చిన్న రాణిలా ఒదిగిపోయిన సితూ పాప | She is truly a mini version of Queen Elsa  says Mahesh babu | Sakshi
Sakshi News home page

చిన్న రాణిలా ఒదిగిపోయిన సితూ పాప

Published Wed, Nov 20 2019 1:04 PM | Last Updated on Wed, Nov 20 2019 2:46 PM

She is truly a mini version of Queen Elsa  says Mahesh babu - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: త్వరలో తెలుగులో విడుదల కానున్న ‘ఫ్రోజెన్‌ -2’ సినిమాలోని బేబీ  ఎల్సా పాత్రకు  టాలీవుడ్‌  హీరో ప్రిన్స్‌ మహేష్‌ బాబు ముద్దుల తనయ బేబి సితార డబ్బింగ్‌ చెబుతున్న సంగతి తెలిసిందే. ఎల్సా చిన్నప్పటి పాత్రలో సితార ఒదిగిపోయిందట. నిజంగా తన వాయిస్‌తో  క్వీన్‌ ఎల్సాకు ప్రతిరూపంగా నిలిచిందంటూ మహేష​ బాబు ట్వీట్‌ చేశారు. చాలా నమ్మకంగా, మ్యాజికల్‌గా, స్వచ్ఛంగా ఆ పాత్రకు తన వాయిస్‌ అందించిందంటూ సోషల్‌ మీడియా వేదికగా ఆయన తన ముద్దుల కూతురు ప్రతిభపై పొంగిపోతున్నారు.

‘సితూ పాపా నిన్నుచూస్తుంటే చాలా గర్వంగా ఉంది. నవంబర్‌ 22 కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నాను' అంటూ మహేశ్‌ ట్వీట్‌ చేశారు. కాగా  హాలీవుడ్‌ పాపులర్‌  చిత్రం 'ఫ్రోజన్‌'. దీనికి సీక్వెల్‌గా  తెరకెక్కిన ‘ఫ్రోజెన్‌ -2'  హిందీ, తెలుగు, తమిళ భాషల్లో కూడా మరో  రెండు రోజుల్లో థియేటర్లను పలకరించనుంది.   ఈ మూవీలో పెద్ద ఎల్సా పాత్రకు హీరోయిన్‌ నిత్యా మీనన్‌  డబ్బింగ్‌ చెప్పారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement