
డీజే టిల్లుకు సీక్వెల్‌గా విడుదలైన 'టిల్లు స్క్వేర్' బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్‌తో దుమ్మురేపుతుంది. సిద్ధు జొన్నలగడ్డ- అనుపమ పరమేశ్వరన్ అల్లరికి ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. మార్చి 29న విడుదలైన ఈ చిత్రాన్ని రెండోసారి కూడా చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తిచూపుతున్నారు. మొదటి పార్ట్‌కు మించిన ఫన్ ఈ చిత్రంలో ఉండటంతో యూత్‌కు బాగా దగ్గరైంది.
సిద్దు తనదైన స్టైల్‌లో వన్ లైనర్ డైలాగ్స్‌తో సినిమాను దడదడలాడించేశాడు. కథకు తగ్గట్టు హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ కూడా చెలరేగిపోయింది. సినిమా విడుదలై మూడు వారాలు పూర్తి కావస్తుంది. దీంతో తాజాగా ఈ సినిమా నుంచి టికెట్టే కొనకుండా అనే వీడియో సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. రామ్ మిరియాల ఈ పాటను పాడటమే కాకుండా మ్యూజిక్‌ను కూడా అందించారు. ట్రెండింగ్ సాంగ్ కావడంతో ప్రస్తుతం యూట్యూబ్‌లో దూసుకుపోతుంది. టిల్లు గాడి ఫన్‌కు మెచ్చిన ఆడియన్స్ ఇప్పటి వరకు రూ. 115 కోట్ల గ్రాస్‌ను కలెక్షన్స్ రూపంలో ఇచ్చేశారు.
Comments
Please login to add a commentAdd a comment