చెన్నై: నేటి రాజకీయ వ్యవస్థకు అద్దం పట్టేలా రూపొందించిన చిత్రం మండేలా. వై నాట్ స్టూడియోస్, రిలయన్స్ ఎంటర్‌టెయిన్‌మెంట్, విష్ బెరీ ఫిలిమ్స్, ఎల్ ఎల్ పీ సంస్థల సమర్పణలో యాన్ ఓపెన్ వీడియో ప్రొడక్షన్ సంస్థ నిర్మించిన చిత్రం మండేలా. నటుడు యోగిబాబు కథానాయకుడిగా నటించిన ఈ చిత్రంలో సంగిలి మురుగన్, జీఎం సుందర్, నటి షీలా రాజ్కుమార్, కన్నరవి ప్రధాన పాత్రలు పోషించారు. దీనికి కథ, దర్శకత్వ బాధ్యతలను మడోనా అశ్విన్ నిర్వహించారు. ఎస్ శశికాంత్ నిర్మించిన ఈ చిత్రానికి చక్రవర్తి రామచంద్ర సహా నిర్మాతగా వ్యవహరించారు. దర్శకుడు బాలాజీ మోహన్ క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహించారు. దీనికి భరత్ శంకర్ సంగీతాన్ని, విదు ఆయ్యన్న ఛాయాగ్రహణం అందించారు.
ఒక గ్రామ పంచాయతీ ఎన్నికలు విజయవంతంగా రూపొందించిన చిత్రం మండేలా. ఆ గ్రామ ప్రెసిడెంట్‌కు ఇద్దరు భార్యలు ఉంటారు. ఐదుగురు కొడుకులు తర్వాత ప్రెసిడెంట్ బాధ్యతను తమకంటే తమకు కట్టపెట్టాలని తండ్రిపై ఒత్తిడి తీసుకొస్తారు. చివరికి ఇద్దరు ప్రెసిడెంట్ పదవికి పోటీకి సిద్ధమవుతారు. రెండు వర్గాలకు ఓటర్లు సరి సమానంగా ఉంటారు. అలాంటి సమయంలో ఆ గ్రామంలో ఉన్న ఒక నాయీబ్రాహ్మణ యువకుడి ఓటు కీలకంగా మారుతుంది. అతని ఓటు కోసం వారు పడే పాటులేమిటన్నదే మండేలా చిత్రం. నేటి సమకాలీన రాజకీయాలకు అద్దంపట్టేదిగా దర్శకుడు మండేలా చిత్రాన్ని తీర్చిదిద్దారు.
చదవండి: వీరప్పన్ కూతురు కథానాయికగా తెరంగేట్రం
Comments
Please login to add a commentAdd a comment