MS Dhoni- Sakshi Dhoni: ‘‘ఈ విషయంలో నేను నిజాయితీగా సమాధానం చెప్తాను. నిజానికి మగవాళ్లు తొలుత తాము ప్రేమించిన అమ్మాయిల వెంట పడతారు.. పెళ్లైన తర్వాత మాత్రం.. ‘ఓకే! ఇప్పుడు ఈమె నాదైపోయింది. ఇంకెక్కడికి పోతుందిలే! అన్న ధోరణిలో ఉంటారు. అలా కంఫర్ట్ జోన్‌లోకి వెళ్లిపోతారు. ఇక మా విషయానికొస్తే.. రోజంతా గొడవ పడుతూనే ఉంటాం(సరదాగా)..
ఎప్పుడో ఓసారి మాత్రమే రొమాన్స్ ఉంటుంది. అయితే, రొమాన్స్ జరిగినంత మాత్రాన ఆ చిన్న చిన్న గొడవలు సమసిపోవు. మళ్లీ ఆటపట్టించుకోవడాలు.. స్నేహపూర్వక సంభాషణలు జరుగుతూనే ఉంటాయి. మా ఇద్దరి మధ్య కెమిస్ట్రీ ఇలాగే ఉంటుంది’’ అంటూ టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని సతీమణి సాక్షి ధోని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
సినీ నిర్మాతగా కొత్త ప్రయాణం
తమ వైవాహిక బంధం గురించి ఎదురైన ప్రశ్నకు ఈ విధంగా బదులిచ్చింది. కాగా ధోని ఎంటర్టైన్‌మెంట్ పేరిట ఎంఎస్ సినీ నిర్మాణ రంగంలో అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తమ బ్యానర్‌పై సాక్షి నిర్మాతగా LGM(Lets Get Married) పేరిట తొలి సినిమాను తెరకెక్కించారు. వికాస్ హసిజా ఈ మూవీకి మరో నిర్మాత. ఈ నేపథ్యంలో LGM ప్రమోషన్లలో భాగంగా సాక్షి ధోని మీడియాతో ముచ్చటించింది.
13 ఏళ్ల వైవాహిక బంధం
ఈ సందర్భంగా ధోనితో ఉన్న కెమిస్ట్రీ గురించి ప్రశ్న ఎదురుకాగా.. ఆమె ఏమాత్రం తొణక్కుండా మిస్టర్ కూల్‌తో తాను ఎలా ఉంటానన్న విషయాన్ని బయటపెట్టింది. కాగా 2010, జూలై 4న సాక్షి- ధోనిల వివాహం జరిగింది. ఇటీవలే 13వ పెళ్లిరోజు జరుపుకొన్న ఈ జంటకు కూతురు జీవా సంతానం.
అన్యోన్యంగా ఉంటూ
2015లో జీవాకు జన్మనిచ్చిన ధోని దంపతులు.. ఎప్పటికప్పుడు కపుల్ గోల్స్ సెట్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. ధోనికి ఏమాత్రం విరామం దొరికినా రాంచిలోని తమ ఫామ్‌హౌజ్‌లో కుటుంబంతో గడుపుతాడు. అన్యోన్య దంపతులుగా ధోని- సాక్షిలకు పేరుంది.
ఇక టీమిండియాకు మూడు ఐసీసీ టైటిళ్లు.. ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌కు ఏకంగా ఐదు ట్రోఫీలు అందించిన ఘనత ధోనిది. ఆటగాడిగా ఉన్నత శిఖరాలను అధిరోహించిన తలా.. కోలీవుడ్‌తో సినిమా రంగంలో ఎంట్రీ ఇచ్చాడు. చెన్నైతో తనకున్న అనుబంధాన్ని ఇలా మరోసారి చాటుకున్నాడు.
చదవండి: కోహ్లి గురించి ప్రశ్న.. విసుగెత్తిపోయిన రోహిత్! ఘాటు రిప్లైతో నోరు మూయించి..
ఏడాదికి 50 కోట్ల సంపాదన! మరి.. ధోని సొంత అక్క పరిస్థితి ఎలా ఉందంటే!
Comments
Please login to add a commentAdd a comment