వైరల్: ప్రభాస్ అభిమాని సూసైడ్ నోట్.. నా చావుకి కారణం వాళ్లే అంటూ.. | Prabhas Fan Suicide Letter Delaying Movie Updates Goes Viral | Sakshi
Sakshi News home page

వైరల్: ప్రభాస్ అభిమాని సూసైడ్ నోట్.. నా చావుకి కారణం వాళ్లే అంటూ..

Nov 11 2021 11:22 PM | Updated on Nov 12 2021 6:13 PM

Prabhas Fan Suicide Letter Delaying Movie Updates Goes Viral - Sakshi

మీరు అప్‌డేట్స్ ఇవ్వకపోవడం వల్ల రాయక తప్పడం లేదు. కనీసం నా చావు చూసైనా రాధేశ్యామ్ అప్‌డేట్ ఇస్తారని అనుకొంటున్నాను.

బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు డార్లింగ్ ప్రభాస్. ఇక ఆ సినిమా తరువాత కాస్త విరామం తీసుకున్నా, ఇటీవల మాత్రం వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా మారాడు డార్లింగ్. అయితే సాహో తరువాత ప్రభాస్ సినిమాల అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ఓ అభిమాని రాధే శ్యామ్ చిత్ర యూనిట్ కు రాసిన లేఖ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

అందులో.. సార్.. ఇంతవరకు ఒక లెటర్ కూడా రాయని నేను సూసైడ్ నోట్ రాస్తానని కలలో కూడా అనుకోలేదు. మీరు అప్‌డేట్స్ ఇవ్వకపోవడం వల్ల రాయక తప్పడం లేదు. కనీసం నా చావు చూసైనా రాధేశ్యామ్ అప్‌డేట్ ఇస్తారని అనుకొంటున్నాను. చాలా రోజులు వేచి చూసేలా చేశారు. మేము వెయిట్ చేశాం. ఇక చాలు సార్ అంటూ అని అభిమాని ఆందోళన చెందుతూ సూసైడ్ లెటర్ లో ఓ అభిమానిగా తన ఆవేదనను తెలిపాడు.
 

అంతటితో అభిమాని ఆగకుండా.. నా చావుకి కారణం యూవీ క్రియేషన్స్ టీమ్, డైరెక్టర్ రాధాకృష్ణ మాత్రమే. ఈ యూనిట్‌కు చిన్న మనవి.. ఫ్యాన్స్ ఎమోషన్స్‌తో ఆడుకోవద్దు.. ఇట్లు.. రెబెల్ స్టార్ ఫ్యాన్ అంటూ అభిమాని విన్నవించుకొన్నారు. ప్రస్తుతం ఈ లెటర్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.రాధేశ్యామ్ చిత్రాన్ని జనవరి 14వ తేదీన రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది
చదవండి: Allu Sirish: మర్చిపోలేని రోజు, సోషల్‌ మీడియాను వీడుతున్నా..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement