
హీరోయిన్ అన్నాక అన్ని రోల్స్ చేయాలి. బరి గీసుకుని ఉంటే పెద్దగా అవకాశాలు రావు. ఆ విషయం తెలుసుకున్న అనుపమ పరమేశ్వరన్ బోల్డ్ పాత్రలకు ఓకే చెప్పింది. టిల్లు స్క్వేర్‌లో ముద్దులు, హగ్గులతో రెచ్చిపోయింది. ఇది అభిమానులకు అస్సలు నచ్చలేదు. అనుపమ కూడా ఇలా తయారైందేంటని కోపంతో ఊగిపోయారు. ఇవన్నీ అవసరమా? అని తిట్టినవాళ్లు కూడా ఉన్నారు. ఎప్పుడూ ఒకేరకమైన పాత్రలు చేస్తే బోర్ కొడుతుంది కదా.. అందుకే ఈ సినిమా ఒప్పుకున్నానని చెప్పినా ఫ్యాన్స్ ఆవేశం చల్లారలేదు. తనను ట్రోల్ చేస్తూనే ఉన్నారు.
ఇబ్బంది పెట్టొద్దు
బుధవారం (మార్చి 27న) టిల్లు స్క్వేర్ ప్రీరిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ కార్యక్రమానికి అనుపమ డుమ్మా కొట్టింది. దీనిపై స్టేజీపైనే స్పందించాడు సిద్దు జొన్నలగడ్డ. అతడు మాట్లాడుతూ.. టిల్లు స్క్వేర్ నుంచి లేటెస్ట్‌గా ఓ పోస్టర్ రిలీజైంది. దానికింద చాలా కామెంట్స్ చేశారు. ఒక అమ్మాయి గురించినే ఏది పడితే అది అనేయడం అనడం కరెక్ట్ కాదు! మీకు మాట్లాడే హక్కు ఉంది.. నేను దాన్ని తప్పనడం లేదు. ఉదాహరణకు మనం ఒకరిని ఫ్లర్ట్ చేస్తే అవతలివాళ్లు ఎంజాయ్ చేసేలా ఉండాలి. కానీ వారిని ఇబ్బంది పెట్టేలా ఉండొద్దు.
హర్ట్ అవడం వల్లే?
తన గురించి పిచ్చిపిచ్చిగా కామెంట్స్ చేశారు. నా అభ్యర్థన ఏంటంటే దయచేసి వల్గర్‌గా మాట్లాడొద్దు. ఆరోగ్యకర వాతావరణం ఉంటే బాగుంటుంది' అని చెప్పుకొచ్చాడు. నెగెటివ్ కామెంట్స్‌కు హర్ట్ అయినందువల్లే అనుపమ ఈవెంట్‌కు రాలేదని తెలుస్తోంది. ఇకపోతే టిల్లు స్క్వేర్ మార్చి 29న రిలీజ్ కానుంది.
చదవండి: లండన్‌లో కొత్త ఇల్లు?
Comments
Please login to add a commentAdd a comment