ఇండస్ట్రీ ప్లే బాయ్‌తో చెయ్యి కలపనున్న 'సాయి పల్లవి' | Sai Pallavi Upcoming Movie With Star Hero | Sakshi
Sakshi News home page

ఇండస్ట్రీ ప్లే బాయ్‌తో చెయ్యి కలపనున్న 'సాయి పల్లవి'

Published Tue, Feb 11 2025 6:35 AM | Last Updated on Tue, Feb 11 2025 11:01 AM

Sai Pallavi Upcoming Movie With Star Hero

సాయిపల్లవికి నటిగా ప్రత్యేక గుర్తింపు ఉంది. వచ్చిన అవకాశాలన్నింటినీ ఒప్పేసుకోవడం ఈమె నైజం కాదు. కథ, అందులో తన పాత్ర నచ్చితేనే నటించడానికి పచ్చజెండా ఊపుతారు. అదీ తన పాత్రకు ప్రాధాన్యత ఉండాలి. ఇకపోతే గ్లామరస్‌గా ఉండకూడదు. అలాంటి పాత్రల్లో నటిస్తూనే వరుస విజయాలను అందుకుంటున్నారు. ఇటీవల శివకార్తికేయన్‌కు జంటగా అమరన్‌ చిత్రంలో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. అదేవిధంగా తాజాగా నాగచైతన్య సరసన తండేల్‌ చిత్రంలో నటించి తన ప్రత్యేకతను చాటుకున్నారు. ప్రస్తుతం హిందీలో రామాయణం చిత్రంలో సీత పాత్రలో నటిస్తున్నారు. కాగా తాజాగా మరో కోలీవుడ్‌ చిత్రం కోసం సాయిపల్లవి పేరు వినిపిస్తోంది. అదీ సంచలన నటుడు శింబుతో జత కట్టే విషయమై ప్రచారం జోరందుకుంది. 

శింబు ఇప్పుడు నటుడు కమలహాసన్‌ హీరోగా మణిరత్నం దర్శకత్వంలో నటించిన థగ్‌లైఫ్‌ చిత్రంలో ప్రధాన పాత్రను పోషించారు. ఈ చిత్రం జూన్‌లో తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. కాగా తాజాగా వరుసగా మూడు చిత్రాల్లో నటించడానికి శింబు సిద్ధం అవుతున్నారు. అందులో ఒకటి పార్కింగ్‌ చిత్రం ఫేమ్‌ రామ్‌కుమార్‌ దర్శకత్వం వహించనున్న చిత్రం. డాన్‌ పిక్చర్స్‌ పతాకంపై ఆకాశ్‌ భాస్కరన్‌ నిర్మిస్తున్న ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను ఇటీవల నటుడు శింబు పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేశారు. అందులో శింబు చేతిలో ఉన్న పుస్తకంలో రక్తం మరకలు కలిగిన కత్తి ఉండడంతో ఇది యాక్షన్‌ ఎంటర్‌టెయినర్‌ కథా చిత్రంగా ఉంటుందని తెలుస్తోంది. 

సాయి పల్లవి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చేనా..
ఈ చిత్రంలో కథానాయకిగా నటి సాయిపల్లవి నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. అదేవిధంగా మరో ముఖ్య పాత్రలో నటుడు సంతానం నటించనున్నట్లు టాక్‌ వైరల్‌ అవుతోంది. హాస్య నటుడిగా పరిచయం అయ్యి ఆ తరువాత కథానాయకుడిగా రాణిస్తున్న సంతారం ఈ చిత్రం ద్వారా మళ్లీ క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా నటించడానికి సిద్ధం అవుతున్నట్లు సమాచారం. ఇకపోతే శింబు నటించిన గత సినిమాలను పరిశీలిస్తే ఎక్కువగా హీరోయిన్‌తో రొమాంటిక్‌ సీన్స్‌ లేదా సాంగ్స్‌ ఉండటం సహజం. కోలీవుడ్‌ ప్లే బాయ్‌ అనే ట్యాగ్‌లైన్‌ కూడా ఆయనకు ఉంది. 

నయనతార,హన్సిక,ఆండ్రియా, హర్షిక,త్రిష,సనా ఖాన్‌ వంటి వారితో ఆయనకు ఎఫైర్స్‌ ఉన్నాయంటూ కోలీవుడ్‌లో వార్తలు కూడా వచ్చాయి. అయితే, సింబు సినిమాలో సాయి పల్లవి నటించడానికి సమ్మతించారా..? అన్నదే ప్రశ్నార్థకంగా మారింది. నిజంగా ఆమె అంగీకరించినట్లయితే అందులో ఆమె పాత్ర స్ట్రాంగ్‌ అయ్యి ఉంటుందని భావించవచ్చు. కాగా ఈ క్రేజీ కాంబినేషన్‌కు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడే అవకాశం ఉంది. కాగా ఇది శింబు నటించనున్న 49వ చిత్రం అన్నది గమనార్హం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement