Frozen 2
-
చిన్న రాణిలా ఒదిగిపోయిన సితూ పాప
సాక్షి, హైదరాబాద్: త్వరలో తెలుగులో విడుదల కానున్న ‘ఫ్రోజెన్ -2’ సినిమాలోని బేబీ ఎల్సా పాత్రకు టాలీవుడ్ హీరో ప్రిన్స్ మహేష్ బాబు ముద్దుల తనయ బేబి సితార డబ్బింగ్ చెబుతున్న సంగతి తెలిసిందే. ఎల్సా చిన్నప్పటి పాత్రలో సితార ఒదిగిపోయిందట. నిజంగా తన వాయిస్‌తో క్వీన్ ఎల్సాకు ప్రతిరూపంగా నిలిచిందంటూ మహేష బాబు ట్వీట్ చేశారు. చాలా నమ్మకంగా, మ్యాజికల్‌గా, స్వచ్ఛంగా ఆ పాత్రకు తన వాయిస్ అందించిందంటూ సోషల్ మీడియా వేదికగా ఆయన తన ముద్దుల కూతురు ప్రతిభపై పొంగిపోతున్నారు. ‘సితూ పాపా నిన్నుచూస్తుంటే చాలా గర్వంగా ఉంది. నవంబర్ 22 కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నాను' అంటూ మహేశ్ ట్వీట్ చేశారు. కాగా హాలీవుడ్ పాపులర్ చిత్రం 'ఫ్రోజన్'. దీనికి సీక్వెల్‌గా తెరకెక్కిన ‘ఫ్రోజెన్ -2' హిందీ, తెలుగు, తమిళ భాషల్లో కూడా మరో రెండు రోజుల్లో థియేటర్లను పలకరించనుంది. ఈ మూవీలో పెద్ద ఎల్సా పాత్రకు హీరోయిన్ నిత్యా మీనన్ డబ్బింగ్ చెప్పారు. She is truly a mini version of Queen Elsa! Confident, Magical and Pure. So proud of you Situ papa! ❤❤ Can't wait for 22nd November #Frozen2 in Telugu...@DisneyStudiosIN pic.twitter.com/aN6uu4s0EG — Mahesh Babu (@urstrulyMahesh) November 20, 2019 -
ఎల్సా పాత్రతో నాకు పోలికలున్నాయి
‘‘ఫ్రోజెన్’ సినిమా చూసిన నా ఫ్రెండ్ ఒకామె ’ఆ సినిమా చూసినప్పుడు నువ్వే గుర్తొచ్చావు’ అని చెప్పింది. నాకూ ఎల్సా పాత్రకు పర్సనాలిటీ విషయంలో ఎక్కడో పోలికలున్నాయని సినిమా చూశాక అనిపించింది’’ అని నటి నిత్యామీనన్ అన్నారు. డిస్నీ సంస్థ అందిస్తున్న తాజా యానిమేషన్చిత్రం ‘ఫ్రోజెన్ 2’. ఎల్సా, అన్న అనే అక్కా చెల్లెళ్ల కథ ఇది. నవంబర్ 22న ఈ సినిమా తెలుగులో విడుదలకానుంది. తెలుగు వెర్షన్లో ఎల్సా పాత్రకు నిత్యామీనన్, ఎల్సా చిన్ననాటి పాత్రకు మహేశ్ బాబు కుమార్తె సితార డబ్బింగ్ చెప్పారు. ఈ సందర్భంగా నిత్యామీనన్ మాట్లాడుతూ– ‘‘ఎల్సా పాత్రతో చాలా కనెక్ట్ అయ్యాను. అందుకే.. ‘ఫ్రోజెన్ 2’లో ఎల్సాకు డబ్బింగ్ చెప్పమనగానే ఓకే అన్నాను. మరోసారి డబ్బింగ్ చెప్పమని అడిగినా చెబుతాను (నవ్వుతూ)’’ అన్నారు. ‘‘డబ్బింగ్ చెప్పడం చాలా సరదాగా అనిపించింది. నాన్న సర్ప్రైజ్గా ఫీలయ్యారు. నా ఫేవరెట్ కార్టూన్ పాత్ర ఎల్సానే’’ అని సితార అన్నారు. ‘‘సితారతో డబ్బింగ్ చెప్పించమని డిస్నీ శివప్రసాద్‌గారు మహేశ్‌ని, నన్ను కన్విన్స్ చేశారు. సితార ఎలా డబ్బింగ్ చెబుతుందో అనుకున్నాను.. బాగా చెప్పింది. 3 ఏళ్ల నుంచి ఎల్సా పాత్రకు తను పెద్ద ఫ్యాన్. సితారను సినిమాల్లోకి తీసుకురావాలని ఇదేం స్ట్రాటజీ కాదు. గౌతమ్, సితార కెరీర్‌ని ఇంకా ఏం ప్లాన్ చేయలేదు. వాళ్లు ఏం ఎంచుకున్నా సపోర్టివ్‌గా నిలబడతాం’’అన్నారు నమ్రతా శిరోద్కర్. ‘‘2013లో ‘ఫ్రోజెన్’ చిత్రం రిలీజ్ అయింది. యానిమేషన్ సినిమాల కలెక్షన్లలో టాప్‌గా నిలిచింది’’ అన్నారు డిస్నీ ప్రతినిధి విక్రమ్ దుగ్గల్. -
మహేష్ బాబు కుమార్తె సితారకు లక్కీ ఛాన్స్
సాక్షి,హైదరాబాద్: డిస్నీ సంస్థ ప్రతిష్టాత్మక యానిమేషన్ మూవీ ఫ్రాజెన్-2 తెలుగులోకి డబ్ అవుతున్న సంగతి తెలిసిందే. విడుదలకుముందే యువతలో ఎంతో క్రేజ్ సంపాదించుకున్న ఈ మూవీ సంబంధించి మరో ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. టాలీవుడ్ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు కుమార్తె ఘట్టమనేని సితార తన గొంతును దానం చేస్తోంది. ప్రతిష్టాత్మక డిస్నీ లాంటి నిర్మాణ సంస్థ చిత్రంలోని బేబీ ఎల్సా పాత్రకు సితార డబ్బింగ్ చెప్పనున్నారు. ఇప్పటికే తన ఆటపాటలతో ఆకట్టుకుంటూ మహేష్‌బాబు అభిమానులను మురిపిస్తున్న బేబీ సితార తన సరికొత్త టాలెంట్‌తో ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి. మరోవైపు యువరాణి ఎల్సా పాత్రకు ప్రముఖ నటి నిత్యామీనాన్ డబ్బింగ్ చెప్తున్నారు. దీంతో హలీవుడ్లో సెన్సేషనల్ ప్రాజెక్ట్ ఫ్రోజెన్ 2 రిలీజ్‌కు ముందే ప్రేక్షకుల్లో మంచి జోష్‌ను క్రియేట్ చేస్తోంది. కాగా 2013లో విడుదలైన హాలీవుడ్ మూవీ ‘ఫ్రొజెన్’ ప్రపంచ బాక్సాఫీస్ వద్ద అత్యధిక వసూళ్లు సాధించిన యానిమేటేడ్ చిత్రంగా రికార్డును సొంతం చేసుకొన్నది. ఎల్సా, అన్నా అనే ఇద్దరు అక్కాచెల్లెళ్ల కథే ‘ఫ్రాజెన్’. ఈ సిరీస్‌లోనే మూవీ ఫ్రాజెన్ -2 రూపుదిద్దుకుంది. ఈ మూవీ మొదటి పార్ట్ ఆస్కార్ అవార్డుల కార్యక్రమంలో ఉత్తమ యానిమేటెడ్ చిత్రం అవార్డును గెలుచుకొన్నది. ఈ చిత్రంలోని పాపులర్ గీతం ‘లెట్ ఇట్ గో’ కు క్రిస్టిన్ అండర్సన్-లోపెజ్, రాబర్ట్ లోపెజ్ ఉత్తమ మ్యూజిక్కు ఆస్కార్ అవార్డు లభించింది. ఫ్రొజెన్ 2 చిత్రం నవంబర్ 22 తేదీన ఇంగ్లీష్, హిందీ, తమిళ, తెలుగు భాషల్లో రిలీజ్ అవుతున్నది. Meet the little star of the Telugu Film Industry. Sitara Papa will be the voice for Baby Elsa in Telugu! Welcome to the Disney family, Sitara! #Frozen2@urstrulyMahesh #NamrataShirodkar pic.twitter.com/ubPcJTULx6 — Walt Disney Studios India (@DisneyStudiosIN) November 11, 2019 Hear more of @PanicAtTheDisco’s #IntoTheUnknown in Frozen 2. See it in theaters on November 22. pic.twitter.com/rXFXieAw1Q — Walt Disney Studios (@DisneyStudios) November 8, 2019 -
మాటా.. పాటా
అన్నా, ఎల్సా అనే అక్కాచెల్లెళ్ళ కథాంశంతో తెరకెక్కిన హాలీవుడ్ యానిమేషన్ మూవీ ‘ఫ్రోజెన్ 2’. ఈ చిత్రాన్ని ఇంగ్లీష్‌తో పాటు ఆయా ప్రాంతీయ భాషల్లో కూడా విడుదల చేస్తున్నారు డిస్నీ సంస్థ ప్రతినిధులు. ‘ఫ్రోజెన్ 2’ హిందీ వెర్షన్‌కు ప్రియాంకా చోప్రా, పరిణీతి చోప్రాలు డబ్బింగ్ చెప్పారు. తెలుగులో నిత్యామీనన్ ఈ పనిని పూర్తి చేయగా, తమిళ వెర్షన్లో ఎల్సా పాత్రకు హీరోయిన్ శ్రుతీహాసన్ డబ్బింగ్ చెప్పారు. అంతేకాదు స్వతహాగానే గాయని, సంగీత దర్శకురాలైన శ్రుతీ ‘ఫ్రోజెన్ 2’ తమిళ వెర్షన్ కోసం మూడు పాటలు కూడా ఆలపించారు. ఈ విషయం గురించి శ్రుతీహాసన్ మాట్లాడుతూ– ‘‘అన్నా, ఎల్సాల మధ్య ఉండే అనుబంధం నన్ను ఎంతగానో ఆకట్టుకుంది. ఎల్సా పాత్రకు డబ్బింగ్ చెప్పాను. అన్నా, ఎల్సాల అనుబంధం నా చెల్లి అక్షరాహాసన్‌కు, నాకు ఉన్న అనుబంధంలా అనిపించింది. ఎల్సా పాత్ర ప్రతి అమ్మాయికి రోల్ మోడల్లా ఉంటుంది’’ అని అన్నారు శ్రుతి. ‘ఫ్రోజెన్ 2’ చిత్రం ఈ నెల 22న విడుదల కానుంది. -
చోప్రా సిస్టర్స్ మాట సాయం
ఇటీవల హాలీవుడ్ సినిమాలను మన ప్రాంతీయ భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. ఆ ప్రాంత సూపర్ స్టార్స్‌తోనూ ప్రమోట్ చేయిస్తున్నాయి ఆ చిత్ర నిర్మాణ సంస్థలు. తాజాగా తమ కొత్త యానిమేషన్ చిత్రం ‘ఫ్రాజెన్ 2’ను కూడా అదే స్టయిల్లో ప్రమోట్ చేస్తోంది డిస్నీ సంస్థ. ఎల్సా, అన్నా అనే ఇద్దరు అక్కాచెల్లెళ్ల కథే ‘ఫ్రాజెన్’ ముఖ్యాంశం. హిందీ వెర్షన్లో ఈ పాత్రలకు చోప్రా సిస్టర్స్ (ప్రియాంకా చోప్రా, పరిణీతీ చోప్రా) వాయిస్ ఓవర్ అందించనున్నారు. ‘‘మిమి, తిషా (ప్రియాంక, పరిణితీ ముద్దు పేర్లు) ఇప్పుడు ఎల్సా, అన్నా కాబోతున్నారు. ఇలాంటి అద్భుతమైన, ధైర్యవంతమైన పాత్రలకు మా వాయిస్‌ను అందించడం ఆనం దంగా ఉంది’’ అని ప్రియాంక పేర్కొన్నారు. ఈ చిత్రం నవంబర్ 22న రిలీజ్ కానుంది. -
8 వేల కోట్ల హిట్‌కు... సీక్వెల్
ప్రపంచంలోనే అత్యధిక మొత్తం వసూలు చేసిన యానిమేషన్ చిత్రం ఏదో తెలుసా? వాల్ట్‌డిస్నీ సంస్థ రూపొందించిన - ‘ఫ్రోజెన్’. ఆ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 127 కోట్ల డాలర్లు (అంటే మన లెక్కల్లో దాదాపుగా 8 వేల కోట్ల రూపాయలు) వసూలు చేసింది. అంతేకాకుండా, ఉత్తమ యానిమేటెడ్ చిత్రంగానూ, ‘లెట్ ఇట్ గో...’ అనే పాటకు ఉత్తమ గీతంగానూ రెండు ఆస్కార్ అవార్డులు కూడా అందుకుంది. ఇప్పుడా సినిమాకు సీక్వెల్ రానుంది. ‘ఫ్రోజెన్ 2’ చిత్ర నిర్మాణానికి సన్నాహాలు చేస్తున్నట్లు డిస్నీ సంస్థ అధికారికంగా వెల్లడించింది. దాంతో, ‘ఫ్రోజెన్’ చిత్రంలో పాపులరైన అన్నా, ఒలాఫ్ ది స్నోమ్యాన్ లాంటి పాత్రలు మళ్ళీ ప్రాణం పోసుకోనున్నాయి. ‘‘ఈ సరికొత్త ప్రయత్నం ద్వారా ప్రేక్షకులను మళ్ళీ ఆ యానిమేషన్ పాత్రల ప్రపంచంలోకి తీసుకెళ్ళనున్నాం’’ అంటూ చిత్ర నిర్మాణ వర్గాలు ప్రకటించాయి.