మాటా.. పాటా | Shruti Haasan to lend her voice for Tamil version of Frozen 2 | Sakshi
Sakshi News home page

మాటా.. పాటా

Published Sat, Nov 9 2019 3:36 AM | Last Updated on Sat, Nov 9 2019 3:36 AM

Shruti Haasan to lend her voice for Tamil version of Frozen 2 - Sakshi

అన్నా, ఎల్సా అనే అక్కాచెల్లెళ్ళ కథాంశంతో తెరకెక్కిన హాలీవుడ్‌ యానిమేషన్‌ మూవీ ‘ఫ్రోజెన్‌ 2’. ఈ చిత్రాన్ని ఇంగ్లీష్‌తో పాటు ఆయా ప్రాంతీయ భాషల్లో కూడా విడుదల చేస్తున్నారు డిస్నీ సంస్థ ప్రతినిధులు. ‘ఫ్రోజెన్‌ 2’ హిందీ వెర్షన్‌కు ప్రియాంకా చోప్రా, పరిణీతి చోప్రాలు డబ్బింగ్‌ చెప్పారు. తెలుగులో నిత్యామీనన్‌ ఈ పనిని పూర్తి చేయగా, తమిళ వెర్షన్‌లో ఎల్సా పాత్రకు హీరోయిన్‌ శ్రుతీహాసన్‌ డబ్బింగ్‌ చెప్పారు.

అంతేకాదు స్వతహాగానే గాయని, సంగీత దర్శకురాలైన శ్రుతీ ‘ఫ్రోజెన్‌ 2’ తమిళ వెర్షన్‌ కోసం మూడు పాటలు కూడా ఆలపించారు. ఈ విషయం గురించి శ్రుతీహాసన్‌ మాట్లాడుతూ–  ‘‘అన్నా, ఎల్సాల మధ్య ఉండే అనుబంధం నన్ను ఎంతగానో ఆకట్టుకుంది. ఎల్సా పాత్రకు డబ్బింగ్‌ చెప్పాను. అన్నా, ఎల్సాల అనుబంధం నా చెల్లి అక్షరాహాసన్‌కు, నాకు ఉన్న అనుబంధంలా అనిపించింది. ఎల్సా పాత్ర ప్రతి అమ్మాయికి రోల్‌ మోడల్‌లా ఉంటుంది’’ అని అన్నారు శ్రుతి. ‘ఫ్రోజెన్‌ 2’ చిత్రం ఈ నెల 22న విడుదల కానుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement