అఫీషియల్: ఓటీటీకి టిల్లు స్క్వేర్.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ | Siddu Jonnalagadda Tillu Square Movie OTT Release Date Locked, Check Streaming Platform Details - Sakshi
Sakshi News home page

Tillu Square OTT Release Date: ఓటీటీకి టిల్లు స్క్వేర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Published Fri, Apr 19 2024 11:15 AM | Last Updated on Fri, Apr 19 2024 11:43 AM

Siddu Jonnalagadda MovieTillu Square OTT Date Locked On This day - Sakshi

సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్‌ జంటగా నటించిన 'టిల్లు స్క్వేర్'. ఈ చిత్రాన్ని మల్లిక్ రామ్ దర్శకత్వంలో తెరకెక్కించారు.  డీజే టిల్లుకు సీక్వెల్‌గా ఈ సినిమాను రూపొందించారు. గతంలో రిలీజైన డీజే టిల్లు సూపర్ హిట్ కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మార్చి 29 ప్రేక్షకుల ముందుకొచ్చిన టిల్లు స్క్వేర్‌ బాక్సాఫీస్ వద్ద హిట్‌ టాక్‌ సొంతం చేసుకుంది. దాదాపు రూ.100 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించింది. టిల్లు స్క్వేర్‌ సూపర్ హిట్ కావడంతో ఎప్పుడెప్పుడు ఓటీటీకి వస్తుందా అని ఫ్యాన్స్‌ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 

తాజాగా ఈ మూవీ ఓటీటీకి స్ట్రీమింగ్ డేట్ వచ్చేసింది. ఈ నెల 26 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు నెట్‌ఫ్లిక్స్‌ వెల్లడించింది. తెలుగుతోపాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో అందుబాటులోకి రానున్నట్లు తెలిపింది. ఈ విషయాన్ని ట్విటర్‌ ద్వారా పంచుకుంది. 'చరిత్ర పునరావృతం అవ్వడం సాధారణం. అదే టిల్లు వస్తే హిస్టరీ, మిస్టరీ, కెమిస్ట్రీ అన్నీ రిపీట్ అవ్వుతాయి. అట్లుంటది టిల్లుతోని. టిల్లు స్క్వేర్ తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీలో నెట్‌ఫ్లిక్స్‌లో ఏప్రిల్ 26న వస్తుంది.' అంటూ పోస్ట్ చేసింది. ఇది చూసిన ఫ్యాన్స్‌ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాగా.. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement