టీమిండియా మాజీ కెప్టెన్ ధోని నిర్మాతగా మారి తొలిసారిగా తమిళంలో తీసిన చిత్రం 'ఎల్‌జీఎం'. ధోనీ సతీమణి సాక్షి ధోని నిర్మాతగా వ్యవహరించిన ఈ మూవీతో రమేష్ తమిళమణి దర్శకుడు, సంగీత దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. హరీష్ కళ్యాణ్, ఇవనా జంటగా నటించిన ఇందులో నటి నదియా, యోగిబాబు, ఆర్‌జే. విజయ్ తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. విశ్వజిత్ ఛాయాగ్రహణం అందించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని శుక్రవారం వారం తెరపైకి రానుంది.
(ఇదీ చదవండి: మరోసారి వివాదంలో 'బిగ్ బాస్'.. మొదలవడానికి ముందే!)
ఈ సందర్భంగా చిత్ర యూనిట్ మంగళవారం సాయంత్రం చైన్నెలోని పలోజా థియేటర్‌లో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ వేదికపై దర్శకుడు మాట్లాడుతూ ఒక సాధారణ కథను బ్రహ్మాండంగా తెరకెక్కించే ప్రయత్నమే ఎల్‌జీఎం అని తెలిపారు. ధోనీ నిర్మించిన చిత్రంలో నటించడం అదృష్టం అని నటుడు హరీష్ కళ్యాణ్ పేర్కొన్నారు. తన వివాహానంతరం విడుదల అవుతున్న చిత్రం ఇదని,ఆ విధంగా తన భార్య లక్కీ ఛామ్ అని అన్నారు.
నిర్మాత సాక్షి ధోని మాట్లాడుతూ... తమకు, తమిళ ప్రేక్షకులకు మధ్య భాష సమస్యే కాదన్నారు. ధోనీని తమిళ ప్రజలు ఎప్పుడో ఆదరించారని, తమిళ చిత్రం చేయడానికి అదీ ఒక కారణం అని అన్నారు. సహజత్వంతో కూడిన ఓ సినిమా చేయాలనుకున్నామని, అదే ఎల్‌జీఎం అని చెప్పుకొచ్చారు. మూవీ చూసిన ధోనీ చాలా బాగుందని మెచ్చుకున్నట్లు సాక్షి పేర్కొన్నారు. తమిళంలో ఈ వారం రిలీజ్ అవుతోంది కానీ తెలుగులో వచ్చే శుక్రవారం అంటే ఆగస్టు 4న రాబోతుంది.
(ఇదీ చదవండి: 'బేబీ' డైరెక్టర్‌కి విశ్వక్‌సేన్ కౌంటర్స్.. కానీ!?)
Comments
Please login to add a commentAdd a comment