Meet Sheila Singh, MS Dhoni's CEO mother-in-law: మహేంద్ర సింగ్ ధోని.. ఈ పేరే ఓ ఎమోషన్. టీమిండియా దిగ్గజ కెప్టెన్‌గా నీరాజనాలు అందుకుంటున్న మిస్టర్ కూల్.. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లోనూ తనకు తానే సాటి అని నిరూపించుకుంటున్నాడు. 41 ఏళ్ల వయసులో చెన్నై సూపర్‌కింగ్స్‌ను ఐదోసారి చాంపియన్‌గా నిలిపి తనలో సత్తా ఇంకా తగ్గలేదని మరోసారి చాటిచెప్పాడు.
రెండు చేతులా సంపాదిస్తున్న ధోని
సారథిగా టీమిండియాకు మూడు ఐసీసీ ట్రోఫీలు అందించిన ధోని.. తనకున్న క్రేజ్‌ను క్యాష్ చేసుకోవడంలోనూ ముందే ఉంటాడు. వివిధ బ్రాండ్లకు ప్రచారకర్తగా ఉన్న ఈ జార్ఖండ్ డైనమైట్.. యాడ్స్ రూపంలో రెండు చేతులా సంపాదిస్తున్నాడు.
పిల్లనిచ్చిన అత్త.. సీఈఓగా.. 800 కోట్లు!
అంతేకాదు.. ఇప్పటికే పలు వ్యాపార సంస్థలలో పెట్టుబడి పెట్టిన మహేంద్రుడు.. వినోద రంగంలోనూ కాలుమోపిన విషయం తెలిసిందే. ధోని ఎంటర్టైన్‌మెంట్ లిమిటెడ్ పేరిట ప్రొడక్షన్ హౌజ్ ఏర్పాటు చేశాడు. మరి కంపెనీకి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎవరో తెలుసా?
ధోనికి పిల్లనిచ్చిన అత్తగారు షీలా సింగ్ అట! డీఎన్‌ఏ నివేదిక ప్రకారం.. తన ప్రొడక్షన్ హౌజ్‌లో కుటుంబ సభ్యులకు పెద్దపీట వేయాలని భావించిన ఎంఎస్.. భార్య సాక్షి సింగ్, ఆమె తల్లి షీలా సింగ్‌కు కీలక బాధ్యతలు అప్పగించాడు.
దక్షిణాదిలో తమ బ్యానర్‌పై పలు సినిమాలు నిర్మిస్తున్న ధోని ఎంటర్టైన్‌మెంట్ లిమిటెడ్ విలువ దాదాపు 800 కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా. ఈ కంపెనీలో సాక్షి బిగ్గెస్ట్ షేర్‌హోల్డర్‌గా ఉన్నట్లు సమాచారం.
వియ్యంకులు ఒకేచోట పనిచేశారు!
కాగా సాక్షి తండ్రి ఆర్కే సింగ్, ధోని తండ్రి పాన్ సింగ్‌తో కలిసి గతంలో ఒకే చోట పనిచేశారట. బినాగురి అనే టీ కంపెనీలో వారు సహోద్యోగులు అని సమాచారం. ఆ సమయంలో గృహిణిగా ఇంటి బాధ్యతలు నిర్వర్తించిన షీలా సింగ్.. అల్లుడు ధోని విజ్ఞప్తి మేరకు కూతురితో కలిసి బిజినెస్‌వుమెన్‌గా అవతారమెత్తినట్లు తెలుస్తోంది. ఇక ప్రస్తుతం ధోని నెట్‌వర్త్ దాదాపు 1030 కోట్ల మేర ఉంటుందని పలు నివేదికలు అంచనా వేశాయి.
ప్రొఫెషనల్, పర్సనల్ లైఫ్‌లో సూపర్ హిట్
ఇదిలా ఉంటే.. ఐపీఎల్‌లో సీఎస్‌కే సారథిగా ఉన్న ధోని ఇప్పటి వరకు ఆ జట్టుకు ఐదుసార్లు ట్రోఫీ అందించాడు. ఇక టీమిండియా ఫినిషర్‌గా పలు చిరస్మరణీయ విజయాలు అందించిన ధోని.. తన కెరీర్‌లో 90 టెస్టులు, 350 వన్డేలు, 98 టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడాడు.
టెస్టుల్లో 4876, వన్డేల్లో 10773, టీ20లలో 1617 పరుగులు సాధించాడు. 2020 ఆగష్టు 15న ఇంటర్నేషనల్ క్రికెట్‌కు గుడ్ బై చెప్పిన మిస్టర్ కూల్.. ఐపీఎల్‌లో కొనసాగుతున్నాడు. ఇదిలా ఉంటే ధోని- సాక్షి 2010, జూలై 4న వివాహ బంధంతో ఒక్కటి కాగా.. 2015 ఫిబ్రవరి 6న వీరికి కూతురు జివా జన్మించింది.
చదవండి: Ind Vs WI: ఆ ముగ్గురు దూరం.. యువ సంచలనం ఎంట్రీ!
20 లక్షలు అనుకుంటే ఏకంగా కోటీశ్వరుడయ్యాడు! జూబ్లీహిల్స్‌లో బంగ్లా, కార్లు.. తగ్గేదేలే!
Comments
Please login to add a commentAdd a comment