రామ్ కొత్త సినిమా మొదలైంది..! | Ram pothineni New Movie details | Sakshi

రామ్ కొత్త సినిమా మొదలైంది..!

Nov 29 2017 12:50 PM | Updated on Nov 29 2017 12:50 PM

Ram pothineni New Movie details - Sakshi

ఉన్నది ఒకటే జిందగీ సినిమాతో మరో విజయాన్ని అందుకున్న యంగ్ హీరో రామ్, తన తదుపరి చిత్రాన్ని ప్రారంభించాడు. గత చిత్రం విజయం సాధించినా.. ఆశించిన స్థాయి ఫలితాన్ని ఇవ్వకపోవటంతో తదుపరి చిత్రం విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటుకున్నాడు. సినిమా చూపిస్త మామ, నేను లోకల్ లాంటి సక్సెస్ ఫుల్ చిత్రాలను తెరకెక్కించిన త్రినాథ్ రావు నక్కిన దర్శకత్వంలో తదుపరి చిత్రాన్ని చేయనున్నాడు రామ్.

ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మించనున్నాడు. ప్రకాజ్ రాజ్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో మెహరీన్ హీరోయిన్ గా నటించే అవకాశం ఉంది. ప్రసన్నకుమార్ కథ అందిస్తున్న ఈ సినిమా 2018 ఫిబ్రవరి నుంచి రెగ్యులర్ షూటింగ్ కు వెళ్లనుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement