అబ్బో.. అలాంటి ఆశ లేదు.. ఎందుకంటే! | Actress Anupama says about car plans and past | Sakshi
Sakshi News home page

అబ్బో.. అలాంటి ఆశ లేదు.. ఎందుకంటే!

Published Tue, Oct 31 2017 5:48 PM | Last Updated on Tue, Aug 28 2018 4:32 PM

Actress Anupama says about car plans and past - Sakshi

సాక్షి, సినిమా : నాకు అలాంటి ఆశ లేదంటోంది నటి అనుపమ పరమేశ్వరన్. ఇంతకీ ఈ బ్యూటీ చెప్పేదేమిటనేగా మీ ప్రశ్న? మలయాళం చిత్రసీమకు ప్రేమమ్‌ అంటూ రంగప్రవేశం చేసిన ఈ కేరళ కుట్టి అతి కొద్ది కాలంలోనే తమిళం, తెలుగు, కన్నడ అంటూ దక్షిణాదిని కవర్‌ చేసేస్తోంది. ముఖ్యంగా టాలీవుడ్‌లో అవకాశాలలో పాటు విజయాలు వరిస్తున్నాయి. కోలీవుడ్‌కు కొడి చిత్రంతో నటుడు ధనుష్‌కు జంటగా పరిచయం అయిన అనుపమను వెంటనే టాలీవుడ్‌ ప్రేమమ్‌ రీమేక్‌ కోసం ఆహ్వానించింది.ఆ చిత్రం సక్సెస్‌తో ఇప్పుడక్కడ బిజీ కథానాయకిగా అయిపోయింది.

ఆమె నటించిన శతమానంభవతి మంచి విజయాన్ని అందుకుంది. తాజాగా ప్రేమమ్‌ చిత్రం తరువాత నాగచైతన్యతో సవ్యసాచి చిత్రంలో చిత్రంలో జతకట్టింది. ఇంకా నానితో కృష్ణార్జున తదితర తెలుగు చిత్రాలలో నటిస్తున్న అనుపమ తాజాగా కన్నడ చిత్ర పరిశ్రమ కూడా ఆహ్వానించింది. కన్నడ, తెలుగు భాషలలో తెరకెక్కుతున్న వేటగాడు అనే చిత్రం ద్వీభాషా చిత్రంలో నటిస్తోంది. ఇకపోతే కొడి చిత్రం తరువాత ధనుష్‌తో మరోసారి మారి 2లో జత కట్టడానికి రెడీ అవుతున్న అనుపమ దక్షిణాది వాంటెడ్‌ హీరోయిన్‌గా మారింది. దీంతో నటిగా కేరీర్‌ ఎలా సాగుతోందన్న ప్రశ్నకు తన సినీ జర్నీ చాలా చిన్నదని, ఇంకా పయనించాల్సింది ఎంతో ఉందని బదులిచ్చింది.

విభిన్న పాత్రలలో నటించి నటిగా మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటున్నానని చెప్పింది. మీ తొలి కారు అనుభవం గురించి చెప్పమనగా తనకసలు కారే లేదని, అలాంటి ఆశ కూడా తనకు లేదని పేర్కొంది. ఎందుకంటే తాను వచ్చింది చాలా మిడిల్‌క్లాస్‌ కుటుంబం నుంచి అని, నాన్న ఇప్పటికీ దుబాయ్‌లో జాబ్‌ చేస్తున్నారని, తన చిన్నప్పుడు ఆయన సంపాదన తన స్కూల్‌ ఫీజ్‌కు ఇతర ఖర్చలకే సరిపోయేదనీ చెప్పింది. అందుకే కారు కొని అందులో తిరగాలన్న ఆశ తనకు లేదని, భవిష్యత్‌లో అవసరం అనిపిస్తే అప్పుడు కొంటానని చెబుతోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement