డబ్బింగ్‌ మొదలెట్టిన విజయ్‌ సేతుపతి | Vijay Sethupathi starts Dubbing For Labham Movie | Sakshi
Sakshi News home page

‘లాభం’ డబ్బింగ్‌ మొదలైంది

Published Fri, Jul 31 2020 10:48 AM | Last Updated on Fri, Jul 31 2020 10:52 AM

Vijay Sethupathi starts Dubbing For Labham Movie - Sakshi

తమిళసినిమా : లాభం చిత్ర డబ్బింగ్‌ మొదలైంది. లాక్‌డౌన్‌ కాలంలో ఇంట్లో ఖాళీగా కూర్చున్న నటీనటులకు కాస్త రిలీఫ్‌ కలిగించేలా ప్రభుత్వం చిత్ర నిర్మాణాంతర కార్యక్రమాలకు అనుమతినిచ్చిన విషయం తెలిసిందే. దీంతో నిర్మాతలు ఆ పనులకు సిద్ధమవుతున్నారు.  లాభం చిత్ర డబ్బింగ్‌ కార్యక్రమాలకు ఆ చిత్ర వర్గాలు మొదలెట్టారు.  ఇందులో విజయ్‌సేతుపతి కథానాయకుడిగా నటిస్తున్న సంగతి తెలిసిందే. సంచలన నటి శ్రుతిహాసన్‌ కథానాయకిగా నటిస్తున్న ఈ చిత్రంలో జగపతిబాబు, కలైయరసన్‌ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. విజయ్‌సేతుపతి సొంత నిర్మాణ సంస్థ, 7సీఎస్‌ ఎంటర్‌టెయిన్‌మెంట్‌ సంస్థ కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎస్‌పీ.జననాథన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. రాంజీ ఛాయాగ్రహణం, డీ.ఇమాన్‌ సంగీతాన్ని అందిస్తున్నారు. పూర్తి కమర్శియల్‌ అంశాలతో కూడిన కథా చిత్రంగా రూపొందుతున్న ఈ చిత్ర షూటింగ్‌ దాదాపు పూర్తి కావచ్చింది. తాజాగా చిత్ర డబ్బింగ్‌కు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా నటుడు విజయ్‌సేతుపతి డబ్బింగ్‌ చెప్పారు. ఈ దృశ్యాలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి.(శరత్‌కుమార్‌ పేరుతో మోసం)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement