Dhoni Entertainment's first film titled 'Let's Get Married' - Sakshi
Sakshi News home page

LGM: ధోని తొలి సినిమాకి ఇంట్రెస్టింగ్‌ టైటిల్‌

Published Fri, Jan 27 2023 1:44 PM | Last Updated on Fri, Jan 27 2023 2:59 PM

Dhoni Entertainment Announced First Film Title As LGM - Sakshi

టీమిండియా మాజీ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోని సినిమా రంగంలోకి ప్రవేశించిన సంగతి తెలిసిందే. ధోని, ఆయన సతీమణి సాక్షి కలిసి ‘ధోని ఎంటర్‌టైన్‌మెంట్‌’అనే నిర్మాణ సంస్థను స్థాపించారు. తాజాగా తమ బ్యానర్‌పై  రూపొందబోతున్న తొలి సినిమాకి సంబంధించిన ప్రకటనను విడుదల చేశారు.

హరీశ్ కళ్యాణ్, ఇవానా హీరో హీరోయిన్లుగా నదియా, యోగి బాబు ప్రధాన పాత్రల్లో రూపొందుతున్న ఈ సినిమాకి ‘ఎల్‌జీఎం’ (లెట్స్‌ గెట్స్‌ మ్యారేడ్‌) - అనే టైటిల్‌ని ఖరారు చేస్తూ మోక్షన్ పోస్టర్ విడుదల చేశారు. నూతన దర్శకుడు రమేష్ తమిళమణి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ‘మంచి కథల ద్వారా దేశంలోని నలుమూలలో వున్న ప్రేక్షకులకు చేరువవ్వడమే ధోనీ ఎంటర్‌టైన్‌మెంట్‌ లక్ష్యం. ఆ ఆలోచనకు తగ్గట్టుగానే ఈ సినిమా రూపొందుతోంది’ అని గతంలో సాక్షి అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement