హీరోయిన్ సాయి పల్లవి (Sai Pallavi) చెల్లి పూజా కన్నన్ సెప్టెంబర్‌లో పెళ్లి పీటలెక్కింది. క్లోజ్ ఫ్రెండ్ వినీత్‌తో ఏడడుగులు వేసింది. ఈ వేడుకలో హీరోయిన్ కుటుంబం సంతోషంగా గడిపారు. అదే సమయంలో పెళ్లయ్యే క్షణాల్లో కన్నీళ్లు ఆపుకోలేకపోయారు. తాజాగా మరోసారి ఆ వెడ్డింగ్ ఫోటోలను సాయిపల్లవి సోషల్ మీడియాలో షేర్ చేసింది. నా చెల్లి పెళ్లి తర్వాత నా జీవితం కొత్త దశలోకి వెళ్తుందని నాకు తెలుసు.
నేనే సాక్ష్యం
ఆ వేడుకకు వచ్చినవాళ్ల ఆశీర్వాదాలు, కన్నీళ్లు, డ్యాన్స్ ప్రతీదానికి నేను సాక్ష్యంగా నిలిచాను. పూజ వైవాహిక బంధంలో అడుగుపెట్టేందుకు మొదట నా మనసు ఒప్పుకోలేదు. ఎందుకంటే ఇదంతా కొత్తగా అనిపించింది. ఇకపై నీకు ఎటువంటి సలహాలు, సూచనలు ఇవ్వలేను. కానీ నా మనసులో మాత్రం వినీత్ నిన్ను నా అంతగా లేదా నాకంటే ఎక్కువగా ప్రేమిస్తాడన్న నమ్మకముంది.
ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు
మీ పెళ్లయి మూడు నెలలవుతోంది. నేను అనుకున్నట్లుగానే తను నిన్ను ఎంతో బాగా చూసుకుంటున్నాడు. మీ జంటపై ప్రేమను కురిపించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అని రాసుకొచ్చింది. ఇది చూసిన అభిమానులు మీ అక్కాచెల్లెళ్ల మధ్య ప్రేమ ఎప్పటికీ ఇలాగే ఉండాలని కామెంట్లు చేస్తున్నారు.
చదవండి: నాపై దిగజారుడు వ్యాఖ్యలు.. ఫేమస్ అవడానికేనా?: ఉర్ఫీ
Comments
Please login to add a commentAdd a comment