fan Suicide
-
వైరల్: ప్రభాస్ అభిమాని సూసైడ్ నోట్.. నా చావుకి కారణం వాళ్లే అంటూ..
బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు డార్లింగ్ ప్రభాస్. ఇక ఆ సినిమా తరువాత కాస్త విరామం తీసుకున్నా, ఇటీవల మాత్రం వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా మారాడు డార్లింగ్. అయితే సాహో తరువాత ప్రభాస్ సినిమాల అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ఓ అభిమాని రాధే శ్యామ్ చిత్ర యూనిట్ కు రాసిన లేఖ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. అందులో.. సార్.. ఇంతవరకు ఒక లెటర్ కూడా రాయని నేను సూసైడ్ నోట్ రాస్తానని కలలో కూడా అనుకోలేదు. మీరు అప్డేట్స్ ఇవ్వకపోవడం వల్ల రాయక తప్పడం లేదు. కనీసం నా చావు చూసైనా రాధేశ్యామ్ అప్డేట్ ఇస్తారని అనుకొంటున్నాను. చాలా రోజులు వేచి చూసేలా చేశారు. మేము వెయిట్ చేశాం. ఇక చాలు సార్ అంటూ అని అభిమాని ఆందోళన చెందుతూ సూసైడ్ లెటర్ లో ఓ అభిమానిగా తన ఆవేదనను తెలిపాడు. @UV_Creations @director_radhaa #RadheShyam #Prabhas ఈ లెటర్ రాసింది ఒక రెబెల్ స్టార్ fan అయ్యినా కానీ ప్రతీ యొక్క రెబెల్ స్టార్ ఆవేదన అది అని అర్ధం చేసుకోండి @director_radhaa @UV_Creations 🙏 pic.twitter.com/j2KyqoESXo — Vamsi (@Vamsi48324621) November 11, 2021 అంతటితో అభిమాని ఆగకుండా.. నా చావుకి కారణం యూవీ క్రియేషన్స్ టీమ్, డైరెక్టర్ రాధాకృష్ణ మాత్రమే. ఈ యూనిట్‌కు చిన్న మనవి.. ఫ్యాన్స్ ఎమోషన్స్‌తో ఆడుకోవద్దు.. ఇట్లు.. రెబెల్ స్టార్ ఫ్యాన్ అంటూ అభిమాని విన్నవించుకొన్నారు. ప్రస్తుతం ఈ లెటర్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.రాధేశ్యామ్ చిత్రాన్ని జనవరి 14వ తేదీన రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది చదవండి: Allu Sirish: మర్చిపోలేని రోజు, సోషల్ మీడియాను వీడుతున్నా.. -
Puneeth Rajkumar: పునీత్ అభిమాని ఆత్మహత్య
సాక్షి, బళ్లారి: పవర్ స్టార్ పునీత్‌రాజ్‌కుమార్ అకాల మరణాన్ని జీర్ణించుకోలేక దావణగెరె నగరంలోని విజయనగర కాలనీకి చెందిన సీ.కుమార్ (25) అనే యువకుడు బుధవారం తన ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పునీత్ రాజకుమార్ అంటే ఇష్టపడేవాడని, పునీత్ నటించిన ప్రతి సినిమాను వీక్షించేవాడని, కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. దావణగెరె పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. పునీత్‌కు నివాళి రాయచూరురూరల్: కర్ణాటక విద్యుత్ ఉద్యోగుల సంఘం ప్రముఖులు, నాయకులు కేపీటీసీఎల్ భవనంలో బుధవారం పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.అధ్యక్షుడు గోపి తదితరులు పాల్గొన్నారు. చదవండి: (కంఠీరవకు.. అభిమాన సంద్రం) -
అజిత్ వీరాభిమాని ఆత్మహత్య..
తమిళ స్టార్ హీరో తలా అజిత్ అభిమాని ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపుతోంది. ప్రకాశ్ అనే యువకుడు అజిత్‌కు వీరాభిమాని.. అతని ఒంటి నిండ నటుడికి సంబంధించిన పచ్చబొట్టులే ఉంటాయి. అజిత్ సినిమాలేవి విడుదలైన ఫస్ట్‌డే ఫస్ట్షోనే చూస్తాడు. అంతేగాక అజిత్ బయట ఏ ఫంక్షన్‌కు హాజరైనా అందులో ప్రకాశ్ ఉత్సాహంగా పాల్గొంటాడు. ఈ క్రమంలో ప్రకాశ్ బుధవారం(ఫిబ్రవరి 24) సుసైడ్ చేసుకోవడం కోలివుడ్లో విషాదం నెలకొంది. అయితే ప్రకాశ్ ఆత్మహత్యకు వ్యక్తిగత విషయాలే కారణమని తెలుస్తోంది. అభిమాని సుసైడ్ విషయాన్ని అజిత్ కుమార్ ఫ్యాన్స్ క్లబ్ ట్విటర్లో షేర్ చేసింది. ‘ఈ రోజు తలా అజిత్ వీరాభిమాని, మంచి వ్యక్తిని కోల్పోయాం. అతని కుటుంబాన్ని ఆదుకోవాలని, అవసరాలు తీర్చాలని స్థానికంగా దగ్గరలో ఉన్న అజిత్ ఫ్యాన్స్‌ను కోరుకుంటున్నాం. తమ కుటుంభానికి మా ప్రగాఢ సానుభూతి’ అని ట్వీట్ చేశారు. కాగా అజిత్ అభిమాని ఆత్మహత్య చేసుకోవడంతో మిగతా అభిమానులు షాక్‌కు గురవుతున్నారు. #RIPPrakash పేరుతో సోషల్ మీడియా వేదికగా నివాళులు అర్పిస్తున్నారు. అయితే జీవితంలో ఏ సమస్యకూ చావు పరిష్కారం కాదని హితవు పలుకుతున్నారు. సమస్య ఎదురైనప్పుడు సమర్థవంతంగా ఎదుర్కొని అధిగమించాలని సూచిస్తున్నారు. ఇదే చివరి ఆత్మహత్య కావాలని ప్రార్థిస్తున్నారు. Today We Lost One Of the Good Soul and One of the Die Hard THALA AJITH Fan 😑 Requesting Nearby Located FC's/Fans to Take Care of His Family And Any Needs 🙏 Kindly Support Family With Ur Assist Our deepest condolences and prayers to their Family.#RIPThalaPRAKASH #RIPPrakash pic.twitter.com/W8zj0v0HkO — AJITHKUMAR FANS CLUB (@ThalaAjith_FC) February 24, 2021 #RIPPrakash Sucide is not a solution brother💔 pic.twitter.com/so9uwyyKBe — P H O E N I X (@phoenixnk98) February 24, 2021 -
హీరో వీరాభిమాని ఆత్మహత్య : ఆఖరి కోరిక
సాక్షి,బెంగళూరు : కేజీఎఫ్ హీరో యశ్ వీరాభిమాని ఆత్మహత్య విషాదాన్ని నింపింది. కర్నాటక మాండ్యా జిల్లా కోడిదొడ్డి గ్రామానికి చెందిన రామకృష్ణ (25) ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. అంతేకాదు తాను కేజీఎఫ్‌స్టార్ తోపాటు, కర్నాటక మాజీ సీఎం, ప్రతిపక్ష నాయకుడు సిద్దరామయ్య ఇద్దరికీ విపరీతమైన అభిమాననని చెప్పుకున్నాడు. అందుకే వారిద్దరూ తన అంత్యక్రియలకు హాజరుకావాలని, అదే తన చివరి కోరిక అని పేర్కొన్నాడు. ఈ మేరకు రామకృష్ట రాసిన సూసైడ్ నోట్ (కన్నడ)కంటతడి పెట్టిస్తోంది.‘తల్లికి మంచి కొడుకుగా, అన్నయ్యకు మంచి సోదరుడిగా మారలేక పోయాను. చివరికి ప్రేమను గెలవడంలో కూడా విఫలమయ్యాను. ఇక జీవితంలో సాధించడానికి ఏమీలేదు’ అంటూ నోట్లో పేర్కొన్నాడు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు విషయం తెలిసిన సిద్ధరామయ్య రామకృష్ణ మృతదేహానికి నివాళులర్పించి, అంత్యక్రియల్లో పాల్గొన్నారు. ఇలాంటి పరిస్తితుల్లో తన అభిమానిని కలుసుకోవడం బాధగా ఉందన్నారు. ఎవరూ ఆత్మహత్యకు పాల్పడకూడదని సూచించారు. ఫ్యాన్స్ అభిమానమే జవం.. జీవం.. మాండ్యా రామకృష్ణ అభిమానం వెలకట్టలేనిది అంటూ హీరో యశ్ ట్విటర్లో స్పందించారు. ఈలలు, చప్పట్లు, ప్రేమను మాత్రమే తాము ఇష్టపడతాం కానీ అభిమానులనుంచి తాము ఆశించేది ఇది కాదంటూ రామకృష్ణ మరణంపై యశ్ సంతాపం ప్రకటించారు. ಅಭಿಮಾನಿಗಳ ಅಭಿಮಾನವೇ ನಮ್ಮ ಬದುಕು.. ಜೀವನ.. ಹೆಮ್ಮೆ.. ಆದರೆ ಮಂಡ್ಯದ ರಾಮಕೃಷ್ಣನ ಅಭಿಮಾನಕ್ಕೆ ಹೆಮ್ಮೆಪಡಲು ಸಾಧ್ಯವೇ... ಅಭಿಮಾನಿಗಳ ಅಭಿಮಾನಕ್ಕೆ ಇದು ಮಾದರಿಯಾಗದಿರಲಿ.. ಕೋಡಿ ದೊಡ್ಡಿ ರಾಮಕೃಷ್ಣನ ಆತ್ಮಕ್ಕೆ ಚಿರಶಾಂತಿ ಸಿಗಲಿ... ಓಂ ಶಾಂತಿ... — Yash (@TheNameIsYash) February 18, 2021 -
పవన్ కల్యాణ్ అభిమాని ఆత్మహత్య
కావలి: పట్టణంలోని సబ్‌కోర్టు వీధిలో ఫోటో స్టూడియో నిర్వహిస్తున్న పసుపులేటి నరేంద్ర (24) అనే పవన్ కల్యాణ్ అభిమాని సోమవారం రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికుల కథనం మేరకు.. కావలి మండలం తాళ్లపాళెం పంచాయతీ రామచంద్రాపురం గ్రామానికి చెందిన నరేంద్ర కావలి పట్టణ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అసోసియేషన్‌కు సంయుక్త కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. అవివాహితుడైన నరేంద్ర ప్రేమించిన యువతి వ్యవహారంలో మనస్థాపం చెంది నాలుగు రోజులుగా మద్యం తాగుతూ సన్నిహితుల వద్ద తన ప్రేమ విఫలంపై ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలిపారు. తాను ప్రేమించిన యువతిని ఇంటికి తీసుకువస్తానని తండ్రికి చెప్పాడు. అందుకు ఆయన అంగీకరించలేదు. ఈ విషయాన్ని బాబాయ్‌కి చెప్పగా, ఆయన మీ నాన్నాతో నేను మాట్లాడుతాను, ఎక్కడున్నవో చెప్పు అని నరేంద్రను ఫోన్లో ప్రశ్నించాడు. ఎందుకులే బాబాయ్... అని సమాధానం చెప్పి ఆత్మహత్య చేసుకోవడానికి సిద్ధమైపోయాడు. ఈ క్రమంలో సోమవారం ముసునూరు దాటిన తర్వాత చెంచుగానిపాళెం గ్రామానికి వెళ్లే రోడ్డుకు ఎదురుగా ఉన్న రైల్వే ట్రాక్‌పై ఎదురుగా రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో రామచంద్రాపురం గ్రామంలో విషాదం అలముకొంది. -
అసలే బాధలో ఉన్నా!
అన్నీ సక్రమంగా కుదిరితేనే ఏ సినిమా అయినా అనుకున్న సమయానికి విడుదలవుతుంది. కుదరలేదా.. పడరాని పాట్లు పడాల్సి వస్తుంది. తమిళ హీరో శింబు నటించిన ‘వాలు’ చిత్రం అడుగడుగునా ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఈ సినిమా పూర్తి కావడానికి మూడేళ్లు పట్టింది. ఎలాగైనా విడుదల చేయాలనే పట్టుదలతో చిత్రబృందం అన్ని సమస్యలనూ అధిగమించుకుంటూ వచ్చింది. నిన్న శుక్రవారం విడుదల చేసేయడానికి సిద్ధపడ్డారు. కానీ, ఆర్థిక లావాదేవీలు, కోర్టు కేసులతో సినిమా రిలీజ్ ఆగిపోయింది. ఇది తట్టుకోలేని శింబు అభిమాని ఒకరు ఆత్మహత్యకు సిద్ధపడ్డారు. ఈ విషయం తెలుసుకున్న శింబు, ‘‘నేనసలే బాధలో ఉన్నా. ఇలాంటి పనులు చేసి, నన్నింకా బాధపెట్టొద్దు. దయచేసి అభిమానులందరూ ధైర్యంగా ఉండండి. నా కోసం ఎలాంటి త్యాగాలూ చేయొద్దు. మీరు కనబరిచే ప్రేమ నాకు ధైర్యాన్నిస్తుంది’’ అని విజ్ఞప్తి చేయాల్సి వచ్చింది. అసలే డిప్రెషన్లో ఉన్న శింబుకు ఎన్ని కష్టాలొచ్చాయో!