
టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ ప్రస్తుతం '18 పేజీస్'తో పాటు 'కార్తికేయ 2' సినిమా చేస్తున్నాడు. నేడు(జూన్1) అతడి బర్త్‌డేను పురస్కరించుకుని 18 పేజీస్ ఫస్ట్‌లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఇందులో హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ నిఖిల్ కళ్లకు గంతలు కట్టి దాని మీద ప్రేమ వాక్యాలు రాస్తోంది. తన ఫీలింగ్‌ను మాటల్లో కన్నా అక్షరాల్లో చెప్తేనే బాగుంటందని అంటోంది. ఈ పోస్టర్ చూస్తేనే ఇదో పూర్తిస్థాయి ప్రేమకథా చిత్రమని అర్థమవుతోంది.
ఈ సినిమాలో హీరోయిన్‌తో లవ్‌సీన్లలో నటించడంపై స్పందించాడు నిఖిల్. అనుపమ పరమేశ్వరన్‌తో ప్రేమ సన్నివేశాల్లో నటించేటప్పుడు తన భార్య డాక్టర్ పల్లవిని ఊహించుకున్నట్లు తెలిపాడు. పెళ్లి తర్వాత లవ్ సీన్లలో నటించడం చాలా తేలికైందని చెప్పాడు. ఇన్నాళ్లూ తనను లవర్‌బాయ్‌గా అంగీకరిస్తారో లేదోనన్న భయంతో ఇంతకాలం పూర్తిస్థాయి ప్రేమకథా చిత్రం చేయలేదని చెప్పుకొచ్చాడు. కాగా '18 పేజీస్' సినిమాకు టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ కథ–స్క్రీన్‌ప్లే అందించగా అల్లు అరవింద్ సమర్పణలో ‘బన్నీ’వాసు నిర్మిస్తున్నారు. 'కుమారి 21 ఎఫ్’ ఫేమ్ సూర్యప్రతాప్ తెరకెక్కిస్తుండగా గోపీసుందర్ సంగీతం అందించారు.
చదవండి: HBD Nikhil : ఆసక్తికరంగా18 pages ఫస్ట్ లుక్ పోస్టర్