Unnadi Okate Zindagi
-
రామ్ రికార్డ్.. 3 రోజుల్లో 3.3 కోట్ల వ్యూస్
రామ్ కథానాయకుడిగా కిశోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘ఉన్నది ఒకటే జిందగీ’. ఈ మూవీ హిందీ డబ్బింగ్ వెర్షన్ ‘నెం.1 దిల్ వాలా’ యూ ట్యూబ్ లో విడుదలైన మూడు రోజుల్లోనే 33 మిలియన్ల వ్యూస్ సాధించి రికార్డు క్రియేట్ చేసింది. గతంలో హిందీలో విడుదలైన ఏ తెలుగు సినిమాకు కూడా మూడు రోజుల్లో ఇన్ని వ్యూస్ సాధించలేదు. ఇటీవల తెలుగు సినిమాల హిందీ డబ్బింగ్ వర్షన్లు బాలీవుడ్లో సంచలనాలు నమోదు చేస్తున్నాయి. కిశోర్ తిరుమల దర్శకత్వం వహించిన ‘ఉన్నది ఒకటే జిందగీ’ స్నేహం విలువను చెప్పే అందమైన ప్రేమ కథా చిత్రం. కోరుకున్న అమ్మాయిని స్నేహితుడు ప్రేమిస్తున్నాడని తెలిసి.. వదులుకున్న అబ్బాయి కథ. స్నేహితులుగా రామ్, శ్రీ విష్ణు నటించారు. ఫ్రెండ్స్ గ్యాంగ్‌లో ప్రియదర్శి, కిరీటి దామరాజు అల్లరి మాటలు నవ్వులు పంచాయి. స్రవంతి సినిమాటిక్స్ పతాకంపై స్రవంతి రవికిశోర్, కృష్ణ చైతన్య సంయుక్తంగా నిర్మించిన చిత్రమిది. అనుపమ పరమేశ్వరన్, లావణ్య త్రిపాఠి నాయికలుగా నటించారు. ఈ చిత్రాన్ని హిందీలో గోల్డ్ మైన్స్ టెలీ ఫిల్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై మనీష్ షా విడుదల చేశారు. యూట్యూబ్‌లో పెట్టిన మూడు రోజుల్లోనే ఈ సినిమా 33 మిలియన్ల (3 కోట్ల 30 లక్షల) వ్యూస్ సాధించడం పట్ల హిందీ అనువాద హక్కులు తీసుకున్న గోల్డ్ మైన్స్ టెలీ ఫిల్మ్స్ మనీష్ షా ఆనందం వ్యక్తం చేశారు. -
‘హలో గురు ప్రేమ కోసమే’
ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘హలో గురు ప్రేమ కోసమే’. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో రామ్ కు జోడిగా అనుపమా పరమేశ్వరన్ నటిస్తోంది. నాని హీరోగా నేనులోకల్ సినిమాతో మంచి సక్సెస్ సాధించిన త్రినాథ్ రావు నక్కిన ఈ సినిమాకు దర్శకుడు . ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈ రోజు (గురువారం) ప్రారంభమైంది. రొమాటింక్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్నాడు. రామ్ హీరోగా తెరకెక్కిన ఉన్నది ఒకటే జిందగీ మంచి టాక్ సొంతం చేసుకుంది. ఈ సినిమాను రామ్ కు జోడిగా నటించిన అనుపమా పరమేశ్వరన్, తాజాగా హలో గురు ప్రేమ కోసమే సినిమాలోనూ రామ్‌తో జోడీకడుతోంది. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో యంగ్ హీరో
సీనియర్ హీరో రాజశేఖర్ హీరోగా తెరకెక్కిన పీయస్వీ గరుడవేగ సినిమాతో ఘనవిజయం సాధించిన యువ దర్శకుడు ప్రవీణ్ సత్తారు మరో సినిమాకు రెడీ అవుతున్నాడు. ఇటీవల నితిన్ హీరో ప్రవీణ్ సత్తారు సినిమా చేయబోతున్నట్టుగా వార్తలు వినిపించాయి. అయితే ఈ సినిమా విషయంలో క్లారిటీ రాకముందే ఇప్పుడు మరో యంగ్ హీరో పేరు తెర మీదకు వచ్చింది. ఉన్నది ఒకటే జిందగీ సినిమాతో ఆకట్టుకున్న రామ్ హీరోగా ప్రవీణ్ సినిమా తెరకెక్కించనున్నాడట. రామ్ ప్రస్తుతం త్రినాథ్ రావు నక్కిన దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో నటించేందుకు రెడీ అవుతున్నాడు. మార్చిలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ సినిమా పూర్తయిన వెంటనే ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో సినిమా మొదలెట్టేలా ప్లాన్ చేస్తున్నాడట రామ్. భవ్యక్రియేషన్ బ్యానర్ లో తెరకెక్కనున్న ఈ సినిమాపై త్వరలోనే అధికారిక ప్రటన వెలుడనుంది. -
మరోసారి రామ్‌కు జతగా..!
ఉన్నది ఒకటే జిందగీ సినిమాతో డీసెంట్ హిట్ అందుకున్న ఎనర్జిటిక్ స్టార్ రామ్ తదుపరి చిత్రానికి రెడీ అవుతున్నాడు. కమర్షియల్ సక్సెస్ లు సాధించటంలో ఫెయిల్ అవుతున్న రామ్, నెక్ట్స్ సినిమాతో ఆ లోటు కూడా తీర్చేసుకోవాలని భావిస్తున్నాడు. త్వరలో త్రినాథ్ రావు నక్కిన దర్శకత్వంలో రామ్ కొత్త సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన నటీనటుల ఎంపిక జరుగుతోంది. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో రామ్ సరసన హీరోయిన్గా అనుపమా పరమేశ్వరన్ ను తీసుకోవాలని భావిస్తున్నారట. ఉన్నది ఒకటే జిందగీ సినిమాలో తొలిసారిగా జతకట్టిన ఈ జోడి మరోసారి హిట్ పెయిర్‌గా ప్రూవ్ చేసుకునేందుకు రెడీ అవుతోంది. -
రామ్ కొత్త సినిమా అప్డేట్
ఉన్నది ఒకటే జిందగీ సినిమాతో మరో విజయాన్ని అందుకున్న యంగ్ హీరో రామ్, తన తదుపరి చిత్రాన్ని కొద్ది రోజుల క్రితం ప్రారంభించాడు. గత చిత్రం విజయం సాధించినా.. ఆశించిన స్థాయి ఫలితాన్ని ఇవ్వకపోవటంతో తదుపరి చిత్రం విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటుకున్నాడు. సినిమా చూపిస్త మామ, నేను లోకల్ లాంటి సక్సెస్ ఫుల్ చిత్రాలను తెరకెక్కించిన త్రినాథ్ రావు నక్కిన దర్శకత్వంలో తదుపరి చిత్రాన్ని చేస్తున్నాడు రామ్. ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మించనున్నాడు. ప్రకాజ్ రాజ్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో మెహరీన్ హీరోయిన్ గా నటించే అవకాశం ఉంది. ప్రసన్నకుమార్ కథ అందిస్తున్న ఈ సినిమా రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనుంది. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ 2018 ఫిబ్రవరిలో ప్రారంభం కానుంది. -
రామ్ కొత్త సినిమా మొదలైంది..!
ఉన్నది ఒకటే జిందగీ సినిమాతో మరో విజయాన్ని అందుకున్న యంగ్ హీరో రామ్, తన తదుపరి చిత్రాన్ని ప్రారంభించాడు. గత చిత్రం విజయం సాధించినా.. ఆశించిన స్థాయి ఫలితాన్ని ఇవ్వకపోవటంతో తదుపరి చిత్రం విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటుకున్నాడు. సినిమా చూపిస్త మామ, నేను లోకల్ లాంటి సక్సెస్ ఫుల్ చిత్రాలను తెరకెక్కించిన త్రినాథ్ రావు నక్కిన దర్శకత్వంలో తదుపరి చిత్రాన్ని చేయనున్నాడు రామ్. ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మించనున్నాడు. ప్రకాజ్ రాజ్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో మెహరీన్ హీరోయిన్ గా నటించే అవకాశం ఉంది. ప్రసన్నకుమార్ కథ అందిస్తున్న ఈ సినిమా 2018 ఫిబ్రవరి నుంచి రెగ్యులర్ షూటింగ్ కు వెళ్లనుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడించనున్నారు. Super Excited about this team.. #Ram16 is ON! #Love pic.twitter.com/Jvk9joA42C — Ram Pothineni (@ramsayz) 29 November 2017 -
అబ్బో.. అలాంటి ఆశ లేదు.. ఎందుకంటే!
సాక్షి, సినిమా : నాకు అలాంటి ఆశ లేదంటోంది నటి అనుపమ పరమేశ్వరన్. ఇంతకీ ఈ బ్యూటీ చెప్పేదేమిటనేగా మీ ప్రశ్న? మలయాళం చిత్రసీమకు ప్రేమమ్ అంటూ రంగప్రవేశం చేసిన ఈ కేరళ కుట్టి అతి కొద్ది కాలంలోనే తమిళం, తెలుగు, కన్నడ అంటూ దక్షిణాదిని కవర్ చేసేస్తోంది. ముఖ్యంగా టాలీవుడ్లో అవకాశాలలో పాటు విజయాలు వరిస్తున్నాయి. కోలీవుడ్‌కు కొడి చిత్రంతో నటుడు ధనుష్‌కు జంటగా పరిచయం అయిన అనుపమను వెంటనే టాలీవుడ్ ప్రేమమ్ రీమేక్ కోసం ఆహ్వానించింది.ఆ చిత్రం సక్సెస్‌తో ఇప్పుడక్కడ బిజీ కథానాయకిగా అయిపోయింది. ఆమె నటించిన శతమానంభవతి మంచి విజయాన్ని అందుకుంది. తాజాగా ప్రేమమ్ చిత్రం తరువాత నాగచైతన్యతో సవ్యసాచి చిత్రంలో చిత్రంలో జతకట్టింది. ఇంకా నానితో కృష్ణార్జున తదితర తెలుగు చిత్రాలలో నటిస్తున్న అనుపమ తాజాగా కన్నడ చిత్ర పరిశ్రమ కూడా ఆహ్వానించింది. కన్నడ, తెలుగు భాషలలో తెరకెక్కుతున్న వేటగాడు అనే చిత్రం ద్వీభాషా చిత్రంలో నటిస్తోంది. ఇకపోతే కొడి చిత్రం తరువాత ధనుష్‌తో మరోసారి మారి 2లో జత కట్టడానికి రెడీ అవుతున్న అనుపమ దక్షిణాది వాంటెడ్ హీరోయిన్గా మారింది. దీంతో నటిగా కేరీర్ ఎలా సాగుతోందన్న ప్రశ్నకు తన సినీ జర్నీ చాలా చిన్నదని, ఇంకా పయనించాల్సింది ఎంతో ఉందని బదులిచ్చింది. విభిన్న పాత్రలలో నటించి నటిగా మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటున్నానని చెప్పింది. మీ తొలి కారు అనుభవం గురించి చెప్పమనగా తనకసలు కారే లేదని, అలాంటి ఆశ కూడా తనకు లేదని పేర్కొంది. ఎందుకంటే తాను వచ్చింది చాలా మిడిల్‌క్లాస్ కుటుంబం నుంచి అని, నాన్న ఇప్పటికీ దుబాయ్‌లో జాబ్ చేస్తున్నారని, తన చిన్నప్పుడు ఆయన సంపాదన తన స్కూల్ ఫీజ్‌కు ఇతర ఖర్చలకే సరిపోయేదనీ చెప్పింది. అందుకే కారు కొని అందులో తిరగాలన్న ఆశ తనకు లేదని, భవిష్యత్‌లో అవసరం అనిపిస్తే అప్పుడు కొంటానని చెబుతోంది. -
నాకిష్టమే కానీ... జిందగీలో చేయను!
‘‘నాకు ఫుడ్ అండ్ ఫిట్నెస్ అంటే పిచ్చి. నచ్చిన ఫుడ్ లాగించేస్తా. బాగా వర్కౌట్స్ చేస్తా. ఫుడ్, ఫిట్నెస్ కాంబినేషన్లో బిజినెస్ స్టార్ట్ చేస్తా. అదేంటంటే? ఇప్పుడు చెప్పలేను. కానీ, తప్పకుండా భవిష్యత్తులో బిజినెస్ చేస్తా’’ అన్నారు లావణ్యా త్రిపాఠి. రామ్ హీరోగా ‘స్రవంతి’ రవికిశోర్, పీఆర్ సినిమాస్ సమర్పణలో కృష్ణచైతన్య నిర్మించిన ‘ఉన్నది ఒకటే జిందగీ’లో ఆమె ఒక హీరోయిన్. కిశోర్ తిరుమల దర్శకత్వం వహించిన ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకొస్తున్న సందర్భంగా లావణ్యతో చిట్ చాట్... ♦ మ్యాగీ... నిజంగానే టూ మినిట్స్‌లో రెడీ అవుతుందా? లావణ్య:హ్హహ్హహ్హా... ఇందులో నా పేరు మ్యాగీ. ‘టూ మినిట్స్‌లో రెడీ అవుతా’ అనేది నా పంచ్ డైలాగ్. ఇన్నోసెంట్ అండ్ బ్యూటిఫుల్ గాళ్! నా రియల్ లైఫ్‌కి దగ్గరైన పాత్ర. ఈతరం యువతీయువకులుఎలా ఉంటున్నారు? ప్రేమపై వాళ్ల దృక్పథం ఏంటి? లక్ష్యం కోసం ఎలా కష్టపడుతున్నారు? అనేవాటిని దర్శకుడు చక్కగా చూపించారు. రాక్‌స్టార్ అభిరామ్ పాత్రలో రామ్ అద్భుతంగా నటించాడు. ♦ రియల్ లైఫ్‌లో మీకు నచ్చిన రాక్‌స్టార్ లేదా మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? లావణ్య: మైఖేల్ జాక్సన్ పాటలంటే ఇష్టం. ఏఆర్ రెహమాన్ కూడా. ఏదొక రోజు రెహమాన్‌తో వర్క్ చేసే ఛాన్స్ వస్తుందని ఎదురు చూస్తున్నా. ♦ ట్రైలర్లో మీరు తక్కువసేపు కనిపించారు. సినిమాలో ఎంతసేపు ఉంటారు? లావణ్య: ఎంతసేపు ఉంటే ఏంటి? మంచి పాత్ర చేశామా? లేదా? అనేది ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్... ‘రాజుగారి గది–2’లో సమంత కనిపించేది తక్కువసేపే. కానీ, తన పాత్రకు ఎంత పేరొచ్చిందో చూడండి. మంచి పాత్రలు వచ్చినప్పుడు లెంగ్త్ గురించి ఆలోచించను. ♦ మీకూ హారర్ సినిమాల్లో అలాంటి పాత్రలొస్తే చేస్తారా? లేదా లేడీ ఓరియెంటెడ్ మూవీస్? లావణ్య: హారర్... నాకిష్టమైన జోనర్. నేనెక్కువగా హారర్ సిన్మాలే చూస్తా. కానీ, జిందగీ (జీవితం)లో హారర్ ఫిల్మ్స్ చేయను. ఇంకొకటి... నాకు లవ్‌స్టోరీలు నచ్చవు. అసలు చూడను కూడా. కానీ, నేను నటించేవన్నీ ప్రేమకథా చిత్రాలే. నేను దెయ్యంగా చేస్తే జనాలు చూడలేరేమో? ♦ రియల్ లైఫ్‌లోనూ ఇంతే సరదాగా ఉంటారా? లావణ్య: ‘శతమానం భవతి, రాధ’ షూటింగులు ఏకకాలంలో జరిగాయి. ‘శతమానం భవతి’ షెడ్యూల్ కంప్లీట్ చేసి ‘రాధ’ సెట్లోకి వచ్చిన శర్వానంద్.. ‘అక్కడ అనుపమ, ఇక్కడ నువ్వు. అల్లరే అల్లరి. క్రేజీ గాళ్స్’ అనేవాడు. నేను మాట్లాడడం మొదలుపెడితే అస్సలు ఆపను. మీరిప్పుడు నా అల్లరిలో జస్ట్ 10 పర్సెంట్ మాత్రమే చూస్తున్నారు. నేనంత అల్లరి చేస్తా. తట్టుకోవడం కొంచెం కష్టమే. ♦ కొందరి మహిళల్లో ఈ సంతోషం లేదు. సోషల్ మీడియాలో ‘మీటూ’ క్యాంపెయిన్ గమనిస్తున్నారా? లావణ్య: పూర్తిగా గమనించలేదు. కానీ, కొందరు మహిళలు సోషల్ మీడియాలో తమకు ఎదురైన చేదు అనుభవాల గురించి చెబుతున్నారు. అందువల్ల సమస్యలు తీరతాయనుకోవడం లేదు. -
సెన్సార్ పూర్తి చేసుకున్న 'ఉన్నది ఒకటే జిందగీ'
ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ఉన్నది ఒకటే జిందగీ. నేను శైలజ సినిమాతో రామ్ కెరీర్ ను మలుపు తిప్పిన కిశోర్ తిరుమల మరోసారి రామ్ హీరో ఉన్నది ఒకటే జిందగీ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. రామ్ సొంత నిర్మాణ సంస్థ స్రవంతి మూవీస్ బ్యానర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్ సంగీతమందించారు. అనుపమా పరమేశ్వరన్, లావణ్య త్రిపాఠిలు రామ్ సరసన హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా అక్టోబర్ 27న రిలీజ్ కు రెడీ అవుతోంది. ఇప్పటికే రిలీజ్ అయిన పాటలకు, టీజర్, ట్రైలర్ లకు మంచి రెస్పాన్స్ రావటంతో చిత్రయూనిట్ సినిమా ఘనవిజయం సాధిస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా కోసం డిఫరెంట్ లుక్ ట్రై చేసిన రామ్ రాక్ స్టార్ గా దర్శనమివ్వనున్నాడు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఉన్నది ఒకటే జిందగీ క్లీన్ యు సర్టిఫికేట్ తో సెన్సార్ కూడా పూర్తి చేసుకుంది. -
అందుకే ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటా!
‘‘సినిమాకు కథ చాలా ఇంపార్టెంట్. నాకొచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటా. ప్రతి సినిమాను ఫస్ట్ మూవీలానే ఫీలవుతా. సక్సెస్‌ను ఎడ్వాంటేజ్‌గా తీసుకుని ఏదైనా చెప్పేయొచ్చు అనుకోను’’ అన్నారు కిశోర్ తిరుమల. రామ్ హీరోగా ఆయన దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘ఉన్నది ఒక్కటే జిందగీ’. ‘స్రవంతి’ రవికిశోర్, పీఆర్ సినిమాస్ సమర్పణలో కృష్ణచైతన్య నిర్మించిన ఈ సినిమా ఈ నెల 27న సినిమా విడుదల కానుంది. కిశోర్ తిరుమల చెప్పిన విశేషాలు... ► రియల్ లైఫ్‌కి దగ్గరగా ఫ్రెండ్షిప్ అండ్ లవ్ నేపథ్యంలో తెరక్కిన చిత్రమిది. ప్రతిదీ పాజిటివ్ క్యారెక్టరే. పరిస్థితులే విలన్‌గా మారతాయి. సిన్మా చూస్తుంటే... యాక్టర్స్ కనపడరు, క్యారెక్టరైజేషన్సే కనపడతాయి. పాజిటివ్ ఫీల్ కోసం ‘ఉన్నది ఒక్కటే జిందగీ’ అని టైటిల్ పెట్టాం. సినిమాలో మేసేజ్‌లు, ఫిలాసఫీ ఉండవు. ► అభిరామ్ (రామ్) క్యారెక్టర్ మెచ్యూర్ అండ్ సింపుల్. అభిరామ్‌కి ఫ్రెండ్షిప్ ఇంపార్టెంట్. చాలా సింపుల్‌గా డెసిషన్స్ తీసుకుంటాడు. కానీ, ప్రతి నిర్ణయం వెనక బలమైన కారణం ఉంటుంది. ఈ సినిమా లైన్ ఏడాదిన్నర క్రితం అనుకున్నాం. కథను డెవలప్ చేయడానికి ఏడాది పట్టింది. కథ రాసుకున్న తర్వాతే... రామ్‌ను అప్రోచ్ అవ్వడం జరిగింది. రామ్‌లో బాగా కాన్ఫిడెంట్ లెవల్స్ పెరిగాయి. అందుకే మీరు ఏ క్యారెక్టర్ అయినా చేయగలరన్నాను. ఈ సినిమా కోసం రామ్ మూడు నెలల పాటు గిటార్ నేర్చుకున్నారు. శ్రీవిష్ణు నాకు నాలుగైదేళ్లుగా తెలుసు. అభిరామ్ ఫ్రెండ్‌గా వాసు పాత్రలో బాగా నటించారు. అనుపమ పాత్రకు అమ్మాయిలు బాగా కనెక్ట్ అవుతారు. లావణ్యది ఎంటర్టైనింగ్ రోల్. ► ‘నేను.. శైలజ’కి దేవిశ్రీ మంచి ఆల్బమ్ ఇచ్చారు. ఈ సినిమాలోనూ మ్యూజిక్కు ఎక్కువ స్కోప్ ఉంది. అందుకే, దేవిగారిని తీసుకున్నాం. ‘వాట్ అమ్మా...’ బ్రేకప్ సాంగ్ కాదు. వెంకటేశ్‌గారి మ్యానరిజమ్ని దృష్టిలో పెట్టుకుని ‘వాట్ అమ్మా’ మ్యానరిజమ్ని పెట్టలేదు. ఈ సాంగ్ విని వెంకటేశ్‌గారు ఫోన్ చేసి అభినందించారు. ► ప్రస్తుతం నా దగ్గర మూడు కథలు ఉన్నాయి. ఒకటి అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. మరొకటి యూత్‌ఫుల్ మూవీ. ఏ కథ చేస్తే బాగుంటుందో ఆలోచించి నెక్ట్స్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తా. నాని, నితిన్‌తో సినిమాలు చేయబోతున్నారనే వార్తలు వచ్చాయి కదా? అనడిగితే – ‘‘స్క్రిప్ట్ ఇంకా ఫామ్ అవ్వలేదు’’ అన్నారు. -
హీరోయినా? హెడ్ మాస్టారా? అన్ని క్వశ్చన్స్ ఏంట్రా బాబు!
‘నీ ఫ్రెండ్స్ దగ్గర నీకు నచ్చని విషయం ఏంటి?’– రామ్‌ని అనుపమ అడిగింది. వెంటనే ఆన్సర్ చెప్పాడు. ‘మరి, నచ్చింది?’– నెక్ట్స్ క్వశ్చన్! మళ్లీ ఆన్సర్ చెప్పాడు. ‘ఫ్రెండ్‌కి, బెస్ట్ ఫ్రెండ్‌కి తేడా ఏంటి?’– వన్ మోర్ క్వశ్చన్! ఈసారీ ఆన్సర్ చెప్పాడు. ‘మరి, బెస్ట్ ఫ్రెండ్‌కి, లవర్‌కి?’– మళ్లీ ఇంకో క్వశ్చన్, ఆన్సర్ కామన్! అక్కడితో అనుపమ ఆగలేదు. ‘అయ్య బాబోయ్... అనుపమా పరమేశ్వరన్ హీరోయినా? హెడ్ మాస్టారా? అన్ని క్వశ్చన్స్ ఏంట్రా బాబు’ అని అబ్బాయిలంతా అనుకునేలా ఇంకొక క్వశ్చన్ ‘నిన్నెవరైనా లవ్ చేస్తే... తన దగ్గర్నుంచి నువ్వు ఎక్స్పెక్ట్ చేసేదేంటి?’ అని అడిగింది! అప్పటివరకూ కూల్ ఆన్సర్స్ ఇచ్చిన రామ్, ఈసారి చిన్న ఝలక్ ఇచ్చాడు. ‘ఏడవడం’ అని చెప్పాడు. లవ్ చేసిన అమ్మాయిని ఏడిపించాలని ఎవరైనా అనుకుంటారా? కానీ, రామ్ ఫీలింగ్ మాత్రం అదే! అప్పుడు అనుపమ ఏం అడిగిందో తెలుసా? ‘నువ్వు ఎప్పుడైనా ఏడ్చావా?’ అని! ‘మనకింకా ఆ అదృష్టం కలగలేదు’ అని రామ్ చెప్పగానే... ‘డోంట్ వర్రీ. తొందరలోనే ఏడుస్తావ్!’ అని అనుపమ రిప్లై ఇచ్చింది. ఓహ్... లవ్‌ని ఇలా కూడా ఎక్స్‌ప్రెస్ చేయొచ్చా? అనుకున్నారు ఆడియన్స్! ఇదంతా ‘ఉన్నది ఒకటే జిందగీ’ ట్రైలర్లో మేటర్. సిన్మా కాన్సెప్ట్ కన్వే చేసేలా ట్రైలర్ కట్ చేశారు. అందులో డైలాగ్స్ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటు న్నాయి. రామ్, అనుపమ, లావణ్యా త్రిపాఠి ముఖ్య తారలుగా కిశోర్ తిరుమల దర్శకత్వంలో ‘స్రవంతి’ రవికిశోర్, పీఆర్ సినిమాస్ సమర్పణలో కృష్ణచైతన్య నిర్మించిన ఈ సినిమా ఈ నెల 27న రిలీజ్ కానుంది. దేవిశ్రీ ప్రసాద్ స్వరపరచచిన పాటల్ని, ట్రైలర్‌ని శుక్రవారం విడుదల చేశారు. ‘‘సినిమా ఇండస్ట్రీకి ఎందుకొచ్చానో ఈ సినిమాతో అర్థమైంది’’ అన్నారు రామ్. ‘‘దర్శకుడు కిశోర్ తిరుమల సినిమా కోసం ఏం చేసినా తన గుండె లోతుల నుంచే చేస్తాడు’’ అన్నారు ‘స్రవంతి’ రవికిశోర్. -
అభిరామ్ జిందగీ
ఎన్ని ఎత్తుపల్లాలు వచ్చినా జిందగీ మొత్తం మనతో ఉండేవాడే నిజమైన స్నేహితుడని నమ్మే యువకుడు అభిరామ్. ఓ రాక్‌బ్యాండ్‌కి లీడర్ అతను. హ్యాపీగా వెళ్తోన్న అభిరామ్ జిందగీలోకి ఇద్దరు అమ్మాయిలొస్తారు. వాళ్లలో ఎవర్ని అభిరామ్ ప్రేమించాడు? అతని జిందగీలో స్నేహితులు ఎలాంటి పాత్ర పోషించారు? అసలు అభిరామ్ కథేంటి? అనేది ఈ నెల 27న చూపిస్తామంటున్నారు దర్శకుడు కిశోర్ తిరుమల. రామ్ హీరోగా ఆయన దర్శకత్వంలో ‘స్రవంతి’ రవికిశోర్, పీఆర్ సినిమాస్ సమర్పణలో స్రవంతి సినిమాటిక్స్ పతాకంపై కృష్ణచైతన్య నిర్మించిన సినిమా ‘ఉన్నది ఒకటే జిందగీ’. అనుపమా పరమేశ్వరన్, లావణ్యా త్రిపాఠి హీరోయిన్లు. ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది. ‘స్రవంతి’ రవికిశోర్ మాట్లాడుతూ– ‘‘ఇటలీలో రామ్‌పై చిత్రీకరించిన సన్నివేశాలతో షూటింగ్ అంతా పూర్తయింది. ప్రేమ, స్నేహం నేపథ్యంలో ఈ సినిమా సాగుతుంది. త్వరలో పాటల్ని, అక్టోబర్ 27న సినిమాను విడుదల చేయాలనుకుంటున్నాం’’ అన్నారు. ‘‘అభిరామ్ అనే వ్యక్తి జిందగీలో చైల్డ్‌హుడ్, కాలేజ్ లైఫ్, కాలేజ్ తర్వాత లైఫ్ ఎలా ఉందనేది సిన్మా. అభిరామ్‌గా పాత్ర కోసం బాడీ మేకోవర్ కావడంతో పాటు సరికొత్త స్టైల్లోకి మారారు రామ్’’ అన్నారు దర్శకుడు కిశోర్ తిరుమల. శ్రీవిష్ణు, ప్రియదర్శి, కిరీటి, కౌశిక్ తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీ ప్రసాద్. -
ట్రెండ్ మారినా ఫ్రెండ్ మారడు
...ఈ మాట అంటున్నది హీరో రామ్. అనడమే కాదు... ‘ట్రెండ్ మారినా ఫ్రెండ్ మారడు..’ అని ఓ పాట పాడుతున్నారు. స్నేహితుల దినోత్సవం సందర్భంగా ఆదివారం ఉదయం పది గంటలకు ఈ పాట విడుదల చేశారు. ‘నేను శైలజ’ తర్వాత కిశోర్ తిరుమల దర్శకత్వంలో రామ్ హీరోగా నటిస్తున్న సినిమాలోనిదీ పాట. దేవిశ్రీ ప్రసాద్ స్వరపరిచిన ఈ పాటకు చంద్రబోస్ సాహిత్యం అందించారు. అలాగే, స్నేహితుల దినోత్సవం కానుకగా టైటిల్‌నూ ప్రకటించారు. ‘స్రవంతి’ రవికిశోర్, పీఆర్ సినిమాస్ సమర్పణలో స్రవంతి సినిమాటిక్స్ పతాకంపై కృష్ణచైతన్య నిర్మిస్తున్న ఈ సినిమాకు ‘ఉన్నది ఒకటే జిందగీ’ టైటిల్‌ను ఖరారు చేశారు. చిత్రసమర్పకులు ‘స్రవంతి’ రవికిశోర్ మాట్లాడుతూ– ‘‘ఇప్పటివరకు జరిగిన చిత్రీకరణతో 50 శాతానికి పైగా సినిమా పూర్తయింది. సోమవారం ఊటీలో కొత్త షెడ్యూల్ మొదలవుతోంది. దాంతో ఓ పాట మినహా చిత్రీకరణ పూర్తవుతుంది. వచ్చే నెల్లో ఇటలీలో ఆ పాటను చిత్రీకరించి, దసరాకు సినిమాను విడుదల చేయాలనుకుంటున్నాం’’ అన్నారు. అనుపమా పరమేశ్వరన్, లావణ్యా త్రిపాఠి హీరోయిన్లుగా, శ్రీవిష్ణు, ‘పెళ్లి చూపులు’ ఫేమ్ ప్రియదర్శి కీలక పాత్రధారులుగా నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీప్రసాద్, కళ: ఏఎస్ ప్రకాశ్, కూర్పు: శ్రీకర్ ప్రసాద్, కెమెరా: సమీర్‌రెడ్డి.