యంగ్ హీరో నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటిస్తోన్న చిత్రం 18 పేజెస్. టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ కథ–స్క్రీన్‌ప్లే అందించిన ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ సమర్పణలో ‘బన్నీ’వాసు నిర్మిస్తున్నారు. రొమాంటిక్ ఎంటర్ టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాను కుమారి 21 ఎఫ్’ ఫేమ్ సూర్యప్రతాప్ తెరకెక్కిస్తున్నారు.
ప్రస్తుతం ఓ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. మరోవైపు హీరో నిఖిల్ డబ్బింగ్ మొదలుపెట్టారు. దీనికి సంబంధించిన ఫోటోను ఆయన సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ చిత్రానికి గోపీ సుందర్ సంగీతం అందిస్తున్నారు. యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా రిలీజ్ డేట్‌ను త్వరలోనే ప్రకటిస్తామని చిత్ర బృందం ప్రకటించింది.
#18Pages Dubbing Starts off 😇 good to be back in the Studio... Movie Getting Ready 👍🏼 pic.twitter.com/2kd0UZFpES
— Nikhil Siddhartha (@actor_Nikhil) August 11, 2021
Comments
Please login to add a commentAdd a comment