ట్రెండ్‌ మారినా ఫ్రెండ్‌ మారడు | Unnadi Okate Zindagi Movie's friendship Song Released | Sakshi
Sakshi News home page

ట్రెండ్‌ మారినా ఫ్రెండ్‌ మారడు

Published Mon, Aug 7 2017 12:05 AM | Last Updated on Sun, Sep 17 2017 5:14 PM

ట్రెండ్‌ మారినా ఫ్రెండ్‌ మారడు

ట్రెండ్‌ మారినా ఫ్రెండ్‌ మారడు

...ఈ మాట అంటున్నది హీరో రామ్‌. అనడమే కాదు... ‘ట్రెండ్‌ మారినా ఫ్రెండ్‌ మారడు..’ అని ఓ పాట పాడుతున్నారు. స్నేహితుల దినోత్సవం సందర్భంగా ఆదివారం ఉదయం పది గంటలకు ఈ పాట విడుదల చేశారు. ‘నేను శైలజ’ తర్వాత కిశోర్‌ తిరుమల దర్శకత్వంలో రామ్‌ హీరోగా నటిస్తున్న సినిమాలోనిదీ పాట.

దేవిశ్రీ ప్రసాద్‌ స్వరపరిచిన ఈ పాటకు చంద్రబోస్‌ సాహిత్యం అందించారు. అలాగే, స్నేహితుల దినోత్సవం కానుకగా టైటిల్‌నూ ప్రకటించారు. ‘స్రవంతి’ రవికిశోర్, పీఆర్‌ సినిమాస్‌ సమర్పణలో స్రవంతి సినిమాటిక్స్‌ పతాకంపై కృష్ణచైతన్య నిర్మిస్తున్న ఈ సినిమాకు ‘ఉన్నది ఒకటే జిందగీ’ టైటిల్‌ను ఖరారు చేశారు. చిత్రసమర్పకులు ‘స్రవంతి’ రవికిశోర్‌ మాట్లాడుతూ– ‘‘ఇప్పటివరకు జరిగిన చిత్రీకరణతో 50 శాతానికి పైగా సినిమా పూర్తయింది.

సోమవారం ఊటీలో కొత్త షెడ్యూల్‌ మొదలవుతోంది. దాంతో ఓ పాట మినహా చిత్రీకరణ పూర్తవుతుంది. వచ్చే నెల్లో ఇటలీలో ఆ పాటను చిత్రీకరించి, దసరాకు సినిమాను విడుదల చేయాలనుకుంటున్నాం’’ అన్నారు. అనుపమా పరమేశ్వరన్, లావణ్యా త్రిపాఠి హీరోయిన్లుగా, శ్రీవిష్ణు, ‘పెళ్లి చూపులు’ ఫేమ్‌ ప్రియదర్శి కీలక పాత్రధారులుగా నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీప్రసాద్, కళ: ఏఎస్‌ ప్రకాశ్, కూర్పు: శ్రీకర్‌ ప్రసాద్, కెమెరా: సమీర్‌రెడ్డి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement