Hindi Version
-
టీనేజ్ గుర్తొచ్చింది!
టీనేజ్ జ్ఞాపకాలు గుర్తొచ్చాయని సంబరపడిపోతున్నారు బాలీవుడ్ యంగ్ హీరోయిన్ అనన్యా పాండే. హఠాత్తుగా అనన్యా పాండేకు టీనేజ్ జ్ఞాపకాలు గుర్తుకు రావడానికి కారణం ‘ఇన్సైడ్ అవుట్ 2’ అనే అమెరికన్ యానిమేటెడ్ ఫిల్మ్. కెల్సీ మన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో హాలీవుడ్ తారలు అమీ పోహ్లర్, ఫిలిస్ స్మిత్, లూయిస్ బ్లాక్, టోనీ హేల్ వంటి వారు ఈ సినిమాలోని హ్యాపీ, సాడ్‌నెస్, యాంగర్ వంటి ఎమోషన్స్‌కు వాయిస్ ఓవర్ ఇచ్చారు.రిలే ఆండర్సన్ అనే ఓ 13 ఏళ్ల టీనేజ్ అమ్మాయి పాత్రకు హిందీ వెర్షన్లో వాయిస్ ఓవర్ ఇచ్చారు అనన్యా పాండే. సినిమాలో కెన్సింగ్టన్ తాల్మన్ ఈ పాత్ర చేసింది. రిలే ఆండర్సన్‌కు వాయిస్ ఓవర్ ఇచ్చిన సందర్భంగా అనన్యా పాండే మాట్లాడుతూ– ‘‘పిక్సర్ అండ్ డిస్నీ స్టూడియోల యానిమేషన్ చిత్రాలకు నేను అభిమానిని. ఈ సంస్థల నుంచి వస్తున్న ‘ఇన్సైడ్ అవుట్ 2’కి వాయిస్ ఓవర్ ఇవ్వడం హ్యాపీగా ఉంది. రిలే పాత్రకు వాయిస్ ఓవర్ చెబుతున్నప్పుడు నాకు నా టీనేజ్ గుర్తొచ్చింది’’ అని పేర్కొన్నారు. కాగా ‘ఇన్సైడ్ అవుట్ 2’ ఈ నెల 14న రిలీజ్ కానుంది. -
50 థియేటర్లని సరదాగా అనుకుంటే, ఇప్పుడేమో..: అల్లు అరవింద్
Allu Aravind Speech In Karthikeya 2 Success Meet: క్రేజీ నిర్మాణ సంస్థలు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరి, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్స్‌పై ఎనర్జిటిక్ యంగ్ హీరో నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన చిత్రం "కార్తికేయ 2". ఈ సినిమాకు చందు మొండేటి దర్శకత్వం వహించారు. మంచి విజయం సాధించిన 'కార్తికేయక'కు సీక్వెల్‌గా వచ్చిన ఈ చిత్రాన్ని టి.జి. విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ సంయుక్తంగా నిర్మించారు. ఈ నెల 13న థియేటర్స్‌లలో విడుదలై సక్సెస్‌ఫుల్‌గా ప్రదర్శితమవుతున్న సందర్బంగా చిత్ర యూనిట్ సక్సెస్ మీట్‌ను హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించింది. ఈ కార్యక్రమంలో ప్రముఖ నిర్మాతలు అల్లు అరవింద్, దిల్ రాజు, డైరెక్టర్ శ్రీ వాసు, మైత్రి అధినేత నవీన్ ఏర్నేని తదితరులు పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా వచ్చిన నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ.. ''ఈ సినిమాను హిందీలో సరదాగా రిలీజ్ చేద్దామని 50 థియేటర్స్‌లలో విడుదల చేస్తే అది రెండో రోజుకు 200 థియేటర్స్ అయింది. ప్రస్తుతం 700 థియేటర్స్‌లలో ఆడుతుంది. అంటే ఇవాళ భాష అనే బారికేడ్లను దాటుకొని ప్రజల గుండెల్లోకి వెళ్లింది అంటే సినిమాలో సత్తా లేకుంటే అలా జరగదు కదా. ఇలా అన్ని థియేటర్స్‌లలో ఆడదు కదా. కాబట్టి ఈ సినిమా ఇంకా పెద్ద విజయం సాదించాలి'' అని తెలిపారు. మా సినిమాను ఇంత పెద్ద హిట్ చేసిన ప్రేక్షకులకు ధన్యవాదాలు. చందు మొండేటి చాలా హార్డ్ వర్క్ చేశాడు. నిఖిల్, అనుపమ, టెక్నీకల్ టీం అందరూ బాగా సపోర్ట్ చేయడంతో సినిమా బాగా వచ్చింది అని చిత్ర నిర్మాత విశ్వ ప్రసాద్ పేర్కొన్నారు. చదవండి: ప్రభాస్ విషయంలో ఆ నిర్మాత వెనుకడుగు.. కారణం అదేనా? మహేశ్ బాబు థియేటర్లో దళపతి విజయ్.. వీడియో వైరల్ ''ఈ సినిమా ఒక్క తెలుగులోనే కాకుండా హిందీలో కూడా బాగా ఆడుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మా సినిమాను ఇంత పెద్ద హిట్ చేసినందుకు ఆడియెన్స్‌కు కృతజ్ఞతలు'' అని హీరో నిఖిల్ తెలిపాడు. ''సినిమా చూస్తుంటే చాలా కొత్తగా ఉంది. అందరూ కొత్త యాక్టర్స్ లా చాలా బాగా నటించారు. వీరందరికీ ఇది 2.0 అనుకోవచ్చు. ఈ సినిమా ఇన్స్పిరేషన్ గా తీసుకొని ముందుకు వెళ్లాలని కోరుకుంటున్నాను'' అని దర్శకుడు శ్రీ వాస్ పేర్కొన్నాడు. ''మా చిత్ర నిర్మాతల సహకారం మరువలేనిది. నాకింత మంచి అవకాశం ఇచ్చిన నిర్మాతలకు ధన్యవాదాలు'' అని డైరెక్టర్ చందు మొండేటి తెలిపాడు. చదవండి: నేను పెళ్లి చేసుకునే సమయానికే ఆమెకు ఒక బాబు: బ్రహ్మాజీ సిల్క్ స్మిత బయోపిక్కు రానున్న సీక్వెల్.. ఈసారి ఏ హీరోయిన్? బిగ్‌బాస్ బ్యూటీకి లైంగిక వేధింపులు.. ఆవేదనతో పోస్ట్ -
ఓటీటీలోనూ రికార్డులు క్రియేట్ చేస్తున్న 'ఆర్ఆర్ఆర్'..
RRR Hindi Version Create Most Popular Indian Movie In Netflix Globally: జూనియర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ మల్టీస్టారర్‌గా జక్కన్న రూపొందించిన భారీ బడ్జెట్ చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. ఈ ఏడాది మార్చి 25న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా రికార్డు స్థాయిలో కలెక్షన్స్ రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా రూ. 1100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి రికార్డు సృష్టించింది. విజువల్ ఎఫెక్ట్స్, మ్యూజిక్, యాక్టింగ్.. ఇలా అన్ని కోణాల్లో తిరుగులేదు అనిపించింది ఈ మూవీ. థియేటర్లలో కాసుల వర్షం కురిపించిన ‘ఆర్ఆర్ఆర్’ ప్రస్తుతం ఓటీటీలోనూ దుమ్ములేపుతోంది. తమ ఓటీటీ ప్లాట్ఫామ్లో అత్యంత ప్రజాదరణ పొందిన భారతీయ చిత్రంగా ‘ఆర్ఆర్ఆర్’ రికార్డు కొట్టినట్లు నెట్‌ఫ్లిక్స్ ప్రకటించింది. తెలుగులో తెరకెక్కిన ఈ చిత్రం హిందీ డబ్బింగ్ వెర్షన్ ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే. నెట్‌ఫ్లిక్స్‌లో మే 20 నుంచి స్ట్రీమింగ్ అవుతున్న ఈ మూవీ ఇప్పటివరకు 45 మిలియన్ అవర్స్ స్ట్రీమింగ్ అయిందట. అలా నెట్‌ఫ్లిక్స్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన ఇండియన్ సినిమాగా రికార్డు క్రియేట్ చేసినట్లు నెట్‌ఫ్లిక్స్ తెలిపింది. అలాగే ఈ మూవీ మరో ఓటీటీ ప్లాట్‌ఫామ్ జీ5లో ఈ చిత్రం తెలుగు, కన్నడ, మలయాళం, తమిళ్ భాషల్లో స్ట్రీమింగ్ అవుతున్నాయి. చదవండి: 'పుష్ప 2'లో శ్రీవల్లి చనిపోతుందా ? నిర్మాత క్లారిటీ ! కమెడియన్ లైంగిక వేధింపులు.. 50 ఏళ్ల తర్వాత తీర్పు.. RRR is now the most popular Indian film on Netflix around the world 🕺🕺 Sending the biggest 🤝 to fans everywhere! pic.twitter.com/WEOw0nb515 — Netflix India (@NetflixIndia) June 23, 2022 -
‘ఆచార్య’ హిందీ వెర్షన్‌పై క్లారిటీ ఇచ్చిన రామ్ చరణ్
Ram Charan Clarifies On Acharya Hindi Version: రాధేశ్యామ్, ఆర్ఆర్ఆర్, కేజీయఫ్ చిత్రాల అనంతరం ప్రస్తుతం ప్రేక్షకులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున సినిమా ‘ఆచార్య’. మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్‌లు కలిసి నటిస్తున్న ఈ సినిమా విడుదల కోసం మెగా అభిమానులతో పాటు సౌత్ ప్రేక్షకులంతా ఆత్రుతుగా ఎదురుచూస్తున్నారు. ఎప్పుడో విడుదల కావాల్సిన ఈ మూవీ వాయిదాల అనంతదరం ఏప్రిల్ 29న థియేటర్లో రిలీజ్‌కు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో మూవీ టీం ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఇదిలా ఉంటే ఏప్రిల్ 29న ఆచార్య దక్షిణాది అన్ని భాషల్లోనూ విడుదల అవుతుంది. చదవండి: రాజమౌళి గురించి ఈ విషయం 12 ఏళ్ల క్రితమే చెప్పాను కానీ, హిందీలో మాత్రం విడుదల కావడం లేదు. ఈ నేపథ్యంలో ఆచార్య హిందీ వెర్షన్‌పై చరణ్ తాజాగా క్లారీటీ ఇచ్చాడు. రీసెంట్గా జరిగిన ఆచార్య మూవీ ప్రెస్మీట్లో చరణ్ మాట్లాడుతూ.. ‘ఆచార్య మూవీ షూటింగ్ మేం అనుకున్నదానికంటే ఎక్కువ ఆలస్యమైంది. అంతేకాదు నేను ఆచార్య, ఆర్ఆర్ఆర్ చిత్రాల్లో ఒకేసారి నటిస్తుండటంతో నాకు చాలా తక్కువ సమయం దొరికింది. దీనికి తోడు కరోనా లాక్డౌన్. అయితే మేం ఆచార్యను హిందీలో రిలీజ్ చేయాలని అనుకోలేదు. కానీ ఆర్ఆర్ఆర్ సినిమాకు అక్కడ వచ్చిన రెస్పాన్స్ చూసి ఆచార్యను కూడా హిందీలో రిలీజ్ చేయాలని అనుకున్నాం. చదవండి: దొంగతనం షురూ చేసిన బిగ్‌బాస్-5 విజేత సన్నీ కానీ హిందీలో రిలీజ్ చేయాలంటే డబ్బింగ్, పొస్ట్‌ప్రొడక్షన్ పనులకు చాలా సమయంలో పడుతుంది. ఇప్పుడు మా దగ్గర అంత టైం లేదు. అందుకే ఏప్రిల్ 29కి హిందీ వెర్షన్‌ను రెడీ చేయలేకపోయాం’ అని చెప్పుకొచ్చాడు. కానీ ఆచార్య సినిమాను ఖచ్చితంగా హిందీలో రిలీజ్ చేస్తామని, తన పాత్రకు తానే స్వయంగా హిందీ డబ్బింగ్ చెప్పుకుంటానని చరణ్ పేర్కొన్నాడు. కానీ దీనికి కాస్తా సమయం పడుతుందని, దక్షిణాది భాషల్లో విడదుల అనంతరం హిందీ వెర్షన్‌పై దృష్టి పెడతామని, త్వరలోనే నార్త్‌లో ఆచార్య మూవీని రిలీజ్ చేస్తామని రామ్ చరణ్ స్పష్టం చేశాడు. కాగా ఆచార్య మూవీకి చరణ్ నిర్మాతగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4251450496.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
విక్రమాదిత్య, ప్రేరణల ప్రేమకథను టూకీగా చెప్పిన అమితాబ్ బచ్చన్
Amitabh Bachchan Voice Over To Movie: విక్రమాదిత్య, ప్రేరణల ప్రేమకథ ఎలా ఉంటుందో అమితాబ్ బచ్చన్ టూకీగా చెప్పారు. విక్రమాదిత్య అంటే ప్రభాస్, ప్రేరణ అంటే పూజా హెగ్డే అనే విషయం ‘రాధేశ్యామ్’ సినిమా అప్డేట్స్ని ఫాలో అవుతున్నవారికి తెలిసే ఉంటుంది. ఈ సినిమాలో ఈ ఇద్దరూ చేసిన పాత్రల పేర్లివి. ప్రభాస్, పూజా హెగ్డే జంటగా రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో వంశీ, ప్రమోద్, ప్రసీద నిర్మించిన చిత్రం ‘రాధేశ్యామ్’. యూరప్ బ్యాక్‌డ్రాప్‌లో 1970ల్లో జరిగే ప్రేమకథతో రూపొందిన ఈ పాన్ ఇండియా మూవీ మార్చి 11న విడుదల కానుంది. చదవండి: Allu Arjun Expensive Things: వావ్.. అల్లు అర్జున్ కొత్త ఇల్లు అదిరిందిగా.. ఎన్ని కోట్లు పెట్టాడంటే.. ఈ నేపథ్యంలో హిందీ వెర్షన్‌కు అమితాబ్ బచ్చన్ వాయిస్ ఓవర్ ఇచ్చిన విషయాన్ని మంగళవారం చిత్రబృందం ప్రకటించింది. ‘‘బాలీవుడ్ లెజెండ్ అమితాబ్ బచ్చన్ నెరేషన్ ఈ సినిమాకి అదనపు ఆకర్షణ అవుతుంది. బిగ్ బీకి ధన్యవాదాలు’’ అని చిత్రబృందం పేర్కొంది. కృష్ణంరాజు, భాగ్యశ్రీ, సచిన్ ఖేడ్కర్ తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: జస్టిన్ ప్రభాకరన్ (తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం), మిథున్, అనూ మాలిక్, మనన్ భరద్వాజ్ (హిందీ), కెమెరా: మనోజ్ పరమహంస. Thank you Shahenshah @SrBachchan sir for the Hindi voiceover of #RadheShyam. #Prabhas @hegdepooja @director_radhaa @UV_Creations @TSeries @GopiKrishnaMvs @AAFilmsIndia @RadheShyamFilm #RadheShyamOnMarch11 pic.twitter.com/xrqZWGXoj1 — Radha Krishna Kumar (@director_radhaa) February 22, 2022 -
పుష్ప ఖాతాలో మరో రికార్డ్.. అక్కడ రూ. 100 కోట్ల కలెక్షన్లు
Pushpa Movie Hindi Version Earns 100 Crores In India: ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో వచ్చిన హ్యాట్రిక్ చిత్రం 'పుష్ప: ది రైజ్'. గతేడాది డిసెంబర్ 17న విడుదలైన ఈ చిత్రం భారీ హిట్ కొట్టింది. కరోనా సమయంలోనూ అత్యధిక కలెక్షన్లతో దూసుకపోయింది. ఈ సినిమా ఇప్పటి వరకు రూ. 300 కోట్లు రాబట్టిందని చిత్ర యూనిట్ ప్రకటించింది. 2021లో ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ గ్రాసర్ గా నిలవడం మాత్రమే కాదు బన్ని కెరీర్ లో తొలిసారి రూ. 300 కోట్ల క్లబ్ లోకి ఎంట్రీ ఇచ్చిన మూవీగా రికార్డుల్లోకి ఎక్కింది పుష్ప. అయితే తాజాగా పుష్ప మరో రికార్డును సొంతం చేసుకుంది. హిందీలో ఈ మూవీ రూ. 100 కోట్లు కలెక్షన్లు రాబట్టి రికార్డు సృష్టించింది. సినిమాకు ముందు నుంచే భారీ హైప్ రావడం అందుకు తగినట్లు సుకుమార్ టేకింగ్, బన్నీ, రష్మిక మందన్నా, సమంత స్పెషల్ సాంగ్ ప్రతీ ఒక్కరూ మూవీ విజయం సాధించేలా చేశాయి. అలాగే పుష్ప సాంగ్స్, డైలాగ్స్, మ్యానరిజంపై వచ్చిన రీల్స్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో సినిమా మరింత పాపులర్ అయింది. ఓటీటీలో విడుదలైన తర్వాత కూడా థియేటర్లలో మంచి స్పందన రావడం ఈ చిత్రానికే చూశానని ప్రముఖ బాలీవుడ్ క్రిటిక్ తరుణ్ ఆదర్శ్ ఇటీవల ట్వీట్ చేశారంటే పుష్ప ఎంతలా ఆకట్టుకుంటుందో అర్థమవుతుంది. మొన్నటి వరకూ తెలుగు, మలయాళంలో అభిమానులు ఉన్న బన్నీకి పుష్పతో నార్త్‌లో కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. -
అల్లు అరవింద్‌కు రూ. 40 కోట్లు నష్టం !.. బన్నీ సినిమా హిందీ వెర్షన్ లేనట్లేనా ?
ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన 'అల వైకుంఠపురములో' సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి హిట్ కొట్టింది. బన్నీ స్టైలిష్ యాక్షన్, త్రివిక్రమ్ మ్యాజికల్ డైలాగ్స్ ప్రేక్షకులను కట్టిపడేశాయి. ఇటీవల విడుదలైన అల్లు అర్జున్ మాస్ పెర్ఫామెన్స్ చిత్రం 'పుష్ప' హిట్‌తో 'అల వైకుంఠపురములో' మూవీని కూడా హిందీలో విడుదల చేయాలనుకున్న సంగతి తెలిసిందే. ఇందుకు హిందీలో డబ్బింగ్ కూడా చేశారు. అయితే ప్రస్తుతం ఈ డబ్బింగ్ వెర్షన్‌ను థియేటర్లలో రిలీజ్ చేయడాన్ని ఆపేశారు. ఈ సినిమాను హిందీలో 'షెహజాదే' పేరుతో రీమేక్ చేస్తున్నారు. దీంతో రీమేక్ నిర్మాతలకు, డబ్బింగ్ నిర్మాతలకు మధ్య అభిప్రాయ బేధాలు కుదరకపోవడంతో సినిమా విడుదలను మానుకున్నట్లు తెలుస్తోంది. ఇందుకు కారణం 'అల వైకుంఠపురములో' సినిమా హిందీ రీమేక్‌లో హీరోగా నటిస్తున్న కార్తీక్ ఆర్యన్ అని డబ్బింగ్ రైట్స్ దక్కించుకున్న గోల్డ్‌మైన్స్ మనీష్ షా ఆరోపిస్తున్నారు. ఈ హిందీ డబ్బింగ్ వెర్షన్‌ను థియేటర్లలో రిలీజ్ చేస్తే తాను నటిస్తున్న 'షెహజాదే' చిత్రాన్ని చేయకుండా మధ్యలోనే మానేస్తానని హీరో కార్తీక్ ఆర్యన్ నిర్మాతలకు చెప్పాడట. అయితే 'షెహజాదే' నిర్మాతల్లో అల్లు అరవింద్ కూడా ఒకరు. ఇప్పటివరకూ 'షెహజాదే' చిత్రీకరణకు అయిన ఖర్చు రూ. 40 కోట్లు అని తెలుస్తోంది. 'అల వైకుంఠపురములో' హిందీ డబ్బింగ్ కోసం రూ. 2 కోట్లు ఖర్చు పెట్టారని సమాచారం. ఈ సినిమాను విడుదల చేస్తే తనకు రూ. 20 కోట్లు ప్రాఫిట్ వచ్చేదని, కానీ తనకు తెలిసిన నిర్మాతలకు నష్టం రాకూడదనే ఈ రిలీజ్ ప్రయత్నాన్ని విరమించుకున్నాని మనీష్ షా పేర్కొన్నారు. అలాగే ఇది కార్తీక్ ఆర్యన్ కోసం కాదు, అల్లు అరవింద్ కోసం చేస్తున్నాని, షెహజాదే నిర్మాతలు రూ. 40 కోట్లు నష్టపోవడం తనకు ఇష్టం లేదని తెలిపారు. 'అల వైకుంఠపురములో' హిందీ డబ్బింగ్ వెర్షన్‌ను కేవలం 'దించాక్' టీవీ ఛానెల్లో మాత్రమే రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. -
‘అఆ’.. 200 మిలియన్ వ్యూసా!!
యంగ్ హీరో నితిన్, సమంత జంటగా తెరపై కనువిందు చేసిన చిత్రం ‘అఆ’. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ఈ కుటంబ కథా చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ప్రేమ, కుటుంబ విలువలు.. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూనే తన దైన కామెడీ టైమింగ్‌ను జోడించారు త్రివిక్రమ్. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ చిత్రం నిత్యం ఏదో ఒక ఘనతను తన ఖాతాలో వేసుకుంటోంది. ‘ఆఆ’ చిత్రం హిందీ వర్షన్లో అనేక రికార్డులను కొల్లగొడుతోంది. ఇప్పటికే వన్ మిలియన్ లైక్స్‌ను సొంతం చేసుకున్న ఈ చిత్రం మరో మైలురాయిని అందుకుంది. తాజాగా హిందీ వర్షన్లో వచ్చిన ‘ఆఆ’ చిత్రానికి యూట్యూబ్‌లో 200 మిలియన్ వ్యూస్ రావడం విశేషం. ఈ విషయాన్ని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఉత్తరాది ప్రేక్షకులు ఈ చిత్రాన్ని భారీగా ఆదరిస్తుండటం పట్ల హీరో నితిన్ ఆనందం వ్యక్తం చేశాడు. అంతేకాకుండా మీ ప్రేమకు ధన్యవాదాలు అంటూ ట్వీట్ చేశాడు ఇక టాలీవుడ్లో అంతగా ఆకట్టుకొని నితిన్ చిత్రాలు సైతం హిందీ వర్షన్లో భారీ హిట్టవుతున్నాయి. తాజాగా అఆ, చల్ మోహన్ రంగ, శ్రీనివాస కళ్యాణం హిందీ డబ్ వర్షన్‌కు యూట్యూబ్‌లో ఓవరాల్‌గా 400 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చినట్లు ఆదిత్య మ్యూజిక్ అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. సౌత్ ఇండియాలోనే అగ్రగామి మ్యూజిక్ కంపెనీగా కొనసాగుతున్న ఆదిత్య మ్యూజిక్ వారు నిర్వహిస్తున్న ఆదిత్య మూవీస్ విభాగానికి సంబంధించిన యూట్యూబ్ ఛానల్లో ఈ సినిమాను అప్లోడ్ చేశారు. వివద తెలుగు హీరోల హిందీ డబ్బింగ్ సినిమాలను ఆదిత్య మూవీస్ యూట్యూబ్‌లో విడుదల చేస్తోంది. అయితే ఈ మధ్య కాలంలో టాలీవుడ్ హీరోల హిందీ డబ్బింగ్ సినిమాలకు భారీగా వ్యూస్ వస్తున్నాయని సంస్థ ప్రతినిధులు పేర్కొంటున్నారు. Thankuu all for the love ❤️❤️#Trivikramsir @Samanthaprabhu2 @vamsi84 @haarikahassine https://t.co/8voFd4pO4L — nithiin (@actor_nithiin) June 12, 2020 -
మరో రికార్డు క్రియేట్ చేసిన ‘అఆ’
యంగ్ హీరో నితిన్, సమంత జంటగా తెరపై కనిపించిన చిత్రం ‘అఆ’. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది. పూర్తి కుటుంబకథా చిత్రంగా తెరకెక్కిన ‘అఆ’తో నితిన్ ఖాతాలో భారీ హిట్ పడింది. ఇక త్రివిక్రమ్ స్టైల్లో మాటలు, విలువలు అందరినీ ఆకట్టుకుంటాయి. పాటలు కూడా సూపర్బ్‌గా ఉంటాయి. ఇక ఈ చిత్రం మరో మైలురాయిని అందుకుంది. ఈ సినిమా హిందీ వర్షన్లో రికార్డులు కొల్లగొడుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ చిత్రానికి యూట్యూబ్‌లో మిలియన్స్ లైక్స్ వచ్చాయి. అంతేకాకుండా ఈ చిత్రాన్ని హిందీ వర్షన్లో దాదాపు 20 కోట్ల మంది వీక్షించడం మరో విశేషం. ఇక వరుస విజయాలతో జోరుమీదున్న నితిన్‌కు ఉత్తరాదిన మంచి మార్కెట్ సెట్ చేసుకుంటున్నారు. సినిమాలను డైరెక్ట్‌గా హిందీలో రిలీజ్ చేయకపోయినా తెలుగులో రిలీజ్ అయిన కొద్ది రోజులకు డబ్బింగ్ చేసి యూట్యూబ్‌లో విడుదల చేస్తున్నారు. ఇక టాలీవుడ్లో అంతగా ఆకట్టుకొని నితిన్ చిత్రాలు సైతం హిందీ వర్షన్లో భారీ హిట్టవుతున్నాయి. తాజాగా అఆ, చల్ మోహన్ రంగ, శ్రీనివాస కళ్యాణం హిందీ డబ్ వర్షన్‌కు యూట్యూబ్‌లో ఓవరాల్‌గా 400 మిలియన్ల వ్యూస్ వచ్చినట్లు ఆదిత్య మ్యూజిక్ అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. చదవండి: ఈశ్వర్, అల్లా, జీసస్‌లపై ఒట్టు: వర్మ సెన్సార్ పూర్తి.. సస్పెన్స్ అలానే ఉంది! var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1151264010.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
బిగ్‌బాస్ : సల్మాన్‌కు కళ్లు చెదిరే రెమ్యూనరేషన్..
ముంబై : వివాదాస్పద విషయాలతో ప్రాచుర్యం పొందే హిందీ బిగ్‌బాస్ సీజన్ 13 మరోసారి వార్తల్లో నానుతోంది. ఈ షోను హోస్ట్ చేస్తున్న కింగ్ ఖాన్ సల్మాన్ పారితోషికం హాట్‌టాపిక్‌గా మారింది. ఈ ఏడాది డిసెంబర్‌తో ముగియాల్సిన బిగ్‌బాస్ 13ను మరో ఐదు వారాలు పొడిగించారు. బిగ్‌బాస్‌ను షెడ్యూల్ ప్రకారం ముగించి రాధే సెట్స్‌పై అడుగుపెట్టాలని ప్లాన్ చేసుకున్న బాలీవుడ్ కండలవీరుడు తాను షోలో పాల్గొనలేనని తేల్చిచెప్పారు. అయితే పొడిగించిన అయిదు వారాలకు భారీ పారితోషికాన్ని ఆఫర్ చేయడంతో సల్మాన్ మెత్తబడినట్టు సమాచారం. షోను అయిదు వారాల పాటు పొడిగించడంతో ఈ ఎపిసోడ్స్ వరకూ రూ 2 కోట్టు సల్మాన్‌కు ముట్టచెప్పేందుకు నిర్వాహకులు ముందుకొచ్చారు. దబంగ్ 2 పోస్ట్ ప్రొడక్షన్ పనులు, రాధే షూటింగ్ వంటి కమిట్మెంట్స్తో బిగ్‌బాస్ ఎక్స్టెన్షన్లో పాల్గొనలేనని సల్మాన్ చెప్పినా నిర్వాహకులు ఊరించే పారితోషికంతో ఆయనను షోలో ఎంగేజ్ చేశారు. ప్రతి సీజన్లోనూ సల్మాన్ రెమ్యూనరేషన్‌ను విపరీతంగా పెంచేస్తుడటంతోనే సల్మాన్ బిగ్‌బాస్‌ను హోస్ట్ చేసేందుకు అంగీకరిస్తున్నారు. ప్రాంతీయ భాషల్లో బిగ్‌బాస్ హోస్ట్‌ల కంటే అధిక మొత్తంలో బాలీవుడ్ కండలవీరుడు ఈ షో నుంచి రాబడుతున్నారు. రెమ్యూనరేషన్‌ను భారీ రేంజ్లో ముట్ట చెప్పడంతో షో నిర్వాహకులు ఇక ఈ షోకు హై రేటింగ్స్ సాధించే పనిలో పడ్డారు. -
మాటా.. పాటా
అన్నా, ఎల్సా అనే అక్కాచెల్లెళ్ళ కథాంశంతో తెరకెక్కిన హాలీవుడ్ యానిమేషన్ మూవీ ‘ఫ్రోజెన్ 2’. ఈ చిత్రాన్ని ఇంగ్లీష్‌తో పాటు ఆయా ప్రాంతీయ భాషల్లో కూడా విడుదల చేస్తున్నారు డిస్నీ సంస్థ ప్రతినిధులు. ‘ఫ్రోజెన్ 2’ హిందీ వెర్షన్‌కు ప్రియాంకా చోప్రా, పరిణీతి చోప్రాలు డబ్బింగ్ చెప్పారు. తెలుగులో నిత్యామీనన్ ఈ పనిని పూర్తి చేయగా, తమిళ వెర్షన్లో ఎల్సా పాత్రకు హీరోయిన్ శ్రుతీహాసన్ డబ్బింగ్ చెప్పారు. అంతేకాదు స్వతహాగానే గాయని, సంగీత దర్శకురాలైన శ్రుతీ ‘ఫ్రోజెన్ 2’ తమిళ వెర్షన్ కోసం మూడు పాటలు కూడా ఆలపించారు. ఈ విషయం గురించి శ్రుతీహాసన్ మాట్లాడుతూ– ‘‘అన్నా, ఎల్సాల మధ్య ఉండే అనుబంధం నన్ను ఎంతగానో ఆకట్టుకుంది. ఎల్సా పాత్రకు డబ్బింగ్ చెప్పాను. అన్నా, ఎల్సాల అనుబంధం నా చెల్లి అక్షరాహాసన్‌కు, నాకు ఉన్న అనుబంధంలా అనిపించింది. ఎల్సా పాత్ర ప్రతి అమ్మాయికి రోల్ మోడల్లా ఉంటుంది’’ అని అన్నారు శ్రుతి. ‘ఫ్రోజెన్ 2’ చిత్రం ఈ నెల 22న విడుదల కానుంది. -
నిర్ణయం నాదే
వరుస అవకాశాలతో బాలీవుడ్లో ఫుల్ బిజీగా ఉంటున్నారు హీరోయిన్ తాప్సీ. అయినప్పటికీ ఏడాదికి సౌత్‌లో కనీసం ఒక్క సినిమా అయినా చేస్తున్నారు. ఇటీవల ఆమె నటించిన ‘గేమ్ ఓవర్’ చిత్రం నటిగా మరింత పేరు తెచ్చిపెట్టింది. ఆమె క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకుని ఈ సినిమా హిందీ వెర్షన్‌ని కూడా రిలీజ్ చేశారు. సౌత్‌లో సినిమాలు చేయడం గురించి తాప్సీ మాట్లాడుతూ –‘‘ప్రస్తుతం హిందీ సినిమాలతో కాస్త బిజీగా ఉన్నా ఏడాదికి సౌత్‌లో ఓ చిత్రంలో నటించేలా ప్లాన్ చేసుకుంటున్నాను. మొదట్లో ‘ఓ పెద్ద హీరో డేట్స్ మా దగ్గర ఉన్నాయి.. మీ టు మంత్స్ డేట్స్ మాకు కావాలి’ అని నిర్మాతలు అడిగేవారు. కానీ, హిందీ సినిమాల కోసం ఆరు నెలల ముందే నా డేట్స్ బుక్కైపోయి ఉంటాయి. కానీ, ఇప్పుడు నేను నటిస్తున్న సౌత్ సినిమాల్లో నేనే ప్రధానపాత్రధారిగా ఉంటున్నాను. స్క్రిప్ట్ నచ్చితే నా నిర్ణయం ప్రకారం డేట్స్‌ని బట్టి సినిమాలు ప్లాన్ చేసుకుంటున్నాను’’ అని తాప్సీ అన్నారు. -
పంద్రాగస్టుకి బాక్సాఫీస్ పోటీ!
వచ్చే పంద్రాగస్టుకి బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ప్రభాస్, జాన్ అబ్రహాం, అక్షయ్ కుమార్, రాజ్‌కుమార్ రావ్ పోటీ పడనున్నారు. ‘బాహుబలి’ సినిమా తర్వాత ప్రభాస్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద 500 కోట్లు కలెక్ట్ చేసిన హిందీ చిత్రాల జాబితాలో ‘బాహుబలి 2’ హిందీ వెర్షన్ టాప్ ఫైవ్‌లో ఉంటుంది. విడుదలైన అన్ని భాషల్లోనూ ‘బాహుబలి’ తన స్టామినా నిరూపించుకుంది. ఆ విధంగా ప్రభాస్ మార్కెట్ ఇతర భాషల్లోనూ పెద్దదైంది. అందుకే ‘బాహుబలి’ తర్వాత ప్రభాస్ చేస్తున్న ‘సాహో’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇందులో శ్రద్ధాకపూర్ కథానాయికగా నటిస్తున్నారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఏక కాలంలో రూపొందుతోన్న ఈ సినిమాను వంశీ, ప్రమోద్‌లు నిర్మిస్తున్నారు. బీ టౌన్లో ప్రొడ్యూసర్ భూషణ్ కుమార్ రిలీజ్ చేయనున్నారు. ‘సాహో’ చిత్రాన్ని వచ్చే ఆగస్టు 15న రిలీజ్ చేయనున్నట్లు చిత్రబృందం ఇటీవల అధికారికంగా ప్రకటించింది. ఈ సినిమా విడుదలయ్యే సమయానికి మరో మూడు హిందీ సినిమాలు రిలీజ్‌కి రెడీ అవుతున్నాయి. దీంతో ఈ సినిమాల రిలీజ్‌ల గురించి బాలీవుడ్లో జోరుగా చర్చ మొదలైంది. అవి ‘మిషన్ మంగళ్’, ‘బాల్తా హౌస్’. ‘మేడ్ ఇన్ చైనా’. అక్షయ్ కుమార్, విద్యాబాలన్, తాప్సీ, నిత్యామీనన్, సోనాక్షీ సిన్హా ముఖ్య తారలుగా తెరకెక్కుతున్న చిత్రం ‘మిషన్ మంగళ్’. జగన్ శక్తి ఈ సినిమా ద్వారా దర్శకునిగా పరిచయం కానున్నారు. ఇస్రో (ఇండియన్ స్పెస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్) మార్స్ మిషన్‌లో కీలక పాత్ర పోషించిన మహిళా శాస్త్రవేత్తల కృషి ఆధారంగా ఈ సినిమా రూపొందుతోంది. ఇక ‘బాల్తా హౌస్’ గురించి చెప్పాలంటే.. దాదాపు పదేళ్ల క్రితం ఢిల్లీలో జరిగిన ఆపరేషన్ బాల్తా హౌస్ ఇన్సిడెంట్ ఆధారంగా నిఖిల్ అద్వానీ దర్శకత్వంలో జాన్ అబ్రహాం హీరోగా రూపొందుతున్న సినిమా ఇది. రాజ్‌కుమార్ రావ్ హీరోగా మిఖిల్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా ‘మేడ్ ఇన్ చైనా’. చైనా ప్రాడెక్ట్స్ గురించి ఈ సినిమా ఉంటుందని భోగట్టా. ఈ మూడు సినిమాలనూ వచ్చే ఏడాది ఆగస్టు 15న విడుదల చేయనున్నట్లు ఆయా చిత్రబృందాలు వెల్లడించాయి. ఇప్పుడు ‘సాహో’ కూడా సీన్లోకొచ్చింది. ఒకేరోజు నాలుగు సినిమాలంటే బాక్సాఫీస్ కలెక్షన్స్ షేర్ అయ్యే అవకాశం ఉంది. అయితే వచ్చే ఏడాది ఇండిపెండెన్స్ డే గురువారం వచ్చింది. ఆ రోజు పబ్లిక్ హాలీడే. నెక్ట్స్ వీకెండ్ స్టారై్టపోయింది. గురు, శుక్ర, శని, ఆదివారం.. వరుసగా నాలుగు రోజులు వసూళ్లు రాబట్టే అవకాశం ఉంది కాబట్టి, నాలుగు చిత్రాల నిర్మాతలూ తమ సినిమాని రిలీజ్ చేసే విషయంలో వెనక్కి తగ్గే అవకాశం లేకపోవచ్చు. మరి.. వచ్చే పంద్రాగస్టుకి ఏ సినిమా నిర్మాత ఆలోచన అయినా మారుతుందా? వెయిట్ అండ్ సీ. గతేడాది అక్షయ్ కుమార్ హీరోగా నటించిన ‘టాయ్‌లెట్: ఏక్ ప్రేమ్ కథ’, ఈ ఏడాది ఆయన నటించిన ‘గోల్డ్’ సినిమాలు ఆగస్టు 15న విడుదలై మంచి వసూళ్లను రాబట్టాయి. ఇదే సెంటిమెంట్‌తో అక్షయ్ కుమార్ ‘మిషన మంగళ్’ చిత్రాన్ని వచ్చే ఏడాది పంద్రాగస్టుకు రిలీజ్ చేయాలనుకుంటున్నారని బాలీవుడ్ సమాచారం. సేమ్ జాన్ అబ్రహాం ఈ ఏడాది హీరోగా నటించిన ‘సత్యమేవ జయతే’ ఆగస్టు 15న విడుదౖలై మంచి కలెక్షన్స్‌ను రాబట్టింది. అందుకే ‘బాల్తా హౌస్’ చిత్రాన్ని కూడా సేమ్ రిలీజ్‌కు అబ్రహాం రెడీ చేశారని బాలీవుడ్ టాక్. ‘సత్యమేవ జయతే, బాల్తా హౌస్’ రెండు చిత్రాల్లో జాన్ అబ్రహాంది పోలీస్ క్యారెక్టర్‌నే కావడం విశేషం. ప్రభాస్, జాన్ అబ్రహాం, అక్షయ్ కుమార్, రాజ్‌కుమార్ రావ్. వీళ్లందరీ కంటే వచ్చే ఏడాది పంద్రాగస్టు రిలీజ్ డేట్‌ను ఫస్ట్ ఫిక్స్ చేసుకుంది హీరో రణ్‌బీర్ కపూర్. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో అమితాబ్ బచ్చన్, రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్ ముఖ్య తారలుగా రూపొందుతున్న సినిమా ‘బ్రహ్మాస్త్ర’. కరణ్ జోహార్ నిర్మాత. మూడు పార్ట్స్‌గా రానున్న ఈ సినిమా తొలి పార్ట్‌ను ఆగస్టు 15కు రిలీజ్ చేద్దాం అనుకున్నారు. కానీ పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పెండింగ్‌లో ఉండటంతో వచ్చే ఏడాది తొలి పార్ట్‌ను క్రిస్మస్కు వాయిదా వేశారు ‘బ్రహ్మాస్త్ర’ టీమ్. ఈ సినిమాలో నాగార్జున, డింపుల్ కపాడియా కూడా కీలక పాత్రలు చేస్తున్న సంగతి తెలిసిందే. జాన్ అబ్రహాం రాజ్‌కుమార్, మౌనీ ‘మిషన్ మంగళ్’ టీమ్ ‘బ్రహ్మాస్త్ర’ టీమ్ -
నార్త్‌ను సైతం షేక్ చేస్తున్న బన్నీ!
స్టైలిష్ స్టార్ హీరో అల్లు అర్జున్‌కు సౌత్‌లోనే కాదు నార్త్‌లోనూ అభిమానులు ఉన్నారు. స్ట్రయిట్‌గా తెలుగు సినిమాలే చేస్తున్నప్పటికీ, తన స్టైలిష్ లుక్‌తో, డ్యాన్సులతో దేశవ్యాప్తంగా అభిమానులు సంపాదించుకున్నాడు బన్నీ. తాజాగా ఉత్తరాదిలో బన్నీ అభిమానుల బలం పెరుగుతున్నట్టు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే బన్నీ తాజా చిత్రం ’దువ్వాడ జగన్నాథం’ సినిమా హిందీ డబ్బింగ్ హక్కులు రికార్డుస్థాయి ధరకు అమ్ముడుపోయాయి. టాలీవుడ్ సినిమాల డబ్బింగ్‌కు ఇంత ధర పలుకడం ఎప్పడూ లేదని అంటున్నారు. ఇక విషయానికొస్తే.. బన్నీ సూపర్ హిట్ చిత్రం ‘సరైనోడు’ హిందీ డబ్బింగ్ వెర్షన్ ఉత్తరాదిలో ప్రకంపనలు రేపుతోంది. ఓ పాపులర్ వీడియో షేరింగ్ షైట్లో విడుదల చేసిన ఈ సినిమాకు తక్కువ సమయంలోనే 64లక్షలకుపైగా హిట్స్ వచ్చాయి. తాజా జోరు చూస్తుంటే ఉత్తరాదిలో బాగా పాపులర్ అయిన సౌతిండియన్ స్టార్‌గా బన్నీ నిలిచాడంటే అతిశయోక్తి కాదంటున్నారు. -
ఖర్చు నబ్బే కరోడ్... ఫాయిదా 285.35 కోట్లు!
-
ఖర్చు నబ్బే కరోడ్... ఫాయిదా 285.35 కోట్లు!
‘బాహుబలి–2’ హిందీ వెర్షన్ లెక్కల చిట్టా ఇది. థియేటర్లలో సినిమా ఇంకా బాగా ఆడుతోంది కనుక లాభం మరింత పెరిగే అవకాశముంది. ‘బాహుబలి–2’ హిందీ థియేట్రికల్ రైట్స్‌ను రూ. 80కోట్లకు సొంతం చేసుకున్న కరణ్ జోహార్ పబ్లిసిటీకి ఓ 10 కోట్లు ఖర్చుపెట్టారట! మొత్తం ఖర్చు నబ్బే (90) కరోడ్. ఇప్పటివరకు ఇండియాలో ఈ సినిమా హిందీ వెర్షన్ రూ. 375.35 కోట్లు కలెక్ట్ చేసింది. అంటే నిర్మాతకు రూ. 285.35కోట్లు ఫాయిదా (లాభం). ఇంకో ఫాయిదా ఏంటంటే.. పన్నెండు కోట్లు కలెక్ట్ చేస్తే ఆమిర్‌ఖాన్ ‘దంగల్’ ఇండియా (రూ. 387.38 కోట్లు) రికార్డును బీట్ చేసేస్తుంది. 12 కోట్లు ఏంటి? 25 కోట్లు కలెక్ట్ చేసి రూ. 400 కోట్లు కలెక్ట్ చేసిన సినిమా (హిందీ నెట్)గా ‘బాహుబలి–2’ రికార్డు సృష్టిస్తుందని ట్రేడ్ పండితుల అంచనా. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో వరల్డ్ వైడ్‌గా వెయ్యి కోట్లు కలెక్ట్ చేసిన ఈ సినిమా తమిళ నాడులో వంద కోట్ల దిశగా దూసుకెళ్తోంది. -
జోడీ కుదరలేదు
ప్రభుదేవా, తమన్నా మరో సినిమా చేస్తు్తన్నారు. గతేడాది వచ్చిన హారర్ కామెడీ ‘అభినేత్రి’లో వీళ్లిద్దరూ జంటగా నటించిన విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే... ఈసారి జోడీ కుదరలేదు. ఆశ్చర్యంగా ఉందా? మరేం లేదు. ఇందులో ప్రభుదేవా విలన్‌గా నటిస్తున్నారు. మరి, హీరో ఎవరంటే.. ఎవరూ లేరు. లేడీ ఓరియెంటెడ్ ఫిల్మ్ కదా, తమన్నాదే మెయిన్ క్యారెక్టర్. సో.. తనే హీరో కింద లెక్క. తమిళంలో నయనతార నటిస్తున్న ‘కొలైవుదిర్ కాలమ్’ సినిమా హిందీ రీమేక్‌లోనే ప్రభుదేవా–తమన్నా నటించనున్నారు. చక్రి తోలేటి దర్శకత్వం వహిస్తున్న ‘కొలైవుదిర్...’ ఇంకా విడుదల కాలేదు. కానీ, హిందీలో రీమేక్ చేయాలనే ఆలోచనతో దర్శక–నిర్మాతలు ప్రభుదేవా, తమన్నాలకు కథ వినిపించగా... గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. ఆల్రెడీ లండన్‌లో షూటింగ్ ప్రారంభమైంది. హిందీ వెర్షన్‌కూ చక్రి తోలేటియే దర్శకత్వం వహిస్తున్నారు. నయనతార పాత్రను హిందీలో తమన్నా చేస్తున్నారు. సంగీత దర్శకుడు యువన్‌శంకర్ రాజాతో కలసి ‘కొలైవుదిర్ కాలమ్’ను నిర్మిస్తున్న వశూ భగ్నానీయే హిందీ చిత్రానికి కూడా నిర్మాత. ‘‘ఫస్ట్ టైమ్ నేను విలన్‌గా నటిస్తున్నాను. ఇప్పటివరకూ నేను చేసిన పాత్రలకు విభిన్నంగా ఉంటుంది. ఎవరూ ఊహించని పాత్రలో కనిపిస్తా’’ అన్నారు ప్రభుదేవా. సీనియర్ హీరోయిన్ భూమిక చావ్లా కూడా హిందీ వెర్షన్లో ముఖ్యమైన పాత్ర చేస్తున్నారు. ఇది కాకుండా... తమిళ దర్శకుడు శీను రామసామి.. ప్రభుదేవా, తమన్నా జంటగా ఓ సినిమా తీయాలనుకుంటున్నట్టు వార్తలొచ్చాయి. మరి, ఆ సినిమా ఏమైందో? -
బాలీవుడ్లో బాహుబలి రికార్డు
మొన్నటి వరకు 100 కోట్లు రూపాయల బిజినెస్ చేసే తెలుగు సినిమా కోసం అందరూ ఎదురు చూశారు. అలాంటిది ఓ తెలుగు చిత్రం వేరే భాషలోకి డబ్ అయి 100 కోట్ల రూపాయలు వసూలు చేస్తుందని కలలో కూడా ఊహించి ఉండరు. రాజమౌళి దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన బాహుబలి చిత్రం ఈ అరుదైన రికార్డు సృష్టించింది. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, హిందీ భాషల్లో విడుదలైన బాహుబలి.. బాలీవుడ్లో కనక వర్షం కురిపిస్తోంది. బాహుబలి హిందీ వర్సెన్ వంద కోట్లకుపైగా వసూళ్లు సాధించింది. ప్రముఖ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ ఈ విషయాన్ని ట్విటర్లో తెలియజేశారు. బాలీవుడ్లో ఈ చిత్రం నాలుగో వారం కూడా విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. నాలుగోవారం కలెక్షన్లు.. సోమవారం 1.20 కోట్లు, మంగళవారం 1.10 కోట్లు, బుధవారం కోటి, గురువారం 1.10 కోట్లు రాబట్టినట్టు ట్వీట్ చేశారు. మొత్తమ్మీద 107.86 కోట్లు వసూళ్లతో ఆల్ టైం బ్లాక్ బస్టర్‌గా నిలిచిందని తరణ్ చెప్పారు. ఇప్పటికే బాహుబలి ప్రపంచ వ్యాప్తంగా 500 కోట్లకు పైగా వసూలు చేసింది. దక్షిణాది భాషల్లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా బాహుబలి చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. #Baahubali [dubbed Hindi version; Week 4] Mon 1.20 cr, Tue 1.10 cr, Wed 1 cr, Thu 1.10 cr. Total: ₹ 107.86 cr. ALL TIME BLOCKBUSTER. — taran adarsh (@taran_adarsh) August 7, 2015