dubbing
-
ఈ ఏడాదిలో తెలుగు వారిని మెప్పించిన డబ్బింగ్ సినిమాల ఓటీటీ వివరాలు ఇవే (ఫోటోలు)
-
కంటెంట్ ఖండాలు దాటేలా యూట్యూబ్ కొత్త ఫీచర్
మీకు యూట్యూబ్ ఛానల్ ఉందా? మీ కంటెంట్‌ను వీరే భాషల్లో వినిపించాలనుకుంటున్నారా? ‘అవును.. కానీ, ఆ భాషలో అంతగా ప్రావీణ్యం లేదు’ అని అధైర్య పడకండి. యూట్యూబ్ మీలాంటి వారికోసం కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈమేరకు తన బ్లాగ్‌పోస్ట్‌లో వివరాలు వెల్లడించింది.సినిమాలే కాదు, భాష రాకపోయినా ఇకపై యూట్యూబ్ వీడియోలను ఖండాంతరాలను దాటించి ఏంచక్కా మీ కంటెంట్‌ను విదేశాల్లోని వారికి వినిపించవచ్చు. ఇందుకోసం యూట్యూట్ ‘ఆటో డబ్బింగ్’ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చించి. ఈ ఫీచర్ వీడియోల్లోని వాయిస్‌ను ఆటోమేటిక్‌గా డబ్ చేసి వేరే భాషల్లోకి తర్జుమా చేసి వినిపిస్తుంది. దాంతో కంటెంట్ క్రియేటర్లు ఎలాంటి ఇబ్బందులూ లేకుండా తమ వీడియోను ఇతర భాషల్లో పోస్ట్ చేసే వీలుంటుంది. స్లైడ్స్, వీడియో బిట్స్‌తో కంటెంట్ ఇచ్చేవారికి ఈ ఫీచర్ మరింత ఉపయోగపడుతుందని నిపుణులు తెలియజేస్తున్నారు.అన్ని భాషల్లోకి మారుతుందా..?ప్రాథమికంగా ఇంగ్లిష్‌లోని వీడియో కంటెంట్‌ను ఫ్రెంచ్, జర్మన్, హిందీ, ఇండోనేషియన్, ఇటాలియన్, జపనీస్, పోర్చుగీస్, స్పానిష్ భాషల్లోకి ఆటోమేటిక్‌గా డబ్ చేసేలా ఈ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. వీడియోలోని వాయిస్ పైన తెలిపిన ఏ భాషల్లో ఉన్నా ముందుగా ఇంగ్లిష్‌లోకి మారిపోతుంది. ఈ వీడియోపై ఆటో డబ్బ్‌డ్ అనే మార్కు ఉంటుంది. ఒకవేళ యూట్యూబ్ ఏఐ డబ్ చేసిన వాయిస్ వద్దనుకుంటే, ఒరిజినల్ వాయిస్ వినాలనిపిస్తే వీడియోపై ట్రాక్ సెలెక్టర్ ఆప్షన్ ఉపయోగించి అసలు వాయిస్‌ను వినొచ్చు. ప్రాథమికంగా ప్రస్తుతానికి పైన తెలిపిన భాషల్లోనే వాయిస్ డబ్ అవుతుంది. యూజర్ ఫీడ్‌బ్యాక్‌ను అనుసరించి ఇందులో మార్పులు చేసే అవకాశం ఉన్నట్లు యూట్యూబ్ తెలిపింది.ఎలా వినియోగించాలంటే..కంటెంట్ క్రియేటర్లు వీడియో అప్లోడ్ చేయగానే యూట్యూబ్ ఆటోమెటిక్‌గా వాయిస్‌ని గుర్తించి అది సపోర్ట్ చేసే భాషల్లోకి కంటెంట్‌ను డబ్ చేస్తుంది. ఫైనల్‌గా అప్లోడ్ చేయడానికి ముందు రివ్యూ చేసుకోవచ్చు. యూట్యూబ్ స్టూడియోలోని లాంగ్వేజ్ సెక్షన్లో డబ్బ్‌డ్ వీడియోలు కనిపిస్తాయి. వైటీ స్టూడియోలోని ప్రతి వీడియోను నియంత్రించే అధికారం మాత్రం కంటెంట్ క్రియేటర్లకే ఉంటుంది.ఇదీ చదవండి: 3.1 కోట్ల కస్టమర్ల డేటా లీక్‌పై క్లారిటీఈ ఫీచర్ ఎప్పుడు పని చేయదంటే..కొన్ని సందర్భాల్లో వాయిస్ క్లారిటీ లేకపోయినా, లేదంటే ఏదైనా కారణాలతో వాయిస్ గుర్తించలేకపోయినా డబ్బింగ్ పని చేయదని యూట్యూబ్ క్లారిటీ ఇచ్చింది. ఒకవేళ డబ్బింగ్ ఆప్షన్ వినియోగించుకోవాలంటే మాత్రం ఇంగ్లీష్ వాయిస్ క్లారిటీగా ఉండడంతోపాటు రికార్డింగ్ సమయంలో ఎలాంటి అవాంతరాలు లేకుండా జాగ్రత్తపడడం ముఖ్యం. ఇప్పటివరకు ఇంగ్లీష్ కంటెంట్‌ను అప్లోడ్ చేసే రిజినల్ కంటెంట్ క్రియేటర్ల సంపాదన ఈ ఫీచర్‌తో పెరగబోతుందని నిపుణులు చెబుతున్నారు. -
డబ్బింగ్ స్టార్ట్
హీరో వెంకటేశ్, దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్లో రూపొందుతున్న తాజా చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’ (ప్రచారంలో ఉన్న టైటిల్). ఈ ట్రయాంగిల్ క్రైమ్ డ్రామా ఫిల్మ్‌లో మీనాక్షీ చౌదరి, ఐశ్వర్యా రాజేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో మాజీ పోలీసాఫీసర్ పాత్రలో వెంకటేశ్ కనిపిస్తారు.ఈ పోలీసాఫీసర్ భార్యగా ఐశ్వర్యా రాజేష్, ఆయన మాజీ ప్రేయసిగా మీనాక్షీ చౌదరి కనిపిస్తారు. కాగా ఈ సినిమా డబ్బింగ్ వర్క్స్ మొదలయ్యాయి. ‘‘ఇప్పటివరకూ జరిపిన షూటింగ్‌తో తొంభై శాతం సినిమా పూర్తయింది. మరోవైపు పోస్ట్ ప్రోడక్షన్ వర్క్స్ కూడా జరుగుతున్నాయి. ఇందులో భాగంగానే డబ్బింగ్ ఆరంభించాం’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ‘దిల్’ రాజు సమర్పణలో శిరీష్ నిర్మిస్తున్న ఈ సినిమా సంక్రాంతి రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈ చిత్రానికి సంగీతం: భీమ్స్ సిసిరోలియో. -
రాకీ మాటలు మొదలు
మెకానిక్ రాకీగా టైటిల్ రోల్లో విశ్వక్ సేన్ నటించిన చిత్రం ‘మెకానిక్ రాకీ’. రవితేజ ముళ్లపూడి దర్శకత్వంలో రామ్ తాళ్లూరి నిర్మించారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం పోస్ట్ ప్రోడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా విశ్వక్ సేన్ ఆదివారం తన రాకీ పాత్రకు డబ్బింగ్ మొదలుపెట్టారు.‘‘మంచి మాస్, కామెడీ ఎంటర్టైనర్గా రూపొందించిన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉంటుంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ గేర్, ఫస్ట్ సాంగ్‌కి మంచి స్పందన లభించింది’’ అని చిత్రబృందం పేర్కొంది. దీపావళి సందర్భంగా అక్టోబరు 31న ఈ చిత్రం విడుదల కానుంది. మీనాక్షీ చౌదరి, శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి సంగీతం: జేక్స్ బిజోయ్, కెమెరా: మనోజ్ కటసాని. -
అమరన్కు సాయిపల్లవి డబ్బింగ్
వైవిధ్యభరిత కథా పాత్రలను ఎంపిక చేసుకుని నటిస్తున్న నటి సాయిపల్లవి. పక్కింటి అమ్మాయి ఇమేజ్ను సొంతం చేసుకున్న ఈ భామ ఒక్కో చిత్రంలో ఒక్కో రకమైన పాత్రలో నటిస్తూ తన ఇమేజ్ను పెంచుకుంటూ పోతున్నారు. మలయాళ చిత్రం ప్రేమమ్‌లో ముగ్గురు కథానాయకిల్లో ఒకరిగా నటించి తన ప్రత్యేకతను చాటుకున్న సాయిపల్లవి ఆ తరువాత తెలుగు, తమిళం భాషల్లో నటిస్తూ ఉన్నతస్థాయికి ఎదిగారు. ఇప్పుడు బాలీవుడ్‌లోనూ నటించే స్థాయికి ఎదిగారు. కాగా ప్రస్తుతం ఈమె తమిళంలో శివకార్తికేయన్‌కు జంటగా నటించిన అమరన్ చిత్రాన్ని నటుడు కమలహాసన్ తన రాజ్‌కమల్ ఫిలిం ఇంటర్నేషనల్ సంస్థలో నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఒక యథార్థ ఇతివృత్తంతో తెరకెక్కిన ఈ చిత్ర షూటింగ్‌ను అధిక భాగం కశీ్మర్లో రూపొందించారు. షూటింగ్‌ను పూర్తిచేసుకున్న అమరన్ చిత్రం ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటోంది. దీంతో డబ్బింగ్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ చిత్రంలో తన పాత్రకు సాయిపల్లవి డబ్బింగ్ చెబుతున్నారు. ఈ విషయాన్ని ఆమె తన ఇన్‌స్ట్రాగామ్‌లో పేర్కొన్నారు. ఈ చిత్రం దీపావళి సందర్భంగా అక్టోబర్ 31న తెరపైకి రానుంది. కాగా ఈచిత్రంతో పాటు తెలుగులో నాగచైతన్యకు జంటగా తండేల్, హిందీలో రామాయణం చిత్రంలో సీతగానూ సాయిపల్లవి నటిస్తున్నారు. -
తెలుగు నేర్చుకుని మరీ...
ఉత్తరాది బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే అవలీలగా తెలుగు మాట్లాడారు. ‘మిస్టర్ బచ్చన్’ సినిమా ద్వారా ఆమె తెలుగు పరిశ్రమకు హీరోయిన్గా పరిచయమవుతున్నారు. ఈ సినిమాలోని తనపాత్రకి తానే డబ్బింగ్ చెప్పుకున్నారు. ఆమె మాతృభాష తెలుగు కాదు. అయినప్పటికీ కష్టపడి తెలుగు నేర్చుకొని తనపాత్రకు డబ్బింగ్ చెప్పి అందర్నీ సర్ప్రైజ్ చేశారామె.ఆమె అంకితభావం ప్రశంసనీయం అని చిత్రబృందం పేర్కొంది. రవితేజ హీరోగా నటించిన చిత్రం ‘మిస్టర్ బచ్చన్’. హరీష్ శంకర్ దర్శకత్వంలో టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన ఈ మూవీ ఆగస్టు 15న రిలీజ్ కానుంది. -
డబ్బింగ్ ఆరంభం
‘అల్లరి’ నరేష్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘బచ్చల మల్లి’ డబ్బింగ్ పనులు ఆరంభమయ్యాయి. ‘సోలో బ్రతుకే సో బెటర్’ ఫేమ్ సుబ్బు మంగదేవి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో అమృతా అయ్యర్ హీరోయిన్గా నటిస్తున్నారు. హాస్య మూవీస్ బ్యానర్‌పై ‘సామజవరగమన, ఊరుపేరు భైరవకోన’ వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలను నిర్మించిన రాజేష్ దండా, బాలాజీ గుత్తా నిర్మిస్తున్న ‘బచ్చల మల్లి’ సెప్టెంబర్‌లో విడుదల కానుంది.కాగా తాజాగా ఈ సినిమా డబ్బింగ్‌ని ప్రారంభించారు మేకర్స్. ‘‘వైవిధ్యమైన కథాంశంతో రూపొందుతోన్న చిత్రం ‘బచ్చల మల్లి’. ఈ మూవీలో గతంలో ఎన్నడూ చూడని మాస్ క్యారెక్టర్లో నరేష్‌ని చూపించనున్నారు డైరెక్టర్ సుబ్బు’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: విశాల్ చంద్రశేఖర్, కెమెరా: రిచర్డ్ ఎం.నాథన్. -
మాటలు ఆరంభం
చిరంజీవి హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘విశ్వంభర’ డబ్బింగ్ పనులు షురూ అయ్యాయి. ‘బింబిసార’ ఫేమ్ వశిష్ఠ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో త్రిష, ఆషికా రంగనాథ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. యూవీ క్రియేషన్స్‌పై విక్రమ్, వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్న ఈ చిత్రం 2025 సంక్రాంతి సందర్భంగా జనవరి 10న విడుదల కానుంది.అందుకు తగ్గట్టు ఓ వైపు షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా మరోవైపు పోస్ట్‌ప్రోడక్షన్ పనులు మొదలుపెట్టింది చిత్రబృందం. గురువారం మాటల (డబ్బింగ్) పనులను ప్రారంభించారు. ‘‘క్రేజీ సోషియో ఫ్యాంటసీ యాక్షన్ అడ్వెంచరస్ మూవీగా ‘విశ్వంభర’ రూపొందుతోంది.ఈ చిత్రంలో హనుమాన్ భక్తుడిగా కనిపిస్తారు చిరంజీవి. యాక్షన్ సీక్వెన్స్‌లు అద్భుతంగా ఉంటాయి. పోస్ట్ ప్రోడక్షన్ పనులకు ఎక్కువ టైమ్ పడుతుంది. అందుకేప్రోడక్షన్, పోస్ట్‌ప్రోడక్షన్ పనులను ఏకకాలంలో చేస్తున్నాం’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: ఎంఎం కీరవాణి, కెమెరా: ఛోటా కె. నాయుడు. -
ఐదు భాషల్లో డబ్బింగ్
‘నేను సూడలేదని ఓ పులుపెక్కి పోతాండవట కదా..’ అంటూ ‘పుష్ప’ సినిమాలో రష్మికా మందన్నా అదో రకం మాస్ స్టయిల్లో చెప్పిన డైలాగ్ చాలా పాపులర్ అయిన విషయం తెలిసిందే. ఈ కూర్గ్ బ్యూటీ ‘పుష్ప’ కోసం చిత్తూరు యాస నేర్చుకుని మరీ ఆ సినిమాలో తాను చేసిన శ్రీవల్లి పాత్రకు డబ్బింగ్ చెప్పారు. ఇక ఈ మధ్యకాలంలో సంచలన విజయం సాధించిన ‘యానిమల్’కి హిందీలోనూ, ఆ చిత్రం తెలుగు, కన్నడ అనువాదాలకూ తన పాత్రకు సొంత గొంతు వినిపించారు. ఇప్పుడు ఏకంగా ఐదు భాషలు మాట్లాడారు రష్మికా మందన్నా. తాను లీడ్ రోల్ చేస్తున్న ‘గర్ల్ ఫ్రెండ్’ చిత్రం టీజర్‌కి తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ హిందీ భాషల్లో డబ్బింగ్ చెప్పారు రష్మిక. ఆమె మలయాళం మాట్లాడటం ఇదే తొలిసారి. ఐదు భాషల్లోనూ రష్మిక డబ్బింగ్ చెప్పిన విధానం అద్భుతం అని కొనియాడుతున్నారు ‘గర్ల్ ఫ్రెండ్’ చిత్రదర్శకుడు రాహుల్ రవీంద్రన్. ఈ నెల 5న రష్మిక పుట్టినరోజు సందర్భంగా ఐదు భాషల టీజర్ విడుదల కానుంది. మరి.. రష్మికతో టీజర్‌కి డబ్బింగ్ చెప్పించిన రాహుల్ పూర్తి పాత్రకు ఆయా భాషల్లో డబ్బింగ్ చెప్పిస్తారేమో చూడాలి. -
‘పురుషోత్తముడు’ మారిన రాజ్ తరుణ్..డబ్బింగ్ పనుల్లో బిజీ
రాజ్ తరుణ్ హీరో గా రామ్ భీమన దర్శకత్వం లో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న 'పురుషోత్తముడు'. ఇటీవల షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ ప్రస్తుతం డబ్బింగ్ పనుల్లో బిజీగా ఉంది. రాజమండ్రి లో వేసిన భారి సెట్ లో టాకీ పూర్తి చేసుకున్న సంధర్భంగా 22న టైటిల్ రివీల్ పోస్టర్ ని విడుదల చేశారు. అయోధ్య రామజన్మభూమి ప్రాణప్రతిష్ట రోజు ఆదే సమయానికి టైటిల్ రివీల్ చేయడం ఆనందంగా ఉందని దర్శకుడు రామ్ భీమన తెలిపారు. నిర్మాతలు డా.రమేశ్ తేజావత్, ప్రకాష్ తేజావత్ మాట్లాడుతూ భారీ బడ్జెట్ తో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో భారీ తారాగణం తో పాటు సంగీత దర్శకుడు గోపి సుందర్ స్వరపరచిన పాటలు తెలుగు ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తాయని, చిత్రం గొప్ప విజయం సాధించబోతుందని తెలిపారు. తన కెరీర్ లో పురుషోత్తముడు గొప్ప చిత్రం అవుతుందని కెమెరామెన్ పి.జి.విందా పేర్కొన్నారు. ప్రస్తుతానికి ఈ సినిమా డబ్బింగ్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ చిత్రాన్ని అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్టు చిత్ర యూనిట్ తెలిపింది. -
డబ్బింగ్ షురూ
కార్తీ హీరోగా నటించిన అడ్వెంచరస్ థ్రిల్లర్ మూవీ ‘జపాన్’. అనూ ఇమ్మాన్యుయేల్ హీరోయిన్గా నటించిన ఈ చిత్రంలో సునీల్, సినిమాటోగ్రాఫర్ విజయ్ మిల్టన్ కీలక పాత్రల్లో నటించారు. ‘జోకర్’ ఫేమ్ రాజు మురుగన్ దర్శకత్వంలో ఎస్ఆర్ ప్రకాశ్‌బాబు, ఎస్ఆర్ ప్రభు నిర్మించిన ఈ చిత్రం దీపావళికి విడుదల కానుంది. తాజాగా ఈ సినిమా డబ్బింగ్ పనులు ప్రారంభమయ్యాయని వెల్లడిస్తూ, ఇందుకు సంబంధించిన ఓ వీడియోను చిత్ర యూనిట్ షేర్ చేసింది. ‘‘కార్తీ పుట్టినరోజు (మే 25) సందర్భంగా విడుదల చేసిన ‘జపాన్’ గ్లింప్స్‌కి అద్భుతమైన స్పందన వచ్చింది. ప్రత్యేకమైన కాన్సెప్ట్‌తో రూపొందించిన ఈ చిత్రంలో కార్తీ డిఫరెంట్ లుక్స్‌లో కనిపిస్తారు’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. కాగా ‘జపాన్’ చిత్రంలో గోల్డ్ స్మగ్లింగ్ చేసే వ్యక్తి పాత్రలో కార్తీ కనిపిస్తారని కోలీవుడ్ టాక్. -
మీ క్యాలెండర్లో ఇది మార్క్ చేసుకోండి: చిరంజీవి
‘భోళా శంకర్’ సినిమాలోని తన పాత్ర డబ్బింగ్‌ని పూర్తి చేశారు హీరో చిరంజీవి. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. మెహర్ రమేష్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో తమన్నా హీరోయిన్. రామబ్రహ్మం సుంకర నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 11న విడుదల కానుంది. ‘‘భోళా శంకర్’ రూపుదిద్దుకున్న తీరు చాలా ఆనందంగా ఉంది. ఈ ఫైర్ మాస్ ఎంటర్టైనర్ కచ్చితంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. మీ క్యాలెండర్లను మార్క్ చేసుకోండి. థియేటర్స్‌లో కలుద్దాం.. భోళా శంకర్ ఆగస్టు 11’’ అంటూ డబ్బింగ్ చెబుతున్న ఓ ఫొటోని షేర్ చేశారు చిరంజీవి. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందిన ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. కీర్తీ సురేష్, సుశాంత్ కీలక పాత్రలు చేసిన ఈ చిత్రానికి సంగీతం: మహతి స్వరసాగర్, కెమెరా: డడ్లీ. -
బిల్డప్ బాబాయ్ కి జ్వరం వచ్చింది..ఇలాగ..
-
'దసరా' డిలీటెడ్ సీన్.. కీర్తి సురేశ్ దడ పుట్టించేసిందిగా!
నేచురల్ స్టార్ నాని, కీర్తి సురేశ్ జంటగా రీసెంట్ బ్లాక్ బస్టర్ మూవీ దసరా. ఇటీవలే థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించింది. ఈ మూవీలో కీర్తి, నాని నటనకు ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. సినీ ప్రముఖులు సైతం వీరిపై ప్రశంసల వర్షం కురిపించారు. ప్రస్తుతం థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమవుతున్న ఈ చిత్రం త్వరలోనే ఓటీటీలోకి రానుంది. ఈ సినిమాలో తెలంగాణ అమ్మాయిగా కీర్తి సురేశ్ పాత్రలో జీవించింది. అచ్చ తెలంగాణ యాసలో తన మాటలతో అభిమానులను కట్టిపడేసింది. ఈ చిత్రంలో తనకు తానే డబ్బింగ్ చెప్పుకోవడం మరో విశేషం. అయితే తాజాగా కీర్తి సురేశ్ తన ఇన్‌స్టాలో ఓ వీడియో షేర్ చేసింది. ఆ వీడియో తనపాత్రకు తానే డబ్బింగ్ చెబుతూ కనిపించింది. ఈ సీన్ సినిమా నుంచి తొలగించినట్లు కీర్తి వెల్లడించింది. కీర్తి తన ఇన్‌స్టాలో రాస్తూ..' దసరా మూవీలో తొలగించిన సీన్ ఇది. ఆ సీన్‌కు నేనే డబ్బింగ్ చెప్పా. డబ్బింగ్ చెబుతున్నప్పుడు నన్ను చూసి అంతా టెన్షన్ పడ్డారు. డబ్బింగ్ ఒక అద్భుతమైన కళ.' అంటూ పోస్ట్ చేసింది. ఆ వీడియోలో కీర్తి సురేశ్ తెలుగు డబ్బింగ్ చూస్తే ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. అచ్చ తెలుగులో.. అది తెలంగాణ యాసలో డబ్బింగ్ చెప్పిన మహానటి అభిమానుల హృదయాలను గెలుచుకుంది. View this post on Instagram A post shared by Keerthy Suresh (@keerthysureshofficial) -
డబ్బింగ్ ఆర్టిస్ట్ కన్నుమూత.. సూర్య ఎమోషనల్ ట్వీట్
సూర్య, అజిత్, విక్రమ్ లాంటి తమిళ స్టార్ హీరోలకు తెలుగు డబ్బింగ్ చెప్పిన ఆర్టిస్ట్ శ్రీనివాస మూర్తి ఇవాళ కన్నుమూశారు. చెన్నైలో నివాసం ఉంటున్న ఆయన గుండెపోటుతో మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న హీరో సూర్య ఎమోషనల్ ట్వీట్ చేశారు. శ్రీనివాస మూర్తి సేవలను గూర్తు చేసుకుంటూ నివాళి అర్పించారు. (ఇది చదవండి: ప్రముఖ డబ్బింగ్ ఆర్టిస్ట్ కన్నుమూత) సూర్య ట్విటర్లో రాస్తూ.. 'ఇది నాకు వ్యక్తిగతంగా తీరని లోటు. తెలుగులో నా నటనకు శ్రీనివాసమూర్తి వాయిస్, భావోద్వేగాలు ప్రాణం పోశాయి. నిన్ను కోల్పోతున్నందుకు చాలా బాధగా ఉంది. ' అంటూ ట్వీట్ చేశారు. కాగా.. సూర్య నటించిన సూపర్ హిట్ సినిమాలు సింగంలో డబ్బింగ్ చెప్పారు. ఈ రంగంలో ఎన్నో ఏళ్లుగా సేవలందిస్తున్న శ్రీనివాస మూర్తి.. సూర్యతో పాటు అజిత్, మోహన్‌లాల్, రాజశేఖర్, విక్రమ్ లాంటి అగ్రహీరోలకు తెలుగులో డబ్బింగ్ చెప్పారు. ఇటీవల విడుదలైన ‘తెగింపు’ చిత్రంలో అజిత్ పాత్రకి కూడా ఆయనే డబ్బింగ్ చెప్పడం విశేషం. శ్రీనివాస మూర్తిలాంటి గొప్ప డబ్బింగ్ ఆర్టిస్ట్ కోల్పోవడంపై తెలుగు, తమిళ ఇండస్ట్రీలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశాయి. This is a huge personal loss! Srinivasamurthy Garu’s voice & emotions gave life to my performances in Telugu. Will miss you Dear Sir! Gone too soon. — Suriya Sivakumar (@Suriya_offl) January 27, 2023 -
నా పిచ్చికి, బాధకు ఇదే మందు: సమంత ఆసక్తికర పోస్ట్
స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం మయోసైటిస్ వ్యాధితో పోరాడుతున్న సంగతి తెలిసిందే. గతేడాది అక్టోబర్ తాను మయోసైటిస్‌తో బాధపడుతున్నానని చెప్పి అందరికి షాకిచ్చింది. ప్రస్తుతం ఈ వ్యాధికి చికిత్స తీసుకుంటున్న కొద్ది రోజులుగా ఇంటికే పరిమితమైంది. ఆస్పత్రి బెడ్‌పైనే యశోద మూవీకి డబ్బింగ్ చెప్పింది సమంత. ఇక ఆమె లేటెస్ట్ మూవీ శాకుంతలం షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు ముస్తాబతోంది. ఈ నేపథ్యంలో సమంత శాకుంతలంలో తన పాత్రకు డబ్బింగ్ చెబుతోంది. ఇందుకు సంబంధించిన ఫొటోను తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. చదవండి: రూ. 100 కోట్ల క్లబ్‌లోకి ధమాకా.. రవితేజ కెరీర్లోనే తొలి రికార్డు! శాకుంతలం సినిమాకు డబ్బింగ్ చెబుతున్న ఫొటో షేర్ చేస్తూ ఆసక్తికరంగా క్యాప్షన్ ఇచ్చింది. ‘నా పిచ్చికి, బాధకు, ప్రపంచంలో కోల్పోయిన వాటన్నింటికి ఈ కళనే మందు. దాని సహాయంతో నేను నా గమ్యానికి చేరుకుంటాను’ అని రచయిత నిక్కీ రో రాసిన కోట్‌ను ఈ సందర్భంగా పంచుకుంది. ఈ పోస్ట్ చూస్తుంటే సమంత ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి మెరుగైనట్లు తెలుస్తోంది. అంతేకాదు ఇవాళ ముంబై ఎయిర్‌పోర్టులో వైట్ సూట్ ట్రెండీ డ్రెస్‌లో సామ్ దర్శనమిచ్చింది. ఈ లుక్ చూసి ఆమె ఫాలోవర్స్ లేడీ బాస్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన శాకుంతలం మూవీ ఫిబ్రవరి 17న విడుదల కాబోతోంది. View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) -
Manju Warrier: వాటిని ఎంజాయ్ చేస్తున్నా.. అభిమానానికి థ్యాంక్స్!
మాలీవుడ్‌లో అగ్ర కథానాయికగా వెలుగొందుతున్న నటి మంజువారియర్. ఈమె తమిళంలో అజిత్ సరసన నటిస్తున్న చిత్రం తుణివు. హెచ్ వినోద్ కథా, కథనం, దర్శకత్వం బాధ్యతలను నిర్వహిస్తున్నారు. ఈ సినిమాని జీసినిమాతో కలిసి బోనీకపూర్ నిర్మిస్తున్నారు. జిబ్రాన్ సంగీతాన్ని అందిస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకుని ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. పొంగల్ సందర్భంగా విడుదలకు ముస్తాబవుతోంది. ఈ చిత్రాన్ని ఉదయనిధి స్టాలిన్‌కు చెందిన రెడ్ జెయింట్ మూవీస్ సంస్థ తమిళనాడులో భారీ ఎత్తున రిలీజ్‌కు సన్నాహాలు చేస్తోంది. కాగా ఇప్పటికే ఈ చిత్రంలోని మూడు పాటలు విడుదలై అజిత్ అభిమానులను ఖుషీ చేస్తున్నాయి. అందులో ఒకటి కాసేదాన్ కడవులడా పల్లవితో సాగే పాట. ఈ పాటను సంగీత దర్శకుడు జిబ్రాన్‌తో కలిసి నటి మంజు వారియర్ పాడటం విశేషం. అయితే ఇటీవల విడుదలైన ఈ పాటలో నటి మంజువారియర్ సెట్ కాలేదని కోరస్లో కలిసిపోయిందని నెటిజన్లు ట్రోలింగ్ చేస్తున్నారు. వాటిపై స్పందించిన ఆమె తుణివు చిత్రంలో తాను పాడిన పాటలో తన గొంతు బాగోలేదని నెటిజన్లు ట్రోలింగ్ చేస్తున్నారని.. తన పాటపై వారు చూపిస్తున్న అభిమానానికి థ్యాంక్స్ అని, తన గొంతు బాగోలేదని మీరేమీ బాధ పడాల్సిన అవసరం లేదని, తాను వీడియో వెర్షన్ కోసమే పాడినట్లు పేర్కొన్నారు. ట్రోలింగ్స్‌ను బాగా ఎంజాయ్ చేస్తున్నట్లు మంజువారియర్ పేర్కొన్నారు. -
హాలీవుడ్ సినిమాలో నటిస్తున్న శోభిత ధూళిపాల.. ఫోటో వైరల్
గూఢచారి సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ శోభిత ధూళిపాల. మేజర్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న శోభిత రీసెంట్గా మణిరత్నం దర్శకత్వంలో పొన్నియన్ సెల్వన్ చిత్రంలో నటించింది.అయితే ఈ మధ్యకాలంలో ఈ అమ్మడు సినిమాల కంటే పర్సనల్ లైఫ్‌తోనే ఎక్కువగా వార్తల్లో నిలుస్తుంది. ప్రస్తుతం ఓ టాలీవుడ్ యంగ్ హీరోతో డేటింగ్లో ఉందంటూ వార్తలు గుప్పమంటున్నాయి. మొన్నటికి మొన్న దుబాయ్‌లో పెళ్లంటూ కొన్ని వెడ్డింగ్ ఫోటోలను షేర్ చేసి చివరికి అది ఓ యాడ్ కోసమంటూ తేల్చేసింది. ఇలా వరుసగా వార్తల్లో నిలుస్తున్న శోభిత తాజాగా హాలీవుడ్‌లోకి కూడా ఎంట్రీ ఇచ్చేసింది. ఆమె హాలీవుడ్లో నటించిన తొలి చిత్రం మంకీ మ్యాన్. ఈ సినిమాకు సంబంధించి డబ్బింగ్ చెబుతున్నట్లు శోభిత స్వయంగా ఫోటోను షేర్చేసింది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. -
చిరు ఫ్యాన్స్‌కి గుడ్‌న్యూస్.. ‘మెగా154’ నుంచి క్రేజీ అప్డేట్
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం గాడ్ ఫాదర్ మూవీ విజయాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు. అదే జోష్‌తో తన నెక్ట్ ప్రాజెక్ట్స్ చకచక పూర్తి చేసే పనుల్లో ఉన్నాడు చిరు. ప్రస్తుతం భోళా శంకర్, డైరెక్టర్ బాబీ దర్శకత్వంతో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. చిరు 154వ చిత్రంగా మూవీ తెరకెక్కుతుంది. తాజాగా ఈ మూవీ టీం మెగా ఫ్యాన్స్‌కి గుడ్‌న్యూస్ అందించింది. ఈ సినిమా డబ్బింగ్ పనులను స్టార్ట్ చేసినట్లు చిత్రబృందం వెల్లడించింది. దర్శకుడు బాబీ, పలువురు టెక్నిషియన్ల సమక్షంలో లాంఛనంగా పూజా కార్యక్రమాల నిర్వహించి డబ్బింగ్ పనులను మొదలు పెట్టారు. చదవండి: 31 ఏళ్ల తర్వాత మళ్లీ రీపిట్ కాబోతోన్న ‘దళపతి’ కాంబినేషన్ ఈ విషయాన్ని చిత్రనిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ వెల్లడించారు. త్వరలోనే మరిన్ని భారీ అప్డేట్స్ ఇస్తామని ఈ సందర్భంగా మైత్రి మూవీ మేకర్స్ తెలిపారు. కాగా దీపావళి పండుగ సందర్భంగా ఈ మూవీ క్రేజీ అప్డేట్ రానున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ చిత్రంలో చిరంజీవి సరసన శ్రుతి హాసన్ నటిస్తుండగా, మాస్ మహారాజా రవితేజ ఓ కీలకపాత్ర పోషిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. వచ్చే ఏడాది జనవరి 14న ఈ మూవీని గ్రాండ్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. View this post on Instagram A post shared by Mythri Movie Makers (@mythriofficial) -
ఆదిపురుష్ మూవీపై ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చిన కృతిసనన్
ప్రభాస్ హీరోగా ఓం రౌత్ దర్శకత్వంలో రూపొందిన పాన్ ఇండియా మూవీ ‘ఆదిపురుష్’. రామాయణం ఆధారంగా రూపొందిన ఈ సినిమాలో రాముడిగా ప్రభాస్, సీతగా కృతీ సనన్, లక్ష్మణుడిగా సన్నీ సింగ్, రావణుడిగా సైఫ్ అలీఖాన్ నటించారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం టీజర్ ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే. మైథలాజికల్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిన సినివ కాబట్టి గ్రాఫిక్స్ వర్క్ ఎక్కువగా జరుగుతోంది. తాజాగా ‘ఆది పురుష్’ సినిమాకు సంబంధించిన డబ్బింగ్ వర్క్స్ కూడా షురూ అయ్యాయి. ఈ సినివలో తన పాత్రకు డబ్బింగ్ చెబుతున్నారు కృతీ సనన్. ‘‘గెట్ సెట్ డబ్’’ అంటూ సోషల్ మీడియా వేదికగా ‘ఆది పురుష్’ డబ్బింగ్ ఆరంభించినట్లు వెల్లడించారు కృతి. ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 12న రిలీజ్ కానుంది. -
ఆడియో డ్రామాకు శృతి గొంతు
హీరోయిన్ శృతిహాసన్ బహుముఖ ప్రజ్ఞాశాలి అని పేర్కొనవచ్చు. సంగీత దర్శకురాలిగా సినీ పరిశ్రమకు పరిచయమైన ఈ బ్యూటీ ఆ తరువాత కథానాయికగా, గాయనీగా తనలోని పలు కోణాలను ఆవిష్కరిస్తూ ప్రతిభను చాటుకుంటున్నారు. ప్రస్తుతం నటనలో బిజీగా ఉన్న శృతిహాసన్ మరో కొత్త శాఖలోకి తనను పరిచయం చేసుకున్నారు. ఆడియో డ్రామాల ప్రాముఖ్యత గురించి ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. ఆడియో డ్రామాల తరువాతే సినిమాలు ప్రజల మధ్యకు వచ్చాయి. అయితే ఈ ఆడియో డ్రామాలు అనేవి హాలీవుడ్లో ఇప్పటికీ ప్రజాదరణ పొందుతూనే ఉన్నాయి. అలా తాజాగా రూపొందిన ది సౌండ్ మాన్ యాక్ట్ అనే ఆడియో డ్రామా సిరీస్‌లోని గ్రామీణ పనిమనిషి పాత్రకు డబ్బింగ్ చెప్పారు. దర్శకుడు నైల్ గ్యామన్ దర్శకత్వంలో డీసీ సంస్థ ఇంతకు ముందు నిర్మించిన అంతర్జాతీయ సిరీస్ ది సౌండ్ మాన్.ఈ సిరీస్‌కు విశేషాదరణ లభించడంతో తాజాగా మూడో సిరీస్ వరల్డ్ ఎండ్ ఇన్ పేరుతో రూపొందించారు. దీనికి డబ్బింగ్ చెప్పడం గురించి నటి శృతిహాసన్ పేర్కొంటూ సంగీత కళాకారునిగా జీవితాన్ని ప్రారంభించిన తనకు ది సౌండ్ మాన్ ఆడియో డ్రామాకు డబ్బింగ్ చెప్పాలన్నది చిరకాల కల అని అన్నారు. అది ఇప్పటికి నెరవేరిందని చెప్పారు. దర్శకుడు నైల్ గ్యామన్‌కు తాను పెద్ద ప్యాన్ అని అన్నారు. కాగా సౌండ్ మాన్ మూడో సిరీస్‌లో తాను ఒక భాగం అయినందుకు సంతోషంగా ఉందన్నారు. దీని నిర్మాత ఈ ఆడియో డ్రామాలు పలు రకాల ప్లాట్‌ఫామ్‌లకు తీసుకెళుతున్నారని చెప్పారు. కాగా నటి శృతిహాసన్ ఇంతకు ముందు ట్రెండ్ స్టోన్, ప్రోజెన్–2 సీరియల్స్ డబ్బింగ్ చెప్పడం గమనార్హం. ఇకపోతే ప్రస్తుతం ఈమె ప్రభాస్‌తో జంటగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ చిత్రంతో పాటు బాలకృష్ణ 107వ చిత్రంలోనూ, చిరంజీవి 154వ చిత్రంలోనూ నటిస్తూ బిజీగా వున్నారు. -
వరలక్ష్మి శరత్ కుమార్ ‘ఛేజింగ్’ డబ్బింగ్ పూర్తి, త్వరలోనే రిలీజ్
సీనియర్ హీరో శరత్ కుమార్ కుమార్తెగా సినీ రంగ ప్రవేశం చేసి వెండితెరపై తనకంటూ ఓ మార్క్ క్రియేట్ చేసుకుంది వరలక్ష్మి శరత్ కుమార్. కంటెంట్ ఉన్న కథలను ఎంచుకుంటూ విభిన్నమైన పాత్రలతో స్పెషల్ క్రేజ్ అందుకుంది. పాజిటివ్ రోల్స్‌తో పాటు నెగిటివ్ రోల్స్ కూడా చేస్తూ తమిళ, తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకుంది. ఈ క్రమంలోనే ఇప్పుడు మరో డిఫరెంట్ కాన్సెప్ట్ స్టోరీ ఛేజింగ్‌తో తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది వరలక్ష్మి శరత్ కుమార్. చదవండి: టాలీవుడ్‌పై అమలా పాల్ షాకింగ్ కామెంట్స్.. ఇప్పటికే తమిళ్లో విడుదలై సూపర్ సక్సెస్ అందుకున్న ఈ చిత్రాన్ని తెలుగులోకి అనువదిస్తున్నారు. శ్రీలక్ష్మి జ్యోతి క్రియేషన్స్ బ్యానర్‌పై ఒరేయ్ బామ్మర్ది, మై డియర్ భూతం లాంటి పలు సూపర్ హిట్ సినిమాలను తెలుగు ప్రేక్షకులకు అందించిన ఏఎన్ బాలాజీ ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఇప్పటికే డబ్బింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా వచ్చే నెలలో అదే ఛేజింగ్ పేరుతో గ్రాండ్‌గా విడుదలకు సిద్ధమవుతోంది. -
కార్తికేయ 2 సినిమాతో భారీ హిట్ కొట్టిన డబ్బింగ్ కంపెనీ!
పోస్ట్ ప్రో (Post Pro) ఒక పాన్ ఇండియా డబ్బింగ్ కంపెనీ. ఈ కంపెనీని వసంత్ స్థాపించారు. పోస్ట్ ప్రో కంపెనీలో సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ (ఆల్ లాంగ్వేజెస్ డబ్బింగ్) జరిగిన మొదటి పాన్ ఇండియా సినిమా కార్తికేయ 2. తెలుగు సినిమాలను ఇతర భాషల్లో అనువదించినప్పుడు మన నిర్మాతలు ఎదుర్కొంటున్న సమస్యలను దృష్టిలో ఉంచుకొని అన్ని భాషల అనువాదాలు ఏకకాలంలో హైదరాబాద్‌లో జరిగేటట్లుగా పోస్ట్ ప్రో కంపెనీని డిజైన్ చేశారు. తెలుగు సినిమా చరిత్రలో మొట్టమొదటి సారిగా ఇతర భాషల్లో ఉన్న డబ్బింగ్ కళాకారులను, రచయితలను హైదరాబాద్‌కు రప్పించి నిర్మాతల సౌలభ్యం కోసం కార్తికేయ 2 సినిమా డబ్బింగ్ కార్యక్రమాలను హైదరాబాద్‌లో పూర్తి చేశారు. దీనివల్ల నిర్మాతకు బడ్జెట్ కంట్రోల్లో ఉండడమే కాకుండా డైరెక్టర్ తన సినిమా అనువాద కార్యక్రమాలను రోజు చూసుకొని అవసరమైన మార్పులు చేసుకోనే వీలు ఉంటుంది, అలాగే చాలా సమయం ఆదా అవుతుంది. కార్తికేయ 2 సినిమాను ఇతర భాషల్లో అనువదించే అవకాశాన్ని ఎంతో నమ్మకంతో పోస్ట్ ప్రో (Post Pro) కంపెనీకి అప్పగించిన నిర్మాతలు టీ. జి. విశ్వ ప్రసాద్, వివేక్ కూచిబొట్ల, అభిషేక్ అగర్వాల్, దర్శకుడు చెందు మొండేటి, హీరో నిఖిల్ సిద్ధార్థ్‌కు వసంత్ కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుతం పోస్ట్ ప్రో కంపెనీ పలు భారీ సినిమాలను అనువదించే పనిలో ఉంది. చదవండి: ప్రియుడు మరణించాక కొరియోగ్రాఫర్‌తో డేటింగ్, స్పందించిన నటి థియేటర్, మల్టీప్లెక్స్‌లో టికెట్ రేట్లు తగ్గిస్తాం -
ఆకాశవాణి... యూఎస్ కేంద్రం!
ఆకాశవాణి శ్రోతలకు ఆమె గొంతు సుపరిచితం. తొలితరం తెలుగు టీవీ ప్రేక్షకులకు ఆమె నటన చిరపరిచితం. ఇరవయ్యేళ్ల కిందట తెలుగు చిత్ర కథానాయికల గళం ఆమె. పేరు... ఉదయగిరి రాజేశ్వరి. ఇప్పుడు... యూఎస్‌లో తెలుగు వాణి ఆమె. యూఎస్ తెలుగు రంగస్థల నిర్మాత. ప్రాక్– పశ్చిమ తెలుగుకు సాంస్కృతిక వారధి. ‘‘నాకు స్టేజి ముందున్న జ్ఞాపకం లేదు. ఎప్పుడూ స్టేజి మీదనే ఉండేదాన్ని. అమ్మ రచయిత. ఆమె రాసిన నాటకాలు ఆలిండియా రేడియోలో ప్రసారమయ్యేవి. అలా నాకు చిన్నప్పుడే రేడియోతో పరిచయం ఏర్పడింది. స్కూల్ ప్రోగ్రామ్స్‌లో కూడా తప్పకుండా పాల్గొనేలా చూసేది అమ్మ’’ అంటూ తన ఎదుగుదలలో తల్లి అత్తలూరి విజయలక్ష్మి పాత్రను గుర్తు చేసుకున్నారు ఉదయగిరి రాజేశ్వరి. ‘‘రేడియోలో నా ఎంట్రీ కూడా అమ్మ నాటకంతోనే. ఆ నాటకం కోసం ఆడిషన్స్ జరిగినప్పుడు నేను ‘బి’ గ్రేడ్ ఆర్టిస్టుగా ఎంపికయ్యాను. ఆ తర్వాత ‘ఏ’ గ్రేడ్‌కి ప్రమోట్ అయ్యాను. అమ్మ ఎప్పుడూ ‘నాకు కొద్దిగా స్టేజ్ ఫియర్. అందుకే నిన్ను స్టేజ్ మీదనే పెంచాను’ అంటుండేది. బాల్యంలో సరైన ఎక్స్పోజర్ లేకపోతే ఆ భయం ఎప్పటికీ వదలదేమోనని ఆందోళన ఆమెకి. అందుకే నన్ను ఊహ తెలిసేటప్పటికే స్టేజి మీద నిలబెట్టింది. రేడియో తర్వాత టీవీకి కూడా పరిచయం చేసింది. జెమినీ టీవీలో ‘బిజినెస్ ట్రాక్స్, యువర్స్ లవింగ్లీ వంటి కార్యక్రమాలకు యాంకరింగ్ చేశాను. స్వచ్ఛమైన తెలుగు, మంచి డిక్షన్ ఉండడంతో ప్రముఖులతో పరిచయ కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా రాణించగలిగాను. మొదట్లో నాకు ఆన్ స్క్రీన్ మీద పెద్దగా ఆసక్తి లేదు. కానీ అమ్మ సరదా కొద్దీ యాంకరింగ్ చేశాను. ప్రముఖుల పరిచయాల్లో భాగంగా యండమూరి వీరేంద్రనాథ్గారిని ఇంటర్వ్యూ చేశాను. అప్పుడాయన సీరియల్స్‌లో చేయమని అడగడంతో కొద్దిపాటి సందిగ్ధతతోనే ‘ప్రియురాలు పిలిచె’లో నటించాను. శాంతి నివాసం, ఎడారి కోయిలలో కూడా మంచి పాత్రలే వచ్చాయి. స్టేజ్ మీద పెర్ఫార్మెన్స్ ఇస్తే అది ఎలా ఉందనేది ప్రేక్షకులు చెప్తారు. కెమెరా ముందు ప్రోగ్రామ్ చేసిన తర్వాత అది ప్రసారం అయ్యేటప్పుడు ఇంట్లో టీవీ ముందు కూర్చుని చూడడం చాలా థ్రిల్లింగ్‌గా ఉండేది. మా ఇంట్లో అందరిదీ ఒక్కటే ఫార్ములా. ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఎన్నింటిలో చురుగ్గా ఉన్నా సరే... చదువును నిర్లక్ష్యం చేయకూడదు. అందుకేనేమో నాకు చదువు మీద ఫోకస్ తగ్గకుండా అమ్మ చాలా జాగ్రత్త పడింది. అయితే నాకు ఆన్ స్క్రీన్ ఆసక్తి పెరిగే సమయంలో అమ్మ మాట మీద కొంతకాలం నటనకు దూరంగా ఉండి చదువుకే పరిమితమయ్యాను. ఎంసీఏ తర్వాత వెబ్స్మార్ట్లో ఉద్యోగంతో కొత్త జీవితం మొదలైంది. చదువుకుంటూ కూడా సినిమాల్లో డబ్బింగ్ చెప్పడం మాత్రం వదల్లేదు. ఇడియట్, శివమణి, ఏ ఫిల్మ్ బై అరవింద్ వంటి సినిమాల్లో హీరోయిన్ పాత్రలకు డబ్బింగ్ చెప్పాను. పెళ్లి, పాపకు తల్లి కావడం, సింగపూర్‌లో ఉద్యోగం, అక్కడి నుంచి 2005లో యూఎస్‌కి... అక్కడ బాబు పుట్టడం, ఉద్యోగం– కుటుంబాన్ని బాలెన్స్ చేసుకోవడం అనే ఒక రొటీన్ చక్రంలో కొంతకాలం గడిచిపోయింది. అయితే అంత బిజీలో కూడా నాకు కొంత వెలితిగా అనిపించేది. రేడియో నాటకాలు, టీవీ షోలు, సినిమా డబ్బింగ్‌ల మధ్య జీవించిన ప్రాణం కదా మరి’’ అన్నారామె నవ్వుతూ. అమ్మ చెప్పింది అమెరికాలో రాజేశ్వరి నివసిస్తున్న డాలస్‌లో కూడా తెలుగు రేడియో ఉందని, వీలయితే ప్రోగ్రామ్స్ చేయమని తల్లి సూచించడంతో ఆమెలోని కళాకారిణి ఉత్సాహంతో ఉరకలు వేసింది. ఆమె సాహిత్యకాంక్ష ఆకాశంలో రెక్కలు విచ్చుకుంది. అలా 2006లో అమెరికా ఆకాశవాణితో గళాన్ని సవరించుకున్నారు రాజేశ్వరి. వారాంతాల్లో ప్రోగ్రామ్‌లు చేయడంతో అమెరికాకు చక్కటి తెలుగు భాషను వినిపించారు. ఆటా, తానా వంటి సాంస్కృతిక కార్యక్రమాల్లో వ్యాఖ్యాతగా అక్కడ మన భాష, సంస్కృతులకు జీవం పోస్తున్నారు. ప్రస్తుతం ఆమె సొంతంగా ‘రేడియో సురభి’ అనే ఎఫ్ఎమ్ రేడియోను రోజుకు ఇరవై నాలుగ్గంటల కార్యక్రమాలతో నిర్వహిస్తున్నారు. ‘సరసిజ’ పేరుతో నాటకసంస్థను కూడా ప్రారంభించారామె. ‘‘విజయా వారి మిస్సమ్మ సినిమాను నాటకంగా ప్రదర్శించిన నా ప్రయోగం విజయవంతమైంది. సినిమాను స్టేజ్ మీద నాటకంగా ప్రదర్శించడం ప్రపంచంలో అదే మొదలు. అలాగే అమ్మ రాసిన ద్రౌపది అంతః సంఘర్షణ నాటకంలో ద్రౌపది పాత్ర పోషించాను. ‘అనగనగా ఒక రాజకుమారి, పురూరవ నాటకాలు కూడా అంతే ప్రజాదరణ పొందాయి. యూఎస్‌లో భారతీయ నాటకరంగం అనగానే మన వాళ్లందరికీ హిందీ నాటకాలే గుర్తుకు వసాయి. తెలుగుకు పెద్ద ఆదరణ ఉండదనే అపోహ ఉండేది. మనం చక్కగా ప్రదర్శిస్తే ఆదరణ ఎందుకు ఉండదు... అని చాలెంజ్‌గా తీసుకుని చేశాను. ప్రతి సన్నివేశానికి ముందు ఆడియోలో ఇంగ్లిష్‌లో నెరేషన్ చెప్పి ప్రదర్శించడం ద్వారా ఇతర భాషల వాళ్లు కూడా మన నాటకాన్ని ఆదరించారు. అలా నేను న్యూయార్క్‌లో ‘ఇంటర్నేషనల్ థియేటర్ ఫెస్టివల్’లో తెలుగు నాటకాన్ని ప్రదర్శించాను’’ అని తన కళాప్రస్థానాన్ని వివరించారామె. హైదరాబాద్‌లోని సారస్వత పరిషత్‌లో బుధవారం (20–7–2022) నాడు ‘లేఖిని– వంశీ’ సంయుక్తాధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఉదయగిరి రాజేశ్వరికి ‘సురభి జమునారాయలు– వంశీ రంగస్థల పురస్కారం, లేఖిని ఆత్మీయ పురస్కార ప్రదానం జరిగింది. ఆ సందర్భంగా సాక్షితో ముచ్చటించారామె. ‘‘మాడపాటి హనుమంతరావు గరల్స్ హైస్కూల్ నాకు మంచి తెలుగు భాషను నేర్పింది. చక్కటి వ్యక్తిత్వ వికాసానికి దోహదం చేసింది’’ అంటూ తన ఎదుగుదలలో తాను చదువుకున్న స్కూల్ ప్రాధాన్యతను గుర్తు చేసుకున్నారు రాజేశ్వరి. రెండు గంటలు ఎవరూ కదల్లేదు యూఎస్... అన్ని ప్రాంతాల నుంచి వలస వచ్చిన వారు కలిసి నివసిస్తున్న ప్రదేశం. అక్కడ అందరూ వాళ్ల వాళ్ల సంస్కృతిని పరిరక్షించుకుంటూ యూఎస్వాసులుగా కొనసాగుతుంటారు. మనవాళ్లు మాత్రమే త్వరగా మన సంస్కృతిని వదిలేస్తున్నారనిపించింది. నాకు చేతవచ్చినది ఏదో ఒకటి చేయాలని కూడా అనిపించింది. నాటకం మీద నాకున్న అభిలాషకు అది చక్కటి వేదిక అయింది. మొదట్లో స్టేజ్ షోకి ఎవరూ రారేమోననే భయంతో మిస్సమ్మ నాటకాన్ని ఫ్రీ షో వేశాం. ఏడువందల సీటింగ్ కెపాసిటీ ఉన్న ఆడిటోరియం నిండిపోయింది. రెండు గంటల సేపు కదలకుండా చూశారు. పురూరవ నాటకాన్ని పిక్టోరియల్గా చిత్రీకరించి అమెజాన్ ప్రైమ్‌లో విడుదల చేయడం కూడా ఓ ప్రయోగమే. మన నాటకాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లడానికి నా వంతు ప్రయత్నం చేస్తున్నాను. – ఉదయగిరి రాజేశ్వరి, రంగస్థల కళాకారిణి – వాకా మంజులారెడ్డి ఫొటోలు : నోముల రాజేశ్ రెడ్డి. -
కన్నడ ప్రేక్షకులకు సారీ చెప్పిన నాని, అసలేం జరిగిందంటే..
Nani Apologizes for His Statement on Kannada Audience: నేచురల్ స్టార్ నాని హీరోగా, మలయాళ బ్యూటీ నజ్రియా నజీమ్ హీరోయిన్గా నటించిన తాజా చిత్రం ‘అంటే సుందరానికి..’ వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఫ్యామిలీ అండ్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ మూవీ జూన్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో బుధవారం మూవీ టీజర్‌ను విడుదల చేశారు మేకర్స్. అయితే ఈ మూవీ దక్షిణాది భాషల్లో మాత్రమే రిలీజ్ అవుతుండగా కన్నడ వెర్షన్లో మాత్రం డబ్ కాలేదు. చదవండి: అంటే సుందరానికీ.. నాని నాలుక మీద వాత పెట్టారు! ఈ నేపథ్యంలో బుధవారం మూవీ టీజర్ లాంచ్ వేడుకలో నాని దీనిపై స్పందించాడు. ఈ సందర్భంగా నాని చేసిన కామెంట్స్‌పై కన్నడ ప్రేక్షకులు హర్ట్ అయినట్లు కనిపిస్తోంది. దీంతో నాని కన్నడ ఆడియన్స్‌కు సోషల్ మీడియా వేదికగా క్షమాపణలు చెప్పాడు. అసలు ఏం జరిగిందంటే.. అంటే సుందరాకి టీజర్ ఈవెంట్లో ఈ మూవీ కన్నడ డబ్బింగ్ వెర్షన్ అంశంపై నాని మాట్లాడాడు. ‘ఈ చిత్రాన్ని కన్నడ ప్రేక్షకులు తెలుగులోనే చూస్తారు. అందుకే కన్నడలో మా మూవీని డబ్ చేయడం లేదు. ఎందుకంటే చాలా మంది కన్నడ ప్రజలు తెలుగు అర్థం చేసుకుంటారు. తెలుగు చిత్రాలను తెలుగులోనే చూసేందుకు వారు ఇష్టపడతారు. కానీ మిగతా వాళ్లకు మాత్రం వాళ్ళ భాషల్లో సినిమాను విడుదల చేస్తేనే అర్థమౌవుతుంది’ అని అన్నాడు. All I was expressing was my gratitude for how a lot of my films or other telugu films Wer appreciated by our Kannada family there even when there was no dubbing version available. A particular answer in a press meet comes with context. Social media takes the context out. — Nani (@NameisNani) April 20, 2022 దీంతో నాని వ్యాఖ్యలను తప్పుబడుతూ ఓ నెటిజన్ ట్విటర్ వేదికగా స్పందించాడు. ‘నాని గారు మీరు తప్పు. చాలా మంది కన్నడిగులకు తెలుగు, తమిళ భాషలు అర్థం కావు. కనీసం వారు తెలుగును అర్థం కూడా చేసుకోలేరు. అలాంటి వారు కూడా మీ సినిమాలు చూడాలి అనుకుంటే తప్పకుండ మీ సినిమాను కన్నడలో డబ్ చేయాల్సిందే’ అని ఓ నెటిజన్ ట్వీట్ చేశాడు. చదవండి: ఆర్ఆర్ఆర్లో ఎన్టీఆర్ ఎలివేషన్ సీన్‌ను డిలీట్ చేశారు: బయటపెట్టిన నటుడు దీనికి నాని స్పందిస్తూ.. ‘కన్నడ డబ్బింగ్ వెర్షన్ అందుబాటులో లేని సమయంలో కూడా నా సినిమాలు లేదా ఇతర తెలుగు చిత్రాలను మన కన్నడ కుటుంబం ఆదరించిన సందర్భాలు చాలా ఉన్నాయి. అందుకు నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ప్రెస్మీట్లో నేను చేసిన ఈ వ్యాఖ్యలు ఒక నిర్దిష్ట సందర్భంలో సమాధానం అవుతుంది. కానీ సోషల్ మీడియాలోకి వచ్చేసరికి దాని అర్థాన్ని మార్చేశారు’ అంటూ రీట్విట్ చేశాడు. అలాగే మరో ట్వీట్లో ‘తన అభిప్రాయాన్ని సరిగా చెప్ప్పలేకపోయుంటే క్షమించండి... బౌండరీస్ దాటి కన్నడ సినిమా సాధించిన సక్సెస్‌కు గర్వపడుతున్నా’ అని నాని వ్యాఖ్యానించాడు. -
తొలి సినిమాకే సొంతంగా డబ్బింగ్, ‘శాకుంతలం’కు 3 నెలలు శిక్షణ
మలయాళం మనసిలాయో అంటే... ‘మలయాళం అర్థమవుతుందా’ అని అర్థం. భాష కాని భాష ఎలా అర్థమవుతుంది? నేర్చుకుంటే అర్థమవుతుంది. మలయాళ తారలు నదియా, నజ్రియా తమ భాష కాని భాష తెలుగు నేర్చుకున్నారు. ఎంచక్కా డబ్బింగ్ చెప్పేశారు. ఫారిన్ బ్యూటీ షిర్లియా కూడా తెలుగు నేర్చుకుని, తెలుగు పలుకులు పలికారు. తియ్యగా తియ్యగా ఈ తారలు తెలుగు మాట్లాడితే, ‘పలుకే తెలుగాయె’ అనకుండా ఉండగలమా! ఇక... ఎవరెవరు ఏయే సినిమాలకు డబ్బింగ్ చెప్పారో తెలుసుకుందాం. మలయాళం, తమిళ భాషల్లో ఎన్నో సినిమాల్లో నటించిన నదియా ఇటీవల తెలుగులో క్యారెక్టర్ ఆర్టిస్టుగా బిజీ అయ్యారు. ‘మిర్చి’, ‘అత్తారింటికి దారేది’, ‘దృశ్యం’, ‘దృశ్యం 2’ రీసెంట్గా ‘గని’ వంటి సినిమాల్లో ఆమె పోషించిన పాత్రలకు తెలుగు ఆడియన్స్ మంచి మార్కులే వేశారు. నదియా నటించిన తాజా చిత్రం ‘అంటే... సుందరానికీ’!. నాని, నజ్రియా హీరో హీరోయిన్లుగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ఇది. ఈ సినిమాలో నదియా కీలక పాత్ర చేశారు. అయితే ఇప్పటివరకూ తెలుగులో తన పాత్రలకు డబ్బింగ్ చెప్పని నదియా ‘అంటే...సుందరానికీ..!’లో సొంత గొంతు వినిపిస్తారు. ఈ సినిమాలో తన పాత్రకు ఆమె ఇటీవల డబ్బింగ్ చెప్పారు. ఇక సుందరం ప్రియురాలు లీలా థామస్ కూడా తెలుగులో డబ్బింగ్ చెప్పారు. ఇంతకీ లీలా థామస్ అంటే తెలుసుగా..! అదేనండీ.. మలయాళ బ్యూటీ నజ్రియాయే. ‘అంటే.. సుందరానికీ..!’ సినిమాతో తెలుగు పరిశ్రమకు వస్తున్నారామె. అయితే తెలుగులో నటిస్తున్న తొలి సినిమాకే నజ్రియా డబ్బింగ్ చెప్పడం విశేషం. ‘‘తొలిసారిగా తెలుగులో డబ్బింగ్ పూర్తి చేశాను. చాలా హ్యాపీగా ఉంది. దర్శకుడు, నా స్నేహితుడు వివేక్ ఆత్రేయ గైడెన్స్‌తో సక్సెస్‌ఫుల్‌గా డబ్బింగ్ పూర్తి చేశాను’’ అన్నారు నజ్రియా. ఇక నదియా, నజ్రియా పలికిన తెలుగు పలుకులను జూన్ 10న థియేటర్స్‌లో వినవచ్చు. ఎందుకంటే ఈ సినిమా రిలీజ్ అయ్యేది ఆ రోజే. ఈ ఏడాది తెలుగు తెరకు పరిచయం అవుతున్న ఫారిన్ అమ్మాయిల జాబితాలో షిర్లే సేతియా ఒకరు. ఈ న్యూజిల్యాండ్ బ్యూటీ ‘కృష్ణ వ్రింద విహారి’ సినిమాలో హీరోయిన్గా నటించారు. నాగశౌర్య హీరోగా అనీష్ కృష్ణ దర్శకత్వంలో రూపొందిన చిత్రమిది. ఇటీవల తన పాత్ర డబ్బింగ్ పూర్తి చేశారు షిర్లే. ‘‘హీరోయిన్గా పరిచయం అవుతున్న నా తొలి తెలుగు సినిమాకే డబ్బింగ్ చెప్పడం చాలెంజింగ్‌గా అనిపించినప్పటికీ చిత్రయూనిట్ సహకారంతో పూర్తి చేయగలిగాను. తెలుగు డబ్బింగ్ కోసం ప్రిపేర్ కావడం, ఆ తర్వాత చెప్పడం చాలా సంతోషంగా అనిపించింది’’ అని పేర్కొన్నారు షిర్లే. అలాగే హిందీ అమ్మాయిలు అనన్యా పాండే (‘లైగర్’), మృణాళినీ ఠాకూర్ (‘సీతారామం’) తెలుగుకి పరిచయం అవుతున్నారు. ఈ చిత్రాలు రిలీజ్‌కు రెడీ అవుతున్నాయి. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగు తున్నాయి. మరి.. వీరు కూడా డబ్బింగ్ చెబుతారా? చూడాలి. ఈసారి సవాల్ దాదాపు 30 సినిమాలు చేసిన తర్వాత కానీ సమంత తెలుగులో డబ్బింగ్ చెప్పలేదు. సమంతకు చిన్మయి డబ్బింగ్ ఆర్టిస్టుగా చేసేవారు. తొలిసారిగా ‘మహానటి’ సినిమాకు డబ్బింగ్ చెప్పారు సమంత. తాజాగా ‘శాకుంతలం’కి చెప్పారు. అయితే ఈసారి చెప్పిన డబ్బింగ్ సమంతకు సవాల్ అనాలి. మైథలాజికల్ ఫిల్మ్ ‘శాకుంతలం’కు గుణశేఖర్ దర్శకుడు. ఈ సినిమాకు డబ్బింగ్ చెప్పేందుకు సమంత దాదాపు మూడు నెలలు శిక్షణ తీసుకున్నారట. ‘‘ఇది మైథలాజికల్ ఫిల్మ్ కావడంతో ఈ సినిమాలో సమంత చేసిన శకుంతల పాత్ర డైలాగ్స్ గ్రాంథికంలో ఉంటాయి. దీంతో ఉచ్ఛరణపై శ్రద్ధ పెట్టాం. అందుకే కొంత ట్రైనింగ్ తర్వాత సమంత డబ్బింగ్ చెప్పారు. అవుట్‌పుట్ బాగా వచ్చింది’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. -
నాపై దయ చూపినందుకు ధన్యవాదాలు: బాక్సింగ్ దిగ్గజం
ప్రముఖ బాక్సర్ మైక్ టైసన్ ‘లైగర్’ చిత్రం ద్వారా భారతీయ చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. విజయ్ దేవరకొండ, అనన్యా పాండే జంటగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘లైగర్’. పూరి జగన్నాథ్, చార్మీ, కరణ్ జోహార్, అపూర్వ మెహతా నిర్మించిన ఈ సినిమా ఆగస్టు 25న విడుదలకానుంది. ఈ చిత్రంలో ముఖ్య పాత్ర చేసిన మైక్ టైసన్ తన పాత్రకు సంబంధించిన డబ్బింగ్ పూర్తి చేశారు. డబ్బింగ్ డన్ అంటూ ‘‘నా పట్ల దయ చూపినందుకు ధన్యవాదాలు. నేను కృతజ్ఞుణ్ణి’’ అని టైసన్ ఒక వీడియో రిలీజ్ చేశారు. హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ‘లైగర్’ రిలీజ్ కానుంది. The final bell has rung!🔔The legend @MikeTyson has completed his dubbing for #Liger.#VaatLagaDenge pic.twitter.com/LTG9tOHVCV— Dharma Productions (@DharmaMovies) April 1, 2022 చదవండి: నువ్ ఏడ్చే రోజు వచ్చేసింది.. కరణ్ జోహార్‌పై కంగనా కామెంట్స్ -
సూర్య అభిమానులకు గుడ్‌న్యూస్: చాన్నాళ్లకు మళ్లీ ఇప్పుడు..
Suriya Telugu Dubbing For The First Time: తమిళ స్టార్ హీరో సూర్యకు టాలీవుడ్‌లోనూ మాంచి డిమాండ్ ఉంది. ఆయన నటించిన సినిమాలు తెలుగులోనూ మంచి కలెక్షన్లు సాధిస్తుంటాయి. తాజాగా సూర్య ఈటీ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. పాండీరాజ్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్ సినిమాపై హైప్‌ను క్రియేట్ చేస్తుంది. అయితే తాజాగా సూర్య ఈ సినిమా కోసం తెలుగులో డబ్బింగ్ చెప్పడం విశేషం. గతంలో బ్రదర్స్ సినిమా కోసం తొలిసారిగా డబ్బింగ్ చెప్పిన సూర్య మళ్లీ ఇన్నాళ్లకు ఈ చిత్రం డబ్బింగ్ చెప్పుకోవడం విశేషం.ఈ సినిమా మార్చి 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. A pakka treat for Telugu fans as@Suriya_offl dubs in his own voice for the Telugu version of #ET 👌👍 #EtharkkumThunindhavan @pandiraj_dir @sunpictures #Suriya pic.twitter.com/TuddNfHWzW — Kaushik LM (@LMKMovieManiac) February 12, 2022 -
'గని' డబ్బింగ్ పూర్తి, రిలీజ్ విషయంలోనే సస్పెన్స్!
సక్సెస్‌ఫుల్‌గా డబ్బింగ్ పూర్తి చేశాడు గని. వరుణ్ తేజ్ హీరోగా కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘గని’. సయీ మంజ్రేకర్ హీరోయిన్. అల్లు అరవింద్ సమర్పణలో సిద్ధు ముద్ద, అల్లు బాబీ నిర్మించిన ఈ మూవీలో గని అనే బాక్సర్ పాత్రలో కనిపిస్తారు వరుణ్‌తేజ్. తాజాగా ఈ సినిమా డబ్బింగ్ వర్క్‌ను పూర్తి చేశారు. తాను డబ్బింగ్ చెబుతున్న ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసి, ఈ విషయాన్ని స్వయంగా తెలిపారు వరుణ్. కాగా మార్చి 18న ‘గని’ సినిమాను రిలీజ్ చేయనున్నట్లు చిత్రబృందం ఇదివరకే ప్రకటించింది. అయితే ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా కొత్త రిలీజ్ డేట్ త్వరలో వచ్చే అవకాశాలున్నాయట. ఉపేంద్ర, సునీల్ శెట్టి, నవీన్ చంద్ర కీలక పాత్రలు పోషించిన ఈ సినిమాకు తమన్ సంగీతం అందించారు. View this post on Instagram A post shared by Varun Tej Konidela (@varunkonidela7) -
Pushpa: రష్మిక సారీ చెప్పినా ఆగని ట్రోలింగ్!
టాలీవుడ్లో మోస్ట్ అవైటడ్ మూవీగా డిసెంబర్ 17న ప్రేక్షకుల ముందుకు రానుంది‘ పుష్ప: ది రైజ్’ చిత్రం. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కి మొదటి పాన్ ఇండియా చిత్రం కావడం, టీజర్ ట్రైలర్లో సుకుమార్ టేకింగ్, బన్నీ యాక్టింగ్ ఈ చిత్రంపై అంచనాలను ఓ రేంజ్‌కి తీసుకువెళ్లాయి. విడుదల తేదీ దగ్గర పడటంతో ఇప్పటికే మూవీ ప్రమోషన్స్‌లో చిత్ర యూనిట్ బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ప్రీ రిలీజ ఈవెంట్లో హీరోయిన్గా రష్మిక ఓవర్ చేసిందని నెటిజన్లు ఓ రేంజ్లో నెట్టింట కామెంట్లు పెట్టారు. తాజాగా కన్నడ మీడియా.. రాష్ట్రానికి చెందిన రష్మిక తన పాత్రకు డబ్బింగ్ మాతృభాషలో చెప్పలేదని ఒక అంశాన్ని లేవనెత్తింది. అయితే ఈ విషయంపై అల్లు అర్జున్ క్లారిటీ ఇచ్చాడు కానీ నటి సోషల్ మీడియాలో మాత్రం రష్మికపై ట్రోల్స్ ఆగడం లేదు. నెటిజన్లు మాత్రం.. రష్మిక తెలుగు, ముఖ్యంగా చిత్తూరు యాస నేర్చుకోవడానికి చాలా కష్టపడింది. ఈ సినిమాను కన్నడలో డబ్ చేయడానికి కొంత సమయం తీసుకోకపోతే ఎలా? అని ప్రశ్నిస్తున్నారు. అయితే కొందరు మాత్రం.. రష్మిక ఒకేసారి అనేక ప్రాజెక్ట్‌లలో పని చేస్తోంది. పైగా ఎవరూ ఉద్దేశపూర్వకంగా అలాంటి పనులు చేయరని మనమే అర్థం చేసుకోవాలి. అన్నింటికంటే మించి, రష్మిక ఇప్పటికే క్షమాపణలు చెప్పింది. దీంతో పాటు రెండవ భాగానికి డబ్బింగ్ మిస్ చేయనని హామీ ఇచ్చింది. ఏది ఎలా ఉన్నా నెట్టింట రష్మిక పై ట్రోల్స్, కామెంట్లు మాత్రం వస్తూనే ఉన్నాయి. చదవండి: Heroine Childhood Pic: ఒకప్పుడు అందంతో కుర్రకారు మతిపోగొట్టిన ఈ ‘రాక్షసి’ ఎవరో గుర్తు పట్టారా? -
ఆర్ఆర్ఆర్ కోసం తొలిసారి ఆ పనిచేసిన ఎన్టీఆర్
కెరీర్లో పెహలీ బార్ (ఫస్ట్ టైమ్) హిందీ డైలాగ్స్ చెబుతున్నారు ఎన్టీఆర్. ‘రౌద్రం... రణం.. రుధిరం’ (ఆర్ఆర్ఆర్) సినిమా కోసమే హిందీ మాట్లాడుతున్నారు. ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘ఆర్ఆర్ఆర్’. దాదాపు 14 భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది. దక్షిణాది భాషల్లో ఒక్క మలయాళం తప్ప తెలుగు, తమిళ, కన్నడంలో తమ పాత్రలకు తామే డబ్బింగ్ చెప్పుకుంటున్నారు ఎన్టీఆర్, రామ్‌చరణ్. అలాగే హిందీలో కూడా సొంత వాయిస్‌నే వినిపించనున్నారు. తాజాగా ఎన్టీఆర్ హిందీలో డబ్బింగ్ చెబుతున్న ఫొటో వైరల్ అవుతోంది. 1920 బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిన ‘ఆర్ఆర్ఆర్’లో స్వాతంత్య్ర సమరయోధులు కొమురం భీమ్ పాత్రలో ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్‌చరణ్ కనిపిస్తారు. డీవీవీ దానయ్య నిర్మించిన ఈ చిత్రం జనవరి 7న థియేటర్స్‌లో విడుదల కానుంది. -
ఫుల్ జోరు మీదున్న అనసూయ, 'ఫ్లాష్‌బ్యాక్' డబ్బింగ్ మొదలు
ప్రభుదేవా, రెజీనా, అనసూయ, ఆర్యన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న క్రేజీ మూవీ "ఫ్లాష్ బ్యాక్". 'గుర్తుకొస్తున్నాయి' అనేది ట్యాగ్ లైన్. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్స్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమాలో డబ్బింగ్ మొదలు పెట్టింది అనసూయ. ఈ విషయాన్ని చిత్రయూనిట్ మీడియాతో వెల్లడించింది. ఆచార్య, పుష్ప, ఖిలాడీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్న అనసూయ ఫ్లాష్‌బ్యాక్‌లో పవర్ఫుల్ పాత్రలో కనిపించనుందట! సరికొత్త పాయిట్‌తో వస్తున్న తమ సినిమా అందరినీ ఆకట్టుకోవడమే గాక పక్కాగా సక్సెస్ సాధిస్తుందని ధీమాగా చెబుతున్నారు దర్శకనిర్మాతలు. త్వరలోనే సినిమా రిలీజ్ డేట్‌ను ప్రకటిస్తామన్నారు. ఈ చిత్రంలో యంగ్ హీరోయిన్ రెజీనా ఓ ఆంగ్లో ఇండియన్ టీచర్‌గా విలక్షణ పాత్ర పోషిస్తోంది. ప్రభుదేవా క్యారెక్టర్ కొత్తగా ఉంటుందట! ఈ చిత్రానికి శ్యామ్ అందించిన బాణీలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మరో లెవల్‌కు తీసుకువెళ్తాయంటున్నారు. తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న 'ఫ్లాష్ బ్యాక్' మూవీకి నందు దుర్లపాటి మాటలు రాశారు. అభిషేక్ ఫిలిమ్స్ బ్యానర్‌పై పి.రమేష్ పిళ్ళై రూపొందిస్తున్న ఈ మూవీకి డాన్ సాండీ దర్శకత్వం వహిస్తున్నారు. నిర్మాత ఎ.ఎన్ బాలాజీ తెలుగులో రిలీజ్ చేయబోతున్నారు. (చదవండి: చీర కట్టులో కుర్రాళ్లను కట్టిపడేస్తున్న అనసూయ.. ఫోటోలు వైరల్) -
విశాల్ తెలుగు డబ్బింగ్ ఎలా చెప్పారో చూడండి
Actor Vishal Dubs For Enemy: యాక్షన్ హీరో విశాల్, మ్యాన్లీ స్టార్ ఆర్య కలిసి నటించిన లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘ఎనిమీ’.ఆనంద్ శంకర్ దర్శకత్వంలో మినీ స్టూడియోస్ పతాకంపై వినోద్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మించాడు. గద్దల కొండ గణేష్’ ఫేమ్ మృణాళిని రవి, మమతా మోహన్‌దాస్‌లు ఈ చిత్రంలో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇటీవలె ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుంది. తాజాగా హీరో విశాల్ ఈ చిత్రానికి డబ్బింగ్ చెప్పారు. దీనికి సంబంధించిన వీడియోను పోస్ట్ చేస్తూ ట్రాఫిక్ కానిస్టేబుల్ లాగా ఇలా చేతులు ఊపుకుంటూ ఉంటేనే నాకు తెలుగులో డబ్బింగ్ వస్తుంది అంటూ విశాల్ ఫన్నీ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.ఇప్పటికే విడుదలైన టీజర్ మూవీపై భారీ అంచనాలను పెంచేసింది. తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రం త్వరలోనే విడుదల కానుంది. The secret behind my way of dubbing in telugu has been revealed. Like a #TrafficConstable at his best. #EnemyDubbing#Enemy at final stage of Post-Production is going 🤔 pic.twitter.com/mHOxByRPSS — VishalFans360 © (@VishalFans360) September 21, 2021 -
డబ్బింగ్ మొదలుపెట్టిన యంగ్ హీరో
యంగ్ హీరో నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటిస్తోన్న చిత్రం 18 పేజెస్. టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ కథ–స్క్రీన్‌ప్లే అందించిన ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ సమర్పణలో ‘బన్నీ’వాసు నిర్మిస్తున్నారు. రొమాంటిక్ ఎంటర్ టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాను కుమారి 21 ఎఫ్’ ఫేమ్ సూర్యప్రతాప్ తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఓ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. మరోవైపు హీరో నిఖిల్ డబ్బింగ్ మొదలుపెట్టారు. దీనికి సంబంధించిన ఫోటోను ఆయన సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ చిత్రానికి గోపీ సుందర్ సంగీతం అందిస్తున్నారు. యూత్‌ఫుల్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమా రిలీజ్ డేట్‌ను త్వరలోనే ప్రకటిస్తామని చిత్ర బృందం ప్రకటించింది. #18Pages Dubbing Starts off 😇 good to be back in the Studio... Movie Getting Ready 👍🏼 pic.twitter.com/2kd0UZFpES — Nikhil Siddhartha (@actor_Nikhil) August 11, 2021 -
డబ్బింగ్ మొదలుపెట్టిన రజనీకాంత్
Rajinikanth Annaatthe Dubbing: అన్నయ్య చెబుతున్నారు.. ఏం చెబుతున్నారు? ఎవరికి చెబుతున్నారు? అంటే.. ఎవరికీ ఏమీ చెప్పడంలేదు. తన పాత్రకు తాను డబ్బింగ్ చెప్పుకుంటున్నారు. రజనీకాంత్ నటిస్తున్న ‘అన్నాత్తే’ (పెద్దన్నయ్య) చిత్రం తాజా అప్డేట్ ఇది. ఈ మధ్య ఈ సినిమా షూటింగ్లో పాల్గొన్న రజనీకాంత్ తాజాగా డబ్బింగ్ కూడా ఆరంభించారు. షూటింగ్ ముగింపు దశకు వచ్చేసిందని సమాచారం. హైదరాబాద్, కోల్‌కత్తాలో కొన్ని సన్నివేశాలు చిత్రీకరించాల్సి ఉండగా, కోవిడ్ నేపథ్యంలో వాటిని చెన్నైలోనే ముగించారట. దీపావళి సందర్భంగా నవంబర్ 4న ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. ఇప్పుడు డబ్బింగ్ పనులు ఆరంభమయ్యాయి కాబట్టి ‘అన్నాత్తే’ చెప్పిన టైమ్‌కే వచ్చేస్తాడని ఫ్యాన్స్ ఆనందపడుతున్నారు. శివ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది. -
డబ్బింగ్ కోసం సుధీర్‌బాబు ఎంత కష్టపడుతున్నారో చూడండి
సుధీర్‌బాబు హీరోగా కరుణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'శ్రీదేవి సోడా సెంటర్'. . 80ల నాటి అమలాపురం నేపథ్యంలో సాగే కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కుతుంది. ఈ మూవీలో సుధీర్‌బాబు లైటింగ్ సూరిబాబు పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఈ చిత్రంలోని తన పాత్రకి డబ్బింగ్ చెప్పడం పూర్తయినట్లు హీరో సుధీర్‌బాబు ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. ఈ సందర్భంగా ఓ ఫైట్ సీన్‌కు డబ్బింగ్ చెబుతున్న వీడియోను షేర్ చేసుకున్నారు. ఇందులో ఫైట్‌కు తగ్గట్లు సుధీర్‌బాబు చెప్పిన డబ్బింగ్ తీరు ఆకట్టుకుంటుంది. డబ్బింగ్‌కే ఇంత కష్టపడుతుంటే, ఇక యాక్టింగ్‌కి ఇంకెంత కష్టపడతారో..మీ డెడికేషన్‌కు హ్యాట్సాఫ్ అంటూ నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. 70 ఎమ్ఎమ్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై ‘భలే మంచి రోజు, ఆనందో బ్రహ్మ, యాత్ర’ వంటి హిట్ సినిమాలను అందించిన విజయ్ చిల్లా, శశిదేవిరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. Done with #SrideviSodaCenter dubbing and it ended pretty much this way 😃 😎 #70mmSSC #SSC pic.twitter.com/ypOvKnSfGk — Sudheer Babu (@isudheerbabu) June 26, 2021 చదవండి : నెట్టింట వైరలవుతున్న సుధీర్‌బాబు ఫ్యామిలీ ఫోటోలు 'సిక్స్ ప్యాక్ బాడీ సీక్రెట్స్ చెప్పమని ఆ హీరోలు అడుగుతారు' -
రంగంలోకి సాయి ధరమ్‌తేజ్.. రిపబ్లిక్ డబ్బింగ్ షురూ..
సాయి ధరమ్ తేజ్, ఐశ్వర్య రాజేష్ జంటగా నటించిన చిత్రం రిపబ్లిక్. దేవకట్ట దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం జూన్4నే విడుదల కావాల్సి ఉండగా లాక్డౌన్ కారణంగా వాయిదా పడింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న ఈ సినిమా అతి త్వరలోనే రిలీజ్ కానుంది. ఇందుకు సంబంధించి సాయి ధరమ్ తేజ్ డబ్బింగ్ మొదలుపెట్టాడు. దీనికి సంబంధించిన ఒక ఫోటో ఫోటోను సోషల్ మీడియా లో పోస్ట్ చేసింది చిత్ర యూనిట్. ఇక గతేడాది సైతం కరోనా ఫస్ట్ వేవ్ అనంతరం థియేటర్స్ తెరుచుకున్నాక మొదట రిలీజైన తెలుగు సినిమాగా సోలో బ్రతుకే సో బెటర్ నిలిచిన సంగతి తెలిసిందే. అప్పటికి 50శాతం ఆక్యుపెన్సీ ఉన్నా ఈ చిత్రం మంచి విజయం సాధించింది. ఇప్పుడు మరోసారి థియేటర్లు కానుండటంతో తన సినిమాతో మరోసారి అలరించేందుకు సిద్ధమయ్యాడు సాయిధరమ్ తేజ్. ఈ చిత్రంలో రమ్య కృష్ణ కీలక పాత్రలో నటిస్తుంది. చదవండి : సాయి ధరమ్ తేజ్ ప్రాజెక్టుకు నో చెప్పిన కృతిశెట్టి? -
మమ్ముట్టి బాటలోనే మరో మలయాళ హీరో
పరభాష నటులు తమ పాత్రలకు డబ్బింగ్ చెప్పించుకుంటుంటారు. భాషపై పట్టు సాధించాక సొంతంగా డబ్బింగ్ చెబుతుంటారు. అయితే కొందరు మాత్రం మొదటి సినిమాకే ఆయా భాషలపై పట్టు సాధించి ప్రేక్షకులకు తమ గొంతును వినిపించానుకుంటారు మలయాళ హీరోలు మమ్ముట్టి, మోహన్‌లాల్ కూడా అలానే చేశారు. తాజాగా వారి బాటలోనే నడవనున్నారట మరో మలయాళ హీరో ఫాహద్ ఫాజిల్. అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న 'పుష్ప' చిత్రంతో తెలుగులోకి ఎంట్రీ ఇస్తున్నారు ఫాహద్. ఈ సినిమాలో తన సొంత గొంతును వినిపించుకుంటున్నార. లాక్డౌన్ కారణంగా షూటింగ్‌కు బ్రేక్ పడటంతో తెలుగు నేర్చుకునే పనిలో ఉన్నారట. వీలైనంత త్వరగా తెలుగు మీద పట్టు సాధించి పుష్పలో సొంత గొంతు వినిపించేందుకు రెడీ అవుతున్నారని సమాచారం. -
Krithi Shetty: ‘బేబమ్మ’కు ఓ కోరిక ఉందట.. నెరవేర్చేదెవరు?
ఒకే ఒక్క సినిమాతో స్టార్ హీరోయిన్గా మారిపోయింది ‘ఉప్పెన’ బ్యూటీ కృతిశెట్టి. ఆకర్షించే ఆందంతో పాటు, ఆకట్టుకునే నటనతో తెలుగు ప్రేక్షకులకు తక్కువ సమయంలోనే ఎక్కువ దగ్గరైంది. ఉప్పెన సినిమా విజయంలో కృతిశెట్టి కీలక పాత్ర వహించిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. వైష్ణవ్ తేజ్‌కు జంటగా బేబమ్మ పాత్రలో తన అమాయకపు నటనతో సినిమాని మరోస్థాయికి తీసుకెళ్లింది. ‘ఉప్పెన’తో భారీ విజయం అందుకున్న ఈ అందాల తార.. వరుస ఆఫర్లు దక్కించుకుంటూ బిజీగా మారింది. ప్రస్తుతం ఈ బ్యూటీ నాని హీరోగా తెరకెక్కుతోన్న శ్యామ్ సింగ రాయ్‌తో పాటు.. సుధీర్ బాబు నటిస్తోన్న ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ సినిమాల్లో నటిస్తోంది. అలాగే తెలుగు, తమిళ భాషల్లో ఎనర్జిటిక్ హీరో రామ్ నటిస్తున్న మాస్ ఎంటర్టైనర్ సినిమాలో నటించే అవకాశం అందుకుంది. ఇదిలా ఉంటే తాజాగా సోషల్ మీడియా వేదికగా అభిమానులతో ముచ్చటించిన ‘బేబమ్మ’.. పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది. మీకు ఉన్న కోరిక ఏంటని ఓ అభిమాని ప్రశ్నించగా.. తనకు తెలుగులో డబ్బింగ్ చెప్పుకోవాలని ఉందని చెప్పింది. ఆ కోరిక నెరవేర్చే దర్శకుడి కోసం ఎదురు చూస్తున్నట్లు చెప్పింది. తనకు టాలీవుడ్ బాగా నచ్చిందని, తెలుగు ప్రేక్షకులు తనపై చూపే ప్రేమ, అభిమానానికి చాలా సంతోషంగా ఉన్నానని చెప్పుకొచ్చింది. మరి ‘బేబమ్మ’ కోరిక నెరవేర్చే దర్శకుడు ఎవరో చూడాలి. -
తెలంగాణ యాసలో తమ్మన్నా డబ్బింగ్!
తమన్నా తెలంగాణ యాసలో మాట్లాడారు. ఎలా మాట్లాడారో వినాలంటే ఏప్రిల్ 2 వరకూ ఆగాల్సిందే. గోపీచంద్, తమన్నా జంటగా సంపత్ నంది దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘సీటీమార్’. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా చిట్టూరి నిర్మించిన ఈ సినిమా ఏప్రిల్ 2న విడుదలకానుంది. ఈ సినిమాలో తన పాత్రకి సంబంధించిన డబ్బింగ్ పూర్తి చేసిన తమన్నా మాట్లాడుతూ –‘‘నన్ను నమ్మి ‘సీటీమార్’లో జ్వాలారెడ్డి పాత్రకు అవకాశం ఇచ్చినందుకు సంపత్‌కి థ్యాంక్స్. ఇందులో నా పాత్ర తెలంగాణ యాస మాట్లాడుతుంది’’ అన్నారు. డబ్బింగ్ పూర్తయిందోచ్ అంటూ ఫుల్ జోష్‌గా ఉన్న ఓ ఫొటోను కూడా షేర్ చేశారు. -
డబ్బింగ్ జగదీష్
తాజా చిత్రం కోసం టక్ జగదీష్గా మారారు నాని. ప్రస్తుతం ఈ సినిమా డబ్బింగ్ కార్యక్రమాల్లో ఉంది. ‘నిన్ను కోరి’ తర్వాత నాని హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘టక్ జగదీష్’. ఐశ్వర్యా రాజేష్, రీతూ వర్మ కథానాయికలు. సాహూ గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన డబ్బింగ్ పనులను సోమవారం ప్రారంభించారు నాని. ఈ సినిమాను వేసవికి విడుదల చేయడానికి చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది. -
పలు బాషల్లో సమంత డబ్బింగ్
సాక్షి, హైదరాబాద్: హీరోయిన్ సమంత.. అక్కినేని వారి కోడలు అయ్యాక మరింత గ్లామర్‌తో సినిమాల్లో నటిస్తున్నారు. టాలీవుడ్లో అగ్రనటిగా రాణిస్తూనే ఇటీవల వస్రా వ్యాపారంలోకి అడుగుపెట్టారు సమంత. తాజాగా ‘ది ఫ్యామిలీ మ్యాన్’ వెబ్ సిరీస్ సీజన్ 2లో సమంత ప్రధాన పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. అమెజాన్ ప్రైమ్ వీడియోస్‌లో రూపొందిస్తున్న ఈ వెబ్ సిరీస్‌లో సమంత నెగిటివ్ రోడ్ చేస్తున్నారు. అయితే ఈ సిరీస్ భారత్‌లో పలు భాషలలో నిర్మిస్తున్నందు ఆయా బాషల్లో సమంత తన పాత్రలకు స్వయంగా డబ్బింగ్ చెప్పుకుంటున్నట్లు సమాచారం. అయితే సినిమాల్లో సమంతకు ప్రముఖ గాయని చిన్మయి డబ్బింగ్ చెప్తున్న విషయం తెలిసిందే. సమంత తన అందం, అభినయంతో ఎంతమంది అభిమానులను సంపాదించారో.. సినిమాల్లోని తన వాయిస్‌తో కూడా అంతేమంది అభిమానులు సంపాదించారు. (చదవండి: బబుల్ బాత్.. స్నేహితురాలికి షాకిచ్చిన సామ్) అయితే అది తన రియల్ వాయిస్ కాదని తెలిసి చాలామంది అభిమానులు నిరాశ చెందారు. అయినప్పటిక ఆ వాయిస్ సమంతకు కరెక్ట్‌గా సరిపోవడంతో అభిమానులంత సర్లేనంటూ సరిపెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో సమంత నటిస్తున్న వెబ్ సిరీస్‌లో తన పాత్రలకు డబ్బంగ్ చెప్పకుంటుందన్న ఈ వార్త ఆమె అభిమానులకు నిజంగా శుభవార్తేనని చెప్పుకొవచ్చు. అయితే ఈ వెబ్‌సిరీస్ ఇప్పటికే అమెజాన్‌లో స్ట్రీమింగ్ అవ్వాల్సి ఉంది కానీ వీఎఫ్ఎక్స్ పనులు పూర్తికాకపోవడంతో వచ్చే నెలకు విడుదల వాయిదా వేశారంట. ఇక ఈ సిరీస్‌లో సమంత తన వాయిస్‌తో ప్రేక్షకులను ఏమాత్రం ఆకట్టుకుంటారో వేచి చూడాల్సిందే. -
సొంత గొంతు
పరభాషా హీరోయిన్లకు ఎక్కువ శాతం వేరే వాళ్లు డబ్బింగ్ చెప్పే సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం చాలామంది హీరోయిన్లు తమ పాత్రలకు తమ గొంతునే వినిపించాలనుకుంటున్నారు. భాష నేర్చుకొని ఆ పాత్రకు మరింత న్యాయం చేయాలనుకుంటున్నారు. కొన్నిసార్లు ఆ పాత్ర చేసిన హీరోయిన్లు డబ్ చేస్తేనే బావుంటుందని దర్శకులు భావిస్తే హీరోయిన్లు కూడా రెడీ అంటారు. తాజాగా అదా శర్మ తన గొంతును వినిపించడానికి రెడీ అయ్యారు. ‘?’(క్వొశ్చన్ మార్క్) అనే లేడీ ఓరియంటెడ్ సినిమాలో నటించారామె. ఈ సినిమాలో తెలంగాణ అమ్మాయి పాత్రలో కనిపిస్తారు అదా. ఈ చిత్రానికి ఆమె డబ్బింగ్ చెప్పాలనుకోవడం, దర్శక–నిర్మాతలు విప్రా, గౌరీకృష్ణ ఓకే అనడం జరిగిపోయాయి. ‘‘తెలుగు డైలాగులన్నింటినీ అదా హిందీలో రాసుకున్నారు. బాగా ప్రాక్టీస్ చేసి, చెప్పారు. రెండే రెండు రోజుల్లో డబ్బింగ్ మొత్తం పూర్తి చేశారు. ఆమె కమిట్మెంట్కి ఆశ్చర్యం అనిపించింది. అదా డబ్బింగ్ ఓ హైలైట్’’ అన్నారు దర్శక–నిర్మాతలు. -
సూర్యకు డబ్బింగ్ చెప్పిన యంగ్ హీరో
హీరో సూర్య కథానాయకుడిగా మహిళా దర్శకురాలు సుధా కొంగర దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘సూరరై పోట్రు’ ఈ చిత్రం తెలుగులో ‘ఆకాశం నీ హద్దురా’ పేరుతో విడుదల కానుంది. అపర్ణ బాల మురళి హీరోయిన్గా నటించనున్న ఈ సినిమాను ఓటీటీ ప్లాట్‌ఫాం అయిన అమెజాన్ ప్రైమ్‌లో విడుదల చేయబోతున్నట్లు హీరో సూర్య ప్రకటించిన విషయం తెలిసిందే. మొదట ఈ మూవీని ఈ ఏడాది వేసవిలో విడుదల చేయాలనుకున్నప్పటికీ కానీ కరోనా వైరస్ ప్రభావంతో సినిమా విడుదల వాయిదా పడింది. దీంతో చివరకు ఈ చిత్రాన్ని అక్టోబర్ 30న అమెజాన్‌లో విడుదల చేయడానికి రెడీ అయ్యారు. (మోహన్‌బాబు నా గాడ్ ఫాదర్: సూర్య) ఎయిర్ డెక్కన్ ఫౌండర్ జీ.ఆర్. రామస్వామి జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ'సినిమాలో కలెక్షన్‌కింగ్ మోహన్‌బాబు కీలక పాత్రలో కన్పించనున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మరో ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. ఈ సినిమా తెలుగు రీమేక్ ‘ఆకాశం నీ హద్దురా’లో హీరో సూర్యకు విభిన్న పాత్రలతో నటుడుగా ప్రేక్షకాభిమానుల నుంచి మన్ననలు సత్యదేవ్ డబ్బింగ్ చెప్పారు. ఈ విషయాన్ని నిర్మాత బీఏ రాజు తన ట్విటర్లో వెల్లడించారు. సూర్యకు సత్యదేవ్ వాయిస్ అయితే సరిగా సెట్ అవుతుందని చిత్ర యూనిట్ ఈ నిర్ణయం తీసుకున్నారు. సత్యదేవ్ ఇటీవల విడుదలైన విలక్షణ చిత్రం 'ఉమామహేశ్వర ఉగ్రరూపస్య' చిత్రం’తో ప్రేక్షకులను అలరించారు. -
మంచి ముగింపు
వారానికి క్లైమాక్స్ లాంటిది వీకెండ్. క్లైమాక్స్ బావుంటేనే సినిమా బాగా ఆడుతుంది. వీకెండ్ బావుంటేనే కొత్త వారాన్ని ఉత్సాహంతో ప్రారంభించగలుగుతాం. మరి ఈ వీక్‌ను ఏ స్టార్ ఎలా ఎండ్ చేస్తున్నారో చూద్దామా? లాక్డౌన్లో యోగా మీద ధ్యాస పెట్టారు సమంత. కష్టతరమైన ఆసనాలు ప్రాక్టీస్ చేశారు. చాలా వరకూ నేర్చేసుకున్నారు. ఈ వీకెండ్‌ను సూర్య నమస్కారాలతో మొదలుపెట్టారు సమంత. శనివారం 108 సూర్య నమస్కారాలు చేశారామె. ‘వీకెండ్‌కి మంచి స్టార్ట్’ అన్నారు సమంత. తెలుగు సినిమాకు డబ్బింగ్ చెప్పాలన్నది పాయల్ రాజ్‌పుత్ కోరిక. ఈ వీకెండ్ ఆ పని మీదే ఉన్నారు. తెలుగులో తాను నటిస్తున్న తాజా చిత్రానికి డబ్బింగ్ చెప్పడం మొదలెట్టారు. ‘డబ్బింగ్ చెప్పాలని ఎప్పటినుంచో అనుకుంటున్నాను... ఇప్పటికి కుదిరింది. త్వరలోనే నా తెలుగు ఎలా ఉంటుందో మీరూ వింటారు’ అన్నారు పాయల్ రాజ్‌పుత్. లాక్డౌన్లో ఫిజికల్ ఫిట్నెస్ ట్రైనింగ్ ప్రారంభించారు శ్రుతీహాసన్. బాక్సింగ్ క్లాసుల్లో చురుకుగా పాల్గొంటున్నారు. ‘శారీరకంగా బలంగా తయారైతేనే మానసికంగానూ బలంగా ఉండగలం’ అన్నారు శ్రుతి. వీకెండ్లోనూ నో హాలీడే. ఫుల్ బాక్సింగ్ ట్రైనింగ్‌లో ఉన్నారామె. వీకెండ్ సందర్భంగా పూజా హెగ్డే ‘షెఫ్ పూజా’ అయ్యారు. పూజా తన తండ్రి కోసం కాక్టేల్ తయారు చేశారు. టేస్టీ కాక్టేల్ ఎలా చేయాలో రెసిపీ కూడా పంచుకున్నారు. ఇలా అందాల తారలు ఈ వారాన్ని తమకు నచ్చినట్లుగా ముగించి, వచ్చే వారాన్ని హ్యాపీ మూడ్‌తో ఆహ్వానించడానికి రెడీ అయ్యారు. -
నా కల నెరవేరింది: పాయల్ రాజ్‌పుత్
సాక్షి, హైదరాబాద్: ఆర్ఎక్స్ 100తో ఒక్కసారిగా స్టార్ అయిపోయిన ముద్దుగుమ్మ పాయల్ రాజ్‌పుత్. తన అందాల ఆరబోతతో యువకులను కట్టిపడేస్తుంటుంది. వెంకటేష్, రవితేజ లాంటి స్టార్ హీరోలతో కూడా జతకట్టింది ఈ భామ. ఇప్పుడు తాజాగా తన కలనెరవేరింది అని మురిసిపోతుంది ఈ భామ. తెలుగులో డబ్బింగ్ చెప్పడం తన కల అని, ప్రస్తుతం తెరకెక్కుతున్న ఒక సినిమాలోని తన పాత్రకు డబ్బింగ్ చెప్పనంటూ సోషల్ మీడియా ఖాతాలో ఫోటోలు షేర్ చేసింది. జయంత్ సి పరాన్జీ డైరెక్షన్లో పాయల్ ‘నరేంద్ర’ అనే సినిమాలో నటిస్తోంది. ఇది ఇండో-పాక్ బోర్డర్ లో జరిగే కథతో రూపొందుతుంది. ఈ సినిమాలో పాయల్ ఒక కీలకమైన పాత్రలో నటిస్తోంది. My first dub in telugu 🎬 pic.twitter.com/zuYFfEVBel — paayal rajput (@starlingpayal) September 11, 2020 చదవండి: డ్రగ్స్ కేసులో రకుల్పప్రీత్, సారా అలీఖాన్ పేర్లు? -
తొలిసారి ఆ ప్రయత్నం చేసిన సమంత
లాక్డౌన్లో అందరూ ఖాళీగా మారిపోతే స్టార్ హీరోయిన్, అక్కినేని కోడలు సమంత మాత్రం బిజీగా మారిపోయారు. టెర్రస్ గార్డెనింగ్ మొదలు పెట్టారు, వంట చేయడం నేర్చుకున్నారు. అటు ఫిట్నెస్ను కాపాడుకునేందుకు తప్పనిసరిగా యోగా కూడా చేస్తున్నారు. తాజాగా ఆమె లాక్‌డౌన్‌కు ముందు నటించిన 'ఫ్యామిలీ మ్యాన్ 2' అనే వెబ్ సిరీస్‌కు డబ్బింగ్ చెప్తున్నారు. నిజానికి సినిమాల్లో ఆమె పాత్రలకే గాయని చిన్మయి డబ్బింగ్ చెప్తుంటారు. కానీ ఈ వెబ్ సిరీస్ కోసం సమంతే ప్రత్యేకంగా డబ్బింగ్ చెప్తుండటం అభిమానులకు సంతోషాన్నిచ్చే వార్త. తెలుగు, తమిళ భాషలతో పాటు హిందీలోనూ సమంతే డబ్బింగ్ చెప్తున్నట్లు కనిపిస్తోంది. (నా కుటుంబం కోటి) ఈ సందర్భంగా డబ్బింగ్ స్టూడియోలో ఉన్న ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో పంచుకున్నారు. కానీ ఇందులో సమంత కనపడకుండా, మైక్రోఫోన్‌ను, ఎదురుగా టీవీలోని ఓ సన్నివేశాన్ని చూపించారు. ఇక ఈ సిరీస్ అభిమానులకు క్రేజీ అనుభవాన్ని ఇవ్వబోతుందని రాసుకొచ్చారు. కాగా రాజ్ నిడిమోరు, కృష్ణ డీకేలు రూపొందిస్తున్న ఫ్యామిలీ మ్యాన్ 2 త్వరలోనే అమెజాన్ ప్రైమ్‌లో విడుదల అవనుంది. హిందీతో పాటు తమిళ, తెలుగు భాషల్లో ఇది ప్రసారం కానుంది. ఇందులో సమంత టెర్రరిస్టుగా కనిపించనుందని సమాచారం. ఈ సిరీస్‌లో బాలీవుడ్ నటుడు మనోజ్ భాజ్‌పాయ్‌తో పాటు హీరోయిన్ ప్రియమణి కూడా నటిస్తున్నారు. (‘అమృత ప్రేమలో విరాట్.. మనసులో మాట’) -
డబ్బింగ్ మొదలెట్టిన విజయ్ సేతుపతి
తమిళసినిమా : లాభం చిత్ర డబ్బింగ్ మొదలైంది. లాక్డౌన్ కాలంలో ఇంట్లో ఖాళీగా కూర్చున్న నటీనటులకు కాస్త రిలీఫ్ కలిగించేలా ప్రభుత్వం చిత్ర నిర్మాణాంతర కార్యక్రమాలకు అనుమతినిచ్చిన విషయం తెలిసిందే. దీంతో నిర్మాతలు ఆ పనులకు సిద్ధమవుతున్నారు. లాభం చిత్ర డబ్బింగ్ కార్యక్రమాలకు ఆ చిత్ర వర్గాలు మొదలెట్టారు. ఇందులో విజయ్‌సేతుపతి కథానాయకుడిగా నటిస్తున్న సంగతి తెలిసిందే. సంచలన నటి శ్రుతిహాసన్ కథానాయకిగా నటిస్తున్న ఈ చిత్రంలో జగపతిబాబు, కలైయరసన్ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. విజయ్‌సేతుపతి సొంత నిర్మాణ సంస్థ, 7సీఎస్ ఎంటర్టెయిన్మెంట్ సంస్థ కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎస్పీ.జననాథన్ దర్శకత్వం వహిస్తున్నారు. రాంజీ ఛాయాగ్రహణం, డీ.ఇమాన్ సంగీతాన్ని అందిస్తున్నారు. పూర్తి కమర్శియల్ అంశాలతో కూడిన కథా చిత్రంగా రూపొందుతున్న ఈ చిత్ర షూటింగ్ దాదాపు పూర్తి కావచ్చింది. తాజాగా చిత్ర డబ్బింగ్‌కు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా నటుడు విజయ్‌సేతుపతి డబ్బింగ్ చెప్పారు. ఈ దృశ్యాలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.(శరత్‌కుమార్ పేరుతో మోసం) -
నామినేషన్ తిరస్కరణ
తమిⶠఇండస్ట్రీలో జరిగిన డబ్బింగ్ యూనియన్ ఎన్నికలపై ఎప్పుడూ లేని ఆసక్తి నెలకొంది. దానికి కారణం ప్రెసిడెంట్ పదవికి రాధారవిపై పోటీగా డబ్బింగ్ ఆర్టిస్ట్, గాయని చిన్మయి నామినేషన్ వేయడమే. గతంలో ప్రముఖ రచయిత వైరముత్తు, నటుడు రాధారవిపై ‘మీటూ’ ఉద్యమంలో భాగంగా లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు చిన్మయి. ఆ తర్వాత డబ్బింగ్ యూనియన్ సభ్యత్వం నుంచి ఆమె తొలగించబడ్డారు. కానీ కోర్టు నుంచి ఇంటర్న్ ఆర్డర్ (చిన్మయిని యూనియన్ సభ్యురాలిగా పరిగణించాలి) తెచ్చుకున్నారు చిన్మయి. ఆ తర్వాతే రామరాజ్యం పార్టీ తరఫున డబ్బింగ్ యూనియన్ ప్రెసిడెంట్ పదవికి నామినేషన్ వేశారామె. అయితే చిన్మయి నామినేషన్ తిరస్కరణకు గురయింది. దాంతో రాధారవి ప్రెసిడెంట్ పదవికి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ‘‘ఎలక్షన్ కమిషనర్ నేను సభ్యురాలిని కాదని నామినేషన్ తిరస్కరించారు. నా వద్ద కోర్ట్ ఇంటర్న్ ఆర్డర్ ఉన్నప్పటికీ ఎందుకు సభ్యురాలిగా పరిగణించలేదో అర్థం కావడం లేదు. ఎవరి సూచనల మేరకు ఈ పని చేశారు? రాధారవి ఆజ్ఞ మేరకా? ఈ విషయంపై న్యాయపరంగా పోరాడతాను’’ అని ట్వీటర్లో పేర్కొన్నారు చిన్మయి. -
చిన్న మార్పు
నిత్యామీనన్ మల్టీటాలెంటెడ్. బాగా యాక్ట్ చేయగలరు. మలయాళీ అయినా అచ్చ తెలుగులో సొంతంగా డబ్బింగ్ చెప్పుకోగలరు. సినిమాల్లో పాటలు పాడగలరు. ఇప్పుడు తనలోని గాయనిపై మరింత దృష్టి పెట్టారు. గాయనిగా నిత్యామీనన్ తన తొలి ఆల్బమ్‌ను త్వరలోనే విడుదల చేయనున్నారు. ఈ మ్యూజిక్ ఆల్బమ్‌కి లండన్ మ్యూజిక్ కంపోజర్ సౌమిక్ దత్తా సంగీతాన్ని సమకూర్చగా నిత్యామీనన్ పాడనున్నారు. ఈ విషయాన్ని తన ఇన్‌స్ట్రాగ్రామ్ అకౌంట్ ద్వారా తెలియజేశారామె. ‘‘సరికొత్త ప్రాజెక్ట్ తయారవుతోంది. కెరీర్లో చిన్న మార్పు రాబోతోంది. నా తొలి మ్యూజిక్ సింగిల్ త్వరలో విడుదల కాబోతోంది. అందరికీ త్వరగా వినిపించేయాలనే ఆతురుతతో ఉన్నాను’’ అన్నారు. ప్రస్తుతం జయలలిత బయోపిక్ ‘ది ఐరన్ లేడీ’, తెలుగులో సత్యదేవ్‌తో ఓ సినిమా చేస్తున్నారు నిత్యామీనన్. -
హాలీవుడ్ రివ్యూ 2019
-
చిన్న రాణిలా ఒదిగిపోయిన సితూ పాప
సాక్షి, హైదరాబాద్: త్వరలో తెలుగులో విడుదల కానున్న ‘ఫ్రోజెన్ -2’ సినిమాలోని బేబీ ఎల్సా పాత్రకు టాలీవుడ్ హీరో ప్రిన్స్ మహేష్ బాబు ముద్దుల తనయ బేబి సితార డబ్బింగ్ చెబుతున్న సంగతి తెలిసిందే. ఎల్సా చిన్నప్పటి పాత్రలో సితార ఒదిగిపోయిందట. నిజంగా తన వాయిస్‌తో క్వీన్ ఎల్సాకు ప్రతిరూపంగా నిలిచిందంటూ మహేష బాబు ట్వీట్ చేశారు. చాలా నమ్మకంగా, మ్యాజికల్‌గా, స్వచ్ఛంగా ఆ పాత్రకు తన వాయిస్ అందించిందంటూ సోషల్ మీడియా వేదికగా ఆయన తన ముద్దుల కూతురు ప్రతిభపై పొంగిపోతున్నారు. ‘సితూ పాపా నిన్నుచూస్తుంటే చాలా గర్వంగా ఉంది. నవంబర్ 22 కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నాను' అంటూ మహేశ్ ట్వీట్ చేశారు. కాగా హాలీవుడ్ పాపులర్ చిత్రం 'ఫ్రోజన్'. దీనికి సీక్వెల్‌గా తెరకెక్కిన ‘ఫ్రోజెన్ -2' హిందీ, తెలుగు, తమిళ భాషల్లో కూడా మరో రెండు రోజుల్లో థియేటర్లను పలకరించనుంది. ఈ మూవీలో పెద్ద ఎల్సా పాత్రకు హీరోయిన్ నిత్యా మీనన్ డబ్బింగ్ చెప్పారు. She is truly a mini version of Queen Elsa! Confident, Magical and Pure. So proud of you Situ papa! ❤❤ Can't wait for 22nd November #Frozen2 in Telugu...@DisneyStudiosIN pic.twitter.com/aN6uu4s0EG — Mahesh Babu (@urstrulyMahesh) November 20, 2019 -
ఎల్సా పాత్రతో నాకు పోలికలున్నాయి
‘‘ఫ్రోజెన్’ సినిమా చూసిన నా ఫ్రెండ్ ఒకామె ’ఆ సినిమా చూసినప్పుడు నువ్వే గుర్తొచ్చావు’ అని చెప్పింది. నాకూ ఎల్సా పాత్రకు పర్సనాలిటీ విషయంలో ఎక్కడో పోలికలున్నాయని సినిమా చూశాక అనిపించింది’’ అని నటి నిత్యామీనన్ అన్నారు. డిస్నీ సంస్థ అందిస్తున్న తాజా యానిమేషన్చిత్రం ‘ఫ్రోజెన్ 2’. ఎల్సా, అన్న అనే అక్కా చెల్లెళ్ల కథ ఇది. నవంబర్ 22న ఈ సినిమా తెలుగులో విడుదలకానుంది. తెలుగు వెర్షన్లో ఎల్సా పాత్రకు నిత్యామీనన్, ఎల్సా చిన్ననాటి పాత్రకు మహేశ్ బాబు కుమార్తె సితార డబ్బింగ్ చెప్పారు. ఈ సందర్భంగా నిత్యామీనన్ మాట్లాడుతూ– ‘‘ఎల్సా పాత్రతో చాలా కనెక్ట్ అయ్యాను. అందుకే.. ‘ఫ్రోజెన్ 2’లో ఎల్సాకు డబ్బింగ్ చెప్పమనగానే ఓకే అన్నాను. మరోసారి డబ్బింగ్ చెప్పమని అడిగినా చెబుతాను (నవ్వుతూ)’’ అన్నారు. ‘‘డబ్బింగ్ చెప్పడం చాలా సరదాగా అనిపించింది. నాన్న సర్ప్రైజ్గా ఫీలయ్యారు. నా ఫేవరెట్ కార్టూన్ పాత్ర ఎల్సానే’’ అని సితార అన్నారు. ‘‘సితారతో డబ్బింగ్ చెప్పించమని డిస్నీ శివప్రసాద్‌గారు మహేశ్‌ని, నన్ను కన్విన్స్ చేశారు. సితార ఎలా డబ్బింగ్ చెబుతుందో అనుకున్నాను.. బాగా చెప్పింది. 3 ఏళ్ల నుంచి ఎల్సా పాత్రకు తను పెద్ద ఫ్యాన్. సితారను సినిమాల్లోకి తీసుకురావాలని ఇదేం స్ట్రాటజీ కాదు. గౌతమ్, సితార కెరీర్‌ని ఇంకా ఏం ప్లాన్ చేయలేదు. వాళ్లు ఏం ఎంచుకున్నా సపోర్టివ్‌గా నిలబడతాం’’అన్నారు నమ్రతా శిరోద్కర్. ‘‘2013లో ‘ఫ్రోజెన్’ చిత్రం రిలీజ్ అయింది. యానిమేషన్ సినిమాల కలెక్షన్లలో టాప్‌గా నిలిచింది’’ అన్నారు డిస్నీ ప్రతినిధి విక్రమ్ దుగ్గల్. -
డబ్బింగ్ షురూ
‘దర్బార్’లో ఆదిత్య అరుణాచలం మాటల తూటాలు పేలుతున్నాయి. మరి.. ఈ దర్బార్ డైలాగ్స్ ప్రేక్షకులకు ఎంత కిక్ ఇస్తాయో తెలిసేది మాత్రం సంక్రాంతి పండక్కే. రజనీకాంత్ హీరోగా ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘దర్బార్’. ఇందులో నయతార కథానాయికగా నటించారు. నివేదాథామస్ కీలక పాత్రధారి. ఈ చిత్రంలో పోలీసాఫీసర్ ఆదిత్య అరుణాచలం పాత్రలో నటించారు రజనీకాంత్. ఈ సినిమా డబ్బింగ్ కార్యక్రమాలు మొదలైనట్లు గురువారం చిత్ర దర్శకుడు ఏఆర్ మురుగదాస్ వెల్లడించారు. లైకా ప్రొడక్షన్స్ నిర్మించిన ‘దర్బార్’ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానుంది. -
బుజ్జి బుజ్జి మాటలు
మహేశ్‌బాబు ముద్దుల కుమార్తె సితార సినిమా ప్రపంచంలోకి అడుగుపెట్టనున్నారు. అయితే అది ఆన్‌స్క్రీన్ ఎంట్రీ కాదు ఆఫ్‌స్క్రీన్ ఎంట్రీ. తెరపై కనిపించే పాత్ర కాదు. వినిపించే పాత్ర. హాలీవుడ్ యానిమేషన్ మూవీ ‘ఫ్రోజెన్ 2’. అన్నా, ఎల్సా అనే అక్కాచెల్లెళ్ల కథాంశంగా ఈ సినిమా తెరకెక్కింది. ఇందులో ఎల్సా చిన్ననాటి పాత్రకు సితార డబ్బింగ్ చెప్పనున్నారు. తన బుజ్జిబిజ్జి మాటలతో ఎల్సా పాత్రకు డబ్బింగ్ చెబు తారట. ఎల్సా ఎంగేజ్ పాత్రకు నిత్యా మీనన్ డబ్బింగ్ చెప్పిన విషయం గుర్తుండే ఉంటుంది. ఈ నెల 22న ఈ సినిమా రిలీజ్ కానుంది. ఆల్రెడీ యూట్యూబ్‌లో ఓ చానెల్లో ఎప్పటికప్పుడు వీడియోలను పోస్ట్ చేస్తూ ఉంటారు సితార. మరి భవిష్యత్తులో సినిమాల్లోకి వచ్చే ఆసక్తి ఉందా? వేచి చూడాలి. -
మహేష్ బాబు కుమార్తె సితారకు లక్కీ ఛాన్స్
సాక్షి,హైదరాబాద్: డిస్నీ సంస్థ ప్రతిష్టాత్మక యానిమేషన్ మూవీ ఫ్రాజెన్-2 తెలుగులోకి డబ్ అవుతున్న సంగతి తెలిసిందే. విడుదలకుముందే యువతలో ఎంతో క్రేజ్ సంపాదించుకున్న ఈ మూవీ సంబంధించి మరో ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. టాలీవుడ్ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు కుమార్తె ఘట్టమనేని సితార తన గొంతును దానం చేస్తోంది. ప్రతిష్టాత్మక డిస్నీ లాంటి నిర్మాణ సంస్థ చిత్రంలోని బేబీ ఎల్సా పాత్రకు సితార డబ్బింగ్ చెప్పనున్నారు. ఇప్పటికే తన ఆటపాటలతో ఆకట్టుకుంటూ మహేష్‌బాబు అభిమానులను మురిపిస్తున్న బేబీ సితార తన సరికొత్త టాలెంట్‌తో ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి. మరోవైపు యువరాణి ఎల్సా పాత్రకు ప్రముఖ నటి నిత్యామీనాన్ డబ్బింగ్ చెప్తున్నారు. దీంతో హలీవుడ్లో సెన్సేషనల్ ప్రాజెక్ట్ ఫ్రోజెన్ 2 రిలీజ్‌కు ముందే ప్రేక్షకుల్లో మంచి జోష్‌ను క్రియేట్ చేస్తోంది. కాగా 2013లో విడుదలైన హాలీవుడ్ మూవీ ‘ఫ్రొజెన్’ ప్రపంచ బాక్సాఫీస్ వద్ద అత్యధిక వసూళ్లు సాధించిన యానిమేటేడ్ చిత్రంగా రికార్డును సొంతం చేసుకొన్నది. ఎల్సా, అన్నా అనే ఇద్దరు అక్కాచెల్లెళ్ల కథే ‘ఫ్రాజెన్’. ఈ సిరీస్‌లోనే మూవీ ఫ్రాజెన్ -2 రూపుదిద్దుకుంది. ఈ మూవీ మొదటి పార్ట్ ఆస్కార్ అవార్డుల కార్యక్రమంలో ఉత్తమ యానిమేటెడ్ చిత్రం అవార్డును గెలుచుకొన్నది. ఈ చిత్రంలోని పాపులర్ గీతం ‘లెట్ ఇట్ గో’ కు క్రిస్టిన్ అండర్సన్-లోపెజ్, రాబర్ట్ లోపెజ్ ఉత్తమ మ్యూజిక్కు ఆస్కార్ అవార్డు లభించింది. ఫ్రొజెన్ 2 చిత్రం నవంబర్ 22 తేదీన ఇంగ్లీష్, హిందీ, తమిళ, తెలుగు భాషల్లో రిలీజ్ అవుతున్నది. Meet the little star of the Telugu Film Industry. Sitara Papa will be the voice for Baby Elsa in Telugu! Welcome to the Disney family, Sitara! #Frozen2@urstrulyMahesh #NamrataShirodkar pic.twitter.com/ubPcJTULx6 — Walt Disney Studios India (@DisneyStudiosIN) November 11, 2019 Hear more of @PanicAtTheDisco’s #IntoTheUnknown in Frozen 2. See it in theaters on November 22. pic.twitter.com/rXFXieAw1Q — Walt Disney Studios (@DisneyStudios) November 8, 2019 -
మాటా.. పాటా
అన్నా, ఎల్సా అనే అక్కాచెల్లెళ్ళ కథాంశంతో తెరకెక్కిన హాలీవుడ్ యానిమేషన్ మూవీ ‘ఫ్రోజెన్ 2’. ఈ చిత్రాన్ని ఇంగ్లీష్‌తో పాటు ఆయా ప్రాంతీయ భాషల్లో కూడా విడుదల చేస్తున్నారు డిస్నీ సంస్థ ప్రతినిధులు. ‘ఫ్రోజెన్ 2’ హిందీ వెర్షన్‌కు ప్రియాంకా చోప్రా, పరిణీతి చోప్రాలు డబ్బింగ్ చెప్పారు. తెలుగులో నిత్యామీనన్ ఈ పనిని పూర్తి చేయగా, తమిళ వెర్షన్లో ఎల్సా పాత్రకు హీరోయిన్ శ్రుతీహాసన్ డబ్బింగ్ చెప్పారు. అంతేకాదు స్వతహాగానే గాయని, సంగీత దర్శకురాలైన శ్రుతీ ‘ఫ్రోజెన్ 2’ తమిళ వెర్షన్ కోసం మూడు పాటలు కూడా ఆలపించారు. ఈ విషయం గురించి శ్రుతీహాసన్ మాట్లాడుతూ– ‘‘అన్నా, ఎల్సాల మధ్య ఉండే అనుబంధం నన్ను ఎంతగానో ఆకట్టుకుంది. ఎల్సా పాత్రకు డబ్బింగ్ చెప్పాను. అన్నా, ఎల్సాల అనుబంధం నా చెల్లి అక్షరాహాసన్‌కు, నాకు ఉన్న అనుబంధంలా అనిపించింది. ఎల్సా పాత్ర ప్రతి అమ్మాయికి రోల్ మోడల్లా ఉంటుంది’’ అని అన్నారు శ్రుతి. ‘ఫ్రోజెన్ 2’ చిత్రం ఈ నెల 22న విడుదల కానుంది. -
నా గొంతు వినండి
‘వరల్డ్ ఫేమస్ లవర్’ కోసం తొలిసారి గొంతు సవరించారు కథానాయిక రాశీఖన్నా. తొలిసారి సొంతంగా డబ్బింగ్ చెప్పుకుంటూ తన మాటలు వినమంటున్నారు. విజయ్ దేవరకొండ హీరోగా క్రాంతిమాధవ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘వరల్డ్ ఫేమస్ లవర్’. ఇందులో రాశీఖన్నా, ఐశ్వర్యా రాజేశ్, క్యాథరిన్, ఇజాబెల్లా లెయితే కథానాయికలుగా నటించారు. కేయస్ రామారావు సమర్పణలో కె.ఎ వల్లభ నిర్మించారు. ఈ సినిమా కోసమే తొలిసారి తెలుగులో డబ్బింగ్ చెబుతున్నారు రాశీఖన్నా. ‘‘నా పాత్రకు డబ్బింగ్ చెప్పుకోవాలంటే నా గొంతు సరిగ్గా లేదేమోనని, పద ఉచ్చారణ లయ తప్పుతుందేమోనని కాస్త భయం ఉండేది. కానీ ఇప్పుడు డబ్బింగ్ చెబుతున్నాను. బాగా వస్తోంది. నేనే ఆశ్చర్యపోతున్నా. ప్రేక్షకులకు నా గొంతు వినిపించడానికి ఆత్రుతగా ఎదురుచూస్తున్నా’’ అని పేర్కొన్నారు రాశీఖన్నా. -
పాట.. మాట.. నటన
నటుడు సత్యప్రకాశ్ కుమారుడు నటరాజ్ ‘ఊల్లాలా ఊల్లాలా’ చిత్రం ద్వారా తెరంగేట్రం చేస్తున్నాడు. నటరాజ్, నూరిన్, అంకిత హీరో, హీరోయిన్లుగా నటించిన చిత్రమిది. ఏ. గురురాజ్ నిర్మించిన ఈ చిత్రానికి సత్యప్రకాశ్ దర్శకుడు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని నవంబర్‌లో విడుదల చేయనున్నారు. ఈ చిత్రంలో ఓ కీలక పాత్ర చేయడంతో పాటు, ఓ పాట పాడి, హీరోయిన్ నూరిన్‌కి డబ్బింగ్ చెప్పారు తెలంగాణ ఫోక్ సింగర్ మంగ్లీ. ‘‘బిగ్‌బాస్–2’ఫేమ్ రోల్ రైడా కూడా ఓ పాట పాడి, నటించారు’’ అని గురురాజ్ అన్నారు. -
కొంటె పిల్లడు.. గడసరి అమ్మడు
ఇంట్లో ఏమీ తెలియని అమాయకుడిలా ఉంటూ బయట మాత్రం మన్మథుడి వేషాలు వేసే ఓ అబ్బాయి.. ఇంట్లో పూజలు చేస్తూ బయట సిగరెట్ కాల్చే ఓ అమ్మాయి. ఇలాంటి కొంటె పిల్లాడి జీవితంలోకి వచ్చిన గడసరి అమ్మాయి చేసిన అల్లరి ఏంటి? వీరిద్దరి జీవితాల్లో ప్రేమ చిగురించిన తర్వాత జరిగిన పరిస్థితులు ఏంటి?... వంటి అంశాలతో తెరకెక్కిన చిత్రం ‘మన్మథుడు 2’. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో నాగార్జున, రకుల్ ప్రీత్‌సింగ్ జంటగా నటించారు. నాగార్జున, పి. కిరణ్ నిర్మించిన ఈ సినిమా ప్రస్తుతం డబ్బింగ్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇటీవల ఈ సినిమా టీజర్‌ను, రకుల్ పోషించిన అవంతిక పాత్ర టీజర్‌ను విడుదల చేశారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను ఈ నెల 25న విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఈ చిత్రంలోని ‘హే మానియా’ పాటను ఆదివారం విడుదల చేశారు. సీనియర్ నటి లక్ష్మి, రావు రమేష్, ఝాన్సీ, దేవదర్శిని, ‘వెన్నెల’ కిశోర్ తదితరులు నటించిన ఈ సినిమా ఆగస్టు 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకు చైతన్య భరద్వాజ్ సంగీతం అందించారు. -
జున్ను కోసం లయన్‌కి డబ్బింగ్ చెప్పా
‘‘నా గొంతు సినిమాలకు పనికిరాదని చెప్పినవాళ్లు ఇండస్ట్రీలో ఉన్నారు. కానీ, ఇప్పుడు నా గొంతు డిస్నీ సినిమాకు డబ్బింగ్ చెప్పే స్థాయికి చేరుకోవడం గర్వంగా ఉంది’’ అని నటుడు జగపతిబాబు అన్నారు. జాన్ ఫెవరూ దర్శకత్వం వహించిన హాలీవుడ్ చిత్రం ‘ద లయన్ కింగ్’. డిస్నీ వరల్డ్ స్టుడియోస్ సంస్థ నిర్మించిన ఈ సినిమా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ నెల 19న విడుదలవుతోంది. ఈ సినిమాలోని ముఫాసా, స్కార్, సింబా, నల, పుంబా, టిమోన్ పాత్రలకు తెలుగులో రవిశంకర్, జగపతిబాబు, నాని, లిప్సిక, బ్రహ్మానందం, అలీ డబ్బింగ్ చెప్పారు. ఈ చిత్రం తెలుగు ట్రైలర్‌ని విడుదల చేశారు. ఈ సందర్భంగా జగపతిబాబు మాట్లాడుతూ– ‘‘యానిమేషన్ చిత్రానికి డబ్బింగ్ చెప్పడం చాలా కష్టం. ఎందుకంటే జంతువుల్లోని భావాలు, భావనలకి అతికేలా డబ్బింగ్ చెప్పాలి. ఈ యానిమేషన్ చిత్రంలోనూ విలన్‌కు డబ్బింగ్ చెప్పాల్సి వచ్చింది. అన్ని వయసుల వారినీ మెప్పించే చిత్రమిది’’ అన్నారు. నాని మాట్లాడుతూ – ‘‘ఈ ఏడాది చేస్తున్న సినిమాలన్నీ నా కోసం, ప్రేక్షకుల కోసం. ‘ది లయన్ కింగ్’కి నా కొడుకు జున్ను కోసం (నాని కుమారుడు అర్జున్) డబ్బింగ్ చెప్పాను. జంతువుల హావభావాలకి అతికేలా డబ్బింగ్ చెప్పేటప్పుడు నవ్వుకునేవాణ్ని. భావోద్వేగభరితమైన కథతో రూపొందిన ఈ సినిమా అందరికీ బాగా నచ్చుతుంది’’ అన్నారు. ‘‘డిస్నీవారు తెరకెక్కించిన చిత్రానికి డబ్బింగ్ చెప్పడం నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నా’’ అన్నారు అలీ. -
నా పేరు సింబా
డిస్నీ సినిమాలను చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్లవరకూ అందరూ ఎంజాయ్ చేస్తారు. డిస్నీ సినిమాల్లో స్పెషల్‌గా నిలిచే చిత్రం ‘లయన్ కింగ్’. తండ్రి సింహం (ముఫాసా) చనిపోవడంతో తన రాజ్యాన్ని లయన్ కింగ్ (సింబా) ఎలా చూసుకుంది? అనే కథ ఆధారంగా ఈ యానిమేషన్ మూవీ 1994లో తెరకెక్కింది. తాజాగా ఈ చిత్రానికి కొత్త వెర్షన్‌ను తీసుకొస్తోంది డిస్నీ సంస్థ. ఈ సినిమాను ఇండియాలో పలు ప్రాంతీయ భాషల్లో డబ్ చేస్తున్నారు. తెలుగులో ముఫాసా పాత్రకు జగపతిబాబు, టిమోన్ అండ్ పుంబా పాత్రలకు అలీ, బ్రహ్మానందం డబ్బింగ్ చెప్పారు. తాజాగా సింబా పాత్రకు నాని డబ్బింగ్ చెప్పడం విశేషం. ‘‘ఈ ఏడాది నన్ను తండ్రి పాత్రలో (‘జెర్సీ’ సినిమా) చూశారు. ఇప్పుడు కొడుకు పాత్రలో వినిపించబోతున్నాను. ఈ జూలై నాకో కొత్త పేరు రాబోతోంది. అదే సింబా’’ అని ట్వీటర్లో పేర్కొన్నారు నాని. -
సింహానికి గొంతు అరువిచ్చిన సిద్ధార్థ్
తమిళసినిమా: చిత్రాలకు నేపథ్య వాయిస్‌ను ప్రముఖ నటులు ఇవ్వడం ఆ చిత్రాలకు అదనపు బలంగానే మారుతోంది. ఇటీవల నటుడు విజయ్‌సేతుపతి అవేంజర్స్ చిత్రంలోని హీరో పాత్రకు డబ్బింగ్ చెప్పిన విషయం తెలిసిందే. తాజాగా నటుడు సిద్ధార్థ్ ఏకంగా ఒక సింహానికే తన గొంతును అరువిచ్చారు. ఈ సంగతేంటో చూద్దాం. ఇంతకు ముందు హాలీవుడ్ చిత్రం ది జంగిల్‌బుక్ ఎంత సంచలన విజయాన్ని సాధించిందో తెలిసిందే. ఆ చిత్ర నిర్మాణ సంస్థ డిస్నీ తాజాగా నిర్మించిన చిత్రం లయన్‌కింగ్. ఇంతకు ముందు నిర్మించిన జంగిల్‌బుక్ చిత్రం తరహాలోనే యానిమేషన్ చిత్రం అయినా లయన్ కింగ్‌ను మరింత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి బలమైన, భావోద్రేకాలతో కూడిన కథ, కథనాలతో తెరకెక్కించినట్లు చిత్ర వర్గాలు తెలిపారు. ఒక సింహం తన వీరత్వాన్ని నిరూపించుకుని తనకుంటూ ఒక స్థానాన్ని అధిరోహించడమే లయన్‌కింగ్ చిత్ర ఇతివృత్తం అయినా, పలు విశేషాలతో కూడిన చిత్రంగా ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని కలిగిస్తుందని చెప్పారు. లవ్, యాక్షన్లతో కూడిన చిత్రాలను సిల్వర్‌స్క్రీన్ చూడడానికి ప్రేక్షకులు ఆసక్తిని కనబరుస్తారన్నారు. ముఖ్యంగా తమిళ ప్రేక్షకులను అద్భుతమైన విషయాలతో తరాల వారు కూడా ఇష్టపడే విధంగా ఈ చిత్రం ఉంటుందన్నారు. అలాంటి లయన్‌కింగ్ చిత్రంలో సింహం పాత్రకు తమిళ వెర్షన్లో నటుడు సిద్ధార్థ్ వాయిస్ ఇవ్వడం మరో విశేషంగా పేర్కొన్నారు. దీని గురించి ఆయన మాట్లాడుతూ సింహాన్ని తాను వెండితెరపైనా, వేదికపైనా తొలిసారిగా చూసిన అనుభవాన్ని ఎప్పటికీ మరచిపోనన్నారు. ఈ కాలంలో మరచిపోలేని క్లాసిక్ చిత్రం లయన్‌కింగ్‌లో సింబాగా తాను మాట్లాడటం, పాడటం మరువలేని అనుభవంగా పేర్కొన్నారు. సినిమాలో తన కొత్త అవతారాన్ని ప్రేక్షకులతో కలిసి చూడడానికి ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని సిద్ధార్థ్ పేర్కొన్నారు. ది జంగిల్ బుక్ చిత్ర దర్శకుడు జాన్ ఫేవరునే ఈ లయన్‌కింగ్ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రం తమిళం, తెలుగు, హిందీ, ఇంగ్లిష్ భాషల్లో జూలై 19న తెరపైకి రానుంది. -
జగపతిబాబు@ స్కార్ రవిశంకర్@ ముఫార్
కార్టూన్ నెట్‌వర్క్‌లో కామిక్ సీరియల్‌గా మొదలైన ‘లయన్ కింగ్’ని డిస్నీ వారు 2డి యానిమేటెడ్ సినిమాగా 1990లో విడుదల చేశారు. అప్పట్లో సూపర్ హిట్‌గా నిలిచిన ఈ సినిమాని ఇప్పుడు 3డి యానిమేటెడ్ టెక్నాలజీతో, కంప్యూటర్ గ్రాఫిక్స్ ఉపయోగించి ప్రేక్షకులకు సరికొత్త అనుభూతి ఇచ్చేందుకు డిస్నీ వారు ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగానే ‘లయన్ కింగ్’ కొత్త హంగులతో 3డి యానిమేటెడ్ సినిమాగా జూలై 19న విడుదల కానుంది. జాన్ ఫేవ్రేవ్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలోని స్కార్ పాత్రకి నటుడు జగపతి బాబు డబ్బింగ్ చెప్పగా, ముఫార్ పాత్రకి డబ్బింగ్ స్టార్, నటుడు పి.రవిశంకర్ డబ్బింగ్ చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా తెలుగుతో పాటు పలు భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది. -
సింహానికి మాటిచ్చారు
క్రూర మృగాలు మనషుల్లా మాట్లాడతాయి.. మిగతా మృగాలతో స్నేహం చేస్తాయి, కలిసి మెలిసి జీవిస్తాయి. జంతువు కనిపిస్తే చాలు వేటాడి తినేసే రారాజు సింహం తన రాజ్యంలో ఉన్న జంతువులను కాపాడుతూ ఉంటుంది. అవునా! అని ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇదంతా డిస్నీ వాళ్లు తయారు చేసిన ‘లయన్ కింగ్’ అనే సినిమా కథ. డిస్నీ కామిక్ పుస్తకాల్లో పుట్టిన ఈ సింహం పేరు సింబ. ఇదే ఈ సినిమా కథకి హీరో. టిమోన్ అనే ముంగిస, పుంబా అనే అడివి పంది కూడా ‘లయన్ కింగ్’ కథలో ముఖ్య పాత్రలు. జూలై 19న విడుదల కానున్న ఈ సినిమాకి బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ గాత్ర దానం చేశాడు. ముసాఫాకు షారుక్ డబ్బింగ్ చెప్పగా, ముసాఫా తనయుడు, సినిమాకు హీరో పాత్రైన సింబాకు షారుక్ తనయుడు ఆర్యన్ ఖాన్ డబ్బింగ్ చెప్పడం విశేషం. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు అన్ని ముఖ్య భాషల్లో ఈ సినిమాని విడుదల చేస్తున్నారు. కార్టూన్ ¯ð ట్‌వర్క్‌లో కామిక్ సీరియల్‌గా మొదలైన ‘లయన్ కింగ్’ ని డిస్నీ వారు 2డి ఆనిమేటెడ్ సినిమాగా 1990లో విడుదల చేశారు. అప్పట్లో సూపర్ హిట్‌గా నిలిచిన ఈ సినిమాని ఇప్పుడు 3డి ఆనిమేటెడ్ టెక్నాలజీతో, కంప్యూటర్ గ్రాఫిక్స్‌తో ‘లయన్ కింగ్’ ఫ్యాన్స్‌కి, కామిక్ అభిమానులకి సరికొత్త అనుభూతి ఇచ్చేందుకు మరో మారు డిస్నీ వారు ప్రయత్నిస్తున్నారు. -
నేనే డబ్బింగ్ చెప్పుకుంటా!
తమిళసినిమా: బాలీవుడ్ నటి అమిరా దస్తూర్ గుర్తుందా? ఆ మధ్య ధనుష్‌కు జంటగా అనేగన్ చిత్రంతో నాయకిగా నటించిది. దక్షిణాది చిత్రంలో నటిస్తున్నప్పుడు నన్ను చాలా కష్టపెట్టారంటూ ఆరోపణలు చేసి కలకలం సృష్టించింది కూడా. ఇప్పుడు గుర్తుకొచ్చే ఉంటుంది. అందాలారబోతకుసై అంటున్నా, అవకాశాలు అంతంత మాత్రంగానే రాబట్టుకుంటోందీ బ్యూటీ. అలా హిందీ, తెలుగు చిత్రాల్లోనూ నటిస్తున్న ఈ అమ్మడు చాలా కాలం తరువాత ఇప్పుడు మళ్లీ కోలీవుడ్‌లో బిజీ అవుతోంది. నటుడు సంతానం సరసస ఓడి ఓడి ఒళైక్కనుమ్ చిత్రంతో పాటు డాన్సింగ్ కింగ్ ప్రభుదేవాతోనూ ఒక చిత్రంలో రొమాన్స్ చేసే లక్కీచాన్స్‌ను దక్కించుకుంది. అంతే కాదు తమిళంలో ఎక్కువ చిత్రాలు చేయాలని కోరుకుంటున్నానంటోందట ఈ అమ్మడు. దీని గురించి అమిరా దస్తూరి తెలుపుతూ సంతానంకు జంటగా నటిస్తున్న ఓడి ఓడి ఒళైక్కనుమ్ చిత్ర నిర్మాణం చివరి దశకు చేరుకుందని చెప్పింది. ప్రస్తుతం ఆధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో ప్రభుదేవాతో కలిసి నటిస్తున్న చిత్ర షూటింగ్లో పాల్గొంటున్నట్లు తెలిపింది. ఇది యాక్షన్, థ్రిల్లర్ కథా చిత్రంగా ఉంటుందని చెప్పింది. ఇందులో తనది చాలా బలమైన పాత్ర అని తెలిపింది. ఆ పాత్రకు తానే డబ్బింగ్ చెబితే జీవం ఉంటుందని అనిపించిందంది. అందుకే తానే డబ్బింగ్ చెప్పాలని భావించానని చెప్పింది. అందుకే తమిళ భాషను నేర్చుకోవడానికి ఎక్కువ సమయాన్ని కేటాయిస్తున్నానని, ఈ చిత్రమే కాకుండా ఇకపై నటించే అన్ని చిత్రాలకు తన పాత్రలకు తానే డబ్బింగ్ చెప్పుకుంటానని చెప్పింది. అంతా బాగానే ఉంది గానీ సడన్‌గా ఆ డబ్బింగ్ చెప్పుకోవాలన్న కోరిక ఎందుకొచ్చిందమ్మడూ అని చెవులు కొరుక్కుంటున్నారు సినీ వర్గాలు. అసలే అవకాశాలు అరకొరగానే వస్తున్నాయి. దీంతో అవకాశాలను పెంచుకునేందుకే ఈ డబ్బింగ్ అంశాన్ని ముందుకు తీసుకొస్తోందా? అయినా ఈ జాణ డబ్బింగ్ చెబుతానన్నా, దర్శక నిర్మాతలు సరే అనాలిగా! చూద్దాం అమిరా దస్తూర్ డబ్బింగ్ ట్రిక్స్ ఏ మాత్రం పనిచేస్తుందో! -
నేనూ జీనీ లాంటి వాణ్ణే
‘‘డిస్నీ సినిమాలు అందరికీ తెలుసు. వాళ్ల యానిమేషన్ చిత్రాలు చాలానే చూశాను. ‘అలాద్దీన్’ చిత్రంలో వాయిస్ ఇవ్వాలని సంప్రదించినప్పుడు చాలా థ్రిల్ ఫీల్ అయ్యాం. ఇలాంటి సినిమాలు తెలుగువాళ్లు కూడా చూడాలని అంగీకరించాను’’ అని వెంకటేశ్ అన్నారు. విల్‌స్మిత్ ముఖ్యపాత్రలో రూపొందిన చిత్రం ‘అలాద్దీన్’. డిస్నీ సంస్థ నిర్మించింది. ఈ సినిమాలో జినీ పాత్రకు వెంకటేశ్, అలాద్దీన్ పాత్రకు వరుణ్ తేజ్ తెలుగు డబ్బింగ్ చెప్పారు. ఈ సినిమా ఈ నెల 24న విడుదల కానుంది. ఈ సందర్భంగా వెంకటేశ్ మాట్లాడుతూ– ‘‘జీనీ పాత్రకు డబ్బింగ్ చెప్పడం చాలా ఫన్‌గా ఉంది. క్రేజీ పాత్ర ఇది. చాలెంజింగ్‌గా ఉంది. డబ్బింగ్ చెబుతూ చాలా ఎంజాయ్ చేశాను. ఇందులో అలాద్దీన్ కోరుకుంటే నేను నెరవేరుస్తుంటాను. జనరల్‌గా కూడా కోరుకున్నది నెరవేర్చడం చాలా బావుంటుంది. ‘ఎఫ్ 2’ తర్వాత మళ్లీ వరుణ్ని గైడ్ చేసే పాత్ర రావడం అనుకోకుండా జరిగింది. మా పిల్లలకు నేను జీనీలాంటి వాణ్ణే. అడిగింది ఇస్తుంటాను’’ అన్నారు. వరుణ్ మాట్లాడుతూ– ‘‘చిన్నప్పటి నుంచి నేను, చెల్లి(నిహారిక) డిస్నీ సినిమాలు చూసేవాళ్లం. ఇప్పుడు డిస్నీ సినిమాలకే డబ్బింగ్ చెప్పడం లక్కీగా ఫీల్ అవుతున్నా. అలాద్దీన్‌లా మూడు కోరికలు వస్తే ప్రపంచమంతా సంతోషంగా ఉండాలని కోరుకుంటాను’’ అన్నారు. -
కథ చెబుతారట
అల్లాదిన్ అద్భుత దీపం కథను చిన్నప్పుడు చాలా సందర్భంలో వినే ఉంటాం. ఈ కథనే మళ్లీ మనందరికీ చెప్పడానికి వెంకటేశ్, వరుణ్ తేజ్ సిద్ధమయ్యారు. వాల్ట్ డిస్నీ నిర్మాణంలో విల్‌స్మిత్ ముఖ్య పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘అల్లాదిన్’. ఈ సినిమాలో జీని, అల్లాదిన్ పాత్రలకు వెంకటేశ్, వరుణ్ తేజ్ డబ్బింగ్ చెప్పారు. బ్లాక్‌బస్టర్ ‘ఎఫ్ 2: ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్’లో నటించాక వీ2 (వెంకీ, వరుణ్ ) ఈ సినిమాకి కలిసి డబ్బింగ్ చెప్పడం విశేషం అని చెప్పవచ్చు. మే 24న ‘అల్లాదిన్’ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. హాలీవుడ్ సినిమా అయినప్పటికీ మన స్టార్స్ వాయిస్ తోడైతే కచ్చితంగా సినిమా అన్ని వర్గాల వారికి చేరువ అవుతుందని భావించి నిర్మాతలు మన స్టార్స్‌తో డబ్బింగ్ చెప్పిస్తుంటారు. ఇటీవలే ‘అవెంజర్స్’లో థానోస్ పాత్రకు రానా డబ్బింగ్ చెప్పిన విషయం గుర్తుండే ఉంటుంది. -
డబ్బింగ్ షురూ
జనరల్‌గా ఆస్ట్రోనాట్ అంటే రాకెట్ లాంచింగ్ స్టేషన్లో బిజీ బిజీగా ఉంటారు. కానీ టాలీవుడ్ ఆస్ట్రోనాట్ వరుణ్ తేజ్ చెన్నై, హైదరాబాద్‌లోని స్కూల్స్‌కి వెళ్లొచ్చారు మరి.. స్టూడెంట్స్‌కు రాకెట్ గురించి ఏమైనా పాఠాలు చెప్పారా? లేక చిన్ననాటి జ్ఞాపకాలను వెతుక్కుంటూ వెళ్లారా? అనే విషయాలు ప్రస్తుతానికి సస్పెన్స్. ‘ఘాజీ’ ఫేమ్ సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా రూపొందిన చిత్రం ‘అంతరిక్షం 9000 కెఎమ్‌పిహెచ్’. లావాణ్యా త్రిపాఠి, అదితీరావ్ హైదరీ కథానాయికలుగా నటించారు. ప్రస్తుతం ఈ సినిమాకు డబ్బింగ్ చెబుతున్నారు వరుణ్ తేజ్. ‘‘ఫస్ట్ లుక్కు మంచి స్పందన లభించింది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు వేగంగా జరుగుతున్నాయి’’ అని చిత్రబృందం పేర్కొంది. సత్యదేవ్, అవసరాల శ్రీనివాస్ కీలక పాత్రలు చేసిన ఈ సినిమాకు ప్రశాంత్ విహారి స్వరకర్త. క్రిష్ సమర్పణలో సాయిబాబు, రాజీవ్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా డిసెంబర్ 21న రిలీజ్ కానుంది. -
సింగర్ చిన్మయిపై వేటు : మీటూ ఎఫెక్ట్?
ప్రముఖ గాయని, డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి శ్రీపాద మీటూ పేరుతో ఇండియాలో విస్తృతమైన ఉద్యమానికి ఊతమిచ్చిన వారిలో ప్రధాన వ్యక్తిగా పేర్కొనదగిన వ్యక్తి. ముఖ్యంగా తమిళ సినీరంగంలో పెద్దమనిషిగా, అవార్డు విన్నింగ్ రచయితగా, సెలబ్రిటీగా వెలుగొందుతున్న సినీ రచయిత వైరముత్తుపై లైంగిక ఆరోపణలు చేశారు. అంతేకాదు తన లాంటి అనేకమంది బాధితుల గోడును వెలుగులోకి తీసుకొచ్చారు. వారికి మద్దతుగా నిలిచారు. దీంతోపాటు ప్రముఖ నటుడు, తమిళనాడు ఫిలిం డబ్బింగ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రాధా రవిపై లైంగిక ఆరోపణలు చేసిన బాధితులకు కూడా చిన్నయి బహిరంగ మద్దతును ప్రకటించిన సంగతి తెలిసిందే. అదే ఇపుడు ఆమెకు కష్టాలు తెచ్చి పెట్టింది. తాజాగా తమిళ డబ్బింగ్ యూనియన్ నుంచి ఆమె సభ్యత్వానికి రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ విషయాన్ని చిన్నయి ట్విటర్ ద్వారా వెల్లడించారు. తనను డబ్బింగ్ యూనియన్నుంచి తొలగించారని ప్రకటించారు. అయితే ఈ రెండు సంవత్సరాలుగా తన డబ్బింగ్ ఫీజులోంచి 10శాతం ఎందుకు తీసుకున్నారని ఆమె ప్రశ్నించారు. తనపై వేటు నిర్ణయం కొనసాగితే, తమిళంలో 96లాంటి మంచి సినిమాలో హీరోయిన్ త్రిషకు చెప్పిన డబ్బింగ్ చివరిది అవుతుందని ఆమె ట్వీట్ చేశారు. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండానే తన సభ్యత్వాన్ని తొలగించడంపై ఆమె అభ్యంతరం వ్యక్తం చేశారు. అలాగే డబ్బింగ్ యూనియన్ ద్వారానే తనపై తొలి వేటు తాను ముందే అంచనా వేశానన్నారు. ఆరోపణలు వచ్చిన రాధారవిపై ఎలాంటి చర్యలు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. అటు ఈ పరిణామంపై నటి మంచు లక్ష్మి కూడా స్పందించారు. ఇది ఇలా వుంటే ఈ ప్రమాదాన్ని చిన్మయి ముందే ఊహించారు. తమిళ సినీ రంగంలో పేరొందిన నటుడు, యూనియన్ అధ్యక్షుడు రాధా రవి కారణంగా తన డబ్బింగ్ కరియర్ ప్రమాదంలో పడనుందంటూ అక్టోబర్ 9న ఒక ట్వీట్ చేయడం గమనార్హం. మరోవైపు గత రెండు సంవత్సరాలుగా డబ్బింగ్ యూనియన్‌కు చెల్లించాల్సిన సభ్యత్వ రుసుమును చెల్లించకపోవడమే ఇందుకు కారణంగా వివరించారు. మరి ఇన్నిరోజులుగా పలు సినిమాలకు చిన్మయి డబ్బింగ్ ఎలా చెప్పింది అన్న ప్రశ్నకు స్పందించిన సంఘం.. కేవలం పేరున్న ఆర్టిస్ట్ అన్నగౌరవంతోనే ఆమెకు మినహాయింపు నిచ్చినట్టు చెప్పుకొచ్చారు. కాగా సినీ నేపథ్యగాయనిగానే కాకుండా డబ్బింగ్ ఆర్టిస్టుగా చిన్మయి పేరు తెచ్చుకున్నారు. ముఖ్యంగా తెలుగులో సమంత, తమిళంలో త్రిషలాంటి హీరోయిన్లకు చిన్మయి తన గొంతును అరువిచ్చారు. వారి నటనకు చిన్మయి డబ్బింగ్ ప్రాణం పోసిందంటే అతిశయోక్తి కాదు. Sooo given to understand that I have been terminated from the dubbing union. Which means I can longer dub in Tamil films henceforth. The reason stated is that I haven’t paid ‘subscription fees’ for 2 years though this hasn’t stopped them from taking 10% off my dubbing income — Chinmayi Sripaada (@Chinmayi) November 17, 2018 I can see my Dubbing career go up in smoke now. He heads the dubbing union. — Chinmayi Sripaada (@Chinmayi) October 9, 2018 Anyway I always knew my career would be done with. Society is run by the powerful. The predators will NEVER be questioned. Neither will disciplinary action be taken against them. Fact that Mr Radha Ravi is still President of the Dubbing Union despite all the allegations https://t.co/gFrQJJuXIa — Chinmayi Sripaada (@Chinmayi) November 17, 2018 Wth!!! They cant do that to you!! This is ridiculous!! https://t.co/4IW4yLAwUC — Lakshmi Manchu (@LakshmiManchu) November 17, 2018 -
గోవా బ్యూటీ తెలుగు పలుకులు
‘దేవదాసు’ చిత్రంతో తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమయ్యారు గోవా బ్యూటీ ఇలియానా. ఆమె టాలీవుడ్‌కి వచ్చి 12ఏళ్లు అవుతున్నా ఇప్పటి వరకూ తన పాత్రకు డబ్బింగ్ చెప్పలేదు. తాజాగా ‘అమర్ అక్బర్ ఆంటొని’ సినిమా కోసం తొలిసారి తెలుగు పలుకులు పలుకుతున్నారామె. రవితేజ, ఇలియానా జంటగా శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘అమర్ అక్బర్ ఆంటొని’. నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్, మోహన్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 16న విడుదలవుతోంది. ఆరేళ్ల కిందట విడుదలైన ‘దేవుడు చేసిన మనుషులు’ చిత్రం తర్వాత బాలీవుడ్ వెళ్లిన ఇలియానా ‘అమర్ అక్బర్ ఆంటొని’ సినిమాతో టాలీవుడ్‌కి రీ–ఎంట్రీ ఇస్తున్నారు. ఈ చిత్రంలో ఇలియానా చేసిన పాత్రకు ఆమెతోనే డబ్బింగ్ చెప్పించాలని శ్రీను వైట్ల అనుకున్నారు. నాలుగు రోజుల్లోనే ఇలియానా డబ్బింగ్ పార్ట్‌ని పూర్తి చేయడం విశేషం. ఈ సినిమా ప్రీ–రిలీజ్ ఫంక్షన్‌ని రేపు (శనివారం) నిర్వహించనున్నారు. ఈ చిత్రానికి సంగీతం: తమన్, కెమెరా: వెంకట్ సి.దిలీప్, సహనిర్మాత: ప్రవీణ్ మార్పురి. -
ఈసారి వినిపిస్తా!
‘సవ్యసాచి’తో తొలిసారి స్ట్రయిట్ తెలుగు చిత్రంలో తెలుగు ప్రేక్షకులను పలకరించారు మాధవన్. ఈ చిత్రంలో మాధవన్ పోషించిన నెగటివ్ పాత్రకు మంచి అభినందనలు కూడా వస్తున్నాయి. ప్రస్తుతం మాధవన్ ‘రాకెట్రీ: ది నంబీ ఎఫెక్ట్’ అనే చిత్రంలో యాక్ట్ చేస్తున్నారు. శాస్త్రవేత్త నంబీ నారాయణ్ జీవితం ఆధారంగా తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని అనంత్ మహదేవ్‌తో కలసి దర్శకత్వ బాధ్యతలు కూడా చేపడుతున్నారు మాధవన్. ఈ సినిమా తెలుగు, తమిళ, హిందీ, మలయాళ భాషల్లో తెరకెక్కుతోంది. ఈ చిత్రం తెలుగు వెర్షన్‌కు మాధవన్ సొంతంగా డబ్బింగ్ చెప్పుకోనున్నారు. ‘‘సవ్య సాచి’ సినిమాలో పాత్రకు డబ్బింగ్ చెప్పాలనుకున్నా అనివార్య కారణాల వల్ల కుదరలేదు. ఈ సినిమా చేస్తున్నప్పుడు నా సినిమాలను ఫాలో అయ్యేవాళ్లు తెలుగు రాష్ట్రాల్లో చాలామంది ఉన్నారని తెలుసుకున్నాను. అందుకే ‘రాకెట్రీ’ సినిమాలో నా గొంతునే వినిపిస్తాను’’ అని మాధవన్ పేర్కొన్నారు. -
గొంతు పోయింది!
ఇప్పటి హీరోయిన్లలో కొందరు తమ పాత్రకు తమ గొంతునే వినిపించుకోవాలని అనుకుంటున్నారు. అందుకోసమే కొంచెం కష్టమైనా శ్రద్ధగా పరభాషను నేర్చుకొని డబ్బింగ్ చెప్పుకుంటున్నారు. ఇప్పుడు తాజాగా ఈ లిస్ట్‌లోకి వరలక్ష్మీ శరత్‌కుమార్ కూడా జాయిన్ అయ్యారు. అంతే కాదు డబుల్ ధమాకా ఇవ్వనున్నారు. విజయ్ హీరోగా తెరకెక్కిన ‘సర్కార్’, విశాల్ ‘పందెం కోడి 2’లో కీలక పాత్రలు పోషిస్తున్నారు వరలక్ష్మీ. ఈ రెండు సినిమాలకు సొంతంగా తెలుగులో డబ్బింగ్ చెప్పుకున్నారామె. ‘‘డబ్బింగ్ చెప్పీ చెప్పీ గొంతు పోయింది. కానీ దానికి తగ్గ ఫలితం ఉంటుందని అనుకుంటున్నాను. ‘పందెం కోడి 2’ ఈ నెల 18న రిలీజ్ కాబోతోంది. సూపర్‌గా ఉంటుంది’’ అని పేర్కొన్నారు వరలక్ష్మీ శరత్‌కుమార్. ‘సర్కార్’ నవంబర్‌లో రానుంది. -
తెలుగులో అమితాబ్, ఆమిర్..!
తొలిసారిగా బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్ కలిసి నటిస్తున్న సినిమా థగ్స్ ఆఫ్ హిందుస్తాన్. యాక్షన్ అడ్వంచరస్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు ధూమ్ 3 ఫేం విజయ్ కృష్ణ ఆచార్య దర్శకుడు. కన్ఫెషన్స్ ఆఫ్ థగ్స్ నవల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాను యష్ రాజ్ ఫిలింస్ సంస్థ భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న థగ్స్ ఆఫ్ హిందుస్తాన్ సినిమాను దక్షిణాది భాషల్లోనూ రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా ప్రమోషన్ కార్యక్రమాలను కూడా వినూత్నంగా ప్రారంభించారు. బిగ్ బి అమితాబ్ బచ్చన్‌తో పాటు ఆమిర్ ఖాన్ స్వయంగా తెలుగులో మాట్లాడుతూ తమ సినిమా తెలుగు రాష్ట్రాల్లో దీపావళి సందర్భంగా రిలీజ్ అవుతుందని తెలిపారు. హిందీ వర్షన్ తో పాటు నవంబర్ 8న తెలుగు, తమిళ భాషల్లోనే ఒకేసారి రిలీజ్ అవుతోంది థగ్స్ ఆఫ్ హిందుస్తాన్. For the first time @SrBachchan and @aamir_khan are coming together to give you a Diwali Dhamaka. #ThugsOfHindostan releasing on 8th November in Telugu! #KatrinaKaif | @fattysanashaikh | #VijayKrishnaAcharya | @yrf pic.twitter.com/EwXzT30J1t — #ThugsOfHindostan (@TOHTheFilm) 26 September 2018 -
ఒక రోజు.. 3 సినిమాలు
జనరల్‌గా ఒక సినిమా షూటింగ్‌లోనే కథానాయికల డే అంతా ముగిసిపోతుంది. కానీ శనివారం పూజా హెగ్డే ఏకంగా మూడు డిఫరెంట్ సినిమాల వర్క్‌లో భాగమై మంచి వర్కింగ్ డేను ఎంజాయ్ చేశారామె. ముందుగా త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న ‘అరవింద సమేత వీర రాఘవ’ సినిమాకు డబ్బింగ్ చెప్పారు. ఆ నెక్ట్స్ మహేశ్‌బాబు హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందుతున్న ‘మహర్షి’ సినిమా సెట్లో జాయిన్ అయ్యారు. ఫైనల్‌గా ప్రభాస్ హీరోగా రాధాకృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ప్రీ–ప్రొడక్షన్ వర్క్స్‌లో భాగమయ్యారు. ఇలా ఒకే రోజు మూడు సినిమాలకు సంబంధించిన పనుల్లో భాగమయ్యారు. ఈ విషయాలన్నింటినీ ఆమె సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. -
ఇప్పుడు పూజా వంతు!
దాదాపు నాలుగేళ్లు పూర్తి కావొస్తోంది హీరోయిన్ పూజా హెగ్డే తెలుగు తెరపైకి ఎంట్రీ ఇచ్చి. ఇప్పుడీ విషయాన్ని ఎందుకు గుర్తుచేస్తున్నాం అంటే ఓ కారణం ఉంది. ఇప్పటివరకు ఆమె పాత్రలకు డబ్బింగ్ ఆర్టిస్టులు వాయిస్ ఇచ్చారు. ఇప్పుడు ‘అరవింద సమేత వీర రాఘవ’ సినిమా కోసం పూజా సొంతంగా తెలుగులో డబ్బింగ్ చెప్పుకుంటున్నారు. ఇటీవల సమంత, కీర్తీ సురేశ్, అనూ ఇమ్మాన్యుయేల్ ఇలా కొందరు సొంత గొంతు వినిపించారు. ఇప్పుడు పూజా వంతు వచ్చింది. ఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘అరవింద సమేత వీర రాఘవ’ సినిమాకు తమన్ స్వరకర్త. ఈ ఏడాది దసరాకు ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలనుకుంటున్నారు. -
ఇప్పుడు రితిక
అనూ ఇమ్మాన్యుయేల్, కీర్తీ సురేశ్, సమంత రీసెంట్గా అదితీ రావ్ హైదరీ తమకు తామే సొంతంగా తెలుగులో డబ్బింగ్ చెప్పుకున్నారు. తాజాగా ఈ లిస్ట్‌లోకి రితికా సింగ్ చేరారు. ఆది పినిశెట్టి, తాప్సీ, రితికా సింగ్ ముఖ్య తారలుగా కోన ఫిలిమ్ కార్పొరేషన్, ఎం.వి.వి సినిమా పతాకాలపై హరినాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘నీవెవరో’. ‘లవ్ ఈజ్ బ్లైండ్ నాట్ ది లవర్’ అనేది ట్యాగ్‌లైన్. రీసెంట్గా ఈ సినిమా మోషన్ పోస్టర్‌ను కొరటాల శివ లాంచ్ చేశారు. ఈ సినిమాలోని తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకుంటున్నారు రితికాసింగ్. ‘‘నా రెండో తెలుగు సినిమా ‘నీవెవరో’ చిత్రానికి డబ్బింగ్ చెబుతున్నాను. ముందు నేను చెప్పగలనా? అనుకున్నాను. ఎందుకంటే నాకు తెలుగు పూర్తిగా రాదు. కానీ భరద్వాజ్ ఎంతో సహాయం చేశారు’’ అని పేర్కొన్నారు రితికా సింగ్. వెంకటేశ్ నటించిన ‘గురు’ ద్వారా రితికా తెలుగుకి పరిచయమైన విషయం గుర్తుండే ఉంటుంది. -
సిక్సర్
రయ్ రయ్ మంటూ కెరీర్లో దూసుకెళ్తున్నారు సమంత. అయితే ఈ ఏడాది ఆమె కెరీర్లో సమ్‌థింగ్ స్పెషల్ అనే చెప్పవచ్చు. ఆల్రెడీ ‘రంగస్థలం’, ‘మహానటి’(తమిళంలో ‘నడిగయర్ తిలగం’), ‘ఇరంబుదురై’ (తెలుగులో ‘అభిమన్యుడు’) సినిమాలతో సిల్వర్ స్క్రీన్‌పై మెరిసిన ఈ బ్యూటీ తాజాగా ‘యు టర్న్’ సినిమాలో తన షూటింగ్‌ను కంప్లీట్ చేశారు. పవన్‌కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ఆది పినిశెట్టి, భూమిక, రాహుల్ రవీంద్రన్ కూడా ముఖ్య తారలుగా నటిస్తున్నారు. శ్రీనివాస్ చిట్టూరి నిర్మాత. ‘‘ఇంకో సినిమా (యు టర్న్) షూటింగ్‌ను కంప్లీట్ చేశా. ఇక డబ్బింగ్ స్టార్ట్ చేయాలి’’ అన్నారు సమంత. ఈ సినిమాకు సోమవారం నుంచి సమంత డబ్బింగ్ చెప్పనున్నారు. తమిళంలో శివకార్తీకేయన్ హీరోగా ‘సీమరాజా’, విజయ్‌సేతుపతి, ఫాహద్ ఫాజిల్ నటించిన ‘సూపర్ డీలక్స్’ సినిమాలను కూడా కంప్లీట్ చేశారు సమంత. ఈ సినిమాలు కూడా ఈ ఏడాదిలోనే రిలీజ్ కానున్నాయి. షూటింగ్ ఎప్పుడు ప్రారంభమయ్యాయన్నది పక్కన పెడితే ఈ ఏడాది ఇప్పటి వరకూ సమంత అరడజను సినిమాల షూటింగ్‌ను కంప్లీట్ చేసి సిక్సర్ కొట్టారు. ‘నిన్నుకోరి’ ఫేమ్ శివ నిర్వాణ దర్శకత్వంలో సమంత, నాగచైతన్య ఓ సినిమా చేయనున్నారు. సో.. ఈ సినిమానే సమంత నెక్ట్స్ చిత్రం అని ఊహిస్తున్నారు సినీ లవర్స్. -
డబ్బింగ్ చెప్పానోచ్..
కొన్నిసార్లు మనసుకి నచ్చిన పాత్రలు చేసినప్పుడు డబ్బింగ్ వేరే వాళ్లు చెబితే నటిగా తమకు పరిపూర్ణత ఉండదని ఫీల్ అవుతుంటారు హీరోయిన్లు. అందుకే వాళ్ల పాత్రలకు వాళ్లే డబ్బింగ్ చెప్పుకుంటుంటారు. మేఘా ఆకాశ్ కూడా ఫస్ట్ టైమ్ డబ్బింగ్ చెప్పుకున్నారు. అధర్వ మురళి, మేఘా ఆకాశ్ జంటగా రూపొందిన తమిళ చిత్రం ‘బూమర్యాంగ్’. ఈ సినిమాలో మేఘ బాగా నటించారని, వేరేవాళ్లు డబ్బింగ్ చెబితే ఆ కంప్లీట్‌నెస్ పోతుందేమోనని దర్శకుడు కన్నన్ భావించారట. దాంతో తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకున్నారు మేఘ. ‘‘డబ్బింగ్ చెప్పడం సరదాగా అనిపించింది’’ అన్నారు మేఘ. నిజానికి మేఘ మాతృభాష తమిళ్. మరి.. మదర్ టంగ్‌లో డబ్బింగ్ చెబితే విశేషం ఏంటి అంటున్నారా? కొందరు నాయికలు మాతృభాషలో కూడా సొంత గొంతు వినిపించరు. వేరేవాళ్లు డబ్బింగ్ చెప్పాల్సిందే. -
తుఫాను వచ్చే ముందు నిశ్శబ్దంలా.. : సమంత
ఈ ఏడాది ప్రథమార్థం సమంతకు బాగా కలిసొచ్చింది. కేవలం సినిమాలు విజయవంతం కావడమే కాదు.. నటిగానూ ఎంతో పేరు వచ్చింది. రంగస్థలం సినిమాలో రామలక్ష్మిగా అలరించిన సమంత, మహానటిలో మధుర వాణీ పాత్రలో జీవించారు. ఇవి రెండూ టాలీవుడ్ చరిత్రలో నిలిచిపోయే చిత్రాలే. రీసెంట్గా వచ్చిన అభిమన్యుడు సినిమా కూడా విజయవంతంగా దూసుకెళ్తోంది. మరి ద్వితీయార్థం సమంతకు ఎలా ఉంటుందో చూడాలి. సెకండాఫ్ కూడా విజయాలను ఇస్తుందని చాలా నమ్మకంగా ఉన్నట్లు కనిపిస్తున్నారు సమంత. ఇదే విషయమై సమంత స్పందిస్తూ.. ‘తుఫాను వచ్చే ముందు ఉండే నిశ్శబ్దంలా..... ఫస్ట్ హాఫ్ సక్సెస్ అయినట్లు సెకండాఫ్ కూడా ఉండబోతోంది... యూ టర్న్ మూవీకి డబ్బింగ్ మొదలైంది’ అంటూ ట్వీట్ చేశారు. కన్నడ చిత్రానికి రీమేక్‌గా తెరకెక్కుతున్న ఈ మూవీకి పవన్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. The calm before the storm !! Prepping for the second half of the year ,after an amazing first half 💪. #SuperDeluxe #Uturn #Seemaraja Dubbing begins !! pic.twitter.com/bKZ7YS4Enp — Samantha Akkineni (@Samanthaprabhu2) June 7, 2018 -
రీ–ఎంట్రీతో వినిపించబోతున్నారు
‘ఇడియట్, శివమణి’ సినిమాలతో తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు బెంగళూరు బ్యూటీ రక్షిత. 2007లో దర్శకుడు ప్రేమ్‌తో పెళ్లి జరగడంతో సినిమాలకు స్వస్తి చెప్పేశారామె. సిల్వర్ స్క్రీన్కు దూరం అయినప్పటికీ టెలివిజన్ షోలకు న్యాయ నిర్ణేతగా చేస్తున్నారు రక్షిత. ఆల్మోస్ట్ పదేళ్ల తర్వాత సిల్వర్ స్క్రీన్‌కి రీ–ఎంట్రీ ఇస్తున్నారు రక్షిత. కానీ ఈసారి రక్షిత కనిపించరు.. వినిపించబోతున్నారు. సుదీప్, శివరాజ్ కుమార్ హీరోలుగా భర్త ప్రేమ్ రూపొందిస్తున్న కన్నడ సినిమా ‘విలన్’లో హీరోయిన్ అమీ జాక్సన్ పాత్రకు డబ్బింగ్ చెప్పబోతున్నారట. ‘‘ప్రేమ్‌తో వర్క్ చేయడం అంత సులువేం కాదు. అతను పర్ఫెక్షనిస్ట్. కొన్నికొన్ని సార్లు డైలాగ్‌ను 20 సార్లు చెప్పించేవారు. ఎంత పెద్ద డైలాగ్‌ని అయినా ముక్కలుగా కట్ చేసి చెప్పించరు. మొత్తం చెప్పాల్సిందే. ఎన్ని టేక్స్ అయినా ఆయనకు సంబంధం లేదు. గతంలో నా పాత్రలకు నేనే డబ్బింగ్ చెప్పాను. కానీ వేరే వాళ్లకు డబ్ చేయడం చాలా డిఫరెంట్‌గా ఉంది’’ అని పేర్కొన్నారు రక్షిత. -
డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా మారిన హీరోయిన్
ఇడియట్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది కన్నడ భామ రక్షిత. పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉన్న ఆమె డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు. భర్త ప్రేమ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘‘విలన్’’ సినిమాలో నటి అమీ జాక్సన్ పాత్రకు డబ్బింగ్ చెబుతున్నారామె. పునీత్‌రాజ్‌కుమార్ హీరోగా 2002లో వచ్చిన ‘‘అప్పు’’ సినిమాతో రక్షిత తెరంగేట్రం చేశారు. 2002లో వచ్చిన ‘‘ఇడియట్’’ తెలుగులో ఆమె మొదటి సినిమా. తెలుగులో అగ్రతారలైన చిరంజీవి, నాగార్జున, మహేశ్‌బాబులతో పలు సినిమాలలో కలిసి నటించిందామె. 2007లో కన్నడ సినిమా దర్శకుడు ప్రేమ్‌తో వివాహం అయిన తర్వాత సినిమాలకు దూరంగా ఉన్నారు. ఈ మధ్యే కొన్ని టీవీ షోలతో బిజీగా ఉన్న ఆమె మరోసారి భర్త సినిమా కోసం తన గొంతును సవరించుకున్నారు. రక్షిత మాట్లాడుతూ.. కేవలం తన పాత్రలకు మాత్రమే డబ్బింగ్ చెప్పుకున్న ఆమె ఇలా ఇతరుల పాత్రకు డబ్బింగ్ చెప్పడం కొత్తగా ఉందన్నారు. ఇలా ఇతరులక డబ్బింగ్ చెప్పడం ఇష్టంగా, చాలా సంతోషంగా ఉందన్నారు. -
అల్లుడు.. డబ్బింగ్ షురూ
మెగాస్టార్ చిరంజీవి చిన్నల్లుడు కల్యాణ్ దేవ్ హీరోగా పరిచయం అవుతోన్న విషయం తెలిసిందే. ‘జతకలిసే’ ఫేమ్ రాకేష్ శశి దర్శకత్వంలో సాయి కొర్రపాటి నిర్మాణ సారథ్యంలో రజిని కొర్రపాటి నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ చివరి దశలో ఉంది. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. కల్యాణ్ దేవ్ గురువారం డబ్బింగ్ ప్రారంభించారు. దర్శక–నిర్మాత మాట్లాడుతూ– ‘‘ఒక వినూత్నమైన కాన్సెప్ట్‌తో తెరకెక్కుతోన్న చిత్రమిది. ‘బాహుబలి’ కెమెరామ్యాన్ సెంథిల్ కుమార్ మా చిత్రానికి కెమెరా బాధ్యతలు నిర్వర్తించారు. ‘రంగస్థలం’ చిత్రంతో కళా దర్శకుడిగా ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న రామకృష్ణ మా సినిమాకి ఆర్ట్ డైరెక్టర్‌గా వర్క్ చేశారు. హర్షవర్ధన్ రామేశ్వర్ చక్కటి సంగీతం సమకూర్చారు. త్వరలో టైటిల్, రిలీజ్ డేట్‌ను ప్రకటిస్తాం’’ అన్నారు. ఈ చిత్రానికి సమర్పణ: సాయి శివాని. -
చరణ్ సినిమాకు భారీ ఆఫర్
రంగస్థలం సినిమాతో ఘనవిజయం అందుకున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. మాస్ యాక్షన్ స్పెషలిస్ట్‌గా పేరు తెచ్చుకున్న బోయపాటి రామ్ చరణ్ హీరోగా పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ను రెడీ చేస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకు ఉత్తరాది నుంచి భారీ ఆఫర్స్ వస్తున్నాయి. బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన సరైనోడు హిందీ డబ్బింగ్ వర్షన్‌ను ఆన్లైన్లో 16 కోట్ల మందికి పైగా వీక్షించారు. దీంతో బోయపాటి సినిమాల హిందీ డబ్బింగ్ వర్షన్లకు భారీ క్రేజ్ ఏర్పడింది. చరణ్ కూడా బాలీవుడ్ ప్రేక్షకులకు సుపరిచితుడు కావటంతో వీరిద్దరి కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమా హిందీ డబ్బింగ్ రైట్స్‌కు భారీ డిమాండ్ ఏర్పడింది. తాజాగా ఓ ఉత్తరాది సంస్థ ఈ సినిమా అనువాద హక్కులను 21 కోట్లకు సొంతం చేసుకున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. రామ్ చరణ్ సరసన కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తున్న ఈసినిమాలో బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ ప్రతినాయక పాత్రలో కనిపించనున్నాడు. -
విస్మయపరుస్తున్న ఆది ’రంగస్థలం’ డబ్బింగ్ వీడియో
-
అన్ని భాషల్లో మహేష్
భరత్ అనే నేను చిత్రంపై ప్రేక్షకుల నుంచే కాదు.. ప్రముఖలు కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు. మరోవైపు కలెక్షన్లు సునామీ కొనసాగుతున్న వేళ ఈ చిత్రం రీమేక్ గురించి ఊహాగానాలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో దర్శకుడు కొరటాల శివ స్పందించారు. ఈ చిత్రాన్ని రీమేక్ చేసే ఆలోచన లేదని స్పష్టం చేశారు. ‘సమకాలీన రాజకీయాలు, సందేశాత్మకంగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని రీమేక్ చేయాలన్న ఆలోచన మొదటి నుంచే లేదు. మిగతా భాషల్లో కూడా దీనిని డబ్ చేసి వదలబోతున్నాం. పొలిటికల్ నేపథ్యం కారణంగా ప్రతీ పౌరుడు ఈ చిత్రానికి కనెక్ట్ అయ్యే అవకాశం ఉంది. మిగతా చోట్ల కూడా విజయం సాధిస్తుందని ఆశిస్తున్నాం’ అని కొరటాల పేర్కొన్నారు. -
క్రీమ్ బన్.. డబ్బింగ్ డన్
మధురవాణి పాత్రలో సమంత షూటింగ్ డన్. లేటెస్ట్గా ఫస్ట్‌టైమ్ తెలుగులో డబ్బింగ్ ఆల్సో డన్. సో.. సమంత వెల్డన్. అందాల అభినేత్రి సావిత్రి జీవితం ఆధారంగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తమిళ, తెలుగు భాషల్లో రూపొందిన సినిమా ‘మహానటి’. తమిళంలో ‘నడిగర్ తిలగం’ అనే టైటిల్ పెట్టారు. కీర్తీ సురేశ్, సమంత, మోహన్‌బాబు, రాజేంద్రప్రసాద్, నాగచైతన్య, దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ తదితరులు నటించారు. సావిత్రి పాత్రలో కీర్తీ సురేశ్ నటించారు. జర్నలిస్ట్ మధురవాణి పాత్రలో సమంత నటించారు. ఆల్రెడీ దుల్కర్సల్మాన్, భానుప్రియ డబ్బింగ్‌ను కంప్లీట్ చేశారట. తాజాగా సమంత కంప్లీట్ చేశారు. ‘మహానటి’ సినిమాతో తొలిసారి సమంత సొంతగా డబ్బింగ్ చెప్పుకోవడం విశేషం. ‘‘క్రీమ్ బన్ తింటూ డబ్బింగ్‌ను కంప్లీట్ చేశా’’ అన్నారు సమంత. ‘మహానటి’ చిత్రం మే 9న రిలీజ్ కానుంది. -
నాకు ఆమె డబ్బింగా!
సాక్షి సినిమా: నా పాత్రకు ఆ నటి డబ్బింగ్ చెప్పారా? అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు నటి కీర్తీసురేశ్. ఈ బ్యూటీ ఇంతకు ముందు నటించిన చిత్రాలు వేరు, తాజాగా నటించిన నడిగైయార్ తిలగం చిత్రం వేరు. ఈ చిత్రం కీర్తీసురేశ్‌కు ప్రత్యేకం అన్న మాట చాలా చిన్నదే అవుతుంది. మహానటి సావిత్రి పాత్రలో నటించే అవకాశం రావడం అంత సులభం కాదు. ఆమెలా నటించడం సాధారణ విషయం కాదు. సావిత్రి జీవిత చిరిత్రతో తెరకెక్కుతున్న ఈ చిత్రం తెలుగులోనూ మహానటి పేరుతో రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇతర ప్రధాన పాత్రల్లో సమంత, దుల్కర్సల్మాన్, మోహన్‌బాబు, విజయ్‌దేవరకొండ ఇలా పలువురు నటిస్తున్నారు. నాగ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని మే 9న విడుదలకు సిద్ధం అవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో నటి కీర్తీసురేశ్ పాత్రకు సీనియర్ నటి భానుప్రియ డబ్బింగ్ చెప్పారనే ప్రచారంసామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. దీనికి స్పందించిన కీర్తిసురేశ్ తన పాత్రకు నటి భానుప్రియ డబ్బింగ్ చెప్పారనే ప్రచారంలో నిజం లేదన్నారు. రెండుభాషల్లోనూ తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకున్నానని, ఇప్పటికే తెలుగు వెర్షన్‌కు డబ్బింగ్ పూర్తి చేశానని, నడిగైయార్ తిలగం తమిళ వెర్షన్‌కు ప్రస్తుతం డబ్బింగ్ చెబుతున్నానని పేర్కొన్నారు. నటి భానుప్రియ ఈ చిత్రంలో నటించారన్నారు. మొత్తం మీద ఈ ద్విభాషా చిత్రంలో నటి భానుప్రియ కూడా నటించారన్న విషయాన్ని కీర్తీసురేశ్ వెల్లడించారు. అయితే అది ఏ పాత్ర అన్నది ఆసక్తిగా మారిందిప్పుడు. ఇదిలా ఉండగా నటి కీర్తీసురేశ్ తాజాగా తన పేరుతో ఒక వెబ్‌సైట్‌ను ప్రారంభించారట. అందులో తన చిత్రాలవివరాలను అభిమానులు తెలుసుకునేఅవకాశం ఉంటుందన్నమాట. -
నాలుగు భాషల్లో ‘రంగస్థలం’
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన సూపర్ హిట్ సినిమా రంగస్థలం. ఇప్పటికే వందకోట్ల షేర్ మార్కును దాటి దూసుకుపోతున్న ఈ సినిమా విజయోత్సవ వేడుకను ఈ రోజు (శుక్రవారం) సాయంత్రం అభిమానుల సమక్షంలో ఘనంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హజరవుతున్నారు. తాజాగా రంగస్థలం సినిమాకు సంబంధించిన మరో ఆసక్తికర వార్త అభిమానులను ఖుషీ చేస్తోంది. ఈ సినిమా రిలీజ్‌కు ముందే.., రామ్ చరణ్ తమిళ్లోకి అనువాదం చేసే ఆలోచన ఉన్నట్టుగా తెలిపారు. అయితే తాజా సమాచారం ప్రకారం రంగస్థలం సినిమాను తమిళ్‌తో పాటు మరో మూడు భాషల్లోకి అనువదించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారట. తమిళ్‌తో పాటు మలయాళం, హిందీ, భోజ్‌పురి భాషల్లోకి కూడా అనువదించనున్నారని తెలుస్తోంది. ప్రస్తుతానికి ఈ విషయంపై చిత్రయూనిట్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటనా రాలేదు. త్వరలోనే డబ్బింగ్ వర్షన్ల రిలీజ్‌పై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. రామ్ చరణ్ సరసన సమంత హీరోయిన్గా నటించిన ఈ సినిమాలో ఆది పినిశెట్టి, అనసూయ, జగపతి బాబు, ప్రకాష్ రాజ్‌లు ఇతర కీలక పాత్రల్లో నటించారు. -
అవెంజర్స్‌తో జతకట్టిన భళ్లాల దేవ
సాక్షి, హైదరాబాద్ : హాలీవుడ్ సినిమాలో మన తెలుగు నటుడా అని ఆశ్చర్యపోకండి. రానా దగ్గుబాటి హాలీవుడ్లో జతకట్టింది నటనతో కాదు..సినిమాలో ఓ పాత్రకు డబ్బింగ్ చెప్పడం ద్వారా ఆ రూట్లో ఎంట్రీ ఇచ్చారు. అవెంజర్స్ సిరీస్‌లోనే భారీ అంచనాలతో విడుదల కాబోతున్న చిత్రం అవెంజర్స్ ఇన్ఫినిటీ వార్. ఈ సినిమాలో హీరోలను ఢీ కొట్టే సింగిల్‌మన్ ఆర్మీ.. అదే విలన్ తానోస్ పాత్రకు డబ్బింగ్ చెప్పారట రానా. మరో సారి భళ్లాలదేవ విలనిజాన్ని తెర మీద వినబోతున్నారు ప్రేక్షకులు. రానా మాట్లాడుతూ.. తాను చిన్నప్పటి నుంచి మార్వెల్ కామిక్స్ చదువుతూ, సినిమాలు చూస్తూ పెరిగానన్నారు. మార్వెల్ సంస్థ ఎవ్వరూ ఊహించని విధంగా మంచి కథలతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులను అలరిస్తోందన్నారు. ఐరన్ మాన్, కెప్టెన్ అమెరికా నచ్చిన పాత్రలని ఆయన తెలిపారు. ఈ సినిమాలో విలన్ తానో పాత్రకు డబ్బింగ్ చెప్పటం చాలా ఆనందంగా ఉందన్నారు. ఈ సినిమా ఏప్రిల్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగులో రానా డబ్బింగ్ చెప్పినట్లు గానే ఇతర భాషల్లో కూడా అక్కడి నటీనటులతో డబ్బింగ్ చెప్పిస్తున్నారు నిర్మాతలు. -
బాలీవుడ్లో శ్రీదేవీకి గళమిచ్చింది ఈమెనే!
సాక్షి, న్యూఢిల్లీ : తమిళ సినిమా ద్వారా తొలిసారిగా వెండితెరకు పరిచయమై మలయాళం, కన్నడ, తెలుగు, హిందీ భాషల్లో కొన్ని వందల చిత్రాల్లో హీరోయిన్గా వెలుగులు విరజిమ్మిన ప్రముఖ నటి శ్రీదేవీ బాలీవుడ్‌కు మాత్రం 1979లో ‘సోల్వా సావన్’ చిత్రం ద్వారా పరిచయం అయ్యారు. శ్రీదేవీ హీరోయిన్గా 1977లో తమిళంలో ‘16 వయతినిల్లీ’ చిత్రాన్ని తీసిన ప్రముఖ దర్శకుడు భారతీరాజానే రెండేళ్ల తర్వాత బాలివుడ్ నటుడు అమోల్ పాలేకర్, శ్రీదేవి కాంబినేషన్లో సోల్వా సావన్ చిత్రాన్ని తీశారు. అంతకుముందు కే. రాఘవేంద్రరావు 1978లో శ్రీదేవీతో ‘16 ఏళ్ల వయస్సు’ పేరిట తెలుగులో తీశారు. తెలుగు, తమిళంలో సూపర్ డూపర్ ఇట్టయిన ఈ చిత్రం బాలీవుడ్లో మాత్రం రాణించలేకపోయింది. సోల్వా సావన్ చిత్రంలో శ్రీదేవీకి ప్రముఖ హిందీ నటి, డబ్బింగ్ ఆర్టిస్ట్ బేబీ నాజ్ డబ్బింగ్ చెప్పారు. 1979 నుంచి 1989 వరకు హిందీలో శ్రీదేవీ నటించిన చిత్రాలకు బీబీ నాజ్యే ఎక్కువగా డబ్బింగ్ చెప్పారు. ‘ఆఖరీ రాస్తా’లో సినీ నటి రేఖ డబ్బింగ్ చెప్పారు. 1989లో వచ్చిన ‘చాందినీ’ చిత్రం నుంచే శ్రీదేవీ సొంతంగా డబ్బింగ్ చెప్పుకోవడం ప్రారంభించారు. శ్రీదేవీ లాగానే బీబీ నాజ్ చిన్నప్పటి నుంచే హిందీ చిత్రాల్లో నటిస్తూ వచ్చారు. అప్పుడు అందరు ఆ బాలికను బేబీ నాజ్ అని పిలిచేవారు. అదే పేరు ఆమెకు చివరి వరకు స్థిరపడి పోయింది. బేబీ నాజ్ 1944లో ముంబైలో జన్నించారు. అప్పుడు ఆమె పేరు సల్మా బేగ్. ఆమె తన నాలుగవ ఏటా బేబీ నాజ్ పేరుతో హిందీ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. 1954లో వచ్చిన ‘బూట్ పాలిష్’ చిత్రంలో నటనకుగాను బేబీ నాజ్‌కు కేన్స్ అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో ప్రత్యేక ప్రశంసా పురస్కారం లభించింది. 1955లో బిమల్ రాయ్ తీసిన ‘దేవదాస్’, 1957లో హషికేష్ ముఖర్జీ తీసిన ‘ముసాఫిర్’, 1958లో ఆయనే తీసిన ‘లజ్వంతి’, 1959లో గురుదత్ తీసిన ‘కాగజ్ కే ఫూల్’ తీసిన చిత్రాల్లో నటించిన బేబీ నాజ్ హీరోయిన్గా కాకుండా ఎక్కువ వరకు సహ పాత్రలకే పరిమితం అయ్యారు. చివరకు డబ్బింగ్ ఆర్టిస్ట్‌గానే మిగిలిపోయి 1995, అక్టోబర్‌లో కన్నుమూశారు. శ్రీదేవీ గొంతు ఇప్పుడు శాశ్వతంగా మూగపోగా ఆమెకు పదేళ్లపాటు గొంతునిచ్చిన నాజ్ గొంతు 23 ఏళ్ల క్రితమే మూగపోయింది. -
తెలుగు పేసిట్టారు
.. అంటే సూర్య తెలుగు మాట్లాడారని అర్థం. తెలుగు వేడుకల్లో సూర్య తెలుగు మాట్లాడటం విన్నాం. ఇప్పుడు కొత్తగా మాట్లాడేది ఏముంది అనుకుంటున్నారా? సినిమాలో సొంత గొంతు వినిపించబోతున్నారు. తమిళంలో సూర్య చేసిన సినిమాలు తెలుగులో విడుదలవు తుంటాయి. కానీ, ఆయన పాత్రకు వేరేవాళ్లు డబ్బింగ్ చెప్పేవారు. ఈసారి సూర్య తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకోవాలను కున్నారు. అంతే.. తెలుగు పేసిట్టారు (మాట్లాడేశారు). ఆయన తెలుగు పలుకులను మనం వినబోతున్నది ‘గ్యాంగ్’ సినిమాలో. తమిళంలో సూర్య హీరోగా రూపొందిన ‘తానా సేంద కూట్టమ్’ను యూవీ క్రియేషన్స్ తెలుగులో ‘గ్యాంగ్’గా ఈ సంక్రాంతికి విడుదల చేయనుంది. విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో కీర్తీ సురేష్ హీరోయిన్గా నటించారు. నిర్మాతలు వంశీ, ప్రమోద్‌లు మాట్లాదుతూ– ‘‘టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. సూర్యగారు తొలిసారి తెలుగు డబ్బింగ్ చెప్పటం ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది. జనవరి 12న రిలీజ్ చేయటానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: అనిరు«ద్. -
నన్ను బాధపెట్టడం అంత వీజీ కాదు!
ఈజీ అనాలి కదా.. వీజీ అంటున్నారేంటి అనుకుంటున్నారా? కొంచెం ఎటకారంగా.. అదేనండీ వెటకారంగా చెప్పాలంటే వీజీ అంటారు కదా. ఒక విషయం గురించి త్రిష ఇలా వ్యంగ్య ధోరణిలోనే మాట్లాడారు. అదేంటంటే... ఫేస్బుక్, ట్విట్టర్లో ఏదైనా కామెంట్ పెట్టి, దానికి తగ్గట్టు సెలబ్రిటీల ఫొటోలు పెడుతుంటారు కదా. ఆ ఫొటోలో స్టార్ ఎక్స్ప్రెషన్ ఆ కామెంట్‌కి తగ్గట్టుగా ఉంటుంది. త్రిష ఫొటోలు ఇలాంటివి చాలానే వైరల్ అయ్యాయి. ‘‘కొన్ని బాగానే ఉంటాయి. కొన్ని ఫొటోలు, కామెంట్స్ మాత్రం బాగుండవు. అలాంటివి చూసి, బాధపడతారా? అని నన్నడిగితే.. ‘అస్సలు బాధపడను’ అని చెబుతా. నన్ను బాధపెట్టడం అంత వీజీ కాదు’’ అన్నారు త్రిష. స్టార్ అయ్యాక ఇలాంటివి కామన్ కాబట్టి, అలవాటై త్రిష లైట్ తీసుకున్నారేమో అనుకుంటున్నారా? అదేం కాదు. నటి కాకముందు కూడా ఇలానే ఉండేవారట. ఆ విషయం గురించి త్రిష చెబుతూ – ‘‘నా గురించి ఎవరైనా చేయకూడని కామెంట్ చేస్తే పట్టించుకునేదాన్ని కాదు. బాధపడేదాన్ని కాదు. ఒకవేళ తట్టుకోలేనంత బాధ అనిపిస్తే.. అప్పుడు మా అమ్మకి, ఫ్రెండ్స్‌కి చెబుతాను. అంతా విని, వాళ్లు ఒక్కసారిగా నవ్వేస్తారు. అప్పుడా బాధ జోక్ అయిపోతుంది’’ అన్నారు. ఆ సంగతలా ఉంచితే.. ప్రస్తుతం త్రిష చేస్తోన్న వాటిలో మలయాళ చిత్రం ‘హే జ్యూడ్’ ఒకటి. ఈ చెన్నై చందమామ ఈ చిత్రంలో తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకోవాలనుకుంటున్నారట. -
నయనే చెప్పాలి
నటి నయనతారపై దర్శకుల ఒత్తిడి పెరుగుతోంది. అలాంటి ఒత్తిడిని ఆమె ఆనందంగా స్వాగతిస్తున్నట్లు సమాచారం. ఇంతకీ విషయం ఏమిటంటే నయనతార తమిళం, తెలుగు, మలయాళం భాషల్లో పలు చిత్రాల్లో నటిస్తున్నారు. ముఖ్యంగా కోలీవుడ్‌లో అగ్రనాయకిగా రాణిస్తున్న విషయం తెలిసిందే. అంతే కాదు మాయ చిత్రం తరువాత హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాలు ఈ అమ్మడి తలుపుతడుతున్నాయన్నది తెలిసిందే. ప్రస్తుతం నయన నటిస్తున్న చిత్రాల్లో ఆ తరహా చిత్రాలే అధికం. పలు చిత్రాల్లో నటించిన నయనతార ఇప్పటివరకూ ఒకే ఒక్క చిత్రంలో తన పాత్రకు తనే డబ్బింగ్ చెప్పుకున్నారు. మిగతా వాటికి అరువుగొంతే. ఆ ఒక్క చిత్రం తన ప్రియుడిగా ప్రచారంలో ఉన్న విఘ్నేశ్‌శివ దర్శకత్వంలో నటించిన నానుమ్ రౌడీదాన్ . ఆ చిత్రానికి నయనతార సొంతంగా చెప్పిన డబ్బింగ్ చాలా ప్లస్ అయ్యిందన్నారు. ఈ భామ తాజాగా సెంట్రిక్ పాత్రల్లో నటిస్తున్న అరమ్, దోరా చిత్రాలకు తననే డబ్బింగ్ చెప్పాలని దర్శకుల నుంచి ఒత్తిడి పెరుగుతోందట. నయన కలెక్టర్‌గా నటిస్తున్న చిత్రం అరమ్. మింజూర్ గోపీ దర్శకుడు. ఈయన తెలుపుతూ నయనతార తమిళ భాషను చాలా ఫ్లూయంట్‌గా మాట్లాడతారన్నారు. తమ చిత్రానికి ఆమె డబ్బింగ్ ఎస్సెట్ అవుతుందన్నారు. నయనతార ప్రధాన పాత్రలో నటిస్తున్న మరో చిత్రం దోరా. దాస్ రామసామి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం హారర్ కథాంశంతో రూపొందుతోంది. ఈ చిత్రానికి నయనతార డబ్బింగ్ చెప్పాలని దర్శకుడు కోరుకుంటున్నారట. అందుకు నయనతార కూడా సమ్మతించినట్లు సమాచారం. దీంతో తమిళంలో నయనతార చిత్రాలకు ఆమె సొంత గొంతునే వినవచ్చునంటున్నారు కోలీవుడ్ వర్గాలు. ఇటీవల నడిగర్‌సంఘం జల్లికట్టుకు మద్దతుగా నిర్వహించిన మౌనపోరాటానికి డుమ్మా కొట్టిన ఈ కేరళ బ్యూటీ మెరీనాతీరానికి వెళ్లి ప్రజల పోరాటానికి మద్దతు పలకడం చర్చనీయాంశంగా మారిందన్నది గమనార్హం. -
750 నాటౌట్!
‘ఈ వేళలో నీవు ఏం చేస్తూ ఉంటావో...’ – ‘గులాబి’ చిత్రంలోని ఈ పాటతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన సుమధుర గాయని సునీత ఇప్పటివరకూ కొన్ని వేల పాటలు పాడారు. ఆమె మంచి గాయని మాత్రమే కాదు... డబ్బింగ్ ఆర్టిస్ట్, యాంకర్ కూడా. నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన నూరవ సినిమా ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా సునీతకి 750వ సినిమా. అందులో శ్రియ పాత్రకి ఆమె డబ్బింగ్ చెప్పారు. సంక్రాంతికి విడుదలైన శాతకర్ణి చిత్రం సునీత డబ్బింగ్‌కి సర్వత్రా ప్రశంసలు తెచ్చిపెట్టింది. ఈ సందర్భంగా సునీత సంతోషం వ్యక్తం చేశారు. ఆమె మాట్లాడుతూ – ‘‘బాలకృష్ణగారి కెరీర్లో మైలురాయిగా నిలిచిన చిత్రంలో నేనూ ఓ భాగం కావడం, చారిత్రక కథతో రూపొందిన శాతకర్ణి డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా నా 750వ చిత్రం కావడం అదృష్టంగా భావిస్తున్నా’’ అన్నారు. ఆమె ‘సాక్షి’తో మాట్లాడుతూ, ‘‘సినిమా రంగంలో రకరకాల పాత్రలు పోషించినా, నాకు అత్యంత సంతృప్తికరమైన అంశం డబ్బింగే! ఏ సినిమాకు ఆ సినిమాలో పాత్రకు తగ్గట్లు, సీన్లోని భావోద్వేగానికి తగ్గట్టు పర కాయప్రవేశం చేసి స్వరదానం చేయడం ఒక సవాల్’’ అన్నారు. ‘శ్రీరామదాసు’లో స్నేహకీ, ‘శ్రీరామరాజ్యం’లో నయనతారకీ చెప్పిన డబ్బింగ్ ఎప్పటికీ మర్చిపోలేననీ, బాపు లాంటి మహానుభావులతో పనిచేయడం అదృష్టమనీ అన్నారు. -
సునీత... 750 నాటౌట్!
‘ఈ వేళలో నీవు ఏం చేస్తూ ఉంటావో’ అంటూ గులాబీ చిత్రంలోని ఈ పాటతో సుమధుర గాయని సునీత తెలుగు చిత్ర పరిశ్రమకి పరిచయం అయ్యారు. ఆ పాట నుంచి ఇప్పటి వరకూ కొన్ని వేల పాటలు ఆలపించారు. ఏ వేళలోనైనా సునీత పాటలు వింటే మనసుకి ప్రశాంతత లభిస్తుందని శ్రోతలు అంటుంటారు. భక్తి గీతాలు మొదలుకుని సినిమాల్లో పలు గీతాలు ఆలపించిన సునీత మంచి గాయని మాత్రమే కాదు.. వ్యాఖ్యాత, డబ్బింగ్ ఆర్టిస్ట్ కూడా. పలు టీవీ కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా వ్యవహరించి, ఆయా కార్యక్రమాలకు వన్నె తీసుకొచ్చారు. పలు చిత్రాల్లో సునీత డబ్బింగ్ వలన కథానాయికల నటన మరింత ఎలివేట్ అయ్యిందంటే అతిశయోక్తి కాదు. పలువురు పరభాషా కథానాయికలకు గొంతు అరువిచ్చి, సినిమాల్లోని ఆయా సన్నివేశాల్లో భావోద్వేగాలను తన గాత్రంతో ప్రేక్షకులకు చేరువయ్యేలా చేశారు. ఈ సంక్రాంతికి విడుదలైన నందమూరి నటసింహం బాలకృష్ణ నూరవ చిత్రం ‘గౌతమిపుత్ర శాతకర్ణి’లో కథానాయిక శ్రియ పాత్రకు సునీత డబ్బింగ్ చెప్పారు. తెలుగుజాతి ఘనతను సగర్వంగా చాటి చెప్పిన ఈ చిత్రం డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా సునీతకి 750వ సినిమా. ఈ సందర్భంగా సునీత మాట్లాడుతూ : ‘బాలకృష్ణగారి కెరీర్లో మైలురాయిగా నిలిచిన చిత్రంలో నేనూ ఓ భాగం కావడం, చారిత్రక కథతో రూపొందిన ఈ చిత్రం నా 750వ చిత్రం కావడం అదృష్టంగా భావిస్తున్నా. గౌతమిపుత్ర శాతకర్ణి విడుదలైనప్పటి నుంచి పలువురు ఫోన్ చేసి డబ్బింగ్ బాగా చెప్పావని ప్రశంసిస్తుంటే ఎంతో సంతోషంగా ఉంది. దర్శకులు క్రిష్ ప్రతి సన్నివేశాన్ని అద్భుతంగా తీయడంతో పాటు శ్రియ అద్భుతంగా నటించడంతో నేనూ బాగా డబ్బింగ్ చెప్పగలిగా. డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా 750 చిత్రాలు పూర్తిచేసుకోవడం వెనుక దర్శక, నిర్మాతల ప్రోత్సాహం ఎంతో ఉంది. 750 చిత్రాల్లో ప్రతి సినిమా దర్శకుడు, నిర్మాత, రచయిత, ప్రతి టెక్నీషియన్ నా ప్రతిభని గుర్తించి ప్రోత్సహించినవారే. డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా 750 చిత్రాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంలో నన్ను ఆదరించిన ప్రేక్షకులు, చలన చిత్ర ప్రముఖులందరికీ నా కృతజ్ఞతలు. భవిష్యత్తులోనూ ఇదే విధంగా ఆదరాభిమానాలు చూపిస్తారని ఆశిస్తున్నాను’ అన్నారు. సునీత డబ్బింగ్ చెప్పిన సినిమాల్లో ది బెస్ట్ సెలక్ట్ చేయమంటే కష్టమే. ఒకటా.. రెండా... 750 సినిమాల్లో ఎన్నని ఎంపిక చేయగలం! అందుకే, మచ్చుకి కొన్ని సినిమాల పేర్లు: 1) జయం 2) చూడాలని వుంది 3) నిన్నే ప్రేమిస్తా 4) నువ్వు నేను 5) ఆనంద్ 6) గోదావరి 7) హ్యాపీడేస్ 8) మన్మథుడు 9) మల్లీశ్వరి 10) శంకర్‌దాదా ఎం.బి.బి.ఎస్. 11) మంత్ర 12) అనుకోకుండా ఒక రోజు 13) మనం 14) నేనున్నాను 15) ఆడవారి మాటలకు అర్థాలు వేరులే 16) శ్రీ రామదాసు 17) రాధాగోపాలం 18) శ్రీరామరాజ్యం ఇప్పుడు... గౌతమిపుత్ర శాతకర్ణి -
'సమోసాలో ఆలూ ఉన్నంత కాలం..'
ఆలూ సమోసాలో ఆలూ ఎంతకాలం ఉంటుంది? అసలు ఆలూ లేకుండా ఎక్కడైనా ఆలూ సమోసా ఉంటుందా? అదే ఉదాహరణగా చెప్తుంది ప్రముఖ సింగర్, డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి శ్రీపాద. సమోసాలో ఆలూ ఉన్నంతకాలం.. సమంతకు తెలుగులో డబ్బింగ్ చెప్తానంటోంది. సమంత హీరోయిన్గా నటించిన 'జనతా గ్యారేజ్' విడుదల సందర్భంగా విషెస్ చెప్తూ ట్వీట్ చేసింది చిన్మయి. 'ఏ మాయ చేశావే' లో జెస్సీగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి అందరినీ నిజంగానే మాయ చేసింది సమంత. జెస్సీ క్యారెక్టర్ అంతగా ఆకట్టుకోవడానికి ఆమెకు చెప్పిన డబ్బింగ్ ఓ ప్రధాన కారణమని చెప్పొచ్చు. సమంతకు గాత్రదానం చేసింది సింగర్ చిన్మయే. ఇక అప్పటినుంచి తెలుగులో సమంతకు చిన్మయే డబ్బింగ్ చెప్తూ వస్తుంది. ఆమె గొంతు సమంత రూపానికి చక్కగా సరిపోయి ఫ్యాన్ ఫాలోయింగ్‌ని పెంచేసింది. ప్రస్తుతం సమంత టాప్ హీరోయిన్గా ఉన్న సంగతి తెలిసిందే. సమంత కూడా పలుమార్లు చిన్మయి డబ్బింగ్ తన విజయానికి ఎంతగానో ఉపయోగపడిందని చెప్పుకొచ్చింది. సమోసాలో ఆలూ ఉన్నంతకాలం.. అంటూ చిన్మయి చేసిన ట్వీట్‌కు 'థాంక్యూ పాపా' అంటూ సమంత ముద్దులతో స్పందించింది. Wishing Sam papa the best for Janatha Garage. As saying goes, Jab tak rahega samose mein aaloo (God-willing) I’ll dub for Sam in Telugu.😜 — Chinmayi Sripaada (@Chinmayi) 31 August 2016 😋😋😋😋ha ha Muah thanks Paapa https://t.co/vFgjIdcpIR — Samantha Ruth Prabhu (@Samanthaprabhu2) 31 August 2016 -
ఉత్తమ విలన్
వీరు పెంటయ్య... వీరశంకరరెడ్డి ఎలా అయ్యాడు? ‘కత్తులతో కాదురా కంటి చూపుతో చంపుతా’ కేకలు... చప్పట్లు.... వన్స్మోర్లు... హీరోగారి నుంచి ఈ పవర్ఫుల్ డైలాగ్ రావడానికి కారణం ఎవరు? విలన్. విలన్ ఎంత గట్టివాడైతే హీరో నోటి నుంచి అంత పవర్ఫుల్ డైలాగ్‌లు వస్తాయి అని చెప్పడానికి ఈ పాపులర్ డైలాగే ఉదాహరణ. మరి ఈ లెక్కన కుప్పుస్వామినాయుడు కూడా గా...ట్టి విలనే కదా! దేవాలయంలో దేవునికి నిశ్శబ్దంగా మొక్కుకుంటున్న నరసింహనాయుడితో గిచ్చి తగాదా పెట్టుకోవాలనుకుంటాడు కుప్పుస్వామి నాయుడు. ఇలా ఒక డైలాగు కూడా విసురుతాడు... ‘నా పేరు కుప్పుస్వామి నాయుడు. అప్పలనాయుడి బావమరిదిని. బావమరదులు బావ బతుకు కోరుతారు. కానీ నా బావ బతికిలేడు. కనుక... నేను మా బావను చంపినవాడి చావు చూసే వరకు నిద్రపోను’ అంతేనా? ‘ఇది గుడైపోయిందిరా’ అని కూడా కవ్విస్తాడు. మరి హీరో ఊరుకుంటాడా? ‘ఎక్కడైనా’ ‘ఎప్పుడైనా’ అంటూనే ‘కత్తులతో కాదురా...’లాంటి పవర్ఫుల్డైలాగ్ చెబుతాడు. ‘గాండీవం’లో వీరు పెంటయ్య, ‘మనోహరం’లో ఐఎస్ఐ బాషా, అంతకుముందు బాలీవుడ్ సినిమాలు ‘ఘాయల్’ ‘పరంపర’ ‘గర్దిష్’ ‘బాజీ’... ముఖేష్ రుషి చాలా బాగానే నటించి ఉండొచ్చు....అయితే మన మాస్ కళ్లకు దగ్గర చేసింది మాత్రం ‘నరసింహనాయుడు’ ‘ఇంద్ర’లాంటి సినిమాలే. ఫ్యాక్షనిస్ట్ అనగానే తనే గుర్తుకుచ్చేలా నటించాడు ముఖేష్. ఆరడుగుల ఎత్తుకు, డబ్బింగ్ కంచుకంఠం తోడై కళ్లతోనే ఎర్రగా రౌద్రం పలికించి ‘విలన్ అంటే ఇలా ఉండాలి’ అనుకునేలా చేశాడు. చండీగఢ్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తరువాత ముంబైలో స్టోన్-క్రషింగ్ బిజినెస్ చేశాడు ముఖేష్. ఆ తరువాత ఫిజీలో వ్యాపారం చేయడానికి వెళ్లాడు. అక్కడ కొన్నేళ్లు ఉన్న తరువాత న్యూజిలాండ్‌లో స్టోర్ మేనేజర్‌గా పనిచేయడానికి వెళ్లాడు. అదే సమయంలో వివిధ కంపెనీలకు మోడలింగ్ కూడా చేసేవాడు. తీరిక లేని ఉద్యోగం, మోడలింగ్...ఈ రెండూ సంతృప్తి ఇవ్వడం లేదు. మనసు ఇంటివైపు లాగుతుంది. అలా ఏడు సంవత్సరాల తరువాత ముంబైకి తిరిగివచ్చాడు. ‘రోషన్ తనేజాస్ యాక్టింగ్ స్కూల్’లో చేరాడు. ‘‘నేను మంచి నటుడిని కాదు అనే విషయం నాకు తెలుసు. నటనలో నేను నేర్చుకోవాల్సింది చాలా ఉంది. నువ్వు బాగా నటిస్తున్నావు. ఇక వేషాల కోసం ప్రయత్నించవచ్చు అనే మీరు చెప్పేదాకా నా ప్రయత్నాలేవీ చేయను’’ అని తనేజాతో చెప్పాడు. అయితే ఆరునెలలకే ‘ఇక నువ్వు దూసుకెళ్లవచ్చు’ అంటూ తనేజా అనుమతి ఇచ్చారు. ఇక అప్పటి నుంచి సినిమా ఆఫీసుల చుట్టూ తిరగడం ప్రారంభించాడు ముఖేష్. సంజయ్‌ఖాన్ ‘టిప్పు సుల్తాన్’ సీరియల్‌తో ముఖేష్‌కు తొలి బ్రేక్ వచ్చింది. అందులో మీర్ అలీఖాన్ పాత్ర వేశాడు ముఖేష్. ఎత్తు, మంచి శరీరసౌష్టవం ఉండడం వల్ల పెద్దగా కష్టపడకుండానే ముఖేష్‌కు అవకాశాలు వచ్చేవి. ప్రియదర్శన్ ‘గర్దిష్’ సినిమాలో బిల్లా జిలానీ పాత్రతో ప్రేక్షకుల దృష్టిలో గట్టి విలన్‌గా గుర్తింపు పొందాడు ముఖేష్. ఆ తరువాత వరుసగా నలభై సినిమాలు చేశాడు. అన్నీ నెగెటివ్ రోల్సే. ఇక ‘సర్ఫ్రోష్’లో ఇన్స్పెక్టర్ సలీమ్ పాత్రను చాలెంజింగ్‌గా తీనుకొని అద్భుతంగా నటించాడు ముఖేష్. ఆ పాత్ర ప్రేక్షకులపై ఎంత ముద్రవేసిందంటే... ఒకసారి ముఖేష్ జమ్మూలో ఉన్నప్పుడు ఒక సంభాషణ వినిపించింది. ఒకరు ఇలా అంటున్నారు... ‘‘ఈ దేశం నుంచి టైజాన్ని తుడిచిపెట్టాలంటే అజయ్‌సింగ్ రాథోడ్(అమీర్‌ఖాన్), సలీమ్(ముఖేష్ రుషి) కావాలి’’ ముఖేష్ రుషిని విలన్ పాత్రల్లో చూసీ చూసీ కొందరు ప్రేక్షకులకు బోర్ కొట్టవచ్చు. వాళ్ల అబ్బాయి... ‘‘మంచి పాత్రలు వేయవూ’’ అని అడిగి ఉండవచ్చు. అయితే నటన విషయంలో... ‘మంచి పాత్ర’ అంటే నైతిక విలువలతో ముడిపడి ఉన్నది కాదు. ఎంత మంచిగా నటించాడన్నదే మంచి పాత్ర. ఆ రకంగా... ముఖేష్ రుషి ఉత్తమవిలన్. ‘గాండీవం’లో వీరు పెంటయ్యగా పరిచయమై కానట్లు అనిపించినా, వీరశంకరరెడ్డిగా మాత్రం ఇప్పుడు ముఖేష్ సుపరిచితుడు. దీనికి కారణం ఆయన అత్యున్నత నటన అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు! -
డబ్బింగ్ లో 'ఆక్సిజన్'
హీరో గోపీచంద్ తాజా చిత్రం 'ఆక్సిజన్' డబ్బింగ్ పనుల్లో బిజీగా ఉంది. ఏఎమ్ జ్యోతికృష్ణ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ సినిమా ఓ వైవిధ్యమైన కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. యువన్ శంకర్ రాజా ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. సెప్టెంబరులో ఆడియో రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్న చిత్ర యూనిట్.. అదే నెలలో సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఆక్సిజన్‌లో గోపీచంద్ సరసన రాశి ఖన్నా, అను ఎమ్మానుయేల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. జగపతిబాబు ఓ కీలకమైన పాత్రలో అలరించనున్నారు. హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టెయినర్గా రూపొందుతున్న ఈ సినిమాపై గోపీచంద్ చాలా ఆశలు పెట్లుకున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ ఆకట్టుకుంటోంది. -
7 రోజులు... 68 గంటలు!
తెలుగు నేర్చుకోవడానికి ఎంత సమయం పడుతుంది? జస్ట్ వారం రోజులు చాలు. రోజుకి సుమారు ఓ పది గంటల పాటు కష్టపడితే.. సినిమాకి డబ్బింగ్ కూడా చెప్పొచ్చు అంటున్నారు మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్. చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో వారాహి చలనచిత్రం పతాకంపై రజనీ కొర్రపాటి నిర్మించిన చిత్రం ‘మనమంతా’. మోహన్‌లాల్, గౌతమి, విశ్వాంత్, రైనారావు ప్రధాన పాత్రధారులు. మోహన్‌లాల్ తెలుగులో నటించిన పూర్తి స్థాయి చిత్రమిది. అంతే కాదు.. ఆయన పాత్రకు తెలుగులో స్వయంగా డబ్బింగ్ కూడా చెప్పారు. డబ్బింగ్ చెప్పడానికి ముందు 7 రోజుల్లో 68 గంటల పాటు కష్టపడి తెలుగు నేర్చుకుని, భాషపై పట్టు సాధించానని మోహన్‌లాల్ తెలిపారు. తెలుగులో డబ్బింగ్ చెప్పడం చాలా హ్యాపీగా ఉందన్నారాయన. ఆగస్టు 5న విడుదలవుతోన్న ఈ సినిమా గురించి మాట్లాడుతూ -‘‘సిని మా చూసే ప్రతి ఒక్కరికీ తమ గతం గుర్తుకు వస్తుంది. డబ్బింగ్ చెప్తుంటే నన్ను నేను తెరపై చూసుకుంటున్నట్లు అనిపించింది. చంద్రశేఖర్ ఏలేటి సినిమాని అద్బుతంగా తీర్చిదిద్దాడు. నా పాత్రతో పాటు గౌతమి, విశ్వాంత్, రైనారావు పాత్రలు చక్కగా వచ్చాయి. అన్ని వర్గాలను అలరిస్తుందీ సినిమా’’ అన్నారు. -
ఆడవారె ఈడవారు
కవర్ స్టోరీ తెలుగుతెర అంతా ‘ఆడ’ పిల్లలే... అదేనండీ పరభాషా నాయికలే అని తరచూ వాపోతూ ఉంటాం. కానీ, ఇవాళ తెలుగు సినిమాలలో పాపులర్ హీరోయిన్లయిన తమిళ, మలయాళ, పంజాబీ, ఢిల్లీ భామల్లో చాలామంది తెలుగుసీమను అక్షరాలా తమ రెండో ఇల్లు చేసుకుంటున్నారు. ఇక్కడే ఫ్లాట్ కొంటున్నారు, జిమ్ పెడుతున్నారు, తెలుగు నేర్చేసు కొని డబ్బింగ్ చెప్పేస్తున్నారు. చిన్న పాత్రకైనా, కురచ దుస్తులకైనా సై అంటున్నారు. అందుకే, ఈ ‘ఆడ’వారు... ఇప్పుడిక ‘ఈడ’ వారు. అనుష్క (34) : తెలుగింటి రుద్రమ బి.సి.ఏ. చదివి, యోగా శిక్షకురాలిగా చేస్తూ, 11 ఏళ్ళ క్రితం హఠాత్తుగా సినిమాల్లోకి వచ్చినప్పుడు ఈ తుళు భామకు నటనలో ఓనమాలు తెలియవు. ఇవాళ తెలుగు, తమిళాల్లో నటిగా ఆమె ఎవరో తెలీనివారు లేరు. ‘బిల్లా’లో బికినీ వేసినా, ‘సైజ్ జీరో’ కోసం లావైనా, ‘వేదం’లో వేశ్యపాత్ర వేసినా అనుష్క గట్స్ వేరు. స్నేహం కోసం స్పెషల్ సాంగ్కైనా (‘స్టాలిన్’, ‘కింగ్’), అతిథి పాత్రలకైనా ఎవర్ రెడీ. అందుకే, ఇండస్ట్రీలో ఆమె గురించి అంతా మంచే చెప్తారు. ‘మనమ్మాయే’ అంటారు. ఫస్ట్ : నాగార్జున - పూరీల ‘సూపర్’ ( 2005) బెస్ట్ : ‘అరుంధతి’, ‘రుద్రమదేవి’, రాజమౌళి ‘బాహుబలి’ స్పెషాల్టీ : మంచితనం, యూనిట్ సభ్యులతో సహకారం, కలుపుగోలుతనం హీరోయిన్లలో స్వీటీని స్పెషల్‌గా నిలబెట్టాయి. పోజులు కొట్టకుండా, సామాన్య వ్యక్తిలా అందరితోనూ కనెక్టయిపోతారు. చక్కటి తెలుగు మాట్లాడతారు. ఉంటే బెంగుళూరు, లేదంటే హైదరాబాదే. నాగ్ కుటుంబానికి సన్నిహితురాలు. లేడీ ఓరియంటెడ్ సినిమాలంటే ఇవాళ దర్శక, నిర్మాతలకు ఫస్ట్ అండ్ లాస్ట్ చాయిస్ అనుష్కే. పారితోషికం : రూ. 1.5 నుంచి 2 కోట్లు తమన్నా (27) : పాల నురగల తళుకు బ్రహ్మాండంగా తెలుగు మాట్లాడుతూ, డబ్బింగ్ కూడా చెప్పే స్థాయికి (నాగార్జున ‘ఊపిరి’) చేరిన ఈ పాల మెరుగుల సుందరి పంజాబీ గుడియా అంటే నమ్మలేం. 15 ఏళ్ళకే హిందీలో ఎంట్రీ ఇచ్చి, ఆపైన దక్షిణాదికి వచ్చి, తెలుగు, తమిళాల్లో దున్నేస్తున్నారు. డైమండ్ వ్యాపారి కూతురైన తమ్మూ దక్షిణాదిలో జ్యువెలరీ ఎండార్సమెంట్స్లో టాప్. గత ఏడాది సొంతంగా ‘వైట్ ఎన్ గోల్డ్’ అనే రిటైల్ జ్యువెలరీ బ్రాండ్ కూడా మొదలెట్టారు. ఫస్ట్ : తెలుగులో ‘శ్రీ’ (2005) బెస్ట్ : ‘హ్యాపీడేస్’, ‘బాహుబలి’, ‘ఊపిరి’ స్పెషాల్టీ : నవతరం హీరోయిన్స్ లో మంచి డ్యాన్సర్. సాక్షాత్తూ చిరంజీవి సైతం నర్తించడానికీ, నటించడానికీ ఇష్టపడుతున్న హీరోయిన్. స్పెషల్ సాంగ్స్ (‘అల్లుడు శీను’), అతిథి పాత్ర (‘రెడీ’)లకూ సై! కొన్ని ఆడకపోయినా, హిందీ వైపు చూడడం మానని నటి. స్టార్ స్టేటస్ తెచ్చిన తెలుగు సీమ అంటే తెగ ఇష్టం. భేషజం లేకుండా నవ్వుతూ మాట్లాడే ఈ మిల్కీ బ్యూటీ అలా మన తెలుగమ్మాయిలా కలిసిపోయారు. పారితోషికం: రూ. 1.5 కోట్ల దాకా సమంత (29) : చిన్న వయసు... పెద్ద మనసు... తెలుగునాట వెన్నెల కాస్తున్న చెన్నై చంద్రమ. కొత్తతరం ప్రేమకు ప్రతినిధిగా పవన్‌కల్యాణ్, చిన్న ఎన్టీఆర్, బన్నీ - ఇలా అందరి సరసనా ఆమే. సిద్ధార్థతో బ్రేకప్ లవ్‌స్టోరీ నుంచి బెల్లంకొండ శ్రీనివాస్‌తో ఐటవ్ు సాంగ్ దాకా ఆమెకు సంబంధించి ప్రతిదీ హాట్ న్యూసే. బ్రాండ్ ఎండార్సమెంట్లు, 3 భాషల్లో సినిమాలతో ఎప్పుడూ యమ బిజీ. ఫస్ట్ : నాగచైతన్య- గౌతమ్ మీనన్‌ల ‘ఏ మాయచేశావె’ (2010) బెస్ట్ : ‘ఏ మాయ చేశావె’, ‘ఈగ’, ‘అత్తారింటికి దారేది’ స్పెషాల్టీ: కళ్ళల్లో చిలిపితనం... సమాజం పట్ల ప్రేమ ధనం... చారిటీకి మూలధనం కలిస్తే - సమంత. ఫ్యాషన్ దుస్తులు, మీడియాలో ట్వీట్లతో రోజూ పేపర్లో ఉంటారు. టాప్ హీరోయినైనా చెన్నై మధ్యతరగతి మనస్తత్వాన్ని వదులుకోని మంచి మనిషి. నవ్వుతూ, చక్కటి తెలుగు గలగలా మాట్లాడతారు. నెలకు ఇరవై రోజులైనా హైదరాబాద్‌లోనే మకాం. ఉంటున్న స్టార్ హోటల్‌నే దాదాపు ఇంటిని చేసుకున్నారు. తెలుగు, తమిళాల్లో హీరోలకు ఇవాళ ఫస్ట్ చాయిస్. త్వరలోనే నిజజీవితంలో అక్షరాలా తెలుగు సినీసీమకు పెద్దింటి కోడలు కానున్నారట. పారితోషికం: రూ. 1.5 కోట్ల దాకా రకుల్ (25) : ఇప్పుడు వీస్తున్న గాలి... అడుగుపెట్టిన ఆరేళ్ళలోనే అందరినీ ఆకర్షించిన పంజాబీ పిల్ల. ప్రస్తుతం చేతిలో 6 సిన్మాలతో నంబర్ వన్ హీరోయిన్ రేసులో గట్టి పోటీదారు. పెదవులపై చిరునవ్వు, ప్రొఫెషనలిజమ్ ఆభరణాలు. ఫస్ట్ : తెలుగులో ‘కెరటం’ (2011) బెస్ట్ : ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’, ‘లౌక్యం’, ‘పండగ చేస్కో’ ,‘సరైనోడు’ స్పెషాల్టీ : గోల్ఫ్ ఆడడంలోనే కాదు... అనుకున్న గోల్ సాధించే ఏకాగ్రతా ఉన్న నవతరం అమ్మాయి. ఇప్పుడు యువ హీరోలు అందరూ కోరి తెచ్చుకుంటున్న కొత్త హీరోయిన్. బాగా తెలుగు మాట్లాడడమే కాదు... చిన్న ఎన్టీఆర్ ‘నాన్నకు ప్రేమతో’లో తెలుగు డబ్బింగ్ కూడా చెప్పిన అమ్మాయి. మూడు నెలల క్రితమే గచ్చిబౌలీలో సొంతంగా జిమ్ (‘ఎఫ్45’) కూడా పెట్టారు. ఇల్లు కొనుక్కొని, అచ్చంగా ‘ఈడ’ పిల్లగా మారిన ‘ఆడ’ పిల్ల. పారితోషికం: రూ. 1 - 1.25 కోట్లు (బోయపాటి శ్రీను దర్శకత్వంలో బెల్లంకొండ శ్రీనివాస్ తాజా సినిమాకు ఏకంగా రూ. 1.5 కోట్లు) శ్రుతీహాసన్ (30) : అందం... అభినయాల సమశ్రుతి ఆళ్వార్‌పేట నుంచి ఆంధ్రదేశం దాకా పరుచుకున్న వెండివెన్నెల వెలుగు - ఈ చెన్నపట్నం చిన్నది. తల్లి (సారిక), తండ్రుల సినిమా జీన్స బాల్యంలోనే తెర మీదకు తెచ్చాయి. కాలక్రమంలో తండ్రి (కమల్‌హాసన్) చాటు బిడ్డలా కాక... సొంత కాళ్ళపై నిలబడిన నవ తరం అమ్మాయి. అందాల ప్రదర్శనకు వెనుకాడని ప్రొఫెషనల్. తెలుగు, తమిళ, హిందీ సిన్మాలు, ఆల్బమ్ లు, పాటలు, ఫ్రెండ్స, పార్టీలు - అన్నింటితో బిజీ బిజీ. ఫస్ట్ : తెలుగులో ‘అనగనగా ఓ ధీరుడు’ (2011) బెస్ట్ : ‘గబ్బర్‌సింగ్’, ‘ఎవడు’, ‘రేసుగుర్రం’, ‘శ్రీమంతుడు’ స్పెషాల్టీ : సాధారణ సినీ సంప్రదాయానికి భిన్నంగా హీరో కుటుంబం నుంచి వచ్చిన హీరోయిన్. మొదట్లో చేసిన సినిమాలేవీ ఆడనప్పుడు ‘ఐరన్‌లెగ్’ అన్న నోళ్ళే ఇప్పుడీ అమ్మడిని ‘గోల్డెన్ లెగ్’ అంటూ ఆకాశానికి ఎత్తేస్తున్నాయి. శ్రుతి ముఖంలో మాత్రం చెరగని నవ్వే. పవన్ కల్యాణ్, మహేశ్, రామ్ చరణ్, బన్నీ - పెద్ద హీరో ఎవరైనా సరే శ్రుతి డేట్స్ ఖాళీ ఉంటే, ఆమెకే ఓటు. తెలుగు బాగా మాట్లాడడం, భలేగా పాడడం శ్రుతీహాసన్‌కు ఉన్న ప్లస్. మనవాళ్ళు మెచ్చే దక్షిణాది సహజ సౌందర్యం ఆమెకున్న ఎడ్వాంటేజ్. పారితోషికం : రూ. 1.25 కోట్లు నిత్యామీనన్ (28) : హుందాతనానికి చిరునామా కర్ణాటకలో పెరిగిన ఈ మలయాళీ అమ్మాయి ఇవాళ తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషలన్నిట్లో క్రేజీ స్టార్. పదేళ్ళ వయసులోనే బాలనటిగా చేసినా, చదివిన డిగ్రీకి తగ్గట్లే జర్నలిస్ట్ అవుదామనుకొన్నారు. తీరా కన్నడ, మలయాళ చిత్రాలతో హీరోయినయ్యారు. తొలి సినిమాతోనే అందరూ ఫ్లాటై పోయారు. నిత్య హుందాతనం, మల్టీ టాలెంట్ పరిశ్రమతో పాటు ప్రేక్షకుల్నీ అబ్బురపరిచాయి. ప్రతి ఒక్కరూ నిత్యను ప్రేమించేలా చేశాయి. ఫస్ట్ : తెలుగులో నందినీరెడ్డి దర్శకత్వంలో ‘అలా మొదలైంది’ (2011) బెస్ట్ : ‘ఇష్క్’, ‘గుండె జారి గల్లంతయ్యిందే’, ‘మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు’, ‘ఓకే బంగారం’ స్పెషాల్టీ : జీవితంలోనైనా, కెరీర్‌లోనైనా కొత్త సవాళ్ళంటే కళ్ళు చక్రాల్లా తిప్పుతూ ఉత్సాహపడిపోతారు. స్క్రిప్ట్, పాత్ర నచ్చితే అతిథి పాత్ర (‘జబర్దస్త్’), చిన్న హీరో అయినా రెడీ. లేదంటే, ఎంత పెద్ద ప్రాజెక్ట్‌కైనా ‘నో’ చెప్పేస్తారు. పుట్టు మలయాళీ అన్న మాటే కానీ, నిత్యకు దక్షిణాది భాషలన్నీ కొట్టినపిండి. అచ్చ తెలుగమ్మాయిల కన్నా అందంగా తెలుగు మాట్లాడతారు. ఎంత బాగా మాట్లాడతారో అంతకన్నా బాగా పాటా పాడతారు. చలాకీతనం, హుందాతనం కలగలిసిన నిత్యను మనమ్మాయే అనేది అందుకే. పారితోషికం : రూ. 40 నుంచి 75 లక్షల మధ్య (సినిమా స్థాయి, పాత్రను బట్టి) రాశీఖన్నా (25) : యువ హీరోలకు రాశి... ఢిల్లీలో చదువుకున్న ఈ పంజాబీ అమ్మాయి ముచ్చటగా మూడేళ్ళలోనే తెలుగునాట జెండా పాతింది. యువ హీరోలకు, మీడియవ్‌ు రేంజ్ సినిమాలకూ బెస్ట్ ఆప్షన్ అయింది. ఉత్తరాది సౌందర్యం, సోషల్‌గా ఫ్రీగా ఉండే ప్రవర్తన బాగానే అవకాశాలు తెస్తోంది. ఫస్ట్ : తెలుగులో ‘ఊహలు గుసగుసలాడె’ (2014) బెస్ట్ : ‘ఊహలు గుసగుసలాడె’, ‘జిల్’, ‘బెంగాల్ టైగర్’, ‘సుప్రీమ్’ స్పెషాల్టీ : హైదరాబాద్ వాతావరణం, సినీ జనం తెగ నచ్చేసిన రాశీఖన్నా ఇప్పుడు హైదరాబాద్‌లోనే మకాం పెట్టేశారు. ఇక్కడే మణికొండలో సొంత ఇల్లు కూడా కొనుక్కున్నారు. గోపీచంద్, రావ్‌ు, సాయిధరవ్ుతేజ్ లాంటి యువ హీరోలకు ఆమె కలిసొచ్చిన చాయిస్. పారితోషికం: రూ. 50 లక్షల పైగా. లావణ్యా త్రిపాఠీ (25) : సొట్టబుగ్గల సుందరి ఉత్తరప్రదేశ్‌లో పుట్టి, ఉత్తరాఖండ్‌లో పెరిగి, ‘మిస్ ఉత్తరాఖండ్’గా నిలిచి, మోడలింగ్ ర్యాంప్ నుంచి టీవీ షోల మీదుగా వెండితెర పైకి నడిచొచ్చిన నటి.హిందీ టీవీ సిరీస్ ‘ష్...కోయీ హై’తో నటిగా పరిచయమయ్యారు. తెలుగుతోనే సినీ రంగప్రవేశం. ఫస్ట్ : ‘అందాలరాక్షసి’ (2012) బెస్ట్ : ‘‘అందాల రాక్షసి’, ‘భలే భలే మగాడివోయ్’, ‘సోగ్గాడే చిన్ని నాయనా’ స్పెషాల్టీ : చేస్తున్న సంస్థ, హీరోను బట్టి అవసరమైతే అతిథి పాత్రలకు కూడా సిద్ధమనే పట్టు విడుపులున్న నవతరం నాయిక ( నాగార్జున ‘మనం’ (2014)లో చేసిన గెస్ట్ రోల్ గుర్తుందిగా). స్నేహశీలత, కెమేరా ముందు బిడియం లేకపోవడం లావణ్యను పరిశ్రమలో నలుగురి ఎదుట స్పెషల్‌గా నిలబెడుతున్నాయి. టావ్ుబాయ్ స్టయిల్, సొట్టబుగ్గల సౌందర్యం ఆమెని సన్నిహితం చేస్తున్నాయి. ‘హైదరాబాద్ నా రెండో ఇల్లు’ అంటున్న లావణ్య ఇప్పుడు కొత్త దర్శక, నిర్మాతలకు మరో చాయిస్. పారితోషికం : రూ. 50 లక్షల పైగా. క్యాథరిన్ (26) : సోగకళ్ళ అమ్మాయి... ఈ మలయాళీ రోమన్ సిరియన్ క్యాథలిక్ అమ్మాయి పుట్టింది దుబాయ్‌లో కానీ, దుమ్ము రేపుతోంది మాత్రం దక్షిణాది అంతా. బెంగుళూరులో పెరిగిన ఈ అమ్మాయికి పాట, ఆట, పియానో - మనసు పెడితే రానిదేదీ లేదు. 14 ఏళ్ళ వయసుకే మోడల్‌గా తొలి అడుగులు వేసి, ప్రసాద్ బిడప్ప లాంటి ప్రసిద్ధుల ఫ్యాషన్ షోలలో పాల్గొన్నారు. బోలెడన్ని యాడ్స చేశారు. కన్నడంలో మొదలుపెట్టి, మలయాళం మీదుగా తెలుగులోకి దూసుకు వస్తున్నారు. ఫస్ట్ : తెలుగులో ‘చమ్మక్ చల్లో’ (2013) బెస్ట్ : ‘ఇద్దరమ్మాయిలతో’, ‘రుద్రమ దేవి’, ‘సరైనోడు’ స్పెషాల్టీ : హీరోయిన్‌గానైనా, స్పెషల్ ఎప్పీయరెన్సకైనా రెడీ అనడం. పారితోషికం: రూ. 25 నుంచి 30 లక్షల దాకా. 'తమిళ కోటలో... తెలుగు బావుటా! కన్నాంబ... సావిత్రి... జమున... శారద... వాణిశ్రీ... జయప్రద... ఇలా ఎందరో నాయికల్ని పరాయిభాషలకు ఎగుమతి చేసిన ఘనత మనది. కానీ, ఇప్పుడు మన తెరపై కనిపిస్తున్నదంతా ఉత్తరాది భామలు! తమిళ పొన్నులు! మలయాళ కుట్టీలు! మనవాళ్ళు లేరా? ఉన్నా, వాళ్ళకు చాన్సుల్లేవా? ఇది పెద్ద చర్చే! అమ్మాయిల్ని హీరోయిన్లుగా ప్రోత్సహించని తల్లితండ్రుల దగ్గర నుంచి నటవారసులుగా కొడుకుల్నే తప్ప కూతుళ్ళను ప్రోత్సహించని టాలీవుడ్ బిగ్ ఫ్యామిలీల దాకా తవ్వితీస్తే - తెలుగు సమాజంలోని ఈ స్నేహరహిత వాతావరణానికి సవాలక్ష కారణాలున్నాయి. ఈ పరిమితుల మధ్యనే అంజలి, స్వాతీ రెడ్డి, వేద, మధుశాలిని లాంటి కొద్దిమంది తెలుగ మ్మాయిలు మాత్రం అడపాదడపా మెరుస్తున్నారు. విచిత్రం ఏమిటంటే, మన తెలుగమ్మాయిల్లో కొందరు హీరోయిన్లుగా తమిళ, మలయాళ సినీ పరిశ్రమల్లో మంచి అవకాశాలు దక్కించుకుం టున్నారు. రచ్చ గెలిచాకనైనా, ఇంట గెలుస్తామనే నమ్మకంతో అక్కడి సినిమాల్లో పాత్రలకు జీవం పోస్తున్నారు. అడపా దడపా తెలుగులో మెరుస్తున్న రాజోలు అమ్మాయి అంజలి ఇప్పుడు దాదాపు అరవ హీరోయినే. ఎక్కువ సిన్మాలు అక్కడే చేస్తున్నారు. ‘అష్టాచమ్మా’, ‘కార్తికేయ’ లాంటి హిట్లున్నా, ఇక్కడ అవకాశాలు తక్కువైన స్వాతీరెడ్డి తమిళ, మలయాళాల్లో మంచి పాత్రలకు కేరాఫ్ అడ్రస్. అక్కడి ప్రేక్షకులకు సుపరిచితం. ఆ భాషల్లోనూ బాగా మాట్లాడేస్తున్నారు. మదనపల్లె అమ్మాయి బిందుమాధవి మొదలెట్టింది తెలుగులో అయినా, స్థిరపడింది తమిళంలోనే! ఈ నేటివ్ బ్యూటీ ప్రతిభను తమిళులే గుర్తించారు. ‘బస్‌స్టాప్’, ‘మల్లెలతీరంలో సిరిమల్లె పువ్వు’ల్లో అభినయంతో ఆకట్టుకున్న ఒకప్పటి బాల నటి శ్రీదివ్య కూడా ఇప్పుడు ఇక్కడి కన్నా తమిళంలోనే ఫేమస్. మూడేళ్ళ క్రితం మొదలుపెట్టి తాజా ‘పెన్సిల్’ దాకా తమిళంలో చాలా ప్రయాణమే చేశారు. భాష, ప్రాంతం హద్దులు చెరిపేసి, రచ్చ గెలిచిన ఈ తెలుగమ్మాయిలకు ఇంట కూడా సముచిత స్థానం ఇవ్వాల్సింది మనమేగా! అప్పుడెప్పుడో ఏయన్నార్ కుటుంబం నుంచి ఆయన మనుమరాలు సుప్రియ, కృష్ణ ఫ్యామిలీ నుంచి ఆయన కూతురు మంజుల కెమేరా ముందుకొచ్చి, వచ్చినంత వేగంగానే వెనక్కీ వెళ్ళిపోయారు. తాజాగా ‘మెగా’ ఫ్యామిలీ నుంచి చిరంజీవి సోదరుడైన నాగబాబు కుమార్తె నీహారిక కొణిదెల నాయికగా వస్తున్నారు. ఒత్తిళ్ళనూ, బంధువుల అభ్యంతరాలనూ పక్కనపెట్టి, ఇంట్లో వాళ్ళను సైతం ఒప్పించి మరీ, హీరోయిన్గా ప్రూవ్ చేసుకొనేందుకు ‘ఒక మనసు’ సినిమాతో తొలి ప్రయత్నం చేస్తున్నారు. -
వాటిని ఎందుకు నిషేధించాలి?
‘‘నేరుగా తెలుగు సినిమా చేయడం కన్నా, వేరే భాషలోని సినిమాను తెలుగులోకి డబ్బింగ్ చేయడం చాలా కష్టం. డబ్బింగ్ చాలా గొప్ప ప్రక్రియ. శివాజీ గణేశన్ లాంటి మహానటులు తెలుగులో దశరథరామయ్య, కె.వి.ఎస్. శర్మ, జగ్గయ్య లాంటి వారి గొంతు ద్వారానే తెలుగువారికి తెలిశారు. ఈ కళను చిన్నచూపు చూడకండి’’ అని ప్రముఖ సినీ నేపథ్య గాయకుడు - డబ్బింగ్ కళాకారుడైన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అన్నారు. ‘తెలుగు సినిమాల్లో డబ్బింగ్ పాటలు’ పేరిట డాక్టర్ పైడిపాల రచించిన పరిశోధనా గ్రంథాన్ని ఆదివారం నాడు హైదరాబాద్‌లో ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పెద్ద నటులు నటించిన పెద్ద సినిమాల కన్నా చిన్న నటులు చేసిన చిన్న డబ్బింగ్ సినిమాలు బాగా ఆడడాన్ని ఎస్పీబీ ప్రస్తావించారు. ‘డబ్బింగ్ సినిమాల్ని నిషేధించాలనే వాదన సినీ పరిశ్రమలో కొందరు పెద్దలు తరచూ అంటున్నారు. మనకు చేతనైతే అంతకన్నా మంచి సినిమాలు తీయాలి కానీ, బాగున్న సినిమాల్ని ఎందుకు నిషేధించాలి?’ అని ఆయన సూటిగా ప్రశ్నించారు. గాయకుడిగా మొదలైన తాను ప్రముఖ సంగీత దర్శకుడు - డబ్బింగ్ కళాకారుడైన చక్రవర్తి బలవంతంతో ‘మన్మథలీల’ సినిమాతో అనుకోకుండా డబ్బింగ్ కళాకారుడినైన సంగతిని ఎస్పీబీ గుర్తు చేసుకున్నారు. కమలహాసన్ ‘దశావతారం’ తెలుగు రూపంలో 8 పాత్రలకు డబ్బింగ్ చెప్పిన క్లిష్టమైన అనుభవాన్ని అందరితో పంచుకున్నారు. ‘‘ఫిల్మ్ మీద ఒక భాషలో ఉన్న సౌండ్ ట్రాక్‌ను తొలగించి, వేరే భాష డైలాగ్ పెట్టాలనే ఆలోచన కొన్ని దశాబ్దాల క్రితం ఎవరికి వచ్చిందో కానీ, వాళ్ళకు జోహార్. పరభాషా చిత్రాల్ని మన తెలుగు నుడికారంలోకి తెచ్చే రచయితలే ఆ డబ్బింగ్ చిత్రాల విజయానికి ప్రధానకారకులు. తెలుగులోకి సినిమాను డబ్బింగ్ చేసే ప్రక్రియకు ఆద్యుడైన రచయిత శ్రీశ్రీ నుంచి అనిసెట్టి, రాజశ్రీ, ఇవాళ్టి శ్రీరామకృష్ణ, వెన్నెలకంటి దాకా ఈ శాఖను ముందుకు తీసుకెళ్ళిన మహానుభావులందరికీ వందనాలు’’ అని ఎస్పీబీ వ్యాఖ్యానించారు. రచయిత వెన్నెలకంటి మాట్లాడుతూ, తెలుగులో డబ్బింగ్ పాటలపై తొలిసారిగా ఇంత ప్రామాణిక రచన చేసిన పైడిపాలను అభినందించారు. ‘‘డబ్బింగ్ సినిమాకు రైటరే డెరైక్టర్’’ అని స్పష్టం చేస్తూ, శ్రీశ్రీ, ఆరుద్ర, రాజశ్రీ మొదలు కమలహాసన్ దాకా డబ్బింగ్ ప్రక్రియలో ఎదురైన తమాషా అనుభవాల్ని అందరితో పంచుకున్నారు. శాంతా వసంతా ట్రస్ట్ పక్షాన కె. వరప్రసాదరెడ్డి ఈ కార్యక్రమాన్ని నిర్వహించగా, పుస్తక రచయిత పైడిపాల, ప్రముఖ వైద్యులు డాక్టర్ గురవారెడ్డి, పుస్తక ప్రచురణకర్త - ‘మనసు ఫౌండేషన్’ వ్యవస్థాపకులు మన్నం వెంకట రాయుడు అతిథులుగా పాల్గొన్నారు. ‘పద్మశ్రీ’ డాక్టర్ గోపీచంద్, సినీ రచయితలు రావి కొండలరావు, గురుచరణ్, భారతీబాబు, దాము (బాలాజీ) తదితరులు పెద్ద సంఖ్యలో ఈ సభకు హాజరవడం విశేషం. -
తెలుగు నేర్పించింది..
నేను పుట్టింది ముంబయిలో అయినా నా సొంతూరు హైదరాబాద్ అనే ఫీలవుతా. ఇక్కడికి వస్తే ఏదో వేరే ప్రాంతానికి వ చ్చినట్టుండదు. అంతలా నా మనసుకు దగ్గరైపోయింది. ఇక్కడ ఉన్నప్పుడు పాజిటివ్స్ వైబ్స్ వస్తాయి. ఇక్కడికి వచ్చిన కొన్ని రోజుల్లోనే నేను తెలుగు నేర్చుకోవడం మొదలుపెట్టాను. త్వరలో నా పాత్రకు నేనే డబ్బింగ్ చెప్పుకుంటా. నేనంత ఫుడీని కాకపోయినా ఇక్కడి కొస్తే బిర్యానీ, చేపల పులుసు మిస్ కాను. ఆ డిషెస్ గురించి తలుచుకుంటేనే నోరూరిపోతుంది. విశేషం ఏంటంటే.. హైదరాబాద్ బిర్యాని టేస్ట్ ఒక్కో రెస్టారెంట్లో ఒక్కో విధంగా ఉంటుంది. ఒకదానికి మించి ఒకటి అన్నీ బాగుంటాయి. ఇక్కడ షికారంటే మాలాంటి వాళ్లకు కాస్త కష్టమే కదా. అయినా వచ్చినప్పుడల్లా జీవీకే మాల్‌ను చుట్టేయాల్సిందే. షూటింగ్ నిమిత్తం మేం రకరకాల ప్రదేశాలకు తిరుగుతూ ఉంటాం. కానీ నేను చూసిన అన్ని నగరాలతో పోలిస్తే హైదరాబాద్ సూపర్బ. - తమన్నా -
తప్పులుంటే క్షమించండి : రకుల్
ప్రస్తుతం యంగ్ హీరోలకు పర్ఫెక్ట్ జోడీ అనిపించుకుంటున్న హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. రాశీఖన్నా, రెజీనా లాంటి హీరోయిన్స్ నుంచి గట్టి పోటీ ఉన్నా.. స్టార్ హీరోల సరసన ఛాన్స్ కొట్టేయటంలో ముందే ఉంది ఈ బ్యూటీ. ఇప్పటికే రామ్ చరణ్ సరసన బ్రూస్ లీ సినిమాలో నటించిన రకుల్, ప్రస్తుతం ఎన్టీఆర్‌కు జోడీగా నటించిన నాన్నకు ప్రేమతో సినిమా రిలీజ్ కోసం వెయిట్ చేస్తోంది. సంక్రాంతి కానుకగా రిలీజ్ అవుతున్న ఈ సినిమాలో తన పాత్రకు తానే స్వయంగా డబ్బింగ్ కూడా చెప్పుకుంది. తను డబ్బింగ్ చెపుతుండగా తీసిన ఓ మేకింగ్ వీడియోను తన అఫీషియల్ యూట్యూబ్ ఛానల్లో రిలీజ్ చేసింది. అంతేకాదు తొలిసారిగా తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకుంటున్నాని, ఈ అవకాశం ఇచ్చిన వారందరికీ కృతజ్ఞతలు తెలియజేసింది. మరో అడుగు ముందుకేసి ఈ తొలి ప్రయత్నంలో ఏమైన తప్పులు జరిగినా.. క్షమించండీ అంటూ అందరి మనసు గెలుచుకుంది. అల్లు అర్జున్, బోయపాటి శ్రీను కాంబినేషన్లో తెరకెక్కుతున్న సరైనోడు సినిమాలోనూ హీరోయిన్గా నటిస్తోంది రకుల్ ప్రీత్ సింగ్. Who says dubbing is easy!! but me loving it!! #dubbing #NaannakuPrematho #workislife pic.twitter.com/fYNUwPRREk — Rakul Preet (@Rakulpreet) January 3, 2016 -
సింగర్‌గా జాక్వెలిన్...!
ఒకప్పుడు నటీనటులు సినిమాలో తమపై వచ్చే పాటలను తామే పాడుకునేవారు. ఆ తర్వాత సీన్ మారింది. పాత్రకు డబ్బింగ్ చెప్పుకునే స్థితిలో కూడా ఇప్పుడు కొంతమంది తారలు లేరు. దానికి కారణం పరభాషా చిత్రాల్లో ఎక్కువగా చేయడమే. డబ్బింగ్ సంగతెలా ఉన్నా కొంతమంది తారలు అడపా దడపా పాటలు పాడుతున్నారు. శ్రుతీహాసన్, నిత్యామీనన్ వంటి తారలు సింగర్స్‌గా కూడా ప్రతిభ నిరూపించుకున్నారు. హిందీలో ఆ మధ్య ఆలియా భట్ సింగర్ అవతారమెత్తారు. ఈ జాబితాలో జాక్వెలిన్ ఫెర్నాండెజ్ చేరనున్నారు. హీరో సూరజ్ పంచోలితో కలిసి ఆమె ఓ ఆల్బమ్‌లో నటించారు. ఈ ఆల్బమ్ కోసం గాయకుడు గుర్వీందర్ సీగల్తో కలిసి జాక్వెలిన్ ఓ పాట పాడనున్నారు. -
గాత్రదాత.. సుఖీభవ
సిటీలోని డబ్బింగ్ స్టూడియోలు స్టార్స్‌తో కళకళలాడుతున్నాయి. పెద్ద హీరోలు, ఎంతో బిజీగా ఉండే స్టార్స్ సైతం డబ్బింగ్ చెప్పేందుకు సరదా పడుతుండడమే దీనికి కారణం. టాలీవుడ్లో కొత్తగా వేళ్లూనుకుంటున్న ఈ ట్రెండ్ ఓవైపు డబ్బింగ్ ఆర్ట్‌కు స్టార్ హోదా ఇస్తూనే మరోవైపు ఇతర భాషల హీరోలకు గాత్రదాతల కొరతను తీరుస్తోంది. - శిరీష చల్లపల్లి టాలీవుడ్ సినిమాలతో వచ్చే క్రేజ్ అంత ఇంత కాదు. అందుకే భాషా ప్రావీణ్యం లేకపోయిన ఇతర భాష హీరోలు సైతం తెలుగులో నటించాలని ఇష్టపడుతుంటారు. లేదా కనీసం తమ సినిమాలు తెలుగులో అనువాదం కావాలని ఆశిస్తుంటారు. అన్యభాషా చిత్రాలు తెలుగులోకి అనువాదమైనప్పుడు ఆ హీరో ఆకారాన్ని, బాడీ లాంగ్వేజ్‌ని బట్టి సరిపడే వాయిస్ ఉన్న డబ్బింగ్ ఆర్టిస్ట్‌ని అతి కష్టం మీద వెతికి పట్టుకుంటుంటారు డెరైక్టర్లు. ఫుల్ హ్యాపీ ‘ప్రేమలీల’ సినిమా కోసం సల్మాన్‌ఖాన్‌కి డబ్బింగ్ చెప్పాలని అడిగినప్పుడు, నా వాయిస్ ఆయన పర్సనాలిటీకి , పాత్రకు హైలైట్ అవుతుందని చెప్పినప్పుడు హ్యాపీగా ఒప్పేసుకున్నాను. నా మీద నమ్మకముంచి, ఇలాంటి ఒక ప్రయోగం నాతో చేయించినందుకు నిజంగా చాలా సంతోషంగా ఉంది. - రామ్‌చరణ్ (ట్వీటర్ ద్వారా) అన్ని కళల్లోనూ ప్రూవ్ చేసుకోవాలి సైజ్ జీరో సినిమా కోసం తమిళ్ టాప్ హీరో ఆర్యకు డబ్బింగ్ చెప్పాలని అడిగినప్పుడు ఆశ్చర్యపోయాను. ఇన్నాళ్లు ఒక హీరోగా నిలబడేందుకు నా వంతు కృషి చేస్తున్నాను. అయితే నాకంటూ ఒక మంచి గుర్తింపు రావడానికి, ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడానికి నాలో ఉన్న విభిన్న రకాల టాలెంట్లను ప్రూవ్ చేసుకోవ డం అవసరమే. నాలోని ఒక కొత్త కళను గుర్తించి ఆర్య లాంటి పెద్ద హీరోకు డబ్ చెప్పమనడం గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఇలాంటి ప్రయో గాలకు నేను ఎప్పుడూ రెడీనే. - నందు ఫస్ట్ అండ్ బెస్ట్ ఛాన్స్ మొట్టమొదటి సారిగా వేరొక నటుడికి నా వాయిస్ ఇవ్వాలని డెరైక్టర్ మణిరత్నం గారి నుంచి కాల్ వచ్చినప్పుడు చాలా ఎగ్జయిట్ అయ్యాను. తెలుగు దనం మిస్ కాని వాయిస్ కాబట్టే నన్ను సెలెక్ట్ చేశారని చెప్పడంతో మరింత థ్రిల్‌గా ఫీల్ అయ్యాను. పైగా మణిరత్నం లాంటి లెజెండ్ మూవీలో ఏదో రకమైన అవకాశం వస్తే ఎలా కాదనగలను.. సో వెంటనే ఒప్పేసుకున్నా. ఓ కొత్త ప్రయోగం చేసినందుకు సంతోషంగా కూడా ఉంది. - నాని స్టార్స్‌లోనూ డబ్బింగ్ క్రేజ్ ఈ మధ్య కాలంలో టాలీవుడ్లో పెద్ద హీరోలు సైతం డబ్బింగ్ చెప్పడాన్ని క్రేజీగా ఫీల్ అవుతున్నారు. ఉదాహరణకి ‘ఓకే బంగారం ’ సినిమాలో హీరోగా చేసిన మమ్ముట్టి కొడుకు దుల్కర్ సల్మాన్ స్వతహాగా తమిళ్, మలయాళం భాషల్లో ప్రావీణ్యుడు. తెలుగు భాషా నైపుణ్యం లేకపోవడంతో దుల్కర్‌కి మన తెలుగు హీరో నాని మొదటి సారిగా డబ్బింగ్ చెప్పారు. అదే విధంగా సైజ్ జీరో చిత్రంలో హీరో ఆర్యకు నందు చెబితే, తాజాగా విడుదలైన సల్మాన్‌ఖాన్ డబ్బింగ్ చిత్రం ‘ప్రేమలీల’లో ఆయన పాత్రకు రామ్‌చరణ్ డబ్బింగ్ చెప్పడంతో.. ఈ డబ్బింగ్ ట్రెండ్‌కి స్టార్ స్టేటస్ స్థిరపడినట్టయింది. దీంతో మరింత మంది హీరోలు నిస్సంకోచంగా డబ్బింగ్‌కు సై అంటున్నారు. -
డబ్బింగ్‌కు ఆయన వాయిస్... తిరుగులేని చాయిస్
సమ్‌థింగ్ స్పెషల్ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. ఎం.ఎస్ నారాయణ తను నటించిన సన్నివేశాలకు సంబంధించి డబ్బింగ్ చెప్పడానికి ఇంకాసేపట్లో రావాల్సి ఉంది. ఇంతలో అకస్మాత్తుగా ఫోన్...‘‘సార్...ఎమ్మెస్ గారు చనిపోయారట సార్’’... మరో సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతోంది. ప్రకాష్‌రాజ్ తను చేసిన సీన్లకు సంబంధించి చెప్పాల్సిన డబ్బింగ్ వర్క్ పెండింగ్ ఉంది. అనుకోకుండా ఆయన ఔటాఫ్ కంట్రీ. అక్కడి నుంచి ఆయన తిరిగి వచ్చేవరకూ విడుదల ఆపేయాల్సిందేనా.... నిర్మాతలకు, సినిమా రూపకర్తలకు ఇలాంటి సమస్యలు కొత్తేం కాదు. అయితే వాటికి ఇప్పుడు సులభమైన పరిష్కారం దొరికింది. ఆ పరిష్కారం పేరు జితేంద్రనాథ్. మిమిక్రీ చేసేవాళ్లు మనకి చాలామందే తెలిసినా... అది ఇప్పటిదాకా నవ్వించడానికే అనుకునేవాళ్లం. అయితే అదే అనుకరణ కళ ను ఆధారం చేసుకుని తిరిగిరాని లోకాలకు చేరిపోయిన నటుల గొంతులను వారి పాత్రలకు అతికిస్తూ... వారిని బతికిస్తూ...తనను తాను బతికించుకుంటున్నారు జితేంద్ర. ఉదయ్‌కిరణ్, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, ఎమ్మెస్ నారాయణ తదితర ప్రముఖ నటులు అనుకోకుండా దూరమైతే.. అప్పటికే వారు నటించి ఉన్న సినిమాలో పాత్రకు ఎవరు డబ్బింగ్ చెప్పాలి? ఆయన లేకపోయినా, ఆ లోటు తెరపై వినపడకుండా ఎవరు చేయాలి? ఇలాంటి ప్రశ్నలకు సమాధానంగా నిలుస్తున్నాడీ అనుకరణ కళాకారుడు. అనుకోకుండా అనుకరణలోకి... ‘‘మాది విజయవాడ. పదేళ్ల క్రితం నగరానికి వచ్చి స్థిరపడ్డాను’’ అంటూ చెప్పారు జితేంద్ర. స్టేజిషోస్, టీవీ షోస్... ఇలా పలు రంగాల్లో మిమిక్రీ ప్రదర్శనలతో రాణిస్తున్నారు. ఇది చాలా మంది చేసేదే కాబట్టి విశేషమేమీ లేదు. అయితే అకస్మాత్తుగా మరణించిన సినిమా నటుల పాత్రలకు వారి మరణానంతరం ఆయన గాత్రదానం ఇవ్వడం ద్వారా పరిశ్రమలో ఆయన ప్రొఫెషన్‌కు అరుదైన గౌరవం దక్కింది. ‘‘ఆరేళ్ల వయసులోనే చిరంజీవిని అనుకరిస్తూ డ్యాన్సులు చేశా. సాంగ్స్, డ్యాన్స్ తప్ప మిమిక్రీ రంగంలోకి ప్రవేశిస్తాననుకోలేదు’’ అంటున్న జితేంద్ర... శ్రీదేవి పెళ్లి అనే నాటి మిమిక్రీ క్యాసెట్‌తో ఇన్స్పైర్ అయ్యి నటీనటులను అనుకరించడం ప్రాక్టీస్ చేశారు. కాలేజ్ వేడుకల్లో హర్షధ్వానాలు అందుకున్నారు. చిన్నప్పటి నుంచి కళలంటే ఉన్న ఇష్టంతో చిరుద్యోగంతో సరిపుచ్చుకోలేక సినిమాల్లో భవిష్యత్తు నిర్మించుకోవాలనే ఆలోచనతో సిటీకి వచ్చేశారు. ఆ తర్వాత సినీరంగంలో విభిన్న అంశాల్లో తన టాలెంట్‌ను పరీక్షించుకున్నారు. అలా అనుకరణ కళాకారుడిగా స్థిరపడ్డారు. ఆపద్బాంధవుడిగా... ఉదయ్‌కిరణ్ అకస్మాత్తుగా మరణించే నాటికి ఒక సినిమాలో నటించి ఉన్నారు. దాంతో ఆయన పాత్రకు డ బ్బింగ్ చెప్పడం సమస్యగా మారింది. అప్పుడు జితేంద్ర ధైర్యం చేశారు. అప్పటి నుంచి సినీ ప్రముఖుల మరణానంతరం సినీ రూపకర్తల పాలిట ఆపద్బాంధవుడిగా మారిపోయారు. ఆహుతి ప్రసాద్, మల్లికార్జునరావు, చిత్తజల్లు లక్ష్మీపతిరావు... ఇలా అకస్మాత్తుగా దూరమైన నటులతో పాటు, రకరకాల కారణాలతో తమ పాత్రకు తామే డబ్బింగ్ చెప్పలేకపోయిన దాదాపు 60 మంది నటులకు వాయిస్ అందించారు. ఎం.ఎస్.నారాయణ చనిపోయిన అనంతరం ఆయన వాయిస్‌నే దాదాపు 10 సినిమాలకు పైగా తాను డబ్బింగ్ చెప్పడం గొప్ప విశేషం అంటారాయన. ఇప్పటికే దేశ విదేశాల్లో పెద్ద సంఖ్యలో స్టేజ్ షోస్ ఇస్తూ రాణిస్తున్న జితేంద్ర... చనిపోయిన కళాకారుల గొంతులను అనుకరించడం అదీ వారి పాత్ర, అభినయాలకు దీటుగా పలికించడం కష్టసాధ్యమైనా... అది వారికి తన వంతుగా అర్పిస్తున్న నివాళి లాంటిదంటున్నారు. ఎంతో మంది మిమిక్రీ ఆర్టిస్టులున్నా... ఈ ఆపద్బాంధవుడనే పేరు తనకు మాత్రమే దక్కడాన్ని వినమ్రంగా స్వీకరిస్తున్నానంటారు. గాయకుల గొంతులు అనుకరిస్తూ పాటలు పాడడం, షార్ట్ ఫిల్మ్‌లో నటించడం, హాలీవుడ్ నటుల వాయిస్‌ను సైతం ఇమిటేట్ చేయగలగడం... ఇలా ఎన్నో రకాల అదనపు నైపుణ్యాలను అలంకారంగా చేసుకున్న జితేంద్ర... వీలున్నంత కాలం కళాకారుడిగా జీవించడమే తన లక్ష్యం అంటున్నారు. - ఎస్.సత్యబాబు -
సల్మాన్ ఖాన్‌కు రామ్‌చరణ్ డబ్బింగ్
టాలీవుడ్, బాలీవుడ్ సర్కిల్స్‌లో ఓ ఆసక్తి కరమైన వార్త చక్కర్లు కొడుతుంది. బాలీవుడ్ సూపర్ స్టార్‌గా ప్రజెంట్ వరుస సక్సెస్‌లతో దూసుకుపోతున్న సల్మాన్ ఖాన్‌కు టాలీవుడ్ యంగ్ హీరో రామ్ చరణ్ డబ్బింగ్ చెప్పబోతున్నాడట. సల్మాన్ చేస్తున్న లేటెస్ట్ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్ 'ప్రేమ్ రతన్ ధన్ పాయో' సినిమా కోసం ఈ క్రేజీ కాంబినేషన్‌ను సెట్ చేస్తున్నారు చిత్రయూనిట్. 'ప్రేమ్ రతన్ ధన్ పాయో' సినిమాను హిందీతో పాటు ఒకేసారి తెలుగులో కూడా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తుంది చిత్ర నిర్మాణ సంస్ధ రాజశ్రీ ప్రొడక్షన్స్, అయితే తెలుగు వర్షన్లో సల్మాన్ పాత్రకు ఓ స్టార్ హీరోతో డబ్బింగ్ చెప్పించాలని భావించిన యూనిట్ సభ్యులు సల్మాన్‌తో సన్నిహిత సంబందాలు ఉన్న మెగా ఫ్యామిలీ హీరో అయితే కరెక్ట్ అని భావించారట. అందుకే సల్మాన్ ఖాన్ స్వయంగా చెర్రీకి ఫోన్ చేసి అడగటంతో చరణ్ వెంటనే ఒప్పేసుకున్నాడన్న టాక్ వినిపిస్తుంది. గతంలో సల్మాన్ హీరోగా తెరకెక్కిన 'మైనే ప్యార్ కియా', 'హమ్ ఆప్కే హై కౌన్' సినిమాలు తెలుగులో డబ్ అయి మంచి విజయాలు సాదించాయి. ఈ రెండు సినిమాలు తెలుగులో సక్సెస్ చేసిన రాజశ్రీ సంస్థ మరోసారి సల్మాన్ హీరోగా అదే మ్యాజిక్‌ను రిపీట్ చేయాలని భావిస్తోంది. ఇప్పటి వరకు అఫీషియల్ ఎనౌన్స్మెంట్ లేకపోయినా సల్మాన్ సినిమాకు చరణ్ డబ్బింగ్ అన్న వార్త మాత్రం ఫిలిం నగర్లో గట్టిగానే వినిపిస్తుంది. -
హిందీ బాణీ తెలుగు పాట...
నాస్టాల్జియా సంగీతానికి కులం లేదు మతం లేదు తెలుగు హిందీ అనే భాషాభేదం లేదు. హిట్ అయిన పాట ఎక్కడైనా హిట్ అవుతుంది. అయ్యింది. కాలం కూడా అదే నిరూపించింది. అశోక్ కుమార్ ‘కిస్మత్’ (1943)లో అందరూ మెచ్చిన ఆ పాట ‘మేరా బుల్బుల్ సో రహా హై’... తెలుగులో అంతే అందంగా నలుగురినీ ఆకర్షించలేదా? ‘దొంగ రాముడు’ (1955)లో ‘నిదురపోయే రామచిలుక ఎగిరిపోతుంది... కల చెదిరిపోతుంది’... అంటే మనమందరం సద్దు చేయకుండా శ్రద్ధగా వినలేదా? మంచి పాటను డబ్బింగ్ కూడా ఆపలేదని ‘ఆహ్’ నిరూపించింది. ‘రాజా కి ఆయేగీ బారాత్‘ అని అక్కడ లతా మంగేష్కర్ పాడితే తెలుగులో ‘కనువిందవుతున్నాది’ అని జిక్కీ జవాబు చెప్పలేదా? ఇవాళ్టికీ పందిళ్లు వేసిన పెళ్లి ఇళ్లలో ఈ పాట వినిపిస్తూనే ఉండటం లేదా? మంచి హిందీ పాటకు పరవశించని తెలుగు సంగీత దర్శకుడు లేడు. సాలూరి కావచ్చు, పెండ్యాల కావచ్చు చివరకు నేటి మేటి సంగీత దర్శకులు కూడా కావచ్చు. కాని అందరి కంటే నాలుగు ఆకులు ఎక్కువ చదివింది మాత్రం సత్యం. హిందీ పాటలను తెలుగులో చాలా సృజనాత్మకంగా సత్యం ప్రవేశపెట్టాడు. కన్నడంలో ఈ బాధ్యతను రాజన్-నాగేంద్ర తీసుకున్నారు. ఫిరోజ్ ఖాన్ 1975లో ‘ధర్మాత్మ’ తీశాడు. ‘గాడ్ ఫాదర్’ను ఇండియనైజ్ చేసే మొదటి ప్రయత్నం అది. కల్యాణ్‌జీ- ఆనంద్జీ సంగీతం. ముకేశ్- కంచన్ పాడిన ‘క్యా ఖూబ్ లగ్తీ బడి సుందర్ దిఖ్తీ హో’... పాట పెద్ద హిట్ అయ్యింది. ఇది మన తెలుగు ఇండస్ట్రీని కూడా తాకింది. 1977లో వచ్చిన రెండు సినిమాల్లో ఈ పాట వినిపించింది. ఎన్టీఆర్ తీసిన ‘చాణక్య చంద్రగుప్త’లో అందరికీ గుర్తుండే ఉండాలి... ‘చిరునవ్వుల తొలకరిలో’ పెద్ద హిట్. అదే సంవత్సరం వచ్చిన కృష్ణంరాజు ‘శివమెత్తిన సత్యం’లో ‘గీతా ఓ గీతా డార్లింగ్ మై డార్లింగ్’ పాట కూడా పెద్ద హిట్టే. ఏసుదాస్- వాణి జయరాం పాడిన ఈ పాటకు జె.వి.రాఘవులు సంగీతం. ఇక సత్యం ఒకే హిందీ బాణీని అనేకసార్లు ఉపయోగించిన సందర్భాలు ఉన్నాయి. నౌషాద్ మహానుభావుడు. తమిళ సూపర్‌హిట్ ‘పాలుమ్-పాజుమమ్’ను హిందీలో ‘సాథీ’ (1968) పేరుతో రీమేక్ చేస్తుంటే ఆయన తన ట్రెడిషనల్ బాణీకి కాస్త పక్కకు జరిగి మంచి మోడరన్ మెలోడీ ఇచ్చాడు. ‘మేరా ప్యార్ భి తూ హై ఏ బహార్ భి తూ హై’... ముకేశ్- లతా పాడిన ఈ డ్యూయెట్లో రాజేంద్రకుమార్, వైజయంతిమాలా అందంగా అలరిస్తారు. ఈ పాట బహుశా సత్యంను వెంటాడింది. ఆయన ‘బుల్లెమ్మ బుల్లోడు’ (1972)లో దీనిని ‘కురిసింది వానా నా గుండెలోన’గా ఇన్‌స్పయిర్ అయ్యి చేశాడు. అంతటితో ఆగలేదు. ‘పుట్టినిల్లు మెట్టినిల్లు’ (1973) ‘సిరిమల్లె సొగసు జాబిల్లి వెలుగు’ పాటగా చేశాడు. రెండూ పెద్ద హిట్ అయ్యాయి. అందరం అభిమానించే సాలూరి కూడా ఇలాంటి ప్రభావం నుంచి తప్పించుకోలేకపోయారు. ‘హరేరామ హరేకృష్ణ’ (1971) కోసం ఆర్.డి.బర్మన్ చాలామంచి మెలోడీ ఒకటి చేశాడు. ‘ఫూలోంకా తారోంకా సబ్ కా కెహనా హై’... లతా పాడిన ఈ పాట ఇప్పటికీ హిట్టే. ఇది ఆయన మనసులో పడి ఉండాలి. ‘రాధాకృష్ణ’ (1978)కు సంగీతం అందించేటప్పుడు ఈ పాటను ‘నీవే జాబిలి నీ నవ్వే వెన్నెల’గా... చేశారు. సుశీల, బాలూ పాడిన ఈ పాట మంచి ఆహ్లాదంగా ఉంటుంది. పాటలో శోభన్‌బాబు పక్కన హైదరాబాద్ స్టార్ రూప కూడా. ఏమైనా ఈ కథ అనంతం. ఈ పాటల తీపికి లేదు అంతం. గొంతుతో గెలిచిన నటుడు... రాజ్‌కుమార్‌ను అందరూ ఇష్టపడరు. కాని ఇష్టపడేవాళ్లు మాత్రం విపరీతంగా ఇష్టపడతారు. పరిమితమైన శరీర కదలికలతో గంభీరమైన గొంతుతో ఒక ప్రత్యేకమైన డైలాగ్ డెలివరీతో పేరు తెచ్చుకున్న నటుడాయన. కశ్మిర్ పండిట్ కుటుంబాల నుంచి వచ్చి బాలీవుడ్లో నిలదొక్కుకున్న తొలితరంవారిలో ఆయన ఒకడు. దిల్ ఏక్ మందిర్, వక్త్, హమ్రాజ్, నీల్ కమల్, హీర్ రాంజా... వంటి హిట్స్ ఈయన ఖాతాలో ఉన్నాయి. దిలీప్ కుమార్‌తో ఎందుకనో వైరం వచ్చింది. ఇద్దరూ కలిసి ‘పైగామ్’లో నటించారు. ఆ తర్వాత 32 ఏళ్లకు సుభాష్ ఘాయ్ ‘సౌదాగర్’లో నటించారు. రాజ్‌కుమార్ అసలు రూపం ఎవరూ చూడలేదు. ఆయన ఎప్పుడూ విగ్లో ఉండేవాడు. నిజ జీవితంలో కూడా విగ్ వాడిన మొదటి నటుడు బహుశా ఆయనే కావచ్చు. ఎవరినీ కలవకుండా రిజర్వ్డ్గా ఉండటానికి ఇష్టపడిన రాజ్‌కుమార్ తను చనిపోయేముందు కుటుంబానికి స్పష్టమైన సూచనలు ఇచ్చాడు. అంతిమ సంస్కారాలు ముగిశాకే తన మరణవార్త లోకానికి తెలియచేయమన్నాడు. కుటుంబ సభ్యులు ఆయన కోరిక నెరవేర్చారు. అందువల్ల ఆయన అంతిమయాత్రలో పాల్గొనే సంగతి దేవుడెరుగు కనీసం చివరి చూపులు కూడా ఆయన అభిమానులకు దక్కలేదు. రాజ్ కుమార్ అనగానే ‘పాకీజా’లో డైలాగ్ గుర్తుకు వస్తుంది. గుర్తుంది కదా... ‘ఆప్ కే పావ్ దేఖా. బహూత్ హసీన్ హై. ఇన్ హే జమీన్ పర్ మత్ ఉతారియేగా. మైలే హోజాయేంగే’... ( మీ పాదాలు చూశాను. చాలా అందంగా ఉన్నాయి. నేల మీద దించకండి. మాసిపోతాయి’)... ఆమె.... అతడూ... ప్రతి మగవాడి విజయం వెనుక ఒక స్త్రీ ఉన్నా లేకపోయినా ప్రతి స్త్రీ పరాజయం వెనుక మాత్రం చాలామంది పురుషులు ఉంటారు. మీనాకుమారి జీవితం చూస్తే అదే అనిపిస్తుంది. కటిక పేదరికం, దారుణమైన పరిస్థితులు ఆమెను సినిమా రంగంలో బలవంతంగా ప్రవేశపెట్టాయి. ఆమె తండ్రికి ఆమె సంపాదన తప్ప వేరే మార్గం లేదు. సరే సినిమాల్లో నటించింది.. రాణించింది... స్టార్ అయ్యింది. ఆ తర్వాత ఆమె కంటే పదిహేనేళ్ల పెద్దవాడైన దర్శకుడు కమాల్ అమ్రోహి ఆమెను రెండో పెళ్లి చేసుకున్నాడు. ఈమెకు పరిణితి లేకపోయినా ఆయనకైనా ఉండి ఉంటే ఆ పెళ్లి ఎంత దాకా వెళ్లగలిగేదో ఊహించి ఉండేవాడు. అలాగే అయ్యింది. 1960ల నాటికి ఇద్దరూ విడివిడిగా ఉండాల్సి వచ్చింది. ఆ సందర్భంలోనే కవి గుల్జార్ కొన్నాళ్లు ఆమెకు దగ్గరయ్యాడు. అంతకంటే ఎక్కువగా హీరో ధర్మేంద్ర. సినిమా రంగంలో ఎటువంటి సంబంధం గాని మంచి చదువుగాని లేకుండా కేవలం కండలని నమ్ముకుని ముంబై చేరుకున్న ఈ హీమేన్ మొదటిసారిగా ‘పూర్ణిమ’ అనే సినిమాలో మీనాకుమారి పక్కన నటించాల్సి వచ్చింది. అప్పటికే ఆమె సూపర్‌స్టార్ కనుక ఇతడికి ఆమె ముందు చేయీ కాలూ ఆడలేదు. నోట మాట రాలేదు. కాని మీనా కుమారి ఎంత మంచి కోస్టార్ అంటే అతడి అనీజీని గమనించి చనువుగా చెవి మెలివేసిందట. దాని వల్ల చెవి ఎర్రగా అయ్యే సరికి ‘భడవా... ఎంత రంగు ఉన్నావ్’ అని పెద్దగా నవ్విందట. దాంతో భయం పోయి ధర్మేంద్ర హాయిగా నటించగలిగాడట. ఈ విషయాన్ని ధర్మేంద్రే చెప్పుకున్నాడు. మీనా కుమారి దాదాపుగా ధర్మేంద్రకు గురుస్థానంలో వెళ్లి అతడికి యాక్టింగ్లోని మెలకువలన్నీ నేర్పింది. నువ్వు పెద్ద హీరోవి అవుతావు అని జోస్యం చెప్పింది. అదే నిజమయ్యింది కూడా. కాని మీనా కుమారితో ధర్మేంద్ర స్నేహం రేయింబవళ్లు ధర్మేంద్ర ఆమె ఇంట్లోనే ఉండటం ఇద్దరూ కలిసి తాగడం ఇవన్నీ పెద్ద గొడవలకు దారి తీశాయి. ధర్మేంద్ర భార్య దాదాపు యుద్ధం ప్రకటించింది. మీనా కుమారి అక్కను పెళ్లి చేసుకున్న కమెడియన్ మెహమూద్ కూడా ఈ గొడవను సర్దుబాటు చేయాల్సి వచ్చింది. మొత్తం మీద వారిద్దరినీ విడదీయగలిగినా తాగుడుకు బానిసైన మీనా కుమారిని చూడ్డానికి వచ్చినప్పుడల్లా ధర్మేంద్ర ఆమె పరిస్థితి చూడలేక రోదిస్తూ బయటకు వచ్చేవాడట. మీనా కుమారి 1972లో తన 39వ ఏట మరణించింది. ఆమె పుట్టినప్పుడు తల్లిదండ్రుల దగ్గర హాస్పిటల్ బిల్లులకు డబ్బు లేదు. చనిపోయినప్పుడు కూడా అదే పరిస్థితి. విషాద నాయిక విషాదకరమైన ముగింపు అది. టున్ టున్ టున్ టున్ అంటే అర్థం ఏమిటో ఎవరికీ తెలియదు. కాని దానిని పెట్టింది మాత్రం దిలీప్ కుమార్. టున్ టున్ దిలీప్ కుమార్‌కు మంచి ఫ్రెండ్. మ్యూజిక్ డెరైక్టర్ నౌషాద్కు క్లోజ్ ఫ్రెండ్. పదమూడేళ్ల వయసులో ఇంటి నుంచి పారిపోయి నౌషాద్ ఇంటి తలుపు తడితే గాయనిగా ఆయనే అవకాశం ఇచ్చాడు. అవును. టున్ టున్ తన అసలు పేరు ఉమా దేవి పేరుతో చాలా హిట్ పాటలు పాడింది. వాటిలో అందరికీ తెలిసిన ‘అఫ్సానా లిఖ్ రహీ హూ దిలే బేకరార్కా’ వంటి హిట్స్ ఉన్నాయి. కాని ఎక్కువ రోజులు సింగర్‌గా కెరీర్ కొనసాగించలేకపోతే దిలీప్ కుమార్ ఆమెను నటిని చేశాడు. లావుగా ఉండే ఆమె ఆకారాన్ని బట్టి కమెడియన్‌గా రాణిస్తావ్ అన్నాడు. చాలా సినిమాల్లో హీరోకు లైన్ వేసే లట్టు అమ్మాయిగా టున్ టున్ కనిపిస్తుంది. ఎనభై ఏళ్లు జీవించి 2003లో మరణించినా తెలుగులో గయ్యాళులకు సూర్యకాంతం అనే పేరు ఎలా పడిందో ఉత్తరాదిన లావుగా ఉన్న ఆడవాళ్లకు టున్ టున్ అనే పేరు మిగిల్చి వెళ్లింది. -
ఆయన్ని మిస్సవుతున్నా
త్రిష ఎవరితోనూ మాట్లాడదు... మాట్లాడితే... తన గురించి ఎక్కువగా మాట్లాడతారని భయం కావచ్చు! ఆల్మోస్ట్ పదమూడేళ్ల పాటు డబ్బింగ్ చెప్పకుండానే మాట్లాడింది మరి! చిరంజీవి నుంచి చిన్న ఎన్టీఆర్ దాకా అందరితో మాట్లాడించేసింది. థర్టీన్ ఇయర్స్ ఇండస్ట్రీ ఇక్కడ!! షూటింగ్లో... ఎవరైనా అనవసరంగా మాట్లాడిస్తారేమోనని, తప్పించుకోవడానికి అనుకుంటా...సెల్ఫోన్లో తలదూర్చి, తన ప్రపంచాన్ని తాను ఆవిష్కరించుకుంటూ ఉంటుంది. మరి, అంతటి ‘మూకీ’ దేవత ‘సాక్షి’తో ఎందుకు మాట్లాడిందో! మరి అదే... మీ ‘సాక్షి’! రామ్,ఎడిటర్, ఫీచర్స్ పదమూడేళ్ళుగా చూస్తున్నాం. చిరు నుంచి చిన్న ఎన్టీఆర్ దాకా అందరితో నటించిన హీరోయిన్లలో మీరే ఆఖరేమో! (నవ్వేస్తూ...) నేను సినీరంగానికి వచ్చినప్పుడు సిమ్రాన్, జ్యోతిక, నేను - ఇలా ముగ్గురు, నలుగురమే ఉండేవాళ్ళం. ఇప్పుడు అందం, అభినయమున్న 10 - 15 మంది హీరోయిన్లున్నారు. దీనివల్ల పోటీ పెరిగి, హీరోయిన్ల యావరేజ్ కెరీర్ లైఫ్ శ్పాన్ చాలా తగ్గింది. అయినా ఇన్నేళ్ళు హీరోయిన్గా నిలవడం విశేషమే. అయామ్ బ్లెస్డ్. షార్ట్ శ్పాన్ ఆఫ్ టైమ్‌లో ఇంత స్టార్సతో నటించడం, పేరు తెచ్చుకోవడం హ్యాపీ. ఈ స్థాయికి రావడంలో మీ కష్టమెంత? అదృష్టమెంత? నన్నడిగితే సరైన స్క్రిప్ట్‌నూ, సరైన దర్శకుణ్ణీ ఎంచుకోవడం చాలా ఇంపార్టెంట్. భారీ, మాస్, హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలు - ఇలా అన్నీ ప్యాకేజ్‌గా ఉండాలి. ఆ బ్యాలెన్స్ చూసుకోవాలి. దానికి లక్ తోడవ్వాలి. లేదంటే, (చేతులతో పై నుంచి కిందకు చూపిస్తూ... చటుక్కున తమిళంలోకి మారి..) ‘అంగ వెచ్చిట్ట రసికర్గళ్ ఇంగ తూక్కి పోడువాంగ’ (ఆకాశానికి ఎత్తిన ప్రేక్షకులే, పాతాళానికీ పడదోస్తారు). ఈ బ్యాలెన్సింగ్‌లో మీ అమ్మగారి పాత్ర ఉందట! ‘నా చుమ్మా సెట్స్‌కు వందు వేల పణ్ణిట్టి పోవేన్. బిహైండ్ ది సెట్స్ నరయ వేల ఇరుక్కు’ (నేరుగా సెట్స్‌కు వచ్చి, నటించి వెళ్ళిపోతుంటా. కానీ, తెర వెనుక చాలా శ్రమ ఉంటుంది). ఆ శ్రమ అంతా మా అమ్మదే! ఇప్పటికీ నాకు మోటివేషన్ - మా అమ్మే! అన్నీ నిశ్శబ్దంగా హ్యాండిల్ చేసే మా అమ్మ ‘సెలైంట్ మేనేజర్’. మేనేజరున్నా స్క్రిప్టు ఏమిటి, ఏ సినిమా చేయాలి - అన్నీ నేను, అమ్మే కలసి చర్చించుకుంటాం. సినిమా చేయాలా, వద్దా అనే ఫైనల్ డెసిషన్ మాత్రం నాదే! అమ్మగారి సపోర్ట్ తెలిసిందే... మరి నాన్న? అమ్మ దగ్గర కన్నా చనిపోయిన నాన్న దగ్గరే నాకు గారాబం ఎక్కువ. ఆయావ్ు అప్పాస్ గర్ల! న్యూయార్క్‌లో చత్వాల్ గ్రూపులో 13 ఏళ్ళ పాటు ఆయన పనిచేశారు. ఆ తరువాత ‘తాజ్’ గ్రూపులో చెన్నై, హైదరాబాద్‌లలో పనిచేశారు. (కళ్ళలో నీళ్ళు తిరుగుతుండగా...) ఆయన్ని మిస్సవుతున్నా. బాధపెట్టినట్లున్నా! మళ్ళీ సినిమాల కొద్దాం. ‘లయన్’లో బాలకృష్ణతో తొలిసారి నటిస్తున్నట్లున్నారు! రెండేళ్ళ గ్యాప్ తరువాత వస్తున్న నా తెలుగు సినిమా - ‘లయన్’. థ్రిల్లర్, యాక్షన్ ఫిల్మ్ ఇది. కానీ, సన్నివేశాలు చాలా ఆహ్లాదంగా ఉంటాయి. నిజానికి, ‘అతడు’ తర్వాత ‘బాలా’ (బాలకృష్ణ)తో ఒక సినిమాకు అడిగారు. అలాగే, లాస్ట్ ఇయర్ ‘లెజెండ్’లో కూడా చేయాల్సింది. ఇన్నాళ్ళకు ఆయనతో యాక్ట్ చేయడం కుదిరింది. ఆయన చాలా కూల్. నాలెడ్జబుల్ మ్యాన్. వంద సినిమాలకు దగ్గరవుతున్నా, అంత హుషారుగా పనిచేసే వ్యక్తిని మరొకరిని చూడలేదు. పెద్ద స్టార్స్‌తో చేశారు. వాళ్ళతో మీ నటనానుభవం? ఆ స్థాయికెళ్ళాక, మనకూ కొంత అహం ఉంటుంది. కానీ, కమల్, చిరంజీవి, నాగ్, వెంకీ, బాలా లాంటి వారంతా అహం లేకుండా పనిచేస్తారు. అది నేర్చుకోవాలి. కెరీర్లో చాలా అప్స్ అండ్ డౌన్స చూసినట్లున్నారు? ఈ 13 ఏళ్ళ కెరీర్లో ప్రతి మూడేళ్ళకూ కెరీర్లో నాకు ‘లల్’ వచ్చింది. అప్పుడు ఏదో ఒకటి ఒప్పుకోవడం కాకుండా, ఇంట్లోనే ఖాళీగా కూర్చొనేదాన్ని. మొదటిసారి ‘మంగాత్తా’, రెండోసారి ‘విన్నైతాండి వరువాయా’ వచ్చి హిట్టయ్యాయి. ఇలా కెరీర్ డల్లయినప్పుడల్లా ఏదో ఒక సినిమాతో పైకి లేచా. మరి, చటుక్కున కన్నడ ‘పవర్’ (‘దూకుడు’ రీమేక్) చేశారేం! బాలీవుడ్లో ఒక సినిమా చేసినట్లే, కన్నడంలో ఉత్తినే... ఛేంజ్ కోసం అలా చేశా. అదేదో అన్ని ఇండస్ట్రీల్లో ైపైకి ఎదిగిపోవాలని కాదు. ఆ సినిమా అక్కడ బాగా ఆడింది. ఫర్ మి - కన్నడ, తమిళ్, తెలుగు, మలయాళం - ఎవ్రీథింగ్ ఈజ్ ఫన్! మీ గురు ప్రియదర్శన్ మలయాళంలో చేయమనడగలేదా? ఆయన హిందీకి వెళ్ళి, అక్కడే ఎక్కువ చేస్తున్నారుగా! నా ఏకైక హిందీ ఫిల్మ్ ‘ఖట్టా మీఠా’ ఆయన తీసినదే! మలయాళంలో మొదట్లో కొన్ని ఛాన్స్‌లొచ్చాయి. చేయలేకపోయా. అయినా నా ప్లాన్ టూ వీక్స్ వరకే! అంతకు మించి కెరీర్లోనే కాదు... జీవితంలో కూడా ఏదీ ముందుగా ప్లాన్ చేయను. హిందీలో ఒక సినిమా చేసినా, నిలబడాలని చూడలేదేం? హిందీలో పనిచేయాలంటే, ముంబయ్‌లో ఉండాలి. కానీ, పుట్టి పెరిగిన చెన్నైలో ఉండడమే నాకు ఇష్టం. పైగా, నార్త్‌తో పోలిస్తే, సౌత్‌లో పనిచేయడమే నాకు కంఫర్ట్ కూడా! నార్తలో పనిచేయాలంటే, పబ్లిక్ రిలేషన్స్ కావాలి. పర్సనల్ లైఫ్ వదిలి, అక్కడకు మారాలి. దాని కన్నా ఇక్కడుంటే సుఖం. ఇంకా మీకు తెలుగుపై పట్టు దొరికినట్లులేదు! తెలుగు బాగా అర్థమవుతుంది కానీ, చదవలేను. రాయలేను. డైలాగులు చెప్పగలను కానీ, ఫ్లూయెంట్‌గా మాట్లాడలేను. కానీ, ఇప్పుడొస్తున్న హీరోయిన్స్ తెలుగు మాట్లాడేస్తుంటే, అయామ్ జెలస్! నాకు భాషలంత తొందరగా పట్టుబడవు. అడపా దడపా తమిళంలో డబ్బింగ్ చెబుతున్నట్లున్నారు! ఇన్నేళ్ళ తర్వాత ఈ మధ్యే కొన్ని సినిమాలకు! మణిరత్నం దర్శకత్వంలోని ‘ఆయుధ ఎళుత్తు’ (తెలుగులో ‘యువ’), కమలహాసన్ నటించిన ‘మన్మదన్ అంబు’ (తెలుగులో ‘మన్మథ బాణం’) - రెండూ లైవ్ సౌండ్‌లో తీసినవే. దాంతో, సెట్స్‌పై తమిళంలో నా డైలాగులు నేనే చెప్పా. ఆ తరువాత డబ్బింగ్ చెప్పాల్సి వచ్చింది. కమల్ డైలాగులు ఎలా పలకాలో పక్క నుండి ఆరు రోజుల పాటు నేర్పారు. మీరెప్పుడూ మొబైల్ఫోన్తోనే కనిపిస్తుంటారు! (నవ్వేస్తూ...) బాగా గమనించారే! ప్రకాశ్‌రాజ్, వెంకటేశ్ లాంటి కో ఆర్టిస్టులు కూడా నా మొబైల్ వాడకం చూసి ఆటపట్టిస్తుంటారు. నిజం చెప్పాలంటే, మొబైల్ ఫోన్ నాకొక ఎడిక్షన్. అయితే, ఫోన్లో నేనెక్కువ మాట్లాడను. మెసేజ్ చేయడానికీ, ఆటలాడడానికీ, లేటెస్ట్ న్యూస్ తెలుసుకోవడానికీ ఫోన్ వాడతా. కొత్త యాప్స్, గ్యాడ్జెట్లపై నాకు ఇంట్రస్టెక్కువ. మీరు బాగా ఫుడీ అట! మరి, నాజూగ్గా ఉన్నారు? ఆ విషయంలో అయామ్ రియల్లీ లక్కీ! కనపడిందల్లా తినేస్తాను. నేను తినే తిండి చూసి, ‘బకాసురుడిలా తింటావు. తిన్నదంతా ఎటు పోతోంది’ అంటూ దర్శకుడు ప్రభుదేవా ఆటపట్టిస్తుంటారు. సర్ప్రైజింగ్లీ... నేను జిమ్‌లకు వెళ్ళను. పెద్ద వ్యాయామాలు చేయను. సూర్య నమస్కారాలు, పవర్ యోగా చేస్తా. నేనెంత బద్ధకస్థురాలినంటే, చీకాకనిపిస్తే కొన్నాళ్ళు వర్కౌట్స్ కూడా చేయను. మీ నిశ్చితార్థంపై చాలా వార్తలొస్తున్నాయి. పెళ్ళెప్పుడు? లెటజ్ నాట్ టాక్ ఎబౌట్ మై పర్సనల్ మేటర్స. పర్స నల్ లైఫ్ ఈజ్ మై సీక్రెట్. దాని గురించి ఇతరులు మాట్లాడుకోవడం ఇష్టముండదు. అందుకే మాట్లాడను. మరో అయిదేళ్ళ తరువాత త్రిష ఏం చేస్తుంటారు? (నవ్వుతూ) అయిదు రోజుల తర్వాతేం చేస్తానో తెలీదు. ఇందాకే చెప్పినట్లు ఏదీ ప్లాన్ చేయను. నా నేచర్ అది. - రెంటాల జయదేవ నచ్చిన దర్శకుల్లో కొందరి గురించి... ప్రభుదేవా: సెట్లో కొంత ఛాలెంజ్ ఇస్తారు. సెల్వరాఘవన్: పర్ఫెక్షన్ కోసం తపించే దర్శకుడు. అంతా సరిగ్గా ఉన్నా... పెదాలు మూసుకోవడంలో చిన్న తేడా ఉందనకున్నా మళ్ళీ కొత్తగా షూట్ చేస్తారు. గౌతమ్ మీనన్: మన స్టైల్లోనే మన నుంచి ది బెస్ట్ తీసుకుంటారు. మనలోని ప్రతిభను ఆయన బయటకు తీస్తారు. మణిరత్నం: ఆయనతో పని చేయడం నా కల. అది నిజమైంది. అనుకున్నది మన నుంచి రాబట్టే వరకు రాజీపడని తత్త్వం ఆయనది. ఆయనతో పని చేయాలంటే, అంతకు ముందు దాకా నేర్చుకున్నదంతా వదులుకోవాలి. ప్రియదర్శన్: సినిమాల్లోకి వచ్చేందుకు నాకు తొలి అవకాశమిచ్చిన గురువు. ప్రతి ఒక్కరినీ ఒకేలా చూస్తారు. ఎంతో సాధించినా, కించిత్తు కూడా గర్వం చూపరు. త్రివిక్రమ్: ఆయన చాలా కూల్. ఆయనతో పనిచేయడంలో ఫన్ ఉంది. కబుర్లాడుతూ, నవ్వుతూ పనిచేయించుకోవడం ఆయనకు అలవాటు. ‘అతడు’ నా బెస్ట్ ఎంటర్టైనర్సలో ఒకటి. శ్రీను వైట్ల: వినోదం బాగా పండిస్తారు. వి.వి. వినాయక్: ఆయన, రవితేజ, నేను గనక ఒక చోట ఉంటే, ఇక వినోదానికి కొదవ ఉండదు. బ్యాంకాక్‌లో షూటింగ్ సైతం, పిక్నిక్లా గడిచిపోయేది. కె. రాఘవేంద్రరావు: ఆయనను ఒక మంచి మిత్రుడిలా చూస్తాను. శరీరానికే తప్ప మనసుకు వయసు రాదని నిరూపించిన మనిషి. స్టార్ కామెంట్ త్రిష అద్భుతమైన నటి. తమిళంలో తన రెండో చిత్రం ‘మౌనమ్ పేసియదే’లో, ఆ తర్వాతా ఇద్దరం కలిసి యాక్ట్ చేశాం. త్రిష హావభావాలు సహజంగా ఉంటాయి. నటనకు అవకాశం ఉన్న పాత్ర అంటే దర్శక, నిర్మాతలకు త్రిష గుర్తొస్తుంది. - హీరో సూర్య ఇటీవల ఆకట్టుకున్న తోటి నటి? శ్రీయ నుంచి అనూష్క దాకా చాలా మందితో కలసి పనిచేశా. అనూష్క లాంటి మంచి అమ్మాయిని చూడలేదు. ఆమె ఎంత ఫ్రెండ్లీయో చెప్పలేను. ‘అరుంధతి’, రానున్న ‘రుద్రమదేవి’, ‘బాహుబలి’లో ఆమె గెటప్‌లు, ఆ రాజసం అద్భుతం. అనూష్కలాగా ఇంకెవరూ చేయలేరు! ఒత్తిడిగా ఉంటే... బ్రేక్ కోసం? ఓ నెలరోజుల పాటు ఊళ్ళు తిరిగొస్తా! పరిశ్రమలో మీ స్నేహితులు? ఇక్కడ అంత ఆప్త మిత్రులు లేరు. నా ఫ్రెండ్సంతా స్కూల్, కాలేజ్మేట్లే. జీవన సిద్ధాంతం? ‘హాయిగా బతుకు... ఇతరులను బతకనివ్వు’! -
డబ్లింగ్‌కు పచ్చజెండా
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్ : జిల్లావాసులు సుదీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న సికింద్రాబాద్- మహబూబ్‌నగర్ రైలుమార్గం డబ్లింగ్ పనులకు ఎట్టకేలకు ఆమోదం లభించింది. కేంద్రమంత్రి సురేశ్‌ప్రభు గురువారం పార్లమెంటులో ప్రవేశపెట్టిన 2015-16 రైల్వే బడ్జెట్లో జిల్లాకు ఓ మోస్తరు ప్రాధాన్యత దక్కింది. అయితే, బడ్జెట్ ప్రసంగంలో కొత్త రైళ్లు, రైలుమార్గాల ప్రతిపాదన ఊసే లేకపోవడం జిల్లావాసులను నిరాశ పరిచింది. నత్తనడకన సాగుతున్న మహబూబ్‌నగర్- మునీరాబాద్ మార్గానికి నిధులు విడుదల కావడం కొంత ఊరటనిచ్చేదిగా ఉంది. సికింద్రాబాద్- మహబూబ్‌నగర్ మధ్య 110 కిలోమీటర్ల మేర రైలుమార్గాన్ని డబ్లింగ్ చేసేందుకు రైల్వే బడ్జెట్ 2015-16లో ఆమోదం లభించింది. రూ.1200కోట్లు అవసరమవుతాయని అంచనా వేయడంతో పాటు, పనులు ప్రారం భించేందుకు ప్రస్తుత బడ్జెట్లో రూ.27.44 కోట్లు కేటాయించారు. ఈ మార్గం డబ్లింగ్ సర్వే కోసం 2009-10 బడ్జెట్లో రూ.5 కోట్లు కేటాయించారు. సర్వే పూర్తయినా ఇన్నాళ్లూ నిధులు విడుదల కాకపోవడంతో పనులు ప్రారంభం కాలేదు. జిల్లా కేంద్రం మీదుగా ప్రతిరోజూ 54 రైళ్లు, అంతే సంఖ్యలో గూ డ్సు రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి. డబ్లింగ్ పనులు పూర్తయితే జిల్లా కేంద్రం మీదుగా మరిన్ని రైళ్ల రాకపోకల పెరగడంతో పాటు ప్రయాణ సమయం తగ్గే అవకాశముంటుంది. ‘మునీరాబాద్’కు ఊతం రూ.245 కోట్ల అంచనాతో మొదలైన మహబూబ్‌నగర్- మునీరాబాద్ రైలుమార్గం పనులు ఏళ్ల తరబడి నత్తనడకన సాగుతున్నాయి. దేవరకద్ర నుంచి కృష్ణావరకు సుమారు 65కి.మీ దూరానికి మక్తల్ మండలం జక్లేర్ వరకు సుమారు 34కి.మీ మేర పనులు పూర్తయ్యాయి. ప్రస్తుత బడ్జెట్లో రూ.35 కోట్లు కేటాయించారు. భూసేకరణ సమస్యలతో సతమతమవుతున్న ఈ ప్రాజెక్టు త్వరితగతిన పూర్తయ్యేందుకు ప్రస్తుత కేటాయింంపులు ఊతమివ్వనున్నాయి. ఇప్పటికే వున్న మహబూబ్‌నగర్- గుత్తి మార్గంలో అదనపు లైను సర్వేకు రూ.63.74 లక్షలు కేటాయించారు. హైదరాబాద్- శ్రీశైలం నడుమ 170 కిలోమీటర్ల రైలు మార్గం సర్వేకు రూ.25.5 లక్షలు కేటాయించడం ప్రాధాన్యత సంతరించుకుంది. నిర్మాణం పూర్తి కావస్తున్న గద్వాల- రాయిచూరు మార్గానికి రూ.7 కోట్లు కేటాయిస్తున్నట్లు రైల్వేమంత్రి ప్రకటించారు. ప్రస్తావనకు నోచుకోని కొత్త మార్గాలు గద్వాల- రాయిచూరు, జడ్చర్ల- నంద్యాల రైలుమార్గం పనులు చేపట్టాలంటూ జిల్లాకు చెందిన ఇద్దరు పార్లమెంటు సభ్యులు కేంద్రాకి ప్రతిపాదనలు సమర్పించారు. మహబూబ్‌నగర్ ఎంపీ జితేందర్‌రెడ్డి ఇటీవల రైల్వేమంత్రి సురేశ్‌ప్రభును కలిసి నూతన రైలు మార్గాలకు ఆమోదం తెలపాల్సిందిగా కోరారు. మరోవైపు గద్వాల- రాయిచూరు నడుమ కొత్త రైళ్లు నడిపై ప్రతిపాదన కూడా ప్రస్తావనకు నోచుకోలేదు. -
సూపర్ స్టారా... మజాకానా!
సినిమాలో నటించడం ఒక ఎత్తయితే, ఆ తర్వాత ఆ పాత్రకు డబ్బింగ్ చెప్పడం మరో ఎత్తు. షూటింగ్ లొకేషన్లో పెదాలు ఎలా అయితే కదిపి మాట్లాడతారో, దానికి తగ్గట్టుగా డబ్బింగ్ చెప్పాలి. లేకపోతే పెదాల కదలికకు, మాటకు సంబంధం ఉండదు. అందుకే, డబ్బింగ్ చెప్పడం కష్టం అంటారు. ఇతర పాత్రల సంగతెలా ఉన్నా.. సినిమా మొత్తం హీరో కనిపిస్తాడు కాబట్టి, ఎక్కువ డైలాగ్స్ ఉంటాయి. పైగా పంచ్ డైలాగ్‌లు, పవర్ఫుల్ డైలాగులకు కొదవ ఉండదు. అందుకే, డబ్బింగ్‌కి కనీసం మూడు నుంచి పదిరోజుల వరకైనా తీసుకుంటారు. కానీ, రజనీకాంత్ ఇటీవల ఒకే ఒక్క రోజులో ‘లింగా’లో తన పాత్ర తాలూకు డబ్బింగ్ పూర్తి చేసి, ఆ చిత్రబృందాన్ని ఆశ్చర్యపరిచారు. 24 గంటల్లోపే డబ్బింగ్ చెప్పడం పూర్తి చేసేశారని, ‘సూపర్ స్టారా... మజాకానా?’ అని ఆ చిత్రబృందం రజనీని తెగ పొగిడేస్తోంది. కేయస్ రవికుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం రెండు పాటలు మినహా పూర్తయ్యింది. రజనీ పుట్టినరోజుని పురస్కరించుకుని డిసెంబర్ 12న ‘లింగా’ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారని సమాచారం. -
గొంతు సవరించుకుని..
సంచలన తార నయనతార ఇప్పుడు స్టార్ హీరోయిన్. ఈ బ్యూటీ బహుభాషా నటికూడా. పలు చిత్రాలు చేశారు. ఇప్పటి వరకు ఏ భాషలోనూ ఆమె తన పాత్రలకు అరువు గొంతే. కాగా ఇన్నాళ్లకి ఈ అమ్మడు సొంత గొంతుతో డబ్బింగ్ చెప్పుకోవడానికి సిద్ధమవుతున్నారు. అదీ తమిళ చిత్రానికి. అందులోనూ తన మాజీ ప్రియుడి సరసన చిత్రానికి డబ్బింగ్ చెప్పనుండడం విశేషం. ఆ చిత్రం ఏమిటో ఈ పాటికే పాఠకులకు అర్థమైపోయి ఉంటుం ది. ఎస్.నమ్మఆళు చిత్రంలో తన పాత్రకు నయనతారే డబ్బింగ్ చెప్పుకోవడానికి ఓకే అన్నారు. ఇందుకామె తన గొంతును సవరించుకుంటున్నారు. చిన్న పాటి తర్ఫీదు కూడా తీసుకుంటున్నారట. శింబు, నయనతార జంటగా నటిస్తున్న చిత్రం ఇదునమ్మ ఆళు. పాండిరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్ తుది దశకు చేరుకుంది. ఈ చిత్రానికి శింబు తమ్ముడు కురలరసన్ సంగీతాన్ని అందిస్తున్నారు. చిత్ర డబ్బింగ్ కార్యక్రమాలు మొదలయ్యాయి. నయనతార పాత్రకు ఆమే డబ్బింగ్ చెబితే బాగుంటుందని దర్శకుడు భావించారట. ఆలోచన వచ్చిందే తడువుగా నయనతారను సంప్రదించగా మొదట సంకోసించిన ఈ ముద్దుగుమ్మ దర్శకుడి ప్రోద్బలంతో ఓకే చెప్పిందని సమాచారం. అయితే చిత్ర షూటింగ్ అయిపోతే అంతటితో తనపని పూర్తయ్యిందని నయనతార భావించేది. చిత్ర ప్రమోషన్ కార్యక్రమాలకూ హాజరయ్యేది కాదు. అలాంటిది ఇదు నమ్మ ఆళు చిత్రానికి ఏకంగా డబ్బింగ్ చెప్పడానికి అంగీకరించడం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యింది. -
డబ్బింగ్ ఢమాల్!
-
ఇప్పుడే కాదు...భవిష్యత్తులోనూ చేయను!
సునీత... అందంగా ఉంటారు! అందంగా పాడతారు... అందంగా డబ్బింగ్ చెబుతారు! ఇవన్నీ పాత విషయాలే... మరి కొత్త సంగతి ఏంటంటే... సునీత ఇప్పుడు యాక్టింగ్ చేస్తున్నారు! శేఖర్ కమ్ముల తీస్తున్న ‘అనామిక’ కోసం ఆమె మేకప్ వేసుకున్నారు... కంగ్రాట్స్... ఆర్టిస్ట్‌గా కొత్త అవతారం ఎత్తారుగా! సునీత: ఆగండాగండి. నేను జస్ట్ ‘అనామిక’ ప్రమోషనల్ సాంగ్‌లో యాక్ట్ చేశానంతే. క్యారెక్టర్ చేయలేదు! సాంగ్‌లో కనబడడం కూడా యాక్టింగే కదా? సునీత: కరెక్టే కానీ, ఇది జస్ట్ ప్రమోషనల్ సాంగ్. ఈ సాంగ్ మీతో చేయాలన్న ఆలోచన శేఖర్దేనా? సునీత: అవును... ఆయనదే. ‘అనామిక’ కోసం కీరవాణి స్వరసారథ్యంలో ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి రాసిన ‘ఎవ్వరితో చెప్పను... ఎక్కడని వెతకను’ పాట పాడాను. ఈ పాటనే వీడియోగా షూట్ చేస్తామని శేఖర్ నన్ను అడిగారు. వినూత్నమైన ఆలోచన కాబట్టి, వెంటనే అంగీకరించాను. ఇలాంటి మ్యూజిక్ వీడియోల ట్రెండ్ బాలీవుడ్లో ఎక్కువ. ఆయా సినిమాల ప్రచారానికి ఈ మ్యూజిక్ వీడియోలను అక్కడ బాగా ఉపయోగిస్తుంటారు. ఇక్కడ కూడా ఇప్పుడిప్పుడే ఈ ట్రెండ్ మొదలవుతోంది. సరే... ఇంతకూ ఫస్ట్ డే షూటింగ్ ఎలా అనిపించింది? సునీత: కొంచెం నెర్వస్‌గానే అనిపించింది. బుల్లితెరపై అనేక మ్యూజిక్ షోస్ చేశాను. కానీ, సినిమా షూటింగ్ దానికి పూర్తి భిన్నం కదా! కెమెరాను చూస్తూ నటించగలగడం ఓ కొత్త అనుభవం. ఈ పాట కోసం రెండు రోజులు షూటింగ్లో పాల్గొన్నా. ఎలా కనిపిస్తానా అని కొంచెం టెన్షన్‌గానే ఉంది. ఫెంటాస్టిక్‌గా యాక్ట్ చేశానని చెప్పను కానీ, ఏదో చేసేశానులెండి. ఓసారి ఫ్యాష్‌బ్యాక్‌లోకి వెళ్దాం. అప్పట్లో ఎవరూ మిమ్మల్ని హీరోయిన్గా చేయమని అడగలేదా? సునీత: ఎస్వీ కృష్ణారెడ్డిగారు ఫస్ట్ అడిగారు. ఏ సినిమాకనేది తెలీదు. తర్వాత రామ్‌గోపాల్‌వర్మ కూడా అడిగారు. ఇంకా చాలా ప్రపోజల్స్ వచ్చాయి. హీరోయిన్ అనేకాదు. స్పెషల్ క్యారెక్టర్లూ చేయమని అడిగారు. మరి ఎందుకు చేయలేదు? సునీత: నాకు పాడటమే ఇష్టం. ఆ తర్వాత డబ్బింగ్ చెప్పడం ఇష్టం. నాకు మానసిక సంతృప్తినిచ్చే ఈ రెండూ వదిలేసి, ఆర్టిస్ట్‌గా వెళ్లాలని ఏనాడూ అనుకోలేదు. కలలో కూడా ఆలోచించలేదు. మంచి యాక్టింగ్ ఆఫర్స్ వదిలేసుకున్నానని ఏనాడూ చింతించలేదు కూడా. యాక్ట్ చేస్తూ కూడా పాటలు పాడొచ్చుగా? సునీత: సినిమా పుట్టిన కొత్తల్లో ఆ ప్రక్రియే నడిచేది. ఈ ట్రెండ్‌లో అలా కష్టం. యాక్టింగ్‌తో పాటు పాటలు కూడా పాడతానంటే ఎవరూ ఒప్పుకోరేమో! అయినా నటించాలనే ఆలోచనే లేనప్పుడు ఇదంతా ఎందుకు ఆలోచిస్తాను. భవిష్యత్తులో కూడా యాక్ట్ చేయరా? సునీత: ఏమోనండీ... ఇప్పుడే ఏం చెప్పగలం. అసలు మ్యూజిక్ వీడియోలో నటిస్తాననే అనుకోలేదు కదా. నా కెరీర్ మొదలై 18 ఏళ్లయింది. ఇప్పటికి 3000 పాటలు పాడాను,750 సినిమాలకు డబ్బింగ్ చెప్పాను. సింగర్‌గా, డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా నేను చాలా చాలా హ్యాపీ. సంగీత దర్శకత్వం చేస్తారా? సునీత: అస్సలు చేయను. ఇప్పుడే కాదు, భవిష్యత్తులో కూడా చేయను. మీ లక్ష్యం? సునీత: మొదటి నుంచీ నా గోల్ ఒకటే, జాతీయ అవార్డు అందుకోవాలి. అలాగే అన్ని భాషల్లోనూ పాటలు పాడాలని ఉంది. ఇప్పటికి తెలుగు, తమిళం, కన్నడ భాషల్లోనే పాడాను. ఇక్కడ బిజీ కారణంగా మిగతా భాషలవైపు దృష్టి సారించలేకపోతున్నాను. మంచి అవకాశం కోసం ఎదురుచూస్తున్నాను. -
డబ్బింగ్‌ను అనుమతిస్తే తప్పేంటి ?
వేరే భాషల సినిమాల ద్వారా ఇతరుల సంస్కృతిని తెలుసుకోవచ్చు ‘డబ్బింగ్’పై చర్చా కార్యక్రమంలో అగ్ని శ్రీధర్ సాక్షి, బెంగళూరు : కన్నడ సినీ పరిశ్రమలోకి డబ్బింగ్‌ను అనుమతిస్తే తప్పేంటని న్యాయక్కాగి నావు సంస్థ వ్యవస్థాపకులు అగ్ని శ్రీధర్ ప్రశ్నించారు. కన్నడ సినీ పరిశ్రమలోకి డబ్బింగ్‌ను అనుమతించరాదంటూ శాండల్‌వుడ్ కళాకారులు స్పష్టం చేస్తున్న నేపథ్యంలో కన్నడ సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు, ఇతర సామాజిక సంస్థల ప్రతినిధులతో కలిసి ‘న్యాయక్కాగి నావు’ సంస్థ ఆధ్వర్యంలో శనివారమిక్కడ ‘డబ్బింగ్’పై చర్చా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అగ్ని శ్రీధర్ మాట్లాడుతూ...కన్నడ సినీ పరి శ్రమలోకి డబ్బింగ్‌ను అనుమతించడం ద్వారా కన్నడ భాష, సంస్కృతితో పా టు కళాకారులకు ఎటువంటి అన్యాయ ం జరగదని అన్నారు. మారుతున్న కాలంతో పాటు మనం కూడా మారు తూ పోవాలని, ఇతర భాషలను కన్నడలోకి డబ్ చేయడం ద్వారా ఇతర రాష్ట్రాల సంస్కృతి గురించి తెలుసుకునేందుకు అవకాశం ఉంటుందని అన్నా రు. అంతేకాక ఇతర భాషలకు చెందిన సినిమాల్లో ఉపయోగించిన సరికొత్త టెక్నాలజీ, నటుల ప్రతిభను గురించి కూడా కర్ణాటక ప్రజలు తెలుసుకోవచ్చని చెప్పారు. అనంతరం సాహితీవేత్త ఇందూధర హున్నాపుర మాట్లాడుతూ... కళాకారులు, నటీనటులు సాంస్కృతిక రాయబారులుగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. అ యితే కొంతమంది కళాకారులు మాత్ర ం గూండా ల్లా మాట్లాడడం, ప్రవర్తించ డం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశా రు. కన్నడ భాషపై ఎంతో మమకారాన్ని చూపుతున్నామని చెప్పుకునే శాండల్‌వుడ్ కళాకారుల్లో ఎంతమంది తమ తమ పిల్లలను కన్నడ మాధ్యమంలో చదివిస్తున్నారని ప్రశ్నించారు. ఈ సందర్భంగా డెరైక్టర్ సురేష్ డబ్బింగ్‌ను వ్యతిరేకిస్తూ మాట్లాడారు. వినోదం అనేది పూర్తి స్థాయిలో వ్యాపారంగా మారిపోకూడదనే ఉద్దేశంతోనే డబ్బింగ్‌ను విరోధిస్తున్నామని చెప్పారు. డబ్బింగ్‌ను అడ్డం పెట్టుకొని కన్నడ సినీ పరిశ్రమలోకి ప్రవేశించాలని అనేక అంతర్జాతీయ సంస్థలు భావిస్తున్నాయని పేర్కొన్నారు. అదే కనుక జరిగితే శాండల్‌వుడ్ పరిశ్రమ పూర్తిగా దెబ్బతింటుందని చెప్పారు. చర్చా కార్యక్రమంలో రైతు నాయకుడు, ఎమ్మెల్యే కె.ఎస్.పుట్టణ్ణయ్య పాల్గొన్నారు. -
వద్దే వద్దు
చిత్ర పరిశ్రమ బంద్ సంపూర్ణం రాష్ర్ట వ్యాప్తంగా థియేటర్ల మూత పలుచోట్ల ‘డబ్బింగ్ భూతం’ దిష్టిబొమ్మల దహనం బెంగళూరులో భారీ ర్యాలీ రాజ్‌కుమార్ సమాధి నుంచి సెంట్రల్ కాలేజీ వరకు ప్రదర్శన హాజరైన అగ్ర తారాగణం బెంగళూరు, న్యూస్‌లైన్ : అనువాద (డబ్బింగ్) చిత్రాలకు వ్యతిరేకంగా కన్నడ చిత్ర పరిశ్రమ సోమవారం చేపట్టిన బంద్ సంపూర్ణంగా జయప్రదమైంది. సినీ తారలతో పాటు చిత్ర పరిశ్రమ అంతా ఒకే తాటిపై నిలిచి డబ్బింగ్ సినిమాలు వద్దే వద్దని నినదించాయి. రాష్ట్ర వ్యాప్తంగా థియేటర్లన్నీ మూతపడ్డాయి. నగరంలోని రాజ్‌కుమార్ సమాధి వద్ద నుంచి మైసూరు బ్యాంకు సర్కిల్ వరకు డబ్బింగ్‌కు వ్యతిరేకంగా తొలుత బైక్ ర్యాలీని నిర్వహించారు. అనంతరం సెంట్రల్ కాలేజీ వరకు భారీ ర్యాలీని నిర్వహించారు. అగ్ర తారాగణం సహా చిత్ర పరిశ్రమకు చెందిన అందరూ ఇందులో పాల్గొన్నారు. అనంతరం కాలేజీ మైదానంలో జరిగిన బహిరంగ సభలో హ్యాట్రిక్ హీరో శివరాజ్‌కుమార్ మాట్లాడుతూ తన తండ్రి డాక్టర్ రాజ్‌కుమార్ కన్నడ చిత్ర పరిశ్రమకు డబ్బింగ్ చిత్రాలు అవసరం లేదని పోరాటం చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఇప్పుడు కొందరు నిర్మాతలు స్వార్థంతో డబ్బింగ్ చిత్రాల పాట పాడుతున్నారని ఆరోపించారు. అదే జరిగితే కన్నడ చిత్ర పరిశ్రమ వీధిన పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. తుది శ్వాస వరకు డబ్బింగ్ చిత్రాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తామని ఆయన ప్రకటించారు. ఈగ ఫేం సుదీప్ మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితిలో డబ్బింగ్ చిత్రాలు వస్తే కన్నడ చిత్ర పరిశ్రమ అధోగతి పాలవుతుందని హెచ్చరించారు. డబ్బింగ్ చిత్రాలను తాము పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ మాట్లాడుతూ తాము ఏ భాషా చిత్రాలకూ వ్యతిరేకం కాదని అన్నారు. డబ్బింగ్ చిత్రాలకు వ్యతిరేకంగా శాంతియుతంగా సుదీర్ఘ కాలం పోరాటం చేయడానికి కూడా సిద్ధమేనన్నారు. డబ్బింగ్ సినిమాలు కావాలంటున్న వారికి కన్నడిగులు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. ఈ ఆందోళనకు నాయకత్వం వహించిన కన్నడ చళువళి వాటాల్ పక్షం అధ్యక్షుడు వాటాల్ నాగరాజ్ మాట్లాడుతూ డబ్బింగ్ చిత్రాల వల్ల కన్నడ సంస్కృతి దెబ్బ తింటుందని హెచ్చరించారు. కన్నడ భాష, సంస్కృతులను కాపాడుకోవాలంటే డబ్బింగ్ చిత్రాలకు అవకాశం కల్పించకూడదని తెలిపారు. దీనిపై కన్నడిగులందరూ పోరాటానికి సన్నద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు. కన్నడ అభివృద్ది ప్రాధికార అధ్యక్షుడు, నటుడు ముఖ్యమంత్రి చంద్రు మాట్లాడుతూ డబ్బింగ్ భూతం వల్ల కన్నడ చిత్ర పరిశ్రమ దెబ్బ తింటుందని హెచ్చరించారు. డబ్బింగ్ చిత్రాలను అడ్డుకోవడానికి ప్రభుత్వం కూడా ముందుకు రావాలని కోరారు. ఇదే సందర్భంలో నటీ నటులు జగ్గేష్, తార, నవీన్ కృష్ణ, ప్రేమ్, వినోద్ రాజ్, సాధు కోకిల, మాలాశ్రీ, సుధారాణి, శృతి, భావన, రాధిక పండిత్, అలనాటి నటీమణులు భారతి విష్ణువర్ధన్, లీలావతి, ప్రేమా చౌదరి, ప్రమీళ జోషాయ్, డాక్టర్ రాజ్‌కుమార్ అభిమానుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సా.రా. గోవిందు, కర్ణాటక రక్షణా వేదిక నాయకులు శివరామే గౌడ, ప్రవీణ్ కుమార్‌శెట్టి, కన్నడ సేన కుమార్, దళిత సంఘం నాయకుడు మూర్తి ప్రభృతులు పాల్గొన్నారు. ఆందోళనలో భాగంగా నగరంలో అనేక చోట్ల కన్నడ సంఘాలు ‘డబ్బింగ్ భూతం’ దిష్టి బొమ్మలను దహనం చేశాయి. -
డబ్బింగ్ వద్దే వద్దు...
ముక్తకంఠంతో నినదించిన సినీ కళాకారులు డబ్బింగ్‌కు వ్యతిరేకంగా నేడు శాండిల్‌వుడ్ బంద్ సాక్షి, బెంగళూరు : కన్నడ సినీ పరిశ్రమలోకి డబ్బింగ్ భూతాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ రానివ్వబోమని శాండిల్‌వుడ్ కళాకారులు నిన దించారు. కన్నడ సినీ పరిశ్రమలోకి డబ్బింగ్ చిత్రాలను అనుమతించాలనే కన్నడ చలనచిత్ర వాణిజ్య మండలి అభిప్రాయాన్ని వ్యతిరేకిస్తూ కన్నడ చళువళి వ్యవస్థాపకుడు వాటాళ్ నాగరాజ్ ఆదివారమిక్కడ సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శాండల్‌వుడ్‌కు చెందిన నటీ నటులు, సంగీత దర్శకులు, కొందరు నిర్మాతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రముఖ నటుడు శివరాజ్‌కుమార్ మాట్లాడుతూ... కన్నడిగులైన వారందరికీ కన్నడ భాషపై మమకారం ఉండాలని అన్నారు. కన్నడ సినీ పరిశ్రమలోకి డబ్బింగ్‌ని అనుమతిస్తే ఇక్కడున్న వ ందలాది మంది నటీనటులు, కన్నడ సినీ పరిశ్రమను నమ్ముకున్న వేలాది మంది టెక్నీషియన్లు ఉపాధి కోల్పోవాల్సి వస్తుందని అన్నారు. డబ్బింగ్ సంస్కృతిని కన్నడ కంఠీరవుడు రాజ్‌కుమార్ ఎప్పుడో వ ్యతిరేకించారని ఆయన బాటలోనే ఇప్పటి సినీ కళాకారులు నడవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. డబ్బింగ్‌కు ఎవరు మద్దతు ఇచ్చినా కూడా తాము వారిని అడ్డుకుని తీరతామని హెచ్చరించారు. అనంతరం నటుడు రవిచంద్రన్ మాట్లాడుతూ...ఇతర చిత్రాలను నేరుగా విడుదల చేస్తుంటేనే కన్నడ చిత్రాలకు థియేటర్లు దొరకడం లేదని పేర్కొన్నారు. ఇక అలాంటి పరిస్థితుల్లో డబ్బింగ్‌కు కూడా అనుమతిస్తే కన్నడ సినీ పరిశ్రమ పూర్తిగా కనుమరుగవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం తెలుగు చిత్రాలు కేరళలో విడుదలై అక్కడి మళయాళీ నటుల చిత్రాలను దెబ్బతీస్తున్నాయని, తమిళ చిత్రాలు ఆంధ్రప్రదేశ్‌లో డబ్బింగ్ చేయబడి టాలీవుడ్ మార్కెట్‌పై ప్రభావం చూపే పరిస్థితి ఏర్పడిందని అన్నారు. అందుకే తాము శాండల్‌వుడ్‌లోకి డబ్బింగ్ సంస్కృతిని అనుమతించడాన్ని వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. డబ్బింగ్ మాత్రమే కాక రీమేకింగ్కి కూడా వ్యతిరేకత వ్యక్తం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. ఈ సందర్భంగా కన్నడ చళువళి వ్యవస్థాపకుడు వాటాళ్ నాగరాజు మాట్లాడుతూ... కన్నడ సినీ పరిశ్రమలోకి డబ్బింగ్ విధానాన్ని అనుమతించడాన్ని వ్యతిరేకిస్తూ నేడు (సోమవారం) సినీ కళాకారులు బంద్ పాటించనున్నారని తెలిపారు. నగరంలోని ఎస్బీఎం సర్కిల్ నుంచి వేలాది మంది సినీ కళాకారులు ర్యాలీగా బయలుదేరి సెంట్రల్ కాలేజ్ ఆవరణకు చేరుకొని అక్కడ సమావేశాన్ని నిర్వహించనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో నటీ నటులు యష్, పూజాగాంధీ, రాధికా పండిట్, శృతి, హేమా చౌదరి, భారతీ విష్ణువర్ధన్, శశికుమార్, జగ్గేష్, సంగీత దర్శకులు గురుకిరణ్ తదితరులు పాల్గొన్నారు. -
మాతృభాషలో డబ్బింగ్ భలే మజా: అమలాపాల్
షాపింగ్ మాల్ నుంచి ఇద్దరమ్మాయిలతో వరకు వరుస విజయాలతో తెలుగునాట దూసుకెళ్తున్న మళయాళ తార అమలా పాల్. ఇప్పుడు ఆమె తన మాతృభాషలో 'ఒరు ఇండియన్ ప్రణయకథ' అనే రొమాంటిక్ డ్రామా చిత్రంలో నటిస్తోంది. అంతే కాదు.. సొంత భాషలో తొలిసారి సొంత గొంతుతో డబ్బింగ్ కూడా చెప్పుకుంటోంది. గత నెల రోజులుగా తన పాత్రకు మాతృభాషలో సొంతంగా డబ్బింగ్ చెప్పుకోవడం చాలా మజాగా అనిపిస్తోందని అమలా పాల్ చెబుతోంది. ఈ విషయాన్ని ఆమె తన ఫేస్బుక్ పేజీలో రాసింది. తాను తన 'ఒరు ఇండియన్ ప్రణయకథ' చిత్రం గురించే చెబుతున్నట్లు కూడా ఆమె స్పష్టం చేసింది. ఈ సినిమాలో ఆమె ఫహద్ ఫాసిల్ సరసన నటిస్తోంది. ఈ చిత్రానికి సత్యన్ అంతికాడ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల తమిళంలో 'తలైవా' చిత్రానికి కూడా అమలాపాల్ సొంతంగా డబ్బింగ్ చెప్పుకొంది. ఇంతకుముందు మళయాళంలో 'రన్ బేబీ రన్', 'నీలతమార' లాంటి చిత్రాల్లో నటించినా, ఆ భాషలో మాత్రం ఇప్పటివరకు డబ్బింగ్ చెప్పలేదు. ఇదే మొదటిసారి. -
ఎస్పీ బాలుకి డబ్బింగ్ చెప్పాలనేది నా డ్రీమ్! - ఆర్.సి.ఎం.రాజు
ఎన్టీఆర్ ‘సింహాద్రి’ సినిమా చూశారుగా. అందులో గోదావరి పుష్కరాల సన్నివేశంలో ప్రత్యర్థుల్ని ఎన్టీఆర్ తెగ నరుకుతుంటాడు. ఆ సందర్భంలో ఎన్టీఆర్‌ని చూసిన శరత్‌సక్సేనా భావోద్వేగానికి లోనై.. ‘సింగమలై అన్నా...’ అని అరుస్తాడు. ఆ డైలాగు చాలా చిన్నదే. కానీ అందులోని ఉద్వేగం జనాలను కట్టిపడేసింది. ఆ డైలాగ్ చెబుతూ తెరపై మనకు కనిపించింది శరత్‌సక్సేనా. కానీ వెనకున్న వ్యక్తి వేరు. అతనే... అనువాద కళాకారుడు ఆర్.సి.ఎం.రాజు. ప్రతినాయక పాత్రధారులకు తన కంఠాన్ని అరువిస్తూ... ఆయా పాత్రలకు తన గొంతుతో ప్రాణ ప్రతిష్ట చేస్తున్న రాజుతో ‘సాక్షి’ ప్రత్యేకంగా జరిపిన ఇంటర్వ్యూ ఇది. అనుకోకుండా డబ్బింగ్ ఆర్టిస్ట్ అయ్యారా? లేక అనుకునే అయ్యారా? ‘అనుకోకుండా’ అని చెప్పలేను, ‘అనుకునే’ అని చెప్పలేను. అయితే.. అంతా తెలిసే జరిగిందని మాత్రం చెప్పగలను. మా నాన్నగారి పేరు ఆర్.సుబ్బరాజు. రిటైర్డ్ సబ్ఇన్స్పెక్టర్. అమ్మ జయమ్మ హౌస్‌వైఫ్. అమ్మకు నన్ను కళాకారుణ్ణి చేయాలని కోరిక. చిన్నప్పుడే స్టేజ్ షోలు చేస్తుండేవాణ్ణి. కాలేజ్ టైమ్‌లో అయితే మిమిక్రీ షోలు చేశాను. ఓ ఆర్కెస్ట్రా కూడా నడిపా. అప్పట్లో ఉపన్యాస పోటీలు ఎక్కడ జరిగినా మొదటి బహుమతి నాదే. మొదట్నుంచీ నా పెర్ఫార్మెన్స్ కంటే... గాత్రానికే ఎక్కువ ప్రశంసలొచ్చేవి. జనం ఆదరిస్తుంటే అర్థమైంది... నా గాత్రంలో ఏదో గమ్మత్తు ఉందని. చివరకు ఆ గాత్రమే ఈ రోజు నన్ను ఓ స్థాయిలో నిలబెట్టింది. అసలు డబ్బింగ్ రంగంలోకి ఎలా వచ్చారు? నా లక్ష్యం ఆలిండియా రేడియో ఎనౌన్సర్ అవ్వడం. మహబూబ్‌నగర్ జిల్లా వనపర్తి మా ఊరు. అక్కడే డిగ్రీ పూర్తి చేశాను. తర్వాత డిప్లొమా ఇన్ థియేటర్ ఆర్ట్స్ చేయడానికి హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో చేరా. అక్కడ చదువుతున్నప్పుడే... ‘యువవాణి’ కార్యక్రమానికి ఆలిండియా రేడియో వారు ఆడిషన్స్‌కి పిలిచారు. అప్పుడే.. యాదృచ్ఛికంగా ‘రుతురాగాలు’ సీరియల్లో నగేష్ కర్రకు డబ్బింగ్ చెప్పే అవకాశం లభించింది. మరి సినిమా అవకాశం...? నాగార్జున ‘ఆటో డ్రైవర్’ సినిమాకు డబ్బింగ్ శాఖలో పనిచేశా. ‘ఆనందం’(2000) సినిమాలో వెంకట్ పాత్రకు డబ్బింగ్ చెప్పాను. అదే నా తొలి బ్రేక్ అనువాద కళాకారునిగా మీకు పేరు తెచ్చిన సినిమాలు? నరసింహనాయుడు, ఇంద్ర, సింహాద్రి, పోకిరి... ఇలా ఎన్నో ఉన్నాయి. రవిశంకర్‌గారు బిజీగా ఉంటే.. డబ్బింగ్ ఇన్‌చార్జ్‌లు నాతో చెప్పించేవారు. మీరు ఛాలెంజ్‌గా తీసుకొని డబ్బింగ్ చెప్పిన సినిమాలు? ‘రక్తచరిత్ర’లో వివేక్ ఓబెరాయ్కి, ‘రక్త కన్నీరు’లో ఉపేంద్రకి డబ్బింగ్ చెప్పాను. ఆ రెండు పాత్రలకీ డబ్బింగ్ చెప్పడానికి చాలా కష్టపడ్డా ఎందరో నటులకు గాత్రదానం చేశారు. మరి మీరే ఎందుకు నటించకూడదు? నటనలో భాగమే డబ్బింగ్. అయితే.. అనువాద రంగంలో బిజీ అయ్యాక... నటుడు అవ్వాలని మనసులో ఉన్నా అవ్వలేని పరిస్థితి. ఇటీవలే ‘అవతారం’ చిత్రానికి డబ్బింగ్ చెబుతుంటే.. కోడి రామకృష్ణగారు అడిగారు.. ‘నటిస్తావా..’ అని. చేస్తానని చెప్పేశా. నేడో రేపో ఆయన నుంచి ఫోన్ రావచ్చు. ప్రస్తుతం ఏయే సినిమాలకు డబ్బింగ్ చెప్పారు? ‘ఎవడు’లో రాహుల్దేవ్కి, ‘అత్తారింటికి దారేది’లో ముఖేష్‌రుషికి, ‘భాయ్’లో ఆశిష్విద్యార్థికి, కోడిరామకృష్ణ ‘అవతారం’లో సత్యప్రకాష్కి. అన్నీ విలన్లకేనా. హీరోలకు చెప్పలేదా? మమ్ముట్టి, మోహన్‌లాల్‌లకు చెప్పేశాను. మలయాళం డబ్బింగ్ ‘4ఫ్రెండ్స్’ చిత్రానికి గాను కమల్‌హాసన్‌కి కూడా చెప్పాను. ఇంకెవరికైనా డబ్బింగ్ చెప్పాలని కోరిక ఉందా? ఎస్పీ బాలుగారికి చెప్పాలి. ఆయనంత గొప్పగా డబ్బింగ్ చెప్పడమంటే ఛాలెంజే. ఆయనకు డబ్బింగ్ చెప్పాలన్న కోరిక ఎప్పుడు తీరుతుందో! అవార్డులేమైనా అందుకున్నారా? ‘పురాణ గాథలు’, ‘మొగలిరేకులు’ సీరియల్స్‌కి నందులు అందుకున్నాను. సినిమాల విషయానికొస్తే... ‘డార్లింగ్’ చిత్రంలో ముఖేష్‌రుషికి, ‘పోరు తెలంగాణ’లో నటుడు జమకి చెప్పిన డబ్బింగ్‌లకు నందులొచ్చాయి. డబ్బింగ్ కళ ఒకప్పుడు ఉన్నంత ఉన్నతంగా ఇప్పుడుందంటారా? ఇప్పుడు కూడా మంచి డబ్బింగ్ ఆర్టిస్టులున్నారు. జగ్గయ్య, పీజేశర్మ లాంటి వాళ్లు డబ్బింగ్ కళకు వన్నె తెస్తే... సాయికుమార్, రవిశంకర్ లాంటి వాళ్లు దాన్ని ఓ అత్యున్నత స్థానంలో నిలబెట్టారు. వాళ్లందరూ నాకు ఆదర్శమే. డబ్బింగ్ చిత్రాల్ని, సీరియల్స్‌ని రద్దు చేయాలనే ఉద్యమంపై మీ అభిప్రాయం? సమర్థించలేను. ఖండించనూ లేను. ఫలితం ఏదైనా శిరసావహిస్తానంతే.