Anupama Parameshwaran
-
ఓటీటీలో 'డ్రాగన్' సినిమా.. పోస్టర్ వైరల్
కంటెంట్ బాగుంటే చాలు భాషతో సంబంధం లేకుండా హిట్ కొట్టొచ్చని లవ్ టుడే ఫేమ్ ప్రదీప్ రంగనాథన్ మరోసారి నిరూపించాడు. ఆయన నటించిన రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ మూవీ (Return Of The Dragon) బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. అయితే, తాజాగా ఈ చిత్రం ఓటీటీలో విడుదల కానుంది. ఈమేరకు అధికారికంగా ప్రకటన కూడా వచ్చేసింది. ఈ సినిమా తమిళం, తెలుగు భాషల్లో ఫిబ్రవరి 21న విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. అనుపమ పరమేశ్వరన్, కయాదు లోహర్ హీరోయిన్లుగా నటించిన ఈ మూవీకి యూత్ బాగా కనెక్ట్ అయ్యారు.మార్చి 14న హిందీలో రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ రిలీజవుతుండగా ఇంతలోనే ఓటీటీ గురించి ఒక పోస్టర్ నెట్టింట వైరల్ అవుతుంది. తెలుగు,తమిళ్,మలయాళం,కన్నడలో మార్చి 21 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుందని షోషల్‌మీడియాలో పోస్టర్ షేర్ అవుతుంది. దీంతో అభిమానులు కూడా వైరల్ చేస్తున్నారు. అయితే, నెట్‌ఫ్లిక్స్ అధికారిక సోషల్‌మీడియా నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. కేవలం రూ. 35 కోట్లతో తెరకెక్కించిన డ్రాగన్ బాక్సాఫీస్ వద్ద రూ. 150 కోట్ల మార్క్ కలెక్షన్లకు దగ్గరగా ఉంది. కథేంటి..?డి.రాఘవన్(ప్రదీప్ రంగనాథన్)(Pradeep Ranganathan) ఇంటర్మీడియట్లో 96 శాతం మార్కులతో పాస్ అయిన తర్వాత తాను ఇష్టపడిన అమ్మాయికి ప్రపోజ్ చేస్తాడు. అయితే ఆమె తనకు బ్యాడ్ బాయ్స్ అంటేనే ఇష్టమని చెబుతూ అతని ప్రేమను రిజెక్ట్ చేస్తుంది. దీంతో రాఘవన్ బ్యాడ్ బాయ్‌గా మారిపోయి బీటెక్‌లో 48 సబ్జెక్టుల్లో ఫెయిల్ అవుతాడు. రెండేళ్ల పాటు ఖాలీగా ఉండడంతో కాలేజీలో తనను ప్రేమించిన అమ్మాయి కీర్తి(అనుపమ పరమేశ్వరన్)(Ashwath Marimuthu) బ్రేకప్ చెప్పి వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుంటుంది.దీంతో జీవితంలో ఎలాగైన సక్సెస్ కావాలని ఫేక్ సర్టిఫికేట్స్ వల్ల మంచి ఉద్యోగం సంపాదిస్తాడు. తనకున్న తెలివితో పెద్ద పొజిషియన్‌కి వెళ్తాడు. ఇల్లు, కారు కొంటాడు. బాగా ఆస్తులు ఉన్న అమ్మాయి పల్లవి (కయాదు లోహర్)తో పెళ్ళి కూడా ఫిక్స్ అవుతుంది. లైఫ్ అంతా సాఫీగా సాగుతున్న సమయంలో ఫేక్ సర్టిఫికెట్స్ గురించి ప్రిన్సిపల్‌కి తెలుస్తుంది. అక్కడి నుంచి అసలు కథ మొదలౌతుంది. డ్రాగన్‌కు ప్రిన్సిపల్ పెట్టే కండీషన్స్ ఏంటి..? బీటెక్‌లో 48 సబ్జెక్టులను ఎలా పూర్తి చేశాడు. కాలేజీ డేస్‌లో తను ప్రేమించిన అమ్మాయి కీర్తి(అనుపమ పరమేశ్వరన్) మరోసారి ఆయన జీవితంలోకి ఎందుకొస్తుంది..? ఉద్యోగం ఉందని చెప్పి పెళ్లి సెట్ చేసుకున్న పల్లవితో ఏడడుగులు వేస్తాడా..? చివరకు ఏం జరిగింది? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే(Return Of The Dragon Review ). -
‘రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్’ సక్సెస్ మీట్ (ఫొటోలు)
-
బ్లూ శారీలో హెబ్బా.. స్విమ్మింగ్‌పూల్‌లో కత్రినా కైఫ్!
బ్లూ శారీలో మెరిసిపోతున్న హెబ్బా పటేల్..స్విమ్మింగ్ పూల్‌లో కత్రినా కైఫ్ చిల్..మజాకా హీరోయిన్ రీతూ వర్మ స్మైలీ లుక్స్...శారీలో అనుపమ పరమేశ్వరన్ ట్రెండీ లుక్..శారీ హీరోయిన్ స్టన్నింగ్ పోజులు.. View this post on Instagram A post shared by Keerthy Suresh (@keerthysureshofficial) View this post on Instagram A post shared by Anupama Parameswaran (@anupamaparameswaran96) View this post on Instagram A post shared by AaradhyaDevi (@iamaaradhyadevi) View this post on Instagram A post shared by Ritu Varma (@rituvarma) View this post on Instagram A post shared by Katrina Kaif (@katrinakaif) View this post on Instagram A post shared by Hebah Patel (@ihebahp) -
'రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్' మూవీ రివ్యూ
‘లవ్ టుడే’తో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు యంగ్ హీరో ప్రదీప్‌రంగనాథన్. చాలా గ్యాప్ తర్వాత ఈ సారి 'రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్'(Return Of The Dragon Review)తో మళ్లీ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.'ఓరి దేవుడా' ఫేమ్ అశ్వత్ మారిముత్తు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అనుపమా పరమేశ్వరన్, కయాదు లోహర్ హీరోయిన్లుగా నటించారు. నేడు(ఫిబ్రవరి 21) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.కథేంటంటే..డి.రాఘవన్(ప్రదీప్ రంగనాథన్)(Pradeep Ranganathan) ఇంటర్మీడియట్లో 96 శాతం మార్కులతో పాస్ అయిన తర్వాత తాను ఇష్టపడిన అమ్మాయికి ప్రపోజ్ చేస్తాడు. అయితే ఆమె తనకు బ్యాడ్ బాయ్స్ అంటేనే ఇష్టమని చెబుతూ అతని ప్రేమను రిజెక్ట్ చేస్తుంది. దీంతో రాఘవన్ బ్యాడ్ బాయ్‌గా మారిపోయి బీటెక్‌లో జాయిన్ అవుతాడు. కాలేజీలో అతనికి డ్రాగన్ అని పేరు పెడతారు. ప్రిన్సిపల్(మిస్కిన్)తో సహా ఫ్యాక్టల్లీ మొత్తానికి డ్రాగన్ అంటే నచ్చదు. 48 సబ్జెక్టుల్లో ఫెయిల్ అవుతాడు. రెండేళ్ల పాటు ఖాలీగా ఉండడంతో కాలేజీలో తనను ప్రేమించిన అమ్మాయి కీర్తి(అనుపమ పరమేశ్వరన్)(Ashwath Marimuthu) బ్రేకప్ చెప్పి వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుంటుంది.దీంతో జీవితంలో ఎలాగైన సక్సెస్ కావాలని ఫేక్ సర్టిఫికేట్స్ మంచి ఉద్యోగం సంపాదిస్తాడు. తనకున్న తెలివితో పెద్ద పొజిషియన్‌కి వెళ్తాడు. ఇల్లు, కారు కొంటాడు. బాగా ఆస్తులు ఉన్న అమ్మాయి పల్లవి (కయాదు లోహర్)తో పెళ్ళి కూడా ఫిక్స్ అవుతుంది. లైఫ్ అంతా సాఫీగా సాగుతున్న సమయంలో ఫేక్ సర్టిఫికెట్స్ గురించి ప్రిన్సిపల్‌కి తెలుస్తుంది. ఈ విషయం తాను ఉద్యోగం చేస్తున్న కంపెనీతో పాటు పిల్లనిచ్చి పెళ్లి చేయబోతున్న మామగారికి చెప్పకుండా ఉండాలంటే కాలేజీకి వచ్చి చదువుకొని పెండింగ్‌లో ఉన్న 48 సబ్జెక్టులు పాస్ అవ్వాలని కండీషన్ పెడతాడు. పరీక్షలకు మూడు నెలల సమయమే ఉంటుంది. దీంతో వేరే దారిలేక తప్పనిసరి పరిస్థితుల్లో మళ్లీ కాలేజీకి వెళ్తాడు డ్రాగన్. ఆ తర్వాత ఏం జరిగింది? కాలేజీకి మళ్లీ కీర్తి ఎందుకు వచ్చింది? ఆఫీస్‌లో,ఇంట్లో అబద్దం చెప్పి కాలేజీకి వచ్చిన డ్రాగన్‌కి ఎదురైన సమస్యలు ఏంటి? నిజంగానే 48 సబ్జెక్టుల్లో పాస్ అయ్యాడా? లేదా? పల్లవితో పెళ్లి జరిగిందా? చివరకు ఏం జరిగింది? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే(Return Of The Dragon Review ).ఎలా ఉందంటే.. 'లవ్ టుడే'తో భారీ హిట్ కొట్టాడు ప్రదీప్ రంగనాథన్. అంతకు ముందు అతనెవరేది కూడా తెలుగు ప్రేక్షకులకు తెలియదు. కానీ ఆ ఒక్క సినిమాతో తెలుగు హీరోగా మారిపోయాడు. అతని నుంచి మరో సినిమా వస్తుందంటే టాలీవుడ్లో అంచనాలు పెరిగిపోయాయి. ఆ అంచనాలకు తగ్గట్టే మళ్లీ యూత్‌ఫుల్ ఎంటర్టైనర్తో వచ్చేశాడు. 'రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్’ కథ, కథనంలో కొత్తదనం ఏమి లేదు కానీ..ఫుల్ ఎంటర్టైనింగ్గా సాగుతుంది. కాలేజీ సీన్స్ మొదలు క్లైమాక్స్ వరకు ప్రతీ సీన్ గత సినిమాలను గుర్తు చేస్తుంది.ఊహించినట్లుగానే కథనం సాగుతుంది.అయినా కూడా బోర్ కొట్టదు. దర్శకుడు కథ విషయంలో కేర్ తీసుకోలేదు కానీ కథనం మాత్రం జాగ్రత్త పడ్డాడు. అల్రేడీ చూసిన కథలనే కొత్తగా చెప్పే ప్రయత్నం చేశాడు. ఫస్టాఫ్ కాలేజీ ఎపిసోడ్ కొంతవరకు ఆకట్టుకుంటుంది. హీరో కాలేజీ నుంచి బయటకు వచ్చిన తర్వాత కథనం నెమ్మదిగా సాగుతుంది. హీరోకి ఉద్యోగం లభించిన తర్వాత కథనం ఆసక్తికరంగా సాగుతుంది. ఫేక్ సర్టిఫికేట్స్‌తో దొరికిపోతాడు అనుకున్న ప్రతిసారి ఓ ట్విస్ట్ ఇవ్వడం ఆసక్తిని పెంచుతుంది. ఇక ఇంటర్వెల్ ట్విస్ట్ అదిరిపోతుంది. ఫస్టాఫ్‌తో పోలిస్తే సెకండాఫ్ కథనం ఆసక్తికరంగా సాగుతుంది. చోటా డ్రాగన్ కామెడీ నవ్విస్తుంది. అలాగే మధ్యమధ్యలో వచ్చే ట్విస్టులు బాగుంటాయి. ప్రీక్లైమాక్స్ నుంచి కథనం చాలా ఎమోషనల్‌గా సాగుతుంది. ముగింపు ఆకట్టుకుంటుంది. ఫేక్ సర్టిఫికెట్స్‌తో ఉద్యోగాలు పొందడం కారణంగా టాలెంట్ ఉన్నవారు నష్టపోతున్నారనే విషయాన్ని దర్శకుడు తెరపై ఎంటర్టైనింగ్ చెప్పాడు. ఎవరెలా చేశారంటే.. రాఘవన్ అలియాస్ డ్రాగన్‌గా ప్రదీప్ రంగనాథ్ తనదైన నటనతో మరోసారి ఆకట్టుకున్నాడు. ఎమోషనల్ సీన్లలో అదరగొట్టేశాడు. ఇక డ్రాగన్ ప్రియురాలు కీర్తిగా అనుపమ పరమేశ్వరన్ తెరపై కనిపించేది తక్కువ సమయమే అయినా.. ఉన్నంతలో చక్కగా నటించింది. హీరోయిన్ కయాదు లోహర్ తెరపై గ్లామరస్‌గా కనిపించింది. అనుపమ కంటే ఆమె పాత్రకు స్క్రీన్ స్పేస్ ఎక్కువ. అయితే నటనతో అంతగా స్కోప్ ఉండదు. మిస్కిన్‌తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. సాంకేతికంగా సినిమా బాగుంది. లియోన్ జేమ్స్ నేపథ్య సంగీతం సినిమాకు ప్లస్ అయింది. పాటలు తెలుగు ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేవు. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి. -
Happy Birthday: అనుపమ పరమేశ్వరన్ బర్త్‌డే స్పెషల్
-
ప్రదీప్ రంగనాథన్ 'రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్' మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
'అక్కడ ఎక్కడో చావడానికి రూ.70 లక్షలా?'.. ఆసక్తిగా టీజర్
అనుపమ పరమేశ్వరన్ లీడ్ రోల్లో నటిస్తోన్న తాజా చిత్రం పరదా. సినిమా బండి ఫేమ్ ప్రవీణ్ కండ్రేగుల ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీని ఆనంద మీడియా బ్యానర్లో విజయ్ డొంకాడ, శ్రీనివాసులు పివి, శ్రీధర్ మక్కువ నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ టీజర్‌ను మేకర్స్ విడుదల చేశారు. హీరో దుల్కర్ సల్మాన్ చేతుల మీదుగా టీజర్ రిలీజ్ చేశారు.టీజర్ చూస్తే ఈ మూవీని సోషియో ఫాంటసీగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. 'పిచ్చి గిచ్చి పట్టిందా తనకీ.. అక్కడ ఎక్కడో చావడానికి 70 లక్షలు ఇస్తుందట' అనే డైలాగ్‌తో టీజర్ ప్రారంభమైంది. టీజర్ చూస్తే ఈ కథ అంతా పర్వత ప్రాంతాల్లోనే చిత్రీకరించినట్లు తెలుస్తోంది. హిమాచల్ ప్రదేశ్ లాంటి ఎత్తైన ప్రాంతాల్లో ఉండే గ్రామీణ సంప్రదాయాలు, ఆచారాల నేపథ్యంలో తెరకెక్కించినట్లు అర్థమవుతోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రంలో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకు గోపి సుందర్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రంలో దర్శన రాజేంద్రన్, సంగీత ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. -
రియల్ స్టోరీతో వస్తోన్న అనుపమ పరమేశ్వరన్..!
మలయాళ సూపర్ స్టార్ సురేష్ గోపి, అనుపమ పరమేశ్వరన్ ముఖ్య పాత్రల్లో నటించిన చిత్రం 'జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ'. ఈ సినిమాను యధార్థ సంఘటనల ఆధారంగా తెరెకెక్కిస్తున్నారు. ప్రవీణ్ నారాయణ దర్శకత్వంలో వస్తోన్న ఈ చిత్రానికి ఫణీంద్ర కుమార్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. కాస్మోస్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు.ఈ మూవీలో అనుపమ పరమేశ్వరన్ జానకి పాత్రలో నటిస్తోంది. యదార్థ సంఘటన ఆధారంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో జానకికి జరిగిన అన్యాయాన్ని కోర్టులో ఎలా ఎదుర్కొందనేదే అసలు కథ. ఇంటెన్స్ కోర్టు డ్రామాగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ మూవీలో జానకి కేసును వాదించే లాయర్ పాత్రలో సూపర్ స్టార్ సురేష్ గోపి నటించారు. ప్రస్తుతం షూటింగ్ జరుగుతోన్న ఈ సినిమాని ఫిబ్రవరిలో విడుదల చేస్తామని మూవీ మేకర్స్ తెలిపారు.రియల్ స్టోరీ కావడంతో ఈ చిత్రంపై ఆడియన్స్‌లో ఆసక్తి నెలకొంది. ఈ చిత్రంలో బైజు సందోష్, మాధవ్ సురేష్ గోపి, దివ్య పిళ్లయి, అస్కర్ అలీ ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సినిమాకు గిరీష్ నారాయణన్ , జిబ్రాన్ సంగీతమందిస్తున్నారు. -
కళ్లతోనే కవ్విస్తోన్న హీరోయిన్ అనుపమ.. ఫోటోలు
-
బ్లూ శారీలో క మూవీ హీరోయిన్.. ఫుల్ ఎంజాయ్ చేస్తోన్న ఆదిపురుష్ భామ!
మెహందీ ఫోటోలు షేర్ చేసిన హీరోయిన్ రహస్య గోరఖ్..సిటాడెల్ లుక్‌లో సమంత స్పెషల్ లుక్స్..బ్లూ శారీలో మెరిసిపోతున్న క మూవీ హీరోయిన్ నయన్ సారిక..అక్టోబర్ జ్ఞాపకాలు గుర్తు చేసుకున్న ప్రియాంక చోప్రా..ఫ్యామిలీతో చిల్ అవుతోన్న అనుపమ పరమేశ్వరన్..పర్వతాల్లో ఫుల్ ఎంజాయ్ చేస్తోన్న ఆదిపురుష్ భామ కృతి సనన్..కలర్‌ఫుల్ శారీలో అనసూయ హోయలు.. View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by Kriti (@kritisanon) View this post on Instagram A post shared by Anupama Parameswaran (@anupamaparameswaran96) View this post on Instagram A post shared by Priyanka (@priyankachopra) View this post on Instagram A post shared by Nayan🇮🇳 (@nayansarika_05) View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) View this post on Instagram A post shared by Rahasya Kiran (@rahasya_kiran) -
హీరోలతో పోటీ పడుతున్న సూపర్ లేడీస్.. ఇప్పుడిదే ట్రెండ్
సినిమాని జనరల్‌గా మేల్ లీడ్ చేస్తుంటారు. ఫిమేల్ లీడ్ చేయడం తక్కువ. అయితే ఈ మధ్య కాలంలో లేడీస్ లీడ్ చేసే సినిమాలు ఎక్కువయ్యాయి. ఒకవైపు హీరోల సరసన రెగ్యులర్ చిత్రాల్లో నటించడంతో అటు హీరోయిన్ ఓరియంటెడ్ చిత్రాలు చేస్తున్నారు కొందరు కథానాయికలు. స్టోరీని లీడ్ చేస్తున్న ఆ లీడ్ లేడీస్ గురించి తెలుసుకుందాం. ప్రతీకారం కేసు పెడదామంటే..‘అరుంధతి, రుద్రమదేవి, భాగమతి, నిశ్శబ్దం’ వంటి ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్స్ చేసిన అనుష్క నటిస్తున్న తాజా చిత్రం ‘ఘాటీ’. ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ సినిమా తర్వాత అనుష్క తెలుగులో కమిటైన చిత్రమిది. ఈ మూవీకి క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్నారు. వీరి కాంబినేషన్లో వచ్చిన ‘వేదం’ (2010) మంచి హిట్‌గా నిలిచింది. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై రూపొందుతోన్న ‘ఘాటీ’ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. ఒడిశాలోని ఒక మహిళ జీవితంలో జరిగిన వాస్తవ ఘటన నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారట క్రిష్. బిజినెస్ ఉమన్‌గా ఎదుగుతున్న ఓ మహిళను కొందరు కావాలని టార్గెట్ చేస్తారు. వ్యాపారంలో నష్టాలపాలైన ఆ మహిళ అందుకు కారకులైన వారిపై ప్రతీకారం తీర్చుకోవాలనుకునే కథాంశంతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారట. ఆంధ్రా– ఒడిశా బోర్డర్లో తొలి షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ సినిమా తాజా షెడ్యూల్ హైదరాబాద్‌లో జరుగుతోంది. శివశక్తిగా... తమన్నా లీడ్ రోల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘ఓదెల 2’. 2021లో విడుదలై, హిట్‌గా నిలిచిన ‘ఓదెల రైల్వేస్టేషన్ ’ సినిమాకి సీక్వెల్‌గా ‘ఓదెల 2’ రూపొందుతోంది. తొలి భాగాన్ని తెరకెక్కించిన అశోక్ తేజయే రెండో భాగానికి కూడా దర్శకత్వం వహిస్తున్నారు. మధు క్రియేషన్స్, సంపత్ నంది టీమ్ వర్క్స్‌పై డి. మధు నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో తన కెరీర్లో తొలిసారిగా శివశక్తి (నాగ సాధు) పాత్రలో నటిస్తున్నారు తమన్నా. ఇప్పటికే విడుదలైన ఆమె ఫస్ట్ లుక్, పోస్టర్‌కి అనూహ్యమైన స్పందన వచ్చింది. సూపర్ నేచురల్ థ్రిల్లర్‌గా రూపొందుతోన్న ‘ఓదెల 2’ ఫైనల్ షెడ్యూల్ ఓదెల గ్రామంలోని ఓదెల మల్లన్న క్షేత్రంలో జరుగుతోంది. తన దర్శకత్వంలో వచ్చిన ‘రచ్చ’ సినిమాలో హీరోయిన్గా తమన్నాకి అవకాశం ఇచ్చిన డైరెక్టర్ సంపత్ నంది ‘ఓదెల 2’లో లీడ్ రోల్ చేసే చాన్స్ ఇచ్చారు. ఈ మూవీలో హెబ్బా పటేల్, వశిష్ఠ ఎన్. సింహా, మురళీ శర్మ, నాగమహేశ్, గగన్ విహారి వంటివారు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. బంగారు బొమ్మ ‘యశోద, శాకుంతలం’ వంటి లేడీ ఓరియంటెడ్ చిత్రాల తర్వాత సమంత నటించనున్న తాజా ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్ ‘మా ఇంటి బంగారం’. తన బర్త్ డే (ఏప్రిల్ 28న) సందర్భంగా ఈ సినిమాని ప్రకటించారు సమంత. తన సొంత డైరెక్షన్ బ్యానర్ ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై ఈ సినిమాని నిర్మించనున్నట్లు ఆమె ప్రకటించడం విశేషం. తెలుగులో ‘ఖుషి’ సినిమా తర్వాత ఆమె అంగీకరించిన చిత్రం ఇదే. అయితే ఈ సినిమాకి దర్శకుడు ఎవరు? అనే విషయాన్ని ప్రకటించలేదు. ఇప్పటిదాకా నటిగా మంచి విజయాలను అందుకున్న సమంత ఇప్పుడు నిర్మాతగా తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఈ సినిమా డైరెక్టర్, ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు తెలియాల్సి ఉంది. డబుల్ ధమాకా హీరోయిన్ రష్మికా మందన్నా ఒకేసారి రెండు లేడీ ఓరియంటెడ్ చిత్రాల్లో నటిస్తున్నారు. ఓ వైపు ‘పుష్ప 2: ది రూల్’, ‘కుబేర’, ‘సికందర్’, ‘ఛావా’, వంటి క్రేజీ ప్రాజెక్టుల్లో అల్లు అర్జున్, ధనుష్, సల్మాన్ ఖాన్, విక్కీ కౌశల్ వంటి హీరోలకి జోడీగా నటిస్తూ దూసుకెళుతున్న ఈ బ్యూటీ మరోవైపు ‘రెయిన్బో’, ‘ది గాళ్ ఫ్రెండ్’ వంటి ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్స్‌లోనూ యాక్ట్ చేస్తున్నారు. శాంతరూబన్ దర్శకునిగా పరిచయమవుతున్న ‘రెయిన్బో’లో రష్మికా మందన్నా లీడ్ రోల్ చేస్తున్నారు. రొమాంటిక్ ఫ్యాంటసీ ఎంటర్టైనర్గా రూపొందుతోన్న ఈ చిత్రాన్ని డ్రీమ్ వారియర్ పిక్చర్స్‌పై ఎస్ఆర్. ప్రకాశ్‌బాబు, ఎస్ఆర్. ప్రభు నిర్మిస్తున్నారు. అదేవిధంగా ‘చిలసౌ’ (2018) సినిమాతో దర్శకుడిగా మారిన నటుడు రాహుల్ రవీంద్రన్ కొంచెం గ్యాప్ తర్వాత తెరకెక్కిస్తున్న సినిమా ‘ది గాళ్ ఫ్రెండ్’. ఈ మూవీలోనూ రష్మికా మందన్నా లీడ్ రోల్ చేస్తున్నారు. అల్లు అరవింద్ సమర్పణలో విద్యా కొప్పినీడి, ధీరజ్ మొగిలినేని నిర్మిస్తున్న ఈ సినిమాలో రష్మిక కళాశాల విద్యార్థి పాత్ర చేస్తున్నారని సమాచారం. ఓ కాలేజ్ స్టూడెంట్ ప్రేమ, సంఘర్షణ నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందని టాక్. ఈ మూవీలో కన్నడ నటుడు దీక్షిత్ శెట్టి, అనూ ఇమ్మాన్యుయేల్ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. మహిళల పరదా పక్కింటి అమ్మాయి, హోమ్లీ గర్ల్ ఇమేజ్ ఉన్న అనుపమ పరమేశ్వరన్ ‘రౌడీ బాయ్స్, టిల్లు స్క్వేర్’ సినిమాలతో రూట్ మార్చారు. గ్లామరస్‌గా కనిపించడంతో పాటు ముద్దు సీన్స్‌లోనూ నటించి ఆశ్చర్యపరిచారు. ఆమె ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా తెలుగు చిత్రం ‘పరదా’. ‘ఇన్ ద నేమ్ ఆఫ్ లవ్’ అనేది ఉపశీర్షిక. ‘సినిమా బండి’ మూవీ ఫేమ్ ప్రవీణ్ కాండ్రేగుల ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. విజయ్ డొంకాడ, శ్రీనివాసులు పీవీ, శ్రీధర్ మక్కువ నిర్మిస్తున్న ఈ చిత్రంలో సంగీత, దర్శన రాజేంద్రన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇటీవల ఈ సినిమాకి ‘పరదా’ అనే టైటిల్ ఖరారు చేసి, ఫస్ట్ లుక్, కాన్సెప్ట్ వీడియోను విడుదల చేశారు మేకర్స్. మహిళల చుట్టూ సాగే కథతో రూపొందుతోన్న ఈ సినిమా ప్రేక్షకుల్ని మరో ప్రపంచంలోకి తీసుకెళుతుందని యూనిట్ పేర్కొంది. ఓ భక్తురాలి కథ మంచు లక్ష్మి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘ఆదిపర్వం’. సంజీవ్ కుమార్ మేగోటి దర్శకత్వం వహించారు. రావుల వెంకటేశ్వర్ రావు సమర్పణలో ఎమ్ఎస్కే నిర్మించిన ఈ సినిమా ఈ నెల 31న ప్రేక్షకుల ముందుకురానుంది. ‘‘ఆదిపర్వం’ ఓ అమ్మవారి కథ. అమ్మవారిని నమ్ముకున్న ఓ భక్తురాలి కథ. ఆ భక్తురాలిని దుష్ట శక్తుల నుండి కాపాడే ఓ క్షేత్రపాలకుడి కథ. ఎర్రగుడి నేపథ్యంలో దైవానికి, దుష్టశక్తికి మధ్య జరిగే యుద్ధమే ఈ సినిమా. 1974 నుంచి 1992 మధ్యకాలంలో జరిగిన వాస్తవ ఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించాం. పీరియాడిక్ డ్రామాగా రూపొందిన ఈ మూవీలో గ్రాఫిక్స్ ప్రధానాకర్షణగా నిలుస్తాయి. మంచు లక్ష్మి నటన సరికొత్తగా ఉంటుంది’’ అని చిత్రబృందం పేర్కొంది. సరికొత్త థ్రిల్లర్ మలయాళ, తెలుగు, తమిళ, కన్నడ సినిమాల్లో నటించి, తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు హీరోయిన్ సంయుక్తా మీనన్. తెలుగులో ‘భీమ్లా నాయక్, బింబిసార, సార్, విరూపాక్ష’ వంటి వరుస హిట్లను తన ఖాతాలో వేసుకున్న ఈ బ్యూటీ తొలిసారి ఓ లేడీ ఓరియంటెడ్ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ‘సామజవరగమన, ఊరు పేరు భైరవకోన’ వంటి హిట్ చిత్రాలు తీసిన నిర్మాత రాజేష్ దండా ఈ సినిమా నిర్మిస్తున్నారు. మాగంటి పిక్చర్స్, హాస్య మూవీస్ బ్యానర్స్‌పై రూపొందుతున్న ఈ సినిమాకి యోగేష్ కేఎంసీ దర్శకుడు. ఈ సినిమా బుధవారం హైదరాబాద్‌లో ప్రారంభం అయింది. ‘‘సరికొత్త యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ మూవీ రూపొందుతోంది. ఇది బలమైన మహిళా ప్రధాన పాత్రతో ఆకట్టుకునే కథ. స్క్రిప్ట్‌లో చాలా సామాజిక, రాజకీయ అంశాలు కూడా ఉన్నాయి. ఒక స్త్రీ తనదైన రీతిలో మొత్తం నెగిటివిటీని తగ్గించే మార్గం ఉంది. ఆమె ఎలా చేస్తుంది అనేది ఈ చిత్రకథ’’ అని సంయుక్తా మీనన్ తెలిపారు. కుమారి ఖండం నేపథ్యంలో..హీరోయిన్గా గ్లామర్ పాత్రలు చేస్తూనే మరోవైపు క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటిస్తున్నారు శ్రద్ధా దాస్. ఆమె లీడ్ రోల్లో నటించిన తాజా చిత్రం ‘త్రికాల’. ‘స్క్రిప్ట్ ఆఫ్ గాడ్’ అనేది ట్యాగ్‌లైన్. మణి తెల్లగూటి దర్శకత్వం వహించారు. రిత్విక్ సిద్ధార్థ్ సమర్పణలో మినర్వా పిక్చర్స్ బ్యానర్‌పై రాధికా శ్రీనివాస్ నిర్మించిన ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘‘భారీ బడ్జెట్‌తో ఫ్యాంటసీ, హారర్ మూవీగా ‘త్రికాల’ రూపొందింది. కుమారి ఖండం నేపథ్యాన్ని ఆధారంగా చేసుకుని నేటి కాలానికి తగ్గట్టుగా మార్పులు చేర్పులు చేశాం. పురాణ నేపథ్యంతో సాగే ఈ మూవీలో విజువల్ గ్రాఫిక్స్‌కు ఎంతో ప్రాధాన్యం ఉంటుంది’’ అని పేర్కొన్నారు మేకర్స్. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోన్న ఈ సినిమా త్వరలో విడుదల కానుంది. హత్యలు చేసిందెవరు? ప్రియమణి లీడ్ రోల్లో నటించిన తాజా చిత్రం ‘క్యూజి: కొటేషన్ గ్యాంగ్’. ఎన్టీఆర్ శ్రీను సమర్పణలో వివేక్ కుమార్ కన్నన్ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ సినిమా ఈ నెల 30న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో రిలీజ్ కానుంది. జాకీ ష్రాఫ్, సన్నీ లియోన్ , సారా అర్జున్ ఇతర పాత్రల్లో నటించారు. ఈ చిత్రం తెలుగు వరల్డ్ వైడ్ రిలీజ్ హక్కులను రుషికేశ్వర్ ఫిలింస్ అధినేత ఎం.వేణుగోపాల్ సొంతం చేసుకున్నారు. ‘‘మంచి మాస్ మసాలా కమర్షియల్ ఎంటర్టైనర్గా ‘క్యూజి: కొటేషన్’ గ్యాంగ్’ రూపొందింది. ముంబై, కశ్మీర్, చెన్నై ప్రాంతాల మధ్య కిరాయి హత్యలు చేసే గ్యాంగ్‌లకు సంబంధించిన కథ ఇది. ఒక హత్య కేసు ఈ మూడు ప్రాంతాలకు కనెక్ట్ అవుతుంది. అది ఏంటి అనేది సస్పెన్స్. నాలుగు స్టోరీలు, మూడు ప్రాంతాల్లో సాగుతాయి. స్క్రీన్‌ప్లే అద్భుతంగా ఉంటుంది’’ అని చిత్రబృందం పేర్కొంది. ఇదిలా ఉంటే... హీరోయిన్లు నయనతార, కీర్తీ సురేష్. శ్రుతీహాసన్, హన్సిక, వరలక్ష్మీ శరత్‌కుమార్ వంటి వారు తమిళ భాషల్లో ప్రస్తుతం లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. -
Anupama Parameswaran : చీరకట్టుతో కనికట్టు చేస్తున్న అందమైన భామ అనుపమ
-
తిరుమలలో మహేశ్ ఫ్యామిలీ.. కిరాక్ ఫోజులు ఇచ్చిన శ్రీలీల
తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న మహేశ్ ఫ్యామిలీ బిగ్ బాస్ హరితేజ మేకోవర్ వీడియో వైరల్అర్జున్కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన కోలీవుడ్ మీడియా చీరలో మ్యాజిక్ చేస్తున్న అనన్య పాండే View this post on Instagram A post shared by Sreeleela (@sreeleela14) View this post on Instagram A post shared by Namrata Shirodkar (@namratashirodkar) View this post on Instagram A post shared by Ananya 🌙 (@ananyapanday) View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) View this post on Instagram A post shared by Divyabharathi (@divyabharathioffl) View this post on Instagram A post shared by People Media Factory (@peoplemediafactory) View this post on Instagram A post shared by Hamsa Nandini (@ihamsanandini) View this post on Instagram A post shared by Raghava Lawrence Fans (@raghavalawrenceoffl) View this post on Instagram A post shared by Geetha Arts (@geethaarts) View this post on Instagram A post shared by Vaishnavi Chaitanya🧿🦋 (@vaishnavii_chaitanya) View this post on Instagram A post shared by Bhagyashri Borse (@bhagyashriiborse) View this post on Instagram A post shared by Anupama Parameswaran (@anupamaparameswaran96) View this post on Instagram A post shared by Rakul Singh (@rakulpreet) View this post on Instagram A post shared by ISWARYA MENON (@iswarya.menon) View this post on Instagram A post shared by Rithu_chowdary (@rithu_chowdhary) View this post on Instagram A post shared by Sreemukhi (@sreemukhi) View this post on Instagram A post shared by Priyanka (@priyankachopra) View this post on Instagram A post shared by Hari Teja (@actress_hariteja) View this post on Instagram A post shared by Arjun Sarjaa (@arjunsarja_) View this post on Instagram A post shared by Avika Gor (@avikagor) View this post on Instagram A post shared by Nazriyafahadh (@nazriyaoffl) View this post on Instagram A post shared by Kushboo Sundar (@khushsundar) -
గ్లామర్ స్టిల్స్‌తో అలజడి రేపుతున్న అనుపమ పరమేశ్వరన్ (ఫోటోలు)
-
Anupama Parameswaran: కవులకందని అందమా..అనుపమా! అదిరిపోయే ఫోటోలు
-
సరికొత్త టైటిల్‌తో సినిమా ప్రకటించిన అనుపమ పరమేశ్వరన్
టాలీవుడ్లో ఇప్పుడ అనుపమ పరమేశ్వరన్ ట్రెండ్ కనిపిస్తుంది. వరుస సినిమాలతో తన జోరు కొనసాగిస్తుంది. ఇప్పటికే 'టిల్లు స్క్వేర్'తో బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టిన ఈ బ్యూటీ ఇప్పుడు మరొక సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉంది. ఈ సినిమాకు 'పరదా' అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. 'సినిమా బండి' దర్శకుడు ప్రవీణ్ కండ్రేగులతో చేస్తున్న సినిమా నుంచి తాజాగా4 టైటిల్ టీజర్ విడుదలైంది.ఆనంద మీడియా బ్యానర్‌పై విజయ్ డొంకాడ నిర్మాణంలో రూపొందుతున్న ఈ సినిమా సరికొత్తగా అనిపిస్తుందని అనుపమ చెబుతుంది. ఇప్పటి వరకు ఎక్కడా చూడని కథతో వస్తున్నామని ఆమె చెప్పింది. మలయాళ నటి దర్శన రాజేంద్రన్‌తో పాటు సంగీత, రాగ్ మయూర్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. వాస్తవంగా ఈ ప్రాజెక్ట్‌లో సమంత నటించాల్సింది. కానీ ఆమె ఆరోగ్యం సహకరించకపోవడంతో అనుపమకు ఈ ఛాన్స్ దక్కింది. -
అఫీషియల్: ఓటీటీకి టిల్లు స్క్వేర్.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్
సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన 'టిల్లు స్క్వేర్'. ఈ చిత్రాన్ని మల్లిక్ రామ్ దర్శకత్వంలో తెరకెక్కించారు. డీజే టిల్లుకు సీక్వెల్‌గా ఈ సినిమాను రూపొందించారు. గతంలో రిలీజైన డీజే టిల్లు సూపర్ హిట్ కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మార్చి 29 ప్రేక్షకుల ముందుకొచ్చిన టిల్లు స్క్వేర్ బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్ సొంతం చేసుకుంది. దాదాపు రూ.100 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించింది. టిల్లు స్క్వేర్ సూపర్ హిట్ కావడంతో ఎప్పుడెప్పుడు ఓటీటీకి వస్తుందా అని ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ మూవీ ఓటీటీకి స్ట్రీమింగ్ డేట్ వచ్చేసింది. ఈ నెల 26 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు నెట్‌ఫ్లిక్స్ వెల్లడించింది. తెలుగుతోపాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో అందుబాటులోకి రానున్నట్లు తెలిపింది. ఈ విషయాన్ని ట్విటర్ ద్వారా పంచుకుంది. 'చరిత్ర పునరావృతం అవ్వడం సాధారణం. అదే టిల్లు వస్తే హిస్టరీ, మిస్టరీ, కెమిస్ట్రీ అన్నీ రిపీట్ అవ్వుతాయి. అట్లుంటది టిల్లుతోని. టిల్లు స్క్వేర్ తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీలో నెట్‌ఫ్లిక్స్‌లో ఏప్రిల్ 26న వస్తుంది.' అంటూ పోస్ట్ చేసింది. ఇది చూసిన ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాగా.. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. History repeat avvadam normal. Adhe Tillu vasthe History, mystery, chemistry anni repeat avvuthai. Atluntadhi Tilluthoni. ✨🥰 Tillu Square arrives on 26 April, on Netflix in Telugu, Tamil, Malayalam, Kannada & Hindi. pic.twitter.com/SwEzFgJujb — Netflix India South (@Netflix_INSouth) April 19, 2024 -
ముద్దు సీన్లో నటిస్తే తప్పేంటి?: అనుపమ
తమిళసినిమా: పక్కింటి అమ్మాయిగా ఇమేజ్ తెచ్చుకున్న అతి తక్కువ మంది నటీమణుల్లో అనుపమ పరమేశ్వరన్ ఒకరు. అలాంటిది ఇప్పుడీ మలయాళీ భామ కూడా గ్లామర్‌కు గేట్లు ఎత్తేశారు. ప్రేమమ్ చిత్రంతో ముగ్గురు హీరోయిన్లలో ఒకరిగా పరిచయం అయిన ఈమె తమిళంలోనూ కొడి, తల్లిపోగాదే, సైరన్ వింటి చిత్రాల్లో నటించారు. ఇక తెలుగులో కథానాయకిగా పలు హిట్ చిత్రాల్లో నటించి పేరు తెచ్చుకున్నారు. కాగా ఇటీవల టిల్లు స్క్వేర్ అనే తెలుగు చిత్రంలో లిప్‌లాక్, అందాలారబోత అంటూ విజృంభించారు. దీంతో నటి అనుపమ పరమేశ్వరన్‌నే ఇలా నటించింది? అని చాలా మంది ఆశ్చరపడుతున్నారు. కొందరైతే అంతా బాగా ఉందిగా సడన్‌గా ఈ అమ్మడికి ఏమొచ్చిందీ? అంటూ విమర్శల వర్షం కురిపిస్తున్నారు. మొత్తం మీద అ కేరళ కుట్టి ఇప్పుడు వార్తలో నానుతున్నారు. గుడ్డిలో మెల్ల అన్న సామెత మాదిరి ఈమె నటించిన టిల్లు స్క్వేర్ చిత్రం హిట్ అయ్యింది. అందాలారబోత అనే విషయాన్ని పక్కన పెడితే అనుపమ పరమేశ్వరన్‌కు ఈ చిత్రం మంచి పేరు తెచ్చి పెట్టింది. గ్లామర్‌గా నటించడంపై వస్తున్న విమర్శనలపై అనుపమ ఘాటుగానే స్పందించారు. ఈమె ఒక భేటీలో పేర్కొంటూ తాను లిప్‌లాక్ సన్నివేశంలో నటించడాన్ని ఏదో పెద్ద తప్పు చేసినట్లు విమర్శిస్తున్నారనీ, తాను ముద్దు సన్నివేశాల్లో నటించననీ, గ్లామరస్‌గా నటించనని చెప్పింది తన 18 ఏళ్ల వయసులోనని అన్నారు. అయితే నటిగా తానిప్పుడు చాలా పరిణితి చెందానన్నారు. కథకు అవసరం అయితే లిప్‌లాక్ వంటి సన్నివేశాల్లో నటించడం తప్పేకాదని అన్నారు. అంతే కాకుండా ఒకేరకమైన మూస పాత్రల్లో నటించి బోర్ కొడుతోందని పేర్కొన్నారు. మరో విషయం ఏమిటంటే టిల్లు స్క్వేర్ చిత్రం చూసిన తరువాత ప్రశంసించడమో, విమర్శించడమో చేయవచ్చు గానీ, చిత్రం చూడకుండానే విమర్శించడం కరెక్ట్ కాదని నటి అనుపమ పరమేశ్వరన్ ఫైర్ అయ్యారు. -
Tillu Square Box Office Collection: బాక్సాఫీస్‌ని షేక్ చేస్తున్న ‘టిల్లుగాడు’
లేట్‌గా వచ్చినా లేటెస్ట్గా వచ్చినంటోన్నాడు సిద్దు జొన్నలగడ్డ. ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం ‘టిల్లు స్వ్కేర్’. మార్చి 29న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం తొలి రోజే హిట్ టాక్ సంపాదించుకుంది. టిల్లుగాడి మ్యానరిజం, పంచ్ డైలాగ్స్‌కి సినీ ప్రేక్షకులు మరోసారి ఫిదా అయ్యారు. ఫలితంగా తొలిరోజు భారీ కలెక్షన్స్ వసూలు చేసింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రానికి ఫస్ట్‌డే రూ.23.7 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చినట్లు నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ అధికారికంగా ప్రకటించింది. (చదవండి: ‘టిల్లు స్వ్కేర్’ మూవీ రివ్యూ) అలాగే అమెరికాలో ఈ చిత్రం తొలిరోజు 1 మిలియన్ డాలర్స్‌కి పైగా వసూళ్లను రాబట్టింది. హిట్ టాక్ రావడంతో వీకెండ్లో కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశం ఉందని సినీ పండితులు అంచనా వేస్తున్నారు. ఈ సినిమా కచ్చితంగా రూ. 100 కోట్లకు పైగా వసూలు చేస్తుందని నిర్మాత నాగవంశీ ధీమా వ్యక్తం చేస్తున్నారు. 2022లో వచ్చిన డీజే టిల్లు చిత్రానికి కొనసాగింపుగా వచ్చిన చిత్రమే ‘టిల్లు స్వ్కేర్’. మల్లిక్ రామ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్గా నటించింది. Tillu Registers a 𝐃𝐎𝐔𝐁𝐋𝐄 𝐁𝐋𝐎𝐂𝐊𝐁𝐔𝐒𝐓𝐄𝐑 Start at the Box-Office with 𝟐𝟑.𝟕 𝐆𝐑𝐎𝐒𝐒 on 𝐃𝐀𝐘 𝟏 🔥 Our Starboy 🌟 is shattering the records all over! 💥💥 Book your tickets here - https://t.co/vEd8ktSAEW #Siddu @anupamahere @MallikRam99 @ram_miriyala… pic.twitter.com/Dz7hqglg5Z — Sithara Entertainments (@SitharaEnts) March 30, 2024 -
టిల్లు స్క్వేర్ పబ్లిక్ టాక్.. ఎలా ఉందంటే!
సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన చిత్రం 'టిల్లు స్క్వేర్'. అభిమానుల భారీ అంచనాల మధ్య ఈ రోజే ప్రేక్షకుల ముందుకొచ్చింది. డీజే టిల్లు సూపర్ హిట్ కావడంతో ఈ సినిమాకు సీక్వెల్‌గా తెరకెక్కించారు. ఈ చిత్రానికి మల్లిక్ రామ్ దర్శకత్వం వహించారు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇవాళ ఉదయాన్నే ఓవర్సీస్తో పాటు మొదటి షో థియేటర్లలో అలరిస్తోంది. ఈ సినిమా చూసిన అభిమానులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాన్ని పంచుకుంటున్నారు. మరి ఈ సినిమా డీజే టిల్లు మరిపించిందా? అన్న విషయంపై ట్విటర్లో పోస్టులు పెడుతున్నారు. కొందరేమో ఫుల్ ఫన్ రోలర్‌కోస్టర్‌గా అలరించిందని కామెంట్స్ చేస్తున్నారు. సిద్ధు ఎనర్జీ, అనుపమ ఫర్మామెన్స్ కట్టిపడేశాయని అంటున్నారు. సిద్ధు గట్టి కమ్‌బ్యాక్ ఇచ్చాడని ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. సిద్ధూ తన ట్రేడ్‌మార్క్ చూపించాడని పోస్ట్ చేస్తున్నారు. ఫన్ ఇంటర్వెల్ ట్విస్ట్ అద్భుతంగా ఉందని అంటున్నారు. ఫస్ హాఫ్ డీసెంట్‌గా ఉందని.. సెకండాఫ్‌లో ట్విస్టులు అదిరిపోయాయంటూ కామెంట్స్ చేస్తున్నారు. #TilluSquare is one hell of a movie; it's literally a square of entertainment that we had in DJ Tillu. Moreover, those one-liners 👌, as usual, Star Boy Siddu shines, Anupama did well, and the music is a big plus 💯. Overall: 3.5/5.#TilluSquarereview — keishhh (@FCB_LM_91) March 29, 2024 Show stealer siddhu buoy show throughout…same DJ Tillu treatment…if you love DJ Tillu you will love #TilluSquare ..just go to the theatres and enjoy the senseless lol ride 🍻🍻 https://t.co/Rbxi2TyWAd — 🌶️🔥 (@PenuToofan) March 29, 2024 First half of #TilluSquare is entertaining! Lot of Déjà Vu of #DJTillu in the movie. Siddhu 👍 https://t.co/C4pgRwbN0Q — idlebrain jeevi (@idlebrainjeevi) March 29, 2024 #TilluSquare - a rollercoaster of fun! Siddhu's energy lights up the screen, Anupama is good, and the never ending one-liners kept me hooked. Despite the occasional disjointed scenes & questionable green screens, it still manages to captivate! Perfect for a one-time watch! 3/5 😍 pic.twitter.com/W3qnppCjYF — Swathiiii 🌸 (@Swathi_Prasad96) March 29, 2024 #TilluSquare Decent 1st Half! Siddhu is back again with his trademark energetic avatar and one liners that are carrying the film. Comedy works in parts so far but feels redundant at times . Fun interval twist sets up the 2nd half well. — Venky Reviews (@venkyreviews) March 29, 2024 -
టిల్లుకి, నాకు ఆ ఒక్కటే తేడా : స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ
‘డీజే టిల్లు’ సమయంలో ప్రేక్షకుల్లో అంచనాల్లేవు. హీరో పాత్ర ఎలా ఉంటుంది అనేది ముందు తెలీదు. అందుకే ఆ పాత్రను చూసి ప్రేక్షకులు సర్ ప్రైజ్ అయ్యారు. ఇప్పుడు అదే పాత్రతో ‘టిల్లు స్వ్కేర్’ చేయాల్సి రావడంతో కాస్త ఒత్తిడి ఉండటం సహజం. అయితే ఒత్తిడిని జయించి మెరుగైన అవుట్ పుట్ని అందించడానికి ప్రయత్నించాం’ అన్నారు స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ. ఆయన ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం ‘టిల్లు స్వ్కేర్’. 'డీజే టిల్లు'చిత్రానికి కొనసాగింపుగా వస్తున్న ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్గా నటించింది. మల్లిక్ రామ్ దర్శకత్వం వహించారు. మార్చి 29న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో గురువారం సిద్ధు జొన్నలగడ్డ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు.. ► ‘డీజే టిల్లు’ కథకి, టిల్లుగాడి పాత్రకి కొనసాగింపుగా ఈ చిత్రం ఉంటుంది. పాత్ర కొనసాగింపు పూర్తి స్థాయిలో ఉంటుంది. కథ కొనసాగింపు కూడా కొంత ఉంటుంది కానీ.. అది పాత కథను గుర్తుచేస్తూ కొత్త అనుభూతిని ఇస్తుంది. టిల్లు పాత్ర కూడా సీక్వెల్ లో ఇంకా ఎక్కువ ఎనర్జిటిక్ గా ఉంటుంది. ఎందుకంటే ఈసారి ఇంకా పెద్ద సమస్యలో ఇరుక్కుంటాడు. ఆ సమస్య ఏంటి అనేది ఇప్పుడే చెప్పను. థియేటర్ లో చూసి ఎంజాయ్ చేస్తారు. చాలా సర్ ప్రైజ్ లు, షాక్ లు ఉంటాయి. సినిమా అంతా నవ్వుకుంటూనే ఉంటారు. టిల్లు ఎక్కడా నవ్వడు.. కానీ అందరినీ ఫుల్ గా నవ్విస్తాడు. ► డీజే టిల్లులో హీరో, హీరోయిన్ రెండు పాత్రలకు ప్రాధాన్యత ఉంటుంది. ఇప్పుడు టిల్లు స్క్వేర్ కూడా అలాగే ఉంటుంది. హీరో పాత్ర లేకపోతే హీరోయిన్ పాత్ర పండదు, అలాగే హీరోయిన్ పాత్ర లేకపోతే హీరో పాత్ర పండదు. ► ఈ సినిమాలోని టిల్లు పాత్ర నా ఆలోచనలు, నేను చూసిన అనుభవాల నుంచి పుట్టింది. టిల్లుకి, నాకు ఒక్కటే తేడా. టిల్లు తన మనసులో ఉన్నవన్నీ బయటకు అంటాడు. నేను మనసులో అనుకుంటాను అంతే తేడా. ► ఈ సినిమా నిడివిని కావాలని తగ్గించలేదు. సినిమాకి ఎంత అవసరమో అంత ఉంచాము. కామెడీ సినిమా కాబట్టి ఎక్కువ నిడివి లేకపోతేనే ఎక్కడా బోర్ కొట్టించకుండా ప్రేక్షకులను పూర్తిస్థాయి వినోదాన్ని అందించగలం. ► సీక్వెల్ చేద్దాం అనుకున్న సమయంలో విమల్ వేరే ప్రాజెక్ట్ కమిట్ అయ్యి ఉండటంతో అందుబాటులో లేరు. మరోవైపు నేను, మల్లిక్ ఒక సినిమా చేద్దామని అప్పటికే అనుకుంటున్నాము. మా కలయికలో డీజే టిల్లు సీక్వెల్ చేస్తే బాగుంటుంది అనిపించి.. అలా మల్లిక్ న దర్శకుడిగా తీసుకోవడం జరిగింది. ► త్రివిక్రమ్ గారి సలహాలు, సూచనలు ఖచ్చితంగా సినిమాకి హెల్ప్ అవుతాయి. అయితే ఆయన ఎప్పుడూ కథలో మార్పులు చెప్పలేదు. ఈ భాగం ఇంకా మెరుగ్గా రాస్తే బాగుంటుంది వంటి సలహాలు ఇచ్చేవారు. ► ఈ సినిమా సీక్వెల్ అనుకున్నప్పుడు లక్కీగా ఒక మంచి కథ తట్టింది. అలాగే పార్ట్-3 కి కూడా జరుగుతుందేమో చూడాలి. రెండు మూడు ఐడియాస్ ఉన్నాయి.. చూడాలి ఏమవుతుందో. అయితే టిల్లు-3 కంటే ముందుగా మరో విభిన్న కథ రాసే ఆలోచనలో ఉన్నాను. ప్రస్తుతం ఐతే నా దృష్టి అంతా టిల్లు స్క్వేర్ పైనే ఉంది. ► ఇలాంటి సినిమాలకు సంభాషణలే కీలకం. అవి ఎంతలా ప్రేక్షకులకు చేరువైతే అంత వినోదం పండుతుంది. సంభాషణలు నా మనసు నుంచి, నా మెదడు నుంచి పుట్టాయి కాబట్టి.. ఏ ఉద్దేశంతో రాశాను, ఎలా పలకాలి అనే దానిపై నాకు పూర్తి అవగాహన ఉంటుంది. అందుకే డీజే టిల్లు పాత్ర ప్రేక్షకులకు అంత దగ్గరైంది. -
అవన్నీ భరిస్తేనే తెరపై హాట్‌గా కనిపిస్తాం: అనుపమ పరమేశ్వరన్
-
అందుకే అనుపమని బోల్డ్‌గా చూపించాం: 'టిల్లు స్క్వేర్' డైరెక్టర్
'టిల్లు స్క్వేర్'లో లిల్లీ పాత్రకు చాలా ప్రాధాన్యత ఉంటుంది.ఆమెది ఛాలెంజింగ్ రోల్. ఆ పాత్ర కోసం ఎందరో పేర్లను పరిశీలించాం. కానీ అనుపమనే పర్ఫెక్ట్ ఛాయిస్ అనిపించింది. ఆమెను బోల్డ్‌గా చూపించాలనే ఉద్దేశంతో లిల్లీ పాత్రను రాసుకోలేదు. లిల్లీ పాత్ర తీరే అలా ఉంటుంది. ఆ పాత్రకి అనుపమ న్యాయం చేయగలదని నమ్మాం. ఆమె ఆ పాత్రకి నూటికి నూరు శాతం న్యాయం చేసింది’ అన్నారు దర్శకుడు మల్లిక్ రామ్. ఆయన దర్శకత్వం వహించిన తాజా చిత్రం ‘టిల్లు స్కేవర్’. స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటించిన డీజే టిల్లు సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కిన ఈ చిత్రం మార్చి 29న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో దర్శకుడు రామ్ మల్లిక్ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు.. ► సిద్ధుతో నాకు ఎప్పటి నుంచో పరిచయం ఉంది. దాదాపు ఇద్దరం ఒకేసారి సినీ ప్రయాణం మొదలుపెట్టాం. నేను దర్శకత్వం వహించిన అద్భుతం మూవీ, డీజే టిల్లు ఇంచుమించు ఒకే సమయంలో వచ్చాయి. ఆ తర్వాత నేను, సిద్ధు కలిసి ఒక సినిమా చేయాలి అనుకున్నాం. అదే సమయంలో నాగవంశీ గారు 'టిల్లు స్క్వేర్' చేస్తే బాగుంటుందని చెప్పడం, డీజే టిల్లు దర్శకుడు విమల్ కృష్ణ ఇతర కమిట్ మెంట్స్ తో బిజీగా ఉండటంతో నేను ఈ ప్రాజెక్ట్ లోకి వచ్చాను. మొదట కాస్త సంకోచించాను కానీ కథ బాగా వచ్చేసరికి ఇక వెనకడుగు వేయలేదు. ► సినిమాలో సిద్దు ప్రమేయం ఉటుందని..ప్రతి సీన్లోనూ తలదూర్చుతాడని బయట ఏవో కొన్ని వార్తలు వస్తుంటాయి కానీ వాటిలో వాస్తవం లేదు. సిద్ధు ఒక రచయితగా, నటుడిగా ఎంతవరకు ఇన్వాల్వ్ అవ్వాలో.. అంతవరకే ఇన్వాల్వ్ అవుతాడు. దర్శకుడికి ఇవ్వాల్సిన స్వేచ్ఛను దర్శకుడికి ఇస్తాడు. ఎలా చేస్తే బాగుంటుంది అనేది ఇద్దరం చర్చించుకొని చేశాం. కథా చర్చల సమయంలో ఒక రచయితగా వ్యవహరిస్తాడు. చిత్రీకరణ సమయంలో ఒక నటుడిగా ఏం చేయాలో అది చేస్తాడు. ► డీజే టిల్లు, టిల్లు స్క్వేర్ కి వ్యత్యాసం ఉంటుంది. డీజే టిల్లు డెడ్ బాడీ నేపథ్యంలో సాగే బ్లాక్ కామెడీ. కానీ టిల్లు స్క్వేర్ అలా ఉండదు. ఒక కమర్షియల్ సినిమాలా ఉంటుంది. టిల్లు పాత్ర తీరు అలాగే ఉంటుంది. రాధిక పాత్ర ప్రస్తావన ఉంటుంది. మొదటి భాగాన్ని ముడిపెడుతూ కొన్ని సన్నివేశాలు ఉంటాయి. డీజే టిల్లుని గుర్తు చేస్తూనే టిల్లు స్క్వేర్ మీకొక కొత్త అనుభూతిని ఇస్తుంది. ► ఇంటర్వెల్ తర్వాత ద్వితీయార్థం ప్రారంభ సన్నివేశాలు చాలా సినిమాల్లో తేలిపోతుంటాయి. ఫస్టాఫ్ బాగుంటుంది, క్లైమాక్ బాగుంటుంది. కానీ ఆ 15-20 నిమిషాలు ఆశించిన స్థాయిలో ఉండదు. టిల్లు స్క్వేర్ విషయంలో అలా జరగకూడదన్న ఉద్దేశంతో.. ఆ కొన్ని సన్నివేశాలు మరింత మెరుగ్గా రాసుకొని రీ షూట్ చేయడం జరిగింది. ► ముందు ఈ సినిమాకు పాటలు రామ్ మిరియాల, శ్రీచరణ్ పాకాల, నేపథ్య సంగీతం తమన్ అనుకున్నాం. రామ్ మిరియాల రెండు పాటలు ఇచ్చారు. శ్రీచరణ్ పాకాల ఒక పాట ఇచ్చారు. ఆ పాట బాగా వచ్చింది. కానీ అక్కడ సిట్యుయేషన్ మారడంతో మరో సంగీత దర్శకుడు అచ్చుత్తో పాట చేయించడం జరిగింది. తమన్ గారు ఇతర సినిమాలతో బిజీగా ఉండి అందుబాటులో లేకపోవడంతో..భీమ్స్ గారిని తీసుకున్నాం. ► ఈ చిత్రంలో ఎలాంటి సందేశం ఉండదు. కొందరి స్వభావం ఎలా ఉంటుందో చూపించాము కానీ ఇలా ఉండకండి మారండి అనే సందేశాలు మాత్రం ఇవ్వలేదు. -
‘డీజే టిల్లు-2’ మూవీ ప్రెస్‌మీట్ (ఫొటోలు)
-
అది ఇస్తే చాలు, నేను మీ సొంతం: అనుపమ
-
స్టార్ హీరో యాక్షన్ థ్రిల్లర్.. టాలీవుడ్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్!
'తని ఒరువన్' 'కొమాలి' 'పొన్నియిన్ సెల్వన్' లాంటి చిత్రాలతో తెలుగులోనూ క్రేజ్ దక్కించుకున్న హీరో జయం రవి. ఆయన తాజాగా 'సైరన్' అనే మాస్ యాక్షన్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ చిత్రంలో దసరా భామ కీర్తి సురేశ్, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్లుగా నటించారు. అంథోని భాగ్యరాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు కూడా అందుబాటులోకి రానుంది. టాలీవుడ్లో ఈ సినిమా 'గంగ ఎంటర్టైన్మెంట్స్' పతాకంపై మహేశ్వర్ రెడ్డి మూలి రిలీజ్ చేయనున్నారు. ఈ చిత్రం ఈనెల 23న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే తెలుగు టీజర్ విడుదల కాగా మంచి స్పందన లభించింది. తాజాగా చిత్రబృందం ప్రెస్ మీట్ నిర్వహించింది. దర్శకుడు ఆంథోని భాగ్యరాజ్ మాట్లాడుతూ.. " ఈ చిత్రం నాకొక కలలా జరిగిపోయింది. ఒక కొత్త దర్శకుడి మొదటి చిత్రం. అదీ పెద్ద హీరోతో చేసినప్పుడు కచ్చితంగా హిట్ కొట్టాలనుకుంటారు. ఆ బాధ్యత జయం రవి తీసుకున్నారు. జీవీ గారి మెలోడీస్ అంటే నాకు చాలా ఇష్టం. చిత్రం అద్భుతంగా వచ్చింది. తెలుగు ప్రేక్షకులకి నచ్చుతుందని ఆశిస్తున్నాం" అని అన్నారు. జయం రవి మాట్లాడుతూ.."ఈ చిత్రంలో ఎమోషన్స్ చాలా ముఖ్య పాత్రలు వహిస్తాయి. వాటికి జీవీ తన సంగీతంతో ప్రాణం పోశారు. అలాగే ఈ చిత్రంలో ముఖ్యమైన లేడి పోలీస్ ఆఫీసర్ పాత్రలో కీర్తి సురేశ్ మా నమ్మకాన్ని నిలబెట్టింది. ఆంథోనీ భాగ్యరాజ్ లాంటి కొత్త దర్శకులతోనే చేస్తున్నందుకు నన్ను చాలా మంది హెచ్చరిస్తుంటారు. కానీ ప్రతిభ గల దర్శకుడి కష్టంలోనే విజయం కనిపిస్తుంది. ఈ చిత్రంలో నేను రెండు విభిన్నమైన పాత్రలు పోషించాను. మా సైరన్ తెలుగు ప్రేక్షకులని ఆకట్టుకుంటుందనే నమ్మకం ఉంది" అని అన్నారు. కాగా.. ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతమందించారు. ఈ సినిమాలో సముద్రఖని, యోగి బాబు, అజయ్, అలగం పెరుమాళ్, పాండ్యన్ కీలక పాత్రలు పోషించారు. -
వీధి పోకిరి చెంప చెళ్లు మనిపించా: కీర్తి సురేశ్
తక్కువ కాలంలోనే హీరోయిన్గా అనూహ్య స్థాయికి చేరుకుంది కీర్తీ సురేశ్. మహానటి చిత్రంతో జాతీయ ఉత్తమ నటి అవార్డును గెలుచుకున్న ఈ బ్యూటీ ఇప్పుడు మలయాళం, తమిళం, తెలుగు భాషలను దాటి ఉత్తరాది ప్రేక్షకులను అలరించడానికి బాలీవుడ్ వరకు చేరుకుంది. ఇలా చేతి నిండా చిత్రాలతో బిజీగా ఉన్న కీర్తీ సురేశ్‌కు ధైర్యం కాస్త ఎక్కువేనట. సినీ రంగప్రవేశం చేయకముందే నిజ జీవితంలో తన మాస్ హీరోయిజాన్ని చూపించారట. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తన పాత రోజులను గుర్తు చేసుకుంటూ ఒక పోకిరికి బుద్ధి చెప్పిన సంఘటన గురించి చెప్పారు. నటిగా పరిచయం కాని సమయంలో ఒక రోజు అర్ధరాత్రి తాను స్నేహితురాళ్లతో కలిసి వెళుతున్నానని, అప్పుడొక మందుబాబు వెనుకగా వచ్చి తనను రాసుకుంటూ వెళ్లాడని చెప్పారు. తనకు కోపం తన్నుకు రావడంతో అతన్ని పట్టుకుని చెంపలు పగలకొట్టినట్లు చెప్పారు. ఆ తరువాత ఆ మందుబాబు తనపై దాడి చేసి తలపై కొట్టాడని, దీంతో అతన్ని చితకబాది పోలీసులకు అప్పగించినట్లు కీర్తి సురేశ్‌గుర్తు చేసుకున్నారు. పోలీసులు అతన్ని ఆ రాత్రి అంతా జైలులోనే ఉంచి ఉదయం విడిచి పెట్టారని చెప్పారు. అయితే ఇది నమ్మశక్యంగా లేదంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఏదేమైనా కీర్తీ సురేశ్ తాజాగా జయంరవి చొక్కా కాలర్ పట్టుకుని ఈడ్చుకెళుతున్న ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఇది సైరన్ చిత్రంలో దృశ్యం అని గమనించవచ్చు. జయంరవి కథానాయకుడిగా నటించిన ఇందులో కీర్తీసురేశ్ పోలీస్ అధికారిగా నటించారు. ఈ చిత్రం కోసం ఈ బ్యూటీ 10 కిలోల బరువు పెరిగారట. సైరన్ చిత్రం ఈనెల 16న థియేటర్లలోకి రానుంది. -
కీర్తి సురేశ్ పవర్ఫుల్ పాత్రలో వస్తోన్న సైరన్.. రిలీజ్ ఎప్పుడంటే?
కోలీవుడ్ హీరో జయంరవి, కీర్తి సురేశ్, అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కించిన తాజా చిత్రం సైరెన్. హోమ్ మూవీ మేకర్స్ పతాకంపై సుజాత విజయకుమార్ నిర్మించిన ఈ చిత్రం ద్వారా ఆంథోని భాగ్యరాజ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. జీవీ ప్రకాష్‌కుమార్ సంగీతాన్ని అందించిన సైరన్ చిత్రం ఈనెల 16న తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ చైన్నెలోని పీవీపీ స్టూడియోలో ప్రెస్ మీట్ నిర్వహించారు. హీరో జయంరవి మాట్లాడుతూ.. తాము సమష్టిగా శ్రమించిన సైరన్ చిత్రం విడుదలకు సిద్ధమవుతోందని చెప్పారు. దర్శకుడు ఆంథోని భాగ్యరాజ్ చిత్రాన్ని చాలా బాగా తెరకెక్కించారని.. ఆయనకు మంచి భవిష్యత్తు ఉందని అన్నారు. కీర్తీసురేశ్ చాలా బలమైన పాత్రను అద్భుతంగా చేశారని అభినందించారు. తాను ఇందులో రెండు డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించానని.. ఈ చిత్రం పిల్లలు నుంచి పెద్దల వరకు అందరినీ అలరిస్తుందనే నమ్మకాన్ని జయంరవి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నిర్మాత సుజాత విజయకుమార్ మాట్లాడుతూ.. అంబులెన్స్ సైరన్‌కు, పోలీస్ సైరన్‌కు మధ్య జరిగే పోరాటమే ఈ చిత్రమని అన్నారు. జయంరవి కథానాయకుడిగా సైరన్ చిత్రాన్ని నిర్మించడం సంతోషంగా ఉందన్నారు. ఆయన తన అల్లుడు అని చెప్పడం కాదు కానీ.. చాలా అద్భుతంగా నటించారని అన్నారు. కీర్తీసురేశ్ ఈ చిత్రంలో పోలీసు అధికారిగా పవర్ఫుల్ పాత్రను జయంరవికి ధీటుగా నటించారని ప్రశంసించారు. అనుపమ పరమేశ్వరన్ కూడా చాలా చక్కగా చేశారని చెప్పారు. దర్శకుడు తనకు చెప్పిన కథ వేరు.. జయంరవికి చెప్పి చేసిన సైరన్ చిత్ర కథ వేరని ఆమె అన్నారు. కాగా.. ఈ చిత్రంలో సముద్రఖని, అళగర్ పెరుమాళ్ ముఖ్యపాత్రలు పోషించారు. -
Eagle Review: ‘ఈగల్’ రివ్యూ
టైటిల్: ఈగల్నటీనటులు: రవితేజ, అనుపమ పరమేశ్వరన్, కావ్య థాపర్, నవదీప్, విజయ్ రాయ్, మధుబాల, అవసరాల శ్రీనివాస్, అజయ్ ఘోష్ తదితరులునిర్మాణ సంస్థ: పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాత: టీజీ విశ్వ ప్రసాద్దర్శకత్వం: కార్తీక్ ఘట్టమనేనిసంగీతం: డేవ్ జాంద్విడుదల తేది: ఫిబ్రవరి 9, 2024ఢిల్లీలో జర్నలిస్టుగా పని చేస్తున్న నళిని(అనుపమ పరమేశ్వరన్)కి ఓ రోజు మార్కెట్లో స్పెషల్ కాటన్ క్లాత్ కనిపిస్తుంది. అది ఎక్కడ తయారు చేశారని ఆరా తీయగా.. ఆసక్తికరమైన విషయాలు తెలుస్తాయి. ఆ క్లాత్కి వాడిన పత్తిని ఆంధ్రప్రదేశ్‌లోని తలకోన ప్రాంతంలోని పండించారని, దానికి ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చిన సహదేవ్ వర్మ(రవితేజ)అనే వ్యక్తి అనుమానాస్పద స్థితిలో కనిపించకుండా పోయాడని తెలుసుకుంటుంది. అలాంటి గొప్ప వ్యక్తి ఆచూకీ తెలిస్తే సమాజానికి ఉపయోగపడుతుందనే ఉద్దేశ్యంతో ఆ విషయాన్ని పేపర్లో ప్రచురిస్తుంది. చివరి పేజీలో చిన్న ఆర్టికల్‌గా వచ్చిన ఆ న్యూస్‌ని చూసి.. సీబీఐ రంగంలోకి దిగుతుంది. ఆ పత్రికా సంస్థపై దాడి చేసి.. ఆ సమాచారం ఎలా లీకైందని విచారణ చేపడుతుంది.ఒక్క చిన్న వార్తకు అంతలా రియాక్ట్ అయ్యారంటే.. దీని వెనుకాల ఏదో సీక్రెట్ ఉందని, అది ఏంటో తెలుసుకోవాలని నళిని తలకోన గ్రామానికి వెళ్తుంది. అక్కడ సహదేవ్ వర్మ గురించి ఆసక్తికరమైన విషయాలు తెలుస్తాయి. అసలు సహదేవ్ వర్మ ఎవరు? అతన్ని మట్టుబెట్టడానికి కేంద్ర ప్రభుత్వ బలగాలు.. పాకిస్తాన్‌కి చెందిన టెర్రరిస్టులతో పాటు నక్సల్స్ ఎందుకు ప్రయత్నిస్తున్నారు. యూరప్‌లో కాంట్రాక్ట్ కిల్లర్ అయిన ఈగల్(రవితేజ)కి ఇతనికి ఉన్న సంబంధం ఏంటి? సహాదేవ్ ఎలా మిస్ అయ్యాడు? సహదేవ్, రచన(కావ్య థాపర్)ల ప్రేమ కథ ఏంటి? సహదేవ్ అనుచరుడైన జై(నవదీప్) ప్రస్తుతం ఎక్కడ ఉన్నాడు? తలకోన కొండను దక్కించుకునేందుకు ప్రముఖ వ్యాపారవేత్త(నితిన్ మెహతా), లోకల్ ఎమ్మెల్యే చిల్లర సోమేశ్వరరెడ్డి(అజయ్ ఘోష్) ఎందుకు ప్రయత్నించారు? వారిని ఈగల్ ఎలా అడ్డుకున్నాడు? అసలు సహదేవ్ బతికే ఉన్నాడా? ఈ కథలో మధుబాల, శ్రీనివాస్ అవసరాల,విజయ్ రాయ్ పోషించిన పాత్రలు ఏంటి? తదితర విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే.. ‘కేజీయఫ్’ తర్వాత యాక్షన్ సినిమాల ప్రజంటేషన్లో మార్పు వచ్చింది. కథ కంటే యాక్షన్, ఎలివేషన్స్‌కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు మేకర్స్. ప్రేక్షకులు కూడా అలాంటి చిత్రాలను ఆదరిస్తున్నారు. ‘ఈగల్’ కూడా ఆ తరహా చిత్రమే. కేజీయఫ్, విక్రమ్, జైలర్ తరహాలోనే ఇందులో కూడా భారీ యాక్షన్ సీన్స్‌తో పాటు హీరోకి కావాల్సినంత ఎలివేషన్ ఇచ్చారు. కానీ కథను ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా చేయడంలో దర్శకుడు విఫలం అయ్యాడు.యాక్షన్, ఎలివేషన్లనే నమ్ముకొని కథనాన్ని నడిపించాడు. సినిమా ప్రారంభం నుంచే హీరోకి భారీ ఎలివేషన్స్ ఇచ్చారు. ప్రతి సీన్ క్లైమాక్స్ అన్నట్లుగానే తీర్చిదిద్దారు. మణిబాబు రాసిన సంభాషణలు హీరోని ఓ రేంజ్లో కూర్చోబెట్టేలా ఉన్నాయి. అయితే కొన్ని చోట్ల వచ్చే డైలాగులకు.. అక్కడ జరిగే సన్నివేశానికి ఎలాంటి సంబంధం ఉండకపోవడమే కాకుండా అతిగా అనిపిస్తుంది. ఇక హీరోకి ఇచ్చే ఎలివేషన్స్ కొన్ని చోట్ల చిరాకు పుట్టిస్తుంది. యాక్షన్స్ సన్నివేశాలు మాత్రం ఆకట్టుకుంటాయి. ఈ సినిమా కథ ఢిల్లీలో ప్రారంభమై.. ఏపీలోని తలకోన ప్రాంతం చుట్టూ తిరుగుతుంది. జర్నలిస్టు నళిని వార్త ప్రచురించడం.. సీబీఐ రంగంలోకి దిగి పత్రికా సంస్థపై దాడి చేయడంతో కథపై ఆసక్తి కలుగుతుంది. హీరో ఎంట్రీకి ఇచ్చే ఎలివేషన్ సీన్ ఆకట్టుకుంటుంది. ఫస్టాఫ్ అంతా ఎలివేషన్లతోనే ముగుస్తుంది. హీరో క్యారెక్టర్ గురించి తెలియజేయకుండా ఎలివేషన్స్ ఇవ్వడంతో కొన్ని చోట్ల అంత బిల్డప్ అవసరమా అనిపిస్తుంది. ఇంటర్వెల్ సీన్ సెకండాఫ్‌పై ఆసక్తి పెంచుతుంది. ఇక సెకండాఫ్‌లో హీరో ఫ్లాష్‌బ్యాక్ తెలుస్తుంది. సహదేవ్, రచనల లవ్ స్టోరీ అంతగా ఆకట్టుకోదు. కానీ కథకు అది ముఖ్యమైనదే! ఫస్టాఫ్‌తో ఎలివేషన్ల కారణంగా యాక్షన్ సీన్స్ అంతగా ఆకట్టుకోలేవు కానీ.. ద్వితీయార్థంలో వచ్చే పోరాట ఘట్టాలు ఆకట్టుకుంటాయి. పబ్లీ నేపథ్యంలో వచ్చే ఫైట్ సీన్ అదిరిపోతుంది. అలాగేప్రీ క్లైమాక్స్ యాక్షన్ సీన్ కూడా బాగుంటుంది. సినిమాలో మంచి సందేశం ఉన్నా.. దాన్ని ఓ చిన్న సన్నివేశంతో ముగించారు. ఎవరెలా చేశారంటే.. రవితేజకు యాక్షన్ కొత్త కాదు..ఎలివేషన్లు అంతకంటే కొత్తకాదు. ఈ రెండు ఉన్న ‘ఈగల్’లో రెచ్చిపోయి నటించాడు. సహదేవ్, ఈగల్ ఇలా రెండు విభిన్నమైన పాత్రల్లో చక్కగా నటించాడు. ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్‌గా అనుపమ తనదైన నటనతో ఆకట్టుకుంది. సహదేవ్ అనుచరుడు జైగా నవదీప్ తన పాత్ర పరిధిమేర నటించాడు. వినయ్ రాయ్ పాత్ర చిన్నదైనా ఉన్నంతలో ఆకట్టుకున్నాడు. అవసరాల శ్రీనివాస్, మధుబాల, మిర్చి కిరణ్, అజయ్ ఘోష్, శ్రీనివాస్ రెడ్డి, అమృతం అప్పాజీతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. సాంకేతికంగా సినిమా పర్వాలేదు. దేవ్ జాండ్ నేపథ్య సంగీతం బాగుంది. పాటలు పర్వాలేదు. మణి బాబు రాసిన డైలాగ్స్ ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. అయితే కొన్ని చోట్ల సన్నివేశాలను డామినేట్ చేశాయి. సినిమాటోగ్రఫీ బాగుంది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణ విలువలు బాగున్నాయి. హై రిచ్ కంటెంట్ డెలీవరి చేయడంలో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ మరోసారి సత్తా చాటింది. -
స్టేజీపైనే డైరెక్టర్‌కు రాఖీ కట్టిన అనుపమ.. కారణం ఇదే
మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన చిత్రం 'ఈగల్'. సూర్య వర్సెస్ సూర్య సినిమాతో డైరెక్టర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న కార్తీక్ ఘట్టమనేని ఈ మూవీని తెరకెక్కించాడు. ఇందులో అనుపమ పరమేశ్వరన్, కావ్యా థాపర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. నవదీప్, అవసరాల శ్రీనివాస్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన ఈ సినిమా ఫిబ్రవరి 9న విడుదలవుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన ప్రీ రిలీజ్ వేడుకలో చిత్ర దర్శకుడు కార్తీక్ ఘట్టమనేనికి హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ రాఖీ కట్టింది. ఈ వేడుకలో స్టేజీపైకి వచ్చిన అనుపమ డైరెక్టర్‌ను అన్నయ్య అని పిలిచింది. వెంటనే రవితేజ.. 'నువ్వు అతన్ని అన్నయ్య అని పిలిచావా.. అందమైన అమ్మాయిలు అన్నయ్య అనే పదం వాడకూడదు.. నేను ఎందుకు చెప్పానో, ఎందుకు చెప్తున్నానో అర్ధం చేసుకో' అని చెప్తాడు. ఆ వెంటనే అనుమప కూడా సారీ రవిగారు.. 'దర్శకుడు కార్తీక్‌తో నేను నాలుగు సినిమాలు చేశాను. ఆయనతో మంచి అనుబంధం ఏర్పడింది. మొదటి నుంచి ఆయన్ను అన్నయ్య అనే నేను పిలుస్తున్నాను అలాగే అలవాటు అయిపోయింది. ఇప్పుడు మార్చుకోలేను.' అని చెప్పింది. ఇంకేముంది ఈ లోపు యాంకర్ సుమ ఓ రాఖీ తీసుకొచ్చి అన్నయ్యకు కట్టేయమని చెప్పింది. దీంతో స్టేజిపైనే డైరెక్టర్ కార్తీక్‌కి అనుమప రాఖీ కడుతుంది. ఈ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్లో వైరల్ అవుతుంది. గతంలో డైరెక్టర్ కార్తీక్ చాలా సినిమాలకు ఛాయాగ్రాహకుడిగా పనిచేశాడు. ప్రేమమ్,కృష్ణార్జున యుద్ధం,చిత్రలహరి,నిన్ను కోరి,కార్తీకేయ,ఎక్స్‌ప్రెస్ రాజా వంటి చిత్రాలకు ఆయన కెమెరామెన్‌గా వర్క్ చేశాడు. దీంతో అనుపమతో ఆయనకు మంచి అనుబంధం ఉంది. -
ఎంగేజ్మెంట్ హడావుడిలో సాయిపల్లవి.. మరింత క్యూట్‌గా అనుపమ
అనాథ పిల్లలతో 'గుంటూరు కారం' చూసిన సితార చెవిలో పువ్వు పెట్టుకుని అనుపమ క్యూట్‌నెస్ డిఫరెంట్ చీరలో అంతే డిఫరెంట్‌గా ఆలియా భట్ పసుపు పచ్చని చీరలో సోయగాలతో రుహానీ శర్మ నాభితో పాటు అందాల జాతర చేస్తున్న అనికా మలయాళ బ్యూటీ అదితీ రవి మెల్ట్ అయ్యే పోజులు చెల్లి ప్రీ ఎంగేజ్మెంట్ హడావుడిలో సాయిపల్లవి క్రేజీ వింటేజ్ లుక్‌లో అలా కనిపిస్తున్న యాంకర్ శ్రీముఖి View this post on Instagram A post shared by sitara 🪩 (@sitaraghattamaneni) View this post on Instagram A post shared by Ariyana Glory ❤️ (@ariyanaglory) View this post on Instagram A post shared by Anupama Parameswaran (@anupamaparameswaran96) View this post on Instagram A post shared by Alia Bhatt 💛 (@aliaabhatt) View this post on Instagram A post shared by Ruhani Sharma (@ruhanisharma94) View this post on Instagram A post shared by Roopashree nair(Anicka Vikramman) (@anickavikramman) View this post on Instagram A post shared by Aditiii🔥Ravi (@aditi.ravi) View this post on Instagram A post shared by Ananya nagalla (@ananya.nagalla) View this post on Instagram A post shared by Sreemukhi (@sreemukhi) View this post on Instagram A post shared by Shraddha Das (@shraddhadas43) View this post on Instagram A post shared by Samyuktha Hegde (@samyuktha_hegde) View this post on Instagram A post shared by Manushi Chhillar (@manushi_chhillar) View this post on Instagram A post shared by Sreeleela (@sreeleela14) View this post on Instagram A post shared by Priya Prakash Varrier✨ (@priya.p.varrier) -
సంక్రాంతి నుంచి తప్పుకుంటున్న రవితేజ.. కారణం ఇదేనా?
మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న తాజా చిత్రం ఈగల్.. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. ఇందులో అనుపమపరమేశ్వరన్‌తో పాటు కావ్య థాపర్ కీలక పాత్రలో నటిస్తోంది. సంక్రాంతి సందర్భంగా జనవరి 13న ప్రేక్షకుల ముందుకొస్తోందని ఈ చిత్ర యూనిట్ కొద్దిరోజుల క్రితం కౌంట్‌డౌన్ పోస్టర్‌ను కూడా విడుదల చేసింది. ఇప్పటికే ఈ చిత్రం సెన్సార్ కూడా పూర్తి చేసుకుంది. కానీ సంక్రాంతి రేసు నుంచి ఈగల్ తప్పుకుంటున్నట్లు ఇండస్ట్రీలో వార్తలు వస్తున్నాయి. ఈగల్ సినిమాకు సెన్సార్ బోర్డ్ కూడా యూ/ఏ సర్టిఫికెట్ ఇచ్చింది. ఒక్క కట్ కూడా లేకుండా ఈ చిత్రానికి సెన్సార్ ఇవ్వడం గమనార్హం. కానీ సంక్రాంతి రేసులో భారీగా చిత్రాలు ఉండటం వల్ల రెండు రాష్ట్రాల్లో థియేటర్స్ కొరత ఏర్పడింది. మహేష్ బాబు గుంటూరు కారం, హనుమాన్,వెంకటేష్ సైంధవ్, నా సామిరంగా వంటి చిత్రాలు ఉండటంతో రేసు నుంచి తప్పకుంటే బెటర్ అని ఈగల్ టీమ్ ఆలోచిస్తుందట. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈగల్... ఇన్నీ సినిమాల మద్య వస్తే థియేటర్స్ కొరత ఏర్పడి నష్టాలు రావచ్చని వారు అంచనా వేస్తున్నారట. సినీ విశ్లేషకులు కూడా ఇదే సరైన నిర్ణయం అని వ్యాఖ్యానిస్తున్నారు. నిర్మాత టీజీ విశ్వప్రసాద్- రవితేజ కాంబోలో గతేడాది 'ధమాకా' చిత్రంతో సూపర్ హిట్ కొట్టారు. ఇప్పుడు ఈగల్ కూడా భారీ హిట్ కొట్టడం ఖాయం అనుకుంటున్న తరుణంలో సంక్రాంతి నుంచి ఈ చిత్రం వాయిదా పడుతుందనే వార్తలు సోషల్మీడీయాలో ప్రచారం జరుగుతుండటంతో రవితేజ ఫ్యాన్స్ కొంతమేరకు నిరుత్సాహానికి గురి అయ్యారు. ఈగల్ సినిమా వాయిదా దాదాపు ఖాయం.. కానీ అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. -
'నా కొంప ఎలా ముంచబోతున్నావో చెప్పు రాధిక'..క్రేజీ సాంగ్ వచ్చేసింది!
'డీజే టిల్లు'తో మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరో సిద్ధు జొన్నలగడ్డ. ప్రస్తుతం టిల్లు స్క్వేర్తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. 'డీజే టిల్లు' చిత్రానికి సీక్వెల్‌గా రూపొందిస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ఈ మూవీకి మల్లిక్ రామ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్గా నటిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి క్రేజీ అప్డేట్ వచ్చేసింది. ఈ మూవీలోని సెంకడ్ సింగిల్ పాటను మేకర్స్ రిలీజ్ చేశారు. ఇప్పటికే విడుదలైన మొదటి సాంగ్ 'టికెట్టే కొనకుండా' అభిమానులను అలరిస్తోంది. తాజాగా 'రాధిక' పేరుతో వచ్చిన ఈ పాట ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ గీతానికి కాసర్ల శ్యామ్ సాహిత్యం అందించారు. కాగా.. ఈ చిత్రం 2024, ఫిబ్రవరి 9వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ చిత్రానికి రామ్ మిరియాల సంగీతమందిస్తున్నారు. Here's the most energetic beat of the year, #Radhika from #TilluSquare 🕺 - https://t.co/X9teTtEAgl 🎹 & 🎤 @ram_miriyala ✍️ @LyricsShyam #Siddu @anupamahere @MallikRam99 @achurajamani @NavinNooli #SaiPrakash @vamsi84 #SaiSoujanya @SitharaEnts @Fortune4Cinemas… pic.twitter.com/EJ8t2CTfXV — Anupama Parameswaran (@anupamahere) November 27, 2023 -
Tillu Square: లేటుగా వస్తున్న ‘టిల్లుగాడు’
‘డీజే టిల్లు’ మూవీతో ఓవర్‌నైట్ స్టార్ అయ్యాడు సిద్ధు జొన్నలగడ్డ. అంతకుముందు పలు సినిమాల్లో నటించినప్పటికీ.. సిద్ధుకి తగిన గుర్తింపు రాలేదు. కానీ ఈ ఒక్క మూవీ మాత్రం ఈ యంగ్ హీరో జీవితాన్నే మార్చేసింది. సిద్దుని టిల్లు పాత్రలో మరోసారి చూడడానికి ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుండటంతో.. సిద్ధు, సితార ఎంటర్టైన్మెంట్స్ కలిసి 'డీజే టిల్లు' చిత్రానికి సీక్వెల్‌ను రూపొందించాలని నిర్ణయించారు. డీజే టిల్లు' సీక్వెల్ గా 'టిల్లు స్క్వేర్’ రూపొందింది. ఈ చిత్రం సెప్టెంబర్ 15న రాబోతున్నట్లు గతంలో ప్రకటించారు. కానీ అనూహ్యం వాయిదా వేస్తూ.. రిలీజ్ తేదిని త్వరలోనే ప్రకటిస్తామని చెప్పారు. తాజాగా రిలీజ్ డేట్‌ని అనౌన్స్ చేసింది చిత్రబృందం. వచ్చే ఏడాది ఫిబ్రవరి 9న టిల్లుగాడు థియేటర్స్‌లో సందడి చేయనున్నాడు. డీజే టిల్లు చిత్రానికి ఏమాత్రం తగ్గకుండా పూర్తి వినోదాత్మకంగా మలచడానికే సినిమా విడుదల విషయంలో జాప్యం జరుగుతుందని మేకర్స్ అంటున్నారు. నిర్మాత సూర్యదేవర నాగ వంశీ మాట్లాడుతూ, టిల్లూ స్క్వేర్ కల్ట్ స్టేటస్‌ను అందుకుంటుందని, ఆ దిశగా కృషి చేస్తున్నామని తెలిపారు. ఇప్పుడు ఈ సినిమాను 2024 ఫిబ్రవరి 9న ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సిద్ధమవుతున్నారు. టిల్ స్క్వేర్‌లో అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటిస్తున్నారు. డీజే టిల్లులో నేహా శెట్టి పోషించిన రాధిక పాత్ర తరహాలో ఈ పాత్ర కూడా గుర్తుండిపోయేలా ఉంటుందని మేకర్స్ హామీ ఇచ్చారు. ఇప్పటికే, ఈ సినిమా ప్రచార చిత్రాల్లో అనుపమ కనిపిస్తున్న తీరు పెద్ద చర్చనీయాంశంగా మారింది. -
హీరో అక్కర్లేదు.. యంగ్ హీరోయిన్స్ దానికి సై
నాయికా ప్రాధాన్యంగా సాగే చిత్రాలు చేయడం అంటే అంత ఈజీ కాదు. కథానుసారం ఫైట్లు చేయాలి.. పవర్ఫుల్ డైలాగులు చెప్పాలి.. రెగ్యులర్ కమర్షియల్ చిత్రాలకన్నా కాస్త ఎక్కువగానే ఎమోషన్ పండించాలి.. అవసరమైతే క్యారెక్టర్‌కి తగ్గట్టు సన్నబడాలి లేదా బరువు పెరగాలి లేదా నల్లటి మేకప్ వేసుకోవాలి. అన్నింటికీ మించి సినిమా మొత్తం ఆ నాయిక తన భుజాల మీద మోయాలి. ‘లేడీ ఓరియంటెడ్’ మూవీ అంటే పెద్ద సవాల్. అలాంటి సవాల్ వస్తే కాదనకుండా ఒప్పేసుకుంటారు కథానాయికలు. ప్రస్తుతం ముగ్గురు నాయికలు తొలిసారి ‘హాయ్ హాయ్ నాయికా’ అంటూ లేడీ ఒరియంటెడ్ మూవీకి సై అన్నారు. ఎమోషనల్ రెయిన్ బో రష్మికా మందన్నా క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఈ బ్యూటీ ఇప్పటివరకూ ఎక్కవగా కమర్షియల్ చిత్రాలే చేశారు. ‘రెయిన్ బో’ చిత్రంతో తొలిసారి ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్ వరల్డ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నారు రష్మికా మందన్నా. ఫీల్ గుడ్ రొమాంటిక్ ఎంటర్టైనర్గా ఈ చిత్రాన్ని దర్శకుడు శాంత రూబన్ తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం ప్రధానంగా ఎమోషన్స్‌తో సాగుతుందట. ఇందులో మలయాళ నటుడు దేవ్ మోహన్ మరో లీడ్ రోల్ చేస్తున్నారు. ఈ సినిమా తొలి షెడ్యూల్ ముగిసింది. ఈ చిత్రం వచ్చే ఏడాదిప్రారంభంలో రిలీజ్ కానుంది. రోడ్ ట్రిప్ మనాలి, లడఖ్ లొకేషన్స్‌తో ΄ాటు నార్త్‌లోని మరికొన్నిప్రాంతాల్లో రోడ్ ట్రిప్ చేస్తున్నారట హీరోయిన్ అనుపమా పరమేశ్వరన్. ఇది పర్సనల్ ట్రిప్ కాదు... ్ర΄÷ఫెషనల్ ట్రిప్ అని తెలిసింది. ‘సినిమా బండి’ ఫేమ్ ప్రవీణ్ దర్శకత్వంలో రోడ్ ట్రిప్ నేపథ్యంలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ లేడీ ఓరియంటెడ్ మూవీలో అనుపమా పరమేశ్వరన్ మెయిన్ లీడ్ రోల్ చేస్తుండగా, మలయాళ యంగ్ బ్యూటీ దర్శన, సీనియర్ నటి సంగీత లీడ్ రోల్స్ చేస్తున్నారు. ముగ్గురు మహిళల జీవితాల నేపథ్యంలో ఈ సినిమా కథనం ఉంటుందని టాక్. మరోవైపు ఈ సినిమా కంటే ముందే ‘బటర్ ఫ్లై’ అనే ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్ చేశారు అనుపమా పరమేశ్వరన్. అయితే ఈ చిత్రం డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజ్ అయ్యింది. ఇప్పుడు అనుపమ చేస్తున్న చిత్రం థియేటర్లలో విడుదల కానుంది. సో.. వెండితెరపై అనుపమ కనిపించనున్న తొలి ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్ ఇదే అవుతుందనుకోవచ్చు. వచ్చె నెలలో ఆరంభం ‘సమ్మోహనం, వి, అంతరిక్షం, మహాసముద్రం’ వంటి తెలుగు సినిమాలతో నటిగా ప్రేక్షకులతో మంచి మార్కులు వేయించుకున్నారు హీరోయిన్ అదితీరావ్ హైదరి. ఈ బ్యూటీ సౌత్‌లో ఫస్ట్‌టైమ్ ఓ లేడీ ఓరియంటెడ్ ఫిల్మ్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలిసింది. దర్శక– నటుడు రాజేష్ ఎమ్. సెల్వ ఓ ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్ ΄్లాన్ చేస్తున్నారని, ఈ చిత్రంలోని మెయిన్ లీడ్ క్యారెక్టర్‌కు అదితీరావ్ని ఎంపిక చేశారనే టాక్ వినిపిస్తోంది. వచ్చే నెలలో చిత్రీకరణప్రారంభించుకోనున్న ఈ సినిమా వచ్చే ఏడాదిలో విడుదల కానుంది. త్రిష, అనుష్క, కాజల్ అగర్వాల్, తమన్నా, నయనతార, సమంత వంటి తారలు ఇప్పటికే పలు లేడీ ఓరియంటెడ్ చిత్రాల్లో నటించారు. ఇప్పుడు మరికొందరు ఈ తరహా చిత్రాలపై మొగ్గు చూ΄ారు. వీరి స్ఫూర్తితో కొందరు యువకథానాయికలు లేడీ ఓరియంటెడ్ చిత్రాలు సైన్ చేయడానికి రెడీ అవుతున్నారు. ∙ -
Tillu Square: అనుపమతో డీజే టిల్లు ఫ్లర్టింగ్.. ప్రోమో అదిరింది!
‘డీజే టిల్లు’.. ఈ ఒక్క మూవీతో ఓవర్‌నైట్ స్టార్ అయ్యాడు సిద్ధు జొన్నలగడ్డ. అంతకు ముందు పలు సినిమాల్లో నటించినా సిద్దుకు తగిన గుర్తుంపు రాలేదు. కానీ డీజే టిల్లు మాత్రం అతని జీవితాన్ని మార్చేసింది. ప్రస్తుతం ఈ సినిమాకు సీక్వెల్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. రామ్ మల్లిక్ దర్శకత్వం వహిస్తున్న ఈ సీక్వెల్‌కు టిల్లు స్క్వేర్ అని టైటిల్ ఫిక్స్ చేశారు. తాజాగా ఈ సినిమా నుంచి ఓ అప్డేట్ ఇచ్చింది చిత్ర యూనిట్. సినిమాలోని 'టికెటే కొనకుండా' అనే పాటను జులై 26న రిలీజ్ కానుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఓ ప్రోమోని విడుదల చేసింది చిత్ర యూనిట్. అందులో సిద్ధు తనదైన స్టైల్లో అనుపమను ఫ్లర్టింగ్ చేశాడు. ఓ పార్టీలో వాష్ బేసిన్ వద్ద షూస్ క్లీన్ చేస్తున్న సిద్ధు.. అక్కడే ఉన్న అనుపమను చూస్తూ.. ‘మనసు విరిగినట్టున్నది ఎక్కడనో’అనడంతో ఆమె కోపంగా చూస్తుంది. ఉన్నడా బాయ్‌ఫ్రెండ్? అనడంతో.. ‘నీకెందుకు’ అంటుంది అను. అప్పుడు సిద్దు..‘ఒకవేళ ఉంటే నా షూ నేనేసుకుని వెళ్లిపోతా, లేడంటే.. ‘నిన్నేసుకొని పోతా’అంటాడు. ‘అబా.. ఎక్కడికి?’అని అను అంటే..‘నువ్వు ఏడికంటే ఆడికి’అని సిద్ధు రిప్లై ఇస్తాడు. ‘ఇప్పుడే కదరా కలిశాం. అప్పుడే ఓపెన్‌గా ఫ్లర్ట్ చేస్తావా’ అంటుంది అనుపమ. ‘మరి ఫ్లర్ట్ చేస్తున్న సంగతి నీకు తెల్వాలే గదా. లేకపోతే చేసి ఉపయోగం ఏముంది?’ అంటూ ఫన్నీగా ఆ ప్రోమో సాగుతుంది. ప్రోమోని ఇంత కామెడీగా ఉంది అంటే.. ఇక సినిమా ఏ రేంజ్లో ఉంటుందో అని ఫ్యాన్స్ అంచనాలు పెంచేసుకుంటున్నారు. -
Social Hulchul: అందాల ప్రదర్శనలో అనుపమతో తమన్నా పోటీ
► బ్లాక్ డ్రెస్‌లో డోస్ పెంచుతున్న అనుపమ పరమేశ్వరన్.. ఘాటైన పోజులతో లేటెస్ట్ ఫోటలు వైరల్ ► భూమిపై నిజమైన స్వర్గం ఇదేనేమో అంటూ.. కుటుంబంతో పాటు స్నేహితులతో ఎంజాయ్ చేస్తున్న హనీరోజ్ ► ఎవర్గ్రీన్ అందంతో మెరిసిపోతున్న టబు ► లగ్జరీ బైక్‌పై సింగిల్‌గా రైడ్ చేస్తూ తగ్గేదెలే అంటున్న మంజు వారియర్ ►లస్ట్ స్టోరీస్-2 వెబ్ సిరీస్ ఫోటో షూట్లో రెచ్చిపోయిన తమన్నా View this post on Instagram A post shared by Anupama Parameswaran (@anupamaparameswaran96) View this post on Instagram A post shared by Honey Rose (@honeyroseinsta) View this post on Instagram A post shared by Manju Warrier (@manju.warrier) View this post on Instagram A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks) View this post on Instagram A post shared by Suhasini Hasan (@suhasinihasan) View this post on Instagram A post shared by Krithi Shetty (@krithi.shetty_official) View this post on Instagram A post shared by Sreemukhi (@sreemukhi) -
'నువ్వేమీ పెద్ద హీరోయిన్ కాదు'.. అనుపమ రిప్లై అదిరిందిగా
తెలుగులో వరుస అవకాశాలతో దూసుకుపోతున్న మలయాళీ భామ అనుపమ పరమేశ్వరన్. సౌత్ ఇండస్ట్రీలో అత్యధికంగా ఫాలోయింగ్ ఉన్న హీరోయిన్లలో ఈమె ఒకరు. 'అఆ' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ కేరళ కుట్టికి టాలీవుడ్లో విపరీతమైన క్రేజ్ ఉంది. తెలుగుతోపాటు.. తమిళం, మలయాళంలోనూ అనేక చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది ఈ బ్యూటీ. కానీ ఆమెకు పెద్ద హీరోలతో నటించే అవకాశం దక్కలేదు. ఈ ఏడాది కార్తికేయ 2 సినిమాతో పాన్ ఇండియా హిట్ ఖాతాలో వేసుకుంది. ఆ తర్వాత 18 పేజీస్ చిత్రంలో నటించింది. సోషల్ మీడియాలో ఈ బ్యూటీ ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటుంది. ఎప్పటికప్పుడు లేటేస్ట్ ఫోటోస్ షేర్ చేస్తూ ఫాలోవర్లకు టట్‌లో ఉంటుంది. (ఇదీ చదవండి : కారు ప్రమాదం... షాక్‌లోకి వెళ్లిపోయానన్న నటి) తాజాగా ఒక నెటిజన్ 'నువ్వు పెద్ద హీరోయిన్‌వి ఏమీ కాదు.. అందుకే భారీ సినిమాల్లో నటించే అవకాశం రావడం లేదు.. అసలు మీరు హీరోయిన్ మెటీరియలే కాదు' అని కామెంట్ చేశాడు. దీంతో అనుపమ ఎంతో వినయంగా సమాధానం ఇచ్చింది. 'మీరు చెప్తుంది కరెక్టే అన్నా.. నేను హీరోయిన్ టైప్ కాదు, నేను యాక్టర్ టైప్' అని చాచి చెంపపై కొట్టినట్లు బదులిస్తూనే స్మైలీ ఎమోజీలను జత చేసింది. ఇది చూసిన నెటిజన్లు అనుపమకు మద్ధతుగా కామెంట్స్ చేస్తున్నారు. బ్యూటీతో పాటు టాలెంట్ ఉన్న నటి అంటూ ఆమెను పొగుడుతున్నారు. ఇది ఇలా ఉంటే అనుపమ ప్రస్తుతం సిద్దు జొన్నలగడ్డ హీరోగా వస్తున్న డిజే టిల్లూ స్క్వేర్తో పాటు.. రవితేజ రాబోయే భారీ యాక్షన్ సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. (ఇదీ చదవండి: అలాంటి వ్యక్తినే మనువాడతా: టాప్ హీరోయిన్) -
లెహంగాలో కృతి శెట్టి, చీరలో ప్రణీత..అందాల తారల హాట్ పోజులు
►పెళ్లి సంబరాలు అంటూ పెళ్లి కూతురిలా ముస్తాబైన ఫోటోలను షేర్ చేసింది హీరోయిన్ ప్రణీత ►ఎర్ర చీరలో ఆహా అనిపిస్తున్న అషురెడ్డి ►లెహంగాలో కృతిశెట్టి పరువాల విందు ► అనుపమ ఆవకాయ పెట్టింది. దానికి సంబంధించిన ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది ► దుబాయ్ టూర్లో ఎంజాయ్ చేస్తుంది ఫరియా అబ్దుల్లా View this post on Instagram A post shared by Krithi Shetty (@krithi.shetty_official) View this post on Instagram A post shared by Pranita Subhash (@pranitha.insta) View this post on Instagram A post shared by Ashu Reddy (@ashu_uuu) View this post on Instagram A post shared by Anupama Parameswaran (@anupamaparameswaran96) View this post on Instagram A post shared by Kriti (@kritisanon) View this post on Instagram A post shared by Malavika Mohanan (@malavikamohanan_) View this post on Instagram A post shared by Rakul Singh (@rakulpreet) View this post on Instagram A post shared by Faria Abdullah (@fariaabdullah) -
ఎంత క్యూట్ గా చేసిందో చూడండి..
-
రోజురోజుకీ గ్లామర్ డోసు పెంచుతున్న అనుపమ పరమేశ్వరన్ (ఫోటోలు)
-
18 పేజెస్ మూవీ టీంతో " స్పెషల్ చిట్ చాట్ "
-
" 18 పేజెస్ " మూవీ పబ్లిక్ టాక్
-
సక్సెస్‌ను మించిన ప్రెజర్ మరొకటి ఉండదు
‘‘నా కెరీర్లో ఇప్పటివరకూ నేను మంచి కథలు, మంచి సినిమాల్లో నటించాను. కానీ నటనలో నాకు ఉన్న ప్రతిభకు సరైన పేరు రాలేదని ఫీలవుతుంటాను. అయితే ‘18 పేజెస్’ రిలీజ్ తర్వాత కేవలం ఈ సినిమా గురించే కాకుండా నా నటన గురించి కూడా మాట్లాడుకుంటారని అనుకుంటున్నాను’’ అని హీరో నిఖిల్ సిద్ధార్థ అన్నారు. పల్నాటి సూర్యప్రతాప్ దర్శకత్వంలో నిఖిల్ సిద్ధార్థ, అనుపమా పరమేశ్వరన్ జంటగా నటించిన చిత్రం ‘18 పేజెస్’. దర్శకుడు సుకుమార్ అందించిన కథతో అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మించిన ఈ చిత్రం నేడు రిలీజవుతోంది. ఈ సందర్భంగా గురువారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో నిఖిల్ చెప్పిన విశేషాలు. ► ‘18 పేజెస్’ చిత్రం ఎలా ఉంటుంది? థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో కూడిన క్రేజీ లవ్‌స్టోరీ ఇది. 18 పేజెస్ ఆధారంగా నందినీతో సిద్ధు ఏ విధంగా ప్రేమలో పడతాడు? వీరి ప్రేమకథ ఎలా ముగిసింది? అన్నదే కథ. ఈ సినిమా క్లయిమాక్స్‌ని ఊహించలేకపోయాను. అలాగే ఈ సినిమాను ప్రేక్షకులు, విమర్శకులు ఎలా రిసీవ్ చేసుకుంటారోననే భయం కూడా ఉంది. హిట్టయినా కాకపోయినా మేం ఓ మంచి ప్రయత్నం చేశామని ఆడియన్స్ భావిస్తారనే గ్యారంటీ ఇవ్వగలను. ► థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, లవ్‌స్టోరీ కాకుండా.. ఈ సినిమాలో వేరే అంశాలేమైనా? కొన్ని సామాజిక అంశాలను చెప్పే ప్రయత్నం చేశాం. ఎవరో ఒక అమ్మాయి తనను రిజెక్ట్ చేసిందని అతను ఆమెపై యాసిడ్‌తో దాడి చేయడం, అఘాయిత్యాలకు పాల్పడటం వంటివి వార్తల్లో చూస్తున్నాం. ఓ అమ్మాయికి ఎలాంటి గౌరవం దక్కాలి? ఆమె పట్ల ప్రవర్తన ఎలా ఉండాలి? పెద్దల పట్ల యువత తీరు ఎలా ఉంటే బాగుంటుంది? అనే అంశాలను చెప్పే ప్రయత్నం చేశాం. ఈ సినిమా చూసిన తర్వాత బ్రేకప్ను కూడా పాజిటివ్‌గా తీసుకుంటారు. ► ఈ చిత్రంపై దర్శకుడు సుకుమార్ మార్క్ ఎంత? వంద శాతం ఆయన మార్క్ కనిపిస్తుంది. హీరో, హీరోయిన్ల క్యారక్టరైజేషన్స్, స్క్రీన్‌ప్లే డిఫరెంట్‌గా ఉన్న ఇలాంటి లవ్‌స్టోరీని నేనిప్పటివరకు చేయలేదు. ప్రతి సీన్ చాలెంజింగ్‌గా అనిపించింది. ‘కార్తికేయ 2’తో పాన్ ఇండియా హీరో అయ్యారు. ఏమైనా ఒత్తిడి ఫీలవుతున్నారా? పాన్ ఇండియా హీరో అన్న ప్రతిసారీ నాకు ఒత్తిడే. నాకు తెలిసి సక్సెస్‌ను మించిన ప్రెజర్ మరొకటి ఉండదు. ► మీ తర్వాతి చిత్రాలు? నెక్ట్స్ ఇయర్ ఓ స్పై మూవీతో రాబోతున్నాను. దర్శకుడు చందు మొండేటి ‘కార్తికేయ 3’ కోసం పరిశోధన చేస్తున్నారు. నా ‘యువత’ సినిమా రిలీజైన ఐదు రోజులకు సుకుమార్‌గారు లక్ష రూపాయల పారితోషికం ఇచ్చారు. ఆయనతో సినిమా ఎప్పుడో చెప్పలేను. ► మనతో పని చేసేవారు కొన్నిసార్లు తప్పుడు నిర్ణయాలను కూడా పొగుడుతుంటారు. రియల్ పర్సన్స్‌ను కలిసినప్పుడు మనకు రియాలిటీ అర్థమవుతుంది. ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్.. ఇలా సోషల్ మీడియా ద్వారా రియల్ పీపుల్‌ను కలిసే చాన్స్ నాకు లభించింది. సోషల్ మీడియాలో నాకో ఫేక్ ప్రొఫైల్ ఉంది. నెటిజన్ల కామెంట్స్ చదువుతూ నిజాలు తెలుసుకుంటుంటాను. నా సినిమాలకు ప్రేక్షకుల స్పందన ఎలా ఉందనే విషయాలను నా ఫ్రెండ్స్ ద్వారా తెలుసుకుంటుంటాను. ► అనుకోకుండా యాక్టర్ అయ్యాను. ఊహించని విధంగా హిట్స్ పడ్డాయి. అలాగే ఊహించని రీతిలో జాతీయ స్థాయిలో ఆడియన్స్ దృష్టిలో పడ్డాను. ఇదంతా ఎలా జరిగిందో ఆలోచించుకుంటూ ఉంటాను. -
అవకాశాల కోసం రూట్ మార్చిన అనుపమ
-
18 Pages: ‘నన్నయ్య రాసిన కావ్యమాగితే..’ ఆకట్టుకుంటున్న క్లాసీ మెలోడీ
నిఖిల్ సిద్దార్థ ,అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన చిత్రం 18 పేజెస్. "జీఏ 2" పిక్చర్స్ బ్యానర్‌పై బన్నీ వాసు ఈ సినిమాను నిర్మించగా, మెగా నిర్మాత అల్లు అరవింద్ సమర్పిస్తున్నారు. ఇదివరకే విడుదలైన టీజర్ సినిమాపై మరిన్ని అంచనాలను పెంచేసింది. తాజాగా ఈ చిత్రం నుంచి ‘నన్నయ్య రాసిన’ అనే లిరికల్ వీడియో సాంగ్ ను విడుదల చేసారు. ఈ పాటకు శ్రీమణి సాహిత్యం అందించగా, పృథ్వి చంద్ర, సితార కృష్ణ కుమార్ ఆలపించారు. గోపి సుందర్ సంగీతం అందించారు. ఏ కన్నుకి ఏ స్వప్నమో ఏ రెప్పెలైన తెలిపేనా ఏ నడకది ఏ పయనమో ఏ పాదమైన చూపేనా నీలో స్వరాలకే నేనే సంగీతమై నువ్వే వదిలేసిన పాటై సాగేనా నన్నయ్య రాసిన కావ్యమాగితే, తిక్కన తీర్చేనుగా రాధమ్మ ఆపిన పాట మధురిమా కృష్ణుడు పాడెనుగా .. అని శ్రీమణి రచించిన లైన్స్ మంచి ఫీల్ ను క్రియేట్ చేస్తున్నాయి. సూర్య ప్రతాప్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. నవీన్ నూలి ఈ చిత్రానికి ఎడిటర్ గా వర్క్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా డిసెంబర్ 23న క్రిస్టమస్ కానుకగా విడుదల చేయనున్నారు. -
‘రౌడీబాయ్స్’ సాంగ్ రిలీజ్ ఈవెంట్లో విజయ్ దేవరకొండ సందడి
-
మేమిద్దరం ఇండస్ట్రీకి రావాలని కలలు కనేవాళ్లం: విజయ్
ప్రముఖ నిర్మాత దిల్ రాజు సోదరుడు శిరీష్ తనయుడు ఆశిష్ హీరోగా నటించిన చిత్రం ‘రౌడీబాయ్స్’. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్. శ్రీహర్ష కొనుగంటి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని దిల్‌రాజు, శిరీష్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన ఫస్ట్‌లుక్, మోషన్ పోస్టర్, ఫస్ట్సాంగ్కు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ నుంచి రెండో పాట విడుదలైంది. ‘ప్రేమ ఆకాశమైతే...’ అంటూ సాగే ఈ పాటే యంగ్ హీరో విజయ్ దేవరకొండ విడుదల చేశాడు. శ్రీమణి రాసిన ఈ పాటకు దేవిశ్రీప్రసాద్ స్వరాలు సమకుర్చగా జస్ప్రీత్ జస్జ్ ఆలపించారు. చదవండి: ఆ సినిమాలో సాయి పల్లవిపై స్పెషల్ సాంగ్, ఈసారి క్లాసికల్ టచ్‌తో..! ఈ పాట విడుదల అనంతరం విజయ్ మాట్లాడుతూ.. ‘‘హర్ష, నేను ఇండస్ట్రీలోకి రావాలని కలలు కనేవాళ్ళం. హర్షకు కాలేజ్ మీటర్ బాగా తెలుసు. హర్ష దర్శకత్వం వహించిన మొదటి సినిమా ‘హుషారు’ కంటే ఈ సినిమా ఇంకా పెద్ద విజయం సాధించాలని ఆశిస్తున్నా. ఇక తొలి సినిమా ఎక్స్‌పీరియన్స్‌ను ఆశిష్ ఫుల్‌గా ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను. నాకు ‘పెళ్ళి చూపులు’ స్ట్రాంగ్‌గా గుర్తుండిపోయింది. ఆశిష్‌లో నాకో సిన్సియారిటీ కనిపిస్తుంది. ‘రౌడీ బాయ్స్’ స్టార్ట్ కావడానికి ముందు ఓసారి నన్ను కలిశాడు. అతనిలో నటన పట్ల ఆసక్తి, తపన కనిపించాయి. ఆశిష్... మీ నాన్న (శిరీష్), బాబాయ్ (‘దిల్’ రాజు) చాలా కష్టపడి ఈ స్థాయికి వచ్చారు. నువ్వు.. వారు గర్వపడేలా చేస్తావని ఆశిస్తున్నాను’’ అన్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) చదవండి: ప్రభాస్ బర్త్‌డే: రాధే శ్యామ్ నుంచి రానున్న బిగ్ సర్ప్రైజ్ -
లంగా ఓణిలో శ్రీదేవి.. ఎంజాయ్ చేస్తున్న జాన్వీ
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికల్లో మంచు విష్ణుకు నందమూరి బాలకృష్ణ మద్దతు తెలిపాడు. ఈ విషయాన్ని మంచు విష్ణు ఇన్‌స్టా ద్వారా తెలియజేస్తూ బాలయ్యకు థ్యాంక్స్ చెప్పాడు. లంగా ఓణిలో అదరగొట్టింది శ్రీదేవి విజయకుమర్ ఫ్రెండ్స్‌తో కలిసి ప్రకృతి అందాలను ఆస్వాదిస్తోంది బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ View this post on Instagram A post shared by Ritu Varma (@rituvarma) View this post on Instagram A post shared by sridevi vijaykumar (@sridevi_vijaykumar) View this post on Instagram A post shared by Vishnu Manchu (@vishnumanchu) View this post on Instagram A post shared by Avika Gor (@avikagor) View this post on Instagram A post shared by Vidyu Raman (@vidyuraman) View this post on Instagram A post shared by Neha Sharma 💫 (@nehasharmaofficial) View this post on Instagram A post shared by Mamta Mohandas (@mamtamohan) View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) View this post on Instagram A post shared by Satyadev (@actorsatyadev) View this post on Instagram A post shared by Sreeleela (@sreeleela14) View this post on Instagram A post shared by Malaika Arora (@malaikaaroraofficial) View this post on Instagram A post shared by Rakul Singh (@rakulpreet) -
‘18 పేజెస్’ నుంచి క్రేజీ అప్డేట్, ఆకట్టుకుంటున్న అనుపమ లుక్
యంగ్ హీరో నిఖిల్, హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ జంటగా ‘కుమారి 21 ఎఫ్’ ఫేమ్ సూర్యప్రతాప్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘18 పేజెస్’. టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ కథ, స్క్రీన్‌ప్లే అందించిన ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ సమర్పణలో ‘బన్నీ’ వాసు నిర్మిస్తున్నారు. రొమాంటిక్ ఎంటర్టైనర్గా ఈ చిత్రం రూపొందుతోంది. ఈ మూవీలో అనుపమ నందిని పాత్ర పోషిస్తోంది. తాజాగా ఈ మూవీలోని నందిని పాత్రకు సంబంధించిన ఒక వీడియోను చిత్ర బృందం విడుదల చేసింది. ఇందులో అనుపమ చాలా యాక్టివ్‌గా కనిపిస్తుంది. Here it is!! 🤩 Introducing the beautiful @anupamahere as #𝑵𝒂𝒏𝒅𝒊𝒏𝒊 from #18Pages 📜🦋#NandiniFirstLook ▶️ https://t.co/edXy4PnW3S@aryasukku #BunnyVas @actor_Nikhil @dirsuryapratap @GopiSundarOffl @NavinNooli @raparthysaran @SukumarWritings @GA2Official @adityamusic — Geetha Arts (@GeethaArts) September 10, 2021 ఈ సినిమాలో నిఖిల్ డ్యూయల్ రోల్లో కనిపించనున్నాడని తెలుస్తోంది. ఈ సినిమాతో కెరియర్లో మొదటిసారి ద్విపాత్రాభినయం చేయబోతున్నాడు నిఖిల్. అందులో ఒకపాత్ర గతం మరచిపోయే నేపథ్యంలో సాగుతుందని ప్రచారం జరుగుతోంది. ఆ మధ్య చిత్రానికి సంబంధించి ఒక పోస్టర్ విడుదల చేశారు మేకర్స్. నా పేరు నందిని. నాకు మొబైల్లో అక్షరాలను టైప్ చెయ్యడం కన్నా ఇలా కాగితంపై రాయడం ఇష్టం. టైప్ చేసే అక్షరాలకి ఎమోషన్స్ ఉండవు.. ఎవరు టైప్ చేసినా ఒకేలా ఉంటాయి. కానీ రాసే ప్రతి అక్షరానికి ఒక ఫీలింగ్ ఉంటుంది. దానిపై నీ సంతకం ఉంటుంది. నాకెందుకో ఇలా చెప్పడమే బాగుంటుంది” అని నిఖిల్ కళ్లకు గంతల్లా పేపర్ కట్టి దానిపై రాసింది. -
మా నమ్మకం నిజమైంది
‘‘రాక్షసుడు’ సినిమా చాలా పెద్ద విజయాన్ని సాధించింది. ఆడపిల్లల పెంపకం విషయంలో తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలను సందేశాత్మకంగా చూపించిన సినిమా ఇది’’ అన్నారు నిర్మాత కోనేరు సత్యనారాయణ. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమా పరమేశ్వరన్ జంటగా రమేష్ వర్మ దర్శకత్వంలో కోనేరు సత్యనారాయణ నిర్మించిన చిత్రం ‘రాక్షసుడు’. ఆగస్టు 2న విడుదలైన ఈ చిత్రం విజయవంతంగా మూడు వారాలు పూర్తి చేసుకుని నాలుగో వారంలోకి అడుగుపెట్టింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కోనేరు సత్యనారాయణ మాట్లాడుతూ– ‘‘పిల్లల నుంచి పెద్దల వరకు ఈ సినిమా అందరినీ ఆకట్టుకుంది. మరో రెండు వారాల వరకూ వసూళ్లను సాధించే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. మా ‘ఏ స్టూడియోస్ బ్యానర్’పై తొలి చిత్రంగా తెరకెక్కిన ‘రాక్షసుడు’ ఇంత పెద్ద విజయాన్ని సాధించడం ఆనందంగా ఉంది’’ అన్నారు. ‘‘కథపై నమ్మకంతో ఈ సినిమా చేశాం. ఈ రోజు మా నమ్మకం నిజమైంది. ఒరిజినల్ కంటెంట్‌లోని అంశాలను మిస్ చేయకుండా మనకు తగ్గట్లు చేశాం’’ అన్నారు రమేష్ వర్మ. ‘‘ఆర్టిస్టులు, టెక్నీషియన్ల కెరీర్లకు మంచి సినిమా ఎప్పుడూ ఉపయోగపడుతూనే ఉంటుంది. అలాంటి సినిమానే ‘రాక్షసుడు’’ అన్నారు అనుపమా పరమేశ్వరన్. -
ఫిట్ అవడానికే హీరోగా చేస్తున్నా
‘‘నేను హీరోగా పరిచయం చేసిన సాయి శ్రీనివాస్‌కి ‘రాక్షసుడు’ సినిమాతో హిట్ రావడం చాలా ఆనందంగా ఉంది. తనకంటే కూడా నాకే ఎక్కువ సంతోషంగా అనిపించింది. దానికి కారణమైన రమేశ్ వర్మకి నా అభినందనలు’’ అని డైరెక్టర్ వీవీ వినాయక్ అన్నారు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమా పరమేశ్వరన్ జంటగా రమేష్ వర్మ పెన్మత్స దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రాక్షసుడు’. కోనేరు సత్యనారాయణ నిర్మించిన ఈ సినిమాని అభిషేక్ నామా ఈ నెల 2న విడుదల చేశారు . ఆ సినిమా మంచి హిట్ కావడం సంతోషంగా ఉందని వినాయక్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ– ‘‘రాక్షసుడు’ నిర్మాత కోనేరు సత్యనారాయణగారి అబ్బాయి హవీష్ కూడా హీరోనే. అయినా కూడా ‘రాక్షసుడు’ కథకి సాయి కరెక్ట్‌గా సరిపోతాడని, నిర్మాణంలో ఎక్కడా రాజీ పడకుండా ఓ సూపర్‌హిట్ సినిమాని సాయికి అందించినందుకు మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. అందరూ రీమేక్ చేయడం చాలా ఈజీ అంటారు.. కానీ చాలా కష్టం. ‘రాక్షసన్’ తమిళ సినిమా నేను చూశా. మొదటి నుంచి చివరి వరకు ఆ సినిమా టెంపోని ఎక్కడా మిస్ అవకుండా రమేశ్ చాలా బాగా తెరకెక్కించాడు. డైరెక్షన్ వైపు ఎందుకొచ్చావని రమేశ్‌ని అడిగితే.. దాదాపు 800 సినిమాలకు డిజైనర్‌గా పనిచేశాను.. బోర్ కొట్టి డైరెక్షన్ వైపు వచ్చానని చెప్పడం నాకు చాలా బాగా నచ్చింది. అయితే డైరెక్షన్ ఎప్పుడూ బోర్ కొట్టదు.. నువ్వు ఇంకా మంచి మంచి సినిమాలు తీయాలి. సాయితో మళ్లీ హిట్ సినిమా తీయాలి. సాయికి ఇంకా మంచి హిట్లు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా’’ అన్నారు. ఈ సందర్భంగా విలేకరులు అడిగిన ప్రశ్నలకు ఆయన బదులిస్తూ.... ► ఓ కమర్షియల్ హీరోగా ఇండస్ట్రీకి పరిచయం చేయాలంటే ఏ అంశాలు అవసరమో అవన్నీ సాయితో తీసిన ‘అల్లుడు శీను’లో ఉన్నాయి. కొన్ని కథకి అవసరం లేకున్నా యాడ్ చేశాం.. ఎందుకంటే హీరోని (సాయి శ్రీనివాస్) ఎలివేట్ చేయడానికి చేసిన మ్యాజిక్ అది.. సినిమాకి అది బాగా వర్కవుట్ అయింది. ► ఈ మధ్య పేపర్లో చదివా.. ‘మా అబ్బాయి శ్రీనుని ‘రాక్షసుడు’ సినిమాతో ప్రేక్షకులు నటుడిగా గుర్తించారు’ అని బెల్లంకొండ సురేశ్‌గారు అన్నారు. అది అబద్ధం. ‘అల్లుడు శీను’ నుంచి ‘రాక్షసుడు’ వరకూ అన్ని సినిమాలకు సాయిని నటుడిగా గుర్తించారు ప్రేక్షకులు. ► తొలి సినిమా ‘అల్లుడు శీను’కే ది బెస్ట్ ఇచ్చాడు. వినోదం పండించడం చాలా కష్టం.. కానీ ఆ సినిమాలో బాగా చేశాడు. ‘రాక్షసుడు’లో కథ టెంపో ఏ మాత్రం తగ్గకుండా, బాగా ఇన్వాల్వ్ అయి నటించాడు.. దాంతో తనకు మంచి పేరొచ్చింది. తను ఏ పాత్ర అయినా చేయగలడు. ► ‘అల్లుడు శీను’ సినిమా వచ్చి ఐదేళ్లు అయిందంటే రోజులు ఎంత స్పీడుగా అయిపోతున్నాయా అనిపిస్తోంది. ఆ సినిమా నిన్నకాక మొన్ననే విడుదల చేసినట్లుంది నాకు. ప్రతి ఒక్కరూ సినిమా సినిమాకి కొంచెం నేర్చుకుంటూ ఉంటారు. సాయి మాత్రం అనుభవం ఉన్నవాడిలా అన్నీ ఒకే టేక్‌లోనే చేసేవాడు. నాకు చాలా సంతోషంగా, పెద్ద హీరోతో చేసినట్టు అనిపించింది. అప్పటికీ ఇప్పటికీ తనలో నాకు తేడా కనిపించడం లేదు. కథకు ఏది అవసరమో దాన్ని చేస్తున్నాడు. నేను–సాయి కలిసి మళ్లీ సినిమా చేయాలనుంది. అయితే పెద్ద సినిమా తీయాలి. అందుకు మంచి కథ కుదిరితే చేస్తాం. ► నేను సినిమా చేస్తున్నదే ఫిట్ అవడానికి.. అంతేకానీ హీరో అయిపోవాలని కాదు (నవ్వుతూ). బాడీ ఫిట్ అవడానికి ఏదో ఓ కారణం కావాలి.. అందుకు సినిమాని కారణంగా పెట్టుకుని చేస్తున్నా’’ అంటూ హీరోగా తాను ఓ సినిమా కమిట్ అయిన విషయం గురించి చెప్పారు వినాయక్. -
వాటిని మరచిపోయే హిట్‌ని రాక్షసుడు ఇచ్చింది
‘‘నేను సినిమా ఇండస్ట్రీకి వచ్చి 30 ఏళ్లయింది. సినిమాలు నిర్మించడం ప్రారంభించి 21 సంవత్సరాలైంది. ఇన్నేళ్లలో 25 స్ట్రయిట్ సినిమాలు నిర్మించా.. 8 చిత్రాలు డబ్బింగ్ చేశా. అవేవీ నాకు ఆనందం ఇవ్వలేదు. మా అబ్బాయి చేసిన ‘రాక్షసుడు’ సినిమాకి అందరి ప్రశంసలు దక్కడంతో చాలా ఆనందంగా ఉంది. ఇప్పటి వరకూ తను చేసిన ఆరు సినిమాలు ఒక ఎత్తయితే ‘రాక్షసుడు’ మరో ఎత్తు. ఫస్ట్ టైమ్ ఓవర్సీస్లో మా సినిమాకి 100 ప్రీమియర్ షోలు పడటం విశేషం’’ అని నిర్మాత బెల్లంకొండ సురేశ్ అన్నారు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమా పరమేశ్వరన్ జంటగా రమేష్ వర్మ పెన్మత్స దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రాక్షసు డు’. కోనేరు సత్యనారాయణ నిర్మించిన ఈ సినిమాని అభిషేక్ నామా గత శుక్రవారం విడుదల చేశారు. ఈ సినిమాకి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తున్న సందర్భంగా బెల్లంకొండ సురేశ్ తన ఆనందాన్ని మీడియాతో పంచుకున్నారు.. ఆ విశేషాలు. ► మా అబ్బాయి ఈ ఐదేళ్లలో 7 సినిమాలు చేశాడు. ‘అల్లుడు శీను’ సినిమాకి చాలా మంది హీరోలకి తీసిపోని విధంగా ఎక్స్ట్రార్డినరీ ఓపెనింగ్స్‌తో 6 రోజుల్లో 34కోట్ల షేర్ వచ్చింది. అన్ని వాణిజ్య అంశాలతో వీవీ వినాయక్‌గారి దర్శకత్వంలో ఆ సినిమాలో మా అబ్బాయిని హీరోగా పరిచయం చేశా. ఆ తర్వాత బోయపాటి శ్రీనుగారి సినిమాని భారీ బడ్జెట్‌తో, భారీ నటీనటులతో నిర్మించాం. కానీ, వాటికి దర్శకులకు, తోటి నటీనటులకు పేరొచ్చింది. అయితే ‘రాక్షసుడు’ మాత్రం మా అబ్బాయికి మంచి పేరు తీసుకొచ్చింది. రెవెన్యూ సైడ్ కూడా సూపర్ హిట్ అయింది. మాకు ఇంత పెద్ద సూపర్ హిట్ ఇచ్చిన తెలుగు ప్రేక్షకులకు కృతజ్ఞతలు. ► ‘రాక్షసుడు’ కచ్చితంగా హిట్ అవుతుంది.. తెలుగులో మంచి పేరు వస్తుందని నెలన్నర పాటు రమేశ్ వర్మ తమిళ ‘రాక్షసన్’ హక్కుల కోసం ప్రయత్నించాడు.. నేను కూడా తనకు సపోర్ట్‌గా ప్రయత్నించాను. ఈ రోజుల్లో స్ట్రయిట్ సినిమా తీయడం ఈజీ కానీ, రీమేక్ తీయడం చాలా కష్టం. సరిగ్గా తీయకపోతే మంచి సినిమాని చెడగొట్టారంటూ తిడతారు. రమేశ్ వర్మకి కోనేరు సత్యనారాయణ వంటి మంచి నిర్మాత కుదిరారు. మా అబ్బాయికి మంచి సినిమా ఇచ్చినందుకు నిర్మాతకి పాదాభివందనం. సాయిని అందంగా, యూత్‌ఫుల్‌గా చూపించిన కెమెరామేన్ వెంకట్‌కి హ్యాట్సాఫ్. ► మా అబ్బాయి ‘అల్లుడు శీను, జయ జానకి నాయక’ సూపర్ హిట్స్.. స్పీడున్నోడు, కవచం, సీత’ వంటి ఫ్లాప్ సినిమాలు కూడా ఉన్నాయి. వీటన్నింటినీ మరచిపోయేలా ‘రాక్షసుడు’ హిట్ కొట్టింది. సౌత్ నుంచి హిందీలో డబ్బింగ్ అయిన íహీరోల సినిమాల్లో నంబర్ వన్‌గా ఉన్నవన్నీ మా అబ్బాయి సినిమాలే. కావాలంటే యూ ట్యూబ్‌లో చూసుకోవచ్చు. ‘జయ జానకి నాయక’ సినిమాకి సరైన విడుదల తేదీ, థియేటర్లు దొరక్కపోవడం వల్ల కొంచెం నష్టం జరిగింది. లేకుంటే ఆ సినిమానే పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ కావాల్సింది.. దీంతో హిట్‌తోనే సరిపెట్టుకున్నాం. ► సాయితో బాలీవుడ్లో స్ట్రయిట్ హిందీ సినిమా చేస్తామంటూ హాలీవుడ్ సినిమాలు తీసే ఓ పెద్ద కంపెనీ నుంచి సోమవారమే మెయిల్ వచ్చింది. మేమింకా ఓకే చెప్పలేదు. అన్నీ కుదిరితే తప్పకుండా చేస్తాం. లేదంటై వచ్చే ఏడాది మా సొంత బ్యానర్లో తెలుగులో హిట్ అయిన ఓ సినిమాని హిందీలో రీమేక్ చేస్తాం. ఇప్పటి వరకూ మా అబ్బాయి ఫైట్స్, డ్యాన్సులు బాగా చేయగలడనే పేరుంది.. ‘రాక్షసుడు’తో బాగా నటించగలడని పేరొచ్చింది. ► హీరో అవ్వాలని ఐదో తరగతిలోనే సాయి అనుకున్నాడు. అప్పటి నుంచే ఓ వైపు చదువుతూనే మరోవైపు డ్యాన్స్, ఫైట్స్, జిమ్నాస్టిక్ నేర్చుకున్నాడు. నిర్మాత కొడుకు హీరోగా ఎదగడం చాలా కష్టం. కానీ, మా అబ్బాయిది ఎంతో కష్టపడే తత్వం.. దానికి దేవుడి ఆశీర్వాదం, ప్రేక్షకులు అభిమానం తోడవడంతో సక్సెస్ అందుకున్నాడు. దానికితోడు మంచి సినిమాని ఎప్పుడూ మన ప్రేక్షకులు ఆదరిస్తారు. ► ‘రాక్షసన్’ రీమేక్ చేయాలనుకున్నప్పుడు వెంకటేశ్‌బాబు రీమేక్ సినిమాల్లా ఏం మార్పులు చేయకుండా చేస్తే సరిపోతుందని చెప్పా. అలా చేయడం వల్లే ‘రాక్షసుడు’ మంచి విజయం సాధించింది. ఇకపై మంచి కథా చిత్రాలే చేయాలనుకున్నాం. మా అబ్బాయి తర్వాతి సినిమాని నిర్మాత ‘దిల్’ రాజుగారికి అప్పచెప్పా.. ఆయనే నిర్మిస్తారు. ఆ తర్వాత మా సొంత బ్యానర్లో ఓ సినిమా ఉంటుంది. -
రీమేక్ చేయడం సులభం కాదు
‘‘నా చిన్నప్పటి నుంచి సూపర్‌గుడ్ ఫిలిమ్స్‌లో చాలా రీమేక్‌లు చేయడం చూశా. అవన్నీ సక్సెస్‌లే. నేనెప్పుడూ రీమేక్ సినిమా చేయాలనుకోలేదు. కానీ, ‘రాక్షసుడు’ కథ నచ్చింది. ఒక పెయింటింగ్‌ని మళ్లీ వేయడం మామూలు విషయం కాదు. అలాగే రీమేక్ చేయడం కూడా ఈజీ కాదు. ఇండియాలో రీమేక్ అవుతున్న సినిమాలన్నీ హిట్ అయ్యాయా? నేను సక్సెస్ అయ్యాను’’ అని రమేష్ వర్మ అన్నారు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమా పరమేశ్వరన్ జంటగా రమేష్ వర్మ పెన్మెత్స దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రాక్షసుడు’. కోనేరు సత్యనారాయణ నిర్మించిన ఈ సినిమా శుక్రవారం విడుదలైంది. ఈ సందర్భంగా రమేష్ వర్మ పంచుకున్న విశేషాలు... ► సాయిశ్రీనివాస్‌కి ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ ఇచ్చింది నేనే అని వింటుంటే చాలా ఆనందంగా ఉంది. బెల్లంకొండ సురేష్‌గారు వాళ్లబ్బాయిని నా చేతిలో పెట్టినప్పుడు ‘రాక్షసుడు’ సినిమాను ఎంపిక చేసుకున్నా. దీనికన్నా ముందు ఆయన ఓ లవ్ స్టోరీతో డబుల్ బడ్జెట్ ఉన్న సినిమా ఇచ్చారు. ఇద్దరు హీరోయిన్లు, దేవీశ్రీ మ్యూజిక్, లండన్‌లో సినిమా... ఇలా చాలా బెటర్ అవకాశం ఇచ్చారు. కానీ గమ్యం నన్ను ‘రాక్షసుడు’ వైపు తీసుకెళ్లింది. ► ‘కవచం’ సినిమా తర్వాత నేను సాయి శ్రీనివాస్‌కి ఈ కథ చెబితే ‘మళ్లీ పోలీస్‌గా చేయను’ అన్నాడు. బెల్లంకొండ సురేష్గారి దగ్గరకు వెళ్లి ‘రాక్షసన్’ సినిమా చూడమని చెప్పా. వాళ్ల ఫ్యామిలీ మొత్తం చూశారు.. అందరికీ నచ్చడంతో ‘రాక్షసుడు’ ఓకే అయింది. ► ఈ సినిమాలో ఫైట్స్ పెట్టాలని శ్రీనివాస్ కొంచెం ఒత్తిడి చేశాడు. కానీ, నేను ఒప్పుకోలేదు. ‘ఎందుకండీ రమేశ్‌తో రిస్క్. మీ అబ్బాయి హవీశ్‌తో చేసుకుని, వేరే పెద్ద డైరెక్టర్ని పెడితే, ఈ సినిమా పెద్ద హిట్ అవుతుంది’ అని కొందరు సత్యనారాయణగారితో అన్నారు. కానీ ఆయన పట్టించుకోలేదు. ► ఇండియాలో టాప్ గ్రాసర్ సినిమాను ఓ సౌత్ ఇండియన్ డైరెక్టర్ తీస్తే అట్టర్ ఫ్లాప్ అయింది. ఐఎండీబీలో టాప్ సెకండ్ సినిమాను మేం చేశాం.. ప్రూవ్ చేసుకున్నాం. ‘రాక్షసుడు’ తో ఆత్మసంతృప్తి కలిగింది. ‘మా అబ్బాయికి బ్లాక్ బస్టర్ ఇచ్చావు’ అని సురేష్‌గారు మెసేజ్ చేయడం హ్యాపీ. ► ప్రస్తుతానికి ‘రాక్షసుడు’ సినిమాను ఇంకా ప్రమోట్ చేసుకోవాలని ఉంది. ‘రాక్షసుడు’ టైమ్‌లో నితిన్ వాళ్ల నాన్నగారు సుధాకర్రెడ్డిగారిని కలిసి కథ చెప్పా.. వాళ్లకు నచ్చింది. అయితే మీడియాలో ఆ విషయం రావడం వల్ల డిస్టర్బెన్స్ జరిగింది. ఆ కథను, ఆ ప్రేమకథని నితిన్‌తో చేయాలని ఉంది. -
బ్యాక్‌గ్రౌండ్ ఉన్నా కష్టపడాల్సిందే
‘‘నేనెప్పుడూ కథని నమ్ముతా.. హీరోయిజాన్ని కాదు. నా తొలి, మలి సినిమాలు ‘అల్లుడు శీను, స్పీడున్నోడు’ హీరోయిజం కోసం చేశాను. ఆ తర్వాత కథకి ప్రాధాన్యం ఉన్న సినిమాలు చేస్తున్నా. అవి సరిగ్గా ఆడినా, ఆడకున్నా ఆయా పాత్రల్లో నా కష్టం మాత్రం 100 శాతం ఉంటుంది. ప్రతిదీ నా తొలి సినిమాలానే భావిస్తా’’ అని బెల్లంకొండ సాయి శ్రీనివాస్ అన్నారు. రమేష్ వర్మ పెన్మత్స దర్శకత్వంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమా పరమేశ్వరన్ జంటగా నటించిన చిత్రం ‘రాక్షసుడు’. కోనేరు సత్యనారాయణ నిర్మించారు. అభిషేక్ నామా విడుదల చేస్తున్న ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ చెప్పిన విశేషాలు. ► ‘రాక్షసన్’ తమిళ సినిమా చూశా. ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ కావడంతో చాలా బాగా నచ్చింది. కిడ్నాప్ లాంటి సంఘటనలు సమాజంలో ఎన్నో జరుగుతుండటం పేపర్లలో, టీవీల్లో చూస్తున్నాం. అందుకే ఈ చిత్రాన్ని మనసు పెట్టి చేశా. బయట శవాల మధ్య, మార్చురీలో ఎక్కువ షూటింగ్ చేశాం. చిత్రీకరణ తర్వాత కూడా ఆ జ్ఞాపకాలు నన్ను వెంటాడుతూ ఉండేవి. ► టీనేజ్ అమ్మాయిలను కిడ్నాప్ చేసి దారుణంగా హతమార్చే సైకో కిల్లర్‌ని పట్టుకుని, హత మార్చే పోలీసు అధికారి పాత్రలో నటించాను. 2018 డిసెంబరులోనే తమిళ సినిమా ‘రాక్షసన్’ చూశా.. విపరీతంగా నచ్చడంతో రీమేక్ హక్కుల కోసం రెండు నెలలు ప్రయత్నించాం. మనకు తెలిసిన, మనతో ఉన్న అమ్మాయిలకు ఏమైనా జరిగితే తట్టుకోలేం. అలాంటి పాయింట్‌నే ఈ సినిమాలో చర్చించాం. నా మరదలు పాత్ర చేసిన సిరి కిడ్నాప్‌కి గురై చనిపోతుంది. సినిమాలో రెండవ భాగం మొత్తం నా పాత్ర చాలా సీరియస్‌గా, భావోద్వేగంగా సాగుతుంది. ► ఈ సినిమాకి కథే హీరో. ఆ తర్వాతే నేను. గ్లామర్, కమర్షియల్ అంశాలు ఉండవు. ఇదొక తమిళ చిత్రం కంటే మా సినిమాలో సీన్స్‌ని ఇంకా బాగా తీశాం. రీమేక్ సినిమా చేయడం 90 శాతం సులభం, 10 శాతం ఒత్తిడి ఉంటుంది. గత జూలై నుంచి ఈ జూలైకి మూడు పెద్ద సినిమాలు చేశా.. చాలా కష్టపడ్డా.. అందుకే ఓ నెల సరదాగా అమెరికా వెళుతున్నా. ► నా ఫ్రెండ్స్ అంతా నెట్‌ఫ్లిక్స్ బ్యాచ్. ‘రాక్షసుడు’ ప్రివ్యూ చూసి, ‘నిజమైన పోలీస్ అనిపించావ్.. గర్వంగా ఉంది’ అన్నారు. మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా తమిళ్ కంటే తెలుగులోనే బాగా చేశారని అన్నారు. ఇంత మంచి కథ నాకు ఎప్పుడూ దొరకలేదు. ఇలాంటి సినిమా చేసినందుకు గర్వపడుతున్నా. ఇందులో అంతర్జాతీయ స్థాయి క్లయిమాక్స్ ఉంటుంది. ► రమేష్ వర్మ బాగా తీశాడు. నేనెప్పుడూ దర్శకత్వంలో కల్పించుకోను. డైరెక్టర్లు ఎలా చెబితే అలా చేస్తా. వీవీ వినాయక్, బోయపాటి శీనుగార్ల వంటి మాస్ డైరెక్టర్లతో కమర్షియల్ సినిమాలు చేశా. నటుడిగా నేనేంటో నిరూపించుకోవాలి. అందుకే ‘సీత, రాక్షసుడు’ వంటి వైవిధ్యమైన సినిమాలు ఎంచుకున్నా. సినిమా సినిమాకి వైవిధ్యమైన పాత్రలు చేయాలనుంది. కానీ, టాలీవుడ్లోనే కాదు.. ఇతర భాషల్లోనూ కొత్త కథలు దొరకడం కష్టమైపోతోంది. నా ‘సాక్ష్యం, కవచం, సీత’ సరిగ్గా ఆడనప్పుడు ‘ఇంత కష్ట పడ్డాం. ఎందుకిలా?’ అని బాధపడ్డా. అయితే సక్సెస్‌కంటే ఫెయిల్యూర్స్‌తోనే ఎక్కువ నేర్చుకుంటాం. ► నాన్నగారు (బెల్లంకొండ సురేశ్) పక్కా కమర్షియల్ నిర్మాత. ‘సీత, రాక్షసుడు’ వంటి కథలతో ఆయన సినిమాలు తీయరు. ఇండస్ట్రీ నేపథ్యం ఉన్నవారైనా, లేనివారైనా ఇక్కడ కష్టపడాల్సిందే. కొన్ని కథలను మనం జడ్జ్ చేయలేం. మనకి బాగా అనిపించినవి ప్రేక్షకులకు నచ్చకపోవచ్చు. ఈ మధ్య రెండు మూడు కథలు విన్నా ఏదీ ఫైనల్ చేయలేదు. రెండు బాలీవుడ్ అవకాశాలొచ్చాయి. కానీ, హిందీపై నాకు అంత పట్టు లేదు. అందుకే చేయలేదు. -
రాక్షసుడు నా తొలి సినిమా!
‘‘అల్లుడు శీను’ సినిమా ఐదేళ్ల క్రితం విడుదలైంది. అభిమానుల ప్రేమ, ప్రోత్సాహం వల్లే ఇంత దూరం రాగలిగాను. చిన్న చిన్న తప్పులు చేశాను. ఇకపై ఓటమి లేకుండా ఉండటానికి కృషిచేస్తా. మంచి సినిమాలతో మీ ముందుకు రావడానికి ప్రయత్నిస్తాను’’ అని బెల్లంకొండ సాయి శ్రీనివాస్ అన్నారు. రమేష్ వర్మ పెన్మత్స దర్శకత్వంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమా పరమేశ్వరన్ జంటగా నటించిన చిత్రం ‘రాక్షసుడు’. కోనేరు సత్యనారాయణ నిర్మించిన ఈ సినిమాని అభిషేక్ నామా రేపు (ఆగస్ట్ 2) విడుదల చేస్తున్నారు. హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రీ రిలీజ్ ఫంక్షన్లో ‘రాక్షసుడు’ ట్రైలర్‌ను నిర్మాత నారాయణ్‌దాస్ నారంగ్ విడుదల చేశారు. తొలి టికెట్‌ను సాయిశ్రీనివాస్, అనుపమ, కోనేరు సత్యనారాయణ విడుదల చేయగా, తలసాని సాయి యాదవ్ కొన్నారు. ఈ సందర్భంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మాట్లాడుతూ– ‘‘అభిమానుల ప్రేమ, ఆదరణ పొందడానికి ఇంకా కష్టపడతాను. ఇప్పటి నుండి మన కెరీర్ స్టార్ట్ అయింది. ‘రాక్షసుడు’ నా మొదటి సినిమా. రెండో సినిమా కోసం వేచి చూడండి. నాకు వ్యక్తిగతంగా చాలా ఇష్టమైన సినిమా ‘రాక్షసుడు’. అరుదుగా దొరికే కథ ఇది. ఇంత మంచి స్క్రిప్ట్ దొరకడం అదృష్టంగా భావిస్తున్నా’’ అన్నారు. నిర్మాత బెల్లంకొండ సురేశ్ మాట్లాడుతూ– ‘‘తొలి సినిమా ‘అల్లుడు శీను’తోనే ఏ ఇతర హీరోల సినిమాలకు తీసిపోని విధంగా రికార్డు కలెక్షన్స్‌ను సాధించాడు మా అబ్బాయి శ్రీనివాస్. సొంత ప్రతిభతో పైకి వస్తున్నాడు. కొన్ని సినిమాలకు తెలిసోతెలియకో తప్పులు చేశాం. ఇకపై ఆ తప్పులు చేయకూడదని, అభిమానులను నిరుత్సాహ పరచకూడదనిపించి ఇంత వరకు మరో సినిమాకి కమిట్ కాకుండా ‘రాక్షసుడు’ సినిమాపైనే ఫోకస్ పెట్టాడు. ఇకపై ప్రేక్షకులు ఎలాంటి సినిమాలను ఇష్టపడతారో అలాంటివాటిలోనే నటిస్తాడు. తనను ఓ మెట్టు పైకి ఎక్కించే సినిమా ‘రాక్షసుడు’’ అన్నారు. ‘‘చాలా ఉద్విగ్నంగా ఉండే చిత్రం ‘రాక్షసుడు’. చిత్రీకరణలో అస్సలు రాజీపడలేదు. రీషూట్స్ కూడా చేశాం. ఈ సినిమాకు కథే మూలం. ఇలాంటి కథతో నాలుగేళ్లుగా సౌతిండియాలో ఏ సినిమా రాలేదు’’ అన్నారు కోనేరు సత్యనారాయణ. ‘‘ఈ ఏడాది బెస్ట్ హిట్ మూవీస్‌లో ‘రాక్షసుడు’ ఉంటుంది. ఈసారి వందశాతం గట్టిగా హిట్ కొడుతున్నాం’’ అన్నారు అభిషేక్ నామా. ‘‘మా సినిమాలో పనిచేసిన నటీనటులు, సాంకేతిక నిపుణులకు థ్యాంక్స్’’ అని రమేశ్‌వర్మ పెన్మత్స అన్నారు. ‘‘రాక్షసుడు’ సినిమాలో అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు థ్యాంక్స్. శ్రీనివాస్ కెరీర్‌కు ఇది టర్నింగ్ పాయింట్’’ అన్నారు అనుపమా పరమేశ్వరన్. ‘‘బెల్లంకొండ సురేశ్‌గారు నన్ను దర్శకుడిగా పరిచయం చేయాలనుకున్నారు. కానీ అప్పుడు నేను సిద్ధంగా లేకపోవడంతో కుదరలేదు. హీరోగా ఎదిగే క్రమంలో సాయి ప్రతి సినిమాకు కొత్తగా ప్రయత్నిస్తూ ఈ స్థాయికి చేరుకున్నాడు’’ అన్నారు దర్శకుడు అనిల్ రావిపూడి. నిర్మాత మల్టీడైమన్షన్ వాసు, డైరెక్టర్ సాగర్, నిర్మాతలు బెక్కం వేణుగోపాల్, నల్లమలుపు బుజ్జి, నటులు మాదాల రవి, రాజీవ్ కనకాల, కెమెరామేన్ వెంకట్, ఎడిటర్ అమర్, ఆర్ట్ డైరెక్టర్ గాంధీ తదితరులు పాల్గొన్నారు. -
కాలేజీకి చేసినదే సినిమాకి చేశాను
‘‘40 ఏళ్లుగా కేఎల్ యూనివర్శిటీలు నడిపిస్తున్నాం. హైదరాబాద్‌లో కొత్త బ్రాంచ్ కూడా ప్రారంభించాం. మా అబ్బాయి హవీష్ చేసిన ‘జీనియస్’కు నిర్మాణంలో భాగస్వామిగా ఉన్నాను. కానీ నిర్మాణంలో ఇన్వాల్వ్ కాలేదు. పూర్తిస్థాయి ప్రొడక్షన్లోకి వద్దామనుకొని ‘ఏ స్టూడియోస్’ బ్యానర్ స్థాపించాం’’ అన్నారు కోనేరు సత్యనారాయణ. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమా పరమేశ్వరన్ జంటగా రమేశ్ వర్మ దర్శకత్వం వహించిన చిత్రం ‘రాక్షసుడు’. కేఎల్యు సంస్థల చైర్మన్ కోనేరు సత్యనారాయణ నిర్మించిన ఈ చిత్రం ఆగస్ట్ 2న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా కోనేరు సత్యనారాయణ చెప్పిన విశేషాలు. ► తమిళంలో ‘రాక్షసన్’ రిలీజ్ అయిన వారంలోనే చూశాను. గ్రిప్పింగ్‌గా ఉంది. మా అబ్బాయితో రీమేక్ చేయాలనుకున్నాను. అప్పటికే మావాడు థ్రిల్లర్ జానర్లో ‘7’ సినిమా చేస్తున్నాడు. దాంతో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా బావుంటాడనుకున్నాం. సాయి శ్రీనివాస్ చాలా బాగా చేశాడు. ► ‘ఒరిజినల్లో ఉన్నదానికి ఒక్క సీన్ కూడా మార్చకుండా తీయండి’ అని దర్శకుడితో అన్నాను. ఉన్నది ఉన్నట్టు తీయడం కూడా కష్టమే! రమేష్ వర్మ చాలా కష్టపడ్డాడు. సినిమాను ఎలా తీయాలనుకున్నామో అలానే తీశాం. ► నా చిత్రాల్లో మెసేజ్ ఉండాల నుకుంటాను. ‘జీనియస్’లో హీరోలను, క్రికెటర్స్‌ను అభిమానించండి.. ఆరాధిం చొద్దని చెప్పాం. ‘రాక్షసుడు’లో ఆడపిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పాం. ► కాలేజీలో ఒక పని చేయాలంటే చాలామంది ఉంటారు. ఒకరికి చెబితే పని అయిపోతుంది. షూటింగ్‌లోనూ అదే అప్లై చేశాను. సినిమా బిజినెస్ పూర్తయింది. థియేట్రికల్ రైట్స్ అభిషేక్ పిక్చర్స్ వాళ్లకి ఇచ్చేశాం. నెక్ట్స్ 2, 3 సినిమాలు అనుకుంటున్నాం. వాటిలో హవీష్‌తో ఓ సినిమా ఉంటుంది. ► ఎంటర్టైన్మెంట్ యూనివర్శిటీ స్థాపించాలనుకుంటున్నాను. ఆ యూనివర్శిటీలో సినిమా, టీవీ, యానిమేషన్, గ్రాఫిక్స్ అన్నీ నేర్చుకునేలా ఏర్పాటు చేస్తాం. -
సమంతలా నటించలేకపోయేదాన్నేమో!
‘‘రాక్షసుడు’ కథ నచ్చింది. ఇది తమిళ ‘రాక్షసన్’ సినిమాకి రీమేక్. నేను తమిళ సినిమా చూడలేదు. మా నాన్నగారు చూసి ‘రాక్షసన్’ చాలా బాగుంది.. చూడమంటే చూశా. కథ అద్భుతంగా ఉంది’’ అన్నారు అనుపమా పరమేశ్వరన్. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమా పరమేశ్వరన్ జంటగా రమేష్ వర్మ పెన్మత్స దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘రాక్షసుడు’. కోనేరు సత్యనారాయణ నిర్మించారు. అభిషేక్ నామా ఈ చిత్రాన్ని ఆగస్ట్ 2న విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా అనుపమా పరమేశ్వరన్ పంచుకున్న విశేషాలు. ► క్రైమ్ థ్రిల్లర్‌గా రూపొందిన చిత్రం ఇది. నాకు థ్రిల్లర్ సినిమాలంటే ఇష్టం. అందుకే ఈ కథకి బాగా కనెక్ట్ అయ్యాను. ఇందులో నేను టీచర్ పాత్రలో కనిపిస్తాను. సినిమాలో ఎక్కువ భాగం చీరలో ఉండటం సౌకర్యంగానే అనిపించింది. ఎందుకంటే ఐదో తరగతి నుంచే నాకు చీరలు కట్టుకోవడం అలవాటు. డ్యాన్స్, ఇతర ప్రోగ్రామ్స్ టైమ్‌లో చీరలో ఉండేదాన్ని. సినిమాలో నన్ను చూసి ప్రేక్షకులు ఎలా ఫీల్ అవుతారో అనే టెన్షన్ ఉంది. ► తమిళ ‘రాక్షసన్’లో అమలా పాల్ చేశారు. ఆమె కళ్లు చాలా బాగుంటాయి. అమలా పాల్ పాత్ర నేను చేయడం హ్యాపీగా ఉంది. అయితే ఆమెలా కాకుండా నా శైలిలో నటించాను. ఈ సినిమాకి నేనే డబ్బింగ్ చెప్పాను. ఆ సమయంలో నా వాయిస్ బాగాలేదు. ఎవరితోనైనా డబ్బింగ్ చెప్పించమని రమేష్ వర్మగారితో అంటే, ఆయన నేనే చెప్పాలనడంతో చెప్పాను. ► దుల్కర్ సల్మాన్ నిర్మిస్తున్న ఓ మలయాళ సినిమాకి డైరెక్టర్ శ్యాంసు జ్యభ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశా. ఓ సినిమా కోసం యూనిట్ పడే కష్టం ఏంటో తెలుసుకోవాలి.. అప్పుడే వృత్తిపై నాకు మరింత గౌరవం పెరుగుతుందని అసిస్టెంట్‌గా చేశా. వైవిధ్యమైన అనుభూతి కలిగింది. భవిష్యత్తులో దర్శకత్వం చేస్తా. కొన్ని ఐడియాలు ఉన్నాయి. నేను దర్శకత్వం వహించే సినిమాల్లో జీవితం కనిపించాలి. ► నా మాతృభాష మలయాళం అయినా తెలుగులోనే ఎక్కువ సినిమాలు చేశాను కాబట్టి ఇక్కడే నాకు ఎక్కువ సౌకర్యంగా ఉంటుంది. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ నాకు రెండో ఇల్లు లాంటిది. నటిగా సంతృప్తి ఉండదు. మంచి సినిమాలు, పాత్రలు వస్తున్నాయి. కానీ, ఇప్పటి వరకూ నాకు చాలెంజింగ్ పాత్ర రాలేదు. తెలుగు ‘నిన్ను కోరి’ తమిళ్ రీమేక్‌లో నటిస్తున్నా. నివేదా థామస్ పాత్రను నా శైలిలో చేయనున్నా. ఇది నాకు చాలెంజిగ్ పాత్ర అనుకుంటున్నా. ‘ఫిదా’ సినిమాలో సాయిపల్లవి, ‘మహానటి’లో కీర్తీ సురేశ్ చేసిన పాత్రలంటే చాలా ఇష్టం. నటిగా నేనేంటో నిరూపించుకునే అలాంటి పాత్రలు చేయాలనుంది. ‘రంగస్థలం’ సినిమా అవకాశం కోల్పోవడం కొంచెం బాధగానే ఉంది. అయితే ఆ పాత్రలో సమంతకంటే నేను బాగా చేయలేనేమో? అనిపించింది. -
నేనంటే భయానికి భయం
‘నేనంటే భయానికే భయం.. నన్ను పట్టుకోవాలనుకోకు... పట్టుకుందామనుకున్నా అది నేనవను’ అంటూ పోలీస్ అధికారి బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌కు ఓ కిల్లర్ వార్నింగ్ ఇస్తున్న డైలాగ్‌తో ప్రారంభమైన ‘రాక్షసుడు’ ట్రైలర్ ఉత్కంఠ రేకెత్తించేలా ఉంది. ‘మనం వెతుకుతున్నవాడు రేపిస్టో, కిడ్నాపరో లేకపోతే వన్‌సైడ్ లవరో కాదు... పథకం ప్రకారం హత్యలు చేసే ఒక మతిస్థిమితం లేని వ్యక్తి’, ‘మనం ఊహించిన దానికంటే ఈ కేసులో ఏదో సీరియస్‌నెస్ ఉంది మేడమ్’ అంటూ బెల్లంకొండ శ్రీనివాస్ చెప్పే డైలాగులు సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి. బెల్లంకొండ శ్రీనివాస్, అనుపమా పరమేశ్వరన్ జంటగా రమేష్ వర్మ పెన్మత్స దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రాక్షసుడు’. ఎ హవీష్ లక్ష్మణ్ కోనేరు ప్రొడక్షన్స్ పతాకంపై కోనేరు సత్యనారాయణ నిర్మించిన ఈ సినిమా నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. అభిషేక్ పిక్చర్స్ పతాకంపై అభిషేక్ నామా ఈ చిత్రాన్ని ఆగస్ట్ 2న విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ‘రాక్షసుడు’ ట్రైలర్‌ని విడుదల చేశారు. కోనేరు సత్యనారాయణ మాట్లాడుతూ– ‘‘ఏడాది క్రితం నేను, రమేష్ వర్మ కలిసి చెన్నైలో తమిళ చిత్రం ‘రాక్షసన్’ని చూశాం. బాగా నచ్చడంతో రీమేక్ చేశాం. హీరోగా నలుగురైదుగురు పేర్లు అనుకుని, సాయిశ్రీనివాస్‌ను తీసుకున్నాం. పోలీసాఫీసర్ పాత్రలో బాగా నటించాడు. ఒక మంచి సినిమా తీశామనే తృప్తి కలిగింది’’ అన్నారు. ‘‘సాయిశ్రీనివాస్ కెరీర్లో ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవుతుంది’’ అన్నారు అభిషేక్ నామా. ‘‘డైరెక్టర్‌గా చాన్స్ ఇచ్చిన కోనేరు సత్యనారాయణగారికి, బెల్లంకొండ సురేశ్‌గారికి థ్యాంక్స్’’ అన్నారు రమేశ్ వర్మ. ‘‘కవచం’ సమయంలో రమేష్ వర్మ ఈ రీమేక్ గురించి చెప్పారు. మళ్లీ పోలీస్ పాత్రే అనుకుని ముందు ఆసక్తి చూపలేదు. కానీ, తమిళ సినిమా చూశాక అద్భుతంగా అనిపించింది. ఇలాంటి సినిమాను మిస్ చేసుకోకూడదనిపించి చేశా. అద్భుతమైన థ్రిల్లర్. కోనేరు సత్యనారాయణలాంటి నిర్మాత ఈ చిత్రానికి లభించడం అదృష్టం. ఈ బ్యానర్లో తొలి చిత్రం నాదే కావడం హ్యాపీ. రమేష్ వర్మతో సహా అందరూ ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారు’’ అన్నారు బెల్లంకొండ సాయి శ్రీనివాస్. నటుడు కాశీ విశ్వనాథ్, బేబీ దువా కౌశిక్, కెమెరామేన్ వెంకట్ సి. దిలీప్, ఎడిటర్ అమర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
కాలేజీకి వేళాయె
కాలేజీకి వెళ్లడానికి బ్యాగ్‌లో బుక్స్ సర్దుకుంటున్నారు హీరోయిన్ అనుపమా పరమేశ్వరన్. రియల్ లైఫ్‌లో కాదులెండీ. రీల్ లైఫ్‌లో. తమిళ యువ నటుడు అధర్వ హీరోగా కన్నన్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమాలో కథానాయికగా అనుపమా పరమేశ్వరన్‌ను తీసుకున్నారు. ఈ సినిమాలో ఇంజినీరింగ్ స్టూడెంట్ కమ్ భరతనాట్యం డ్యాన్సర్‌గా నటించనున్నారు అనుపమా పరమేశ్వరన్. హీరో అధర్వ పీహెచ్డీ స్కాలర్‌గా పాత్ర చేయనున్నారు. ‘‘ఈ సినిమా షూటింగ్‌ను ఎక్కువ శాతం విదేశాల్లో చిత్రీకరించాలని ప్లాన్ చేశాం. యూఎస్, ఆస్ట్రేలియాలో మేజర్ షూటింగ్ ప్లాన్ చేస్తున్నాం. సింగిల్ షెడ్యూల్లో చిత్రాన్ని కంప్లీట్ చేయాలని ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం’’ అని దర్శకుడు పేర్కొన్నారు. అనుపమ తమిళంలో చేస్తున్న రెండో చిత్రం ఇది. ఇంతకుముందు ధనుష్ ద్విపాత్రాభినయం చేసిన ‘కొడి’ సినిమాలో ఆమె ఒక హీరోయిన్గా నటించారు. -
ఇంతకీ రాక్షసుడు ఎవరు?
అమాయకులను అన్యాయంగా, రాక్షసానందం కోసం చంపుతుంటాడు ఓ సైకో. అతడిని పట్టుకోవడానికి పరిగెత్తే పోలీస్. ఇంతకీ రాక్షస సైకో ఎవరు? అతడిని ఈ పోలీస్ పట్టుకున్నాడా? లేదా? తెలియాలంటే ‘రాక్షసుడు’ సినిమా చూడాలంటున్నారు చిత్రబృందం. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమా పరమేశ్వరన్ జంటగా రమేశ్ వర్మ పెన్మత్స దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘రాక్షసుడు’. ఎ హవీష్ లక్ష్మణ్ కోనేరు ప్రొడక్షన్ బ్యానర్‌పై కోనేరు సత్యనారాయణ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం టీజర్ శనివారం రిలీజ్ అయింది. టీజర్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వస్తుందని చిత్రబృందం తెలిపింది. ఈ సందర్బంగా నిర్మాత హవీష్ మాట్లాడుతూ – ‘‘తమిళ సూపర్‌హిట్ చిత్రం ‘రాక్షసన్’ రీమేక్‌గా ఈ చిత్రం తెరకెక్కిస్తున్నాం. ఇందులో సాయి శ్రీనివాస్ సీరియస్ పోలీసాఫీసర్‌గా కనిపిస్తారు. మేకింగ్‌లో ఎక్కడా కాంప్రమైజ్ అవ్వలేదు. షూటింగ్ దాదాపు పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. జూలై 18న మా చిత్రాన్ని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం’’ అని చెప్పారు. ఈ చిత్రానికి సంగీతం: జిబ్రాన్, కెమెరా: వెంకట్ సి. దిలీప్. -
ఫిబ్రవరిలో నటసార్వభౌమ
కన్నడ సూపర్‌స్టార్ పునీత్ రాజ్‌కుమార్ హీరోగా రూపొందిన చిత్రం ‘నట సార్వభౌమ’. అనుపమా పరమేశ్వరన్, రచితారామ్ కథానాయికలుగా నటించారు. రాక్‌లైన్ వెంకటేశ్ నిర్మించారు. పవన్ వడయార్ దర్శకత్వం వహించారు. ఇటీవల షూటింగ్ పూర్తయిన ఈ సినిమా జనవరిలో విడుదల కానుందన్న వార్తలు వచ్చాయి. తాజాగా ఈ సినిమాను ఫిబ్రవరి 7న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించిందని శాండిల్‌వుడ్ సమాచారం. ఇందులో అనుపమ లాయర్ పాత్రలో కనిపించనున్నారు. అలాగే పునీత్ హీరోగా రూపొందనున్న నెక్ట్స్ చిత్రం ‘యువరత్న’. ఇందులో స్టూడెంట్ పాత్ర పోషిస్తున్నారట పునీత్. -
స్క్రీన్ టెస్ట్
సినిమా డైలాగ్ అనగానే యన్టీఆర్ నటించిన ‘దానవీర శూర కర్ణ’ చిత్రంలో ‘ఆచార్య దేవా’ ఏమంటివీ.. ఏమంటివీ ... అనే డైలాగ్ ఇప్పటికీ గుర్తొస్తుంది. 40 ఏళ్ల క్రితం విడుదలైన ఈ సినిమా మాటలు ఇప్పటికీ వినిపిస్తున్నాయంటే డైలాగ్‌కి ఉన్న పవర్ అది. 2018లో విడుదలైన చిత్రాల్లోని పలు ఫేమస్ డైలాగ్‌లు ఈ వారం క్విజ్.... 1. ‘‘ప్రతిభ ఇంటిపట్టునుంటే... ప్రపంచానికి పుట్టగతులుండవు’’ ఈ డైలాగ్ ‘మహానటి’ చిత్రంలోనిది. చిత్రంలో ఈ డైలాగ్ పలికిన నటుడెవరో తెలుసా? ఎ) మోహన్‌బాబు బి) ప్రకాశ్ రాజ్ సి) దుల్కర్ సల్మాన్ డి) నరేశ్ 2. ‘ఇట్స్ షో టైమ్’ అనే డైలాగ్‌తో హల్చల్ చేసిన ప్రముఖ హీరో ఎవరో కనుక్కోండి. ఈ డైలాగ్ ఉన్న సినిమా 2019 ఆగస్టులో విడుదలవుతుంది? ఎ) మహేశ్‌బాబు బి) వెంకటేశ్ సి) ప్రభాస్ డి) రానా 3. ‘‘వయొలెన్స్ మా డీఎన్ఏ కాదు.. మా మీద పడ్డ అత్యవసర పరిస్థితి...’ అనే డైలాగ్ చెప్పిన హీరో ఎవరో తెలుసా? (చిన్న క్లూ:ఈ డైలాగ్ రైటర్ త్రివిక్రమ్) ఎ) యన్టీఆర్ బి) బాలకృష్ణ సి) నాగార్జున డి) వెంకటేశ్ 4. ‘‘ఇంకోసారి అమ్మాయిలు, ఆంటీలు, ఫిగర్లు అని తిరిగావంటే.. యాసిడ్ పోసేస్తా’’ అనే ఫేమస్ డైలాగ్‌ను విజయ్ దేవరకొండతో చెప్పిన హీరోయిన్ ఎవరో గుర్తుపట్టండి? ఎ) ప్రియాంక జవాల్కర్ బి) మెహరీన్ సి) షాలినీ పాండే డి) రష్మికా మండన్నా 5. ‘‘క్యారెక్టర్ వదిలేయడమంటే ప్రాణాలు వదిలేయడమే, చావురాక ముందు చచ్చిపోవటమే’’ ఈ డైలాగ్ చెప్పిన ప్రముఖ హీరో ఎవరో తెలుసా? (చిన్న క్లూ: ఈ డైలాగ్‌ను రాసింది వక్కంతం వంశీ) ఎ) నాని బి) విజయ్ దేవరకొండ సి) కల్యాణ్ రామ్ డి) అల్లు అర్జున్ 6. ‘‘యూనిఫామ్‌లో ఉంటే గన్‌లో ఆరే బుల్లెట్లు, యూనిఫామ్ తీసేస్తే దీనమ్మ రాయితో చంపుతానో, రాడ్‌తో చంపుతానో నాకే తెలియదు’’ ఈ డైలాగ్ చెప్పిన ప్రముఖ హీరో ఎవరో కనుక్కోండి? (ఈ చిత్రానికి విక్రమ్ సిరికొండ దర్శకుడు) ఎ) బెల్లంకొండ సాయి శ్రీనివాస్ బి) రవితేజ సి) నాగచైతన్య డి) గోపీచంద్ 7. ‘‘ఆడోళ్లు భలే కఠినాత్ములు...’ ఈ డైలాగ్‌ను ‘కృష్ణార్జున యుద్ధం’ చిత్రంలో హీరో నాని చెప్తాడు. ఈ డైలాగ్ రైటర్ ఎవరు? ఎ) వక్కంతం వంశీ బి) మేర్లపాక గాంధీ సి) పెంచల్ దాస్ డి) ఆకుల శివ 8. ‘వియ్ ఆర్ లివింగ్ ఇన్ ఏ సొసైటీ... ప్రతి ఒక్కరికీ బరువు, బాధ్యత ఉండాలి...’ అనే సోషల్ మెసేజ్ డైలాగ్ ఏ సినిమాలోనిదో కనిపెట్టండి? ఎ) నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా బి) భరత్ అనే నేను సి) టచ్ చేసి చూడు డి) కవచం 9. ‘చేపలకి కూడా కన్నీళ్లుంటాయి బాస్... నీళ్లల్లో ఉంటాం కదా కనిపించవు అంతే’ ఈ డైలాగ్‌ను హీరో నాని ‘అ!’ చిత్రంలోని చేప పాత్ర ద్వారా చెప్పారు. ఈ చిత్రంలో కృష్ణవేణి పాత్రలో నటించిన నటి ఎవరో కనిపెట్టండి? ఎ) తమన్నా బి) కాజల్ అగర్వాల్ సి) నిత్యామీనన్ డి) రెజీనా 10. ‘ఛల్ మోహన్ రంగ’ చిత్రంలో హీరో నితిన్ చెప్పిన ‘‘వర్షాకాలంలో కలుసుకున్న మేము, శీతాకాలంలో ప్రేమించుకొని, వేసవికాలంలో విడిపోయాము’’ డైలాగ్ రాసిందెవరో తెలుసా?(ఈ చిత్రానికి ప్రముఖ రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ఓ నిర్మాత) ఎ) చైతన్యకృష్ణ బి) సత్యానంద్ సి) త్రివిక్రమ్ డి) యం.రత్నం 11. సావిత్రి జీవితం ఆధారంగా తెరకెక్కిన బయోపిక్ ‘మహానటి’. ఈ చిత్రానికి మాటల రచయిత ఎవరో తెలుసా? ఎ) కోన వెంకట్ బి) అబ్బూరి రవి సి) నాగ్ అశ్విన్ డి) బుర్రా సాయిమాధవ్ 12. ‘‘సల్మాన్‌ఖాన్ జిందాబాద్, షారుక్æఖాన్ జిందాబాద్, ఆమిర్ ఖాన్ జిందాబాద్, అబ్దుల్ కలాం జిందాబాద్, ఇన్సాన్ జిందాబాద్, మొహబ్బత్ జిందాబాద్, మేరీ మెహబూబా జిందాబాద్’’ ఈ డైలాగ్ ‘మెహబూబా’ చిత్రంలోనిది. ఈ డైలాగ్ చెప్పిన హీరో ఆకాష్ పూరి. డైలాగ్ రైటర్ ఎవరో చెప్పుకోండి? ఎ) పూరి జగన్నాథ్ బి) భాస్కరభట్ల సి) కందికొండ డి) వనమాలి 13 ‘‘కాలేజీలో ఉన్న ప్రతివాడికి రాఖీ కడతా, వాడికి తప్ప... బికాజ్ ఐ లవ్ హిమ్’’ అని హీరోయిన్ రాశీ ఖన్నా ఏ హీరో గురించి అంటుందో కనిపెట్టండి? ఎ) వరుణ్ తేజ్ బి) సాయిధరమ్ తేజ్ సి) సందీప్ కిషన్ డి) నాగౖచైతన్య 14. ‘‘ఏయ్ లేవయ్యా లే.. ఏంటి ఫాలో చేస్తున్నావా అని హీరోయిన్ అంటే... ఆ మీకు తెలిసిపోయిందా. అయినా మీరు ఇలా దగ్గరికొచ్చి మాట్లాడటం ఏం బాలేదండి...’’ అని హీరో శర్వానంద్ ఏ హీరోయిన్ని ఉద్దేశించి అంటాడో కనుక్కోండి? ఎ) లావణ్యా త్రిపాఠి బి) అనుపమా పరమేశ్వరన్ సి) సాయి పల్లవి డి) నిత్యామీనన్ 15. ‘‘అబద్ధాలు చెబితే అమ్మాయిలు పుడతారో లేదో తెలియదు కానీ, అబద్ధాలు చెబితే అమ్మాయిలు కచ్చితంగా పడతారు...’ ఈ డైలాగ్ చెప్పిన హీరో ఎవరో తెలుసా? ఎ) రామ్ బి) అఖిల్ సి) రాహుల్ రవీంద్రన్ డి) నవీన్ చంద్ర 16. ‘‘ఫణీంద్ర భూపతి నాయుడు.. నువ్వు భయపడాల్సింది మేకను చంపిన సింహాల గుంపును చూసి కాదు, సింహాల మందకు ఎదురు తిరిగిన మేక గురించి’’ అనే డైలాగ్ ‘రంగస్థలం’ చిత్రంలోనిది. ఫణీంద్ర నాయుడుగా నటించింది ఎవరు? ఎ) ఆది పినిశెట్టి బి) రాజీవ్ కనకాల సి) ‘జబర్దస్త్’ మహేశ్ డి) జగపతిబాబు 17. ‘‘అమ్మాయిలతో ప్రాబ్లమ్ ఇదేరా, మనం వాళ్లను చూసినా వాళ్లు మనల్ని చూసినా డిస్ట్రబ్ అయ్యేది మనమేరా’’ ఈ డైలాగ్ ‘శ్రీనివాస కల్యాణం’ చిత్రంలోనిది. డైలాగ్ రైటర్ ఎవరో తెలుసా? ఎ) ప్రసన్నకుమార్ బెజవాడ బి) విజయేంద్ర ప్రసాద్ సి) పోసాని కృష్ణమురళి డి) వేగేశ్న సతీశ్ 18. ‘‘సినిమా, సాహిత్యం బతికే ఉంటాయి. అంతే.. అని నరేశ్ అంటే, సాహిత్యం అన్నావ్ ఓకే, సినిమా...’ అని సుధీర్‌బాబు అనే డైలాగ్ ‘సమ్మోహనం’ చిత్రం లోనిది. డైలాగ్ రైటర్ ఎవరో తెలుసా? ఎ) ఇంద్రగంటి మోహనకృష్ణ బి) తనికెళ్ల భరణి సి) శ్రీనివాస్ అవసరాల డి) జనార ్ధన మహర్షి 19. ‘ఎవడు పడితే వాడు రావడానికి ఎప్పుడు పడితే అప్పుడు పోవడానికి ఇదేమైనా పశువుల దొడ్డా.. భాగమతి అడ్డా’’ అనే డైలాగ్ ‘భాగమతి ’ చిత్రంలోనిది. అనుష్క టైటిల్ రోల్ చేసిన ఈ చిత్రాన్ని నిర్మించిన నిర్మాణ సంస్థ ఏది? ఎ) గీతా ఆర్ట్స్ బి) వైజయంతీ మూవీస్ సి) యూవీ క్రియేషన్స్ డి) సురేశ్ ప్రొడక్షన్స్ 20. ‘‘నేలటిక్కెట్టుగాళ్లతో పెట్టుకుంటే నేల నాకించేస్తారు’’ అనే డైలాగ్ ‘నేలటిక్కెట్టు’ చిత్రంలో హీరో రవితేజ చెబుతారు. ఈ చిత్రదర్శకుడెవరో తెలుసా? ఎ) వీఐ ఆనంద్ బి) కల్యాణ్ కృష్ణ సి) వీవీ వినాయక్ డి) శ్రీను వైట్ల మీరు 6 సమాధానాల కంటే తక్కువ చెబితే... మీకు సినిమా అంటే ఇష్టం 10 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే ఇంట్రెస్ట్ 15 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే పిచ్చి 20 సమాధానాలూ చెప్పగలిగితే... ఇంకోసారి ఈ క్విజ్ చదవకండి! సమాధానాలు 1) బి )2) సి 3) ఎ 4) డి 5) డి 6) బి 7) బి 8) బి9) సి 10) ఎ 11) డి 12) ఎ 13) ఎ 14) సి 15) ఎ 16) డి 17) డి 18) ఎ 19) సి 20) బి నిర్వహణ: శివ మల్లాల -
ఇంతకంటే ఏం కావాలి.. చాలా హ్యాపీగా ఉంది!
‘‘దిల్’ రాజు మా కుటుంబ సభ్యుడు. కథని నమ్ముకుని ప్రయాణం చేసే అతి తక్కువ మంది నిర్మాతల్లో రాజుగారు ఒకరు. అలాంటి నిర్మాత ఎంచుకున్న దర్శకుడు త్రినాథరావు. రామ్ స్వచ్ఛత ఉన్న మనిషి. తన సినిమాలు సరదాగా ఉంటాయి. ‘హలో గురు ప్రేమకోసమే’ చిత్రంలో రామ్‌తో సెటిల్డ్‌గా చేయించారు త్రినాథరావు. ‘పిల్లా నువ్వులేని జీవితం’ సినిమాకు హర్షిత్ నా వద్ద పనిచేశాడు. తనకు మంచి భవిష్యత్ ఉంది’’ అని నిర్మాత అల్లు అరవింద్ అన్నారు. రామ్ హీరోగా, అనుపమ పరమేశ్వరన్, ప్రణీత హీరోయిన్లుగా త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘హలో గురు ప్రేమకోసమే’. ‘దిల్’ రాజు సమర్పణలో శిరీష్, లక్ష్మణ్ నిర్మించారు. సోమవారం హైదరాబాద్‌లో నిర్వహించిన ఈ చిత్రం సక్సెస్‌మీట్‌లో త్రినాథరావు నక్కిన మాట్లాడుతూ– ‘‘నేను తీసిన ‘సినిమా చూపిస్త మావ, నేను లోకల్, హలో గురు ప్రేమకోసమే’ మూడు సినిమాలు హిట్ అయ్యాయి. ఓ డైరెక్టర్‌గా ఇంతకంటే ఏం కావాలి.. చాలా హ్యాపీగా ఉంది.ఈ మధ్య కాలంలో ప్రకాశ్‌రాజ్‌గారితో చాలా ఎక్కువ రోజులు పనిచేసిన యూనిట్ మాదే. మా సినిమాని సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్’’ అన్నారు. ‘‘ఈ దసరాకి ప్రేక్షకులు ఇంత పెద్ద విజయం ఇచ్చినందుకు హ్యాపీ. చాలా మంది ఫోన్ చేసి అభినందిస్తుంటే సంతోషంగా అనిపించింది. రాజుగారు ప్యాషనేట్ ప్రొడ్యూసర్. త్రినాథ్రావుగారు చాలా ఎంటర్టైనింగ్ డైరెక్టర్’’ అన్నారు రామ్. ‘‘డైరెక్టర్‌గా, ఆర్టిస్ట్‌గా, రైటర్‌గా 34 ఏళ్లుగా ఇండస్ట్రీలో ప్రయాణం చేస్తున్నా. త్రినాథరావుని చూస్తే.. ఏ కోశానా డైరెక్టర్ లుక్‌లో కనపడడు. కానీ, సినిమాను కంఫర్ట్‌బుల్‌గా తీస్తాడు’’ అన్నారు పోసాని కృష్ణమురళి. ఈ సమావేశంలో అనుపమ పరమేశ్వరన్, ప్రణీత, రచయితలు సాయికృష్ణ, ప్రసన్న కుమార్, నిర్మాత హర్షిత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఆయన మాటలే స్ఫూర్తి
‘‘జీవితంలో మనం చాలా చూస్తుంటాం. గెలుపు, ఓటములు సహజం. అది క్రీడల్లో అయినా, రాజకీయాల్లో అయినా. మా సినిమా వాళ్ల విషయానికి వస్తే సక్సెస్, ఫెయిల్యూర్స్ వచ్చినా సినిమా తీయాలనే ప్యాషన్‌తో ఇక్కడే ఉంటూ.. సక్సెస్ గురించి ట్రావెల్ అవుతుంటారు’’ అని నిర్మాత ‘దిల్’రాజు అన్నారు. రామ్ హీరోగా, అనుపమా పరమేశ్వరన్, ప్రణీత హీరోయిన్స్‌గా త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘హలో గురు ప్రేమ కోసమే’. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై ‘దిల్’ రాజు నిర్మించిన ఈ సినిమా దసరా కానుకగా ఈనెల 18న విడుదలవుతోంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ వేడుకలో ‘దిల్’రాజు మాట్లాడుతూ– ‘‘స్రవంతి’ రవికిషోర్‌గారు 30 ఏళ్లుగా సినిమాలు తీస్తూనే ఉన్నారు. 2002 ఫిబ్రవరి 16న ‘అమృత’ సినిమాని విడుదల చేయడానికి తీసుకున్నాం. ‘తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో పెద్ద ప్రొడ్యూసర్‌గా నిన్ను చూస్తాను’ అని రవికిషోర్‌గారు అనడంతో సోప్ వేస్తున్నాడనుకున్నాను. ‘బొమ్మరిల్లు’ సక్సెస్‌మీట్‌లో ఆయన గుర్తు చేసే వరకు నాకు గుర్తుకులేదు. నాలో ఏం చూసి ఆయన ఆ మాట అన్నారో తెలియదు. ఇప్పుడు ఏ సినిమా అయినా సక్సెస్ కాకపోతే.. ‘సక్సెస్, ఫెయిల్యూర్ కామన్. మనం ముందుకెళుతుండాలి’ అని ఆయన చెప్పిన మాటలను నేను స్ఫూర్తిగా తీసుకుంటాను. ఆయనకు థ్యాంక్స్. ప్రసన్న చెప్పిన కథలోని ఓ పాయింట్‌కి నేను, రామ్, దేవిశ్రీ ప్రసాద్, ప్రకాశ్‌రాజ్‌గారు కనెక్ట్ అయ్యాం. ఇది హిలేరియస్ మూవీ.. ఓ అద్భుతమైన పాయింట్‌ని సినిమాలో చూస్తారు’’ అన్నారు. ‘‘రాజుగారి లైఫ్‌లో ప్రేమకథలు ఉన్నాయో లేదో కానీ ప్రతి సినిమాను ఎంతగానో ప్రేమించేస్తారు. త్రినాథరావుగారితో పనిచేయడం చాలా కష్టం. ఎందుకంటే ఆయన ముందు ప్రేక్షకుడు, ఆ తర్వాతే డైరెక్టర్. ప్రకాశ్‌రాజ్‌గారితో పనిచేయడం గౌరవంగా ఉంటుంది’’ అన్నారు రామ్. ‘‘104 డిగ్రీల జ్వరం ఉన్నా రామ్ అద్భుతంగా డ్యాన్స్ చేశాడు. రామ్, ప్రకాశ్‌రాజ్‌గారు పాటను చాలా చక్కగా పాడారు’’ అన్నారు త్రినాథరావు నక్కిన. ‘‘మా సినిమా పాటలను హిట్ చేసిన ప్రేక్షకులకు థ్యాంక్స్’’ అన్నారు దేవిశ్రీ ప్రసాద్. అనుపమా పరమేశ్వరన్, నిర్మాతలు శిరీష్, లక్ష్మణ్, పాటల రచయిత శ్రీమణి, నటుడు ప్రవీణ్, రచయిత ప్రసన్నకుమార్, సాయికృష్ణ పాల్గొన్నారు. -
స్క్రీన్ టెస్ట్
1. ‘తల్లా? పెళ్లామా?’ చిత్రదర్శకుడెవరో కనుక్కోండి? ఎ) బీఏ సుబ్బారావు బి) యన్టీ రామారావు సి) ఆదుర్తి సుబ్బారావు డి) కె.కామేశ్వరరావు 2. ప్రభాస్ నటించిన ‘రాఘవేంద్ర’ చిత్రంలో హీరోయిన్గా నటించింది ఎవరు? ఎ) ఆర్తీ అగర్వాల్ బి) అన్షు సి) శ్రీదేవి డి) శ్రియ 3. ‘నాలుగు స్తంభాలాట’ చిత్రానికి ప్రముఖ దర్శకులు జంధ్యాల వద్ద దర్శకత్వ శాఖలో శిష్యుడిగా చేసిన ప్రముఖ దర్శకుడెవరో కనుక్కోండి? ఎ) కోడి రామకృష్ణ బి) ఈవీవీ సత్యనారాయణ సి) రేలంగి నరసింహారావు డి) యస్వీ కృష్ణారెడ్డి 4. ‘హలో గురూ ప్రేమకోసమే’ చిత్రంలో కథానాయిక ఎవరు? (క్లూ: ఈ చిత్రంలో హీరోగా రామ్ నటిస్తున్నారు) ఎ) సాయి పల్లవి బి) నివేథా థామస్ సి) అనుపమా పరమేశ్వరన్ డి) క్యాథరిన్ 5. శింభు హీరోగా ద్విపాత్రాభినయం చేసిన చిత్రం ‘మన్మథ’. ఈ చిత్రంలో ఆయన సరసన ఓ హీరోయి¯Œ గా సింధుతులాని నటించారు. మరో కథానాయిక ఎవరో తెలుసా? ఎ) జ్యోతిక బి) నయనతార సి) త్రిష డి) హన్సిక 6. ‘బలహీనత లేని బలవంతుణ్ణి భగవంతుడు ఇంతవరకు సృష్టించలేదు..’ డైలాగ్ రాసింది హను రాఘవపూడి. ఆ డైలాగ్ చెప్పిన హీరోఎవరు? ఎ) శర్వానంద్ బి) నితిన్ సి) నాని డి) అర్జున్ 7. ఈ వారం ఇన్స్టాగ్రామ్ ఫాలోయర్స్ పరంగా 40 లక్షలకు చేరుకున్న నటి ఎవరో కనుక్కోండి? ఎ) శ్రుతీహాసన్ బి) రకుల్ ప్రీత్‌సింగ్ సి) సమంత డి) పూజా హెగ్డే 8. ‘మిణుగురులు’తో మంచి చిత్రాన్ని అందించారని పలు ప్రశంసలను దక్కించుకున్నారు ఆ చిత్రదర్శకుడు అయోధ్య కుమార్. ఆయన దర్శకత్వంలో ఇప్పుడు ‘24 కిస్సెస్’ అనే సినిమా రూపొందింది. ఈ చిత్రంలో హీరోయిన్ హె బ్బా పటేల్. హీరోఎవరో తెలుసా? ఎ) నవీన్‌చంద్ర బి) రాజ్ తరుణ్ సి) అరుణ్ అదిత్ డి) రాహుల్ రవీంద్ర 9. మణిరత్నం దర్శకత్వం వహించిన ‘తిరుడా తిరుడి’ (తెలుగులో ‘దొంగ దొంగ’) మూవీకి కథను అందించిందెవరో తెలుసా? ఎ) జేడీ చక్రవర్తి బి) ఇ. నివాస్ సి) శేఖర్ కపూర్ డి) రామ్ గోపాల్‌వర్మ 10. పదేళ్ల క్రితం నటుడు నానా పటేకర్ తనను వేధించాడంటూ వార్తల్లోకెక్కిన హీరోయిన్ ఎవరో తెలుసా? ఎ) కంగనా రనౌత్ బి) మల్లికా శెరావత్ సి) తనుశ్రీ దత్తా డి) రాధికా ఆప్టే 11. మలయాళ సినిమా ‘మన్యం పులి’లో నటించి, మెప్పించిన హీరో ఎవరో తెలుసా? ఎ) మమ్ముట్టి బి) మోహన్‌లాల్ సి) సురేశ్ గోపి డి) జయరాం 12. ‘అమ్మోరు’ చిత్రం అనగానే నటి సౌందర్య గుర్తుకు వస్తారు. ఆ చిత్రంలో అమ్మవారి పాత్రను పోషించిన నటి ఎవరో కనుక్కోండి? ఎ) వాణీ విశ్వనాథ్ బి) సుకన్య సి) రమ్యకృష్ణ డి) ప్రేమ 13 అక్టోబర్ 10న హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్, కమెడియన్ అలీల పుట్టినరోజు. అదే రోజు పుట్టినరోజు జరుపుకున్న ప్రముఖ దర్శకుడెవరో తెలుసా? ఎ) శ్రీను వైట్ల బి) యస్.యస్. రాజమౌళి సి) వీవీ వినాయక్ డి) పూరీ జగన్నాథ్ 14. ‘మనీ’ చిత్రంలో ‘నెల్లూరు పెద్దారెడ్డి’ పాత్రలో జీవించిన ప్రముఖ నటుడెవరు? ఎ) బ్రహ్మానందం బి) జయప్రకాశ్ రెడ్డి సి) తనికెళ్ల భరణి డి) శుభలేఖ సుధాకర్ 15 కళాతపస్వి కె.విశ్వనాథ్ జీవితం ఆధారంగా తెరకెక్కనున్న చిత్రం ‘విశ్వదర్శనం’. ఆ చిత్రదర్శకుడెవరో తెలుసా? ఎ) ఇంద్రగంటి మోహన కృష్ణ బి) జనార్థన మహర్షి సి) దశరథ్ డి) అవసరాల శ్రీనివాస్ 16. జగపతిబాబు హీరోగా నటించిన ఓ చిత్రానికి ఆరు నంది అవార్డులు వచ్చాయి. ఆ సినిమా పేరేంటి? ఎ) ఆహా బి) గాయం సి) ఆహ్వానం డి) శుభాకాంక్షలు 17 ‘‘తెలుసా.. మనసా.. ఇది ఏనాటి అనుబంధమో...’ ఈ పాట ‘క్రిమినల్’ చిత్రంలోనిది. ఈ చిత్ర సంగీతదర్శకుడెవరో తెలుసా? ఎ) ^è క్రవర్తి బి) యం. యం. శ్రీలేఖ సి) ఏఆర్ రెహమాన్ డి) యం.యం. కీరవాణి 18. ‘ఖలేజా’ చిత్రంలోని ‘సదాశివ సన్యాసి తాపసీ కైలాసవాసి...’ పాట రచయితెవరో తెలుసా? ఎ) సిరిÐð న్నెల బి) చంద్రబోస్ సి) సుద్ధాల అశోక్‌తేజ డి) రామజోగయ్య శాస్త్రి 19. ఈ ఫొటోలోని నటుడెవరు? ఎ) ఆమిర్ ఖాన్ బి) హృతిక్ రోషన్ సి) సల్మాన్ ఖాన్ డి) షారుక్ ఖాన్ 20. యన్టీఆర్, చిరంజీవి నటించిన ఈ స్టిల్ ఏ సినిమాలోనిదో కనుక్కోండి? ఎ) జ్వాలా బి) చట్టానికి కళ్లులేవు సి) తిరుగులేని మనిషి డి) ఎదురులేని మనిషి మీరు 6 సమాధానాల కంటే తక్కువ చెబితే... మీకు సినిమా అంటే ఇష్టం 10 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే ఇంట్రెస్ట్ 15 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే పిచ్చి 20 సమాధానాలూ చెప్పగలిగితే... ఇంకోసారి ఈ క్విజ్ చదవకండి! సమాధానాలు 1) బి 2) బి 3) బి 4) సి 5) ఎ 6) బి ్చ7) డి 8) సి 9) డి 10) సి 11) బి 12) సి 13) బి 14) ఎ 15) బి 16) బి 17) డి 18) డి 19) ఎ 20) సి నిర్వహణ: శివ మల్లాల -
హలో... పాటలొచ్చాయ్
రామ్ హీరోగా, అనుపమా పరమేశ్వరన్, ప్రణీత హీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం ‘హలో గురు ప్రేమ కోసమే’. ‘సినిమా చూపిస్త మావ, నేను లోకల్’ వంటి హిట్ చిత్రాల దర్శకుడు త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో ‘దిల్’ రాజు సమర్పణలో శిరీష్, లక్ష్మణ్ నిర్మించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ‘హలో గురు ప్రేమ కోసమే’ సినిమాలోని పాటల్ని మార్కెట్లోకి విడుదల చేశారు. ‘దిల్’ రాజు మాట్లాడుతూ– ‘‘లవ్ ఎంటర్టైనర్గా రూపొందిన చిత్రమిది. టీజర్‌కు మంచి స్పందన రావడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. రామ్, అనుపమ, ప్రణీతల కెమిస్ట్రీ ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తుంది. మా బ్యానర్లో ఎన్నో సక్సెస్ఫుల్ చిత్రాలకు సంగీతం అందించిన దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికీ సంగీతం అందించారు. పాటలకు మంచి స్పందన వస్తోంది. ఈ నెల 10న థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేస్తాం. అక్టోబర్ 13న వైజాగ్‌లో ప్రీ–రిలీజ్ ఫంక్షన్ నిర్వహిస్తున్నాం. దసరా సందర్భంగా ఈ నెల 18న సినిమా విడుదల చేస్తున్నాం’’ అన్నారు. ప్రకాశ్‌రాజ్ కీలక పాత్రలో నటించిన ఈ చిత్రానికి కెమెరా: విజయ్ కె.చక్రవర్తి. -
‘హలో గురు ప్రేమ కోసమే’ టీజర్ విడుదల
-
క్యూట్‌గా ‘హలో గురు ప్రేమ కోసమే’ టీజర్
ఎనర్జిక్ స్టార్ రామ్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం హలో గురు ప్రేమ కోసమే. రామ్‌కు జోడీగా మలయాళ బ్యూటీ అనుపమా పరమేశ్వరన్ నటిస్తున్న ఈ సినిమా టీజర్‌ను చిత్ర బృందం ఈరోజు విడుదల చేసింది. టైటిల్‌తోనే ఆసక్తి పెంచేసిన మూవీ యూనిట్ టీజర్‌తోనూ అదరగొట్టేసింది. ‘చూశావా... నీ కోసమే కాఫీ..’ అంటూ అనుపమ వాయిస్‌తో మొదలై... రామ్ సమాధానంతో టీజర్ ముగుస్తుంది. వీరిద్దరి మధ్య సంభాషణలకు తోడు.. బ్యాక్‌గ్రౌండ్‌లో దేవి శ్రీ మ్యూజిక్ వింటుంటే.. పేరుకు తగ్గట్టుగానే ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ ఫుల్ టూ రొమాంటిక్‌గా ఉండబోతుందని తెలుస్తోంది. కాగా ‘నేను లోకల్’ సినిమాతో హిట్ కొట్టిన త్రినాథ రావు దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాను దసరా కానుకగా అక్టోబర్ 18న రిలీజ్ చేస్తున్నట్లు సమాచారం. -
ప్రేమ ప్రదక్షణలు
ప్రేయసి కోసం ఓ కాలేజీ చుట్టూ ప్రేమ ప్రదక్షణలు చేస్తున్నారు హీరో రామ్. మరి... ఆయన ప్రేమ ఫలించడానికి ఈ ప్రదక్షణలు, వెయిటింగ్లు ఏ మాత్రం సాయం చేసాయన్నది సిల్వర్ స్క్రీన్‌పై తెలుస్తుంది. రామ్, అనుపమా పరమేశ్వరన్ జంటగా ‘నేను లోకల్’ ఫేమ్ నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో ‘దిల్’ రాజు నిర్మిస్తున్న సినిమా ‘హలో గురు ప్రేమకోసమే..’. ఇందులో అనుపమా పరమేశ్వరన్ ఇంజనీరింగ్ స్టూడెంట్ అనుపమ పాత్ర పోషిస్తున్నారని సమాచారం. ప్రస్తుతం సినిమాలో కీలకమైన కాలేజీ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. అలాగే కొన్ని నైట్ సీన్స్‌ను కూడా కెమెరాలో బంధిస్తున్నారు చిత్రబృందం. బావ–మరదళ్ల బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా ఉంటుందట. రామ్ మామయ్య పాత్రలో ప్రకాశ్‌రాజ్ కనిపిస్తారు. టాకీ పార్ట్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమాను ఈ ఏడాది అక్టోబర్ 18న రిలీజ్ కానుంది. -
న్యాయం కోసం!
మలయాళ బ్యూటీ అనుపమా పరమేశ్వరన్ వరుసగా తెలుగు సినిమాలు చేస్తున్నారు. ఇప్పుడు కన్నడ పరిశ్రమలోకి అడుగుపెడుతున్నారు. అక్కడ న్యాయం కోసం పోరాడుతున్నారు. అయ్యో.. ఏమంత కష్టం వచ్చిపడింది అనుకుంటున్నారా? మరేం లేదు. బాధితుల తరఫున న్యాయం కోసం పోరాడే లాయర్‌గా ఆమె ‘నటసార్వభౌమ’ అనే కన్నడ చిత్రంలో నటిస్తున్నారు. పవన్ వడయార్ దర్శకత్వంలో పునీత్ రాజ్‌కుమార్ హీరోగా ఈ చిత్రం రూపొందుతోంది. కలకత్తా, బెంగళూరులో ఈ సినిమా మేజర్ షూటింగ్‌ను ప్లాన్ చేసింది చిత్రబృందం. ఈ చిత్రంలో అనుపమ లుక్కు సంబంధించిన ఫొటోలు కొన్ని బయటకు వచ్చాయి. ఇక తెలుగులో ‘హలో గురు ప్రేమకోసమే’ సినిమాలో అనుపమ కథానాయికగా నటిస్తోన్న సంగతి తెలిసిందే. రామ్ హీరోగా నక్కిన త్రినా«థరావు దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమా దసరా సందర్భంగా అక్టోబర్ 18న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
హృదయానికి రెక్కలొచ్చె
హీరో రామ్ మనసు గాలిలో తేలిపోతోంది. ఆయన ప్రేమలో పడటమే ఇందుకు కారణం. మరి.. సక్సెస్ కావడానికి ఆ ప్రేమకథ ఎన్ని మలుపులు తిరిగిందో వెండితెరపై చూడాల్సిందే. రామ్ హీరోగా ‘నేను లోకల్’ ఫేమ్ నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘హలో గురు ప్రేమ కోసమే..’. ‘దిల్’ రాజు నిర్మిస్తున్నారు. ఇందులో అనుపమా పరమేశ్వరన్, ప్రణీత కథానాయికలుగా నటిస్తున్నారు. రామ్‌కు మామయ్య పాత్రలో ప్రకాశ్ రాజ్ నటిస్తున్నారని సమాచారం. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. దాదాపు 70 శాతం చిత్రీకరణ పూర్తయింది. రీసెంట్గా ‘మై హార్ట్ ఈజ్ ఫ్లైయింగ్’ అనే సాంగ్‌ను షూట్ చేశారట. ఈ సినిమాను దసరా సందర్భంగా ఈ ఏడాది అక్టోబర్ 18న విడుదల చేయాలనుకుంటున్నారు. -
దసరా కానుకగా ‘హలో గురు ప్రేమ కోసమే’
ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘హలో గురు ప్రేమ కోసమే’. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో రామ్ కు జోడిగా అనుపమా పరమేశ్వరన్ నటిస్తుండగా దేవీ శ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్నారు. నాని హీరోగా నేను లోకల్ సినిమాతో మంచి సక్సెస్ సాధించిన త్రినాథ్ రావు నక్కిన ఈ సినిమాకు దర్శకుడు . ఇప్పటికే మేజర్ పార్ట్ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా రిలీజ్ డేట్‌ను ప్రకటించారు చిత్రయూనిట్. రొమాంటిక్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాను దసరా కానుకగా అక్టోబర్ 18న రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. -
ప్రేక్షకుల ఈలలే గొప్ప కాంప్లిమెంట్స్
‘‘నా ప్రతి సినిమాలో ‘తొలిప్రేమ’ హ్యాంగోవర్ కనిపిస్తుంటుందని అంటుంటారు. ఎందుకంటే నేను కరుణాకరన్‌ని కాబట్టి. అది నా స్టైల్. జనాలకు ఏది నచ్చుతుందో అది చేయడం డైరెక్టర్ పని. ‘తొలిప్రేమ’ని ఇప్పటికీ గుర్తు చేస్తుంటే భయంగా అనిపిస్తుంటుంది. ఫస్ట్ క్లాస్‌లో స్టేట్ ఫస్ట్ వచ్చాం. ఆ నెక్ట్స్ మళ్లీ స్టేట్ ఫస్ట్ ఎందుకు రాలేదు? అని అడిగితే స్టూడెంట్స్‌కు ప్రెషర్గా ఉంటుంది. నాక్కూడా సేమ్’’ అన్నారు కరుణాకరన్. సాయిధరమ్ తేజ్, అనుపమ జంటగా కరుణాకరన్ దర్శకత్వంలో కేయస్ రామారావు నిర్మించిన ‘తేజ్ ఐ లవ్ యు’ శుక్రవారం రిలీజైంది. శనివారం కరుణాకరన్ మీడియాతో మాట్లాడారు. ► ‘సినిమా బావుంది, చాలా ఎంటర్టైనింగ్గా ఉంద’ని రిలీజైన రోజు నుంచి ఫోన్స్, మెసేజ్‌లు వస్తున్నాయి. చాలా సంతోషంగా ఉంది. ఏ సినిమాకైనా ప్రేక్షకుల ఈలలే బెస్ట్ కాంప్లిమెంట్స్. ‘తేజ్’ సినిమా ఏ హాలీవుడ్ సినిమాకు ఇన్స్పిరేషన్ కాదు. నా ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’, ‘ఎందుకంటే ప్రేమంట’, ఇప్పుడు ‘తేజ్’లో హీరోయిన్లు గతం మర్చిపోతారన్నది కావాలని రిపీట్ చేయలేదు. అది స్క్రీన్ ప్లేలో ఒక భాగం. ‘డార్లింగ్’లో ‘ఫస్ట్ హాఫ్ అబద్ధం’ అనే స్క్రీన్‌ప్లేతో నడుస్తుంది. అలా ఒక్కొక్క లవ్ స్టోరీని ఒక్కో స్టైల్లో చెప్పడానికి ప్రయత్నిస్తుంటా. ► లవ్ స్టోరీకి మ్యూజిక్ ఇంపార్టెంట్. అందుకని నా సినిమాలో హీరోలకు మ్యూజిక్ అంటే ఇంట్రెస్ట్ ఉంటుంది. సినిమా చూడటానికి ఆడియన్స్ వచ్చినప్పుడు మంచి విజువల్స్, మ్యూజిక్, రొమాన్స్ ఉంటేనే ఎంటర్టైన్ అవుతారు. ఆండ్రూ విజువల్స్ చాలా బాగా చూపించారు. గోపీ సుందర్ అద్భుతమైన సంగీతం అందించారు. నా డైరెక్షన్ డిపార్ట్మెంట్ కూడా బాగా కష్టపడ్డారు. వీళ్లంతా లేకపోతే నేను లేను. ► ఇప్పటివరకు ఆడియన్స్ నన్ను గుర్తు పెట్టుకున్నది ‘తొలిప్రేమ’ వల్లనే. ఒక స్టాండర్డ్ సెట్ చేసింది ఆ సినిమా కాబట్టి నా ప్రతి సినిమాను అదే సినిమాతో కంపేర్ చేస్తుంటారు. వణుకు వచ్చేస్తుంటుంది. నేను కూడా ‘తొలిప్రేమ’ కంటే మంచి సినిమా తీయడానికి ప్రయత్నిస్తుంటాను. నా కథకు తగ్గట్టు సాయిధరమ్ తేజ్, అనుపమ అద్భుతంగా చేశారు. ► మా ఫ్యామిలీ మొత్తం 32మంది ఉంటారు. బాబాయిలు, మావయ్యలు, ఇలా చాలా మంది ఉంటాం. మా పిన్ని కూడా నన్ను కొడుకులానే చూస్తుంటారు. అదే నా సినిమాల్లో చూపిస్తాను. నా సినిమాకు వెళ్తే అందరూ ఎంజాయ్ చేయాలి. నా లైఫ్‌లో జరిగే బెస్ట్ మూమెంట్స్‌ని నా సినిమాలో వాడేస్తాను. అందులో ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’లో ‘వద్దు సరోజా...’ ఎపిసోyŠ ఒకటి. మంచి మూమెంట్స్ అన్ని డైరీలో రాసుకొని కావాల్సినప్పుడు వాడుకుంటాను (నవ్వుతూ). నా ఫస్ట్ లవ్ స్టోరీ డిజాస్టర్. నాది అరేంజ్డ్ మ్యారేజ్. ఇప్పుడు మేమిద్దరం లవ్‌లో ఉన్నాం. ► కేయస్ రామారావుగారు లెజెండ్. ఆయనతో సెకండ్ టైమ్ వర్క్ చేయడం హ్యాపీగా ఉంది. 45 సినిమాలు చేశారు. ఎప్పటినుంచో సినిమాలు తీస్తున్నారు. కథ విని మంచి సలహాలు ఇస్తారు. నెక్ట్స్ సినిమా గురించి ఇంకా ఏం అనుకోలేదు. -
‘తేజ్ ఐ లవ్ యు’ మూవీ రివ్యూ
టైటిల్ : తేజ్ ఐ లవ్ యు జానర్ : రొమాంటిక్, ఫ్యామిలీ ఎంటర్టైనర్ తారాగణం : సాయి ధరమ్ తేజ్, అనుపమా పరమేశ్వరన్, జయ ప్రకాష్, పవిత్రా లోకేష్, అనీష్ కురివిల్లా సంగీతం : గోపి సుందర్ దర్శకత్వం : కరుణాకరన్ నిర్మాత : కేయస్ రామారావు మెగా ఫ్యామిలీ నుంచి హీరోగా ఎంట్రీ ఇచ్చిన సాయి ధరమ్ తేజ్ తనకంటూ ప్రత్యేకంగా ఫాలోయింగ్ సాధించుకునేందుకు కష్టపడుతున్నాడు. కెరీర్ స్టార్టింగ్‌లో వరుస విజయాలు అందుకున్నా.. తరువాత కెరీర్ గాడి తప్పింది. మాస్ హీరోయిజం కోసం చేసిన ప్రయత్నాలు బెడిసి కొట్టడంతో.. ఈ సారి తేజ్ ఐ లవ్ యు అంటూ రొమాంటిక్ ఎంటర్టైనర్తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. తొలిప్రేమ, డార్లింగ్ లాంటి లవ్ స్టోరిలను తెరకెక్కించిన కరుణాకరన్ దర్శకత్వంలో లవర్‌బాయ్‌గా ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. కరుణాకరన్ కెరీర్‌కు కూడా ఈ సినిమా కీలకం కావటంతో రిజల్ట్ మీద ఆసక్తి నెలకొంది. మరి తేజ్ ఐ లవ్ యు ఈ ఇద్దరి కెరీర్లకు బ్రేక్ ఇచ్చిందా..? కథ; తేజ్ (సాయి ధరమ్ తేజ్) చిన్నతనంలోనే అమ్మానాన్నకు దూరం కావటంతో పెద్దమ్మ(పవిత్రా లోకేష్) పెదనాన్న(జయ ప్రకాష్), పిన్నీ బాబాయ్‌లు గారాభంగా చూసుకుంటుంటారు. కుటుంబం అంతా ఎంతో ప్రేమగా చూసుకునే తేజ్, పదేళ్ల వయస్సులో ఓ మహిళను కాపాడే ప్రయత్నంలో హత్య చేసి జైలుకెళతాడు. (సాక్షి రివ్యూస్) ఏడేళ్ల శిక్ష తరువాత ఇంటికి తిరిగి వచ్చిన తేజ్‌ను ఆ కుటుంబం మరింత ప్రేమగా చూసుకుంటుంది. తేజ్ ప్రతీ పుట్టిన రోజును పండగలా చేస్తుంటుంది. కానీ ఓ సంఘటన మూలంగా తేజ్‌ను ఇంటి నుంచి గెంటేస్తారు. ఇంట్లో నుంచి వచ్చేసిన తేజ్ హైదరాబాద్‌లోని బాబాయ్ (పృథ్వీ) ఇంట్లో ఉంటూ మ్యూజిక్ ట్రూప్‌లో పనిచేస్తుంటాడు. అదే సమయంలో ఓ కుర్రాడి అడ్రస్ కోసం వెతుకుతూ లండన్ నుంచి ఇండియాకు వచ్చిన నందిని (అనుపమా పరమేశ్వరన్)తో తొలి చూపులోనే ప్రేమలో పడతాడు తేజ్. (సాక్షి రివ్యూస్)నందిని కూడా తేజ్‌తో ప్రేమలో పడుతుంది. కానీ తేజ్‌కు తన ప్రేమ గురించి చెప్పాలనుకున్న సమయంలో ఓ యాక్సిడెంట్లో నందిని గతం మర్చిపోతుంది. నందినికి తిరిగి గతం గుర్తుకు వచ్చిందా..? నందిని లండన్ నుంచి ఇండియాకు ఎవరి కోసం వచ్చింది..? నందిని, తేజ్‌లు ఎలా ఒక్కటయ్యారు..? అన్నదే మిగతా కథ. నటీనటులు ; ఇన్నాళ్లు మాస్ యాక్షన్ హీరో రోల్స్ లో మెప్పించిన సాయి ధరమ్ తేజ్ తొలిసారిగా రొమాంటిక్ ఎంటర్టైనర్లో నటించాడు. తనదైన ఎనర్జిటిక్ పర్ఫామెన్స్, కామెడీ టైమింగ్‌తో మెప్పించాడు. నటన పరంగా ఆకట్టుకున్నా లుక్స్ పరంగా ఇంకాస్త వర్క్ అవుట్ చేస్తే బాగుండేది. (సాక్షి రివ్యూస్)తెర మీద తేజ్ చాలా బొద్దుగా కనిపించాడు. అంతేకాదు గత చిత్రాల మాదిరిగానే ఈ సినిమాలో కూడా చాలా సన్నివేశాల్లో చిరంజీవి, పవన్ కల్యాణ్‌లను ఇమిట్ చేసే ప్రయత్నం చేశాడు. హీరోయిన్ నందిని పాత్రలో అనుపమా పరమేశ్వరణ్ ఒదిగిపోయింది. తనకున్న హోమ్లీ ఇమేజ్ను పక్కన పెట్టి మోడ్రన్ లుక్‌లోనూ అదరగొట్టింది. జయప్రకాష్, పవిత్రా లోకేష్‌ల నటన కంటతడిపెట్టిస్తుంది. 30 ఇయర్స్ పృథ్వీ, వైవా హర్షలు అక్కడక్కడా నవ్వించే ప్రయత్నం చేశారు. విశ్లేషణ ; కరుణాకరన్ సినిమా అంటే యూత్ ఆడియన్స్‌లో ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. తొలిప్రేమ, డార్లింగ్ లాంటి సినిమాలతో ఆకట్టుకున్న కరుణాకరన్ ఇటీవల ఆ మ్యాజిక్‌ను రిపీట్ చేయలేకపోతున్నాడు. అందుకే కాస్త గ్యాప్ తీసుకొని ఓ ఫ్యామిలీ, రొమాంటిక్ ఎంటర్టైనర్తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే మరోసారి కరుణాకరన్ ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయాడు. తన హిట్ చిత్రాల స్థాయిలో ఎమోషన్స్‌ను పండించలేకపోయాడు.(సాక్షి రివ్యూస్) చాలా చోట్ల కరుణాకరన్ గత చిత్రాల ఛాయలు కనిపించటం కూడా ఇబ్బంది పెడుతుంది. కథా పరంగా బలమైన ఎమోషన్స్ చూపించే అవకాశం ఉన్నా.. సాదాసీదా కథనంతో నడిపించేశాడు దర్శకుడు. ఫస్ట్ హాఫ్ మొత్తంలో ప్రేక్షకుడ్ని కథలో లీనం చేసే స్థాయి ఎమోషనల్ సీన్ ఒక్కటి కూడా లేకపోవటం నిరాశపరుస్తుంది. అక్కడక్కడా కామెడీ వర్క్ అవుట్ అయినా.. సినిమాను నిలబెట్టే స్థాయిలో మాత్రం లేదు. రొమాంటిక్ ఎంటర్టైనర్కు సంగీతం చాలా ఇంపార్టెంట్. కానీ మ్యూజిక్ డైరెక్టర్ గోపిసుందర్ పాటలతో పాటు నేపథ్య సంగీతంతోనూ నిరాశపరిచాడు. సినిమాటోగ్రఫి బాగుంది. ఎడిటింగ్, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. ప్లస్ పాయింట్స్ ; ఫ్యామిలీ ఎమోషన్స్ కొన్ని కామెడీ సీన్స్ హీరోయిన్ పాత్ర మైనస్ పాయింట్స్ ; సంగీతం స్క్రీన్ ప్లే సతీష్ రెడ్డి జడ్డా, ఇంటర్నెట్ డెస్క్. -
అందమైన అనుభవం
‘‘నన్ను చూసి ఇన్స్పైర్ అయ్యేవాడినని కె.ఎస్.రామారావుగారు చెప్పడం శుద్ధ అబద్ధం. ఎందుకంటే.. నేను మాంటిస్సోరి స్కూల్లో చదువుకునే రోజుల్లో రామారావుగారు కె.ఎస్.ప్రకాశ్రావుగారి వద్ద అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేసేవారు’’ అని నిర్మాత సి. అశ్వనీదత్ అన్నారు. సాయిధరమ్ తేజ్, అనుపమా పరమేశ్వరన్ జంటగా ఎ.కరుణాకరన్ దర్శకత్వంలో కె.ఎస్.రామారావు నిర్మించిన చిత్రం ‘తేజ్’. ‘ఐ లవ్ యు’ అన్నది ఉపశీర్షిక. ఈ సినిమా రేపు విడుదల కానుంది. ఈ చిత్రం గ్రాండ్ ప్రీ–రిలీజ్ వేడుకలో అశ్వనీదత్ మాట్లాడుతూ– ‘‘మా సూర్యారావు పేటలో ఆ రోజుల్లో రామారావుగారిని కలవడమంటే గ్లామర్‌గా ఫీలయ్యేవాళ్లం. ఆయన్ను చూసి గర్వపడతాం. ఇవాల్టికి కూడా ఆయన సినిమాల్లో ఉన్నంత మ్యూజిక్ మన సినిమాల్లో లేదేమో అని ఫీల్ అవుతుంటాను’’ అన్నారు. నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ– ‘‘చిరంజీవిగారి సినిమాకి నేను తీసుకురాలేని ఇళయరాజాగారిని తీసుకొచ్చి సినిమాలు చేసి హిట్స్ కొట్టేసరికి రామారావుగారంటే చిన్న అసూయ ఉండేది. ఆయనతో సినిమాలు తీయడంలో పోటీ పడేవాణ్ని. ఈ మధ్య ఆయన సినిమాలు రెండు, మూడు సరిగ్గా ఆడలేదు. అంతా సవ్యంగానే ఉందా? అంటే.. ‘బాస్.. లాభమా నష్టమా? అని ఆలోచించను. నా దగ్గర ఆఖరి రూపాయి ఉన్నంత వరకు సినిమాల్లోనే పెడతాను.. సినిమాల్లోనే చనిపోతా’ అన్నారు. అది విని నా గుండె జల్లుమంది. రామారావుగారి అంతటి ప్యాషన్‌ను మళ్లీ అశ్వనీదత్గారిలోనే చూడాలి. ఇలా సినిమాలను ప్రేమిస్తున్న స్నేహితులు ఉండటం నా అదృష్టం. దశాబ్దాలు కొనసాగేంత డెడికేషన్ ఉన్న హీరో తేజు’’ అన్నారు. ‘‘నేను రేడియో పబ్లిసిటీ చేస్తున్న సమయంలో అశ్వనీదత్, అల్లు అరవింద్గారితో పరిచయం ఉంది. అంత గొప్ప నిర్మాతల స్థాయి కాకపోయినా వారితో ఈ వేదిక పంచుకునే స్థాయి రావడం నా అదృష్టం’’ అన్నారు కె.ఎస్.రామారావు. ‘‘నా కెరీర్లో ఓ ఇంపార్టెంట్ మూవీని కరుణాకరన్‌గారు డైరెక్ట్ చేస్తే కె.ఎస్.రామారావుగారు నిర్మించారు. ఇదొక బ్యూటీఫుల్ ఎక్స్పీరియన్స్’’ అన్నారు సాయిధరమ్ తేజ్. ‘‘తొలిప్రేమ’ నుంచి ఈ రోజు వరకు నేను చేసిన ఈ ప్రయాణంలో నా హీరోలు, నిర్మాతలు ఎంతగానో సపోర్ట్ చేశారు. వారు లేకుంటే నేను లేను. తక్కువ సినిమాలే చేసినా పెద్ద నిర్మాతలతో చేశా. జాతీయ అవార్డు తీసుకున్నంత ఆనందంగా ఉంది’’ అన్నారు ఎ.కరుణాకరన్. -
రాసి పెట్టి ఉంటే వస్తాయి
‘‘నేను ఇప్పటి వరకూ చేసిన సినిమాల్లో ఫుల్ లెంగ్త్ రోల్ చేసింది ‘శతమానం భవతి’ చిత్రంలోనే. మిగిలిన చిత్రాల్లో సగం క్యారెక్టర్, ఇద్దరు ముగ్గురు నాయికల్లో ఓ నాయికగా నటించాను. ‘తేజ్ ఐ లవ్ యు’లో నేను ఇంతకు ముందెన్నడూ చేయని పాత్ర చేశా’’ అని అనుపమా పరమేశ్వరన్ అన్నారు. సాయిధరమ్ తేజ్, అనుపమా పరమేశ్వరన్ జంటగా కరుణాకరన్ దర్శకత్వంలో కె.యస్. రామారావు నిర్మించిన ‘తేజ్ ఐ లవ్ యు’ ఈ నెల 6న విడుదలవుతోంది. ఈ సందర్భంగా అనుపమా పరమేశ్వరన్ మాట్లాడుతూ– ‘‘ఈ సినిమాలో నా పాత్ర పేరు నందిని. రియల్ లైఫ్‌లో నేను మాటకారిని. నందిని పాత్ర కూడా మాటకారే. యుఎస్ నుంచి ఓ పర్పస్ కోసం హైదరాబాద్ వచ్చే పాత్ర. చాలా వేరియేషన్స్ ఉంటాయి. పాత్రను బట్టే నేను సినిమా ఎంచుకుంటా. కరుణాకరన్‌గారు హీరోయిన్లను చూపించే విధానం, ఆయన రూపుదిద్దే పాత్రలు చాలా ఇష్టం. సాంగ్స్ తీసేటప్పుడు తేజ్ ఫస్ట్ టేక్‌లోనే స్టెప్పులు చేసేసేవారు. నేను మాత్రం రిహార్సల్స్ చేసి చేసేదాన్ని. నేను తెలుగు నేర్చుకోవడానికి కారణం త్రివిక్రమ్‌గారు. ‘అఆ’ షూటింగ్లో నాకు ట్రాన్స్‌లేట్ చేసేవారు. రెండో సినిమాకు తెలుగు నేర్చుకోవాలని అప్పుడే అనిపించింది. ప్రస్తుతం కన్నడ సినిమా చేస్తున్నా. అందుకే కన్నడ నేర్చుకుంటున్నా. ‘రంగస్థలం’ సినిమా చూడగానే సుకుమార్‌గారికి ఫోన్ చేసి మాట్లాడాను. ఆ పాత్రకి సమంత 101 పర్సెంట్ యాప్ట్ అనిపించింది. మన కోసం రాసిపెట్టిన పాత్రలే మనకు వస్తాయి. ఇంకా బోల్డ్ పాత్రలు, చాలెంజింగ్ పాత్రలు చేయాలనుకుంటున్నా. మలయాళంలో మంచి సినిమా అవకాశాలు వచ్చినప్పుడు నేను తెలుగులో చాలా బిజీగా ఉండటంతో చేయలేదు’’ అన్నారు. -
పోస్టర్లో పేరులా నిర్మాత మిగిలిపోకూడదు
నిర్మాతకు ఫ్రీడమ్ లేదంటుంటారు. అసలు ఫ్రీడమే నిర్మాతది కదా. అతనికి ఫ్రీడమ్ ఇవ్వడం ఏంటి? ఓ మంచి సినిమా తీయడం కోసం కావాల్సినవన్నీ తను సమకూర్చుకోగలగాలి. తన టేస్ట్‌కి తగ్గట్టుగా సినిమా తీయించుకోవాలి’’ అని కేయస్ రామారావు అన్నారు. సాయిధరమ్ తేజ్, అనుపమా పరమేశ్వరన్ జంటగా ఎ.కరుణాకరన్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘తేజ్ ఐలవ్ యు’. క్రియేటీవ్ కమర్షియల్ బ్యానర్‌పై కేయస్ రామారావు నిర్మించిన ఈ చిత్రం ఈనెల 6న విడుదల కానుంది. ఈ సందర్భంగా కేయస్ రామారావు పలు విశేషాలు పంచుకున్నారు. ► ‘తేజ్ ఐ లవ్యూ’ మా బ్యానర్లో వస్తున్న 45వ సినిమా. ఇప్పటివరకూ మా బ్యానర్లో నిర్మించిన మంచి చిత్రాల్లో ఇది మరో మంచి చిత్రం. లవ్, ఎమోషన్స్, మంచి ఫీల్‌తో సాగే ఫ్యామిలీ ఎంటర్టైనర్. గోపీసుందర్ సంగీతం, కరుణాకరన్ టేకింగ్ స్టైల్, ఆండ్రూ అందమైన ఫొటోగ్రఫీ, సాయి ధరమ్– అనుపమ పెయిర్ మా సినిమాకు ప్లస్. ► నేను ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి దాదాపు 6 దశాబ్దాలు అవుతోంది. అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఉంటున్నప్పటి నుంచి కథలు వినడం, చదవడం అలవాటైంది. అది మా బ్యానర్లో నిర్మించిన చిత్రాల కథల సెలెక్షన్‌కి ఉపయోగపడింది. మొదట్లో సినిమాలకు రేడియోల ద్వారా పబ్లిసిటీ చేసేవాణ్ణి. అప్పట్లో అందరూ నన్ను రేడియో రామారావు, పబ్లిసిటీ రామారావు అని కూడా పిలిచేవాళ్లు. డైరెక్షన్ అంటే ఇంట్రెస్ట్ ఉంది కానీ నేను అంత క్యాపబుల్ కాదేమో అనుకుంటాను. అప్పట్లో సౌందర్యకు ఓ కథ కూడా చెప్పాను. ► నిర్మాతలు రెండు రకాలు ఉంటారు. కేవలం పోస్టర్ మీద పేరులా ఉండేవాళ్లు ఒక రకం. మంచి కంటెంట్‌తో సినిమా తీద్దాం. మన బ్యానర్ పేరు గుర్తుండిపోయేలా సినిమా తీయాలని అనుకునేవాళ్లు మరో రకం. నిర్మాతలు అనే వాళ్లు కేవలం కాంబినేషన్ సెట్ చేసేవాళ్లు కాదు. ► కొత్త నిర్మాతలు వస్తున్నారు.. వెళ్లిపోతున్నారు అనడం కరెక్ట్ కాదు. ‘రంగస్థలం’ తీసింది కొత్తవాళ్లే. ‘బాహుబలి’ తీసింది కూడా కొత్తవాళ్లే కదా. కొత్త పాత అని ఉండదు. ఎంత ఇష్టంతో నిర్మాత సినిమా తీశారన్నది ముఖ్యం. ► రచయిత యండమూరితో మళ్లీ అసోసియేట్ అవ్వడం లేదా? అని అడుగుతున్నారు. ఆయన నవలలు రాయడం తగ్గించాడు. నేను సినిమాలు తీయడం తగ్గించాను కదా (నవ్వుతూ). ► రామ్ చరణ్ ఫస్ట్ సినిమా నుంచి ఆయన నెక్ట్స్ సినిమా తీయాలనే అనుకున్నాను. ఎవ్వరైనా అనుకుంటారు. చిరంజీవిగారితో కూడా మళ్లీ ఓ సినిమా తీయాలనుంది. ఛాన్స్ ఉంటే చరణ్ కంటే ముందే చిరంజీవిగారితో సినిమా తీయాలనుంది. చిరంజీవిగారితో దాదాపు నాలుగు దశాబ్దాల పరిచయం ఉంది. ఆయనకు, నాకు మధ్యలో కొన్ని డిస్ట్రబెన్స్ వచ్చినా ఇప్పుడు దాని గురించి మాట్లాడదలుచుకోలేదు. ఆ పేజీని మేమిద్దరం ఎప్పుడో తిప్పేశాం అనుకుంటున్నాను. అప్పుడప్పుడు ఇండస్ట్రీలో డిస్ట్రబెన్సెస్ జరుగుతుంటాయి. కానీ అనవసరమైన వాటిని అవసరమైన దానికంటే ఎక్కువ చూపించకూడదని నా ఉద్దేశం. ► మా బ్యానర్లో నెక్ట్స్ క్రాంతి మాధవ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా సినిమా ఉంటుంది. ప్రస్తుతం మార్కెట్ విపరీతంగా పెరిగింది. మంచి కంటెంట్‌తో సినిమా తీయాలని దర్శకులందరిలో పోటీ వాతావరణం ఉంది. ఇది మంచి పరిణామం. -
క్లైమాక్స్‌లో లవ్
ప్రేమని గెలిపించుకునే విషయంలో లాస్ట్ స్టెప్‌లోకి వచ్చేశారట హీరో రామ్. తన ప్రేమకి ఏర్పడ్డ అడ్డంకుల్ని కష్టపడి తొలగించుకుంటున్నారట. ఇదంతా ‘హలో గురు ప్రేమ కోసమే’ సినిమా కోసమే. రామ్, అనుపమా పరమేశ్వరన్ జంటగా త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘హలో గురు ప్రేమ కోసమే’. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ‘దిల్’ రాజు నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా క్లైమాక్స్ పార్ట్‌ను కాకినాడలో చిత్రీకరిస్తున్నారు. రామ్‌పై కొన్ని కీలక సన్నివేశాలను షూట్ చేస్తున్నారు. ప్రకాశ్‌రాజ్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు. ‘హలో గురు ప్రేమ కోసమే’ సినిమాను ఈ సెప్టెంబర్‌లో విడుదల చేయడానికి ప్లాన్ చే స్తున్నారు. -
చిరంజీవితో అర నిమిషమైనా నటించాలని ఉంది
‘‘నా అభిమాన హీరో చిరంజీవి. ఆయన గొప్ప నటుడు.. చాన్స్ వస్తే చిరంజీవిగారితో అర నిమిషమైనా నటిస్తే నా జన్మ ధన్యమైనట్లే’’ అని హీరోయిన్ అనుపమా పరమేశ్వర్ అన్నారు. ప్రస్తుతం తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో బిజీగా ఉన్న అనుపమ శనివారం విజయవాడలో జరిగిన ‘తేజ్ ఐ లవ్ యూ’ చిత్రం ఆడియో సక్సెస్ మీట్లో పాల్గొన్నారు. పలు విషయాలను ‘సాక్షి’తో పంచుకున్నారు. ‘‘తేజ్ ఐలవ్ యూ’ మంచి లవ్‌స్టోరీ. ఎంటర్టైన్మెంట్ బాగుంటుంది. నేను నటించిన ‘అ..ఆ’ చిత్ర విజయోత్సవం గుంటూరులో జరిగింది. అప్పుడే విజయవాడ గురించి, ఇక్కడ ఉన్న కనకదుర్గమ్మ ఆలయం గురించి తెలుసుకున్నాను. ఈ రోజు అమ్మవారిని దర్శించుకుని ఆశీస్సులు పొందడం సంతోషంగా ఉంది. నా అభిమాన నటి నిత్యామీనన్. సావిత్రిగారు గొప్ప నటి. ఆమె గురించి ఇటీవలే ‘మహానటి’ సినిమా చూసి తెలుసుకున్నాను. ప్రస్తుతం ప్రతిభ ఉన్నవారికి అవకాశాలు బాగానే ఉన్నాయి. నా వరకూ బాగానే ఉంది. మంచి అవకాశాలు వస్తున్నాయి. రామ్ సరసన ‘హలో గురూ ప్రేమ కోసమే’ చిత్రంలో నటిస్తున్నాను. నటిగా మంచి గుర్తింపు పొందాలనేది నా ఆకాంక్ష. ముందు తెలుగు మాట్లాడటం రాక ఇబ్బందిగా ఉండేది. ప్రస్తుతం తెలుగు స్పష్టంగా మాట్లాడగలగడం హ్యాపీగా ఉంది’’ అన్నారు. -
తేజ్ ఈజ్ కమింగ్
లవ్ స్టోరీల స్పెషలిస్ట్ కరుణాకరన్ దర్శకత్వంలో సాయిధరమ్ తేజ్, అనుపమా పరమేశ్వరన్ జంటగా రూపొందిన చిత్రం ‘తేజ్’. ఐ లవ్ యు అనేది ఉపశీర్షిక. క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్‌పై కె.ఎస్ రామారావు నిర్మించారు. ఈ చిత్రం ఆడియో ఇటీవలే రిలీజ్ అయింది. ఆడియోకు వస్తున్న రెస్పాన్స్‌తో ఈ చిత్రబృందం ఆడియో సక్సెస్ మీట్‌ను ఈ శనివారం విజయవాడలో నిర్వహించనుంది. ‘‘కరుణాకరన్ స్టైలో సాగే రొమాంటిక్ ఎంటర్టైనర్ ఇది. మంచి ఫీల్‌తో సాగే లవ్ స్టోరీ. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. జూలై 6న రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నాం’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: గోపీ సుందర్, కెమెరా: ఆండ్రూ, మాటలు: ‘డార్లింగ్’ స్వామి, సహ నిర్మాత: వల్లభ. -
ఈ జన్మకు ఇది చాలదా అనిపిస్తుంటుంది
‘‘మీ (ఫ్యాన్స్) ఈలలు, చప్పట్లు, కేరింతలు ఎప్పుడు విన్నా ఇంకా వినాలనిపిస్తుంది. ఎడారిలో దాహంతో ఉన్నవాడికి నీళ్లిస్తే ఎంత ఆనందంగా ఉంటుందో నేనూ అంతటి ఆనందం అనుభవిస్తా’’ అని హీరో చిరంజీవి అన్నారు. సాయిధరమ్ తేజ్, అనుపమా పరమేశ్వరన్ జంటగా ఎ.కరుణాకరన్ దర్శకత్వంలో కేయస్ రామారావు నిర్మించిన చిత్రం ‘తేజ్ ఐ లవ్ యు’. గోపీ సుందర్ స్వరపరచిన ఈ చిత్రం పాటలను చిరంజీవి విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ– ‘‘1980వ దశకంలో చిరంజీవికి ఎక్కువ సూపర్ డూపర్ హిట్స్ ఉన్నాయన్నా, నవలా కథానాయకుడని పేరు తెచ్చుకున్నాడన్నా, ఎవరికీ లేని సూపర్ హిట్ సాంగ్స్ ఉన్నాయన్నా.. ముఖ్యంగా ఇళయరాజాగారి నుంచి వచ్చాయన్నా.. సుప్రీమ్ హీరోగా ఉన్న నా పేరుని ఈ రోజు మెగాస్టార్ అని ముద్దుగా, ఆప్యాయంగా పిలుస్తున్నారన్నా, ఆ పేరు నాకు ఎవరు ఆపాదించారన్నా వాటన్నింటికీ సమాధానం ఒక్కటే ‘క్రియేటివ్ కమర్షియల్స్’. ‘అభిలాష, ఛాలెంజ్, రాక్షసుడు, మరణ మృదంగం’.. వరుస హిట్లు వచ్చాయి. అలాంటి మంచి సినిమాలిచ్చిన నిర్మాత రామారావుగారు. ‘అభిలాష’ సమయంలో నాకు ఆయన పరిచయం. నెల్లూరులో మా అమ్మగారు యండమూరి ‘అభిలాష’ నవల చదివారు. అందులో హీరో పేరు చిరంజీవి. ‘ఆ నవల చదువుతుంటే నువ్వే గుర్తొచ్చావు, సినిమా తీస్తే బాగుంటుంది’ అన్నారు. ఆ తర్వాత కొద్ది రోజులకు రామారావుగారు ‘అభిలాష’ నవల హక్కులు తీసుకున్నా. మీరు డేట్స్ ఇస్తే సినిమా చేద్దామన్నారు. వెంటనే ఓకే చెప్పేశా. నా కెరీర్లో రామారావుగారిని మరచిపోలేను. ఇన్నేళ్ల తర్వాత ఆయనకి సభా ముఖంగా ధన్యవాదాలు చెప్పుకునే అవకాశం లభించింది. ఇండస్ట్రీ చెన్నై నుంచి హైదరాబాద్‌కి వచ్చాక కూడా ఆయన మంచి సినిమాలు తీస్తూ వచ్చారు. అలాంటి ఆయన బ్యానర్లో ‘స్టువర్టుపురం పోలీస్‌స్టేషన్’ లాంటి ఫ్లాప్ సినిమా ఇచ్చాం. ఆ సినిమా ఫ్లాప్ అయిందంటే తప్పు ఆయనది కాదు నాది. కథ నచ్చింది. డైరెక్టర్‌గా యండమూరిని పెడదామన్నారు. ఆయన డైరెక్షన్లో చేయాలనే కోరిక నాకూ ఉండటంతో సరే అన్నాను. దానికంటే ముందు యండమూరి తీసిన ‘అగ్నిప్రవేశం’ అనుకున్నంత సక్సెస్ కాలేదు. బయ్యర్స్ నుంచి ఒత్తిడి ఉండటంతో పునరాలోచనలో పడి డైరెక్టర్ని మారుద్దామన్నారు రామారావుగారు. నేను వద్దన్నాను. ఆ సినిమా నా వల్లే ఫ్లాప్ అయిందని పబ్లిక్‌గా ఒప్పుకున్నారు యండమూరిగారు. రామారావుగారి అభిరుచి మేరకు డైరెక్టర్ని మార్చుంటే ఫలితం ఎలా ఉండేదో? ఆ తర్వాత ఆయన ‘చంటి’ వంటి మంచి సినిమాలు తీస్తూ హిట్స్ అందుకున్నారు. ఈ మధ్యలో కొంచెం మా మధ్య గ్యాప్ వచ్చింది. మెగాస్టార్‌తో కానీ, వారి కుటుంబ సభ్యులతో కానీ సినిమా తీయలేకపోతున్నాననే లోటు ఆయన నాతో వ్యక్తపరిచారు. అయితే తేజూతో ఈ సినిమా తీయడం ద్వారా ఎంతో కొంత తృప్తి చెందానని ఆయన చెప్పడం హ్యాపీ. ఈ మధ్య రామ్ చరణ్ ‘డాడీ.. నేనిప్పటి వరకూ డైరెక్టర్, కథ ఏంటని చూసి ఆ తర్వాత నిర్మాత ఎవరని చూస్తా. ఎందుకో రామారావుగారితో ఓ సినిమా చేయాలనిపిస్తోంది.. కచ్చితంగా చేస్తాను’ అన్నాడు. ఈ జనరేషన్ వాళ్లు ఆయనతో సినిమా చేయాలనుకుంటున్నారంటే ఆయనేంటో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఆయన ఈ సినిమాతో మళ్లీ తన వైభవాన్ని తీసుకొస్తారు. ఈ చిత్రం పెద్ద హిట్ అవుతుందని నాకు నమ్మకం ఉంది. అందుకు కారణం కరుణాకరన్. లవ్‌స్టోరీస్ తీయడంలో అతనికి అతనే సాటి. తెలుగు మేగజైన్స్ కవర్ పేజీలోని నా ఫొటోలను కట్ చేసి, వాటిని ఆల్బమ్‌గా చేసినటువంటి పెద్ద ఫ్యాన్ కరుణాకరన్. చదువుకున్న విజ్ఞులు, సాఫ్ట్వేర్ ఇంజినీర్స్, యంగ్ డైరెక్టర్స్.. వీళ్లందరూ నన్ను ఇంతగా అభిమానిస్తున్నారంటే ఈ జన్మకు ఇది చాలదా? ఇంతకంటే ఇంకేం కావాలి అనిపిస్తుంటుంది నాకు. వీళ్లందరికీ (మెగా హీరోలు) నా నుంచి సంక్రమించింది నా ఇమేజ్ మాత్రమే కాదు కష్టపడే మనస్తత్వం. కష్టపడి పనిచేస్తున్నారా? లేదా? క్రమశిక్షణగా ఉంటున్నారా? లేదా? అన్నదే నాకు ముఖ్యం. అంతేకానీ వారి సక్సెస్, ఫెయిల్యూర్స్ అన్నవి సెకండ్రీ. తేజ్ నా గుడ్ బుక్స్‌లో ఎప్పుడూ ఉంటాడు. ఏదైనా తప్పు జరిగితే వాళ్ల అమ్మకంటే ముందు వార్న్ చేసేది నేనే. ఆ అవకాశం తేజు నాకు ఎప్పుడూ ఇవ్వలేదు. ఇవ్వడు కూడా. ‘తేజ్ ఐ లవ్ యు’ రషెస్ చూశా. కనుల పండువగా ఉంది. చక్కటి ఫ్యామిలీ, లవ్‌స్టోరీ. మిమ్మల్నందర్నీ అలరిస్తుంది. గోపీసుందర్ పాటలు చాలా బాగున్నాయి. అనుపమ మంచి నటన, భావోద్వేగాలు కనబరిచింది’’ అన్నారు. కేయస్ రామారావు మాట్లాడుతూ– ‘‘చిరంజీవిగారు ఎంత ఎదిగినా ఒదిగి ఉంటారు. అందుకే ఆయన సౌత్ ఇండియాలోనే కాదు ఇండియాలోనే మెగాస్టార్. ఆయన్ను చూసి ఇండస్ట్రీ ఇంకా ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉంది. కరుణాకరన్‌గారు నాకు కావాల్సిన సినిమా తీసిపెట్టారు’’ అన్నారు. ‘‘నాకు మామూలుగానే మాట్లాడటం రాదు. చిరంజీవి అన్నయ్య ఉన్నప్పుడు గుండె దడదడలాడుతుంది. సినిమా కల ఇచ్చింది పెద్ద అన్నయ్య చిరంజీవి. డైరెక్టర్‌గా అవకాశం ఇచ్చింది చిన్న అన్నయ్య కల్యాణ్.ఇప్పుడు తమ్ముడు తేజ్‌తో సినిమా చేశా’’ అన్నారు కరుణాకరన్.‘‘నేను నిద్ర లేవగానే మా మావయ్య చిరంజీవిగారి ముఖం (ఫొటో) చూసి గుడ్ మార్నింగ్ చెబుతా. ఆయన ఆశీర్వాదం లేకుండా నా జీవితం సాగదు’’ అన్నారు సాయిధరమ్. సహనిర్మాత వల్లభ, కెమెరామెన్ అండ్రూ.ఐ, సంగీత దర్శకుడు గోపీసుందర్, మాటల రచయిత ‘డార్లింగ్’ స్వామి, ఆదిత్య మ్యూజిక్ నిరంజన్ తదితరులు పాల్గొన్నారు. -
‘తేజ్’ ప్రీమియర్ క్రికెట్ లీగ్
సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ ప్రస్తుతం ‘తేజ్ ఐ లవ్ యూ’ సినిమాతో బిజీగా ఉన్నారు. గత కొంత కాలం నుంచి ఈ మెగా హీరో నటించిన సినిమాలు ఆశించినంత స్థాయిలో విజయం సాధించడం లేవు. మాస్ సినిమాలు తీసి ప్రేక్షకులకు బోర్ కొట్టించిన ఈ హీరో ప్రస్తుతం లవ్‌స్టోరీతో మన ముందుకు రాబోతున్నాడు. ఫీల్ గుడ్ లవ్ స్టోరీగా తెరకెక్కుతున్న ఈ మూవీ ఫస్ట్ లుక్, పోస్టర్స్‌పై పాజిటివ్ కామెంట్స్ వస్తున్నాయి. కరుణాకరన్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ మూవీని తన గత సినిమాల్లానే మంచి ప్రేమ కథా చిత్రంగా తెరకెక్కిస్తున్నాడు. సినిమా ప్రమోషన్లో భాగంగా జూన్ 2న ఆర్జే ( రెడియో జాకీ) వర్సెస్ తేజ్ ఐ లవ్ యూ టీమ్ క్రికెట్ లీగ్ ఆడబోతోంది. గెలిచిన వారి చేతుల మీదుగా ఈ మూవీలోని మొదటి సాంగ్‌ను విడుదల చేయించనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ‘అందమైన చందమామ’ అనే ఈ ఫస్ట్ సాంగ్‌ను ఎవరు రిలీజ్ చేస్తారో వేచి చూడాలి. ఈ సినిమాలో అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్గా నటిస్తోంది. A crazy movie, A crazy gang, A super crazy song launch! 🤟 TEJ Premier League 🏏🏏🏏 Our movie team vs RJ's team. Join the fun and be a part of the #TejILoveYou madddnesss... @IamSaiDharamTej @anupamahere pic.twitter.com/CFvsngfj9O — Creative Commercials (@CCMediaEnt) May 31, 2018 -
హలో గురు
వెంకటేశ్ హీరోగా వచ్చిన ‘గురు’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు రితికా సింగ్. రియల్ లైఫ్‌లో బాక్సర్ అయిన ఈ ముంబై బ్యూటీ రీల్ లైఫ్‌లోనూ బాక్సర్‌గా అలరించారు. లారెన్స్ హీరోగా వచ్చిన ‘శివలింగా’ చిత్రంతో తమిళ ప్రేక్షకులనూ ఆకట్టుకున్న రితికా తాజాగా ఓ తమిళ చిత్రంతో పాటు తెలుగు సినిమా చేస్తున్నారు. ఆది పినిశెట్టి హీరోగా హరినా«ద్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘నీవెవరో’ చిత్రంలో రితికా ఓ కథానాయిక. తాజాగా ఆమె సాయిధరమ్ తేజ్ సరసన నటించే క్రేజీ ఆఫర్ సొంతం చేసుకున్నారని అంటున్నాయి ఫిల్మ్‌నగర్ వర్గాలు. సాయిధరమ్ తేజ్ హీరోగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనుంది. ఈ చిత్రంలో ఇద్దరు కథానాయికలకు చోటుండగా ‘హలో’ ఫేమ్ కల్యాణీ ప్రియదర్శన్‌ని ఓ హీరోయిన్గా ఎంచుకున్నారు. రెండో కథానాయికగా అనుపమా పరమేశ్వరన్ తీసుకున్నారనే వార్తలొచ్చాయి. తాజాగా ఆ అవకాశం రితికా సింగ్‌కి దక్కినట్లు భోగట్టా. ఆ పాత్రకు రితికా అయితే సరిగ్గా సరిపోతారన్నది చిత్రబృందం ఆలోచనట మరి.. ఈ ముంబై బ్యూటీ గ్రీన్‌సిగ్నల్ ఇస్తారా? వెయిట్ అండ్ సీ. -
ఆడలేదు బాబాయ్
నానీ డబుల్ రోల్ చేసిన తాజా చిత్రం ‘కృష్ణార్జునయుద్ధం’. మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించారు. ఇందులో అనూపమా పరమేశ్వరన్, రుక్సా మీర్ కథానాయికలుగా నటించారు. రీసెంట్గా విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని రాబట్టలేదు. అయితే..‘‘సూపర్‌హిట్ ‘కృష్ణార్జున యుద్ధం’ సినిమాను మా డిజిటల్ కంటెంట్‌లో చూడండి’’అని ట్విటర్ ద్వారా యప్ టీవీ పేర్కొంది. దానికి నానీ స్పందిస్తూ –‘‘సినిమా సూపర్ హిట్ అవ్వలేదు బాబాయ్. ఆడలేదు కూడా. అయినా మనసుపెట్టి చేశాం. చూసేయ్యండి’’ అని అన్నారు. -
మంచి ఫీల్
‘తొలిప్రేమ, ఉల్లాసంగా ఉత్సాహంగా, డార్లింగ్’ వంటి రొమాంటిక్ చిత్రాలను అందించిన ఎ.కరుణాకరన్ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం ‘తేజ్’. ‘ఐ లవ్ యు’ అన్నది ఉపశీర్షిక. సాయిధరమ్ తేజ్, అనుపమా పరమేశ్వరన్ జంటగా క్రియేటివ్ కమర్షియల్స్ మూవీ మేకర్స్ పతాకంపై కె.ఎస్.రామారావు నిర్మిస్తున్నారు. దర్శక–నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘రొమాంటిక్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతోన్న చిత్రమిది. మంచి లవ్ ఫీల్‌తో సాగుతుంది. ప్యారిస్‌లో చిత్రీకరించిన రెండు పాటలతో సినిమా షూటింగ్ పార్ట్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్లో భాగంగా ఎడిటింగ్, డబ్బింగ్ జరుగుతోంది. జూన్ 29న సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: గోపీ సుందర్, కెమెరా: అండ్రూ.ఐ, మాటలు: ‘డార్లింగ్’ స్వామి, సహనిర్మాత: వల్లభ. -
ప్రేమ కోసమే
ఒక అబ్బాయి.. అమ్మాయి వెనకే పడుతున్నాడు. ఉదయం, సాయంత్రం తన చుట్టూనే తిరుగుతున్నాడు. తన మనసును గెలుచుకోవడమే అతని టార్గెట్. ఇదంతా ప్రేమ కోసమే అంటోంది ‘హలో గురూ ప్రేమ కోసమే..’ చిత్రబృందం. త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో రామ్, అనుపమా పరమేశ్వరన్ జంటగా రూపొందుతున్న చిత్రం ‘హలో గురూ ప్రేమ కోసమే...’. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ‘దిల్’ రాజు నిర్మిస్తున్నారు. రామ్ బర్త్‌డే (మే 15) స్పెషల్‌గా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను సోమవారం రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ‘దిల్’ రాజు మాట్లాడుతూ – ‘‘ఎనర్జిటిక్ హీరో రామ్‌ని కొత్త కోణంలో చూపించే చిత్రం ఇది. జూన్ ఫస్ట్ వీక్‌లో కాకినాడ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరపనున్నాం. ఆ తర్వాత హైదరాబాద్ షెడ్యూల్‌తో సినిమా షూటింగ్ పూర్తవుతుంది. సెప్టెంబర్‌లో రిలీజ్ ప్లాన్ చేస్తున్నాం. అవుట్‌పుట్ చాలా బాగా వస్తోంది. ఆడియన్స్‌ను తప్పకుండా అలరించేలా ఈ సినిమా ఉంటుంది’’ అన్నారు. ఈ సినిమాకు కెమెరా: విజయ్ కె. చక్రవర్తి, ఎడిటింగ్: కార్తీక శ్రీనివాస్, డైలాగ్స్: ప్రసన్న కుమార్ బెజవాడ. -
స్క్రీన్ టెస్ట్
1. 1999లో విడుదలైన ‘నీ కోసం’ సినిమాకి ఆ చిత్రసంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్‌తో కలసి పనిచేసిన ఇప్పటి ప్రఖ్యాత సంగీత దర్శకుడెవరో తెలుసా? ఎ) అనూప్ రూబెన్స్ బి) యస్‌యస్ తమన్ సి) దేవిశ్రీ ప్రసాద్ డి) మణిశర్మ 2. పూరి జగన్నాథ్ తెరకెక్కించిన ‘బిజినెస్‌మేన్’లో ‘సారొత్తారు... రొత్తా్తరు..’ పాటలో కనిపించే హీరోయిన్ ఎవరు? ఎ) తమన్నా భాటియా బి) కాజల్ అగర్వాల్ సి) దిశా పాట్నీ డి) చార్మీ కౌర్ 3. ‘ఎటో వెళ్లిపోయింది మనసు’చిత్ర దర్శకుడు గౌతమ్ మీనన్. చాలా తక్కువ సమయం ఉండటంతో అందులోని ఏడు పాటలను ఏడు రోజుల్లో రాయాలని ఒక రచయితకు చెప్పారు గౌతమ్. ఎవరా రచయిత? ఎ) అనంత శ్రీరామ్ బి) శ్రీమణి సి) ‘ సిరివెన్నెల’ సీతారామశాస్త్రి డి) వనమాలి 4. మహేశ్ బాబు, ప్రభాస్‌లను హీరోలుగా పరిచయం చేసిన దర్శకుడెవరో తెలుసా? ఎ) కె. రాఘవేంద్రరావు బి) బి. గోపాల్ సి) జయంత్.సి. పరాన్జీ డి) శ్రీను వైట్ల 5. గుంటూరు జిల్లా చిర్రావురులో పుట్టిన గొప్ప నటి ఎవరో తెలుసా? ఎ) సావిత్రి బి) జమున సి) శారద డి) వాణిశ్రీ 6. ‘క్షేమంగా వెళ్ళి లాభంగా రండి, హనుమాన్ జంక్షన్, దిల్’ సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన దర్శకుడు ఇప్పుడు టాలీవుడ్ టాప్ డైరెక్టర్లలో ఒకరు. ఆయనెవరు? ఎ) ఎస్.ఎస్. రాజమౌళి బి) సుకుమార్ సి) బోయపాటి శ్రీను డి) కొరటాల శివ 7. 1985వ సంవత్సరంలో ‘నవ్ జవాన్’ అనే చిత్రంలో దేవానంద్ కూతురిగా నటించిందామె. అప్పుడామెకు 14 ఏళ్లు. ఆ తర్వాత తెలుగు, తమిళ, హిందీ సినిమాల్లో చాలా బిజీగా నటించింది. 2011లో ఆమెకు కేంద్ర ప్రభుత్వం ‘పద్మశ్రీ’ ఇచ్చింది. ఎవరా హీరోయిన్? ఎ) రేఖ బి) హేమమాలిని సి) టబు డి) మాధురీ దీక్షిత్ 8. భారత సినీ ప్రపంచంలో యల్.వి. ప్రసాద్ పేరు తెలియనివారుండరు. ఆయన ఇంటిపేరే తెలుగు చిత్రసీమలో నాటి తరం నుంచి నేటి తరం నటీనటులు ఉన్న మరో పేరున్న కుటుంబానికి ఉంది. ఆయన ఇంటి పేరేంటి? ఎ) దగ్గుబాటి బి) నందమూరి సి) కొణిదెల డి) అక్కినేని 9. దర్శకుడు గౌతమ్ మీనన్ తీసిన ‘సూర్య సన్నాఫ్ కృష్ణన్’కు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన తెలుగు హీరో ఎవరో తెలుసా? ఎ) సందీప్ కిషన్ బి) వరుణ్ సందేశ్ సి) సిద్ధార్థ్ డి) నాని 10. కంటిన్యూస్‌గా మూడు నాలుగు సంక్రాంతి పండగలకు సూపర్ హిట్ మూవీస్ ఇచ్చిన ఓ నిర్మాతను ‘సంక్రాంతి రాజు’ అనేవారు. ఆ నిర్మాత ఎవరో తెలుసా? ఎ) కె.యల్.యన్ రాజు బి) యం.యస్ రాజు సి) ‘దిల్’ రాజు డి) జీవీజీ రాజు 11. బెంగుళూరులోని కళాక్షేత్ర అనే నాటక సమాజం నుంచి వచ్చిన ఈయన ప్రముఖ నటుడు. నెలకు 300 రూపాయల జీతంతో స్టేజి నాటకాలాడేవారు. తర్వాత దాదాపు 2000 వీధి నాటకాల్లో నటించారు. ఎవరా నటుడు కనుక్కోండి? ఎ) ప్రకాశ్ రాజ్ బి) జయప్రకాశ్ రెడ్డి సి) గిరీశ్ కర్నాడ్ డి) బొమన్ ఇరానీ 12. 2000వ సంవత్సరంలో బాలీవుడ్ సింగర్ ఫాల్గుని పాతక్ రూపొందించిన వీడియో ఆల్బమ్‌లో ‘మేరి చూనర్ ఉద్ ఉద్ జాయో..’ అనే పాటలో నటించిన హీరోయిన్ ఎవరో గుర్తుపట్టండి? ఎ) సిమ్రాన్ బి) త్రిష కృష్ణన్ సి) శ్రియా సరన్ డి) సదా 13. బ్యాడ్మింటన్‌లో మన దేశానికి ఎంతో గౌరవం తీసుకొచ్చిన పుల్లెల గోపీచంద్‌కు పార్టనర్‌గా ఆట ఆడిన తెలుగు హీరో ఎవరో తెలుసా? ఎ) తరుణ్ బి) ప్రిన్స్ సి) సుధీర్ బాబు డి) సుమంత్ 14. హీరో నాని ప్రస్తుతం శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో నటిస్తున్నారు.ఈ సినిమాలో ఏ హీరోతో పాటు నాని నటిస్తున్నారో తెలుసా? ఎ) వెంకటేశ్ బి) నాగార్జున సి) బాలకృష్ణ డి) చిరంజీవి 15. మొదటి సినిమాతోనే ఉత్తమ దర్శకుడిగా జాతీయ అవార్డు సాధించడంతో పాటు ఉత్తమ దర్శకుడిగా నంది అవార్డు కూడా అందుకున్న దర్శకుడెవరో తెలుసా? ఎ) నీలకంఠ బి) శేఖర్ కమ్ముల సి) దేవా కట్టా డి) ఇంద్రగంటి మోహనకృష్ణ 16. మహేశ్‌బాబు నటì ంచనున్న తర్వాతి సినిమాలో హీరోయిన్ ఎవరు? ఎ) పూజా హెగ్డే బి) కీర్తీ సురేశ్ సి) అనూ ఇమ్మాన్యుయేల్ డి) రాశీ ఖన్నా 17. నటుడు ఆది పినిశెట్టి ‘యూ టర్న్’ సినిమాలో ఓ పెద్ద హీరోయిన్ సరసన నటిస్తున్నారు. ఆ బ్యూటీ ఎవరో తెలుసా? ఎ) రకుల్ ప్రీత్ సింగ్ బి) సమంత సి) అనుపమా పరమేశ్వరన్ డి) కృతీ సనన్ 18. సందీప్ వంగా దర్శకత్వంలో వచ్చిన ‘అర్జున్ రెడ్డి’ బాలీవుడ్ రీమేక్లోనటిస్తున్న హీరో ఎవరు? ఎ) షాహిద్ కపూర్ బి) అర్జున్ కపూర్ సి) రణ్వీర్ సింగ్ డి) రణ్‌బీర్ కపూర్ 19. పై ఫొటోలో నిచిన్నారిని గుర్తుపట్టండి? ఎ) శ్రుతీహాసన్ బి) చార్మి సి) అనూ ఇమ్మాన్యుయేల్ డి) అనుపమా పరమేశ్వరన్ 20. నాగార్జున, అమల నటించిన ఈ స్టిల్ ఏ సినిమాలోనిదో కనుక్కోండి? ఎ) అంతం బి) శివ సి) వారసుడు డి) కిల్లర్ మీరు 6 సమాధానాల కంటే తక్కువ చెబితే... మీకు సినిమా అంటే ఇష్టం 10 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే ఇంట్రెస్ట్ 15 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే పిచ్చి 20 సమాధానాలూ చెప్పగలిగితే... ఇంకోసారి ఈ క్విజ్ చదవకండి! సమాధానాలు 1) సి 2 బి 3) ఎ 4) ఎ5) ఎ 6) బి 7) సి 8) డి 9) ఎ 10) బి 11) ఎ12) బి 13) సి 14) బి 15) డి 16) ఎ 17) బి 18) ఎ 19) బి 20) బి నిర్వహణ: శివ మల్లాల -
అన్ని అంశాలు ప్యాకేజ్‌తో ఉంటాయి –‘దిల్’రాజు
‘‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’ కథను మేర్లపాక గాంధీ ముందు నాకే చెప్పాడు. సింపుల్ కథ. సినిమా సూపర్‌హిట్ అయ్యింది. రెండో సినిమా ‘ఎక్స్‌ప్రెస్ రాజా’ కూడా మంచి హిట్. తన సినిమాలో క్యారెక్టర్స్, కామెడీ, మ్యూజిక్.. ఇలా అన్ని అంశాలు ప్యాకేజ్‌తో ఉంటాయి’’ అని నిర్మాత ‘దిల్’ రాజు అన్నారు. నాని హీరోగా అనుపమా పరమేశ్వరన్, రుక్సార్ మీర్ హీరోయిన్లుగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కృష్ణార్జున యుద్ధం’. వెంకట్ బోయనపల్లి సమర్పణలో షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మించిన ఈ సినిమా ఈనెల 12న విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ‘దిల్’ రాజు మాట్లాడుతూ– ‘‘కృష్ణార్జున యుద్ధం’ సినిమాను నేనే రిలీజ్ చేస్తున్నా. గాంధీ సినిమాలతో ప్రేక్షకులకు పెద్దగా ఒత్తిడి ఉండదు. ఎంజాయ్ చేస్తారు. నేను రీసెంట్గా ఈ సినిమా చూశా. నాన్‌స్టాప్ ఎంటర్టైన్మెంట్’’ అన్నారు. నాని మాట్లాడుతూ– ‘‘నా ప్రతి సినిమా విడుదల టైమ్‌లో టెన్షన్ ఉంటుంది. ఎక్కువ సినిమాలు చేస్తే టెన్షన్ అలవాటు పడిపోతుందని అనుకుంటే.. ప్రతి సినిమాకు కామన్‌గా వచ్చేస్తోంది. రెండు రోజుల ముందు సినిమా చూశాం. చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాం. ఈ సమ్మర్లో ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేసే సినిమా ‘కృష్ణార్జున యుద్ధం’’ అన్నారు. ‘‘ మా సినిమాను రాజుగారు విడుదల చేస్తుండటం హ్యాపీ’’ అన్నారు మేర్లపాక గాంధీ. వెంకట్ బోయనపల్లి, సాహు గారపాటి, హరీష్ పెద్ది పాల్గొన్నారు. -
తేజు చాలా ఎనర్జిటిక్ – కేయస్ రామారావు
‘‘చక్కటి కుటుంబ కథా చిత్రమిది. కరుణాకరన్ అద్భుతమైన కథని అంతే అద్భుతంగా తెరకెక్కిస్తున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకూ ఆయన అటూ ఇటూ తిరుగుతూ సెట్లోనే ఎక్సర్సైజ్లు చేస్తున్నారు. ఇంతమంది నటీనటులు, సాంకేతిక నిపుణులను కో–ఆర్డినేట్ చేసుకుంటూ వేగంగా షూటింగ్ పూర్తి చేస్తున్నారు’’ అని నిర్మాత కేయస్ రామారావు అన్నారు. సాయిధరమ్‌తేజ్, అనుపమా పరమేశ్వరన్ జంటగా ఎ.కరుణాకరన్ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతోంది. క్రియేటివ్ కమర్షియల్స్ పతాకంపై కేయస్ రామారావు నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. ఈ సందర్భంగా కేయస్ రామారావు మాట్లాడుతూ– ‘‘మా హీరో తేజు వింటర్లో డేట్స్ ఇవ్వమంటే సమ్మర్లో ఇచ్చారు (నవ్వుతూ). తేజు చాలా ఎనర్జిటిక్‌గా నటిస్తున్నాడు. ఈ నెల 11కి మేజర్ పార్ట్ పూర్తవుతుంది. 23, 24 తేదీల్లో విమానాశ్రయంలో షూటింగ్ జరపనున్నాం. మే మొదటి వారంలో ఫ్రాన్స్‌లో రెండు పాటలు చిత్రీకరించనున్నాం. ‘డార్లింగ్’ స్వామి చక్కటి డైలాగులు రాశాడు’’ అన్నారు. ‘‘టైటిల్ అనుకోలేదు. ఓ మంచి టైటిల్ అనుకుని త్వరలో చెబుతాం’’ అన్నారు సాయిధరమ్ తేజ్. ‘‘క్యూట్ లవ్‌స్టోరీగా తెరకెక్కుతోన్న చిత్రమిది. చక్కని ఫ్యామిలీ ఎమోషన్స్ ఉంటాయి’’ అన్నారు కరుణాకరన్. అనుపమా పరమేశ్వరన్, కెమెరామెన్ ఆండ్రూ, మాటల రచయిత ‘డార్లింగ్’ స్వామి తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: గోపీ సుందర్, సహ నిర్మాత: అలెగ్జాండర్ వల్లభ. -
యుద్ధం సిద్ధం
నింగికీ నేలకీ మధ్య ఉన్నంత తేడా ఉంది కృష్ణకీ అర్జున్ జయప్రకాశ్కి. ఒకరు పల్లెటూరి ఆకతాయి కుర్రాడు. మరొకడు రాక్‌స్టార్. అమ్మాయిలను ప్రేమలో పడేయాలని నచ్చిన వాళ్లకి లవ్ ప్రపోజ్ చేసి ఫెయిల్ అవుతుంటాడు కృష్ణ. అమ్మాయిలంటే అర్జున్‌కు ఇంట్రస్టే. కానీ సిన్సియర్‌గా లవ్ చేయడం, ఇటాలియన్ మాఫియాతో పెట్టుకోవడం ఒకటే అంటాడు. కానీ కరెక్ట్ పర్సన్ లైఫ్‌లోకి రాగానే కృష్ణ ప్రేమలో పడతాడు. మరోవైపు అర్జున్ కూడా ఒక అమ్మాయికి మనసిచ్చేస్తాడు. అంతేకాదు ఒకే లక్ష్యం కోసం ఇద్దరు అడుగులు ముందుకు పడ్డాయి. కలిసి యుద్ధం చేశారు. ఎవరిపై? ఎందుకు? ఎలా గెలిచారు? అనేది సిల్వర్ స్క్రీన్‌పై చూడాల్సిందే. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో నాని డ్యూయెల్ రోల్ చేసిన సినిమా ‘కృష్ణార్జున యుద్ధం’. అనుపమా పరమేశ్వరన్, రుక్సర్ మీర్ కథానాయికలు. షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మించిన ఈ సినిమా సెన్సార్ కంప్లీటైంది. ఏప్రిల్ 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయాలనుకుంటున్నారు. ‘‘యుద్ధం మీ అందరి కోసం సిద్ధం’’ అన్నారు నాని. ‘‘నాని నటనలో మరో కోణాన్ని ఆవిష్కరించే చిత్రమిది. కృష్ణ, అర్జున్ పాత్రల లుక్స్‌తో పాటు, మూవీ ట్రైలర్‌కు మంచి స్పందన వచ్చింది’’ అన్నారు నిర్మాతలు. ఈ చిత్రానికి సంగీతం: హిప్ హాప్ తమిళ. -
మా ఇద్దరి మధ్య పోటీ జరుగుతోంది – ‘దిల్’ రాజు
‘‘బాహుబలి’ ఫంక్షన్ తర్వాత ‘కృష్ణార్జున యుద్ధం’ సినిమా వేడుక తిరుపతిలో జరుగుతుంటే చాలా ఆనందంగా ఉంది. గాంధీ ఈ సినిమాతో హ్యాట్రిక్ డైరెక్టర్ కాబోతున్నాడు. నాకు, నానీకి పోటీ జరుగుతోంది. ఇద్దరం వరుస హిట్ల మీద ఉన్నాం. సినిమాకు కథ బాగుంటే అన్నీ బాగున్నట్టే. ఈ చిత్రాన్ని ఏపీ, తెలంగాణలో మేం విడుదల చేస్తున్నాం’’ అని నిర్మాత ‘దిల్’ రాజు అన్నారు. నాని, అనుపమా పరమేశ్వరన్, రుక్సార్ హీరో హీరోయిన్లుగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం‘కృష్ణార్జున యుద్ధం’. వెంకట్ బోయనపల్లి సమర్పణలో సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మించిన ఈ సినిమా ఈ నెల 12న విడుదల కానుంది. ఈ సందర్భంగా తిరుపతిలో ప్రీ–రిలీజ్ వేడుక నిర్వహించారు. ‘దిల్’ రాజు సినిమా ట్రైలర్‌ను, ఫస్ట్ టికెట్‌ను ఆవిష్కరించారు. మేర్లపాక గాంధీ మాట్లాడుతూ– ‘‘కథ చెప్పడం మొదలుపెట్టిన పది నిమిషాలకే నానీగారు ఓకే చెప్పేశారు. చిత్తూరు యాసను ఆయన చాలా ఈజీగా పలకడం గర్వంగా ఫీలవుతున్నా. సుబ్బలక్ష్మి, రియా పాత్రల్లో ఇద్దరు హీరోయిన్లు బాగా చేశారు. హిప్ హాప్ తమిళ మంచి సంగీతాన్నిచ్చారు’’ అన్నారు. నాని మాట్లాడుతూ– ‘‘చిన్నప్పటి నుంచి మా తాతగారి ఊరికి ఎన్నిసార్లు వెళ్లానో తెలియదు కానీ, అంతకు మూడు రెట్లు ఎక్కువ తిరుపతికి వచ్చాను. నేనే కాదు.. ప్రతి తెలుగోడు తిరుపతివాడే. గాంధీని చూస్తే సొంత సోదరునిలా అనిపించేది. ఈ మధ్య కాలంలో ఇంత ఎంజాయ్ చేసిన సినిమా ఇంకోటి లేదు. ఏదైనా మంచి పని చేయాలంటే తిరుపతికి వచ్చి దర్శనం చేసుకుని వెళ్తాం. మన ప్రీ–రిలీజ్ ఈవెంట్ ఇక్కడ మొదలైంది. ఇక తిరుగులేదు’’ అన్నారు. అనుపమా పరమేశ్వరన్, రుక్సార్, చిత్ర సంగీతదర్శకుడు హిప్ హాప్ తమిళ, తిరుపతి ప్రసాద్, ‘నిన్ను కోరి’ దర్శకుడు శివ నిర్వాణ, ప్రశాంతి, మౌర్య, ప్రభాస్ శ్రీను, ఫైట్ మాస్టర్స్ జాషువా, ఆర్.కె, డ్యాన్స్ మాస్టర్ రఘు తదితరులు పాల్గొన్నారు. -
కృష్ణ అందరికీ నచ్చుతాడు– నాని
‘‘కృష్ణ, అర్జున అనే ఇద్దరు వ్యక్తులు ఓ పరిస్థితిలో ఒక సమస్యపై చేసే పోరాటమే ‘కృష్ణార్జున యుద్ధం’. కృష్ణది పల్లెటూరి పాత్ర. అర్జున్ రాక్‌స్టార్. నాకు కృష్ణ పాత్ర ఇష్టం. చిత్తూరు యాసలో మాట్లాడే పాత్ర. కృష్ణ పాత్ర తప్పకుండా ప్రేక్షకులకు నచ్చుతుంది’’ అని నాని అన్నారు. నాని హీరోగా అనుపమా పరమేశ్వరన్, రుక్సార్ మీర్ హీరోయిన్లుగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కృష్ణార్జున యుద్ధం’. వెంకట్ బోయనపల్లి సమర్పణలో షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మించిన ఈ సినిమా ఏప్రిల్ 12న విడుదల కానుంది. హిప్ హాప్ తమిళ సంగీతం అందించిన ఈ సినిమా పాటలు డైరెక్ట్‌గా మార్కెట్లోకి విడుద.లయ్యాయి. నాని మాట్లాడుతూ –‘‘గాంధీ డైరెక్షన్ నాకు ఇష్టం. తనతో పని చేయాలనుకుంటే ఇప్పటికి కుదిరింది. మా చిత్రానికి ఏ సినిమా ఇన్స్పిరేషన్ కాదు. ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడమే లక్ష్యంగా తీశాం. హిప్ హాప్ తమిళ అందించిన పాటలు నా కెరీర్లో వన్నాఫ్ ది బెస్ట్ ఆల్బమ్ అవుతుంది’’ అన్నారు. ‘‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్, ఎక్స్‌ప్రెస్ రాజా’ చిత్రాల తర్వాత నా దర్శకత్వంలో వస్తోన్న సినిమా ‘కృష్ణార్జున యుద్ధం’. ఈ నెల 31న తిరుపతిలో ప్రీ–రిలీజ్ ఫంక్షన్ చేస్తున్నాం. నాకు మంచి అవకాశం ఇచ్చిన నానీ అన్నకు స్పెషల్ థ్యాంక్స్’’ అన్నారు మేర్లపాక గాంధీ. ‘‘పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి’’ అన్నారు నిర్మాత సాహు గారపాటి. చిత్రసమర్పకులు వెంకట్ బోయనపల్లి పాల్గొన్నారు. -
స్క్రీన్ టెస్ట్
► మహేశ్‌బాబు హీరో కాకముందు బాల నటుడిగా ఎన్ని సినిమాల్లో నటించాడో తెలుసా? ఎ) 6 బి) 5 సి) 9 డి) 4 ► హీరో రామ్ ‘దేవదాసు’ చిత్రం ద్వారా హీరోగా పరిచయమయ్యాడు. అదే సినిమా ద్వారా పరిచయమైన హీరోయిన్ ఎవరు? ఎ) కాజల్ అగర్వాల్ బి) హన్సిక సి) షీలా డి) ఇలియానా ► దర్శకుడు ఇ.వి.వి. సత్యనారాయణ తెలుగు తెరకు పరిచయం చేసిన విజయవాడ అమ్మాయి ఎవరో తెలుసా? ఎ) రంభ బి) రోజా సి) లయ డి) రవళి ► కోటా శ్రీనివాసరావు, బాబుమోహన్లది చాలా క్రేజీ కాంబినేషన్. ఏ చిత్రం ద్వారా ఈ కాంబినేషన్ ఫేమస్ అయ్యిందో తెలుసా? ఎ) మామగారు బి) చినరాయుడు సి) ఆ ఒక్కటీ అడక్కు డి) మాయలోడు ► ‘మనసుగతి ఇంతే.. మనిషి బతుకింతే.. మనసున్న మనిషికి సుఖము లేదింతే..’ పాట రచయిత ఎవరో తెలుసా? ఎ) ఆత్రేయ బి) కొసరాజు సి) దాశరథి డి) ఆరుద్ర ► టాలీవుడ్లో వీఎఫ్ఎక్స్ (గ్రాఫిక్స్) స్టూడియోను ప్రారంభించిన హీరో ఎవరో తెలుసా? ఎ) ఉదయ్‌కిరణ్ బి) కల్యాణ్రామ్సి) నితిన్ డి) మంచు విష్ణు ► ‘దిల్’ సినిమా నిర్మించటం ద్వారా వెంకటర మణారెడ్డి ‘దిల్ రాజు’ అయ్యాడు. మరి ‘దిల్’ సినిమా దర్శకుడెవరో చెప్పుకోండి? ఎ) బోయపాటి శ్రీను బి) సుకుమార్ సి) వీవీ వినాయక్ డి) వంశీ పైడిపల్లి ► శ్రీకాంత్ నటించిన ఓ సినిమాకు హీరో నాని అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశాడు. ఆ సినిమా పేరేంటి? ఎ) ఆపరేషన్ దుర్యోధన బి) రాధాగోపాళం సి) కౌసల్య సుప్రజ రామ డి) శ్రీకృష్ణ 2006 ► కార్తీ నటించిన మొదటి సినిమా ‘పరుత్తివీరన్’. అందులో నటించిన హీరోయిన్‌కి నేషనల్ అవార్డు వచ్చింది. ఎవరా హీరోయిన్? ఎ) త్రిష బి) ప్రియమణి సి) రీమాసేన్ డి) ఆండ్రియా ► ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ చిత్రంలో అల్లు అర్జున్ ఏ పాత్రను పోషిస్తున్నాడో తెలుసా? ఎ) ఆర్మీ ఆఫీసర్ బి) పైలెట్ సి) పోలీసాఫీసర్ డి) నేవల్ ఆఫీసర్ ► ‘అల్లరి’ నరేశ్ తన తర్వాతి చిత్రంలో మొదటిసారి ఓ ప్రముఖ హీరోకి సోదరుడిగా నటిస్తున్నాడు. ఎవరా హీరో కనుక్కోండి? ఎ) మహేశ్‌బాబు బి) యన్టీఆర్ సి) నాని డి) రవితేజ ► తమన్నా ట్విట్టర్ ఐడీ ఏంటో చెప్పుకోండి చూద్దాం? ఎ) ఐ తమన్నా బి) యువర్స్ తమన్నా సి) తమన్నా స్పీక్స్ డి) తమన్నాభాటియా ► విఘ్నేశ్ శివన్ అనే తమిళ దర్శకుడు తెలుగులో చాలామంది టాప్ హీరోలతోనటించిన హీరోయిన్‌తో లవ్‌లో ఉన్నాడు. ఆ మలయాళ కుట్టి ఎవరో కనుక్కోండి చూద్దాం? ఎ) మమతా మోహన్‌దాస్ బి) నివేథా థామస్ సి) నయనతార డి) అనుపమ పరమేశ్వరన్ ► ‘అర్జున్‌రెడ్డి’ తెలుగు సినిమాను తమిళ్లో ‘వర్మ’ అనే పేరుతో రీమేక్ చేస్తున్నారు. ఇందులో హీరోగా నటిస్తోన్న ధృవ్ ఓ ప్రముఖ హీరో కొడుకు. ఎవరా హీరో? ఎ) విక్రమ్ బి) అర్జున్ సజ్జా సి) కార్తీక్ డి) ప్రభు ► ప్రత్యూష ఫౌండేషన్ అనే సేవాసంస్థ ద్వారా తన సహాయ సహకారాల్ని అందిస్తున్న టాలీవుడ్ టాప్ హీరోయిన్? ఎ) అనుష్క శెట్టి బి) సమంతా అక్కినేని సి) రకుల్‌ప్రీత్ సింగ్ డి) శ్రుతీహాసన్ ► ‘వచ్చిండే పిల్లా మెల్లగ వచ్చిండే క్రీమ్ బిస్కట్ వేసిండే..’ పాట ‘ఫిదా’ చిత్రంలోనిది. ఈ పాట రచయిత ఎవరో తెలుసా? ఎ) సుద్ధా అశోక్ తేజ బి) సిరివెన్నెల సి) వనమాలి డి) కృష్ణచైతన్య ► ‘సైరా నరసింహారెడ్డి’ చిరంజీవికి 151వ చిత్రం. ఈ చిత్రకథ ఏ తెలుగు ప్రాంతానికి చెందిన కథో తెలుసా? ఎ) రాయలసీమ బి) కోనసీమ సి) తెలంగాణ డి) ఉత్తరాంద్ర ► నటి ఖుష్బూను తెలుగు చిత్రసీమకు పరిచయం చేసిన దర్శకుడెవరో తెలుసా? ఎ) ఎ.కోదండరామిరెడ్డి బి) కె.రాఘవేంద్రరావు సి) బి.గోపాల్ డి) కోడి రామకృష్ణ ► ఏఎన్నార్, వాణిశ్రీ నటించిన ఈ స్టిల్ ఏ సినిమాలోనిది? ఎ) ప్రేమనగర్బి) ప్రేమాభిషేకంసి) ప్రేమడి) ప్రేమంటే ఇదేరా ► ఈ ఫొటోలో ఉన్న బాలనటుడు, ఇప్పటి హీరో ఎవరో గుర్తుపట్టగలరా? ఎ) కమల్హాసన్బి) అల్లు అర్జున్సి) తరుణ్ 4) మహేశ్‌బాబు మీరు 6 సమాధానాల కంటే తక్కువ చెబితే... మీకు సినిమా అంటే ఇష్టం 10 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే ఇంట్రెస్ట్ 15 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే పిచ్చి 20 సమాధానాలూ చెప్పగలిగితే... ఇంకోసారి ఈ క్విజ్ చదవకండి! సమాధానాలు 1) సి 2) డి 3) ఎ 4) ఎ5) ఎ 6) డి 7) సి 8) బి 9) బి 10) ఎ 11) ఎ 12) సి 13) సి 14) ఎ 15) బి 16) ఎ 17) ఎ 18) బి 19) ఎ 20) సి -
కృష్ణ... ఊర మాస్
ఎర్ర చొక్కా.. నల్ల బనియన్.. గళ్ల లుంగీ.. మెడలో తాయత్తు.. కత్తులను తలపిస్తున్న కోరమీసాలు.. రఫ్ గడ్డం.. పదునైన చూపులు.. సంక్రాంతి సందర్భంగా ఇలా పక్కా మాస్ లుక్‌లో ప్రత్యక్షమయ్యారు నాని. ఆయన తొలిసారి ద్విపాత్రాభినయం చేస్తోన్న సినిమా ‘కృష్ణార్జున యుద్ధం’. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో వెంకట్ బోయనపల్లి సమర్పణలో సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్నారు. అనుపమా పరమేశ్వరన్, రుక్సార్ మీర్ కథానాయికలు. కృష్ణ పాత్రలో నాని ఫస్ట్ లుక్ విడుదల చేశారు. దర్శక–నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘ఈ చిత్రంలో సరికొత్త నానీని తెరపై చూడనున్నారు. ప్రస్తుతం చివరి షెడ్యూల్ చిత్రీకరణ జరుగుతోంది. హిప్ హాప్ తమిళ స్వరాలు, కార్తీక్ ఘట్టమనేని సినిమాటోగ్రఫీ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ఏప్రిల్ 12న సినిమాను విడుదల చేయాలనుకుంటున్నాం’’ అన్నారు. -
పాతబస్తీ మే సవాల్
జనరల్‌గా బస్తీ మే సవాల్ అంటుంటారు.. కానీ, నాని మాత్రం పాతబస్తీ మే సవాల్ అంటున్నారు. హైదరాబాద్ పాతబస్తీలో నాని ఎవరితో సవాల్ చేశారనేగా మీ డౌట్. ఇంకెవరితో విలన్లతో. బరిలోకి దిగి వాళ్లను రఫ్పాడించేస్తున్నారట. ఇదంతా ‘కృష్ణార్జున యుద్ధం’ సినిమా కోసమే. ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్, ఎక్స్‌ప్రెస్ రాజా’ చిత్రాల దర్శకుడు మేర్లపాక గాంధీ దర్శకత్వంలో నాని హీరోగా ఈ చిత్రం రూపొందుతోంది. ప్రస్తుతం ఈ సినిమాలోని ఓ ఫైట్‌ని పాతబస్తీలోని చార్మినార్ సమీపంలో తెరకెక్కిస్తున్నారని ఫిల్మ్‌నగర్ సమాచారం. అక్కడే నాని విలన్ల భరతం పడుతున్నారు. ఇటీవల ‘ఎంసీఏ’తో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న ఈ సక్సెస్ఫుల్ హీరో రెట్టించిన ఉత్సాహంతో ‘కృష్ణార్జున యుద్ధం’ షూటింగ్లో పాల్గొంటున్నారు. ఈ సినిమాలో తొలిసారి నాని ద్విపాత్రాభినయం చేస్తుండటం విశేషం. అనుపమ పరమేశ్వరన్, రుఖ్సార్ మీర్ కథానాయికలు. వెంకట్ బోయనపల్లి సమర్పణలో షైన్ స్క్రీన్ పతాకంపై సాహు గారపాటి, హరీష్ పెద్ది ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఏప్రిల్ 12న చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ చిత్రానికి సంగీతం: హిప్ హాప్ తమిళ, కెమెరా: కార్తీక్ ఘట్టమనేని. -
ఏప్రిల్ 12 నుంచి ‘కృష్ణార్జున యుద్ధం’
వరుస విజయాలతో దూసుకుపోతున్న యంగ్ హీరో నాని తన నెక్ట్స్ సినిమాను కూడా రిలీజ్ కు రెడీ చేసేస్తున్నాడు. ఇటీవల ఎంసీఏ సినిమాతో మరో విజయాన్ని అందుకున్న ఈ నేచురల్ స్టార్ ప్రస్తుతం వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ ఫేం మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కృష్ణార్జున యుద్ధం సినిమాలో నటిస్తున్నాడు. నాని ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ సినిమాలో అనుపమా పరమేశ్వరన్, రుక్సర్ మీర్ లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రస్తుతం చివరిదశ షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను వేసవిలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఎంసీఏ ప్రమోషన్ లో పాల్గొన్న నాని కృష్ణార్జున యుద్ధం సినిమా రిలీజ్ డేట్ ప్రకటించాడు. తన తదుపరి చిత్రం ఏప్రిల్ 12న రిలీజ్ అవుతుందని వెల్లడించాడు నాని. -
‘అందమైన జీవితం’ మూవీ స్టిల్స్
-
అభిరామ్ జిందగీ
ఎన్ని ఎత్తుపల్లాలు వచ్చినా జిందగీ మొత్తం మనతో ఉండేవాడే నిజమైన స్నేహితుడని నమ్మే యువకుడు అభిరామ్. ఓ రాక్‌బ్యాండ్‌కి లీడర్ అతను. హ్యాపీగా వెళ్తోన్న అభిరామ్ జిందగీలోకి ఇద్దరు అమ్మాయిలొస్తారు. వాళ్లలో ఎవర్ని అభిరామ్ ప్రేమించాడు? అతని జిందగీలో స్నేహితులు ఎలాంటి పాత్ర పోషించారు? అసలు అభిరామ్ కథేంటి? అనేది ఈ నెల 27న చూపిస్తామంటున్నారు దర్శకుడు కిశోర్ తిరుమల. రామ్ హీరోగా ఆయన దర్శకత్వంలో ‘స్రవంతి’ రవికిశోర్, పీఆర్ సినిమాస్ సమర్పణలో స్రవంతి సినిమాటిక్స్ పతాకంపై కృష్ణచైతన్య నిర్మించిన సినిమా ‘ఉన్నది ఒకటే జిందగీ’. అనుపమా పరమేశ్వరన్, లావణ్యా త్రిపాఠి హీరోయిన్లు. ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది. ‘స్రవంతి’ రవికిశోర్ మాట్లాడుతూ– ‘‘ఇటలీలో రామ్‌పై చిత్రీకరించిన సన్నివేశాలతో షూటింగ్ అంతా పూర్తయింది. ప్రేమ, స్నేహం నేపథ్యంలో ఈ సినిమా సాగుతుంది. త్వరలో పాటల్ని, అక్టోబర్ 27న సినిమాను విడుదల చేయాలనుకుంటున్నాం’’ అన్నారు. ‘‘అభిరామ్ అనే వ్యక్తి జిందగీలో చైల్డ్‌హుడ్, కాలేజ్ లైఫ్, కాలేజ్ తర్వాత లైఫ్ ఎలా ఉందనేది సిన్మా. అభిరామ్‌గా పాత్ర కోసం బాడీ మేకోవర్ కావడంతో పాటు సరికొత్త స్టైల్లోకి మారారు రామ్’’ అన్నారు దర్శకుడు కిశోర్ తిరుమల. శ్రీవిష్ణు, ప్రియదర్శి, కిరీటి, కౌశిక్ తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీ ప్రసాద్. -
కృష్ణుడితోనా.. అర్జునుడితోనా... యుద్ధం ఎవరితో?
ఆల్రెడీ యుద్ధం మొదలైంది! ఎవరెవరికి? కృష్ణుడికీ, అర్జునుడికీ మధ్య! ఈ యుద్ధంలోకి మలయాళ కుట్టీ అనుపమా పరమేశ్వరన్ అడుగుపెట్టారు. ఆమె కూడా యుద్ధం చేస్తున్నారు. అయితే... అనుపమది ప్రేమ యుద్ధం! అదీ ఒక్కరితోనే. కృష్ణుడితోనా... అర్జునుడితోనా... ఆమె ఎవరితో ప్రేమ యుద్ధం చేస్తున్నారనేది ఇక్కడ క్వశ్చన్! ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్, ఎక్స్‌ప్రెస్ రాజా’ సిన్మాల ఫేమ్ మేర్లపాక గాంధీ దర్శకత్వంలో నాని ద్విపాత్రాభినయం చేస్తున్న సినిమా ‘కృష్ణార్జున యుద్ధం’. ఇందులో అనుపమా పరమేశ్వరన్ ఓ హీరోయిన్. ఇటీవల యూరప్‌లోని ప్రాగ్లో మొదలైన షెడ్యూల్లో ఆమె పాల్గొంటున్నారు. ఇద్దరు నానీల్లో ఆమె ఎవరికి జోడీగా నటిస్తున్నారో మరి! సెకండ్ హీరోయిన్గా ‘ఆకతాయి’ ఫేమ్ రుక్సార్ మీర్‌ను ఎంపిక చేసినట్టు సమాచారం. వెంకట్ బోయినపల్లి సమర్పణలో షైన్ స్క్రీన్ పతాకంపై సాహు గారపాటి, హరీశ్ పెద్ది నిర్మిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: కార్తీక్ ఘట్టమనేని, సంగీతం: ‘హిప్ హాప్’ తమిళ. -
లైఫ్‌లో ఏం కావాలో తెలుసు
ఎవరికి? అభిరామ్‌కు. అతనెవరు? ఓ రాక్ బ్యాండ్‌కి లీడర్, గిటారిస్ట్. అంతేనా... లైఫ్‌లో చెప్పుకోవడానికి మరొకటి లేదా? ఉంది, అతనో అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. స్పెషల్ ఏంటంటే... ఐదుగురు స్నేహితుల అభిరామ్ గ్యాంగ్‌లో ఆమె ఒకరు. చిన్నప్పుడు, యవ్వనంలో ఉన్నప్పుడు, ఆ తర్వాత... అభిరామ్ అండ్ అమ్మాయి ప్రయాణంలో ఎన్ని మలుపులున్నాయి? వీళ్లిద్దరి ప్రేమ కథేంటి? అనేది ‘ఉన్నది ఒకటే జిందగీ’ చిత్రకథ అంటున్నారు రామ్. ‘నేను శైలజ’ ఫేమ్ కిశోర్ తిరుమల దర్శకత్వంలో ఆయన అభిరామ్‌గా నటిస్తున్న చిత్రమిది. ఆల్రెడీ ఈ సిన్మాలో రామ్ లుక్ విడుదలైంది. గుబురుగా పెంచుకున్న గడ్డం, మీసాలు, జిమ్ బాడీతో మ్యాచోగా కనిపిస్తున్నారు. ఇది కాకుండా మరో లుక్ కూడా ఉందట. త్వరలో దాన్ని విడుదల చేస్తామంటున్నారు. స్రవంతి సినిమాటిక్స్, పీఆర్ సినిమాస్ సంస్థలపై కృష్ణచైతన్య నిర్మిస్తున్న ఈ సినిమా గురించి రామ్ మాట్లాడుతూ– ‘‘లైఫ్‌లో తనకు ఏం కావాలో స్పష్టంగా తెలిసిన అభిరామ్ క్యారెక్టరైజేషన్ నాకు బాగా నచ్చింది. నన్ను నెక్ట్స్ లెవల్‌కు తీసుకెళ్లే చిత్రమిది’’ అన్నారు. లావణ్యా త్రిపాఠి, అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ స్వరకర్త. -
మంచి లవ్‌స్టోరీతో వస్తున్నాం
– నిర్మాత కేఎస్ రామారావు అభిలాష’, ‘ఛాలెంజ్’, ‘స్వర్ణకమలం’, ‘చంటి’, ‘క్రిమినల్’, ‘మాతృదేవోభవ’... ఇరవై, ముప్ఫై ఏళ్ల క్రితం వచ్చిన ఈ సినిమాలు ఇప్పటికీ ప్రేక్షకులకు గుర్తే. క్రియేటివ్ కమర్షియల్స్ పతాకంపై ఇలాంటి హిట్స్ ఎన్నో తీసిన కె.ఎస్ రామారావు నేటి తరం హీరోలు ఎన్టీఆర్‌తో ‘దమ్ము’ వంటి యాక్షన్ ఎంటర్టైనర్, శర్వానంద్‌తో ‘మళ్లీ మళ్లీ ఇది రాని రోజు’ వంటి లవ్‌స్టోరీ తీశారు. ఇప్పుడు సాయిధరమ్ తేజ్ హీరోగా ‘తొలి ప్రేమ’ ఫేమ్ ఎ. కరుణాకరన్ దర్శకత్వంలో ఓ లవ్‌స్టోరీకి శ్రీకారం చుట్టారు. కె.ఎస్. రామారావు, కె.ఎ. వల్లభ నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రారంభోత్సవం హైదరాబాద్‌లోని ఫిల్మ్‌నగర్ దైవ సన్నిధానంలో జరిగింది. కె.ఎస్. రామారావు మాట్లాడుతూ– ‘‘మా క్రియేటివ్ కమర్షియల్స్ బేనర్ స్థాపించి 35 ఏళ్లయింది. ఇది మాకు 45వ సినిమా. కరుణాకరన్ చెప్పిన కథ నచ్చి, రామారావుగారు నిర్మాత అయితే బాగుంటుందని నన్ను కలిసి, ఈ సినిమా స్టార్ట్ అయ్యేలా చేసిన తేజూ (సాయిధరమ్ తేజ్)కి థ్యాంక్స్. అందమైన సినిమాలు తీసే కరుణాకరన్‌గారితో మంచి లవ్‌స్టోరీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నందుకు ఆనందంగా ఉంది. కరుణాకరన్‌తో రైటర్ ‘డార్లింగ్’ స్వామి మంచి సినిమాలు చేశారు. గోపీసుందర్ మంచి సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రానికి మంచి టీమ్ కుదిరింది. కరుణాకరన్‌గారు ఎంతమంచి సినిమా తీద్దామనుకుంటే అంత మంచి ఏర్పాట్లు చేసేందుకు సిద్ధంగా ఉన్నాను. ఎందుకంటే దమ్మూ, ధైర్యం ఉన్న నిర్మాతను. ఈ దసరాకు షూటింగ్ స్టార్ట్ చేసి వచ్చే వేసవిలో సినిమాను విడుదల చేయాలనుకుంటున్నాం’’ అన్నారు. సాయిధరమ్ మాట్లాడుతూ– ‘‘కరుణాకరన్ నాకోసమే ఈ కథ రాశారేమో అనిపిస్తోంది. కె.ఎస్. రామారావుగారితో ఏడాదిగా చేయాలను కుంటున్న ప్రాజెక్ట్ ఇప్పటికి కుదరడం ఆనందంగా ఉంది’’ అన్నారు. ‘‘ఫ్యామిలీ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ప్యూర్ కలర్‌ఫుల్ అండ్ రొమాంటిక్ లవ్‌స్టోరీ ఇది’’ అన్నారు కరుణాకరన్. అనుపమా పరమేశ్వరన్ కథానాయికగా నటించనున్న ఈ చిత్రానికి మాటలు: ‘డార్లింగ్’ స్వామి, కెమెరా: ఆండ్రూ, ఆర్ట్: సురేశ్, ఎడిటింగ్: ఎస్.ఆర్ శేఖర్. -
నానీతో అనుపమ?
‘అ ఆ’, ‘ప్రేమమ్’లో కీలక పాత్రల్లో అలరించి, ‘శతమానం భవతి’తో కథానాయికగానూ ఆకట్టుకున్నారు . ఆచి తూచి సినిమాలు ఎంపిక చేసుకుంటోన్న ఈ మలయాళీ బ్యూటీ ప్రస్తుతం రామ్ సరసన ‘ఉన్నది ఒకటే జిందగీ’లో కథానాయికగా నటిస్తున్నారు. తాజాగా నాని సరసన ఓ చిత్రంలో నటించడానికి అంగీకరించారని టాక్. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో ‘కృష్ణార్జున యుద్ధం’ పేరుతో నాని ఓ సిన్మా చేయనున్న విషయం తెలిసిందే. ఇందులో అనుపమను హీరోయిన్గా తీసుకున్నారట. ఈ చిత్రంలో ఆమె మోడ్రన్‌గా కనిపించనున్నారని సమాచారం. చూడబోతుంటే అనుపమ నెమ్మదిగా తెలుగులో బిజీ అవుతున్నట్లనిపిస్తోంది. అసిన్, మీరా జాస్మిన్, నిత్యామీనన్, నయనతార తదితర మలయాళ కుట్టీలు తెలుగులో స్టార్ హీరోయిన్స్ కాగలిగారు. అనుపమ కూడా ఆ లిస్టులో చేరతారని ఊహించవచ్చు. -
కృష్ణార్జున యుద్ధంలో అనుపమా..!
వరుస హిట్స్‌తో మంచి ఫాంలో ఉన్న యంగ్ హీరో నాని, అదే జోరులో మరిన్ని సినిమాలకు కమిట్ అవుతున్నాడు. ప్రస్తుతం ఎమ్సీఏ (మిడిల్ క్లాస్ అబ్బాయి) షూటింగ్లో బిజీగా ఉన్న నాని, తరువాత మేర్లపాక గాంధీ దర్శకత్వంలో కృష్ణార్జున యుద్ధం సినిమాలో నటించనున్నాడు. నానీ ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ సినిమాలో మలయాళీ బ్యూటీ అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్గా నటిస్తోంది. అ..ఆ.. సినిమాతో టాలీవుడ్‌కు పరిచయం అయిన అనుపమా తరువాత ప్రేమమ్, శతమానం భవతి లాంటి హిట్ చిత్రాలతో ఆకట్టుకుంది. ప్రస్తుతం రామ్ హీరోగా తెరకెక్కుతున్న ఉన్నది ఒకటే జిందగీ సినిమాలో హీరోయిన్గా నటిస్తున్న అనుపమా ఆ సినిమా తరువాత నాని సినిమా యూనిట్‌తో జాయిన్ అవుతుంది. త్వరలో సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ సినిమాను వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్నారు. -
ట్రెండ్ మారినా ఫ్రెండ్ మారడు
...ఈ మాట అంటున్నది హీరో రామ్. అనడమే కాదు... ‘ట్రెండ్ మారినా ఫ్రెండ్ మారడు..’ అని ఓ పాట పాడుతున్నారు. స్నేహితుల దినోత్సవం సందర్భంగా ఆదివారం ఉదయం పది గంటలకు ఈ పాట విడుదల చేశారు. ‘నేను శైలజ’ తర్వాత కిశోర్ తిరుమల దర్శకత్వంలో రామ్ హీరోగా నటిస్తున్న సినిమాలోనిదీ పాట. దేవిశ్రీ ప్రసాద్ స్వరపరిచిన ఈ పాటకు చంద్రబోస్ సాహిత్యం అందించారు. అలాగే, స్నేహితుల దినోత్సవం కానుకగా టైటిల్‌నూ ప్రకటించారు. ‘స్రవంతి’ రవికిశోర్, పీఆర్ సినిమాస్ సమర్పణలో స్రవంతి సినిమాటిక్స్ పతాకంపై కృష్ణచైతన్య నిర్మిస్తున్న ఈ సినిమాకు ‘ఉన్నది ఒకటే జిందగీ’ టైటిల్‌ను ఖరారు చేశారు. చిత్రసమర్పకులు ‘స్రవంతి’ రవికిశోర్ మాట్లాడుతూ– ‘‘ఇప్పటివరకు జరిగిన చిత్రీకరణతో 50 శాతానికి పైగా సినిమా పూర్తయింది. సోమవారం ఊటీలో కొత్త షెడ్యూల్ మొదలవుతోంది. దాంతో ఓ పాట మినహా చిత్రీకరణ పూర్తవుతుంది. వచ్చే నెల్లో ఇటలీలో ఆ పాటను చిత్రీకరించి, దసరాకు సినిమాను విడుదల చేయాలనుకుంటున్నాం’’ అన్నారు. అనుపమా పరమేశ్వరన్, లావణ్యా త్రిపాఠి హీరోయిన్లుగా, శ్రీవిష్ణు, ‘పెళ్లి చూపులు’ ఫేమ్ ప్రియదర్శి కీలక పాత్రధారులుగా నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీప్రసాద్, కళ: ఏఎస్ ప్రకాశ్, కూర్పు: శ్రీకర్ ప్రసాద్, కెమెరా: సమీర్‌రెడ్డి. -
మళ్లీ కాలేజీ...క్లాసులు!?
బుద్ధిగా చదువుకుందామని కొందరు, బుట్టలో అమ్మాయిని పడేయొచ్చని కొందరు కాలేజీకి వెళ్తుంటారు. మరి, రామ్ ఎందుకు కాలేజీకి వెళ్తున్నాడనేది సస్పెన్స్! హీరోగా మంచి స్థాయిలో ఉన్నాడు కదా! చదువు కోసమైనా, అమ్మాయి కోసమైనా... మళ్లీ కాలేజీ, క్లాసులు ఎందుకు? అనుకోవద్దు! ఓ సినిమా కోసమే అతను కాలేజీకి వెళ్తున్నాడు. రామ్ హీరోగా ‘నేను శైలజ’ ఫేమ్ కిశోర్ తిరుమల దర్శకత్వంలో స్రవంతి మూవీస్, పీఆర్ సినిమాస్ సంస్థలు ఓ సినిమాను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన మూడో షెడ్యూల్లో కేజీ రెడ్డి కాలేజీ, సంజీవయ్య పార్క్, అంబేద్కర్ యూనివర్శిటీల్లో కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. ఈ నెలాఖరున విశాఖ, అరుకు లోయల్లో మరో షెడ్యూల్ ఉంటుందని చిత్రనిర్మాత ‘స్రవంతి’ రవికిశోర్ తెలిపారు. అనుపమా పరమేశ్వరన్, మేఘా ఆకాశ్ నాయికలుగా నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, సమర్పణ: కృష్ణచైతన్య. మూడు కోట్లమంది చూశారు: రామ్ హీరోగా కిశోర్ తిరుమల దర్శకత్వంలో ‘స్రవంతి’ రవికిశోర్ నిర్మించిన ‘నేను శైలజ’ సినిమా మంచి హిట్టయ్యింది. గతేడాది వచ్చిన ఈ సినిమాతో పాటు పాటలు కూడా సూపర్ హిట్టే. అందుకు ఉదాహరణ ‘క్రేజీ క్రేజీ ఫీలింగ్’ పాట. యూట్యూబ్‌లో ఇప్పటివరకు ఈ పాటను మూడు కోట్లమంది వీక్షించారు. దీనిపై చిత్రబృందం సంతోషం వ్యక్తం చేసింది. -
అనుపమా.. శారీగమా..
అమీర్‌పేటలో శుక్రవారం వీఆర్కే సిల్క్స్ షోరూంను హీరోయిన్ అనుపమా పరమేశ్వరన్ ప్రారంభించారు. కంచి పట్టు చీరలకు ప్రసిద్ధి చెందిన ఈ షోరూం ప్రారంభోత్సవం ఆద్యంతం సందడిగా సాగింది. కార్యక్రమంలో వీఆర్కే సిల్క్స్ ఎండీ రాజేంద్రకుమార్ తదితరులు పాల్గొన్నారు. -
బిజీ అవుతోన్న ప్రేమమ్ బ్యూటి
త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన అ ఆ సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయిన మలయాళీ బ్యూటి అనుపమా పరమేశ్వరన్. తొలి సినిమాతోనే నటిగా మంచి మార్కులు సాధించిన అనుపమ ఇప్పుడు వరుస అవకాశలతో బిజీ అవుతోంది. ఈ బ్యూటి తెలుగులో చేసిన రెండో సినిమా ప్రేమమ్ కూడా వరుస అవకాశాలను తెచ్చపెడుతోంది. ప్రస్తుతం అనుపమా పరమేశ్వరన్, శర్వానంద్ కు జంటగా నటించిన శతమానంభవతి ఈ సంక్రాంతి కానుకగా శనివారం విడుదలవుతోంది. దిల్ రాజు నిర్మాణంలో సతీష్ వేగ్నేష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై కూడా మంచి అంచనాలే ఉన్నాయి. ఈ సినిమా నిర్మాత దిల్ రాజు తన నెక్ట్స్ ప్రాజెక్ట్ లో కూడా ఈ ముద్దుగుమ్మకే చాన్స్ ఇచ్చాడు. నాని హీరోగా దిల్ రాజు నిర్మాణంలో వేణు శ్రీరాం దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమాలో అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించనుంది. ఈ సినిమాతో పాటు సుకుమార్, రామ్ చరణ్ ల సినిమా, ఎన్టీఆర్, బాబీల సినిమాలకు కూడా అనుపమ పేరు పరిశీలనలో ఉంది. -
పన్నెండేళ్లకు కుదిరింది - ‘దిల్ ’ రాజు
శర్వానంద్ కథానాయకుడిగా సతీష్ వేగేశ్న దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తున్న చిత్రం ‘శతమానం భవతి’. అనుపమా పరమేశ్వరన్ కథానాయిక. శనివారం ప్రారంభమైందీ చిత్రం. ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ ఫైనాన్షియర్ సత్య రంగయ్య క్లాప్ ఇవ్వగా, ఆయన మనవడు రంగా యశ్వంత్ కెమేరా స్విచాన్ చేశారు. సత్య రంగయ్య మనవడు ప్రసాద్ గౌరవ దర్శకత్వం వహించారు. ‘దిల్’ రాజు మాట్లాడుతూ - ‘‘పన్నెండేళ్ల క్రితం శర్వానంద్ హీరో కావాలనుకున్నప్పుడు దర్శకుడు తేజకు పరిచయం చేశా. ఇప్పటికి మా సంస్థలో చేయాలని రాసి పెట్టుందేమో. మూడు తరాలకు సంబంధించిన కథ ఇది. ‘శతమానం భవతి’ టైటిల్లోనే పాజిటివ్ వైబ్రేషన్ ఉంది. యూత్, ఫ్యామిలీ ఆడియన్స్‌కి నచ్చేలా స్క్రిప్ట్ సిద్ధం చేశాం. సెప్టెంబర్ 14న రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తాం. సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదల చేయాలనుకుంటున్నాం’’ అన్నారు. సతీష్ వేగేశ్న మాట్లాడుతూ - ‘‘టైటిల్ కార్డ్స్‌లో మా సినిమాలో పాత్రలన్నీ కల్పితం అని వేస్తారు. ఈ సినిమా కల్పితం కాదు, ఓ జీవితం. ‘దిల్’రాజుగారు చెప్పిన కరెక్షన్స్ వలన స్క్రిప్ట్ బాగా వచ్చింది’’ అన్నారు. ఈ చిత్రానికి కెమేరా: సమీర్‌రెడ్డి, సంగీతం: మిక్కీ జె.మేయర్. -
'అది నేనే, కానీ ఆ సినిమాలో కాదు'
మలయాళ సూపర్ హిట్ సినిమా ప్రేమమ్‌తో ఒక్కసారిగా స్టార్ ఇమేజ్ అందుకున్న హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్. ప్రస్తుతం మలయాళంతో పాటు ఇతర సౌత్ సినిమాలలో నటిస్తున్న ఈ బ్యూటీ ప్రేమమ్ తెలుగు రీమేక్‌గా రూపొందుతున్న మజ్ను సినిమాలో నాగ చైతన్యకు జోడిగా నటిస్తోంది. అయితే ఈ సినిమాను అనుపమ క్యారెక్టర్ ఎలా ఉండబోతుందో రివీల్ చేస్తూ కొన్ని ఫోటోలు నెట్లో హల్చల్ చేస్తున్నాయి. అయితే ఈ ఫోటోలపై స్పందించిన అనుపమ ఆ ఫోటోలలో ఉన్నది తానే కానీ, అది మజ్ను సినిమా షూటింగ్లో కాదంటూ క్లారిటీ ఇచ్చింది. తాను ఇంతవరకు మజ్ను షూటింగ్లో పాల్గొనలేదన్న అనుపమ, మార్చిలో తాను షూటింగ్లో పాల్గొంటున్నట్టుగా తెలిపింది. అనుపమతో పాటు శృతిహాసన్, మడోనా సెబాస్టియన్లు కూడా హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకు కార్తీకేయ ఫేం చందూ మొండేటి దర్శకుడు.