Amitabh Bachchan Voice Over To Movie: విక్రమాదిత్య, ప్రేరణల ప్రేమకథ ఎలా ఉంటుందో అమితాబ్ బచ్చన్ టూకీగా చెప్పారు. విక్రమాదిత్య అంటే ప్రభాస్, ప్రేరణ అంటే పూజా హెగ్డే అనే విషయం ‘రాధేశ్యామ్’ సినిమా అప్‌డేట్స్‌ని ఫాలో అవుతున్నవారికి తెలిసే ఉంటుంది. ఈ సినిమాలో ఈ ఇద్దరూ చేసిన పాత్రల పేర్లివి. ప్రభాస్, పూజా హెగ్డే జంటగా రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో వంశీ, ప్రమోద్, ప్రసీద నిర్మించిన చిత్రం ‘రాధేశ్యామ్’. యూరప్ బ్యాక్‌డ్రాప్‌లో 1970ల్లో జరిగే ప్రేమకథతో రూపొందిన ఈ పాన్ ఇండియా మూవీ మార్చి 11న విడుదల కానుంది.
ఈ నేపథ్యంలో హిందీ వెర్షన్‌కు అమితాబ్ బచ్చన్ వాయిస్ ఓవర్ ఇచ్చిన విషయాన్ని మంగళవారం చిత్రబృందం ప్రకటించింది. ‘‘బాలీవుడ్ లెజెండ్ అమితాబ్ బచ్చన్ నెరేషన్ ఈ సినిమాకి అదనపు ఆకర్షణ అవుతుంది. బిగ్ బీకి ధన్యవాదాలు’’ అని చిత్రబృందం పేర్కొంది. కృష్ణంరాజు, భాగ్యశ్రీ, సచిన్ ఖేడ్‌కర్ తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: జస్టిన్ ప్రభాకరన్ (తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం), మిథున్, అనూ మాలిక్, మనన్ భరద్వాజ్ (హిందీ), కెమెరా: మనోజ్ పరమహంస.
Thank you Shahenshah @SrBachchan sir for the Hindi voiceover of #RadheShyam. #Prabhas @hegdepooja @director_radhaa @UV_Creations @TSeries @GopiKrishnaMvs @AAFilmsIndia @RadheShyamFilm #RadheShyamOnMarch11 pic.twitter.com/xrqZWGXoj1
— Radha Krishna Kumar (@director_radhaa) February 22, 2022
Comments
Please login to add a commentAdd a comment