LGM Movie
-
సైలెంట్‌గా ఓటీటీకి వచ్చేసిన ధోని 'ఎల్‌జీఎమ్'... తెలుగు సినిమాలు ఎన్నో తెలుసా?
సినీ ప్రియులు ఓటీటీలపైనే ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. థియేటర్లలో మొదటి వారం మినహాయిస్తే వెళ్లేందుకు అంతగా ఆసక్తి చూపడం లేదు. సూపర్ హిట్ టాక్ వచ్చిన సినిమాలు కనీసం నెల రోజులైనా థియేటర్లలో సందడి చేస్తున్నాయి. యావరేజ్ టాక్ ఉన్న సినిమాలైతే ఏకంగా నెలలోపే ఓటీటీకి వచ్చేస్తున్నాయి. ప్రతివారం లాగే ఈసారి కూడా మిమ్మల్ని అలరించేందుకు సిద్ధమయ్యాయి. మరీ ఆ చిత్రాలేంటో ఓ లుక్కేద్దాం. సమంత, విజయ్ 'ఖుషి' విజయ దేవరకొండ, సమంత జంటగా నటించిన రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘ఖుషి’. శివ నిర్వాణ దర్శకత్వం వహించిన ఈ చిత్రం సెప్టెంబర్ 1న విడుదలై మంచి ఓపెనింగ్స్‌ని అందుకుంది. థియేటర్స్‌లో విడుదలైన నెల రోజుల తర్వాత ఈ చిత్రం ఓటీటీలో రిలీజ్ కాబోతుంది. అక్టోబర్ 1 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కాబోతున్నట్లు ఒటీటీ దిగ్గజం ప్రకటించింది. నిత్యామీనన్- 'కుమారి శ్రీమతి' (వెబ్ సిరీస్) నిత్యామేనన్ కీలక పాత్రలో గోమఠేష్ ఉపాధ్యాయ దర్శకత్వంలో రూపొందిన ఫ్యామిలీ ఎంటర్టైనింగ్ వెబ్‌సిరీస్ కుమారి శ్రీమతి. ఈ సిరీస్‌లో గౌతమి, తిరువీర్, నిరుపమ్, తాళ్లూరి రామేశ్వరి, ప్రణీత పట్నాయక్, ప్రేమ్ సాగర్, నరేష్, మురళీమోహన్ కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా సెప్టెంబరు 28వ తేదీ నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. దుల్కర్ సల్మాన్- కింగ్ ఆఫ్ కోత సీతారామంతో సూపర్ స్టార్‌గా మారిపోయిన దుల్కర్ సల్మాన్ నటించిన గ్యాంగ్‌స్టర్ మూవీ కింగ్ ఆఫ్ కోత. దుల్కర్ స్నేహితుడు అభిలాష్ జోషి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఎన్నో అంచనాల మధ్య ఆగస్టు నెలాఖరులో విడుదలై ఈ చిత్రం మిక్స్డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఈ మూవీ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ వేదికగా సెప్టెంబర్ 29 నుంచి మలయాళం, తెలుగులో స్ట్రీమింగ్ కానుంది. పాపం పసివాడు సింగర్ శ్రీరామ చంద్ర, గాయత్రి చాగంటి ప్రధాన పాత్రల్లో నటించిన వెబ్ సిరీస్ పాపం పసివాడు. వీకెండ్ షో బ్యానర్‌పై రూపొందిన ఈ సిరీస్ ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. లవ్ ఫెయిల్ అయిన అబ్బాయిని ముగ్గురు అమ్మాయిలు ప్రేమిస్తే ఎలా ఉంటుందన్నది ఈ సిరీస్ కథాంశం. ఈ వెబ్‌సిరీస్ సెప్టెంబర్ 29 నుంచి ఇది స్ట్రీమింగ్ కానుంది. సైలెంట్‌గా వచ్చేసిన ఎల్‌జీఎమ్ భారత క్రికెటర్ ఎంఎస్ ధోని ‘ఎల్‌జీఎమ్’తో నిర్మాణంలోకి అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. హరీష్ కల్యాణ్, ఇవానా, నదియా, యోగిబాబు కీలక పాత్రల్లో తెరకెక్కించిన ఈ చిత్రానికి రమేష్ తమిళ్మణి దర్శకత్వం వహించారు. సాక్షి ధోని, వికాస్ హస్జా నిర్మించిన ఈ చిత్రం తెలుగు, తమిళంలో ఆగస్టు 4న విడుదలైంది. అయితే ఎలాంటి హడావుడి లేకుండానే ఈనెల 28 నుంచే అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. -
కోలీవుడ్‌ను నమ్మి క్లీన్ బోల్డ్ అయిన 5 మంది స్టార్ క్రికెట్ ఆటగాళ్లు
కొందరు భారత్ ప్రముఖ క్రికెటర్లు సినిమా రంగంలో రానించాలనే కోరికతో తమిళ చిత్రసీమలో అగ్రస్థానాన్ని కైవసం చేసుకోవాలని కలలు కంటూ.. తొలి సినిమాతోనే క్లీన్ బౌల్డ్ కావడమే కాకుండా సినిమా పరిశ్రమలోకి వచ్చినంత వేగంగానే చెన్నై వదిలి వెళ్లిపోయారు. అలాంటి ఐదుగురు సెలబ్రిటీల గురించి చూద్దాం. భారత్‌లో క్రికెట్‌కు అభిమానుల సంఖ్య ఎక్కువగానే ఉంది. ముఖ్యంగా తమిళనాడులో క్రికెటర్లకు ఉన్న ప్రాధాన్యతను తెలుసుకుని కొందరు క్రికెటర్లు తమిళ చిత్రసీమలోకి హీరోలుగా అడుగుపెట్టినా.. విజయావకాశాలను అందిపుచ్చుకోలేకపోయారు. (ఇదీ చదవండి: లారెన్స్ తన కూతురిని దాస్తున్నాడా? ఆయనకు అంత పెద్ద కూతురు ఉందా?) తమిళ సినీ పరిశ్రమలో కనిపించిన ఐదుగురు క్రికెట్ సెలబ్రిటీలకు కొంతమేరకు నష్టం తెచ్చింది. కానీ అందరికంటే భారత మాజీ కెప్టెన్ ధోనీనే ఎక్కువగా నష్టపోయాడని చెప్పవచ్చు. మరోవైపు సినిమాల్లో నటించి సక్సెస్ కాకపోవడంతో ఆ క్రికెటర్లకు అవకాశాలు రాలేదు. కొన్ని నెలల క్రితం విడుదలైన ఎల్జీఎం అనే చిత్రాన్ని క్రికెటర్ ధోనీ నిర్మించాడు. ఎనిమిది కోట్ల వ్యయంతో రూపొందిన ఈ చిత్రంలో హరీష్ కళ్యాణ్ హీరోగా నటించగా ఇవానా హీరోయిన్గా నటించింది. నదియా, యోగిబాబు తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రం ఇటీవల విడుదలై మిశ్రమ సమీక్షలను అందుకుంది. అలాగే, ఇప్పటి వరకు ఈ చిత్రాన్ని OTTకి విక్రయించడానికి ధోని కష్టపడుతున్నట్లు వార్తలు వచ్చాయి. అదే విధంగా ఈ సినిమా వల్ల ధోని సంస్థ నష్టపోయింది. మొదటి ప్రొడక్షన్ LGM ఫ్లాప్ కావడంతో, ధోని తన తదుపరి చిత్రం గురించి ఆలోచిస్తాడా? అనేది కూడా పెద్ద ప్రశ్నగా మారింది. నటులుగా అరంగేట్రం చేసిన క్రికెట్ దిగ్గజాలు ఈ జాబితాలో క్రికెటర్ సదాగోపన్ రమేష్ మొదటి స్థానంలో ఉన్నాడు. 1999 సెప్టెంబరులో అతను వన్డే క్రికెట్లో మొదటి బంతికే వికెట్ తీసిన తొలి భారతీయ క్రికెటర్‌గా గుర్తింపు పొందాడు. కానీ ఆయన కేవలం 19 టెస్ట్ మ్యాచ్‌లతో పాటు 24 వన్డేలు మాత్రమే ఆడారు. 2011లో దర్శకుడు యువరాజ్ దయాళన్ దర్శకత్వంలో 'బొట్ట బొట్టి' తమిళ చిత్రంలో హీరోగా నటించాడు. ఈ చిత్రం ఒక చిన్న గ్రామంలో క్రికెట్ మ్యాచ్ చుట్టూ కేంద్రీకృతమై, హాస్య కథాంశం ఆధారంగా రూపొందించబడింది. ఆ సినిమా ఆశించిన విజయం సాధించకపోవడంతో ఆదిలోనే సినీ పరిశ్రమకు దూరమయ్యాడు. అతని తర్వాత నటుడు హర్భజన్ సింగ్ ఇటీవలే 'ఫ్రెండ్షిప్' సినిమాతో హీరోగా తెరంగేట్రం చేశాడు. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. అదే విధంగా, ప్రముఖ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ కూడా కోలీవుడ్‌లో నటించాడు. చియాన్ విక్రమ్ నటించిన 'కోబ్రా' చిత్రంలో పోలీసు అధికారి పాత్రను పోషించాడు. సినిమాలో అతని పాత్ర ఆకట్టుకునేలా ఉన్నప్పటికీ 'కోబ్రా' సినిమా ఘోర పరాజయం అయింది. దీంతో ఇర్ఫాన్ పఠాన్ కూడా సినిమాల నుంచి కనిపించకుండా పోయాడు. అతని తర్వాత క్రికెటర్ శ్రీశాంత్ కూడా గత సంవత్సరం విఘ్నేష్ శివన్ దర్శకత్వం వహించిన 'కథు వాకిల్ దౌ కాదల్'లో చిన్న పాత్రలో నటించాడు. ఈ సినిమాలో ఆయన నటించిన సన్నివేశాలను ఎక్కువగా కట్ చేయడంతో ఆయన పాత్రకు స్కోప్ లేకుండా పోయింది. అలా ఆయన కూడా మరోసారి తమిళ చిత్రసీమలో అడుగుపెట్టలేదు. (ఇదీ చదవండి: విశాల్ 'మార్క్ ఆంటోనీ' సినిమాపై బ్యాన్ విధించిన కోర్టు) సినిమా అంటే తెలుగు ప్రేక్షకలకు చాలా మక్కువ.. అందుకే భాష, ప్రాంతంతో సంబంధం లేకుండా జైలర్,జవాన్,విక్రమ్ వంటి సినిమాలకు టాలీవుడ్లో భారీగా కలెక్షన్స్ వచ్చాయి. అలా ధోనీ నిర్మించిన మొదటి సినిమా టాలీవుడ్ నుంచి అయి ఉండుంటే కచ్చితంగా విజయవంతం అయి ఉండేదని పలువురు అభిప్రాయ పడ్డారు. ధోనీ తన LGM ప్రొడక్షన్ నుంచి తర్వాత నిర్మించబోయే సినిమా తెలుగు నుంచే ఉంటుందని వార్తలు వస్తున్నాయి. -
‘ఎల్జీఎం’ మూవీ రివ్యూ
టైటిల్: ఎల్జీఎం నటీనటులు: హరీష్ కళ్యాణ్, ఇవానా, నదియా, యోగిబాబు తదితరులు నిర్మాణ సంస్థ: ధోని ఎంటర్టైన్మెంట్ ప్రై.లిమిటెడ్ నిర్మాతలు: సాక్షి ధోని, వికాస్ హస్జా దర్శకత్వం: రమేశ్ తమిళ్ విడుదల తేది(తెలుగులో): ఆగస్ట్ 4, 2023 ఎల్జీఎం కథేంటంటే.. ఓ ప్రైవేట్ కంపెనీలో పని చేసే గౌతమ్(హరీశ్ కల్యాణ్), మీరా(ఇవానా) రెండేళ్లుగా లవ్‌లో ఉంటారు. గౌతమ్ తండ్రి చిన్నప్పుడే చనిపోవడంతో తల్లి లీల(నదియ) అల్లారుముద్దుగా పెంచుతుంది. గౌతమ్‌కి తల్లి అంటే చాలా ఇష్టం. పెళ్లి తర్వాత కూడా తల్లితో కలిసే ఉండాలనుకుంటాడు. కానీ మీరా మాత్రం డిఫరెంట్. చిన్నప్పటి నుంచి హాస్టల్లోనే పెరగడంతో ఇతరులతో కలిసి ఉండడానికి అస్సలు ఇష్టపడదు. ఇదే విషయాన్ని పెళ్లి చూపులకని ఇంటికి వచ్చి గౌతమ్‌తో చెప్పేస్తుంది. దీంతో గౌతమ్ తల్లి కోసం ప్రేమను వదులుకుంటాడు. కొన్నాళ్ల తర్వాత మీరా రాజీకొచ్చి.. అత్తను అర్థం చేసుకునేందుకు పెళ్లికి ముందు ఓ వారం ట్రిప్‌కి వెళ్దాం అని గౌతమ్‌ని ఒప్పిస్తుంది. అయితే ఈ విషయం గౌతమ్ తన తల్లికి చెప్పకుండా ఆఫీస్ ట్రిప్ అని తీసుకెళ్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది? ఒకవైపు తల్లి, మరోవైపు ప్రేయసి.. ఇద్దరి ఈగోల కారణంగా గౌతమ్ పడ్డ కష్టాలేంటి? మీరా తన కాబోయే అత్తతో పాటు గోవాకు ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? గోవా నుంచి తిరిగి వచ్చే క్రమంలో ఏం జరిగింది? చివరకు గౌతమ్, మీరాల పెళ్లికి లీల ఒప్పుకుందా లేదా? అనేదే మిగతా కథ. ఎలా ఉందంటే.. పెళ్లిపై నేటి యువతకు ఎన్నో భయాలు ఉన్నాయి. ముఖ్యంగా అత్తా కోడళ్ల మధ్య ఉండే రిలేషన్ గురించి ఎంత చెప్పినా తక్కువే. అలా పెళ్లి తర్వాత అత్తతో కలిసి ఉండగలనా లేనా అని తెలుసుకోవడానికి సిద్ధమైన నేటి తరం అమ్మాయి కథే ఈ ఎల్జీఎం. ఈ కథను కాస్త తిరిగేస్తే మనకు బొమ్మరిల్లు హాసినిని గుర్తు చేస్తుంది . అందులో కోడలు తమతో ఎలా ఉంటుందో అని అత్తింటి వారు పరీక్ష పెడితే.. ఇక్కడ అత్త తనతో ఎలా ఉంటుందో అని టూర్ పేరుతో పరీక్ష పెడుతుంది కోడలు. అంతే తేడా. అత్త కోడళ్ల మధ్య గొడవలు.. వారిద్దరి మధ్య హీరో పడే కష్టాలు.. ఈ కాన్సెప్ట్‌తో సినిమాలతో పాటు పలు సీరియళ్లు కూడా తెలుగులో వచ్చాయి. అలాంటి రోటీన్ పాయింట్‌తో ఎల్జీఎం కథను రాసుకున్నాడు దర్శకుడు రమేష్ తమిళమణి. పెళ్లికి ముందే అత్తతో కలిసి కోడలు టూర్‌కి వెళ్లే కాన్సెప్ట్ వినడానికి కాస్త కొత్తగా ఉంది కానీ తెరపై మాత్రం రొటీన్‌గా సాగుతుంది. కథనం నెమ్మదిగా సాగడం మరింత ఇబ్బందికరం. కామెడీకి ఎమోషనల్ జోడించి మంచి సందేశం ఇచ్చే ప్రయత్నం చేశారు. ఫస్టాఫ్‌లో యోగిబాబుతో ఓ ముసలాయన చేసే కామెడీ నవ్వులు పూయిస్తుంది. ఇంటర్వెల్ ట్విస్ట్ సెకండాఫ్‌పై ఇంట్రెస్ట్‌ని క్రియేట్ చేస్తుంది. అయితే ద్వితియార్థంలో కథ సాగదీతగా అనిపిస్తుంది. అత్తా కోడళ్లు కిడ్నాప్‌కు గురైన తర్వాత కథపై ఆసక్తి పెరుగుతుంది. అక్కడ కూడా యోగిబాబు కామెడీ బాగా వర్కౌట్ అయింది. క్లైమాక్స్ రొటీన్‌గా ఉంటుంది. ఎవరెలా చేశారంటే? ఈ సినిమాకు ప్రధాన బలం ఇవానా, నదియా అనే చెప్పాలి. హీరోగా హరీశ్ కల్యాణ్ చేసిన.. కథ మొత్తం ఇవానా, నదియా పాత్రల చుట్టే తిరుగుతుంది. అత్తాకోడళ్లుగా వీరిద్దరి నటన ఆకట్టుకుంటుంది. ఇద్దరు కలిసి పబ్‌లో వేసే స్టెప్పులు అలరిస్తాయి. నేటితరం అమ్మాయి మీరాగా ఇవానా, గడుసరి అత్తగా నదియా అదరగొట్టేశారు. వీరిద్దరి మధ్య నలిగే వ్యక్తి గౌతమ్. ఈ పాత్రలో హరీశ్ కల్యాణ్ చక్కగా నటించాడు. బస్సు డ్రైవర్‌గా యోగిబాబు చేసే కామెడీ సినిమాకు ప్లస్ పాయింట్. హీరో స్నేహితుడిగా చేసిన నటుడి కామెడీ పంచులు కూడా బాగున్నాయి. ఇక సాంకేతిక విషయాలకొస్తే దర్శకుడు తమిళమణియే ఈ సినిమాకు సంగీతం అందించాడు. పాటలు కథలో బాగంగా వస్తాయి కానీ ఒక్కటి కూడా గుర్తిండిపోయేలా ఉండదు. నేపథ్య సంగీతం ఓకే. సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. -
తెలుగులో ధోని ‘ఎల్‌జీఎమ్’ వచ్చేస్తుంది
భారత క్రికెటర్ ఎంఎస్ ధోని ‘ఎల్‌జీఎమ్’తో నిర్మాణంలోకి అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. హరీష్ కల్యాణ్, ఇవానా, నదియా, యోగిబాబు కీలక పాత్రల్లో రమేష్ తమిళ్మణి దర్శకత్వం వహించారు. సాక్షి ధోని, వికాస్ హస్జా నిర్మించిన ఈ చిత్ర తెలుగు, తమిళంలో ఈ నెల 4న విడుదల కానుంది. తెలుగులో జేపీఆర్ ఫిల్మ్ప్, త్రిపుర ప్రొడక్షన్స్ రిలీజ్ చేస్తున్నాయి. ఈ సినిమాలో ప్రధాన పాత్రల్లో హరీష్ కళ్యాణ్, ఇవానా, నదియాలే ఈ సినిమాకు ప్రధాన బలం. పెళ్లికి ముందే కాబోయే అత్తగారికి కండీషన్స్ పెట్టిన గడుసరి కోడలుగా ఇవానా కనిపిస్తుంది. లవ్ టుడే చిత్రంతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో ఇవానా తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఆమె నటన ఎలా ఉండబోతుందనేది ట్రైలర్లో చిన్న టచ్‌తో చూపించించారు దర్శకుడు రమేష్ తమిళ్ మణి. ఇక కొడుకు ప్రేమ కోసం కోడలి పెట్టిన కండీషన్స్‌ను ఒప్పుకుని ఆమెతో ట్రావెల్ చేసే తల్లి పాత్రలో నదియా నటించారు. ‘‘ప్రేమించిన అబ్బాయిని పెళ్లాడాలనుకున్న అమ్మాయి కాబోయే అత్తగారి గురించి తెలుసుకునేందుకు ఆమెతో కొద్ది రోజులు జర్నీ చేయాలనుకుంటుంది. ఈ పాయింట్‌తో సినిమా ఉంటుంది’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. -
ధోనీ తొలి సినిమా టాక్ ఏంటి? హిట్టా ఫట్టా?
టీమిండియా కెప్టెన్‌గా ఎన్నో అద్భుతాలు చేసిన మహేంద్ర సింగ్ ధోనీ.. ప్రపంచ క్రికెట్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాడు. అంతర్జాతీయంగా రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత ఐపీఎల్ మాత్రమే ఆడుతున్నాడు. మరోవైపు పలు వ్యాపారాల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. అలా సినిమాల్లోకి వచ్చాడు. నిర్మాతగా తమిళంలో ఫస్ట్ మూవీ తీశాడు. మరి దీని టాక్ ఏంటి? హిట్టా ఫట్టా? 'ఎల్‌జీఎమ్' కథేంటి? గౌతమ్(హరీశ్ కల్యాణ్), మీరా(ఇవానా) రెండేళ్లుగా లవ్‌లో ఉంటారు. పెద్దల అంగీకారంతో పెళ్లికి రెడీ అవుతారు. అయితే అత్తతో కలిసి ఉండటానికి మీరా నో చెబుతుంది. దీంతో గౌతమ్.. మన వివాహం కుదరదని అంటాడు. దీంతో రాజీకొచ్చిన మీరా.. అత్త(నదియా)ని అర్థం చేసుకోవడం కోసం తన పెళ్లికి ముందు ఆమెతో కలిసి వారం రోజుల ట్రిప్ ప్లాన్ చేస్తుంది. అనుకోని పరిస్థితుల్లో ట్రిప్‌కి వెళ్లిన మీరాతో పాటు ఆమెకు కాబోయే అత్తని కొందరు కిడ్నాప్ చేస్తారు. చివరకు ఏమైంది? అనేది స్టోరీ. (ఇదీ చదవండి: ప్రియుడి కోసం పేరు మార్చుకున్న నటి.. రెండో పెళ్లి చేసుకుందా?) టాక్ ఏంటి? తమిళ ఆడియెన్స్, నెటిజన్స్ చెబుతున్న దాని ప్రకారం 'ఎల్‌జీఎమ్' చాలా బోరింగ్‌గా ఉందని అంటున్నారు. రెండున్నర గంటలపాటు నిడివితో ఉన్న ఈ సినిమాలో చాలాసేపు ప్రేమకథనే చూపడం, కూర్చుని మాట్లాడుకోవడం లాంటి సీన్స్ వల్ల విసుగొచ్చిందని కామెంట్స్ చేస్తున్నారు. తమిళ బాక్సాఫీస్ దగ్గర వర్కౌట్ కాలేదని, కలెక్షన్స్ అంతంత మాత్రంగానే వచ్చినట్లు సమాచారం. తెలుగు సంగతేంటి? తమిళంతోపాటు తెలుగులోనూ జూలై 28నే రిలీజ్ చేయాలని అనుకున్నారు. కానీ 'బ్రో' వల్ల ప్లాన్ మార్చుకున్నారు. ఓ వారం ఆలస్యంగా అంటే ఆగస్టు 4న తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లలో 'ఎల్‌జీఎమ్' రిలీజ్ కాబోతుంది. ఈ మూవీలో హరీశ్ కల్యాణ్, ఇవానా, నదియా ప్రధాన పాత్రల్లో నటించారు. తమిళమణి దర్శకుడు. మరి తమిళంలో తేడా కొట్టేసిన ఈ సినిమా తెలుగులో ఏ మేరకు టాక్ తెచ్చుకుంటుందనేది చూడాలి. (ఇదీ చదవండి: ప్రముఖ యాంకర్‌తో హైపర్ ఆది పెళ్లి ఫిక్స్!) -
గుడ్‌న్యూస్ చెప్పిన ధోని భార్య సాక్షి! సంతోషంలో ఫ్యాన్స్.. ఇక..
MS Dhoni- IPL 2024: మోకాలి గాయం వేధిస్తున్నా ఐపీఎల్-2023 సీజన్ మొత్తం ఎలాగోలా నెట్టుకొచ్చాడు చెన్నై సూపర్‌కింగ్స్ సారథి మహేంద్ర సింగ్ ధోని. గతేడాది దారుణ ప్రదర్శనతో పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంలో నిలిచిన సీఎస్కేను ఈసారి ఏకంగా చాంపియన్‌గా నిలిపాడు. తన అద్భుత కెప్టెన్సీ నైపుణ్యాలతో జట్టుకు ఐదో ట్రోఫీ అందించాడు. మోకాలికి సర్జరీ ఇక క్యాష్ రిచ్ లీగ్ తాజా ఎడిషన్ ముగిసిన తర్వాత మిస్టర్ కూల్ మెకాలికి సర్జరీ చేయించుకున్న విషయం తెలిసిందే. నీరజ్ చోప్రా, రిషభ్ పంత్ వంటి యువ ఆటగాళ్లను ట్రీట్ చేసిన ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ దిన్షా పార్దీవాలా పర్యవేక్షణలో ధోనికి కీహోల్ సర్జరీ జరిగినట్లు సమాచారం. ఇదిలా ఉంటే.. ఐపీఎల్-2023 తనకు చివరి ఐపీఎల్ కాదంటూ ట్రోఫీ ముగిసిన తర్వాత ధోని స్పష్టం చేసిన సంగతి గుర్తుండే ఉంటుంది. ఈ నేపథ్యంలో 42 ఏళ్ల తలా మళ్లీ బ్యాట్ పట్టడం ఖాయమని అభిమానులు మురిసిపోతున్నారు. ఈ క్రమంలో ధోని సతీమణి సాక్షి సింగ్ ఇచ్చిన అప్డేట్ వారిని మరింత ఖుషీ చేసింది. ఆయన బాగున్నాడు కాగా ధోని ఎంటర్టైన్మెంట్ పేరిట ప్రొడక్షన్ హౌజ్ స్థాపించిన మిస్టర్ కూల్.. తన భార్య సాక్షి నిర్మాతగా కోలీవుడ్‌లో LGM అనే సినిమాను నిర్మించాడు. శుక్రవారం ఈ మూవీ విడుదల సందర్భంగా సాక్షి సందడి చేసింది. ఈ సందర్భంగా ధోని గురించి అభిమానులు ప్రశ్నించగా.. ‘‘ఆయన చాలా చాలా బాగున్నాడు.. కోలుకుంటున్నాడు.. రిహాబ్‌లో ఉన్నాడు’’ అని సమాధానమిచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియోను తలా ఫ్యాన్స్ నెట్టింట వైరల్ చేస్తున్నారు. ‘‘మహీ భాయ్.. ఐపీఎల్-2024లో ఆడటం ఖాయం’’ అంటూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. చదవండి: టీమిండియా క్రికెటర్లలో ప్రభుత్వ ఉద్యోగులు వీరే! లిస్టులో ఊహించని పేర్లు.. View this post on Instagram A post shared by MS DHONI FAN PAGE ™ (@msd7.imran) -
ప్రేమించేటపుడు వెంటపడతారు.. పెళ్లైన తర్వాత అంతే ఇక.. ఆ రొమాన్స్: సాక్షి ధోని
MS Dhoni- Sakshi Dhoni: ‘‘ఈ విషయంలో నేను నిజాయితీగా సమాధానం చెప్తాను. నిజానికి మగవాళ్లు తొలుత తాము ప్రేమించిన అమ్మాయిల వెంట పడతారు.. పెళ్లైన తర్వాత మాత్రం.. ‘ఓకే! ఇప్పుడు ఈమె నాదైపోయింది. ఇంకెక్కడికి పోతుందిలే! అన్న ధోరణిలో ఉంటారు. అలా కంఫర్ట్ జోన్లోకి వెళ్లిపోతారు. ఇక మా విషయానికొస్తే.. రోజంతా గొడవ పడుతూనే ఉంటాం(సరదాగా).. ఎప్పుడో ఓసారి మాత్రమే రొమాన్స్ ఉంటుంది. అయితే, రొమాన్స్ జరిగినంత మాత్రాన ఆ చిన్న చిన్న గొడవలు సమసిపోవు. మళ్లీ ఆటపట్టించుకోవడాలు.. స్నేహపూర్వక సంభాషణలు జరుగుతూనే ఉంటాయి. మా ఇద్దరి మధ్య కెమిస్ట్రీ ఇలాగే ఉంటుంది’’ అంటూ టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని సతీమణి సాక్షి ధోని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. సినీ నిర్మాతగా కొత్త ప్రయాణం తమ వైవాహిక బంధం గురించి ఎదురైన ప్రశ్నకు ఈ విధంగా బదులిచ్చింది. కాగా ధోని ఎంటర్టైన్మెంట్ పేరిట ఎంఎస్ సినీ నిర్మాణ రంగంలో అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తమ బ్యానర్‌పై సాక్షి నిర్మాతగా LGM(Lets Get Married) పేరిట తొలి సినిమాను తెరకెక్కించారు. వికాస్ హసిజా ఈ మూవీకి మరో నిర్మాత. ఈ నేపథ్యంలో LGM ప్రమోషన్లలో భాగంగా సాక్షి ధోని మీడియాతో ముచ్చటించింది. 13 ఏళ్ల వైవాహిక బంధం ఈ సందర్భంగా ధోనితో ఉన్న కెమిస్ట్రీ గురించి ప్రశ్న ఎదురుకాగా.. ఆమె ఏమాత్రం తొణక్కుండా మిస్టర్ కూల్‌తో తాను ఎలా ఉంటానన్న విషయాన్ని బయటపెట్టింది. కాగా 2010, జూలై 4న సాక్షి- ధోనిల వివాహం జరిగింది. ఇటీవలే 13వ పెళ్లిరోజు జరుపుకొన్న ఈ జంటకు కూతురు జీవా సంతానం. అన్యోన్యంగా ఉంటూ 2015లో జీవాకు జన్మనిచ్చిన ధోని దంపతులు.. ఎప్పటికప్పుడు కపుల్ గోల్స్ సెట్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. ధోనికి ఏమాత్రం విరామం దొరికినా రాంచిలోని తమ ఫామ్‌హౌజ్‌లో కుటుంబంతో గడుపుతాడు. అన్యోన్య దంపతులుగా ధోని- సాక్షిలకు పేరుంది. ఇక టీమిండియాకు మూడు ఐసీసీ టైటిళ్లు.. ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్‌కు ఏకంగా ఐదు ట్రోఫీలు అందించిన ఘనత ధోనిది. ఆటగాడిగా ఉన్నత శిఖరాలను అధిరోహించిన తలా.. కోలీవుడ్‌తో సినిమా రంగంలో ఎంట్రీ ఇచ్చాడు. చెన్నైతో తనకున్న అనుబంధాన్ని ఇలా మరోసారి చాటుకున్నాడు. చదవండి: కోహ్లి గురించి ప్రశ్న.. విసుగెత్తిపోయిన రోహిత్! ఘాటు రిప్లైతో నోరు మూయించి.. ఏడాదికి 50 కోట్ల సంపాదన! మరి.. ధోని సొంత అక్క పరిస్థితి ఎలా ఉందంటే! -
ధోనీ భార్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. తమిళ సినిమా అందుకేనని!
టీమిండియా మాజీ కెప్టెన్ ధోని నిర్మాతగా మారి తొలిసారిగా తమిళంలో తీసిన చిత్రం 'ఎల్జీఎం'. ధోనీ సతీమణి సాక్షి ధోని నిర్మాతగా వ్యవహరించిన ఈ మూవీతో రమేష్ తమిళమణి దర్శకుడు, సంగీత దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. హరీష్ కళ్యాణ్, ఇవనా జంటగా నటించిన ఇందులో నటి నదియా, యోగిబాబు, ఆర్జే. విజయ్ తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. విశ్వజిత్ ఛాయాగ్రహణం అందించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని శుక్రవారం వారం తెరపైకి రానుంది. (ఇదీ చదవండి: మరోసారి వివాదంలో 'బిగ్ బాస్'.. మొదలవడానికి ముందే!) ఈ సందర్భంగా చిత్ర యూనిట్ మంగళవారం సాయంత్రం చైన్నెలోని పలోజా థియేటర్లో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ వేదికపై దర్శకుడు మాట్లాడుతూ ఒక సాధారణ కథను బ్రహ్మాండంగా తెరకెక్కించే ప్రయత్నమే ఎల్జీఎం అని తెలిపారు. ధోనీ నిర్మించిన చిత్రంలో నటించడం అదృష్టం అని నటుడు హరీష్ కళ్యాణ్ పేర్కొన్నారు. తన వివాహానంతరం విడుదల అవుతున్న చిత్రం ఇదని,ఆ విధంగా తన భార్య లక్కీ ఛామ్ అని అన్నారు. నిర్మాత సాక్షి ధోని మాట్లాడుతూ... తమకు, తమిళ ప్రేక్షకులకు మధ్య భాష సమస్యే కాదన్నారు. ధోనీని తమిళ ప్రజలు ఎప్పుడో ఆదరించారని, తమిళ చిత్రం చేయడానికి అదీ ఒక కారణం అని అన్నారు. సహజత్వంతో కూడిన ఓ సినిమా చేయాలనుకున్నామని, అదే ఎల్జీఎం అని చెప్పుకొచ్చారు. మూవీ చూసిన ధోనీ చాలా బాగుందని మెచ్చుకున్నట్లు సాక్షి పేర్కొన్నారు. తమిళంలో ఈ వారం రిలీజ్ అవుతోంది కానీ తెలుగులో వచ్చే శుక్రవారం అంటే ఆగస్టు 4న రాబోతుంది. (ఇదీ చదవండి: 'బేబీ' డైరెక్టర్‌కి విశ్వక్సేన్ కౌంటర్స్.. కానీ!?) -
LGM Promotions Photos: ఎల్జీఎం ప్రమోషన్లో ధోని భార్య సాక్షి (ఫొటోలు)
-
ధోని ఎంట్రీ ఖాయం ..ఫ్యాన్స్‌కు పండగలాంటి వార్త
ఇప్పటి వరకూ క్రికెట్లో దుమ్ము రేపిన క్రికెట్ క్రీడాకారుడు ఎంఎస్ ధోని ఇప్పుడు చిత్ర నిర్మాణంలో ప్రవేశం చేసిన విషయం తెలిసిందే. ఈయన ధోని ఎంటర్టైన్మెంట్ చిత్ర నిర్మాణ సంస్థను ప్రారంభించి 'ఎల్జీఎం' అనే చిత్రాన్ని నిర్మించిన విషయం తెలిసిందే. హరీష్ కల్యాణ్, ఇవనా జంటగా నటించిన ఇందులో నటి నదియా, యోగిబాబు తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. (ఇదీ చదవండి: ఈ సినిమా బడ్జెట్‌నే రూ. 200 కోట్లు.. నెట్‌ఫ్లిక్స్ ఎన్ని కోట్లకు కొన్నదో తెలిస్తే) రమేష్ తమిళమణి దర్శకుడిగా పరిచయం అయిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ నెల 28న విడుదల కానుంది. ఇదంతా తెలిసిన కథే. ఈ చిత్రం ద్వారా నిర్మాతగా మారిన ధోనీ అక్కడితో ఆగలేదు. ఈ చిత్రంతో ఆయన నటుడిగానే అవతారమెత్తారు. తాజా సమాచారం. నటుడు కమలహాసన్ కథానాయకుడిగా నటించిన సూపర్ హిట్ చిత్రం చివరి ఘట్టంలో రోలెక్స్ పాత్రలో నటుడు సూర్య మెరిసిన విషయం తెలిసిందే. అది 10 నిమిషాల గెస్ట్ పాత్ర అయినా సూర్య అభిమానుల్లో రోలెక్స్ పాత్ర పెద్దగా ముద్ర వేసుకుంది. సూర్య కనిపిస్తే వారు రోలెక్స్ అంటూ గోల చేస్తున్నారు. (ఇదీ చదవండి: ‘బలగం’ తర్వాత యష్‌తోనే సినిమా ఎందుకంటే:దిల్ రాజు) కాగా ఎల్జీఎం చిత్రంలో ఎంఎస్ ధోనీ ఆ తరహా పాత్రలో ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలిసింది. ఇది ఆయన అభిమానులు సంబరపడే విషయమే అవుతుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. ఈ విషయాన్ని రివీల్ చేయకుండా అభిమానులుకు థ్రిల్ ఇవ్వాలని మేకర్స్ భావించారట. క్రికట్లో తన మార్క్ ఎలా అయితే వేశాడో . ఈ సినిమాలో కేవలం 10 నిమిషాల్లో కనిపించినా తన రోల్‌ను మాత్రం ప్రేక్షకులు మరిచిపోలేరని సమాచారం. అలా సూర్యకు రోలెక్స్ ఎలాంటి గుర్తింపు వచ్చిందో.. ధోనికి కూడా ఈ సినిమా అలాంటి గుర్తింపే తెస్తుందని మేకర్స్ భావిస్తున్నారు. -
టాలీవుడ్ హీరోకు పెద్ద ఫ్యాన్.. ధోని భార్య సాక్షి కామెంట్స్ వైరల్!
టీమిండియా లెజెండ్ క్రికెటర్ ఎంఎస్ ధోని ఎంటర్ టైన్మెంట్ పతాకంపై సాక్షి ధోని నిర్మాతగా తమిళంలో ఎల్జీఎం (లెట్స్ గెట్ మ్యారీ)అనే చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా రమేష్ తమిళమణి దర్శకుడిగా పరిచయమవుతున్నారు. హరీష్ కల్యాణ్, నటి ఇవాన జంటగా నటించిన ఈ చిత్రంలో నదియా, యోగిబాబు తదితరులు ముఖ్యపాత్రల్లో నటించారు. (ఇది చదవండి: సహ నటుడిని పెళ్లి చేసుకున్న యంగ్ హీరోయిన్!) ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రం త్వరలో విడుదలకు ముస్తాబవుతోంది. ఇటీవలే ఈ చిత్ర ట్రైలర్‌ను తెలుగులో రిలీజ్ చేశారు మేకర్స్. ప్రస్తుతం మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉంది చిత్రబృందం. తాజాగా హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌కు ధోని భార్య, చిత్ర నిర్మాత సాక్షి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె పలువురు మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు. మీరు తెలుగు హీరోల సినిమాలు చూస్తారా? అని ప్రశ్నించగా.. సాక్షి బదులిచ్చింది. తాను ఆర్ఆర్ఆర్, బాహుబలి సినిమాలు చూశానని.. కానీ అల్లు అర్జున్ సినిమాలైతే అన్ని చూస్తానని అన్నారు. నేను బన్నీకి పెద్ద ఫ్యాన్ అని సాక్షి తెలిపారు. ఈ సమాధానం చెప్పాగానే ఫ్యాన్స్ పెద్దఎత్తున సందడి చేశారు. ప్రస్తుతం సాక్షి మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఈ వీడియోను బన్నీ ఫ్యాన్స్ భారీ ఎత్తున వైరల్ చేస్తున్నారు. (ఇది చదవండి: ధోనీ నిర్మాతగా ఫస్ట్ సినిమా.. తెలుగు ట్రైలర్ రిలీజ్) While Growing up I have seen all #AlluArjun movies & I’m a huge fan of him - #MSDhoni ‘s wife #Sakshi at #LGM telugu press meet North Kaa Sher @alluarjun 🦁#Pushpa2TheRule pic.twitter.com/klOj2kYvUw — Allu Arjun Taruvate Evadina (@AATEofficial) July 24, 2023 -
ధోనీ నిర్మాతగా ఫస్ట్ సినిమా.. తెలుగు ట్రైలర్ రిలీజ్
మారుతున్న ట్రెండ్‌లో ప్రేమకు అర్థం మారిపోయింది. అమ్మాయి-అబ్బాయి లివ్ ఇన్ రిలేషన్లో ఉండి, నచ్చితే పెళ్లి చేసుకుంటున్నారు. పెళ్లికి ముందు ఇదేం ప్యాషన్ అని అనుకోవచ్చు. కానీ అబ్బాయిని అమ్మాయి.. అమ్మాయిని అబ్బాయి అర్థం చేసుకోవటానికే ఇది కచ్చితమనే భావన ఉండటంతో చాలామంది అటు వైపుగానే ఆలోచనలు చేస్తున్నారు. (ఇదీ చదవండి: ఆమె వల్ల చనిపోదామనుకున్నా.. నటుడు అబ్బాస్ కామెంట్స్) అలానే పెళ్లి చేసుకుని ఓ ఇంట్లోకి కోడలిగా అడుగు పెట్టాల్సిన అమ్మాయి తన ప్రేమికుడిని విచిత్రమైన కోరిక కోరుతుంది. తనకు కాబోయే అత్తతో కలిసి కొన్ని రోజులు ట్రిప్ వెళతానని అప్పుడు ఇద్దరికీ ఒకరి గురించి ఒకరికీ తెలుస్తుందని చెబుతుంది. ఇది కాస్త వింతగానే ఉన్నా.. అతడు ఒప్పుకొంటాడు. తర్వాత ఏమైందో తెలియాలంటే 'ఎల్జీఎం' చూడాల్సిందే. టీమిండియా సక్సెస్ఫుల్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టిన తీసిన ఫస్ట్ మూవీ ఇది. తెలుగు ట్రైలర్ ని తాజాగా రిలీజ్ చేశారు. హరీష్ కళ్యాణ్, ఇవానా, నదియా, యోగిబాబు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తీస్తున్న ఈ చిత్రానికి రమేష్ తమిళమణి దర్శకత్వంతో పాటు సంగీతం అందించారు. త్వరలో ఈ సినిమాని థియేటర్లలోకి తీసుకురాబోతున్నారు. (ఇదీ చదవండి: నటి ప్రగతి కొత్త జర్నీ.. ఇది అస్సలు ఎవరూ ఊహించలేదు!) -
MS Dhoni And Sakshi Latest Photos: ఎల్జీఎం మూవీ ఆడియో, ట్రైలర్‌ను లాంచ్ చేసిన ధోనీ (ఫోటోలు)
-
ధోని తొలి సినిమా రెడీ! హీరోహీరోయిన్లు, కథ ఏంటంటే?
ప్రముఖ క్రికెట్ క్రీడాకారుడు ఎంఎస్ ధోని చైన్నెలో తన సతీమణి సాక్షి ధోనితో కలిసి సందడి చేశారు. ఈయన తాజాగా చిత్ర నిర్మాణం రంగంలోకి కూడా ప్రవేశించిన విషయం తెలిసిందే. ధోని ఎంటర్ టైన్మెంట్ పతాకంపై సాక్షి ధోని నిర్మాతగా తొలి ప్రయత్నంగా తమిళంలో ఎల్జీఎం (లెట్స్ గెట్ మ్యారీ)అనే చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హరీష్ కల్యాణ్, నటి ఇవాన జంటగా నటించిన ఇందులో నదియా, యోగిబాబు తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. (ఇదీ చదవండి: నిహారికపై చైతన్య తండ్రి సంచలన వ్యాఖ్యలు!) ఈ చిత్రం ద్వారా రమేష్ తమిళమణి సంగీతాన్ని అందిస్తూ, దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రం త్వరలో విడుదలకు ముస్తాబవుతోంది. ఈ సందర్భంగా సోమవారం సాయంత్రం చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని చైన్నెలోని ఓ స్టార్ హోటల్లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ధోని తమిళంలో చిత్రాన్ని నిర్మించడం గురించి మాట్లాడుతూ మీరు ఎన్ని పెళ్లిళ్లు చేసుకున్న ఇంట్లో బాస్ ఎవరన్నది అందరికీ తెలిసిందేనన్నారు. తన భార్య చిత్రాన్ని నిర్మిస్తానని చెప్పారన్నారు. తాను క్రికెట్ క్రీడాకారుడిగా పరిచయం అయ్యింది చైన్నెలోనేననీ, అదేవిధంగా తాను టెస్ట్ హైహెస్ట్ స్కోర్ చేసింది కూడా చైన్నెలోనేని చెప్పారు. తాము నిర్మించిన తొలి చిత్రం కూడా తమిళంలోనే గాని కాబట్టి తనకు చైన్నె చాలా ప్రత్యేకమని పేర్కొన్నారు. ఇంకా చెప్పాలంటే తాను 2008లోనే ఐపీఎల్ క్రికెట్ ఆడినప్పుడే చైన్నెతో ఎడాప్ట్ అయినట్టు చెప్పారు. అలా తనకు చైన్నెకు పరస్పర ప్రేమ కారణంగానే తొలిచిత్రాన్ని తమిళంలో నిర్మించినట్లు వివరించారు. చాలా త్వరగా షూటింగ్ పూర్తి చేసుకున్న చిత్రం ఎల్జీఎం అని చెప్పారు. చిత్ర షూటింగ్‌కు ముందు యూనిట్ సభ్యులందరూ హ్యాపీగా ఉండాలని భావించానన్నారు. (ఇదీ చదవండి: Bro Movie: ఏంటి ‘బ్రో’.. బేరం కుదర్లేదటగా!) అందుకే యూనిట్ సభ్యులకు రోజూ మంచి ఆహారం అందించాలని, అదేవిధంగా ఏ విషయంలోనైనా ఒకసారి నిర్ణయం తీసుకుంటే దానిపై పునరాలోచన ఉండరాదని నిర్వాహకులకు చెప్పానన్నారు. తల్లి, కాబోయే భార్య మధ్య ఓ యువకుడి ఎదుర్కొనే ఘటనల కథే ఈ చిత్రం అని ధోని చెప్పారు. చిత్రాన్ని నేను తన కూతురితో కలిసి చూసానని చాలా బాగా ఉందని ఆయన పేర్కొన్నారు. -
తెలుగు హీరోతో ధోనీ కొత్త సినిమా?
మొన్నటివరకు క్రికెట్లో రెచ్చిపోయిన మహేంద్ర సింగ్ ధోనీ.. ప్రస్తుతం బిజినెస్ లతో బిజీ అవుతున్నాడు. మిగతా వాటి సంగతేమో గానీ సినిమా నిర్మాణంలోకి రావడం చాలామందిని ఆశ్చర్యపరిచింది. ధోనీ ఎంటర్ టైన్మెంట్స్ స్థాపించి ఫస్ట్ ఫస్ట్ తమిళంలో 'LGM' అనే సినిమా తీశాడు. తాజాగా దాని ట్రైలర్ రిలీజైంది. ఇప్పుడు టాలీవుడ్‌లోనూ ఓ హీరోతో ధోనీ సినిమా తీసేందుకు రెడీ అయ్యాడట. ఇకపై సినిమాలే మహేంద్ర సింగ్ ధోనీ.. టీమిండియాకు దొరికిన ఆణిముత్యం. ఓ సాధారణ క్రికెటర్ గా జట్టులోకి వచ్చినప్పటికీ, అనుకోని పరిస్థితుల్లో కెప్టెన్ అయిపోయాడు. మన జట్టు మూడు ప్రపంచకప్‌లు గెలుచుకోవడంలో కీలకపాత్ర పోషించాడు. ప్రస్తుతం ఐపీఎల్ తో బిజీగా ఉన్నాడు. త్వరలో ఈ లీగ్ కి కూడా రిటైర్మెంట్ ఇచ్చేయొచ్చు. అందుకే సినిమా నిర్మాణంపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. (ఇదీ చదవండి: ప్రముఖ ఫైట్ మాస్టర్ అరెస్ట్.. అలా చేయడంతో!) తెలుగు హీరోతో తొలుత తమిళంలో సినిమా తీసినప్పటికీ, తెలుగు వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది. ఒకరిద్దరు బడా హీరోలతో పాటు యంగ్ హీరోలతో ధోనీ ప్రొడక్షన్స్ టచ్ లో ఉందని టాక్ వినిపిస్తోంది. 'LGM' రిలీజ్ తర్వాత తెలుగు చిత్రానికి సంబంధించిన ప్రకటన వచ్చే అవకాశాలు గట్టిగా కనిపిస్తున్నాయి. దీనికి సమాంతరంగా హిందీలోనూ మూవీస్ తీసేందుకు ధోనీ-సాక్షి రెడీ అవుతున్నారు. మరి ధోనీ సినిమాలో ఛాన్స్ కొట్టే లక్కీ టాలీవుడ్ హీరో తెలియాల్సి ఉంది. టాలీవుడ్ ఎందుకు? ప్రస్తుతం అంతా పాన్ ఇండియా సినిమాల ట్రెండ్ నడుస్తోంది. ఈ నేపథ్యంలోనే తెలుగు హీరోలతో మూవీస్ చేస్తే.. వాళ్ల ఇమేజ్ కి తోడు తనది కూడా తోడవుతుంది. అది సినిమాపై అంచనాలు పెరగడానికి, కలెక్షన్స్ రావడానికి వర్కౌట్ అయ్యే అవకాశముంది. అలానే తెలుగులో ఇప్పుడు చాలామందికి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా బాగానే పెరిగింది. అలానే ధోనీ అడిగితే కచ్చితంగా ఒప్పుకోవచ్చు. (ఇదీ చదవండి: పెళ్లయిన నటితో తెలుగు యాక్టర్ డేటింగ్?) -
అతడు డ్రగ్లాంటి వాడు.. నా జీవితకాలంలో.. : ధోని ఆసక్తికర వ్యాఖ్యలు
MS Dhoni On India, CSK Star: ‘‘దీపక్ చహర్ డ్రగ్ లాంటివాడు. ఒకవేళ తను మన చుట్టుపక్కలే ఉంటే.. ఎక్కడున్నాడు అని వెతుక్కోవాలి. ఒకవేళ మన పక్కనే ఉంటే.. ఇతడు ఇక్కడెందుకు ఉన్నాడని అనుకునేలా చేస్తాడు. అతడు రోజురోజుకీ పరిణతి చెందడం హర్షించదగ్గ విషయం. పూర్తిస్థాయిలో పరిణతి సాధించాలంటే చాలా సమయం పడుతుంది. అయినా పర్లేదు! కానీ నా జీవితకాలంలో మాత్రం అతడిని మెచ్యూర్ పర్సన్‌గా చూడలేను’’ అని చెన్నై సూపర్‌కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని అన్నాడు. కాగా టీమిండియా ఆల్‌రౌండర్ దీపక్ చహర్‌కు ధోనితో ఉన్న అనుబంధం గురించి తెలిసిందే. 2016లో రైజింగ్ పుణె సూపర్‌జెయింట్స్ చహర్‌ను తీసుకున్నపుడు అక్కడే మిస్టర్కూల్తో పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో 2017 తర్వాత అతడిని సీఎస్కేలోకి తీసుకువచ్చాడు తలా!! చహర్‌కు అండగా నిలిచి ఇక 2018లో చహర్‌ను ఆడించడానికి సీఎస్కే కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ నిరాకరించగా.. ధోని మాత్రం 14 మ్యాచ్‌లలో అతడిని ఆడించాడు. చహర్‌కు అండగా నిలబడి తన కెరీర్ ఊపందుకునేందుకు ఊతమిచ్చాడు. కాగా గాయం కారణంగా ఐపీఎల్-2022 మొత్తానికి దూరమైన చహర్.. తాజా ఎడిషన్‌లో 10 మ్యాచ్‌లు ఆడి 13 వికెట్లు కూల్చాడు. నిర్మాత ధోని ఇంతకీ ధోని ఏ సందర్భంలో చహర్ గురించి ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడో చెప్పనేలేదు కదూ! ధోని సినీ నిర్మాతగా కొత్త అవతారమెత్తాడన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సీఎస్కేలో పెద్దన్న పాత్ర పోషిస్తున్న తలా.. ధోని ఎంటర్టైన్మెంట్ పేరిట సౌత్ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చాడు. LGM పేరిట తన ప్రొడక్షన్లో మొదటి సినిమా నిర్మించాడు. దీనికి సంబంధించిన ట్రైలర్, ఆడియో లాంచ్ ఫంక్షన్‌ను సోమవారం చెన్నైలో నిర్వహించారు. ఈ సందర్భంగా చహర్ గురించి ప్రస్తావన రాగా.. ధోని పైవిధంగా స్పందించాడు. చదవండి: Ashes 2023: కీలకమైన టెస్టుకు మళ్లీ అదే జట్టు! మొండిగా వ్యవహరిస్తే.. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, భారత్ కాదు.. ఆ జట్టుతో చాలా డేంజర్! లేదంటే? -
రాయుడు రిటైర్ అయ్యాడు.. మీకు తప్పకుండా జట్టులో చోటిస్తాం.. కానీ: ధోని
MS Dhoni Hilarious Response Over Yogi Babu Wanting To Join CSK: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని మైదానంలో ఎంత చురుగ్గా ఉంటాడో.. ఆఫ్ ది ఫీల్డ్ అంతే సరదాగా ఉంటాడు. ఆటలో కెప్టెన్సీ నైపుణ్యాలతో ఆకట్టుకునే తలా.. ప్రస్తుతం సినీ నిర్మాతగా కొత్త అవతారమెత్తిన విషయం తెలిసిందే. చెన్నై సూపర్ కింగ్స్‌తో పెనవేసుకున్న బంధాన్ని మరింత పదిలం చేసుకుంటూ సౌత్ ఇండస్ట్రీలో ధోని ఎంటర్టైన్మెంట్ పేరిట నిర్మాణ రంగంలోకి దిగాడు. లెట్స్ గెట్ మ్యారీడ్ తమ బ్యానర్‌పై తెరకెక్కిన తొలి సినిమా LGM (Let's Get Married) ట్రైలర్, ఆడియో లాంచ్ కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. చెన్నైలో జరిగిన ఈ ఈవెంట్లో ధోని, అతడి సతీమణి సాక్షి తమ చేతుల మీదుగా ట్రైలర్‌ను ఆవిష్కరించారు. LGMలో నటించిన హరీశ్ కళ్యాణ్, నదియా, ఇవానా, కమెడియన్ యోగిబాబు, ఆర్జే విజయ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సీఎస్కేకు ఆడాలని ఉంది ఈ సందర్భంగా యోగిబాబు తనదైన శైలిలో హాస్యం పండించాడు. అంతేకాదు తనకు చెన్నై సూపర్ కింగ్స్‌లో భాగం కావాలని ఉందంటూ తన మనసులో ఉన్న కోరికను ధోని ముందు బయటపెట్టాడు. ఇందుకు ధోని కూడా అంతే సరదాగా స్పందించాడు. ‘‘రాయుడు రిటైర్ అయ్యాడు. కాబట్టి సీఎస్కేలో మీకు తప్పకుండా చోటు ఉంటుంది. మేనేజ్మెంట్తో నేను మాట్లాడతాను. కానీ మీరిప్పుడు సినిమాల్లో బిజీగా ఉన్నారు కదా!నేనైతే మీరు ఎల్లప్పుడు జట్టుతో ఉంటూ నిలకడగా ఆడాలని కోరుకుంటా. కానీ వాళ్లు మాత్రం ఫాస్ట్ బౌలింగ్‌తో మిమ్మల్ని గాయపరుస్తారు మరి జాగ్రత్త’’ అని తలా యోగిబాబుకు బదులిచ్చాడు. దీంతో అక్కడ నవ్వులు పూశాయి. రాయుడు అరుదైన ఘనత అంబటి రాయుడు ఐపీఎల్-2023 తర్వాత క్యాష్ రిచ్ లీగ్‌కు గుడ్ బై చెప్పిన విషయం తెలిసిందే. ఇక ఈ ఎడిషన్‌లో చెన్నై టైటిల్ గెలిచి ఏకంగా ఐదోసారి చాంపియన్‌గా నిలవడంతో రాయుడు అరుదైన రికార్డు తన ఖాతాలో వేసుకున్నాడు. ఐపీఎల్లో మొత్తంగా ఆరుసార్లు(ముంబై ఇండియన్స్ తరఫున 3, సీఎస్కే తరఫున 3) విజేతగా నిలిచిన జట్టులో భాగమైన ఆటగాడిగా చరిత్రకెక్కాడు. ముంబై సారథి రోహిత్ శర్మ తర్వాత ఈ ఘనత సాధించిన రెండో క్రికెటర్‌గా నిలిచాడు. చదవండి: సిక్సర్ల రింకూ.. ఎక్కడా తగ్గేదేలే! వీడియోతో సెలక్టర్లకు దిమ్మతిరిగేలా! తల్లిదండ్రుల కష్టం ఏమిటో అర్థం చేసుకోలేని స్థితిలోనూ! శెభాష్ బిడ్డా.. -
ధోనీ ఫస్ట్ సినిమా ట్రైలర్.. అలాంటి కాన్సెప్ట్‌తో!
Dhoni LGM Movie Trailer: స్టార్ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ మొన్నటివరకు గ్రౌండ్ లో సిక్సులు కొట్టాడు. ఇప్పుడు బాక్సాఫీస్ దగ్గర హిట్స్ కొట్టడానికి రెడీ అయిపోయాడు. అవును మీరు విన్నది కరెక్టే. క్రికెటర్ గా ఎంతో పేరు తెచ్చుకున్న మహీ.. తమిళంలో నిర్మాతగా తొలి సినిమా తీస్తున్నాడు. 'LGM' పేరుతో తెరకెక్కుతున్న ఈ చిత్ర ట్రైలర్‌ని తాజాగా రిలీజ్ చేశారు. ఇది కాస్త ఫన్ క్రియేట్ చేస్తూనే అలరిస్తోంది. (ఇదీ చదవండి: ఒక్క ట్రైలర్.. మూడు సినిమాలు కనిపించాయ్!) ధోనీ చాలారోజుల తర్వాత మళ్లీ చెన్నైలో కనిపించాడు. ఈసారి క్రికెటర్‌గా కాదు నిర్మాతగా దర్శనమిచ్చాడు. సోమవారం ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఇందులో భార్య సాక్షితో కలిసి ప్రత్యక్షమయ్యాడు. ధోనీ ఎంటర్ టైన్మెంట్స్ నిర్మాణ సంస్థ స్థాపించిన తర్వాత తొలి మూవీ తమిళంలోనే తీస్తున్నాడు. 'LGM' (లెట్స్ గెట్ మ్యారీడే) పేరుతో తీస్తున్న ఈ మూవీలో హరీశ్ కల్యాణ్, ఇవానా, నదియా ప్రధానపాత్రలు పోషిస్తున్నారు. పెళ్లి-ఫ్యామిలీ ఎమోషన్స్ కాన్సెప్ట్ తో ఈ చిత్రాన్ని తీశారు. LGM కథేంటి? గౌతమ్(హరీశ్ కల్యాణ్), మీరా(ఇవానా) రెండేళ్లుగా లవ్‌లో ఉంటారు. పెద్దల అంగీకారంతో పెళ్లికి రెడీ అవుతారు. అయితే అత్తతో కలిసి ఉండటానికి మీరా నో చెబుతుంది. దీంతో గౌతమ్.. మన వివాహం కుదరదని అంటాడు. దీంతో రాజీకొచ్చిన మీరా.. అత్త(నదియా)ని అర్థం చేసుకోవడం కోసం తన పెళ్లికి ముందు ఆమెతో కలిసి ట్రిప్ ప్లాన్ చేస్తుంది. అయితే ఈ క్రమంలో మీరాతో పాటు ఆమెకు కాబోయే అత్తని కొందరు కిడ్నాప్ చేస్తారు. చివరకు ఏమైంది? అనేది స్టోరీ. (ఇదీ చదవండి: గుర్తుపట్టలేనంతగా మారిన సామ్.. ఆ ఆరు నెలలు!)