కామెడీ ఒకర్ని నవ్వించేలా ఉండేలా కానీ అవతలివ్యక్తిని చులకన చేసేదిగా ఉండకూడదు. ఈ మధ్య వల్గర్, డార్క్, డబుల్ మీనింగ్ కామెడీలు ఎక్కువైపోయాయి. హాస్యం నెపంతో అసభ్యంగా మాట్లాడుతున్నారు. తాజాగా ఓ షోలోని కమెడియన్స్ కూడా అదే పని చేశారంటోంది నటి, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ ఉర్ఫీ జావెద్.
పిచ్చి జోకులు
'ఇండియాస్ గాట్ లాటెంట్' అనే షోకు ఇటీవల ఉర్ఫీ జావెద్ గెస్ట్‌గా వెళ్లింది. కానీ అక్కడి కంటెస్టెంట్లు తనపై పిచ్చి జోకులు వేస్తూ చౌకబారు వ్యాఖ్యలు చేయడంతో షో మధ్యలోనే వెళ్లిపోయింది. తాజాగా ఈ చేదు అనుభవం గురించి ఆమె సోషల్ మీడియా వేదికగా స్పందించింది. 'వ్యూస్ కోసం ఇతరులపై అభ్యంతర వ్యాఖ్యలు చేయడం ఈ రోజుల్లో సామాన్యమైపోయింది. కానీ నన్ను అవమానిస్తుంటే, వేధిస్తుంటే, అవకాశాల కోసం ఎంతమందితో ఉన్నానని ఏవేవో లెక్కలు వేస్తుంటే నేను ఒప్పుకోను.
ఫేమస్ అవడానికేనా?
ఇదంతా ఎందుకు చేస్తున్నారు? క్షణాలపాటు ఫేమస్ అవడానికేనా? అక్కడ స్టేజీపై ఓ వ్యక్తిని ఎందుకు వికలాంగుడిగా నటిస్తున్నావని అడిగాను. అందుకతడు అందరి ముందు దుర్భాషలాడాడు. కోపంతో పిచ్చిగా ఏదేదో వాగాడు.ఈ సంఘటనకు సమ్ రైనాకు ఎటువంటి సబంధం లేదు. అతడు నాకు మంచి స్నేహితుడు. నేను కేవలం అక్కడున్న కంటెస్టెంట్ల గురించే మాట్లాడుతున్నాను' అని ఉర్ఫీ చెప్పుకొచ్చింది.
చదవండి: భార్యాభర్తలే కానీ ఒక గదిలో ఉండరట.. ఎంత టార్చర్ పెట్టారో!: సింగర్
Comments
Please login to add a commentAdd a comment