Tillu Square Movie
-
తెలంగాణ కథా చిత్రాలు.. 2024లో సత్తా చాటాయి!
2024 సంవత్సరంలో తెలుగు చలన చిత్ర పరిశ్రమలో తెలంగాణ నేపథ్యంలో చాలా సినిమాలు ప్రేక్షకులను అలరించాయి. పెద్ద హీరోల సినిమాల నుంచి ఊహించని హిట్ల వరకు వైవిధ్యభరితమైన చిత్రాలను ప్రేక్షకులు ఆస్వాదించారు. కొన్ని సినిమాలు అంచనాలను అందుకోవడంలో విఫలమైనా.. మరి కొన్ని సినిమాలు బ్లాక్ బస్టర్స్‌గా నిలిచి అందరినీ ఆశ్చర్యపరిచాయి. 2024లో తెలంగాణ యాసలో తెరపైకి వచ్చిన చెప్పుకోదగ్గ సినిమాలను నిశితంగా పరిశీలిద్దాం.టిల్లు స్క్వేర్ టూ పొట్టేల్.. స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ నటించిన "టిల్లు స్క్వేర్" బాక్సాఫీస్ వద్ద రూ.100కోట్ల క్లబ్లో చేరి బ్లాక్ బాస్టర్ గా నిలిచింది. ఇందులో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్గా నటించింది. అలాగే హైదరాబాద్ సంస్థానంలో 1940లలో తెలంగాణ ప్రాంతంలో రజాకార్ వ్యవస్థపై జరిగిన అరాచకాల మీద వచ్చిన చిత్రం "రజాకార్". మొదటి రోజే మంచి టాక్ రావడంతో అదిరిపోయే కలెక్షన్లు రాబట్టింది.ఆ తర్వాత ఇటీవల తెలంగాణ పెళ్లి నేపధ్యంలో వచ్చిన మరో చిత్రం "లగ్గం". థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం సూపర్ హిట్‌గా నిలిచింది. అనన్య నాగళ్ల కీ రోల్ ప్లే చేసిన మరో డిఫెరెంట్ మూవీ పొట్టేల్. విభిన్నమైన ప్రమోషన్స్‌తో ప్రజల్లోకి వెళ్లిన "పొట్టేలు" బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదనిపించింది. ప్రస్తుతం ఈ మూవీ ఓటీటీలోనూ దూసుకెళ్తోంది.అంతేకాకుండా జితేందర్ రెడ్డి , ఉరుకు పటేలా , లైన్ మాన్ , ప్రవీణ్ ఐపీఎస్ , కళ్లు కాంపౌండ్ ,పైలం పిలగా, షరతులు వర్తిస్తాయి, గొర్రెపురాణం , బహిర్ భూమి , కేశవ చంద్ర రమావత్ ఇలా ఎన్నో వైవిధ్య భరితమైన సినిమాలు ప్రేక్షకులను అలరించాయి. అయితే ఈ చిత్రాలు ఆశించిన ఫలితాలు అందుకోలేకపోయాయి. ఇన్ని సినిమాలు తెలంగాణ నేపథ్యంలో వచ్చిన కథ, కథనాలు రొటీన్‌గా ఉండడం, మేకింగ్ నాసిరకంగా ఉండటం, నిర్మాణ విలువలు లేకపోవడంతో చాలా సినిమాలు చతికిలపడ్డాయి.అయితే అటు ఓటీటీల్లోను తెలంగాణ నేపథ్యంలో వచ్చిన చిత్రాలకు మంచి ఆదరణ లభిస్తోంది. ప్రముఖ గాయని సునీత కొడుకు హీరోగా, దర్శక ధీరుడు కె రాఘవేంద్రరావు గారి సమ్పర్పణలో వచ్చిన సర్కారు నౌకరి ఓటీటీలో ప్రేక్షకులను మెప్పించింది. అలాగే థియేటర్లో హిట్ టాక్‌తో ఓటీటీలోకి వచ్చిన "లగ్గం" చిత్రం ఆహా, అమెజాన్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. అటు తెలుగులో మాత్రమే కాకుండా తమిళం , కన్నడ , మలయాళం , హిందీ భాషల్లో సూపర్ హిట్‌గా నిలిచింది. పెద్ద హీరో చిన్న హీరో అనే తేడా లేకుండా కంటెంట్ బాగుంటే థియేటర్లో కాకుండా ఓటిటిల్లో సక్సెస్ సాధిస్తున్నాయి.2024లో టిల్లు స్క్వేర్ దర్శకుడు మల్లిక్ రామ్, రజాకర్ దర్శకుడు యాట సత్యనారాయణ, లగ్గం సినిమా దర్శకుడు రమేశ్ చెప్పాల, మంచి పేరు సాధించి పరిశ్రమ దృష్టిని ఆకర్షించారు. 2025లో కూడా తెలంగాణ నేపథ్యంలో మరిన్ని హిట్ సినిమాలు రావాలని ఆశిద్దాం. -
ఓటీటీలోకి 20 సినిమాలు.. హిట్ మూవీస్‌తో పాటు సిరీస్ కూడా!
బాక్సాఫీస్ దగ్గర కొన్నిసార్లు సీన్ డిఫరెంట్‌గా ఉంటుంది. టాక్ బాగున్నా పెద్దగా కలెక్షన్స్ ఉండవు. బాలీవుడ్లో మైదాన్ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది కానీ కలెక్షన్స్ మాత్రం దారుణంగా ఉన్నాయి. వందల కోట్లు పెట్టి తీసిన అక్షయ్ కుమార్ - టైగర్ ష్రాఫ్‌ల బడే మియా చోటే మియా అట్టర్ ఫ్లాప్ దిశగా అడుగులేస్తోంది. భీమా, ఫ్యామిలీ స్టార్.. రెండూ బాక్సాఫీస్ దగ్గర యావరేజ్ కంటే దిగువనే ఉన్నాయి.ఓటీటీ విషయానికి వస్తే టిల్లు స్క్వేర్, భీమా వంటి పలు చిత్రాలు వెబ్ వీక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాయి. మరి ఈ గురు, శుక్రవారాల్లో ఇంకా ఏయే సినిమాలు, సిరీస్‌లు ఓటీటీలో సందడి చేయనున్నాయో చూసేద్దాం..నెట్ఫ్లిక్స్శిక్షనేరక (ఇండోనేషియన్ చిత్రం)- ఏప్రిల్ 25ఫేస్ టు ఫేస్ (ఈజిప్షియన్ చిత్రం) - ఏప్రిల్ 25సిటీ హంటర్ (జపనీస్ చిత్రం) - ఏప్రిల్ 25డెడ్ బాయ్ డిటెక్టివ్స్ (ఇంగ్లీష్ సిరీస్) - ఏప్రిల్ 25టిల్లు స్క్వేర్ (తెలుగు మూవీ) - ఏప్రిల్ 26గుడ్‌బై ఎర్త్ (కొరియన్ సిరీస్) - ఏప్రిల్ 26ద అసుంత కేస్ (స్పానిష్ సిరీస్) - ఏప్రిల్ 26అమెజాన్ ప్రైమ్దిల్ దోస్తీ డైలమా (హిందీ సిరీస్) - ఏప్రిల్ 25ఫ్యామిలీ స్టార్ - ఏప్రిల్ 26హాట్స్టార్భీమా (తెలుగు సినిమా) - ఏప్రిల్ 25థాంక్యూ, గుడ్ నైట్: ద బాన్ జోవి స్టోరీ (ఇంగ్లీష్ డాక్యు సిరీస్) - ఏప్రిల్ 26క్రాక్: జీతేగా తో జియేగా (హిందీ మూవీ) - ఏప్రిల్ 26 జియో సినిమాయారియాన్ 2 (హిందీ మూవీ) - ఏప్రిల్ 25రాన్నీతి: బాలకోట్ అండ్ బియాండ్ (హిందీ సిరీస్) - ఏప్రిల్ 25ధక్ ధక్ - ఏప్రిల్ 25ఓ మై గాడ్ 2 (తెలుగు వర్షన్) - ఏప్రిల్ 25వుయ్ ఆర్ హియర్ సీజన్ 4 (ఇంగ్లీష్ సిరీస్) - ఏప్రిల్ 27బుక్ మై షోకుంగ్ ఫూ పాండా 4 (ఇంగ్లీష్ సినిమా) - ఏప్రిల్ 26లయన్స్ గేట్ ప్లేద బీ కీపర్ (ఇంగ్లీష్ మూవీ) - ఏప్రిల్ 26అమెజాన్ మినీ టీవీచాచా విధాయక్ హై మారే (సిరీస్, మూడో సీజన్) - ఏప్రిల్ 25చదవండి: నా పిల్లలు చూస్తే నా పరువేం కావాలి.. నటుడు ఎమోషనల్ -
ఓటీటీలోకి వచ్చేసిన మూడు సినిమాలు.. ఎందులో చూడొచ్చంటే?
ఈ వీకెండ్ ఓటీటీల్లోకి చాలా సినిమాలు వచ్చేశాయి. కాకపోతే వాటిలో ఓ మూడు మాత్రమే జనాలకు కాస్త ఇంట్రెస్ట్ కలిగిస్తున్నాయి. వీటిలో రెండు తెలుగు చిత్రాలు ఉండగా, హిందీ మూవీ కూడా ఒకటుంది. ఇప్పుడు అవన్నీ కూడా స్ట్రీమింగ్ అయిపోతున్నాయి. కొందరు ఆల్రెడీ చూసేస్తుండగా, మరికొందరు ఎప్పుడు చూడాలనేది ప్లాన్ చేసుకుంటున్నారు. ఇంతకీ ఇవన్నీ ఎక్కడెక్కడ స్ట్రీమింగ్ అవుతున్నాయంటే?'డీజే టిల్లు' సినిమాతో సూపర్ హిట్ కొట్టిన సిద్ధు.. దీని సీక్వెల్‌గా 'టిల్లు స్క్వేర్' తీశాడు. చాలాసార్లు వాయిదా పడి మార్చి 29న థియేటర్లలోకి వచ్చింది. ఊహించని విధంగా బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది. రూ.100 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఇప్పుడీ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజైంది. చూసి కడుపుబ్బా నవ్వుకోవడానికి ఈ వీకెండ్ టిల్లు బెస్ట్ ఆప్షన్.విజయ్ దేవరకొండ లేటెస్ట్ మూవీ 'ఫ్యామిలీ స్టార్'. మృణాల్ ఠాకుర్ హీరోయిన్. గత కొన్నేళ్ల సరైన హిట్ పడక ఇబ్బంది పడుతున్న రౌడీ హీరో.. కనీసం ఈ మూవీతో అయినా సక్సెస్ అందుకుంటాడనుకుంటే నిరాశే ఎదురైంది. బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్‌గా నిలిచింది. ఇప్పుడు ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లోకి వచ్చేసింది. దక్షిణాది భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. టైమ్ పాస్ కోసమైతే ఈ వీకెండ్లో మూవీ చూడొచ్చు.ఆమిర్ ఖాన్ నిర్మాతగా, అతడి మాజీ భార్య కిరణ్ రావ్ దర్శకత్వం వహించిన హిందీ సినిమా 'లా పతా లేడీస్'. కొత్తగా పెళ్లయిన వ్యక్తి, తన భార్య మిస్ కావడంతో మరో అమ్మాయిని ఇంటికి తీసుకొస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది అనే కాన్సెప్ట్‌తో ఈ మూవీ తీశారు. గతేడాది థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌లోకి వచ్చేసింది. ఇది కూడా మంచి కామెడీ చిత్రమే. ఈ వీకెండ్ ఎక్స్ట్రా ఎంటర్టైన్ కావాలంటే దీనిపైన కూడా ఓ లుక్కేసేయండి. -
అఫీషియల్: ఓటీటీకి టిల్లు స్క్వేర్.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్
సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన 'టిల్లు స్క్వేర్'. ఈ చిత్రాన్ని మల్లిక్ రామ్ దర్శకత్వంలో తెరకెక్కించారు. డీజే టిల్లుకు సీక్వెల్‌గా ఈ సినిమాను రూపొందించారు. గతంలో రిలీజైన డీజే టిల్లు సూపర్ హిట్ కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మార్చి 29 ప్రేక్షకుల ముందుకొచ్చిన టిల్లు స్క్వేర్ బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్ సొంతం చేసుకుంది. దాదాపు రూ.100 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించింది. టిల్లు స్క్వేర్ సూపర్ హిట్ కావడంతో ఎప్పుడెప్పుడు ఓటీటీకి వస్తుందా అని ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ మూవీ ఓటీటీకి స్ట్రీమింగ్ డేట్ వచ్చేసింది. ఈ నెల 26 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు నెట్‌ఫ్లిక్స్ వెల్లడించింది. తెలుగుతోపాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో అందుబాటులోకి రానున్నట్లు తెలిపింది. ఈ విషయాన్ని ట్విటర్ ద్వారా పంచుకుంది. 'చరిత్ర పునరావృతం అవ్వడం సాధారణం. అదే టిల్లు వస్తే హిస్టరీ, మిస్టరీ, కెమిస్ట్రీ అన్నీ రిపీట్ అవ్వుతాయి. అట్లుంటది టిల్లుతోని. టిల్లు స్క్వేర్ తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీలో నెట్‌ఫ్లిక్స్‌లో ఏప్రిల్ 26న వస్తుంది.' అంటూ పోస్ట్ చేసింది. ఇది చూసిన ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాగా.. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. History repeat avvadam normal. Adhe Tillu vasthe History, mystery, chemistry anni repeat avvuthai. Atluntadhi Tilluthoni. ✨🥰 Tillu Square arrives on 26 April, on Netflix in Telugu, Tamil, Malayalam, Kannada & Hindi. pic.twitter.com/SwEzFgJujb — Netflix India South (@Netflix_INSouth) April 19, 2024 -
నెల రోజుల్లోపే ఓటీటీకి టిల్లు స్క్వేర్.. స్ట్రీమింగ్ డేట్ అదేనా?
సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన 'టిల్లు స్క్వేర్'. ఈ చిత్రాన్ని మల్లిక్ రామ్ దర్శకత్వంలో తెరకెక్కించారు. డీజే టిల్లుకు సీక్వెల్‌గా ఈ సినిమాను రూపొందించారు. గతంలో రిలీజైన డీజే టిల్లు సూపర్ హిట్ కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మార్చి 29 ప్రేక్షకుల ముందుకొచ్చిన టిల్లు స్క్వేర్ బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్ సొంతం చేసుకుంది. దాదాపు రూ.100 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించింది. టిల్లు స్క్వేర్ సూపర్ హిట్ కావడంతో ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్పై ఆసక్తి నెలకొంది. ఎప్పుడెప్పుడు ఓటీటీకి వస్తుందా అని ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఇప్పటికే ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను భారీ ధరకు ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ దక్కించుకుంది. తాజా బజ్ ప్రకారం ఈనెలలోపే టిల్లు స్క్వేర్ ఓటీటీలో సందడి చేయనున్నట్లు తెలుస్తోంది. ఏప్రిల్ 26 నుంచే స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఒకవేళ ఈ డేట్ ఫిక్స్ అయితే కేవలం నెల రోజుల్లోపే ఓటీటీలో అలరించనుంది. -
'టిల్లు స్క్వేర్' నుంచి అదిరిపోయే వీడియో సాంగ్ విడుదల
డీజే టిల్లుకు సీక్వెల్‌గా విడుదలైన 'టిల్లు స్క్వేర్' బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్‌తో దుమ్మురేపుతుంది. సిద్ధు జొన్నలగడ్డ- అనుపమ పరమేశ్వరన్ అల్లరికి ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. మార్చి 29న విడుదలైన ఈ చిత్రాన్ని రెండోసారి కూడా చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తిచూపుతున్నారు. మొదటి పార్ట్‌కు మించిన ఫన్ ఈ చిత్రంలో ఉండటంతో యూత్‌కు బాగా దగ్గరైంది. సిద్దు తనదైన స్టైల్లో వన్ లైనర్ డైలాగ్స్‌తో సినిమాను దడదడలాడించేశాడు. కథకు తగ్గట్టు హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ కూడా చెలరేగిపోయింది. సినిమా విడుదలై మూడు వారాలు పూర్తి కావస్తుంది. దీంతో తాజాగా ఈ సినిమా నుంచి టికెట్టే కొనకుండా అనే వీడియో సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. రామ్ మిరియాల ఈ పాటను పాడటమే కాకుండా మ్యూజిక్‌ను కూడా అందించారు. ట్రెండింగ్ సాంగ్ కావడంతో ప్రస్తుతం యూట్యూబ్‌లో దూసుకుపోతుంది. టిల్లు గాడి ఫన్‌కు మెచ్చిన ఆడియన్స్ ఇప్పటి వరకు రూ. 115 కోట్ల గ్రాస్‌ను కలెక్షన్స్ రూపంలో ఇచ్చేశారు. -
అనుపమకు అవమానం.. ఎన్టీఆర్ ముందే..!
అనుపమ పరమేశ్వరన్.. ఈ మలయాళ బ్యూటీ తెలుగులో అడుగుపెట్టిన కొంతకాలానికే ఇక్కడి ప్రేక్షకులు ఆమెను అక్కున చేర్చుకున్నారు. గ్లామర్ రోల్స్ చేయకుండా పర్ఫామెన్స్‌కు స్కోప్ ఉన్న పాత్రలు చేసుకుంటూ వచ్చింది అనుపమ. అందుకే ఆడియన్స్‌కు తెగ నచ్చేసింది. కానీ ఎంతకాలమని గిరి గీసుకుని బతకాలి? గ్లామర్ పాత్రలు కూడా ఓసారి చేసి చూస్తే పోలా? అనుకుంది. అలా టిల్లు స్క్వేర్‌లో భాగమైంది. డీజే టిల్లుకు సీక్వెల్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో అనుపమ తొలిసారి బోల్డ్‌గా నటించింది. ఇంకేముంది అభిమానులు హర్టయ్యారు, తనను ట్రోల్ చేశారు, ఇంకా చేస్తూనే ఉన్నారు. అనుపమకు ఇలాంటి పరిస్థితా? టిల్లు స్క్వేర్ మార్చి 29న విడుదలవగా, కొద్ది రోజుల్లోనే వంద కోట్లు రాబట్టింది. ఈ సందర్భంగా సోమవారం నాడు టిల్లు స్క్వేర్ బ్లాక్‌బస్టర్ సెలబ్రేషన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ ముఖ్య అతిథులుగా విచ్చేశారు. అనుపమ స్టేజీపైకి వచ్చి మాట్లాడబోతుంటే అక్కడున్న జనాలు వద్దని గోల చేశారు. అది గమనించిన అనుపమ మాట్లాడకుండా వెళ్లిపోవాలా? అని సైగ చేసింది. అయినా సరే ఎవరూ నిశ్శబ్దంగా ఉండటానికి ప్రయత్నించలేదు. మాట్లాడొచ్చా? వద్దా? అని అడగ్గా వద్దని చెప్పారు. దీంతో హర్టయిన అనుపమ.. సరే వెళ్లిపోతాను అనేసింది. కనీసం ఒక్క నిమిషం దీంతో యాంకర్ సుమ పరిస్థితిని చక్కబెట్టేందుకు ప్రయత్నించింది. ఆమెను తిరిగి స్టేజీపైకి తీసుకొచ్చింది. ఒక రెండు నిమిషాలైనా మాట్లాడొచ్చా? అని అనుపమ రిక్వెస్ట్ చేయగా దానికీ నిరాకరించారు. కనీసం ఒక్క నిమిషం మాట్లాడతానని అభ్యర్థిస్తూ ప్రసంగం మొదలుపెట్టింది. ముందుగా స్పెషల్ గెస్ట్‌గా వచ్చిన తారక్‌కు కృతజ్ఞతలు తెలియజేసింది. నాకేం బాధ లేదు.. అభిమానుల ఎమోషన్స్ అర్థం చేసుకోగలను.. ఆ ఎగ్జయిట్మెంట్లో నేనూ అలాగే ప్రవర్తిస్తాను. ఇక్కడికి విచ్చేసిన అందరికీ థ్యాంక్స్ అని చెప్పి ముగించింది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారగా చాలామంది అక్కడి అభిమానుల ప్రవర్తనను తప్పుపడుతున్నారు. హీరోయిన్ను అలా కించపరచడం తప్పని కామెంట్లు చేస్తున్నారు. 🤦♂️ Our Crowd! pic.twitter.com/dLF2rj2JEG — Christopher Kanagaraj (@Chrissuccess) April 9, 2024 చదవండి: అమాయకుడైన చైని మోసం చేశావ్.. ఇచ్చిపడేసిన సామ్ -
‘ టిల్లు స్క్వేర్’ బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
వారిద్దర్నీ చూస్తుంటే గర్వంగా ఉంది: ఎన్టీఆర్
‘‘విశ్వక్ సేన్‌కి, సిద్ధుకి చాలాసార్లు చెప్పాను. మీపై నమ్మకం ఉంది.. ఇండస్ట్రీ ముందుకు వెళ్లడానికి చాలా సాయపడతారు, కష్టపడతారు అని. ఈ రోజు వారిద్దర్నీ చూస్తుంటే చాలా గర్వంగా, ఆనందంగా ఉంది. కొత్త ఆలోచనలను ముందుకు తీసుకెళ్లటానికి చిత్ర పరిశ్రమకి ఇలాంటి డేర్ డెవిల్స్ కావాలి’’ అని హీరో ఎన్టీఆర్ అన్నారు. సిద్ధు జొన్నలగడ్డ, అనుపమా పరమేశ్వరన్ జంటగా మల్లిక్ రామ్ దర్శకత్వం వహించిన చిత్రం ‘టిల్లు స్క్వేర్’. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ చిత్రం మార్చి 29న విడుదలైంది. ఈ సందర్భంగా సోమవారం నిర్వహించిన ‘డబుల్ బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్ ఆఫ్ టిల్లు స్క్వేర్’ వేడుకకి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎన్టీఆర్ మాట్లాడుతూ– ‘‘నవ్వించడం ఓ వరం. నవ్వకపోవడం అనేది శాపం. నేను నవ్వడం మొదలుపెడితే ఆపుకోవడం కష్టం. అలాంటిది నేను ఇక నవ్వలేను బాబోయ్ అనేలా ‘టిల్లు స్క్వేర్’తో నవ్వించాడు సిద్ధు.. చాలామందిని నవ్వించాడు. మల్లిక్ రామ్‌గారు ‘టిల్లు స్క్వేర్’ని అద్భుతంగా తీశారు. అనుపమ, నేహాశెట్టి లేకపోతే ఈ సినిమా ఇంత హిట్టయ్యేది కాదు. ఇక ‘దేవర’ సినిమా రిలీజ్ లేట్ అయినా సరే.. రేపు మీరందరూ (ఫ్యాన్స్) కాలర్ ఎగరేసుకునేలా ఆ చిత్రాన్ని అందించటానికి ప్రయత్నిస్తాం’’ అన్నారు. డైరెక్టర్ త్రివిక్రమ్ మాట్లాడుతూ– ‘‘టిల్లు స్క్వేర్’ వంద కోట్లు చేసింది. ‘దేవర’తో ఎన్టీఆర్ వెయ్యి కోట్ల వసూళ్లు సాధించాలి’’ అన్నారు. సిద్ధు జొన్నలగడ్డ మాట్లాడుతూ–‘‘త్రివిక్రమ్‌గారి నుంచి ఎంతో నేర్చుకున్నాను. ‘డీజే టిల్లు’, ‘టిల్లు స్క్వేర్’ సినిమాలకి నీకు ఏవైనా అవార్డులు వచ్చాయా? అని నన్ను చాలామంది అడిగారు. వారందరికీ ఎన్టీఆర్ అన్న నా గురించి మాట్లాడిన వీడియో చూపించి.. ఇంతకంటే పెద్ద అవార్డు ఏదైనా ఉందా? అన్నాను’’ అన్నారు. ‘‘అందరి కృషి వల్లే ఈ సినిమా బ్లాక్‌బస్టర్ అయ్యింది’’ అన్నారు మల్లిక్ రామ్. -
ముద్దు సీన్లో నటిస్తే తప్పేంటి?: అనుపమ
తమిళసినిమా: పక్కింటి అమ్మాయిగా ఇమేజ్ తెచ్చుకున్న అతి తక్కువ మంది నటీమణుల్లో అనుపమ పరమేశ్వరన్ ఒకరు. అలాంటిది ఇప్పుడీ మలయాళీ భామ కూడా గ్లామర్‌కు గేట్లు ఎత్తేశారు. ప్రేమమ్ చిత్రంతో ముగ్గురు హీరోయిన్లలో ఒకరిగా పరిచయం అయిన ఈమె తమిళంలోనూ కొడి, తల్లిపోగాదే, సైరన్ వింటి చిత్రాల్లో నటించారు. ఇక తెలుగులో కథానాయకిగా పలు హిట్ చిత్రాల్లో నటించి పేరు తెచ్చుకున్నారు. కాగా ఇటీవల టిల్లు స్క్వేర్ అనే తెలుగు చిత్రంలో లిప్‌లాక్, అందాలారబోత అంటూ విజృంభించారు. దీంతో నటి అనుపమ పరమేశ్వరన్‌నే ఇలా నటించింది? అని చాలా మంది ఆశ్చరపడుతున్నారు. కొందరైతే అంతా బాగా ఉందిగా సడన్‌గా ఈ అమ్మడికి ఏమొచ్చిందీ? అంటూ విమర్శల వర్షం కురిపిస్తున్నారు. మొత్తం మీద అ కేరళ కుట్టి ఇప్పుడు వార్తలో నానుతున్నారు. గుడ్డిలో మెల్ల అన్న సామెత మాదిరి ఈమె నటించిన టిల్లు స్క్వేర్ చిత్రం హిట్ అయ్యింది. అందాలారబోత అనే విషయాన్ని పక్కన పెడితే అనుపమ పరమేశ్వరన్‌కు ఈ చిత్రం మంచి పేరు తెచ్చి పెట్టింది. గ్లామర్‌గా నటించడంపై వస్తున్న విమర్శనలపై అనుపమ ఘాటుగానే స్పందించారు. ఈమె ఒక భేటీలో పేర్కొంటూ తాను లిప్‌లాక్ సన్నివేశంలో నటించడాన్ని ఏదో పెద్ద తప్పు చేసినట్లు విమర్శిస్తున్నారనీ, తాను ముద్దు సన్నివేశాల్లో నటించననీ, గ్లామరస్‌గా నటించనని చెప్పింది తన 18 ఏళ్ల వయసులోనని అన్నారు. అయితే నటిగా తానిప్పుడు చాలా పరిణితి చెందానన్నారు. కథకు అవసరం అయితే లిప్‌లాక్ వంటి సన్నివేశాల్లో నటించడం తప్పేకాదని అన్నారు. అంతే కాకుండా ఒకేరకమైన మూస పాత్రల్లో నటించి బోర్ కొడుతోందని పేర్కొన్నారు. మరో విషయం ఏమిటంటే టిల్లు స్క్వేర్ చిత్రం చూసిన తరువాత ప్రశంసించడమో, విమర్శించడమో చేయవచ్చు గానీ, చిత్రం చూడకుండానే విమర్శించడం కరెక్ట్ కాదని నటి అనుపమ పరమేశ్వరన్ ఫైర్ అయ్యారు. -
ఇక్కడ టిల్లు స్క్వేర్.. అక్కడ క్రూ.. రెండింట్లో ఒకటి కామన్!
కంటెంట్ బాగుంటే చాలు.. బడ్జెట్, తారాగణం.. ప్రమోషన్స్.. ఇవేవీ పట్టించుకోరు జనాలు. ఎంటర్టైన్మెంట్ గ్యారెంటీ అనిపించిందా.. అది చిన్న సినిమా అయినా, పెద్ద సినిమా అయినా లెక్క చేయకుండా పోలోమని థియేటర్లకు వెళ్లిపోతుంటారు. అలా ఈ మధ్య ప్రేమలు, మంజుమ్మెల్ బాయ్స్ బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్‌గా నిలిచాయి. తెలుగులో డీజే టిల్లుకు సీక్వెల్‌గా వచ్చిన టిల్లు స్క్వేర్ సైతం సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. రేపటితో వంద కోట్ల క్లబ్బులో చేరడం ఖాయంగా కనిపిస్తోంది. ఓన్లీ మ్యాజిక్ టిల్లు స్క్వేర్‌లో కథ అంటూ ప్రత్యేకంగా ఏమీ ఉండదు.. ఓన్లీ మ్యాజిక్ అంతే! పంచులు, కామెడీ డైలాగులు పటాసుల్లా పేలుతాయి. అలాంటి మ్యాజిక్‌తోనే బాలీవుడ్లో ఓ సినిమా వచ్చింది.. అదే క్రూ. ఇందులో పెద్దగా ఎమోషన్స్ ఉండవు, సీరియస్ సినిమా కానే కాదు.. కామెడీ ఎంటర్టైనర్. ముగ్గురు ఫ్లయిట్ అటెండెట్లు.. కరీనా, టబు, కృతి పని చేసే ఎయిర్‌లైన్స్ త్వరలో దివాలా తీస్తుందని ఓ రూమర్. కథేంటంటే? పని ఎక్కువ, జీతాలు తక్కువ, మరోవైపు ఉద్యోగం ఎప్పుడు ఊడుతుందోనన్న భయం. ఈ ముగ్గురూ ఉన్న ఫ్లయిట్లో ఓరోజు సడన్‌గా ఓ పెద్దాయన కుప్పకూలిపోతాడు. తన చొక్కా కింద బంగారు కడ్డీలు కనిపిస్తాయి. అవి కొట్టేసి జీవితంలో సెటిలైపోవాలనేది వారి ఆశ. తరువాత ఏమైందన్నదే కథ. ముగ్గురు హీరోయిన్ల మధ్య కామెడీ బాగా వర్కవుట్ అయింది. కలెక్షన్స్ ఎంతంటే? మార్చి 29న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు హిందీ బాక్సాఫీస్ వద్ద పోటీ లేకపోవడంతో దూసుకుపోతోంది. రాజేశ్ ఏ కృష్ణన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఇప్పటివరకు రూ.87 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. చూస్తుంటే త్వరలోనే రూ.100 కోట్లు దాటేసేలా కనిపిస్తోంది. అక్షయ్ కుమార్- టైగర్ ష్రాఫ్‌ల బడే మియా చోటే మియా, అజయ్ దేవ్‌గణ్ మైదాన్ ఈ నెల 10న రిలీజ్ కానుంది. అప్పటివరకు క్రూ మూవీ కలెక్షన్స్‌కు ఎలాంటి ఢోకా లేనట్లే! CREW is flying high with a strong start at the box office with a solid week 1 collection! 🛫#CrewInCinemasNow Book your tickets now: https://t.co/jAZNn6fYMR#Tabu #KareenaKapoorKhan @kritisanon @diljitdosanjh and a special appearance by @KapilSharmaK9 pic.twitter.com/IZJnvt9QIC — BalajiMotionPictures (@balajimotionpic) April 5, 2024 చదవండి: మలయాళంలో రూ.200 కోట్లు వసూలు చేసిన మంజుమ్మల్ బాయ్స్ ఎలా ఉంది? -
‘టిల్లు’భామ : చీరలో స్టన్నింగ్ అండ్ గ్లామర్ లుక్స్ (ఫోటోలు)
-
జానకిగా వచ్చేస్తున్న 'అనుపమ పరమేశ్వరన్'
'టిల్లు స్క్వేర్'తో హిట్ కొట్టిన అనుపమ పరమేశ్వరన్ నుంచి మరో కొత్త సినిమా రానుంది. మలయాళం సినిమా 'జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ' పేరుతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. కోర్ట్ రూమ్ డ్రామాగా రూపొందుతోన్న ఈ మూవీ ద్వారా దాదాపు రెండేళ్ల విరామం అనంతరం మలయాళంలోకి రీఎంట్రీ ఇవ్వబోతున్నది అనుపమ పరమేశ్వరన్. ‘టిల్లు స్క్వేర్’లో గ్లామర్ పాత్రలో అదరగొట్టిన అనుపమ ఇప్పుడు కేరళ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడే పాత్రలో కనిపించనుంది. ఇందులో జానకిగా అనుపమ ప్రేక్షకుల ముందుకు రానుంది. లాయర్‌గా మలయాళ సీనియర్ నటుడు సురేశ్ గోపి నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమాలోని తన పాత్రకు సంబంధించిన డబ్బింగ్ పనులు పూర్తి చేసుకున్న అనుపమ దర్శకుడితో ఉన్న ఫొటోను తాజాగా తన ఇన్‌స్టాలో పంచుకుంది. 'నా తదుపరి చిత్రానికి డబ్బింగ్ పూర్తైంది' అంటూ అందులో రాసుకొచ్చింది. కేరళ ప్రభుత్వానికి వ్యతిరేకంగా న్యాయం కోసం పోరాడే జానకి అనే యువతిగా అనుపమ పరమేశ్వరన్ కనిపించనుండగా.. ఆమె తరఫున కేసును వాదించే లాయర్ పాత్రలో సురేష్ గోపి నటిస్తున్నాడు. మలయాళంతో పాటు తెలుగులో కూడా ఈ సినిమా విడుదల కానుంది. ఈ చిత్రానికి ప్రవీణ్ నారాయణన్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాతో సురేష్ గోపి కుమారుడు మాధవ్ సురేష్ ఎంట్రీ ఇస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. -
బెంచ్ మార్క్ దగ్గర్లో 'టిల్లు స్క్వేర్' కలెక్షన్స్
డీజే టిల్లుకు సీక్వెల్‌గా విడుదలైన టిల్లు స్క్వేర్ బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్‌తో దుమ్మురేపుతుంది. సిద్ధు జొన్నలగడ్డ- అనుపమ పరమేశ్వరన్ అల్లరికి ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. ప్రస్తుతం అదిరిపోయే టాక్‌తో ఈ సినిమా దూసుకుపోతుంది. మొదటి పార్ట్‌కు మించిన ఫన్ ఈ చిత్రంలో ఉండటంతో యూత్‌కు బాగా దగ్గరైంది. తాజాగా ఈ సినిమా కలెక్షన్స్ వివరాలను మేకర్స్ ప్రకటించారు. సిద్దు తనదైన స్టైల్లో వన్ లైనర్ డైలాగ్స్‌తో సినిమాను దడదడలాడించేశాడు. కథకు తగ్గట్టు హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ కూడా చెలరేగిపోయింది. ఇంకేముంది కేవలం ఆరు రోజుల్లో రూ.91 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చిపడ్డాయి. వంద కోట్ల బెంచ్ మార్క్‌కు దగ్గర్లో ఉంది ఈ చిత్రం. నేటి కలెక్షన్స్‌తో ఆ మార్క్‌ను బీట్ చేసే ఛాన్స్ ఉంది. సినిమా ఫస్ట్ షాట్ నుంచి చివరి షాట్ దాకా సిద్ధూ విశ్వరూపం చూపించాడని చెప్పవచ్చు. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ చిత్రాన్ని మల్లిక్ రామ్ డైరెక్టె చేశారు. ఈ మూవీలో సిద్ధు హీరో పాత్రతో పాటు రచన, స్క్రీన్‌ప్లేలో భాగమయ్యారు. ఓటీటీలో ఎప్పుడంటే.. మార్చి 29న విడుదలైన 'టిల్లు స్క్వేర్' హిట్ టాక్‌తో దూసుకుపోతుంది. ఓటీటీలో ఎప్పుడు వస్తుందా అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. టిల్లు స్క్వేర్ చిత్ర డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ సంస్థ అయిన నెట్‌ఫ్లిక్స్ దక్కించుకుంది. రూ. 15 కోట్లకు పైగానే ఈ సినిమా రైట్స్ కోసం వెచ్చించినట్లు సమాచారం. ఇకపోతే ఈ సినిమా థియేట్రికల్ రన్ నెల రోజులు పూర్తి అయిన తర్వాతే ఓటీటీలోకి రానుంది. అంటే ఏప్రిల్ చివరి వారం లేదా మే నెలలోని మొదటి వారంలో తప్పకుండా ఓటీటీలోకి టిల్లుగాడు వస్తాడని టాక్ వినిపిస్తుంది. #TilluSquare Double Blockbuster Run at the box-office is unstoppable, grosses over 𝟗𝟏 𝐂𝐑 𝐢𝐧 𝟔 𝐃𝐚𝐲𝐬! 💥 All set to cross 𝟏𝟎𝟎𝐂𝐑 𝐆𝐫𝐨𝐬𝐬 Mark!! 🔥😎 Our Starboy 🌟 shattering records all over! 🤘 - https://t.co/vEd8ktSAEW pic.twitter.com/lb0pYUwib4 — Sithara Entertainments (@SitharaEnts) April 4, 2024 -
ఫోటో షేర్ చేసిన అనుపమ పరమేశ్వరన్.. ఆమె ఎవరో తెలుసా?
అనుపమ పరమేశ్వరన్.. తెలుగువారికి పరిచయం అక్కర్లేని కేరళ కుట్టి. మన పక్కింటి పిల్లలా సరదాగా మనందరిలో కలిసిపోయిందీ అమ్మాయి. 'ప్రేమమ్'తో పరిచయమై తెలుగువారి ప్రేమను గెలుచుకుంది. తాజాగా విడుదలైన టిల్లు స్క్వేర్ సినిమాతో తనలో దాగి ఉన్న మరో టాలెంట్‌ను ప్రేక్షకులకు చూపించింది. సినిమా చూసిన వారందరూ లిల్లీ పాప దుమ్మురేపింది రా.. అంటూ కామెట్లు చేస్తున్నారు. తాజాగా అనుపమ పరమేశ్వరన్ తన అమ్మగారు అయిన సునీత ఫోటోను షేర్ చేసింది. నేడు (ఏప్రిల్ 3) సునీత పుట్టినరోజు కావడంతో సోషల్ మీడియా ద్వారా అనుపమ శుభాకాంక్షలు తెలిపింది. అనుపమ మాదిరే సునీత కూడా ఎక్కువగా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. దీంతో నెటిజన్లు కూడా ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతున్నారు. కొందరైతే ఏకంగా అత్తమ్మా.. హ్యాపీ బర్త్‌డే అంటూ సరదాగా కామెంట్లు చేస్తున్నారు. అత్తమ్మో.. నీ కూతురు జాగ్రత్త అని మరికొందరూ ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. కేరళలోని త్రిస్సూర్ జిల్లా ఇరింజలకుడలో పుట్టిన అనుపమ.. ఇంటర్ వరకు మాత్రమే చదివి సినిమాల మీద ఆసక్తితో వెండితెరపై అడుగుబెట్టి విజయం సాధించింది. నాన్న పరమేశ్వరన్, అమ్మ సునీత, సోదరుడు అక్షయ్ ఉన్నారు. తన బలం అమ్మే అంటూ చెబుతున్న అనుపమ అప్పడప్పుడు ఆమెను ఆటపట్టిస్తుంది కూడా.. ఒక్కోసారి పలు కార్టూన్స్‌తో తన తల్లి గురించి చెబుతూ పోస్ట్ వేసి అందరినీ నవ్వించేస్తోంది. ప్రస్తుతం టిల్లు స్క్వేర్ విజయాన్ని ఎంజాయ్ చేస్తున్న అనుపమకు నేడు తన అమ్మగారి పుట్టినరోజు కావడంతో తన ఆనందం డబుల్ అయిందని చెప్పవచ్చు. View this post on Instagram A post shared by Anupama Parameswaran (@anupamaparameswaran96) -
టిల్లు 3 స్టోరీ లీక్ చేసిన హీరో సిద్దు
-
టిల్లుతో మ్యాజిక్ సక్సెస్ : లిల్లీ అదిరిపోయే లుక్స్ (ఫొటోలు)
-
టిల్లు స్క్వేర్: శ్రీసత్యకు అన్యాయం!
తల్లిని మించి దైవమున్నదా...? శ్రీసత్య కూడా ఇదే అనుకుంది. తనను కనిపెంచిన అమ్మ మంచాన పడి ఉంటే తట్టుకోలేకపోయింది. ఎవరినో ప్రేమించి, మోసపోయిన శ్రీసత్య చావు అంచులదాకా వెళ్లి తల్లి కోసం బతికొచ్చింది. అమ్మకు మంచి వైద్యం చేయించాలనుకుంది. అందుకనే సీరియల్స్, షోలు, వెబ్ సిరీస్‌లు.. ఏవి వచ్చినా చేసుకుంటూ పోయింది. అలా బిగ్‌బాస్ అవకాశాన్ని కూడా వాడుకుంది.తెలుగు బిగ్‌బాస్ ఆరో సీజన్లో పాల్గొంది. తర్వాత పెద్దగా కనిపించడమే లేదు. మొన్నామధ్య ఓ ఇంటర్వ్యూకు హాజరైన బ్యూటీ.. టిల్లు స్క్వేర్‌లో మంచి పాత్ర చేస్తున్నట్లు తెలిపింది. సిద్ధు జొన్నలగడ్డతో మంచి సన్నివేశాలున్నాయని, ప్రాధాన్యత ఉన్న పాత్ర చేస్తున్నానంది. డైలాగ్స్ చెప్పేటప్పుడు మొదటిరోజు కాస్త టెన్షన్ పడ్డానని, తర్వాత మామూలుగా చెప్పేశానంది. కట్ చేస్తే నాలుగు రోజుల క్రితమే టిల్లు స్క్వేర్ రిలీజైంది.సినిమాలో ఒక పాట మినహా ఎక్కడా శ్రీసత్య కనిపించలేదు. ఆ పాటలో కూడా బ్యాగ్రౌండ్ డ్యాన్సర్లలో ఒకరిగా సెకనుపాటు మెరిసిందంతే! అంటే శ్రీసత్య సీన్లు డిలీట్ చేశారని అర్థమవుతోంది. ఇది చూసిన అభిమానులు శ్రీసత్యకు అన్యాయం చేశారని ఫీలవుతున్నారు. సిద్ధు- శ్రీసత్యల సన్నివేశాలు ఉంచాల్సిందని అభిప్రాయపడుతున్నారు. -
టిల్లు స్క్వేర్‌లో శ్రీసత్య.. సీన్స్ డిలీట్ చేశారా?
తల్లిని మించి దైవమున్నదా...? శ్రీసత్య కూడా ఇదే అనుకుంది. తనను కనిపెంచిన అమ్మ మంచాన పడి ఉంటే తట్టుకోలేకపోయింది. ఎవరినో ప్రేమించి, మోసపోయిన శ్రీసత్య చావు అంచులదాకా వెళ్లి తల్లి కోసం బతికొచ్చింది. అమ్మకు మంచి వైద్యం చేయించాలనుకుంది. అందుకనే సీరియల్స్, షోలు, వెబ్ సిరీస్‌లు.. ఏవి వచ్చినా చేసుకుంటూ పోయింది. అలా బిగ్‌బాస్ అవకాశాన్ని కూడా వాడుకుంది. హీరోతో సీన్స్ ఉన్నాయ్ తెలుగు బిగ్‌బాస్ ఆరో సీజన్లో పాల్గొంది. తర్వాత పెద్దగా కనిపించడమే లేదు. మొన్నామధ్య ఓ ఇంటర్వ్యూకు హాజరైన బ్యూటీ.. టిల్లు స్క్వేర్‌లో మంచి పాత్ర చేస్తున్నట్లు తెలిపింది. సిద్ధు జొన్నలగడ్డతో మంచి సన్నివేశాలున్నాయని, ప్రాధాన్యత ఉన్న పాత్ర చేస్తున్నానంది. డైలాగ్స్ చెప్పేటప్పుడు మొదటిరోజు కాస్త టెన్షన్ పడ్డానని, తర్వాత మామూలుగా చెప్పేశానంది. కట్ చేస్తే నాలుగు రోజుల క్రితమే టిల్లు స్క్వేర్ రిలీజైంది. సినిమా మొత్తం మీద.. సినిమాలో ఒక పాట మినహా ఎక్కడా శ్రీసత్య కనిపించలేదు. ఆ పాటలో కూడా బ్యాగ్రౌండ్ డ్యాన్సర్లలో ఒకరిగా సెకనుపాటు మెరిసిందంతే! అంటే శ్రీసత్య సీన్లు డిలీట్ చేశారని అర్థమవుతోంది. ఇది చూసిన అభిమానులు శ్రీసత్యకు అన్యాయం చేశారని ఫీలవుతున్నారు. సిద్ధు- శ్రీసత్యల సన్నివేశాలు ఉంచాల్సిందని అభిప్రాయపడుతున్నారు. చదవండి: 'జనతా గ్యారేజ్' నటుడితో అనుశ్రీ డేటింగ్..ఒత్తిడిలో హీరోయిన్ -
మెగాస్టార్ చిరంజీవి మెచ్చిన 'టిల్లు స్క్వేర్' (ఫొటోలు)
-
మెగాస్టార్ చిరంజీవి మెచ్చిన 'టిల్లు స్క్వేర్' (ఫొటోలు)
-
చిరంజీవితో సినిమా ఛాన్స్.. ఎందుకు నో చెప్పానంటే: సిద్ధు జొన్నలగడ్డ
సిద్ధు జొన్నలగడ్డ , అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన చిత్రం ‘టిల్లు స్క్వేర్’. ‘డీజే టిల్లు’ చిత్రానిక సీక్వెల్‌గా మార్చి 29న విడుదలైంది. మల్లిక్ రామ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు కథ, మాటలు సిద్ధు జొన్నలగడ్డ అందించడం విశేషం. కేవలం రెండు రోజుల్లోనే రూ. 45 కోట్ల గ్రాస్‌ను రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. హిట్ టాక్‌తో దూసుకుపోతున్న ఈ సినిమా రూ. 100 కోట్ల క్లబ్లో చేరడం ఖాయం అని చెప్పవచ్చు. యూత్‌లో మంచి క్రేజ్ ఉన్న సిద్ధూకు మెగాస్టార్ చిరంజివితో కలిసి నటించే ఛాన్స్ వచ్చింది. కానీ దానిని సిద్ధూనే వద్దనుకున్నాడని గతంలో చాలానే వార్తలు వచ్చాయి. అయితే ఈ విషయంపై ఆయన ఎక్కడా ఇప్పటి వరకు రియాక్ట్ కాలేదు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తొలిసారి ఈ విషయంపై ఇలా స్పందించాడు. 'తెలుగు ఇండస్ట్రీలో నాకు బాగా నచ్చిన హీరో విక్టరీ వెంకటేష్ గారు.. ఆయనే నాకు ఆల్‌టైమ్ ఫేవరెట్. నా సినిమా కెరియర్‌పై ఆయన ప్రభావం కాస్త ఎక్కువగానే ఉంది. ఇండస్ట్రీలో చిరంజీవి గారు, అమితాబ్ బచ్చన్ గారు, రజనీకాంత్ గారు ఇలా టాప్ లెజండరీ హీరోలతో కలిసి పని చేయాలని కోరిక నాకు కూడా ఉంది. ఈ క్రమంలో చిరంజీవి గారితో కలిసి నటించే ఛాన్స్ వచ్చింది. కానీ కొన్ని కారణాల వల్ల అది సెట్ కాలేదు. తెలుగు సినిమా పరిశ్రమ అంటే మొదటగా ఎవరికైనా గుర్తుకువచ్చే పేరు చిరంజీవి.. ఆయనొక సూపర్ హ్యూమన్ అలాంటి హీరోతో కలిసి నటించే అవకాశం వస్తే.. అది బెస్ట్ ప్రాజెక్ట్ కావాలనేది నా అభిప్రాయం. ఆ సినిమా మరో ప్రపంచాన్ని చూపించాలి. చిరంజీవిగారితో కలిసి పనిచేశానని భవిష్యత్‌లో నా పిల్లలకు గర్వంగా చెప్పుకునేలా ఉండాలి. అలాంటి ప్రాజెక్ట్ కోసం ఎదురుచూస్తున్నాను. దేవుడి దయ ఉంటే చిరంజీవి గారితో అలాంటి అవకాశం వస్తుంది. ఈ క్రమంలో ఎవరో ఒకరు అందుకు తగిన కథను ఆయనకు తప్పకుండా అందిస్తారు. ఆ రోజు వస్తుంది అనుకుంటున్నాను. మెగాస్టార్ స్టార్డమ్కు సమానంగా సినిమా తీయడం అంత సులభమైన విషయం కాదు. అలాంటి ఛాన్స్ వస్తుందని ఎదురుచూస్తున్నాను.' అని ఆయన చెప్పారు. -
కలెక్షన్స్‌తో మోత మోగిస్తున్న టిల్లుగాడు.. ఓటీటీలోకి వచ్చేది ఎప్పుడంటే
'టిల్లు స్క్వేర్'తో థియేటర్లలో మోత మోగిస్తున్నాడు డీజే టిల్లు గాడు.. బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్‌తో దూసుకుపోతున్నాడు సిద్ధు జొన్నలగడ్డ. మరోసారి తన డిఫరెంట్ యాటిట్యూడ్ స్టైల్ యాక్టింగ్‌తో అదరగొట్టేశాడు. భారీ అంచనాలతో థియేటర్లోకి వచ్చిన వారిని టిల్లు గాడు విపరీతంగా నవ్వించడమే కాకుండా ఎంటర్టైన్మెంట్ను పంచాడు. అలా బాక్సాఫీస్ వద్ద టిల్లు స్క్వేర్తో సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ ర్యాంపేజ్ ఆడించారు. ఓటీటీలో ఎప్పుడంటే.. ప్రస్తుతం ఐపీఎల్ సీజన్ నడుస్తున్నా కూడా 'టిల్లు స్క్వేర్' హిట్ టాక్‌తో దూసుకుపోతుంది. మార్చి 29న వచ్చిన ఈ సినిమా ఓటీటీలో ఎప్పుడు వస్తుందా అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. టిల్లు స్క్వేర్ చిత్ర డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ సంస్థ అయిన నెట్‌ఫ్లిక్స్ దక్కించుకుంది. రూ. 15 కోట్లకు పైగానే ఈ సినిమా రైట్స్ కోసం వెచ్చించినట్లు సమాచారం. ఇకపోతే ఈ సినిమా థియేట్రికల్ రన్ నెల రోజులు పూర్తి అయిన తర్వాతే ఓటీటీలోకి రానుంది. అంటే ఏప్రిల్ చివరి వారం లేదా మే నెలలోని మొదటి వారంలో తప్పకుండా ఓటీటీలోకి టిల్లుగాడు వస్తాడని టాక్ వినిపిస్తుంది. సినిమాకు మంచి టాక్ వస్తుంది కాబట్టి మరో 20రోజుల తర్వాత ఓటీటీ ప్రకటన అధికారికంగా రావచ్చు. 'టిల్లు స్క్వేర్' కలెక్షన్స్ టిల్లుగాడి డీజేకు యూత్ బాగా ఫిదా అయ్యారు. దీంతో ఈ సినిమాకు మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ. 23.7 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చినట్లు మూవీటీమ్ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా రెండు రోజులకు రూ.45.3 కోట్లు వచ్చినట్లు చిత్ర యూనిట్ తెలిపింది. రూ.100 కోట్ల గ్రాస్ టార్గెట్ పెట్టుకున్న నిర్మాతకు ఈ సినిమా అంతకు మించి కలెక్షన్స్ తెచ్చిబెట్టే ఛాన్స్ ఉంది. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇక నేడు(మార్చి 31) ఆదివారం కాబట్టి మరింత భారీ కలెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. Tillanna Box-office RAMPAGE Continues, grosses over 𝟒𝟓.𝟑 𝐂𝐑 in 𝟐 𝐃𝐚𝐲𝐬 🔥🔥 Our Starboy 🌟 continues to shatter records all over! 💥💥 - https://t.co/vEd8ktSAEW #TilluSquare #Siddu @anupamahere @MallikRam99 @ram_miriyala @achurajamani #BheemsCeciroleo pic.twitter.com/Y3TeL0adtG — Sithara Entertainments (@SitharaEnts) March 31, 2024 -
Tillu Square Box Office Collection: బాక్సాఫీస్‌ని షేక్ చేస్తున్న ‘టిల్లుగాడు’
లేట్‌గా వచ్చినా లేటెస్ట్గా వచ్చినంటోన్నాడు సిద్దు జొన్నలగడ్డ. ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం ‘టిల్లు స్వ్కేర్’. మార్చి 29న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం తొలి రోజే హిట్ టాక్ సంపాదించుకుంది. టిల్లుగాడి మ్యానరిజం, పంచ్ డైలాగ్స్‌కి సినీ ప్రేక్షకులు మరోసారి ఫిదా అయ్యారు. ఫలితంగా తొలిరోజు భారీ కలెక్షన్స్ వసూలు చేసింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రానికి ఫస్ట్‌డే రూ.23.7 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చినట్లు నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ అధికారికంగా ప్రకటించింది. (చదవండి: ‘టిల్లు స్వ్కేర్’ మూవీ రివ్యూ) అలాగే అమెరికాలో ఈ చిత్రం తొలిరోజు 1 మిలియన్ డాలర్స్‌కి పైగా వసూళ్లను రాబట్టింది. హిట్ టాక్ రావడంతో వీకెండ్లో కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశం ఉందని సినీ పండితులు అంచనా వేస్తున్నారు. ఈ సినిమా కచ్చితంగా రూ. 100 కోట్లకు పైగా వసూలు చేస్తుందని నిర్మాత నాగవంశీ ధీమా వ్యక్తం చేస్తున్నారు. 2022లో వచ్చిన డీజే టిల్లు చిత్రానికి కొనసాగింపుగా వచ్చిన చిత్రమే ‘టిల్లు స్వ్కేర్’. మల్లిక్ రామ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్గా నటించింది. Tillu Registers a 𝐃𝐎𝐔𝐁𝐋𝐄 𝐁𝐋𝐎𝐂𝐊𝐁𝐔𝐒𝐓𝐄𝐑 Start at the Box-Office with 𝟐𝟑.𝟕 𝐆𝐑𝐎𝐒𝐒 on 𝐃𝐀𝐘 𝟏 🔥 Our Starboy 🌟 is shattering the records all over! 💥💥 Book your tickets here - https://t.co/vEd8ktSAEW #Siddu @anupamahere @MallikRam99 @ram_miriyala… pic.twitter.com/Dz7hqglg5Z — Sithara Entertainments (@SitharaEnts) March 30, 2024 -
‘టిల్లు స్క్వేర్’ సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
టిల్లు- 3 గురించి ఆసక్తికర విషయాన్ని తెలిపిన నాగ వంశీ
'డీజే టిల్లు'గా ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్వించారు సిద్ధు జొన్నలగడ్డ. తాజాగా ఆ చిత్రానికి సీక్వెల్‌గా ‘టిల్లు స్క్వేర్’తో ప్రేక్షకుల ముందుకు మళ్లీ వచ్చేశాడు. ఇప్పుడు కూడా అంతే రేంజ్లో నవ్వించడమే కాకుండా ప్రేక్షకులను కూడా మెప్పించాడు. మల్లిక్ రామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నిర్మిస్తోంది. అనుపమ పరమేశ్వరన్ కథానాయిక. సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య సంయుక్తంగా నిర్మించారు. ‘టిల్లు స్క్వేర్’ సినిమాలో సిద్ధు జొన్నలగడ్డ హీరోనే కాదు.. ఈ చిత్రానికి స్క్రిప్ట్ కూడా రాశాడు. హాస్యం ప్రధానంగా చాలా అద్భుతంగా కథను రాశాడు. అందుకే థియేటర్లలో సినిమా చూసిన ప్రేక్షకులు మంచి అనుభూతి కలిగిందని బయటకు వస్తున్నారు. మార్చి 29న విడుదలైన ‘టిల్లు స్క్వేర్’కు పాజిటివ్ టాక్ రావడంతో తాజాగా సిద్ధు జొన్నలగడ్డ ఇలా రియాక్ట్ అయ్యాడు. 'డీజే టిల్లు తీస్తున్నప్పుడే నన్ను నమ్మి మంచి ప్రమాణాలతో సినిమాని తీశారు నిర్మాతలు. అనుకున్నట్లు అది హిట్ కావడంతో సీక్వెల్ 'టిల్లు స్క్వేర్' విషయంలోనూ అదే జరిగింది. ఇలాంటి సినిమా చేసే అవకాశం ఇచ్చినందుకు నిర్మాతలకి కృతజ్ఞతలు. నేను నటుడి కంటే ముందు ఈ సినిమాకి రచయితను. ఎంతో నిజాయతీగా కథ ఉండాలని రాశాను. ఎక్కువ, తక్కువలు అనే అభిప్రాయాలు లేకుండా ప్రతి పాత్రని డిజైన్ చేశాను. వాస్తవంగా అనుపమను వంద శాతం ఊహించి కథ రాస్తే.. తన నటనతో వెయ్యి శాతం 'టిల్లు స్క్వేర్'లో ప్రభావం చూపించింది. ఈ సినిమాలో కథ ప్రభావం ఎంతమేరకు ఉండాలో అంత వరకు మాత్రమే ఉంది.' అని ఆయన అన్నారు. 'టిల్లు స్క్వేర్' చిత్రానికి తొలి షో నుంచే మంచి టాక్ వచ్చిందని నిర్మాత సూర్యదేవర నాగవంశీ చెప్పారు. రానున్న రోజుల్లో సెలవులు కూడా సినిమాకు కలిసొస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు. 'టిల్లు స్క్వేర్' రూ.వంద కోట్ల కలెక్షన్స్ సాధిస్తుందనే నమ్మకం ఉందని ఆయన చెప్పాడు. త్వరలో మూడో భాగాన్ని కూడా ప్రకటిస్తామని ఆయన పేర్కొన్నారు. -
Tillu Square: ‘టిల్లు స్వ్కేర్’ మూవీ రివ్యూ
టైటిల్: టిల్లు స్వ్కేర్ నటీనటులు: సిద్ధు జొన్నలగడ్డ,అనుపమ పరమేశ్వరన్, ప్రిన్స్, మురళీధర్ గౌడ్, మురళీ శర్మ తదితరులు నిర్మాణ సంస్థ: సితార ఎంటర్టైన్మెంట్స్,ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ నిర్మాతలు: సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య దర్శకత్వం:మల్లిక్ రామ్ నేపథ్య సంగీతం: భీమ్స్ సిసిరోలియో సినిమాటోగ్రఫీ: సాయి ప్రకాష్ ఉమ్మడిసింగు ఎడిటింగ్: నవీన్ నూలి విడుదల తేది: మార్చి 29, 2024 స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటించిన 'డీజే టిల్లు'(2022)ఎంతటి విజయాన్ని సాధించిందో తెలిసిందే. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ చిత్రం భారీ బ్లాక్ బస్టర్‌తో పాటు యూత్‌లో కల్ట్ ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది. ఈ చిత్రానికి సీక్వెల్‌గా తెరకెక్కిన చిత్రమే ‘టిల్లు స్వ్కేర్’. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పాటలు, ట్రైలర్ సినిమాపై హైప్ క్రియేట్ చేశాయి. దానికి తోడు ప్రమోషన్స్ కూడా గట్టిగా చేయడంతో ‘టిల్లు స్వ్కేర్’పై అంచనాలు మరింత పెరిగాయి. ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని యూత్ ఆడియన్స్ ఎంతో ఆతృతగా ఎదురు చూశారు. పలుమార్లు వాయిదా పడుతూ ఎట్టకేలకు నేడు(మార్చి 29) ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. టిల్లు స్వ్కేర్ కథేంటంటే.. రాధిక(నేహా శెట్టి) చేసిన మోసం నుంచి కోలుకున్న బాల గంగాధర తిలక్ అలియాస్ డీజే టిల్లు (సిద్ధు జొన్నలగడ్డ)..ఫ్యామిలీ,ఫ్రెండ్స్‌తో కలిసి ‘టిల్లు ఈవెంట్స్’ స్టార్ట్ చేస్తాడు. వెడ్డింగ్ ప్లానింగ్‌తో పాటు డీజే ఈవెంట్స్ చేస్తూ హాయిగా గడుపుతున్న టిల్లు జీవితంలోకి లిల్లీ(అనుపమ పరమేశ్వరన్) ఎంటర్ అవుతుంది. తొలి చూపులోనే ఆమెపై మనసు పారేసుకుంటాడు. ఆమెతో ఓ రాంత్రంతా గడుపుతాడు. తెల్లారి చూస్తే లిల్లి కనిపించదు. సరిగ్గా నెల రోజుల తర్వాత ఓ ఆస్పత్రిలో కనిపించి తాను గర్భవతి అని చెబుతుంది. ఆ తర్వాత ఏం జరిగింది? అసలు లిల్లి ఎవరు? టిల్లు జీవితంలోకి ఎందుకు వచ్చింది? ఇంతకు ముందు రాధిక మాదిరే ఇప్పుడు లిల్లితో టిల్లుకి వచ్చిన కొత్త సమస్యలు ఏంటి? వీళ్ళ కథతో పేరు మోసిన మాఫియా డాన్ మెహబూబ్ అలీ(మురళీ శర్మ) కి లింక్ ఏంటి? అనేది తెలియాలంటే థియేటర్స్‌లో ‘టిల్లు స్వ్కేర్’ చూడాల్సిందే. ఎలా ఉందంటే.. 'డీజే టిల్లు' సక్సెస్‌కి ముఖ్యకారణం టిల్లుగాడి పాత్ర.. ఆ పాత్రతో పలికించిన సంభాషణలు. కథగా చూసుకుంటే'డీజే టిల్లు'లో కొత్తదనం ఏమి ఉండదు. కానీ టిల్లుగాడి మ్యానరిజం.. వాడు చేసిన మాటల మ్యాజిక్కే ఆ చిత్రానికి భారీ విజయాన్ని తెచ్చిపెట్టింది. 'టిల్లు స్క్వేర్'లోనూ అదే అప్లై చేశారు దర్శకరచయితలు. కథను కాకుండా టిల్లుగాడి, లిల్లిల కారెక్టరైజేషన్స్ను నమ్ముకున్నారు. సినిమా మొత్తం టిల్లు, లిల్లి పాత్రల చుట్టే తిరుగుతుంది. ప్రేక్షకులకు అల్రేడీ టిల్లు క్యారెక్టర్ గురించి అవగాహన ఉంటుంది కనుక.. సినిమా ప్రారంభం నుంచే ఆ పాత్రతో కనెక్ట్ అవుతారు. పార్ట్ 1 లాగే పార్ట్ 2లో కూడా లాజిక్స్‌ని పట్టించుకోలేదు. చాలా చోట్ల లాజిక్స్ మిస్ అవుతారు. కానీ టిల్లుగాడు తన మ్యానరిజంతో, డైలాగ్స్‌తో ఆ లోపాలను కప్పిపుచ్చుతాడు. మధ్య మధ్యలో వచ్చే కొన్ని ట్విస్టులు కూడా ప్రేక్షకుడికి బోర్ కొట్టకుండా చేస్తాయి. అలా అని ఆ ట్విస్టులు సర్ప్రైజింగ్గా ఉండవు. నిడివి తక్కువగా ఉండడం(దాదాపు 137 నిమిషాలు) కూడా సినిమాకు కలిసొచ్చింది. 'డీజే టిల్లు'లోని రాధిక ఎపిసోడ్‌ని చూపిస్తూ కథను ప్రారంభించాడు దర్శకుడు. దాన్నివల్ల సినిమా చూడని వారికి కూడా రాధిక పాత్రపై కాస్త అవగాహన వస్తుంది. ఆ తర్వాత టిల్లు లైఫ్‌స్టైల్ ఎలా ఉంటుందో చూపించి.. నేరుగా అసలు కథలోకి తీసుకెళ్లాడు. లిల్లి పరిచయం.. ఆ తర్వాత చిన్న టిస్టు.. బర్త్‌డే పార్టీ రోజు మరో షాక్.. ఇలా ఫస్టాఫ్ సాగుతుంది. ఇంటర్వెల్ టిస్టు బాగుంటుంది కానీ.. దాన్ని యాక్సెప్ట్ చేయడం కష్టంగా అనిపిస్తుంది. సెకండాఫ్‌లో కామెడీ డోస్ తగ్గుతుంది. ఇంటర్నేషనల్ మాఫియా కింగ్ ఎంట్రీ తర్వాత కథనం రొటీన్‌గా, సినిమాటిక్‌గా సాగుతుంది. అయితే ప్రీక్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ వరకు వచ్చే ట్విస్టులు ఆకట్టుకుంటాయి. కొన్ని సంభాషణలను యూత్ బాగా ఎంజాయ్ చేస్తుంది. ఎవరెలా చేశారంటే.. టిల్లుగాడి పాత్ర సిద్ధూ జొన్నలగడ్డకు ఎంత పేరు సంపాదించిపెట్టిందో అందరికి తెలిసిందే. ఆ పాత్రను సిద్ధు తప్పా ఎవరూ చేయలేరు అనేంతలా నటించాడు. ఆల్రెడీ చేసిన పాత్రే కాబట్టి చాలా ఈజీగా ఆ పాత్రలో ఒదిగిపోయాడు. ఆయన మ్యానరిజం, డైలాగ్ డెలివరీ సినిమా స్థాయిని పెంచేసింది. అనుపమ ఈ సినిమాలో చాలా కొత్త పాత్రను పోషించింది. గతంలో ఎప్పుడూ ఇలాంటి పాత్రలో ఆమె నటించలేదు. లిల్లిగా ఆమె తెరపై అందాలను పంచడమే కాకుండా.. తనదైన నటనతో ఆకట్టుకుంది. ఆమె పాత్రలో వచ్చే సర్ప్రైజులు, ట్విస్టులు ఆకట్టుకుంటాయి. టిల్లు తండ్రిగా మురళీధర్ గౌడ్ పండించిన కామెడీ బాగా వర్కౌట్ అయింది. మురళీ శర్మ, ప్రిన్స్‌తో పాటు మిగిలిన నటీనటులు తమ తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. సాంకేతికంగా ఈ సినిమా బాగుంది. రామ్ మిరియాల కంపోజ్ చేసిన 'డీజే టిల్లు...' రీమిక్స్, 'రాధికా రాధికా' పాటలతో పాటు అచ్చు రాజమణి అందించిన 'ఓ మై లిల్లీ' సాంగ్ కూడా ఆకట్టుకునేలా ఉంటాయి. భీమ్ అందించిన బీజీఎం సినిమాకు మరో ప్రధాన బలం. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ బాగుంది. తక్కువ నిడివే ఉండడంతో సినిమా త్వరగానే అయిపోయిందనే ఫీలింగ్ కలుగుతుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. -అంజి శెట్టె, సాక్షి వెబ్ డెస్క్ -
టిల్లు స్క్వేర్ పబ్లిక్ టాక్.. ఎలా ఉందంటే!
సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన చిత్రం 'టిల్లు స్క్వేర్'. అభిమానుల భారీ అంచనాల మధ్య ఈ రోజే ప్రేక్షకుల ముందుకొచ్చింది. డీజే టిల్లు సూపర్ హిట్ కావడంతో ఈ సినిమాకు సీక్వెల్‌గా తెరకెక్కించారు. ఈ చిత్రానికి మల్లిక్ రామ్ దర్శకత్వం వహించారు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇవాళ ఉదయాన్నే ఓవర్సీస్తో పాటు మొదటి షో థియేటర్లలో అలరిస్తోంది. ఈ సినిమా చూసిన అభిమానులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాన్ని పంచుకుంటున్నారు. మరి ఈ సినిమా డీజే టిల్లు మరిపించిందా? అన్న విషయంపై ట్విటర్లో పోస్టులు పెడుతున్నారు. కొందరేమో ఫుల్ ఫన్ రోలర్‌కోస్టర్‌గా అలరించిందని కామెంట్స్ చేస్తున్నారు. సిద్ధు ఎనర్జీ, అనుపమ ఫర్మామెన్స్ కట్టిపడేశాయని అంటున్నారు. సిద్ధు గట్టి కమ్‌బ్యాక్ ఇచ్చాడని ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. సిద్ధూ తన ట్రేడ్‌మార్క్ చూపించాడని పోస్ట్ చేస్తున్నారు. ఫన్ ఇంటర్వెల్ ట్విస్ట్ అద్భుతంగా ఉందని అంటున్నారు. ఫస్ హాఫ్ డీసెంట్‌గా ఉందని.. సెకండాఫ్‌లో ట్విస్టులు అదిరిపోయాయంటూ కామెంట్స్ చేస్తున్నారు. #TilluSquare is one hell of a movie; it's literally a square of entertainment that we had in DJ Tillu. Moreover, those one-liners 👌, as usual, Star Boy Siddu shines, Anupama did well, and the music is a big plus 💯. Overall: 3.5/5.#TilluSquarereview — keishhh (@FCB_LM_91) March 29, 2024 Show stealer siddhu buoy show throughout…same DJ Tillu treatment…if you love DJ Tillu you will love #TilluSquare ..just go to the theatres and enjoy the senseless lol ride 🍻🍻 https://t.co/Rbxi2TyWAd — 🌶️🔥 (@PenuToofan) March 29, 2024 First half of #TilluSquare is entertaining! Lot of Déjà Vu of #DJTillu in the movie. Siddhu 👍 https://t.co/C4pgRwbN0Q — idlebrain jeevi (@idlebrainjeevi) March 29, 2024 #TilluSquare - a rollercoaster of fun! Siddhu's energy lights up the screen, Anupama is good, and the never ending one-liners kept me hooked. Despite the occasional disjointed scenes & questionable green screens, it still manages to captivate! Perfect for a one-time watch! 3/5 😍 pic.twitter.com/W3qnppCjYF — Swathiiii 🌸 (@Swathi_Prasad96) March 29, 2024 #TilluSquare Decent 1st Half! Siddhu is back again with his trademark energetic avatar and one liners that are carrying the film. Comedy works in parts so far but feels redundant at times . Fun interval twist sets up the 2nd half well. — Venky Reviews (@venkyreviews) March 29, 2024 -
టిల్లుకి, నాకు ఆ ఒక్కటే తేడా : స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ
‘డీజే టిల్లు’ సమయంలో ప్రేక్షకుల్లో అంచనాల్లేవు. హీరో పాత్ర ఎలా ఉంటుంది అనేది ముందు తెలీదు. అందుకే ఆ పాత్రను చూసి ప్రేక్షకులు సర్ ప్రైజ్ అయ్యారు. ఇప్పుడు అదే పాత్రతో ‘టిల్లు స్వ్కేర్’ చేయాల్సి రావడంతో కాస్త ఒత్తిడి ఉండటం సహజం. అయితే ఒత్తిడిని జయించి మెరుగైన అవుట్ పుట్ని అందించడానికి ప్రయత్నించాం’ అన్నారు స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ. ఆయన ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం ‘టిల్లు స్వ్కేర్’. 'డీజే టిల్లు'చిత్రానికి కొనసాగింపుగా వస్తున్న ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్గా నటించింది. మల్లిక్ రామ్ దర్శకత్వం వహించారు. మార్చి 29న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో గురువారం సిద్ధు జొన్నలగడ్డ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు.. ► ‘డీజే టిల్లు’ కథకి, టిల్లుగాడి పాత్రకి కొనసాగింపుగా ఈ చిత్రం ఉంటుంది. పాత్ర కొనసాగింపు పూర్తి స్థాయిలో ఉంటుంది. కథ కొనసాగింపు కూడా కొంత ఉంటుంది కానీ.. అది పాత కథను గుర్తుచేస్తూ కొత్త అనుభూతిని ఇస్తుంది. టిల్లు పాత్ర కూడా సీక్వెల్ లో ఇంకా ఎక్కువ ఎనర్జిటిక్ గా ఉంటుంది. ఎందుకంటే ఈసారి ఇంకా పెద్ద సమస్యలో ఇరుక్కుంటాడు. ఆ సమస్య ఏంటి అనేది ఇప్పుడే చెప్పను. థియేటర్ లో చూసి ఎంజాయ్ చేస్తారు. చాలా సర్ ప్రైజ్ లు, షాక్ లు ఉంటాయి. సినిమా అంతా నవ్వుకుంటూనే ఉంటారు. టిల్లు ఎక్కడా నవ్వడు.. కానీ అందరినీ ఫుల్ గా నవ్విస్తాడు. ► డీజే టిల్లులో హీరో, హీరోయిన్ రెండు పాత్రలకు ప్రాధాన్యత ఉంటుంది. ఇప్పుడు టిల్లు స్క్వేర్ కూడా అలాగే ఉంటుంది. హీరో పాత్ర లేకపోతే హీరోయిన్ పాత్ర పండదు, అలాగే హీరోయిన్ పాత్ర లేకపోతే హీరో పాత్ర పండదు. ► ఈ సినిమాలోని టిల్లు పాత్ర నా ఆలోచనలు, నేను చూసిన అనుభవాల నుంచి పుట్టింది. టిల్లుకి, నాకు ఒక్కటే తేడా. టిల్లు తన మనసులో ఉన్నవన్నీ బయటకు అంటాడు. నేను మనసులో అనుకుంటాను అంతే తేడా. ► ఈ సినిమా నిడివిని కావాలని తగ్గించలేదు. సినిమాకి ఎంత అవసరమో అంత ఉంచాము. కామెడీ సినిమా కాబట్టి ఎక్కువ నిడివి లేకపోతేనే ఎక్కడా బోర్ కొట్టించకుండా ప్రేక్షకులను పూర్తిస్థాయి వినోదాన్ని అందించగలం. ► సీక్వెల్ చేద్దాం అనుకున్న సమయంలో విమల్ వేరే ప్రాజెక్ట్ కమిట్ అయ్యి ఉండటంతో అందుబాటులో లేరు. మరోవైపు నేను, మల్లిక్ ఒక సినిమా చేద్దామని అప్పటికే అనుకుంటున్నాము. మా కలయికలో డీజే టిల్లు సీక్వెల్ చేస్తే బాగుంటుంది అనిపించి.. అలా మల్లిక్ న దర్శకుడిగా తీసుకోవడం జరిగింది. ► త్రివిక్రమ్ గారి సలహాలు, సూచనలు ఖచ్చితంగా సినిమాకి హెల్ప్ అవుతాయి. అయితే ఆయన ఎప్పుడూ కథలో మార్పులు చెప్పలేదు. ఈ భాగం ఇంకా మెరుగ్గా రాస్తే బాగుంటుంది వంటి సలహాలు ఇచ్చేవారు. ► ఈ సినిమా సీక్వెల్ అనుకున్నప్పుడు లక్కీగా ఒక మంచి కథ తట్టింది. అలాగే పార్ట్-3 కి కూడా జరుగుతుందేమో చూడాలి. రెండు మూడు ఐడియాస్ ఉన్నాయి.. చూడాలి ఏమవుతుందో. అయితే టిల్లు-3 కంటే ముందుగా మరో విభిన్న కథ రాసే ఆలోచనలో ఉన్నాను. ప్రస్తుతం ఐతే నా దృష్టి అంతా టిల్లు స్క్వేర్ పైనే ఉంది. ► ఇలాంటి సినిమాలకు సంభాషణలే కీలకం. అవి ఎంతలా ప్రేక్షకులకు చేరువైతే అంత వినోదం పండుతుంది. సంభాషణలు నా మనసు నుంచి, నా మెదడు నుంచి పుట్టాయి కాబట్టి.. ఏ ఉద్దేశంతో రాశాను, ఎలా పలకాలి అనే దానిపై నాకు పూర్తి అవగాహన ఉంటుంది. అందుకే డీజే టిల్లు పాత్ర ప్రేక్షకులకు అంత దగ్గరైంది. -
Tillu Square Movie: ‘టిల్లు స్క్వేర్’ ప్రీరిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
నెగెటివ్ కామెంట్స్.. హర్టయిన అనుపమ, అందుకే డుమ్మా!
హీరోయిన్ అన్నాక అన్ని రోల్స్ చేయాలి. బరి గీసుకుని ఉంటే పెద్దగా అవకాశాలు రావు. ఆ విషయం తెలుసుకున్న అనుపమ పరమేశ్వరన్ బోల్డ్ పాత్రలకు ఓకే చెప్పింది. టిల్లు స్క్వేర్‌లో ముద్దులు, హగ్గులతో రెచ్చిపోయింది. ఇది అభిమానులకు అస్సలు నచ్చలేదు. అనుపమ కూడా ఇలా తయారైందేంటని కోపంతో ఊగిపోయారు. ఇవన్నీ అవసరమా? అని తిట్టినవాళ్లు కూడా ఉన్నారు. ఎప్పుడూ ఒకేరకమైన పాత్రలు చేస్తే బోర్ కొడుతుంది కదా.. అందుకే ఈ సినిమా ఒప్పుకున్నానని చెప్పినా ఫ్యాన్స్ ఆవేశం చల్లారలేదు. తనను ట్రోల్ చేస్తూనే ఉన్నారు. ఇబ్బంది పెట్టొద్దు బుధవారం (మార్చి 27న) టిల్లు స్క్వేర్ ప్రీరిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ కార్యక్రమానికి అనుపమ డుమ్మా కొట్టింది. దీనిపై స్టేజీపైనే స్పందించాడు సిద్దు జొన్నలగడ్డ. అతడు మాట్లాడుతూ.. టిల్లు స్క్వేర్ నుంచి లేటెస్ట్గా ఓ పోస్టర్ రిలీజైంది. దానికింద చాలా కామెంట్స్ చేశారు. ఒక అమ్మాయి గురించినే ఏది పడితే అది అనేయడం అనడం కరెక్ట్ కాదు! మీకు మాట్లాడే హక్కు ఉంది.. నేను దాన్ని తప్పనడం లేదు. ఉదాహరణకు మనం ఒకరిని ఫ్లర్ట్ చేస్తే అవతలివాళ్లు ఎంజాయ్ చేసేలా ఉండాలి. కానీ వారిని ఇబ్బంది పెట్టేలా ఉండొద్దు. హర్ట్ అవడం వల్లే? తన గురించి పిచ్చిపిచ్చిగా కామెంట్స్ చేశారు. నా అభ్యర్థన ఏంటంటే దయచేసి వల్గర్‌గా మాట్లాడొద్దు. ఆరోగ్యకర వాతావరణం ఉంటే బాగుంటుంది' అని చెప్పుకొచ్చాడు. నెగెటివ్ కామెంట్స్‌కు హర్ట్ అయినందువల్లే అనుపమ ఈవెంట్‌కు రాలేదని తెలుస్తోంది. ఇకపోతే టిల్లు స్క్వేర్ మార్చి 29న రిలీజ్ కానుంది. చదవండి: లండన్‌లో కొత్త ఇల్లు? -
అవన్నీ భరిస్తేనే తెరపై హాట్‌గా కనిపిస్తాం: అనుపమ పరమేశ్వరన్
-
సిద్దు నా దగ్గరికి ఎందుకు వచ్చాడో తెలియదు
-
ఆ రేంజ్ ఫాలోయింగ్ వస్తుందని అసలు ఎక్సపెక్ట్ చేయలేదు
-
అవి దెయ్యం కళ్ళా..? దేవత కళ్ళా!
-
అమ్మాయిలు అందరూ డేంజరే అని ఒప్పుకున్నా అనుపమ
-
ఆ గుర్తింపు కోసమే అలాంటి క్యారెక్టర్ చేశా
-
అనుపమ ని ఒక ఆట ఆడుకున్న సిద్దు
-
అందుకే అనుపమని బోల్డ్‌గా చూపించాం: 'టిల్లు స్క్వేర్' డైరెక్టర్
'టిల్లు స్క్వేర్'లో లిల్లీ పాత్రకు చాలా ప్రాధాన్యత ఉంటుంది.ఆమెది ఛాలెంజింగ్ రోల్. ఆ పాత్ర కోసం ఎందరో పేర్లను పరిశీలించాం. కానీ అనుపమనే పర్ఫెక్ట్ ఛాయిస్ అనిపించింది. ఆమెను బోల్డ్‌గా చూపించాలనే ఉద్దేశంతో లిల్లీ పాత్రను రాసుకోలేదు. లిల్లీ పాత్ర తీరే అలా ఉంటుంది. ఆ పాత్రకి అనుపమ న్యాయం చేయగలదని నమ్మాం. ఆమె ఆ పాత్రకి నూటికి నూరు శాతం న్యాయం చేసింది’ అన్నారు దర్శకుడు మల్లిక్ రామ్. ఆయన దర్శకత్వం వహించిన తాజా చిత్రం ‘టిల్లు స్కేవర్’. స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటించిన డీజే టిల్లు సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కిన ఈ చిత్రం మార్చి 29న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో దర్శకుడు రామ్ మల్లిక్ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు.. ► సిద్ధుతో నాకు ఎప్పటి నుంచో పరిచయం ఉంది. దాదాపు ఇద్దరం ఒకేసారి సినీ ప్రయాణం మొదలుపెట్టాం. నేను దర్శకత్వం వహించిన అద్భుతం మూవీ, డీజే టిల్లు ఇంచుమించు ఒకే సమయంలో వచ్చాయి. ఆ తర్వాత నేను, సిద్ధు కలిసి ఒక సినిమా చేయాలి అనుకున్నాం. అదే సమయంలో నాగవంశీ గారు 'టిల్లు స్క్వేర్' చేస్తే బాగుంటుందని చెప్పడం, డీజే టిల్లు దర్శకుడు విమల్ కృష్ణ ఇతర కమిట్ మెంట్స్ తో బిజీగా ఉండటంతో నేను ఈ ప్రాజెక్ట్ లోకి వచ్చాను. మొదట కాస్త సంకోచించాను కానీ కథ బాగా వచ్చేసరికి ఇక వెనకడుగు వేయలేదు. ► సినిమాలో సిద్దు ప్రమేయం ఉటుందని..ప్రతి సీన్లోనూ తలదూర్చుతాడని బయట ఏవో కొన్ని వార్తలు వస్తుంటాయి కానీ వాటిలో వాస్తవం లేదు. సిద్ధు ఒక రచయితగా, నటుడిగా ఎంతవరకు ఇన్వాల్వ్ అవ్వాలో.. అంతవరకే ఇన్వాల్వ్ అవుతాడు. దర్శకుడికి ఇవ్వాల్సిన స్వేచ్ఛను దర్శకుడికి ఇస్తాడు. ఎలా చేస్తే బాగుంటుంది అనేది ఇద్దరం చర్చించుకొని చేశాం. కథా చర్చల సమయంలో ఒక రచయితగా వ్యవహరిస్తాడు. చిత్రీకరణ సమయంలో ఒక నటుడిగా ఏం చేయాలో అది చేస్తాడు. ► డీజే టిల్లు, టిల్లు స్క్వేర్ కి వ్యత్యాసం ఉంటుంది. డీజే టిల్లు డెడ్ బాడీ నేపథ్యంలో సాగే బ్లాక్ కామెడీ. కానీ టిల్లు స్క్వేర్ అలా ఉండదు. ఒక కమర్షియల్ సినిమాలా ఉంటుంది. టిల్లు పాత్ర తీరు అలాగే ఉంటుంది. రాధిక పాత్ర ప్రస్తావన ఉంటుంది. మొదటి భాగాన్ని ముడిపెడుతూ కొన్ని సన్నివేశాలు ఉంటాయి. డీజే టిల్లుని గుర్తు చేస్తూనే టిల్లు స్క్వేర్ మీకొక కొత్త అనుభూతిని ఇస్తుంది. ► ఇంటర్వెల్ తర్వాత ద్వితీయార్థం ప్రారంభ సన్నివేశాలు చాలా సినిమాల్లో తేలిపోతుంటాయి. ఫస్టాఫ్ బాగుంటుంది, క్లైమాక్ బాగుంటుంది. కానీ ఆ 15-20 నిమిషాలు ఆశించిన స్థాయిలో ఉండదు. టిల్లు స్క్వేర్ విషయంలో అలా జరగకూడదన్న ఉద్దేశంతో.. ఆ కొన్ని సన్నివేశాలు మరింత మెరుగ్గా రాసుకొని రీ షూట్ చేయడం జరిగింది. ► ముందు ఈ సినిమాకు పాటలు రామ్ మిరియాల, శ్రీచరణ్ పాకాల, నేపథ్య సంగీతం తమన్ అనుకున్నాం. రామ్ మిరియాల రెండు పాటలు ఇచ్చారు. శ్రీచరణ్ పాకాల ఒక పాట ఇచ్చారు. ఆ పాట బాగా వచ్చింది. కానీ అక్కడ సిట్యుయేషన్ మారడంతో మరో సంగీత దర్శకుడు అచ్చుత్తో పాట చేయించడం జరిగింది. తమన్ గారు ఇతర సినిమాలతో బిజీగా ఉండి అందుబాటులో లేకపోవడంతో..భీమ్స్ గారిని తీసుకున్నాం. ► ఈ చిత్రంలో ఎలాంటి సందేశం ఉండదు. కొందరి స్వభావం ఎలా ఉంటుందో చూపించాము కానీ ఇలా ఉండకండి మారండి అనే సందేశాలు మాత్రం ఇవ్వలేదు. -
ట్రెండింగ్‌లో ‘అనుపమ పరమేశ్వరన్’ (ఫొటోలు)
-
బోల్డ్నెస్ గురించి ప్రశ్న.. బిర్యానీ, పులిహోర అని అనుపమ కౌంటర్స్
కొందరు హీరోయిన్లని చూస్తే కుందనపు బొమ్మల్లా కనిపిస్తుంటారు. అందుకు తగ్గ పాత్రలే చేస్తుంటారు. 'అఆ','శతమానం భవతి' తదితర చిత్రాల్లో క్లాస్‌గా కనిపించిన అనుపమ.. ఇప్పుడు 'టిల్లు స్క్వేర్' కోసం మాత్రం రెచ్చిపోయింది. ముద్దు సన్నివేశాలు, గ్లామర్ విషయంలో ఎలాంటి అడ్డు చెప్పలేదని టీజర్, పాటల్లాంటివి చూస్తే అర్థమైపోయింది. అయితే ఇలా ఎందుకు నటించాల్సి వచ్చిందనే విషయం ఇప్పుడు బయటపెట్టింది. మార్చి 29న 'టిల్లు స్క్వేర్' మూవీ థియేటర్లలోకి రానుంది. ఈ క్రమంలోనే ప్రస్తుతం ప్రమోషన్స్ చేస్తున్నారు. తాజాగా 'ఓ మై లిల్లీ' అనే పాట రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ప్రెస్ మీట్ పెట్టగా.. టీమ్ అంతా మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు. మిగతా వాటి సంగతి పక్కనబెడితే అనుపమ.. బోల్డ్ క్యారెక్టర్లు గురించి చేసిన కామెంట్స్ మాత్రం హాట్ టాపిక్ అయిపోయాయి. (ఇదీ చదవండి: సిల్క్ స్మిత చేసిన పెద్ద తప్పు అదే: నటి జయమాలిని) 'యాక్టర్‌గా ఇన్నేళ్లలో చేసిన క్యారెక్టర్స్ మళ్లీ మళ్లీ చేస్తుంటే బోర్ కొడుతుంది. ఈ మూవీలో లిల్లీ పాత్ర వదులుకోవడం అనేది పిచ్చి పని అవుతుంద. ఎందుకంటే కమర్షియల్ సినిమాలో అమ్మాయికి ఇంత మంచి పాత్ర దొరకదు. అందుకే వదులుకోవాలని అనుకోలేదు' అని అనుపమ చెప్పుకొచ్చింది. అయితే ఇంత చెప్పిన తర్వాత కూడా మళ్లీ అనుపమకు ఇలాంటి ప్రశ్ననే వచ్చేసరికి కాస్త గట్టిగానే కౌంటర్ ఇచ్చింది. 'మీకు బిర్యానీ అంటే ఇష్టమా.. అలానే ఇంట్లో ప్రతిరోజూ బిర్యానీ తింటారా? లేదు కదా అలానే నేను కూడా ప్రతిరోజూ బిర్యానీ తినాలని కోరుకోవడం లేదు. నాకు కూడా డిఫరెంట్ పులావ్ కావాలి, పులిహోర కావాలి అన్నీ కావాలి' అని 'టిల్లు స్క్వేర్' సినిమాలో తను చేసిన గ్లామర్ పాత్ర గురించి పరోక్షంగా కౌంటర్స్ ఇచ్చింది. ఏదేమైనా ఇప్పుడు ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. (ఇదీ చదవండి: కారు ప్రమాదం.. ఆ రూమర్స్ గురించి నమ్మొద్దు: సింగర్ మంగ్లీ) -
‘డీజే టిల్లు-2’ మూవీ ప్రెస్‌మీట్ (ఫొటోలు)
-
స్టార్ హీరోయిన్‌తో సిద్ధు జొన్నలగడ్డ పెళ్లి.. !
తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసిన పెళ్లిళ్ల హడావిడి నడుస్తోంది. ఈ క్రమంలో సినిమా ఇండస్ట్రీకి చెందిన వారు కూడా తమ పెళ్లి ప్రకటనలు ఇస్తూ అభిమానులను సంతోషపెడుతున్నారు. మరి కొందరు పెళ్లి వార్తలతో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటారు. తాజాగా సిద్ధు జొన్నలగడ్డ పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అది కూడా ఇండస్ట్రీకి చెందిన టాప్ హీరోయిన్ను వివాహం చేసుకోబోతున్నట్లు ప్రచారం జరిగింది. ఈ విషయంపై తాజాగా సిద్దు జొన్నలగడ్డ సోదరుడు చైతన్య జోన్నలగడ్డ ఓ ఇంటర్వ్యూలో స్పందించారు. సిద్దు జొన్నలగడ్డ ఒక స్టార్ హీరోయిన్‌తో ప్రేమలో ఉన్నాడని.. వచ్చే ఏడాదిలో వివాహం చేసుకోబోతున్నారనే వార్తలు వస్తున్నాయి అనే ప్రశ్నకు చైతన్య ఆసక్తికరంగా సమాధానం ఇచ్చారు. 'స్టార్ హీరోయిన్ని పెళ్లి చేసుకుంటే ఎలాంటి ప్రాబ్లమ్ లేదు.. అదే స్టార్ హీరోని చేసుకుంటేనే ప్రాబ్లమ్ అవుతుంది కదా అని నవ్వేశాడు.' అతనకి కూడా పెళ్లి చేసుకోవాలని ఆసక్తి అయితే ఉంది. కానీ స్టార్ హీరోయిన్నే పెళ్లి చేసుకుంటాడో లేదో తనకు తెలియదని చెప్పారు. అన్నీ కుదురితే వచ్చే ఏడాది పెళ్లి కూడా జరగవచ్చని చెప్పారు. (ఇదీ చదవండి: టాలీవుడ్ డైరెక్టర్, నటుడు సూర్యకిరణ్ ఇకలేరు!) చైతన్య కూడా రీసెంట్గా బబుల్ గం సినిమాతో మంచి పేరు సంపాదించారు. 'డి.జె టిల్లు' సినిమాతో బాగా పాపులర్ అయిన సిద్దూ.. ఈ సినిమాతో యూత్‌లో మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. దీంతో 'టిల్లు స్క్వేర్'తో మార్చి 29న ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఇలా ఉండగా తాజాగా ఆయన బ్రదర్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. -
టిల్లు జోరు మామూలుగా లేదుగా
-
‘టిల్లు స్క్వేర్’ ట్రైలర్ వచ్చేస్తోంది!
‘డీజే టిల్లు’ వంటి హిట్ మూవీతో యూత్‌లో మంచి క్రేజ్ సొంతం చేసుకున్నారు హీరో సిద్ధు జొన్నలగడ్డ. బుధవారం (ఫిబ్రవరి 7) ఆయన పుట్టినరోజు. ఈ సందర్భంగా సిద్ధు నటిస్తున్న రెండు చిత్రాల (టిల్లు స్క్వేర్, జాక్) అప్డేట్స్ ఇచ్చారు మేకర్స్. సిద్ధు జొన్నలగడ్డ హీరోగా ‘బొమ్మరిల్లు’ భాస్కర్ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతోంది. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌పై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ‘జాక్’ అనే టైటిల్ ఖరారు చేసి, మోషన్‌పోస్టర్‌ను విడుదల చేశారు మేకర్స్. ‘కొంచెం క్రాక్’ అనేది ట్యాగ్‌లైన్. ‘‘ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. త్వరలోనే మరిన్ని వివరాలను వెల్లడిస్తాం’’ అన్నారు బీవీఎస్ఎన్ ప్రసాద్. త్వరలో ట్రైలర్: ‘డీజే టిల్లు’కి సీక్వెల్‌గా రూపొందిన చిత్రం ‘టిల్లు స్క్వేర్’. మల్లిక్ రామ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. ఈ సినిమా నుంచి స్పెషల్ బర్త్‌డే గ్లింప్స్‌ను విడుదల చేసింది యూనిట్. ఈ మూవీ ట్రైలర్ ఈ నెల 14న రిలీజ్ కానుంది. మార్చి 29న సినిమా రిలీజవుతోంది. -
వేసవిలో డీజే టిల్లు వస్తున్నాడు
వేసవికి థియేటర్స్‌లోకి వచ్చేందుకు సిద్ధం అవుతున్నాడు డీజే టిల్లు. సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటించిన ‘డీజే టిల్లు’ (2022) మంచి హిట్ సాధించింది. ప్రస్తుతం ఈ సినిమా సీక్వెల్ ‘డీజే టిల్లు స్క్వేర్’తో బిజీగా ఉన్నారు సిద్ధు జొన్నలగడ్డ. సీక్వెల్లో అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్. మల్లిక్ రామ్ దర్శకత్వంలో శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కాగా ఈ సినిమాను ఫిబ్రవరి 9న విడుదల చేయాలనుకున్నారు. కొన్ని కారణాల వల్ల రిలీజ్‌ను మార్చి 29కి వాయిదా వేస్తున్నట్లుగా శుక్రవారం ప్రకటించారు మేకర్స్. ‘‘కొన్ని అనుకోని పరిస్థితుల కారణంగా ఫిబ్రవరి 9న అనుకున్న విడుదలను వాయిదా వేస్తున్నాం. వేసవి సెలవులను దృష్టిలో పెట్టుకొని చిత్రాన్ని మార్చి 29న విడుదల చేయాలని నిర్ణయించాం’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. -
ఎలా సహాయపడగలను రాధిక
‘‘చెప్పు రాధిక.. ఏం కావాల నీకు.. నేను నీకు ఎలా సహాయపడగలను రాధిక. ఈసారి నా కొంప ఎట్ల ముంచబోతున్నావు చెప్పు’’ అని సిద్ధు చెప్పే డైలాగ్‌తో ‘రాధిక..’ పాట ఆరంభమవుతుంది. ‘‘రాధిక ఎవరు.. నా పేరు రాధిక కాదు.. నా పేరు లిల్లీ’’ అంటుంది అనుపమ. సిద్ధు జొన్నలగడ్డ, నేహా శెట్టి జంటగా రూపొందిన ‘డీజే టిల్లు’ చిత్రానికి సీక్వెల్‌గా రూపొందుతున్న ‘టిల్లు స్క్వేర్’లోని రెండో పాట ‘రాధిక..’. మల్లిక్ రామ్ దర్శకత్వంలో శ్రీకరా స్టూడియోస్ సమర్పణలో ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సహనిర్మాతగా సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హీరో సిద్ధు జొన్నలగడ్డ సరసన అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్గా నటిస్తున్నారు. చిత్ర సంగీతదర్శకుడు రామ్ మిరియాల ‘రాధిక..’ పాటను స్వరపరచి, పాడారు. ఈ పాటకు కాసర్ల శ్యామ్ సాహిత్యం అందించారు. ‘రాధిక..’ పూర్తి పాటను సోమవారం విడుదల చేశారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 9న ఈ చిత్రం రిలీజ్ కానుంది. -
'నా కొంప ఎలా ముంచబోతున్నావో చెప్పు రాధిక'..క్రేజీ సాంగ్ వచ్చేసింది!
'డీజే టిల్లు'తో మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరో సిద్ధు జొన్నలగడ్డ. ప్రస్తుతం టిల్లు స్క్వేర్తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. 'డీజే టిల్లు' చిత్రానికి సీక్వెల్‌గా రూపొందిస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ఈ మూవీకి మల్లిక్ రామ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్గా నటిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి క్రేజీ అప్డేట్ వచ్చేసింది. ఈ మూవీలోని సెంకడ్ సింగిల్ పాటను మేకర్స్ రిలీజ్ చేశారు. ఇప్పటికే విడుదలైన మొదటి సాంగ్ 'టికెట్టే కొనకుండా' అభిమానులను అలరిస్తోంది. తాజాగా 'రాధిక' పేరుతో వచ్చిన ఈ పాట ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ గీతానికి కాసర్ల శ్యామ్ సాహిత్యం అందించారు. కాగా.. ఈ చిత్రం 2024, ఫిబ్రవరి 9వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ చిత్రానికి రామ్ మిరియాల సంగీతమందిస్తున్నారు. Here's the most energetic beat of the year, #Radhika from #TilluSquare 🕺 - https://t.co/X9teTtEAgl 🎹 & 🎤 @ram_miriyala ✍️ @LyricsShyam #Siddu @anupamahere @MallikRam99 @achurajamani @NavinNooli #SaiPrakash @vamsi84 #SaiSoujanya @SitharaEnts @Fortune4Cinemas… pic.twitter.com/EJ8t2CTfXV — Anupama Parameswaran (@anupamahere) November 27, 2023 -
టిల్లు డేట్ ఫిక్స్
సిద్ధు జొన్నలగడ్డ హీరోగా మల్లిక్ రామ్ దర్శకత్వంలో రూపొందు తున్న సినిమా ‘టిల్లు స్క్వేర్’. ఇందులో అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ సినిమాను వచ్చే ఏడాది ఫిబ్రవరి 9న రిలీజ్ చేయనున్నట్లు వెల్లడించారు. సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటించిన ‘డీజే టిల్లు’కు సీక్వెల్‌గా తెరకెక్కుతోన్న ‘టిల్లు స్క్వేర్’కి సహనిర్మాత: సాయి సౌజన్య. -
Tillu Square: లేటుగా వస్తున్న ‘టిల్లుగాడు’
‘డీజే టిల్లు’ మూవీతో ఓవర్‌నైట్ స్టార్ అయ్యాడు సిద్ధు జొన్నలగడ్డ. అంతకుముందు పలు సినిమాల్లో నటించినప్పటికీ.. సిద్ధుకి తగిన గుర్తింపు రాలేదు. కానీ ఈ ఒక్క మూవీ మాత్రం ఈ యంగ్ హీరో జీవితాన్నే మార్చేసింది. సిద్దుని టిల్లు పాత్రలో మరోసారి చూడడానికి ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుండటంతో.. సిద్ధు, సితార ఎంటర్టైన్మెంట్స్ కలిసి 'డీజే టిల్లు' చిత్రానికి సీక్వెల్‌ను రూపొందించాలని నిర్ణయించారు. డీజే టిల్లు' సీక్వెల్ గా 'టిల్లు స్క్వేర్’ రూపొందింది. ఈ చిత్రం సెప్టెంబర్ 15న రాబోతున్నట్లు గతంలో ప్రకటించారు. కానీ అనూహ్యం వాయిదా వేస్తూ.. రిలీజ్ తేదిని త్వరలోనే ప్రకటిస్తామని చెప్పారు. తాజాగా రిలీజ్ డేట్‌ని అనౌన్స్ చేసింది చిత్రబృందం. వచ్చే ఏడాది ఫిబ్రవరి 9న టిల్లుగాడు థియేటర్స్‌లో సందడి చేయనున్నాడు. డీజే టిల్లు చిత్రానికి ఏమాత్రం తగ్గకుండా పూర్తి వినోదాత్మకంగా మలచడానికే సినిమా విడుదల విషయంలో జాప్యం జరుగుతుందని మేకర్స్ అంటున్నారు. నిర్మాత సూర్యదేవర నాగ వంశీ మాట్లాడుతూ, టిల్లూ స్క్వేర్ కల్ట్ స్టేటస్‌ను అందుకుంటుందని, ఆ దిశగా కృషి చేస్తున్నామని తెలిపారు. ఇప్పుడు ఈ సినిమాను 2024 ఫిబ్రవరి 9న ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సిద్ధమవుతున్నారు. టిల్ స్క్వేర్‌లో అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటిస్తున్నారు. డీజే టిల్లులో నేహా శెట్టి పోషించిన రాధిక పాత్ర తరహాలో ఈ పాత్ర కూడా గుర్తుండిపోయేలా ఉంటుందని మేకర్స్ హామీ ఇచ్చారు. ఇప్పటికే, ఈ సినిమా ప్రచార చిత్రాల్లో అనుపమ కనిపిస్తున్న తీరు పెద్ద చర్చనీయాంశంగా మారింది. -
గణేషా.. ఒక్క సినిమా లేదు..ఎందుకిలా?
పండగొచ్చిందంటే చాలు కొత్త సినిమాల సందడితో థియేటర్స్ కళకళలాడుతాయి. చిన్న పండుగల రోజు ఏమోగానీ సంక్రాంతి..వినాయక చవితి..దసరా..దీపావళి లాంటి పెద్ద పండగ రోజు అయితే రెండు, మూడు పెద్ద సినిమాలతో పాటు ఒకటి రెండు చిన్న చిత్రాలు కూడా రీలీజ్ అవుతుంటాయి. ప్రతి ఒక్కరు ఈ పండుగ రోజుల్లో తమ సినిమాను విడుదల చేయాలనుకుంటారు. కొన్నిసార్లు పోటీ భారీగా ఉన్నప్పటికీ బాక్సాఫీస్ బరిలోకి దిగుతారు. ఎందుకలా అంటే.. సినిమా యావరేజ్‌గా ఉన్నసరే పండుగ కాబట్టి ఫ్యామిలీ ఆడియెన్స్ థియేటర్లకు వచ్చే చాన్స్ ఉంటుంది. ఇది చాలా సందర్భాల్లో వర్కౌట్ అయింది కూడా. అందుకే పండుగలపై చాలా సినిమాలు ముందే ఖర్చీఫ్ వేసుకుంటాయి. కానీ ఇప్పుడు టాలీవుడ్లో విచిత్రమైన సంఘటన చోటు చేసుకుంది. వినాయక చవితి లాంటి పెద్ద పండగ రోజు ఒక్క తెలుగు సినిమా కూడా విడుదల కావడంలేదు. బంగారం లాంటి గణేష్ పండుగ డేట్‌ని వదిలేసి వేరే డేట్‌కి తమ చిత్రాలను రిలీజ్ చేస్తున్నారు. ముందే ఖర్చీఫ్.. చివరల్లో అలా వాస్తవానికి ఈ వినాయక చవితికి చాలా సినిమాలు విడుదల కావాల్సింది. కొన్ని పెద్ద సినిమాలు ముందే డేట్ ఎనౌన్స్ చేయడంతో చిన్న సినిమాలు వెనక్కి తగ్గాయి. కానీ చివరి నిమిషంలో బడా చిత్రాలు సైతం చవితికి రాలేమని ప్రకటించాయి. బోయపాటి-రామ్ కాంబోలో తెరకెక్కిన పాన్ ఇండియా మూవీ ‘స్కంద’ సెప్టెంబర్ 15న విడుదల కావాల్సింది. కానీ కారణం ఏంటో తెలియదు.. సెప్టెంబర్ 28కి వాయిదా వేశారు. ఇక రాఘవ లారెన్స్, కంగనా రనౌత్ కలిసి నటించిన చంద్రముఖి-2 చిత్రం కూడా సెప్టెంబర్ 15న రిలీజ్ కావాల్సింది. అది కూడా వాయిదా పడింది. వీఎఫ్ఎక్స్ సన్నివేశాలు ఆలస్యం కావడం వల్లే సినిమా వాయిదా పడిందని చిత్రయూనిట్ పేర్కొంది. స్కంద రిలీజ్ రోజే చంద్రముఖి-2 రానుంది. అంటే సెప్టెంబర్ 28న ఈ రెండు చిత్రాలు బాక్సాపీస్ వద్ద పోటీ పడతాయి. టిల్లన్న ఇలాగైతే ఎలాగన్నా? పోటీ ఈ వినాయక చవితికి టిల్లుగాని డీజేకి చిందులేద్దామనుకుంటే.. అది కూడా జరగడం లేదు. సిద్ధు జొన్నలగడ్డ, నేహా శెట్టి జంటగా నటించిన ‘టిల్లు స్క్వేర్’ సెప్టెంబర్ 15న విడుదల చేయనున్నట్లు గతంలో మేకర్స్ ప్రకటించారు. కానీ అది కూడా మళ్లీ వాయిదా పడింది. ‘టిల్లు స్క్వేర్’ పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. క్వాలిటీ ఔట్పుట్ కోసం విడుదల వాయిదా వేయక తప్పడం లేదు. త్వరలోనే కొత్త రిలీజ్ డేట్ ప్రకటిస్తాం’’ అంటూ మేకర్స్ ప్రకటించారు. డబ్బింగ్ సినిమానే దిక్కు వినాయక చవితికి ఒక్క తెలుగు సినిమా కూడా టాలీవుడ్లో విడుదల కావడంలేదు. డబ్బింగ్ సినిమాలనే తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు సిద్దమయ్యాయి. అందులో చంద్రముఖి-2 వాయిదా పడింది. ఇప్పుడిక ఒకే ఒక్క డబ్బింగ్ మూవీ విడుదల కాబోతుంది. అదే మార్క్ ఆంటోని. విశాల్ నటిస్తున్న తమిళ సినిమా ఇది. ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్‌కు పిచ్చ క్రేజ్ వచ్చింది. తెలుగులో కూడా విశాల్‌కు మంచి ఫాలోయింగ్. అందుకే ఈ చిత్రాన్నితెలుగులో డబ్ చేసి రిలీజ్ చేస్తున్నారు. ఒకవేళ కొంచెం పాజిటివ్ టాక్ వచ్చిన చాలు..మార్క్ ఆంటోని పంట పండినట్లే అని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మంచి వీకేండ్ మిస్ ఈ సారి వినాయక చవితి సోమవారం వచ్చింది. ఇది సినిమా వాళ్లకు బాగా కలిసొచ్చే రోజు. ఎందుంటే.. పండగతో కలిసి మొత్తం మూడు హాలిడేస్ వస్తున్నాయి. శుక్రవారం(సెప్టెంబర్ 15)సినిమాను విడుదల చేస్తే.. శని,ఆది వారాలతో పాటు సోమవారం కూడా సెలవు దినమే. దీంతో ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువగా థియేటర్స్‌కి వచ్చే అవకాశం ఉంది. సినిమాకు కాస్త పాజిటివ్ టాక్ వచ్చిన చాలు.. ఈ మూడు రోజుల్లో బ్రేక్ ఈవెన్ దాటొచు. ఇంత మంచి వీకెండ్‌ని టాలీవుడ్ వదులుకుంది. -
రిలీజ్ పోస్ట్ పోన్.. కొత్త డేట్ చెప్పు గురూ..
సినిమా సెట్ అనుకున్నప్పుడే చూచాయగా రిలీజ్ డేట్ కూడా సెట్ చేస్తుంటారు మేకర్స్. అలా కాకపోయినా షూటింగ్ సగం పూర్తయ్యాక సెట్ చేస్తారు. వన్ ఫైన్ డే ఆ డేట్‌ని అధికారికంగా ప్రకటిస్తారు. కానీ.. సెట్ చేసిన డేట్‌కి కొన్ని సినిమాలు విడుదల కాకపోవచ్చు. సాంకేతిక కారణాలు, ఇతర కారణాల వల్ల వాయిదా పడుతుంటాయి. అలా ప్రస్తుతం అరడజను చిత్రాల దాకా వాయిదా పడ్డాయి. ఏ సినిమా కారణం ఆ సినిమాది. ఇక అనుకున్న డేట్‌కి రాకుండా కొత్త డేట్ సెట్ చేసుకుని సిల్వర్ స్క్రీన్ పైకి రానున్న సినిమాల గురించి తెలుసుకుందాం. ‘సలార్’లో ప్రభాస్ ∙ప్రభాస్ హీరోగా నటించిన పాన్ ఇండియా చిత్రం ‘సలార్’. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో విజయ్ కిరగందూర్ నిర్మించిన ఈ సినిమా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. అందులో భాగంగా ‘సలార్: పార్ట్ 1–సీజ్ఫైర్’ని ఈ నెల 28న విడుదల చేయనున్నట్లు తొలుత మేకర్స్ ప్రకటించారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ నెలాఖరులో ప్రభాస్ ఫ్యాన్స్‌కి, సినిమా లవర్స్‌కి పండగే. అయితే ఈ సినిమా రిలీజ్ వాయిదా వేస్తున్నారంటూ వార్తలు షికారు చేస్తున్నాయి. గ్రాఫిక్స్ పనులు ఇంకా పూర్తి కాకపోవడంతో విడుదల వాయిదా పడనుందని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్. అయితే ‘సలార్’ రిలీజ్ వాయిదాపై చిత్రబృందం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. దీంతో ఎప్పుడు రిలీజ్ చేస్తారు? అనేదానిపై పాన్ ఇండియా స్థాయిలో చర్చ జరుగుతోంది. తాజా అప్డేట్ ప్రకారం ఈ సినిమాని దీపావళి కానుకగా నవంబర్‌లో విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారట మేకర్స్. ముందుగా అనుకున్నట్లు ఈ నెల 28న సినిమాని విడుదల చేస్తారా? లేదా అనేది తెలియాలంటే కొన్ని రోజులు వేచి చూడాలి. శ్రుతీహాసన్ హీరోయిన్గా నటించిన ఈ చిత్రంలో జగపతిబాబు, పృథ్వీరాజ్ సుకుమారన్, శ్రియా రెడ్డి కీలక పాత్రల్లో నటించారు. ‘స్కంద’లో రామ్, శ్రీలీల రామ్ పోతినేని హీరోగా నటించిన తొలి పాన్ ఇండియా చిత్రం ‘స్కంద’ కూడా ముందు అనుకున్న తేదీకి కాకుండా వేరే తేదీకి ప్రేక్షకుల ముందుకు వస్తోంది. బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్. శ్రీనివాసా చిట్టూరి నిర్మించారు. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో వినాయక చవితి సందర్భంగా ఈ నెల 15న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు గతంలో చిత్రబృందం ప్రకటించింది. అయితే తాజాగా మేకర్స్ సినిమా విడుదలను వాయిదా వేశారు. ఈ నెల 15న కాకుండా 28న రిలీజ్ చేయనున్నట్లు చిత్ర నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది. అయితే సినిమా విడుదల తేదీ ఎందుకు మార్చాల్సి వచ్చిందనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. ‘చంద్ర ముఖి–2’లో కంగన రజనీకాంత్ హీరోగా జ్యోతిక టైటిల్ రోల్లో నటించిన చిత్రం ‘చంద్రముఖి’ (2005). పి. వాసు దర్శకత్వం వహించిన ఈ సినిమా బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. దాదాపు 18 ఏళ్ల తర్వాత ఈ చిత్రానికి సీక్వెల్‌గా రూపొందిన చిత్రం ‘చంద్రముఖి 2’. తొలి భాగానికి దర్శకత్వం వహించిన పి. వాసునే రెండో భాగాన్ని తీశారు. అయితే సీక్వెల్లో హీరో, హీరోయిన్ మారారు. రాఘవ లారెన్స్ హీరోగా, కంగనా రనౌత్ టైటిల్ రోల్లో నటించారు. సుభాస్కరన్ నిర్మించిన ఈ చిత్రాన్ని వినాయక చవితి సందర్భంగా ఈ నెల 15న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. అయితే తాజాగా ఈ సినిమా విడుదల వాయిదా పడింది. ఈ నెల 15న కాకుండా 28న విడుదల చేయనున్నట్లు నిర్మాణ సంస్థ ప్రకటించింది. కొన్ని సాంకేతిక కారణాల వల్లే విడుదలను వాయిదా వేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. కాగా ‘చంద్రముఖి 2’ని తెలుగులో రాధాకృష్ణ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై వెంకట్ ఉప్పుటూరి, వెంకట రత్నం శాఖమూరి రిలీజ్ చేస్తున్నారు. ‘ఆదికేశవ’లో వైష్ణవ్ తేజ్ వైష్ణవ్ తేజ్, శ్రీలీల జంటగా శ్రీకాంత్ ఎన్. రెడ్డి దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘ఆదికేశవ’. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ సినిమా విడుదల కూడా వాయిదా పడింది. తొలుత ఈ చిత్రాన్ని జూలైలో రిలీజ్ చేయాలనుకున్నారు.. చేయలేదు. ఆ తర్వాత ఆగస్టు 18న విడుదల చేయనున్నట్లు యూనిట్ ప్రకటించింది. ఆ తర్వాత అది కూడా వాయిదా పడి చివరికి నవంబర్ 10వ తేదీకి ఫిక్స్ అయింది. ఫారిన్లో కొంత షూటింగ్ బ్యాలెన్స్ ఉండటం వల్లే విడుదల వాయిదా వేస్తున్నట్లు ‘ఆదికేశవ’ చిత్రబృందం ప్రకటించింది. ‘టిల్లు స్క్వేర్’లో సిద్ధు సిద్ధు జొన్నలగడ్డ, నేహా శెట్టి జంటగా విమల్ కృష్ణ దర్శకత్వం వహించిన ‘డీజే టిల్లు’ (2022) సినిమా సూపర్ హిట్‌గా నిలిచిన విషయం తెలిసిందే. ఈ సినిమాకి సీక్వెల్‌గా ‘టిల్లు స్క్వేర్’ రూపొందింది. ఈ చిత్రానికి డైరెక్టర్, హీరోయిన్ మారారు. మల్లిక్ రామ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్గా నటించారు. ‘డీజే టిల్లు’ని నిర్మించిన సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. ఈ మూవీని కూడా ఈ నెల 15న విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. అయితే విడుదల వాయిదా పడింది. ‘‘టిల్లు స్క్వేర్’ పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. క్వాలిటీ ఔట్పుట్ కోసం విడుదల వాయిదా వేయక తప్పడం లేదు. త్వరలోనే కొత్త రిలీజ్ డేట్ ప్రకటిస్తాం’’ అంటూ మేకర్స్ ప్రకటించారు. ‘పెద కాపు’లో విరాట్ కర్ణ ∙‘నారప్ప’ వంటి హిట్ మూవీ తర్వాత శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించిన చిత్రం ‘పెదకాపు–1’. విరాట్ కర్ణ, ప్రగతి శ్రీవాస్తవ జంటగా నటించారు. మిర్యాల సత్యనారాయణ రెడ్డి సమర్పణలో మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించారు. ఈ సినిమాని తొలుత ఆగస్టులో విడుదల చేయనున్నట్లు యూనిట్ ప్రకటించినా, వాయిదా పడింది. కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడు? అనేదానిపై తాజాగా చిత్ర యూనిట్ స్పష్టత ఇచ్చింది. ఈ నెల 29న ‘పెదకాపు –1’ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. -
ప్రేమలో ముగినితేలుతున్న టాలీవుడ్ హీరోలు
టాలీవుడ్లో ప్రేమ కథలకు మంచి ఆదరణ ఉంటుంది. కొంచెం కొత్తగా ప్రేమ కథను చెబితే చాలు ఆ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారు. అందుకే మన దర్శకనిర్మాతలు లవ్‌స్టోరీలకు అతి ప్రాధాన్యత ఇస్తారు. హీరోలు సైతం తొలుత లవ్‌స్టోరీలు చేయడానికే ఇష్టపడతారు. ఆ తర్వాత కొంతకాలానికి మాస్ ఇమేజ్‌ని కోరుకుంటారు. ఆ తరహా సినిమాలు వర్కౌట్ అయితే సరే, ఏ మాత్రం తేడా కొట్టినా.. ఉన్న ఇమేజ్ డ్యామేజ్ అవుతుంది. దాని నుంచి తేరుకునేందుకు మళ్లీ ప్రేమ బాట పడతారు. ప్రస్తుతం టాలీవుడ్ చెందిన కొంతమంది హీరోలు అదే పని చేస్తున్నారు. యాక్షన్‌ని నో చెప్పి ప్రేమలో మునిగితేలుతున్నారు. వరుసగా లవ్‌స్టోరీలు చేస్తూ బీజీగా ఉన్న హీరోలపై ఓ లుక్కేద్దాం. ప్యార్‌కి సై అంటున్న విజయ్ ‘లైగర్’తో పాన్ ఇండియా స్టార్ అయ్యాడు విజయ్ దేవరకొండ. కానీ ఆ సినిమా మాత్రం బాక్సాఫీస్ వద్ద దారుణంగా బోల్తా పడింది. దీంతో విజయ్ యాక్షన్‌కి రాం రాం చెప్పాడు. హిట్ అందుకునేందుకు మళ్లీ ‘గీత గోవిందం’ పార్మెట్లోకి వెళ్లి పోయాడు. శివ నిర్మాణతో కలిసి ‘ఖుషి’ సినిమా చేస్తున్నాడు. సమంత హీరోయిన్. సెప్టెంబర్ 1న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా తర్వాత కూడా విజయ్ మరో ప్రేమ కథా చిత్రంతోనే ప్రేక్షకులను పలకరించనున్నాడు. గీత గోవిందం దర్శకుడు పరశురాంతో విజయ్ ఓ సినిమా చేస్తున్నాడు. ఇది కూడా లవ్‌స్టోరీనే. గీత గోవిందం చిత్రానికి ఇది సీక్వెల్. ఇలా విజయ్ యాక్షన్‌కి నో చెప్పి ఫ్యార్కి సై అంటున్నాడు. మరోసారి ప్రేమలో పడ్డ డీజే టిల్లు ప్రేమలో పడడమే పనిగా పెట్టుకున్నాడు సిద్దు జొన్నలగడ్డ. డీజే టిల్లుతో సూపర్ హిట్ కొట్టిన ఈ యంగ్ హీరో త్వరలోనే ఈ చిత్రం సీక్వెల్ ‘టిల్లు స్క్వేర్’తో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇది కూడా లవ్ స్టోరీనే. ఈ చిత్రం నుంచి విడుదలైన ఫస్ట్ సింగిల్ చూస్తే ఆ విషయం ఇట్టే అర్థమవుతుంది. ఇక ఈ చిత్రం తర్వాత కూడా మళ్లీ లవ్‌స్టోరీలోనే కనిపించబోతున్నాడు ఈ టిల్లుగాడు. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో సిద్దు ఓ సినిమా చేస్తున్నాడు. ఇది పూర్తి ప్రేమ కథా చిత్రమని తెలుస్తోంది. ఫేవరెట్ జానర్లోకి చైతూ రీఎంట్రీ మొదట్లో వరుసగా లవ్‌స్టోరీలు చేస్తూ లవర్ బాయ్‌గా ముద్ర వేసుకున్నాడు నాగ చైతన్య. ఆ ముద్ర నుంచి బయట పడేందుకు మధ్య మధ్యలో యాక్షన్ చిత్రాలు చేశాడు. కానీ అవేవి హిట్ కాలేదు. అయినప్పటికీ యాక్షన్‌ని వీడలేదు. కానీ ఆ మధ్య విడుదలైన ‘కస్టడీ’ చైతు కల్లు తెరిపించింది. విడుదలైన తొలి రోజే డిజాస్టర్ టాక్ వచ్చింది. దీంతో చై మళ్లీ తన ఫేవరెట్ జానర్లోకి తిరిగి వచ్చాడు. ప్రేమమ్ డైరెక్టర్ చందు మొండేటితో కలిసి త్వరలోనే పాన్ ఇండియా స్థాయిలో లవ్‌స్టోరీ చేయబోతున్నాడు. దానికి సంబంధించిన ప్రీప్రొడక్షన్ వర్క్ ఈ మధ్యే స్టార్ట్ అయింది. ఈ చిత్రంలో నాగచైతన్యకు జోడీగా కీర్తి సురేశ్ నటించబోతున్నట్లు సమాచారం. ఇలా మొత్తానికి టాలీవుడ్ యంగ్ హీరోలంతా మళ్లీ లవ్‌స్టోరీలు చేస్తూ ప్రేమలో మునిగిపోతున్నారు. -
Tillu Square: అనుపమతో డీజే టిల్లు ఫ్లర్టింగ్.. ప్రోమో అదిరింది!
‘డీజే టిల్లు’.. ఈ ఒక్క మూవీతో ఓవర్‌నైట్ స్టార్ అయ్యాడు సిద్ధు జొన్నలగడ్డ. అంతకు ముందు పలు సినిమాల్లో నటించినా సిద్దుకు తగిన గుర్తుంపు రాలేదు. కానీ డీజే టిల్లు మాత్రం అతని జీవితాన్ని మార్చేసింది. ప్రస్తుతం ఈ సినిమాకు సీక్వెల్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. రామ్ మల్లిక్ దర్శకత్వం వహిస్తున్న ఈ సీక్వెల్‌కు టిల్లు స్క్వేర్ అని టైటిల్ ఫిక్స్ చేశారు. తాజాగా ఈ సినిమా నుంచి ఓ అప్డేట్ ఇచ్చింది చిత్ర యూనిట్. సినిమాలోని 'టికెటే కొనకుండా' అనే పాటను జులై 26న రిలీజ్ కానుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఓ ప్రోమోని విడుదల చేసింది చిత్ర యూనిట్. అందులో సిద్ధు తనదైన స్టైల్లో అనుపమను ఫ్లర్టింగ్ చేశాడు. ఓ పార్టీలో వాష్ బేసిన్ వద్ద షూస్ క్లీన్ చేస్తున్న సిద్ధు.. అక్కడే ఉన్న అనుపమను చూస్తూ.. ‘మనసు విరిగినట్టున్నది ఎక్కడనో’అనడంతో ఆమె కోపంగా చూస్తుంది. ఉన్నడా బాయ్‌ఫ్రెండ్? అనడంతో.. ‘నీకెందుకు’ అంటుంది అను. అప్పుడు సిద్దు..‘ఒకవేళ ఉంటే నా షూ నేనేసుకుని వెళ్లిపోతా, లేడంటే.. ‘నిన్నేసుకొని పోతా’అంటాడు. ‘అబా.. ఎక్కడికి?’అని అను అంటే..‘నువ్వు ఏడికంటే ఆడికి’అని సిద్ధు రిప్లై ఇస్తాడు. ‘ఇప్పుడే కదరా కలిశాం. అప్పుడే ఓపెన్‌గా ఫ్లర్ట్ చేస్తావా’ అంటుంది అనుపమ. ‘మరి ఫ్లర్ట్ చేస్తున్న సంగతి నీకు తెల్వాలే గదా. లేకపోతే చేసి ఉపయోగం ఏముంది?’ అంటూ ఫన్నీగా ఆ ప్రోమో సాగుతుంది. ప్రోమోని ఇంత కామెడీగా ఉంది అంటే.. ఇక సినిమా ఏ రేంజ్లో ఉంటుందో అని ఫ్యాన్స్ అంచనాలు పెంచేసుకుంటున్నారు.