
Prabhas Radhe Shyam Movie: ప్రభాస్ లెటెస్ట్ మూవీ ‘రాధేశ్యామ్’ కోసం డార్లింగ్ ఫ్యాన్స్ ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. వాస్తవానికి ఈ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సింది. కానీ కరోనా కారణంగా పలుమార్లు వాయిదా పడుతూ వచ్చింది. అయితే తాజాగా పరిస్థితులన్నీ అనుకూలించడంతో ఎట్టకేలకు ఈ సినిమా విడుదలకు సిద్ధమైంది. మార్చి 11న ప్రపంచ వ్యాప్తంగా రాధేశ్యామ్ సినిమా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ స్పీడ్ పెంచింది చిత్ర యూనిట్. ప్రస్తుతం ముంబైలో ఉన్న ప్రభాస్.. అక్కడ పలు చానెల్స్‌కు వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ‘రాధేశ్యామ్’పై గురించి ఆస్తక్తికర విషయాలను పంచుకుంటున్నారు.
తాజాగా ఓ జాతీయ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పూజా హెగ్డేతో రొమాన్స్ సీన్స్‌పై స్పందించారు. తనకు ముందు నుంచి ముద్దు సీన్స్ అంటే చాలా సిగ్గు అని.. కానీ రాధేశ్యామ్ కథ డిమాండ్ మేరకు చేయక తప్పలేదన్నారు. ‘గతంలో యాక్షన్ సినిమాలతో పాటు మాస్ ఎక్కువగా చేయడంతో ముద్దు సీన్ల నుంచి తప్పించుకునే అవకాశాలు ఎక్కువగా వచ్చాయి. కానీ రాధే శ్యామ్ అనేది పూర్తిగా ప్రేమకథ. కమర్షియల్ సినిమాల్లో అలాంటి సీన్స్ ను అవైడ్ చేయొచ్చు కానీ 'రాధేశ్యామ్' లాంటి ప్రాజెక్ట్స్ లో పక్కన పెట్టలేం. కోస్టార్స్ పూజా హెగ్డేతో తో ఆన్ స్క్రీన్ రొమాన్స్ చేయడానికి ఇబ్బంది పడ్డాను. సన్నివేశాలు చేయాలన్నప్పుడు సెట్ లో ఎవరు లేకుండా ఒక ప్రైవేట్ స్పేస్ లో చేస్తానని చెప్పాను. అందుకు దర్శకుడు ఓకే చెప్పగానే ఓ రహస్య ప్రదేశంలో ముద్దు సీన్స్ కానిచ్చేశాను.అంతేకాదు షర్ట్ లేకుండా కొంతమంది ముందు యాక్ట్ చేయడం కూడా నా వల్ల కాలేదు’అని ప్రభాస్ చెప్పుకొచ్చాడు.
గోపికృష్ణ మూవీస్ ప్రైవేట్ లిమిటెడ్, యూవీ క్రియేషన్ సంయుక్తంగా ఈ రొమాంటిక్ లవ్ స్టోరీని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. రెబల్ స్టార్ డాక్టర్ యువి కృష్ణంరాజు ఈ సినిమాను సమర్పిస్తుండగా.. వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు. రాధా కృష్ణ కుమార్ రాధే శ్యామ్ సినిమాను తెరకెక్కిస్తున్నారు. పూజా హెగ్డే ఇందులో రెబల్ స్టార్ ప్రభాస్ కి జోడీగా నటిస్తున్నారు. జస్టిన్ ప్రభాకరన్ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment