Dhoni Entertainment
-
ప్రేమించేటపుడు వెంటపడతారు.. పెళ్లైన తర్వాత అంతే ఇక.. ఆ రొమాన్స్: సాక్షి ధోని
MS Dhoni- Sakshi Dhoni: ‘‘ఈ విషయంలో నేను నిజాయితీగా సమాధానం చెప్తాను. నిజానికి మగవాళ్లు తొలుత తాము ప్రేమించిన అమ్మాయిల వెంట పడతారు.. పెళ్లైన తర్వాత మాత్రం.. ‘ఓకే! ఇప్పుడు ఈమె నాదైపోయింది. ఇంకెక్కడికి పోతుందిలే! అన్న ధోరణిలో ఉంటారు. అలా కంఫర్ట్ జోన్లోకి వెళ్లిపోతారు. ఇక మా విషయానికొస్తే.. రోజంతా గొడవ పడుతూనే ఉంటాం(సరదాగా).. ఎప్పుడో ఓసారి మాత్రమే రొమాన్స్ ఉంటుంది. అయితే, రొమాన్స్ జరిగినంత మాత్రాన ఆ చిన్న చిన్న గొడవలు సమసిపోవు. మళ్లీ ఆటపట్టించుకోవడాలు.. స్నేహపూర్వక సంభాషణలు జరుగుతూనే ఉంటాయి. మా ఇద్దరి మధ్య కెమిస్ట్రీ ఇలాగే ఉంటుంది’’ అంటూ టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని సతీమణి సాక్షి ధోని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. సినీ నిర్మాతగా కొత్త ప్రయాణం తమ వైవాహిక బంధం గురించి ఎదురైన ప్రశ్నకు ఈ విధంగా బదులిచ్చింది. కాగా ధోని ఎంటర్టైన్మెంట్ పేరిట ఎంఎస్ సినీ నిర్మాణ రంగంలో అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తమ బ్యానర్‌పై సాక్షి నిర్మాతగా LGM(Lets Get Married) పేరిట తొలి సినిమాను తెరకెక్కించారు. వికాస్ హసిజా ఈ మూవీకి మరో నిర్మాత. ఈ నేపథ్యంలో LGM ప్రమోషన్లలో భాగంగా సాక్షి ధోని మీడియాతో ముచ్చటించింది. 13 ఏళ్ల వైవాహిక బంధం ఈ సందర్భంగా ధోనితో ఉన్న కెమిస్ట్రీ గురించి ప్రశ్న ఎదురుకాగా.. ఆమె ఏమాత్రం తొణక్కుండా మిస్టర్ కూల్‌తో తాను ఎలా ఉంటానన్న విషయాన్ని బయటపెట్టింది. కాగా 2010, జూలై 4న సాక్షి- ధోనిల వివాహం జరిగింది. ఇటీవలే 13వ పెళ్లిరోజు జరుపుకొన్న ఈ జంటకు కూతురు జీవా సంతానం. అన్యోన్యంగా ఉంటూ 2015లో జీవాకు జన్మనిచ్చిన ధోని దంపతులు.. ఎప్పటికప్పుడు కపుల్ గోల్స్ సెట్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. ధోనికి ఏమాత్రం విరామం దొరికినా రాంచిలోని తమ ఫామ్‌హౌజ్‌లో కుటుంబంతో గడుపుతాడు. అన్యోన్య దంపతులుగా ధోని- సాక్షిలకు పేరుంది. ఇక టీమిండియాకు మూడు ఐసీసీ టైటిళ్లు.. ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్‌కు ఏకంగా ఐదు ట్రోఫీలు అందించిన ఘనత ధోనిది. ఆటగాడిగా ఉన్నత శిఖరాలను అధిరోహించిన తలా.. కోలీవుడ్‌తో సినిమా రంగంలో ఎంట్రీ ఇచ్చాడు. చెన్నైతో తనకున్న అనుబంధాన్ని ఇలా మరోసారి చాటుకున్నాడు. చదవండి: కోహ్లి గురించి ప్రశ్న.. విసుగెత్తిపోయిన రోహిత్! ఘాటు రిప్లైతో నోరు మూయించి.. ఏడాదికి 50 కోట్ల సంపాదన! మరి.. ధోని సొంత అక్క పరిస్థితి ఎలా ఉందంటే! -
LGM Promotions Photos: ఎల్జీఎం ప్రమోషన్లో ధోని భార్య సాక్షి (ఫొటోలు)
-
ధోనికి పిల్లనిచ్చిన అత్తగారు! ఆ కంపెనీ సీఈఓ.. రూ. 800 కోట్ల సామ్రాజ్యం!
Meet Sheila Singh, MS Dhoni's CEO mother-in-law: మహేంద్ర సింగ్ ధోని.. ఈ పేరే ఓ ఎమోషన్. టీమిండియా దిగ్గజ కెప్టెన్‌గా నీరాజనాలు అందుకుంటున్న మిస్టర్ కూల్.. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లోనూ తనకు తానే సాటి అని నిరూపించుకుంటున్నాడు. 41 ఏళ్ల వయసులో చెన్నై సూపర్‌కింగ్స్‌ను ఐదోసారి చాంపియన్‌గా నిలిపి తనలో సత్తా ఇంకా తగ్గలేదని మరోసారి చాటిచెప్పాడు. రెండు చేతులా సంపాదిస్తున్న ధోని సారథిగా టీమిండియాకు మూడు ఐసీసీ ట్రోఫీలు అందించిన ధోని.. తనకున్న క్రేజ్‌ను క్యాష్ చేసుకోవడంలోనూ ముందే ఉంటాడు. వివిధ బ్రాండ్లకు ప్రచారకర్తగా ఉన్న ఈ జార్ఖండ్ డైనమైట్.. యాడ్స్ రూపంలో రెండు చేతులా సంపాదిస్తున్నాడు. పిల్లనిచ్చిన అత్త.. సీఈఓగా.. 800 కోట్లు! అంతేకాదు.. ఇప్పటికే పలు వ్యాపార సంస్థలలో పెట్టుబడి పెట్టిన మహేంద్రుడు.. వినోద రంగంలోనూ కాలుమోపిన విషయం తెలిసిందే. ధోని ఎంటర్టైన్మెంట్ లిమిటెడ్ పేరిట ప్రొడక్షన్ హౌజ్ ఏర్పాటు చేశాడు. మరి కంపెనీకి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎవరో తెలుసా? ధోనికి పిల్లనిచ్చిన అత్తగారు షీలా సింగ్ అట! డీఎన్ఏ నివేదిక ప్రకారం.. తన ప్రొడక్షన్ హౌజ్‌లో కుటుంబ సభ్యులకు పెద్దపీట వేయాలని భావించిన ఎంఎస్.. భార్య సాక్షి సింగ్, ఆమె తల్లి షీలా సింగ్‌కు కీలక బాధ్యతలు అప్పగించాడు. దక్షిణాదిలో తమ బ్యానర్‌పై పలు సినిమాలు నిర్మిస్తున్న ధోని ఎంటర్టైన్మెంట్ లిమిటెడ్ విలువ దాదాపు 800 కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా. ఈ కంపెనీలో సాక్షి బిగ్గెస్ట్ షేర్‌హోల్డర్‌గా ఉన్నట్లు సమాచారం. వియ్యంకులు ఒకేచోట పనిచేశారు! కాగా సాక్షి తండ్రి ఆర్కే సింగ్, ధోని తండ్రి పాన్ సింగ్‌తో కలిసి గతంలో ఒకే చోట పనిచేశారట. బినాగురి అనే టీ కంపెనీలో వారు సహోద్యోగులు అని సమాచారం. ఆ సమయంలో గృహిణిగా ఇంటి బాధ్యతలు నిర్వర్తించిన షీలా సింగ్.. అల్లుడు ధోని విజ్ఞప్తి మేరకు కూతురితో కలిసి బిజినెస్‌వుమెన్‌గా అవతారమెత్తినట్లు తెలుస్తోంది. ఇక ప్రస్తుతం ధోని నెట్‌వర్త్ దాదాపు 1030 కోట్ల మేర ఉంటుందని పలు నివేదికలు అంచనా వేశాయి. ప్రొఫెషనల్, పర్సనల్ లైఫ్‌లో సూపర్ హిట్ ఇదిలా ఉంటే.. ఐపీఎల్లో సీఎస్కే సారథిగా ఉన్న ధోని ఇప్పటి వరకు ఆ జట్టుకు ఐదుసార్లు ట్రోఫీ అందించాడు. ఇక టీమిండియా ఫినిషర్‌గా పలు చిరస్మరణీయ విజయాలు అందించిన ధోని.. తన కెరీర్లో 90 టెస్టులు, 350 వన్డేలు, 98 టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడాడు. టెస్టుల్లో 4876, వన్డేల్లో 10773, టీ20లలో 1617 పరుగులు సాధించాడు. 2020 ఆగష్టు 15న ఇంటర్నేషనల్ క్రికెట్‌కు గుడ్ బై చెప్పిన మిస్టర్ కూల్.. ఐపీఎల్లో కొనసాగుతున్నాడు. ఇదిలా ఉంటే ధోని- సాక్షి 2010, జూలై 4న వివాహ బంధంతో ఒక్కటి కాగా.. 2015 ఫిబ్రవరి 6న వీరికి కూతురు జివా జన్మించింది. చదవండి: Ind Vs WI: ఆ ముగ్గురు దూరం.. యువ సంచలనం ఎంట్రీ! 20 లక్షలు అనుకుంటే ఏకంగా కోటీశ్వరుడయ్యాడు! జూబ్లీహిల్స్‌లో బంగ్లా, కార్లు.. తగ్గేదేలే! -
LGM: ధోని తొలి సినిమాకి ఇంట్రెస్టింగ్ టైటిల్
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని సినిమా రంగంలోకి ప్రవేశించిన సంగతి తెలిసిందే. ధోని, ఆయన సతీమణి సాక్షి కలిసి ‘ధోని ఎంటర్టైన్మెంట్’అనే నిర్మాణ సంస్థను స్థాపించారు. తాజాగా తమ బ్యానర్‌పై రూపొందబోతున్న తొలి సినిమాకి సంబంధించిన ప్రకటనను విడుదల చేశారు. హరీశ్ కళ్యాణ్, ఇవానా హీరో హీరోయిన్లుగా నదియా, యోగి బాబు ప్రధాన పాత్రల్లో రూపొందుతున్న ఈ సినిమాకి ‘ఎల్జీఎం’ (లెట్స్ గెట్స్ మ్యారేడ్) - అనే టైటిల్‌ని ఖరారు చేస్తూ మోక్షన్ పోస్టర్ విడుదల చేశారు. నూతన దర్శకుడు రమేష్ తమిళమణి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ‘మంచి కథల ద్వారా దేశంలోని నలుమూలలో వున్న ప్రేక్షకులకు చేరువవ్వడమే ధోనీ ఎంటర్టైన్మెంట్ లక్ష్యం. ఆ ఆలోచనకు తగ్గట్టుగానే ఈ సినిమా రూపొందుతోంది’ అని గతంలో సాక్షి అన్నారు. We're super excited to share, Dhoni Entertainment's first production titled #LGM - #LetsGetMarried! Title look motion poster out now! @msdhoni @SaakshiSRawat @iamharishkalyan @i__ivana_ @HasijaVikas @Ramesharchi @o_viswajith @PradeepERagav pic.twitter.com/uG43T0dIfl — Dhoni Entertainment Pvt Ltd (@DhoniLtd) January 27, 2023 -
ధోని నిర్మించబోయే తొలి చిత్రంలో హీరో హీరోయిన్లు వీరే!
భారత మాజీ క్రికెటర్ మహేంద్రసింగ్ ధోని సినిమా రంగంలోకి ప్రవేశించిన సంగతి తెలిసిందే. ధోని, ఆయన సతీమణి సాక్షి కలిసి ‘ధోని ఎంటర్టైన్మెంట్’అనే నిర్మాణ సంస్థను స్థాపించారు. తమిళంలో తొలి సినిమాను నిర్మించనున్నాడు. గ్రాఫిక్ నవల ‘అధర్వ: ది ఆరిజన్’ రచయిత రమేశ్ తమిళ్ మణి ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నాడు. అయితే ఇందులో హీరో, హీరోయిన్లుగా ఎవరు నటిస్తారనేది మాత్రం చెప్పలేదు. తాజా సమాచారం ప్రకారం ధోని నిర్మించబోయే తొలి చిత్రంలో హరీష్ కళ్యాణ్, ప్రియాంక అరుల్ మోహన్ లు హీరో హీరోయిన్ లుగా నటించనున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడనుంది. ఈ చిత్రాన్ని తమిళంలోనే కాకుండా అన్ని భాషల్లోనూ విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రం కోసం పేరున్న నటీనటులను, సాంకేతిక నిపుణులను ఎంచుకున్నట్లు తెలుస్తోంది. మరి ధోని నుంచి రాబోయే తొలి చిత్రం ఏ స్థాయిలో విజయం సాధిస్తుందో చూడాలి.