అమ్మమ్మ ఇచ్చిన చీరతో పెళ్లిపీటలు ఎక్కుదామనుకుంటే..: సాయి పల్లవి | Sai Pallavi Sweet Memory With Her Grandmother Saree Gift | Sakshi
Sakshi News home page

అమ్మమ్మ ఇచ్చిన చీరతో పెళ్లిపీటలు ఎక్కుదామనుకుంటే..: సాయి పల్లవి

Feb 18 2025 7:10 AM | Updated on Feb 18 2025 8:46 AM

Sai Pallavi Sweet Memory With Her Grandmother Saree Gift

సినిమాల్లో నటించే వారందరూ నటీనటులే. అయితే అందులో మంచి గుర్తింపు పొందే వారు మాత్రం కొందరే ఉంటారు. అలాంటి వారికి అవార్డులు అంగీకారమే కాకుండా, చాలా ప్రోత్సాహంగా ఉంటాయి. కాగా ఒక్కో సారి ప్రతిభావంతులైన నటీనటులకు కూడా ఉత్తమ అవార్డులు ఆలస్యంగానే వస్తుంటాయి. ఆ పట్టికలో నటి సాయిపల్లవి కూడా ఉన్నారు. ఈమె నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. నటించిన ప్రతిచిత్రంలోనూ తన ప్రత్యేకతను చాటు కుంటారు. సహజత్వానికి ప్రాధాన్యతనిస్తారు. ఇటీవల ఈమె నటించిన తమిళ చిత్రం అమరన్‌, తెలుగు చిత్రం తండేల్‌ ఒక ఉదాహరణ. 

సినీ విజ్ఞులను సైతం తన నటనతో మెప్పిస్తున్న నటి సాయిపల్లవి. మలయాళం, తెలుగు, తమిళం భాషల్లో ప్రముఖ కథానాయకిగా రాణిస్తుంది. ఈమె ఇటీవల ఓ భేటీలో జాతీయ ఉత్తమ నటి అవార్డును అందుకోవాలనే కోరికను వ్యక్తం చేశారు. దీని గురించి సాయిపల్లవి తెలుపుతూ తనకు 21 ఏళ్ల వయసులో తన బామ్మ ఓ చీరను ఇచ్చారన్నారు. దాన్ని తన పెళ్లి రోజున కట్టుకోవమని చెప్పారన్నారు. అప్పటికి తను సినిమాల్లోకి రాలేదట, కాబట్టి పెళ్లి చేసుకున్నప్పుడు కట్టుకుందామనుకుని దానిని దాచిపెట్టినట్లు చెప్పింది. తనకు 23 ఏళ్ల వయసులో ప్రేమమ్‌ చిత్రంలో అవకాశం వచ్చినట్లు చెప్పింది. అయితే, ప్రేమమ్‌ విడుదల తర్వాత ఏదోక రోజు  ప్రతిష్ఠాత్మక అవార్డు అందుకుంటానని నమ్మకం కలగినట్లు చెప్పుకొచ్చింది. 

చిత్ర పరిశ్రమలో అంత గొప్ప అవార్డు జాతీయ అవార్డే కాబట్టి అందుకోసం కష్టపడుతానని ఆమె చెప్పింది. అందుకే దాన్ని దక్కించుకున్న రోజు అమ్మమ్మ చీర కట్టుకుని అవార్డుల ప్రదానోత్సవానికి హాజరు కావాలని నిర్ణయించుకున్నట్లు సాయి పల్లవి పేర్కొంది. ఆ అవార్డును గెలుచుకునే వరకూ తనకు ఆ భారం ఉంటుందని నటి సాయిపల్లవి పేర్కొన్నారు. అలా జాతీయ అవార్డుతో అమ్మమ్మ చీరకు ఒక కనెక్షన్‌ ఉండిపోయిందని నవ్వుతూ చెప్పింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement