నిఖిల్‌, అనుపమ ‘18 పేజిస్‌’ నుంచి మరో మేలోడి సాంగ్‌ | Yedurangula Vaana Lyrical Song Release From Nikhil 18 Pages Movie | Sakshi
Sakshi News home page

18 Pages Movie: నిఖిల్‌, అనుపమ ‘18 పేజిస్‌’ నుంచి మరో మేలోడి సాంగ్‌

Published Mon, Dec 12 2022 10:04 AM | Last Updated on Mon, Dec 12 2022 10:04 AM

Yedurangula Vaana Lyrical Song Release From Nikhil 18 Pages Movie - Sakshi

నిఖిల్ సిద్ధార్థ్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటిస్తున్న తాజా చిత్రం '18 పేజిస్'. ఈ సినిమాను జీఏ 2 పిక్చర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని బన్నీ వాసు నిర్మిస్తుండగా.. మెగా నిర్మాత అల్లు అరవింద్ సమర్పిస్తున్నారు. ఈ చిత్రానికి పాన్ ఇండియా డైరెక్టర్ సుకుమార్ కథను అందించారు.  సూర్యప్రతాప్ పల్నాటి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి ఓ క్రేజీ అప్‌డేట్ వచ్చింది. ఈ సినిమాలోని 'ఏడురంగుల వాన' అనే పాటను తాజాగా చిత్రం విడుదల చేసింది. 

చదవండి: అనుపమ పరమేశ్వరన్‌పై నిర్మాత అల్లు అరవింద్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

‘ఏడు రంగులు వాన..  రెండు కళ్ళల్లోన.. కారణం ఎవరంటే..’ అంటూ సాగే ఈ పాట ఆదివారం అగ్ర నిర్మాత అల్లు అరవింద్‌ రిలీజ్‌ చేశారు. ఈ పాటకు శ్రీమణి సాహిత్యం అందించగా.. సిద్ శ్రీ రామ్ ఆలపించాడు. అరవింద్‌ మాట్లాడుతూ.. ‘‘ఒక విచిత్రమైన లవ్‌ స్టోరీ చేద్దామంటూ సుకుమార్‌ నాతో చెప్పడంతో ‘18 పేజెస్‌ తీశాం. ఇది మామూలు ప్రేమకథ కాదు’’ అన్నారు. ‘‘జానపద పాటలు రాసే తిరుపతిగారిని ఈ సినిమాతో పాటల రచయితగా లాంచ్‌ చేస్తున్నాం’’ అన్నారు బన్నీ వాసు. ‘‘గీతా ఆర్ట్స్‌లో డైరెక్షన్‌ చేయడం పెద్ద గౌరవంగా భావిస్తున్నాను’’ అన్నారు సూర్యప్రతాప్‌ పల్నాటి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement