Prabhas' Radhe Shyam Released in Amazon Prime Video - Sakshi
Sakshi News home page

Radhe Shyam: ఓటీటీలోకి వచ్చేసిన రాధేశ్యామ్‌, స్ట్రీమింగ్‌ ఎక్కడంటే

Published Fri, Apr 1 2022 11:03 AM | Last Updated on Fri, Apr 1 2022 12:27 PM

Prabhas Radhe Shyam Released On Amazon Prime Video - Sakshi

ప్రభాస్‌, పూజా హెగ్డే జంటగా నటించిన సినిమా ‘రాధేశ్యామ్‌’ ఓటీటీలోకి వచ్చేసింది. రిలీజ్‌కు ముందే భారీ అంచనాలు క్రియేట్‌ చేసిన ఈ చిత్రం మిక్స్‌డ్‌ టాక్‌ను తెచ్చుకుంది. రాధాకృష్ణకుమార్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు బాక్సాఫీస్‌ వద్ద అనుకున్నంత మ్యాజిక్‌ చూపించలేకపోయింది. ఇటలీ నేపథ్యంలో సాగిన ఈ పిరియాడికల్‌ లవ్‌స్టోరీ ఓ వర్గం ప్రేక్షకులను ఆకట్టుకోగా.. మాస్‌ ఆడియాన్స్‌ను నిరాశ పరిచింది. మార్చి11న విడుదలైన ఈ సినిమా మూడు వారాలకే ఓటీటీలోకి వచ్చేసింది.

నిన్నఅర్థరాత్రి(ఏప్రిల్‌1) ఈ సినిమా ఓటీటీలో రిలీజ్‌ అయ్యింది. ప్రస్తుతం అమెజాన్‌ ప్రైమ్‌ నుంచి ఈ చిత్రాన్ని చూడొచ్చు. కాగా ఇందులో ప్రభాస్‌ విక్రమాదిత్య అనే అస్ట్రాలజర్‌గా కనిపించగా, పూజ డాక్టర్‌ ప్రేరణగా ఆకట్టుకుంది. యూవీ క్రియేషన్స్, టీ సిరీస్ బ్యానర్లపై భూషణ్ కుమార్, వంశీ, ప్రమోద్, ప్రసీద సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement