ఫోటో షేర్‌ చేసిన అనుపమ పరమేశ్వరన్‌.. ఆమె ఎవరో తెలుసా? | Anupama Parameswaran Wished Her Mother Happy Birthday | Sakshi
Sakshi News home page

ఫోటో షేర్‌ చేసిన అనుపమ పరమేశ్వరన్‌.. ఆమె ఎవరో తెలుసా?

Published Thu, Apr 4 2024 9:31 AM | Last Updated on Thu, Apr 4 2024 10:21 AM

Anupama Parameswaran Wished Her Mother Happy Birthday - Sakshi

తల్లికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పిన అనుపమ

అత్తమ్మా జాగ్రత్త అంటూ నెటిజన్ల ఫన్నీ కామెంట్లు

అనుపమ పరమేశ్వరన్‌.. తెలుగువారికి పరిచయం అక్కర్లేని కేరళ కుట్టి. మన పక్కింటి పిల్లలా సరదాగా మనందరిలో కలిసిపోయిందీ అమ్మాయి. 'ప్రేమమ్‌'తో పరిచయమై తెలుగువారి ప్రేమను గెలుచుకుంది. తాజాగా విడుదలైన టిల్లు స్క్వేర్ సినిమాతో తనలో దాగి ఉన్న మరో టాలెంట్‌ను ప్రేక్షకులకు చూపించింది. సినిమా చూసిన వారందరూ లిల్లీ పాప దుమ్మురేపింది రా.. అంటూ కామెట్లు చేస్తున్నారు.

తాజాగా అనుపమ పరమేశ్వరన్‌ తన అమ్మగారు అయిన సునీత ఫోటోను షేర్‌ చేసింది. నేడు (ఏప్రిల్‌ 3) సునీత పుట్టినరోజు కావడంతో సోషల్‌ మీడియా ద్వారా అనుపమ శుభాకాంక్షలు తెలిపింది. అనుపమ మాదిరే  సునీత కూడా ఎక్కువగా సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. దీంతో నెటిజన్లు కూడా ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతున్నారు. కొందరైతే ఏకంగా అత్తమ్మా.. హ్యాపీ బర్త్‌డే అంటూ సరదాగా కామెంట్లు చేస్తున్నారు.  అత్తమ్మో.. నీ కూతురు జాగ్రత్త అని మరికొందరూ ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు.

కేరళలోని త్రిస్సూర్‌ జిల్లా ఇరింజలకుడలో పుట్టిన అనుపమ.. ఇంటర్‌ వరకు మాత్రమే చదివి సినిమాల మీద ఆసక్తితో వెండితెరపై అడుగుబెట్టి విజయం సాధించింది. నాన్న పరమేశ్వరన్‌, అమ్మ సునీత, సోదరుడు అక్షయ్‌ ఉన్నారు. తన బలం అమ్మే అంటూ చెబుతున్న అనుపమ అప్పడప్పుడు ఆమెను ఆటపట్టిస్తుంది కూడా.. ఒక్కోసారి పలు కార్టూన్స్‌తో తన తల్లి గురించి చెబుతూ  పోస్ట్ వేసి అందరినీ నవ్వించేస్తోంది. ప్రస్తుతం టిల్లు స్క్వేర్ విజయాన్ని ఎంజాయ్‌ చేస్తున్న అనుపమకు నేడు తన అమ్మగారి పుట్టినరోజు కావడంతో తన ఆనందం డబుల్‌ అయిందని చెప్పవచ్చు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement