రామ్ కొత్త సినిమా అప్‌డేట్ | Ram Pothineni Trinadha Rao Nakkina film a love story | Sakshi
Sakshi News home page

Published Tue, Dec 26 2017 11:14 AM | Last Updated on Tue, Dec 26 2017 11:22 AM

Ram Pothineni Trinadha Rao Nakkina film a love story - Sakshi

ఉన్నది ఒకటే జిందగీ సినిమాతో మరో విజయాన్ని అందుకున్న యంగ్ హీరో రామ్, తన తదుపరి చిత్రాన్ని  కొద్ది రోజుల క్రితం ప్రారంభించాడు. గత చిత్రం విజయం సాధించినా.. ఆశించిన స్థాయి ఫలితాన్ని ఇవ్వకపోవటంతో తదుపరి చిత్రం విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటుకున్నాడు. సినిమా చూపిస్త మామ, నేను లోకల్ లాంటి సక్సెస్ ఫుల్ చిత్రాలను తెరకెక్కించిన త్రినాథ్ రావు నక్కిన దర్శకత్వంలో తదుపరి చిత్రాన్ని చేస్తున్నాడు రామ్.

ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మించనున్నాడు. ప్రకాజ్ రాజ్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో మెహరీన్ హీరోయిన్ గా నటించే అవకాశం ఉంది. ప్రసన్నకుమార్ కథ అందిస్తున్న ఈ సినిమా రొమాంటిక్ లవ్ ఎంటర్‌టైనర్ గా తెరకెక్కనుంది. ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్ 2018 ఫిబ్రవరిలో ప్రారంభం కానుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement