Yogi Babu
-
OTT: ‘చట్నీ సాంబార్’ వెబ్ సిరీస్ రివ్యూ
టైటిల్: ‘చట్నీ సాంబార్’ వెబ్ సిరీస్నటీనటులు: యోగిబాబు, వాణి భోజన్, చంద్రన్, నితిన్ సత్య, దీపా శంకర్, తదితరులుదర్శకత్వం: రాధామోహన్ఓటీటీ: హాట్ స్టార్వేడుకేదైనా, వేదికేదైనా, సందర్భం ఎక్కడైనా, సమయం ఎప్పుడైనా మనిషికి ఎప్పటికీ తృప్తినిచ్చేది రుచికరమైన వంటలు. లేచీ లేవగానే కాఫీ టీ ల దగ్గర నుండి రాత్రి పడుకోబోయేముందు డెజర్ట్ వరకు మనం తినే ప్రతి పదార్ధానికి అంత ప్రాముఖ్యత సంతరించుకుంది మరి. తినే పదార్థాల మార్కెట్ అన్ని రంగాలలో విరివిగా వుంది. ఆ కోవలేనే హాట్ స్టార్ వేదికగా ఇటీవల ఓ సిరీస్ విడుదలైంది. దాని పేరే చట్నీ సాంబార్. మనం రోజూ విరివిగా వాడే పదాలు ఇవి. చట్నీ సాంబార్ రుచిలో ఎంత బాగుంటాయో ఈ సిరీస్ కూడా అదే విధంగా ఉంటుంది.ప్రముఖ దర్శకులు రాధామోహన్ దర్శకత్వం వహించిన ఈ సిరీస్ లో వర్ధమాన తమిళ హాస్య నటుడు యోగి బాబు ప్రధాన పాత్రలో నటించాడు. ఇక కధాంశానికొస్తే రత్నసామి అనే వ్యక్తి ఊటీలో అముదా కేఫ్‌ను నడుపుతుంటాడు , ఈ కేఫ్ లో సాంబార్ చాలా ఫేమస్. ఒకరోజు రత్నసామి తీవ్రఅనారోగ్యానికి గురవుతాడు. మరణశయ్యపై, అతను తన తల్లిని వివాహం చేసుకునే ముందు అముద అనే మహిళతో నివసించాడని మరియు ఆమె ద్వారా తనకు ఒక కొడుకు ఉన్నాడని తన కొడుకు కార్తీక్‌కు వెల్లడిస్తాడు. కార్తీక్ నుండి తన సవతి సోదరుడిని కలుస్తానని వాగ్దానం పొందిన తరువాత, రత్నసామి మరణిస్తాడు. కార్తీక్ సవతి సోదరుడు సచిన్. చెన్నై నగరంలో సచిన్ ఓ దోసెలబండి నడుపుతుంటాడు. అతని దగ్గర చట్నీ ఫేమస్. కార్తీక్ సచిన్ ను కనుగొని, అతనిని ఊటీకి రత్నసామి అంత్యక్రియలు జరపడానకి తీసుకువస్తాడు. ఇంట్లో ఉన్న ఎవరికీ సచిన్ నచ్చడు. మరి ఇంట్లో వారినందరినీ మెప్పించి సచిన్ వచ్చిన పని నెరవేర్చాడా? ఈ దశలో కార్తీక్ మరియు సచిన్ ఎటువంటి సవాళ్ళను ఎదుర్కున్నారన్న విషయం ఇడ్లీ లేదా దోశలు తింటూ ఈ చట్నీ సాంబార్ ను హాట్ స్టార్ లో చూశేయండి. మంచి కామెడీ ఎంటర్ టైనర్ ఈ చట్నీ సాంబార్.-ఇంటూరు హరికృష్ణ -
ఓటీటీలో ఫుల్ కామెడీ సినిమా.. తెలుగులో స్ట్రీమింగ్
కోలీవుడ్ ప్రముఖ కమెడియన్ యోగిబాబు ప్రధానపాత్రలో నటించిన చిత్రం 'బూమర్ అంకుల్'. కోలీవుడ్‌లో మార్చి 29న విడుదలైన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి రానుంది. ఈమేరకు అధికారికంగా ప్రకటన కూడా వచ్చేసింది. స్వదీస్ ఎమ్ఎస్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఓవియా, రోబో శంకర్ ప్రధాన పాత్రల్లో నటించారు. అయితే, ఈ సినిమా ఆశించినంత స్థాయిలో మెప్పించలేకపోయింది.ఇప్పటి వరకూ తమిళ్లో అందుబాటులో ఉన్న 'బూమర్ అంకుల్' సినిమా తెలుగులో జులై 20 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈమేరకు తెలుగు ఆహా ఓటీటీ సంస్థ అధికారికంగా ప్రకటించింది. బూమర్ అంకుల్ గట్టిగా నవ్విస్తాడంటూ స్ట్రీమింగ్ డేట్‌ను తమ సోషల్ మీడియా ఖాతాలో ఆహా వెళ్లడించింది. ఇందులో నేసమ్ (యోగిబాబు)- అమీ (ఓవియా) దంపతులుగా కనిపిస్తారు. విదేశీ యువతి అమీతో నేసమ్‌కు పరిచయం ఏర్పడటం.. ఆపై పెళ్లి చేసుకోవడం జరుగుతుంది. కానీ వారు ఎందుకు విడాకులు తీసుకోవాలనుకున్నారు..? విడాకులు కావాలనుకున్న నేసమ్‌కు తన సతీమణి ఎలాంటి కండీషన్ పెడుతుంది..? వంటి అంశాలను జులై 20న అహాలో చూడండి. -
యోగిబాబు హీరోగా.. 'కానిస్టేబుల్ నందన్'
తమిళసినిమా: చిన్న చిన్న పాత్రల నుంచి ప్రముఖ హాస్య నటుడిగా ఎదిగిన యోగిబాబు ఆ తరువాత కథానాయకుడి అవతారమెత్తి సక్సెస్‌పుల్‌గా రాణిస్తున్నారు. ప్రస్తుతం ఈయన లేని చిత్రం లేదంటే అతిశయోక్తి కాదు. అటు హాస్య పాత్రల్లోనూ, ఇటు హీరోగానూ రెండు పడవలపై విజయవంతంగా పయనిస్తున్న యోగిబాబు తాజాగా హీరోగా నటిస్తున్న చిత్రం కానిస్టేబుల్ నందన్. శంకర్ పిక్చర్స్ పతాకంపై డి.శంకర్ తిరువణ్ణామలై నిర్మిస్తున్న ఈ చిత్రం ద్వారా భూపాల నటేశన్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.ఈయన దర్శకుడు సుందర్.సి, శశికుమార్, ఎం.కళైంజయం వద్ద సహాయ దర్శకుడిగా పని చేశారు. కాగా ఈయన దర్శకుడిగా పరి చయం అవుతున్న చిత్రం కానిస్టేబుల్ నందన్ ఆదివారం ఉదయం తిరువణ్ణామలైలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత డి.శంకర్ తిరువణ్ణామలై మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంటూ పలువురు నటులకు స్ఫూర్తిగా నిలిస్తున్న నటుడు యోగిబాబు వంటి ఉత్తమ నటుడితో కలిసి చిత్రం చేయడం ఘనతగా భావిస్తున్నానన్నారు.కథ చెబుతున్నప్పుడే ఆయన చూపించిన ఆసక్తి నిజంగానే అభినందనీయమన్నారు. పలు వురు ప్రముఖ దర్శకుల వద్ద పని చేసి చాలా విషయాలు నేర్చుకున్న భూపాల నటేశన్ వంటి ప్రతిభావంతుడైన దర్శకుడితో కానిస్టేబుల్ నందన్ చిత్రాన్ని చేయడం సంతోషంగా ఉందన్నారు. ఇలాంటి మంచి కథా చిత్రాలను మరిన్ని చేయాలని కోరుకుంటున్నానన్నారు.దర్శకుడు భూపాల నటే శన్ పేర్కొంటూ మంచి కథా చిత్రాలను నిర్మించాలన్న భావన కలిగిన నిర్మాతలను కనుగొనడం ఒక వరప్రసాదం అన్నారు. అలాంటి శంకర్ తన కథను చిత్రంగా నిర్మించడానికి ముందుకు రావడం సంతోషంగా ఉందన్నారు. ప్రేక్షకులు, బయ్యర్లకు నచ్చిన నటుడు యోగిబాబుతో కలిసి పని చేయడం చాలా ఆనందంగా ఉందన్నారు.ప్రముఖ హాస్యనటుడిగా కొనసాగుతూనే హీరోగా పలు విజయవంతమైన చిత్రాల్లో నటిస్తున్న ఆయన కేరీర్ కానిస్టేబుల్ నందన్ చిత్రం ఒక మైలు రాయిగా ఉంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కాగా ఇందులో యోగిబాబుకు విలన్‌గా ఓ బలమైన పాత్ర ఉంటుందన్నారు. ఆ పాత్ర కోసం ప్రతిభావంతుడైన నటుడిని ఎంపికచేసి త్వరలోనే వెల్లడించనున్నట్లు దర్శకుడు భూపాల నటేశన్ పేర్కొన్నారు.ఇవి చదవండి: 'మదర్ ఇండియా'కు సిద్ధం.. -
తమ్ముడి ప్రేమ కోసం యువతి కుటుంబాన్ని ఒప్పించిన యోగి బాబు
తమిళ చిత్రసీమలో చాలా కష్టపడి విజయం సాధించిన ప్రముఖ హాస్య నటుల్లో యోగి బాబు ఒకరు. కమెడియన్ గానే కాకుండా కథానాయకుడిగా పలు చిత్రాల్లో రాణిస్తున్నాడు. తాను కథానాయకుడిగా నటించిన చిత్రాలకు అభిమానుల నుంచి మంచి స్పందన వచ్చినా.. ఏడాదికి ఒక్క సినిమా మాత్రమే కథానాయకుడిగా నటిస్తానని చెబుతూ ఇతర చిత్రాల్లో హాస్య పాత్రల్లో ఆయన నటిస్తున్నాడు.సినిమా కెరియర్ ప్రారంభంలో ఛాన్స్‌ల కోసం వెతుకుతున్న సమయంలో భోజనానికి కూడా ఇబ్బంది పడ్డాడు. ఎలాగైనా తన కుటుంబాన్ని మంచి ఉన్నత స్థానంలో ఉంచాలని ఆయన నిరంతరం శ్రమించాడు. తన కలలను నిజం చేసుకున్న యోగిబాబు.. నేడు చెన్నైలోనే చాలా స్థలాలు, ఇళ్లు ఉన్నాయి. కోట్లలో రెమ్యునరేషన్ తీసుకునే స్థాయికి ఎదిగాడు. ఆర్థికంగా బాగా స్థిరపడిన తర్వాత యోగి బాబు 2020లో భార్గవిని వివాహం చేసుకున్నాడు. ఇప్పుడు ఈ జంటకు ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. గతేడాదే యోగి బాబు తన బిడ్డ మొదటి పుట్టినరోజును ఘనంగా జరుపుకున్నాడు.అయితే, ఈ నేపథ్యంలో యోగి బాబు ఇంట్లో మరో విచిత్రం చోటుచేసుకుంది. నటుడు యోగిబాబు తమ్ముడు విజయన్ ఫేస్బుక్ ద్వారా పరిచయమైన మైసూర్‌కు చెందిన ఓ అమ్మాయిని ప్రేమించాడు. తమిళ చిత్రసీమలో దర్శకుడిగా ఎదగాలని విజయన్ ఉన్నాడు. ఈ క్రమంలో యోగి బాబు కాల్షీట్తో సహా ఆయనకు సంబంధించిన అన్ని వ్యవహారాలను విజయన్ చూసుకునేవాడు. అతడికి ఫేస్బుక్ ద్వారా ఓ అమ్మాయి పరిచయం కావడం ఆ తర్వాత ఒకరినొకరు అర్థం చేసుకొని ప్రేమలో పడటం జరిగింది. అయితే, వీరిద్దరీ సామాజిక వర్గాలు వేర్వేరు కావడంతో పెళ్లిపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది.దీంతో యోగి బాబు నేరుగా మహిళ కుటుంబీకులను సంప్రదించి వారిని ఒప్పించి పెళ్లికి ఏర్పాట్లు చేశారు. జూన్ 3వ తేదీన యోగి బాబు స్వగ్రామం సెయ్యర్లో వీరి వివాహం చాలా సింపుల్‌గా రహస్యంగా జరింపించారు. ఈ వివాహానికి బంధువులు, స్నేహితులు మాత్రమే హాజరై వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు. అయితే, ఈ ఫోటోలు ఆయన ఫ్యాన్స్ నెట్టింట షేర్ చేస్తున్నారు. తమ్ముడి ప్రేమ వివాహాన్న దగ్గరుండి జరిపించిన యోగిబాబును వారందరూ ప్రశంసిస్తున్నారు. -
హీరో లేకుండానే బ్లాక్ బ్లస్టర్: ఏకంగా 800 శాతం లాభాలు
ఏదైనా సినిమా విజయవంతం కావాలంటే దర్శక నిర్మాతలతో పాట ఎలా ఉన్నా హీరోదే కీలక పాత్ర అనేది చాలాకాలంగాకొనసాగుతున్న ట్రెండ్. ఈ ట్రెండ్‌కు భిన్నంగా లేడీ ఓరియంటెడ్ సినిమాలు బ్లాక్ బ్లస్టర్ హిట్స్ అవుతున్న సినిమాలకు కొదవలేదు. అయితే హీరో లేకుండానే కలెక్షన్ల సునామీ సృష్టించిన సినిమాకు సంబంధించిన ఇంట్రస్టింగ్ వివరాలు మీ కోసం.. 2010ల మధ్యకాలంలో తమిళం , తెలుగు చలనచిత్ర పరిశ్రమలలో మహిళా ప్రధాన చిత్రాలు బాగా పెరిగాయని చెప్పొచ్చు. అనుష్క శెట్టి, నయనతార లాంటి హీరోయిన్లు బాక్సాఫీస్ వద్ద భారీ హిట్స్ నమోదు చేశారు. వీటిల్లోచాలావరకు హిందీతోపాటు, ఇతర భాషలలో కూడా రీమేక్ అయ్యాయి. అదే 2018 తమిళ సూపర్ హిట్ మూవీ ‘కొలమావు కోకిల’. తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కి, తొమ్మిది రెట్లకుపైగా లాభాలను సంపాదించింది. నయనతార టైటిల్ రోల్లో నటించిన ‘కొలమావు కోకిల’. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై, నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వం వహించగా యోగి బాబు, శరణ్య, శరవణన్, రాజేంద్రన్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఇదే తెలుగులో కోకోకోకిల పేరుతో రీమేక్ అయింది. కేవలం మౌత్ పబ్లిసిటీ ద్వారానే, ఈ చిత్రం విమర్శనాత్మకంగా, వాణిజ్యపరంగా విజయం సాధించింది. రూ. 8 కోట్ల బిడ్జెట్తో నిర్మితమై, ప్రపంచవ్యాప్తంగా 73 కోట్ల రూపాయలను వసూలు చేసింది. 800 శాతం లాభపడిన చిత్రంగా రికార్డు దక్కించుకుంది. 2022లో, కొలమావు కోకిల సినిమాను హిందీలో నూతన దర్శకుడు సిద్ధార్థ్ సేన్ రీమేక్ చేశారు. పంజాబ్ నేపథ్యంలో తెరకెక్కిన గుడ్‌లక్ జెర్రీ చిత్రంలో జాన్వీ కపూర్ ప్రధాన పాత్రలో దీపక్ డోబ్రియాల్, మితా వశిష్ట్, నీరజ్ సూద్, సౌరభ్ సచ్‌దేవా తదితరులు నటించారు. ఈ చిత్రం థియేటర్స్‌లో కాకుండా ఓటీటీలో రిలీజ్ అయింది. విమర్శకుల ప్రశంసలు కూడా దక్కించుకుంది. కథ ఏంటంటే.. కోకిల (నయనతార) మధ్యతరగతి కుటుంబానికి చెందిన అమ్మాయి. తన తల్లి (శరణ్య)కు కాన్సర్ రావడంతో ఆపరేషన్ కు 15 లక్షలు కావాలి. మసాజ్ పార్లర్ లో ఉద్యోగం ద్వారా వచ్చే సొమ్ము సరిపోక ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్న కోకిల, డ్రగ్స్ సరఫరా చేసే ఓ గ్యాంగ్ లో ట్రాన్స్ పోర్టర్ గా చేరుతుంది. ఈ క్రమంలో ఆమె అనుకోని కష్టాల్లో పడుతుంది. ఈ కష్టాల్లోంచి ఆమె బయట పడడానికి ఆమె ఎదుర్కొన్న సమస్యలేమిటి ? చివరికి తన తల్లిని కాపాడుకుందా ? లేదా ? అనేదే మిగతా సినిమా కథ. ఎప్పటిలాగానే కోకిల పాత్రలో నయనతార పెర్పార్మెన్స్ అదరిపోతుంది.భారీ ఫైట్స్, హోరెత్తించే బీజీఎంలు, ఎలివేషన్స్ ఉండవు కానీ తన అమాయకత్వంతోనే విలన్లకు చెక్ చెప్పడం ఆకట్టుకుంటుంది. ఈ చిత్రంలో నయన్‌ను ప్రేమించే వ్యక్తిగా కమెడియన్ యోగిబాబు వినోదం బాగా పండించాడు. వీరిద్దరిపై చిత్రించిన పాట యూట్యూబ్‌లో ట్రైండ్ సెట్ చేసిన సంగతి తెలిసిందే. -
భూమిక, యోగిబాబు 'స్కూల్' మొదలైంది
నటి భూమిక, యోగిబాబు, దర్శకుడు కేఎస్ రవికుమార్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న స్కూల్ చిత్రం బుధవారం చైన్నెలో పూజాకార్యక్రమాలతో ప్రారంభమైంది. క్వాంటమ్ ఫిలిం ఫ్యాక్టరీ పతాకంపై ఆర్కే విద్యాధరన్, మంజు కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రానికి కథ, కథనం, మాటలు, దర్శకత్వం బాధ్యతలను ఆర్ కె విద్యాధరన్ నిర్వహిస్తున్నాడు. బక్స్, శ్యామ్స్ ముఖ్యపాత్రలు పోసిస్తున్న ఈ చిత్రానికి ఆదిత్యన్ గోవిందరాజన చాయాగ్రహణం అందిస్తున్నారు. చిత్ర వివరాలను దర్శకుడు తెలుపుతూ ఇది పూర్తిగా స్కూల్ నేపథ్యంలో సాగే కథా చిత్రంగా ఉంటుందని చెప్పారు. పాఠశాలలో జరిగే అవినీతి అక్రమాలను ఆవిష్కరించే ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ కథా చిత్రం స్కూల్ చిత్రం అని చెప్పారు. విద్యార్థుల దృష్టిలో సమాజంలో జరిగే ఆత్మహత్యలు, ప్రమాదాలు, అన్యాయాలు వంటి పలు ఆసక్తికరమైన సంఘటనతో చిత్రం సాగుతుందని చెప్పారు. ఇందులో విద్యార్థులను శారీరక రీత్యా పరిశోధించే ప్రధాన అధ్యాపకులుగా నటి భూమిక, విద్యార్థుల సంరక్షణ బాధ్యతలను నిర్వర్తించే పాఠశాల ఉపాధ్యాయుడిగా యోగిబాబు నటించారని చెప్పారు. పాఠశాలలో జరిగే క్రైమ్ థ్రిల్లర్ అంశాలను ఇన్వెస్టిగేషన్ చేసి అధికారిగా దర్శకుడు కేఎస్‌రవికుమార్ నటించారని తెలిపారు. ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ గురువారం నుంచి మొదలవుతుందని దర్శకుడు చెప్పారు. -
కార్తీ, కమల్ ప్రాజెక్ట్‌లను కాదని కమెడియన్‌తో సినిమా తీస్తున్న స్టార్ డైరెక్టర్
హిట్ చిత్రాలకు కేరాఫ్‌గా మారిన దర్శకుడు హెచ్.వినోద్. అజిత్‌తో వలిమై,తెగింపు చిత్రాలతో పాటు బాలీవుడ్ హిట్ సినిమా అయిన పింక్ చిత్రాన్ని కూడా తమిళ్లో వినోద్ డైరెక్ట్ చేశాడు. కార్తీతో ఖాకీ చిత్రాన్ని తీసి టాలీవుడ్లో కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈయన తదుపరి ప్రాజెక్ట్ కమలహాసన్ కథానాయకుడిగా రాజ్ కమల్ ఫిలిం ఇంటర్నేషనల్ పతాకంపై ఓ చిత్రం చేయడానికి సిద్ధం అయ్యారు. దీనికి సంబంధించిన కథా చర్చలు జరిగాయి. ఇది వ్యవసాయ నేపథ్యంలో రూపొందనుందనే ప్రచారం జరిగింది. అలాంటిది ఇప్పుడు ఈ చిత్రం తెరకెక్కించడానికి మరింత సమయం పట్టనుందనే టాక్ వినిపిస్తోంది. కాగా ఇంతకు ముందు నటుడు కార్తీతో ఖాకీ చిత్రానికి సీక్వెల్ చేస్తానని కూడా ఆయన ప్రకటించారు. కానీ ఆ ప్రాజెక్ట్ గురించి ఎలాంటి సమాచారం లేదు. దీంతో నటుడు కార్తీ ప్రస్తుతం వరుస చిత్రాలతో బిజీగా ఉన్నారు. కమలహాసన్ హీరోగా చేసే చిత్రం కూడా వాయిదా పడడంతో హెచ్.వినోద్ మధ్యలో ఓ చిత్రాన్ని చేయడానికి సిద్ధమవుతున్నట్లు తాజా సమాచారం. ఇందులో నటుడు యోగిబాబు హీరోగా నటించనున్నట్లు తెలుస్తోంది. ఇది రాజకీయ వ్యంగ్యాస్త్రాలతో వినోద భరిత కథా చిత్రంగా ఉంటుందని సమాచారం. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉందని భావిస్తున్నారు. -
ఆ నటుడి మరణం బాధాకరం.. దర్శకుడి భావోద్వేగం
యోగిబాబు, ఇనయా ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం తూక్కుదురై. బాలశరవణన్, సెండ్రాయన్, కుంకి అశ్విన్ ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని ఓపెన్ గేట్ పిక్చర్స్ పతాకంపై అన్బు, వినోద్, అరవింద్ కలిసి నిర్మించారు. డేనిస్ మంజునాథ్ దర్శకత్వం వహించిన ఈ మూవీకి రవివర్మ చాయాగ్రహణం, మనోజ్, కేఎస్ సంగీతాన్ని అందించారు. నిర్మాణ కార్యక్రమాలను పూర్తిచేసుకున్న తూక్కుదురై చిత్రం ఈనెల 25న విడుదలకు సిద్ధమవుతోంది. దర్శకుడు డేనిస్ మంజునాథ్ ఈ సందర్భంగా శుక్రవారం సాయంత్రం చిత్ర యూనిట్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చిత్ర దర్శకుడు డేనిస్ మంజునాథ్ మాట్లాడుతూ.. నిర్మాత అన్భు, నటుడు మారిముత్తు ఈ చిత్రం కోసం ఆరంభం నుంచి ఎంతగానో శ్రమించారని చెప్పారు. అలాంటిది ఈ రోజు నటుడు మారిముత్తు లేకపోవడం బాధాకరం అన్నారు. ఇది ఎలాంటి హింసాత్మక సంఘటనలు లేని కుటుంబసమేతంగా జాలీగా చూసి ఆనందించే కథా చిత్రం అని చెప్పారు. ఫిబ్రవరి 9న విడుదల చేయాలని భావించామని అయితే అప్పుడు భారీ చిత్రాలు విడుదల కానుండడంతో ఈనెల 25న విడుదల చేస్తున్నట్లు తెలిపారు. ఈ చిత్ర తమిళనాడు విడుదల హక్కులను ఉత్రా ప్రొడక్షన్స్ అధినేత హరి ఉత్రా పొందారు. తాను ఇప్పటి వరకు విడుదల చేసిన చిత్రాల్లో భారీ బడ్జెట్ కథా చిత్రం ఇదేనని ఆయన పేర్కొన్నారు. చదవండి: ‘తొలిప్రేమ’లో పవన్ చెల్లెలు.. ఇప్పుడు ఎలా ఉందో చూశారా? -
విభిన్నమైన కథాంశంతో వస్తోన్న స్టార్ కమెడియన్..!
నటుడు యోగిబాబు కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం బోట్. నటి గౌరీ జీ.కిషన్ నాయకిగా నటిస్తున్న ఈ చిత్రానికి శింబు దేవన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈయన ఇంతకు ముందు వడివేలు హీరోగా హింసై అరసన్ 23 పులికేసి, విజయ్ హీరోగా పులి, ప్రకాష్ రాజ్, సంతానం, గంజా కరుప్పు ప్రధాన పాత్రలు పోషించిన అరై ఎన్ 305, రాఘవా లారెన్స్ హీరోగా నటించిన ఇరుంబు కోట్టై మురట్టు సింగం వంటి భారీ చిత్రాలను తెరకెక్కించారు. కాగా ఈ తాజా చిత్రాన్ని భారీ అండ్ మాన్వీ మూవీ మేకర్స్ పతాకంపై ప్రభా ప్రేమ్ కుమార్ నిర్మిస్తున్నారు. ఈ చిత్ర వివరాలను దర్శకుడు తెలుపుతూ బోట్ పూర్తిగా వైవిధ్య భరిత కథా చిత్రంగా ఉంటుందన్నారు. ఇది 1940 ప్రాంతంలో చైన్నెలో జపాన్ బాంబులతో దాడి చేసినప్పుడు పదిమంది తమ ప్రాణాలను రక్షించుకోవడానికి బోట్ ఎక్కి తప్పించుకునే ప్రయత్నం చేస్తారన్నారు. అందులో నటుడు యోగి బాబు ఒకరిని చెప్పారు. అయితే ఆ బోట్ సముద్ర మధ్యలో ఆగిపోవడం, రంధ్రం పడి నీరు బోట్లోకి రావడం వంటి పలు కష్టాలను ఎదుర్కొంటారన్నారు. అలాంటి పరిస్థితుల్లో వారు ఏం చేశారు ఎలా ప్రాణాలతో బయటపడ్డారు. వంటి పలు ఆసక్తికరమైన అంశాలతో రూపొందిస్తున్న చిత్రమని చెప్పారు. షూటింగ్ ఎక్కువ భాగం సముద్రంలో చిత్రీకరిస్తున్నట్లు చెప్పారు ఇది యాక్షన్, థ్రిల్లింగ్‌తో కూడిన పొలిటికల్ కామెడీ కథాచిత్రంగా ఉంటుందన్నారు. ఈ చిత్రాన్ని తమిళం, తెలుగు, మలయాళం , కన్నడం, హిందీ భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో రూపొందిస్తున్నట్లు దర్శకుడు తెలిపారు. కాగా.. ఈ జిబ్రాన్ సంగీతాన్ని, మాధేష్ మాణిక్యం ఛాయాగ్రహణం అందిస్తున్నారు. A uniquely intriguing #BOATTeaser that sparks curiosity. It's my pleasure to share this and extend congratulations to the entire crew ! https://t.co/qhgIovhnpJ#ThroughoutInMidSea @chimbu_deven @iYogibabu @Gourayy @Madumkeshprem @GhibranVaibodha @maaliandmaanvi @cde_off pic.twitter.com/OVc9evIXtx — chaitanya akkineni (@chay_akkineni) December 16, 2023 -
ఎవరూ ఊహించని పాత్రలో కనిపించనున్న ఐశ్వర్య రాజేష్
టాలీవుడ్,కోలీవుడ్‌లలో వైవిధ్య కథా పాత్రలో నటిస్తూ తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న నటి ఐశ్వర్య రాజేష్. ఈమె హీరోయిన్ ఓరియెంటెడ్ కథా చిత్రాల్లోనూ నటించి మెప్పిస్తున్నారు. తాజాగా ఎవరూ ఊహించన విధంగా నర్సు అవతారం ఎత్తారు. ఐశ్వర్య రాజేష్ కథానాయకిగా నటిస్తున్న కొత్త చిత్రం తాజాగా పూజ కార్యక్రమాలతో ప్రారంభమైంది. ద్వారకా ప్రొడక్షన్‌పై ప్లాసీ కన్నన్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సవరిముత్తు దర్శకత్వం వహిస్తున్నారు. ఈయన ఇంతకుముందు అజిత్ విశ్వాసం, రజనీకాంత్ 'పెద్దన్న' చిత్రాలకు సంభాషణలు అందించారన్నది గమనార్హం. నటుడు యోగి బాబు, రెడిన్ కింగ్స్లీ, సుమన్‌రెడ్డి, సంతాన భారతి, అర్జున్ చిదంబరం, భగవతీ పెరుమాళ్ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. డి ఇమాన్ సంగీతాన్ని తమిళ్ అళగన్ ఛాయాగ్రహణం అందిస్తున్నారు. ఈ చిత్ర వివరాలను దర్శకుడు తెలుపుతూ ఇది ఆస్పత్రి నేపథ్యంలో సాగే కామెడీ, థ్రిల్లర్ కథా చిత్రం అన్నారు. ఇందులో ఐశ్వర్య రాజేష్ నర్సుగా నటిస్తున్నారని చెప్పారు. చిత్రం ఆధ్యంతం వినోదభరితంగా సాగుతూ కొన్ని ఆసక్తికరమైన అంశాలను ఆవిష్కరించేదిగా ఉంటుందని చెప్పారు. దీనికి సంబంధించిన పూర్తివివరాలను త్వరలోనే వెల్లడించనున్నట్లు దర్శకుడు పేర్కొన్నారు. -
రూమర్స్‌పై స్పందించిన సంపూర్ణేశ్ బాబు
సంపూర్ణేష్‌బాబు.. తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. హాస్యనటుడిగా తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. అలా బిగ్‌బాస్‌లో కూడా అడుగుపెట్టి బుల్లితెర ద్వారా ప్రతి ఇంటికి పరిచయం అయ్యాడు. తాజాగా సంపూర్ణేష్‌బాబు కీలక పాత్రలో 'మార్టిన్ లూథర్ కింగ్' అనే చిత్రంలో నటించిన విషయం తెలిసిందే. త్వరలో ప్రేక్షకుల ముందుకు ఈ సినిమాతో సంపూర్ణేష్‌బాబు రానున్నారు. ఈ సందర్భంగా సినిమా ప్రమోషన్స్ కార్యక్రమాల్లో ఆయన బిజీగా ఉండగా ఇప్పటి వరకు తనపై వస్తున్న రూమర్స్‌కు ఆయన స్పందించాడు. 'ఇండస్ట్రీలో కొందరు మిమ్మల్ని తొక్కేయడం వల్లే మీరు పెద్దగా సినిమాలు చేయడం లేదనే టాక్ వినిపిస్తోంది. నిజమేనా?’ అని హోస్ట్ ప్రశ్నించగా అలాంటిదేం లేదని సంపూర్ణేశ్ బాబు తెలిపాడు. తాను అందరితోనూ మంచిగానే ఉంటానని నాకు అలాంటి ఇబ్బందులు ఏమీ ఎదురుకాలేదన్నాడు. తనకు అనారోగ్యం వల్ల సినిమాలు చేయడం లేదనే వార్తలు కూడా వచ్చాయి. అందులో కూడా నిజం లేదని ఆయన పేర్కొన్నారు. తాను నటించిన మూడు సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయని, ‘మార్టిన్ లూథర్ కింగ్’ రిలీజ్ తర్వాత నెలల వ్యవధిలోనే అవి ప్రేక్షకుల ముందుకొస్తాయని తెలిపారు. తమిళంలో ఘన విజయం సాధించిన 'మండేలా' చిత్రానికి 'మార్టిన్ లూథర్ కింగ్' రీమేక్. పొలిటికల్ సెటైరికల్ మూవీగా రూపొందిన ఈ సినిమాలో 'కేరాఫ్ కంచరపాలెం' దర్శకుడు వెంకటేశ్ మహా, నరేశ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. పూజ కొల్లూరు దర్శకత్వం వహించారు. తమిళంలో యోగిబాబు తన నటనతో మండేలా సినిమాను నిలబెట్టాడు. తనదైన కామెడీతో పాటు, ఎమోషనల్ సీన్స్‌లోనూ చక్కగా నటించాడు. మరి తెలుగులో సంపూర్ణేష్‌బాబు ఏ మేరకు మెప్పిస్తాడో చూడాలి. అక్టోబర్ 27న ఈ సినిమా విడుదలకు రెడీగా ఉంది. -
స్టార్ కమెడియన్ కూతురు బర్త్ డే.. హాజరైన అగ్ర హీరోలు!
కోలీవుడ్ ప్రముఖ కమెడియన్ యోగిబాబు గురించి తెలుగువారికి పరిచయం చేయాల్సిన పనిలేదు. కోలీవుడ్‌తో పాటు తెలుగు ప్రేక్షకులను తన కామెడీతో అలరిస్తూనే ఉన్నారు. తాజాగా తన ముద్దుల కూతురు మొదటి బర్త్‌డేను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో కోలీవుడ్ స్టార్ హీరోలు, సినీ ప్రముఖులు పెద్దఎత్తున పాల్గొన్నారు. సూర్య, కార్తీ, విజయ్ సేతుపతి బర్త్ డే వేడుకలకు హాజరయ్యారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. (ఇది చదవండి: 'పదేళ్ల పనిని వారంలో చేశారు'.. ఆ డైలాగ్పై నటుడి ప్రశంసలు!) కోలీవుడ్ సినిమాల్లో యోగిబాబు తనదైన కామెడీతో అభిమానులను సంపాదించుకున్నారు. కమెడియన్‌గా ప్రేక్షకుల గుండెల్లో ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్నారు. ఇటీవలే రిలీజైన రజినీకాంత్ చిత్రం జైలర్‌లోనూ మెప్పించారు. షారుక్ ఖాన్, నయనతార జంటగా నటించిన సూపర్ హిట్ మూవీ జవాన్‌లో కనిపించారు. ప్రస్తుతం రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తోన్న సైన్స్ ఫిక్షన్ చిత్రం అయాలన్లో నటిస్తున్నారు. (ఇది చదవండి: మెగా ఫోన్ పట్టనున్న రామ్ చరణ్ విలన్!) -
కమెడియన్ యోగి బాబు కూతురు పుట్టినరోజు వేడుకలకు కదిలొచ్చిన తమిళ స్టార్స్ (ఫోటోలు)
-
నయనతార సంచలన నిర్ణయం.. యూట్యూబర్‌కు గోల్డెన్ ఛాన్స్
సంచలన నటి నయనతార మరో హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రంలో నటించడానికి సిద్ధమయ్యారు. దీనికి మన్నాంగట్టి సిన్స్ 1960 అనే టైటిల్ నిర్ణయించారు. నటుడు యోగిబాబు, దేవదర్శిని, గౌరి కిషన్, నరేంద్ర ప్రసాద్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రాన్ని ప్రిన్స్ పిక్చర్స్ ఎస్.లక్ష్మణ్ కుమార్ భారీఎత్తున నిర్మిస్తున్నారు. (ఇదీ చదవండి: Manchu Lakshmi: నాకే అడ్డొస్తావా అంటూ ఒక్కటి ఇచ్చేసిన మంచులక్ష్మి!) ఈ చిత్రం ద్వారా యూట్యూబ్ విక్కీ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఆర్డీ రాజశేఖర్ ఛాయాగ్రహణం, శ్యాన్ రోల్డన్ సంగీతాన్ని అందిస్తున్న చిత్రం చైన్నెలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. కాగా ఇది ప్రిన్స్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్న 10వ చిత్రం అన్నది గమనార్హం. ఒక యూట్యూబర్‌కు దర్శకత్వం వహించే అవకాశాన్ని నయనతారా ఇవ్వడంతో ఇప్పుడు కోలీవుడ్‌లో పెద్ద సంచలనంగా మారింది. విక్కీ కూడా ఇప్పటికే రెండు చిన్న సినిమాలను తెరకెక్కించాడు. అతనిలోని ప్రతిభను గుర్తించే నయనతారా అవకాశం ఇచ్చారని సమాచారం. కొలమావు కోకిల వంటి విజయవంతమైన చిత్రం తరువాత నయనతార, యోగిబాబు కాంబినేషన్ రూపొందడంతో ఈ మన్నాంగట్టి సిన్స్ 1960 చిత్రంపై మంచి అంచనాలు నెలకొన్నాయి. కాగా ఈ చిత్ర ఫస్ట్ లుక్‌పోస్టర్‌ను, మోహన్ పోస్టర్‌ను చిత్ర వర్గాలు విడుదల చేయగా అవి ఇప్పుడు సామాజిక మాద్యమాల్లో వైరల్ అవుతున్నాయి. చిత్ర షూటింగ్‌ను త్వరలో ప్రారంభించనున్నట్లు నిర్మాత తెలిపారు. -
అర డజనుకు పైగా సినిమాలతో ఫుల్ బిజీ.. తాజాగా మరో సినిమా..
ఇప్పుడు తమిళంలో నటుడు యోగిబాబు లేని చిత్రం లేదు..! అన్నట్లు ఉంది అక్కడి పరిస్థితి! స్టార్ హీరోల చిత్రాల్లో హాస్య పాత్రల్లో నటిస్తూనే మరో పక్క కథానాయకుడిగానూ నటిస్తున్నారు. అలా ఆయన హీరోగా నటించిన చిత్రాలు ఇటీవల వరుసగా విడుదలై ప్రేక్షకులను అలరిస్తున్నాయి. ఇటీవలే యోగిబాబు హీరోగా నటించిన లక్కీమెన్ చిత్రం విడుదలైంది. ప్రస్తుతం బూమర్ యాంగిల్, హైకోర్ట్ మహారాజా, వానవన్, రాధామోహన్ దర్శకత్వంలో నటిస్తున్న చట్నీ సాంబార్ మొదలగు అరడజనుకు పైగా చిత్రాలు ఈయన చేతిలో ఉన్నాయి. తాజాగా యోగిబాబు కథానాయకుడిగా మరో నూతన చిత్రం మంగళవారం తెన్‌కాశీలో పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయ్యింది. దీనికి ఆంధ్రా మెస్ జయ్ దర్శకత్వం వహిస్తున్నారు. దీన్ని 23 ఫ్రేమ్స్ ఎంటర్టైన్మెంట్ అధినేత సంచయ్ రాఘవన్, రూక్స్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ అధినేత మధు అలెగ్జెండర్ కలిసి నిర్మిస్తున్నారు. వైవిధ్యభరిత కథా కథనాలతో రూపొందిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడించనున్నట్లు యూనిట్ వర్గాలు పేర్కొన్నాయి. చదవండి: 13 ఏళ్లుగా ఎంతగానో ప్రేమించాం.. 'మా లక్ష్మీ చనిపోయింది' అంటూ డైరెక్టర్ ట్వీట్.. -
షూటింగ్‌లకు రాకుండా తిప్పలు పెడుతున్న యోగిబాబు?
నటుడు యోగిబాబు ప్రధాన పాత్రలో నటించిన చిత్రం లక్కీమ్యాన్. నటి రేచ్చల్ నాయకిగా నటించిన ఈ చిత్రానికి నటుడు బాలాజీ వేణుగోపాల్ దర్శకత్వం వహించారు. శ్యాన్ రోల్డన్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుని సెప్టెంబర్ 1న తెరపైకి రానుంది. ఈ సందర్భంగా మంగళవారం సాయంత్రం చైన్నెలోని ప్రసాద్‌ల్యాబ్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో దర్శకుడు బాలాజీ వేణుగోపాల్ మాట్లాడుతూ.. ఇంతకు ముందు తాను దర్శకత్వం వహించిన వెబ్ సిరీస్ పానీపూరికి మంచి ఆదరణ లభించిందన్నారు. తాజాగా లక్కీమ్యాన్ చిత్ర కథను నటుడు యోగిబాబుకు చెప్పగా వెంటనే నటించడానికి అంగీకరించారన్నారు. యోగిబాబును ఇండియన్ నటుడు అని చెప్పవచ్చునన్నారు. అంతటి ప్రతిభావంతుడని పేర్కొన్నారు. ఆయన గురించి ఇటీవల పలు వదంతులు ప్రచారం అవుతున్నాయని, వాటిలో ఏమాత్రం నిజం లేదన్నారు. యోగిబాబు ఇంటిలో మెడికల్ ఎమర్జెన్సీ పరిస్థితి నెలకొన్నా, షూటింగ్‌కు ఇబ్బంది కలుగుతుందని, కష్టాన్ని భరిస్తూనే తమ చిత్రంలో నటించారన్నారు. కాగా ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్న శక్తి ఫిలిమ్స్ శక్తివేల్‌కు ఈ సందర్బంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నానన్నారు. నటుడు యోగిబాబు మాట్లాడుతూ ఈ చిత్రంలో నటించే అవకాశాన్ని కల్పించిన దర్శకనిర్మాతలకు కృతజ్ఞతలు తెలిపారు. దర్శకుడు బాలాజీ వేణుగోపాల్ చెప్పినట్లుగా ఈ చిత్రం తన జీవితాన్ని తిరిగి చూసుకునేట్లు ఉందన్నారు. ఇంతకు ముందు తాను కొన్ని చిత్రాల్లో నాలుగైదు సన్నివేశాల్లో నటించినా తన పేరును ప్రచారానికి వాడుకోవడం అభిమానులను మోసం చేయడం కాదా..? అని ప్రశ్నించారు. దాని గురించి అడిగితే సమస్యగా మారుతోందన్నారు. తాను షూటింగ్‌లకు సరిగా రావడం లేదనే ఆరోపణలు చేస్తున్నారన్నారు. షూటింగ్‌కు రాకుండా తానెక్కడికి వెళతానన్నారు. తన గురించి జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రం నిజం లేదన్నారు. తాను కథలను విని కాకుండా వారి కష్టాలను విని నటిస్తున్నానని యోగిబాబు వెల్లడించారు. చదవండి: చిన్నాచితకా పాత్రలకు సైతం కాంప్రమైజ్.. కెరీర్ కోసం నేనూ అడ్జస్ట్ అయ్యా..: నటి -
తెలుగులో ధోని ‘ఎల్‌జీఎమ్’ వచ్చేస్తుంది
భారత క్రికెటర్ ఎంఎస్ ధోని ‘ఎల్‌జీఎమ్’తో నిర్మాణంలోకి అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. హరీష్ కల్యాణ్, ఇవానా, నదియా, యోగిబాబు కీలక పాత్రల్లో రమేష్ తమిళ్మణి దర్శకత్వం వహించారు. సాక్షి ధోని, వికాస్ హస్జా నిర్మించిన ఈ చిత్ర తెలుగు, తమిళంలో ఈ నెల 4న విడుదల కానుంది. తెలుగులో జేపీఆర్ ఫిల్మ్ప్, త్రిపుర ప్రొడక్షన్స్ రిలీజ్ చేస్తున్నాయి. ఈ సినిమాలో ప్రధాన పాత్రల్లో హరీష్ కళ్యాణ్, ఇవానా, నదియాలే ఈ సినిమాకు ప్రధాన బలం. పెళ్లికి ముందే కాబోయే అత్తగారికి కండీషన్స్ పెట్టిన గడుసరి కోడలుగా ఇవానా కనిపిస్తుంది. లవ్ టుడే చిత్రంతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో ఇవానా తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఆమె నటన ఎలా ఉండబోతుందనేది ట్రైలర్లో చిన్న టచ్‌తో చూపించించారు దర్శకుడు రమేష్ తమిళ్ మణి. ఇక కొడుకు ప్రేమ కోసం కోడలి పెట్టిన కండీషన్స్‌ను ఒప్పుకుని ఆమెతో ట్రావెల్ చేసే తల్లి పాత్రలో నదియా నటించారు. ‘‘ప్రేమించిన అబ్బాయిని పెళ్లాడాలనుకున్న అమ్మాయి కాబోయే అత్తగారి గురించి తెలుసుకునేందుకు ఆమెతో కొద్ది రోజులు జర్నీ చేయాలనుకుంటుంది. ఈ పాయింట్‌తో సినిమా ఉంటుంది’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. -
కమెడియన్ యోగి బాబు హీరోగా కొత్త సినిమా..
కథానాయకుడిగా, హాస్యనటుడిగా ప్రేక్షకులను అలరిస్తున్న నటుడు యోగిబాబు. ఇతడు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం వానవన్. ఎడెన్ ప్లిక్స్ ప్రొడక్షన్స్ పతాకంపై థామస్ రెన్ని జార్జ్ నిర్మిస్తున్నాడు. ఈయన గత ఏడాది సాయిపల్లవి నటించిన గార్గి సినిమాకు సహ నిర్మాత అన్న విషయం తెలిసిందే! మలయాళ దర్శకుడు సజన్ కె.సురేంద్రన్ వానవన్కు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రంలో యోగిబాబుతో పాటు రమేష్ తిలక్, కాళీ వెంకట్, లక్ష్మీ ప్రియా, చంద్రమౌలి, మాస్టర్ శక్తి రిత్విక్, లవ్ టుడే ప్రార్థన నాదన్, కల్కి రాజా తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఇది ఫీల్‌గుడ్ ఫాంటసీ చిత్రంగా ఉంటుందని డైరెక్టర్ సజన్ చెప్తున్నారు. అదే సమయంలో యోగిబాబు స్టైల్లో వినోద భరిత సన్నివేశాలు చోటు చేసుకుంటాయన్నారు. అందరినీ అలరించే విధంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు చెప్పారు. ప్రేక్షకులందరికీ సరికొత్త అనుభూతిని కలిగిస్తుందని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. చిత్ర షూటింగ్ మధురై, చైన్నెలో నిర్వహిస్తున్నట్లు చెప్పారు. షూటింగ్ చివరి దశకు చేరుకుందన్నారు. కాగా శనివారం యోగిబాబు పుట్టిన రోజు సందర్భంగా వానవన్ చిత్ర టైటిల్‌ను, మోషన్ పోస్టర్‌ను సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ కుమార్, మావీరన్ చిత్ర దర్శకుడు మడోన్నా అశ్విన్ ఆన్లైన్ ద్వారా విడుదల చేసినట్లు తెలిపారు. దీనికి ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభిస్తోందన్నారు. Here is my next movie first look motion poster of #VAANAVAN Directed by @sajinksofficial 🎬#Edenflicks #ThomasGeorge@thilak_ramesh @LakshmiPriyaaC @Kaaliactor pic.twitter.com/c9SxkxIw9C — Yogi Babu (@iYogiBabu) July 22, 2023 చదవండి: ఇప్పట్లో 'గుంటూరు కారం' కష్టాలు తీరవా..? మహేష్ క్లారిటీ ఇవ్వాల్సిందేనా? -
మూవీ టైటిల్ 'చట్నీ- సాంబార్'.. హీరోగా ప్రముఖ కమెడియన్!
కోలీవుడ్‌లో ఫేమస్ కమెడియన్ యోగిబాబు ఓ వైపు హాస్య పాత్రలో నటిస్తూనే మరోవైపు కథానాయకుడిగా ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఈ శుక్రవారం విడుదలైన మావీరన్ చిత్రంలో కమెడియన్ పాత్రలో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. తాజాగా ఈయన కథానాయకుడిగా నటిస్తున్న చిత్రానికి చట్నీ సాంబార్ అనే పేరును నిర్ణయించారు. ఈ చిత్రంలో నటి వాణి భోజన్ హీరోయిన్గా నటిస్తుండగా.. నితిన్, సత్య తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి రాధా మోహన్ దర్శకత్వం వహిస్తున్నారు. యోగి బాబు ఇప్పటికే ఎస్జే సూర్య, ప్రియా భవానీ శంకర్ జంటగా నటించిన బొమ్మై చిత్రం గత నెల 16వ తేదీన విడుదల కాగా.. మిశ్రమ స్పందనను తెచ్చుకుంది. ప్రస్తుతం ఈ చిత్రాన్ని డిస్నీ హాట్ స్టార్ సంస్థతో కలిసి వేల్స్ ఫిలిం ఇంటర్నేషనల్ పతాకంపై ఐసరి గణేష్ నిర్మిస్తున్నారు. దీనికి అజేష్ సంగీతాన్ని.. ప్రసన్నకుమార్ చాయాగ్రహణం అందిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్‌ను శనివారం పూజ కార్యక్రమాలతో ప్రారంభించారు. దర్శకుడు రాధా మోహన్ చిత్రాలు అంటేనే కథ, కథనాలు వైవిధ్యంగా ఉంటాయి. కాగా ఈ చిత్రం టైటిల్ కూడా చాలా కొత్తగా ఉంది. అదే సమయంలో ఇందులో వినోదానికి కొదవ ఉండదు అనిపిస్తుంది. దీంతో ఈ చట్నీ సాంబార్ చిత్రంపై ఆసక్తి నెలకొంది. -
శివ కార్తికేయన్ ‘మహావీరుడు’మూవీ స్టిల్స్
-
రాయుడు రిటైర్ అయ్యాడు.. మీకు తప్పకుండా జట్టులో చోటిస్తాం.. కానీ: ధోని
MS Dhoni Hilarious Response Over Yogi Babu Wanting To Join CSK: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని మైదానంలో ఎంత చురుగ్గా ఉంటాడో.. ఆఫ్ ది ఫీల్డ్ అంతే సరదాగా ఉంటాడు. ఆటలో కెప్టెన్సీ నైపుణ్యాలతో ఆకట్టుకునే తలా.. ప్రస్తుతం సినీ నిర్మాతగా కొత్త అవతారమెత్తిన విషయం తెలిసిందే. చెన్నై సూపర్ కింగ్స్‌తో పెనవేసుకున్న బంధాన్ని మరింత పదిలం చేసుకుంటూ సౌత్ ఇండస్ట్రీలో ధోని ఎంటర్టైన్మెంట్ పేరిట నిర్మాణ రంగంలోకి దిగాడు. లెట్స్ గెట్ మ్యారీడ్ తమ బ్యానర్‌పై తెరకెక్కిన తొలి సినిమా LGM (Let's Get Married) ట్రైలర్, ఆడియో లాంచ్ కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. చెన్నైలో జరిగిన ఈ ఈవెంట్లో ధోని, అతడి సతీమణి సాక్షి తమ చేతుల మీదుగా ట్రైలర్‌ను ఆవిష్కరించారు. LGMలో నటించిన హరీశ్ కళ్యాణ్, నదియా, ఇవానా, కమెడియన్ యోగిబాబు, ఆర్జే విజయ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సీఎస్కేకు ఆడాలని ఉంది ఈ సందర్భంగా యోగిబాబు తనదైన శైలిలో హాస్యం పండించాడు. అంతేకాదు తనకు చెన్నై సూపర్ కింగ్స్‌లో భాగం కావాలని ఉందంటూ తన మనసులో ఉన్న కోరికను ధోని ముందు బయటపెట్టాడు. ఇందుకు ధోని కూడా అంతే సరదాగా స్పందించాడు. ‘‘రాయుడు రిటైర్ అయ్యాడు. కాబట్టి సీఎస్కేలో మీకు తప్పకుండా చోటు ఉంటుంది. మేనేజ్మెంట్తో నేను మాట్లాడతాను. కానీ మీరిప్పుడు సినిమాల్లో బిజీగా ఉన్నారు కదా!నేనైతే మీరు ఎల్లప్పుడు జట్టుతో ఉంటూ నిలకడగా ఆడాలని కోరుకుంటా. కానీ వాళ్లు మాత్రం ఫాస్ట్ బౌలింగ్‌తో మిమ్మల్ని గాయపరుస్తారు మరి జాగ్రత్త’’ అని తలా యోగిబాబుకు బదులిచ్చాడు. దీంతో అక్కడ నవ్వులు పూశాయి. రాయుడు అరుదైన ఘనత అంబటి రాయుడు ఐపీఎల్-2023 తర్వాత క్యాష్ రిచ్ లీగ్‌కు గుడ్ బై చెప్పిన విషయం తెలిసిందే. ఇక ఈ ఎడిషన్‌లో చెన్నై టైటిల్ గెలిచి ఏకంగా ఐదోసారి చాంపియన్‌గా నిలవడంతో రాయుడు అరుదైన రికార్డు తన ఖాతాలో వేసుకున్నాడు. ఐపీఎల్లో మొత్తంగా ఆరుసార్లు(ముంబై ఇండియన్స్ తరఫున 3, సీఎస్కే తరఫున 3) విజేతగా నిలిచిన జట్టులో భాగమైన ఆటగాడిగా చరిత్రకెక్కాడు. ముంబై సారథి రోహిత్ శర్మ తర్వాత ఈ ఘనత సాధించిన రెండో క్రికెటర్‌గా నిలిచాడు. చదవండి: సిక్సర్ల రింకూ.. ఎక్కడా తగ్గేదేలే! వీడియోతో సెలక్టర్లకు దిమ్మతిరిగేలా! తల్లిదండ్రుల కష్టం ఏమిటో అర్థం చేసుకోలేని స్థితిలోనూ! శెభాష్ బిడ్డా.. -
రెమ్యునరేషన్ తీసుకుని డేట్స్ ఇవ్వని హీరోలకు షాక్!
తమిళనాడులో హీరోలు, నిర్మాతల మధ్య వివాదం ముదురుతోంది. రెమ్యునరేషన్, అడ్వాన్సులు తీసుకుని డేట్స్ ఇవ్వడం లేదంటూ నిర్మాతలు హీరోలపై మండిపడుతున్నారు. సరైన కథలతో కాకుండా పిచ్చి కథలతో ముందుకు వస్తే ఎలా డేట్లు సర్దుబాటు చేస్తామని అటు నటులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. గత కొన్ని నెలలుగా వీరి మధ్య జరుగుతున్న వివాదంపై తమిళనాడు చిత్రమండలి స్పందించింది. శింబు, ఎస్జే సూర్య, అధర్వ, విశాల్, యోగి బాబు.. ఐదుగురు నటులకు రెడ్ నోటీసులు ఇవ్వాలని నిర్ణయించింది. మరి ఈ నిర్ణయంపై హీరోలు ఏమని స్పందిస్తారో చూడాలి! చదవండి: తనను ఎక్కడ సమాధి చేయాలో ముందే చెప్పిన రాకేశ్ మాస్టర్ -
సాక్షి ధోని నిర్మాతగా లెట్స్ గెట్ మ్యారీడ్.. పోస్టర్ చూశారా?
కుటుంబ నేపథ్యంలో రూపొందే ఫీల్ గుడ్ కథా చిత్రాలకు ప్రేక్షకుల మధ్య ఎప్పుడూ ఆదరణ ఉంటుంది. అలాంటి కథా చిత్రమే లెట్స్ గెట్ మ్యారీడ్. సినిమా పేరు కొత్తగా ఉందనుకుంటున్నారా? ఇప్పటి వరకు ఎల్జీఎం పేరుతో ప్రచారంలో ఉన్న చిత్రం పూర్తి పేరు లెట్స్ గెట్ మ్యారీడ్. ప్రముఖ భారతీయ క్రికెట్ క్రీడాకారుడు ఎంఎస్ ధోని సమర్పణలో ఆయన సతీమణి సాక్షి ధోని చిత్ర నిర్మాణం రంగంలోకి ప్రవేశించి నిర్మిస్తున్న తొలి చిత్రం ఇది. నటుడు హరీష్ కల్యాణ్, నటి నదియ, యువనా, యోగిబాబు తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రం ద్వారా రమేష్ తమిళమణి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. కాగా చిత్రం షూటింగ్‌ను శరవేగంగా పూర్తి చేసుకుంది. ప్రస్తుతం నిర్మాణ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను ఇటీవల విడుదల చేయగా మంచి స్పందన వచ్చింది. తాజాగా సెకండ్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. దీనికి మంచి స్పందన వస్తుందని చిత్ర వర్గాలు ఆశాభావం వ్యక్తం చేశాయి. చిత్ర షూటింగ్ ప్రణాళిక ప్రకారం పూర్తి చేసినట్లు నిర్మాత సాక్షి ధోని మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. ఇది మంచి ఫీల్‌గుడ్ మూవీగా ఉంటుందని చెప్పారు. చక్కని వినోదంతో అనుబంధాలను ఆవిష్కరించే మంచి కుటుంబ కథా చిత్రంగా ఎల్జీఎం చిత్రం ఉంటుందని తెలిపారు. ప్రేక్షకులకు మంచి అనుభూతిని కలిగిస్తుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. Presenting the second look poster of #LGM! Get ready to join us on this fun journey. #LGM படத்தின் செகண்ட் லுக் போஸ்டரை வழங்குகிறோம்! இந்த வேடிக்கையான பயணத்தில் எங்களுடன் சேர தயாராகுங்கள்! pic.twitter.com/nR2UydHcWp — Dhoni Entertainment Pvt Ltd (@DhoniLtd) May 27, 2023 -
కమెడియన్ యోగిబాబు సరసన మరోసారి నయనతార!
నయనతార లేడీ ఓరియెంటెడ్ కథా చిత్రాల నాయకిగా విజయం సాధించిన చిత్రాలలో కోలమావు కోకిల ఒకటి. ఆమెకు వన్‌సైడ్ లవర్‌గా నటుడు యోగిబాబు నటించారు. ఆ చిత్రం ఆయనకు హీరో ఇమేజ్ తెచ్చి పెట్టింది. నయనతార చుట్టూ తిరిగే కథా చిత్రంలో యోగిబాబుది కీలకపాత్ర. 2018లో విడుదలైన ఈ చిత్రం మంచి విజయం సాధించింది. ఒక ముఖ్య అంశానికి హాస్యం జోడించి తెరకెక్కించిన చిత్రం కోలమావు కోకిల. ఈచిత్రంతో దర్శకుడుగా పరిచయమైన నెల్సన్ ఇప్పుడు రజనీకాంత్ చిత్రానికి దర్శకత్వం వహించే స్థాయికి ఎదిగారు. కాగా నయనతార, యోగిబాబు మళ్లీ కలిసి నటించడానికి సిద్ధమవుతున్నారన్నది తాజా సమాచారం. ఈ చిత్రాన్ని ఇంతకుముందు కార్తీక్ హీరోగా సర్దార్, శశికుమార్ కథానాయకుడిగా ఆర్జే బాలాజి హీరోగా రన్ బేబీ రన్ వంటి సక్సెస్ఫుల్ చిత్రాలను నిర్మించిన ప్రిన్స్ పిక్చర్స్ సంస్థ నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. ఈ చిత్రం ద్వారా విక్కీ అనే నవ దర్శకుడు పరిచయం కానున్నట్లు సమాచారం. ఈ చిత్రం వచ్చే నెలలోనే సెట్ పైకి వెళ్లనున్నట్లు సినీవర్గాల టాక్. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం షారుక్‌ఖాన్ సరసన హిందీలో జవాన్ చిత్రంలో నటిస్తున్న నయనతార తర్వాత తన 75వ చిత్రంలో నటించడానికి సిద్ధమవుతున్నారు అదేవిధంగా వై నాట్ పిక్చర్స్ పతాకంపై శశికాంత్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న చిత్రంలో మాధవన్, సిద్ధార్థ్‌లతో కలిసి నటించనున్నారు. ఇది కథానాయకుడు ప్రాధాన్యత కలిగిన కథా చిత్రం అని దర్శక నిర్మాత ఇప్పటికే ప్రకటించారు. వీటితోపాటు మరికొన్ని అవకాశాలు నయనతార కోసం ఎదురుచూస్తున్నాయి. -
పరాక్రమవంతుడు
సూర్య, దిశా పటానీ జంటగా, యోగిబాబు కీలక పాత్రలో శివ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోంది. స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ పతాకాలపై వంశీ, ప్రమోద్‌లతో కలిసి జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్న ఈ సినిమాకు ‘కంగువ’ అనే టైటిల్‌ను ఖరారు చేసి, వచ్చే ఏడాది ప్రారంభంలో సినిమాని రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ టీజర్‌ను విడుదల చేశారు. డైరెక్టర్ శివ మాట్లాడుతూ–‘‘ఈ సినిమాలో సూర్య గంభీరంగా కనిపిస్తారు. ‘కంగువ’ మాకు ఎంతో ప్రత్యేకమైన చిత్రం. షూటింగ్‌ను పూర్తి చేసి, త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తాం’’ అన్నారు. ‘‘త్రీడీలో పది భాషల్లో రూపొందుతున్న ఈ సినిమాకు అన్ని భాషల ప్రేక్షకులు కనెక్ట్ అయ్యేలా కామన్ టైటిల్ పెట్టాల్సి వచ్చింది. అందుకే అన్ని భాషల్లో ‘కంగువ’ టైటిల్‌ను ఫిక్స్ చేశాం. కంగువ అంటే అగ్నిశక్తి ఉన్న వ్యక్తి, పరాక్రమవంతుడు అనే అర్థాలు వస్తాయి. ఈ సినిమా షూటింగ్ 50 శాతం పూర్తయ్యింది. మరో నెలలో బ్యాలన్స్ షూటింగ్ పూర్తి చేస్తాం. గ్రాఫిక్స్ వర్క్ ఎక్కువగా చేయాల్సి ఉంది.. దీంతో పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్‌కు ఎక్కువ సమయం పడుతుంది. అందుకే 2024 ప్రారంభంలో ఈ సినిమాను విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నాం’’అని చిత్రయూనిట్ పేర్కొంది.