
టిల్లు స్క్వేర్‌తో మళ్లీ ట్రెండింగ్‌లోకి వచ్చింది హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్. ప్రేమమ్ అనే మలయాళ చిత్రం ద్వారా పరిచయం అయిన ఈ బ్యూటీ తెలుగు, తమిళం వంటి ఇతర భాషల్లోనూ రాణిస్తూ పక్కింటి అమ్మాయిగా ముద్ర వేసుకుంది. అయితే ఎన్నాళ్లని ఒకే రకమైన సినిమాలు చేయడం అనుకుందో ఏమో కానీ ఇటీవల గ్లామర్‌కు గేట్లెత్తేసింది.
గ్లామర్‌కు ఓటేసిన బ్యూటీ
టిల్లు స్క్వేర్ చిత్రంలో లిప్‌లాక్ సన్నివేశాల్లో నటించి అందరినీ ఆర్చర్యపరిచింది. అనుపమనేనా ఇలా నటించిందీ అని అభిమానులు ముక్కున వేలేసుకున్నారు. అదేమంటే గ్లామర్ రోల్ చేస్తే తప్పేముందని సమర్థించుకుంది. ఈ మూవీ సక్సెస్‌తో అనుపమ పరమేశ్వరన్ క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. మరిన్ని అవకాశాలు తలుపులు తడుతున్నాయి.
చీర ధరెంతో తెలుసా?
దీంతో ఈ కేరళ బ్యూటీ తన పారితోషికాన్ని ఒక్కసారిగా పెంచేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటి వరకూ రూ.కోటి తీసుకుంటున్న ఈ జాణ టిల్లు స్క్వేర్ నుంచి దాన్ని రెండింతలు చేసి రూ.2 కోట్లు డిమాండ్ చేస్తున్నట్లు ఫిల్మీదునియాలో టాక్. తాజాగా నీలి రంగు చీరలో ఉన్న ఫోటోలను అనుపమ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఎంతో సింపుల్‌గా కనిపిస్తున్న ఈ బనారస్ చీర ధర రూ.15000 అని తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment