
రవితేజ హీరోగా దర్శకుడు కార్తిక్ ఘట్టమనేని తెరకెక్కిస్తున్న సినిమా 'ఈగల్'. భారీ యాక్షన్ కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమాలో రవితేజ లుక్ చాలా డిఫరెంట్‌గా ఉంది. ఇందులో అనుపమ పరమేశ్వరన్, కావ్యా థాపర్ నటిస్తున్నారు. నవదీప్, మధుబాల తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. టి. జి. విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా ఈగల్ టీజర్‌ను మేకర్స్ విడుదల చేశారు.
(ఇదీ చదవండి: రష్మిక మందన్న ఫేక్ వీడియో వైరల్.. వారిని శిక్షించాలని డిమాండ్)
కొండలో లావాను కిందకు పిలవకు. ఊరు ఉండదు. నీ ఉనికి ఉండదు అంటూ రవితేజ చెప్పిన పంచ్ డైలాగ్‌తో టీజర్ ఇంట్రెస్టింగ్‌గా ప్రారంభమైంది. అడవిలో ఉంటాడు. నీడై తిరుగుతుంటాడు. కనిపించడు. కానీ వ్యాపించి ఉంటాడు.. వెలుతురు వెళ్లే ప్రతిచోటకు వాడి బుల్లెట్ వెళుతుంది అంటూ రవితేజ క్యారెక్టర్ గురించి ఇచ్చిన ఎలివేషన్ డైలాగ్స్ టీజర్‌కు హైలైట్‌గా నిలిచాయి.
ఈగల్ సినిమాను కార్తిక్ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తున్నాడు. గతంలో ఆయన నిఖిల్‌తో 'సూర్య వర్సెస్ సూర్య' చిత్రంతో మెప్పించాడు.. కార్తిక్ ఘట్టమనేనికి ఇది రెండో సినిమా. 2024 సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదల చేస్తున్నట్లు టీజర్‌లో ప్రకటించారు. ఇటీవల 'టైగర్ నాగేశ్వరరావు'తో ప్రేక్షకుల ముందుకొచ్చిన రవితేజ.. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ఇద్దరి కాంబినేషన్‌లో గతంలో డాన్‌శీను, బలుపు, క్రాక్ వచ్చాయి.
Comments
Please login to add a commentAdd a comment