18 Pages Movie
-
అలా చేసి ఉంటే సినిమా మరింత బాగుండేది: పరుచూరి గోపాలకృష్ణ
పరుచూరి గోపాలకృష్ణ తెలుగు సినీ ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. కొత్త సినిమాలపై ఎప్పటికప్పుడు తన అభిప్రాయాలను అభిమానులతో పంచుకుంటారు. తాజాగా నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన '18 పేజెస్' చిత్రంపై సమీక్షను వెల్లడించారు. అయితే ఈ చిత్రంలో కొన్ని మార్పులు చేసి ఉంటే మరింత బాగుండేదని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఫస్ట్ హాఫ్ అంతా చాలా బాగుందని.. సెకండాఫ్‌లో కాస్త మార్చి ఉండాల్సిందన్నారు. 18 పేజెస్ టైటిల్ విన్నప్పుడే నాకు కొత్తగా అనిపించింది. సినిమా చూసే దాకా అవీ డైరీలోని పేజీలని ప్రేక్షకులకు తెలియదు. ఒక వ్యక్తికి తన కలల సుందరి కళ్ల ముందు కనపడితే ఎలా ఉంటుందనేదే ఈ చిత్రంలో ప్రధాన కథాంశం. ఏ ఫ్రెండ్ ఇన్ నీడ్ ఈజ్ ఏ ఫ్రెండ్ ఇన్ డీడ్ అనే విషయాన్ని చక్కగా తెరపై చూపించారు దర్శకుడు సూర్యప్రతాప్. పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ..' ఒక అమ్మాయి చేతిలో మోసపోయిన హీరో. అదే సమయంలో నందిని అనే అమ్మాయి డైరీ చదవడం.. చూడకుండానే ఆమెతో ప్రేమలో పడటం. చిన్న చిన్న ట్విస్టులతో ఫస్టాఫ్ తెరకెక్కించారు. ఫస్టాఫ్ అన్నందుకు క్షమించాలి. అందులో ప్రేమను చూపించి.. సెకండాఫ్ వచ్చేసరికి సామాజిక కోణాన్ని పరిచయం చేశారు. అయితే హీరో, హీరోయిన్స్ ఎప్పుడు, ఎక్కడ కలిశారు? అనే సీన్స్‌ను కాస్తా అర్థమయ్యేలా చూపించి ఉంటే సినిమా బాగుండేది. ఈ విషయాన్ని దర్శకుడు సూర్యప్రతాప్తో చెప్పా. సమయం లేకపోవడం వల్ల కొన్ని సీన్స్‌ను తొలగించినట్లు చెప్పారు.'అని అన్నారు. -
ఓటీటీలోకి వచ్చేసిన నిఖిల్ 18 పేజెస్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..
నిఖిల్ సిద్దార్థ్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన చిత్రం 18 పేజెస్. పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మించాడు.ఫీల్ గుడ్ లవ్‌స్టోరీగా తెరకెక్కిన ఈ సినిమా నిఖిల్ కెరీర్లో రెండో హిట్‌గా నిలిచి బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టింది. మొత్తంగా రూ. 25 కోట్లపైనే గ్రాస్ కలెక్ట్ చేసి నిర్మాతలకు లాభాలు తెచ్చిపెట్టింది. వెండితెరపై సత్తా చాటిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో సందడి చేసేందుకు రెడీ అయ్యింది. ఇప్పటికే ఈ మూవీ డిజిటల్ రైట్స్ ఆహాతో పాటు నెట్ ఫ్లిక్స్ వారు సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.ఈరోజు(శుక్రవారం)నుంచే అధికారికంగా స్ట్రీమింగ్ కానుంది. మరి థియేటర్స్‌లో ఈ సినిమాను మిస్ అయిన వాళ్లు ఇప్పుడు ఓటీటీలో చూసి ఎంజాయ్ చూసేయండి. Sukumar gari magical story, Siddhu Nandhinila prema. Witness them all with #18PagesOnAHA Streaming Now on aha. ▶️ https://t.co/9AfN2ElKrx#18Pages #AlluAravind @aryasukku @actor_Nikhil @anupamahere @dirsuryapratap @GopiSundarOffl #BunnyVas @idineshtej @NavinNooli pic.twitter.com/JXeyccNzvc — ahavideoin (@ahavideoIN) January 26, 2023 -
ఈ ఒక్క వారమే ఓటీటీలోకి 20 చిత్రాలు.. అవేంటంటే!
బాక్సాఫీస్ వద్ద సంక్రాంతి సందడి ముగిసిపోయింది. ఈ జనవరి చివరి వారంలో డిజిటల్ ప్రియులను ఆకట్టుకునేందుకు ఓటీటీలు సిద్ధంగా ఉన్నాయి. ఆహా, నెట్ ఫ్లిక్స్, అమెజాన్, హాట్ స్టార్, జీ5లు ఈ వారంలో ఫుల్ ఎంటర్టైన్ అందించేందుకు పలు కొత్త చిత్రాలను రిలీజ్‌కు సిద్ధం చేశాయి. వాటిలో ’18 పేజెస్’, యాన్ యాక్షన్ హీరో హిందీ చిత్రంతో పాటు త్రిష తమిళ మూవీ రాంగీలు ఉన్నాయి. వీటితో పాటు మరిన్ని సినిమాలు కూడా ఓటీటీలోకి రాబోతున్నాయి. ఈ ఒక్క వారమే దాదాపు 20 సినిమాలు డిజిటల్ వేదికగా స్ట్రీమింగ్ కాబోతున్నాయి. మరి ఆ సినిమాలేంటో చూసేద్దాం.. నిఖిల్ సిద్దార్థ్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన చిత్రం 18 పేజెస్. గతేడాది డిసెంబర్ 23న థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్‌తో పాటు మంచి వసూళ్లే వచ్చాయి. ఫీల్ గుడ్ లవ్‌స్టోరీగా తెరకెక్కిన ఈ సినిమా ఓటీటీ హక్కులను అటు ఆహా, ఇటు నెట్‌ఫ్లిక్స్ రెండూ చేజిక్కించుకున్న విషయం తెలిసిందే! అయితే ముందుగా 18 పేజెస్ ఆహాలో రిలీజ్ కాబోతుంది. జనవరి 27 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కానున్నట్లు రీసెంట్గా ఆహా అధికారిక ప్రకటన ఇచ్చింది. యాన్ యాక్షన్ హీరో: ఆయుష్మాన్ ఖురానా ప్రధాన పాత్రలో అనిరుధ్ అయ్యర్ తెరకెక్కించిన చిత్రం ‘యాన్ యాక్షన్ హీరో’. గతేడాది డిసెంబరులో థియేటర్లలో విడుదలై ఈ చిత్రం హిందీ ప్రేక్షకులను అలరించిన జనవరి 27 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. నెట్ ఫ్లిక్స్: నార్విక్ (ఇంగ్లీష్ సినిమా) – జనవరి 23 బ్లాక్ షన్ షైన్ బేబీ (హిందీ డాక్యుమెంటరీ) – జనవరి 24 ఎగైనెస్ట్ ద రోప్స్ (స్పానిష్ వెబ్ సిరీస్) – జనవరి 25 బాడీస్ బాడీస్ బాడీస్ (ఇంగ్లీష్ మూవీ) – జనవరి 25 డేనియల్ స్పెల్ బౌండ్ (సీజన్ 2) – జనవరి 26 18 పేజెస్ (తెలుగు మూవీ) – జనవరి 27 యాన్ యాక్షన్ హీరో (హిందీ మూవీ) – జనవరి 27 యూ పీపుల్ (ఇంగ్లీష్ సినిమా) – జనవరి 27 లాక్ వుడ్ అండ్ కో (ఇంగ్లీష్ సిరీస్) – జనవరి 27 ద ఇన్విటేషన్ (ఇంగ్లీష్ మూవీ) – జనవరి 28 రాంగీ (తమిళ సినిమా) – జనవరి 29 జీ 5: అయలీ (తెలుగు సిరీస్) – జనవరి 26 జన్ బాజ్ హిందుస్థాన్ కే (హిందీ సిరీస్) – జనవరి 26 అమెజాన్ ప్రైమ్: ఎంగ్గా హాస్టల్ (తమిళ సినిమా) – జనవరి 27 షాట్ గన్ వెడ్డింగ్ (ఇంగ్లీష్ సినిమా) – జనవరి 27 యాపిల్ టీవీ ప్లస్: స్రింకింగ్ (ఇంగ్లీష్ సిరీస్) – జనవరి 27 డిస్నీ ప్లస్ హాట్ స్టార్: ఎక్స్ ట్రార్డినరీ (ఇంగ్లీష్ సిరీస్) – జనవరి 25 డియర్ ఇష్క్ (హిందీ సిరీస్) – జనవరి 26 శాటర్ డే నైట్ (మలయాళం మూవీ) – జనవరి 27 -
ఆహాలో 18 పేజెస్, స్ట్రీమింగ్ డేట్ వచ్చేసింది
కార్తికేయ 2 తర్వాత నిఖిల్ సిద్దార్థ్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన చిత్రం 18 పేజెస్.గతేడాది డిసెంబర్ 23న థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్‌తో పాటు మంచి వసూళ్లే వచ్చాయి. ఫీల్ గుడ్ లవ్‌స్టోరీగా తెరకెక్కిన ఈ సినిమా ఓటీటీ హక్కులను అటు ఆహా, ఇటు నెట్‌ఫ్లిక్స్ రెండూ చేజిక్కించుకున్న విషయం తెలిసిందే! అయితే ముందుగా 18 పేజెస్ ఆహాలో రిలీజ్ కాబోతున్నట్లు తెలుస్తోంది. జనవరి 27 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కానున్నట్లు అధికారిక ప్రకటన వెలువడింది. మరింకెందుకాలస్యం.. థియేటర్లో సినిమా చూడటం మిస్ అయినవాళ్లు వచ్చే శుక్రవారం ఫ్యామిలీతో కలిసి 18 పేజెస్ వీక్షించేయండి. ఇక సినిమా విషయానికి వస్తే.. సుకుమార్ కథ అందించగా ఆయన శిష్యుడు, కుమారి 21 ఎఫ్ ఫేమ్ సూర్యప్రతాప్ డైరెక్టర్‌గా వ్యవహరించాడు. మెగా నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మించాడు. Mee intrigue ki therapadabothundhi😅 Suku"Mark" magic ki ready ga undandi!#18PagesOnAHA | Premieres Jan 27 #18Pages @aryasukku @actor_Nikhil @anupamahere @dirsuryapratap @GopiSundarOffl #BunnyVas @idineshtej @NavinNooli @lightsmith83 @GA2Official @SukumarWritings @adityamusic pic.twitter.com/g33HqN6RCL — ahavideoin (@ahavideoIN) January 20, 2023 చదవండి:గర్భవతిగా పూజా.. స్విమ్మింగ్ పూల్‌లో ముద్దులాట అంబానీ ఇంట్లో ఫంక్షన్‌కు ఆ డ్రెస్‌లో వెళ్తావా? -
2023: నెట్‌ఫ్లిక్స్‌లో సినిమాల జాతర.. అన్ని భారీ, పాన్ ఇండియా ప్రాజెక్ట్సే
ఓటీటీలో ఈ ఏడాది కొత్త సినిమాల జాతర నెలకొననుంది. థియేటర్లో సంక్రాంతి పండుగ సందడి ఉండగానే.. ఓటీటీలో కొత్త సినిమాలను వరుస పెట్టి ప్రకటిస్తున్నారు. ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ ఇండియా ఈ సంక్రాంతికి డిజిటల్ ప్రియులను ఆకర్షించే పనిలో పడింది. ఎప్పుడు సినిమాలు రిలీజ్ అనంతరం ప్రకటన ఇచ్చే నెట్‌ఫ్లిక్స్ ఈసారి థియేట్రికల్ రిలీజ్‌కు ముందే కొత్త సినిమాలను వరుస పెట్టి ప్రకటిస్తోంది. చదవండి: Priyanka Jawalkar: పవన్ కల్యాణ్‌తో అసలు నటించను! ఎందుకంటే.. సంక్రాంతి సంందర్భంగా తెలుగులో రాబోయే స్టార్ హీరోల సినిమాలను అనౌన్స్ చేసింది. వాటిలో భారీ బడ్జెట్ చిత్రాలతో పాటు పాన్ ఇండియా సినిమాలు కూడా ఉన్నాయి. ఇందులో కొన్ని రిలీజ్‌కు సిద్దంగా ఉండగా.. మరికొన్ని షూటింగ్ దశలోనే ఉన్నాయి. అవేంటంటే చిరంజీవి భోళా శంకర్, మహేశ్ బాబు ఎస్ఎస్ఎమ్బి 28, వరుణ్ తేజ్ వీటీ 12, అనుష్క ప్రోడక్షన్ నెం. 14, సాయి ధరమ్ తేజ్ విరూపాక్ష, నాని దసరా, డీజే టిల్లు 2 ఇంకా ఎన్నో కొత్త ప్రాజెక్ట్‌లు ఉన్నాయి. చదవండి: హృతిక్‌ను కించపరచడం నా ఉద్దేశం కాదు: ఆ కామెంట్స్‌పై జక్కన్న స్పందన ఇక విడుదలైన 18 పేజెస్, ధమాకా చిత్రాలు కూడా త్వరలో ఇక్కడ స్ట్రీమింగ్ కానున్నాయి. ఒక్క తెలుగు సినిమాలే కాదు హిందీ, తమిళం, కన్నడ, మలయాళ చిత్రాలను కూడా వరుసగా ప్రకటిస్తోంది. అందులో అయినప్పుడు అతి తర్వలో మీ నెట్‌ఫ్లిక్స్‌లో రాబోయే చిత్రాలు ఇవే అంటూనే థియేట్రికల్ రిలీజ్ అనంతరమే అని స్పష్టం చేసింది. నెట్‌ఫ్లిక్స్ జోరు చూస్తుంటే ఈ ఏడాది సినీ ప్రియులకు సినిమాల జాతర ఉండబోతున్నట్లు తెలుస్తోంది. మరి ఆ చిత్రాలేవో చూద్దాం! View this post on Instagram A post shared by Netflix India (@netflix_in) View this post on Instagram A post shared by Netflix India (@netflix_in) View this post on Instagram A post shared by Netflix India (@netflix_in) View this post on Instagram A post shared by Netflix India (@netflix_in) View this post on Instagram A post shared by Netflix India (@netflix_in) View this post on Instagram A post shared by Netflix India (@netflix_in) View this post on Instagram A post shared by Netflix India (@netflix_in) View this post on Instagram A post shared by Netflix India (@netflix_in) View this post on Instagram A post shared by Netflix India (@netflix_in) -
అఫిషియల్: ఓటీటీకి వచ్చేస్తున్న ‘18 పేజెస్’ మూవీ, స్ట్రీమింగ్ ఎక్కడంటే!
యంగ్ హీరో నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన చిత్ర 18 పేజెస్. గతేడాది డిసెంబర్ 23న థియేటర్లలో విడుదలైన ఈ మూవీ మంచి విజయం సాధించింది. విడుదలైన తొలి షో నుంచే ఈ సినిమా ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ అందుకుంది. మంచి ఫీల్‌గుడ్ లవ్‌స్టోరీగా వచ్చిన ఈ చిత్రం మొత్తంగా రూ. 25 కోట్లపైనే గ్రాస్ కలెక్ట్ చేసి నిర్మాతలకు లాభాలు తెచ్చిపెట్టింది. చదవండి: దుమ్ములేపుతున్న వాల్తేరు వీరయ్య.. ఫస్ట్‌డే కలెక్షన్స్ ఎలా ఉన్నాయంటే! వెండితెరపై సత్తా చాటిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో సందడి చేసేందుకు రెడీ అయ్యింది. ఇప్పటికే ఈ మూవీ డిజిటల్ రైట్స్ ఆహాకు దక్కిన సంగతి తెలిసిందే. తాజాగా మరో ఓటీటీ దిగ్గజం ఈ మూవీ డిజిటల్ రైట్స్‌ను సొంతం చేసుకుంది. ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫాం నెట్‌ప్లిక్స్ 18 పేజెస్‌ను భారీ ధరకు సొంతం చేసుకుంది. త్వరలోనే ఈ చిత్రాన్ని ఓటీటీలోకి తీసుకురాబోతున్నట్లు తాజాగా నెట్‌ఫ్లిక్స్ అధికారిక ప్రకటన ఇచ్చింది. అయితే స్ట్రీమింగ్ డేట్‌ను మాత్రం వెల్లడించలేదు. చదవండి: నేను ఆ డిజార్డర్‌తో బాధపడుతున్నా! షాకిచ్చిన అనసూయ.. త్వరలోనే ఈ మూవీ స్ట్రీమింగ్కు సంబంధించిన పూర్తి వివరాలను అధికారికంగా ప్రకటించనుంది నెట్‌ఫ్లక్స్. కాగా కాగా బన్నీ వాసు నిర్మించిన ఈ సినిమాను, మెగా నిర్మాత అల్లు అరవింద్ సమర్పించారు. ఇదిలా ఉంటే ఈ చిత్రానికి పాన్ ఇండియా డైరెక్టర్ సుకుమార్ కథ అంధించిన సంగతి తెలిసిందే.ఈ సినిమాలో సిద్ధు, నందినిల పాత్రలను మలిచిన తీరు, పాటలు, కొన్ని అందమైన విజువల్స్, వీటన్నింటిని మించి సుకుమార్ మార్క్‌తో కూడిన క్లైమాక్స్ ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంది. Page-lu 18 aina, minimum 18 saarlu choodataaniki siddham. 18 pages is coming on Netflix as a post theatrical release!💕#NetflixPandaga #18Pages #NetflixLoEmSpecial pic.twitter.com/vkkgK5dV2v — Netflix India South (@Netflix_INSouth) January 14, 2023 -
రూ. 25 కోట్ల గ్రాస్ సాధించిన నిఖిల్, అనుపమ ‘18 పేజెస్’ చిత్రం
యంగ్ హీరో నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన చిత్ర 18 పేజెస్. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 23న థియేటర్లలో విడుదలైన ఈ మూవీ మంచి విజయం సాధించింది. విడుదలైన తొలి షో నుంచే ఈ సినిమా ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ అందుకుంది. దీంతో మొదటి రోజే ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కలెక్షన్స్‌తో దూసుకెళ్లింది. కేవలం మౌత్ టాక్‌తోనే ఈ చిత్రానికి రోజు రోజుకు ఆదరణ మరింత పెరుగుతోంది. ఈ సినిమా విడుదలై 10 రోజులు గడుస్తున్నా ఇప్పటికి థియేటర్లో సక్సెస్‌ఫుల్‌గా దూసుకుపోతోంది. ఈ ఫీల్ గుడ్ లవ్‌స్టోరీని చూసేందుకు మళ్లీ మళ్లీ థియేటర్‌కు వస్తున్నారు. ఫలితంగా ఈ సినిమా ఇప్పటివరకు రూ. 20 కోట్ల గ్రాస్ సాధించింది. కాగా బన్నీ వాసు నిర్మించిన ఈ సినిమాను, మెగా నిర్మాత అల్లు అరవింద్ సమర్పించారు. ఇదిలా ఉంటే ఈ చిత్రానికి పాన్ ఇండియా డైరెక్టర్ సుకుమార్ కథ అంధించిన సంగతి తెలిసిందే. ఆయన శిష్యుడు ‘కుమారి 21ఎఫ్’ చిత్ర దర్శకుడు సూర్యప్రతాప్ పల్నాటి ఈ చిత్రాన్ని ఫీల్‌గుడ్ లవ్‌స్టోరీగా మలిచారు. ఇందులో హీరోహీరోయిన్ల పాత్రలను మలిచిన తీరు, పాటలు, కొన్ని అందమైన విజువల్స్, వీటన్నింటిని మించి సుకుమార్ మార్క్‌తో కూడిన క్లైమాక్స్ ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంది. చదవండి: నటి నయని పావని ఇంట తీవ్ర విషాదం, తండ్రి మృతి.. ఇన్‌స్టాలో ఎమోషనల్ పోస్ట్ వాల్తేరు వీరయ్య టైటిల్ సాంగ్ లిరిక్స్ వివాదం.. యండమూరికి చంద్రబోస్ గట్టి కౌంటర్ -
రెమ్యునరేషన్‌ను భారీగా పెంచేసిన అనుపమ పరమేశ్వరన్
తమిళసినిమా: డిమాండ్ అండ్ సప్లై అనేది ఎక్కడైనా అప్లై అవుతుంది. ఇక చిత్ర పరిశ్రమ గురించి చెప్పాలా.. మొదట్లో ఒక్కచాన్స్ ప్లీజ్ అంటూ ప్రాధేయపడడం, ఆ ఒక్క అవకాశం వచ్చినా తరువాత విజయం కోసం ఆరాటపడడం, అదృష్టం కలిసొచ్చి ఆమెకు ఒక హిట్ వచ్చేస్తే, ఆ తరువాత పారితోషికం పెంచేయడం ఇలా చైన్‌లా జరిగిపోతాయి. ఇది ఇక్కడ ఏ ఒక్కరి గురించి కాదు. అంతా ఇంతే. ఇందుకు అనుపమ పరమేశ్వరన్ అతీతం కాదు. ఆమె కూడా అంతే. ఇప్పటివరకు ఈమె కెరియర్లో ఓ మోస్తరు విజయాలనే చూసింది. మధ్యలో అవకాశాలు కూడా వెన్ను చూపాయి. అలాంటిది తెలుగులో నిఖిల్ సరసన నటించిన కార్తికేయ–2 చిత్రం అనూహ్య విజయాన్ని సాధించింది. ఇక రీసెంట్గా అదే హీరోతో జతకట్టిన 18 పేజెస్ చిత్రం కూడా హిట్ టాక్‌ను కొట్టేసింది. ఇంతకంటే ఏం కావాలి మంచి తరుణం మించి పోకూడదనుకుందేమో. తన పారితోషికాన్ని అమాంతం పెంచేసిందని సినీ వర్గాల టాక్. ఎంత అంటే ఇప్పటివరకు రూ.60 లక్షలు పుచ్చుకున్న అనుపమ పరమేశ్వరన్ ఇప్పుడు దానికి రెట్టింపు అంటే రూ.1.20 కోట్లు డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. అయినా అనుపమ కావాలంటున్నారు నిర్మాతలు. ఇది వారికి కిక్కు అనుపమకు లక్కు అని చెప్పక తప్పదు. అయితే ఈ అమ్మడికి తమిళంలో మాత్రం ఇంకా అలాంటి లక్కు రాలేదనే చెప్పాలి. మొదట్లో ఎక్కువగా ధనుష్ సరసన నటింన కోడి చిత్రం పరవాలేదు అనిపించిన ఆ క్రెడిట్‌ను నటుడు ధనుష్, నటి త్రిష కొట్టుకు పోయారు. ఈమధ్య నటుడు అధర్వతో రొవన్స్ చేసిన తల్లి పోగాదే చిత్రం తెరపైకి వచ్చి పోయింది. అంతే దీంతో ప్రస్తుతం జయంరవి సరసన రెండవ హీరోయిన్గా నటిస్తున్న సైరన్ చిత్రంపైనే అనుపమ పరమేశ్వరన్ ఆశలు పెట్టుకుంది. మరి తెలుగుతో పాటు తమిళంలోనూ ఆమెకు లక్కు వర్కౌట్ అవుతుందా లేదా వేచి చూడాల్సిందే. -
ఫీల్‌గుడ్ లవ్‌స్టోరీ ‘18 పేజెస్’ వారం రోజుల కలెక్షన్స్ ఎలా ఉన్నాయంటే..
యంగ్ హీరో నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన చిత్ర 18 పేజెస్. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 23న థియేటర్లలో విడుదలైన ఈ మూవీ మంచి విజయం సాధించింది. విడుదలైన తొలి షో నుంచే ఈ సినిమా ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ అందుకుంది. దీంతో మొదటి రోజే ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కలెక్షన్స్‌తో దూసుకెళ్లింది. కేవలం మౌత్ టాక్‌తోనే ఈ చిత్రానికి రోజు రోజుకు ఆదరణ మరింత పెరుగుతోంది. ఈ సినిమా విడుదలై వారం రోజులు గడుస్తున్నా ఇప్పటికి థియేటర్లో అదే జోరు కొనసాగుతోంది. ఆడియన్స్ మళ్లీ మళ్లీ థియేటర్‌కు వచ్చి సినిమా చూస్తుండటం విశేషం. ఫలితంగా ఈ సినిమా ఇప్పటివరకు (వారం రోజులకు) రూ. 20 కోట్ల గ్రాస్ సాధించి విజయంతంగా ముందుకు సాగుతుంది. కాగా బన్నీ వాసు నిర్మించిన ఈ సినిమాను, మెగా నిర్మాత అల్లు అరవింద్ సమర్పించారు. ఇదిలా ఉంటే ఈ చిత్రానికి పాన్ ఇండియా డైరెక్టర్ సుకుమార్ కథ అంధించిన సంగతి తెలిసిందే. ఆయన శిష్యుడు ‘కుమారి 21ఎఫ్’ చిత్ర దర్శకుడు సూర్యప్రతాప్ పల్నాటి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. కమర్షియల్ సినిమాలు మాత్రమే కాదు ఒక ఫీల్‌గుడ్ లవ్‌స్టోరీకి కూడా సరైన ఆదరణ లభిస్తుంది అని నిరూపించింది ఈ క్రేజి లవ్ స్టోరీ. ఈ సినిమాలో సిద్ధు, నందినిల పాత్రలను మలిచిన తీరు, పాటలు, కొన్ని అందమైన విజువల్స్, వీటన్నింటిని మించి సుకుమార్ మార్క్‌తో కూడిన క్లైమాక్స్ ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంది. చదవండి: బాలయ్య ‘అన్‌స్టాపబుల్ షో’పై ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు! వాల్తేరు వీరయ్య నుంచి మరో మాస్ సాంగ్, గొంతు కలిపిన చిరు, రవితేజ -
ఆ సినిమాతో పోల్చడం సంతోషం
‘‘ఫీల్ గుడ్ సినిమా ఆడదు.. ప్రేమ కథలు ఇంటికి (ఓటీటీ) వచ్చినప్పుడు చూద్దాంలే’ అని ప్రేక్షకులు అను కుంటున్న తరుణంలో ‘సీతారామం’ వచ్చి అదరగొట్టేసింది. ఆ సినిమా క్లయిమాక్స్‌కి ఉన్న ఫీలింగ్ మా ‘18 పేజెస్’కి వచ్చిందని చాలామందిపోల్చి చెబుతుంటే సంతోషంగా ఉంది. మా సినిమా చూస్తే ఒక నవలను చదివిన అనుభూతి కలిగేలా దర్శకుడు మలిచాడు’’ అని నిర్మాత అల్లు అరవింద్ అన్నారు. నిఖిల్ సిద్ధార్థ్, అనుపమా పరమేశ్వరన్ జంటగా సూర్య ప్రతాప్ పల్నాటి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘18 పేజెస్’. డైరెక్టర్ సుకుమార్ కథ అందించారు. అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 23న విడుదలైంది. హైదరాబాద్‌లో నిర్వహించిన ఈ సినిమా సక్సెస్ మీట్లో బన్నీ వాసు మాట్లాడుతూ – ‘‘మా సినిమా మొదటిరోజు వసూళ్ల కంటే మూడో రోజు ఎక్కువ ఉన్నాయి. ఈ చిత్రం విషయంలో మేం లాభాల్లో ఉన్నాం’’ అన్నారు. ‘‘మా సినిమా చూసినవారు ‘మాకు మేమే ప్రేమలో పడిన అనుభూతి వస్తోంది’ అంటున్నారు. అది మాకు పెద్ద ప్రశంస’’ అన్నారు సూర్యప్రతాప్. ‘‘2022లో టాప్ ఫైవ్ లవ్ స్టోరీస్‌లో మా ‘18 పేజెస్’ ఉంటుంది. కెరీర్ వైజ్‌గా నా జీవితంలో ఇది బెస్ట్ ఇయర్’’ అన్నారు నిఖిల్. ‘‘శతమానం భవతి’లో నేను చేసిన నిత్య ΄ాత్రకి ఎంత మంచి పేరొచ్చిందో ‘18 పేజెస్’లో నందిని ΄ాత్రకి కూడా అంతే పేరొచ్చింది’’ అన్నారు అనుపమ. ∙ నిఖిల్, అనుపమ, అల్లు అరవింద్, బన్నీ వాసు, సూర్యప్రతాప్ -
నిఖిల్ ఖాతాలో మరో హిట్.. కలెక్షన్లతో దూసుకెళ్తున్న '18 పేజెస్'
ఈ ఏడాది యంగ్ హీరో నిఖిల్ నటించిన చిత్రం కార్తికేయ బ్లాక్ బస్టర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఆ సినిమా హిట్ తర్వాత నిఖిల్ సిద్ధార్థ్ మరోసారి "18 పేజెస్" చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. చాలా రోజుల క్రితమే పూర్తయిన ఈ రొమాంటిక్ మూవీలో నిఖిల్ జోడిగా అనుపమ పరమేశ్వరన్ నటించింది. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 23న థియేటర్లలో విడుదలైంది. (ఇది చదవండి: 18Pages: సెలిబ్రిటిస్‌తో బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్) రిలీజైన తొలి రోజే ఈ సినిమాకు ప్రేక్షకుల పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. విడుదలైన మొదటి రోజే బ్రేక్ ఈవెన్ సాధించి సంచలనం సృష్టించింది. కేవలం మౌత్ టాక్‌తోనే ఈ చిత్రానికి రోజు రోజుకు ఆదరణ మరింత పెరుగుతోంది. రిలీజైన తర్వాత మూడో రోజు అత్యధిక కలెక్షన్స్ సాధించిన చిత్రంగా నిలిచింది. సినీ విశ్లేషకుల అంచనాల ప్రకారం ఈ సీజన్లో మరింత విజయవంతంగా ముందుకెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రం ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా రూ.13.5 కోట్ల గ్రాస్, రూ.22 కోట్ల నాన్-థియేట్రికల్ వసూళ్లను సాధించింది. ఈ సినిమాకు పాన్ ఇండియా దర్శకుడు సుకుమార్ కథను అందించగా.. ఆయన శిష్యుడు "కుమారి 21ఎఫ్" చిత్ర దర్శకుడు సూర్యప్రతాప్ పల్నాటి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. జీఏ2 పిక్చర్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై బన్నీ వాసు ఈ చిత్రాన్ని నిర్మించగా.. గోపి సుందర్ సంగీతమందించారు. ఈ సినిమాను మెగా నిర్మాత అల్లు అరవింద్ సమర్పించారు. -
18 పేజెస్ మూవీ టీంతో " స్పెషల్ చిట్ చాట్ "
-
‘18పేజిస్’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫోటోలు)
-
18Pages: సెలిబ్రిటిస్‌తో బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్
నిఖిల్ సిద్దార్థ్ ,అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన సినిమా ‘18పేజిస్’. ఈ చిత్రానికి పాన్ ఇండియా డైరెక్టర్ సుకుమార్ కథను అందించారు. ఆయన శిష్యుడు సూర్యప్రతాప్ పల్నాటి ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 23న విడుదలైన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. సినిమాలో అనుపమ చేసిన నందిని పాత్రకు సినీ ప్రియులు ఫిదా అయ్యారు. క్లైమాక్స్,అలానే కొన్ని కొత్త ఫీల్ ను తీసుకొచ్చే సీన్స్ ,గోపి సుందర్ మ్యూజిక్ ఈ సినిమా స్థాయిని పెంచాయి. ‘18 పేజెస్’ చిత్రానికి ప్రేక్షకుల నుంచి పాజిటివ్ స్పందన రావడంతో చిత్రబృందం ఫుల్ జోష్ లో ఉంది. శనివారం రాత్రి ఈ చిత్ర యూనిట్ టాలీవుడ్ ప్రముఖులతో కలిసి సక్సెస్ సెలబ్రేషన్స్ ను జరుపుకుంది. ఈ కార్యక్రమంలో మెగా నిర్మాత అల్లు అరవింద్, పాన్ ఇండియా దర్శకుడు సుకుమార్, చందు మొండేటి, బుచ్చిబాబు, వశిష్ట, ప్రియాంక జవాల్కర్, ప్రియా వడ్లమాని తదితర సినీ ప్రముఖులు పాల్గొన్నారు. -
అనుపమతో స్టెప్పులేసిన అల్లు అరవింద్.. వీడియో వైరల్
యంగ్ హీరో నిఖిల్, అనుపమ మరో సూపర్‌హిట్ మూవీని తమ ఖాతాలో వేసుకున్నారు. ఇదివరకే కార్తికేయతో సక్సెస్ అందుకున్న ఈ జోడీ తాజాగా 18 పేజెస్తో మరో విజయాన్ని సొంతం చేసుకున్నారు.ముఖ్యంగా అనుపమ, నిఖిల్ల నటన, డైలాగ్స్ యూత్‌ను బాగా ఆకట్టుకుంటున్నాయి. ఈ చిత్రానికి పాన్ ఇండియా డైరెక్టర్ సుకుమార్ కథ అందించగా, ఆయన శిష్యుడు సూర్యప్రతాప్ పల్నాటి దర్శకత్వం వహించాడు. డిసెంబర్ 23న విడుదలైన 18 పేజెస్ సినిమా తొలిరోజు నుంచే పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్తూ క్లాసిక్ హిట్‌గా నిలిచింది. తాజాగా ఈ సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్‌ను మూవీ టీం గ్రాండ్‌గా నిర్వహించింది. ఇందులో పాల్గొన్న నిర్మాత అల్లు అరవింద్ మూవీలోని 'టైం ఇవ్వు పిల్ల.. కొంచెం టైం ఇవ్వు' అంటూ సాగే పాటకు అనుపమతో కలిసి సరదాగా స్టెప్పులేశారు. అనుపమ, అల్లు అరవింద్‌తో పాటుగా, సుకుమార్ కూడా స్టెప్పులు వేశారు. ఈ వీడియోను నిఖిల్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్చేయగా ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతుంది. View this post on Instagram A post shared by Nikhil Siddhartha (@actor_nikhil) -
అదే నా కోరిక.. నటనకు బ్రేక్ ఇచ్చయినా ఆ విషయాలు తెలుసుకుంటా
మలయాళ చిత్రం ప్రేమమ్‌తో కథానాయికగా ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్. ఆ తర్వాత తెలుగు చిత్ర పరిశ్రమలో మంచి అవకాశాలను చేజిక్కించుకుంటూ ప్రముఖ నటిగా రాణిస్తోంది. తమిళంలోనూ ధనుష్ సరసన కొడి చిత్రంతో ఎంట్రీ ఇచ్చి ఆ తరువాత అధర్వకు జంటగా తల్లిపోగాదే చిత్రంలో నటించింది. తాజాగా సైరన్ అనే తమిళ చిత్రం, తెలుగులో రెండు చిత్రాలు, మలయాళంలో ఒక చిత్రం చేస్తూ బిజీగా ఉంది. ఈమె తెలుగులో కార్తీకేయ 2 వంటి సూపర్ హిట్ చిత్రం తర్వాత నటించిన 18 పేజెస్ చిత్రం శుక్రవారం తెరపైకి వచ్చింది. కాగా ఓ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ.. తనకు ప్రేమ కథా చిత్రాల్లో నటించే అవకాశాలే ఎక్కువగా వస్తున్నాయని చెప్పింది. అలా ఎప్పుడూ ఏదో ఒక ప్రేమ కథా చిత్రంలో నటిస్తూనే ఉన్నానని పేర్కొంది. అయితే ప్రేమ కథా చిత్రాలు వేస్తూనే ఉండాలని కోరుకుంటున్నానంది. తనకు దర్శకత్వం చేయాలనే కోరిక ఉందని, కచ్చితంగా మెగా ఫోన్ పడతానని చెప్పింది. అయితే దర్శకత్వం చేపట్టే ముందు ఒక ఏడాది పాటు నటనకు విరామం ఇచ్చి ప్రముఖ దర్శకుడి వద్ద శిష్యరికం చేసి దర్శకత్వం శాఖలో మెలకువలు తెలుసుకుంటానని చెప్పింది. కొన్ని కథలను కూడా తన మదిలో ఉన్నాయని తెలిపింది. అయితే కథానాయకిగా చాలా చిత్రాల్లో నటించాల్సి ఉందని, అందువల్ల ప్రస్తుతం నటనపైనే పూర్తిగా దృష్టి పెడుతున్నట్లు పేర్కొంది. చదవండి: (టాలీవుడ్లో తీవ్ర విషాదం.. నటుడు చలపతిరావు హఠాన్మరణం) -
18 Pages Box Office Collection: ‘18 పేజెస్’ ఫస్ట్ కలెక్షన్స్ ఎంతంటే..
నిఖిల్ సిద్దార్థ్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన రెండో చిత్రం ‘18 పేజెస్’. ఈ చిత్రానికి పాన్ ఇండియా డైరెక్టర్ సుకుమార్ కథను అందించారు. ఆయన శిష్యుడు సూర్యప్రతాప్ పల్నాటి దర్శకత్వం వహించాడు. వరుస హిట్ సినిమాలను నిర్మిస్తున్న ‘జీఏ 2’ పిక్చర్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్‌పై బన్నీ వాసు నిర్మించిన ఈ చిత్రం డిసెంబర్ 23న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలిరోజే ఈ మూవీ పాజిటివ్ టాక్ సంపాదించుకుంది. కానీ బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో కలెక్షన్లను రాబట్టలేకపోయింది. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం..ఈ చిత్రం తొలిరోజు ప్రపంచ వ్యాప్తంగా రూ.3.45 కోట్ల(రూ.1.75 షేర్) కలెక్షన్స్ రాబట్టింది. అత్యధికంగా నిజాంలో రూ.1.05 కోట్లు, సీడెడ్‌లో రూ.0.25 కోట్లు, ఆంధ్రాలో రూ.1.05 కోట్ల కలెక్షన్లను రాబట్టింది. ఈ చిత్రానికి రూ.12 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగినట్లు సమాచారం. బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే రూ.12.50 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంది. తొలిరోజు రూ.1.75 కోట్లు మాత్రమే సాధించింది. ఇంకో రూ.10.75 కోట్ల కలెక్షన్స్ రాబడితే ఈ చిత్రం సేఫ్ జోన్లోకి వెళ్తుంది. ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ రావడంతో వీకెండ్ డేస్‌లో కలెక్షన్స్ పెరిగే అవకాశం ఉందని, బ్రేక్ ఈవెన్ ఈజీగా సాధిస్తుందని సీనీ వర్గాలు చెబుతున్నాయి. -
హీరో అవ్వడానికి రూ.5 లక్షలు ఇచ్చా.. మోసం చేశారు : నిఖిల్
యంగ్ హీరో నిఖిల్ ప్రస్తుతం ప్యాన్ ఇండియా లెవల్లో సత్తా చాటుతున్నాడు. కార్తికేయ చిత్రంతో కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ అందుకున్న నిఖిల్ రీసెంట్గా 18 పేజెస్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సందర్భంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నిఖిల్ తన సినీ కెరీర్‌పై ఆసక్తికర కామెంట్స్ చేశాడు. ''అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఎంట్రీ ఇచ్చిన నేను ఆ తర్వాత ఓ సీరియల్లో కూడా నటించాను. కానీ అక్కడే ఉండే బుల్లితెరకే పరిమితం అవుతాననిపించింది. దీంతో సినిమాలకు ఆడిషన్స్ ఇవ్వడం ప్రారంభించాను. కొందరికి నా యాక్టింగ్ నచ్చి అవకాశాలు ఇస్తామని చెప్పి ఆ తర్వాత పట్టించుకోలేదు. ఇంకొందరేమో నిన్ను హీరోగా చేయాలా? రూ 50లక్షలు, కోటి రూపాయలు తీసుకురా అనేవాళ్లు. అలా నేను హీరో అవ్వడానికి రూ.5లక్షలు ఇచ్చాను కూడా. లక్ష రూపాయల వరకు షూటింగ్ చేసి ఆపేశారు. ఆ తర్వాత ఇదంతా ఫేక్ అని అర్థమయ్యింది. ఇక శేఖర్ కమ్ముల గారు చాలా జెన్యూన్. నా యాక్టింగ్ నచ్చి ఛాన్స్ ఇచ్చారు. ఆయనే ఫస్ట్ చెక్ ఇచ్చారు. ఇప్పటికీ దాన్ని దాచుకున్నాను. ఆ సినిమా తర్వాతే నాకు వరుసగా అవకాశాలు వచ్చాయి. కార్తికేయతో పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ వచ్చింది. ఇదంతా ఎలా జరిగిందా అని అప్పుడప్పుడు ఆలోచిస్తుంటా'' అంటూ చెప్పుకొచ్చాడు. -
'18 పేజెస్' మూవీ రివ్యూ
టైటిల్: 18 పేజెస్ నటీనటులు: నిఖిల్, అనుపమ పరమేశ్వరన్, సరయూ, దినేశ్ తేజ్, అజయ్, పోసాని కృష్ణమురళి, రమణ, రఘుబాబు తదితరులు నిర్మాణ సంస్థలు: జీఏ2 పిక్చర్స్, సుకుమార్ రైటింగ్ బ్యానర్స్ నిర్మాత: బన్నీ వాసు కథ, స్క్రీన్ ప్లే: సుకుమార్ దర్శకత్వం: పల్నాటి సూర్య ప్రతాప్ సంగీతం: గోపీ సుందర్ సినిమాటోగ్రఫీ: ఏ. వసంత్ ఎడిటర్: నవీన్ నూలి విడుదల తేది: డిసెంబర్ 23, 2022 నిఖిల్ సిద్దార్థ, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన చిత్రం 18 పేజెస్. సుకుమార్ కథను అందించిన ఈ సినిమాకి సూర్యప్రతాప్ దర్శకత్వం వహించారు. కార్తికేయ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత సరికొత్త స్టోరీతో నిఖిల్ ప్రేక్షకుల ముందుకొచ్చారు. డిసెంబర్ 23 రిలీజైన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. కథేంటంటే.. సిద్ధు( నిఖిల్) ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి. ఇంటికి దూరంగా ఓ రూమ్‌లో ఉంటూ ఆఫీస్‌కు వెళ్తుంటాడు. అదే సమయంలో ఓ అమ్మాయిని ప్రేమిస్తాడు. కానీ ఊహించని విధంగా నిఖిల్‌కు ఆ అమ్మాయి గట్టి షాక్ ఇస్తుంది. ఆ షాక్ నుంచి డిప్రెషన్లో వెళ్లిన నిఖిల్‌కు సహాద్యోగి బాగీ( సరయూ) అండగా నిలుస్తుంది. అనుకోకుండా సిద్దుకు రోడ్డు పక్కన ఒక రోజు డైరీ దొరుకుతుంది. అది ఓ పల్లెటూరు అమ్మాయి నందిని(అనుపమ పరమేశ్వరన్)రాసిన డైరీ. అసలు ఆ డైరీ ఏముంది? నందిని చుట్టూ ఓ గ్యాంగ్ ఎందుకు తిరుగుతుంది? ఆ డైరీ చదివాక సిద్ధులో వచ్చిన మార్పులేంటి? అసలు నిఖిల్(సిద్ధు) నందినిని కలిశాడా? వారిద్దరి ప్రేమ సక్సెస్ అయిందా? లేదా? చివరికి ఈ కథలో ఎలాంటి మలుపులు చోటు చేసుకున్నాయన్నదే అసలు కథ. ఎలా ఉందంటే.. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో కూడిన ఓ స్వచ్ఛమైన ప్రేమ కథ ఇది. అమ్మాయిని చూడకుండా ప్రేమించడం అనే కాన్సెప్ట్‌తో ఈ కథనం సాగుతుంది. తెలిసిన కథే అయినా సుకుమార్ టీమ్ ట్రీట్మెంట్ చాలా ఫ్రెష్‌గా, కొత్తగా ఉంది. ఒకపైపు ప్యూర్ లవ్‌స్టోరీని చూపిస్తూనే.. మరోవైపు తర్వాత ఏం జరుగుతుందనే టెన్షన్‌ని ప్రేక్షకులకు కలిగించారు. ఊహించని ట్విస్టులతో ఆద్యంతం ఆసక్తికరంగా కథనం సాగుతుంది. సినిమా మొత్తంలో హీరో, హీరోయిన్లు చివరి సీన్ వరకు అస్సలు కలుసుకోరు. కలుసుకున్నా కూడా వారిద్దరి మధ్య మాటలు అసలే ఉండవు. అయినా కూడా ఎక్కడ బోర్ కొట్టించకుండా స్క్రీన్‌ప్లే అదరగొట్టారు సుకుమార్. సుకుమార్ అనుకున్న పాయింట్‌ని తెరపై చూపించడంలో వందశాతం సఫలం అయ్యాడు దర్శకుడు పల్నాటి సూర్య ప్రతాప్. సినిమా ఫస్టాఫ్ హీరో హీరోయిన్ల ఇంట్రడక్షన్, పాటలు, సరదా సన్నివేశాలతో సాగింది. ఇంటర్వెల్ ట్విస్ట్ ఆకట్టుకుంటుంది.సెకండాఫ్ ఆద్యంత ట్విస్ట్‌లతో సాగుతుంది. కథ ముందుకు సాగే కొద్ది ఆసక్తి మరింత పెరుగుతుంది. మొత్తంగా 18 పేజీల డైరీతో సస్పెన్స్ లవ్ స్టోరీని చక్కగా తెరకెక్కించారు ఎవరెలా చేశారంటే.. నిఖిల్ మరోసారి తన నటనతో ఆకట్టుకున్నారు. సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా నిఖిల్ ఈ సినిమాలో కొత్తగా కనిపించారు. నిఖిల్ ఎమోషన్స్‌తో మరోసారి ఆకట్టుకున్నారు. ఈ సస్పెన్స్ లవ్ స్టోరీలో అనుపమ పరమేశ్వరన్ మరోసారి తన నటనతో మెప్పించింది. మొబైల్ లేకుండా పల్లెటూరి అమ్మాయి పాత్రలో అనుపమ ఒదిగిపోయింది. సరయూ నిఖిల్‌కు సహాద్యోగిగా తెలంగాణ యాసలో అదరగొట్టింది. మధ్యలో రఘుబాబు కామెడీతో అలరించాడు. లాయర్ పాత్రలో పోసాని కృష్ణమురళి, డాక్టర్ సందీప్‌గా దినేశ్ తేజ్, కండక్టర్ పాత్రలో రమణ, విలన్ పాత్రలో అజయ్(తల్వార్) తమ పాత్రలకు న్యాయం చేశారు. జీఏ2 పిక్చర్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్ సినిమా నిర్మాణ విలువలు బాగున్నాయి. గోపీసుందర్ బీజీఎంతో అదరగొట్టాడు. పల్నాటి సూర్య ప్రతాప్ డైరెక్షన్ బాగుంది. వసంత్ సినిమాటోగ్రఫీ, నవీన్ నూలి ఎడిటింగ్ బాగున్నాయి. -
" 18 పేజెస్ " మూవీ పబ్లిక్ టాక్
-
‘18 పేజెస్’ మూవీ ట్విటర్ రివ్యూ
కార్తికేయ 2తో పాన్ ఇండియా స్టార్‌గా మారాడు యంగ్ హీరో నిఖిల్. ఆ సినిమా పాన్ ఇండియా స్థాయిలో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడంతో.. అదే ఊపుతో ఇప్పుడు ‘18 పేజెస్’ అంటూ ఓ ప్రేమ కథా చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. వరుస హిట్ సినిమాలను నిర్మిస్తున్న ‘జీఏ 2’ పిక్చర్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్‌పై బన్నీ వాసు నిర్మిస్తున్న ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్. మెగా నిర్మాత అల్లు అరవింద్ సమర్పించారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, పాటలకు భారీ స్పందన లభించింది. దానికి తోడు మూవీ ప్రమోషన్స్ కూడా గ్రాండ్‌గా చేయడంతో ఈ ప్రేమ కథా చిత్రంపై హైప్ క్రియేట్ అయింది.భారీ అంచనాల మధ్య నేడు(డిసెంబర్ 23) ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే ఓవర్సీస్తో పాటు పలు పలు చోట్ల ఫస్ట్‌డే ఫస్ట్ షో పడిపోయింది. దీంతో ఈ సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ‘18 పెజెస్’ కథేంటి? ఎలా ఉంది? తదితర విషయాలను ట్విటర్ వేదికగా చర్చిస్తున్నారు. అవేంటో చూడండి. #18Pages : the movie has a good story and could have been a great feel good movie. However, the cringe moments in the movie ruined the experience. @actor_Nikhil @anupamahere @aryasukku — Telugu Cinemaalaya (@cinemaalayaa) December 23, 2022 #18Pages 18 Pages - A sweet ❤️ Romantic Entertainer..Good one by Sukumar Writings team..👍 — jayaram abishek (@Jayaram_nikhil_) December 23, 2022 All the best self-made pan india star @actor_Nikhil and #anupama for #18Pages release today. Hope you will get huge BB hit with this, chala days tarvata oka movie release kosam chala exiting ga wait chestuna....🤞🤞❤#sukumarwrittings #geethaarts #18PagesOnDec23 pic.twitter.com/EFI8o68DTv — gang_star_saiyadav (@DHF_nikhil) December 23, 2022 Sure you're all set to startle and treat the audience and fans once again. All the best @RaviTeja_offl garu @aryasukku garu & @actor_Nikhil Best wishes to the teams of #Dhamaka & #18Pages@anupamahere @dirsuryapratap @GA2Official@sreeleela14 @TrinadharaoNak1 @peoplemediafcy pic.twitter.com/D9BCFKwROY — Sai Dharam Tej (@IamSaiDharamTej) December 22, 2022 #18pages @actor_Nikhil Message to USA Audience Huge Grand Release Ever in Recent times with 355+ locations. Bookings open Now Release by @Radhakrishnaen9 🇺🇸@aryasukku @GeethaArts @anupamahere @dirsuryapratap @GopiSundarOffl @SukumarWritings @GA2Official pic.twitter.com/1WNtBeJkJp — Radhakrishnaentertainments (@Radhakrishnaen9) December 23, 2022 -
సక్సెస్‌ను మించిన ప్రెజర్ మరొకటి ఉండదు
‘‘నా కెరీర్లో ఇప్పటివరకూ నేను మంచి కథలు, మంచి సినిమాల్లో నటించాను. కానీ నటనలో నాకు ఉన్న ప్రతిభకు సరైన పేరు రాలేదని ఫీలవుతుంటాను. అయితే ‘18 పేజెస్’ రిలీజ్ తర్వాత కేవలం ఈ సినిమా గురించే కాకుండా నా నటన గురించి కూడా మాట్లాడుకుంటారని అనుకుంటున్నాను’’ అని హీరో నిఖిల్ సిద్ధార్థ అన్నారు. పల్నాటి సూర్యప్రతాప్ దర్శకత్వంలో నిఖిల్ సిద్ధార్థ, అనుపమా పరమేశ్వరన్ జంటగా నటించిన చిత్రం ‘18 పేజెస్’. దర్శకుడు సుకుమార్ అందించిన కథతో అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మించిన ఈ చిత్రం నేడు రిలీజవుతోంది. ఈ సందర్భంగా గురువారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో నిఖిల్ చెప్పిన విశేషాలు. ► ‘18 పేజెస్’ చిత్రం ఎలా ఉంటుంది? థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో కూడిన క్రేజీ లవ్‌స్టోరీ ఇది. 18 పేజెస్ ఆధారంగా నందినీతో సిద్ధు ఏ విధంగా ప్రేమలో పడతాడు? వీరి ప్రేమకథ ఎలా ముగిసింది? అన్నదే కథ. ఈ సినిమా క్లయిమాక్స్‌ని ఊహించలేకపోయాను. అలాగే ఈ సినిమాను ప్రేక్షకులు, విమర్శకులు ఎలా రిసీవ్ చేసుకుంటారోననే భయం కూడా ఉంది. హిట్టయినా కాకపోయినా మేం ఓ మంచి ప్రయత్నం చేశామని ఆడియన్స్ భావిస్తారనే గ్యారంటీ ఇవ్వగలను. ► థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, లవ్‌స్టోరీ కాకుండా.. ఈ సినిమాలో వేరే అంశాలేమైనా? కొన్ని సామాజిక అంశాలను చెప్పే ప్రయత్నం చేశాం. ఎవరో ఒక అమ్మాయి తనను రిజెక్ట్ చేసిందని అతను ఆమెపై యాసిడ్‌తో దాడి చేయడం, అఘాయిత్యాలకు పాల్పడటం వంటివి వార్తల్లో చూస్తున్నాం. ఓ అమ్మాయికి ఎలాంటి గౌరవం దక్కాలి? ఆమె పట్ల ప్రవర్తన ఎలా ఉండాలి? పెద్దల పట్ల యువత తీరు ఎలా ఉంటే బాగుంటుంది? అనే అంశాలను చెప్పే ప్రయత్నం చేశాం. ఈ సినిమా చూసిన తర్వాత బ్రేకప్ను కూడా పాజిటివ్‌గా తీసుకుంటారు. ► ఈ చిత్రంపై దర్శకుడు సుకుమార్ మార్క్ ఎంత? వంద శాతం ఆయన మార్క్ కనిపిస్తుంది. హీరో, హీరోయిన్ల క్యారక్టరైజేషన్స్, స్క్రీన్‌ప్లే డిఫరెంట్‌గా ఉన్న ఇలాంటి లవ్‌స్టోరీని నేనిప్పటివరకు చేయలేదు. ప్రతి సీన్ చాలెంజింగ్‌గా అనిపించింది. ‘కార్తికేయ 2’తో పాన్ ఇండియా హీరో అయ్యారు. ఏమైనా ఒత్తిడి ఫీలవుతున్నారా? పాన్ ఇండియా హీరో అన్న ప్రతిసారీ నాకు ఒత్తిడే. నాకు తెలిసి సక్సెస్‌ను మించిన ప్రెజర్ మరొకటి ఉండదు. ► మీ తర్వాతి చిత్రాలు? నెక్ట్స్ ఇయర్ ఓ స్పై మూవీతో రాబోతున్నాను. దర్శకుడు చందు మొండేటి ‘కార్తికేయ 3’ కోసం పరిశోధన చేస్తున్నారు. నా ‘యువత’ సినిమా రిలీజైన ఐదు రోజులకు సుకుమార్‌గారు లక్ష రూపాయల పారితోషికం ఇచ్చారు. ఆయనతో సినిమా ఎప్పుడో చెప్పలేను. ► మనతో పని చేసేవారు కొన్నిసార్లు తప్పుడు నిర్ణయాలను కూడా పొగుడుతుంటారు. రియల్ పర్సన్స్‌ను కలిసినప్పుడు మనకు రియాలిటీ అర్థమవుతుంది. ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్.. ఇలా సోషల్ మీడియా ద్వారా రియల్ పీపుల్‌ను కలిసే చాన్స్ నాకు లభించింది. సోషల్ మీడియాలో నాకో ఫేక్ ప్రొఫైల్ ఉంది. నెటిజన్ల కామెంట్స్ చదువుతూ నిజాలు తెలుసుకుంటుంటాను. నా సినిమాలకు ప్రేక్షకుల స్పందన ఎలా ఉందనే విషయాలను నా ఫ్రెండ్స్ ద్వారా తెలుసుకుంటుంటాను. ► అనుకోకుండా యాక్టర్ అయ్యాను. ఊహించని విధంగా హిట్స్ పడ్డాయి. అలాగే ఊహించని రీతిలో జాతీయ స్థాయిలో ఆడియన్స్ దృష్టిలో పడ్డాను. ఇదంతా ఎలా జరిగిందో ఆలోచించుకుంటూ ఉంటాను. -
ఆ చాన్స్ మిస్సయినప్పుడు చాలా బాధపడ్డాను: అనుపమా పరమేశ్వరన్
‘‘ప్రేమ లేకుండా ఈ ప్రపంచమే లేదు. భావోద్వేగాలు లేని జీవితమూ ఉండదు. ‘18 పేజెస్’ వంద శాతం స్వచ్ఛమైన ప్రేమకథ. అన్ని వర్గాల వారికీ నచ్చుతుందనే నమ్మకం ఉంది’’ అని హీరోయిన్ అనుపమా పరమేశ్వరన్ అన్నారు. నిఖిల్ సిద్ధార్థ హీరోగా సూర్యప్రతాప్ పల్నాటి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘18 పేజెస్’. డైరెక్టర్ సుకుమార్ కథ అందించారు. అల్లు అరవింద్ సమర్పణలో జీఏ 2 పిక్చర్స్– సుకుమార్ రైటింగ్స్‌పై బన్నీ వాసు నిర్మించిన ఈ సినిమా రేపు (శుక్రవారం) రిలీజవుతోంది. ఈ సందర్భంగా చిత్రకథానాయిక అనుపమా పరమేశ్వరన్ చెప్పిన విశేషాలు.. ► సూర్యప్రతాప్‌గారు చెప్పిన ‘18 పేజెస్’ కథ ఎగ్జయిటింగ్‌గా అనిపించడంతో వెంటనే ఓకే చెప్పాను. ‘కార్తికేయ 2’కి ముందే ‘18 పేజెస్’కి సైన్ చేశాను. ‘కార్తికేయ 2’ అడ్వెంచరస్ మూవీ అయితే ‘18 పేజెస్’ ఫీల్ గుడ్ లవ్‌స్టోరీ. ‘కార్తికేయ 2’ ఇక్కడ సూపర్ హిట్ కావడంతో పాటు హిందీలోనూ ఘనవిజయం సాధించింది. ‘కార్తికేయ 2’ బ్లాక్ బస్టర్ కావడంతో మా జంట (నిఖిల్, అనుపమ)కి మంచి పేరొచ్చింది. ‘18 పేజెస్’ చాలా మంచి సినిమా.. ‘కార్తికేయ 2’లాగే ఈ మూవీ సూపర్ హిట్టవుతుందనే నమ్మకంతో ఉన్నాం. ► సుకుమార్‌గారి ‘రంగస్థలం’ చాన్స్ మిస్సయినప్పుడు చాలా బాధపడ్డాను. అయితే ఏ సినిమా కథ అయినా మనం ఎంచుకోం.. ఆ కథే మనల్ని ఎంచుకుంటుంది. ‘రంగస్థలం’ మిస్ అయినా ఇప్పుడు సుకుమార్‌గారు రాసిన పాత్రలో నటించడం సంతోషంగా ఉంది. ఈ సినిమాలో నేను చేసిన నందిని పాత్ర గుర్తుండిపోతుంది. సుకుమార్‌గారి కథకి సూర్యప్రతాప్‌గారు వందశాతం న్యాయం చేశారు కాబట్టే సినిమా బాగా వచ్చింది. ► ‘18 పేజెస్’లోని లవ్ స్టోరీ నా ఫేవరెట్. వాట్సప్, ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా ట్రెండ్ నడుస్తున్న ఈ టైమ్‌లో మొబైల్ లేకుండా ఒక్క రోజు కూడా చాలామంది ఉండలేరు. అలాంటిది మొబైల్, సోషల్ మీడియా లేకుండా ఉండే ఒక అమాయకమైన నందిని పాత్ర నా మనసుకు బాగా దగ్గరగా అనిపించింది. ► ‘నాకు అనుపమలాంటి కూతురు ఉంటే బాగుండు’ అని అల్లు అరవింద్‌గారు అనడం పెద్ద ఆశీర్వాదంగా భావిస్తున్నాను. ఆయన నన్ను కూతురిలా బాగా చూసుకుంటారు. అందుకే మా కజిన్స్ చాలామంది ఆయన్ని మావయ్యా అని పిలుస్తుంటారు (నవ్వుతూ). బన్నీ వాసుగారు మంచి అభిరుచి ఉన్న నిర్మాత. ► నేను ఒప్పుకున్న సినిమాలన్నీ అయిపోయాక.. నటనకు కొద్ది రోజులు గ్యాప్ తీసుకుని, దర్శకుల వద్ద సాంకేతిక అంశాలపై అవగాహన పెంచుకుని, ఆ తర్వాత డైరెక్షన్ చేస్తాను. వీలు కుదిరినప్పుడల్లా కథ రాస్తున్నాను.. అయితే నా డైరెక్షన్లో నేను నటించను. -
మా గురువు సుకుమార్ అలా కాదు: పల్నాటి సూర్య ప్రతాప్
‘‘చాలామంది ఓ ఐడియా కోసం వర్క్ చేస్తారు. కానీ నా గురువు, నేను అన్నయ్యలా భావించే సుకుమార్‌గారు మాత్రం ఓ కొత్త ఐడియా వచ్చిన తర్వాత దానిపై డెప్త్‌గా వర్క్ చేస్తుంటారు. అలాగే అన్నింటికన్నా కథే గొప్పదని ఆయన అంటారు. నేనూ అదే నమ్ముతాను’’ అన్నారు పల్నాటి సూర్య ప్రతాప్. నిఖిల్, అనుపమా పరమేశ్వరన్ జంటగా నటించిన చిత్రం ‘18 పేజెస్’. దర్శకుడు సుకుమార్ అందించిన కథతో పల్నాటి సూర్యప్రతాప్ దర్శకత్వంలో అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 23న విడుదల కానుంది. ఈ సందర్భంగా విలేకర్ల సమావేశంలో పల్నాటి సూర్యప్రతాప్ మాట్లాడుతూ.. ‘‘ఈ సినిమాలో కేవలం ప్రేమకథే కాదు.. విభిన్న రకాల భావోద్వేగాలు ఉన్నాయి. అలాగే ఫన్, థ్రిల్లింగ్ అంశాలు ఉన్నాయి. అందుకే ఇది రొటీన్ లవ్‌స్టోరీ కాదని చెబుతున్నాం. సినిమా చూస్తున్నంత సేపూ ప్రేక్షకులు ఇందులోని క్యారెక్టర్స్‌తో ట్రావెల్ అవుతుంటారు. కొన్ని సందర్భాల్లో తమ జీవితంలో జరిగిన సంఘటనలు గుర్తు చేసుకునే అవకాశం ఉంటుంది. ఇక నిఖిల్, అనుపమ అద్భుతంగా నటించారు. గీతా ఆర్ట్స్‌లో సినిమా చేస్తున్నానని దర్శకులు గౌరవంగా చెప్పుకుంటారు. అలాంటి బ్యానర్ అది. కొంత గ్యాప్ తర్వాత ‘18 పేజెస్’ సినిమాతో దర్శకుడిగా వస్తున్న నాకు ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చారు అల్లు అరవింద్‌గారు. ఈ సినిమా ఎండింగ్ పాజిటివ్‌గా ఉంటుంది’’ అన్నారు. ఇంకా మాట్లాడుతూ.. ‘‘కుమారి 21ఎఫ్’ చిత్రం తర్వాత దాదాపు ఏడేళ్లకు నా దర్శకత్వంలో వస్తున్న సినిమా ఇది. నేను కావాలని గ్యాప్ తీసుకోలేదు. ‘కుమారి 21ఎఫ్’ తర్వాత రైటింగ్ గురించి ఇంకా నేర్చుకోవాలని నా గురువు సుకుమార్‌గారి దగ్గర చేరాను. ఆయన నుంచి ఎంతో నేర్చుకున్నాను. అయితే దర్శకుడిగా ఇక నాకు గ్యాప్ ఉండకూడదని మేం నిర్ణయించుకున్నాం. సుకుమార్‌గారు, నేను అనుకున్న కథలు మూడు ఉన్నాయి. నేనూ ఓ కథ అనుకున్నాను. నా తర్వాతి చిత్రం మైత్రీ మూవీస్‌లో ఉంటుంది. అలాగే సితార ఎంటర్ టైన్మెంట్స్‌లో ఓ కమిట్మెంట్ ఉంది’’ అన్నారు. -
ఎరుపెక్కిన అందాలతో అనుపమ ( ఫోటోలు )