vaalu
-
హన్సిక ముచ్చట తీరింది
అందమైన పరువాల ఈ తరం అమ్మాయి నటి హన్సిక. ఆమెకు ఒక అరుదైన ముచ్చట తీరిందట. కోలీవుడ్‌లో ప్రముఖ నటీమణుల్లో ఒకరిగా వెలుగొందుతున్న ఈ ఉత్తరాది భామ చేతిలో అరడజను చిత్రాలకు పైగా ఉన్నాయి. విచిత్రం ఏమిటంటే యాదృశ్చికమైనా కొన్ని విషయాల్లో ఈమెకు నయనతారకు పోలికలున్నాయి. శింబుతో ప్రేమాయణం నడిపి నయనతార దూరమైంది. అదే శింబుతో హన్సిక ప్రేమ పెళ్లి వరకూ దారి తీసి ఆగిపోయింది. ఆ తరువాత కూడా నయనతార శింబుతో ఇదు నమ్మ ఆళు చిత్రంలో జత కట్టారు. ఈ చిత్రం విడుదలలో జాప్యం జరుగుతోంది. హన్సిక శింబుతో నటించిన వాలు చిత్రం విడుదల్లో సమస్యలనెదుర్కొంటోంది. ఈ చిత్రం నిర్మాణంలో ఉండగానే వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించి చిత్రం పూర్తి కాకుండానే చెల్లాచెదురైంది. చిత్రంలో ఇంకా ఒక్క పాట చిత్రీకరించాల్సింది. కారణాలేమైనా వాలు చిత్ర షూటింగ్లో జాప్యం జరిగింది. మిగిలిన పాటను శింబుతో నటించడానికి హన్సిక మొదట్లో నిరాకరించారు. కారణం ఏదయినా ఇప్పటికే వాలు చిత్రం కోసం చాలా కాల్షీట్స్ కేటాయించానన్నది ఈమె వాదన. దీంతో ఆ పాటను సీనియర్ నటి సరోజాదేవి, సిమ్రాన్, కుష్భు,శింబులతో చిత్రీకరించాలని చిత్ర వర్గం భావించింది. అయితే దర్శకుడి రిక్వెస్ట్ మేరకు హన్సిక అంగీకరించడంతో ఇటీవల శింబు, హన్సికలపై చిత్రీకరించారు. ఇలా మాజీ ప్రియులతో మళ్లీ నటించిన చరిత్ర కోలీవుడ్‌లో ఇప్పటికి నయనతార, హన్సికలదే అవతుంది. ఇదిలా ఉంటే వాలు చిత్రంలోని తాజా పాటలో హన్సిక జయలలిత, నగ్మా, సిమ్రాన్‌ల గెటప్‌లలో నటించారట. ఒక్క పాటలోనైనా ఇలా వారిలా నటించడం అరుదైన ముచ్చట అంటున్నారు హన్సిక. ఈ నెల 17న విడుదల కావలసిన వాలు చిత్రం సమస్యల కారణంగా ఆగిపోయింది. అవరోధాలను అధిగమించి త్వరలోనే చిత్రాన్ని తెరపైకి తీసుకొస్తాం అంటున్నారు చిత్ర దర్శక నిర్మాతలు. -
అసలే బాధలో ఉన్నా!
అన్నీ సక్రమంగా కుదిరితేనే ఏ సినిమా అయినా అనుకున్న సమయానికి విడుదలవుతుంది. కుదరలేదా.. పడరాని పాట్లు పడాల్సి వస్తుంది. తమిళ హీరో శింబు నటించిన ‘వాలు’ చిత్రం అడుగడుగునా ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఈ సినిమా పూర్తి కావడానికి మూడేళ్లు పట్టింది. ఎలాగైనా విడుదల చేయాలనే పట్టుదలతో చిత్రబృందం అన్ని సమస్యలనూ అధిగమించుకుంటూ వచ్చింది. నిన్న శుక్రవారం విడుదల చేసేయడానికి సిద్ధపడ్డారు. కానీ, ఆర్థిక లావాదేవీలు, కోర్టు కేసులతో సినిమా రిలీజ్ ఆగిపోయింది. ఇది తట్టుకోలేని శింబు అభిమాని ఒకరు ఆత్మహత్యకు సిద్ధపడ్డారు. ఈ విషయం తెలుసుకున్న శింబు, ‘‘నేనసలే బాధలో ఉన్నా. ఇలాంటి పనులు చేసి, నన్నింకా బాధపెట్టొద్దు. దయచేసి అభిమానులందరూ ధైర్యంగా ఉండండి. నా కోసం ఎలాంటి త్యాగాలూ చేయొద్దు. మీరు కనబరిచే ప్రేమ నాకు ధైర్యాన్నిస్తుంది’’ అని విజ్ఞప్తి చేయాల్సి వచ్చింది. అసలే డిప్రెషన్లో ఉన్న శింబుకు ఎన్ని కష్టాలొచ్చాయో! -
శింబు కొత్తమూవీ ట్రైలర్ అదుర్స్
-
'శింబు' వాలు మూవీ స్టిల్స్
-
ఇదంతా పబ్లిసిటీ స్టంటేనా?
అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందడంతో సినిమా పరిశ్రమవారికి ఓ పక్క ఎంతో సౌకర్యంగా ఉన్నప్పటికీ, మరో పక్క సినిమాకు భద్రతలేకుండా పోతోంది. విడుదలకు ముందే సినిమాలో కొంత భాగం, పూర్తిగా సినిమా, పాటల పైరసీలు బయటకు వచ్చేస్తున్నాయి. కొన్ని సినిమాలలో సీన్స్, పాటలు విడుదలకు ముందే అంతర్జాలంలో హల్ చల్ చేస్తున్నాయి. ఒక్కోసారి ఆ చిత్రంలో నటించే హీరోల ఇమేజ్ వల్ల కూడా నిర్మాతలకు ప్రమాదం ముంచుకువస్తోంది. ఎందుకంటే తమ హీరో కొత్త మూవీ వివరాలు తెలుసుకోవడానికి అతని అభిమానులు తెగ ఆరాటపడుతుంటారు. దాంతో వారు నెట్‌ను ఆశ్రయిస్తుంటారు. సినిమా షూటింగ్ విశేషాలతో పాటు ఒక్కోసారి వాటికి సంబంధించిన దృశ్యాలు కూడా నెట్లోకి వచ్చేస్తాయి. పబ్లిసీటి కోసం సినిమా వారు అనుసరించే ఈ పద్దతి ద్వారా వారు విడుదల చేయని దృశ్యాలు కూడా నెట్లో దర్శనమిస్తాయి. దాంతో నిర్మాతలు విలవిలలాడిపోతుంటారు. మొన్నటికి మొన్న మహానటుడు అక్కినేని నాగేశ్వరరావు చివరగా నటించిన అన్నపూర్ణ ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మించిన 'మనం' సినిమా విడుదల కాకముందే పాటల వీడియోను యూట్యూబ్‌లో అప్లోడ్ చేశారు. తాజాగా కోలీవుడ్ మూవీ సాంగ్స్ రీలీజ్‌కు ముందే నెట్లో పడిపోయాయి. కోలీవుడ్ మన్మథుడు శింబు నటిస్తున్న తాజా చిత్రం 'వాలు' ఆడియో ఇంకా విడుదలకాలేదు. అయితే ఈ చిత్రానికి సంబంధించిన పాటలు నెట్లో విహరిస్తున్నాయి. తమ అభిమాన కథానాయకుడు శింబు కొత్త సినిమా పాటలను అభిమానులు చూసి తెగ ఎంజాయ్ చేస్తున్నారు. నిర్మాత మాత్రం విలవిలలాడిపోతున్నారని చెబుతున్నారు. అయితే ఇదంతా పబ్లిసిటీ స్టంట్ అని కోలీవుడ్‌లో గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి. -
నెట్లో శింబు 'వాలు' లీక్డ్ పాటలు