ఇదంతా పబ్లిసిటీ స్టంటేనా? | Is it publicity stunt? | Sakshi
Sakshi News home page

ఇదంతా పబ్లిసిటీ స్టంటేనా?

Published Mon, Mar 10 2014 3:20 PM | Last Updated on Mon, Aug 13 2018 4:19 PM

ఇదంతా పబ్లిసిటీ స్టంటేనా? - Sakshi

ఇదంతా పబ్లిసిటీ స్టంటేనా?

అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందడంతో సినిమా పరిశ్రమవారికి ఓ పక్క ఎంతో సౌకర్యంగా ఉన్నప్పటికీ, మరో పక్క సినిమాకు భద్రతలేకుండా పోతోంది. విడుదలకు ముందే సినిమాలో కొంత భాగం, పూర్తిగా సినిమా, పాటల పైరసీలు బయటకు వచ్చేస్తున్నాయి. కొన్ని సినిమాలలో సీన్స్, పాటలు విడుదలకు ముందే  అంతర్జాలంలో  హల్ చల్‌ చేస్తున్నాయి. ఒక్కోసారి  ఆ చిత్రంలో నటించే హీరోల  ఇమేజ్ వల్ల కూడా నిర్మాతలకు  ప్రమాదం ముంచుకువస్తోంది. ఎందుకంటే  తమ హీరో కొత్త మూవీ వివరాలు తెలుసుకోవడానికి  అతని అభిమానులు తెగ ఆరాటపడుతుంటారు. దాంతో వారు  నెట్ను ఆశ్రయిస్తుంటారు. సినిమా షూటింగ్ విశేషాలతో పాటు ఒక్కోసారి వాటికి సంబంధించిన దృశ్యాలు కూడా  నెట్లోకి వచ్చేస్తాయి.  పబ్లిసీటి కోసం సినిమా వారు అనుసరించే ఈ పద్దతి ద్వారా వారు విడుదల చేయని దృశ్యాలు కూడా నెట్లో దర్శనమిస్తాయి. దాంతో నిర్మాతలు  విలవిలలాడిపోతుంటారు.

మొన్నటికి మొన్న మహానటుడు అక్కినేని నాగేశ్వరరావు చివరగా నటించిన అన్నపూర్ణ ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మించిన 'మనం' సినిమా విడుదల కాకముందే పాటల వీడియోను యూట్యూబ్లో అప్లోడ్ చేశారు.  తాజాగా  కోలీవుడ్  మూవీ సాంగ్స్ రీలీజ్కు ముందే  నెట్లో పడిపోయాయి. కోలీవుడ్ మన్మథుడు  శింబు నటిస్తున్న తాజా చిత్రం 'వాలు' ఆడియో ఇంకా విడుదలకాలేదు. అయితే ఈ చిత్రానికి సంబంధించిన పాటలు నెట్లో విహరిస్తున్నాయి. తమ అభిమాన కథానాయకుడు శింబు కొత్త సినిమా పాటలను అభిమానులు చూసి  తెగ ఎంజాయ్ చేస్తున్నారు.  నిర్మాత మాత్రం విలవిలలాడిపోతున్నారని చెబుతున్నారు. అయితే ఇదంతా పబ్లిసిటీ స్టంట్ అని కోలీవుడ్లో గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement