sakshi singh
-
ధోనికి పిల్లనిచ్చిన అత్తగారు! ఆ కంపెనీ సీఈఓ.. రూ. 800 కోట్ల సామ్రాజ్యం!
Meet Sheila Singh, MS Dhoni's CEO mother-in-law: మహేంద్ర సింగ్ ధోని.. ఈ పేరే ఓ ఎమోషన్. టీమిండియా దిగ్గజ కెప్టెన్‌గా నీరాజనాలు అందుకుంటున్న మిస్టర్ కూల్.. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లోనూ తనకు తానే సాటి అని నిరూపించుకుంటున్నాడు. 41 ఏళ్ల వయసులో చెన్నై సూపర్‌కింగ్స్‌ను ఐదోసారి చాంపియన్‌గా నిలిపి తనలో సత్తా ఇంకా తగ్గలేదని మరోసారి చాటిచెప్పాడు. రెండు చేతులా సంపాదిస్తున్న ధోని సారథిగా టీమిండియాకు మూడు ఐసీసీ ట్రోఫీలు అందించిన ధోని.. తనకున్న క్రేజ్‌ను క్యాష్ చేసుకోవడంలోనూ ముందే ఉంటాడు. వివిధ బ్రాండ్లకు ప్రచారకర్తగా ఉన్న ఈ జార్ఖండ్ డైనమైట్.. యాడ్స్ రూపంలో రెండు చేతులా సంపాదిస్తున్నాడు. పిల్లనిచ్చిన అత్త.. సీఈఓగా.. 800 కోట్లు! అంతేకాదు.. ఇప్పటికే పలు వ్యాపార సంస్థలలో పెట్టుబడి పెట్టిన మహేంద్రుడు.. వినోద రంగంలోనూ కాలుమోపిన విషయం తెలిసిందే. ధోని ఎంటర్టైన్మెంట్ లిమిటెడ్ పేరిట ప్రొడక్షన్ హౌజ్ ఏర్పాటు చేశాడు. మరి కంపెనీకి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎవరో తెలుసా? ధోనికి పిల్లనిచ్చిన అత్తగారు షీలా సింగ్ అట! డీఎన్ఏ నివేదిక ప్రకారం.. తన ప్రొడక్షన్ హౌజ్‌లో కుటుంబ సభ్యులకు పెద్దపీట వేయాలని భావించిన ఎంఎస్.. భార్య సాక్షి సింగ్, ఆమె తల్లి షీలా సింగ్‌కు కీలక బాధ్యతలు అప్పగించాడు. దక్షిణాదిలో తమ బ్యానర్‌పై పలు సినిమాలు నిర్మిస్తున్న ధోని ఎంటర్టైన్మెంట్ లిమిటెడ్ విలువ దాదాపు 800 కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా. ఈ కంపెనీలో సాక్షి బిగ్గెస్ట్ షేర్‌హోల్డర్‌గా ఉన్నట్లు సమాచారం. వియ్యంకులు ఒకేచోట పనిచేశారు! కాగా సాక్షి తండ్రి ఆర్కే సింగ్, ధోని తండ్రి పాన్ సింగ్‌తో కలిసి గతంలో ఒకే చోట పనిచేశారట. బినాగురి అనే టీ కంపెనీలో వారు సహోద్యోగులు అని సమాచారం. ఆ సమయంలో గృహిణిగా ఇంటి బాధ్యతలు నిర్వర్తించిన షీలా సింగ్.. అల్లుడు ధోని విజ్ఞప్తి మేరకు కూతురితో కలిసి బిజినెస్‌వుమెన్‌గా అవతారమెత్తినట్లు తెలుస్తోంది. ఇక ప్రస్తుతం ధోని నెట్‌వర్త్ దాదాపు 1030 కోట్ల మేర ఉంటుందని పలు నివేదికలు అంచనా వేశాయి. ప్రొఫెషనల్, పర్సనల్ లైఫ్‌లో సూపర్ హిట్ ఇదిలా ఉంటే.. ఐపీఎల్లో సీఎస్కే సారథిగా ఉన్న ధోని ఇప్పటి వరకు ఆ జట్టుకు ఐదుసార్లు ట్రోఫీ అందించాడు. ఇక టీమిండియా ఫినిషర్‌గా పలు చిరస్మరణీయ విజయాలు అందించిన ధోని.. తన కెరీర్లో 90 టెస్టులు, 350 వన్డేలు, 98 టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడాడు. టెస్టుల్లో 4876, వన్డేల్లో 10773, టీ20లలో 1617 పరుగులు సాధించాడు. 2020 ఆగష్టు 15న ఇంటర్నేషనల్ క్రికెట్‌కు గుడ్ బై చెప్పిన మిస్టర్ కూల్.. ఐపీఎల్లో కొనసాగుతున్నాడు. ఇదిలా ఉంటే ధోని- సాక్షి 2010, జూలై 4న వివాహ బంధంతో ఒక్కటి కాగా.. 2015 ఫిబ్రవరి 6న వీరికి కూతురు జివా జన్మించింది. చదవండి: Ind Vs WI: ఆ ముగ్గురు దూరం.. యువ సంచలనం ఎంట్రీ! 20 లక్షలు అనుకుంటే ఏకంగా కోటీశ్వరుడయ్యాడు! జూబ్లీహిల్స్‌లో బంగ్లా, కార్లు.. తగ్గేదేలే! -
పెళ్లి రోజు కానుకగా భార్యకు సర్ప్రైజ్ ఇచ్చిన ధోని
రాంఛీ: భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయినప్పటికీ అతని ఫాలోయింగ్ మాత్రం తగ్గట్లేదు. ఇక, రిటైర్ దగ్గర నుంచి.. ఫామ్ హౌస్ లో భార్య సాక్షి, కూతురు జీవాలతో సరదాగా గడిపేస్తున్నాడు. మహేంద్ర సింగ్ ధోనీ, ఆయన భార్య సాక్షి సింగ్‌ల వివాహ వార్షికోత్సవం నేడు. 2010లో ప్రేమ పెళ్లి చేసుకుని ఒక్కటైన ఈ జంట దాంపత్యానికి 11 ఏళ్లు నిండాయి. వివాహ వార్షికోత్సవం సందర్భంగా తన సతీమణి సాక్షి సింగ్ కి ధోని ఓ మధురమైన బహుమతి ఇచ్చాడు. సాక్షి కోసం స్పెషల్ గా ఓ వింటేజ్ కారును కొనుగోలు చేశాడు మహీ. లేత నీలం, వైట్ కలర్ కాంబినేషన్ లో ఉన్న కారును యానివర్సరీ కానుకగా ఇచ్చాడంటూ ఇన్‌స్టా స్టోరీలో సాక్షి సింగ్ పోస్టు చేసింది. ధోనీ..సోషల్ మీడియాలో అంత యాక్టివ్ గా ఉండడు. దీంతో సాక్షినే.. ధోనీ అప్ డేట్స్ ను ఎప్పటికప్పుడూ సోషల్ మీడియా ద్వారా ధోని ఫ్యాన్స్‌కు షేర్ చేస్తుంటోంది. వీరిద్దరికీ జీవా ధోనీ అనే కూతురు కూడా ఉన్న విషయం తెలిసిందే. ఐదేళ్ల జీవాకి ఇన్‌స్టాలో సెపరేట్ అకౌంట్ ఉండడమే కాదు, దాదాపు 2 మిలియన్ల ఫాలోవర్లు కూడా ఉన్నారు. -
వినోద రంగంలోకి ధోని అడుగు
ముంబై : అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఇప్పుడు పూర్తి స్థాయిలో వినోద రంగంపై దృష్టి పెట్టాడు. అతని సంస్థ ధోని ఎంటర్టైన్మెంట్ ద్వారా త్వరలో ఒక సైన్స్ ఫిక్షన్ వెబ్ సిరీస్‌ను రూపొందించనున్నట్లు కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్, ధోని భార్య సాక్షి సింగ్ వెల్లడించింది. ఇందు కోసం ఒక పురాణ గాథను కథగా ఎంచుకున్నట్లు ఆమె చెప్పింది. ‘రాబోయే సిరీస్ ఒక అద్భుత అనుభవాన్ని అందిస్తుంది. ఇంకా ప్రచురితం కాని ఒక పౌరాణిక సైన్స్ ఫిక్షన్ పుస్తకం హక్కులను మేం రచయిత నుంచి తీసుకున్నాం. ఒక అఘోరి ప్రయాణాన్ని అత్యుత్తమ సాంకేతిక ప్రమాణాలతో చూపిస్తాం. అఘోరి చెప్పే విషయాల్లో భూత, వర్తమాన, భవిష్యత్ గురించిన అంశాలు ఉంటాయి. విశ్వానికి సంబంధించిన పలు ఆసక్తికర అంశాలను ఇందులో చూపిస్తాం. ఒక సినిమా తీయడంకంటే వెబ్ సిరీస్ మా ఆలోచనలకు దగ్గరగా ఉంటుందని ఇందులోకి అడుగు పెడుతున్నాం’ అని సాక్షి వివరించింది. ఐపీఎల్లో రెండేళ్లు నిషేధానికి గురైన తర్వాత పునరాగమనం చేసిన 2018లో టైటిల్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స ప్రయాణాన్ని చూపిస్తూ ‘రోర్ ఆఫ్ లయన్’ పేరుతో గత ఏడాదే ధోని బ్యానర్ నుంచి డాక్యుమెంటరీ వచ్చింది. అయితే పూర్తి స్థాయిలో వినోద రంగంలో అడుగు పెట్టడం మాత్రం దీంతోనే మొదలు కానుంది. కొత్త సిరీస్‌కు సంబంధించి త్వరలోనే నటీనటులు, సాంకేతిక నిపుణులను ఎంచుకుంటారు. -
ధోని రిటైర్మెంట్పై భార్య సాక్షి భావోద్వేగ పోస్ట్
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయ్యారు. తన అభిమానుల కోసం పంచుకున్న సందేశంలో మీ నుంచి ఎల్లప్పుడూ లభించే ప్రేమ, మద్దతుకు ధన్యవాదాలు అని సోషల్ మీడియాలో ధోనీ రాశారు. శనివారం(15-08-2020) సాయంత్రం 07.29 తర్వాత తాను పదవీ విరమణ చేసినట్లు గుర్తించండి అని పేర్కొన్నాడు. ధోని రిటైర్మెంట్ తర్వాత పలువురు స్పందించారు. కొందరు ఆయనతో కలిసి నడిచిన కాలాన్ని గుర్తుచేసుకోగా... మరికొందరు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ క్రమంలోనే ధోనీ ఘనతల్ని గుర్తు చేసుకుంటూ ఫొటోలు, వీడియోల్ని ట్విటర్లో షేర్ చేస్తున్నారు. అభిమానులే కాదు.. ధోనీ సహచర క్రికెటర్లు కూడా అతనితో తమకి ఉన్న జ్ఞాపకాలను నెమరువేసుకుంటున్నారు. (చదవండి : రిటైర్మెంట్ ప్రకటించిన మిస్టర్ కూల్..) ఇక ధోని రిటైర్మెంట్పై ఆయన సతీమణి సాక్షిసింగ్ కూడా స్పందించారు. దేశం గర్వపడేలా ఎన్నో విజయాలను ధోని అందిచాడని, ప్రజలు వాటిని మర్చిపోతారు కాని ఆ క్షణంలో వారికి ఆయన అందించిన అనుభూతిని మర్చిపోలేనిదని ఇన్‌స్ట్రాగ్రామ్‌లో చెప్పుకొచ్చారు. ‘మీరు సాధించిన విజయాలను చూసి గర్వపడాలి. రిటైర్మెంట్ ప్రకటించినందుకు అభినందనలు. మీరు సాధించిన విజయాలను చూసి నేను గర్విస్తున్నాను. మీకిష్టమైన ఆటకు గుడ్‌బై చెప్పే క్రమంలో మీరు పడిన మనోవేదన నాకు తెలుసు. కన్నీళ్లను దిగమింగుకొని రిటైర్మెంట్ ప్రకటించారని అనుకుంటున్నాను. మీరు ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను. మీరు చెప్పిన మాటలు, చేసిన పనిని ప్రజలు మర్చిపోతారేమో కానీ, వాళ్లకు అందించిన అనుభూతిని ఎప్పుడూ మర్చిపోలేరు’అని సాక్షిసింగ్ ధోని పేర్కొన్నారు. (చదవండి : మహేంద్రుడి మాయాజాలం) దాదాపు 16 ఏళ్ళ పాటు టీం ఇండియాకు మహీ సేవలు అందించాడు. మూడు ఫార్మాట్లలో కూడా టీం ఇండియాకు ధోనీ అన్ని విధాలుగా తన బాధ్యతలు నిర్వహించి మంచి విజయాలు అందించాడు. 2007లో టి20 ప్రపంచ కప్, ఆ తర్వాత భారత అభిమానులంతా కలలు గన్న వన్డే వరల్డ్ కప్ (2011)తో పాటు 2013లో చాంపియన్ ట్రోఫీని కూడా సాధించి ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచాడు. మూడు ఐసీసీ టోర్నీలను గెలిచిన ఏకైక కెప్టెన్‌గా నిలిచిపోయాడు. ప్రస్తుతం ధోనీ ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. యూఏఈ వేదికగా సెప్టెంబర్ 19 నుంచి నవంబర్ 10వరకు ఐపీఎల్ 2020 జరుగనున్న సంగతి తెలిసిందే. View this post on Instagram You should be proud of what you have achieved. Congratulations on giving your best to the game. I am proud of your accomplishments and the person you are! I am sure you must have held those tears to say goodbye to your passion. Wishing you health, happiness and wonderful things ahead! #thankyoumsd #proud “People will forget what you said, people will forget what you did, but people will never forget how you made them feel.” — Maya Angelou A post shared by Sakshi Singh Dhoni (@sakshisingh_r) on Aug 15, 2020 at 10:51am PDT -
ధోనీ సతీమణి పోస్ట్‌పై నెటిజన్ల మండిపాటు
ధోని సతీమణి సాక్షిసింగ్ ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన ఓ పోస్ట్‌పై నెటిజన్లు మండిపడుతున్నారు. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు సభ్యుడు మోను కుమార్‌తో కలిసి దిగిన ఓ ఫోటోను సాక్షి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. 'బంజరు భూమి.. పచ్చదనం కోసం ఎదురుచూస్తోంది.. గడ్డి ఈ సైడ్ పచ్చగా లేదనుకుంటా.. 'అంటూ మోను కుమార్ తలపై సాక్షి ముద్దు పెట్టింది. మోను కుమార్ బట్టతలపై సెటైర్ వేస్తూ బీపాజిటివ్ హ్యాష్ ట్యాగ్‌తో సరదాగా సాక్షి చేసిన పోస్ట్‌పై ఆమె ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ కొందరు హర్ట్ అయ్యారు. మీరు ఇలా పోస్ట్ పెట్టడం మమ్మల్ని బాధించింది, మిమ్మల్ని అన్‌ఫాలో అవుతున్నామంటూ మెసేజ్‌లు పెట్టారు. సాక్షిని అనుసరిస్తూ మరికొందరు.. ఫ్లాట్ పిచ్ బాగుంది బ్యాటింగ్‌కు పనికొస్తుంది అంటూ బట్టతలపై సెటైర్లు వేస్తున్నారు. ఇంతకు ముందు సాక్షిసింగ్‌ను ప్రపంచంలోనే ఉత్తమ వదిన అంటూ మోను కుమార్ ఇన్‌స్టాగ్రామ్‌లో పొగడ్తలతో ముంచెత్తిన విషయం తెలిసిందే. View this post on Instagram Banjar zameen ... hariyaaalii ka intezaar.... Grass is not green on this side yet ! @monu_singh31 #bepositivealways A post shared by Sakshi Singh Dhoni (@sakshisingh_r) on Apr 23, 2019 at 1:44pm PDT -
సాక్షి నీ ఐడియా సూపరో.. సూపర్
-
సాక్షీ.. నీ ఐడియా సూపరో.. సూపర్
సాక్షి, హైదరాబాద్: టీమిండియా సీనియర్ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోని సతీమణి సాక్షిసింగ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన రెండు వీడియోలు ఇప్పుడు నెట్టింట్లో హల్ చల్ చేస్తున్నాయి. శ్రీలంకతో వన్డే సిరీస్‌కు చాలా సమయం ఉండటంతో ధోని కుటుంబ సభ్యులతో తెగ ఎంజాయ్ చేస్తున్నాడు. అయితే ఇటీవల ఓ ఫ్లైట్‌లో కూతురు జీవాతో ఈ జంట ప్రయాణించింది. ఫ్లైట్‌లోని ప్రయాణీకులకు ధోని కనబడితే ఇబ్బంది కలుగుతుందని భావించిన సాక్షి.. కనబడకుండా ఉండేందుకు వినూత్నంగా ఆలోచించి నెటిజన్ల ప్రశంసలు అందుకుంటోంది. ఇంతకేం చేసిందంటే మహీకి చుట్టూ టవల్ చుట్టేసింది. దీంతో ఎవరూ ధోని గుర్తించలేకపోయారు. ప్రయాణీకులు వెళ్లిన అనంతరం అబ్రక దబ్రా సాక్షి మాయా అంటూ ధోనిని చూపించింది. ఇలా రెండు వీడియోలను తన ఇన్‌స్టాగ్రమ్‌లో పోస్ట్ చేసింది. ఈ వీడియోలపై అభిమానులు వాటే ఐడియా.. అని కొందరూ..మీ వ్యక్తిత్వాన్ని దాచలేరని మరి కొందరు ట్రోల్ చేస్తున్నారు. ఇక టీ20ల నుంచి తప్పుకోవాలని ధోనిపై వస్తున్న విమర్శల గురించి తెలిసిందే. -
ధోనీ భార్య.. కేంద్ర మంత్రి.. ఓ ఆధార్ వివాదం!
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ తన ఆధార్ సమాచారాన్ని అప్డేట్ చేసుకున్నాడు. ఇందుకోసం ఆయన సీఎస్సీ (కామన్ సర్వీసెస్ సెంటర్) వాళ్ల సేవలు వినియోగించుకున్నాడు. ఆ విభాగం వాళ్లు దాన్ని ఫొటో తీసుకుని ప్రచారం చేసుకున్నారు. అంతవరకు అంతా బాగానే ఉంది. కానీ, ధోనీ ఫొటోతో పాటు.. ఆయన దరఖాస్తు ఫొటో్ కూడా వాళ్లు ట్వీట్ చేయడంతో ధోనీ భార్య సాక్షి సింగ్‌కు ఎక్కడలేని కోపం వచ్చింది. తమ వ్యక్తిగత సమాచారం మొత్తాన్ని బహిరంగపరిచే హక్కు ఎవరిచ్చారంటూ కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్‌ను ట్యాగ్ చేసి మరీ ట్వీట్ చేశారు. దానికి ప్రసాద్ కూడా వెంటనే స్పందించారు. మంత్రిగారు కూడా ధోనీ తన ఆధార్ వివరాలను అప్డేట్ చేసుకుంటున్న ఫొటోను ట్వీట్ చేశారు. దాంతో సాక్షిసింగ్ రావత్ ఆయన్ను ట్యాగ్ చేసి ట్వీట్ చేశారు. దానికి మంత్రి వెంటనే స్పందించారు. తాను పెట్టిన ఫొటోలో వ్యక్తిగత సమాచారం ఏముందని ప్రశ్నించారు. అప్పుడు.. సీఎస్సీ ఈగవర్నెన్స్ వాళ్లు చేసిన ట్వీట్లో ధోనీ దరఖాస్తు ఉన్న విషయాన్ని స్క్రీన్ షాట్ తీసి మరీ సాక్షి సింగ్ ట్వీట్ చేశారు. ఈ సందర్భంలో రవిశంకర్ ప్రసాద్, సాక్షి సింగ్‌ల మధ్య వరుసపెట్టి ట్వీట్ల జోరు కొనసాగింది. వెంటనే ఆ విషయాన్ని గమనించిన మంత్రి.. ఆ శాఖ చేసిన తప్పును గ్రహించి, తగిన చర్యలు తీసుకుంటామని సాక్షి సింగ్‌కు హామీ ఇచ్చారు. విషయాన్ని తన దృష్టికి తెచ్చినందుకు థాంక్స్ చెప్పారు. వ్యక్తిగత సమాచారాన్ని బయట పెట్టడం నేరమని, బాధ్యులపై కఠిన చర్యలు తప్పవని అన్నారు. దాంతో ఆమె కూడా శాంతించి, తగిన సమాధానం ఇచ్చినందుకు మంత్రిగారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ విషయం తెలియగానే సీఎస్సీ ట్విట్టర్ హ్యాండిల్ నుంచి ధోనీ అప్లికేషన్ కనిపించే ఫొటోను డిలీట్ చేసేశారు. VLE of @CSCegov_ delivers #Aadhaar service to @msdhoni. Legendary cricketer's #Digital hook (shot). pic.twitter.com/Xe62Ta63An — Ravi Shankar Prasad (@rsprasad) 28 March 2017 @rsprasad @CSCegov_ is there any privacy left ??? Information of adhaar card including application is made public property!#disappointed — Sakshi Singh -
ధోని నిర్ణయంపై భార్య సాక్షి స్పందన
జార్ఖండ్:భారత క్రికెట్ జట్టు కెప్టెన్సీ బాధ్యతల నుంచి ఆకస్మికంగా వైదొలిగిన మహేంద్ర సింగ్ ధోని గురించి ఇప్పటికే పలువురు స్పందించగా, తాజాగా అతని భార్య సాక్షి సింగ్ కూడా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. గత పదేళ్ల నుంచి తిరుగులేని భారత క్రికెట్ సారిథిగా ఉన్న ధోని.. ఇక అధిరోహించే శిఖరాలు ఏమీ లేవంటూ ప్రత్యేకమైన మెస్సేజ్‌ను ట్వీట్ చేసింది. ' నా భర్త ఎంఎస్ ధోని క్రికెట్ కెరీర్ ను చూసి గర్విస్తున్నా. ఇక ధోని ఎక్కే పర్వతాలు ఏమీ లేవు. అందుచేత అతన్నే ఆపే ప్రయత్నం కూడా చేయలేదు. ధోని నిర్ణయాలు తీసుకునే ముందు చాలా ఆలోచించే తీసుకుంటాడు. నా భర్త ఏ నిర్ణయం తీసుకున్నా కరెక్టుగానే ఉంటుంది' అని భార్య సాక్షి పేర్కొంది. భారత క్రికెట్ జట్టు వన్డే, టి20 జట్ల నాయకత్వ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు బుధవారం మహేంద్ర సింగ్ ధోని ప్రకటించాడు. జట్టు కెప్టెన్‌గా ఇకపై కొనసాగబోనని అతను బీసీసీఐకి సమాచారం అందించాడు. అయితే ఈనెల 15 నుంచి ఇంగ్లండ్‌తో జరిగే సిరీస్‌కు ఆటగాడిగా మాత్రం అందుబాటులో ఉంటానని అతను వెల్లడించాడు. -
నా భర్తను కలుసుకోబోతున్నా: ధోనీ భార్య
రాంచీ: వన్డే వరల్డ్ కప్ లో టీమిండియా ప్రదర్శన దేశం గర్వించేలా ఉందని భారత జట్టు కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ భార్య సాక్షిసింగ్ ధోనీ పేర్కొంది. ' గొప్ప పోరాటం చేశారు. కొన్ని గెలిచారు, కొన్ని ఓడారు. మీ త్యాగం అమూల్యం. తర్వలోనే నా భర్తను కలుసుకోబోతున్నా' అని ఆమె ట్వీట్ చేశారు. బిజీ షెడ్యూల్ కారణంగా భారత ఆటగాళ్లు గత మూడు నెలలుగా ఆస్ట్రేలియాలోనే ఉన్న విషయం తెలిసిందే. ప్రపంచకప్ నేపథ్యంలో ధోని తన పాపను చూడడానికి కూడా రాలేదు. రెండో సెమీస్ లో ఆసీస్ చేతిలో పరాజయం పాలైన భారత ఆటగాళ్లు స్వదేశానికి తిరుగు ప్రయాణమయ్యారు. Fought Hard!Proud of the team!You win some and you lose some.All the sacrifices made are totally worth it!Finally will get to c my husband -
ధోనీపై సినిమా ఖాయం!
క్రీడాకారుల జీవితం ఆధారంగా సినిమాలు తీయడమనేది బాలీవుడ్లో లేటెస్ట్ ట్రెండ్. గత ఏడాది మిల్కా సింగ్ జీవితంతో వచ్చిన ‘భాగ్ మిల్కా భాగ్’, ఈ ఏడాది మేరీ కోమ్ జీవితంతో వచ్చిన ‘మేరీ కోమ్’ చిత్రాలు ఘనవిజయం సాధించాయి. తాజాగా, టీమిండియా కెప్టెన్ మహేందర్ సింగ్ ధోని జీవితం ఆధారంగా ‘ఎం.ఎస్. ధోని’ పేరుతో ఓ చిత్రం రూపొందనుంది. నీరజ్ పాండే దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రం పోస్టర్ని ధోని భార్య సాక్షీ సింగ్ తన ట్విట్టర్ ద్వారా బయటపెట్టారు. అయితే, కొన్ని రోజుల క్రితం ధోనీ జీవితంతో సినిమా రూపొందనుందనే వార్త రాగానే, ‘బీసీసీఐ’ (బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా) అభ్యంతరం వ్యక్తం చేసిందనే వార్త వచ్చింది. అంతర్జాతీయ క్రికెట్లో దోనీ ఇంకా ఆడుతున్నందున ఇప్పుడు సినిమా తీయడం సరికాదని, ఆయన రిటైర్ అయిన తర్వాత మాత్రమే ఈ సినిమా తీయాలని బీసీసీఐ చెప్పినట్లు ఓ వార్త హల్చల్ చేసింది. దాంతో ధోనీపై చిత్రం ఉండదని ఎవరికి వారు అనుకుంటున్న తరుణంలో, హఠాత్తుగా సాక్షీ సింగ్ ఈ చిత్రం పోస్టర్‌ను బయటపెట్టడంతోపాటు, ‘గత కొన్ని రోజులుగా వస్తున్న వార్తలన్నీ నిజం కాదు. మీ కోసమే ఈ పోస్టర్’ అని ట్విట్టర్లో పేర్కొన్నారు. ఇదిలా ఉంటే తన జీవితం ఆధారంగా సినిమా తీస్తున్నందుకుగాను హక్కుల నిమిత్తం ధోని 40 కోట్ల రూపాయలు డిమాండ్ చేశారట. దాదాపు 100 కోట్ల రూపాయల నిర్మాణ వ్యయంతో రూపొందనున్న ఈ చిత్రంలో ధోనీగా సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ నటించనున్నారు.