుకునే అవకాశం ఉంది. అయితే భార్య సాక్షి ఒక గిఫ్ట్‌తో ధోనిని సర్ప్రైజ్ చేయనున్నారు. ధోనికి ఎంతో ఇష్టమైన ‘ఎ జీప్ గ్రాండ్ చెరోకీ’ అనే అద్భుతమైన కారును కొన్న సాక్షి ఆ ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశారు. ‘ నీ కోసం సరికొత్త టాయ్ వెయిట్ చేస్తోంది. త్వరలో ఇంటికి రాబోతున్న నీకు వెల్కమ్. నీకిష్టమైన రెడ్‌బీస్ట్ ఇంటికొచ్చింది. నిన్ను నేను చాలా మిస్సవుతున్నా’ అని సాక్షి పేర్కొన్నారు. ధోనికి కార్లన్నా, బైకులన్నా అమితమైన ఇష్టమనే విషయం తెలిసిందే. ఇప్పటికే అతని షెడ్డులో ఫెరారీ 599 జీటీవో, హమ్మర్ హెచ్2, జీఎంసీ సీరా వంటి కార్లు ఉండగా బైకుల్లో.. కవాసాకి నింజా హెచ్2, కాన్ఫిడరేట్ హెల్కాట్, బీఎస్ఎలు ఉన్నాయి. వెస్టిండీస్ పర్యటన నుంచి కావాలనే విశ్రాంతి తీసుకున్న ధోని.. పారామిలటరీ రెజిమెంట్‌లో సేవ చేసేందుకు సిద్ధమయ్యాడు. View this post on Instagram Welcome home #redbeast ! Your toy is finally here @mahi7781 really missing you ! Awaiting its citizenship as its the first n only car in India ! 🙈 A post shared by Sakshi Singh Dhoni (@sakshisingh_r) on Aug 9, 2019 at 6:15am PDT -
ఆమ్రపాలి కుంభకోణం : ధోనీపై సంచలన ఆరోపణలు
సాక్షి, న్యూఢిల్లీ : రియల్ ఎస్టేట్ సంస్థ ఆమ్రపాలి గ్రూప్ నకు రెరా రిజిస్ట్రేషన్‌ను సుప్రీం కోర్టు రద్దు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా మరో సంచలన విషయం వెలుగు చూసింది. ఇంటి కొనుగోలుదార్లకు చెందిన డబ్బును ఆమ్రపాలి గ్రూప్ అక్రమ పద్ధతుల్లో దాళి మళ్లించిన కుంభకోణం భారత క్రికెట్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి సంబంధమున్న వార్త కలకలం రేపుతోంది. ధోని భార్య సాక్షికి చెందిన రితి స్పోర్ట్స్ మేనేజ్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్‌తో ఆమ్రపాలి గ్రూప్ చీకటి ఒప్పందాలను కుదుర్చుకుందని కోర్టు నియమించిన ఫోరెన్సిక్ ఆడిటర్లు సుప్రీం కోర్టుకు అందించిన నివేదికలో పేర్కొనడం గమనార్హం. రితి స్పోర్ట్స్ మేనేజ్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్, ఆమ్రపాలి మాహి డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఒప్పందాలలో అక్రమాలు చోటు చేసుకున్నాయని పవన్ కుమార్ అగర్వాల్, రవీందర్ భాటియా సమర్పించిన ఫోరెన్సిక్ ఆడిట్ నివేదిక తేల్చింది. ఈ నివేదికను సుప్రీం కోర్టు అంగీకరించింది. 2009 - 2015 మధ్య రితి స్పోర్ట్స్ మేనేజ్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్‌కు రూ .42.22 కోట్లు చెల్లించినట్లు కోర్టుకు తెలిపింది. ఈ మొత్తంలో రూ .6.52 కోట్లు అమ్రపాలి నీలమణి డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ చెల్లించింది. మాహిగా పేరొందిన ధోనికి రితి స్పోర్ట్‌లో ప్రధాన వాటా ఉండగా, సాక్షి అమ్రపాలి మాహికి డైరెక్టర్. మూడేళ్ల క్రితం వరకు ధోని ఈ బృందానికి బ్రాండ్ అంబాసిడర్‌గా పనిచేశారు. గ్రూప్ ప్రాజెక్టుల ఆమోదానికి సంబంధించి చాలా లావాదేవీలను నిర్వహించారని, ఇతర గ్రూప్ కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకున్నప్పుడు కూడా ధోనీ జోక్యం చేసుకున్నాడని తమ ఆడిట్ రిపోర్టులో పవన్ కుమార్ అగర్వాల్, రవీందర్ భాటియా పేర్కొన్నారు. రాంచీలో ఓ ప్రాజెక్టు అభివృద్ధి కోసం ఈ సంస్థ (ఆమ్రపాలి మహి) విలీనం చేశారని, దీనికి సంబంధించి ఇద్దరి మధ్య ఎంవోయూ కూడా కుదిరిందన్నారు. కానీ ఈ ఒప్పంద పేపర్లు తమ దగ్గర అందబాటులో లేవని పేర్కొన్నారు. ఆడిట్ నివేదిక ప్రకారం, నవంబర్ 22, 2009 తేదీన సంతకం చేసిన ఎండార్స్మెంట్ ఒప్పందం ప్రకారం, ధోని తనను తాను అమృపాలి గ్రూప్ ఛైర్మన్‌కు రితి స్పోర్ట్స్ ప్రతినిధితో పాటు మూడు రోజుల పాటు అందుబాటులో ఉండాల్సి ఉంది. దీనికి ధోనీ అంగీకరించినట్టుగా ఎలాంటి రికార్డు అందుబాటులో లేదు. అలాగే మార్చి 20, 2015 నాటి మరో స్పార్సర్షిప్ ఒప్పందం ప్రకారం ఐపిఎల్ 2015 ఎడిషన్ సందర్భంగా చెన్నై సూపర్ కింగ్స్ కోసం వివిధ ప్రదేశాలలో "లోగో స్పేస్" ను ప్రకటించే హక్కును అమ్రపాలి గ్రూప్ సొంతం చేసుకుంది. అ ప్పుడు ధోని చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్‌గా ఉన్నారు. అయితే ఈ ఒప్పందం సాదా కాగితంపై ఉందని , అమ్రపాలి, రితి స్పోర్ట్స్ మేనేజ్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ మధ్య మాత్రమేఈ డీల్ జరిగింది. ఈ ఒప్పందానికి చెన్నై సూపర్ కింగ్స్ తరపున సంతకాలు లేవని నివేదిక తెలిపింది. 42వేలకు పైగా గృహకొనుగోలుదారుల డబ్బులను అక్రమంగా మళ్లించారని తాము భావిస్తున్నామని, వాటిని రికవరీ చేయాల్సిన అవసరముందని సుప్రీం కోర్టు జస్టిస్ అరుణ్ మిశ్రా, యూయూ లలిత్‌లతో కూడిన ధర్మాసనం జూలై 23న జారీ చేసిన ఆర్డర్లో అభిప్రాయపడింది. ఈ సంస్థ ఆధ్వర్యంలో అన్ని పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసే బాధ్యతని ప్రభుత్వరంగ నేషనల్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కార్పోరేషన్ (ఎన్బీసీసి)కి అప్పగించింది. రితి స్పోర్ట్స్ పేరుతో పలు ప్రాంతాల్లో ఆమ్రపాలికి అధికారులు మంజూరు చేసిన ఆస్తుల లీజును కూడా సుప్రీం కోర్టు రద్దు చేసింది. మనీలాండరింగ్ ఆరోపణలు రావడంతో గ్రూప్ సీఎండీ అనిల్ శర్మ, ఇతర డైరెక్టర్లను, సీనియర్ అధికారులను విచారించాలని ఆదేశించింది. ఇది ఇలా వుంటే ఆమ్రపాలి గ్రూప్ ప్రాజెక్టులో పదేళ్ల కింద బుక్ చేసుకున్న 5,500 చ.అ.పెంట్‌హౌస్‌కు సంబంధించిన యాజమాన్య హక్కులకు రక్షణ కోరుతూ ఈ ఏడాది ఏప్రిల్‌లో ధోనీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తన సర్వీసులకు చెల్లించాల్సిన సొమ్ముతో పాటు, పెట్టుబడిగా పెట్టిన రూ.25 కోట్లు కంపెనీ ఎగవేసిందని ఆరోపించారు. అలాగే కంపెనీ తమకు 115 కోట్ల రూపాయల మేర బకాయి పడిందని రితి స్పోర్ట్స్, ధోని సంయుక్తంగా సుప్రీంను కోరాయి. మరోవైపు ఈ వార్తలపై రితి స్పోర్ట్స్ గానీ, క్రికెటర్ ఎంఎస్ ధోనీ గానీ అధికారికంగా స్పందించాల్సి వుంది. చదవండి : ‘ఇల్లు’ గెలిచింది..! -
ఐపీఎల్ టైమింగ్స్‌పై ధోని దంపతుల నిరసన
చెన్నై : ఐపీఎల్ షెడ్యూల్ టైమింగ్స్‌పై చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని, అతని సతీమణి నేలపై పడుకొని నిరసన వ్యక్తం చేశారు. మంగళవారం కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో చెన్నై వేదికగా జరిగిన మ్యాచ్‌లో సీఎస్కే 7 వికెట్ల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇక సీఎస్కే తమ తదుపరి మ్యాచ్‌ను రాజస్తాన్ రాయల్స్‌తో జైపూర్ వేదికగా ఆడనుంది. ఈ నేపథ్యంలో చెన్నై జట్టు ఉదయం అక్కడికి బయలు దేరింది. ఈ సందర్భంగా చెన్నై ఎయిర్‌పోర్ట్‌లో ధోని దంపతులు నేలపై పడుకున్నారు. తమ బ్యాగ్స్‌ను తలదిండులుగా చేసుకొని సేద తీరారు. దీనికి సంబంధించిన ఫొటోను ధోని తప ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ... ‘ఐపీఎల్ టైమింగ్స్ వల్ల.. మార్నింగ్ ఫ్లైట్ ఉంటే ఇలాంటివి జరుగుతాయి.’అని క్యాప్షన్‌గా పేర్కొన్నాడు. అర్థరాత్రి వరకు మ్యాచ్.. మళ్లీ మార్నింగే ఫ్లైట్ అంటే ఎవరికైనా కష్టమే అంటూ అభిమానులు ధోనికి మద్దతుగా కామెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట హల్ చల్ చేస్తోంది. ఆస్ట్రేలియా సిరీస్ సందర్భంగా చెన్నై ఎయిర్‌పోర్ట్‌లో నేలపై పడుకున్న ధోని ఇక ధోని ఎయిర్‌పోర్ట్‌లో ఇలా నేలపై పడుకోవడం ఇదే తొలిసారి కాదు. గతంలో ఆస్ట్రేలియాతో ఐదు వన్డేల సిరీస్ సందర్భంగా ఇదే చెన్నై ఎయిర్‌పోర్ట్‌లో ధోని నేలపై పడుకొని సేదతీరాడు. అప్పుడు ఈ ఫొటో నెట్టింట హల్చల్ చేసింది. ధోని అంటేనే సింప్లిసిటీ..సింప్లిసిటీ అంటేనే ధోని అని అభిమానులు కొనియాడారు. View this post on Instagram After getting used to IPL timing this is what happens if u have a morning flight A post shared by M S Dhoni (@mahi7781) on Apr 9, 2019 at 9:36pm PDT -
టీమిండియా ప్రదర్శనపై ధోని భార్య స్పందన
మెల్బోర్న్ : ఆస్ట్రేలియాతో శుక్రవారం జరిగిన నిర్ణయాత్మక మూడో వన్డేలో అద్భుతమైన ఆటతీరుతో టీమిండియా ఘన విజయం సాధించింది. దీంతో మూడు వన్డేల సిరీస్‌ను 2–1తో గెలుచుకొని కోహ్లి బృందం సత్తాను చాటింది. తద్వారా ఆస్ట్రేలియాలో ద్వైపాక్షిక వన్డే సిరీస్‌ను తొలిసారి సొంతం చేసుకుని భారత్ చరిత్ర సృష్టించింది. మణికట్టు స్పిన్నర్ యజువేంద్ర చహల్ (6/42) అద్భుతమైన ప్రదర్శనతో ఆసీస్‌ను తక్కువ పరుగులకే కట్టడి చేయగా.. మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని (87 నాటౌట్), మరో ఆటగాడు కేదార్ జాదవ్ (61నాటౌట్)తో కలిసి ఒక్కోపరుగు జతచేస్తూ టీమిండియాను విజయతీరాలకు చేర్చాడు. చారిత్రక విజయంతో సిరీస్ సాధించిన టీమిండియాపై క్రికెట్ ప్రముఖులు, అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా.. ధోని భార్య సాక్షి ఇన్‌స్టాగ్రామ్‌లో టీమిండియా ఆటగాళ్లను అభినందించారు. ‘సైనికుల మాదిరి కష్టించి పనిచేసి భారత్‌కు చారిత్రాత్మక విజయాన్నిఅందించారు. మీ అందరికీ అభినందనలు. దేశం తలెత్తుకునేలా చేశారు’ అని పేర్కొన్నారు. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రే లియా 48.4 ఓవర్లలో 230 పరుగులకే ఆలౌట్ కాగా అనంతరం భారత్ 49.2 ఓవర్లలో 3 వికెట్లకు 234 పరుగులు చేసి గెలిచింది. 7 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాను చిత్తు చేసింది. ధోని (114 బంతుల్లో 87 నాటౌట్; 6 ఫోర్లు), కేదార్ జాదవ్ (57 బంతుల్లో 61 నాటౌట్; 7 ఫోర్లు) నాలుగో వికెట్‌కు అభేద్యంగా 121 పరుగులు జోడించి జట్టును గెలిపించారు. కోహ్లి (62 బంతుల్లో 46; 3 ఫోర్లు) మరో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. సిరీస్‌లో ధోని మొత్తం 193 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్’ పురస్కారం అందుకున్నాడు. View this post on Instagram Historical victory by @indiancricketteam .Huge Congratulations!! You guys have made country proud! Fought like a soldier long and hard 🔥👏🏻❤️ @mahi7781 🇮🇳 Sweet Victory ! A post shared by Sakshi Singh Dhoni (@sakshisingh_r) on Jan 18, 2019 at 6:19am PST (మిషన్ ఆసీస్ దిగ్విజయం) -
నేను బస్సులో ఉంటాను. నాకు ఇల్లు లేదు: ధోని
-
నాకు ఇల్లు లేదు : ధోని
రాంచీ : టెస్ట్ సిరీస్‌తో ఆస్ట్రేలియా పర్యటనలో కోహ్లిసేన బిజీగా ఉండటంతో మాజీ కెప్టెన్, సీనియర్ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోని తనకు లభించిన విరామాన్ని కుటుంబంతో ఆస్వాదిస్తున్నాడు. పెళ్లి విందులు.. బర్త్‌డే పార్టీలు, షాపింగ్‌లతో ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు. అయితే తాజాగా ఓ చిన్నారితో ధోని ముద్దుగా ముచ్చటించిన వీడియో నెట్టింట్లో హల్చల్ చేస్తుంది. ఆ చిన్నారిని ఆప్యాయంగా దగ్గరుకు తీసుకుని మరి ఎత్తుకున్న ధోని.. ‘మీరు ఎక్కడ ఉంటారని ఆ పాప ముద్దుగా అడిగిన ప్రశ్నకు.. నేను బస్సులో ఉంటాను. నాకు ఇల్లు లేదు’ అని సమాధానం ఇచ్చాడు. ఈ వీడియోను ధోని సతీమణి సాక్షిసింగ్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయడంతో తెగ వైరల్ అయింది. ధోనికి ఇల్లు అవసరం లేదని.. అతన్ని గుండెల్లో ఉంచుకున్నామని అతని అభిమానులు కామెంట్ చేస్తున్నారు. ఇక ధోని ఇటీవల తన కూతురు జీవాతో కలిసి డ్యాన్స్ చేసే వీడియో కూడా వైరల్ అయింది. ఈ వీడియోలో జీవా ధోనికి డ్యాన్స్ నేర్పించడం గమనార్హం. విరామం దొరికితే సతీమణి సాక్షిసింగ్, కూతురు జీవాలతో గడిపే ధోని ఈ సారి కూడా తన పూర్తి సమయాన్ని వారికే కేటాయించాడు. దీంతో వీరు ఏది చేసినా నెట్టింట హాట్ టాపిక్ అవుతోంది. జనవరి12న ఆసీస్‌తో ప్రారంభమయ్యే వన్డే సిరీస్‌తోనే ఈ రాంచీ క్రికెటర్ తిరిగి మైదానంలో అడుగుపెట్టనున్నాడు. -
సాక్షి సింగ్.. ధోనికి కాస్త మర్యాదివ్వు.!
రాంచీ : ‘బిల్లు నువ్వే కట్టావ్‌గా.. ఆ చెప్పులు కూడా నువ్వే వేయ్’ అనే క్యాప్షన్‌తో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని సతీమణి సాక్షిసింగ్ ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్న ఓ ఫొటో నెట్టింట హల్చల్ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ ఫొటోపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. సతీమణి అడిగిందే ఆలస్యం.. టీమిండియా విజయవంతమైన కెప్టెన్‌గా పేరొందిన ధోని ఏమాత్రం అహం చూపకుండా.. అందరి ముందూ అలా సాక్షికి సాయం చేయడం గొప్ప విషయం అని కొందరు ప్రశంసలు జల్లు కురిపించారు. కానీ మరి కొందరు మాత్రం.. సాక్షిసింగ్‌పై మండిపడుతున్నారు. ‘మంచి మనసున్న ధోనికి భార్యగా నువ్వు అనర్హురాలివి. పబ్లిక్‌గా ఓ దిగ్గజ క్రికెటర్‌తో చెప్పులు వేయించుకుంటావా? ఇది నీకు తగునా?’ అని ఒకరు.. ఇది పద్దతి కాదు ధోని.. మీరొక దిగ్గజ క్రికెటర్. కానీ సేవకుడు మాత్రం కాదు’ అని మరొకరు.. ‘ సాక్షి.. నువ్వు లేడీ బాస్‌గా ఫీలవ్వకూ.. ఆ మంచి మనిషికి కొంచెం గౌరవమివ్వు’ అని కామెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఆస్ట్రేలియా గడ్డపై టీమిండియా టెస్టు సిరీస్ ఆడుతుండటంతో.. విశ్రాంతిలో ఉన్న ధోని.. ఇటీవల తన భార్య సాక్షిసింగ్‌తో కలిసి షాపింగ్‌కు వెళ్లాడు. అయితే అక్కడ చెప్పులు పరీక్షించే ప్రయత్నంలో ఇబ్బందిపడ్డ సాక్షికి ధోని సాయం చేశాడు. అతనే స్వయంగా ఆమెకు చెప్పులను వేసి తన సతీమణి మనసును దోచుకున్నాడు. (చదవండి: బిల్లు నువ్వే కట్టావ్‌గా.. షూ నువ్వే వేయ్ : ధోని భార్య) View this post on Instagram You paid for the shoes so you tie them tooo 🤗😘 !!! Photo Credit - @k.a.b.b.s A post shared by Sakshi Singh Dhoni (@sakshisingh_r) on Dec 15, 2018 at 9:54am PST -
బిల్లు నువ్వే కట్టావ్‌గా.. షూ నువ్వే వేయ్ : ధోని భార్య
రాంచీ : టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని మరోసారి తన సతీమణి మనసును దోచుకున్నాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియా గడ్డపై టీమిండియా టెస్టు సిరీస్ ఆడుతుండటంతో.. విశ్రాంతిలో ఉన్న ధోని.. ఇటీవల తన భార్య సాక్షిసింగ్‌తో కలిసి షాపింగ్‌కు వెళ్లాడు. అయితే అక్కడ చెప్పులు పరీక్షించే ప్రయత్నంలో ఇబ్బందిపడ్డ సాక్షికి ధోని సాయం చేశాడు. అతనే స్వయంగా ఆమెకు చెప్పులను వేసాడు. ఈ ఫొటోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన సాక్షి... ‘బిల్లు నువ్వే కట్టావ్‌గా.. షూస్ కూడా నువ్వే వేయ్’ అని కామెంట్ చేసింది. టీమిండియా విజయవంతమైన కెప్టెన్‌గా పేరొందిన ధోనీ ఏమాత్రం అహం చూపకుండా.. షాప్‌లో అందరి ముందూ అలా సాక్షికి సాయం చేయడంపై అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. 2014లో ధోని టెస్టు క్రికెట్‌కి రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి వన్డే, టీ20ల్లోనే కొనసాగుతున్న ధోని.. నిలకడలేమి ప్రదర్శనతో టీ20 జట్టులో కూడా స్థానం కోల్పోయాడు. అతని స్థానంలో యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్‌కు అవకాశం కల్పించడంతో గత రెండు నెలలుగా అంతర్జాతీయ క్రికెట్‌కి దూరమయ్యాడు. ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌కి ఎంపికైతే మాత్రం వచ్చే ఏడాది జనవరి 12న మళ్లీ మైదానంలోకి అడుగుపెట్టనున్నాడు. -
ఊతప్పకు ధోని భార్య థ్యాంక్స్!
ముంబై: క్రికెటర్ రాబిన్ ఊతప్పకు మహేంద్రసింగ్ ధోని భార్య సాక్షి ధోని ధన్యవాదాలు తెలిపారు. మహి, తనను కలిపింది అతడేనని వెల్లడించి, ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్పారు. సాక్షి తన 30వ పుట్టిన రోజు వేడుకలను ముంబైలోని ఓ హోటల్లో ఇలీవల జరుపుకున్నారు. ఈ పార్టీకి రాబిన్ ఊతప్పతో పాటు హార్థిక్ పాండ్యా, పలువురు సన్నిహితులు హాజరయ్యారు. ధోని కూతురు జీవా ఈ పార్టీలో ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ప్రముఖ గాయకుడు రాహుల్ వైద్య పలు బాలీవుడ్ హిట్ సాంగ్స్ పాడి అలరించారు. సాక్షి, పాండ్యా కూడా రాహుల్‌తో కలసి ‘యే దిల్ హై ముష్కిల్’ సినిమాలోని ‘చన్నా మేరాయా’ పాట ఆలపించారు. పార్టీ పూర్తయ్యాక తన పుట్టిన రోజు వేడుకలకు వచ్చిన వారందరికి కృతజ్ఞతలు తెలిపారు. రాబిన్ ఊతప్ప, అతడి భార్య శీతల్ గౌతమ్‌తో కలిసివున్న ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. 2010లో ధోని, సాక్షి పెళ్లి చేసుకున్నారు. వీరికి మూడేళ్ల కూతురు జీవా ఉంది. ప్రస్తుతం ఆస్ట్రేలియాతో జరుగుతున్న టీ20 సిరీస్‌కు ఎంపిక కాకపోవడంతో ధోని అంతర్జాతీయ కెరీర్‌కు బ్రేక్ పడింది. 2018 సంవత్సరం ధోని కెరీర్లో అత్యంత చెత్తగా నిలిచింది. ఈ ఏడాది ఇప్పటివరకు 19 మ్యాచ్‌లు ఆడి కేవలం 275 పరుగులు మాత్రమే చేశాడు. ఇందులో అతడి వ్యక్తిగత అత్యధిక స్కోరు 42 నాటౌట్. 2019 వన్డే ప్రపంచకప్ టోర్నమెంట్‌కు కొద్ది నెలల సమయం మాత్రమే ఉండటంతో ధోని ఫామ్ టీమిండియాను కలవరపెడుతోంది. -
పాండ్యా.. అది సిగరెటా?
టీమిండియా మాజీ సారథి ఎంఎస్ ధోని సతీమణి సాక్షి ధోని జన్మదిన వేడుకలు ముంబైలో ఆదివారం అట్టహాసంగా జరిగిన విషయం తెలిసిందే. ఈ వేడుకకు హాజరైన భారత ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. మిగతా క్రికెటర్లు ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న నేపథ్యంలో హాజరుకాలేకపోయారు. అయితే సాక్షి ధోని ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన వీడియోలో పాండ్యా తీరు పట్ల నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ వీడియోలో ఆమె కేక్ కట్ చేస్తుండగా.. పాండ్యా పొగతాగుతూ కనిపించాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై నెటజన్లు పాండ్యాను ట్రోల్ చేస్తూ కామెంట్ చేస్తున్నారు. ‘పాండ్యా భాయ్ అది నిజంగా సిగరెటేనా’అంటూ ఒకరు కామెంట్ చేయగా.. మరికొందరు పాండ్యా సిగరెట్ తాగాడంటూ కన్ఫామ్ అయి మండిపడుతున్నారు. అయితే ఆ వీడియోలో కనిపిస్తున్నట్లు పాండ్యా నిజంగా సిగరెట్ తాగాడా అనే విషయం తెలియాల్సివుంది. దీనిపై పాండ్యా ఇంతవరకు స్పందించలేదు. ఆసియా కప్‌లో హార్దిక్ పాండ్యా గాయపడటంలో వెస్టిండీస్, ఆస్ట్రేలియాలతో సిరీస్‌లకు దూరమైన విషయం తెలిసిందే. హార్దిక్ పాండ్యా గాయపడటంతో తన అన్న కృనాల్ పాండ్యాకు టీ20 జట్టులో చోటు దక్కింది. ఇక కీలక ఆసీస్ పర్యటనకు హార్దిక్ లేకపోవడం తీవ్రమైన లోటేనని టీమిండియా ప్రధాన కోచ్ రవిశాస్త్రి పేర్కొన్నాడు. అతడు జట్టులో ఉంటే టీమ్ బ్యాలెన్స్డ్గా ఉండేదని కోచ్ వాపోయాడు. View this post on Instagram Cake cutting 😍😍 #SakshiDhoni #Msdhoni A post shared by Sakshi Singh Dhoni FC 🍓 (@_sakshisingh_r) on Nov 17, 2018 at 11:52am PST -
బర్త్‌డే సెలబ్రేషన్స్.. ఆడిపాడిన సాక్షి ధోని
-
వైరల్: బర్త్‌డే సెలబ్రేషన్స్.. ఆడిపాడిన సాక్షి ధోని
ముంబై: టీమిండియా మాజీ సారథి ఎంఎస్ ధోని సతీమణి సాక్షి ధోని సోషల్ మీడియాలో చాలా ఆక్టీవ్‌గా ఉంటారన్న విషయం తెలిసిందే. తాజాగా తన బర్త్ డే వేడుకలకు సంబంధించిన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ప్రతీ సారి తను షేర్ చేసే ఫోటోలో మిస్టర్ కూల్ ధోని లేక జీవా హైలెట్‌గా ఉండేవారు కానీ తాజాగా షేర్ చేసిన ఫోటోలు, వీడియోలో సాక్షి మాత్రమే హైలెట్‌గా నిలిచారు. ఆదివారం(నవంబర్ 18) ముంబైలో సాక్షి ధోని జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ వేడుకలో సాక్షి తన స్నేహితులతో కలిసి చిన్న పిల్లలా మారి ఆడుతూ, పాడుతూ తెగ అల్లరి చేశారు. ఈ కార్యక్రమానికి సాక్షి స్నేహితులతో పాటు పలువురు సినీ తారలు హాజరయ్యారు. ధోని-పాండ్యాల బ్రొమాన్స్ సాక్షి ధోని బర్త్‌డే సెలబ్రేషన్స్‌కి టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా హాజరయ్యాడు. ఈ సందర్భంగా ధోనితో కలిసి దిగిన ఫోటోను పాండ్యా షేర్ చేశాడు. దీనిపై నెటిజన్లు ఫన్నీగా స్పందించారు. ధోని, పాండ్యాల మధ్య బ్రొమాన్స్(రొమాన్స్ ఆఫ్ బ్రదర్స్) చూడముచ్చటగా ఉందని కామెంట్ చేస్తున్నారు. ఇక గాయం కారణంగా ఆస్ట్రేలియా సిరీస్‌కు పాండ్యా దూరం కాగా ధోనిని సెలక్టర్లు పక్కకు పెట్టిన విషయం తెలిసిందే. -
‘భార్య కెప్టెన్ అయితే గొడవే ఉండదు’
టీమిండియా మాజీ సారథి మహేంద్ర సింగ్ సతీమణి సాక్షి ధోని సోషల్ మీడియాలో చాల యాక్టీవ్‌గా ఉంటారన్న విషయం తెలిసిందే. ధోని, జీవాలకు సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకునే ఆమె తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్చేసిన వీడియో తెగ వైరల్ అవుతుంది. సరదాగా ఉన్న వీడియో, కింద రాసిన కామెంట్ ఆకట్టుకోవడంతో నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. నిమిషాల్లోనే వేల లైక్స్, వందల కామెంట్లు వచ్చాయి. అసలు విషయమేమిటంటే? సిమ్లా అందాలను వీక్షించిన అనంతరం భర్త ఎంఎస్ ధోనితో కలిసి సాక్షి విమానంలో తిరుగుపయనయ్యారు. ఆ విమానాన్ని నడిపే ఇద్దరు పైలెట్లు భార్యభర్తలు కావడంతో సాక్షి ఆశ్చర్యపోయారు. దీంతో వారు విమానాన్ని ఆపరేటింగ్ చేసే విధానాన్ని వీడియో తీసి ‘భార్యాభర్తలిద్దరూ ప్రయాణం మధ్యలో గొడవ పెట్టుకోకూడదని కోరుకుంటున్నా.. ఈ రోజు కెప్టెన్ భార్య అయితే గొడవ ఉండకపోవచ్చు’ అంటూ ఫన్నీగా కామెంట్ చేశారు. సాక్షి కామెంట్‌పై స్పందించిన ధోని‘భయపడకు నీ పక్కనే కూల్ హెలికాప్టర్ ఉంది’ అంటూ పేర్కొన్నాడు. ఇక సాక్షి వీడియో అండ్ కామెంట్‌పై నెటిజన్లు మిశ్రమంగా స్పందిచారు. దీనిపై కొందరు నెటిజన్లు ఫన్నీగా స్పందిస్తే, మరికొందరు ముందు మహిళా ఫైలెట్‌ను గౌరవించండి అంటూ ఘాటుగా పేర్కొన్నారు. A post shared by Sakshi Singh Dhoni (@sakshisingh_r) on Aug 31, 2018 at 3:03am PDT -
ధోని బైక్ మ్యూజియం చూశారా?
రాంచీ: భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని ఖాళీ సమయాల్లో ఏం చేస్తూ ఉంటాడు అని ఎవరైనా ప్రశ్నిస్తే వెంటనే గుర్తొచ్చేది బైక్ సవారీనే. ఎందుకంటే ధోనికి బైక్‌లంటే అంత ఇష్టం. ఈ విషయం అందరికీ తెలిసిందే. తాజాగా ధోని భార్య సాక్షి కూడా ఇదే విషయాన్ని అభిమానులతో పంచుకుంది. ‘ధోనీ అమితంగా ప్రేమించే టాయ్స్’ అంటూ సాక్షి ఒక ఫొటోను సోషల్ మీడియాలో పంచుకుంది. ఈ ఫొటో ఏంటో తెలుసా. బైక్స్ మ్యూజియం. ఈ ఫొటో ఎక్కడిది అన్నది మాత్రం సాక్షి చెప్పలేదు. సామాజిక మాధ్యమాల్లో ఈ ఫొటో చూసిన అభిమానులు మాత్రం ఇది ‘ధోని బైక్ మ్యూజియం, రాంచీలోని తన ఇంటి ప్రాంగణంలో ధోని ఏర్పాటు చేసుకున్న బైక్ మ్యూజియం ఇదే’ అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ధోని వద్ద చాలా బైకులు ఉన్న సంగతి మనకూ తెలిసిందే. -
ఎలాంటి డ్రెస్సులు వేయాలో తెలీదా?
టీమిండియా సీనియర్ క్రికెటర్ ఎంఎస్ ధోనీ భార్య సాక్షి ధోనీపై సోషల్ మీడియా వేదికగా సెటైర్ల వర్షం కురుస్తోంది. సాక్షి ఈ మధ్యే తన బెస్ట్ ఫ్రెండ్ పూర్ణ పటేల్ సంగీత్ కార్యక్రమానికి ఈ మధ్య హాజరయ్యారు. అందుకోసం మనీష్ మల్హోత్రా డిజైన్ చేసిన డ్రెస్సును ఆమె ధరించారు. అయితే ఆ డ్రెస్సే సోషల్ మీడియాలో ఆమెపై విమర్శలు గుప్పించేలా చేసింది. ‘ఎలాంటి డ్రెస్సులు వేయాలో తెలీదా? అది అవసరమా?.. సెలబ్రిటీ భార్య అయినంత మాత్రానా ఇలాంటివి వేస్తావా? నీకలు డ్రెస్సింగ్ సెన్సే లేదు’ ఇలాంటి కామెంట్లు వచ్చి పడుతున్నాయి. అయితే ఈ క్రమంలో సాక్షికి సపోర్ట్‌గా పలువురు నిలుస్తున్నారు. ఆ ఫోటోలో ఎలాంటి తప్పు లేదని.. ట్రోల్ చేసే వాళ్ల ఆలోచనలే తప్పుగా ఉన్నాయని కామెంట్లు చేస్తున్నారు. అయితే భర్త ధోనీలాగే కూల్ అని పేరున్న సాక్షి.. ఆయా కామెంట్లకు రియాక్ట్ కాకుండా ఉండిపోయారు. -
సాక్షితో కలిసి జీవా స్టెప్పులు..
ముంబై: టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని గారాలపట్టి జీవా తన డ్యాన్స్‌తో మరోసారి వార్తల్లో నిలిచింది. ఓ పెళ్లి వేడుకకు ధోని కుటుంబం హజరైన క్రమంలో జీవా తన డ్యాన్స్‌తో అదరగొట్టింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తాజాగా వైరల్‌గా మారింది. వివరాల్లోకి వెళితే.. కేంద్ర మాజీ మంత్రి ప్రఫుల్ పటేల్ కుమార్తె పూర్ణ పటేల్ వివాహ కార్యక్రమంలో భాగంగా గురువారం రాత్రి మెహందీ ఫంక్షన్ జరిగింది. సాక్షి-పూర్ణ ఎప్పటి నుంచో స్నేహితులు. దీంతో సాక్షి కుటుంబసమేతంగా ఈ వేడుకకు హాజరైంది. ఈ కార్యక్రమంలో జీవా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తల్లి సాక్షి చూపిస్తోన్న డ్యాన్స్ స్టెప్పులు వేసేందుకు ప్రయత్నిస్తూ జీవా ఆకట్టుకుంది. ఇంగ్లండ్ పర్యటన ముగించుకుని తిరిగి భారత్ చేరుకున్న ధోని తన విరామ సమయాన్ని కుటుంబ సభ్యులతో కలిసి గడుపుతున్నాడు. -
ధోని గారాలపట్టి జీవా డ్యాన్స్
-
స్త్రీలోక సంచారం
::: మూడు నెలల క్రితం బల్గేరియాలో జరిగిన ఆర్యన్ ముఖర్జీ చిత్రం ‘బ్రహ్మాస్త్ర’ యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణలో ఆలియా భుజానికి అయిన గాయం పూర్తిగా తగ్గకుండానే ఇప్పుడు మళ్లీ అభిషేక్ వర్మ ‘కళంక్’ షూటింగ్లో ఆమె కాలికి తీవ్ర గాయం అయింది. బ్రహ్మాస్త్రలోని ఆలియా సహనటులు రణబీర్ కపూర్, అమితాబ్‌బచ్చన్; ‘కళంక్’ తారలు వరుణ్ ధావన్, ఆదిత్యారాయ్ కపూర్, సోనాక్షీ సిన్హాల టైట్ షెడ్యూళ్లకు ఇబ్బంది కలగకుండా ఉండడం కోసం ఆలియా షూటింగ్ విరామ సమయాల్లోనే తన రెండు గాయాలకూ కాస్త విశ్రాంతినిస్తూ ఈ రెండు చిత్రాలను ఏకకాలంలో చేస్తున్నారు ::: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో రెండేళ్ల క్రితం ఆత్మహత్య చేసుకున్న పీహెచ్డీ విద్యార్థి రోహిత్ వేముల మరణానికి ప్రధాని నరేంద్ర మోదీనే కారణం అని అతడి తల్లి రాధిక వేముల ఆరోపించారు. బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడేందుకు ‘ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్’ (ఐ.యు.ఎం.ఎల్) తనకు డబ్బు ఇచ్చిందన్న విమర్శలను ఖండిస్తూ, పదవీ విరమణ పొందిన ‘ఐఏఎస్ అధికారుల సంఘం’ చేత ఇంటి స్థలాన్ని విరాళంగా ఇప్పించి, ఆ స్థలంలో ఇల్లు కట్టించి ఇస్తామని మాత్రమే కేరళలోని ఐ.యు.ఎం.ఎల్ తనకు హామీ ఇచ్చింది తప్ప డబ్బురూపంలో ఏమీ ఇవ్వలేదని రాధిక స్పష్టం చేశారు. మాజీ ఇండియన్ క్రికెట్ కెప్టెన్ ఎం.ఎస్.ధోనీ భార్య సాక్షి ధోని ఆయుధ లైసెన్స్ కోసం రాంచీ జిల్లా యంత్రాంగానికి దరఖాస్తు చేసుకున్నారు. రాంచీలో తనెప్పుడూ ఒంటరిగానే ఉంటున్నందున తన ప్రాణాలకు రక్షణ అవసరమనీ, రోజూ తను ఇంటి నుండి బయటికి వెళ్లి వచ్చేటప్పుడు కూడా భద్రత అవసరం కనుక తన దగ్గర రివాల్వర్‌ను ఉంచుకునేందుకు అనుమతించాలని సాక్షి ఆ దరఖాస్తులో కోరారు ::: దేశ రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ జమ్మూకశ్మీర్‌లోని పూం^Œ కి వెళ్లి, ఇటీవల ఉగ్రవాదులకు చిక్కి, వారి చేతుల్లో చిత్రహింసలకు గురై మరణించిన ఆర్మీ రైఫిల్‌మేన్ ఔరంగజేబుకు నివాళులు అర్పించి, ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఈ సందర్భంగా ఆ వీర జవాను ఇంట్లో నేలపై కూర్చున్న సీతారామన్ ఉద్వేగానికి గురై, ‘మీకు అండగా మేము ఉంటాము’ అని చెమర్చిన కళ్లతో ఆ జవాను తల్లికి భరోసా ఇచ్చారు ::: ఇటీవలి వివాదాస్పద బాలీవుడ్ చిత్రం ‘వీరె ది వెడ్డింగ్’ (నా స్నేహితురాలి పెళ్లి)లోని దేహవాంఛను స్థిమిత పరిచే ‘స్వయంతృప్తి’ సన్నివేశంలో నటించిన స్వరాభాస్కర్ సోషల్ మీడియాలో తీవ్రమైన విమర్శలకు గురవుతున్నారు. అయితే.. స్త్రీవాంఛలపై నోరు విప్పని మన సంస్కృతిలో ఇలాగైనా కొంత చర్చ జరుగుతుండడం ఆరోగ్యకరమైన పరిణామమేనని స్వరా అంటున్నారు. యాభై మూడేళ్ల ఆస్కార్ నటి శాండ్రా బుల్లక్.. కెరియర్ కొత్తలో తనకు ఎదురైన అనుభవం గురించి చెబుతూ, అప్పట్లో హాలీవుడ్లో అత్యంత శక్తిమంతుడైన ఒక నిర్మాత తనకు అవకాశం ఇచ్చినందుకు ప్రతిఫలంగా తనను కోరుకున్నాడని, అయితే అందుకు మనస్కరించక ఆ అవకాశాన్ని చిరునవ్వుతో వదులుకున్నానని ‘టైమ్’ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఇలాంటి ఇరకాటంలో తనెప్పుడూ ‘ప్లీజ్ జస్ట్ ఫైర్ మీ’ (మీరొద్దు మీ అవకాశం వద్దు) అనే సిద్ధాంతాన్నే పాటిస్తానని చెప్పారు ::: యు.ఎస్.లోని వర్జీనియాలో ఒకటో తరగతి చదువుతున్న శారా గోమెజ్ లేన్ అనే చిన్నారి గూగుల్ డూడుల్ కంటెస్ట్‌లో డైనోసార్ బొమ్మను గీసి 20 లక్షల 50 వేల రూపాయలకు సమానమైన 30 వేల డాలర్ల ప్రైజ్ మనీ గెలుచుకుంది! యు.ఎస్. ఆ చుట్టపక్కల ప్రాంతాల నుంచి వచ్చిన లక్షా 80 వేల ఎంట్రీలన్నిటిలోకీ తెల్ల కాగితంపై రంగు పెన్సిళ్లతో శారా గీసిన డైనోసార్ బొమ్మను చూసి జడ్జిలుగా వచ్చిన ఉద్ధండులు ముగ్ధులయ్యారని గూగుల్ వెల్లడించింది ::: యోగా డే సందర్భంగా ఢిల్లీలో స్త్రీ, శిశు అభివృద్ధి శాఖ మంత్రి మనేకాగాంధీ గర్భిణుల చేత తేలికపాటి యోగాసనాలు వేయించారు. ‘హెల్దీ అండ్ హ్యాపీ ప్రెగ్నెన్సీ’ కోసం మనేకా ఏర్పాటు చేయించిన ఈ ప్రత్యేక యోగా కార్యక్రమంలో సుఖ ప్రసవానికి దోహదపడే ఆసనాలను గర్భిణులకు నిపుణులు నేర్పించారు. -
ప్రాణహాని ఉంది.. తుపాకీ కావాలి : ధోని భార్య
భారత్ క్రికెట్ జట్టు మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోని భార్య సాక్షి లైసెన్స్ రివ్వాలర్ ఇప్పించాలని కోరినట్లు సమాచారం. అంతేకాక తనకు ప్రాణ హాని ఉందని కూడా ఆమె చెప్పినట్లు తెలుస్తోంది. ఎంఎస్ ధోని మ్యాచ్‌ల దృష్ట్యా బీజీగా ఉంటారనే విషయం విదితమే. ‘ధోని ఇంట్లో చాలా తక్కువ సమయం ఉంటారు. నేను నా కూతురితో కలిసి ఒంటరిగానే ఇంట్లో ఉంటాను. తరచూ ఏదో ఒక పని మీద బయట తిరుగుతుంటాను. ఆ సమయంలో ఒంటరిగానే వెళ్తాను. నా భద్రతా దృష్ట్యా త్వరగా లైసెన్స్డ్ పిస్టల్ లేదా 0.32 రివాల్వర్ ఇప్పించండి’ అని సాక్షి పేర్కొన్నారు. గతంలో కూడా ఎంఎస్ ధోని కూడా లైఎస్స్ తుపాకీ కోసం అనుమతి కోరిన విషయం తెలిసిందే. ఆ సమయంలో ధోనికి 9ఎమ్ఎమ్ గన్‌కు కూడా అనుమతి ఇచ్చారు. టీమిండియా జట్టు త్వరలో ఐర్లాండ్ పర్యటనకు వెళ్లనుంది. యో యో టెస్టు పాసైన ఎంఎస్ ధోని ప్రస్తుతం బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో ప్రాక్టీస్ సెషన్స్‌లో ఉన్నాడు. -
టెన్షన్లో అనుష్క.. సాక్షి ధోని హ్యాపీ!
సాక్షి, బెంగళూరు: ఐపీఎల్ ఒకే సీజన్లో రెండో పర్యాయం 200 పైచిలుకు లక్ష్యాన్ని ఛేదిస్తూ రాయల్ చాలెంజర్స్ బెంగళూరుపై బుధవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించింది. అయితే మిస్టర్ కూల్ కెప్టెన్, బెస్ట్ ఫినిషర్ ఎంఎస్ ధోని (34 బంతుల్లో 70 నాటౌట్; 1 ఫోర్, 7 సిక్సర్లు) బెంగళూరు బౌలర్లపై సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. ధోనితో పాటు అంబటి రాయుడు (53 బంతుల్లో 82; 3 ఫోర్లు, 8 సిక్సర్లు) కీలక ఇన్నింగ్స్ తోడవడంతో చెన్నై జట్టు 205 పరుగుల లక్ష్యాన్ని 19.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించి అద్భుత విజయాన్ని అందుకుంది. బెంగళూరు, చెన్నై మ్యాచ్ ముగుస్తుందనగా విరాట్ కోహ్లి భార్య అనుష్కశర్మ, ధోని భార్య సాక్షి ధోనిల హావభావాలపై ప్రేక్షకుల దృష్టి సారించారు. కోహ్లి టీమ్ ఓడుతుందని అనుష్క టెన్షన్ పడుతుందగా, ధోని టీమ్ విజయానికి చేరువ అవుతుండటంతో సాక్షి ధోని ఉత్సాహంగా కనిపించారు. ఇందుకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చెన్నై బ్యాటింగ్ సమయంలో ఇన్నింగ్స్ 19వ ఓవర్ బెంగళూరు పేసర్ మహ్మద్ సిరాజ్ వేశాడు. ఆ ఓవర్ 5వ బంతిని లో ఫుస్టాస్గా సంధించగా.. తన అనుభవాన్ని ఉపయోగించి ధోని సిక్సర్‌గా మలిచాడు. పలుమార్లు లేచి చప్పట్లు కొడుతూ భర్త ధోనికి మద్దుతు తెలిపిన సాక్షి ధోని.. ఆ సిక్సర్‌ను ఆస్వాధిస్తూ 'వన్ మోర్ సిక్స్' (ఇంకో సిక్సర్ కొట్టు) అంటూ చిన్నస్వామి స్టేడియంలో సందడి చేశారు. చివరి ఓవర్లో నాలుగో బంతిని తనదైన స్టైల్లో ధోని సిక్సర్‌గా మలిచి చెన్నైకి విజయాన్ని అందించాడు. -
సాక్షి ధోని 'వన్ మోర్ సిక్స్' వైరల్ వీడియో
-
హల్ చల్ చేస్తున్న సాక్షి ధోనీ ఫొటోలు!
మిగతా క్రికెటర్ల భార్యలతో పోల్చుకుంటే మహేంద్రసింగ్ ధోనీ సతీమణి సాక్షి సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటారు. సెల్ఫీలు తీసుకోవడంలోనూ ఆమె పర్ఫెక్ట్ అని.. ఇన్ స్టాగ్రామ్ లో ఆమె పేజీని ఫాలో అయ్యే అభిమానులు చెప్తూ ఉంటారు. సాక్షి తమ జీవితంలో అందమైన ఘట్టాలను ఫొటోల రూపం ఎప్పటికప్పుడు అభిమానులకు పంచుతూ ఉంటారు. ఫొటోకు పోజివ్వమంటూ ధోనీని ఒప్పించడం నుంచి, కూతురు జివాతో అందమైన ఫొటో దిగడం వరకు తాజాగా ఆమె ఇన్ స్టాగ్రామ్ లో పెట్టిన ఫొటోలు బాగా హల్ చల్ చేశాయి. అందమైన విహార ప్రాంతంలో ఆమె దిగిన అందమైన సెల్ఫీలు కూడా ఫాలోవర్స్ కు తెగ నచ్చేశాయి. ధోనీ వెరీ లక్కీ పర్సన్ అంటూ చాలామంది నెటిజన్లు పొగిడేశారు కూడా. ఆ ఫొటోలు మీకోసం ఓ లుక్ వేయండి. -
ధోనీ భార్యకు కోపం వచ్చింది..
రాంచీ : గత రాత్రి ఈడెన్ గార్డెన్స్ లో జరిగిన టి 20 మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ పై గెలిచిన ఆనందంలో క్రికెట్ అభిమానులంతా సంబరాలు జరుపుకోగా ధోనీ సతీమణి సాక్షికి మాత్రం చిరు కోపం వచ్చిందట.. అది కూడా భారత్ అభిమానులపై! అంత చిరాకు పెట్టేలా అభిమానులు ఏం చేసుంటారనుకుంటున్నారా ? ధోనీ గారాల పట్టి జీవాకు నిద్రా భంగం కలిగించారు. భారత్ మ్యాచ్ గెలిచిన సంబరంలో కొందరు అభిమానులు ధోనీ ఇంటి ముందు బాణా సంచా పేల్చి హంగామా చేయడం మొదలుపెట్టారు.అప్పటికే బాగా పొద్దు పోవడంతో సాక్షి కాస్త ఇబ్బంది పడ్డారు. పాప నిద్ర లేస్తుందని చెప్తూ చిరు కోపాన్ని ట్విట్టర్ లో ప్రదర్శించారు! టీం ఇండియాకు శుభాకాంక్షలు చెబుతూనే.. ఇంటి ముందు హంగామాను కూడా వివరించారు. 'మీరంతా కలిసి నా చిన్నారిని నిద్ర లేపేలా ఉన్నారు. నేను తప్పకుండా ఏదో ఒక రోజు భారత్-పాక్ మ్యాచ్ గురించి పాపకు చెప్తాను, కానీ ఇప్పుడు తను చాలా చిన్నపిల్ల కదా.. ఏం జరుగుతుందో, వాళ్ల నాన్న ఎవరో .. ఇవేమీ పాపకు అర్థం కావు' అంటూ ట్వీట్ చేశారు సాక్షి సింగ్ ధోనీ. I would tell her one day as of now she is too young to understand it was #indpak match ! She doesn't kno what n who her dad is !!! — Sakshi Singh Dhoni (@SaakshiSRawat) March 20, 2016 Ppl outside my house ...honking burning fire crackers ...screaming ...u guys r gonna wake up my daughter .... — Sakshi Singh Dhoni (@SaakshiSRawat) March 19, 2016 Congratulations Team India and Happy 8 years boo.... — Sakshi Singh Dhoni (@SaakshiSRawat) March 19, 2016 -
ఈ బుజ్జాయి ఎవరో తెలుసా!
సిరులొలికించే చిరునవ్వులొలుకుతున్న ఈ చిన్నారి.. భారత క్రికెటర్ మహేంద్రసింగ్ ధోనీ గారాల పట్టి. పేరు జివ. వయస్సు పదినెలలు. చూడగానే భలే ముద్దొస్తున్న ఈ బుజ్జాయి ఫొటోను ధోనీ భార్య సాక్షి ట్విట్టర్లో షేర్ చేసింది. జివను ఆశీర్వవందించాలని అభిమానులను కోరింది. గతంలో ఓసారి కూడా జివ ఫొటోను సాక్షి పోస్టుచేసింది. ఆ ఫొటోలో కూతురు జివను ధోని ఎత్తుకొని ఉంటాడు. తాజా ఫొటోలో ముద్దుగా నవ్వుతున్న జివను చూసి ధోనీ అభిమానులు తెగ మురిసిపోతున్నారు. స్వచ్ఛమైన పసిపాపల నవ్వులకు ఫీదా కానివారు ఎవరుంటారు?!! Posers daddy n #Ziva !! pic.twitter.com/hYYe4YRUzf — Sakshi Singh Dhoni (@SaakshiSRawat) November 21, 2015