anupama Parameswaran
-
అనుపమ పరమేశ్వరన్ ప్రేమలో మోసపోయిందా?
తమిళసినిమా: మాలీవుడ్‌లో కంటే టాలీవుడ్ లోనే ఎక్కువ చిత్రాలు చేస్తూ స్టార్ హీరోయిన్గా రాణిస్తున్న మలయాళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్. ప్రేమవ్ు అనే చిత్రం ద్వారా ముగ్గురు కథానాయకిల్లో ఒకరిగా పరిచయమైన ఈమెను ఆ చిత్ర విజయం దక్షిణాది నటిగా మార్చేసింది. ఆ తర్వాత మాతృభాషలోనే కాకుండా తెలుగు, తమిళం భాషల్లోనూ అవకాశాలు వరుసగట్టాయి. అయితే ఎక్కువగా తెలుగులోనే ఈమె నటించిన చిత్రాలు సక్సెస్ కావడంతో అక్కడ స్టార్ ఇమేజ్ను సంపాదించుకుంది. ఇకపోతే డీజే టిల్లు చిత్రానికి ముందు వరకు పక్కింటి అమ్మాయి ఇమేజ్ను సొంతం చేసుకున్న అనుపమ పరమేశ్వరన్ ఆ చిత్రంలో అందాలను ఆరబోయడంతో పాటు లిప్‌లాక్ సన్నివేశాలలో నటించి తనలోని గ్లామర్ కోణాన్ని తెరపై విచ్చలవిడిగా ఆవిష్కరించింది. అయితే తమిళంలో ధనుష్ జంటగా కోడి చిత్రంతో కథానాయకిగా పరిచయం అయింది. కోలీవుడ్‌లో ఈ అమ్మడికి ఆశించిన విజయాలు రాలేదు. ఇటీవల జయం రవి సరసన నటించిన సైరన్ చిత్రం కూడా పూర్తిగా నిరాశపరిచింది. ఇలాంటి పరిస్థితుల్లో అనుపమ పరమేశ్వరన్ ఒక భేటీలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.‘‘ఎప్పుడు నిన్నే ప్రేమిస్తున్నాను అని చెప్పడం శుద్ధ అబద్ధం. అదేవిధంగా నువ్వే నా ప్రాణం నువ్వు లేక నేను లేను అనే ప్రేమలో చిక్కుకున్న వారు వెంటనే అందులోంచి బయటపడండి’’ అని నటి అనుపమ పరమేశ్వరన్ పేర్కొన్నారు. దీంతో అమ్మడు ప్రేమలో మోసపోయిందా? ఆ చేదు అనుభవంతోనే ఇలాంటి వ్యాఖ్యలు చేసిందా? అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. -
Anupama Parameswaran: 2025లో అనుపమ పరమేశ్వరన్ ఫస్ట్ పోస్ట్ ఇదే! (ఫోటోలు)
-
మెరిసే... మురిసే...
సిల్వర్ స్క్రీన్‌పై మెరుపులా మెరవడానికి మెరుపు తీగల్లాంటి కథానాయికలు జోరుగా హుషారుగా సినిమాలు చేస్తుంటారు. ఒకే ఏడాది మూడు ఆపై ఎక్కువసార్లు తెరపై మెరిసే చాన్స్ వస్తే వాళ్ల ఆనందం పట్టలేనంతగా ఉంటుంది. ఈ ఏడాది అలా మినిమమ్ మూడు చిత్రాలతో తెలుగులో మెరిసి, కెరీర్ బాగున్నందుకు మురిసిపొయిన కథానాయికల గురించి తెలుసుకుందాం.2024లో తెలుగు తెరపై మీనాక్షీ చౌదరి హవా కనిపించింది. మహేశ్‌బాబు ‘గుంటూరు కారం’, దుల్కర్ సల్మాన్ ‘లక్కీ భాస్కర్’, వరుణ్ తేజ్ ‘మట్కా’, విశ్వక్ సేన్ ‘మెకానిక్ రాకీ’ చిత్రాలతో మీనాక్షీ చౌదరి వెండితెరపై కనిపించారు. అంతేనా... తమిళ హీరో విజయ్ ‘గోట్: ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’ తెలుగులో అనువాదమై, ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలోనూ ఓ లీడ్ రోల్ చేశారు మీనాక్షి. ‘లక్కీ భాస్కర్, మట్కా, మెకానిక్ రాకీ’ చిత్రాలు నెల రోజుల గ్యాప్‌లో విడుదల కావడం విశేషం. ఇక ‘గుంటూరు కారం, లక్కీ భాస్కర్, మెకానిక్ రాకీ, గోట్’ చిత్రాలు హిట్స్‌గా నిలిచాయి.మరోవైపు తెలుగు అమ్మాయి అనన్య నాగళ్ల ఈ ఏడాది మంచి జోరు కనబరిచారు. హారర్ మూవీ ‘తంత్ర’లో లీడ్ రోల్ చేసి, రూరల్ యాక్షన్ ఫిల్మ్ ‘΄÷ట్టేల్’లో గృహిణిగా భావోద్వేగభరితమైన పాత్ర చేశారు. ప్రియదర్శి–నభా నటేష్ లీడ్ రోల్స్‌లో నటించిన ‘డార్లింగ్’లోనూ డాక్టర్‌గా ఓ లీడ్ రోల్ చేశారీ బ్యూటీ. అలాగే నేడు విడుదలవుతోన్న ‘శ్రీకాకుళం షెర్లాక్‌హోమ్స్’ చిత్రంలోనూ ఓ లీడ్ చేశారు. ఇలా అనన్య ఈ ఏడాది నాలుగుసార్లు ప్రేక్షకుల ముందుకు వచ్చినట్లవుతుంది. ఇక ముంబై బ్యూటీ కావ్యా థాపర్ కూడా తెలుగు ప్రేక్షకులను ఈ ఏడాది తరచూ పలకరిస్తూ వచ్చారు.రవితేజ ‘ఈగిల్’, సందీప్ కిషన్ ‘ఊరు పేరు భైరవకోన, రామ్ ‘డబుల్ ఇస్మార్ట్’, గోపీచంద్ ‘విశ్వం’ చిత్రాల్లో కావ్యా థాపర్ కనిపించారు. ఓ మంచి కమర్షియల్ హీరోయిన్గా ఈ ఏడాది తెలుగు ఆడియన్స్‌ను అలరించారు కావ్యా థాపర్. మరోవైపు హీరోయిన్గా పరిచయమైన తొలి ఏడాదే మూడు సినిమాలతో సత్తా చాటారు యువ హీరోయిన్ నయన్ సారిక. ఆనంద్ దేవరకొండ ‘గం గం గణేశా’, నార్నే నితిన్ ‘ఆయ్’, కిరణ్ అబ్బవరం ‘క’ చిత్రాల్లో హీరోయిన్గా చేశారీ బ్యూటీ.నయన్ చేసిన ఈ మూడు చిత్రాలకు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ రావడం ఆమె కెరీర్‌కు బలం చేకూరినట్లయింది. ఇక హీరోయిన్గా కాదు కానీ... కథను ఇంపాక్ట్ చేసే పాత్రల్లో రుహానీ శర్మ కనిపించారు. వెంకటేశ్ ‘సైంధవ్’, వరుణ్ తేజ్ ‘ఆపరేషన్ వాలెంటైన్’, సుహాస్ ‘శ్రీరంగనీతులు’ చిత్రాల్లో రుహానీ మంచి పాత్రలు చేశారు. ‘లవ్ మీ’ చిత్రంలో ఓ చిన్న గెస్ట్ రోల్లో కూడా కనిపించారు రుహానీ. ఇలా ఈ ఏడాది తెలుగు ప్రేక్షకులను తరచూ పలకరించిన మరికొంతమంది హీరోయిన్లు ఉన్నారు.విలన్‌గానూ విజృంభించారు సిద్ధు జొన్నలగడ్డ ‘డీజే టిల్లు స్క్వేర్’లో స్పై ఏజెంట్ లిల్లీ జోసెఫ్‌గా, రవితేజ ‘ఈగిల్’లో జర్నలిస్ట్ నలినీ రావుగా కనిపించారు అనుపమా పరమేశ్వరన్. అయితే ‘డీజే టిల్లు 2’లో కాస్త నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో అనుపమ నటించడం విశేషం. ఈ తరహాలోనే మరో హీరోయిన్ శ్రద్ధా శ్రీనాథ్ తొలిసారి నెగటివ్ షేడ్స్ ఉన్న అప్సర ఆలియాస్ మాయ పాత్రను విశ్వక్ సేన్ ‘మెకానిక్ రాకీ’ సిని మాలో చేశారు. ఈ బ్యూటీయే వెంకటేశ్ ‘సైంధవ్’లో మనోజ్ఞ అనే సెంటిమెంట్ రోల్లో కనిపించడం విశేషం. మహేశ్‌బాబు ‘గుంటూరు కారం’లో హీరోయిన్గా చేసిన శ్రీలీల, అల్లు అర్జున్ ‘పుష్ప: ది రూల్’లో స్పెషల్ సాంగ్ ‘కిస్సిక్’లో మెరిశారు. ఈ సినిమాలో రష్మికా మందన్నా హీరోయిన్గా నటించిన విషయం తెలిసిందే. ఈ ఏడాది తెలుగులో రష్మిక కనిపించిన చిత్రం ఇదొక్కటే. విజయ్ దేవరకొండ ‘ఫ్యామిలీ స్టార్’తో మృణాల్ ఠాకూర్ (‘కల్కి 2898 ఏడీ’లో ఓ గెస్ట్ రోల్ చేశారు), శర్వానంద్ ‘మనమే’లో ఐటీ ఉద్యోగిగా కృతీ శెట్టి, ఫ్యామిలీ డ్రామా ‘35: చిన్న కథ కాదు’లో గృహిణి సరస్వతిగా నివేదా థామస్‌ల నుంచి ఈ ఏడాది ఒక్క చిత్రమే తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగు ప్రేక్షకులకు సుపరిచితులైన అనుష్క, సమంత, సాయి పల్లవి, పూజా హెగ్డే, కీర్తీ సురేష్ వంటి హీరోయిన్లు ఇతర భాషల చిత్రాలతో బిజీగా ఉండటం వల్ల ఈ ఏడాది తెలుగులో కనిపించలేదు. ఇక ఈ ఏడాది దీపికా పదుకోన్, భాగ్యశ్రీ భోర్సే, రుక్మిణీ వసంత్... ఇలా దాదాపు 20మంది హీరోయిన్లు తెలుగుకు పరిచయం అయ్యారు. – ముసిమి శివాంజనేయులు -
ఫ్యాషన్ మ్యాగజీన్ వోగ్ (Vogue) కవర్ పేజీపై మెరిసిన నటి (ఫోటోలు)
-
ఓనమ్ స్పెషల్: కసావు చీర... కాటుక కళ్లు...
ఓనమ్ పండగకి కళకళలాడిపోయారు తారలు. పండగ ప్రత్యేకమైన కసావు చీర కట్టుకుని, సంప్రదాయ నగలు పెట్టుకుని, కళ్లకు కాటుక పెట్టుకుని మెరిసిపోయారు. ఆ ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశారు. అమ్మ చీర కట్టుకుని, కొప్పున పువ్వులు పెట్టుకుని అందంగా ముస్తాబైన అనుపమా పరమేశ్వరన్ ‘ఇవాళ ఓనమ్ పెన్నే...’ అంటూ పలు ఫొటోలను షేర్ చేశారు.భర్త జగత్ దేశాయ్, కుమారుడు ఇలయ్తో కలిసి ఉన్న ఫొటోను షేర్ చేశారు అమలా పాల్. ‘ఇవాళ ఓనమ్ థీమ్ ఏంటంటే పాయసమ్’ అంటూ చిరునవ్వులు చిందిస్తున్న ఫొటోను షేర్ చేశారు కల్యాణీ ప్రియదర్శన్. భర్త, హీరో గౌతమ్ కార్తీక్‌తో కలిసి పండగ చేసుకున్నారు మంజిమా మోహన్. ఓనమ్ పండగకి అంబారీ స్వారీ చేయకపోతే ఎలా అంటూ నటుడు కాళిదాస్ జయరాం సందడి చేశారు. చేతిలో కలువ పువ్వు పట్టుకుని అనిఖా సురేంద్రన్, మియా జార్జ్ కనువిందు చేశారు. జడకు తామర పువ్వు పెట్టుకుని ప్రెట్టీగా అన్నా బెన్, జుత్తుకి మల్లెలు చుట్టి బ్యూటిఫుల్‌గా మిర్నా మీనన్, అరిటాకులో పువ్వులు పెట్టి చిరునవ్వుతో అందంగా మహిమా నంబియార్, సింపుల్‌గా స్టిల్ ఇచ్చినా సూపర్‌గా కనిపించిన అతుల్యా రవి, అంతే అందంగా కనిపిం చిన అనంతికా సనీల్‌కుమార్, నవ్యా నాయర్... ఇలా ఎవరికి వారు చక్కగా రెడీ అయి, ‘ఓనమ్ శుభాకాంక్షలు’ తెలిపారు. -
ఓనం స్పెషల్.. మలయాళ బ్యూటీస్ మామూలుగా లేరు!
మలయాళీలు ఎంతో ఇష్టంగా జరుపుకొనే ఓనం వచ్చేసింది. కేరళలో అందరూ వేడుకగా దీన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. మరీ మలయాళ బ్యూటీస్ ఊరుకుంటారా? పద్ధతైన చీరల్లో మెరిసిపోయారు. అందమే అసూయపడేలా ధగధగాలాడిపోయారు. అనుపమ, అమలాపాల్, కల్యాణి ప్రియదర్శన్, మాళవిక మోహనన్, హనీరోజ్, మమిత బైజు.. ఇలా అందరూ తమ అందంతో మాయ చేసేస్తున్నారు. ఆ ఫొటోలపై మీరు లుక్కేసేయండి.(ఇదీ చదవండి: బిగ్ బాస్ 8లో రెండో ఎలిమినేషన్.. కొత్త ట్విస్ట్) View this post on Instagram A post shared by Anupama Parameswaran (@anupamaparameswaran96) View this post on Instagram A post shared by Rukshar Dhillon (@rukshardhillon12) View this post on Instagram A post shared by Amala Paul (@amalapaul) View this post on Instagram A post shared by Mamitha Baiju (@mamitha_baiju) View this post on Instagram A post shared by Anikha surendran (@anikhasurendran) View this post on Instagram A post shared by Manjima Mohan (@manjimamohan) View this post on Instagram A post shared by Priya Prakash Varrier✨ (@priya.p.varrier) View this post on Instagram A post shared by Anu Emmanuel (@anuemmanuel) View this post on Instagram A post shared by Honey Rose (@honeyroseinsta) View this post on Instagram A post shared by @studio.omal View this post on Instagram A post shared by Malavika Mohanan (@malavikamohanan_) View this post on Instagram A post shared by Mirnaa (@mirnaaofficial) View this post on Instagram A post shared by Bhavana🧚🏻♀️Mrs.June6 (@bhavzmenon) View this post on Instagram A post shared by NAMITHA PRAMOD (@nami_tha_) View this post on Instagram A post shared by Navya Nair (@navyanair143) View this post on Instagram A post shared by Sanjana Singh (@actresssanjana) View this post on Instagram A post shared by Ritika_nayak (@ritika_nayak__) View this post on Instagram A post shared by Kalyani Priyadarshan (@kalyanipriyadarshan) View this post on Instagram A post shared by Anjali Nair (@ianjali.nair) View this post on Instagram A post shared by Anna Ben 🌸 (@benanna_love) View this post on Instagram A post shared by Gouri G Kishan (@gourigkofficial) View this post on Instagram A post shared by Gouri G Kishan (@gourigkofficial) View this post on Instagram A post shared by Ivana (@i__ivana_) View this post on Instagram A post shared by Athulyaa Ravi (@athulyaofficial) View this post on Instagram A post shared by S H E ♾️ (@anaswara.rajan) View this post on Instagram A post shared by Ammu_Abhirami (@abhirami_official) View this post on Instagram A post shared by Saniya Iyappan (@_saniya_iyappan_) View this post on Instagram A post shared by Femina⚡️George (@feminageorge_) -
Anupama Parameswaran: కొంగు చాటు అందాలతో అనుపమ పరమేశ్వరన్ (ఫోటోలు)
-
Anupama Parameswaran: ఉఫ్.. వర్షంలోనూ చెమటలు పట్టిస్తున్న బ్యూటీ (ఫోటోలు)
-
లిప్‌లాక్‌కు రెడీ!
ఈతరం కథానాయకులు దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలనే భావనతో ఉన్నారు. అవకాశాలు వచ్చేవరకు వాటి కోసం తంటాలు పడుతున్నారు. అవకాశాలు వస్తుంటే పారితోషకాలు పెంచే ఆలోచనలో ఉంటున్నారు. పైకి మాత్రం పాత్రలు నచ్చితేనే అంగీకరిస్తున్నట్లు చెబుతున్నారు. అయితే వచ్చిన అవకాశాన్ని మాత్రం ఎలాంటిదైనా వదులుకోవడానికి సిద్ధపడడం లేదు. చాలామంది హీరోయిన్లది ఇదే తంతు. అనుపమ పరమేశ్వరన్ కూడా ఇందుకు అతీతం కాదనే ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. మలయాళ చిత్రం ప్రేమమ్ చిత్రంలో ముగ్గురు కథానాయికల్లో ఒకరిగా పరిచయమైన నటి బ్యూటీ. ఆ తర్వాత తెలుగు, తమిళం భాషల్లో వరుసగా అవకాశాలు రావడంతో బిజీగా మారారు. అయితే ఆరంభంలో మంచి కుటుంబ కథా చిత్రాల్లో నటించి పక్కింటి అమ్మాయి ఇమేజ్ తెచ్చుకున్నారు. అలా తెలుగులో కార్తికేయ 2 చిత్రం వరకు అనుపమ పరమేశ్వరన్ తన పక్కింటి అమ్మాయి ఇమేజ్ను కంటిన్యూ చేస్తూ వచ్చారు. ఆ తర్వాత అవకాశాలు తగ్గడంతో అందాల ఆరిబోతకు గేట్లు ఎత్తేశారు. అలా ఇటీవల ఈమె టిల్లు స్క్వేర్ చిత్రంలో అందాలారబోతలో విజృంభించేశారు. ఇక లిప్‌లాక్ సన్నివేశాల్లోనూ రక్తి కట్టించారు. ఇలాంటి పరిస్థితుల్లో ఒక నిర్మాతకు అనుపమ పరమేశ్వరన్ గట్టిగానే షాక్ ఇచ్చారన్న ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఒక చిత్రంలో కథానాయకగా నటించడానికి నిర్మాత అనుపమ పరమేశ్వరన్‌ను సంప్రదించగా, కనీసం కథ కూడా వినకుండా. పాత్ర ఎలాంటిదైనా సరే పారితోషికం మాత్రం కోటి కావాలంటూ డిమాండ్ చేశారట. దీంతో నిర్మాత అక్కడి నుంచి తిరుగు ముఖం పట్టారు. అనుపమాకు తెలుగులో హిట్ చిత్రాలు ఉన్నాయి, కానీ తమిళనాడు మాత్రం ఇంకా మంచి సక్సెస్ కోసం పోరాడుతున్న నటినే. అలాంటి నటి కోటి పారితోషికం డిమాండ్ చేస్తే ఏ నిర్మాత అయినా చేసే పని ఇదే అంటూ సోషల్ మీడియాలో న్యూస్ చక్కర్లు కొడుతోంది. -
థ్రిల్లింగ్ కాన్సెప్ట్‌తో బెల్లంకొండ శ్రీనివాస్ కొత్త సినిమా
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కొంత కాలం పాటు సినిమాలకు గ్యాప్ ఇచ్చారు. దాదాపు మూడేళ్ల తర్వాత మళ్లీ వెండితెరపై మెరిసేందుకు అడుగులు వేస్తున్నారు. చివరిగా బాలీవుడ్లో ఛత్రపతి సినిమాలో నటించిన ఆయన కొన్ని రోజుల క్రితం టైసన్ నాయుడు చిత్రాన్ని ప్రారంభించారు. అయితే, తాజాగా #BSS11 పేరుతో మరో కొత్త ప్రాజెక్ట్‌ను ఆయన పట్టాలెక్కించారు.బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ మరోసారి ఈ సినిమాలో జోడిగా కనిపించనున్నారు. గతంలో వారిద్దరూ 'రాక్షసుడు' సినిమాలో నటించిన విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని కౌశిక్ పెగళ్లపాటి దర్శకత్వం వహించనున్నారు. 'చావు కబురు చల్లగా' అనే సినిమాను ఆయన డైరెక్ట్ చేసి గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ సినిమాను శ్రీమతి అర్చన సమర్పణలో షైన్ స్క్రీన్స్ ప్రొడక్షన్ నెం 8 పేరుతో సాహు గారపాటి ప్రొడ్యూస్ చేస్తున్నారు. తాజాగా అన్నపూర్ణ స్టూడియోస్‌లో #BSS11 ప్రాజెక్ట్‌కు సంబంధించిన పూజా కార్యక్రమం జరిగింది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ అందరినీ మెప్పించేలా ఉంది. హారర్-మిస్టరీ కథాంశంతో తెరకెక్కనున్న ఈ సినిమాపై ఫ్యాన్స్‌లో భారీ అంచనాలు ఉన్నాయి. వచ్చే ఏడాదిలో ఈ సినిమా విడుదల కానుంది. -
జెట్ స్పీడ్‌తో...
తమిళంలో మరో కొత్త సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు హీరోయిన్ అనుపమా పరమేశ్వరన్ . ఇప్పటికే ఈ యంగ్ బ్యూటీ ప్రస్తుతం ‘బైసన్ ’, ‘లాక్డౌన్ ’ అనే రెండు తమిళ చిత్రాలతో బిజీగా ఉన్నారు. తాజాగా ‘లవ్‌టుడే’ ఫేమ్ ప్రదీప్ రంగనాథన్ హీరోగా అశ్వత్ మరిముత్తు దర్శకత్వంలో రూపొందుతున్న తమిళ సినిమా ‘డ్రాగన్ ’లో ఓ హీరోయిన్ గా అనుపమ నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఓ కాలేజీలో ప్రదీప్–అనుపమల మధ్య చిత్రీకరిస్తున్న రొమాంటిక్ సన్నివేశాల విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్స్ సంస్థ ఈ సినిమా నిర్మిస్తోంది. ఇదిలా ఉంటే.. అనుపమ నటించిన ‘జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ, ది పెట్ డిటెక్టివ్’, పరదా’ చిత్రాలు విడుదలకు సిద్ధం అవుతున్నాయి. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ‘ఆక్టోపస్’ (ప్రచారంలో ఉన్న టైటిల్), బెల్లకొండ సాయిశ్రీనివాస్ ‘కిష్కిందపురి’ (ప్రచారంలో ఉన్న టైటిల్) చిత్రాల్లో ఆమె నటిస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. ఇలా అరడజనుకుపైగా సినిమాలతో అనుపమా జెట్ స్పీడ్‌తో దూసుకెళుతున్నారు. -
ఈ నెలలోనే లాక్డౌన్!
ఈ నెలలోనే లాక్డౌన్ అంటున్నారు హీరోయిన్ అనుపమా పరమేశ్వరన్. కానీ కంగారు పడవలసిన అవసరం ఏమీ లేదు. ఎందుకంటే... ఆమె చెబుతున్నది ‘లాక్డౌన్’ సినిమా గురించి. అనుపమా పరమేశ్వరన్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘లాక్డౌన్’. ఏఆర్ జీవాను దర్శకుడిగా పరిచయం చేస్తూ లైకా ప్రోడక్షన్స్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెలలోనే విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు మేకర్స్.కాగా ఈ సినిమాలో అనిత అనే పాత్రలో అనుపమా పరమేశ్వరన్ నటించినట్లుగా తెలుస్తోంది. లాక్డౌన్లో చిక్కుకుపోయి కష్టాలు పడుతున్న ఓ యువతి నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందట. లాక్డౌన్ కష్టాలతోపాటు కరోనా వైరస్ గురించిన అంశాలను ఈ సినిమాలో కాస్త సీరియస్‌గానే చూపిస్తారనే టాక్ కోలీవుడ్‌లో వినిపిస్తోంది. చార్లీ, నిరోషా, ప్రియా వెంకట్, లివింగ్స్టన్, ఇందుమతి, రాజ్‌కుమార్ కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమాకు ఎన్ఆర్ రఘునందన్, సిద్ధార్థ్ విపిన్ సంగీతం అందించారు. ఈ సినిమాకు కెమెరా: వీజే సాబు జోసెఫ్. -
అనుపమ 'లాక్డౌన్' టీజర్ విడుదల
టాలీవుడ్లో 'టిల్లు స్వేర్' చిత్రంతో ఇటీవలే మంచి విజయాన్ని దక్కించుకుంది మలయాళీ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్. ఈ చిత్రంలో స్క్రీన్‌పై హాట్‌గా కనిపించడమే కాకుండా తనలోని సరికొత్త టాలెంట్‌ను తెరపై చూపించింది. ఇప్పుడు లేడీ ఓరియెంటెడ్ సినిమాల బాటలో అనుపమ దూసుకురానుంది. ఈ క్రమంలో లాక్డౌన్,పరదా వంటి చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు రానుంది.తాజాగా అనుపమ పరమేశ్వరన్ నటించిన లాక్డౌన్ చిత్రం నుంచి టీజర్ విడుదలైంది. అయితే, తమిళ్లో తెరకెక్కుతున్న ఈ చిత్రం తెలుగులో కూడా విడుదల కానుంది. ఈ మూవీకి ఏ.ఆర్.జీవా దర్శకత్వం వహిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ తెరకెక్కిస్తుంది. లాక్డౌన్ నేపథ్యంలో థ్రిల్లర్ కథాంశంతో సరికొత్తగా ఉండే స్క్రీన్‌ప్లేతో ఈ చిత్రం ఉంటుందని చిత్ర యూనిట్ తెలిపింది. ప్రస్తుతం విడుదలైన లాక్డౌన్ టీజర్ నిమిషంలోపే ఉన్నప్పటికీ కాస్త ఆసక్తిగానే సాగుతుంది. తెలుగులో పరదా అనే చిత్రంతో పాటు తమిళంలో 'బైసన్ కాలమాదన్' అనే తమిళ చిత్రంలో కూడా అనుపమ పరమేశ్వరన్ నటిస్తుంది. ఇలా వరుస సినిమాలతో ఈ బ్యూటీ బిజీగా ఉంది. -
ప్రదీప్ రంగనాథన్‌తో ఆ ఇద్దరు హీరోయిన్లు రొమాన్స్
ఏ రంగంలోనైనా లక్ ఉంటే ఆ కిక్కే వేరబ్బా. సహాయ దర్శకుడిగా ఎలాంటి కష్టాలు పడ్డారో తెలియదుగానీ, దర్శకుడైన తరువాత ప్రదీప్ రంగనాథన్‌కు లక్ తేనె తుట్టులా పట్టుకుంది. ఈయన జయంరవి కథానాయకుడిగా నటించిన కోమాలి అనే చిత్రంతో దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఆ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. ఆ తరువాత రెండో చిత్రంతోనే కథానాయకుడిగా అవతారమెత్తి స్వీయ దర్శకత్వంలో లవ్ టుడే చిత్రాన్ని తెరకెక్కించారు. ఆ చిత్రం అనూహ్య విజయాన్ని సాధించింది. అంతే వరుసగా హీరో అవకాశాలు తలుపు తడుతున్నాయి. ప్రస్తుతం ఒకేసారి రెండు చిత్రాలు చేస్తున్నారు. అందులో ఒకటి విఘ్నేశ్‌శివన్ దర్శకత్వంలో నటిస్తున్న ఎల్ఐసీ చిత్రం. ఈ చిత్రానికి ప్రదీప్ రంగనాథన్ రూ.20 కోట్లు పారితోషికం తీసుకుంటున్నట్లు ప్రచారం హోరేత్తుతోంది. ఈ చిత్ర షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటిస్తున్న మరో చిత్రం డ్రాగన్. ఈ చిత్ర షూటింగ్ పూర్తి కాకముందే అశ్వంత్ మారిముత్తు దర్శకత్వంలో డ్రాగన్ అనే చిత్రంలో నటించడానికి కమిట్ అయ్యారు. ఈ చిత్ర షూటింగ్ ఇటీవల ప్రారంభమై తొలి షెడ్యూల్‌ను పూర్తిచేసుకుంది. ఈ చిత్రంలోనే ఆయన సరసన ఇద్దరు సెన్సేషనల్ హీరోయిన్లు రొమాన్స్ చేయనున్నారని తాజా సమాచారం. అందులో ఒకరు అనుపమా పరమేశ్వరన్, మరొకరు మమితా బైజు అని తెలిసింది. వీరిద్దరూ ఇటీవల మంచి హిట్ కొట్టి మంచి జోరుమీద ఉన్నారన్నది గమనార్హం. అనుపమా పరమేశ్వరన్ తెలుగు చిత్రం టిల్లు స్క్వేర్ చిత్ర సక్సెస్ జోష్‌లో ఉంటే మమితా బైజు మలయాళ చిత్రం ప్రేమలు చిత్ర హిట్ క్రేజ్‌లో ఉన్నారు. డ్రాగన్ చిత్రం కళాశాల నేపథ్యంలో సాగే వైవిధ్యభరిత ప్రేమ కథా చిత్రంగా తెరకెక్కుతోందని సమాచారం. ఈ చిత్ర షూటింగ్ రెండో షె డ్యూల్ త్వరలో చైన్నె, హైదరాబాద్ ప్రాంతాల్లో జరగనుందని సమాచారం. -
ఇలాంటి మసాజ్ కావాలంటూ ఫోటో షేర్ చేసిన అనుపమ
టాలీవుడ్లో 'టిల్లు స్వేర్' చిత్రంతో ఇటీవలే మంచి విజయాన్ని దక్కించుకుంది మలయాళీ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్. ఈ చిత్రంలో స్క్రీన్‌పై ఒక హాట్‌గా కనిపించడమే కాకుండా తనలోని సరికొత్త టాలెంట్‌ను తెరపై చూపించింది. దీంతో గ్లామర్ పాత్రలకే అనుపమ పరిమితం అవుతుందని అందరూ అనుకున్నారు. కానీ అందరి అంచనాలకు మించి త్వరలో లేడీ ఓరియెంటెడ్ సినిమా 'పరదా'తో ప్రేక్షకుల ముందుకు రానుంది.సోషల్ మీడియాలో తన అభిమానులతో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే అనుపమ తన గ్లామర్ ఫోటోలతో కిక్ ఇస్తుంది. ఈ క్రమంలో ఆమె ఒక ఫోటో తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. తనకు నడుము నొప్పి వస్తుందని తెలుపుతూ.. అందుకు చికిత్స ఏదైతే బాగుండూ అంటూనే రోడ్ రోలర్‌తో మసాజ్ అయితే బాగుంటుందని అర్థం వచ్చేలా ఆమె ఒక పోస్ట్ చేసింది. దీంతో నెటిజన్లు కూడా చాలా ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు.'సినిమా బండి' దర్శకుడు ప్రవీణ్ కండ్రేగుల డైరెక్షన్లో పరదా అనే సినిమాలో అనుపమ నటిస్తుంది. ఇదొక భిన్నమైన న్యూఏజ్ ట్రావెల్ డ్రామా కథాంశంతో తెరకెక్కుతున్నట్లు సమాచారం. ఇందులో మలయాళ నటి దర్శన రాజేంద్రన్‌తో పాటు సంగీత, రాగ్ మయూర్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. View this post on Instagram A post shared by Ananda Media (@anandamediaofficial) -
నీలిరంగు చీరలో అనుపమ.. ధరెంతో తెలుసా?
టిల్లు స్క్వేర్తో మళ్లీ ట్రెండింగ్‌లోకి వచ్చింది హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్. ప్రేమమ్ అనే మలయాళ చిత్రం ద్వారా పరిచయం అయిన ఈ బ్యూటీ తెలుగు, తమిళం వంటి ఇతర భాషల్లోనూ రాణిస్తూ పక్కింటి అమ్మాయిగా ముద్ర వేసుకుంది. అయితే ఎన్నాళ్లని ఒకే రకమైన సినిమాలు చేయడం అనుకుందో ఏమో కానీ ఇటీవల గ్లామర్‌కు గేట్లెత్తేసింది. గ్లామర్‌కు ఓటేసిన బ్యూటీటిల్లు స్క్వేర్ చిత్రంలో లిప్‌లాక్ సన్నివేశాల్లో నటించి అందరినీ ఆర్చర్యపరిచింది. అనుపమనేనా ఇలా నటించిందీ అని అభిమానులు ముక్కున వేలేసుకున్నారు. అదేమంటే గ్లామర్ రోల్ చేస్తే తప్పేముందని సమర్థించుకుంది. ఈ మూవీ సక్సెస్‌తో అనుపమ పరమేశ్వరన్ క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. మరిన్ని అవకాశాలు తలుపులు తడుతున్నాయి. చీర ధరెంతో తెలుసా?దీంతో ఈ కేరళ బ్యూటీ తన పారితోషికాన్ని ఒక్కసారిగా పెంచేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటి వరకూ రూ.కోటి తీసుకుంటున్న ఈ జాణ టిల్లు స్క్వేర్ నుంచి దాన్ని రెండింతలు చేసి రూ.2 కోట్లు డిమాండ్ చేస్తున్నట్లు ఫిల్మీదునియాలో టాక్. తాజాగా నీలి రంగు చీరలో ఉన్న ఫోటోలను అనుపమ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఎంతో సింపుల్‌గా కనిపిస్తున్న ఈ బనారస్ చీర ధర రూ.15000 అని తెలుస్తోంది. View this post on Instagram A post shared by Anupama Parameswaran (@anupamaparameswaran96) -
క్రేజీ కాంబో.. సూపర్ ఛాన్స్ కొట్టేసిన అనుపమ
'టిల్లు స్క్వేర్' సినిమాతో హిట్ కొట్టిన అనుపమ.. మళ్లీ బిజీ అయిపోతోంది. తెలుగులో 'పరదా' అనే హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీ చేస్తోంది. మరోవైపు ఇతర భాషల్లోనూ క్రేజీ ఆఫర్స్ అందుకుంటోంది. తాజాగా అలాంటిదే ఒకటి అనుపమ ఖాతాలో చేరింది. తమిళంలో డిఫరెంట్ చిత్రాలు తీస్తాడనే పేరున్న డైరెక్టర్.. తన కొత్త మూవీలో అనుపమకు ఛాన్స్ ఇచ్చాడు. తాజాగా ఈ ప్రాజెక్ట్ లాంఛనంగా ప్రారంభమైంది. ఇంతకీ ఈ సినిమా సంగతేంటి?(ఇదీ చదవండి: తెలుగులో ఛాన్సులు అందుకే రావట్లేదు: హీరోయిన్ ఇలియానా)హీరో విక్రమ్ కొడుకు ధ్రువ్ విక్రమ్.. ఇప్పుడిప్పుడే హీరోగా నిలదొక్కుకునే ప్రయత్నాల్లో ఉన్నాడు. తాజాగా అతడి మూడో చిత్రం చైన్నెలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. 'ఆదిత్య వర్మ', 'మహాన్' సినిమాలతో ఆకట్టుకున్న ధ్రువ్.. ఇప్పుడు చాలా కాలం గ్యాప్ తీసుకుని కొత్త మూవీకి రెడీ అయిపోయాడు. సక్సెస్‌పుల్ దర్శకుడు మారి సెల్వరాజ్ తీయబోయే మూవీలో మెయిన్ లీడ్‌గా చేస్తున్నాడు. ఈ చిత్రానికి బైసన్ టైటిల్ ఫిక్స్ చేశారు. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్.ఇదే సినిమాలో లాల్, పశుపతి, కలైయ రసన్, రజిష విజయన్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. నివాస్ కె. ప్రసన్న సంగీతమందిస్తున్నారు. ప్రశాంతమైన మార్గాన్ని అన్వేషించే ఒక వీరుడి ఇతివృత్తమే 'బైసన్' సినిమా అని దర్శకుడు మారి సెల్వరాజ్ చెప్పారు. 'మామన్నన్' లాంటి అద్భుతమైన హిట్ సినిమా తర్వాత తీస్తున్న మూవీ కావడంతో అంచనాలు గట్టిగానే ఉన్నాయి.(ఇదీ చదవండి: విడాకులపై సలహా అడిగిన యువతి.. మెగా డాటర్ శ్రీజ పోస్ట్ వైరల్)As powerful and fierce as it could get! Unleashing #Bison 🦬#BisonKaalamaadan All the best @mari_selvaraj #DhruvVikram @anupamahere @nivaskprasanna and team 💥💥💥@Tisaditi @ApplauseSocial @NeelamStudios_ pic.twitter.com/0D9pLnw2AD— pa.ranjith (@beemji) May 6, 2024 -
లాక్ డౌన్లో ఏం జరిగింది?
ఇప్పటికే తెలుగు, తమిళ, మలయాళం భాషల్లో నాలుగైదు సినిమాలు అంగీకరించి, ఫుల్ ఫామ్‌లో ఉన్నారు అనుపమా పరమేశ్వరన్. తమిళంలో విక్రమ్ తనయుడు ధ్రువ్ సరసన అనుపమ నటిస్తున్న చిత్రానికి ‘బైసన్’ టైటిల్ ఖరారు చేసినట్లు సోమవారం యూనిట్ ప్రకటించింది. అనుపమ లీడ్ రోల్లో రూపొందనున్న మరో చిత్రం ‘లాక్ డౌన్’ ప్రకటన కూడా వచ్చింది.ఈ చిత్రాన్ని ప్రకటించి, ‘‘భావోద్వేగాలతో కూడిన కథను చూడ్డానికి సిద్ధం అవ్వండి’’ అంటూ అనుపమా పరమేశ్వరన్ పస్ట్ లుక్ పోస్టర్ని విడుదల చేశారు. ఈ పోస్టర్లో అనుపమ బాధతో అరుస్తున్నట్లుగా కనిపిస్తున్నారు. ‘లాక్ డౌన్’లో ఆమె పాత్ర ఎలా ఉంటుంది? ఈ రేంజ్లో ఎందుకు బాధపడుతున్నారనే విషయాలు తెలియాల్సి ఉంది. ఏఆర్ జీవా దర్శకత్వంలో లైకా ప్రోడక్షన్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. -
అనుపమా కెరీర్ ప్రస్తుతం నాన్‌స్టాప్‌గా... జెట్ స్పీడ్‌లో
హీరోయిన్ అనుపమా పరమేశ్వరన్ కెరీర్ ప్రస్తుతం నాన్‌స్టాప్‌గా జెట్ స్పీడ్‌లో దూసుకెళ్తోంది. మలయాళంలో ‘ది పెట్ డిటెక్టివ్, జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ’, తెలుగులో ‘పరదా’, తమిళంలో మారి సెల్వరాజ్ దర్శకత్వంలో ఓ సినిమా కమిటయ్యారు అనుపమ. ఈ సినిమాలకు సంబంధించిన అధికారిక ప్రకటనలు వెల్లడయ్యాయి. అలాగే ‘హను–మాన్’ దర్శకుడు ప్రశాంత్ వర్మ తెరకెక్కిస్తున్న ‘ఆక్టోపస్’ (ప్రచారంలో ఉన్న టైటిల్), కౌశిక్ తెరకెక్కిస్తున్న ‘కిష్కిందపురి’ (ప్రచారంలో ఉన్న టైటిల్) చిత్రాల్లోనూ అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్గా నటిస్తున్నారనే టాక్ తెరపైకి వచ్చింది. అనుపమ మెయిన్ లీడ్ రోల్లో నటించనున్న మరో కొత్త సినిమా ప్రకటన శనివారం వెల్లడైంది. సుభాస్కరన్ నిర్మించనున్న ఈ సినిమాతో ఏఆర్ జీవా దర్శకుడిగా పరిచయం అవుతారు. ఇది ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్ అని కోలీవుడ్ సమాచారం. ఈ సంగతి ఇలా ఉంచితే... అనుపమా పరమేశ్వరన్ నటించిన ‘ఈగల్’, ‘టిల్లు స్వే్కర్’, ‘సైరన్’ చిత్రాలు ఈ ఏడాది విడుదలయ్యాయి. ఇలా ఇప్పటికే అనుపమ మూడుసార్లు థియేటర్స్‌లో కనిపించారు. ఆమె నటించిన మరో రెండు సినిమాలు విడుదలకు సిద్ధం అవుతున్నాయి. -
అనుపమ పరదా
అనుపమా పరమేశ్వరన్ ప్రధాన పాత్రధారిగా, సంగీత, దర్శనా రాజేంద్రన్ కీలక పాత్రల్లో నటిస్తున్న చిత్రానికి ‘పరదా’ అనే టైటిల్ ఖరారైంది. ‘సినిమా బండి’ ఫేమ్ ప్రవీణ్ కాండ్రేగుల దర్శకత్వంలో విజయ్ డొంకాడ, శ్రీనివాసులు పీవీ, శ్రీధర్ మక్కువ నిర్మిస్తున్నారు. కాగా ఈ సినిమా ఫస్ట్ లుక్, కాన్సెప్ట్ వీడియోను నటి సమంత, దర్శక–నిర్మాతలు రాజ్ అండ్ డీకే షేర్ చేశారు. ‘పరదా’ కాన్సెప్ట్ వీడియోలో ‘యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతా..’ అనే శ్లోకం వినిపిస్తుండటం సినిమాపై ఆసక్తిని కలిగించేలా ఉంది.ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్ లొకేషన్స్‌తో పాటు ఆ పరిసర గ్రామాల్లో ఇప్పటివరకు ఈ సినిమాను చిత్రీకరించారు. ‘‘మేలో హైదరాబాద్‌లో జరగనున్న కొత్త షెడ్యూల్‌తో ఈ సినిమా చిత్రీకరణ దాదాపు పూర్తవుతుంది’’ అని చిత్రబృందం పేర్కొంది. ‘‘ఓ మంచి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాం’’ అన్నారు ప్రవీణ్. ‘‘ప్రేక్షకులను మరో ప్రపంచంలోకి తీసుకువెళ్లే ప్రయాణమే మా చిత్రం’’ అన్నారు విజయ్ డొంకాడ. ఈ చిత్రానికి సంగీతం: గోపీ సుందర్. -
నెల రోజుల్లోపే ఓటీటీకి టిల్లు స్క్వేర్.. స్ట్రీమింగ్ డేట్ అదేనా?
సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన 'టిల్లు స్క్వేర్'. ఈ చిత్రాన్ని మల్లిక్ రామ్ దర్శకత్వంలో తెరకెక్కించారు. డీజే టిల్లుకు సీక్వెల్‌గా ఈ సినిమాను రూపొందించారు. గతంలో రిలీజైన డీజే టిల్లు సూపర్ హిట్ కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మార్చి 29 ప్రేక్షకుల ముందుకొచ్చిన టిల్లు స్క్వేర్ బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్ సొంతం చేసుకుంది. దాదాపు రూ.100 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించింది. టిల్లు స్క్వేర్ సూపర్ హిట్ కావడంతో ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్పై ఆసక్తి నెలకొంది. ఎప్పుడెప్పుడు ఓటీటీకి వస్తుందా అని ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఇప్పటికే ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను భారీ ధరకు ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ దక్కించుకుంది. తాజా బజ్ ప్రకారం ఈనెలలోపే టిల్లు స్క్వేర్ ఓటీటీలో సందడి చేయనున్నట్లు తెలుస్తోంది. ఏప్రిల్ 26 నుంచే స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఒకవేళ ఈ డేట్ ఫిక్స్ అయితే కేవలం నెల రోజుల్లోపే ఓటీటీలో అలరించనుంది. -
'టిల్లు స్క్వేర్' నుంచి అదిరిపోయే వీడియో సాంగ్ విడుదల
డీజే టిల్లుకు సీక్వెల్‌గా విడుదలైన 'టిల్లు స్క్వేర్' బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్‌తో దుమ్మురేపుతుంది. సిద్ధు జొన్నలగడ్డ- అనుపమ పరమేశ్వరన్ అల్లరికి ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. మార్చి 29న విడుదలైన ఈ చిత్రాన్ని రెండోసారి కూడా చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తిచూపుతున్నారు. మొదటి పార్ట్‌కు మించిన ఫన్ ఈ చిత్రంలో ఉండటంతో యూత్‌కు బాగా దగ్గరైంది. సిద్దు తనదైన స్టైల్లో వన్ లైనర్ డైలాగ్స్‌తో సినిమాను దడదడలాడించేశాడు. కథకు తగ్గట్టు హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ కూడా చెలరేగిపోయింది. సినిమా విడుదలై మూడు వారాలు పూర్తి కావస్తుంది. దీంతో తాజాగా ఈ సినిమా నుంచి టికెట్టే కొనకుండా అనే వీడియో సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. రామ్ మిరియాల ఈ పాటను పాడటమే కాకుండా మ్యూజిక్‌ను కూడా అందించారు. ట్రెండింగ్ సాంగ్ కావడంతో ప్రస్తుతం యూట్యూబ్‌లో దూసుకుపోతుంది. టిల్లు గాడి ఫన్‌కు మెచ్చిన ఆడియన్స్ ఇప్పటి వరకు రూ. 115 కోట్ల గ్రాస్‌ను కలెక్షన్స్ రూపంలో ఇచ్చేశారు. -
చీరలో అనుపమ మరింత క్యూట్.. శ్రీముఖి మాత్రం ఎప్పట్లానే!
చీరలో మరింత క్యూట్ గా 'హనుమాన్' హీరోయిన్ అమృత పద్ధతైన కేరళ చీరకట్టులో అనుపమ పరమేశ్వరన్.. చూస్తే అంతే మోడ్రన్ మహాలక్ష్మిలా మెరిసిపోతున్న యాంకర్ శ్రీముఖి తెలుగమ్మాయిలా మారిపోయిన హీరోయిన్ రుహానీ శర్మ చూపులతో మత్తెక్కించేస్తున్న 'నా సామి రంగ' ఆషికా రంగనాథ్ ప్యూర్ వైట్ శారీలో మరింత అందంగా హీరోయిన్ అనంతిక ఇంట్లో పూజ చేయించిన అనసూయ.. రీజన్ మాత్రం సస్పెన్స్ View this post on Instagram A post shared by Amritha - Thendral (@amritha_aiyer) View this post on Instagram A post shared by Anupama Parameswaran (@anupamaparameswaran96) View this post on Instagram A post shared by Sreemukhi (@sreemukhi) View this post on Instagram A post shared by Ruhani Sharma (@ruhanisharma94) View this post on Instagram A post shared by Ashika Ranganath (@ashika_rangnath) View this post on Instagram A post shared by Ananthika Sanilkumar (@ananthika_sanilkumar) View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by Amala Paul (@amalapaul) View this post on Instagram A post shared by Vithika Sheru (@vithikasheru) View this post on Instagram A post shared by Anjali (@yours_anjali) View this post on Instagram A post shared by Priyanka Mohan (@priyankaamohanofficial) -
Anupama Parameswaran: చీరలో ‘టిల్లుగాడి’ లవర్ లిల్లీ హోయలు (ఫొటోలు)
-
అనుపమకు అవమానం.. ఎన్టీఆర్ ముందే..!
అనుపమ పరమేశ్వరన్.. ఈ మలయాళ బ్యూటీ తెలుగులో అడుగుపెట్టిన కొంతకాలానికే ఇక్కడి ప్రేక్షకులు ఆమెను అక్కున చేర్చుకున్నారు. గ్లామర్ రోల్స్ చేయకుండా పర్ఫామెన్స్‌కు స్కోప్ ఉన్న పాత్రలు చేసుకుంటూ వచ్చింది అనుపమ. అందుకే ఆడియన్స్‌కు తెగ నచ్చేసింది. కానీ ఎంతకాలమని గిరి గీసుకుని బతకాలి? గ్లామర్ పాత్రలు కూడా ఓసారి చేసి చూస్తే పోలా? అనుకుంది. అలా టిల్లు స్క్వేర్‌లో భాగమైంది. డీజే టిల్లుకు సీక్వెల్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో అనుపమ తొలిసారి బోల్డ్‌గా నటించింది. ఇంకేముంది అభిమానులు హర్టయ్యారు, తనను ట్రోల్ చేశారు, ఇంకా చేస్తూనే ఉన్నారు. అనుపమకు ఇలాంటి పరిస్థితా? టిల్లు స్క్వేర్ మార్చి 29న విడుదలవగా, కొద్ది రోజుల్లోనే వంద కోట్లు రాబట్టింది. ఈ సందర్భంగా సోమవారం నాడు టిల్లు స్క్వేర్ బ్లాక్‌బస్టర్ సెలబ్రేషన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ ముఖ్య అతిథులుగా విచ్చేశారు. అనుపమ స్టేజీపైకి వచ్చి మాట్లాడబోతుంటే అక్కడున్న జనాలు వద్దని గోల చేశారు. అది గమనించిన అనుపమ మాట్లాడకుండా వెళ్లిపోవాలా? అని సైగ చేసింది. అయినా సరే ఎవరూ నిశ్శబ్దంగా ఉండటానికి ప్రయత్నించలేదు. మాట్లాడొచ్చా? వద్దా? అని అడగ్గా వద్దని చెప్పారు. దీంతో హర్టయిన అనుపమ.. సరే వెళ్లిపోతాను అనేసింది. కనీసం ఒక్క నిమిషం దీంతో యాంకర్ సుమ పరిస్థితిని చక్కబెట్టేందుకు ప్రయత్నించింది. ఆమెను తిరిగి స్టేజీపైకి తీసుకొచ్చింది. ఒక రెండు నిమిషాలైనా మాట్లాడొచ్చా? అని అనుపమ రిక్వెస్ట్ చేయగా దానికీ నిరాకరించారు. కనీసం ఒక్క నిమిషం మాట్లాడతానని అభ్యర్థిస్తూ ప్రసంగం మొదలుపెట్టింది. ముందుగా స్పెషల్ గెస్ట్‌గా వచ్చిన తారక్‌కు కృతజ్ఞతలు తెలియజేసింది. నాకేం బాధ లేదు.. అభిమానుల ఎమోషన్స్ అర్థం చేసుకోగలను.. ఆ ఎగ్జయిట్మెంట్లో నేనూ అలాగే ప్రవర్తిస్తాను. ఇక్కడికి విచ్చేసిన అందరికీ థ్యాంక్స్ అని చెప్పి ముగించింది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారగా చాలామంది అక్కడి అభిమానుల ప్రవర్తనను తప్పుపడుతున్నారు. హీరోయిన్ను అలా కించపరచడం తప్పని కామెంట్లు చేస్తున్నారు. 🤦♂️ Our Crowd! pic.twitter.com/dLF2rj2JEG — Christopher Kanagaraj (@Chrissuccess) April 9, 2024 చదవండి: అమాయకుడైన చైని మోసం చేశావ్.. ఇచ్చిపడేసిన సామ్