అసలే బాధలో ఉన్నా! | Simbu's Fan Tries to Commit Suicide over 'Vaalu' Delay | Sakshi
Sakshi News home page

అసలే బాధలో ఉన్నా!

Published Fri, Jul 17 2015 10:59 PM | Last Updated on Sun, Sep 3 2017 5:41 AM

అసలే బాధలో ఉన్నా!

అసలే బాధలో ఉన్నా!

అన్నీ సక్రమంగా కుదిరితేనే ఏ సినిమా అయినా అనుకున్న సమయానికి విడుదలవుతుంది. కుదరలేదా.. పడరాని పాట్లు పడాల్సి వస్తుంది. తమిళ హీరో శింబు నటించిన ‘వాలు’ చిత్రం అడుగడుగునా ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఈ సినిమా పూర్తి కావడానికి మూడేళ్లు పట్టింది. ఎలాగైనా విడుదల చేయాలనే పట్టుదలతో చిత్రబృందం అన్ని సమస్యలనూ అధిగమించుకుంటూ వచ్చింది. నిన్న శుక్రవారం విడుదల చేసేయడానికి సిద్ధపడ్డారు. కానీ, ఆర్థిక లావాదేవీలు, కోర్టు కేసులతో సినిమా రిలీజ్ ఆగిపోయింది. ఇది తట్టుకోలేని శింబు అభిమాని ఒకరు ఆత్మహత్యకు సిద్ధపడ్డారు. ఈ విషయం తెలుసుకున్న శింబు, ‘‘నేనసలే బాధలో ఉన్నా. ఇలాంటి పనులు చేసి, నన్నింకా బాధపెట్టొద్దు. దయచేసి అభిమానులందరూ ధైర్యంగా ఉండండి. నా కోసం ఎలాంటి త్యాగాలూ చేయొద్దు. మీరు కనబరిచే ప్రేమ నాకు ధైర్యాన్నిస్తుంది’’ అని విజ్ఞప్తి చేయాల్సి వచ్చింది. అసలే డిప్రెషన్‌లో ఉన్న శింబుకు ఎన్ని కష్టాలొచ్చాయో!
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement