
బాక్సాఫీస్ వద్ద సంక్రాంతి సందడి ముగిసిపోయింది. ఈ జనవరి చివరి వారంలో డిజిటల్ ప్రియులను ఆకట్టుకునేందుకు ఓటీటీలు సిద్ధంగా ఉన్నాయి. ఆహా, నెట్ ఫ్లిక్స్, అమెజాన్, హాట్ స్టార్, జీ5లు ఈ వారంలో ఫుల్ ఎంటర్‌టైన్ అందించేందుకు పలు కొత్త చిత్రాలను రిలీజ్‌కు సిద్ధం చేశాయి. వాటిలో ’18 పేజెస్’, యాన్ యాక్షన్ హీరో హిందీ చిత్రంతో పాటు త్రిష తమిళ మూవీ రాంగీలు ఉన్నాయి. వీటితో పాటు మరిన్ని సినిమాలు కూడా ఓటీటీలోకి రాబోతున్నాయి. ఈ ఒక్క వారమే దాదాపు 20 సినిమాలు డిజిటల్ వేదికగా స్ట్రీమింగ్ కాబోతున్నాయి. మరి ఆ సినిమాలేంటో చూసేద్దాం..
నిఖిల్ సిద్దార్థ్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన చిత్రం 18 పేజెస్. గతేడాది డిసెంబర్ 23న థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్‌తో పాటు మంచి వసూళ్లే వచ్చాయి. ఫీల్ గుడ్ లవ్‌స్టోరీగా తెరకెక్కిన ఈ సినిమా ఓటీటీ హక్కులను అటు ఆహా, ఇటు నెట్‌ఫ్లిక్స్ రెండూ చేజిక్కించుకున్న విషయం తెలిసిందే! అయితే ముందుగా 18 పేజెస్ ఆహాలో రిలీజ్ కాబోతుంది. జనవరి 27 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కానున్నట్లు రీసెంట్‌గా ఆహా అధికారిక ప్రకటన ఇచ్చింది.
యాన్ యాక్షన్ హీరో:
ఆయుష్మాన్ ఖురానా ప్రధాన పాత్రలో అనిరుధ్ అయ్యర్ తెరకెక్కించిన చిత్రం ‘యాన్ యాక్షన్ హీరో’. గతేడాది డిసెంబరులో థియేటర్లలో విడుదలై ఈ చిత్రం హిందీ ప్రేక్షకులను అలరించిన జనవరి 27 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది.
నెట్ ఫ్లిక్స్:
- నార్విక్ (ఇంగ్లీష్ సినిమా) – జనవరి 23
- బ్లాక్ షన్ షైన్ బేబీ (హిందీ డాక్యుమెంటరీ) – జనవరి 24
- ఎగైనెస్ట్ ద రోప్స్ (స్పానిష్ వెబ్ సిరీస్) – జనవరి 25
- బాడీస్ బాడీస్ బాడీస్ (ఇంగ్లీష్ మూవీ) – జనవరి 25
- డేనియల్ స్పెల్ బౌండ్ (సీజన్ 2) – జనవరి 26
- 18 పేజెస్ (తెలుగు మూవీ) – జనవరి 27
- యాన్ యాక్షన్ హీరో (హిందీ మూవీ) – జనవరి 27
- యూ పీపుల్ (ఇంగ్లీష్ సినిమా) – జనవరి 27
- లాక్ వుడ్ అండ్ కో (ఇంగ్లీష్ సిరీస్) – జనవరి 27
- ద ఇన్విటేషన్ (ఇంగ్లీష్ మూవీ) – జనవరి 28
- రాంగీ (తమిళ సినిమా) – జనవరి 29
జీ 5:
- అయలీ (తెలుగు సిరీస్) – జనవరి 26
- జన్ బాజ్ హిందుస్థాన్ కే (హిందీ సిరీస్) – జనవరి 26
- అమెజాన్ ప్రైమ్:
- ఎంగ్గా హాస్టల్ (తమిళ సినిమా) – జనవరి 27
- షాట్ గన్ వెడ్డింగ్ (ఇంగ్లీష్ సినిమా) – జనవరి 27
యాపిల్ టీవీ ప్లస్:
- స్రింకింగ్ (ఇంగ్లీష్ సిరీస్) – జనవరి 27
డిస్నీ ప్లస్ హాట్ స్టార్:
- ఎక్స్ ట్రార్డినరీ (ఇంగ్లీష్ సిరీస్) – జనవరి 25
- డియర్ ఇష్క్ (హిందీ సిరీస్) – జనవరి 26
- శాటర్ డే నైట్ (మలయాళం మూవీ) – జనవరి 27
Comments
Please login to add a commentAdd a comment