Radhe Shyam
-
జపాన్‌లో ప్రభాస్ బర్త్ డే సెలబ్రేషన్స్.. రీ రిలీజ్ కూడా
పాన్ ఇండియా పుణ్యమా అని మన హీరోలకు ఇతర రాష్ట్రాలు, దేశాల్లోనూ బోలెడంత మంది అభిమానులు ఉంటున్నారు. 'బాహుబలి'తో అంతర్జాతీయ గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్‌కి మన దేశంతో పాటు జపాన్‌లోనూ లెక్కలేనంత మంది ఫ్యాన్స్ ఉన్నారు. వాళ్లలో కొందరు ఇప్పుడు డార్లింగ్ ప్రీ బర్త్ డే సెలబ్రేషన్స్ గ్రాండ్‌గా నిర్వహించారు.(ఇదీ చదవండి: కాబోయే భార్యతో నాగచైతన్య.. పెళ్లికి ముందే చెట్టాపట్టాల్!)అక్టోబర్ 23న ప్రభాస్ పుట్టినరోజు. ఆ రోజున రాజా సాబ్, కల్కి 2, సలార్ 2 సినిమాలకు సంబంధించి అప్డేట్స్ రావొచ్చని టాక్. మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే పలుచోట్ల 'సలార్' రీ రిలీజ్ చేశారు. మిస్టర్ ఫెర్ఫెక్ట్, ఈశ్వర్, రెబల్ చిత్రాల్ని కూడా రీ రిలీజ్ చేస్తారు.ఇప్పుడు జపాన్‌లోనూ ప్రభాస్ పుట్టినరోజు వేడుకల్ని జరుపుకోవడంతో పాటు 'రాధేశ్యామ్' మూవీని రీ రిలీజ్ చేశారు. లేడీ ఫ్యాన్స్ చాలామంది ఈ సినిమాని చూసి ఫుల్ సెలబ్రేట్ చేసుకున్నారు. ఫొటోలు, వీడియోలు కొన్ని వైరల్ కావడంతో ఇక్కడి డార్లింగ్ ఫ్యాన్స్ ఖుషీ అయిపోతున్నారు.(ఇదీ చదవండి: మరో స్టార్ కొరియోగ్రాఫర్‌పై చీటింగ్ కేసు)I’m overjoyed to see our darling #Prabhas fans in Japan celebrating his birthday in Tokyo! They sent their heartfelt wishes to our Rebel Star ♥️😍#HappyBirthdayPrabhas pic.twitter.com/yEBj9FSbMY— Prasad Bhimanadham (@Prasad_Darling) October 19, 2024 -
ప్రభాస్ సరికొత్త రికార్డ్.. ఏ సౌత్ హీరో వల్ల కాలేదు!
మీకు తెలిసిన ఫస్ట్ పాన్ ఇండియా స్టార్ ఎవరు? అని అడిగితే ఇప్పటి జనరేషన్ టక్కున చెప్పే పేరు ప్రభాస్. 'బాహుబలి' ముందు వరకు కేవలం తెలుగుకే పరిమితమైన ఇతడు.. ఆ తర్వాత తన రేంజుని అంతకంతకు పెంచుకుంటూ ఎక్కడికో వెళ్లిపోయాడు. ఇప్పుడు ఏకంగా సౌత్ లో ఏ హీరోకి సాధ్యం కానీ విధంగా ఓ సరికొత్త రికార్డు సృష్టించాడు. పాన్ ఇండియా స్టార్ అంటే దేశవ్యాప్తంగా ప్రేక్షకుల్ని అలరించాలి. తన సినిమాలతో ఎంటర్ టైన్ చేయాలి. డార్లింగ్ ప్రభాస్ ని చూస్తుంటే అచ్చం అలానే అనిపిస్తోంది. ఎందుకంటే 'ఆదిపురుష్'నే తీసుకోండి. డివైడ్ టాక్ వచ్చినాసరే కలెక్షన్స్ సాధిస్తూనే ఉంది. సౌత్ లో అంతంత మాత్రంగానే ఉన్నప్పటికీ.. నార్త్ లో ఈ సినిమాకు ప్రేక్షకులు వెళ్తున్నారు. చూసి ఎంజాయ్ చేస్తున్నారు. దీనికి కారణం వన్ అండ్ ఓన్లీ ప్రభాస్. (ఇదీ చదవండి: ఆ నెలంతా పాన్ ఇండియా మూవీసే.. ఏకంగా అన్ని!) 'బాహుబలి' తర్వాత 'సాహో', 'రాధేశ్యామ్', 'ఆదిపురుష్'.. ఇలా మూడు భారీ బడ్జెట్ చిత్రాలతో ప్రేక్షకుల్ని పలకరించాడు ప్రభాస్. వీటి టాక్ ఏంటనేది పక్కనబెడితే నార్త్ లో ఇవన్నీ కూడా కలెక్షన్స్ లో వావ్ అనిపించాయి. మొత్తం ఈ నాలుగు చిత్రాలు.. కేవలం హిందీలోనే తలో రూ.100 కోట్లు చొప్పున నెట్ వసూళ్లు సాధించాయి. తద్వారా దక్షిణాది నుంచి వెళ్లి బాలీవుడ్ లో ఈ ఘనత సాధించిన ఫస్ట్ హీరోగా ప్రభాస్ నిలిచాడు. ఇక్కడ ఆసక్తికర విషయం ఏంటంటే.. ప్రభాస్ తన నాలుగు సినిమాలతో తలో రూ.100 కోట్ల నెట్ కలెక్షన్స్ సాధిస్తే దక్షిణాది నుంచి మరే హీరో కూడా కనీసం ఒక్కటంటే ఒక్క మూవీతోనూ ఈ క్లబ్ లో చేరలేకపోయాడు. దీన్నిబట్టే మీరు అర్థం చేసుకోవచ్చు అసలు సిసలు 'పాన్ ఇండియా స్టార్' ప్రభాస్ అని. మరోవైపు బాలీవుడ్ లో ఇలా రూ.100 కోట్లు సాధించిన హీరోలు ఒకరో ఇద్దరో ఉంటారంతే! (ఇదీ చదవండి: వారం గడిచింది.. 'ఆదిపురుష్' కలెక్షన్స్ ఎన్ని కోట్లు?) -
ఎన్ని ప్లాప్ వచ్చిన టాలీవుడ్ ని వదిలేదే లే ....
-
ఈ ఏడాది టాలీవుడ్లో అతిపెద్ద డిజాస్టర్ మూవీ అదేనా..!
కాలగమనంలో మరో ఏడాది కనుమరుగవుతోంది. మరి కొన్ని రోజుల్లోనే 2022వ ముగియనుంది. కొత్త ఆశలతో 2023కి స్వాగతం పలికేందుకు యావత్ ప్రపంచం రెడీ అవుతోంది. మరి ఈ ఏడాదిలో ఏం సాధించారో ఓ సారి నెమరు వేసుకోవాల్సిన సమయం ఇది. ఇక టాలీవుడ్ చిత్రాల విషయానికొస్తే ప్రతి ఏడాదిలాగే సక్సెస్, ఫెయిల్యూర్ తప్పనిసరిగా ఉంటాయి. ఈ ఏడాది కూడా టాలీవుడ్లో చాలా సినిమాలు వచ్చాయి. కొన్ని చిత్రాలు బాక్సాఫీస్‌ను బద్దలు కొడితే మరికొన్ని చతికిలపడ్డాయి. కానీ ఎక్కువ శాతం సినిమాలు అభిమానులను నిరాశకు గురి చేశాయి. కొన్ని చిత్రాలు మాత్రం ఫర్వాలేదనిపించాయి. రాజమౌళి చిత్రం ఆర్ఆర్ఆర్ పలు రికార్డులను తిరగ రాసిన సంగతి తెలిసిందే. మరోవైపు చిన్న చిత్రాలు బింబిసార, కార్తికేయ ఊహించని స్థాయిలో కలెక్షన్లు రాబట్టాయి. అయితే టాలీవుడ్ చిత్రాల్లో డిజాస్టర్‌గా నిలిచిన చిత్రం ప్రభాస్, పూజా హేగ్డే నటించిన రాధేశ్యామ్. ఈ సినిమా ఏకంగా రూ.500 నుంచి రూ.1000 కోట్ల కలెక్షన్స్ రాబడుతుందని అంచనా వేశారు. కానీ వంద కోట్ల కలెక్షన్స్ కూడా రాబట్టలేక చతికిల పడిపోయింది. ప్రభాస్ ఆల్ ఇండియా స్థాయిలో గుర్తింపు దక్కించుకున్న హీరో కావడంతో భారీ కలెక్షన్స్ నమోదు చేసే అవకాశం ఉందని భావించారు. ముఖ్యంగా ఉత్తర భారతంలో కనీసం కలెక్షన్స్ కూడా రాబట్టలేకపోయింది. దీంతో ఈ ఏడాది బిగ్గెస్ట్ డిజాస్టర్ మూవీగా రాధేశ్యామ్ నిలిచిందనడంలో ఎలాంటి సందేహం లేదు. -
ఆ సినిమా బాహుబలి కంటే హిట్ అయ్యేది.. ఆర్జీవీ ట్వీట్ వైరల్
సంచలన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ ఏం చేసినా అందరి కంటే కాస్త భిన్నంగా ఉంటుంది. ఏ కామెంట్ చేసినా ఎవరూ ఊహించని విధంగా కొత్తదనం కనిపిస్తుంది. ఎప్పుడు సోషల్ మీడియాలో చురుకుగా ఉండే ఆర్జీవీ చేసిన ఓ ట్వీట్ తెగ వైరలవుతోంది. నిన్న ప్రభాస్ జన్మదినం సందర్భంగా ప్రభాస్ ఫ్యాన్స్ చేసి రచ్చపై స్పందించారు. బిల్లా రీ రిలీజ్ సందర్భంగా థియేటర్లోనే అభిమానులు బాణాసంచా కాల్చడంతో అగ్ని ప్రమాదం సంభవించింది. ఆర్జీవీ ఆ విషయంపై స్పందిస్తూ ప్రభాస్ అభిమానుల పిచ్చి అంటూ ట్వీట్ చేశారు. (చదవండి: అది దీపావళి కాదు.. ప్రభాస్ అభిమానుల పిచ్చి.. ఆర్జీవీ ట్వీట్ వైరల్) తాజాగా ఇవాళ దీపావళి సందర్భంగా చేసిన మరో ట్వీట్ సోషల్ మీడియాలో వైరలవుతోంది. ప్రభాస్ మూవీ రాధేశ్యామ్ ఇప్పడు రీ రిలీజ్ చేసి ఉంటే బాహుబలి కంటే పెద్ద హిట్ అయ్యేదంటూ పోస్ట్ చేశారు. ఏది ఏమైనా ఆర్జీవీ పోస్ట్ చేశాడంటే అది వైరల్ కావడం ఖాయం. దీపావళిని పురస్కరించుకుని అందరూ బాగుండాలని తనదైన శైలిలో వరుస ట్వీట్లు చేశారు. Hey #Prabhas May GOD re release Radhe Shyam and this time it becomes a bigger hit than BAHUBALI #HappyDiwali — Ram Gopal Varma (@RGVzoomin) October 24, 2022 -
ఈ వారం థియేటర్, ఓటీటీలో రిలీజ్ అయ్యే సినిమాలివే..
మొన్నటిదాకా థియేటర్లలో 'ఆర్ఆర్ఆర్', 'కేజీఎఫ్' వంటి పెద్ద సినిమాలు సందడి చేశాయి. మే నెలలో మరిన్ని భారీ బడ్జెట్ సినిమాలు విడుదల కానున్న నేపథ్యంలో ఈ గ్యాప్‌లో చిన్న సినిమాలు బాక్సాఫీస్ వద్ద బరిలోకి దిగుతున్నాయి. . అటు ఓటీటీలు కూడా కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ మీ అరచేతిలో అంటూ కొత్త సరుకుతో సిద్ధంగా ఉన్నాయి. మరి ఈ వారం అటు థియేటర్లో ఇటు ఓటీటీలో రిలీజ్ అవుతున్న చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు ఏంటో చూసేయండి.. ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటించిన పాన్ ఇండియా చిత్రం రాధేశ్యామ్. 1960 నాటి వింటేజ్ ప్రేమకథగా వచ్చిన ఈ మూవీకి రాధాకృష్ణకుమార్ దర్శకత్వం వహించారు. యూవీ క్రియేషన్స్, టీ సిరీస్ బ్యానర్లపై భూషణ్ కుమార్, వంశీ, ప్రమోద్, ప్రసీద సంయుక్తంగా నిర్మించారు. ఇప్పటికే తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా ఇప్పుడు తాజాగా హిందీ వర్షన్ నెట్‌ఫ్లిక్స్‌లో మే4 నుంచి ప్రసారం కానుంది. ప్రముఖ యాంకర్ సుమ కనకాల టైటిల్ రోల్లో నటించిన చిత్రం ‘జయమ్మ పంచాయతీ’.విజయ్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా మే6న విడుదల కానుంది. పల్లెటూరి బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ చిత్రంతో సుమ పల్లెటూరి మహిళ పాత్రలో కనిపించనుంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి. ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందించారు. జయాపజయాలతో సంబంధం లేకుండా కంటెంట్ ఉన్న కథలను ఎంచుకుంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు హీరో శ్రీ విష్ణు. ఈయన నటించిన లేటెస్ట్ చిత్రం ‘భళా తందనాన’. చైతన్య దంటులూరి దర్శకుడిగా పరిచయమవుతూ తెరకెక్కించిన ఈ చిత్రంపై ప్రేక్షకులలో మంచి అంచనాలు నెలకొన్నాయి. యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం మే 6న విడుదల కానుంది. ఈ చిత్రంలో కేథరిన్ హీరోయిన్గా నటించింది. 'మహానటి' కీర్తి సురేష్ సెల్వ రాఘవన్‌తో కలిసి నటించిన తాజా చిత్రం 'సాని కాయిధం' . చిన్ని పేరుతో తెలుగులోనూ విడుదల చేయనున్నారు. అరుణ్ మథేశ్వరం ఈ చిత్రానికి దర్శకత్వం వహిచారు. ఇందులో కీర్తి సురేష్ ఒక గ్రామీణ యువతిగా డీ గ్లామరైజ్డ్ పాత్రలో అలరించనుంది. థియేరట్‌లో కాకుండా నేరుగా అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో మే6న చిన్ని స్ట్రీమింగ్ కానుంది. మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటించిన తాజా చిత్రం అశోకవనంలో అర్జున కళ్యాణం. విద్యాసాగర్ చింత దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రుక్సర్ ధిల్లాన్ హీరోయిన్గా నటించింది. సుధీర్ చంద్ర నిర్మించారు. పెళ్లి కోసం పాట్లు పడే మధ్యతరగతి అబ్బాయిగా విశ్వక్ సేన్ నటించినట్లు తెలుస్తోందినీ సినిమా మే6న ప్రేక్షకుల ముందుకు రానుంది. అమెజాన్ ప్రేమ్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్(కన్నడ)- మే5 ద వైల్డ్(వెబ్‌సిరీస్2)- మే6 నెట్‌ప్లిక్స్ రాధేశ్యామ్(హిందీ)-మే4 థార్(మిందీ)-మే6 40 ఇయర్స్ యంగ్(హాలీవుడ్)-మే4 ది సౌండ్ ఆఫ్ మ్యూజిక్(వెబ్‌సిరీస్)-మే6 డిస్నీ+హాట్‌స్టార్ హోమ్ శాంతి(హిందీ సిరీస్)-మే6 స్టోరీస్ ఆన్ది నెక్ట్స్ పేజ్(హిందీ సిరీస్)-మే6 జీ5 ఝండ్(హిందీ)-మే6 -
నెట్‌ఫ్లిక్స్‌లో రాధేశ్యామ్ హిందీ వర్షన్, ఎప్పటినుంచంటే?
ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటించిన పాన్ ఇండియా చిత్రం రాధేశ్యామ్. 1960 నాటి వింటేజ్ ప్రేమకథగా వచ్చిన ఈ మూవీకి రాధాకృష్ణకుమార్ దర్శకత్వం వహించారు. యూవీ క్రియేషన్స్, టీ సిరీస్ బ్యానర్లపై భూషణ్ కుమార్, వంశీ, ప్రమోద్, ప్రసీద సంయుక్తంగా నిర్మించారు. కృష్ణంరాజు కీలక పాత్ర పోషించిన ఈ మూవీలో ప్రభాస్ తల్లిగా బాలీవుడ్ నటి భాగ్యశ్రీ రీఎంట్రీ ఇచ్చింది. భారీ అంచనాల మధ్య మార్చి 11న థియేటర్లలో విడుదలైన ఈ మూవీకి మిశ్రమ స్పందన లభించింది. దీంతో నెల రోజుల్లోనే ఈ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. వావ్.. సినీ ప్రియులకు ఇక పండగే.. ఓటీటీలో ఏకంగా 40 రాధేశ్యామ్ ఏప్రిల్ 1 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో ప్రసారమవుతున్న విషయం తెలిసిందే! అయితే కేవలం తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లోనే రాధేశ్యామ్ ప్రైమ్‌లో అందుబాటులో ఉంది. తాజాగా హిందీ వర్షన్ నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం కానుంది. ఈ విషయాన్ని నెట్‌ఫ్లిక్స్ అధికారికంగా వెల్లడించింది. మీ కామెంట్లకు సమాధానం దొరికినట్లే.. రాధేశ్యామ్ హిందీ వర్షన్ నెట్‌ఫ్లిక్స్‌లో మే 4 నుంచి స్ట్రీమింగ్ అవనుందని ట్వీట్ చేసింది. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. థియేటర్లలో మిస్ అయిన హిందీ ఆడియన్స్ ఎంచక్కా ఓటీటీలో చూసేయొచ్చని సంతోషిస్తున్నారు. YOUR COMMENTS HAVE FINALLY BEEN ANSWERED! Radhe Shyam (Hindi) is arriving on Netflix on 4th May 🥳 pic.twitter.com/vPXq2hrXLX — Netflix India (@NetflixIndia) April 29, 2022 చదవండి: ఖాన్, కుమార్ చిత్రాలు తిరస్కరించా.. అందుకు అలా చూసేవారు: కంగనా -
'రాధేశ్యామ్' ఫలితంపై ప్రభాస్ షాకింగ్ కామెంట్స్..!
'బాహుబలి' సిరీస్‌తో వరుసగా రెండు బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నాడు ప్రభాస్. ఇక ఆ చాత్రాలు ఇచ్చిన విజయంతో అదే స్పీడ్‌లో వరుసగా ప్యాన్ ఇండియా ప్రాజెక్ట్స్ చేస్తున్నాడు. ఇక తాజాగా విడుదలైన తన చిత్రం 'రాధే శ్యామ్' ఫలితంపై పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ స్పందించాడు. ఇక ఇదే విషయంపై ప్రభాస్ మాట్లాడుతూ 'బాహుబలి' లాంటి సినిమాలు చేయడం నాకిష్టమే. అయితే ఎప్పుడూ అలాంటి సినిమాల్లో మాత్రమే నటిస్తే తాను నటుడిగా కొత్తదనం చూడలేను. అలాగే పలు విభిన్నమైన చిత్రాల్లో నటించాలని నా కోరిక. అవి చిన్న బడ్జెట్ చిత్రాలైనా నాకిష్టమే. ఇక 'రాధే శ్యామ్' విషయానికి వస్తే ఆ చిత్రం రిలీజ్ సమయానికి కరోనా వ్యాప్తి ఇంకా పూర్తిగా తగ్గకపోవడమే కారణం అనుకుంటున్నా. దాంతో పాటు నన్ను ప్రేమ కథల్లో చూడటానికి ప్రేక్షకులు ఇష్టపడి ఉండకపోవచ్చు. లేదా ఆ స్క్రిప్టులోనే ఏదైనా లోపం కూడా ఉండి ఉండొచ్చు అంటూ ప్రభాస్ పేర్కొన్నాడు. ఇక ప్రభాస్ చేస్తున్న సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం దాదాపు పలు చిత్రాల్లో నటిస్తున్నాడు. వాటిలో ఆదిపురుష్, సలార్, స్పిరిట్, ప్రాజెక్ట్ కె చిత్రాలతో పాటు మారుతి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. -
ఫేస్ ఆఫ్ ఇండియా.. రిద్ధి కుమార్
పలు కళలకు చక్కటి ఆకృతినిస్తే.. ఆ పేరు రిద్ధి కుమార్. తెలుగు సినిమా ప్రేక్షకులకు తెలుసు.. ఇటీవలి ‘లవర్’, ఈనాటి ‘రాధే శ్యామ్’ సినిమాల ద్వారా. ఆమె వెబ్‌స్టార్ కూడా! అందుకే ఈవారానికి రిద్ధి కుమార్‌ను ఈ ‘కాలమ్’ గెస్ట్‌గా తీసుకొచ్చాం. పుట్టింది పుణెలో. తండ్రి ఆర్మీ ఆఫీసర్ అవడం వల్ల దేశంలోని చాలా ప్రాంతాల్లో పెరిగింది. తల్లి అల్కా కుమార్... అడ్వకేట్. పుణె, ఫెర్గ్యూసన్ కాలేజ్‌లో ఫిలాసఫీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. పదవ తరగతి పూర్తయిన నాటి నుంచే పని చేయడం మొదలుపెట్టింది. డ్యాన్స్ టీచర్‌గా, ఈవెంట్ మేనేజర్‌గా, యాంకర్‌గా ఇలా పలు రంగాల్లో ప్రతిభను చాటుకుంది. డిగ్రీ చదువుతున్నప్పటి నుంచే మోడలింగ్ చేయడం మొదలుపెట్టింది. ఎన్నో అందాల పోటీల్లోనూ పాల్గొంది. అన్నిట్లోనూ ఏదో ఒక టైటిల్స్‌ను గెలుచుకుంది. వాటిల్లో మిస్ పుణె (2015), ఫేస్ ఆఫ్ ఇండియా (2016) వంటివి మచ్చుకు కొన్ని. మోడలింగ్‌లో ఉన్నప్పుడే సినిమా అవకాశం వచ్చింది. అదే ‘లవర్’.. తెలుగు చిత్రం. దాని తర్వాత మాతృభాష మరాఠీలో, అనంతరం మలయాళం సినిమాల్లోనూ వరుస చాన్స్‌లు వచ్చాయి. ఓ వైపు సినిమాల్లో బిజీగా ఉండగానే వెబ్ చానెల్స్‌లోనూ ఆఫర్స్ ఆమె డేట్స్ డైరీలోని పేజీలను నింపేశాయి. అలా ‘వూట్’లో స్ట్రీమ్ అయిన ‘క్యాండీ’ రిద్ధిని దేశమంతటికీ పరిచయం చేసింది. డిస్నీ హాట్‌స్టార్‌లోని ‘హ్యుమన్’ సిరీస్ కూడా ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టింది. నటనంటే అమితంగా అభిమానించే రిద్ధి చిత్రకారిణి కూడా. ఆమె ఆయిల్ పెయింటింగ్స్‌కు ఇన్‌స్టాగ్రామ్‌లో మహా ఫాలోయింగ్ ఉంది. ఇంకా చాలా కళలున్నాయి ఆమెలో.. రాస్తుంది.. కమ్మటి వెరైటీలను వండుతుంది.. విపరీతంగా ప్రయాణాలు చేస్తుంది. వృత్తి, ప్రవృత్తి రెండూ రెండు కళ్లలాంటివి అంటుంది. తమను తాము ఆవిష్కరించుకునే భూమికలు అంటే ఇష్టం. కానీ డ్రీమ్ రోల్స్ మాత్రం ఫన్ క్యారెక్టర్సే. అంతేకాదు డిటెక్టివ్, పోలీసు పాత్రల్లో నటించాలనీ ఉంది. – రిద్ధి కుమార్ -
ఓటీటీలోకి వచ్చేసిన రాధేశ్యామ్.. ఇక చూసేయండి
ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటించిన సినిమా ‘రాధేశ్యామ్’ ఓటీటీలోకి వచ్చేసింది. రిలీజ్‌కు ముందే భారీ అంచనాలు క్రియేట్ చేసిన ఈ చిత్రం మిక్స్డ్ టాక్‌ను తెచ్చుకుంది. రాధాకృష్ణకుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు బాక్సాఫీస్ వద్ద అనుకున్నంత మ్యాజిక్ చూపించలేకపోయింది. ఇటలీ నేపథ్యంలో సాగిన ఈ పిరియాడికల్ లవ్‌స్టోరీ ఓ వర్గం ప్రేక్షకులను ఆకట్టుకోగా.. మాస్ ఆడియాన్స్ను నిరాశ పరిచింది. మార్చి11న విడుదలైన ఈ సినిమా మూడు వారాలకే ఓటీటీలోకి వచ్చేసింది. నిన్నఅర్థరాత్రి(ఏప్రిల్1) ఈ సినిమా ఓటీటీలో రిలీజ్ అయ్యింది. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ నుంచి ఈ చిత్రాన్ని చూడొచ్చు. కాగా ఇందులో ప్రభాస్ విక్రమాదిత్య అనే అస్ట్రాలజర్‌గా కనిపించగా, పూజ డాక్టర్ ప్రేరణగా ఆకట్టుకుంది. యూవీ క్రియేషన్స్, టీ సిరీస్ బ్యానర్లపై భూషణ్ కుమార్, వంశీ, ప్రమోద్, ప్రసీద సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. Vikramaditya and Prerana are here to mesmerise you with their chemistry 💙#RadheShyamOnPrime, watch now https://t.co/otz3WKsBWW pic.twitter.com/fglUyMPxfv — amazon prime video IN (@PrimeVideoIN) March 31, 2022 -
ఈ వారం థియేటర్, ఓటీటీలో రిలీజవుతున్న సినిమాల లిస్ట్!
కంటెంట్ బాగుంటే టికెట్ రేట్ ఎక్కువైనా సరే సినిమా చూసేందుకు ఏమాత్రం వెనుకాడరు జనాలు. అందుకు ఆర్ఆర్ఆర్ కలెక్షన్ల సునామీనే అతి పెద్ద నిదర్శనం. జూనియర్ ఎన్టీఆర్, రామ్‌చరణ్ నటించిన ఈ మల్టీస్టారర్ మూవీ చూసేందుకు ఎగబడుతున్నారు సినీప్రియులు. ఈ పాన్ ఇండియా మూవీ దూకుడు చూస్తుంటే మరో వారం రోజులదాకా దీని ప్రభంజనం ఆగేట్లు కనిపించడం లేదు. ఈ కలెక్షన్ల ప్రవాహానికి అడ్డుకట్ట వేసేందుకు కొత్త చిత్రాలు రిలీజ్‌కు రెడీ అయ్యాయి. మరి ఏప్రిల్ మొదటివారంలో అటు థియేటర్లో ఇటు ఓటీటీలో రిలీజవుతున్న చిత్రాలు, వెబ్ సిరీస్ ఏంటో చూసేద్దాం.. మిషన్ ఇంపాజిబుల్ బాలీవుడ్లో పాగా వేసిన తాప్సీ చాలాకాలానికి తెలుగులో రీ ఎంట్రీ ఇస్తోంది. ఆమె ప్రధాన పాత్రలో నటించిన చిత్రం మిషన్ ఇంపాజిబుల్. ఆర్ఎస్జె స్వరూప్ తెరకెక్కించిన ఈ సినిమాను నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మించారు. యదార్థ సంఘటన ఆధారంగా రూపొందిన ఈ చిత్రం ఏప్రిల్ 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. దావూద్ ఇబ్రహీంని పట్టుకోవాలన్న ముగ్గురు పిల్లలకు తాప్సీ ఎలా సాయం చేసింది? ఈ మిషన్‌ను వారు పూర్తి చేశారా? లేదా? అన్నది కథ. రాధేశ్యామ్ ప్రభాస్, పూజా హెగ్డే హీరోహీరోయిన్లుగా నటించిన పాన్ ఇండియా చిత్రం రాధేశ్యామ్. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా మార్చి 11న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాలతో రిలీజైన రాధేశ్యామ్ అంతగా ఆకట్టుకోలేకపోయింది. దీంతో కేవలం 20 రోజుల్లోనే ఓటీటీ బాట పడుతోందీ మూవీ. ఏప్రిల్ 1 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానుంది. ప్రవీన్ తాంబే ఎవరు? స్పోర్ట్స్‌లో ఎక్కువమంది ఇష్టపడే గేమ్ ఏంటి అంటే క్రికెట్ అని టపీమని సమాధానం వస్తుంది. క్రికెట్ అంటే జనాలకు పిచ్చి ఉంది కాబట్టే ఈ క్రీడా నేపథ్యంలో ఎన్నో సినిమాలు వచ్చాయి. తాజాగా భారత క్రికెటర్ ప్రవీన్ తాంబే జీవిత కథ ఆధారంగా ప్రవీన్ తాంబే ఎవరు? అనే సినిమా తెరకెక్కింది. శ్రేయాస్ తల్పడే ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రం హాట్‌స్టార్‌లో ఏప్రిల్ 1 నుంచి అందుబాటులోకి రానుంది. హలో జూన్ తెలుగువారికి కావాల్సినంత వినోదాన్ని పంచుతోంది ఆహా. ఇతర భాషాచిత్రాలను తెలుగులోకి డబ్ చేస్తూ ప్రేక్షకుడికి కొత్త కథలను పరిచయం చేస్తోంది. తాజాగా మలయాళ మూవీ జూన్‌ను తెలుగులోకి తీసుకొస్తోంది ఆహా. రాజిష విజయన్ ప్రధాన పాత్రలో నటించిన జూన్ 2019లో విడుదలై హిట్ కొట్టింది. ఏప్రిల్ 1 నుంచి హలో జూన్ పేరుతో ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. సోనీలివ్ ► ఆడవాళ్లు మీకు జోహార్లు - ఏప్రిల్ 2 హాట్‌స్టార్ ► మూన్ నైట్ - మార్చి 30 ► భీష్మపర్వం - ఏప్రిల్ 1 అమెజాన్ ప్రైమ్ ► శర్మాజీ నమ్కీన్ - మార్చి 31 నెట్‌ఫ్లిక్స్ ► హే సినామిక - మార్చి 31 ► స్టోరీస్ ఆఫ్ విట్ అండ్ మ్యాజిక్ అనే యానిమేషన్ టీవీ షో - మార్చి 31 ► ది లాజ్ బస్(వెబ్ సిరీస్) - ఏప్రిల్ 1 చదవండి: రూ.15 కోట్లు ఇస్తామని చెప్పి మోసం.. కోర్టునాశ్రయించిన హీరో -
రాధేశ్యామ్ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్, ఆ రోజు నుంచే స్ట్రీమింగ్
Radhe Shyam OTT Release Date: ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటించిన సినిమా ‘రాధేశ్యామ్’ ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మార్చి 11న విడుదలై మిశ్రమ టాక్‌ను తెచ్చుకుంది. ఇటలి నేపథ్యంలో సాగిన ఈ పిరియాడికల్ లవ్‌స్టోరీ ఓ వర్గం ప్రేక్షకులను ఆకట్టుకోగా.. మాస్ ఆడియాన్స్ను నిరాశ పరిచింది. దీంతో ఈ మూవీకి మిక్స్డ్ టాక్ రావడంతో పాన్ ఇండియా స్థాయిలో విజయం సాధించలేకపోయింది. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ మూవీ ఓటీటీలో అలరించేందుకు సిద్ధమైంది. ఏప్రిల్ 1వ తేదీ నుంచి రాధేశ్యామ్ అమెజాన్ ప్రైం వీడియోస్‌లో స్ట్రీమింగ్ కానుంది. చదవండి: ఆనందం పట్టలేక సోషల్ మీడియాలో పంచుకున్న సమంత దీనిపై తాజాగా అమెజాన్ ప్రైం తన ట్విటర్ ఖాతాలో అధికారిక ప్రకటన ఇచ్చింది. ఏప్రిల్ 1వ తేదీన రాధేశ్యామ్ ఓటీటీలో రిలీజ్ కానున్నట్లు స్పష్టం చేసింది. కాగా ఇందులో ప్రభాస్ విక్రమాదిత్య అనే అస్ట్రాలజర్‌గా కనిపించగా.. పూజ డాక్టర్ ప్రేరణగా ఆకట్టుకుంది. 1960 నాటి వింటేజ్ ప్రేమకథగా వచ్చిన ఈ మూవీని యూవీ క్రియేషన్స్, టీ సిరీస్ బ్యానర్లపై భూషణ్ కుమార్, వంశీ, ప్రమోద్, ప్రసీద సంయుక్తంగా నిర్మించారు. కృష్ణంరాజు కీలక పాత్ర పోషించిన ఈ మూవీతో బాలీవుడ్ నటి భాగ్యశ్రీ రీఎంట్రీ ఇచ్చింది. ఇందులో ఆమె ప్రభాస్ తల్లిగా మెప్పించింది. Hop on this magical journey of love with #RadheShyamOnPrime, April 1 #Prabhas @hegdepooja @director_radhaa @UVKrishnamRaju #Vamshi #Pramod @PraseedhaU @UV_Creations @GopiKrishnaMvs @TSeries pic.twitter.com/D7ZcDFfS7y — amazon prime video IN (@PrimeVideoIN) March 28, 2022 -
విధిరాత.. రాధేశ్యామ్ విషయంలో అదే జరిగింది : పూజా హెగ్డే
ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటించిన చిత్రం రాధేశ్యామ్. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం అభిమానుల అంచనాలను అంతగా అందుకోలేకపోయింది. తొలి మూడు రోజులు భారీ వసూళ్లు నమోదు చేసినా ఆ తర్వాత డీలా పడిపోయింది. ఇక బాలీవుడ్ అయితే ఈ సినిమా డిజాస్టర్‌గా మిగిలిపోయింది. పూర్తి ప్రేమకథ చిత్రమైనప్పటికీ ఒక్క యాక్షన్ ఎలిమెంట్ కూడా లేకపోవడం సినిమాకు పెద్ద మైనస్‌గా మారిపోయింది. ప్రభాస్, పూజా హెగ్డే వంటి స్టార్స్ ఉన్నా అనుకన్న రిజల్ట్ మాత్రం రాలేదు. తాజాగా ఈ సినిమా ఫలితం గురించి పూజాహెగ్డే ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. కొన్ని సినిమాలు మనకు యావరేజ్ అనిపించినా బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతాయి. మరికొన్ని మనకు బాగా నచ్చినా రిజల్ట్ అనుకున్నట్లు ఉండకపోవచ్చు. ఏ సినిమా ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందనేది ముందుగానే రాసి పెట్టి ఉంటుంది. అలాగే జరుగుతుంది. రాధేశ్యామ్ విషయంలో కూడా అదే జరిగింది. బాక్సీఫీస్ వద్ద సినిమా తలరాత మారిపోతుంది అని బలంగా నమ్ముతాను అంటూ చెప్పుకొచ్చింది. -
‘రాధేశ్యామ్’పై వర్మ షాకింగ్ కామెంట్స్, మూవీకి అంత అవసరం లేదు..
Ram Gopal Varma Shocking Comments On Radhe Shyam: రామ్ గోపాల్ వర్మ నోరు విప్పితే చాలు అది వైరల్ అవుతుంది. సినీ, రాజకీయ ప్రముఖులపై వ్యంగ్యస్త్రాలు ఒదులుతూ కవ్విస్తుంటాడు. అలా ఎప్పుడు వివాదంలో నిలుస్తుంటాడు. ఆర్జీవీ పేరు వింటేనే వివాదం అనేంతగా మారాడు వర్మ. ఒకప్పుడు తన చిత్రాలతో ట్రెండ్ సట్టర్, బ్లాక్‌బస్టర్స్ హిట్స్ అందుకున్న ఆర్జీవీ ప్రస్తుతం వరస ప్లాప్లను చూస్తున్నాడు. ఇదిలా ఉంటే ఇటీవల కాలంలో పాన్ ఇండియా, భారీ బడ్జెట్ చిత్రాలపై తనదైన శైలిలో కామెంట్స్ చేస్తున్నాడు వర్మ. ఈ క్రమంలో పాన్ ఇండియా చిత్రం రాధేశ్యామ్ మూవీపై వర్మ షాకింగ్ కామెంట్స్ చేశాడు. చదవండి: మాజీ భార్య ఐశ్యర్యపై ధనుష్ ట్వీట్, అంత మాట అనేశాడేంటి! ఈ మేరకు వర్మ ఒక నటుడి ముందు సినిమా అది సాధించిన వసూళ్ల ఆదారంగా తదుపరి మూవీపై అంచనాలు ఉంటాయి. ‘రాధేశ్యామ్‌లో హీరో ప్రభాస్ పారితోషికం పక్కన పెడితే.. ఈ చిత్రం మొత్తం బడ్జెట్లో 5వ వంతు ఖర్చుతో సినిమా తీసేయవచ్చు. రాధేశ్యామ్ వంటి ఇంటెన్స్ లవ్‌స్టోరీ అభిమానులకు విజువల్ ఫీస్ట్ అవసరం లేదు. కథలోని భావోద్వేగం, భావాలను విజువల్ ఫిస్ట్ డ్యామినేట్ చేస్తాయి, ఇది కథను చంపేస్తుంది’ అని అన్నాడు. ఇక బాలీవుడ్ చిత్రం ది కశ్మీర్ ఫైల్స్ గురించి విడుదలయ్యే వరకు ఎవరికి తెలియదు, కేవలం రూ. 4 కోట్లనుంచి రూ. 5 కోట్లతో తెరకెక్కిన ఆ మూవీ ఇప్పుడు రూ. 100 కోట్ల వసూళు సాధించిందనిపేర్కొన్నాడు. చదవండి: Hanuman: నో డూప్, ఎనిమిది గంటల పాటు తాడు పైనే! అదే రాధేశ్యామ్ మూవీకి పెట్టిన బడ్జెట్, వచ్చిన వసూళ్లకు పొంతన లేదంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇక ఒక మూవీకి విజువల్ ఎఫేక్ట్స్ కంటే కథలో ఉండే దమ్ము ముఖ్యమని ఈ రెండు సినిమాలు నిరూపించాయని వర్మ అభిప్రాయం వ్యక్తం చేశాడు. ఇక అతడి కామెంట్స్‌పై పలువురు ‘అంటే తక్కువ బడ్జెట్‌తో అయిపోయే రాధేశ్యామ్ మూవీని కావాలనే విజువల్ ఎఫెక్ట్స్‌తో భారీ బడ్జెట్ సినిమా చేశారని’ అంటున్నారా వర్మ అని స్పందిస్తున్నారు. రాధేశ్యామ్‌ను రూ. 300 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించిన సంగతి తెలిసిందే. -
ప్రభాస్ మంచితనం.. అభిమాని కుటుంబానికి ఆర్థిక సాయం
Prabhas Donated Two Lakh Rupees To Deceased Fan Family: పాన్ ఇండియా స్టార్, మనందరి డార్లింగ్ ప్రభాస్ మరోసారి తన మంచి చాటుకున్నాడు. తన సినిమా విడుదల రోజు ప్రమాదవశాత్తు మరణించిన అభిమాని కుటుంబానికి ఆర్థిక సాయం అందించాడు. ప్రభాస్ తాజా చిత్రం 'రాధేశ్యామ్' మార్చి 11న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో గుంటూరు జిల్లాలోని కారంపూడి పల్నాడు ఐమాక్స్ థియేటర్ వద్ద 37 ఏళ్ల చల్లా కోటేశ్వర రావు అనే ప్రభాస్ ఫ్యాన్ ఫ్లెక్సీ కడుతున్నాడు. అనుకోకుండా అది విరిగి పక్కనే ఉన్న కరెంట్ తీగలపై పడింది. ఈ ప్రమాదంలో కోటేశ్వర రావు విద్యుదాఘాతానికి గురై చికిత్స పొందుతూ మృతిచెందాడు. చదవండి: ఐమ్యాక్స్ థియేటర్ వద్ద అపశృతి.. అభిమానికి తీవ్ర గాయాలు ఈ విషయాన్ని ప్రభాస్ అభిమానులు, డిస్ట్రిబ్యూటర్లు ప్రభాస్ దృష్టికి తీసుకు వెళ్లారు. ఇది తెలిసి చలించిపోయిన ప్రభాస్ చల్లా కోటేశ్వర రావు కుటుంబానికి రూ. 2 లక్షల ఆర్థిక సాయం అందించాడు. అలాగే ఆ కుటుంబానికి ఏ కష్టమొచ్చినా ఆదుకుంటానని భరోసా ఇచ్చాడు. కష్టాల్లో ఉన్న వారికి ప్రభాస్ తనవంతు సాయం ఎప్పుడూ చేస్తూనే ఉంటాడు. ఇదివరకు కేరళ, ఏపీ వరదల్లో చిక్కుకున్నప్పుడు ఆర్థిక సాయం అందించి ఉదారత చాటుకున్నాడు. ఈసారి తన అభిమాని కుటుంబానికి ఆర్థిక సాయం అందించి నిజమైన డార్లింగ్ అనిపించుకున్నాడు ఈ మిస్టర్ పర్ఫెక్ట్. కాగా ప్రభాస్, బుట్టబొమ్మ పూజా హెగ్డే జంటగా నటించిన రొమాంటిక్ లవ్‌స్టోరీ 'రాధేశ్యామ్' ప్రపంచవ్యాప్తంగా సుమారు 7 వేలకుపైగా థియేటర్లలో విడుదలైంది. చదవండి: రాదేశ్యామ్ సినిమా ఫ్లాప్ అయ్యిందని అభిమాని ఆత్మహత్య -
ప్రభాస్ పిల్లలతో ఆడుకోవాలని ఉంది : కృష్ణం రాజు
ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటించిన చిత్రం రాధేశ్యామ్. కె. రాధాకృష్ణ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా మార్చి 11న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే కలెక్షన్స్‌తో దూసుకెళ్తుంది. మూడు రోజుల్లోనే రూ. 151 కోట్ల గ్రాస్ వసూలు చేసి రికార్డు క్రియేట్ చేసింది రాధేశ్యామ్. ఈ సినిమా విజయం పట్ల సీనియర్ హీరో, ప్రభాస్ పెదనాన్న కృష్ణం రాజు స్పందించారు. సినిమా చాలా బాగుందని, ముఖ్యంగా సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉందన్నారు. చదవండి: కృష్ణంరాజు హోంటూర్ చూశారా? ఇల్లంతా బంగారమే అలాగే బాలీవుడ్ సూపర్‌స్టార్ అమితాబ్ బచ్చన్ రాధేశ్యామ్‌పై ప్రశంసలు కురిపించినట్లు తెలిపారు. మరోవైపు డార్లింగ్ పెళ్లి గురించి కూడా కృష్ణంరాజు స్పందించారు. ప్రభాస్ త్వరగా పెళ్లి చేసుకుంటే చూడాలని, ప్రభాస్‌కు పుట్టబోయే పిల్లలతో ఆడుకోవాలని ఉందంటూ మనసులో మాటను బయటపెట్టారు. కాగా రాధేశ్యామ్ ప్రమోషన్స్‌లోనూ ప్రభాస్ పెళ్లిపై ఆయన పెద్దమ్మ శ్యామలా దేవి, చెల్లెలు ప్రసీద సైతం స్పందించిన సంగతి తెలిసిందే. చదవండి: బాహుబలి-3 ఉంటుంది, వర్క్ చేస్తున్నాం : రాజమౌళి -
‘రాధేశ్యామ్’ డైరెక్టర్ అసహనం
Radha Krishna Kumar Respond to Controversial Comments: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, బుట్టబొమ్మ పూజా హెగ్డే జంటగా, రాధాకృష్ణ కుమార్ తెరకెక్కించిన ప్రేమకథ చిత్రం ‘రాధేశ్యామ్’. భారీ అంచనాల మధ్య మార్చి 11న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ మొదట్లో మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. అయితే తొలి రోజే ఓ వర్గం ప్రేక్షకులు మూవీ ప్లాప్ అంటూ ప్రచారం చేయగా మరో వర్గం ప్రేక్షకులు మాత్రం బ్లాక్‌బస్టర్ హిట్ అన్నారు. రాధేశ్యామ్ పిరియాడికల్ లవ్‌స్టోరీ అని ముందు నుంచి డైరెక్టర్, మూవీ టీం చెబుతూనే ఉంది. చదవండి: ఓటీటీకి రాధేశ్యామ్, స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే..! దీంతో పూర్తి ప్రేమకథ అని భావించిన వారిని ఈ మూవీ ఆకట్టుకోగా.. మరికొందరిని మాత్రం నిరాశ పరిచింది. దీనికి కారణంగా రాధేశ్యామ్‌లో ఒక్క యాక్షన్ ఎలిమెంట్ కూడా లేకపోవడమే. అంతేకాదు పాన్ ఇండియా చిత్రం, రూ. 300 కోట్ల భారీ బడ్జెట్ మూవీ, పైగా ప్రభాస్ సినిమా.. అందులో ఒక్కటంటే ఒక్క ఫైట్ సీన్ లేదు, ఓ కామెడీ లేదంటూ మాస్ ఆడియన్స్ అంటున్నారు. ఈ క్రమంలో ఇటీవల రాధేశ్యామ్ సక్సెస్ మీట్లో పాల్గొన్న డైరెక్టర్ రాధాకృష్ణ అసహనం వ్యక్తం చేశాడు. ఈ మూవీలో యాక్షన్ సీన్స్ లేవని వస్తున్న విమర్శలపై ఘాటుగా స్పందించాడు. చదవండి: సూపర్ హిట్ కలెక్షన్స్‌తో దూసుకుపోతోన్న రాధేశ్యామ్ వెజిటేరియన్ హోటల్‌కు వెళ్లి చికెన్ బిర్యానీ పెడతారని ఎలా ఆశిస్తారు? అని ప్రశ్నించాడు. అంతేకాదు రాధేశ్యామ్ ఇంటెన్సీవ్ లవ్‌స్టోరీ అని ముందు నుంచే చెబుతున్నామని, ఓ ప్రేమకథ నుంచి ఇంకేం ఆశిస్తారంటూ మండిపడ్డాడు. ఇందులో ప్రభాస్ విక్రమాదిత్య అనే హస్తసాముద్రికా నిపుణుడిగా కనిపించగా, పూజా డాక్టర్ ప్రేరణ పాత్ర పోషించింది. గోపికృష్ణ మూవీస్ ప్రైవేట్ లిమిటెడ్, యూవీ క్రియేషన్ సంయుక్తంగా నిర్మించిన ఈ ప్రేమకథ చిత్రం విడుదలైన మూడు రోజుల్లోనే రూ. 151 కోట్ల కలెక్షన్ రాబట్టి క్రియేట్ చేసింది. -
రాధేశ్యామ్‌కు పోటీ ఇవ్వనున్న చిత్రం ఇదేనా !
Radhe Shyam Vs The Kashmir Files Box Office Collection: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, బుట్టబొమ్మ పూజా హెగ్డే నటించిన రొమాంటిక్ ప్రేమకథా చిత్రం 'రాధేశ్యామ్'. రోమన్ కాలం నాటి రొమాంటిక్ లవ్ స్టోరీతో తెరకెక్కిన ఈ మూవీలో ప్రేమించిన అమ్మాయి జాతకమేమిటో తెలిసిన హీరో.. ఆమెను దక్కించుకోవడం కోసం చేసే సాహసమే రాధేశ్యామ్ కథ. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం మార్చి 11న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. యూవీ క్రియేషన్స్, టీ సిరీస్ బ్యానర్లపై భూషణ్ కుమార్, వంశీ, ప్రమోద్, ప్రసీద సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా ఇప్పటివరకూ బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లే రాబట్టింది. 'రాధేశ్యామ్' ఇండియాలో మొదటి వారంలో సుమారు రూ. 94.50 కోట్లు కొల్లగొట్టింది. అందులో ఒక్క తెలుగు రాష్టాల (తెలంగాణ/ఏపీ) నుంచి రూ. 78.64 కోట్లు సాధించింది. అయితే ప్రపంచవ్యాప్తంగా రూ. 151 కోట్ల గ్రాస్ వసూలు చేసింది 'రాధేశ్యామ్'. చదవండి: అప్పుడే ఓటీటీకి రాధేశ్యామ్, స్ట్రీమింగ్ ఎక్కడంటే.. కాకపోతే ప్రభాస్ పాపులారిటీ, సినిమా ప్రమోషన్స్‌తో విడుదలైన తొలిరోజు రూ. 46 కోట్లు కొల్లగొట్టింది 'రాధేశ్యామ్'. తర్వాత మిక్స్డ్ పబ్లిక్ టాక్‌తో రోజురోజూకీ బాక్సాఫీస్ వద్ద వసూళ్లు తగ్గుతున్నాయి. శనివారం (మార్చి 12) రూ. 24. 50 కోట్లు వసూలు చేయగా ఆదివారం (మార్చి 13) రూ. 24 కోట్లు రాబట్టింది. ఈ కలెక్షన్లలో ప్రధానంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచే వచ్చాయి. తెలుగు రాష్ట్రాల్లో రూ. 37.85 కోట్లతో విడుదలైన రోజు ప్రారంభం కాగా శనివారం రూ. 21.48 కోట్లు, ఆదివారం 19.31 కోట్లు వసూళ్లు సాధించింది. నిజానికి పెద్ద హీరోలంటే విడుదలైన రోజు కంటే తర్వాత రోజుల్లో కలెక్షన్లు ఎక్కువగా ఉంటాయి. కానీ రాధేశ్యామ్ మాత్రం మిక్స్డ్ టాక్‌తో బాక్సాఫీస్ వద్ద వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. #RadheShyam AP/TS Box Office Biz stays STRONG despite mixed response. Day 1 - ₹ 37.85 cr Day 2 - ₹ 21.48 cr Day 3 - ₹ 19.31 cr Total - ₹ 78.64 cr#Prabhas — Manobala Vijayabalan (@ManobalaV) March 14, 2022 చదవండి: ప్రధాని మోదీ మెచ్చిన చిత్రం 'ది కశ్మీర్ ఫైల్స్'.. సినిమాలో ఏముంది ? ఇక అనేక వివాదాలు, బెదిరింపులు ఎదుర్కొని విడుదలైన హిందీ చిత్రం 'ది కశ్మీర్ ఫైల్స్'. ఈ చిత్రానికి సామాజిక అంశాలను ఉన్నది ఉన్నట్లుగా తెరకెక్కించే డైరెక్టర్ వివేక్ రంజన్ అగ్నిహోత్రి దర్శకత్వం వహించారు. అనుపమ్ ఖేర్, మిథున్ చక్రవర్తి వంటి పాపులర్ యాక్టర్స్ నటించిన ఈ చిత్రం 1990లో కశ్మీర్ పండిట్లపై జరిగిన మారణకాండకు అద్దం పడుతుంది. అదే మార్చి 11న విడుదలైన ఈ మూవీ సాధారణ కలెక్షన్లతో ప్రారంభమైంది. తర్వాత ప్రేక్షకులు, విమర్శకులు, ప్రధాని నరేంద్ర మోదీ సైతం ప్రశంసలు కురుపించడంతో మంచి మౌత్ టాక్ సంపాదించుకుంది. దీంతో రోజు రోజుకీ ఈ సినిమా వసూళ్లు పెరిగిపోతున్నాయి. శుక్రవారం విడుదలైన 'ది కశ్మీర్ ఫైల్స్' మొదటి రోజు రూ. 3.55 కోట్లు రాబట్టగా, శనివారం రూ. 8.50 కోట్లు కలెక్ట్ చేసింది. తర్వాత ఆదివారం ఒకేసారి భారీగా రూ. 15.10 కోట్లు వసూళ్లు చేసింది. మొత్తంగా మొదటి వారంలో ఈ మూవీ వసూళ్లు రూ. 27.15 కోట్లకు చేరుకున్నాయి. #TheKashmirFiles shows PHENOMENAL GROWTH… Grows 325.35% on Day 3 [vis-à-vis Day 1], NEW RECORD… Metros + mass belt, multiplexes + single screens, the *opening weekend biz* is TERRIFIC across the board... Fri 3.55 cr, Sat 8.50 cr, Sun 15.10 cr. Total: ₹ 27.15 cr. #India biz. pic.twitter.com/FsKN36sDCp — taran adarsh (@taran_adarsh) March 14, 2022 కలెక్షన్లతో పోల్చుకుంటే 'రాధేశ్యామ్'కు చాలా వెనకంజలో 'ది కశ్మీర్ ఫైల్స్' ఉంది. కానీ రెండు సినిమాలపై ఆడియెన్స్ రెస్పాన్స్ చూస్తుంటే మాత్రం 'రాధేశ్యామ్'ను 'ది కశ్మీర్ ఫైల్స్' కొద్దివరకైనా చేరుకునే అవకాశాలు లేకపోలేదని మూవీ క్రిటిక్స్ అంచనా వేస్తున్నారు. ఏది ఏమైనా రెండు సినిమా కథలను మాత్రం పోల్చి చూడలేం. ఒకటి రొమాంటిక్ లవ్‌స్టోరీ అయితే మరొకటి నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కింది. అయితే ప్రభాస్ స్టార్డమ్, వరల్డ్‌వైడ్‌గా డార్లింగ్ ఉన్న పాపులారిటీని 'ది కశ్మీర్ ఫైల్స్' రీచ్ అవుతుందా ?.. లేదా బీట్ చేస్తుందా ? చూడాలి. చదవండి: డైరెక్టర్ కాళ్లు పట్టుకుని ఏడ్చేసిన మహిళ.. కంటతడి పెట్టిస్తున్న వీడియో -
ఓటీటీకి రాధేశ్యామ్, స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే..!
ప్రభాస్, పూజా హెగ్డే కలిసి నటించిన సినిమా రాధేశ్యామ్. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం మార్చి 11న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. యూవీ క్రియేషన్స్, టీ సిరీస్ బ్యానర్లపై భూషణ్ కుమార్, వంశీ, ప్రమోద్, ప్రసీద సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతుంది. రోమన్ కాలం నాటి రొమాంటిక్ లవ్ స్టోరీతో తెరకెక్కిన ఈ మూవీలో ప్రేమించిన అమ్మాయి జాతకమేమిటో తెలిసిన హీరో.. ఆమెను దక్కించుకోవడం కోసం చేసే సాహసమే రాధేశ్యామ్ కథ. చదవండి: సూపర్ హిట్ కలెక్షన్స్‌తో దూసుకుపోతోన్న రాధేశ్యామ్ 1960 నాటి వింటేజ్ ప్రేమకథ నేపథ్యంలో సాగిన ఈ క్లాసీ లవ్‌స్టోరీ ఓ వర్గం ప్రేక్షకులను వీపరితంగా ఆకట్టుకుంటోంది. దీంతో ఈ మూవీ మళ్లీ మళ్లీ చూడాలని వారంత ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వారిందరిని సంతోష పెట్టే ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతొంది. బిగ్స్క్రీన్పై సందడి చేస్తోన్న ఈమూవీ త్వరలో డిజిటల్ ప్లాట్‌ఫాంపై కూడా అలరించేందుకు సిద్ధమవుతున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతుంది. రాధేశ్యామ్ భారీ బడ్జెట్‌తో తెరకెక్కడం, అందులో ప్రభాస్ మూవీ కావడంతో పలు ఓటీటీ సంస్థలు ఈ మూవీ డిజిటల్, శాటిలైట్ రైట్స్‌ను సొంతం చేసుకునేందుకు పోటీ పడుతున్నాయట. చదవండి: ‘రాధేశ్యామ్’ మూవీ ఎలా ఉందంటే.. ఈ క్రమంలో ప్రముఖ ఓటీటీ దిగ్గజం అమెజాన్ ప్రైం భారీ ఒప్పందానికి రాధేశ్యామ్‌ను సొంతం చేసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన కూడా రానుందట. ఇక ఏ సినిమా అయిన థియేట్రికల్ రిలీజ్ అనంతరం 4 వారాల తర్వాతే డిజిటల్ ప్లాట్‌ఫాంకు వస్తుంది. అంటే రాధేశ్యామ్ ఏప్రిల్ 11 తర్వాతే ఓటీటీలో స్ట్రీమింగ్ కావాలి. కానీ ఏప్రిల్ 2న ఉగాది పండగ ఉండటంతో ఆ రోజే మధ్యాహ్నం 12 గంటల నుంచి రాధేశ్యామ్ స్ట్రీమింగ్ చేయాలని అమెజాన్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. -
సూపర్ హిట్ కలెక్షన్స్‌తో దూసుకుపోతోన్న రాధేశ్యామ్
Radhe Shyam Box Office Collection: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, పూజా హెగ్డే జంటగా రాధాకృష్ణ కుమార్ తెరకెక్కించిన ‘రాధే శ్యామ్’ మూవీ అద్భుతమైన కలెక్షన్స్‌తో దూసుకుపోతోంది. ఇండియాలో మొదటి సారి ఒక ప్రేమకథకు ఈ స్థాయిలో కలెక్షన్ల వర్షం కురుస్తోంది. మూడు రోజుల్లోనే రూ. 151 కోట్ల గ్రాస్ వసూలు చేసి రికార్డు క్రియేట్ చేసింది రాధేశ్యామ్. పాజిటివ్ టాక్‌తో థియేటర్లకు ప్రేక్షకులు కదులుతున్నారు. భాషతో సంబంధం లేకుండా అన్ని చోట్ల ఈ సినిమాకు అనూహ్యమైన స్పందన వస్తోంది. చదవండి: పెళ్లి, ప్రెగ్నెన్సీపై యంగ్ హీరోయిన్ క్లారిటీ ఈ మూవీలో ప్రభాస్జ్-పూజా హెగ్డేల కెమిస్ట్రీకి అందరూ ఫిదా అవుతున్నారు. అలాగే రాధా కృష్ణ కుమార్ టేకింగ్ కూడా సినిమాకు అదనపు ఆకర్షణగా నిలిచింది. ఇప్పటికే నిర్మాతలకు బ్రేక్ ఈవెన్ అయిపోయింది ఈ సినిమా. సినిమాకు పెట్టిన ఖర్చుకు.. చేసిన ప్రీ రిలీజ్ బిజినెస్‌కు.. ఇప్పుడు వస్తున్న కలెక్షన్స్‌కు.. నిర్మాతలు ఇప్పటికే సేఫ్ అయిపోయారు. నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలోనే రాధే శ్యామ్ రికార్డ్ క్రియేట్ చేసిందంటున్నారు. శాటిలైట్, డిజిటల్ రైట్స్ ఆల్ టైం రికార్డు ధరకు అమ్ముడయ్యాయి. చదవండి: ఆ స్టార్ హీరో గురించి చాలా చెప్పాలి: పూనమ్ షాకింగ్ కామెంట్స్ ఇక ఇప్పుడు థియేటర్లలో కూడా సినిమా అద్భుతమైన కలెక్షన్స్ సాధిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లోనూ మూడు రోజుల్లో అన్ని థియేటర్స్ లో హౌస్ ఫుల్ కలెక్షన్స్ వచ్చాయి. ఒక ప్రేమ కథకు ఈ స్థాయిలో ఆదరణ లభిస్తుండడం ఇదే మొదటిసారి. ప్రభాస్ కు ఉన్న పాన్ ఇండియా ఇమేజ్ రాధే శ్యామ్ సినిమా మరోసారి నిరూపించింది. అత్యద్భుతమైన విజువల్ ఎఫెక్ట్స్.. ఎమోషనల్ గా సాగే లవ్ స్టోరీ.. కట్టి పడేసే క్లైమాక్స్ సన్నివేశాలు రాధే శ్యామ్ సినిమాకు పాజిటివ్ గా నిలిచాయి. ఇదే సినిమాను ప్రేక్షకులకు మరింత చేరువ చేస్తున్నాయి. -
రాధేశ్యామ్: 'నిన్నేలే' ఫుల్ వీడియో సాంగ్ వచ్చేసింది
Ninnele Full Video Song Out Now: ప్రభాస్, పూజా హెగ్డే కలిసి నటించిన సినిమా రాధేశ్యామ్. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం మార్చి 11న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. యూవీ క్రియేషన్స్, టీ సిరీస్ బ్యానర్లపై భూషణ్ కుమార్, వంశీ, ప్రమోద్, ప్రసీద సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతుంది. 1960 నాటి వింటేజ్ ప్రేమకథ నేపథ్యంలో సాగిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.తాజాగా ఈ చిత్రం నుంచి నిన్నేలే నిన్నేలే అనే ఫుల్ వీడియో సాంగ్‌ని రిలీజ్ చేశారు. 'నిన్నేలే నిన్నేలే.. నిన్నే నమ్మాలే ఏముంది నా నేరమే' అంటూ ఎంతో భావోద్వేగంతో ఈ సాంగ్ సాగుతుంది. Come and fall in love 💕 with melodious songs from blockbuster, #RadheShyam #MusicalOfAges#Ninnele (Telugu): https://t.co/ow8TLqHQbH#Unnaalae (Tamil): https://t.co/NDDX3Xq6eu#Ninnalle (Kannada): https://t.co/e1aCqRN8nP#Ninnaale (Malayalam): https://t.co/KfCGZw2rTG pic.twitter.com/r2yyUEdLed — Radhe Shyam (@RadheShyamFilm) March 13, 2022 -
ప్రభాస్‌పై పూనమ్ కౌర్ ఆసక్తికర వ్యాఖ్యలు
Poonam Kaur Intresting Comments On Prabhas: నటి పూనమ్ కౌర్ ఈ మధ్య తరచూ వార్తల్లో నిలుస్తోంది. గత కొంతకాలంగా వెండితెరకు దూరమైన ఈ పంజాబి భామ తాజాగా ‘నాతి చరామి’ మూవీతో రీఎంట్రీ ఇచ్చింది. మార్చి 10న ఈ మూవీ అమెజాన్, హంగామా, సోనీ, టాటా స్కై, ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్, ఎంఎక్స్ ప్లేయర్ వంటి 20 ఓటీటీ ప్లాట్ఫామ్ల్లో విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఈ నేపథ్యంలో పూనమ్ వరస ఇంటర్య్వూలతో బిజీగా మారింది. ఈ క్రమంలో ఇటీవల ఓ యూట్యూబ్ చానల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో ఆమె మాట్లాడుతూ.. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. చదవండి: రాధికను టిల్లు నమ్మలేదు.. కానీ మీరు నమ్మారు: హీరోయిన్ పరిశ్రమలో ప్రభాస్ లాంటి వ్యక్తి ఎవరూ లేరంటూ స్టేట్మెంట్ ఇచ్చింది. ఈ మేరకు ఆమె ‘సినీ పరిశ్రమలో స్టార్స్, యాక్టర్స్ అనేవారు చాలామంది ఉన్నారు. కానీ ఒక మనిషిని నమ్మి అయిదు సంవత్సరాలు ఒకే మూవీకి కేటాయించడం చాలా గొప్ప విషయం. అది ప్రభాస్ లాంటి వ్యక్తి మాత్రమే చేయగలరు. ఆయన మంచి వ్యక్తి. ప్రభాస్ లుక్స్, క్రేజ్ పక్కన పెడితే.. నమ్మిన వాళ్ల కోసం నిలబడడమే ఆయన క్యారెక్టర్’ అంటూ డార్లింగ్‌పై ప్రశంసలు కురిపించింది పూనమ్. చదవండి: ఓటీటీలోకి అజిత్ ‘వలిమై’, స్ట్రీమింగ్ ఎక్కడంటే.. కాగా ఇటీవల కాలంతో పలువురు ప్రముఖలపై సోషల్ మీడియాల్లో పరోక్షంగా సంచలన వ్యాఖ్యలు, విమర్శలు చేస్తూ వివాదంలో నిలిచే పూనమ్ ఇలా ప్రభాస్‌పై ప్రశంస వ్యాఖ్యలు చేయడం ఆసక్తిని సంతరించుకుంది. ఈ నేపథ్యంలో ప్రభాస్‌పై ఆమె కామెంట్స్ వైరల్‌గా మారాయి. ఇక ప్రభాస్ ‘రాధేశ్యామ్’ మూవీ గురించి మాట్లాడుతూ.. తనకు ప్రేమ కథలు, సినిమాలు అంటే ఇష్టమని, అలాగే 'రాధే శ్యామ్' కూడా తనకు నచ్చుతుందని పూనమ్ పేర్కొంది. -
ప్రభాస్ ఆ సినిమా రీమేక్ చేస్తే చూడాలని ఉంది : కృష్ణంరాజు
ప్రభాస్, పూజా హెగ్డే జంటగా కె. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘రాధేశ్యామ్’. మార్చి 11న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకి మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ.. కలెక్షన్స్ పరంగా మాత్రం దూసుకెళ్తోంది. తొలిరోజే దాదాపు రూ.50 కోట్ల వసూళ్లను రాబట్టి మరోసారి ప్రభాస్ సత్తా ఏంటో ఇండియన్ బాక్సాఫీస్‌కు చూపించింది. ఇక ఈ సినిమా విజయం పట్ల సీనియర్ హీరో, ప్రభాస్ పెదనాన్న హర్షం వ్యక్తం చేశారు. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘ఈ సినిమా నాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. నేను ప్రభాస్ కలిసి ఇంతకుముందు నటించాం. ఈ సారి మా అమ్మాయి ప్రసీద కూడా ఇందులో భాగస్వామి కావడం ఆనందంగా ఉంది. ఈ సినిమాలో నేను 'పరమహంస' పాత్రలో కనిపిస్తాను.ఈ పాత్రను చూస్తే వివేకానందుడు .. రామకృష్ణ పరమహంస మాదిరిగా అనిపిస్తుంది. అంతటి నిండుదనం ఉన్న పాత్రను చేయడం నాకు ఎంతో సంతృప్తిని ఇచ్చింది. ఆ పాత్రను ఎంతో ఎంజాయ్ చేస్తూ చేశాను. 'పరమహంస' పాత్రలో నన్ను చూస్తే దేవుడిని చూసినట్టుగా ఉందని ప్రభాస్ ఒక ఇంటార్వ్యూలో చెప్పాడు. నిజంగా అది నాకు దక్కిన పెద్ద కాంప్లిమెంట్ గా నేను భావిస్తున్నాను. ప్రభాస్ కెరియర్ అంచనాలను దాటుకుని వెళుతోంది. అయితే రెండు మూడేళ్లకు ఒక సినిమానే చేస్తున్నాడని అభిమానులు అసంతృప్తి చెందుతున్నారు. ‘రాధేశ్యామ్' కూడా ఇంత ఆలస్యమై ఉండేది కాదు. కరోనా ప్రభావం వలన కలిగిన ఆటంకాల వలన ప్రేక్షకుల ముందుకు రావడానికికి చాలా సమయం పట్టేసింది. ఇకపై ఏడాదికి రెండు సినిమాలు చేస్తానని ప్రభాస్ చెప్పాడు’అని కృష్ణంరాజు చెపుకొచ్చాడు.అలాగే రాధేశ్యామ్ చిత్రాన్ని బాహుబలితో చూసి పోల్చొద్దని చెప్పారు. ఇక ప్రభాస్ ఏ సినిమా రీమేక్ చేయాలని కోరుకుంటున్నారు అని అడిగితే.. ‘మనవూరి పాండవులు’అయితే బాగుంటుందని చెప్పారు. -
‘రాధేశ్యామ్’ తొలి రోజు వసూళ్లు ఎంతంటే..?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, బుట్టబొమ్మ పూజా హెగ్డే జంటగా, రాధాకృష్ణ కుమార్ తెరకెక్కించిన ప్రేమకథ చిత్రం ‘రాధేశ్యామ్’. భారీ అంచనాల మధ్య విడుదలైన మార్చి 11న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రానికి.. తొలిరోజు మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ..కలెక్షన్స్ పరంగా మాత్రం దుమ్ముదులిపింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా దాదాపు రూ.50 కోట్ల షేర్ని సాధించినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా ఓవర్సీస్లో అయితే రికార్డు స్థాయిలో ఓపెనింగ్స్‌ని రాబట్టినట్లు తెలుస్తోంది. ఈ సినిమా ప్రీమియర్ తోనే 904 K డాలర్లు వసూలు చేసిందట. (చదవండి: ‘రాధేశ్యామ్’మూవీ రివ్యూ) ప్రభాస్‌కు ఉన్న క్రేజ్ దృష్ట్యా అక్కడ విడుదలకు ముందే ఎక్కువ టికెట్స్ అమ్ముడయ్యాయి. హాలీవుడ్ సినిమాలతో పోటీపడి మరీ అద్భుతమైన వసూళ్లు సాధించింది రాధే శ్యామ్. నార్త్ అమెరికాలో మరికొన్ని స్క్రీన్స్ యాడ్ చేశారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో మొత్తంగా రూ. 30 కోట్లు వసూళ్ల రాబట్టింది. ఒక్క నైజాంలోనే తొలిరోజు రూ.11.87 కోట్ల రూపాయలు వసూలు చేసినట్టు సమాచారం. ఆంధ్రాలో మొత్తంగా రూ.8.5 కోట్లను రాబట్టినట్లు సమాచారం. బాలీవుడ్‌లోనూ భారీగానే వసూళ్లను రాబట్టిందట. అయితే ఎన్ని కోట్లు అదేదానిపై క్లారిటీ లేదు. ఈ సినిమాలో హస్తసాముద్రికా నిపుణుడు విక్రమాదిత్య పాత్రలో ప్రభాస్ నటించాడు. దాదాపు రూ.300 కోట్ల బడ్జెట్‌తో గోపికృష్ణ మూవీస్ ప్రైవేట్ లిమిటెడ్, యూవీ క్రియేషన్ సంయుక్తంగా ఈ రొమాంటిక్ లవ్ స్టోరీని నిర్మించింది. సౌత్ లాంగ్వేజెస్‌కి జస్టిన్ ప్రభాకరన్ సంగీతం సమకూర్చగా, తమన్ నేపథ్య సంగీతం అందించాడు. -
రాధేశ్యామ్‌పై ట్రోలింగ్: మీమ్‌తో కౌంటరిచ్చిన తమన్
ప్రభాస్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రాధేశ్యామ్ ఎట్టకేలకు శుక్రవారం (మార్చి 11) రిలీజైంది. రాధాకృష్ణకుమార్ దర్శకత్వంలో ప్రభాస్ నటించిన ఈ పీరియాడికల్ మూవీకి మిశ్రమ స్పందన లభిస్తోంది. ఈ ప్రేమకథ అజరామరం అని కొందరు పొగుడుతుంటే మరికొందరు మాత్రం చాలా స్లోగా సాగుతూ బోర్ కొట్టిందని అంటున్నారు. ఈ సినిమా ప్రభాస్ చేయాల్సింది కాదని కొందరు నెగెటివ్ కామెంట్లు పెడుతుంటారు. తాజాగా ఈ నెగెటివిటీపై సంగీత దర్శకుడు తమన్ పరోక్షంగా స్పందించాడు. చదవండి: ‘రాధేశ్యామ్’మూవీ రివ్యూ సినిమా స్లోగా ఉందన్నవాళ్లకు కౌంటరిచ్చేలా ఉన్న మీమ్‌ను ట్విటర్లో షేర్ చేశాడు. ఇంతకీ ఆ మీమ్‌లో ఏముందంటే.. 'సినిమా ఎలా ఉంది?' అన్న ప్రశ్నకు బాగా స్లోగా ఉందని చెప్పగా.. 'నేను అడిగింది బాగుందా? బాలేదా? అని!, లవ్ స్టోరీ స్లోగా కాకుండా ఫస్ట్ హాఫ్‌లో ఫస్ట్ నైట్, సెకండాఫ్‌లో సెకండ్ సెటప్ పెట్టాలా ఏంటి?' అని చిర్రుబుర్రులాడుతున్నట్లుగా ఉంది. దీన్ని షేర్ చేసిన తమన్.. 'మీమ్ అదిరింది.. స్లో అంట, నువ్వు పరిగెత్తాల్సింది' అంటూ ట్రోలర్స్‌పై సెటైర్ వేశాడు. ఈ ట్వీట్‌కు బ్లాక్‌బస్టర్ రాధేశ్యామ్ అన్న హ్యాష్‌ట్యాగ్‌ను జత చేశాడు. మరి ఈ సినిమా నిజంగానే బ్లాక్‌బస్టర్ హిట్ అవుతుందో లేదో చూడాలి! #BlockBusterRadheShyam 💥💥💥💥💥💥 Slowwwww antaaaaa … Nuvvvvuuu parrigethaaaalsindhiiiii 🤣🤣🤣🤣 Adhirindhiiiii memmeee !! 🍭🍭🍭🍭🎭🤪 pic.twitter.com/SGW10l5w5h — thaman S (@MusicThaman) March 11, 2022 -
‘రాధేశ్యామ్’మూవీ జెన్యూన్ రివ్యూ..
-
యూఎస్ షోలలో కనిపించని కృష్ణంరాజు.. ఎందుకంటే?
Krishnam Raju Character Missing In Radhe Shyam USA Theaters: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రమే కాకుండా సినీ ప్రేక్షకలోకం ఎంతగానో ఎదురు చూసిన చిత్రం 'రాధేశ్యామ్' ఎట్టకేలకు మార్చి 11న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. సుమారు నాలుగేళ్ల నిరీక్షణ తర్వాత రిలీజై బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. ఈ సినిమాలో ప్రభాస్ ప్రముఖ హస్త సాముద్రికుడు విక్రమాదిత్య పాత్రలో యాక్ట్ చేస్తున్నాడు. అలాగే పీరియాడికల్ బ్యాక్ డ్రాప్లో రూపొందిన ఈ మూవీలో ప్రభాస్ పెద్దనాన్న రెబల్ స్టార్ కృష్ణంరాజు కూడా ఒక కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. 'రాధేశ్యామ్' మూవీలో కృష్ణంరాజు 'పరమహంస' రోల్లో నటించారు. ఇదివరకూ బిల్లా, రెబల్ చిత్రాల్లో వీరిద్దరూ స్క్రీన్ షేర్ చేసుకోగా 'రాధేశ్యామ్' మూడో చిత్రం. ఇదిలా ఉంటే తాజాగా ఆశ్చర్యపరుస్తున్న వార్త ఏంటంటే పరమహంస పాత్ర పోషించిన కృష్ణంరాజు కేవలం ఈ మూవీ తెలుగు వెర్షన్‌కు మాత్రమే పరిమితయ్యారట. విదేశీ థియేటర్లలో విడుదలైన ఈ చిత్రంలో కృష్ణంరాజు కనిపించట్లేదని సమాచారం. దీంతో కృష్ణంరాజదు ఎందుకు కనిపించడంలేదంటూ ఫ్యాన్స్ మేకర్స్‌ను సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారట. అయితే ఈ పాత్రను తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో కోలీవుడ్ యాక్టర్ సత్యరాజ్ పోషించారు. ట్రైలర్ విడుదలైనప్పటినుంచి ఈ విషయం స్పష్టమైంది. కానీ ఈ సినిమా తెలుగు వెర్షన్లో సైతం కృష్ణంరాజుకు బదులు సత్యరాజ్ కనిపించినట్లు యూఎస్ఏ ఆడియెన్స్ చెప్పినట్లు తెలుస్తోంది. ఈ పాత్రకు కృష్ణంరాజు నటించడమే కాకుండా స్వయంగా డబ్బింగ్ కూడా చెప్పారు. అలా అయితే యూఎస్ తెలుగు ప్రింట్లో కృష్ణంరాజుకు బదులు సత్యరాజ్‌ను ఎందుకు చూపించారనే విషయంపై ఎలాంటి క్లారిటీ లేదట. ఇంతేకాకుండా యూకేకి పంపిన కొన్ని ప్రింట్లలో కృష్ణంరాజు పాత్రను మొత్తానికే తీసేసినట్లు టాక్ వినిపిస్తోంది. -
‘రాధేశ్యామ్’మూవీ రివ్యూ
టైటిల్ : రాధేశ్యామ్ నటీనటులు : ప్రభాస్,పూజా హెగ్డే, కృష్ణంరాజు, జగపతిబాబు, భాగ్యశ్రీ, సచిన్ ఖేడ్కర్, ప్రియదర్శి తదితరులు నిర్మాణ సంస్థ : గోపీ కృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్, టి.సిరీస్ నిర్మాతలు: భూషణ్ కుమార్, వంశీ ప్రమోద్ ప్రసీదా దర్శకత్వం : కె. రాధాకృష్ణ సంగీతం : జస్టిన్ ప్రభాకరన్(తెలుగు,తమిళ, కన్నడ,మళయాళం) నేపథ్య సంగీతం: తమన్ సినిమాటోగ్రఫీ : మనోజ్ పరమహంస ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వరరావు విడుదల తేది : మార్చి 11,2022 బాహుబలి, సాహో తర్వాత ప్రభాస్ నటించిన మరో పాన్ ఇండియా చిత్రం ‘రాధేశ్యామ్’. ఈ మూవీ కోసం రెబల్ స్టార్ అభిమానులు కళ్లల్లో ఒత్తులు వేసుకొని ఎదురు చూశారు. పీరియాడికల్ బ్యాక్ డ్రాప్లో తెరకెక్కిన ఈ చిత్రం.. దాదాపు నాలుగేళ్ల పాటు షూటింగ్ జరుపుకుంది. కరోనా కారణంగా పలుమార్లు వాయిదా పడిన ఈ మూవీ ఎట్టకేలకు ఈ శుక్రవారం (మార్చి 11) ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్‌కు భారీ స్పందన రావడంతో పాటు సినిమాపై అంచనాలను పెంచాయి. దానికి తోడు సినిమా ప్రమోషన్స్ కూడా గ్రాండ్‌గా నిర్వహించడంతో ‘రాధేశ్యామ్’పై హైప్ క్రియేట్ అయింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ మూవీ.. ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో రివ్యూలో చూద్దాం. ‘రాధేశ్యామ్’ కథేంటంటే.. రాధేశ్యామ్ కథంతా 1976 ప్రాంతంలో సాగుతుంది. విక్రమాదిత్య(ప్రభాస్) ఓ గొప్ప జ్యోతిష్కుడు. హస్తసాముద్రికంలో ఆయన అంచనాలు వందశాతం నిజమవుతుంటాయి. ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించబోతుందని ముందే చెప్పి.. ఇండియా నుంచి ఇటలీ వెళ్లిపోతాడు. తన చేతిలో ప్రేమ రేఖలు లేవని, లవ్‌ని కాకుండా ఫ్లటేషన్షిప్ని నమ్ముకుంటాడు. ఇలా కనిపించిన ప్రతి అమ్మాయితో ఎంజాయ్ చేసే విక్రమాదిత్య.. డాక్టర్ ప్రేరణ(పూజా హెగ్డే)తో మాత్రం తొలి చూపులోనే ప్రేమలో పడతాడు. కానీ తన చేతిలో లవ్ లైన్స్ లేవని, ఆ విషయాన్ని ఆమెకు చెప్పలేక పోతాడు. మరోవైపు ప్రేరణ క్యాన్సర్‌తో బాధపడుతుంది. ఆమె రెండు నెలల కంటే ఎక్కువ కాలం బతకదని వైద్యులు చెప్తారు. కానీ తాను జీవితాంతం బతుకుతుందని విక్రమాదిత్య చెప్తాడు. అది ఎలా సాధ్యం అవుతుంది? విధిని ఎదురించి తన ప్రేమని విక్రమాదిత్య గెలిపించుకోగలిగాడా? లేదా? అనేదే ఈ సినిమా కథ. ఎలా ఉందంటే.. మన రాత అనేది చేతుల్లో ఉండదు.. చేతల్లో ఉంటుందనే విషయాన్ని ఓ ప్రేమ కథతో మరోసారి ప్రపంచానికి గుర్తు చేశాడు దర్శకుడు రాధాకృష్ణ. ఓ అందమైన ప్రేమకథని గ్రాండ్‌గా చూపించే ప్రయత్నం చేశాడు. కథలో ఎలాంటి మలుపులు ఉండవు కానీ.. లొకేషన్స్, విజువల్ ఎఫెక్ట్స్ మాత్రం ప్రేక్షకుడి మనసు దోచుకుంటాయి. ఇటలీలోని బ్యూటిఫుల్ లొకేషన్స్‌లో కథ.. అలా సాగిపోతుంది. ప్రభాస్ గత సినిమాల మాదిరి ఫైట్ సీన్స్, మాస్ సాంగ్స్ గానీ ఈ చిత్రంలో ఉండవు. కానీ కథంతా హీరో, హీరోయిన్ల చుట్టే తిరుగుతుంది. మిగతా పాత్రలకు అంతగా స్క్రీన్ స్పేస్ లేదు. భాగ్యశ్రీ, సచిన్ ఖేడ్కర్, జగపతిబాబు, జయరాం,మురళిశర్మ లాంటి సీనియర్ నటులు ఉన్నప్పటికీ.. వారంతా కథలో ఇలా వచ్చి అలా వెళ్లినట్లు అనిపిస్తుంది. ప్రేమ కథకు హీరో, హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ చాలా అవసరం. ఈ సినిమాలో ఆ కెమెస్ట్రీ వర్కౌట్ అయినా.. అందుకు తగినట్లుగా బలమైన సీన్స్ లేకపోవడం మైనస్. ఫస్టాఫ్ అంతా స్లోగా సాగుతుంది. యూరప్ అందాలపైనే దర్శకుడు ఎక్కువ శ్రద్దపెట్టినట్లు అనిపిస్తుంది. ట్రైన్ సీన్ ఆకట్టుకుంటుంది. అలాగే హీరో, హీరోయిన్ల మధ్య వచ్చే డెత్ ప్రాక్టీస్ సీన్ నవ్విస్తుంది. ఇంటర్వెల్ ట్విస్ట్ సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచుతుంది. కానీ ఆ ఆసక్తిని సినిమా ఎండింగ్ వరకు కొనసాగించడంలో దర్శకుడు విఫలమయ్యాడు. సెకండాఫ్‌లో కూడా కథ రొటీన్‌గా సాగుతుంది. క్లైమాక్స్‌లో వచ్చే ఓడ సీన్.. పలు ఇంటర్యూల్లో చిత్ర యూనిట్ చెప్పినట్లుగా మెస్మరైస్ చేయకపోయినా.. ఉన్నంతలో ఆకట్టుకుంటుంది. మొత్తంగా పాన్ ఇండియా స్థాయిలో ఇమేజ్ ఉన్న ప్రభాస్.. ఇలాంటి కథను ఒప్పుకొని, చేయడం నిజంగా ఓ ప్రయోగమే. కానీ అది అంతగా ఫలించలేదు. ఎవరెలా చేశారంటే.. పేరుమోసిన జోతిష్యుడు విక్రమాదిత్య పాత్రలో ప్రభాస్ ఒదిగిపోయాడు. మాస్ ఇమేజ్‌ని ఉన్న ప్రభాస్.. ఈ సినిమాలో చాలా క్లాస్‌గా కనిపించాడు. ఇక డాక్టర్ ప్రేరణగా పూజా హెగ్డే మెప్పించింది. వీరిద్దరి జోడి తెరపై అందంగా కనిపించింది. విక్రమాదిత్య గురువు పరమహంస పాత్రంలో కృష్ణంరాజు ఆకట్టుకున్నాడు. హీరో తల్లిగా భాగ్యశ్రీ నటించింది. కానీ ఆమె పాత్రకు అంతగా స్క్రీన్ స్పెస్ లేదు. అలాగే హీరోయిన్ పెదనాన్నగా సచిల్ ఖేడ్కర్, ఓడ కెప్టెన్‌గా జయరాం, బిజినెస్ మ్యాన్‌గా జగపతిబాబుతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఇక సాంకేతిక విషయానికొస్తే.. మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫీ సినిమాని మరో లెవల్‌కి తీసుకెళ్లింది. ప్రతి ఫ్రేమ్ అందంగా, అద్భుతంగా ఉంటుంది. ఓ కొత్త ప్రపంచాన్ని కళ్లముందు సృష్టించాడు.అలాగే కమల్ కన్నన్ విజువల్ ఎఫెక్ట్స్ అద్భుతంగా ఉన్నాయి. అవసరానికి మించి విఎఫ్ఎక్స్ ను ఉపయోగించుకోవడంతో ప్రతి ఫ్రేమ్ ఓ విజువల్ వండర్ గా మారిపోయింది. జస్టిన్ ప్రభాకర్ సంగీతం(సౌత్ వర్షన్) ఓకే. పాటలు అంతగా ఆకట్టుకోలేదు. తమన్ నేపథ్య సంగీతం బాగుంది.కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నాయి. - అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
కృష్ణంరాజు హోంటూర్ చూశారా? ఇల్లంతా బంగారమే
Krishnam Raju Home Tour: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటించిన సినిమా 'రాధేశ్యామ్'. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా నేడు(శుక్రవారం)ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 1960 నాటి వింటేజ్ ప్రేమకథ నేపథ్యంలో భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమాలో రెబల్‌స్టార్, ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజు మహాజ్ఞాని అయిన పరమహంస పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. సినిమా రిలీజ్ నేపథ్యంలో మూవీ టీం ప్రమోషన్స్‌లో జోరు పెంచింది. తాజాగా ఓ యూట్యూబ్ చానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కృష్ణారాజు భార్య శ్యామలదేవీ హోంటూర్ చూపించారు. తమ ఇంటికి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను ఆమె పంచుకున్నారు. ఇంట్లో అందరికి దైవభక్తి ఎక్కువ. ప్రతిరోజు దేవుడికి పూజలు చేస్తాం. ఇక కృష్ణంరాజు గారికి పురాతన వస్తువులంటే చాలా ఇంట్రెస్ట్. అందుకే మా ఇంట్లో అలాంటివి చాలా కనిపిస్తుంటాయి. ఇక అందులో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఇటలీ నుంచి తెప్పించిన ఈ అందమైన బొమ్మ. 24క్యారెట్ల బంగారంతో రూపొందించిన ఈ విగ్రహం 30ఏళ్ల క్రితం నాటిది అని చెప్పుకొచ్చారు. అంతేకాకుండా పూర్తి బంగారంతో తయారు చేసిన పులి బొమ్మ చాలా అరుదని, దీని ప్రత్యేకత ఏంటంటే.. 50ఏళ్ల తర్వాతే మళ్లీ కొత్తది తయారు చేస్తారు అని చెప్పుకొచ్చారు. ఇక ఎంత బిజీగా ఉన్నా ప్రభాస్ తన పెదనాన్న కృష్ణంరాజుతో సమయం గడుపుతారని, వాళ్లిద్దరి మధ్య మంచి అనుబంధం ఉంటుందని పేర్కొన్నారు. -
ఐమ్యాక్స్ థియేటర్ వద్ద అపశృతి.. అభిమానికి తీవ్ర గాయాలు
ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న రోజు వచ్చేసింది. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో ప్రభాస్ నటించిన 'రాధేశ్యామ్' చిత్రం శుక్రవారం విడుదలైంది. ఈ సందర్భంగా థియేటర్స్ వద్ద సందడి వాతావరణం నెలకొంది. ఏ థియేరట్ వద్ద చూసినా డార్లింగ్ అభిమానుల హంగామా కనిపిస్తుంది. సాహో తర్వాత మూడేళ్లకు ప్రభాస్ సినిమా రిలీజ్ కావడంతో ఫ్యాన్స్ ఆనందంలో మునిగిపోయారు. ఈ నేపథ్యంలో థియేటర్స్ ద్ద భారీ కటౌట్లు పెట్టి తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. ఈ క్రమంలో కర్ణాటకలోని కారంపూడి ఐమ్యాక్స్ థియేటర్ వద్ద అపశృతి నెలకొంది. ఈ ప్రమాదంలో ప్రభాస్ ఫ్యాన్స్‌కి తీవ్ర గాయాలైనట్లు తెలుస్తుంది. థియేటర్ వద్ద 37ఏళ్ల చల్లా కోటేశ్వర రావు అనే వ్యక్తి ఫ్లెక్సీ కడుతుండగా అది విరిగి పక్కనే ఉన్న కరెంట్ తీగలపై పడింది. ఈ ప్రమాదంలో కోటేశ్వర రావు అనే వ్యక్తి విద్యుదాఘాతానికి గురై తీవ్ర గాయాలపాలయ్యాడు. స్థానికులు వెంటనే అతడ్ని ఆసుపత్రికి తరలించారు. -
వీళ్లిద్దరు కలిస్తే ఫన్ కి నో ఎండ్
-
‘రాధేశ్యామ్’ మూవీ ట్విటర్ రివ్యూ
రాధేశ్యామ్.. ఈ సినిమా కోసం రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులు మాత్రమే కాదు ఆల్ ఇండియా మూవీ లవర్స్ అందరూ ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. బాహుబలి, సాహో చిత్రాల తర్వాత ప్రభాస్ నటించిన చిత్రమిది. పీరియాడికల్ బ్యాక్ డ్రాప్లో ఇటలీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా.. దాదాపు నాలుగేళ్ల పాటు షూటింగ్ జరుపుకుంది. కరోనా కారణంగా పలుమార్లు వాయిదా పడిన ఈ చిత్రం ఎట్టకేలకు ఈ శుక్రవారం (మార్చి 11) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాల మధ్య ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 7010 స్క్రీన్స్‌లో ఈ చిత్రం రిలీజైంది. ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్‌కు భారీ స్పందన రావడంతో పాటు మూవీపై భారీ హైప్ క్రియేట్ చేసింది. ఓవర్సీస్తో పాటు పలు చోట్ల ఈ సినిమా ప్రీవ్యూస్ పడడంతో ఈ సినిమాను చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను తెలుపుతున్నారు.. అసలు కథేంటీ.. కథనం ఎలా ఉంది? తదితర అంశాలను ట్విటర్ వేదికగా చర్చిస్తున్నారు. అవేంటో చూడండి. 1st half - More than decent first half Pre-Interval to the last scene, movie went onto a whole different level 2nd half - 👌🏻 One more blockbuster for Prabhas, probably first time without any fights@idlebrainjeevi #RadheyShyam @UV_Creations @hegdepooja #Prabhas𓃵 @director_radhaa pic.twitter.com/CPqu5qI9a5 — Duggu Tej (@duggu_tej) March 10, 2022 సినిమాలో విజువల్స్ అదిరిపోయాయి. ప్రభాస్ లుక్స్, యాక్టింగ్ సరికొత్తగా ఉంది. తమన్ బీజీఎం ఔట్ స్టాండింగ్ అని అంటున్నారు. అలాగే ప్రభాస్ కెరీర్లో ఒక్క ఫైట్ సీన్ లేకుండా వచ్చిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అని చెబుతున్నారు. Decent - First Half Excellent- Second half Mind blowing twist and perfectly executed story 👌 Songs visuals are Top Notch #Prabhas Looks Outstanding and peaks Performance @MusicThaman Bgm outstanding Overall - 👌👌👌 Rating - 4/5 #RadheyShyam #RadheShyamFromTomorrow — PowerStar 🔥 (@powerstarpk007) March 10, 2022 ఫస్ట్ హాఫ్ చాలా బావుంది. ఇంటర్వెల్ ముందు వచ్చే సన్నివేశం సినిమాను మరో లెవల్‌కు తీసుకెళ్లెంది. సినిమా సెకండాఫ్ ఎక్సలెంట్.ప్రభాస్ కెరీర్లో మరో బ్లాక్ బస్టర్ అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. #RadheShyam #RadheyShyam #RadheShyamReview : ⭐⭐⭐🌟 1st half is artistic and visually splendid. The superficial second half is slow paced and convoluted. Interesting premise,soulful music, and extravaganza production. Superb BGM by #ThamanS @MusicThaman#Prabhas #Poojahegde pic.twitter.com/gU8H9GWVEt — OTTRelease (@ott_release) March 11, 2022 Decent - First Half Excellent- Second half Mind blowing twist and perfectly executed story 👌 Songs visuals are Top Notch #Prabhas Looks Outstanding and peaks Performance @MusicThaman Bgm outstanding Overall - 👌👌👌 Rating - 4/5 #RadheyShyam — 🐰 (@Edgarboy_) March 11, 2022 Good 1st half (With minor glitches)#Prabhas & @hegdepooja chemistry worked out well ❤️ 3 Songs are visually good... 😍 Interval point & shots literally elevated the film. Excited for 2nd Half 🤷🏼♂️#RadheShyam#RadheShyamReview — Rajesh Manne (@rajeshmanne1) March 11, 2022 Finished the show just now #RadheyShyam What a movie , mind blowing. Another milestone movie in the career of #RebelStar #Prabhas Anna. Unbelievable climax 🙏🏼#Blockbuster — DHFM_REAL (@DhfmReal) March 10, 2022 Decent - First Half Excellent- Second half Mind blowing twist and perfectly executed story 👌 Songs visuals are Top Notch #Prabhas Looks Outstanding and peaks Performance @MusicThaman Bgm outstanding Overall - 👌👌👌 Rating - 4/5 #RadheyShyam — 🐰 (@Edgarboy_) March 11, 2022 #RadheShyamReview 1st half ok for visuals 2nd half li8 Climax mehhh but good vfx — Nav🔔 (@maamaekpeglaa) March 11, 2022 -
ప్రభాస్: నాకంటే మీకు ఆ స్టార్ హీరోలే ఎక్కువ..!
పాన్ ఇండియా చిత్రం 'రాధే శ్యామ్' సినిమా ప్రమోషన్స్‌లో ప్రభాస్‌తో పాటు దర్శకధీరుడు రాజమౌళి కలిసి ఓ ఇంటర్వూలో పాల్గొన్న విషయం తెలిసిందే. అయితే ఆ ఇంటర్వూలో ప్రభాస్ మాట్లాడుతూ.. ఇపుడు మీరు చరణ్, తారక్ లాంటి ఇద్దరు సూపర్ స్టార్స్‌తో 'ఆర్ఆర్ఆర్' చేస్తున్నారు. అయితే ఆ సినిమాలో నన్ను గెస్ట్ అపీయరెన్స్లో అయినా అడగాలని అనిపించలేదా? అలా ఒకే స్క్రీన్ పై నేను, చరణ్, తారక్ ముగ్గురం ఉంటే బాగుండేది కదా..? అంటే మీరనుకున్న ఆ విజన్‌లో ఎక్కడా కనపడలేదా? అంటూ ప్రభాస్ జక్కన్నను సరదాగా ప్రశ్నించాడు. ఇక దానికి రాజమౌళి స్పందిస్తూ పలు ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చారు. డార్లింగ్ నువ్వు ఓ పెద్ద షిప్ లాంటోడివి.. ఓ సీన్లో ఆ పెద్ద షిప్ పెడితే బ్రహ్మాండగా సీన్ వస్తుంది అంటే షిప్ తీసుకొస్తాం. నేనడిగితే ప్రభాస్ నటిస్తాడు కాబట్టి ప్రభాస్‌ని సినిమాలో ఎక్కడ పెడదామా అని తీస్తే సినిమా బాగుండదు. సినిమాకి అవసరం అంటే మాత్రం నువ్వు ఎంత బిజీగా ఉన్నా నిన్ను ఎలాగైనా కన్విన్స్ చేసి తీసుకొచ్చేస్తా అంటూ రాజమౌళి బదులిచ్చాడు. ఇక దానికి ప్రభాస్.. మీరు అనుకుంటే నాకోసం పాత్రను సృష్టించగలరు కదా? ఎలాగైనా మీకు నాకంటే చరణ్, తారక్ అంటేనే ఇష్టమని నాకు అర్థమైంది అంటూ నవ్వుకున్నాడు. ఇక దానికి రాజమౌళి స్పందిస్తూ నేను ఏ సినిమా చేస్తే ఆ సినిమా చేసినప్పుడు నాకు ఆ హీరోకంటే ఇంకెవ్వరూ ఎక్కువ కాదన్నారు. -
వీళ్లిద్దరూ కలిస్తే ఫన్ కి నో ఎండ్
-
రాధేశ్యామ్‌ను వాడేసిన సజ్జనార్, మీమ్ వైరల్!
Radhe Shyam Movie Meme: టీఎస్ఆర్టీసీ ఎండీగా సజ్జనార్ బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ఎన్నో సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. సంస్థ అభివృద్ధికి, ప్రజారవాణాను జనాలకు మరింత దగ్గర చేసేందుకు ఎంతగానో కృషి చేస్తున్నారు. ఇందుకోసం సోషల్ మీడియాను అస్త్రంగా వాడుకుంటున్నారు. ఆర్టీసీ బస్సు క్షేమంగా గమ్య తీరాలకు చేరుస్తుందంటూ మీమ్స్ వదులుతుండగా అవి నెట్టింట వైరల్ అవుతున్నాయి. తాజాగా సజ్జనార్ పాన్ ఇండియా మూవీ రాధేశ్యామ్‌ను ఆర్టీసీ బస్సుల ప్రమోషన్ కోసం వాడుకున్నారు. ఈ మేరకు ఓ మీమ్ ట్వీట్ చేశారు. ఇందులో 'చాలా రోజుల తర్వాత కలిశాం, ఏదైనా టూర్ వెళదామా?' అని ప్రభాస్ అనగా 'వెళదాం కానీ, ఆర్టీసీ బస్సులోనే వెళదాం' అని పూజా హెగ్డే అంటుంది. 'ఎందుకు?' అని ప్రభాస్ ప్రశ్నించగా 'ఎందుకంటే ఆర్టీసీ ప్రయాణం సురక్షితం- సుఖమయం' అని పూజా సమాధానం చెప్తున్నట్లుగా ఉంటుంది. దీనికి 'బస్సే క్షేమం అంటున్న రాధేశ్యామ్' అని ఒక టైటిల్ కూడా ఇచ్చేశారు. ప్రస్తుతం ఈ మీమ్ వైరల్‌గా మారింది. కాగా రాధేశ్యామ్ శుక్రవారం(మార్చి 11న) రిలీజవుతున్న విషయం తెలిసిందే! #TSRTC బస్సులోనే వెళ్దాం అంటున్నా #RadheShyam Choose TSRTC & Encourage the #publictransport @TSRTCHQ @TV9Telugu @SakshiHDTV @ntdailyonline @News18Telugu @baraju_SuperHit @telugufilmnagar @Sreeram_singer @puvvada_ajay @Govardhan_MLA @TeluguBulletin @ChaiBisket @boxofficeindia pic.twitter.com/3QuEsYqN9i — V.C Sajjanar IPS MD TSRTC Office (@tsrtcmdoffice) March 10, 2022 -
లవ్ మ్యారేజ్ చేసుకుంటా.. ఆ విషయం ఇప్పుడే చెప్పలేను : ప్రభాస్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పెళ్లిపై ఎప్పుడూ చర్చ నడుస్తూనే ఉంటుంది. డార్లింగ్ పెళ్లి గురించి అభిమానులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ అయిన ప్రభాస్ పెళ్లి అంటేనే తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే తాజాగా 'రాధేశ్యామ్' చిత్ర ప్రమోషన్స్‌లో పాల్గొన్న ప్రభాస్‌కు పెళ్లి గురించి ప్రశ్నలు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన ప్రభాస్.. ప్రేమ పెళ్లి చేసుకుంటానని తెలిపాడు. అయితే అది ఎప్పుడు అన్నదానిపై మాత్రం కశ్చితంగా చెప్పలేనని బదులిచ్చాడు. బాహుబలి సినిమా తర్వాత 5వేల పెళ్లి ప్రపోజల్స్ వచ్చాయని అడగ్గా.. అవునని చెప్పిన డార్లింగ్ ఇదో పెద్ద కన్ఫ్యూజన్ అని అన్నారు. ఇలాంటి పరిస్థితి మీకొస్తే ఏం చేస్తారంటూ సరదాగా అడిగాడు. ఇక మొత్తానికి పెళ్లి చేసుకుంటానని చెప్పిన ప్రభాస్ ఎప్పుడన్నది క్లారిటీ ఇవ్వలేదు. ఇక ప్రభాస్, పూజా హెగ్డే నటించిన రాధేశ్యామ్ చిత్రం రేపు(మార్చి11)న విడుదలకు సిద్ధం అవుతుంది. -
ఆ యాక్షన్ సీన్లో ప్రభాస్‌ను విలన్ నిజమైన కర్రతో కొట్టాడట, ఆ తర్వాత..
డార్లింగ్ ప్రభాస్ ప్రస్తుతం రాధేశ్యామ్ ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీ ఉన్న సంగతి తెలిసిందే. రేపు(మార్చి 11) ఈ మూవీ గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ఈనేపథ్యంలో వారం ముందుగా మూవీ ప్రమోషన్లో పాల్గొంటున్న ప్రభాస్ ఈ సందర్భంగా ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. ఈ సందర్భంగా రాజమౌళి డైరెక్షన్లో తాను తొలిసారి నటించిన చత్రపతి మూవీలో ఆర్ట్ డైరెక్టర్ చేసిన ఓ పనిని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నాడు. చదవండి: సమంతపై దారుణమైన ట్రోల్స్.. చీచీ ఇలా దిగజారిపోతున్నావేంటి? కాగా ఈ మూవీకి పనిచేసిన ఆర్ట్ డైరెక్టర్ రవిందర్.. రాధేశ్యామ్‌కు కూడా పని చేశాడు. ఈ నేపథ్యంలో ప్రభాస్ చత్రపతిలో ఆర్ట్ డైరెక్టర్ రవిందర్ చేసిన పనిని గుర్తు చేసుకున్నాడు. చత్రపతిలో సముద్రం ఒడ్డున ప్రభాస్ విలన్ కాట్రాజ్ల ఫైట్ సీన్ ది బెస్ట్ యాక్షన్ సీన్‌గా నిలిచింది. ఈ సన్నివేశంలో ప్రభాస్‌ను విలన్ కర్రతో కోడతాడు. దీని కోసం విలన్ కాట్రాజ్కు సముద్రం ఉప్పుతో చేసిన నిజమైన కర్రను ఇచ్చారట. కానీ ఈ విషయం ప్రభాస్‌కు, విలన్ సుప్రిత్కు తెలియదు. దీంతో విలన్ సుప్రీత్ డూప్ కర్ర అనుకుని తన వీపుపై గట్టిగా కొట్టాడని చెప్పాడు. చదవండి: నేను కూడా కాస్టింగ్ కౌచ్ ఎదుర్కొన్నా: మంచు లక్ష్మి షాకింగ్ కామెంట్స్ దాంతో తన వీపు పగిలిపోయిందంటూ ఫన్నీగా చెప్పుకొచ్చాడు ప్రభాస్. అయితే ఇదే విషయాన్ని ఆర్ట్ డైరెక్టర్ రవిందర్‌ను అడగ్గా.. పర్ఫెక్షన్ కోసం అంటూ సమాధానం ఇచ్చాడట. కాగా 2005లో రాజమౌళి డైరెక్షన్ వచ్చిన ఈ మూవీ బ్లాక్‌బస్టర్ హిట్ అందుకుంది. అప్పట్లోనే ఈ మూవీ రూ. 27 కోట్లు వరకు షేర్ వసూలు చేసిందట. అప్పటి వరకు లవర్ భాయ్‌గా కనిపించిన ప్రభాస్‌కు చత్రపతితో మాస్ ఇమేజ్ వచ్చింది. -
ప్రభాస్ ప్రశ్నకు రాజమౌళి షాకింగ్ ఆన్సర్!
పాన్ ఇండియా చిత్రం 'రాధే శ్యామ్' సినిమా ప్రమోషన్స్‌లో ప్రభాస్‌తో పాటు దర్శకధీరుడు రాజమౌళి కలిసి ఓ ఇంటర్వూలో పాల్గొన్నారు. జక్కన్న ఈ చిత్రానికి వాయిస్ ఓవర్ అందించారు. ఇక ఈ సినిమా కోసం తన వంతు కృషి చేస్తుండటం గమనార్హం. తాజాగా జరిగిన ఈ ఇంటర్వూలో ప్రభాస్ జక్కన్నల మధ్య ఆసక్తికర సంబాషణలు చోటు చేసుకున్నాయి. ఇక విషయం ఏంటంటే స్టార్ హీరో ప్రభాస్ జక్కన్నని రాధేశ్యామ్ సినిమాను ఎందుకు ప్రమోట్ చేస్తున్నావంటూ సరదాగా ప్రశ్నించాడు. అయితే దానికి రాజమౌళి నుంచి షాకింగ్ సమాధానం వచ్చింది. అదేంటంటే.. నువ్వు నా డార్లింగ్, నీకోసం ఏదైనా చేస్తానంటూ జక్కన్న బదులిచ్చారు. ఇక దాంతో ప్రభాస్‌తో పాటు తన అభిమానులు కూడా జక్కన్నకు ఫిదా అయ్యారు. ఇక ఇదిలా ఉండగా ప్రభాస్ నటించిన తాజా పాన్ ఇండియా చిత్రం 'రాధే శ్యామ్' మార్చి 11న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకానున్న విషయం తెలిసిందే. -
అది మా ఫ్యామిలీ బ్లడ్‌లోనే ఉంది: సాయి ప్రసీద
సాయిప్రసీద.. డాటర్ ఆఫ్ రెబల్ స్టార్ కృష్ణంరాజు. సిస్టర్ ఆఫ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. తండ్రి, అన్నయ్యల విజిటింగ్ కార్డ్‌తో నిర్మాతగా పరిచయమవుతున్నారు ప్రసీద ఉప్పలపాటి. ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటించిన ‘రాధేశ్యామ్’కి ప్రసీద ఓ నిర్మాత. కె. రాధాకృష్ణకుమార్ దర్శకత్వంలో వంశీ, ప్రమోద్, ప్రసీద నిర్మించిన ఈ చిత్రం శుక్రవారం రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ప్రసీద చెప్పిన విశేషాలు. ►మీరు నిర్మాతగా లాంచ్ కావడానికి ‘రాధేశ్యామ్’ సరైన ప్రాజెక్ట్ అని ఎందుకు అనిపించింది? అమెరికాలో ప్రొడక్షన్ కోర్స్ చేశాను. తర్వాత ఏం చేయాలా అని ఆలోచిస్తున్నప్పుడు ‘రాధేశ్యామ్’ రైట్ ప్రాజెక్ట్ అని నాన్న (కృష్ణంరాజు), అన్నయ్య (ప్రభాస్) సపోర్ట్ చేశారు. చిన్నప్పటి నుంచి ఇండస్ట్రీలోనే పెరిగాను కాబట్టి సినిమాలంటే ఆసక్తి ఉంది. అయితే ఏదైనా వేరే బిజినెస్ చేద్దామని లండన్‌లో మాస్టర్స్ చేశాను. కానీ సినిమాలపై ఇష్టంతో ‘సాహో’కి వర్క్ చేసి, ఆ తర్వాత మాస్టర్స్ చేయడానికి యూఎస్ వెళ్లాను. అక్కడ నా థియరీస్ అన్నీ సినిమాపైనే చేశాను. నిజానికి మా అమ్మగారు (శ్యామల) బిజినెస్వైపే వెళ్లమన్నారు. కానీ బిజినెస్ మొదలుపెట్టి, సినిమాల మీద ఇష్టంతో మళ్లీ వెనక్కి వచ్చి టైమ్ వేస్ట్ ఎందుకని ఇండస్ట్రీవైపే వచ్చేశాను. ►ప్రొడక్షన్ కోర్స్‌లో నేర్చుకున్నదానికి, ‘రాధేశ్యామ్’ని నిర్మించడానికి ఉన్న తేడాలేంటి? పుస్తకంలో చదివినదానికి ప్రాక్టికల్‌గా చేయడానికి తేడా ఉంటుంది. యూఎస్‌లో ప్రొడక్షన్ కోర్స్ చేశాక నెట్‌ఫ్లిక్స్‌కి చెందిన ఓ హాలీవుడ్ ప్రాజెక్ట్‌కి వర్క్ చేశాను. మన వర్కింగ్ స్టైల్‌కి, అక్కడి వర్కింగ్ స్టైల్‌కి చాలా తేడాలు కనిపించాయి. మన దగ్గర సెట్స్‌లో కనిపించే ఫన్ అక్కడ కాస్త తక్కువ. అలానే మేకింగ్వైజ్గా కూడా చాలా తేడా ఉంది. అన్నయ్య ప్రభాస్‌తో... ►కృష్ణంరాజుగారు ఖర్చు బాగా పెట్టి గ్రాండ్‌గా సినిమాలు తీసేవారు. మరి నిర్మాతగా మీరు? ఈ విషయంలో నాన్నలా ఉండకూడదని నేర్చుకున్నాను (నవ్వుతూ). వృథా ఖర్చులు తగ్గించుకోవాలనే విషయంపైనే ఎక్కువగా ఫోకస్ పెడుతున్నాను. అలా అని నిర్మాణ పరంగా ఖర్చు చేయకూడదని కాదు. ఖర్చంతా స్క్రీన్‌పై కనిపించాలి. ఆడియన్స్‌కు విజువల్ ట్రీట్‌లా అనిపించాలి. ‘రాధేశ్యామ్’ దాదాపు 300 కోట్లతో నిర్మించిన సినిమా కాబట్టి కాస్త టెన్షన్‌గా ఉంది. కానీ ఈ సినిమాతో మంచి అనుభవజ్ఞులు అసోసియేట్ కావడంవల్ల మంచి రిజల్ట్ వస్తుందనే నమ్మకం ఉంది. ►గోపీకృష్ణా మూవీస్ బాధ్యతలను మీకు అప్పజెప్పేటప్పుడు కృష్ణంరాజుగారు, ప్రభాస్‌గారు ఎలాంటి జాగ్రత్తలు చెప్పారు? సినిమా ప్రొడక్షన్ మీద నాకు ఆసక్తి ఉందని నాన్నతో అన్నప్పుడు అన్నయ్యతో చెప్పమన్నారు. అన్నయ్యతో చెబితే, ‘నాకెందుకో సినిమాలపై నీకు ఆసక్తి ఉందనిపించింది. అయితే నా అంతట నేను అడిగి, ఓ ఐడియా క్రియేట్ చేయకూడదని అడగలేదు’ అని అన్నయ్య అన్నారు. ‘నాకు తెలిసింది నేర్పిస్తాను. నాన్నగారు కూడా నేర్పిస్తారు. ఆ తర్వాత నువ్వే కష్టపడాలి’ అని కూడా అన్నారు. ఓ దశలో డైరెక్షన్ పట్ల ఆసక్తి కలిగినప్పటికీ ఫైనల్‌గా ప్రొడక్షన్ వైపే రావాలని నిర్ణయించుకున్నాను. ►మేకింగ్ పరంగా ‘రాధేశ్యామ్’ చిత్రంలోని కొత్త విషయాల గురించి ఏం చెబుతారు? ఈ సినిమాకు వర్చువల్ ప్రొడక్షన్ చేశాం. హాలీవుడ్‌లోని అన్రియల్ ఇంజిన్ అనే ఓ కొత్త టెక్నాలజీని తీసుకువచ్చాం. ‘రాధేశ్యామ్’ ఇటలీ బ్యాక్‌డ్రాప్ మూవీ. కోవిడ్ వల్ల కొన్నిసార్లు అక్కడ షూటింగ్ కుదర్లేదు. దీంతో ఈ కొత్త టెక్నాలజీతో ఇటలీనే ఇండియాకు తీసుకువచ్చాం. ►మీ అన్నయ్య పాన్ ఇండియన్ స్టార్ అయ్యాక మీతో స్పెండ్ చేసే టైమ్ తనకు దొరుకుతోందా? ఏమాత్రం వీలున్నా అన్నయ్య ఫ్యామిలీకి టైమ్ కేటాయిస్తారు. ఓ గంట సమయం ఉంది.. రండి అని నన్ను, నా చెల్లెళ్లను పిలుస్తారు. మేం వెళ్లిన తర్వాత చాలా టైమ్ స్పెండ్ చేస్తారు. మిగతావన్నీ పోస్ట్‌పోన్ (నవ్వుతూ..). అలాగే ప్రతి ఏడాది రాఖీ పండక్కి మాకు గిఫ్ట్‌లు ఇస్తుంటారు. ►మీ అన్నయ్యను యాక్షన్ హీరోగా చూడటం ఇష్టమా? లేక రొమాంటిక్ హీరోగానా? అన్నయ్య చేసిన రొమాంటిక్ ఫిల్మ్ ‘డార్లింగ్’ ఇష్టం. ఓ ఫ్యాన్‌గా అన్నయ్య యాక్షన్ ఫిల్మ్స్ ఇష్టం. ‘సలార్’ కోసం ఎదురు చూస్తున్నాను. ►ప్రభాస్, కృష్ణంరాజుగార్లు కాకుండా ఇండస్ట్రీలోని వేరేవాళ్ల నుంచి ప్రొడక్షన్ పరంగా సలహాలేమైనా తీసుకున్నారా? వైజయంతీ మూవీస్‌లో అన్నయ్య చేస్తున్న ‘ప్రాజెక్ట్ కె’ డెవలప్‌మెంట్స్‌లో పాల్గొన్నాను. స్వప్న, ప్రియాంక బాగా గైడ్ చేశారు. ►మీ ముగ్గురు సిస్టర్స్‌లో ప్రభాస్‌గారు ఎక్కువగా ఎవర్ని ప్యాంపర్ చేస్తుంటారు? అన్నయ్య, మా రెండో సిస్టర్ ప్రకీర్తి బెస్ట్ ఫ్రెండ్స్. ‘ప్రాజెక్ట్ కె’కి ప్రకీర్తి అసిస్టెంట్ ఆర్ట్ డైరెక్టర్‌గా చేస్తోంది. మా చిన్న చెల్లి (ప్రదీప్తి) సైకాలజీ చదువుతోంది. ఈ ఇయర్ లాస్ట్ గ్రాడ్యుయేషన్. చిన్న చెల్లికి సినిమాలపై ఆసక్తి లేదు. నాకు, ప్రకీర్తికి చిన్నప్పటి నుంచే ఆసక్తి ఉంది. ►నీలిమ గుణ (దర్శకుడు గుణశేఖర్ కుమార్తె), కోడి దివ్య (దివంగత దర్శకుడు కోడి రామకృష్ణ కుమార్తె) వంటి వారు నిర్మాణరంగంలోకి వచ్చారు. ఈ రంగంలో మహిళల సంఖ్య పెరగడంపై మీ అభిప్రాయం? చాలా సంతోషంగా ఉంది. దీనివల్ల మహిళలకు ఇండస్ట్రీలో మరిన్ని అవకాశాలు లభిస్తాయి. హన్షిత అక్క (నిర్మాత ‘దిల్’ రాజు కుమార్తె), నీలిమలతో మాట్లాడుతుంటాను. నీలిమవాళ్లు మొన్ననే చాలా ఆర్గనైజ్డ్గా ‘శాకుంతలం’ సినిమాను పూర్తి చేశారు. మహిళా నిర్మాతలుగా మేం మాట్లాడుకుంటూనే ఉంటాం. ►నిర్మాతగా మీ తర్వాతి చిత్రం? ఓ న్యూ ఏజ్ మూవీ కోసం కథలు వింటున్నాను. పెద్ద సినిమాలనే కాదు.. చిన్నవి కూడా నిర్మించాలని ఉంది. ►విందు ఇవ్వడంలో కృష్ణంరాజు, ప్రభాస్ ది బెస్ట్ అని ఇండస్ట్రీ టాక్.. మరి మీరు? నేనూ వంద శాతం నాన్న, అన్నయ్యలానే. అది మా ఫ్యామిలీ బ్లడ్‌లోనే ఉండిపోయింది. చిన్నప్పటి నుంచి మేం అలానే పెరిగాం. డాడీతో మేం షూట్‌కు వెళ్లినా ఫుడ్ ఉంటుంది. ‘బిలా’్ల సినిమా షూటింగ్ మలేసియాలో జరిగినప్పుడు మా అమ్మ యూనిట్ మొత్తానికి పులావ్ వండిపెట్టారు. అలానే నాకూ అలవాటైపోయింది. నేను కూడా యూఎస్ వెళ్లినప్పుడు అక్కడ అందరికీ వండిపెట్టేదాన్ని. మా అన్నయ్యకు వంట రాదు. ►మీ నాన్న, అన్నయ్యలో ఉన్న కామన్ క్వాలిటీస్ ఏంటి? అందరికీ మర్యాద చేయడం, చక్కగా ఫుడ్ పెట్టడం.. ఇలా చాలా కామన్ పాయింట్స్ ఉన్నాయి. ఒకే రకమైన ప్యాషన్‌తో అన్నయ్య, నాన్న సినిమాలు చేస్తారు. ఇప్పటికీ నాన్నగారు సినిమా పట్ల చాలా ప్యాషన్‌గా ఉంటారు. ‘రాధేశ్యామ్’లో నాన్న, అన్నయ్య మధ్య వచ్చే సీన్లు చాలా బాగుంటాయి. -
ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజుకు ఆపరేషన్
టాలీవుడ్ సీనియర్ హీరో, ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజు చిన్న ప్రమాదానికి గురయ్యారు. ఇటీవల ఆయన ఇంట్లో కాలు జారి కిందపడిపోయారట. దీంతో ఆయనకు ఆపరేషన్ జరిగిందని ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. సర్జరీలో భాగంగా ఆయన కాలి వేలుని తొలగించాల్సి వచ్చిందట. ఈ విషయం తెలిస్తే.. రెబల్ స్టార్ ఫ్యాన్స్ కంగారు పడే అవకాశం ఉందని, రహస్యంగా ఉంచినట్లు సమాచారం. ప్రస్తుతం ఆయన ఆరోగ్యంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో కృష్ణంరాజు సతీమణి శ్యామలా దేవి మాట్లాడుతూ.. ఆయన ఇంట్లో జారిపడ్డారని చెప్పారు. కానీ ఆపరేషన్ జరిగిందనే విషయాన్ని మాత్రం చెప్పలేదు. అభిమానులకు ఇబ్బంది కలిగించొద్దనే ఉద్దేశ్యంతోనే ఈ విషయాన్ని చెప్పలేదట. ఆపరేషన్ కారణంగానే ‘రాధేశ్యామ్’ప్రమోషన్స్‌లో ఆయన పాల్గొనలేకపోయాడట. మూవీ విడుదల తర్వాత ఆయన మీడియా ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాగా, ప్రభాస్ హీరోగా నటించిన రాధేశ్యామ్ చిత్రం ఈ నెల 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో ప్రభాస్ తన కెరీర్లోనే మొదటిసారి జ్యోతిష్కుడిగా నటించారు. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ఈ చిత్రానికి వాయిస్ ఓవర్ అందించారు. ఈ చిత్రంలో విక్రమాదిత్య(ప్రభాస్) గురువు పరమహంస పాత్రలో ఆయన కనిపించబోతున్నారు. గోపికృష్ణ మూవీస్ ప్రైవేట్ లిమిటెడ్, యూవీ క్రియేషన్ సంయుక్తంగా ఈ రొమాంటిక్ లవ్ స్టోరీని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. -
ప్రభాస్‌తో యాక్ట్ చేయనున్న సూపర్ స్టార్
'కెజిఎఫ్' చిత్ర దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న చిత్రం 'సలార్'. కొన్నాళ్ల క్రితం ప్రారంభమైన ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుంది. పాన్ ఇండియా లెవల్లో రానున్న ఈ చిత్రానికి 'కెజిఎఫ్'కు సంగీతం అందించిన రవి బస్రూర్ మ్యూజిక్ డైరెక్టర్. హీరోయిన్గా శ్రుతీ హాసన్ ఆద్య రోల్ పోషిస్తోంది. ప్రముఖ నటుడు జగపతిబాబు రాజమన్నార్‌గా కనిపించనున్నాడు. ఇక తాజా సమాచారం ఏంటంటే.. ప్రముఖ దర్శకుడు, నిర్మాత, మలయాళ సూపర్ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ తమ 'సలార్'లో ఓ ముఖ్యమైన పాత్ర చేస్తున్నారని ప్రభాస్ అధికారికంగా ప్రకటించారు. తన తాజా చిత్రం రాధేశ్యామ్ ప్రమోషన్ ఈవెంట్లో విలేకరులు అడిగిన పలు ప్రశ్నలకు ప్రభాస్ సమాదానం ఇచ్చారు. ఇక దానిలో భాగంగా ఓ విలేకరి 'సలార్' గురించి ప్రశ్నించగా.. సినిమా స్క్రిప్ట్‌తో పాటు తన పాత్ర కూడా పృథ్వీరాజ్‌కు ఎంతో బాగా నచ్చడంతో ఆ పాత్ర చేయడానికి వెంటనే ఒప్పుకున్నారన్నారు, కాగా పృథ్వీరాజ్‌తో స్క్రీన్ షేర్ చేసుకోవడం తనకు ఎంతో ఆనందంగా ఉందన్నాడు. ఇక ఆ పాత్ర చేస్తున్నందుకు గానూ పృథ్వీరాజ్‌కు ప్రభాస్ కృతజ్ణతలు తెలిపాడు. ఇక 'సలార్' చిత్రం తప్పకుండా అన్ని భాషల్లోనూ పెద్ద సక్సెస్ అవుతుందని ప్రభాస్ ఆశాభావం వ్యక్తం చేశాడు. ఇక ఇదిలా ఉండగా ప్రభాస్ నటించిన తాజా పాన్ ఇండియా చిత్రం 'రాధే శ్యామ్' మార్చి 11న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకానున్న విషయం తెలిసిందే. -
ప్రభాస్-అనుష్క పెళ్లి..? క్లారిటీ ఇచ్చిన కృష్ణంరాజు సతీమణి!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పెళ్లిపై ఎప్పుడూ చర్చ నడుస్తూనే ఉంటుంది. ఇటీవల కాలంలో ఆయన పెళ్లిపై ఎన్నో వార్తలు వస్తున్నప్పటికీ వాటీలో క్లారిటీ అనేది ఉండదు. కాగా ప్రభాస్ పెళ్లిపై అభిమానులతో పాటు టాలీవుడ్ జనాలు సైతం ఎదురు చూస్తున్నారు. కానీ ప్రభాస్ మాత్రం పెళ్లి అంటేనే తప్పించుకునే ప్రయత్నం చేస్తాడనే చెప్పాలి. అయితే తాజాగా 'రాధే శ్యామ్' చిత్ర ప్రమోషన్స్‌లో పాల్గొన్న ప్రభాస్‌కు ఇదే ప్రశ్న ఎదురవ్వగా..లవ్ ఫెయిల్యూర్ అంటూ మాట దాటేశాడు. ఇక ఎప్పటి నుంచో మీడియాలో చక్కర్లు కొడుతున్న వార్త ప్రభాస్, అనుష్క పెళ్లి. అయితే తాజాగా ఈ వార్తలను ప్రభాస్ పెద్దమ్మ, రెబల్ స్టార్ కృష్ణంరాజు సతీమణి శ్యామల దేవి స్పందించారు. ఇంతకీ వీరి పెళ్లిపై ఆమె ఏమన్నారంటే.. ప్రభాస్ అనుష్కల పెళ్లి జరగదు. ఎందుకంటే వాళ్లు మంచి ఫ్రెండ్స్, వాళ్ళ మధ్య అలాంటి ఫీలింగ్స్ లేవు.. అంటూ ఈ వార్తలను ఖండించారు. ప్రభాస్‌కి మన సంస్కృతి సంప్రదాయాలన్నా, మహిళలన్నా అమితమైన గౌరవం ఉంది. అలాగే తన కుటుంబానికి, ఇంటి పెద్దలకు గౌరవం ఇస్తాడు. అయితే ప్రభాస్ ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటాడు. ప్రస్తుతం వరుస సినిమాలతో ఆయన బిజీగా ఉన్నాడంటూ శ్యామల దేవి తెలిపారు. ఇక అలాగే ప్రభాస్ చేసుకోబోయే అమ్మాయి ఇండస్ట్రీకి సంబంధించిన వారా అనే ప్రశ్నకు సమాదానంగా ఆ విషయం ఇప్పుడే చెప్పలేను. త్వరలోనే మీకు తెలుస్తుంది. అప్పటి వరకు వెయిట్ చేయ్యాల్సిందే అంటున్నారు శ్యామల దేవి. ఇక ఇదిలా ఉండగా ప్రభాస్ నటించిన తాజా పాన్ ఇండియా చిత్రం 'రాధే శ్యామ్' మార్చి 11న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకానున్న విషయం తెలిసిందే. -
రాధేశ్యామ్ షూటింగ్లో ప్రభాస్‌తో గొడవ, క్లారిటీ ఇచ్చిన పూజా హెగ్డే
ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటించిన చిత్రం రాధేశ్యామ్. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని వంశీ, ప్రమోద్, ప్రసీద నిర్మించారు. భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ పాన్ ఇండియా మూవీ మార్చి11న విడుదలవుతోంది. ఈ సందర్భంగా ప్రభాస్, పూజలు వరస ఇంటర్య్వూలతో బిజీగా ఉన్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమా షూటింగ్ సమయంలోనే ప్రభాస్- పూజ హెగ్డేల మధ్య మనస్పర్థలు వచ్చాయని, వారిద్దరు మధ్య మాటలు లేవని గతంలో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. చదవండి: కండోమ్ టెస్టర్‌గా రకుల్, ఆమె తల్లిదండ్రులు ఏమన్నారంటే.. ఇక ఇటీవల ముంబైలో జరిగిన రాధేశ్యామ్ ప్రమోషన్ ఈవెంట్లో సైతం వీరిద్దరూ మాట్లాడుకున్నట్లు కనిపించలేదు. పక్కనే పక్కనే ఉన్నప్పటికీ మూవీ హీరోహీరోయిన్ మధ్య ఉండే బాండింగ్, కెమిస్ట్రీ మిస్ అయ్యింది. ఈ కార్యక్రమంలో వారిద్దరూ ఎడమెహం, పెడమెహంగా కనిపించడంతో ఈ వార్తలకు మరింత బలం చెకూరింది. అంతే ఇక మూవీ వీరిద్దరి మధ్య ఎవో మనస్పర్థలు వచ్చాయని అంతా ఫిక్స్ అయ్యారు. అందుకే ప్రమోషన్స్‌ల్లో ప్రభాస్- పూజల కలిసి పోజులు ఇవ్వడానికి కూడా ఇబ్బంది పడుతున్నారనే వార్తలు జోరందుకున్నాయి. చదవండి: విదేశాల్లో జగ్గూభాయ్, షాకింగ్ లుక్ షేర్ చేసిన నటుడు ఈ క్రమంలో తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్య్వూలో పూజ ఈ వార్తలపై స్పందించింది. ఈ సందర్భంగా ఆమె వార్దిదరి మధ్య వివాదం అంటూ వస్తున్న వార్తలపై క్లారిటీ ఇచ్చింది. ఈ మేరకు ఆమె ప్రభాస్ గురించి మాట్లాడుతూ.. ‘ప్రభాస్ గొప్ప మనసున్న వ్యక్తి. షూటింగ్ సమయంలో నాకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకున్నారు. ప్రతి రోజు ప్రభాస్ తన ఇంటి నుంచి భోజనం తెప్పించేవారు. అంత మంచి మనిషితో నాకు మాటలు లేకపోవడమేమిటి? అదంతా పుకారే. నేనే కాదు ఎవరైనా సరే ఆయనతో మాట్లాడకుండా ఉండలేరు’ అని చెప్పుకొచ్చింది. -
Radhe Shyam: ఆ 100 మంది నేరుగా ప్రభాస్‌ని కలుసుకోవచ్చు
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న ‘రాధేశ్యామ్’ కోసం రెబల్ స్టార్ ఫ్యాన్స్‌తో పాటు సినీ అభిమానులు ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. కరోనా కారణంగా పలుమార్లు వాయిదా పడిన ఈ మూవీ.. ఎట్టకేలకు మార్చి 11న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. విడుదల తేది దగ్గరపడుతుడడంతో మూవీ ప్రమోషన్స్‌లో స్పీడ్ పెంచారు మేకర్స్. ఇదివరకు మరే సినిమాకు చేయనంతగా కాస్త కొత్తగా, డిఫరెంట్‌గా ప్రమోషన్స్ చేస్తున్నారు. ఇప్పటికే ప్రభాస్ వరుస ఇంటరవ్యూలతో సినిమాని ఫుల్ ప్రమోట్ చేస్తున్నాడు. ఇక ఈ సినిమాకి మరింత హైప్ తేవడం కోసం ప్రభాస్ అభిమానుల కోసం మార్చ్ 8న రాధే శ్యామ్ సినిమాకు సంబంధించిన ఎన్ఎఫ్టీ(NFT) లాంఛింగ్ జరగనుంది. ఈ కలెక్షన్లో ప్రభాస్ డిజిటల్ ఆటోగ్రాఫ్, 3డి యానిమేటెడ్ డిజిటల్ ఆర్ట్‌తో పాటు ఎక్స్‌క్లూజివ్ 3డి యానిమేటెడ్ పిక్చర్స్ కూడా ఉండబోతున్నాయి. సినిమాలో రెబల్ స్టార్ ప్రభాస్ నడిపిన కారుకు సంబంధించిన 3డి యానిమేటెడ్ NFT కూడా ఇందులో ఉండబోతున్నాయి. వాటిని కొనుక్కోడానికి అభిమానులకు మార్చ్ 8 నుంచి అందుబాటులోకి రానున్నాయి. డిజిటల్ కలెక్షన్లో విజేతగా నిలిచిన 100 మంది లక్కీ విన్నర్స్ నేరుగా ప్రభాస్‌ను కలిసే అవకాశం కూడా అందుకోనున్నారు. అంటే ఈ NFTలు ఎవరు ఎక్కువగా కొనుగోలు చేస్తే వాళ్లకు తమకు ఇష్టమైన స్టార్‌ను కలిసే అవకాశం మరింత ఎక్కువగా ఉండబోతుంది. అభిమానులు డబ్బుల రూపంలోనే వీటిని కొనుగోలు చేయొచ్చు. క్రిప్టో కరెన్సీతో దీనికి పని లేదు. ఈ సినిమాలో ప్రభాస్ తన కెరీర్లోనే మొదటిసారి జ్యోతిష్కుడిగా నటించారు. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ఈ చిత్రానికి వాయిస్ ఓవర్ అందించారు. Own a part of #RadheShyamNFTs in just 1 Minute & 100 lucky winners will get a chance to meet our superstar #Prabhas. REGISTER NOW on https://t.co/dQQsVGKsyL 👉🏼 Log In 👉🏼 Set Up Wallet Get Ready for First DROP on 𝟖𝐭𝐡 𝐌𝐚𝐫𝐜𝐡, 𝟓 𝐏𝐌!#RadheShyam @ngageNFT @UV_Creations pic.twitter.com/4b611aB5TG — UV Creations (@UV_Creations) March 7, 2022 -
'రాధేశ్యామ్'కు ముందే ప్రభాస్ అరుదైన రికార్డ్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం రాధేశ్యామ్ ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారు. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా మార్చి 11న ప్రపంచ వ్యాప్తంగా విడుల కానుంది. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. సుమారు రూ. 300కోట్లకు పైగా భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా ప్రమోషన్స్ ఓ రేంజ్లో కొనసాగుతున్నాయయి. ఇదిలా ఉండగా ప్రభాస్ తాజాగా మరో అరుదైన రికార్డును సాధించాడు. ఇప్పటికే ప్రపంచమంతా క్రేజ్ ఉన్న ప్రభాస్ తాజాగా మరో మైల్‌స్టోన్‌కి రీచ్ అయ్యాడు. అతి తక్కువ కాలంలోనే ఆయన ఇన్‌స్టా ఫాలోవర్స్ సంఖ్య 8మిలియన్స్‌కి పైగా చేరుకుంది. అయితే సోషల్ మీడియాకు దూరంగానే ఉండే ప్రభాస్ కేవలం తన సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ని షేర్ చేస్తుంటారు. ఈ క్రమంలో ప్రభాస్ ఫాలోవర్స్ సంఖ్య ఒక్కసారిగా పెరిగిపోయింది. ఇక ప్రభాస్ నటించిన ఆదిపురుష్ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ‘సలార్', ‘ప్రాజెక్ట్-K’ఇప్పుడు షూటింగ్ దశలో ఉన్నాయి. -
ప్రభాస్ గురించి ఆసక్తికర విషయం చెప్పిన శ్యామల దేవి
Krishnam Raju Wife Shyamala Devi About Prabhas: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం రాధేశ్యామ్ మూవీ ప్రమోషన్ కార్యక్రమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. మరికొద్ది రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రాధేశ్యామ్ విడుదల కానున్న నేపథ్యంలో చిత్ర బృందం, హీరోయిన్ పూజ హెగ్డేతో కలిసి ప్రభాస్ వరస ఇంటర్య్వూల్లో పాల్గొంటున్నాడు. ఇదిలా ఉంటే ఈ నేపథ్యంలో ఆయన పెద్దమ్మ, కృష్ణం రాజు సతిమణి శ్యామల దేవి ప్రభాస్ గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు. రీసెంట్గా ఓ యూట్యూబ్ చానల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో ఆమె మాట్లాడుతూ ప్రభాస్‌కు ఇష్టమైన వంటకం ఏంటో బయట పెట్టింది. ఈ మేరకు శ్యామల దేవి ప్రభాస్ పులస చాప కూర అంటే ఇష్టమని, దీనితో ఇష్టంగా భోజనం చేస్తాడని తెలిపింది. చదవండి: శ్రీజ భర్త కల్యాణ్ దేవ్ లెటేస్ట్ పోస్ట్ వైరల్, ఏం అంటున్నాడంటే ‘ప్రభాస్‌కు ఆయన పెద్దనాన్న(కృష్ణం రాజు) అంటే చాలా ఇష్టం. ఎంత బిజీగా ఉన్న పెద్దనాన్నను తరచూ కలుస్తూనే ఉంటారు. కొడుకుని చూడగానే ఆయన కూడా ఫుల్ ఖుషి అవుతారు.ఎక్కడలేని ఎనర్జీ వస్తుంది ఆయనకు. ఎలాంటి పరిస్థితులో అయిన తండ్రికొడుకులు తప్పకుండా కలుసుకుంటారు. సుమారు రెండు, మూడు గంటలు మాట్లాడుకుంటారు. ప్రభాస్ ఆయనను పెద్ద బాజీ అని, నన్ను కన్నమ్మ అని పిలుస్తాడు’ అంటూ చెప్పకొచ్చింది. ప్రభాస్‌కు ఏమైనా లెటర్స్, ఫోన్స్ వస్తాయా అని అడగ్గా.. ‘బాబోయ్ చాలా ఫోన్ కాల్స్ వస్తాయి, అమ్మాయిల నుంచి మరి ఎక్కువ. అంతేకాదు వాళ్ల పేరేంట్స్ కూడా చేస్తుంటారు. కావాలంటే జాబ్ మానేస్తాం, అక్కడి వచ్చేస్తాం అంటారు. కానీ వాళ్లందరి మీ కెరీర్ చూసుకొండని, జీవితం నాశనం చేసుకోవద్దు’ అని నచ్చ చెబుతుంటానని ఆమె అన్నారు. అంతేగాక ప్రభాస్‌కు చాలా మోహమాటమని, అమ్మాయిలతో అసలు మాట్లాడడు అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. అందుకే ఆ ఫోన్ కాల్స్ అన్ని తానే ఎత్తి మాట్లాడతానంటూ ఆమె స్పష్టం చేశారు. చదవండి: ఇంటర్య్వూలో పూజ నోట అభ్యంతరకర పదం, పట్టేసిన నెటిజన్లు ఇక భర్త కృష్ణం రాజు గురించి మాట్లాడుతూ.. రాధేశ్యామ్ షూటింగ్లో కృష్ణం రాజుకు గాయమైందని, అయినా రెస్ట్ తీసుకొకుండా ఆయన షూటింగ్ పూర్తి చేశారని చెప్పింది. అప్పటి నుంచి తాను కుటుంబ సభ్యుల ఆరోగ్యం కోసం సప్త శనివార వ్రతం చేస్తున్నట్లు వెల్లడించింది. ఇక కృష్ణం రాజు శివుడు, భక్త కన్నప్పను ఆరాధిస్తారని... తాను విష్ణువు, పార్వతీదేవిని ఆరాధిస్తానని ఆమె చెప్పుకొచ్చింది. కాగా రాధేశ్యామ్‌లో కృష్ణం రాజు మహాజ్ఞాని అయిన పరమహంస పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని వంశీ, ప్రమోద్, ప్రసీద నిర్మించారు. భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ పాన్ ఇండియా మూవీ మార్చి11న విడుదలవుతోంది. -
ఇంటర్య్వూలో పూజ నోట అభ్యంతరకర పదం, పట్టేసిన నెటిజన్లు
Pooja Hegde Gets Trolled For Huge Tongue Slip: ‘బుట్టబొమ్మ’ పూజ హెగ్డే ప్రస్తుతం రాధేశ్యామ్ ప్రమోషన్ కార్యక్రమాలు, ఇంటర్య్వూలో ఫుల్ బిజీగా ఉంది. ఈ క్రమంలో తాజాగా ఓ ఇంటర్య్వూలో పూజ చేసిన తడబాటుకు ట్రోల్స్‌ను ఎదుర్కొంటోంది. ఇంతకి ఏం జరిగిందంటే.. ఇటీవల జరిగిన రాధేశ్యామ్ ఈ వెంట్లో పాల్గొన్న పూజ మూవీ విశేషాలను పంచుకుంది. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతున్న ఆమె సక్సెస్ అనబోయి సె... అంటూ అనుకొకుండ అభ్యంతరకర పదం పలకబోయింది. అయితే వెంటనే దానిని ఆమె సరిదిద్దుకుంది. కానీ ఇది పట్టేసిన నెటిజన్లు పూజను రకరకాలుగా ట్రోల్ చేస్తున్నారు. చదవండి: ఆర్జీవీపై యాంకర్ శ్యామల ఆసక్తికర వ్యాఖ్యలు చదవండి: ముమైత్ ఎలిమినేట్.. బిందు మాధవిపై షాకింగ్ కామెంట్స్ కాగా ప్రభాస్-పూజ హెగ్డేలు జంటగా నటించిన పాన్ ఇండియా చిత్రం రాధేశ్యామ్ మార్చి 11న గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. పీరియాడికల్ బ్యాక్‌డ్రాప్‌గా తెరకెక్కిన ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేసింది. కాగా ఈ సినిమాలో బాలీవుడ్ అలనాటి హీరోయిన్ భాగ్యశ్రీ ప్రభాస్ తల్లిగా నటిస్తుండగా, జగపతి బాబు, మురళీ శర్మ, సచిన్ ఖేడేకర్, ప్రియదర్శి పులికొండ, కునాల్ రాయ్ కపూర్, రిద్ధి కుమార్, సాషా చెత్రీ, సత్యన్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. గోపికృష్ణ మూవీస్,యువీ క్రియేషన్స్ సుమారు రూ. 300కోట్ల రూపాయలతో ఈ చిత్రాన్ని నిర్మించారు. 😉😜 pic.twitter.com/Q6VOXNxiKh — MilagroMovies (@MoviesMilagro) March 5, 2022 -
ఆ హీరోయిన్ అంటే ఇష్టం: ప్రభాస్
ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటించిన చిత్రం రాధేశ్యామ్. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని వంశీ, ప్రమోద్, ప్రసీద నిర్మించారు. భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ పాన్ ఇండియా మూవీ మార్చి11న విడుదలవుతోంది. ఈ సందర్భంగా ప్రభాస్, పూజా సాక్షి టీవీతో ముచ్చటించారు. ఈ సందర్భంగా వారు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ప్రభాస్ మాట్లాడుతూ.. 'బాహుబలి 1 సినిమాకు విపరీతమైన ప్రమోషన్స్ చేశాం. అప్పటి నుంచి ప్రమోషన్స్ అంటే కొంత జంకు తగ్గింది. ఒకసారైతే దీపికా పదుకొనే నువ్వు ఎక్కువ మాట్లాడవంట కదా? అని అడిగింది. నాకు స్టార్టింగ్ ప్రాబ్లమ్.. కాస్త పరిచయం అయితే ఎక్కువ మాట్లాడతానని చెప్పాను. దీపికా యాటిట్యూడ్ అంటే ఇష్టం, పర్సనల్‌గా కూడా ఆమెంటే చాలా ఇష్టం. నా లైఫ్‌లో బాహుబలి మూవీతో మ్యాజిక్ జరిగింది. ఇప్పుడు ఆదిపురుష్ చేయబోతున్నా, నా జీవితంలో ఎక్కువ భయపడింది ఈ సినిమాకే!' అని చెప్పుకొచ్చాడు. మరి ప్రభాస్, పూజా ఇంకా ఏమేం మాట్లాడారో తెలియాలంటే కింది వీడియో చూసేయండి.. -
ఈ వారం బాక్సాఫీస్‌పై పెద్ద సినిమాల దండయాత్ర!
కరోనా వల్ల సినీప్రేమికుడు మిస్సయిన వినోదాన్ని రెట్టింపు చేసి ఇచ్చేందుకు కొత్త సినిమాలు రెడీ అయ్యాయి. ఈ వారం పెద్ద సినిమాలు థియేటర్లో, మధ్య, చిన్న తరహా చిత్రాలు ఓటీటీలో రిలీజ్ అవుతున్నాయి. ఈ జాబితా చూస్తుంటే ఈ వారం ఎంటర్టైన్మెంట్కు ఢోకా లేనట్లే కనిపిస్తోంది. మరి మీరూ కొత్త సినిమాలు వీక్షించాలనుకుంటే ఈ వారం(మార్చి 7-13 వరకు) ఏయే సినిమాలు రిలీజ్ అవుతున్నాయో ఓ లుక్కేయండి.. ఈటీ తమిళ స్టార్ హీరో సూర్య థియేటర్లో ప్రేక్షకులను పలకరించి చాలాకాలమే అయింది. ఆయన నటించిన 'ఆకాశమే హద్దురా', 'జై భీమ్' చిత్రాలు ఓటీటీలో రిలీజై సూపర్ సక్సెస్ అందుకున్నాయి. ఆ తర్వాత ఆయన ఈటీ సినిమా చేయగా ఇది థియేటర్లలో రిలీజవుతోంది. పాండిరాజ్ తెరకెక్కించిన ఈ పాన్ ఇండియా మూవీలో ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్గా, వినయ్ రామ్, సత్యరాజ్, జయప్రకాశ్ ముఖ్యపాత్రల్లో నటించారు. అమ్మాయికు జరిగే అన్యాయాలపై పోరాటమే ప్రధాన కథగా సాగే ఈ సినిమా మార్చి 10న రిలీజవుతోంది. రాధేశ్యామ్ డార్లింగ్ ప్రభాస్ థియేటర్లలో కనిపించి చాలా ఏళ్లవుతోంది. దీంతో అతడి సినిమా కోసం అభిమానులు కళ్లు కాయేలా ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు కరోనా ఉధృతి కొంత తగ్గడంతో 'రాధేశ్యామ్' రిలీజ్‌కు రెడీ అయింది. ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటించిన రాధేశ్యామ్ మూవీ మార్చి 11న విడుదలవుతోంది. విధితో పోరాటం చేసిన ప్రేమకథే ఈ సినిమా స్టోరీలైన్. రాధాకృష్ణకుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై వంశీ, ప్రమోద్, ప్రసీద నిర్మిస్తున్నారు. ఓటీటీలో విడుదలవుతున్న చిత్రాల జాబితా.. హాట్‌స్టార్ ► ఖిలాడి - మార్చి 11 ► మారన్ - మార్చి 11 ఆహా ► ఖుబూల్ హై - మార్చి 11 సోనీలివ్ ► క్లాప్ - మార్చి 11 జీ5 ► రౌడీ బాయ్స్ - మార్చి 11 ► మిసెస్ అండ్ మిస్టర్ షమీమ్ (వెబ్ సిరీస్) - మార్చి 11 ► రైడర్ - మార్చి 11 నెట్‌ఫ్లిక్స్ ► అవుట్ ల్యాండర్ (ఆరో సీజన్) - మార్చి 7 ► ద లాస్ట్ కింగ్డమ్ (ఐదో సీజన్) - మార్చి 9 ► ద అండీ వార్హోల్ డైరీస్ (వెబ్ సిరీస్) - మార్చి 9 ► ఎ ఆడమ్ ప్రాజెక్ట్ - మార్చి 11 అమెజాన్ ప్రైమ్ ► అప్లోడ్ (రెండో సీజన్) - మార్చి 11 ఎంఎక్స్ ప్లేయర్ ► అనామిక - మార్చి 10 -
ప్యాన్ ఇండియా లవ్ స్టోరీ
-
ప్రభాస్ చేసిన పనికి మా అమ్మ కూడా సంతోషించింది
‘‘రాధే శ్యామ్’ రెగ్యులర్ ప్రేమ కథ కాదు. చాలా సీరియస్, మెచ్యూర్డ్ లవ్ స్టోరీ. ఈ పాత్ర ద్వారా దేవుడు నాకు ఓ చాలెంజ్ ఇచ్చారు.. దానికి న్యాయం చేశాననుకుంటున్నా. నేనెక్కువగా ప్రేమ కథల్లో నటించాను. కానీ ప్రస్తుతం నిజ జీవితంలో ప్రేమలో పడేంత సమయం లేదు.. నాలుగైదు సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాను’’ అని హీరోయిన్ పూజా హెగ్డే అన్నారు. ప్రభాస్, పూజా హెగ్డే జంటగా రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రాధే శ్యామ్’. వంశీ, ప్రమోద్, ప్రసీద నిర్మించిన ఈ సినిమా ఈ నెల 11న విడుదలవుతోంది. ఈ సందర్భంగా పూజా హెగ్డే హైదరాబాద్‌లో విలేకరులతో పంచుకున్న విశేషాలు... ► ‘రాధే శ్యామ్’లో డాక్టర్ ప్రేరణ పాత్ర చేశాను. ఈ పాత్రలో చాలా షేడ్స్ ఉన్నాయి.. చాలా డెప్త్ ఉంది. నా కెరీర్లో చాలా సవాల్‌తో కూడుకున్న పాత్ర ఇది.. నాలుగేళ్ల నుంచి ఆ పాత్రతో కనెక్ట్ అయి ఉన్నాను. వ్యక్తిగా నన్ను ఈ మూవీ మరింత స్ట్రాంగ్ చేసింది. కెరీర్లో ఫస్ట్ టైమ్ నా పాత్ర కోసం ఎక్కువ రీసెర్చ్ చేశాను.. ఎన్నో బుక్స్ చదివాను. ప్రేరణ పాత్రకి నా బెస్ట్ ఇచ్చాను.. అదే ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తుందని నమ్ముతున్నాను. ► భారతీయ సంస్కృతి చాలా గొప్పది. జ్యోతిష్యంలో ఏదో ఓ పవర్ ఉంది. నిజ జీవితంలో నేను జ్యోతిష్యాన్ని నమ్ముతాను. అది కూడా ఒక సైన్స్. చాలామంది జ్యోతిష్యులను కలిశాను. వాళ్లు నా కెరీర్ గురించి చాలా కచ్చితమైన ప్రిడిక్షన్స్ ఇచ్చారు. నిజానికి టెలిస్కోప్ తయారు చేయడానికి ఎన్నో ఏళ్ల ముందే మనవాళ్లు గొప్ప ఆస్ట్రాలజీ బుక్స్ కూడా రాశారు. ► చిన్నప్పుడు నాకు మొహమాటం ఎక్కువ. స్టేజ్‌పై డాన్స్ చేయాలంటే చాలా భయపడేదాన్ని. డాన్స్ చేయమని మా అమ్మ నన్ను వేదికపైకి నెట్టేసేది. హృతిక్ రోషన్, అల్లు అర్జున్ వంటి స్టార్స్‌తో చేసేటప్పుడు డాన్స్ బాగా నేర్చుకున్నాను.. ఎలాంటి బెరుకు లేకుండా ఎంతో ఎనర్జీతో చేసేదాన్ని. ∙‘ముకుంద’ మూవీ తర్వాత నేను గ్లామర్ పాత్రలకు సరిపోను అన్నారు. ఆ తర్వాత ‘డీజే’(దువ్వాడ జగన్నాథమ్) చేశాక నేను గ్లామర్ రోల్స్ మాత్రమే చేస్తానని ఫిక్స్ అయ్యారు. ప్రస్తుతం ‘ఆచార్య’ సినిమాలో నేను సంప్రదాయమైన పాత్ర చేశాను. (మరిన్ని ఫొటోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి) ► ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’లో స్టాండ్ అప్ కమెడియన్‌గా నటించాను. ‘గద్దలకొండ గణేష్’లో ‘ఎల్లువొచ్చి గోదారమ్మ..’ పాటకు మంచి పేరొచ్చింది. శ్రీదేవిగారు చేసిన ఆ పాటలో ప్రేక్షకులు నన్ను కూడా ఆదరించడం హ్యాపీ. ఆడియన్స్ నన్ను వైవిధ్యమైన పాత్రల్లో చూడాలనుకుంటున్నారు.. అది నాకు చాలెంజింగ్‌గా అనిపిస్తుంది. ∙ఏ సినిమాకైనా మనసుపెట్టి వందశాతం కష్టపడతాను. వాటిల్లో కొన్ని హిట్ అవుతాయి.. మరికొన్ని సరిగ్గా ఆడవు. దేవుడు ప్రతిదీ చూస్తుంటాడు.. అందుకే ప్రతి సినిమాకూ ఓన్ డెస్టినీ ఉంటుందని నమ్ముతాను. నా పాత్రపై మాత్రమే ఫోకస్ పెడతాను. ► జార్జియా, ఇటలీలో షూటింగ్ చే శాం. ఫస్ట్ కరోనా సమయంలో నేను చాలా భయపడ్డాను. ఇటలీలో మూడు రోజులు షూటింగ్ చేయగానే లాక్డౌన్ అనౌన్స్ చేశారు.. వెంటనే మేము అక్కడి నుంచి వచ్చేశాం. ► ‘రాధే శ్యామ్’ చిత్రం తెలుగు, హిందీ భాషల్లో ఒకేసారి చిత్రీకరించడం సవాలుగా అనిపించింది. ఇందులో భావోద్వేగాలున్న సన్నివేశాలు చేసేటప్పుడు చాలా లోతుగా వెళ్లి నటించాను. ప్రేరణ పాత్రలోని బాధను ఫీలవుతూ గ్లిజరిన్ లేకుండా ఏడ్చిన సన్నివేశాలున్నాయి. రాధాకృష్ణసర్ కట్ చెప్పగానే అందరూ ‘వెరీ గుడ్’ అంటూ క్లాప్స్ కొట్టారు. ఆ సీన్ కంప్లీట్ కాగానే సేమ్ సీన్ మరో భాషలో చేద్దాం అనేవారు. ఒకే టైమ్‌లో రెండు డిఫరెంట్ మూవీస్ చేసిన ఫీల్ కలిగింది. ∙ తెలుగు, హిందీ వెర్షన్స్‌లో మేటర్ సేమ్ ఉంటుంది కానీ మేజిక్ డిఫరెంట్. ఈ మేజిక్‌ని బాగా ఎంజాయ్ చేశాను.. ఇలాంటి పాత్ర ఇచ్చినందుకు దేవుడికి థ్యాంక్స్. ► ‘రాధే శ్యామ్’ సంగీతం అనుభవాన్ని ప్రేక్షకులు థియేటర్స్‌లో ఫీల్ అయి ‘వావ్’ అంటారు. ‘మీలో ఇంత మంచి క్వాలిటీస్ ఉన్నాయి.. అయినా పెళ్లెందుకు కాలేదు?’ అని ‘రాధే శ్యామ్’ లో ప్రభాస్‌గారిని అడిగాను. అది ఓ రకంగా ప్రేక్షకుల వాయిస్.. నాది కాదు. దానికి ఆన్సర్ ఏంటి? అన్నది తెలియాలంటే ‘రాధే శ్యామ్’ చూడాలి. ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ లో నా పాత్ర కోసం కొంచెం రీసెర్చ్ చేశాను. నా పాత్రలకు చిన్న చిన్న ఫన్ జోడించడం నాకు ఇష్టం. ‘అరవింద సమేత వీర రాఘవ’లో నేను హెడ్‌ఫోన్స్‌తో కనిపించాను.. ఎందుకంటే ఆ పాత్ర సంగీతాన్ని ఇష్టపడుతుంది. ► ఇండస్ట్రీలో మొదటి స్థానం, రెండో స్థానం.. ఇలా నంబరింగ్ గేమ్‌ని నేను నమ్మను. తెలుగులో నాకు చాలా లాంగ్ కెరీర్ ఉండాలనుకుంటున్నాను. యాక్టర్స్, నా డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ నన్ను రిపీట్ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది.. అదే నాకు అతిపెద్ద ప్రశంస. మహేశ్‌బాబు, అల్లు అర్జున్‌తో రెండేసి సినిమాలు చేశాను. ‘దిల్’ రాజుగారి ప్రొడక్షన్లో రెండు సినిమాలు చేశాను. త్రివిక్రమ్‌గారితో మూడో సినిమా చేస్తున్నా. హరీష్ శంకర్‌తో రెండు సినిమాలు చేశా. నేను హార్డ్ వర్కర్ని.. అందుకే నిర్మాతలు నాకు గౌరవం ఇస్తున్నారు. ► ప్రభాస్‌గారితో పాటు ఇప్పటివరకూ నేను నటించిన అందరు హీరోలతోనూ నా కెమిస్ట్రీ బాగుండటం హ్యాపీ. ఒక్కో హీరో ఒకోలా ఉంటారు. ప్రభాస్‌గారికి మీడియా ముందు సిగ్గెక్కువ. కానీ సెట్లో చాలా సరదాగా, ఎనర్జీగా ఉంటారు. ఆయన మాకు ఫుడ్ కూడా పంపించేవారు. ఇటలీకి వెళ్లినప్పుడు నా టీమ్‌లో ముగ్గురు కోవిడ్ బారిన పడ్డారు. అప్పుడు ప్రభాస్‌గారు చాలా మంచి వెజిటేరియన్ ఫుడ్‌ని పంపించేవారు. మా అమ్మ కూడా సంతోషపడ్డారు. తారక్(ఎన్టీఆర్) సెట్లో ఫుల్ ఎనర్జీతో ఉంటాడు.. ఒక్క టేక్‌లో చేసేస్తాడు. అల్లు అర్జున్ కూడా ఫుల్ ఎనర్జీగా ఉంటాడు. ► మన (మహిళలు) పవర్ మన చేతుల్లోనే ఉంది. నా పాత్ర మహిళలకు స్ఫూర్తిగా ఉండాలనుకుంటా. సావిత్రి, హేమ మాలినీ, శ్రీదేవిగార్లు ఉమెన్ ఓరియంటెడ్ సినిమాలు చేసి బాగా డబ్బులొచ్చేలా చేశారు. ‘అరవింద సమేత వీరరాఘవ’ లో నా పాత్ర పవర్‌ఫుల్‌గా ఉంటుంది. నా పాత్రల ద్వారా కొందరు మహిళలైనా స్ఫూర్తి పొందితే సంతోషంగా ఉంటుంది. ► పాన్ ఇండియా హీరోయిన్ అనిపించుకోవాలని నా మైండ్‌లో లేదు. అన్ని భాషల్లో నటించాలని ఉంటుంది. ప్రస్తుతం తెలుగు నేర్చుకుంటున్నాను. ‘మొహెంజొదారో’ తర్వాత హిందీలో ఆఫర్స్ వచ్చాయి. అయితే నాకు తెలుగు సినిమాలంటే చాలా ఎక్కువ ఇష్టం. అందుకే టాలీవుడ్‌కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నా. ఎందుకంటే తెలుగు ఇండస్ట్రీనే నా కెరీర్‌ను తీర్చిదిద్దింది. నా సినిమాలు ఇప్పుడు పాన్ ఇండియన్ అయ్యాయి. తెలుగు, తమిళ్, హిందీ.. ఇలా ఆయా ఇండస్ట్రీల్లో పనిచేయడం వల్లే ప్రేక్షకులు నన్ను బాగా ఆదరిస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో నేనే డబ్బింగ్ చెబుతున్నాను. -
జ్యోతిష్యాన్ని నమ్మను కానీ.. బాహుబలి విజయం తర్వాత
Radhe Shyam Star Prabhas Said He Does Not Believing In palmistry: ప్రభాస్ లెటెస్ట్ మూవీ ‘రాధేశ్యామ్’ కోసం డార్లింగ్ ఫ్యాన్స్ ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాలో ప్రేరణ (పూజా హెగ్డే)తో ప్రేమలో పడి, ఆమెను రక్షించడానికి విధితో పోరాడే ప్రముఖ జ్యోతిష్య శాస్త్ర నిపుణుడు విక్రమాదిత్యగా ప్రభాస్ అలరించనున్న సంగతి తెలిసిందే. మార్చి 11న ప్రపంచ వ్యాప్తంగా రాధేశ్యామ్ సినిమా రిలీజ్ కానుంది. దీంతో ప్రమోషన్స్ స్పీడ్ పెంచింది చిత్ర యూనిట్. ప్రస్తుతం ముంబైలో ఉన్న ప్రభాస్ అక్కడ పలు ఛానెల్స్‌కు వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. ఈ క్రమంలోనే ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు డార్లింగ్ ప్రభాస్. అయితే ఈ సినిమాలో ఉన్న క్యారెక్టర్‌కు బయటకు చాలా విభిన్నంగా ఉంటానని ప్రభాస్ చెప్పుకొచ్చాడు. తాను జ్యోతిష్యాన్ని పెద్దగా నమ్మనని తెలిపాడు. 'నేను ఇవన్నీ నమ్మను. కానీ నేను నా స్నేహితుల నుంచి దీనికి సంబంధించిన స్టోరీలు విన్నాను. మన నాలెడ్జ్‌కు మించింది ఏదో ఉంటుందని మాత్రం నమ్ముతాను. కానీ నా చేతులు ఎవరికీ చూపించలేదు. అయితే బాహుబలి అద్భుతమైన విజయం తర్వాత నేను విధిని (డెస్టినీ), విశ్వాసాన్ని నమ్మడం ప్రారంభించాను. ఈ సినిమా తర్వాత నుంచి నేను హార్డ్ వర్కును మాత్రమే నమ్ముతున్నాను.' అని తెలిపాడు డార్లింగ్ ప్రభాస్. -
'రాధేశ్యామ్' మూవీ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది..
టాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ సినిమా 'రాధేశ్యామ్' కోసం ప్రభాస్ ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నారు. రాధాకృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ప్రభాస్‌కు జోడీగా పూజా హెగ్డే నటిస్తుంది. పీరియాడికల్ బ్యాక్‌డ్రాప్‌గా తెరకెక్కిన ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేసింది. తాజాగా సెన్సార్ కార్యాక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈనెల 11న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా ఓవర్సీస్ సెన్సార్ బోర్డ్ మెంబర్ (అని చెప్పుకునే) సినీ విశ్లేషకుడు ఉమైర్ సంధు రాధేశ్యామ్ సినిమా ఎలా ఉందో చెప్పుకొచ్చాడు.'రాధేశ్యామ్ సినిమా చూశాను. విజువల్ ఎఫెక్ట్స్ అద్భుతంగా ఉన్నాయి. ప్రభాస్- పూజాల కెమిస్ట్రీ ఎలక్ట్రిఫైయింగ్గా అనిపించింది. క్లైమాక్స్ ఎవరూ ఊహించని విధంగా ఉంది. ఇది ఒక యూనిక్ సబ్జెక్ట్. ఒక్క మాటలో చెప్పాలంటే రాధేశ్యామ్.. క్లాసిక్, స్టైలిష్, థ్రిల్లింగ్, మిస్టరీ అండ్ రొమాంటిక్. రాధేశ్యామ్ ఒక ఎపిక్. ప్రభాస్ అదరగొట్టేశాడు. అతని డ్రెస్సింగ్, యాక్టింగ్ అద్భుతం. భారతదేశంలో ప్రభాస్ క్లాస్, స్టైల్‌ను బీట్ చేసేవాళ్లే లేరు' అంటూ యంగ్ రెబల్ స్టార్‌ను ఆకాశానికెత్తాడు. ఉమైర్ సంధు చేసిన ట్వీట్‌తో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయని చెప్పొచ్చు. దీన్ని బట్టి చూస్తే రాధేశ్యామ్ రికార్డులు క్రియేట్ చేయడం ఖాయమంటున్నారు నెటిజన్లు. ఇప్పటికే ఈ సినిమాకు అడ్వాన్స్ బుకింగ్స్ ఊహించని స్థాయిలో జరుగుతున్నాయని సమాచారం. కాగా ఈ సినిమాలో బాలీవుడ్ అలనాటి హీరోయిన్ భాగ్యశ్రీ ప్రభాస్ తల్లిగా నటిస్తుండగా, జగపతి బాబు, మురళీ శర్మ, సచిన్ ఖేడేకర్, ప్రియదర్శి పులికొండ, కునాల్ రాయ్ కపూర్, రిద్ధి కుమార్, సాషా చెత్రీ, సత్యన్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. గోపికృష్ణ మూవీస్,యువీ క్రియేషన్స్ సుమారు రూ. 300కోట్ల రూపాయలతో ఈ చిత్రాన్ని నిర్మించారు. Nobody can beat Class & Style of #Prabhas in India ! He has Sexiest Swag in #RadheShyam ! Totally LOVED & LOVED his performance & wardrobes ❤❤❤ — Umair Sandhu (@UmairSandu) March 4, 2022 Done with Overseas Censor Screening of #RadheShyam ❤ — Umair Sandhu (@UmairSandu) March 4, 2022 Done First Half of #RadheShyam ! Outstanding VFX used in the movie. #Prabhas𓃵 & #PoojaHegde chemistry is Electrifying 🔥 ! Mystery continues in #RadheShyam. What a unique subject ❤ — Umair Sandhu (@UmairSandu) March 4, 2022 #RadheShyam is truly Cinematic Experience! Climax is the USP of film 🍿❤️🔥 — Umair Sandhu (@UmairSandu) March 5, 2022 -
'రాధేశ్యామ్'పై క్రేజీ అప్డేట్ ఇచ్చిన తమన్
ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటించిన చిత్రం రాధేశ్యామ్. మోస్ట్ అవైటెడ్‌గా నిలిచిన ఈ సినిమా ఈనెల11న రిలీజ్ కానుంది. రాధాకృష్ణ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. రీసెంట్గా విడుదలైన మేకింగ్ వీడియోలో మ్యూజిక్ ఎంతలా ఆకట్టుకుందో తెలిసిందే. తాజాగా ఈ సినిమాకి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ఇచ్చిన థమన్ ఈ సినిమాకి సంబంధించి క్రేజీ అప్డేట్ ఇచ్చాడు. చదవండి: పూజా హెగ్డేతో విబేధాలపై తొలిసారి స్పందించిన ప్రభాస్ మా నుంచి ఒక క్రేజియెస్ట్ స్కోర్‌ను మీరంతా వినబోతున్నారు. మున్ముందు మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ రానున్నాయి అంటూ ట్వీట్ చేశాడు. మరి ఆ అప్డేట్ ఏంటో తెలియాలంటే కాస్త సమయం ఆగాల్సిందే. చదవండి: ఆ ముగ్గురు హీరోలతో నటించాలనుంది : పూజా హెగ్డే Hope u loved our #TheSagaOfRadheShyam Ur goona Witness A Craziest Score Ever from Us 💥🦋 it’s all tat #Butterflies running in my Stomach a longgggg wait 🎧🎛🎛 More updates coming from us let’s make this big guys #RadheShyamOnMarch11th 🦋🦋🦋🦋🦋 pic.twitter.com/qXXOPWkZb4 — thaman S (@MusicThaman) March 6, 2022 -
ఆ ముగ్గురు హీరోలతో నటించాలనుంది : పూజా హెగ్డే
పూజా హెగ్డే ఇప్పుడు సౌత్ ఇండియన్ సినిమాల్లో గోల్డెన్ లెగ్గా పేరు తెచ్చుకుంది. పూజ ఉంటే చాలు హిట్టు గ్యారెంటీ అన్నంతగా సెంటిమెంట్ వర్కవుట్ అవుతుండటంతో ఆమె అడిగినంత పారితోషికం ఇచ్చేందుకు నిర్మాతలు వెనకాడటం లేదు. భారీ బడ్జెట్ సినిమాల్లో వరుస ఆఫర్లతో బిజీగా మారిన పూజా నటించిన రాధేశ్యామ్ ఈనెల 11న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ప్రమోషన్స్‌లో పాల్గొన్న పూజా.. ఓ ఇంటర్వ్యూలో.. ఏ హీరోలతో నటించాలనుకుంటున్నారు అని అడగ్గా.. కమల్‌హాసన్, రణ్‌బీర్ కపూర్, ధనుష్‌లతో నటించాలనుకుంటున్నట్లు చెప్పింది. ఇప్పటికే కోలీవుడ్‌లో బీస్ట్ మూవీతో ఎంట్రీ ఇస్తుంది. త్వరలోనే ఈ సినిమా కూడా విడుదల కానుంది. ఈ పొడుగు కాళ్ల సుందరి లక్ చూస్తుంటే త్వరలోనే ఆమె కోరిక తీరేలా కనిపిస్తుంది. చదవండి: పూజా హెగ్డేతో విబేధాలపై తొలిసారి స్పందించిన ప్రభాస్ -
పూజా హెగ్డేతో విబేధాలపై తొలిసారి స్పందించిన ప్రభాస్
ప్రభాస్, పూజా హెగ్డే కలిసి నటించిన చిత్రం 'రాధేశ్యామ్' విడుదలకు సిద్ధం అవుతుంది. గత కొంతకాలంగా వీరిద్దరి మధ్య విభేదాలు ఉన్నాయంటూ వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు చేస్తున్న సంగతి తెలిసిందే. దీనికి తోడు ప్రమోషన్స్‌లోనూ ఈ గ్యాప్ స్పష్టంగా కనిపించింది. ఎడమొహం, పెడమొహం అన్నట్లు పక్కపక్కనే ఉన్నా మాట్లాడుకోకపోవడంతో ఈ రూమర్స్‌కి మరింత బలం చేకూరింది. అయితే తాజాగా ప్రభాస్ ఈ రూమర్స్‌పై క్లారిటీ ఇచ్చారు. తమిళనాడులో నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఉత్సాహంగా పాల్గొని మీడియా అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. ఈ చిత్రంలో హీరోయిన్ పాత్ర కీలకమని, అందుకే ప్రేరణ పాత్ర కోసం ఎంతగానో ఆలోచించి పూజాన తీసుకున్నట్లు తెలిపారు. ఇక ఈ సినిమాలో ఆమెతో కెమిస్ట్రీ బాగా సెటయ్యిందని చెప్పారు. అంతకుముందు పూజా హెగ్డే ప్రభాస్ గురించి మాట్లాడుతూ.. ఆయనకు సిగ్గు ఎక్కువని, అందుకే ఆయనతో కలవడానికి టైం పడుతుందని కానీ ఒకసారి కలిసిపోతే మాత్రం ఆయనంత స్వీట్ పర్సన్ మరొకరు లేదని తెలిపింది. దీన్ని బట్టి ఇద్దరి మధ్యా విభేదాలు అంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని స్పష్టమవుతుంది. -
ఎడమొహం పెడమొహంగా ప్రభాస్-పూజా ??
-
రాధేశ్యామ్ భామ రిద్ధి కుమార్ ఫొటోలు
-
ఇబ్బందిగా ఫీల్ అయ్యా.. కానీ చేయక తప్పలేదు : ప్రభాస్
Prabhas Radhe Shyam Movie: ప్రభాస్ లెటెస్ట్ మూవీ ‘రాధేశ్యామ్’ కోసం డార్లింగ్ ఫ్యాన్స్ ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. వాస్తవానికి ఈ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సింది. కానీ కరోనా కారణంగా పలుమార్లు వాయిదా పడుతూ వచ్చింది. అయితే తాజాగా పరిస్థితులన్నీ అనుకూలించడంతో ఎట్టకేలకు ఈ సినిమా విడుదలకు సిద్ధమైంది. మార్చి 11న ప్రపంచ వ్యాప్తంగా రాధేశ్యామ్ సినిమా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ స్పీడ్ పెంచింది చిత్ర యూనిట్. ప్రస్తుతం ముంబైలో ఉన్న ప్రభాస్.. అక్కడ పలు చానెల్స్‌కు వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ‘రాధేశ్యామ్’పై గురించి ఆస్తక్తికర విషయాలను పంచుకుంటున్నారు. తాజాగా ఓ జాతీయ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పూజా హెగ్డేతో రొమాన్స్ సీన్స్‌పై స్పందించారు. తనకు ముందు నుంచి ముద్దు సీన్స్ అంటే చాలా సిగ్గు అని.. కానీ రాధేశ్యామ్ కథ డిమాండ్ మేరకు చేయక తప్పలేదన్నారు. ‘గతంలో యాక్షన్ సినిమాలతో పాటు మాస్ ఎక్కువగా చేయడంతో ముద్దు సీన్ల నుంచి తప్పించుకునే అవకాశాలు ఎక్కువగా వచ్చాయి. కానీ రాధే శ్యామ్ అనేది పూర్తిగా ప్రేమకథ. కమర్షియల్ సినిమాల్లో అలాంటి సీన్స్ ను అవైడ్ చేయొచ్చు కానీ 'రాధేశ్యామ్' లాంటి ప్రాజెక్ట్స్ లో పక్కన పెట్టలేం. కోస్టార్స్ పూజా హెగ్డేతో తో ఆన్ స్క్రీన్ రొమాన్స్ చేయడానికి ఇబ్బంది పడ్డాను. సన్నివేశాలు చేయాలన్నప్పుడు సెట్ లో ఎవరు లేకుండా ఒక ప్రైవేట్ స్పేస్ లో చేస్తానని చెప్పాను. అందుకు దర్శకుడు ఓకే చెప్పగానే ఓ రహస్య ప్రదేశంలో ముద్దు సీన్స్ కానిచ్చేశాను.అంతేకాదు షర్ట్ లేకుండా కొంతమంది ముందు యాక్ట్ చేయడం కూడా నా వల్ల కాలేదు’అని ప్రభాస్ చెప్పుకొచ్చాడు. గోపికృష్ణ మూవీస్ ప్రైవేట్ లిమిటెడ్, యూవీ క్రియేషన్ సంయుక్తంగా ఈ రొమాంటిక్ లవ్ స్టోరీని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. రెబల్ స్టార్ డాక్టర్ యువి కృష్ణంరాజు ఈ సినిమాను సమర్పిస్తుండగా.. వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు. రాధా కృష్ణ కుమార్ రాధే శ్యామ్ సినిమాను తెరకెక్కిస్తున్నారు. పూజా హెగ్డే ఇందులో రెబల్ స్టార్ ప్రభాస్ కి జోడీగా నటిస్తున్నారు. జస్టిన్ ప్రభాకరన్ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
‘రాధేశ్యామ్’ కోసం ప్రభాస్ టీమ్ పడిన కష్టం చూశారా.. మేకింగ్ వీడియో
Radhe Shyam Making Video: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ లెటెస్ట్ మూవీ ‘రాధేశ్యామ్’కోసం ఆయన డైహార్ట్ ఫ్యాన్స్ కళ్లలో వత్తులేసుకొని ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు.. అప్పుడు అంటూ పలుమార్లు విడుదలను వాయిదా వేసినా చిత్రబృందం.. ఎట్టకేలకు మార్చి 11న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సిద్దమయ్యారు. విడుదలకు తేది దగ్గరపడుతుండటంతో.. ప్రమోషన్స్ స్పీడ్‌ని కూడా పెంచేశారు. ఇందులో భాగంలో తాజాగా రిలీజ్ ట్రైలర్‌ని విడుదల చేశారు. అలాగే దర్శకుడు రాధాకృష్ణతో పాటు పలువురు నటులు వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తున్నారు.ఇలా ప్రతి రోజు ఏదోఒక రకంగా ‘రాధేశ్యామ్’ని ప్రమోట్ చేస్తుంది చిత్రబృందం. ఇదిలా ఉంటే... తాజాగా రాధేశ్యామ్ మేకింగ్ వీడియోని జనాల్లోకి వదిలారు. రాధేశ్యామ్’ సాగా పేరుతో ఈ మేకింగ్ వీడియోని రిలీజ్ చేశారు. ఈ వీడియో చూస్తుంటే.. ‘రాధేశ్యామ్’ కోసం మేకర్స్ ఎంత కష్టపడ్డారో అర్థమవుతుంది. సినిమాని ఎంత బాగా చిత్రీకరించారో వీడియో చూస్తే తెలిసిపోతుంది. యూరప్‌లోని అందమైన లొకేషన్స్, మంచు ప్రాంతాలతో చాలా కష్టపడి సినిమా షూటింగ్ జరిపారు. అలాగే 1970 కాలం నాటి ఇటలీని కళ్లకు కట్టినట్లుగా చూపించారు. కరోనా కారణంగా యూరప్‌లో షూటింగ్ ఆగిపోవడంతో.. ఇండియాలో యూరప్ సెట్ వేసి మరీ షూటింగ్ చేశారు. ఇటాలీ సెట్, సినిమాకి మ్యూజిక్ అందివ్వడం.. ఇలా అన్ని వీడియోలో చూపించారు. ఈ మేకింగ్ వీడియో సినిమాపై భారీ అంచనాలను పెంచేఏసింది. ఈ సినిమా కచ్చితంగా ప్రేక్షకులను మరో కొత్త లోకానికి తీసుకెళ్తుందని చిత్రబృందం గట్టిగా చెబుతోంది. ఈ మేకింగ్ వీడియో చూస్తుంటే అది నిజమే అనిపిస్తోంది. -
Riddhi Kumar: రాధేశ్యామ్ కోసం విలువిద్య నేర్చుకున్నా
‘రాధేశ్యామ్’ సినిమాలో స్పోర్ట్స్ ఉమన్ క్యారెక్టర్ చేశాను. ఈ పాత్ర చేయడం చాలా కష్టం. ఈ పాత్ర కోసం ప్రత్యేకంగా ఆర్చరీ (విలు విద్య) నేర్చుకున్నాను’’ అని నటి రిద్దీ కుమార్ అన్నారు. ప్రభాస్, పూజా హెగ్డే జంటగా రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రాధేశ్యామ్’. వంశీ, ప్రమోద్, ప్రసీద నిర్మించిన ఈ సినిమా ఈ నెల 11న విడుదలవుతోంది. ఈ చిత్రంలో నటించిన రిద్దీ కుమార్ విలేకరులతో మాట్లాడుతూ– ‘‘మాది పుణే. మా నాన్న ఆర్మీ ఆఫీసర్. నేను పుణేలోనే ఫిలాసఫీలో డిగ్రీ చేశాను. సినిమాల్లో నటించాలనుకున్నప్పుడు ముందు మోడలింగ్‌లో అవకాశం వచ్చింది. ఆ తర్వాత సినిమాల్లో చాన్స్ వచ్చింది. తెలుగులో ‘లవర్స్, అనగనగా ఓ ప్రేమకథ’ చిత్రంలో నటించాను. ఇంత తక్కువ సమయంలోనే ప్రభాస్ వంటి బిగ్ స్టార్‌తో సినిమా చేసే అవకాశం రావడం నా అదృష్టం. ఈ సినిమాలో నటనకు అవకాశం ఉన్న పాత్ర చేశాను. ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో అని ఆత్రుతగా ఎదురు చూస్తున్నాను. నేను నటిస్తున్న వెబ్ సిరీస్ మేలో రిలీజ్ అవుతోంది. నటి రేవతి మేడమ్ దర్శకత్వంలో కాజోల్ లీడ్ రోల్ చేస్తున్న సినిమాలో నటిస్తున్నాను. మరికొన్ని సినిమాలు, వెబ్ సిరీస్‌లు కూడా చేస్తున్నాను. నాకు డిటెక్టివ్, ఫన్ క్యారెక్టర్స్ చేయాలని ఉంది. తెలుగులో ఎన్టీఆర్, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ.. ఇలా అందరి హీరోలతో నటించాలని ఉంది’’ అన్నారు. (మరిన్ని ఫొటోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
రాధే శ్యామ్ లో ప్రభాస్ తల్లి.. ప్రేమ పావురాలు భాగ్యశ్రీ ఇంటర్వ్యూ
-
ప్రభాస్ అలా మాట్లాడతాడని ఊహించలేదు : నటి
ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటించిన సినిమా 'రాధేశ్యామ్'. పీరియాడికల్ లవ్‌స్టోరీగా తెరకెక్కిన ఈ చిత్రం ఈనెల 11న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్‌లో పాల్గొన్న సీనియర్ నటి భాగ్యశ్రీ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. చాలా కాలం తర్వాత తెలుగు సినిమా చేయడం ఆనందంగా ఉందన్నారు. 'రాధేశ్యామ్‌లో ప్రభాస్‌కు తల్లిగా నటించడం సంతోషంగా అనిపించింది. ఆయన చాలా గొప్ప నటుడు. పాన్ ఇండియాలో ప్రభాస్‌కు ఎంతో క్రేజ్ ఉంది. వీటన్నింటిని పక్కన పెట్టి అందరితో ఎంతో సరదాగా ఉంటాడు. ఈ సినిమా సెట్లోనే ప్రభాస్‌ని చూశాను. ఎలా పలకరించాలా అని అనుకుంటుండగా అతనే నా దగ్గరికి వచ్చాడు. నా అభిమాని అంటూ ప్రభాస్ చెప్పడంతో షాక్ అయ్యాను. ఆయన అంత సింపుల్‌గా ఉంటారనీ, అంత చనువుగా మాట్లాడతారని ఊహించలేదు' అని చెప్పుకొచ్చారు. -
అసలేం జరిగింది, ఇద్దరి మధ్య కోల్డ్ వార్ ఇంకా కొనసాగుతుందా?
Cold War Between Prabhas and Pooja Hegde: మూవీ ప్రమోషన్ కార్యక్రమం అంటే ఆ హీరోహీరోయిన్ మధ్య మంచి సాన్నిహిత్యం ఉంటుంది. ఒకరిపై ఒకరు సరదాగా జోక్స్ వేసుకుంటూ చిత్ర విశేషాలను పంచుకుంటారు. అంతేకాదు ఒకరిపై ఒకరు కంప్లైట్స్ ఇచ్చుకోవడం, సిల్లిగా గొడవ పడటం చేస్తుంటారు. రీల్‌లైఫ్ కపుల్‌గా కనిపించే ఆ ఇద్దరి మధ్య మంచి బాండింగ్ ఉంటుంది. కానీ అవేవి రాధేశ్యామ్ ప్రమోషన్ కార్యక్రమంలో కనిపించలేదు. ఇటీవల ముంబైలో జరిగిన ఈ మూవీ ప్రమోషన్లో ప్రభాస్-పూజా హెగ్డే పక్కపక్కనే కుర్చున్నారు.. కానీ వారి మధ్య చాలా గ్యాప్ కనిపించింది. చదవండి: ‘భీమ్లా నాయక్’ టీంపై అలిగిన హీరోయిన్లు?, సంయుక్త మీనన్ క్లారిటీ కేవలం హాయ్.. బాయ్... పైపై చిరునవ్వులు మాత్రమే ఉన్నాయి. దీంతో ఒక్కసారిగా ఎన్నో అనుమానాలు రేకెత్తున్నాయి. నిజంగానే వీరిద్దరి మధ్య ఏదో జరిగిందనేది రుజువైంది అంటూ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే రాధేశ్యామ్ మూవీ షూటింగ్ సమయంలో ప్రభాస్-పూజకు గొడవలు జరిగాయంటూ గతంలో జోరుగా ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. దీంతో ఎడమోహం పెడమోహంగానే వీరిద్దరూ షూటింగ్‌ను పూర్తి చేశారని ఫిలిం దూనియాలో వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే వీటిపై స్పందించిన చిత్ర బృందం అలాంటిదేం లేదని అందరికి సర్థిచెప్పింది. కానీ ఈ తాజా ఈవెంట్లో ప్రభాస్-పూజ తీరు చూస్తుంటే ఆ వార్తలు వాస్తవమే అని తెలుస్తోంది. చదవండి: సమంతపై జిమ్ ట్రైనర్ జునైద్ ఆసక్తికర వ్యాఖ్యలు ఈ ప్రెస్మీట్లో కనీసం ఒకరితో ఒకరు మాట్లాడుకోనే లేదు. ఒకరు ఒకవైపు చూస్తే.. మరోకరు మరో వైపు చూస్తున్నారు. మీడియా అడిగిన ప్రశ్నలకు ముభావంగానే సమాధానం ఇచ్చారు. ఎవరి ప్రశ్నలకు వారే సమాధానం చెప్పారు తప్పా ఒకరి విషయంలో మరోకరు జోక్యం చేసుకోలేదు. దీంతో మిగతా సినిమా ప్రమోషన్లో మాదిరిగా ఇక్కడ ఆ అల్లరి, సందడి వాతావరణం కరువైంది. ఇదంతా చూస్తుంటే ఇంకా ఇద్దరి మధ్య కోల్డ్‌వార్ అలాగే ఉందని స్పష్టమవుతోంది. సంక్రాంతికి ముందు జరిగిన రాధే శ్యామ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సైతం పూజా, ప్రభాస్ ఎవరి దారి వారిదే అన్నట్లున్నారు. కనీసం ఫ్రెండ్లీ కన్వర్జేషన్ కూడా కనిపించలేదు. ఇన్ని రోజులు అయినా, కలిసి షూటింగ్ చేసిన ఇద్దరి మధ్య మనస్పర్థలు తొలగలేదంటే ఏ రేంజ్లో విభేదాలు వచ్చాయో అంటూ రాధేశ్యామ్ ఫ్యాన్స్ కంగారు పడుతున్నారు. ఇంకా ఇలాగే ఇద్దరు మూవీ ప్రమోషన్స్ చేస్తే ఆ జోష్ మిస్ అవుతుందంటున్నారు. వరల్డ్ వైడ్‌గా రిలీజ్ అవుతున్న రాధేశ్యామ్ మూవీ ప్రమోషన్స్ ఓ రెంజ్లో ఊహించుకున్న తమకు ప్రభాస్-పూజ తీరు నిరాశ కలిగిస్తుందంటూ నెటిజన్లు, ఫ్యాన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరి ఇకనైనా ప్రభాస్-పూజలు తమ తీరు మార్చుకున సఖ్యతగా కలిసి ప్రమోషన్ చేయాలని డార్లింగ్-బుట్టబొమ్మల ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. (మరిన్ని ఫొటోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
బాలీవుడ్‌పై నటి భాగ్యశ్రీ షాకింగ్ కామెంట్స్..
Bhagyashree Shocking Comments On Bollywood: ఒకప్పుడు టాలీవుడ్‌ను చిన్న చూపు చూసిన బాలీవుడ్ స్టార్ నటీనటులు ఇప్పుడు తెలుగు సినిమాలపై కన్నేస్తున్నారు. బాలీవుడ్ అగ్ర హీరోయిన్లు మన తెలుగు హీరోలతో నటించేందుకు మొగ్గు చూపుతున్నారు. ఇప్పటికే కొందరు హీరోహీరోయిన్లు కూడా ఈ స్టేట్మెంట్ కూడా ఇచ్చేశారు. బాలీవుడ్ ‘భాయిజాన్’ సల్మాన్ ఖాన్ కూడా త్వరలోనే తెలుగు తెరపై సందడి చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఆయనతో పాటు చాలా మంది హీరోలు, నటులు తెలుగు నటించాలని ఉందంంటూ వారి మనసులో మాట చెప్పేస్తున్నారు. అంతేకాదు మన తెలుగు సినిమాలను సైతం అక్కడ రిమేక్ చేస్తున్నారు. చదవండి: సమంతపై జిమ్ ట్రైనర్ జునైద్ ఆసక్తికర వ్యాఖ్యలు ఈ నేపథ్యంలో సీనియర్ నటి భాగ్యశ్రీ బాలీవుడ్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. కాగా పాన్ ఇండియా చిత్రం రాధేశ్యామ్‌తో భాగ్యశ్రీ రీఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. 80, 90లలో బాలీవుడ్లో స్టార్ హీరోయిన్ వెలుగువెలిగిన ఆమె పెళ్లి అనంతరం సినిమాలకు దూరమయ్యారు. రాధేశ్యామ్‌లో ప్రభాస్‌కు తల్లి పాత్రతో ఆమె మళ్లీ వెండితెరపై అలరించనున్నారు. రాధేశ్యామ్ మార్చి 11న విడుదలకు కాబోతున్న తరుణంలో మూవీ ప్రమోషన్లో భాగంగా ఆమె మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా భాగ్యశ్రీ ప్రస్తుతం బాలీవుడ్లో అన్ని పాత కథలు, కాపీ స్క్రీప్ట్స్ వస్తున్నాయని అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. చదవండి: ఆ హీరో నన్ను ఏకాంతంగా కలవాలి అన్నాడు: ‘చంద్రలేఖ’ హీరోయిన్ అలాగే తెలుగు మలయాళ ఇండస్ట్రీలో కొత్త స్క్రిప్ట్స్, కొత్త కథలు వస్తున్నాయన్నారు. కొత్త టాలెంట్, ఓటిటి ప్లాట్ ఫామ్స్ వల్ల సినిమా స్థాయి రోజు రోజుకు ఇంటర్నేషనల్ స్థాయికి మారుతుందని, ప్రజలు ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలను, అలాంటి కథలనే ఇష్ట పడుతున్నారని చెప్పారు. భాషతో సంబంధం లేకుండా మంచి సినిమాని ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, యంగ్ జనరేషన్ నుంచి కొత్త కథలు, కొత్త సినిమాలు వస్తున్నాయన్నారు. అందుకే తానూ న్యూ టాలెంట్ పీపుల్స్‌తో పని చేసేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు. -
ముంబైలో 'రాధే శ్యామ్' ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ (ఫోటోలు)
-
అందుకే నాకింకా పెళ్లి కాలేదు: ప్రభాస్
టాలీవుడ్లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ ఎవరయా? అంటే మొదటగా ప్రభాస్ పేరే వినిపిస్తుంది. పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్న ప్రభాస్‌కు పెళ్లి గురించి పట్టించుకునేంత తీరిక లేకుండా పోయింది. ప్రస్తుతం అతడు రాధేశ్యామ్ ప్రమోషన్లలో బిజీగా ఉన్నాడు. బుధవారం నాడు ముంబైలో ఈ సినిమా నుంచి మరో కొత్త ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. అందులో భాగంగా ఏర్పాటు చేసిన ఈ ప్రెస్మీట్లో ప్రభాస్‌కు పెళ్లి గురించి ప్రశ్న ఎదురైంది. 'ప్రేమ విషయంలో ఆదిత్య ప్రిడిక్షన్ తప్పు' అన్న డైలాగ్‌ను గుర్తు చేస్తూ 'రియల్ లైఫ్‌లో ప్రేమ విషయంలో మీ లెక్క తప్పిందా?' అని ప్రభాస్‌ను ప్రశ్నించారు. దీనికి అతడు.. 'ప్రేమ విషయంలో చాలాసార్లు నా అంచనాలు తప్పాయి. అందుకే నాకింకా పెళ్లి కాలేదు' అని సరదాగా బదులిచ్చాడు. ప్రస్తుతం ఈ కామెంట్లు నెట్టింట వైరల్‌గా మారాయి. కాగా ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటించిన 'రాధేశ్యామ్' మార్చి 11న థియేటర్లలోకి రానుంది. ఈ సినిమాకు రాధాకృష్ణ దర్శకత్వం వహించగా యూవీ క్రియేషన్స్ భారీ బడ్జెట్‌తో నిర్మించింది. -
Radhe Shyam : ఎలా చనిపోతాడో చెప్పనా..? అంచనాలు పెంచేసిన ట్రైలర్
సాహో తర్వాత ప్రభాస్ నటిస్తున్న ‘రాధేశ్యామ్’సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.ఈ సినిమా కోసం ఆయన డైహార్డ్ ఫ్యాన్స్ కళ్లలో వత్తులేసుకుని ఎదురు చూస్తున్నారు. వాస్తవానికి ఈ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సింది. కానీ కరోనా కారణంగా పలుమార్లు వాయిదా పడుతూ వచ్చింది. అయితే తాజాగా పరిస్థితులన్నీ అనుకూలించడంతో ఎట్టకేలకు ఈ సినిమా విడుదలకు సిద్ధమైంది. మార్చి 11న రాధేశ్యామ్ సినిమాను విడుదల చేయనున్నారు. విడుదల తేది దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రమోషన్స్‌లో వేగాన్ని పెంచింది చిత్ర యూనిట్. ఇందులో భాగంగా నేడు(మార్చి 2)రాధేశ్యామ్ కొత్త ట్రైలర్‌ని విడుదల చేసింది. ‘మనం ఆలోచిస్తున్నామని భ్రమపడతాం. మన ఆలోచనలు కూడా ముందే రాసి ఉంటాయి’అని ప్రభాస్ చెప్పే డైలాగ్‌తో ట్రైలర్ ప్రారంభమవుతోంది. ‘చేయి చూసి ఫ్యూచర్‌ని, వాయిస్ విని పాస్ట్‌ని కూడా చెప్పేస్తావా అని ఒకరు ప్రభాస్‌ని అడగ్గా.. ‘విని ఎలా ఎప్పుడు చనిపోతాడో చెప్పనా ’అని ప్రభాస్ బదులిస్తాడు. ‘ఇంకోసారి చెయ్యి చూడు’ అని జగపతి బాబు అడగ్గా.. నాకు రెండో సారి చెయ్యి చూడడం అలవాటు లేదు అంటూ ప్రభాస్ చెప్పే డైలాగ్ బాగా పేలింది. అలాగే ట్రైలర్ చివర్లో ‘ప్రేమ విషయంలో ఆదిత్య ప్రెడిక్షన్ తప్పు’ అని పూజా హెగ్డే చెప్పిన డైలాగ్ సినిమాపై మరింత ఆసక్తిని పెంచింది రాజులు, యువరాజులు, ప్రెసిడెంట్స్, ప్రైమ్ మినిష్టర్ వంటి పెద్ద పెద్ద వారికి పల్మనాలజీ చెప్పే పల్మనిస్ట్ క్యారెక్టర్లో ప్రభాస్ నటించారు. ప్రపంచలోనే తొలిసారిగా ఈ నేపథ్యంలో వస్తున్న చిత్రం రాధే శ్యామ్. గోపికృష్ణ మూవీస్ ప్రైవేట్ లిమిటెడ్, యూవీ క్రియేషన్ సంయుక్తంగా ఈ రొమాంటిక్ లవ్ స్టోరీని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. రెబల్ స్టార్ డాక్టర్ యువి కృష్ణంరాజు ఈ సినిమాను సమర్పిస్తుండగా.. వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు. రాధా కృష్ణ కుమార్ రాధే శ్యామ్ సినిమాను తెరకెక్కిస్తున్నారు. పూజా హెగ్డే ఇందులో రెబల్ స్టార్ ప్రభాస్ కి జోడీగా నటిస్తున్నారు. జస్టిన్ ప్రభాకరన్ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. -
రాధేశ్యామ్ ట్రైలర్ రిలీజ్‌కు డేట్ ఫిక్స్
ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటిస్తున్న చిత్రం 'రాధేశ్యామ్'. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా మార్చి 11న విడుదల కానుంది. 1960 నాటి వింటేజ్ ప్రేమకథ నేపథ్యంలో తెరకెక్కుంది. భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా చిత్రంగా యూవీ క్రియేషన్స్, టీ సిరీస్ బ్యానర్లపై భూషణ్ కుమార్, వంశీ, ప్రమోద్, ప్రసీద సంయుక్తంగా నిర్మిస్తున్నారు. చదవండి: ఆదిపురుష్ రిలీజ్ డేట్ వచ్చేసింది ఈ మూవీ రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో మేకర్స్ ప్రమోషన్ కార్యక్రమాలను స్టార్ట్ చేశారు. ఈ నేపథ్యంలో రాధేశ్యామ్ ట్రైలర్ ఈవెంట్‌గా చిత్రం బృందం గ్రాండ్‌గా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. రేపు మధ్యాహ్నం 3 గంటలకు ఈ సినిమా నుంచి ట్రైలర్ రిలీజ్ చేయనున్నట్లు తాజాగా మేకర్స్ ప్రకటించారు. కాగా ఈ సినిమాలో ప్రభాస్ తల్లిగా బాలీవుడ్ నటి భాగ్యశ్రీ నటిస్తుండగా.. కృష్ణం రాజు, జగపతి బాబులు కీలక పాత్రలో కనిపంచనున్నారు. Celebrate love in the grandest way possible! The release trailer of #RadheShyam out on March 2nd at 3 PM.#RadheShyamReleaseTrailer#Prabhas @hegdepooja @director_radhaa@UV_Creations #BhushanKumar @TSeries @GopiKrishnaMvs@AAFilmsIndia @RedGiantMovies_ #RadheShyamOnMarch11 pic.twitter.com/BrowtdSjUL — Radhe Shyam (@RadheShyamFilm) February 28, 2022 -
Radhe Shyam: ప్రభాస్ కోసం రంగంలోకి రాజమౌళి!
SS Rajamouli Gives Voice Over For Prabhas Movie: రాజమౌళి , ప్రభాస్ కాంబినేషన్ అంటే చిన్న విషయం కాదు.ఎప్పుడెప్పుడు వీరిద్దరు మళ్లీ చేతులు కలుపుతారా అని ఒక్క టాలీవుడ్ మాత్రమే కాదు, వరల్డ్ వైడ్ గా బాహుబలి సిరీస్ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. కాని ఇటు రాజమౌళి, అటు ప్రభాస్ ఇతర ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నారు.ఇండియన్ సినిమాను నెక్ట్స్ లెవల్ కు తీసుకెళ్లడమే పనిగా పెట్టుకున్నారు. అయితే తాజాగా వీరిద్దరు మరోసారి చేతులు కలుపుతున్నారు. అంటే వీరిద్దరి కాంబోలో మరో మూవీ వస్తుందని అనుకోకండి. అల్రేడీ తెరకెక్కిన ‘రాధేశ్యామ్’కోసం ప్రభాస్, రాజమౌళి చేతులు కలిపారు. Heartful thanks to @ssrajamouli sir, @NimmaShivanna sir, and @PrithviOfficial sir for the voiceover of #RadheShyam. #Prabhas @hegdepooja @director_radhaa @UV_Creations @TSeries @GopiKrishnaMvs @AAFilmsIndia @RadheShyamFilm #RadheShyamOnMarch11 pic.twitter.com/nf5u9yxl2m — UV Creations (@UV_Creations) February 27, 2022 మార్చి 11న రాధేశ్యామ్ రిలీజ్ అవుతోంది.అందుకే సినిమా యూనిట్ ప్రమోషన్ పై ఫోకస్ పెట్టింది.ఇప్పటికే న్యూ వీడియో సాంగ్స్ రిలీజ్ అయ్యాయి.దర్శకుడు రాధాకృష్ణ కూడా మీడియాకు ఇంటర్వ్యూస్ ఇస్తున్నాడు.ఇప్పుడు ఈ సినిమాను ప్రమోట్ చేసేందుకు స్వయంగా రాజమౌళి రంగంలోకి దిగుతున్నాడు.త్వరలో ‘రాధేశ్యామ్’నుంచి కొత్త ట్రైలర్ రాబోతుంది. ఈసారి సినిమా నుంచి పూర్తిగా కొత్త కంటెంట్ ఆ ట్రైలర్ లో కనిపించబోతున్నాయి.పైగా ఫుల్ ఫామ్ లో ఉన్న తమన్ ఈ సినిమా ట్రైలర్ మ్యూజిక్ అందిస్తున్నాడు.అందుకే బాలీవుడ్ వర్షన్ రాధేశ్యామ్ ట్రైలర్ కు అమితాబ్ బచ్చన్ వాయిస్ ఓవర్ అందిస్తుండగా, తెలుగు వర్షన్ రాధేశ్యామ్ ట్రైలర్ కు దర్శకధీరుడు రాజమౌళి వాయిస్ ఓవర్ అందించబోతున్నాడు. -
‘రాధే శ్యామ్’ సర్ప్రైజ్.. థియేటర్స్‌లో ఆస్ట్రాలజీ కౌంటర్!
Prabhas-Pooja Hegde Radhe Shyam Movie Promotions: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన పీరియాడికల్ ప్రేమకథా చిత్రం ‘రాధేశ్యామ్’ కోసం అభిమానులు ఎంతగా వేచి చూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కరోనా కారణంగా పలుమార్లు వాయిదా పడిన ఈ చిత్రం ఎట్టకేలకు మార్చి 11న ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ కార్యక్రమాలను వేగవంతం చేసింది చిత్ర యూనిట్. జోతిష్యం, హస్తసాముద్రికం తదితర అంశాలకు సంబంధించి చాలా హనెస్ట్‌గా ఓ విషయాన్ని చెప్పామని.. అదే ఈ చిత్రానికి మెయిన్ కంక్లూజన్ అంటున్నారు మేకర్స్. రాజులు, యువరాజులు, ప్రెసిడెంట్స్, ప్రైమ్ మినిష్టర్ వంటి పెద్ద పెద్ద వారికి పల్మనాలజీ చెప్పే పల్మనిస్ట్ క్యారెక్టర్లో ప్రభాస్ నటించారు. ప్రపంచలోనే తొలిసారిగా ఈ నేపథ్యంలో వస్తున్న చిత్రం రాధే శ్యామ్. ఈ క్రమంలో మూవీ ప్రమోషన్స్‌ని చాలా కొత్తగా చేయాలని డిసైడ్ అయింది చిత్ర యూనిట్. జోతిష్యం నేపథ్యంలో వస్తున్న చిత్రం కావడంతో.. దేశవ్యాప్తంగా ఉన్న థియేటర్స్‌లో ఆస్ట్రాలజీ కౌంటర్ ఓపెన్ చేశారు. అక్కడ జ్యోతిష్యం చెప్తూ సినిమాకు ప్రమోషన్ చేస్తున్నారు. ఈ వినూత్నమైన ఐడియాకు ప్రేక్షకుల నుంచి కూడా అనూహ్యమైన స్పందన వస్తుంది. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర ట్రైలర్‌తో పాటు పాటలకు కూడా అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది. గోపికృష్ణ మూవీస్ ప్రైవేట్ లిమిటెడ్, యూవీ క్రియేషన్ సంయుక్తంగా ఈ రొమాంటిక్ లవ్ స్టోరీని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. రెబల్ స్టార్ డాక్టర్ యువి కృష్ణంరాజు ఈ సినిమాను సమర్పిస్తుండగా.. వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు. రాధా కృష్ణ కుమార్ రాధే శ్యామ్ సినిమాను తెరకెక్కిస్తున్నారు. పూజా హెగ్డే ఇందులో రెబల్ స్టార్ ప్రభాస్ కి జోడీగా నటిస్తున్నారు. జస్టిన్ ప్రభాకరన్ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. -
రాధేశ్యామ్: అందుకే యూరప్‌లో షూట్ చేశాం
‘‘రాధేశ్యామ్’ చిత్రకథను ప్రభాస్‌గారిని దృష్టిలో పెట్టుకునే రాశాను. రెండున్నర గంటలు ఈ కథ విన్న ఆయన చాలా ఎగై్జట్ అయ్యి, సినిమా చేద్దామన్నారు. సెట్లో ఆయన చిన్నపిల్లాడిలా ఉంటారు.. ప్రతిదీ నేర్చుకుంటారు. ప్రభాస్ లాంటి మంచి ఫ్రెండ్‌తో పాన్ ఇండియా సినిమా చేయడం నా అదృష్టం’’ అని రాధాకృష్ణ కుమార్ అన్నారు. ప్రభాస్, పూజా హెగ్డే జంటగా రూపొందిన చిత్రం ‘రాధేశ్యామ్’. కృష్ణంరాజు సమర్పణలో రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో వంశీ, ప్రమోద్, ప్రసీద, భూషణ్ కుమార్ నిర్మించిన ఈ సినిమా మార్చి 11న విడుదల కానుంది. ఈ సందర్భంగా రాధాకృష్ణ కుమార్ చెప్పిన విశేషాలు. ∙జ్యోతిష్య శాస్త్రంపై ప్రపంచవ్యాప్తంగా వచ్చిన సినిమాలు చాలా తక్కువ. జ్యోతిష్యం నేపథ్యంలో ‘రాధేశ్యామ్’ కథ అనుకున్నాక చాలా అధ్యయనాలు చేశాను.. కొందరు జ్యోతిష్కులను కలిసి, వారి అనుభవాలు తెలుసుకున్నాను. జ్యోతిష్యం అంటే నమ్మకమా? నిజమా? అనేదానికి నేను ఇచ్చిన ముగింపు ఏంటో మా సినిమా చూస్తే తెలుస్తుంది. యూనివర్సల్ పాయింట్‌తో తీసిన ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను మాత్రమే కాదు.. ఇతర భాషల ప్రేక్షకులకూ కనెక్ట్ అవుతుంది. ∙నా దర్శకత్వంలో వచ్చిన ‘జిల్’ (2015) తర్వాత ‘రాధేశ్యామ్’ అనుకున్నాను. నిజానికి ‘బాహుబలి’ చిత్రం కంటే ముందే ‘రాధేశ్యామ్’ కథని మొదలుపెట్టాం. ‘బాహుబలి’ విడుదల తర్వాత కథలో ఎలాంటి మార్పులూ చేయలేదు.. ఎందుకంటే ‘బాహుబలి’ సూపర్ హిట్ అవుతుందనే నమ్మకంతో ‘రాధేశ్యామ్’ని కూడా పెద్ద సినిమాగా అనుకున్నాం. ‘సాహో’ టైమ్‌లోనే ‘రాధేశ్యామ్’ కూడా కొంత షూటింగ్ జరిగింది. కానీ కోవిడ్ వల్ల కొంత ఆలస్యం అయింది. ∙గోపీకృష్ణా మూవీస్, యూవీ క్రియేషన్స్ వంటి ప్రతిష్టాత్మక సంస్థల్లో పని చేయడం నిజంగా నా అదృష్టం. ఈ కథను మొదట మన దేశంలోనే ఏదైనా ఒక ప్రాధాన్యత ఉన్న ప్లేస్‌ను బేస్ చేసుకుని చేద్దామనుకున్నాను. కానీ ప్రభాస్ సూచన మేరకు యూరప్ బ్యాక్‌డ్రాప్‌గా మారింది. ఇటలీ, ఆస్ట్రేలియా, జార్జియాలో షూటింగ్ చేశాం. కోవిడ్ వల్ల షూటింగ్ ఆలస్యం అవుతోందనే చిన్న టెన్షన్ తప్ప నాపై ఎలాంటి ఒత్తిడి లేదు.. ఫుల్ క్లారిటీతో సినిమా తీశాను. నిర్మాతలు పూర్తి స్వేచ్ఛ ఇవ్వటంతో ఒత్తిడి లేకుండా పనిచేశా. లాక్డౌన్ వల్ల యూరప్ షెడ్యూల్‌ను మధ్యలోనే ఆపేసి వేరే దేశాల మీదుగా ఇళ్లకు చేరుకున్నాం. క్లైమాక్స్ షూటింగ్ హైదరాబాద్‌లో చేశాం. ∙ఈ చిత్రంలో కృష్ణంరాజుగారు ప్రత్యేక పాత్ర చేశారు. ఆ పాత్రకు ఆయనే కరెక్ట్ అని ప్రభాస్ గారే చెప్పారు. రెండు తరాల హీరోలతో ఒకేసారి పని చేయడం చాలా సంతోషంగా అనిపించింది. పూజా హెగ్డే కథ వినగానే ఓకే అన్నారు. నటనకు మంచి ప్రాధాన్యత ఉన్న పాత్ర ఆమెది. ప్రభాస్, పూజా హెగ్డేల జంట చూడముచ్చటగా ఉంటుంది. ‘రాధేశ్యామ్’ కథ నచ్చడం, పైగా ప్రభాస్గారిలాంటి సినిమాతో రీ ఎంట్రీ అంటే బాగుంటుందని భాగ్యశ్రీగారు చేశారు. ∙‘రాధేశ్యామ్’కి బలమైన కథ కుదిరింది.. అందుకే తెలుగు సినిమా స్థాయిని మరోసారి ప్రపంచానికి చాటి చెప్పే చిత్రంగా నిలుస్తుందని నమ్మకంగా ఉన్నాను. జస్టిన్ ప్రభాకరన్ సంగీతం, తమన్ నేపథ్య సంగీతం చిత్రానికి ప్రత్యేక ఆకర్షణ. ఇలాంటి భారీ సినిమాలకు గ్రాఫిక్స్ ప్రాణం. కమల్ కణ్ణన్‌గారు దాదాపు 12 దేశాల్లోని టెక్నీషియన్స్‌ను కో ఆర్డినేట్ చేసుకుని విజువల్ ఫీస్ట్‌గా ఉండేలా శ్రమించారు. ∙సోషల్ మీడియా వల్ల సినిమా అనేది ఇంటర్నేషనల్ అవుతోంది. నాకు ఫలానా జోనర్లో సినిమా తీయాలనే ఆసక్తి లేదు.. అన్ని జోనర్స్ ఇష్టం. అయితే చాలెంజింగ్ కథలంటే ఇంకా ఇష్టం. ప్రస్తుతానికి కొన్ని కథలు సిద్ధంగా ఉన్నాయి. కొందరు నిర్మాతలు సంప్రదించారు. కానీ ఏ సినిమానీ ఓకే చేయలేదు. ‘రాధేశ్యామ్’ విడుదల తర్వాత వివరాలు చెబుతాను. -
రాధేశ్యామ్ నుంచి సర్ప్రైజ్ వచ్చేసింది..
Ee Raathale Song Out: యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్, రాధాకృష్ణ కుమార్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమా రాధేశ్యామ్. ఇందులో ప్రభాస్ సరసన పూజా హెగ్డే నటిస్తుంది. 1960 నాటి వింటేజ్ ప్రేమకథ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలున్నాయి.యూవీ క్రియేషన్స్, టీ సిరీస్ బ్యానర్లపై భూషణ్ కుమార్, వంశీ, ప్రమోద్, ప్రసీద సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా మార్చి 11న విడుదల కానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి ఈ రాతలే ప్రోమోను రిలీజ్ చేసిన మేకర్స్ తాజాగా ఫుల్ సాంగ్‌ని విడుదల చేశారు. జస్టిస్ శంకర్ మ్యూజిక్ అందించగా యువన్ శంకర్ రాజా, హరిణి ఇవటూరి ఆలపించారు. When hearts meet, melody is created! Presenting a romantic treat from #MusicalOfAges ♥️#JaanHaiMeri: https://t.co/kD8gqjRPAe#EeRaathale: https://t.co/EslmEs6qi6#Aagoozhilae: https://t.co/yYefbG1Llz#EeReethile: https://t.co/BhqIDAXwV8#Kaanaakkare: https://t.co/tmwmP3C2gC pic.twitter.com/VeD5IISQih — Radhe Shyam (@RadheShyamFilm) February 25, 2022 -
న్యూ వీడియో సాంగ్ రిలీజ్
-
రాధేశ్యామ్ నుంచి సర్ప్రైజ్.. మరో బిగ్ అప్డేట్
ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటిస్తున్న చిత్రం 'రాధేశ్యామ్'. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా మార్చి 11న విడుదల కానుంది. 1960 నాటి వింటేజ్ ప్రేమకథ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కృష్ణంరాజు కీలక పాత్రలో నటిస్తున్నారు.భారీ బడ్జెట్ మూవీగా యూవీ క్రియేషన్స్, టీ సిరీస్ బ్యానర్లపై భూషణ్ కుమార్, వంశీ, ప్రమోద్, ప్రసీద సంయుక్తంగా నిర్మిస్తున్నారు. చదవండి: 'భీమ్లా నాయక్' ఈవెంట్లో త్రివిక్రమ్ అందుకే మాట్లాడలేదా? అయితే.. తాజాగా ఈ చిత్రం నుంచి ఫ్యాన్స కోసం మేకర్స్ ఓ సర్ప్రైజ్ను వదిలారు. ఈ రాతలే అనే సాంగ్ ప్రోమోను విడుదల చేశారు. ఇక ఫుల్ సాంగ్‌ను రేపు(శుక్రవారం)రిలీజ్ చేస్తామని పేర్కొన్నారు. చదవండి: నాకు ఇంకో బిడ్డ ఉంది: కాజల్ చెల్లెలు నిషా అగర్వాల్ -
విక్రమాదిత్య, ప్రేరణల ప్రేమకథను టూకీగా చెప్పిన అమితాబ్ బచ్చన్
Amitabh Bachchan Voice Over To Movie: విక్రమాదిత్య, ప్రేరణల ప్రేమకథ ఎలా ఉంటుందో అమితాబ్ బచ్చన్ టూకీగా చెప్పారు. విక్రమాదిత్య అంటే ప్రభాస్, ప్రేరణ అంటే పూజా హెగ్డే అనే విషయం ‘రాధేశ్యామ్’ సినిమా అప్డేట్స్ని ఫాలో అవుతున్నవారికి తెలిసే ఉంటుంది. ఈ సినిమాలో ఈ ఇద్దరూ చేసిన పాత్రల పేర్లివి. ప్రభాస్, పూజా హెగ్డే జంటగా రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో వంశీ, ప్రమోద్, ప్రసీద నిర్మించిన చిత్రం ‘రాధేశ్యామ్’. యూరప్ బ్యాక్‌డ్రాప్‌లో 1970ల్లో జరిగే ప్రేమకథతో రూపొందిన ఈ పాన్ ఇండియా మూవీ మార్చి 11న విడుదల కానుంది. చదవండి: Allu Arjun Expensive Things: వావ్.. అల్లు అర్జున్ కొత్త ఇల్లు అదిరిందిగా.. ఎన్ని కోట్లు పెట్టాడంటే.. ఈ నేపథ్యంలో హిందీ వెర్షన్‌కు అమితాబ్ బచ్చన్ వాయిస్ ఓవర్ ఇచ్చిన విషయాన్ని మంగళవారం చిత్రబృందం ప్రకటించింది. ‘‘బాలీవుడ్ లెజెండ్ అమితాబ్ బచ్చన్ నెరేషన్ ఈ సినిమాకి అదనపు ఆకర్షణ అవుతుంది. బిగ్ బీకి ధన్యవాదాలు’’ అని చిత్రబృందం పేర్కొంది. కృష్ణంరాజు, భాగ్యశ్రీ, సచిన్ ఖేడ్కర్ తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: జస్టిన్ ప్రభాకరన్ (తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం), మిథున్, అనూ మాలిక్, మనన్ భరద్వాజ్ (హిందీ), కెమెరా: మనోజ్ పరమహంస. Thank you Shahenshah @SrBachchan sir for the Hindi voiceover of #RadheShyam. #Prabhas @hegdepooja @director_radhaa @UV_Creations @TSeries @GopiKrishnaMvs @AAFilmsIndia @RadheShyamFilm #RadheShyamOnMarch11 pic.twitter.com/xrqZWGXoj1 — Radha Krishna Kumar (@director_radhaa) February 22, 2022 -
వాలంటైన్స్ డే: స్పెషల్ సర్‌ప్రైజస్!
ప్రేమికుల దినోత్సవం (ఫిబ్రవరి 14) సందర్భంగా సోమవారం ప్రేమతో పలు అప్డేట్స్ ఇచ్చాయి ఆయా చిత్రబృందాలు. ఒకరు సాంగ్‌తో సర్ప్రైజ్ చేస్తే, మరొకరు టీజర్ గిఫ్ట్స్ ఇచ్చారు. ఇంకొకరు ప్రేయసి లుక్స్‌ను రివీల్ చేశారు. ఇలా ఎవరికి వీలైనట్లు వారు ప్రేమికుల రోజున అప్డేట్స్తో ఆడియన్స్‌కు లవ్ గిఫ్ట్స్ ఇచ్చారు. ఈ బహుమతుల తాలూకు వివరాల్లోకి మీరూ ఓ లుక్కేయండి. ‘‘పిల్లలూ పరీక్షలు ముగించుకోండి. పెద్దలు సమ్మర్ సందడికై తయారుకండి. ఫన్ పిక్నిక్కి డేట్ ఫిక్స్ చేశాం’ అంటూ ‘ఎఫ్ 3’ టీమ్ కొత్త రిలీజ్ డేట్‌ను ప్రకటించింది. మే 27న ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నట్లు సోమవారం ప్రకటించింది. వెంకటేశ్, వరుణ్ తేజ్, తమన్నా, మెహరీన్ హీరో హీరోయిన్లుగా, రాజేంద్రప్రసాద్, సునీల్, సోనాల్ చౌహాన్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ఇది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘దిల్’ రాజు నిర్మించారు. పిల్లలు పరీక్షలు ముగించుకోండి🤩 పెద్దలు సమ్మర్ సందడికై తయారుకండి🔥 ఫన్ పిక్నిక్ కి డేట్ ఫిక్స్ చేశాం!🔐 No change in date Anymore! 😎 Most Awaited FUN Franchise ➡️ #F3Movie ON MAY 27th🥳#F3OnMay27@VenkyMama @IAmVarunTej @AnilRavipudi @ThisIsDSP @SVC_official @adityamusic pic.twitter.com/PTjLnKvQbF — Sri Venkateswara Creations (@SVC_official) February 14, 2022 ఇక ఈ ప్రేమికుల రోజున డాక్టరు ప్రేరణకు ప్రపోజ్ చేశాడు విక్రమాదిత్య. ‘రాధేశ్యామ్’ చిత్రంలోని సీన్ ఇది. ఈ సినిమా వీడియో గ్లింప్స్‌ను విడుదల చేశారు. ఇందులో జ్యోతిష్కుడు విక్రమాదిత్యగా ప్రభాస్, ప్రేరణగా పూజా హెగ్డే కనిపిస్తారు. కె. రాధాకృష్ణ ్ణకుమార్ దర్శకత్వంలో వంశీ, ప్రమోద్, ప్రసీద నిర్మించిన ఈ చిత్రం మార్చి 11న విడుదల కానుంది. ఇక సిల్వర్ స్క్రీన్‌పై తన కొత్త ప్రేయసి ఎవరనేది అధికారికంగా చెప్పేశారు రవితేజ. నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో తాను హీరోగా నటిస్తున్న ‘ధమాకా’ చిత్రంలో ప్రణవి అనే అమ్మాయిని ప్రేమిస్తారు రవితేజ. ప్రణవి అంటే ఎవరో కాదండోయ్. ‘పెళ్లి సందడి’తో పరిచయమైన శ్రీ లీల అన్నమాట. టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాకు వివేక్ కూచిభొట్ల సహనిర్మాత. మరోవైపు ‘వారియర్’ మనసులో విజిల్ వేసి మరీ ప్రేమ పుట్టించింది మహాలక్ష్మి. రామ్ హీరోగా లింగుసామి దర్శకత్వంలో ‘ది వారియర్’ అనే యాక్షన్ ఫిల్మ్ రూపుదిద్దుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో హీరోయిన్గా నటిస్తోన్న కృతీ శెట్టి ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఇందులో విజిల్ మహాలక్ష్మి పాత్రలో కనిపిస్తారు కృతి. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఈ ఏడాదిలోనే రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ఇంకోవైపు ఆద్య పక్కన ఉంటే చాలు ప్రపంచాన్నే మర్చిపోతున్నారు శర్వానంద్. ఆద్యా అంటే శర్వా రీల్ లైఫ్ పార్ట్నర్. ‘ఆడవాళ్ళు మీకు జోహార్లు’ చిత్రంలో శర్వానంద్‌కు జోడీగా చేసిన రష్మికా మందన్నాయే ఈ ఆద్య. కిశోర్ తిరుమల దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలోని ‘హో... ఆద్య’ అనే సాంగ్ ప్రోమోను విడుదల చేశారు. సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 25న విడుదల కానుంది. మరోవైపు ‘లవ్ మొళి’ అవతారం ఎత్తారు నవదీప్. అవనీంద్ర దర్శకత్వంలో నవదీప్, ఫంకూరీ గిద్వానీ జంటగా నటిస్తున్న చిత్రం ‘లవ్ మొళి’. ఈ సినిమా కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. ప్రశాంత్ రెడ్డి తాటికొండ నిర్మిస్తున్నారు. వీతోపాటు మరికొన్ని చిత్రబృందాలు సాంగ్స్, కొత్త పోస్టర్స్‌తో ప్రేమికుల దినోత్సవానికి ప్రేక్షకులకు ప్రేమ కానుక ఇచ్చారు. -
లవ్ బర్డ్స్ గా కనిపించిన ప్రభాస్ పూజా హెగ్డే
-
'ఇంత మంచి అబ్బాయికి ఇంకా పెళ్లెందుకు కాలేదు?'
ప్రభాస్ నటించిన పాన్ ఇండియా చిత్రం రాధేశ్యామ్. ప్యారిస్ బ్యాక్‌డ్రాప్‌లో కొనసాగే ఈ ప్రేమకథలో పూజా హెగ్డే కథానాయిక. కృష్ణం రాజు మహాజ్ఞాని అయిన పరమహంస పాత్ర పోషించగా జిల్ ఫేమ్ కేకే రాధాకృష్ణకుమార్ దర్శకత్వం వహించారు. ప్రేమికుల రోజు సందర్భంగా ఈ సినిమా నుంచి వాలంటైన్స్ గ్లింప్స్ రిలీజ్ చేసింది చిత్రయూనిట్. లైఫ్‌లో వాడి ముఖం చూడను అన్న హీరోయిన్ డైలాగ్‌తో ఈ వీడియో ప్రారంభమవుతుంది. 'కుక్ చేస్తావ్, బాగా మాట్లాడతావ్.. ఇంత మంచి అబ్బాయికి ఇంకా పెళ్లెందుకు కాలేదు?' అని హీరోయిన్ ప్రశ్నించగా ప్రభాస్ తత్తరపాటుకు లోనయ్యాడు. కానీ అతడు ఏమని సమాధానం చెప్పాడన్నది మాత్రం చూపించలేదు. కృష్ణంరాజు సమర్పణలో వంశీ, ప్రమోద్, ప్రసీద నిర్మించిన ఈ చిత్రం మార్చి 11న విడుదల కానుంది. ఈ చిత్రానికి ఆస్కార్ విన్నింగ్ హాలీవుడ్ మూవీ ‘గ్లాడియేటర్’కి యాక్షన్ కొరియోగ్రఫీ అందించిన నిక్ పోవెల్ వర్క్ చేస్తుండటం విశేషం. -
వాలంటైన్స్ డే: 'రాధేశ్యామ్' నైట్ థీమ్ పార్టీ!
జనరల్‌గా సినిమా షూటింగ్స్ కోసం సెట్స్ వేస్తుంటారు. అలా ‘రాధేశ్యామ్’ సినిమా కోసం కూడా పలు సెట్స్ తయారు చేయించారు. అది మాత్రమే కాదు.. వాలెంటైన్స్ డే సందర్భంగా ఏర్పాటు చేస్తున్న ‘నైట్ థీమ్ పార్టీ’ కోసం సెట్ ఏర్పాటు చేయించింది ఈ చిత్రబృందం. ఈ నెల 14న రాత్రి 8 గంటల నుంచి ఈ పార్టీ ప్రారంభం కానుంది. ఈ పార్టీ కోసం ‘రాధేశ్యామ్’ సినిమా కథను ప్రతిబింబించేలా సెట్స్ వేయించారు. ప్రభాస్, పూజా హెగ్డే హీరో హీరోయిన్లుగా కె. రాధాకృష్ణకుమార్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘రాధేశ్యామ్’. వంశీ, ప్రమోద్, ప్రసీద నిర్మించిన ఈ చిత్రం మార్చి 11న విడుదల కానుంది.