koliwood
-
Rajinikanth: కాంబినేషన్ కుదిరేనా?
‘అన్నాత్తే’ (తెలుగులో ‘పెద్దన్న’) రిలీజ్ తర్వాత రజనీకాంత్ హీరోగా నటించనున్న సినిమాపై ఇంకా స్పష్టత రాలేదు. కార్తీక్ సుబ్బరాజు, వెంకట్ ప్రభు, కేఎస్ రవికుమార్ వంటి దర్శకులు రజనీకి కథలు వినిపించారని కోలీవుడ్ టాక్. తాజాగా ఈ జాబితాలో ‘చీనీ కమ్’, ‘పా’, ‘ప్యాడ్మాన్’ వంటి హిందీ చిత్రాలకు దర్శకత్వం వíß ంచిన ఆర్. బాల్కీ పేరు తెరపైకి వచ్చింది. ఇటీవల రజనీని కలిసి ఓ కథను వినిపించారట బాల్కీ. ఆ కథ రజనీకి బాగా నచ్చిందని సమాచారం. ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కించాలను కుంటున్నారట. ఇక ఇప్పటివరకూ బాల్కీ తెరకెక్కించిన వాటిలో చీనీ కమ్, పా, షమితాబ్ తదితర చిత్రాలకు ఇళయరాజా సంగీతం సమకూర్చారు. ఒకవేళ రజనీ – బాల్కీ కాంబినేషన్ కుదిరితే ఈ సినిమాకు కూడా ఆయనే సంగీతం అందించే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం జరుగుతోంది. 1994లో వచ్చిన ‘వీర’ చిత్రం తర్వాత రజనీ–ఇళయరాజా కలిసి వర్క్ చేయలేదు. మరి... 28 ఏళ్ల తర్వాత ఈ కాంబినేషన్ కుదురుతుందా? అసలు రజనీ–బాల్కీ కాంబినేషన్ కుదిరిందా? అనేది తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే. -
జైభీమ్ మూవీపై సీతక్క ట్వీట్.. థ్యాంక్యూ మేడమ్ అంటూ హీరో సూర్య రిప్లై
సాక్షి, హైదరాబాద్: తమిళ స్టార్ హీరో సూర్య ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం జైభీమ్. సినిమా అంటే ఫైట్లు, ఫీట్లు, ఐటెం సాంగ్‌లు కాదని నిరూపించిన మూవీ జై భీమ్. సినిమాకు సామాజిక బాధ్యతకు ఉన్న అవినావ సంబంధాన్ని మరోసారి తట్టిలేపింది. ఒక ఆడబిడ్డ నిజజీవిత గాథను, పోరాటాన్ని ప్రయోగాత్మకంగా తెరకెక్కించిన వైనం శభాష్ అనిపించుకుంది. ఈ మూవీ బ్లాక్ బ్లస్టర్హిట్ అవ్వడమే కాదు అనేక రికార్డులతో దూసుకుపోతోంది. అయితే జై భీమ్ చిత్రం విమర్శకుల ప్రశంసలను దక్కించుకుంది. ఇప్పటికే పలువురు సినీ రాజకీయ ప్రముఖులు ఈ చిత్రాన్ని వీక్షించి.. హీరో సూర్య, చిత్ర బృందానికి అభినందనలు తెలిపారు. అయితే తాజాగా ఈ చిత్రాన్ని చూసిన తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ధనసరి అనసూయ(సీతక్క) హీరో సూర్యకు ట్విటర్ వేదికగా అభినందనలు తెలియజేశారు. ‘జై భీమ్ చిత్రం ఆస్కార్ బరిలో నిలిచి అవార్డు సాధిస్తుందని ఆశిస్తున్నా. చిత్రం బృందానికి ముందస్తుగా నా అభినందనలు’ అని ఆమె ట్వీట్ చేశారు. అయితే ఆమె చేసిన ట్వీట్‌కు హీరో సూర్య స్పందించారు. ‘కృతజ్ఞతలు మేడం.. మా చిత్రం బృందం తరఫున మీకు కృతజ్ఞతలు’ అని సూర్య రిప్లై ఇచ్చారు. I hope this movie gets Oscar award @Suriya_offl garu 🙏 🔸My Congratulations in advance to entire Jai Bhim movie team 💐@RahulGandhi @priyankagandhi @TribalArmy @HansrajMeena @manickamtagore @JitendraSAlwar @AlankarSawai @vidyarthee @revanth_anumula @MahilaCongress https://t.co/DsjsuZNVXA — Danasari Anasuya (Seethakka) (@seethakkaMLA) November 17, 2021 -
నేను జీవించినంత కాలం గిల్టీ ఫిలింగ్ అనుభవిస్తా.. నన్ను క్షమించు పావని
తమిళ బిగ్‌బాస్ ఫేం, నటి యాషిక ఆనంద్ గత నెలలో రోడ్డు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంతో ఆమె స్నేహితురాలు పావని అక్కడికక్కడే మృతి చెందారు. యాషికకు కూడా తీవ్ర గాయాలు అయ్యాయి. ఆస్పత్రిలో చికిత్స తీసుకొని యాషిక ఇటీవల కోలుకున్నారు. అయితే తాజాగా యాషిక.. తన స్నేహితురాలకు సంబంధించి ఓ ఎమోషనల్ నోట్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఆమె పోస్టులు సోషల్ మీడియోలో వైరల్‌గా మారాయి. ‘‘ప్రస్తుతం నేను ఎలా ఉన్నానో కూడా చెప్పలేకపోతున్నాను. నేను జీవించి ఉన్నంత కాలం ప్రమాదానికి సంబంధించి గిల్టీ ఫిలింగ్‌ను అనుభవిస్తాను. ఆ విషాదం నుంచి నన్ను కాపాడినందుకు దేవునికి కృతజ్ఞతలు చెప్పాలా లేదా ప్రాణ స్నేహితురాలిని నా నుంచి పూర్తిగా దూరం చేసిన దేవుడిని నిందించాలా అర్ధం కావటం లేదు. ప్రతి క్షణం పావనిని మిస్ అవుతున్నాను. ఆమె నన్ను ఎప్పటికీ క్షమించదని తెలుసు. నన్ను క్షమించు పావని.. నీ కుటుంబాన్ని విషాదకరమైన పరిస్థితిలోకి నెట్టినందుకు తీవ్రంగా బాధపడుతున్నాను. ప్రతి క్షణం నిన్ను కోల్పోతున్నా.. బతికి ఉన్నంతకాలం దోషిగా బాధపడతాను. నీ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను. ఏదో ఒకరోజు పావని కుటుంబం నన్ను క్షమిస్తుందని ఆశిస్తున్నాను. ఆమెతో ఉన్న జ్ఞాపకాలను ఎప్పటికీ మర్చిపోలేను’’ అని యాషిక భావోద్వేగంతో రాశారు. బుధవారం యాషిక ఆనంద్ 22వ వసంతంలోకి అడుగుపెట్టబోతున్నారు. అయితే తన బర్త్ డే వేడకలను అభిమానులు ఎవరూ చేయవద్దని కోరారు. ‘నేను బర్త్ డే వేడకలు చేసుకోవటం లేదు. అభిమానులు కూడా నా బర్త్ డే వేడుకలు నిర్వహించవద్దు.. పావని కుటుంబ సభ్యులకు శక్తినివ్వాలని దేవుడిని ప్రార్థించండి. పావని దూరమవ్వటం.. నా జీవితంలో పూడ్చలేని లోటు. మిస్ యూ పావని’ అని ఇన్స్టాగ్రామ్ స్టోరీలో యాషిక పోస్ట్ చేశారు. View this post on Instagram A post shared by Y A S H ⭐️🌛🧿 (@yashikaaannand) -
ఏమ్మా నీకు అంత పొగరా? అడగడంతో ఖంగుతిన్నా..
సాక్షి, చెన్నై: ఏమ్మా నీకు అంత పొగరా? అని అడగడంతో ఖంగుతిన్నానని చెప్పారు సార్పట్ట కథానాయిక దుషారా విజయన్. ఇటీవల ఓటీటీలో విడుదలైన ఈ చిత్రం విశేష ప్రేక్షకాదరణ అందుకుంటోంది. ఈ సందర్భంగా ఆమె తన సంతోషాన్ని మీడియాతో పంచుకున్నారు. ‘దిండుగల్ జిల్లా కన్యాపురం గ్రామానికి చెందిన నేను ప్యాషన్ డిజైనింగ్ చేసే సమయంలో బోదై ఏరి బుద్ధిమారి చిత్రంలో ఓ చిన్న పాత్రలో నటించాను. ఐదేళ్ల కష్టానికి ఫలితంగా పా.రంజిత్ దర్శకత్వంలో సార్పట్ట చిత్రం అవకాశం వచ్చింది. ఓ రోజు రంజిత్ ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది. మరుసటిరోజు ఆఫీసుకు రావాల్సిందిగా చెప్పారు. అయితే నేను ఆ ఫోన్‌కాల్‌ను నమ్మలేదు. రెండో రోజు మళ్లీ పోన్ చేసి నీకు అంత పొగరా? పా.రంజిత్ ఆఫీస్ నుంచి ఫోన్ చేస్తే రాలేదే అని ప్రశ్నించారు. దీంతో వెంటనే అక్కడికి వెళ్లాను. అడిషన్లో సెలెక్ట్ కావడంతో నటించే అవకాశం లభించింద’ని చెప్పుకొచ్చారు. -
మాజీ మంత్రికి నటి షాక్.. రూ.10 కోట్ల నష్టపరిహారం కోరుతూ
తమిళసినిమా: అన్నాడీఎంకే మాజీమంత్రి మణికంఠన్‌కు నటి చాందిని షాక్ ఇచ్చారు. మణికంఠన్ తనకు నష్టపరిహారంగా రూ.10 కోట్లు చెల్లించాలంటూ గురువారం స్థానిక సైదాపేట కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. స్థానిక బీసెంట్‌నగర్‌కు చెందిన మలేషియాకు చెందిన నటి చాందిని. అన్నాడీఎంకేకు చెందిన మాజీమంత్రి మణికంఠన్ పెళ్లి చేసుకుంటానని తనతో సహజీవనం చేసి మోసం చేశారని పోలీసు కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసు వ్యవహారంలో పోలీసులు మాజీ మంత్రి మణికంఠన్‌ను అరెస్టు కూడా చేశారు. ప్రస్తుతం ఈ కేసు మద్రాసు హైకోర్టులో విచారణలో ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో చాందిని గురువారం స్థానిక సైదాపేట కోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారు. అందులో మాజీమంత్రి మణికంఠన్ తనకు నష్టపరిహారంగా రూ.10 కోట్లు చెల్లించాలని పేర్కొన్నారు. అదే విధంగా తాను చెన్నైలో ఉండి కోర్టు కేసు వ్యవహారాలను చూసుకోవాల్సి ఉండడంతో అందుకు తనకు అయ్యే నెలవారి ఖర్చులు కూడా మాజీ మంత్రినే చెల్లించాలని ఆ పిటిషన్లో కోరారు. కాగా నటి చాందిని పిటిషన్ వచ్చే నెల 5న కోర్టు విచారణ చేపట్టనుంది. -
నటుడు టీకేఎస్ నటరాజన్ కన్నుమూత
సీనియర్ గాయకుడు, నటుడు టీకేఎస్ నటరాజన్(87) బుధవారం చెన్నైలో కన్నుమూశారు. చిన్నతనంలోనే నటనపై ఆసక్తితో టీకేఎస్ నాటక బృందంలో చేరి రంగస్థల నటుడిగా, గాయకుడిగా మంచి పేరు తెచ్చుకున్నారు. దీంతో ఆయన టీకేఎస్ నటరాజన్‌గా గుర్తింపు పొందారు. 1954లో రక్తపాశం చిత్రం ద్వారా నటుడిగా సినీ రంగ ప్రవేశం చేశారు. అలా శివాజీ గణేశన్, ఎంజీఆర్, కమలహాసన్, రజనీకాంత్ వంటి ప్రముఖ హీరోల చిత్రాల్లో ముఖ్య పాత్రల్లో నటించి పేరు తెచ్చుకున్నారు. 50 ఏళ్లలో 500కు పైగా చిత్రాల్లో నటించారు. 1984లో శంకర్ గణేష్ సంగీత దర్శకత్వంలో వాంగ మాప్పిళ్లై వాంగ చిత్రంలో నటరాజన్ పాడిన ‘ఎన్నడీ మునియమ్మ ఉన్న కన్నుల మయ్యి’ పాటతో ఆయన మరింత ప్రాచుర్యం పొందారు. స్థానిక సైదాపేటలో నివసిస్తున్న ఈయన వృద్ధాప్యం కారణంగా బుధవారం ఉదయం 6.30 గంటలకు కన్నుమూశారు. నటరాజన్ మృతికి పలువురు సినీప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. భౌతిక కాయానికి బుధవారం సాయంత్రం అంత్యక్రియలు జరిగాయి. చదవండి: ఓటీటీ ప్లాట్‌ఫామ్ ప్రారంభిస్తున్న నటి నమిత -
ఓటీటీ ప్లాట్‌ఫామ్ ప్రారంభిస్తున్న నటి నమిత
నటి నమిత ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభించనున్నారు. ప్రస్తుతం కరోనా మహమ్మారి చిత్ర పరిశ్రమను చిదిమేస్తోంది. థియేటర్లు మూతపడ్డాయి. షూటింగ్‌లు రద్దయ్యాయి. ఇదిలా జరగడం రెండోసారి. సినిమాల విడుదల చాలా వరకు వాయిదా పడుతున్నాయి. అయితే కొందరు నిర్మాతలు మాత్రం తప్పనిసరి పరిస్థితుల్లో ఓటీటీ వైపు దృష్టిసారిస్తున్నారు. అలా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు లాభసాటిగా మారాయి. దీంతో ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లకు గిరాకీ పెరగడంతో కొత్తగా మరిన్ని పుట్టుకొస్తున్నాయి. తాజాగా నటి నమిత కూడా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభించడానికి సిద్ధమయ్యారు. ఆమె రవివర్మ అనే సాఫ్ట్వేర్ ఇంజినీర్‌తో కలిసి ప్రారంభిస్తున్న ఈ ప్లాట్‌ఫామ్ నమిత టాకీస్ అని పేరు నిర్ణయించారు. దీని గురించి నమిత బుధవారం మీడియాకు ఓ ప్రకటన విడుదల చేశారు. చిత్ర పరిశ్రమకు చెందిన చిన్న నిర్మాతలు, కొత్త దర్శకులను ప్రోత్సహించాలన్న ఉద్దేశంతోనే ఓటీటీ ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఈ ఓటీటీ ద్వారా కొత్త కాన్సెప్ట్‌తో కూడిన చిత్రాలు, సిరీస్‌లను ప్రేక్షకులకు అందించనున్నట్లు పేర్కొన్నారు. చదవండి: ప్యాలెస్‌లో రాఖీ భాయ్ -
వివేక్ కుటుంబానికి విజయ్ పరామర్శ
చెన్నై: ఇటీవల గుండెపోటుతో కన్నుమూసిన ప్రముఖ హాస్యనటుడు వివేక్ కుటుంబాన్ని నటుడు విజయ్ పరామర్శించారు. చిరునవ్వే ఆభరణంగా చిత్ర పరిశ్రమలో అజాతశత్రువుగా పేరు తెచ్చుకున్న నటుడు వివేక్. అలాంటి పేరున్న నటుడు ఈ నెల 17వ తేదీ ఈ లోకాన్ని విడిచిన సంగతి తెలిసిందే. ప్రధాని నరేంద్ర మోదీ నుంచి పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు వివేక్ మృతికి సంతాపాన్ని వ్యక్తం చేశారు. పలువురు ఆయన భౌతిక కాయానికి నివాళులర్పించారు. కాగా నటుడు విజయ్ ఆ సమయంలో జార్జియాలో చిత్రీకరణ జరుగుతున్న తన 65 చిత్ర షూటింగ్లో ఉన్నారు. వివేక్ మరణ వార్త తెలిసినా కరోనా నిబంధనల కారణంగా ఆయన భౌతికకాయానికి నివాళులు అర్పించలేని పరిస్థితి. విజయ్ ఆరంభకాలం నుంచి వివేక్ ఆయనతో కలిసి పలు చిత్రాల్లో నటించారు. చివరిగా విజయ్ కథానాయకుడిగా నటించిన బిగిల్ చిత్రంలో వివేక్ కీలక పాత్రను పోషించారు. కాగా జార్జియాలో షూటింగ్ పూర్తి చేసుకుని ఆదివారం చెన్నై చేరుకున్న విజయ్ సోమవారం ఉదయం వివేక్ ఇంటికి వెళ్లి ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. చదవండి: ‘బ్లాక్’ క్యారెక్టర్ లీడ్‌గా సాగిన చిత్రం -
ప్రేమ వ్యవహారం: టీవీ నటితో వాగ్వాదం.. ముగ్గురి అరెస్టు
తిరువొత్తియూరు: ప్రేమ వ్యవహారానికి సంబంధించి టీవీ నటితో గొడవ చేసిన సహాయ దర్శకుడితో పాటు ముగ్గురిని పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. చెన్నై మనలి బాలాజీ పాలయానికి చెందిన జెనీఫర్ (24) బుల్లితెర నటి. 2019లో జెనీఫర్కు శరవణన్‌తో వివాహమైంది. అనంతరం ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో విడిపోయారు. విడాకుల పిటిషన్ కోర్టులో నడుస్తోంది. ఈ క్రమంలో టీవీ సీరియల్లో సహాయ డైరక్టర్‌గా పని చేస్తున్న నవీన్‌కుమార్ (25)తో జెనిఫర్‌కు పరిచయం ఏర్పడి ప్రేమకు దారి తీసింది. జెనిఫర్‌కు వివాహమైన సంగతి నవీన్‌కుమార్‌కు తెలిసింది. దీంతో అతను ఆమెను నిలదీయడంతో ఇరువురి మధ్య వాగ్వాదం జరిగింది. ఆదివారం మధ్యాహ్నం నవీన్‌కుమార్, అతని స్నేహితులు జెనీఫర్ ఇంటికి వెళ్లి గొడవ చేయడంతో పోలీసులు నవీన్‌కుమార్, పాండియన్ (24), కార్తికేయన్‌లను పోలీసులు అరెస్టు చేశారు. చదవండి: భార్గవ్ కేసుతో ఎలాంటి సంబంధం లేదు : ఓమైగాడ్ నిత్య -
‘వెట్రిని కొత్త చిత్రం మరో స్థాయికి తీసుకెళ్తుంది’
యువ నటుడు వెట్రి కొత్త చిత్రానికి సిద్ధమవుతున్నారు. 8 తూట్టాగల్ చిత్రంతో కథానాయకుడిగా రంగప్రవేశం చేసిన ఈయన ఆ చిత్ర విజయంతో వరుసగా కథాబలం ఉన్న చిత్రాలను ఎంపిక చేసుకుని నటిస్తున్నారు. తాజాగా పిక్చర్ బాక్స్ కంపెనీ నిర్మిస్తున్న చిత్రంలో హీరోగా నటించడానికి సిద్ధమయ్యారు. ఈ సంస్థ ఇంతకుముందు పలు చిత్రాలను డిస్ట్రిబ్యూషన్ చేసింది. ఈ చిత్రం ద్వారా శ్యామ్మనోహరన్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈయన ఇంతకుముందు పలు వాణిజ్య ప్రకటనలకు దర్శకత్వం వహించారు. ఈ చిత్రం గురించి నిర్మాత అలెగ్జాండర్ మాట్లాడుతూ.. డిస్ట్రిబ్యూషన్ రంగంలో ఉన్న అనుభవంతో ప్రేక్షకుల అభిరుచిని కొంతవరకు గ్రహించానన్నారు. దర్శకుడు శ్యామ్మనోహరన్ చెప్పిన కథ ప్రేక్షకులకు బాగా నచ్చుతుందనిపించిందన్నారు. చిత్ర కథ, కథనాలు కొత్తగా ఉంటాయన్నారు. మిస్టరీ కథా చిత్రాల్లో చివరి సమావేశాలు ఉత్కంఠ భరితంగా ఉంటాయన్నారు. అయితే ఈ చిత్రం ఆది నుంచి చివరి వరకు ఉత్కంఠ భరితంగా సాగుతుందని తెలిపారు. చాలా తక్కువ కాలంలో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు వెట్రిని ఈ చిత్రం మరో స్థాయికి తీసుకెళ్తుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కథానాయిక ఇతర నటీనటుల ఎంపిక జరుగుతోందని, వేసవి కాలం ముగిసిన తర్వాత చిత్ర షూటింగ్‌ను ప్రారంభించనున్నట్లు నిర్మాత తెలిపారు. చదవండి: కేసీఆర్ బయోపిక్కు ‘తెలంగాణ దేవుడు’ పేరు -
వివేక్ మరణంతో ఉద్వేగంలో వ్యాఖ్యానించా!
సాక్షి, చెన్నై: సినీనటుడు మన్సూర్ అలీఖాన్ ముందస్తు బెయిల్ కోసం సోమవారం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. హాస్యనటుడు వివేక్ మరణంతో ఉద్వేగానికి లోనై తాను చేసిన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని పేర్కొన్నారు. వివేక్ కోవిడ్ వ్యాక్సిన్ వేసుకున్న మరుసటి రోజున గుండెపోటుకు గురైన విషయం విధితమే. ఆ సమయంలో మన్సూర్ అలీఖాన్ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ఆరోగ్యంగా ఉన్న మనిషిని వ్యాక్సిన్ పేరుతో మంచం ఎక్కించారని ఆరోపించారు. ఇంతో వివేక్ కన్నుమూయడంతో మన్సూర్ ఆగ్రహానికి పట్టపగ్గాల్లేకుండా పోయాయి. ఆరోగ్యశాఖ కార్యదర్శి రాధాకృష్ణన్‌ను టార్గెట్ చేస్తూ విరుచుకుపడ్డారు. కరోనా వైరస్ అనేది ప్రజలను గుప్పిట్లో ఉంచుకునేందుకు పాలకులు చేస్తున్న పొలిటికల్ స్టంట్‌గా విమర్శించారు. మన్సూర్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో దుమారం వైరల్ కావడంతో చెన్నై కార్పొరేషన్ కమిషనర్ ప్రకాష్ స్పందించారు. మన్సూర్‌పై డీజీపీ త్రిపాఠీకి ఫిర్యాదు చేశారు. కోవిడ్ వ్యాక్సిన్‌పై తప్పుడు ప్రచారం చేస్తూ ప్రజలను పక్కదోవ పట్టిస్తున్నారని పేర్కొన్నారు. దీంతో మన్సూర్‌పై వడపళని పోలీస్‌స్టేషన్‌లో పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఈక్రమంలో మన్సూర్ అలీఖాన్ కోర్టును ఆశ్రయించారు. మిత్రుడిని కోల్పోయిన ఆవేదనలో వ్యాఖ్యానించానని, ఆయనకు ఎలాంటి దురుద్దేశం లేదని మన్సూర్ తరఫు న్యాయవాదులు కోర్టుకు విన్నవించారు. ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరారు. దీనిపై కోర్టు మంగళ లేదా బుధవారాల్లో విచారించే అవకాశముంది. చదవండి: ప్రభుత్వాలకు ధన్యవాదాలు: నటుడు వివేక్ సతీమణి వ్యాక్సిన్‌కు, వివేక్ మృతికి సంబంధం లేదు -
ప్రియుడితో నయనతార.. ప్రత్యేక విమానంలో
చెన్నై: కోలీవుడ్‌లో సంచలన జంట ఎవరంటే నయనతార, దర్శకుడు విఘ్నేష్ శివన్ అని ఠక్కున సమాధానం వస్తుంది. ఈ జంట పెళ్లి చేసుకోరు. కనీసం ప్రేమించుకుంటున్నాం అని కూడా చెప్పరు. అయినా సహజీవనం చేస్తున్నారు. కలిసి ఏ దేశానికి విహారయాత్రలకు వెళ్లినా, పుట్టిన రోజు, రెండు రోజు వేడుకలను జరుపుకున్నా వెంటనే ఆ ఫొటోలను మీడియాకు విడుదల చేసి వార్తల్లో చర్చనీయాంశంగా మారుతుంటారు. కాగా ప్రస్తుతం మరోసారి ఈ సంచలన జంట వార్తల్లోకెక్కారు. శనివారం చెన్నై నుంచి ప్రత్యేక చార్టెడ్ ఫ్లైట్‌లో కొచ్చిన్‌కి వెళ్లారు. ఆ ఫొటోలను దర్శకుడు విఘ్నేష్ శివన్ తన ట్విటర్లో పోస్ట్ చేశారు. ప్రయాణానికి సంబంధించిన వీడియోను నయనతార తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పంచుకున్నారు. ఇదంతా ఇలా ప్రత్యేక విమానంలో వెళ్లడం రెండోసారి. గత ఏడాది ఓనం పండుగ వేడుకలను జరుపుకోవడానికి నయనతార చెన్నై నుంచి కొచ్చిన్‌కు ప్రత్యేక విమానంలో వెళ్లారు. తాజాగా ఈ నెల 14వ తేదీన కొత్త సంవత్సరాన్ని కేరళీయులు విషు వేడుక పేరుతో ఘనంగా జరుపుకుంటారు. ఆ వేడుక జరుపుకోవడానికి నయనతార, విఘ్నేష్ శివన్ ప్రత్యేక విమానంలో వెళ్లారు. చదవండి: నీటి లోపల మెహరీన్ లవ్ ప్రపోజల్ -
‘యాగం చేస్తేనే కరోనా అంతం, మోదీని డబ్బులడిగితే ఇవ్వలేదు’
చెన్నై: నటుడు రజినీకాంత్ రాజకీయాల గురించి పదిహేనేళ్ల క్రితం చెప్పానని రాజగురు బ్రహ్మశ్రీ గురువాయూర్ సూర్యన్ నంబూద్రి స్వామి పేర్కొన్నారు. అంతే కాకుండా ప్రధాని నరేంద్ర మోదీ, హిందూ మతాధిపతులు తమిళనాడు ముఖ్యమంత్రి పలువురిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. నాలుగు వేదాల్లో నిష్ణాతులైన ఈయన కరోనా మహమ్మారిని తరిమికొట్టడానికి ధరణి రక్ష మహాయాగం చేయ తలపెట్టారు. అయితే అందుకు ప్రధానమంత్రి నుంచి కోట్లాది ఆస్తి కలిగిన పీఠాధిపతుల వరకు ఎవరు ఆర్థిక సాయం చేయలేదని విమర్శించారు. యాగాన్ని జరిపిస్తే కరోనా వ్యాధి తగ్గిపోతుందన్నారు. అలా ఆరు నెలలపాటు తాను యాగాన్ని నిర్వహించాలని, తర్వాత ఆర్థిక స్థోమత లేక నిలిపివేసినట్లు తెలిపారు. సూర్యన్ నంబూద్రి స్వామి శనివారం సాయంత్రం చెన్నైలో మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుతం అధర్వన వేదం నడుస్తోందని, కరోనా వ్యాధి వ్యాప్తికి ఇంద్రాది దేవతల ఆగ్రహం కారణమని పేర్కొన్నారు. ఈ వ్యాధిని తగ్గించడానికి ధరణి రక్ష మహా యాగం చేస్తే ప్రపంచ జనాన్ని కాపాడవచ్చని. ఇది ఖర్చుతో కూడిన యాగం కావడంతో తాను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి సహా దేశంలోని పీఠాధిపతులందరికీ సాయం కోసం లేఖలు రాశారు. అయితే ఎవరు స్పందించలేదన్నారు. సంతోషాల కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేసి యాగాలు చేయించే వాళ్లు దేశ ప్రజల కోసం తాను తలపెట్టిన ధరణి రక్ష యాగానికి సహకరించకపోవడం శోచనీయమన్నారు. హిందువుల పరిరక్షణ తమ ధ్యేయమని చెప్పుకునే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా తన లేఖకు స్పందించలేదని విమర్శించారు. చదవండి: కరోనాతో కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి మృతి -
తమిళ నటుడుపై ఫిర్యాదు
చెన్నై : నటుడు యోగిబాబుపై చెన్నై పోలీసు కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు నమోదైంది. హాస్య నటుడి నుంచి కథానాయకుడు స్థాయికి ఎదిగిన నటుడు యోగిబాబు. కాగా ఇటీవల ఆయన ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం. ఇందులో నటుడు యోగిబాబు నాయీ బ్రాహ్మణుడి పాత్రలో నటించారు. మండేలా చిత్రం ఇటీవలే విడుదలైంది. ఈ చిత్రంలోని పలు సన్నివేశాలు నాయీబ్రాహ్మణులను కించపరిచే విధంగా ఉన్నాయంటూ తమిళనాడు నాయీ బ్రాహ్మణ కార్మికుల సంక్షేమ సంఘం నిర్వాహకులు శుక్రవారం చెన్నై పోలీసు కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. అందులో వారు పేర్కొంటూ మండేలా చిత్రంలో నాయీ బ్రాహ్మణ కార్మికులను కించపరిచే విధంగా పలు సన్నివేశాలు చోటుచేసుకున్నాయని, అదేవిధంగా వైద్య సామాజిక వర్గానికి చెందిన 40 లక్షల మంది మనోభావాలకు భంగం కలిగే విధంగా సన్నివేశాలు ఉన్నాయని పేర్కొన్నారు. కాబట్టి మండేలా చిత్ర దర్శక నిర్మాతలు అందులో నటించిన యోగిబాబులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. చదవండి: సరదా మాటలు.. రొమాంటిక్ పాటలు! -
సీనియర్ నటుడికి అత్యవసర చికిత్స
చెన్నై: సీనియర్ నటులు కార్తీక్‌కు వైద్యులు అత్యవసర వైద్య చికిత్స అందిస్తున్నారు. బహుభాషా నటుడు కార్తీక్ చాలాకాలం క్రితమే రాజకీయ రంగప్రవేశం చేశారు. అయితే కొంతకాలం తర్వాత ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చారు. చాలా గ్యాప్ తర్వాత కార్తీక్ మళ్లీ సినిమాల్లో నటించడం మొదలు పెట్టారు. అలాంటిది ఇటీవల జరిగిన రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో ఆయన అన్నాడీఎంకే పార్టీకి ప్రచారం చేస్తారని ప్రకటించారు. అన్నట్టుగానే ప్రచారంలో పాల్గొన్న కార్తీక్ గత నెల 21న అనూహ్యంగా అనారోగ్యానికి గురయ్యారు. దీంతో ఆయన్ను కుటుంబ సభ్యులు స్థానిక ఒక ప్రైవేట్ హాస్పిటల్లో చేర్చారు. శ్వాస సంబంధిత సమస్యలతోపాటు, రక్తపోటు కారణంగా కార్తీక్ అనారోగ్యానికి గురైనట్లు వైద్యులు గుర్తించారు. దీంతో ఆయన కొన్ని రోజులు ఆస్పత్రిలోనే వైద్య చికిత్సలు పొంది ఆరోగ్యం చేకూరడంతో ఇంటికి వచ్చారు. ఆ తర్వాత కూడా కార్తీక్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. అలా ఇటీవల ప్రచార కార్యక్రమాలు ముగించుకొని తిరిగి రాగా మళ్లీ అనారోగ్యానికి గురయ్యారు. దీంతో కార్తీక్‌ను మళ్లీ ఆస్పత్రిలో చేర్చారు. ప్రస్తుతం ఆయన అత్యవసర చికిత్స వార్డులో చికిత్స పొందుతున్నారు. వైద్యులు ఆయనకు కరోనా పరీక్ష నిర్వహించగా నెగిటివ్ అని తేలింది. అయినా కార్తీక్ శ్వాసకోశ సమస్య తీవ్రత తగ్గలేదు. ప్రస్తుతం ఆయన వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు. చదవండి: మళ్లీ అనారోగ్యానికి గురైన సీనియర్ నటుడు కార్తీక్ -
హీరోయిన్ను రక్షించిన విలన్, సినిమాలో కాదు
చెన్నై: హీరోయిన్ను కాపాడిన విలన్ చిత్ర యూనిట్ అభినందనలు పొందారు. ఆ సంగతేంటో చూద్దాం. లింక్ క్రియేషన్స్ పతాకంపై హేమవతి ఆర్ నిర్మిస్తున్న చిత్రం ఓట్టం. సస్పెన్స్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ద్వారా దివంగత ప్రముఖ దర్శకుడు రామనారాయణన్ శిష్యుడు ఎన్.మురుగన్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. అదేవిధంగా ఈ చిత్రం ద్వారా సంగీత దర్శకుడు ప్రదీప్ వర్మ కథానాయకుడిగా అవుతున్నారు. ఆయనకు జంటగా బెంగళూరుకు చెందిన మోడల్ ఐశ్వర్య సిందోషి నటిస్తుండగా, మరో నాయికగా కేరళకు చెందిన అనుశ్రేయ నటిస్తున్నారు. రవిశంకర్ అనే నటుడు విలన్‌గా పరిచయం అవుతున్నారు. అయితే ఆయన ఆ చిత్ర హీరోయిన్ మాత్రం నిజజీవితంలో హీరోగా మారారు. ఆమెను రియల్ లైఫ్‌లో పలు ఆపదల నుంచి రక్షించారు. ముఖ్యంగా చిత్ర కథానాయకి ఐశ్వర్య సిందోషి చిత్రంలోని పాటల సన్నివేశాలకు డ్రెస్ కొనుగోలు చేయడానికి బెంగళూరులోని ఒక పెద్ద షాపింగ్ మాల్‌కు వెళ్లారు. ఆమెతో పాటు నటుడు రవిశంకర్ కూడా వెళ్లారు. అయితే అక్కడ కొందరు పోకిరోళ్లు నటి ఐశ్వర్య సిందోషిను ఎగతాళి చేస్తూ వేధింపులకు గురి చేశారు. దీంతో ఆమె వెంట ఉన్న రవిశంకర్ వారిని అడ్డుకొని చెంప చెళ్లుమనిపించి ఇక్కడ నుంచి వెళ్లకపోతే పోలీసులకు పట్టిస్తానని హెచ్చరించడంతో వాళ్లు అక్కడి నుంచి పారిపోయారు. దీంతో హీరోయిన్ కాపాడిన విలన్ జయశంకర్ చిత్రం యూనిట్ అభినందించారు. చదవండి: 'శ్రీదేవి.. బ్యూటీ ఐకాన్' -
ఇది వీరప్పన్ కథ కాదు!
చెన్నై : మా వీరన్ పిళ్లై.. వీరప్పన్ కథ కాదని చిత్రయూనిట్ స్పష్టం చేసింది. వీరప్పన్ కుమార్తె విజయలక్ష్మి కథానాయకిగా నటిస్తున్న చిత్రం ‘మా వీరన్ పిళ్లై’. కేఎన్ఆర్ మూవీస్ పతాకంపై కేఎన్ఆర్ రాజా స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న ఈ చిత్రానికి రవివర్మ సంగీతం అందిస్తుండగా మంజునాథ్ చాయాగ్రాహకుడిగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే నిర్మాణం పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలోనే తెరపైకి వచ్చేందుకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా చిత్రవిశేషాలను విజయలక్ష్మి శుక్రవారం మీడియాకు వివరించారు. వీరప్పన్ కథకు మావీరన్ పిళ్లై చిత్రానికి ఎలాంటి సంబంధం లేదన్నారు. ఇది ఒక జాతికి చెందిన కథ అంటూ సాగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని తెలిపారు. సమాజంలోని సమస్యలను ఆవిష్కరించే కథతో ఈ చిత్రం రూపొందిందని వెల్లడించారు. ఇందులో తాను న్యాయవాదిగా నటించినట్లు చెప్పారు. ఢిల్లీలో రైతుల పోరాటం. ప్రేమలో మోసపోయిన యువతుల సమస్యలు, ఇతర సామాజిక అంశాలను స్పృశించినట్లు వివరించారు. నిర్మాత మాట్లాడుతూ సెన్సార్ పూర్తి చేసుకున్న మావీరన్ పిళ్లైను త్వరంలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు. చదవండి: నా ఆరోగ్యం బాగుంది! -
ఓటు వేయకపోవడానికి కారణం ఇదే: పార్థిబన్
సాక్షి, చైన్నై: రాష్ట్ర శాసనసభ ఎన్నికలు మంగళవారం జరిగిన విషయం తెలిసిందే. అయితే అతి తక్కువ మంది చిన్ని తారలు ఓటు వేయలేకపోయారు. అందులో నటుడు, దర్శకుడు పార్థిబన్ ఒకరు. కాగా పార్థిబన్ ఓటు హక్కును వినియోగించుకోకపోవడానికి గల కారణాన్ని బుధవారం ట్విట్టర్ ద్వారా వివరించారు. అందులో ఆయన పేర్కొంటూ తాను ఇటీవల కోవిడ్ వ్యాక్సిన్‌ను రెండవ సారి వేసుకున్నానన్నారు. అయితే వ్యాక్సిన్ కారణంగా ఎలర్జీ కలిగి ముఖమంతా వాచిపోయిందన్నారు. దీంతో తన ఫొటోలు వైద్యులకు పంపి వైద్య చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. ఈ కారణంగానే తాను ఓటు హక్కును వినియోగించుకోలేకపోయానని వివరించారు. అయితే అందరూ తప్పనిసరిగా కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకోవాలని, అతి కొద్ది మందికి మాత్రమే వ్యాక్సిన్ కారణంగా ఎలర్జీ కలుగుతుందని, తనకు ఇంతకు ముందే ఎలర్జీ సమస్య ఉండడంతో ఇలా జరిగిందని పార్థిపన్ తెలిపారు. చదవండి: అలా అనుకున్నాను కాబట్టే ఇంత దూరం వచ్చా! -
మళ్లీ అనారోగ్యానికి గురైన సీనియర్ నటుడు కార్తీక్
చెన్నై: సీనియర్ నటుడు కార్తీక్ మరోసారి అనారోగ్యానికి గురయ్యారు. కార్తీక్ అనూహ్యంగా రాజకీయ రంగప్రవేశం చేసి సొంతంగా పార్టీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే కొంతకాలం తర్వాత రాజకీయాలకు దూరమైన ఆయన పార్టీని కూడా రద్దు చేశారు. ఇటీవల అన్నాడీఎంకే పార్టీకి మద్దతుగా ప్రచారం చేయనునట్లు ప్రకటించారు. కాగా కార్తీక్ అనూహ్యంగా అనారోగ్యానికి గురై గత నెల 21న చెన్నైలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేసిన వైద్యులు కార్తీక్ ను కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోవాల్సిందిగా సూచించారు. కార్తీక్ ఇటీవల మళ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. సోమవారం సాయంత్రం ప్రచారం ముగించుకుని ఇంటికి చేరుకున్న కార్తీక్ మరోసారి అనారోగ్యానికి గురయ్యారు. కుటుంబసభ్యులు వెంటనే ఆయన్ను అడయార్‌లోని ప్రైవేట్ హాస్పిటల్లో చేర్చారు. కార్తీక్ శ్వాసకోస సంబంధిత సమస్యతో పాటు, అధిక రక్తపోటుకు గురైనట్లు వైద్యులు తెలిపారు. చదవండి: కృతీ శెట్టి డ్యాన్స్ వీడియో చూశారా? -
ఆసక్తి రేపుతున్న విశాల్ కొత్త సినిమా పోస్టర్
చెన్నై: దక్షిణాది సినీ రంగంలో ప్రముఖ కథానాయకుల్లో ఒకరు విశాల్. కథానాయకుడిగా నిర్మాతగా రాణిస్తున్న విశాల్ తాజాగా మరో కొత్త చిత్రానికి సిద్ధమవుతున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన వివరాలను విశాల్ శుక్రవారం సాయంత్రం మీడియాకు వెల్లడించారు. నాట్ ఏ కామన్ మెన్ అనే చిత్రాన్ని తన విశాల్ ఫిలిం ఫ్యాక్టరీ పతాకంపై నిర్మిస్తున్న కథానాయకుడిగా నటించనున్నట్లు పేర్కొన్నారు. ఈ చిత్రం ద్వారా టీపీ.శరవణన్ అనే కొత్త దర్శకుని పరిచయం చేస్తున్నట్లు తెలిపారు. కుళ్లనరి కూట్టం, తేన్ చిత్రాలకు సహాయ దర్శకుడిగా పనిచేసిన సన్రవణన్ ఎదు తేవయో అదువే ధర్మం అనే లఘు చిత్రానికి దర్శకత్వం వహించారు. ఇది పలువురు సినీ ప్రముఖుల ప్రశంసలను అందుకుంది. ఈ లఘు చిత్రం చూసే శరవణన్‌కు దర్శకత్వం అవకాశం ఇచ్చినట్లు విశాల్ తెలిపారు. దీనికి యువన్ శంకర్ రాజా సంగీతాన్ని, బాలసుబ్రమణియం ఛాయాగ్రహణం అందిస్తున్నారని చెప్పారు. అధికారం బలం కలిగిన వ్యక్తిని ఎదిరించి ఒక సామాన్యుడి కథే నాట్ ఏ కామన్ మెన్ చిత్రం అని పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలోనే సెట్ పైకి వెళ్లనుందని తెలిపారు. ఇందులో నటించనున్న కథానాయికి, నటీనటులు ఎంపిక జరుగుతోందని ఆయన చెప్పారు. చదవండి: వెండితెరపై అందాల పుట్టుమచ్చ -
రాజకీయ వ్యవస్థకు అద్దం పట్టేలా ‘మండేలా’
చెన్నై: నేటి రాజకీయ వ్యవస్థకు అద్దం పట్టేలా రూపొందించిన చిత్రం మండేలా. వై నాట్ స్టూడియోస్, రిలయన్స్ ఎంటర్టెయిన్మెంట్, విష్ బెరీ ఫిలిమ్స్, ఎల్ ఎల్ పీ సంస్థల సమర్పణలో యాన్ ఓపెన్ వీడియో ప్రొడక్షన్ సంస్థ నిర్మించిన చిత్రం మండేలా. నటుడు యోగిబాబు కథానాయకుడిగా నటించిన ఈ చిత్రంలో సంగిలి మురుగన్, జీఎం సుందర్, నటి షీలా రాజ్‌కుమార్, కన్నరవి ప్రధాన పాత్రలు పోషించారు. దీనికి కథ, దర్శకత్వ బాధ్యతలను మడోనా అశ్విన్ నిర్వహించారు. ఎస్ శశికాంత్ నిర్మించిన ఈ చిత్రానికి చక్రవర్తి రామచంద్ర సహా నిర్మాతగా వ్యవహరించారు. దర్శకుడు బాలాజీ మోహన్ క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహించారు. దీనికి భరత్ శంకర్ సంగీతాన్ని, విదు ఆయ్యన్న ఛాయాగ్రహణం అందించారు. ఒక గ్రామ పంచాయతీ ఎన్నికలు విజయవంతంగా రూపొందించిన చిత్రం మండేలా. ఆ గ్రామ ప్రెసిడెంట్‌కు ఇద్దరు భార్యలు ఉంటారు. ఐదుగురు కొడుకులు తర్వాత ప్రెసిడెంట్ బాధ్యతను తమకంటే తమకు కట్టపెట్టాలని తండ్రిపై ఒత్తిడి తీసుకొస్తారు. చివరికి ఇద్దరు ప్రెసిడెంట్ పదవికి పోటీకి సిద్ధమవుతారు. రెండు వర్గాలకు ఓటర్లు సరి సమానంగా ఉంటారు. అలాంటి సమయంలో ఆ గ్రామంలో ఉన్న ఒక నాయీబ్రాహ్మణ యువకుడి ఓటు కీలకంగా మారుతుంది. అతని ఓటు కోసం వారు పడే పాటులేమిటన్నదే మండేలా చిత్రం. నేటి సమకాలీన రాజకీయాలకు అద్దంపట్టేదిగా దర్శకుడు మండేలా చిత్రాన్ని తీర్చిదిద్దారు. చదవండి: వీరప్పన్ కూతురు కథానాయికగా తెరంగేట్రం -
వీరప్పన్ కూతురు కథానాయికగా తెరంగేట్రం
చెన్నై: గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ గురించి ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తమిళనాడు, కర్ణాటక ప్రభుత్వాలను గడగడలాడించిన వీరప్పన్‌ను ఎట్టకేలకు 2004లో తమిళనాడు ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ అధికారులు కాల్చి చంపిన విషయం తెలిసిందే. గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ గురించి ఇప్పటికే పలు భాషల్లో చిత్రాలు రూపొందాయి. కాగా వీరప్పన్‌కు ఇద్దరు కూతుర్లు ఉన్నారు. వారిలో పెద్ద కూతురు విద్యారాణి ఇటీవలే బీజేపీ పార్టీలో చేరారు. ఇక రెండవ కూతురు విజయలక్ష్మి తమిళ్వురిమై పార్టీలో చేరారు. ఇప్పుడు ఆమె సినీ రంగ ప్రవేశం చేసి కథానాయికగా అవతారమెత్తారు. విజయలక్ష్మి కథానాయికగా నటిస్తున్న చిత్రానికి మావీరన్ పిళ్లై అనే టైటిల్‌ని నిర్ణయించారు. కేఎన్ఆర్ మూవీస్ పతాకంపై కేఎన్ఆర్. రాజ్శ్రీ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దీనికి రవివర్మ సంగీతాన్ని, మంజునాథ్ ఛాయాగ్రహణం అందిస్తున్నారు. ఈ చిత్ర ఫస్ట్‌లుక్ శుక్రవారం విడుదల చేశారు. విశేషమేమిటంటే మావీరన్ పిళ్లై చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్లో విజయలక్ష్మి తండ్రి వీరప్పన్ గెటప్‌లో భుజాన తుపాకీ పట్టుకొని నిలబడ్డారు. దీంతో ఈ చిత్రం కూడా గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో సాగే కథ అని తెలుస్తోంది. ఈ చిత్రంతో వీరప్పన్ వారసురాలు సినీరంగంలో ఎలాంటి పేరును సంపాదించుకుంటారో చూడాలంటే మరి కొద్ది రోజులు ఆగాల్సిందే. చదవండి: మలైకాకు కోవిడ్ వ్యాక్సిన్ -
నటుడు ఆర్యకు ముందస్తు బెయిల్ ఇవ్వొద్దు!
సాక్షి, చెన్నై: తమిళ నటుడు ఆర్యకు ముందస్తు బెయిల్ మంజూరు చేయకూడదని శ్రీలంకకు చెందిన మహిళ మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జెమినిలో నివసిస్తున్న శ్రీలంకకు చెందిన ఓ యువతి ఆర్య తనను వివాహం చేసుకుంటానని చెప్పి రూ.70 లక్షలు తీసుకుని మోసం చేశారని ఆరోపిస్తూ పీఎం, సీఎం, హోం మినిస్టర్ కార్యాలయాలకు లేఖ రాశారు. దీంతో ఆర్య అనుచరుడు మహమ్మద్ అర్మన్ ముందస్తు బెయిల్ కోరుతూ మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే వారికి బెయిల్ ఇవ్వకూడదని కోరుతూ యువతి మరో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ శుక్రవారం న్యాయమూర్తి సెల్వ కుమార్ సమక్షంలో విచారణకు వచ్చింది. విచారణను ఏప్రిల్ 4వ తేదీకి వాయిదా వేశారు. చదవండి: షారుఖ్‌తో సినిమా.. ముంబైలో ఆఫీస్ వెతుకుతున్న డైరెక్టర్ -
కొత్త చిత్రానికి హీరో సూర్య శ్రీకారం
నటుడు సూర్య నిర్మాతగా మారి 2డీ ఎంటర్టెయిన్మెంట్ పతాకంపై తాజాగా 14వ చిత్రానికి ఆదివారం పూజా కార్యక్రమాలతో శ్రీకారం చుట్టారు. చెన్నై గోకులం స్టూడియోలో ప్రారంభమైన చిత్రానికి మద్రాసు హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి కె. వెంకటరామన్, తమిళనాడు తుపాకీ షూటింగ్ సంఘ కార్యదర్శి ఆర్. రవికృష్ణన్, చిత్ర సహనిర్మాత రాజశేఖర్ కర్పూర పాండియన్ హాజరయ్యారు. ఇందులో రమ్యా పాండియన్ కథానాయికగా నటిస్తున్నారు. చిత్రానికి అరిసిల్ మూర్తి దర్శకత్వం వహిస్తున్నారు. గాయకుడు క్రిష్ సంగీత దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రానికి సుకుమార్ ఛాయాగ్రహణం అందిస్తున్నారు. -
కేసు వెనక్కి తీసుకున్న ఇళయరాజా!
సంగీత దర్శకుడు ఇళయరాజా తన కేసును వెనక్కి తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. ఇళయరాజా 40 ఏళ్లకు పైగా స్థానిక సాలిగ్రామంలోని ప్రసాద్ స్టూడియోలో సంగీత కార్యక్రమాలు నిర్వహిస్తున్న గదిని ఖాళీ చేయాలంటూ ప్రసాద్ స్టూడియో అధినేతలు ఒత్తిడి చేశారు. ఇళయరాజా ఈ విషయమై మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో స్టూడియో అధినేతలు ఇళయరాజాకు వ్యతిరేకంగా కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. చదవండి: ఇళయరాజాకు ఎందుకు అనుమతివ్వరు న్యాయమూర్తి ఎన్.సతీష్‌కుమార్ ఒక రోజు ధ్యానం చేసుకోవడానికి ఇవ్వాలన్న ఇళయరాజా కోరికను ఎందుకు అంగీకరించరని ప్రసాద్ స్టూడియో అధినేతలను ప్రశ్నించారు. అందుకు స్టూడియో అధినేతలు ఇళయరాజా తమపై పోలీసులకు ఫిర్యాదు చేశారని బదులిచ్చారు. దీనికి బదులివ్వాల్సిందిగా ఇళయరాజాను న్యాయమూర్తి ఆదేశించారు. దీంతో తన పిటిషన్‌ను వెనక్కి తీసుకుంటున్నట్టు ఇళయరాజా బుధవారం కోర్టుకు తెలిపారు. దీంతో న్యాయమూర్తి కేసును కొట్టివేశారు. -
విలన్‌గా మారిన దర్శక నిర్మాత
సినీరంగంలో ఒక శాఖలో పేరు తెచ్చుకున్న వ్యక్తి మరో శాఖలో ప్రవేశించడం సులభమే. అయితే అన్ని శాఖల్లోనూ రాణించడం అంత సులభం కాదు. అలాంటిది పదమ్ కుమార్ మాత్రం ఇందుకు అతీతం అనే చెప్పాలి. ఈయన ప్రముఖ ఛాయాగ్రాహకుడు. అంతేకాకుండా భారతీయ సినీ దర్శకుడు, నిర్మాత కూడా. అంతకుమించి పదమ్ కుమార్ తండ్రి హెచ్ఎస్.వేణు దివంగత ప్రఖ్యాత దర్శకుడు విఠలాచార్య దర్శకత్వం వహించిన తెలుగు చిత్రాలకు ఛాయాగ్రహణ అందించారు. కాగా పదమ్ కుమార్ కూడా హిందీ, తెలుగు, కన్నడ చిత్రాలకు చాయాగ్రాహకుడిగా పనిచేశారు. బాలీవుడ్ ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ యష్‌రాజ్ ఫిలిమ్స్ నిర్మించిన దక్షిణాది చిత్రాలకు ఈయన నిర్మాణ నిర్వహణ బాధ్యతలను నిర్వహించారు. అలా 2014లో నాని, వాణీకపూర్ జంటగా నటించిన తెలుగు చిత్రం ఆహా కళ్యాణం పదం కుమార్ నిర్మాణ సారథ్యంలోనే రూపొందింది. అదేవిధంగా తమిళ్లో శింబు, వరలక్ష్మి జంటగా నటించిన పోడాపోడీ చిత్రాన్ని నిర్మించి నయనతార ప్రియుడు విఘ్నేష్ శివన్‌ను దర్శకుడిగా పరిచయం చేసింది ఈయనే. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రపంచ సుందరి ఐశ్వర్యరాయ్‌ని మొదటిసారిగా సినిమాకు పరిచయం చేసిన నిర్మాత కూడా పదమ్ కుమార్‌నే. ఈయన కథా రచయిత కూడా. అన్ని శాఖల్లో ప్రావీణ్యం కలిగిన పదమ్ కుమార్ తాజాగా నటుడి అవతారమెత్తారు. ఇటీవల ఓటీటీలో వడుదలై విశేష ప్రేక్షకాదరణ పొందుతున్న పావ కథైగళ్ సిరీస్‌లో నిలవ్ పన్న ఉట్రనుమ్ సెగ్మెంట్లో విలన్ పాత్రల్లో నటించి అందరి ప్రశంసలను అందుకున్నారు. విశేషమేంటంటే తాను దర్శకుడిగా పరిచయం చేసిన విఘ్నేష్ శివన్నే పదమ్ కుమార్‌ను ఈ సిరీస్ ద్వారా నటుడిగా పరిచయం చేశారు. -
కమల్ సినిమాలో మలయాళ హీరో విలన్!
‘ఖైదీ, మాస్టర్’ చిత్రాల దర్శకుడు లోకేశ్ కనగరాజ్ డైరెక్షన్లో కమల్‌హాసన్ ఓ సినిమా కమిట్ అయిన సంగతి తెలిసిందే. నవంబర్‌లో కమల్ పుట్టినరోజున ఈ సినిమా టీజర్, టైటిల్‌ను విడుదల చేశారు. యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ సినిమా తెరకెక్కనుంది. ఇందులో విలన్‌గా మలయాళ హీరో ఫాహద్ ఫాజిల్ కనిపిస్తారనే వార్తలు వస్తున్నాయి. ఆ మధ్య సూపర్ డీలక్స్’ వేలైకారన్’ వంటి తమిళ సినిమాల్లో నటించారు ఫాహద్. ‘వేలైకారన్’లో చేసిన విలన్ పాత్ర ఫాహద్ కి మంచి పేరు తెచ్చింది. -
కోలీవుడ్: సిల్క్ స్మితగా అనసూయ..
సాక్షి, హైదరాబాద్: జబర్దస్త్ యాంకర్‌గా బుల్లితెరపై తళుక్కుమన్న అనసూయ భరద్వాజ్ అవకాశం వచ్చినప్పడల్లా వెండితెరపై మెరుస్తున్నారు. అయితే సినిమాల సెలక్షన్స్‌లలో ఆనసూయ ఆచితూచి అడుగు వేస్తున్నారు. గ్లామర్ అయినా డీగ్లామరైన పాత్ర నచ్చితేనే ఒకే చెబుతారు. లేదంటే ఎంత పెద్ద దర్శకుడికైన మొహమాటం లేకుండా నో అంటారు. ఈ క్రమంలో ‘రంగస్థలం’లో రంగమ్మత్త క్యారెక్టర్లో నటించి మంచి మార్కులు కొట్టెసిన అనసూయ తాజాగా కోలీవుడ్‌లో కూడా అడుగు పెడుతున్న విషయం తెలిసిందే. తమిళ సూపర్ స్టార్ విజయ్ సేతుపతితో కలిసి ఓ చిత్రంలో నటిస్తున్నారు. అయితే ఈ చిత్రానికి సంబంధించిన తాజా అప్డేట్ను ఆదివారం సోషల్ మీడియలో పోస్టు చేశారు అనసూయ. తన ఇన్‌స్టాగ్రామ్‌లో బ్లాక్ అండ్ వైట్ ఫొటో షేర్ చేస్తూ.. ‘మరో మంచి కథ.. కొత్త ఆరంభం.. కోలీవుడ్’ అనే క్యాప్షన్ జత చేశారు. అంతేగాక రిఫరెన్స్ సిల్క్ స్మిత గారు అంటూ ఆమె పేరును ట్యాగ్ చేశారు. ఈ ఫొటోలో అనసూయ అద్దంలో తన రూపాన్ని చూసుకుంటూ ఫొజు ఇచ్చి కనిపించారు. (చదవండి: సేతుపతితో రంగమ్మత్త?!) View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) అయితే విజయ్ సేతుపతితో కలిసి నటిస్తున్న ఈ సినిమా నాటి గ్లామర్ బ్యూటీ సిల్క్ స్మిత బయోపిక్‌గా రూపొందనుందని ఇందులో అనసూయ లీడ్‌రోల్ పోషిస్తున్నట్లు సమచారం. అనసూయ ఇప్పటికే చిరంజీవి, కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కుతున్న 'ఆచార్య' సినిమాలో కీలక పాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. అంతేగాక కృష్ణవంశీ ‘రంగమార్తాండ’లో కూడా ఆమె ఓ స్పెషల్ రోల్ చేయనున్నారు. ఇప్పుడు తాజాగా మాస్ మహారాజు రవితేజ 'ఖిలాడీ' చిత్రంలో ముఖ్య పాత్రలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ‘రాక్షసుడు’ ఫేమ్ రమేష్ వర్మ తెరకెక్కిస్తున్న 'ఖిలాడి' చిత్రం ఫస్ట్‌లుక్ పోస్టర్ ఇటీవలే విడుదలైన విషయం తెలిసిందే. దీనికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. రవితేజ డబుల్ రోల్ చేస్తున్న ఈ సినిమాలో మీనాక్షి చౌదరి, డింపుల్ హయాతి హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ఇందులో అనసూయ ముఖ్య పాత్ర పోషించడమే కాక ఓ స్పెషల్ సాంగ్‌లో రవితేజతో కలిసి చిందులేయన్నారంట. (చదవండి: అందుకే అనసూయ పాత్రను తిరస్కరించాను: రాశి) -
జీవీ నుంచి మరో హాలీవుడ్ సాంగ్
సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్‌కుమార్ రూపొందించిన హాలీవుడ్ ఆల్బమ్ నుంచి మరో ఇంగ్లిష్ సాంగ్ విడుదలకు సిద్ధమైంది. సంగీత దర్శకుడిగా, నటుడిగా కోలీవుడ్‌లో విజయవంతమైన పయనాన్ని సాగిస్తున్న జీవీ ఇప్పుడు ఇంగ్లిషు పాటల ఆల్బమ్‌తో హాలీవుడ్ సంగీత ప్రియులను కూడా అలరించడానికి సిద్ధమయ్యారు. ఈయన సూరరై పోట్రు చిత్రానికి సంగీతాన్ని అందించిన విషయం తెలిసిందే. ఈ చిత్రం దీపావళి సందర్భంగా అమెజాన్ ప్రైమ్ టైంలో విడుదలై సంచలన విజయాన్ని అందుకుంటోంది. ఇందులో జీవీ సమకూర్చిన సంగీతానికి మంచి ప్రశంసలు వస్తున్నాయి. జీవీ ఇటీవల ‘గోల్డ్ నైట్స్’ పేరుతో ఒక ఇంగ్లిష్ ఆల్బమ్‌ను రూపొందించారు. అందులోని ‘హై అండ్ డ్రై’ అనే పాటను గత సెప్టెంబర్ 17వ తేదీన విడుదల చేయగా యువతను విశేషంగా ఆకట్టుకుంది. దీంతో అదే ఆల్బంలోని ‘క్రయింగ్ అవుట్’ అనే మరో పాటను ఈనెల 19న నటుడు ధనుష్ చేతుల మీదగా విడుదల చేయడానికి సిద్ధమయ్యారు. ఈ పాటను జీవీ, కెనడాకు చెందిన జూలియా గర్దా కలిసి పాడడం విశేషం. -
నా ప్రేయసి వద్దకు వచ్చేశా
తమిళ హీరోల్లో ఏడాదికి మూడు సినిమాలు చేస్తుంటారు ధనుష్. ఎప్పటికప్పుడు సినిమాలను ప్రారంభిస్తూ, పూర్తి చేస్తూ బిజీబిజీగా ఉంటారాయన. కరోనా కారణంగా సుమారు ఏడు నెలలు షూటింగ్స్‌కు దూరమయ్యారు ధనుష్. ఆయన చేతిలో దాదాపు నాలుగు సినిమాలున్నాయి. తాజాగా మళ్లీ షూటింగ్ లొకేషన్లో అడుగుపెట్టారు. బాలీవుడ్ దర్శకుడు ఆనంద్ ఎల్. రాయ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘అత్రంగీ’. అక్షయ్ కుమార్, ధనుష్, సారా అలీ ఖాన్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ మొదలుపెట్టారు ధనుష్. కెమెరాతో దిగిన ఫోటోను పంచుకొని, ‘నా ప్రేయసి (కెమెరాని ఉద్దేశించి) దగ్గరకు తిరిగొచ్చేశాను’ అని పేర్కొన్నారు. -
‘నేను ఎక్కడైనా డాన్స్ చేయగలను’
నటిగా, గాయనిగా దక్షిణాదిలోనే కాక బాలీవుడ్‌లోనూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు శృతీహాసన్. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ శృతీ తన వృత్తిగత, వ్యక్తిగత విషయాలను అభిమానులతో పంచుకుంటారు. ఇటీవల శృతీ ఇన్‌స్టాగ్రామ్‌లో 14 మిలియన్స్ (కోటీ నలభై లక్షలు) ఫాలోయర్స్‌ని సంపాదించుకున్నారు. తాజాగా శృతీ అండర్ వాటర్ ఫొటో షూట్‌కు సంబంధించిన త్రోబ్యాక్(పాత) ఫొటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ‘నేను ఎక్కడైనా డాన్స్ చేయగలను. నేను కలగన్న ప్రదేశానికి వెళ్లగలను’ అని ఆమె ఫొటోలకు కామెంట్ జతచేశారు. ఆమె ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ ఫొటోల్లో శృతీహాసన్ ఎరుపు రంగు దుస్తుల్లో చేతికి బ్రాస్లెట్ ధరించి కనిపిస్తున్నారు. ఇక నీటి లోపల తాను డాన్స్ చేస్తూ పలు పోజులతో ఫొటో షూట్‌ను ఎంజాయ్ చేసినట్లు పేర్కొంది. (కొత్త పుస్తకం చదువుతున్న మహేశ్!) View this post on Instagram Reaching for tomorrow 🖤 A post shared by @ shrutzhaasan on Jun 26, 2020 at 11:24pm PDT ఇక సినిమా విషయాలకు వస్తే.. రవితేజ సరసన ‘క్రాక్’ సినిమాలో శృతీహాసన్ హీరోయిన్గా నటిస్తున్నారు. ఈ సినిమాను గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తుండగా.. ఠాగూర్ మధు నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో రవితేజ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తున్నారు. ఇక లాక్డౌన్ కారణంగా ఈ చిత్ర షూటింగ్ వాయిదా పడిన విషయం తెలిసిందే. (సినిమాలపై దావూద్ ప్రభావం) View this post on Instagram I can dance anywhere 🖤 A post shared by @ shrutzhaasan on Jun 26, 2020 at 11:24pm PDT -
ఆ హైదరాబాద్ వంటకం ఎంతో ఇష్టం
దేశ వ్యాప్తంగా అమలవుతున్న లాక్డౌన్ నేపథ్యంలో సినీ సెలబ్రిటీలు ఇంటికే పరిమితమైన విషయం తెలిసిందే. ఇక కొంతమంది వంట చేయటం నేర్చుకుంటూ అందులో ప్రావిణ్యం సంపాదిస్తున్నారు. మరికొంత మంది రకరకాల వెరైటీ వంటలు ట్రై చేస్తూ కుటుంబ సభ్యులను సంతోషపెడుతున్నారు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ వృత్తి, వ్యక్తిగత విషయాలను అభిమానులతో పంచుకునే సినీ సెలబ్రిటీల్లో హీరోయిన్ శృతి హాసన్ ముందు వరసలో ఉంటారన్న విషయం తెలిసిందే. అయితే తాజాగా శృతి హాసన్ తనకు ఎంతో ఇష్టమైన హైదరాబాద్ తెలుగు వంటకం ‘మామిడికాయ పప్పు’ను చేశారు. (తారక్‌కు బిగ్‌బాస్ హౌస్మేట్స్ స్పెషల్ విషెస్..) View this post on Instagram The EASIEST mango pappu!! I love this so much I had it for the first time when I visited Hyderabad as a kid and feel in love ❤️ it’s super easy to make hits make sure the raw mango turns translucent so you know it’s done ! Add spice according to your Taste but I keep it mild so I can proper taste the mango :) yummy 😋 A post shared by @ shrutzhaasan on May 19, 2020 at 2:28am PDT అదేవిధంగా తాను స్వయంగా చేసిన ‘మామిడికాయ పప్పు’ వీడియాను తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశారు శృతి హాసన్. ‘చాలా సులభంగా చేసే మామిడికాయ పప్పు నాకు చాలా ఇష్టం. నేను చిన్నతనంలో హైదరాబాద్‌కి మొదటిసారి వచ్చినప్పుడు ఈ మామిడికాయ పప్పును తిన్నాను. ఇక ఈ వంట చేయటం చాలా సులభం. మీ రుచికి తగినట్లు మసాలా వేస్తే చాలా బాగుంటుంది. నేను మాత్రం చాలా తక్కువగా మసాలాను వేస్తాను. ఎందుకంటే సహజమైన మామిడికాయ రుచిని ఆస్వాదించాలి’ అంటూ కామెంట్ జత చేశారు శృతి హాసన్. ఇక తాను లాక్డౌన్ సమయంలో సెల్ఫ్ క్వారంటైన్లో భాగంగా ఇంటికే పరిమితయ్యారు. ఇక సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం రవితేజ హీరోగా నటిస్తున్న ‘క్రాక్’ చిత్రంలో శ్రుతీహాసన్ హీరోయిన్గా నటిస్తున్న సంగతి తెలిసిందే. లాక్డౌన్ వల్ల ఈ సినిమా షూటింగ్ తాత్కాలికంగా నిలిచిపోయింది. -
సూర్యకు నిర్మాతల అండ
నటుడు, నిర్మాత సూర్య తన భార్య జ్యోతిక హీరోయిన్గా 2డి ఎంటర్టైన్మెంట్ పతాకంపై నిర్మించిన పొన్మగల్ వందాల్ చిత్రం లాక్డౌన్ కారణంగా విడుదల చేయలేని పరిస్థితి. దీంతో ఈ చిత్రాన్ని ఆన్లైన్లో విడుదల చేయడానికి సిద్ధమయ్యారు. ఈ చిత్రాన్ని అమేజాన్ సంస్థ విడుదల హక్కులను పొందింది.ఆన్లైన్లో చిత్రాన్ని విడుదల చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన థియేటర్ల అసోసియేషన్.. సూర్య నిర్మించే చిత్రాలను నిషేధిస్తున్నట్లు ప్రకటించింది. థియేటర్ల సంఘం తీసుకున్న నిర్ణయంపై నిర్మాతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. త్వరలో జరగనున్న నిర్మాతల సంఘం ఎన్నికల్లో అధ్యక్షుడిగా పోటీ చేయనున్న అమ్మ క్రియేషన్స్ టి.శివ ఒక ప్రకటన విడుదల చేశారు. అందులో ‘కరోనా కారణంగా చిత్ర పరిశ్రమ తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో పడిపోయింది. ఇలాంటి సమయంలో చిన్న చిత్రాల నిర్మాతలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వారిని ఆదుకునే విధంగా అమేజాన్ సంస్థ ఆన్లైన్లో విడుదల చేయడానికి ముందుకు రావడం స్వాగతించాల్సిన విషయం. అలాంటిది సూర్య నిర్మించిన పొన్మగల్ వందాల్ చిత్రాన్ని ఆన్లైన్లో విడుదల చేయడాన్ని థియేటర్ల సంఘం వ్యతిరేకించడం సరికాదు. పొన్మగల్ వందాల్ చిత్రంతో పాటు మరో ఐదు చిత్రాలను ఆన్లైన్లో విడుదల చేయడానికి నిర్మాతలు సిద్ధమవుతున్నారని అన్నారు. ఇది చిన్న నిర్మాతలకు లభించిన గొప్ప అవకాశం. ఈ విషయమై ప్రముఖ డిస్టిబ్యూటర్ తిరుపూర్ సుబ్రమణ్యం కూడా చర్చిద్దామని తెలిపారన్నారు. తాజాగా విజయ్ నటించిన మాస్టర్, సూర్య నటించిన సూరరైపొట్రి వంటి భారీ చిత్రాలను కూడా ఆన్లైన్లో విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నట్టు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరుగుతోంది. మాస్టర్ చిత్రాన్ని రూ. 130 కోట్లకు, అదే విధంగా సూరరైపోట్రు చిత్రాన్ని రూ. 55 కోట్లకు విక్రయించే విషయమై చర్చలు జరుగుతున్నట్టు సమాచారం. దీనిపై థియేటర్ల సంఘం ఆందోళన వ్యక్తం చేస్తోంది. -
సూర్య సినిమాలో పూజకు ఆఫర్!
‘అల వైకుంఠపురంలో’ సినిమా హిట్‌తో హీరోయిన్ పూజా హెగ్డే టాప్‌గేర్‌లో దూసుకుపోతున్నారు. ఈ సినిమాతో టాలీవుడ్లో బిజీ హీరోయిన్గా మారిన ఆమెకు కోలీవుడ్ అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా హీరో సూర్య, సింగం ఫేం డైరెక్టర్ హరి కాంబినేషన్లో తెరకెక్కనున్న‘అరువా’ చిత్రంలో పూజను హీరోయిన్గా తీసుకున్నట్లు సమాచారం. మొదటగా ఈ చిత్రానికి రష్మిక మందన్నను సంప్రదించగా.. కాల్షిట్లు సర్దుబాటు కాకపోవటంతో ఈ అవకాశం పూజను వరించినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. కాగా, ‘అరువా’ చిత్రాన్ని స్టూడియోగ్రీన్ సంస్థలో జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు. ఈ సినిమా పూర్తిస్థాయి యాక్షన్ మూవీగా తెరకెక్కనుంది. డి.ఇమామ్ సంగీతం అందిచనున్నారు. ఇక జీవా హీరోగా 2012లో వచ్చిన ‘ముంగమూడి’ సినిమాతో పూజా కోలీవుడ్‌లో అడుగుపెట్టిన విషయం తెలిసిందే. మరి సూర్య సరసన ఛాన్స్ కొట్టేసి ఆమె ఏ మేరకు సక్సెస్ సాధిస్తుందో చూడాలి. ప్రస్తుతం అక్కినేని అఖిల్ హీరోగా తెరకెక్కుతున్న ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ సినిమాలో పూజా హీరోయిన్గా నటిస్తోంది. -
ఏఆర్ రెహమాన్ కచ్చేరీలు రద్దు
ఏఆర్ రెహమాన్ సంగీత కచ్చేరీలు రద్దయ్యాయి. ఆయన ఎక్కువగా విదేశాల్లోనే సంగీత కచ్చేరీలు నిర్వహిస్తున్నారు. మే, జూన్ నెలల్లో ఉత్తర అమెరికాలో సంగీత విభావరి నిర్వహించడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ప్రస్తుత కరోనా ఎఫెక్ట్ ఆయన సంగీత కచ్చేరీలపైనా పడింది. అమెరికాలో సంగీత కచ్చేరీలు నిర్వహించడం తనకూ, తన సంగీత బృందానికి శ్రేయస్కరం కాదని భావించిన ఏఆర్ రెహమాన్ వాటిని రద్దు చేసుకున్నారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. (‘జుమాంజి’ నటికి కరోనా) నటుడు యోగిబాబు వివాహ రిసెప్షన్ వాయిదా అలాగే నటుడు యోగిబాబు వివాహ రిసెప్షన్ వాయిదా పడింది. ఆయన మంజుభార్గవి అనే వైద్యురాలిని గత ఫిబ్రవరి 5వ తేదీన పెళ్లి చేసుకున్నారు. ఏప్రిల్ 5న వివాహ రెసెప్షన్ ఉంటుందని ప్రకటించారు. కానీ కరోనా నేపథ్యంలో దీన్ని రద్దు చేస్తున్నట్టు వెల్లడించారు. (లిక్కర్ షాపులు తెరవండి : నటుడి విజ్ఞప్తి) -
విశాల్ స్థానంలో శింబు..!
విశాల్ నటించాల్సిన కొత్త చిత్రంలో సంచలన నటుడు శింబు నటించనున్నారనేది తాజా సమాచారం. విశాల్ ప్రస్తుతం రెండు చిత్రాల్లో నటిస్తున్నారు. ఈ రెండింటికీ ఆయనే నిర్మాత కావడం విశేషం. అందులో ఒకటి మిస్కిన్ దర్శకత్వంలో నటిస్తున్న తుప్పరివాలన్– 2. ఈ చిత్రం అధిక భాగం లండన్‌లో చిత్రీకరణ జరుపుకుంది. అయితే చిత్ర షూటింగ్ మధ్యలోనే విశాల్‌తో వివాదాలు తలెత్తడంతో దర్శకుడు మిస్కిన్ ఆ చిత్రం నుంచి వైదొలిగాడు. దీంతో ఆ చిత్రాన్ని తానే దర్శకత్వం చేస్తానని విశాల్ ప్రకటించాడు. వివాదానికి కారణం బడ్జెట్ పెరగడమే అని ఇద్దరు ఒకరినొకరు విమర్శించుకున్నారు. కాగా, విశాల్ నటిస్తున్న మరో చిత్రం చక్ర. ఈ చిత్రం ద్వారా ఎమ్ఎస్ ఆనందన్ దర్శకుడుగా పరిచయం అవుతున్నాడు. ఈ చిత్ర షూటింగ్ దాదాపు పూర్తయింది. ఈ చిత్రంలో విశాల్ కు జంటగా శ్రద్ధా శ్రీనాథ్, రెజీనా నటిస్తున్నారు. ఈ క్రమంలో విశాల్ మరో చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. దర్శకుడు ఆనంద్ శంకర్ చెప్పిన కథ నచ్చడంతో నిర్మించడానికి సిద్ధమయ్యారు. ఇలాంటి పరిస్థితుల్లో చిత్ర బడ్జెట్ పెరిగిపోవడంతో ఇప్పటికే రెండు చిత్రాలను నిర్మిస్తున్న విశాల్ ఈ చిత్ర నిర్మాణం నుంచి తప్పుకున్నాడు. దీంతో ఆనంద్ శంకర్ దర్శకత్వంలోనే ఈ చిత్రాన్ని సెవంత్ స్క్రీన్ స్టూడియో పతాకంపై లలిత్ కుమార్ నిర్మించడానికి ముందుకు వచ్చినట్టు సమాచారం. కాగా, ఈ చిత్రంలో హీరోగా నటుడు శింబును ఎంపిక చేసినట్లు కోలీవుడ్ సమాచారం. శింబు ప్రస్తుతం వెంకట్ ప్రభు దర్శకత్వంలో సురేష్ కామాక్షి నిర్మిస్తున్న మానాడు చిత్రంలో నటిస్తున్నా డు. కాగా, మానాడు తర్వాత శింబు దర్శకుడు ఆనంద్ శంకర్ చిత్రంలో నటిస్తారని టాక్. -
‘విశ్వాసం’ కాంబో రిపీట్
విశ్వాసం కాంబో రిపీట్ కానుందా. దీనికి కోలీవుడ్ నుంచి అవుననే బదులు వస్తోంది. అజిత్ ప్రస్తుతం వలిమై చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. హ్యూమాఖురేషీ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రాన్ని దివంగత నటి శ్రీదేవి భర్త బోనీ కపూర్ నిర్మిస్తున్నారు. దీనికి హెచ్.వినోద్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో అజిత్ పోలీసు అధికారిగా నటిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ దాదాపు పూర్తి కావచ్చింది. దీంతో అజిత్ కొత్త చిత్రానికి సిద్ధమవుతున్నారు. కాగా, ఇటీవల సూర్య హీరోగా సూరైర్ పోట్రు చిత్రాన్ని తెరకెక్కించిన మహిళా దర్శకురాలు సుధాకొంగర దర్శకత్వం వహించనున్నారనే ప్రచారం జరిగింది. కాగా, తాజాగా, అజిత్ తో కొత్త చిత్రానికి చిరుతై శివ దర్శకత్వం వహించనున్నట్లు ప్రచారం జోరందుకుంది. వీరి కాంబినేషన్ లో ఇంతకు ముందు వేదాళం, వీరం, వివేకం, విశ్వాసం ఇలా నాలుగు హిట్ చిత్రాలు రూపొందిన విషయం తెలిసిందే. తాజాగా, ఈ కాంబో అయిదో చిత్రానికి సిద్ధమవుతోంది. ఇది చారిత్రక కథాంశంతో తెరకెక్కబోతుందని తెలిసింది. దీనికి ఓ ప్రముఖ రచయిత కథను తయారు చేస్తున్నట్లు ప్రచారంలో ఉంది. అయితే, దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. కాగా, ప్రస్తుతం దర్శకుడు చిరుతై శివ సూపర్‌స్టార్ రజనీకాంత్ హీరోగా అన్నాత్త చిత్రాన్ని తెరెక్కిస్తున్న విషయం తెలిసిందే. నటి నయనతార, కుష్బూ, మీనా, కీర్తి సురేష్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రం నిర్మాణదశలో ఉంది. ఈ చిత్రం తర్వాత అజిత్‌తో దర్శకుడు చిరుతై శివ చేసే చిత్రం ప్రారంభమవుతుందని సమాచారం. -
ఆ సినిమా చూడండి వైరస్ వ్యాప్తి అర్ధమవుతుంది
సంచలన నటిగా ముద్ర వేసుకున్న ఈ బ్యూటీ సమాజానికి సంబంధించిన ఏ విషయంలోనా స్పందించడానికి ముందుంటుంది. ప్రస్తుతం కరోనా మహమ్మారిని అరికట్టేందుకు ప్రభుత్వం ప్రకటించిన లాక్‌డౌన్‌కు సహకరించాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉంటుంది. ఏప్రిల్ 14వ తేదీ వరకు బయటకు రాకుండా ఇంట్లో ఉంటే చాలు. అదే మనకు, చుట్టుపక్కల ఉన్న వారికి క్షేమం. నటి వరలక్ష్మీశరత్‌కుమార్ కూడా ఇదే విషయాన్ని చెబుతోంది. ఈ అమ్మడు ఒక వీడియోను సామాజిక మాధ్యమాల్లో విడుదల చేసింది. అందులో ప్రస్తుత కరోనా కాలంలో అందరూ ఇంట్లోనే ఉంటున్నారని భావిస్తున్నాను. నేనూ ఇంట్లోనే ఉంటున్నారు. కరోనా వైరస్ మనకు సోకదు అని కొందరు భావిస్తున్నారు. అయితే, అది కరెక్ట్ కాదు. కరోనా ఎవరికైనా సోకవచ్చు. కాంటేజెయన్ అనే ఆంగ్లో సినిమా ఉంది. అది చూస్తే ఇలాంటి వైరస్ ఎంత వేగంగా వ్యాప్తి చెందుతుందో అర్ధమవుతుంది. కాగా, చుట్టు పక్కల పిల్లలు, వృద్ధులకు సహాయం చేయండి. అలాగే ఇళ్లు, దుకాణాల అద్దెలను ఈ నెల ఆలస్యంగా తీసుకుంటే మంచిది. ప్రభుత్వం నిత్యావసర వస్తువులను అందరికీ అందుబాటులో ఉంచేందుకు చర్యలు తీసుకుంటోంది. అదే విధంగా యువత బయట తిరగకుండా కనీసం నెల రోజుల పాటైనా ఇంట్లోనే ఉంటే మంచిది. ఇటలీ మాదిరి మన ఇండియా చిన్న దేశం కాదు. 134 కోట్ల మంది జనాభా గల దేశం మనది. కరోనా భారత దేశంలో వ్యాప్తి చెందితే ఆ పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. అందుకే కొంచెం బుద్ధిని ఉపయోగించండి అని వరలక్ష్మీ శరత్ కుమార్ హితవు పలికింది. -
సూపర్‌స్టార్‌కు దీటుగా ఇళయ దళపతి?
సూపర్‌స్టార్‌కు దీటుగా ఇళయ దళపతి నిలబడనున్నారా? తమిళనాడులో రజనీకాంత్ తర్వాత అంత ఫాలోయింగ్ ఉన్న నటుడిగా విజయ్ వెలుగొందుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం విజయ్ “మాస్టర్’ చిత్రంలో నటిస్తున్నారు. దీనికి మానగరం, ఖైదీ చిత్రాల ఫేమ్ లోకేశ్ కనకరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో విజయ్‌కి జంటగా నటి మాళవికా మోహన్ నటిస్తున్న విషయం తెలిసిందే. విజయ్ సేతుపతి విలన్‌గా నటిస్తున్న ఈ చిత్ర షూటింగ్‌ను పూర్తి చేసుకుంది. ఏప్రిల్ 9వ తారీకు ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్టు ఇంతకు ముందే ప్రకటించారు. అయితే, ఈ చిత్రం విడుదల కరోనా ఎఫెక్ట్ కారణంగా జూన్‌కు వాయిదా పడే అవకాశం ఉందని తాజా సమాచారం. కాగా, మరో సారి మురుగదాస్ దర్శకత్వంలో విజయ్ నటించనున్నారనే ప్రచారం ఇప్పటికే వైరల్ అవుతోంది. ఇది తుపాకీ చిత్రానికి సీక్వెల్ అని కూడా ప్రచారం జరుగుతోంది. ఇకపోతే, ఈ చిత్రానికి విజయ్ పారితోషికం ఎంత ఉంటుందనేది చర్చనీయాంశంగా మారింది. కారణం ఇంతకు ముందు బిగిల్ చిత్రానికి రూ.60 కోట్లు, మాస్టర్ చిత్రానికి రూ.80 కోట్ల పారితోషికం తీసుకున్నట్లు ఆయనే స్వయంగా ఐటీ అధికారులకు తెలిపారు. దీంతో కొత్త చిత్రానికి విజయ్ పారితోషికం రూ.100 కోట్లకు చేరిందని ఓ ప్రముఖ విలేఖరి పేర్కొన్నారు. కాగా, ఇప్పటికే రజనీకాంత్ రూ.107 కోట్లు పారితోషికాన్ని తీసుకుంటున్నారు. ఇప్పుడు విజయ్ రూ.100 కోట్ల పారితోషికం నిజమైతే సూపర్‌స్టార్ కు దీటుగా నిలిచినట్లవుతుంది. -
నా ఆలోచనలు మారాయి!
తన ఆలోచనలు మారాయి అంటోంది నటి తమన్నా. మొదట్లో బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చినా, ఈ ముంబై అమ్మడిని నటిగా ఆదరించింది మాత్రం టాలీవుడ్, కోలీవుడ్‌నే అన్నది తెలిసిందే. నటిగా అన్ని రకాల పాత్రలను నటించేసిందనే చెప్పవచ్చు. అందాలారబోతతో ప్రారంభించి తరువాత నటిగా తానేమిటో నిరూపించుకుంది. ముఖ్యంగా బాహుబలి చిత్రంలో అవంతిక పాత్రకు జీవం పోసి ప్రశంసలు అందుకుంది. అదేవిధంగా సైరా నరసింహారెడ్డి చిత్రంలో లక్ష్మీ పాత్రకు వన్నె తెచ్చింది. నటిగా దశాబ్దన్నర అనుభవాన్ని గడించింది. ప్రస్తుతం మూడు పదుల వయసును దాటింది. అయితే ప్రస్తుతం అవకాశాలు తగ్గి ఉండవచ్చుగానీ, తమన్నాతో జోష్ మాత్రం ఏమాత్రం తగ్గలేదు. అది ఇటీవల సరిలేరు నీకెవ్వరూ చిత్రంలో నటించిన సింగిల్ సాంగ్‌లో స్పష్టంగా తెలుస్తుంది. అయితే మరీ అసలు అవకాశాలు లేక పోలేదు తెలుగులో సిటీమార్ అనే చిత్రం, హిందీలో బోల్ చుడియన్ చిత్రాల్లో నటిస్తూనే ఉంది. ఇక చాలా కాలం క్రితం నటించిన దటీజ్ మహాలక్ష్మీ చిత్రం విడుదల కావలసి ఉంది. ఈలోగా మరిన్ని అవకాశాలు రావచ్చు. కాగా తన సినీ జీవితం గురించి తమన్నా ఒక ఇంటర్వ్యూలో పేర్కొంటూ తాను సినిమాకు వచ్చిన కొత్తలో కావచ్చు, ఇప్పుడు కావచ్చు తీసుకునే నిర్ణయాలు కరెక్ట్‌గానే ఉంటాయి అని చెప్పింది. ఇంతకుముందు సినిమా ప్రపంచం సంతోషంగా ఉందంది. నటించడానికి వచ్చిన కొత్తలో ఏమైనా చేయాలనే ఆసక్తి ఉండేదని చెప్పింది. వయసలాంటిదని అంది. దీంతో వచ్చిన అవకాశాలన్నీ అంగీకరించి నటించేశానని చెప్పింది. అదీ తనకు మంచే అయ్యిందని చెప్పింది. ఆ చిత్రాలకు ప్రేక్షకుల మధ్య మంచి ఆదరణ లభించిందని అంది. ఇప్పుడు తాను పూర్తిగా పరిణితి చెందానని చాలా అనుభవం గడించానని అంది. దీంతో ఆలోచనల్లోనూ మార్చు వచ్చిందని చెప్పింది. ఆ అనుభవం ఇప్పుడు నటించే పాత్రలకు చాలా ఉపయోగపడుతోందని పేర్కొంది. మరో విషయం ఏమిటంటే తానెప్పుడూ తప్పుడు నిర్ణయాలు తీసుకోలేదని అంది. కొత్తలోనూ మంచి చిత్రాలను ఎంపిక చేసుకుని నటించానని, ఇప్పుడూ అంతేనని తమన్నా చెప్పుకొచ్చింది. అంతా బాగానే ఉంది పెళ్లెప్పుడన్న ప్రశ్నకు బదులివ్వడం లేదీ అమ్మడు. ఇంకా నటించాల్సింది చాలా ఉందని మాట దాటేస్తోంది. ఇదీ తన అనుభవంలో ఒక భాగం ఏమో! -
కరోనాపై నవ్వుతూనే పోరాడాలి!
కరోనాపై నవ్వుతూనే పోరాడాలి అని అంటోంది నటి రకుల్‌ప్రీత్‌సింగ్. ఇది కరోనా కాలం అని పేర్కొనవచ్చు. ఈ మహమ్మారి ప్రపంచదేశాలనే భయభ్రాంతులకు గురిచేస్తోంది. ఎప్పుడు ఎవరి ప్రాణాలు అరిస్తుందో తెలియని భయానక పరిస్థితుల్లో మానవాళి బతుకుతున్నారు. దీంతో ప్రజలు ప్రతి క్షణం అప్రమత్తతో ఉండాల్సిన అవసరం ఉంది. ఈ విషయంలో సెలబ్రిటీలు ఎవరికి తోచిన సలహాలు వారు ఇస్తున్నారు. కాగా నటి రకుల్‌ప్రీత్‌సింగ్ కూడా తనదైన బాణీలో కరోనా గురించి సలహా ఇచ్చింది. హిందీ, తెలుగు, తమిళం భాషల్లో నటిస్తున్న నటి రకుల్‌ప్రీత్‌సింగ్. (భారత్ @ 519) ప్రస్తుతం తమిళంలో ఇండియన్–2, శివకార్తికేయన్‌కు జంటగా ఒక చిత్రంలో నటిస్తోంది. హిందీలోనూ ఒక చిత్రంలో నటిస్తోంది. ఈ అమ్మడు కరోనా వైరస్ ప్రభావం ఉన్న తరుణంలోనూ కొన్ని రోజులు షూటింగ్ చేసిందట. దీని గురించి ఈ అమ్మడు చెబుతూ ఇంటి నుంచి బయటకు కాలు పెడుతుంటే ఏదో పోరుకు బయలుదేరుతునట్టుగా ఉందంది. అందుకు కారణం కరోనా భూతమేనంది. కాబట్టి ఎవరూ అత్యవసరం అనుకుంటే కానీ బయటకు రావద్దని చెప్పింది. తాను ఇటీవల తప్పనిసరి కావడంతో ముందు జాగ్రత్తలు తీసుకుని తక్కువ మంది చిత్ర యూనిట్‌తో షూటింగ్లో పాల్గొన్నట్లు చెప్పింది. (దండం పెడుతున్నా.. బయటకు రావొద్దు) ఆ సమయంలో తన టీమ్‌ను మినహా ఎవరినీ కారవన్లోకి అనుమతివ్వలేదని చెప్పింది. నిజం చెప్పాలంటే ఇప్పుడు తాను చాలా బిజిగా ఉండాల్సిందని, అయితే అంతా మారిపోయిందని అంది. కరోనా కారణంగా తాను నటిస్తున్న రెండు చిత్రాల షూటింగ్‌లు ఏప్రిల్ నెలకు వాయిదా పడినట్లు చెప్పింది. ఇప్పటికీ ఏం జరుగుతుందో తెలియడం లేదని పేర్కొంది. నటిగా తన జీవితంలో ఏర్పడిన పెద్ద విరామం ఇదేనని చెప్పుకొచ్చింది. ఏదేమైనా అందరూ కరోనాపై నవ్వుతూనే పోరాడాలని రకుల్‌ప్రీత్‌సింగ్ పేర్కొంది. ముఖ్యంగా దీన్ని ఎవరూ అలక్ష్య పరచరాదని, ప్రతి ఒక్కరూ అవగాహనతో మెలగాలని రకుల్‌ప్రీత్‌సింగ్ చెప్పింది. -
నచ్చిన నటుడితో మరోసారి..
కోలీవుడ్‌లో సక్సెస్ఫుల్ జంటలోకి విజయ్, కాజల్‌అగర్వాల్ కూడా వస్తారు. ఇంతకుముందు వీరిద్దరూ కలిసి నటించిన జిల్లా, తుపాకీ, మెర్శల్ వంటి చిత్రాలు విజయాలను పొందాయి. కాగా తాజాగా మరోసారి కలిసి నటించడానికి ఈ జంట సిద్ధం అవుతోందన్నది తాజా సమాచారం. దీన్ని నటి కాజల్‌అగర్వాల్‌నే స్వయంగా చెప్పింది. విజయ్ తాజాగా నటిస్తున్న చిత్రం మాస్టర్. నటి మాళవికామోహన్ ఆయనకు జంటగా నటిస్తున్న ఇందులో నటుడు విజయ్‌సేతుపతి విలన్‌గా నటిస్తున్నారు. లోకేశ్ కనకరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్‌ను పూర్తి చేసుకుంది. చిత్రాన్ని ఏప్రిల్ 9న విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ ముందుగానే ప్రకటించింది. అయితే కరోనా ప్రభావం కారణంగా ఈ చిత్ర విడుదల తేదీ వాయిదా పడుతుందా అనే సందేహం కలుగుతోంది. చిత్ర వర్గాలు మాత్రం అనుకున్నట్లుగానే మాస్టర్ చిత్రాన్ని విడుదల చేస్తామంటున్నారు. కాగా నటుడు విజయ్ తన తదుపరి చిత్రానికి రెడీ అయిపోతున్నారు. మరోసారి ఆయన దర్శకుడు ఏఆర్.మురుగదాస్‌తో చేతులు కలపనున్నట్లు ఇప్పటికే ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. తుపాకీ, కత్తి, సర్కార్ చిత్రాలతో సంచలన విజయాలను అందుకున్న ఈ కాంబినేషన్ రిపీట్ కానుందన్నమాట. కాగా దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా విడుదల కాలేదు. ఇకపోతే ఇది నటుడు విజయ్‌కు 65వ చిత్రం అవుతుంది. ఇది తుపాకీ చిత్రానికి సీక్వెల్‌గా తెరకెక్కనుందనే ప్రచారం జరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో నటి కాజల్‌అగర్వాల్ తాను నటుడు విజయ్‌తో మరోసారి కలిసి నటించనున్నట్లు తెలిపింది. ప్రస్తుతం ఇండియన్–2 చిత్రంలో కమలహాసన్‌తోనూ, దుల్కర్‌సల్మాన్‌కు జంటగా ఒక చిత్రంలోనూ నటిస్తున్న ఈ అమ్మడు ఇటీవల ఒక వీడియోను సామాజిక మాధ్యమాలకు విడుదల చేసింది. అందులో తనకు బాగా నచ్చిన నటుడు దళపతి విజయ్ అని పేర్కొంది. తాము త్వరలో మరోసారి కలిసి నటించనున్నట్లు చెప్పింది. దీంతో తుపాకీ–2లో ఈ అమ్మడు విజయ్‌తో మరోసారి రొమాన్స్ చేయనుందని భావించాల్సి ఉంది. ఎందుకంటే తుపాకీ చిత్రంలో ఈ బ్యూటీనే హీరోయిన్. దీంతో దాని సీక్వెల్లోనూ కాజల్‌అగర్వాల్‌నే హీరోయిన్గా ఎంపిక చేసుకుని ఉంటారని భావించవచ్చు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాలంటే మరి కొద్ది రోజులు ఆగాల్సిందే. -
కోలీవుడ్‌కి మరోసారి శర్వానంద్!
ప్రముఖ నృత్యదర్శకుడు రాజుసుందరం మరోసారి మెగాఫోన్ పట్టాడానికి రెడీ అవుతున్నారన్నది తాజా సమాచారం. పలు భాషా చిత్రాలకు నృత్యదర్శకత్వం వహిస్తూ బిజీగా ఉన్న రాజుసుందరం కొన్ని చిత్రాల్లోనూ ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. అంతే కాదు ఈయన దర్శకుడిగా అవతారమెత్తి అజిత్ హీరోగా ఏగన్ అనే చిత్రాన్ని తెరకెక్కించారు. నయనతార హీరోయిన్గా నటించిన ఈ చిత్రం ఆశించిన విజయాన్ని సాధించలేదు. దీంతో రాజు సుందరం ఆ తరువాత దర్శకత్వం జోలికి పోలేదు. అలాంటిది మరోసారి మెగాఫోన్ పట్టడానికి రెడీ అవుతున్నట్లు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం వైరల్ అవుతోంది. కాగా ఇందులో నటుడు శర్వానంద్ హీరోగా నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. తెలుగులో మంచి పేరున్న నటుడు ఈయన, కాగా కోలీవుడ్‌లోనూ మూడు నాలుగు చిత్రాల్లో నటించారు. అందులో జయ్‌తో కలిసి నటించిన ఎంగేయుమ్ ఎప్పోదుమ్ చిత్రం మంచి పేరు తెచ్చి పెట్టింది. కాగా చేరన్ దర్శకత్వంలో నటించిన జేకే ఎనుమ్ నన్భనిన్ వాళ్ ల్కై చిత్రం నిర్మాణం పూర్తి చేసుకున్నా తెరపైకి రాలేదు. ఆ చిత్రాన్ని ఆన్లైన్లో విడుదల చేయాల్సి వచ్చింది. కాగా చాలా గ్యాప్ తరువాత కోలీవుడ్‌లో మరోసారి తన అదృష్టాన్ని శర్వానంద్ పరిక్షించుకోవడానికి సిద్ధం అవుతున్నారు. అదేవిధంగా నృత్యదర్శకుడు రాజుసుందరానికి దర్శకుడిగా ఈ చిత్రం కీలకం అవుతుంది. కాగా ఈ చిత్రం మేలో సెట్ పైకి వెళ్లనున్నట్లు తెలిసింది. అయితే దీనికి సంబంధించిన అధికార ప్రకటన వెలువడలేదదన్నది గమనార్హం. పూర్తి వివరాలు తెలియాలంటే మరి కొద్ది రోజులు ఆగాల్సిందే. -
మాధవన్ ఆనందం.. తనయుడి గెలుపు
సాధారణంగా సినిమా సెలబ్రిటీలు తమ పిల్లలకు సంబంధించిన విషయాలను సోషల్ మీడియాలో అభిమానలతో పంచుకుంటారు. అయితే మాధవన్ తన తనయుడికి సంబంధించిన వీడియోను అభిమానులతో పంచుకున్నారు. మాధవన్ కొడుకు వేదాంత్ జాతీయ స్థాయి స్విమ్మింగ్‌లో విశేష ప్రతిభ చూపించారు. జూనియర్ లెవల్లో జాతీయ స్విమ్మింగ్ చాంపియన్ షిప్లో విజయం సాధించారు. దీనికి సంబంధించిన వీడియోను మాధవన్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. అదే విధంగా ‘మీ అందరి దీవెనలలో వేదాంత్ ఈ పోటీల్లో గెలిచాడు. వేదాంత్ విజయానికి గర్వపడుతున్నా. దేవుడి దయ వల్ల అతనికి ఈ విజయాలు లభించాయి. తన ఆటను టీవీ లైవ్‌లో చూడటం చాలా ఉత్సాహంగా ఉంది’ అంటూ కామెంట్ చేశారు. దీంతో ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. View this post on Instagram The Blessing and privileged of seeing your boy win LIVE on a Sports channel. Crazy feeling .. but it’s Gods grace and the mother and boys efforts only. I just cheered.😊😊😊🙏🙏 A post shared by R. Madhavan (@actormaddy) on Jan 30, 2020 at 2:59am PST కాగా , 2019 సెప్టెంబర్‌లో జరిగిన ఆసియా ఏజ్ గ్రూప్ ఛాంపియన్‌షిప్‌లో వేదాంత్ భారత్ తరఫున రజత పతకం సాధించాడు. ఇవే కాకుండా వేదాంత్ పలు పోటీల్లో విజయం సాధించాడు. ప్రస్తుతం విడుదలకు సిద్ధంగా ఉన్న ‘నిశ్శబ్దం’ సినిమాలో మాధమన్ నటించారు. ఈ సినిమాకు హేమంత్ మధుకర్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో అనుష్క, అంజలి, షాలినీ పాండే, సుబ్బరాజు, మైఖేల్ మ్యాడిసన్ ముఖ్య పాత్రల్లో నటించారు. అదేవిధంగా దర్శకుడు దిలీప్ కుమార్ తెరకెక్కించే ‘ మారా ’ సినిమా చిత్రీకరణలో మాధవన్ బిజీగా ఉన్నారు. ఈ సినిమాలో మాధవన్ సరసన శ్రద్ధా శ్రీనాథ్ హిరోయిన్‌గా నటిస్తున్నారు. -
రూ. 200 కోట్ల క్లబ్లో ‘దర్బార్’
సంక్రాంతి కానుకగా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకొచ్చిన రజనీకాంత్ దర్బార్ భారీ కలెక్షన్లను కొల్లగొడుతోంది. దర్బార్ కలెక్షన్ల సునామీతో రూ. 200 కోట్ల క్లబ్లో చేరి మరో రికార్డు సొంతం చేసుకుంది. విడులైన పదకొండు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా దర్బార్ రూ. 200 కోట్లు రాబట్టిందని ప్రముఖ ట్రేడ్ విశ్లేషకుడు త్రినాథ్ వెల్లడించారు. దీంతోపాటు ప్రపంచవ్యాప్తంగా రూ.200 కోట్ల వసూళ్లు రాబట్టిన రజనీకాంత్ ఐదో సినిమా ‘దర్బార్’ కావడం విశేషం. గతంలో రాజనీకాంత్ నటించిన ఎంతిరాన్, కబాలి, రోబో 2.ఓ, పేటా చిత్రాలు కూడా ప్రపంచవ్యాప్తంగా రూ. 200 కోట్ల కలెక్షన్లను సాధించాయి. కాగా ఈ భారీ కలెక్షన్లలో అధికభాగం తమిళనాడు నుంచి సుమారు రూ. 80 కోట్లు వచ్చాయని త్రినాథ్ పేర్కొన్నారు. అదేవిధంగా ‘దర్బార్’ మూవీ కేరళలో రూ. 8 కోట్లు, కర్ణాటకలో రూ.19 కోట్లు వసూలు చేసినట్లు తెలిపారు. చదవండి: దర్బార్: ట్విటర్లో ఏమంటున్నారంటే? రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి సుమారు రూ. 20 కోట్లు, హిందిలో రూ.8 కోట్లు రాబట్టిందని ఆయన పేర్కొన్నారు. అదేవిధంగా విదేశాల్లో సుమారు రూ. 70 కోట్లు వసూలు చేసిందని తెలిపారు. కోలీవుడ్ అగ్ర దర్శకుడు మురుగదాస్ తెరకెక్కించిన ‘దర్బార్’ సంక్రాంతి కానుకగా ఈ నెల 9న విడుదలైన సంగతి తెలిసిందే. అభిమానులకు కావాల్సిన మాస్‌మసాలా అంశాలు, పోరాట సన్నివేశాలు రజనీని సూపర్‌స్టైలిష్‌గా చూపించిన ‘దర్బార్’ సినిమా ప్రేక్షకుల హృదయాలను కొల్లగొడుతోంది. ముంబై పోలీసు కమిషనర్ ఆదిత్య అరుణాచలంగా నటించిన రజనీకాంత్ నటన, స్టైల్ ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తుండటంతో ఈ సినిమా భారీగా వసూళ్లు సాధిస్తోంది. చదవండి: దర్బార్ చిత్రంలో నయనతార పాత్ర దారుణం -
సమంత.. కెరీర్లో తొలిసారిగా
తన కేరీర్‌లోనే తొలిసారిగా ఒక పాత్ర కోసం కష్టపడి నటించినట్లు నటి సమంత పేర్కొంది. ఈ అమ్మడు అంతగా కష్టపడి నటించిన చిత్రం ఏంటబ్బా! సమంత బహుభాషా నటిగా రాణిస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా తెలుగు, తమిళంలో ప్రముఖ కథానాయకిగా వెలుగొందుతోంది. గతేడాది నటించిన చిత్రాలన్నీ సమంతను సక్సెస్ బాటలో నడిపించాయి. ఈ ఏడాది అది రిపీట్ చేయాలని సమంత ఆశ పడుతోంది. అలా ఇటీవల తన భర్త నాగచైతన్యతో కలిసి నటించిన మజిలీ చిత్రం తెరపైకి రానుంది. దీని విజయం సమంతకు చాలా ముఖ్యం. అయితే ఈ బ్యూటీ కష్టపడి నటించిన చిత్రం మాత్రం అది కాదు. తమిళంలో అరండకాండం చిత్రం ఫేమ్ త్యాగరాజన్ కామరాజా దర్శకత్వంలో విజయ్‌సేతుపతికి జంటగా సూపర్ డీలక్స్ చిత్రంలో నటిస్తోంది. (ఆ పాత్రకు నో చెప్పిన సమంత..!) ఇందులో ఫాహత్ ఫాజిల్ కూడా ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం డబ్బింగ్ దశలో ఉంది. ఇందులో విజయ్‌సేతుపతి తొలిసారిగా హిజ్రాగానూ కొంచెం సేపు తళుక్కుమననున్నారు. కాగా నటి సమంత పాత్రా చాలా వైవిధ్యంగా ఉంటుందట. కథనే విభిన్నంగా ఉండటంతో అందులో నటించడానికి ఇంతకు ముందెప్పుడూ లేనంతగా చాలా కష్టపడినట్లు సమంత ఒటీవల ఒక భేటీలో పేర్కొంది. ఇందులోని వేంబు అనే పాత్ర కోసం దర్శకుడి సలహా మేరకు రిహార్సల్స్ చేసి నటించానని, ఈ చిత్రంలోని పాత్ర తనకే కాకుండా తన అభిమానులకు సరికొత్త అనుభూతిని కలిగిస్తుందనే అభిప్రాయాన్ని సమంత వ్యక్తం చేసింది.కాగా సూపర్ డీలక్స్ చిత్రం సమ్మర్ స్పెషల్‌గా ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతోంది. -
రజనీ ఈసారెలా కనిపిస్తారో తెలుసా?
తమిళసినిమా: రాజకీయాల మాట ఏమోగానీ నటుడు రజనీకాంత్ సినిమాలతో బిజీ అయిపోతున్నారు. ఇంతకు ముందు నటించిన కబాలి చిత్రం మంచి విజయాన్నే సాధించినా, ఆ తరువాత వచ్చిన కాలా ఆశించిన విజయాన్ని సాధించలేదన్నది నిజం. అలాంటిది తాజాగా రజనీకాంత్ నటించిన పేట సూపర్‌హిట్ టాక్‌నే తెచ్చుకుంది. ముఖ్యంగా తలైవా అభిమానుల్ని పూర్తిగా సంతృప్తి పరుస్తోంది. ఇక దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ సూపర్‌స్టార్‌ను ఆయన అభిమానులు ఎలా చూడాలనుకుంటున్నారో అలానే చూపించడంతో 100 శాతం సక్సెస్ అయ్యాడు. పేట చిత్రంలో రజనీకాంత్ వయసును 20 తగ్గించేశాడు. ఈ చిత్రం రజనీకాంత్‌లోనూ నూతనోత్సాహాన్ని నింపించదనే చెప్పాలి. దీంతో ఆయన రెట్టింపు ఎనర్జీతో వరుసగా చిత్రాలు చేయడానికి రెడీ అయిపోతున్నారన్నది తాజా సమాచారం. ప్రస్తుతం ఏఆర్.మురుగదాస్ దర్శకత్వంలో నటించడానికి సిద్ధం అవుతున్నారు. వీరి కాంబినేషన్లో తెరకెక్కనున్న సంచలన చిత్రాన్ని 2.ఓ, ఇండియన్–2 చిత్రాల సంస్థ లైకానే నిర్మించబోతోందన్నది తాజా సమాచారం. కాగా ఇది రాజకీయ నేపథ్యంలో సాగే కథా చిత్రం అని, దీనికి నర్కాలి (కుర్చీ) అనే టైటిల్ పరిశీలనలో ఉందని జరుగుతున్న ప్రచారానికి దర్శకుడు ఫుల్స్టాప్ పెట్టారు. రజనీకాంత్‌తో తెరకెక్కించనున్న చిత్రం టైటిల్ నక్కాలి కాదని ఆయన ఇటీవల ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. తాజా సమాచారం ఏమిటంటే పేట చిత్రంలో కత్తి చేత పట్టిన రజనీకాంత్ తాజాగా లాఠీ చేత పట్టనున్నారట. అవును మురుగదాస్ ఆయన్ని పోలీస్ అధికారిగా తెరపై ఆవిష్కరించబోతున్నట్లు తెలిసింది. రజనీకాంత్ లాఠీ చేత పట్టి చాలా కాలమైంది. అప్పుడెప్పుడో మూండ్రు ముగం, పాండియన్, కొడి పరక్కుదు వంటి చిత్రాల్లో పోలీస్ అధికారిగా నటించారు. తాజాగా మురుగదాస్ దర్శకత్వంలో మరోసారి పవర్ఫుల్ పోలీస్ అధికారిగా నటించబోతున్నట్లు సమాచారం. ఫిబ్రవరిలో ఈ చిత్రం సెట్‌పైకి వెళ్లనున్నట్లు తెలిసింది. ఇకపోతే ఈ చిత్రం తరువాత కూడా రజనీకాంత్ నటుడిగా కొనసాగనున్నారనే ప్రచారం వైరల్ అవుతోంది. ఆయన బాషా, మన్నన్, అన్నామలై వంటి సూపర్‌హిట్ చిత్రాలను అందించిన దర్శకుడు సురేశ్కృష్టకు, ముత్తు, పడయప్ప వంటి బ్లాక్ బ్లస్టర్ చిత్రాలను అందించిన కేఎస్.రవికుమార్‌కు మంచి కథలను సిద్ధం చేయమని చెప్పినట్లు టాక్. అదేవిధంగా తనకు, యూత్‌కు నచ్చేలా పేట చిత్రంలో చూపించిన యువ దర్శకుడు కార్తీక్సుబ్బరాజ్కు మరో అవకాశం ఇవ్వనున్నట్లు సమాచారం. ఇవన్నీ కార్యరూపం దాల్చితే రజనీకాంత్‌ను మరో ఐదేళ్ల పాటు నటుడిగానే చూడవచ్చు. ఇది ఆయన్ని రాజకీయనాయకుడిగా చూడాలని కలలు కంటున్న అభిమానులకు నచ్చకపోవచ్చుగానీ, సినీ అభిమానులకు మాత్రం పండగచేసుకునే వార్తే అవుతుంది. -
కోలీవుడ్‌పై రకుల్ గురి
తమిళసినిమా: రకుల్‌ప్రీత్‌సింగ్ తాజాగా కోలీవుడ్‌పై గురిపెట్టినట్లుంది. టాప్ హీరోయిన్గా నిరంతరం కొనసాగడం ఎవరికీ సాధ్యం కాదు. తాజాగా ఆ రేంజ్‌కు నటి రకుల్‌ప్రీత్‌సింగ్ చేరుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. టాలీవుడ్లో ప్రముఖ నాయకి స్థాయికి చేరుకున్న ఈ ఉత్తరాది బ్యూటీ అక్కడ యువ స్టార్స్ అందరితోనూ నటించేసింది. అల్లుఅర్జున్, రామ్‌చరణ్‌తేజ, నాగచైతన్య లాంటి హీరోలతో హిట్స్ కొట్టేసింది. ప్రస్తుతం మహేశ్‌బాబు హీరోగా ఏఆర్.మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ అంచనాలతో త్వరలో తెలుగు, తమిళం భాషల్లో తెరపైకి రానున్న స్పైడర్ చిత్రంలో నటించిన రకుల్ ఈ చిత్రంపై చాలా ఆశలే పెట్టుకుంది. ముఖ్యంగా కోలీవుడ్‌లో ఈ భామకు స్పైడర్ రీఎంట్రీ చిత్రం అవుతుంది. నిజానికి తొలుత కోలీవుడ్‌లోనే రకుల్‌ప్రీత్‌సింగ్ ఎంట్రీ అయ్యింది. ఇక్కడ తడయార తాక్క, పుత్తగం, ఎన్నమో ఏదో చిత్రాల్లో నటించింది. అయితే వాటిలో ఏ ఒక్కటీ ఆశించిన విజయాలను అందుకోకపోవడంతో అమ్మడిని పక్కన పెట్టేశారు. దీంతో టాలీవుడ్‌కు జంప్ చేసి అక్కడ వరుస సక్సెస్‌లను అందుకుంటూ టాప్ హీరోయిన్ రేంజ్‌కు ఎదిగింది. తాజాగా కోలీవుడ్‌పై కన్నేసినట్లుంది. ఇక్కడిప్పుడు స్పైడర్‌తో కలిపి నాలుగు భారీ చిత్రాలు రకుల్‌ప్రీత్‌సింగ్ చేతిలో ఉన్నాయి. స్పైడర్ చిత్రం త్వరలో విడుదలకు ముస్తాబవుతుండగా తాజాగా కార్తీకి జంటగా ధీరన్ అధికారం ఒండ్రు, సెల్వరాఘవన్ దర్శకత్వంలో సూర్య సరసన ఒక చిత్రం ఇప్పటికి కమిటైన చిత్రాలు. వీటిలో కార్తీతో నటిస్తున్న ధీరన్ అధికారం ఒండ్రు చిత్రం నిర్మాణ దశలో ఉండగా, సూర్యతో రొమాన్స్ చేసే చిత్రం త్వరలో ప్రారంభం కానుంది. ఇక వీటితో పాటు ఇళయదళపతి విజయ్‌తో జోడీ కట్టే అవకాశాన్ని కొట్టేసిందనే ప్రచారం జరుగుతోంది. విజయ్ ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో మెర్శల్ చిత్రాన్ని పూర్తిచేసే పనిలో ఉన్నారు. తదుపరి ఏఆర్.మురుగదాస్ దర్శకత్వంలో నటించడానికి సిద్ధమవుతున్నారు. ఇందులో రకుల్‌ప్రీత్‌సింగ్ నాయకిగా నటించనున్నట్లు సమాచారం. దీంతో తదుపరి టాప్ హీరోయిన్ స్థాయికి రకుల్‌ప్రీత్‌సింగ్ గురిపెట్టినట్లు చెప్పవచ్చు. -
విశాల్‌తో రకుల్ ప్రీత్ సింగ్ రొమాన్స్
విశాల్‌తో రొమాన్స్‌కు రకుల్ ప్రీత్ సింగ్ సిద్ధం అవుతుందా? దీనికి కోలీవుడ్ నుంచి ఎస్ అనే సమాధానమే వస్తోంది. నటుడు అరుణ్ విజయ్‌కు జంటగా తడయారు తాక్క చిత్రం ద్వారా తమిళ పరిశ్రమకు దిగుమతి అయిన ఉత్తరాది బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్. ఆ తరువాత పుత్తగమ్, ఎన్నమో ఏదో వంటి చిత్రాల్లో నటించినా ఇక్కడ కేక పుట్టించలేకపోయినా ఈ చిన్నది ఆపై టాలీవుడ్కెళ్లి అక్కడిప్పుడు కేక పుట్టిస్తోంది. తెలుగు యువ హీరోలతో నటిస్తూ యమ బిజీగా ఉన్న రకుల్ ప్రీత్ సింగ్ కు కోలీవుడ్‌లో రాణించలేకపోయాననే బాధ చాలా కాలంగా వెంటాడుతూనే ఉంది. ఆ మధ్య రామ్ చరణ్‌తో నటించిన బ్రూస్లీ చిత్ర తమిళ అనువాద ఆడియో కార్యక్రమంలో పాల్గొన్న ఈ అమ్మడు మంచి అవకాశం వస్తే తమిళంలో నటించడానికి రెడీ అని ఒక స్టేట్మెంట్ పడేసింది. అది ఇప్పుడు వర్కౌట్ అవుతున్నట్లు సమాచారం. రకుల్ త్వరలో విశాల్‌లో డ్యూయెట్లు పాడటానికి రెడీ అవుతున్నారని తెలుస్తోంది. దీనికి తుప్పరివాలన్ అనే టైటిల్‌ను కూడా నిర్ణయించారు. ఈ చిత్రం ద్వారా రకుల్ ప్రీత్ సింగ్ కోలీవుడ్‌కు రీఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతున్నట్లు తెలిసింది. మిష్కిన్ చిత్రాల్లో కథానాయికలకు, కథానాయకులకు సమానంగా ప్రాధాన్యం ఉంటుందన్న విషయం తెలిసిందే. అందువల్ల ఈ చిత్రంతో కోలీవుడ్‌లో తన విజయ ఖాతాను తెరవాలని రకుల్ ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే తుప్పరివాలన్ చిత్రంలో రకుల్‌ను ఎంపిక చేయడానికి చర్చలు జరుగుతున్నాయని, కాగా ఇంకా ఆమె ఒప్పందంపై సంతకం చేయలేదని విశాల్ వర్గం అంటోంది. -
క్షణం తీరికలేని హీరోయిన్!
దక్షిణాదిలో వరుస సినిమాలతో హీరోయిన్ హన్సిక బిజిబిజిగా ఉంది. ఆ బొద్దుగుమ్మ క్షణం తీరక లేకుండా రాత్రి, పగలు షూటింగుల్లో పాల్గొంటూ వయసుకు మించి కష్ట పడుతోంది. కోలీవుడ్‌లో ఆఫర్ల మీద ఆఫర్లతో ఈ బబ్లీ బ్యూటీ దూసుకుపోతోంది. గత మూడేళ్ళ నుంచి ఈ బ్యూటీ ఇలానే కాలం గడుపుతోంది. ఏడాదికి కోలీవుడ్‌లో ఆరు సినిమాలు చేస్తోంది. విజయ్ వంటి స్టార్ హీరోల సరసన నటిస్తూ క్రేజీ హీరోయిన్గా వెలుగొందుతోంది. ఈ బ్యూటీ సినిమాలకు అక్కడ మంచి మార్కెట్ కూడా ఉంది. ఈ మధ్యనే మళ్లీ తెలుగుపై దృష్టి మరల్సింది. ఇక్కడ కూడా రెండు సినిమాల్లో నటించింది. కోలీవుడ్‌లో వరుసపెట్టి అవకాశాలు రావడంతో హన్సిక తన పారితోషికాన్ని కూడా అమాంతం పెంచేసింది. ఈ మధ్య విడుదలైన అరణ్మణి చిత్రం తర్వాత హన్సిక పారితోషికాన్ని కోటిన్నరకు పెంచినట్లు సమాచారం. ప్రస్తుతం విజయ్ సరసన నటిస్తున్న 'గరుడ' చిత్రానికి హన్సిక కోటిన్నర తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా వాణిజ్య ప్రకటనల పారితోషికం కూడా అదే స్థాయిలో పెంచేసినట్లు కోలీవుడ్ టాక్. అధిక సినిమాలలో నటించే అవకాశం రావడంతో ఎంతో ఓర్పు, ఓపికతో రాత్రి పగలు సెట్స్‌లో నటిస్తోంది. ఈ విధంగా క్షణం తీరిక, విశ్రాంతి లేకుండా నటిస్తూపోతే గ్లామర్ దెబ్బతింటుంది కదా అని ఈ ముద్దుగుమ్మని అడిగితే, కష్టపడి పని చేస్తే మరింత అందంగా కనిపించే అవకాశం ఉంటుందని ముద్దు ముద్దుగా చెబుతోంది. ఇది ఇలా ఉంటే ఈ మిల్కీ బ్యూటీకి టాలీవుడ్లో ఉన్న క్రేజ్‌ను క్యాష్ చేసుకునేందుకు కొందరు నిర్మాతలు ప్రయత్నాలు చేస్తున్నారు. తమిళంలో 'అరణ్మణి'గా సుందర్.సి దర్శకత్వంలో రూపొందించిన హారర్ కామెడీ సినిమాను తెలుగులో 'చంద్రకళ' పేరుతో విడుదల చేశారు. 'చందమామ' వంటి సూపర్ హిట్ చిత్రాన్ని అందించిన నిర్మాత సి.కళ్యాణ్ ఈ చిత్రాన్ని సి.కె.ఎంటర్టైన్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ బేనర్‌పై తెలుగులోకి అనువదించారు. -
కుర్రకారుకి కునుకు పట్టనివ్వని హీరోయిన్
సినీ ప్రపంచంలో ఒక్కో హీరోయిన్ ఒక్కోసారి ఓ వెలుగు వెలిగిపోతుంటుంది. ఇప్పుడు అది సమంత వంతైంది. ఈ ముద్దు గుమ్మ ఇటు టాలీవుడ్‌లోనూ, అటు కోలీవుడ్లోను కుర్రకారుకు పిచ్చెక్కిస్తోంది. ఆ పేరు వింటేనే కుర్రాళ్లకు నిద్రపట్టడంలేదు. మరోవైపు నిర్మాతలకు కనక వర్షం కూడా కురిపిస్తోంది. సమంత నటిస్తే సినిమా హిట్టే అనే టాక్ కూడా వచ్చింది. దాంతో నిర్మాతలు ఆమె కోసం బారులు తీరుతున్నారు. ఈ రెండు భాషలలోనూ స్టార్ హీరోలు అందరి సరసన నటించే అవకాశాలు వాటంతట అవే వచ్చేశాయి. నటనలో కూడా పరిణతి చూపుతూ అదే స్థాయిలో ఆమె దూసుకుపోతోంది. ఈ రేంజ్లో ఉన్న సమంతకు ఇప్పుడు ఓ చిక్కువచ్చి పడింది. ఆమె స్పీడ్‌కు మరో హీరోయిన్ బ్రేకులు వేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. సమంతతో శృతిహాసన్ ఢీ అంటే ఢీ అన్నట్లు తలపడుతోంది. తెలుగులో మాత్రం సమంత మరే హీరోయిన్‌కు అందనంత ఎత్తులో కొనసాగుతోంది. ఈ అమ్మడు నటించిన సినిమాలు వరుసగా టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద భారీ హిట్స్ కొట్టాయి. దాంతో తెలుగులో బాగా క్రేజ్ ఏర్పడింది. ఈ ఊపుతో సొంత భాష తమిళంలో కూడా హవా కొనసాగించాలని ఈ అమ్మడు చూస్తోంది. అనుకున్నట్లు ఈ ముద్దుగుమ్మ కోలీవుడ్‌లో కూడా యామ స్పీడ్‌గా టాప్ ప్లేస్‌కు చేరుతోంది. ఇదే సమయంలో సమంతకు పోటీగా మరో ముద్దుగుమ్మ శృతిహసన్ తమిళంలోకి ఎంట్రీ ఇచ్చింది. మొన్నటివరకు బాలీవుడ్‌కే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చిన శృతి తాజాగా తమిళంలో స్థిరపడాలన్న ఆలోచనతో ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. ఆ ఉద్దేశంతోనే తమిళ చిత్రాల పట్ల ఆసక్తి చూపుతోంది. ప్రస్తుతం విశాల్ సరసన పూజై సినిమాలో నటిస్తోంది. మళ్లీ ఇటీవలే స్టార్ హీరో విజయ్‌తో కలసి నటించేందుకు అంగీకరించినట్లు సమాచారం. త్వరలో మరి కొంతమంది స్టార్ హీరోల సినిమాలకి కూడా ఈ నాజూకు సుందరి సంతకం చేయబోతున్నట్లు తమిళ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఇలా వరుసగా తమిళ సినిమాలను శృతి తన ఖాతాలో వేసుకుంటూ సమంత ఆశలపై నీళ్ళు చల్లుతోంది. వీరిద్దరిలో కోలీవుడ్‌లో ఎవరు అగ్రస్థానానికి చేరతారో కొంతకాలం వేచి చూడవలసిందే. - శిసూర్య -
ఆ కామెడీ హీరో సంపాదన అంతా!
కోలీవుడ్ ప్రముఖ కమెడీయన్ సంతానం తన హస్యంతో సునామీ సృష్టిస్తున్నాడు. ప్రతి పాత్రను పండించే సత్తా ఉన్న నటుడు సంతానం. తన కామెడీతో తమిళ ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నాడు. హీరోగా కూడా నటిస్తూ స్టార్ హీరోలకు ధీటుగా తన ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నాడు. ఈ హాస్య నటుడు ఇటీవల తొమ్మిది మంది ముద్దుగుమ్మలతో రొమాన్స్ చెయ్యడానికి సిద్దపడ్డాడు. వడివేలుకు రాజకీయ గ్రహణం పట్టడంతో సంతానం దశతిరిగింది. ప్రస్తుతం కోలీవుడ్‌లో సంతానం క్రేజ్ టాప్ రేంజ్లో ఉంది. అతను లేకుండా తమిళంలో ఏ స్టార్ హీరో కూడా సినిమాలు చేయడం లేదు. సంవత్సరంలో దాదాపు 15 సినిమాల్లో నటించే సంతానం సగటున ఏడాదికి 30 కోట్ల రూపాయల వరకు సంపాదిస్తున్నట్లు సమాచారం. గత సంవత్సరం ఇతని ఇంటిపై ఇన్కమ్ టాక్స్ అధికారులు దాడి కూడా చేశారు. అది వేరే విషయం. మొత్తానికి సంతానం సినిమాలతో ఊపిరిసలపనంత బిజీబిజీగా ఉన్నాడు. తెలుగులో ప్రముఖ హాస్యనటుడు సునీల్ హీరోగా రూపొందించిన 'మర్యాద రామన్న' సినిమాను తమిళంలో 'వల్లవునుక్కు పుల్లుం ఆయుధం' పేరుతో రీమేక్ చేశారు. ఆ చిత్రంతో సంతానం హీరోగా మారిపోయాడు. ఇప్పడు దర్శకుడు విజయ్ చందర్ 'కన్నిరాశి' టైటిల్‌తో తెరకెక్కబోతున్న మరో మూవీలో సంతానం తొమ్మిది మంది హీరోయిన్స్‌తో ఆడిపాడేందుకు రెఢీ అయ్యాడు. ఇప్పటికే ఆ చిత్ర దర్శకుడు ఆ తొమ్మిది మంది బ్యూటీస్‌ను ఎంపిక చేసే పనిలో ఉన్నాడని కోలీవుడ్ వర్గాల సమాచారం. అంతమంది అందాల భామలు ఎవరన్నదానిపైనే ఇప్పుడు చర్చ జరుగుతోంది. శృతిహాసన్, నయనతార, తమన్నా, కాజల్, అంజలి, ఆండ్రియా...వంటి హీరోయిన్లతో దర్శకుడు సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. - శిసూర్య -
రజనీ కొత్త చిత్రంలో అనుష్క
దక్షిణ భారత సూపర్ స్టార్ రజనీకాంత్ సరసన అనుష్క నటించనుంది. ఈ చిత్రానికి కె.ఎస్.రవికుమార్ దర్శకత్వం వహించనున్నారు. రవికుమార్ దర్శకత్వంలో జగ్గుబాయ్, రాణా అనే రెండు చిత్రాల్లో రజనీ నటించవలసి ఉంది. అయితే వివిధ కారణాల వల్ల ఆ రెండు చిత్రాలలో ఆయన నటించలేదు. అయినప్పటికీ కోచ్చడయాన్ చిత్రానికి కథను రవికుమారే అందించారు. పడయప్పా బాణిలో సవాలుతో కూడుకున్న ఒక చిత్రాన్ని నిర్మించాలంటూ రజనీ అభిమానులు ఆయన్ను ఎప్పటి నుంచో కోరుతున్నారు. దానికి తగిన సమయం వచ్చేసింది. రజనీకాంత్ సరసన జంటగా నటించేదుకు అనుష్క ఆనందంగా అంగీకరించారు. కాల్షీట్లు కోరిన వెంటనే రజనీతో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. ప్రస్తుతం అనుష్క నటిస్తున్న రాణి రుద్రమ దేవి, బాహుబలి చిత్రాలు ముగింపు దశలో ఉన్నాయి. ఆ తరువాత ఆమె రజనీతో నటిస్తారు. ఈ కొత్త చిత్రం షూటింగ్ మే నెల తొలివారంలో ప్రారంభించే అవకాశం ఉంది. ఈ చిత్రానికి మాస్ టైటిల్ పెట్టేందుకు రజనీతో రవికుమార్ చర్చలు జరుపుతున్నారు. ఇదిలా ఉండగా, రజనీకాంత్, దీపికా పడుకొనే నటించిన కోచ్చడయాన్ చిత్రాన్ని ఏప్రిల్ 11వ తేదీ విడుదల చేసేందుకు నిర్ణయించారు. అయితే లోక్‌సభ ఎన్నికల కారణంగా ఈ చిత్రం విడుదలను వాయిదావేశారు. ఎన్నికల తర్వాత విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. అయితే దీని గురించి ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. -
ఇదంతా పబ్లిసిటీ స్టంటేనా?
అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందడంతో సినిమా పరిశ్రమవారికి ఓ పక్క ఎంతో సౌకర్యంగా ఉన్నప్పటికీ, మరో పక్క సినిమాకు భద్రతలేకుండా పోతోంది. విడుదలకు ముందే సినిమాలో కొంత భాగం, పూర్తిగా సినిమా, పాటల పైరసీలు బయటకు వచ్చేస్తున్నాయి. కొన్ని సినిమాలలో సీన్స్, పాటలు విడుదలకు ముందే అంతర్జాలంలో హల్ చల్ చేస్తున్నాయి. ఒక్కోసారి ఆ చిత్రంలో నటించే హీరోల ఇమేజ్ వల్ల కూడా నిర్మాతలకు ప్రమాదం ముంచుకువస్తోంది. ఎందుకంటే తమ హీరో కొత్త మూవీ వివరాలు తెలుసుకోవడానికి అతని అభిమానులు తెగ ఆరాటపడుతుంటారు. దాంతో వారు నెట్‌ను ఆశ్రయిస్తుంటారు. సినిమా షూటింగ్ విశేషాలతో పాటు ఒక్కోసారి వాటికి సంబంధించిన దృశ్యాలు కూడా నెట్లోకి వచ్చేస్తాయి. పబ్లిసీటి కోసం సినిమా వారు అనుసరించే ఈ పద్దతి ద్వారా వారు విడుదల చేయని దృశ్యాలు కూడా నెట్లో దర్శనమిస్తాయి. దాంతో నిర్మాతలు విలవిలలాడిపోతుంటారు. మొన్నటికి మొన్న మహానటుడు అక్కినేని నాగేశ్వరరావు చివరగా నటించిన అన్నపూర్ణ ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మించిన 'మనం' సినిమా విడుదల కాకముందే పాటల వీడియోను యూట్యూబ్‌లో అప్లోడ్ చేశారు. తాజాగా కోలీవుడ్ మూవీ సాంగ్స్ రీలీజ్‌కు ముందే నెట్లో పడిపోయాయి. కోలీవుడ్ మన్మథుడు శింబు నటిస్తున్న తాజా చిత్రం 'వాలు' ఆడియో ఇంకా విడుదలకాలేదు. అయితే ఈ చిత్రానికి సంబంధించిన పాటలు నెట్లో విహరిస్తున్నాయి. తమ అభిమాన కథానాయకుడు శింబు కొత్త సినిమా పాటలను అభిమానులు చూసి తెగ ఎంజాయ్ చేస్తున్నారు. నిర్మాత మాత్రం విలవిలలాడిపోతున్నారని చెబుతున్నారు. అయితే ఇదంతా పబ్లిసిటీ స్టంట్ అని కోలీవుడ్‌లో గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి. -
బొద్దే ముద్దు
సాధారణంగా స్లిమ్‌గా, అందంగా ఉన్న భామల్ని చూసి ఎంత చక్కగున్నావే అంటూ పాడుకుంటుంటారు. అందు కు భిన్నంగా నటి తమన్న బొద్దుగా తయారయ్యే పనిలో పడడం విశేషం. నిజానికి ఈ బ్యూటీ సన్నగా, నాజుగ్గా ఉంటారు. కోలీవుడ్‌లో కేడీ చిత్రం ద్వారా ప్రతి నాయకిగా పరిచయమయ్యారు తమన్న. ఈ చిత్రం ఆశించిన విజయం సాధించకపోవడంతో టాలీవుడ్లో హ్యాపీడేస్‌తో తొలి విజయాన్ని అందుకున్నారు. దీంతో మళ్లీ తమిళంలో అవకాశాలు వరించాయి. పైయ్యా, అయన్ వంటి చిత్రాలతో సక్సెస్ఫుల్ నటిగా వెలిగిన తమన్నకు వేంగై తర్వాత అవకాశాలు రాకపోవడంతో టాలీవుడ్‌పై దృష్టి సారించారు. అనంతరం బాలీవుడ్లో పరిచయమైన తమన్నకు ప్రస్తుతం ఈ మూడు భాషలలోనూ అవకాశాలు అంతంత మాత్రమే. తమిళంలో చాలా గ్యాప్ తర్వాత నటించిన చిత్రం వీరం జనవరి 10న విడుదలకు ముస్తాబవుతోంది. తదుపరి అవకాశాలేమీ లేవు. దీంతో ఆఫర్ల అన్వేషణలో పడ్డారు. సన్నగా నాజుగ్గా ఉన్న ఈ బ్యూటీని కొంచెం మార్పు కోసం కాస్త లావెక్కమని కొందరు దర్శక నిర్మాతలు సలహా ఇచ్చారట. బరువెక్కడం ఎంతపని మళ్లీ సన్నబడడమే కష్టం అనుకున్న తమన్న లావెక్కే విషయం గురించి మరి కొందరు సన్నిహిత దర్శకుల సలహాలు అడిగారట. అందుకు వారు కోలీవుడ్‌లో అవకాశాలు రాబట్టాలంటే బరువెక్కడంలో తప్పు లేదని, కోలీవుడ్ ప్రేక్షకులకు బొద్దుగుమ్మలనే అధికంగా ఇష్టపడే వారని హితవు పలికారట. దీంతో ఈ మిల్కీ బ్యూటీ కాస్త ఒళ్లుపెంచే పనిలో పడ్డారట.